buddha venkanna
-
కార్పొరేటర్‌కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నువ్వా జగన్ గురించి మాట్లాడేది
-
అమ్మ సాక్షిగా అవినీతి
-
టీడీపీ కోసం 37 కేసులు పెట్టించుకున్నా.. ఏం లాభం?
విజయవాడ, సాక్షి: అధికారంలో ఉన్నా పదవి ఉంటేనే ఏదైనా చెల్లుతుందని, ఆ పదవి లేకనే తాను ఏం చేయలేకపోతున్నానంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘పదవి లేక పోవడంతో నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారు. నా మాట చెల్లలేదు. చాలా ఆవేదనగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. నన్ను నమ్ముకున్న వారికి నేనేం చేస్తాను. నన్ను కార్యకర్తలు క్షమించాలి.. .. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినోళ్లను నేను అడ్డుకున్నా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడెవరు వచ్చారో చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అందులోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్లను తిట్టా. టీడీపీ కోసం ఎంతో చేశా. .. నా మీద మొత్తం 37 కేసులు ఉన్నాయి. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకున్నా. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా. ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నా తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా.. .. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా. నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్నా. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా. చచ్చేంతవరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను ఎంపీ కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అని బుద్దా వెంకన్న అన్నారు. బుద్దా ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ కేశినేని చిన్ని మైక్ అందుకున్నారు. ‘‘పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడొవద్దు. త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు కూడా మంచి పదవులు వస్తాయి అని బుద్దాను సముదాయించే మాటలు చెప్పారు. ఇదిలా ఉంటే.. సీఐల బదిలీలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిచ్చు రాజేసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. అయితే.. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సాక్షిగా అది నిజమని తేలింది. -
పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
వన్‌టౌన్(విజయవాడపశ్చమ): ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో పశ్చమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న హవా నడిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం బుద్దా వెంకన్న ఇంటికే పరిమితమయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనాచౌదరితో పాటు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా బుద్దా వెంకన్నను పూర్తిగా దూరం పెట్టారు. దాంతో నియోజకవర్గంలో బుద్దా వెంకన్న వర్గం సైలెంట్ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి బీజేపీ అభ్యర్థిగా సుజనాచౌదరిని పోటీకి దింపారు. సుజనాచౌదరి వచ్చిన తొలి నాళ్లలో బుద్దా వెంకన్న తన క్యాడర్‌తో కాస్త హడావుడి చేశారు. కానీ గడిచిన 15 రోజులుగా ఆయన ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆర్థిక అంశాలను తనకు అప్పజెబుతారనుకున్న బుద్దా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్ని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ఇద్దరూ ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక అంశాలను తనకు అప్పగిస్తారని బుద్దా వెంకన్న ఆశించారు. నియోజకవర్గంలో కేశినేని చిన్నితో గడిచిన ఏడాదిన్నర కాలంగా అనేక కార్యక్రమాలను సైతం బుద్దా వెంకన్న నిర్వహించారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం చిన్ని బుద్దా వెంకన్నను నమ్మకపోవటంతో ఆయనను దూరంగా ఉంచారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సుజనాచౌదరి ఆర్థిక కార్యకలాపాలన్నీ తన ద్వారానే నిర్వహిస్తారని బుద్దా వెంకన్న భావించారు. కానీ సుజనాచౌదరి సైతం బుద్దా వెంకన్నను నమ్మకుండా దూరంగా ఉంచారు. ఇద్దరూ వేరువేరుగా నియోజకవర్గంలో తమ తాలుకా వ్యక్తులను రంగంలోకి దింపి ఆర్థిక అంశాలను చక్కబెట్టే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడైనప్పటికీ... పశ్చమ నియోజకవర్గంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక కమిటీని వేసి దాని ద్వారా ఖర్చులు చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన చేసింది. అందులో బుద్దా వెంకన్నను సైతం సభ్యునిగా సూచించారు. కానీ సుజనాచౌదరి ఆ కమిటీ ఏర్పాటుకు, దాని ద్వారా నిర్వహణకు వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుద్దా వెంకన్నను నమ్మకపోవటం వలనే సుజనాచౌదరి వ్యతిరేకించినట్లు సమాచారం. దాంతో అటు కేశినేని చిన్ని, ఇటు సుజనాచౌదరి రెండు శిబిరాలు వెంకన్నను దూరంగా పెట్టాయి. అందువలన ఇద్దరికీ బుద్దా వెంకన్న దూరంగా ఉంటూ ఇంటికి మాత్రమే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తమ నాయకుడిని పట్టించుకోకపోవటంతో బుద్దా వెంకన్న క్యాడర్ సైతం ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయటం లేదని తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు చెబుతున్నారు. -
టీడీపీలో వెస్ట్ ఫైట్: నోరు జారిన జలీల్ ఖాన్!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ వార్ ముదురుతోంది. టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో నోరు జారారాయన. విజయవాడ వెస్ట్‌లో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వార్ ముదురుతోంది. మైనారిటీలకు టికెట్‌ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అన్నారు. ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ఆపై ఓ అడుగు ముందుకేసి వెస్ట్ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు. ఇక.. చంద్రబాబుకు దరఖాస్తు సమర్పిస్తానంటూ గురువారం బుద్దా వెంకన్న విజయవాడలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ గనుక ఇవ్వడం కుదరకుంటే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో బుద్దా వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కోరేందుకు జనసేన సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుద్దా వెంకన్న ర్యాలీ పరిణామాలను ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏకపక్షంగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందో అనే ఆందోళనతో పవన కల్యాణ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. -
పొగ పెట్టేది.. మంట రాజేసేది బాబే?
► తెలుగుదేశం పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆరో వేలితో సమానమా.. అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ► నియోజకవర్గ నాయకుల మధ్య నిత్యం రగడ రగులుకుంటూ ఉండటానికి కారణం అధిష్టానమా... అంటే అదే నిజమనిపిస్తోంది. ► కేశినేని శ్రీనివాస్ (నాని), బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా తదితర నాయకులు, వారి బృందాలు వైరి వర్గాలుగా కొనసాగుతుండటానికి బాధ్యులెవరంటే.. అన్ని వేళ్లూ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల వైపే.. అని ఆ పార్టీ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా అంటున్నారు. టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అవసరం లేనిది(ఆరోవేలు) గానే చూస్తుంటుందనేది జవాబు. సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్‌ను తోసేసి పార్టీని ఆక్రమించేసుకున్నప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గం బాబుకు ఒక ఆప్షన్ మాత్రమే అనేది నిరూపితమైనదే. ఏ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరినా ఆ స్థానాన్ని అలవోకగా కేటాయించేస్తున్నారు. ఆ స్థానాన్ని ఆశించే పార్టీల వాస్తవ బలాబలాలు ఎలాగున్నా.. రెండు పరస్పర వైరి సిద్ధాంతాలు కలిగిన పార్టీలకై నా సరే ఇచ్చేస్తున్నారు. వామపక్షాలకు, బీజేపీకి పశ్చిమాన్ని ఇచ్చేయడమే ఇందుకు నిదర్శనం. రానున్న ఎన్నికల్లో తమకు ఈ సీటు దాదాపు రిజర్వు అయ్యిందనేది జనసేన నుంచి బలంగా వినిపిస్తున్న మాట. రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం కూడా. తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి.. పశ్చిమ నియోజకవర్గంలోని నాయకుల మధ్య తగువులు పెట్టేది, వారిని ప్రోత్సహించేది అధిష్టానమే అన్నది ఉమ్మడి కృష్ణాలోని టీడీపీ నాయకులకు తెలియని అంశమేమీ కాదు. నియోజకవర్గం పరిధిలో సీనియర్ నాయకులు ఎందరున్నా వారిని పక్కనపెట్టి విజయవాడ ఎంపీ కేశినేనికి రెండేళ్ల కిందట కో ఆర్డినేటర్ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా, వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ తదితరులు ఉన్నారు. బుద్దా వెంకన్న ఎమ్మెల్సీగానే కాకుండా నగర పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పని చేశారు. నాగుల్‌మీరా గతంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా, నూర్‌బాషా సంఘం రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. నియోజకవర్గంపై పార్టీ దృష్టి ఏమాత్రం ఉన్నా ఇందరు నాయకుల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి పార్టీని గాడిలో పెట్టి ఉండవచ్చు. తక్షణ అవసరంగా ఎంపీకి పశ్చిమ కో ఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించినా రెండేళ్లుగా అలాగే కొనసాగించాల్సిన అవసరం ఏంటనేది స్వపక్షీయుల ప్రశ్న. ఎంపీకి నేతృత్వం అప్పగించినా తమందరినీ పక్కనపెట్టి ఏ పదవీలేని ఎం.ఎస్. బేగ్‌కు అంత ప్రాధాన్యం ఎలా ఇస్తారనేది ప్రధాన వాదన. యువగళం ముగింపు సభలో మైనార్టీల తరఫున ప్రసంగించే అవకాశాన్ని బేగ్‌కు ఇవ్వడంపైనా రగడ జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమ నేతల మధ్య రగడకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అధిష్టానిదేనని, తగువు పెట్టాం తన్నుకు చావండని ప్రోత్సహిస్తోందని పార్టీ సీనియర్ల విశ్లేషణ. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేమనే.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి గెలవలేమని, ఎన్ని పార్టీలతోనైనా సీట్ల బేరసారాల ఒప్పందాలు కుదుర్చుకుంటామనే అంచనాలతోనే పశ్చిమ నియోజకవర్గం ఆప్షన్‌ను అలాగే ఉంచుకున్నట్లు స్పష్టమవుతోంది. రానున్న ఎన్నికల్లో కుదిరే ఒప్పందాల ఆధారంగా జనసేన/సీపీఐ/బీజేపీ.. కేటాయించే అవకాశాలు లేకపోలేదని సీనియర్లు ముక్తాయిస్తున్నారు. గాడిలో పెట్టే యోచన ఏది..? నియోజకవర్గంలో పార్టీని పటిష్ట పరచాలన్నా, గాడిన పెట్టాలన్నా అధిష్టానం దృష్టి సారిస్తుంది. ఇది ఏ పార్టీకై నా సాధారణం, అవసరం కూడా. నిత్యం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కో ఆర్డినేటర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారి పట్ల చర్యలు తీసుకోవాలి. అలా వీలుకాని పక్షంలో కో ఆర్డినేటర్‌ను మార్చుకుని చక్కదిద్దగలిగే వారికి బాధ్యతలు అప్పగించడం పరిపాటి. అలాంటివేమీ చేయడం లేదంటే పశ్చిమ నియోజకవర్గంను అధిష్టానం ఆరోవేలుగా పరిగణిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలని పరిశీలకుల అభిప్రాయం. -
టీడీపీ ఎంపీ సీటుపై బుద్దా వెంకన్నపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
-
విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై ముసలం
-
టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ వేగం పెంచింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కార్యాచరణకు ఉపక్రమించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. బుద్దా వెంకన్న, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సహా 23 మంది సోషల్ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా గుర్తించిన సీఐడీ వారందరినీ విచారించాలని నిర్ణయించింది. బుచ్చయ్య చౌదరికి కూడా ఒకట్రెండురోజుల్లో నోటీసులు జారీ చేయనుంది. నిందితులతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్(ఎక్స్), గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది. చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా? -
పచ్చపార్టీలో గ్రూపు రాజకీయాలు.. అధినేత ఆందోళన!
అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం.. అందులోనూ గ్రూప్ రాజకీయాలు.. వర్గ విభేదాలు. పాతాళానికి పడిపోయిన పార్టీతో అధినేత ఆందోళన చెదుతుంటే.. వ్యక్తిగత ఆరోపణలతో నేతలు రోడ్డెక్కుతున్నారు. ఆ జిల్లా.. ఈ జిల్లా అని కాదు.. అన్ని చోట్లా టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. పచ్చపార్టీ నేతలు గ్రూప్‌లు కట్టి మరీ కొట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.. విభేదాలతో టీడీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారు.. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. నేతలు కలహాలతో పార్టీ పరువు బజారున పెడుతున్నారు. పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి నేతలు నువ్వు ఎంత అంటే నువ్వు ఎంతని ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్ద లేక నాయకులకు సర్ది చెప్పలేక చంద్రబాబు చివరికి నిస్సహాయుడిగా మిగిలిపోతున్నారు. ఒకప్పుడు పార్టీ కేడర్‌ను కంటిచూపుతో శాసించిన చంద్రబాబు మాటను ఇప్పుడు ఎవరూ లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు.. మీ దారి మీదే మా దారి మాదే అన్నట్లు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.. పార్టీ కంటే వర్గ ప్రయోజనాలే ముఖ్యమనే ధోరణిలో పచ్చనేతల తీరు ఉంది. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, బుద్ధ వెంకన్న రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఒక వర్గం పై మరొక వర్గం నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్లకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత నిస్తున్నారని నాని మీడియా ముందు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.. కొంతమంది పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీ కోసం ఎవరూ పనిచేయడం లేదని, మీడియా ముందు కెమెరాలకు ఫోజులు ఇస్తుంటారని నాని మండిపడ్డారు.. చివరకు తమ స్వార్థం కోసం తమ కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని కొంతమంది ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.. నాని కామెంట్స్‌పై బుద్దా వెంకన్న కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తమను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొంతమంది వ్యవహరిస్తున్నారని నానిని ఉద్దేశించి మాట్లాడారు.. బీసీలను పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.. అటు విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాస రావుల మధ్య వైరం మరోసారి మొదలైంది. ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు.. ఎన్నికల సమీపిస్తుండడంతో మళ్లీ గంటా యాక్టీవ్ అయ్యారు.. గంటాపై మరోసారి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో రెచ్చిపోయారు.. గంటా ఎవడండి లక్షల్లో ఒకడు అంటూ ఆవేశంగా మాట్లాడారు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో దాక్కొని ఎన్నికలు వస్తుండడంతో మళ్లీ పుట్టలో పాముల్లా బయటకు వస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడని వాడు ఏం నాయకుడని గంటాను ప్రశ్నించారు. గంటా కూడా అయ్యన్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చేందుకు తన అనుచరులతో సిద్ధమవుతున్నారట. తాను సొంత కుటుంబ సభ్యులకి అయ్యన్నలా వెన్నుపోటు పోడవలేదని అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని కొడుకుల కోసం సీట్లు అడగలేదని గంటా వర్గం అయ్యన్నపై విమర్శలు చేస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నాయకులు ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే అంతంత మాత్రమంగా ఉన్న టీడీపీని ఈ గ్రూపు రాజకీయాలు మరింత పాతాళానికి తొక్కేస్తాయని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చంద్రబాబుకు పార్టీ మీద రోజురోజుకీ పట్టు సడలిపోతుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ కేడర్ నుంచి వ్యక్తమవుతోంది. -
కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయవాడ ఈస్ట్, వెస్ట్ నేతలకు సరైన గౌరవం దక్కలేదు. సమావేశం స్టేజ్ మీద తన ఫొటో లేకపోవడంతో బుద్ధా వెంకన్న తన అసంతృప్తిని వెళ్లగక్కారు. స్టేజ్‌కు మీదకు రావాల్సిందిగా కొల్లు రవీంద్ర బుద్దాని ఆహ్వానించినా అందుకు ఆయన నిరాకరించారు. అనంతరం సమావేశం నుంచి బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వెళ్లిపోయారు. ఆ సమయంలో వర్ల రామయ్య బుద్దాను ఆపేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ సమావేశంలోనే గద్దె రామ్మోహన్‌ను కూడా స్టేజ్ మీదకు ఆహ్వానించలేదంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చదవండి: (ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు.. ఎప్పటినుంచంటే..) -
చంద్రబాబు డైరెక్షన్లోనే బుద్ధా వ్యాఖ్యలు
అనంతపురం క్రైం/చీరాల అర్బన్: వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి తీవ్రవాద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఆయన అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో బుద్ధాపై ఫిర్యాదు చేశారు. అనంతరం వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు జన్మదినం సందర్భంగా బుద్ధా వెంకన్న వైఎస్సార్సీపీ నేతలను చంపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందుకు 100 మందితో బ్యాచ్ సిద్ధంగా ఉందంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి.. ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూల్చాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బుద్ధా వెంకన్న వ్యాఖ్యల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆరోపించారు. సమాజంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు టీడీపీ ఈ సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేసిందని మండిపడ్డారు. వీరి నుంచి వైఎస్సార్సీపీ నేతలకు ప్రాణహాని ఉందన్నారు. వీరు మారణహోమం సృష్టించకముందే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బుద్ధా వెంకన్నపై వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు యాతం మేరిబాబు గురువారం చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
‘మంత్రిని మర్డర్ చేస్తానంటే చట్టం చూస్తూ ఊరుకోదు’
తాడేపల్లి: మంత్రిని మర్డర్ చేస్తానంటే చట్టం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టుపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిచ్చారు. తాడేపల్లిలోని మీడియా పాయింట్ నుంచి విలేకర్లతో మాట్లాడిన కొడాలి నాని.. బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జూదశాలలు నడిచాయి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ దురదృష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంద్రబాబు చరిత్ర రోడ్డు మీద పెడతా. నా మంత్రి పదవి ఊడగొట్టేయాలని వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. గుడివాడలో ఏదో జరిగింది అని పనికిమాలిన మాటలు చెప్తున్నారు. నా కే కన్వెన్షన్ లో కాసినో జరిగిందని నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పా. ఆ మాట అనగానే కే కన్వెన్షన్ సమీపంలో అంటారు. మళ్లీ గుడివాడలో అంటారు. వీళ్ళ 420 వెబ్ సైట్లో పెట్టిన దాన్ని ఆధారాలు అంటారు. వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ మీకెలా వచ్చాయి...మీరే బుక్ చేశారా...?, 420లతో నిజ నిర్ధారణకు వస్తే ఎలా రానిస్తారు’ అని కొడాని నాని ప్రశ్నించారు. బెల్లీ డ్యాన్సులు, లుంగీ డ్యాన్సులు టీడీపీ నేతలకే బాగా తెలుసు. ట్విట్టర్ బాబు.. లోకేష్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు. ట్విట్టర్ బాబు గురించి నేనేం చెప్పగలను, ఆడో సన్నాసి. కెమెరాతో నిజ నిర్ధారణకు చంద్రబాబు ఇంట్లోకి అనుమతి ఇస్తారా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదు. బుద్ధా వెంకన్న నోరు అదుపులోకి పెట్టుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. 2024లో కూడా టీడీపీ రాజకీయ సమాధి అవుతుంది’ అని నాని తెలిపారు. -
బుద్దా వెంకన్నపై కేసు నమోదు
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వెంకన్న చేసిన వ్యాఖ్యలపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు. ఏసీపీ కె.హనుమంతరావు ఆధ్వర్యంలో సాయంత్రం వెంకన్న ఇంటికి వెళ్లి విచారణకు రావాలని కోరారు. వెంకన్న అనుచరులు పోలీసులను లోపలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో వెంకన్నను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలేశారు. అంతకుముందు వెంకన్న మరో టీడీపీ నేత నాగుల్‌మీరాతో కలిసి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కొడాలి నాని, డీజీపీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘అరే కొడాలి నానీ.. చంద్రబాబు ఇంటి గేట్ ముట్టుకో. నీ శవాన్ని పంపుతా. అరే నానీ కొట్టుకుందాం రా..’ అంటూ వీరంగం వేశారు. ‘అరేయ్ కొడాలి నాని నీ భాషేంటి? నీ చరిత్ర ఏంట్రా? గుడివాడలో ఆయిల్ దొంగవి. వర్ల రామయ్య నిన్ను లోపలవేసి చితక బాదిన విషయం అందరికీ తెలుసు’ అంటూ రెచ్చిపోయారు. ‘పోలీసుల్లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి. కొట్టుకుందాం రా’ అంటూ సవాళ్లు విసిరారు. గుడివాడకు వ్యభిచార కంపెనీ తీసుకొచ్చావని, నోటి దూలతో కృష్ణా జిల్లా పరువు తీశావని అన్నారు. నువ్వు తోపు అయితే కెమెరా పట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళ్లు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు గేట్ తాకితే నాని శవాన్ని పంపుతానంటూ హెచ్చరించారు. ‘నీ బావ, బావమరిది అనుకున్నవా? మమ్మల్ని వాడు, వీడు అంటున్నావు? డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు’ అంటూ ఊగిపోయారు. నాని కులాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. ‘చంద్రబాబును నా కొడకా అంటున్నావు నీ బాబు పేరు ఏంట్రా? 2004లో నీకు టిక్కెట్ ఇచ్చింది చంద్రబాబు. హరికృష్ణ కాదు. 2024లో ఓడిపోయిన అర గంటలో ప్రజలు నిన్ను చంపుతారు. ఓడిపోగానే దుబాయి పారిపోతావు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా గౌతమ్ సవాంగ్ వ్యవహరిస్తున్నారు. గుడివాడ కేసినోలో రూ.250 కోట్లు చేతులు మారాయి. డీజీపీ నీ వాటా ఎంతో చెప్పు’ అంటూ చిందులేశారు. గుట్కా తిని క్యాన్సర్‌తో చచ్చిపోతావంటూ నానికి శాపనార్థ్ధాలు పెట్టారు. -
నమ్మిన బుద్ధా వెంకన్నకు శఠగోపం
-
టీడీపీలో ముసలం: కేశినేని నాని Vs బుద్ధా వెంకన్న
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నానిని నియమించడంపై ఆ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న, నాగూల్‌మీరా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయితే వారిని పక్కన పెట్టి నియోజకవర్గ సమన్వయకర్తగా కేశినేని నానిని నియమించడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే బుద్ధా వెంకన్న కార్యాలయానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. నాని నియామకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: (‘అంతుచూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకో’.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు) తారస్థాయికి వర్గపోరు.. టీడీపీలో కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగూల్‌మీరా, బొండా ఉమా వర్గాల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. నాయకులు, కార్యకర్తలు సామాజిక వర్గాల వారీగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేతను ఏకపక్షంగా ప్రకటించడంతో వర్గ విభేదాలు మరోసారి రాజుకున్నాయి. దీంతో సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినా.. టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దిగొచ్చిన చంద్రబాబు.. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తన కుమార్తెను కూడా టాటా కంపెనీలో ఉద్యోగానికి పంపుతున్నానని ఎంపీ కేశినేని ప్రకటించారు. ఎంపీ కార్యాలయంలో చంద్రబాబునాయుడి ఫొటోను తొలగించారు. ఆ తర్వాత అనుహ్య పరిణామాలతో కేశినేని మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యారు. దీంతో నియోజకవర్గంపై ఆయనకు పెత్తనం అప్పగించారు. అయితే కొంత కాలంగా అక్కడ పార్టీ బాధ్యతలు చూస్తున్న బుద్ధా వెంకన్నకు మాత్రం అవమానమే మిగిలింది. చదవండి: (టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. మంగళగిరికి చేరిన పంచాయితీ) అత్యవసర సమావేశం.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, తమ నేతలకు అన్యాయం జరిగిందని హడావుడిగా బుద్ధా వెంకన్న కార్యాలయంలో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమన్వయకర్తగా నాని వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. -
Kuppam: టీడీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కుప్పం(చిత్తూరు జిల్లా): ‘మీ రాజకీయాల్లోకి మా అభిమాన నేతను లాగి నానా యాగీ చేయడం బాగోలేదు. ఎన్టీఆర్ మాటల్లో పస లేదు.. దమ్ము లేదు.. కోపం లేదంటూ మీ ఇష్టాను సారం నోరు పారేసుకుంటారా.. ఇలా మీ అంతకు మీరే మాట్లాడుతున్నారా.. లేక ఇలా మాట్లాడాలని మీకు ఎవరైనా చెప్పారా.. ఇంకో సారిలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. బాబులకే బాబు మా తారక్ బాబు’ అని టీడీపీ నేతలపై సీనీ నటుడు ఎన్టీఆర్ అభిమానులు చిత్తూరు జిల్లా కుప్పంలో నిప్పులు చెరిగారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై వారు ఆదివారం నిరసన తెలిపారు. చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశిస్తూ దుర్భాషలాడారంటూ.. బాబు, టీడీపీ నేతలు నానాయాగి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యల్లో పసలేదంటూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటివారు జూనియర్ ఎన్టీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జూనియర్ అభిమానులు కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఎం సినిమా థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఎస్ఆర్ఎం థియేటర్ ఎదుట జూనియర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివకుమార్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడిపై కుట్ర పూరితంగా చేస్తున్న విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. -
కర్రలతో బుద్దా వెంకన్న, టీడీపీ కార్యకర్తల హల్చల్
సాక్షి, విజయవాడ: కర్రలతో టీడీపీ నేత బుద్దా వెంకన్న, కార్యకర్తలు హల్చల్ చేశారు. కర్రలతో ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. బందర్ రోడ్డులో టీడీపీ నేతలు హల్చల్ చేస్తూ.. బలవంతంగా షాపులు మూయించేందుకు యత్నించారు. ప్రజలకు ఉపయోగం లేని బంద్‌కు మద్దతు ఇవ్వలేమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది. -
బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. 'బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే. టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు. ఏపీకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') కాల్‌మనీ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారు. గతంలో జీవీ ఆంజనేయులు ప్రభుత్వం తయారు చేసే ఫర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కాల్‌మనీ కేసులో డైరెక్ట్‌గా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న. ఇలాంటి నాయకులు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్ పాలన చేస్తున్నారు. సీఎం జగన్ డ్రగ్స్‌ను ఏపీలోకి రానివ్వరు. ఆధారాల్లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు. సత్తెనపల్లిలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు. అయ్యన్న పాత్రుడు చాలా నీచంగా మాట్లాడారు. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని గోపిరెడ్డి మండిపడ్డారు. చదవండి: (రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స) -
విజయవాడలో టీడీపీ నేతల రచ్చ రచ్చ
సాక్షి, అమరావతి బ్యూరో/మొగల్రాజపురం: విజయవాడలో టీడీపీ నేతల మధ్య కొన్నాళ్ల నుంచి రగులుతున్న ఆధిపత్య పోరుకు వర్గ విభేదాలు తోడు కావడంతో వ్యవహారం రచ్చకెక్కింది. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ మేయర్ అభ్యర్థి తండ్రి, ఎంపీ కేశినేని నానిపై నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మైనార్టీ నాయకుడు నాగుల్‌మీరాలు నిప్పులు చెరిగారు. వీరంతా శనివారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి, కేశినేనిపై మండిపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నువ్వు పెద్ద తోపువా.. అయితే చూసుకుందాం రా.. ఓపిక నశించి ఈ రోజు మీడియా ముందుకొచ్చాం. కేశినేని నాని చంద్రబాబును ఏకవచనంతో ఇష్టానుసారం మాట్లాడాడు. అధిష్టానం నేనేనంటూ చిటికెలు వేసి చెప్పాడు. ఆరోజే నానిని చెప్పు తీసుకుని కొట్టేవాడిని. నువ్వేంటి? నీ స్థాయేంటి? నేనే పెద్ద హీరోనంటున్నావ్.. నువ్వెక్కడ హీరోవి? చూసుకుందాం రా.. చంద్రబాబు జోలికి వచ్చిన రోజే నీకు ఈ సవాల్ విసరాలి. వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో ముద్దాయిని వన్‌టౌన్‌లో తిప్పుతున్నావ్. ప్రజలు ఓట్లేస్తారా? ఛీకొడ్తారు. ఏంటి నీకీ అహంకారం? నా కులం గురించి మాట్లాడుతున్నావ్. నీకు నీ కులంలోనే ఓట్లేయరే. సొంత ఇమేజితో గెలిచానంటావా? చంద్రబాబును, మమ్మల్నీ లెక్క చేయవు. నువ్వు పెద్ద తోపువా? తోపువైతే రా.. ఎక్కడైనా సెంటర్ చూసుకుందాం.. నువ్వో నేనో తేల్చుకుందాం. కనకదుర్గ గుడికి నీ ఇద్దరు కూతుళ్లను తీసుకుని రా.. చంద్రబాబును విమర్శించలేదని అమ్మవారి మీద ప్రమాణం చేయ్. మీడియా సాక్షిగా చెబుతున్నా. రేపు చంద్రబాబు ఆశీస్సులతో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా.. ఈ రోజు నుంచి ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతా. – బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ మాకు తెలియని స్థాయా నీది? నువ్వెవరికి తెలుసు? కేశినేనీ.. నువ్వు కులహంకారంతో మాట్లాడుతున్నావు. బలహీన వర్గాలంటే నీకు లెక్కలేదా? సైకిల్ గుర్తు లేకుండా నీకు ఒక్కడు ఓటేస్తాడా? నువ్వు పార్టీలోకి ఎప్పుడొచ్చావ్? 2013లో వచ్చావ్. మేం 1998 నుంచి ఉన్నాం. మేం కట్టుబానిసలమా? మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటున్నాం. మీ నాయకత్వం కింద మేం పని చేయాలా? మేం నాయకులం కాదా? నీ స్థాయి ఏమిటి? మాకు తెలియని స్థాయా నీది? నువ్వెవరికి తెలుసు? నిన్ను చూసి ఓట్లేయరు.. మమ్మల్ని చూసి వేస్తారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేయలేం. మీ చెప్పులు మోయాలా? ఇంకెన్నాళ్లు మోస్తాం? మోసే రోజులు పోయాయ్. – నాగుల్ మీరా, మైనార్టీ నేత సత్తా ఉంటే రాజీనామా చెయ్.. నీకు నిజంగా సత్తా , గ్లామర్ ఉంటే రాజీనామా చెయ్. చంద్రబాబు ఫొటో లేకుండా, తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా ఇండిపెండెంట్‌గా గెలువు. అప్పుడు మేం రాజకీయాలను వదిలేసుకుని, ఊరు వదిలేసి వెళ్లిపోతానని సవాల్ చేస్తున్నా. నువ్వెంత అహంకారంతో మాట్లాడుతున్నావ్. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావ్. నువ్వు మోనార్క్వని గెలిచావా? పార్టీ టిక్కెట్టు మీద గెలిచావా? కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్లాలి? ఎటు వెళ్లాలి? ఎంపీ పిలిస్తే వెళ్లాలా.. లేక ఎమ్మెల్సీలో, మాజీ ఎమ్మెల్యేలో పిలిస్తే వెళ్లాలా? ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఆదివారం చంద్రబాబు విజయవాడ పర్యటనలో కేశినేని నాని ఉంటే మేం పాల్గొనం. లేదంటే ఆయన్ను అదుపులో పెట్టండి. నాని ఒంటెత్తు పోకడలు, అవమానకరమైన ప్రవర్తన, బీసీలను, కాపులను చులకనగా చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. -బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే -
రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు
-
రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: బెజవాడ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా?. రూట్ మ్యాప్ మార్చడానికి కేశినేని ఎవరని వారు ప్రశ్నించారు. ‘చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదంటూ’ వారు నిప్పులు చెరిగారు. ‘‘టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు. రంగా హత్య కేసు నిందితులందరూ కేశినేని వెంటే ఉన్నారంటూ’’ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా విమర్శలు గుప్పించారు. కాగా, విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్‌కు గద్దె రామ్మోహన్ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్‌మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇచ్చిన టిక్కెట్‌ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. చదవండి: ఔను.. మళ్లీ ‘వాళ్ల మాటే’ నెగ్గింది తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. -
‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’
సాక్షి, గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాళ్లు. చంద్రబాబుకు దేవుడంటే అసలు నమ్మకం లేదు. ఆయన రాష్ట్రంలో కుల, మతాలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు. ఎక్కడో చిన్న తప్పిదం జరిగితే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతున్నారు. బుద్ధా వెంకన్న సైకిల్ బెల్లను దొంగతనాలు చేసేవాడు. ఆయనో బుద్ధిలేని వ్యక్తి. మంత్రి వెలంపల్లి నివాసంలో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణం. మంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెండి రథానికి నాలుగు అడుగుల దూరంలో బుద్ధా వెంకన్న ఇల్లు ఉంది. ఈ కేసులో బుద్ధా వెంకన్నను విచారణ చేయాలి.’ అని ఎమ్మెల్యే గిరిధర్ డిమాండ్ చేశారు. (చదవండి: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి) (చదవండి: చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) -
వదంతులు ప్రచారం చేస్తే కేసులు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగిపోయినట్టు కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదని, పని కట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించేలా వదంతులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల ఏడీజీ అయ్యన్నార్, విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపాటి ఘటనలను పెద్దవిగా చూపుతూ, పుకార్లతో అలజడి రేపే ప్రయత్నాలు సరికాదన్నారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుద్దా వెంకన్న, బొండా ఉమా కాల్ డేటా పరిశీలిస్తాం.. - మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ నుంచి మాచర్ల ఎందుకు వెళ్లారో.. అక్కడ దాడి జరిగితే ఎవరికీ ఫిర్యాదు చేయకుండా విజయవాడ ఎలా వచ్చారో.. ఇతరత్రా అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. - వారిని మాచర్ల నుంచి పోలీసు వాహనంలోనే బయటకు తీసుకొచ్చాం. - ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307 కింద సుమోటోగా కేసు నమోదు చేసి, ముగ్గురిని తక్షణం అరెస్టు చేశాం. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తే ఎలా? - బొండా ఉమ, బుద్దాల నుంచి స్టేట్మెంట్ తీసుకుంటాం. వారి కాల్ డేటా పరిశీలిస్తాం. - పుంగనూరు ఘటనపై టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు. మహిళా అభ్యర్థి చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే. (వీడియో క్లిప్పింగ్ చూపారు) - ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్పీల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు. చిన్న ఘటన జరిగినా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తాం. నిష్పక్షపాతంగా కేసుల నమోదు - వారం రోజుల్లో 57 కేసులు (ఇందులో హత్యాయత్నం ఘటనలు 8) నమోదు చేశాం. - 11,386 బైండోవర్ కేసులు నమోదు చేసి 1,09,801 మందిని బైండోవర్ చేశాం. - 10,514 ఆయుధాల్లో (లైసెన్స్డ్ వెపన్స్) 8,015 ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నాం. - నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న 3,184 మందిని, నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న 1,117 మందిని బైండోవర్ చేశాం. - ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పిస్తు న్నాం. - సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, తప్పుడు విషయాలను వైరల్ చేయడం వంటి వాటిపై సుమోటోగా కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం. - ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేశాం. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశాం. -
బోండా ఉమ, వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నాం
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగినట్లు ప్రచారం చేయొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఏపీ పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. (వీడియోలు తీయండి.. గొడవ చేయండి ) ఆమె చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే.. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సంఘటనపై డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలతో పాటు, ఆయన చూపించిన వీడియోపై డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థి చుట్టు ఉన్నది టీడీపీ నేతలే అని, నామినేషన్ ఎవరో దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. (ఆడలేక మద్దెల ఓడు) ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్ సెల్ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా 35 సంఘటనలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా 43 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల నామినేషన్లలో 14 ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారన్నారు. కేవలం ఎనిమిది సంఘటనల్లో మాత్రమే 307 సెక్షన్ కింద కేసులు నమోదు అయినట్లు డీజీపీ తెలిపారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం) రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకూ పోలీసుల తనిఖీల్లో రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ చేశామని, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, 701 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. (కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ!) రికార్డు స్థాయిలో... ఆపరేషన్ సురా 1,1386 బైండోవర్ కేసులు నమోదు చేశామని, అలాగే 10,980 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నామని, జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద 27,735 మంది, సమస్యాత్మక ప్రాంతాల్లో 4,399 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సురా పేరుతో రికార్డు స్థాయిలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరిగేవని, ఈసారి అలా జరగకుండా చూడబోతున్నామన్నారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హలు అవుతారంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. (డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా) వాళ్ల కాల్‌డేటా పరిశీలిస్తున్నాం.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాచర్ల ఎందుకు వెళ్లారో..అక్కడి నుంచి విజయవాడకు ఎలా వచ్చారో విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్లలో ఘటన జరిగితే అక్కడి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారని, మాచర్ల ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. వాళిద్దరూ ఎందుకు మాచర్ల వెళ్లారు, ఎప్పుడు పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న తమకు స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నారు. (అల్లర్లకు పన్నాగం) -
అరాచకమే.. టీడీపీ నైజం
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఏదో జరిగిపోతోందని ‘చలో ఆత్మకూరు’ పేరుతో గత ఏడాది సెప్టెంబర్‌లో నానాయాగీ చేసిన టీడీపీ.. తాజాగా మరో అలజడి సృష్టించి శాంతిభద్రతల సమస్యలకు పన్నాగం పన్నడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీ వారితో స్థానిక జిల్లా నేతలు నామినేషన్లు వేయించాల్సింది పోయి విజయవాడకు చెందిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నను చంద్రబాబు పల్నాడుకు పంపడంపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 2014–19 వరకు టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలను స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. - 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబుపై మాజీ స్పీకర్ కోడెల తనయుడు శివరామ్ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమే కాక ముస్తఫా, అంబటిలను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన వాహనం 5 ఏళ్ల పాలనలో టీడీపీ దుర్మార్గాలు - 2014 సెప్టెంబర్ 11న మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చినగార్లపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి (45)పారిపోతున్నా వదలకుండా టీడీపీ మూకలు వెంటాడి కత్తులతో నరికి చంపాయి. అడ్డు వచ్చిన అతని భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందుకు ప్రయత్నించారు. - 2014 సెప్టెంబర్ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిలను హతమార్చారు. - 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడిచేసి గాయపరచడంతో అతను మృతిచెందాడు. - 2014 డిసెంబర్ 19న మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్యను కూడా టీడీపీ వర్గీయులు హతమార్చారు. కోర్టు వాయిదాకు వెళ్లొస్తున్న ఆయనపై టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడిచేసి అతి కిరాతకంగా చంపారు. - 2015లో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత పెద వెంకటేశ్వర్లు (బ్రహ్మం)నూ టీడీపీ వర్గీయులు నరికి చంపారు. - 2017 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎస్సార్సీపీ నేత సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేటకొడవళ్లతో నరికి చంపారు. - 2019 ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున గురజాల పట్టణంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తులు ధ్వంసం చేశారు. అదే విధంగా గురజాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయినా అదే తీరు - గత ఏడాది డిసెంబర్ 27న రాజధాని ప్రాంతంలోని మందడంలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై టీడీపీ మూకలు దాడిచేశాయి. - జనవరి 7న గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. - ఫిబ్రవరి 2న కృష్ణాజిల్లా నందిగామలో బాపట్ల ఎంపీ సురేష్‌పై దాడికి తెగబడ్డారు. ఇదే నెల 23న అమరావతి మండలం లేమల్లె గ్రామంలో సురేష్‌పై మరోసారి టీడీపీ శ్రేణులు కారం చల్లి దాడికి పాల్పడ్డారు. - ఫిబ్రవరి 17న కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు, మహిళలు దాడికి పాల్పడ్డారు. - ఫిబ్రవరి 20న మంగళగిరి రూరల్ మండలంలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కారును టీడీపీ గూండాలు అడ్డుకుని ఆమెపై దాడికి విఫలయత్నం చేశారు. ఇదే రోజు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డ్రోన్ కెమెరా ఆపరేట్ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైనా ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నాయకులు మందడంలో దాడికి తెగబడ్డారు. -
‘మా వాళ్లను చంపేస్తారా..? చంపేస్తే చంపేయండి..’
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఓ చిన్న ఘటనను సాకుగా చూపి ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం నడిపిన హైడ్రామా చూసి సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ ఆయన చేసిన హడావుడికి అంతా విస్తుపోయారు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్మీట్లు నిర్వహించి పట్టలేని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీర్ఘంగా మాట్లాడటం, డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి బైఠాయించడం, పోలీసు అధికారులు లోపలకు రావాలని కోరినా తిరస్కరించి రోడ్డుపైనే కూర్చుని చేసిన హంగామాకు అందరూ నివ్వెరపోయారు. - మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి పెద్దగా అరుస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రం అల్లకల్లోలమైందనే భ్రమ కలిగించే రీతిలో వ్యక్తం చేసిన హావభావాలు చూసి సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ‘మా నాయకులను చంపేస్తారా..? చంపేస్తే చంపేయండి..’ అంటూ కొద్దిసేపు, ‘ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగాయా? ఇవన్నీ చూసి ప్రజలు ఆలోచించాలి’ అంటూ దండం పెట్టారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి హడావుడి చేశారు. - మాచర్ల నుంచి బొండా, బుద్ధా రాగానే మళ్లీ మీడియా సమావేశం నిర్వహించి వారితో గంటన్నర మాట్లాడించి తాను మరో 45 నిమిషాలు ప్రసంగించారు. - పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు డీజీ రవిశంకర్‌కు కొద్దిసేపు విలువల గురించి ఉద్బోధించారు. - అనంతరం చంద్రబాబు రోడ్డుపైనే కూర్చుని మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరగంటసేపు మాట్లాడారు. అక్కడినుంచి విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుండగా మీడియా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అయిష్టంగానే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. -
శాంతిభద్రతల విఘాతానికి బాబు ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ చూస్తోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ అలజడులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 కార్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్లకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. టీడీపీ నేతల కార్లు ఓవర్ స్పీడ్‌తో దివ్యాంగుడిపైకి దూసుకెళ్లాయని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని చెప్పారు. - ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు ఉండకూడదని, వ్యవస్థలో మార్పు రావాలని సీఎం చెప్పారు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాక్షసానందం పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. - గత ఐదేళ్లలో ఏ విధంగా బాబు ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. అయినప్పటికీ వాటిని సహించాం. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేదు. ప్రజల ఆలోచన మేరకు సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలతో ముందుకెళ్తున్నాం. - పులివెందుల టీడీపీ ఇన్చార్జి సతీష్‌రెడ్డి, విశాఖలో పంచకర్ల రమేష్ చంద్రబాబు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని వివరించారు. -
మీ గూండాగిరీ.. ఇక్కడ చెల్లదు
మాచర్ల: ‘నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా దగ్గరికి వచ్చి గూండాయిజం చేస్తామంటే కుదరదు. పల్నాడు ప్రాంతంలో హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయడం అలవాటు. ఏదో షో చేసి మీడియా ముందు మాట్లాడటం కాదు. మీకు చేతనైతే మాచర్లకు రండి... లేదా నేనే విజయవాడ వస్తా’’ అంటూ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన బుధవారం మాచర్లలో విలేకరులతో మట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వారి అనుచరులు పది కార్లలో మాచర్లకు తరలివచ్చారని, దివ్యాంగుడిపై కారు వేగంగా వెళ్లటంతో అక్కడ స్థానికులు వారిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిని అడ్డం పెట్టుకొని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. - విజయవాడలో గల్లీ రాజకీయాలు చేసే బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు పది కార్లు వేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి? - ప్రతిదీ రాజకీయం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అలజడి సృష్టించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధం లేని వారు ఇక్కడ గొడవలు చేయాల్సిన పని ఏమిటి? మీ గూండాగిరీ పల్నాడులో చెల్లదు. - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నన్ను టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రాజధాని అమరావతి వద్ద నాపై దాడి చేయించారు. - టీడీపీ తరఫున నామినేషన్లు వేసేవారు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకొని గల్లీ గూండాలు నాటకాలకు తెరతీశారు. - మా పార్టీ శ్రేణులపై దాడులు చేయడానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు వచ్చి కారు నడిపి ఒక దివ్యాంగుడిని గాయపరచడం వల్లే ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు నానా హంగామా చేసి ప్రజలను రెచ్చగొట్టారు. -
అల్లర్లకు పన్నాగం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వాటినే ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపించి మరింత రాద్ధాంతం సృష్టిస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు.. ప్రజలను ఏమార్చేందుకు, ఓటమికి సాకులు చెప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయనన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన కూడా ఇందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన పిన్నెల్లి కారు అనవసర రాద్ధాంతానికే బొండా, బుద్ధా మాచర్లకు.. గుంటూరు జిల్లా పల్నాడులోని వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బోదిలవీడులో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం రాత్రి దాడిచేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్దేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చంద్రబాబు చూశారు. కానీ, మార్గమధ్యంలో మాచర్ల వద్ద టీడీపీ నేతల వాహనం వికలాంగుడ్ని ఢీకొట్టింది. ఈ ఘటనతోనే అక్కడ ఘర్షణ తలెత్తిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక గ్రామంలో జరిగిన చిన్న గొడవపై విజయవాడ నుంచి భారీఎత్తున నాయకులను పంపాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని పిన్నెల్లి డిమాండ్ చేశారు. రాద్ధాంతం సృష్టించే వ్యూహంతోనే వారు బయలుదేరినట్లు ఆయన స్పష్టంచేశారు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల గ్రామంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులను టీడీపీ నేతలు వీడియో తీస్తూ ధూషించడంతో ఘర్షణ జరగ్గా దానిపైనా హంగామా సృష్టించారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల్లో ఐదారుకు మించలేదు. 13 జిల్లాల్లో మిగిలిన చోట్ల ఎక్కడా ఘర్షణ వాతావరణం లేకపోయినా తాను సృష్టించిన ఈ చిన్న ఘటనల్ని ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శాంతిభద్రతల సమస్యగా ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలపైనే దాడులు : గోపిరెడ్డి టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో తమపై ఇంతకంటే పెద్దఎత్తున దాడులు జరిగాయని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలపైనే దాడులు చేసిన ఉదంతాలున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన సందర్భాలున్నాయని వివరించారు. కానీ, ఇప్పుడా వాతావరణం రాష్ట్రంలో ఎక్కడాలేదని.. కేవలం టీడీపీ వాళ్లు అక్కడక్కడ సృష్టించిన చిల్లర గొడవలు తప్ప స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ చెబుతోంది. కీలక నేతల గుడ్బైతోనే ఇలా : బొత్స ఇక అన్ని వర్గాల ఆదరణను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి గ్రామాల్లో హీనంగా మారిపోవడంతో ప్రజలను ఏమార్చేందుకు ఇవన్నీ చేస్తున్నట్లు మంత్రి బొత్స స్పష్టంచేశారు. ఎన్నికల వేళ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కీలక నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం టీడీపీకి ఏమాత్రం మింగుడుపడడంలేదు. ఉదా.. – డొక్కా మాణిక్యవరప్రసాద్, కదిరి బాబూరావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డి వంటి ముఖ్య నాయకులు పార్టీకి వరుసగా రాజీనామా చేయడం.. మరికొందరు అదేబాటలో ఉన్నట్లు తెలియడంతో చంద్రబాబుకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. – అనేకచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎంపీటీసీలు,సర్పంచ్ స్థానాల్లో అభ్యర్థుల కోసం వారు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. – సగానికిపైగా జిల్లాల్లో జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దంపడుతోంది. – అనేకచోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్య నాయకులు అస్త్ర సన్యాసం చేయడంతో పార్టీని నడిపించే నాథుడే కనిపించడంలేదని చెబుతున్నారు. – క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే బలం కోల్పోయి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్లు సైతం పోటీచేయలేమని చేతులెత్తేస్తున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. – ఇక పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్కపోతే.. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పోటీచేయడానికి ముందుకొచ్చిన వారికి మద్దతిస్తామని స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రకటించడం.. టీడీపీ పతనావస్థకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎస్ అధికారిపై దాడిచేసిన వారితో స్క్రీన్‌ప్లే విజయవాడలో నడిరోడ్డు మీద ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం (అప్పటి రవాణా కమిషనర్) మీద దాడిచేసిన బొండా ఉమ (అప్పటి ఎమ్మెల్యే), ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను మాచర్లకు పంపించడానికి చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉన్న వారిద్దరూ అనవసరంగా మాచర్లకు బయల్దేరి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. అది చూసి ఆవేశంతో ప్రశ్నించడానికి వచ్చిన స్థానికులతో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగక.. ఆ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. బొండా, బుద్ధా గత చరిత్ర కూడా వివాదాస్పదం కావడం తెలిసిందే. రాష్ట్రమంతా అదే కుట్ర ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి టీడీపీ ప్రయత్నించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పెదపూడి, చిత్తూరు జిల్లా పుంగనూరు, చంద్రగిరి, గుంటూరు జిల్లా దాచేపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తదితర చోట్ల కూడా ఇదే తరహాలో కుట్రను అమలుచేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. పూర్తిస్థాయి నివేదికకు డీజీపీ ఆదేశం గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో ఐజీ మాచర్లకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఐజీ వెంట గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు కూడా ఉన్నారు. జరిగిందిదీ.. ► సోమవారమే టీడీపీ దాడి.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో సోమవారం రాత్రి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు. ► బెజవాడ నుంచి టీడీపీ నేతలు బోదిలవీడులో జరుగుతున్న గొడవలను పెద్దవి చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఒక పథకం ప్రకారం బుధవారం విజయవాడ నుంచి నాయకులు భారీ సంఖ్యలో వాహనాలలో అక్కడకు బయల్దేరారు. ► మాచర్లలో యాక్సిడెంట్.. విజయవాడ నుంచి వస్తున్న టీడీపీ నాయకుల వాహనాలలో ఒకటి మాచర్లలో ఒక దివ్యాంగుడిని ఢీకొట్టడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ► దుర్భాషలాడడంతో ఘర్షణ.. దివ్యాంగుడు గాయపడినా ఏ మాత్రం బాధ లేకపోగా.. దుర్భాషలాడడంతో స్థానికులు దాడిచేశారు. కార్లలోని వారు ఏపార్టీ వారనేది కూడా స్థానికులకు తెలియదు. ► బాబు హైడ్రామా.. ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి టీడీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఫిర్యాదు చేసే పేరుతో డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ బయటే బాబు బైఠాయించారు. -
‘లోకేష్‌ను కన్నందుకు బాబు బాధపడుతున్నాడు’
సాక్షి, తాడేపల్లి: రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు, లోకేష్‌ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించులేకపోయాడు. ఇలాంటి కొడుకు పుట్టినందుకు చంద్రబాబు మథనపడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చర్రితలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించబోతున్నారని తెలిపారు. రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. మాట తప్పారని ఆరోపించారు. జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల దెబ్బలకు చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రజాదరణ కార్యక్రమం అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు సుధాకర్ బాబు. చంద్రబాబు విద్యను అమ్ముకునే వాడిని విద్యాశాఖ మంత్రిగా చేస్తే.. జగన్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు సుధాకర్ బాబు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్ అవుతుందన్నారు. ఏనాడైతో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడే.. నాటి నుంచే టీడీపీ కనుమరుగవడం ప్రారంభించిందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో మిగిలిన వేలాది కోట్ల రూపాయలు చంద్రబాబుకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన పాపాలను కడుక్కొడానికి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని ఆయన సూచించారు. కాకపోతే.. చంద్రబాబు గంగానదిలో దిగితే అది కూడా కలుషితమవుతుందన్నారు సుధాకర్ బాబు. జగన్ పాలన గురించి బుద్ధిలేని బుద్ధా వెంకన్న కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. దుర్గ గుడిలో కొబ్బరి చిప్పల దొంగ బుద్ధా వెంకన్న.. రాయడం, చదవడం రాని వెంకన్న కూడా ట్విటర్లో పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బుద్ధా వెంకన్నకు ట్విటర్లో పోస్ట్ చేయడం, కామెంట్ చేయడం వచ్చా అని ప్రశ్నించారు. -
టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!
సాక్షి, విజయవాడ: రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్(నాని) టీడీపీలో ఏకాకిగా మారుతున్నారు. ఇటీవల అధిష్టానంపై తీవ్ర ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండటం.. పార్టీలోని నాయకులను బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంపై పార్టీలో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ అండగా ఉన్న కొందరు నేతలు సైతం ఆయనకు దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేడర్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. గెలిచినప్పటి నుంచి.. ఎన్నికల్లో గెలవగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, విజయవాడ వచ్చిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌ను ఎంపీ కేశినేని ప్రత్యేకంగా కలవడం ఆ పార్టీలో చర్చనీయాశంగా మారింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లోక్‌సభలో పార్టీ విప్ బాధ్యతలు అప్పగిస్తే తనకు అవసరం లేదంటూ బహిరంగంగానే తృణీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేస్తే దాన్ని లోక్‌సభలోనూ, బయట టీడీపీ సమర్థించింది. అయితే ఎంపీ కేశినేనినాని మాత్రం బయటకొచ్చి వ్యతిరేకించడం కేడర్‌ను గందరగోళంలో పడేసింది. అర్బన్ నేతలు దూరం..దూరం.. ఎంపీ కేశినేని నానికి, అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్లో యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు ట్వీట్ల రూపంలో తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఒకరు దొంగ బస్సులు తిప్పారంటే.. మరొకరు సైకిల్ బెల్స్, చెప్పులు దొంగిలించుకున్నారని విమర్శించుకున్నారు. దీంతో బుద్ధావెంకన్న కేశినేని నానికి దూరమయ్యారు. గతంలో కేశినేని భవన్లో కీలక పాత్ర పోషించిన, అర్బన్ కార్యదర్శి పట్టాభి కూడా ఎంపీ కేశినేనికి దూరం జరిగారు. తనకు పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పి కేశినేనిని వీడారు. కేశినేని భవన్లో పట్టాభికి ప్రాధాన్యం ఏమాత్రం లేదని అంటున్నారు. ఇక కేశినేని భవన్‌కు వెళ్లే అర్బన్, జిల్లా నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిఘా పెట్టినట్లు సమాచారం. అటువైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా సమావేశాలకు ఎంపీ గైర్హాజరు.. గత ఐదేళ్లు టీడీపీ జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహిస్తే ఎంపీ కేశినేని నాని తప్పని సరిగా హాజరయ్యేవారు. అయితే రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు హాజరయ్యే సమావేశాలకు మాత్రం హాజరై కొద్దిసేపు ఉండి వెళ్లిపోతున్నారు. సొంత గ్రూపు.. పార్టీలో కూడా తన సొంత గ్రూపును తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. అర్బన్ పార్టీలోనూ తనకు అనుకూలంగా ఉండే మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారినే తన కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. వివాదాల పయనం.. కేశినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వామపక్షాలపై పలు ఆరోపణలు చేయడంతో ఆ నాయకులు కేశినేని ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు ఎగ్గొట్టడంపై నిలదీశారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పీవీపీ తన ట్వీట్స్‌లో ఎంపీ నానిని కడిగేస్తున్నారు. ఎంపీ నాని ప్రజాసమస్యలపై కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలకే పరిమితమవుతున్నారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. రోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ ట్విట్టర్ పులిగా మారారని, ఆయన వ్యవహార శైలితో పార్టీ ఇరకాటంలో పడుతోందని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని బెజవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కలహించుకుంటూ చేస్తున్న రచ్చ ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. టీడీపీ నేతలు రోడ్డుపైకెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారని పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. వీరిని నియంత్రించలేకపోవడం ఆయన నిస్సహాయ పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు. విజయవాడలో టీడీపీ ముఖ్య నేతలైన ఎంపీ కేశినేని నాని, నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాలుదువ్వుతున్నారు. పార్టీ పరువును బజారున పడేస్తున్నా చంద్రబాబు వారిని నియంత్రించలేకపోతున్నారు. నాని, బుద్ధా రెండ్రోజులుగా ట్విట్టర్లో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకుంటున్నా పార్టీలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇద్దరూ గల్లీ నాయకుల కంటే దారుణంగా తిట్టుకుంటున్నారు. బుద్ధా వెంకన్న గుళ్లో కొబ్బరి చిప్పలు, సైకిల్ బెల్లుల దొంగ అని కేశినేని నాని ట్వీట్ చేస్తే, నాని దొంగ పర్మిట్లతో బస్సులు నడిపాడని, మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులు కాజేసిన దొంగని, మోసగాడని అని బుద్ధా వెంకన్న ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఇలా ఒకరి బండారాన్ని మరొకరు బయటపెట్టుకుంటుండడంతో టీడీపీ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. కేశినేని టార్గెట్ చంద్రబాబే ఇటీవల కాలంలో టీడీపీ అధినాయకత్వంపై సునిశిత విమర్శలు చేస్తూ వస్తున్న ఎంపీ కేశినేని నాని సోమవారం ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబుపైనే గురిపెట్టారు. తనలాంటి వారు అవసరం లేదనుకుంటే ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, తాను పార్టీలో కొనసాగాలంటే మీ పెంపుడు కుక్కను కంట్రోల్లో పెట్టుకోవాలని హెచ్చరిక ధోరణితో ట్వీట్ చేశారు. కేశినేని నాని ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుండడం, ఆయన తనపైనే కొద్ది రోజులుగా విమర్శలు చేస్తుండడంతో చంద్రబాబు నేరుగా ఆయన్ను మందలించే సాహసం చేయలేదు. మరోవైపు బుద్ధా వెంకన్న తన వీరాభిమాని కాబట్టి ఆయన్ను వారించే ప్రయత్నమూ చంద్రబాబు చేయలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతల్ని రంగంలోకి దించి చంద్రబాబు ఇద్దరినీ బుజ్జగించారు. అయితే చంద్రబాబు తన బినామీలుగా ఉన్న సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపినట్లే కేశినేని నానిని కూడా ఆ పార్టీలోకి పంపే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేయిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. -
కొబ్బరిచిప్ప దొంగలకు, కాల్‌మనీగాళ్లకు అది అవసరం
సాక్షి, విజయవాడ: ట్విటర్ వేదికగా టీడీపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా బుద్ధావెంకన్నపై టీడీపీ అసంతృప్త ఎంపీ కేశినేని నాని మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్ బెల్లుల దొంగలకు, కాల్‌మనీగాళ్లకు, సెక్స్ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని.. తనకు అవసరం లేదని ఘాటుగా ట్వీట్ చేశారు. అంతకుముందు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి కేశినేని నాని పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు..నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నారు.. దౌర్బాగ్యం’ అంటూ వెంకన్నను ఎద్దేవా చేశారు. గతకొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్లో యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో కేశినేని నాని ఆయనను టార్గెట్ చేసి.. ట్వీట్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ ట్వీట్‌కు బుద్దా వెంకన్న కూడా కౌంటర్ ఇచ్చారు. ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం.. నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఇద్దరు నేతలు పరస్పరం టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న ట్వీట్స్‌తో టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడి.. రచ్చ చేస్తున్నాయి. -
కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ట్విటర్ వేదికగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూ విమర్శలతో రోడ్డున పడ్డారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కేశినేని నాని ఆదివారం ఉదయం బుద్దా వెంకన్నను ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు. దీనిపై కొద్దిసేపటికే బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘సంక్షోభం సమయంలో పార్టీ కోసం...నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు..చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు కేశినేని నాని... నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాదు నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు... ఇది మన దౌర్భాగ్యం అంటూ ట్వీట్లో విమర్శించారు. చదవండి: బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసిన కేశినేని నాని! -
కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న
-
కలకలం రేపుతున్న కేశినేని నాని ట్వీట్
-
బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసిన కేశినేని నాని!
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు...నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నారు....దౌర్బాగ్యం’ అంటూ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కాగా కొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్లో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా ట్వీట్స్ పెడుతున్న నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల టీడీపీలో షో మ్యాన్లు అవసరం లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతోంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తాను సూచించినవారికి ఇవ్వకుండా జలీల్ ఖాన్ కుమార్తెకు కేటాయించడం... దీని వెనుక మాజీమంత్రి దేవినేని ఉమతో పాటు బుద్ధా వెంకన్న కూడా ఉండటం కూడా నాని అసంతృప్తికి కారణం అని తెలుస్తోంది. మరోవైపు త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై కూడా ఇద్దరు నేతల మధ్య వార్ కొనసాగుతోంది. గతంలోనూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి కేశినేని నాని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. -
అవినాష్‌కు పదవికోసం ఇంటెలిజెన్స్ డీజీని కలిశాం
సాక్షి, అమరావతి: దేవినేని అవినాష్‌కు తెలుగు యువత పదవి కోసం ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దగ్గరకెళ్లాం అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో బుద్దా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. బుద్దా చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీకోసం ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తోందనేందుకు నిదర్శనంగా నిలుస్తుండడమేగాక పార్టీ పదవుల కేటాయింపు, అధికారుల బదిలీల్లో ఇంటెలిజెన్స్ డీజీ కీలక పాత్ర పోషిస్తున్నారనేందుకు అద్దం పడుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం టీడీపీ అనుబంధమా అంటూ సెటైర్లు పేలుస్తుండడం విశేషం. అవినాష్‌కు తెలుగు యువత పదవి రావడానికి తనతోపాటు గద్దె రామ్మోహన్ కూడా కారణమని, తాము ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్లి అవినాష్‌కు పదవి ఇవ్వాలని కోరామని బుద్దా ఇందులో చెప్పుకొచ్చారు. వెంకటేశ్వరరావుకు చెప్పిన తర్వాత.. సీఎం చంద్రబాబును కూడా కలసి చెప్పడం జరిగిందని ఆయన సగర్వంగా వివరించుకున్నారు. ‘‘దేవినేని అవినాష్‌కు ఎక్కడినుంచి పోటీ చేయాలని ఉందో, అక్కడి నుంచి పోటీ చేస్తాడు.. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు’’ అంటూనే జరిగిన సంగతులన్నింటినీ ఆయన సభావేదిక సాక్షిగా బహిర్గతం చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు ఏదైతే నెహ్రూ మోసగాడు కాదు అన్నారో.. మేము కూడా మోసగాళ్లం కాదు.. మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంత రిస్క్ అయినా పోరాటం చేయడం మా నేచర్. దేవినేని అవినాష్ యువత కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అంతే కమిట్మెంట్తో పనిచేయాలి’’ అని బుద్దా అన్నారు. తెలుగు యువత అధ్యక్ష పదవి రావడం మామూలు విషయం కాదని, అది ఒకప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ చేశారని చెప్పుకొచ్చారు. మరి ఆ పదవిని ఇప్పుడు అవినాష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత ప్రేమ.. మనోడు, మన మనిషి అని భావించి ఇచ్చారని బుద్దా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. అంతేస్థాయిలో దీనిపై విమర్శలూ రేగుతున్నాయి. -
‘చంద్రబాబు కరకట్టపై కాపలా పెట్టకున్నారు’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ అడ్డదారిలో మంత్రి అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిగం సురేశ్ విమర్శించారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోరుంది కదా అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను హెచ్చరించారు. బుద్ధా వెంకన్న అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓడిపోతామనే భయం పట్టుకుందని.. ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబుకు అర్థమైందని అన్నారు. ఓటుకు కోట్లు కేసు, ఇటీవల ఐటీ గ్రిడ్స్ కేసు తర్వాత ఏ క్షణాన అరెస్ట్ చేస్తారో అనే భయంతో చంద్రబాబు కరకట్టపై కాపలా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐకి నో ఎంట్రీ బోర్డులు తీసేసి.. విచారణకు సిద్దపడ్డాలని సవాలు విసిరారు. దొంగతనం చేసి కేకలు పెట్టినంత మాత్రాన ఏమి జరగదని వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబు అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఎల్లో మీడియాలో అబద్ధాలను ప్రచారం చేసినంతా మాత్రనా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
గవర్నర్‌పై టీడీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు..
సాక్షి, విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై ప్రభుత్వ విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఉంటున్నది రాజ్భవనా లేక బీజేపీ భవనా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్, రాజ్‌భవన్‌పై ఏపీ ప్రజలకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బుద్ధా వెంకన్న మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలకు అతీతంగా పని చేయాలి తప్ప, రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గవర్నర్ బంగ్లా నుండే ప్రారంభమయిందని అన్నారు. బీజేపీ నేతలు గవర్నర్ బంగ్లాని చూసి రెచ్చిపోతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. కన్నా అవినీతి గురించి మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీకి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
తారాస్థాయికి చేరిన బీజేపీ-టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ మెజార్టీ బాగా తగ్గిపోతుంది..
సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రతిష్ట బాగా దెబ్బతింటోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఆ పార్టీకి మెజార్టీ కూడా బాగా తగ్గిపోతుందని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆ పార్టీ గెలిచే అవకాశాలున్నా 2014లో వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని, రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెబితేనే దానికి అంగీకరించామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చెప్పారు. ప్రత్యేక హోదాతోపాటు మిగిలిన 18 అంశాలను సాధించడమే లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ నాయకులు రోడ్లపై తిరగలేరు : బుద్ధా వెంకన్న రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న మాపై చులకనగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ నాయకులు వారి నియోజకవర్గాల్లో కూడా తిరగలేరని, రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కూడా మాట్లాడారు. -
అంబటి అరెస్ట్.. సత్తెనపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి : అర్హులందరికీ పెన్షన్లు అందించడంలో విఫలం చెందారు కాబట్టే టీడీపీ నేతలు చర్చకు భయపడుతున్నారని, అందులో భాగంగానే తనను హౌస్ అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పెన్షల వ్యవహారంపై ఓ టీవీ చానెల్లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విసిరిన సవాలును స్వీకరిస్తూ సత్తెనపల్లి సెంటర్లో చర్చ కోసం బయలుదేరిన అంబటిని గుంటూరులోనే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సత్తెనపల్లిలో ఉద్రిక్తత : టీడీపీ నాయకులతో చర్చ కోసం వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు సత్తెనపల్లికి చేరుకున్నారు. అంతలోనే అంబటి అరెస్టు వార్త తెలియడంతో కార్యకర్తలు ఆందోళకు గురయ్యారు. అక్కడికక్కడే శాంతియుత నిరసనలకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు వారిని బలవంతంగా పంపేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం అదే ప్రదేశంలో.. పోలీసుల అండతో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్సీ వెంకన్నలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. సమస్యలపై మాట్లాడాలనుకున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి, అధికార పార్టీ నేతలకు వత్తాసుపలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని అంబటి రాంబాబు విమర్శించారు. చర్చ చేపడితే అక్రమాలు బయటికొస్తాయనే భయంతోనే టీడీపీ నేతలు పోలీసులను అడ్డంపెట్టుకుని కుట్రలు చేశారని మండిపడ్డారు. -
నోరు మెదపవద్దని సీఎం ఆదేశం
-
పాలకమండలి సభ్యులపై చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని వాస్తవాలు బైటపెట్టిన పాలక మండలిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా దుర్గగుడి వివాదంపై పాలక మండలి సభ్యులు ఇకపై నోరు మెదపవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం పాలక మండలి సభ్యులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. అయితే ఎటువంటి విచారణ జరగకుండానే ఆలయంలో పూజలు జరగలేదని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎలా ప్రకటించారని పాలకమండలి సభ్యులు...ఎమ్మెల్సీని నిలదీశారు. ఈవో వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందని పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇలాగే ముదిరితే పాలక మండలినే రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ సభ్యులను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అలాగే ఈవో సూర్యకుమారి తప్పేమీ లేదని చెప్పకపోతే దుర్గగుడి ఆయల ప్రతిష్ట దెబ్బతింటుందని సూచన చేశారు. కాగా సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. -
‘నా ఇంటిపై దాడి చేయించినా భయపడను’
విజయవాడ: టీడీపీ నేతలే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ఇంటిపౌ దాడి చేయించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. పైరవీలతోనే బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. వైఎస్ జగన్‌ను విమర్శించే నైతకత వెంకన్నకు లేదన్నారు. విశాఖ భూకబ్జాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర ఉందని, చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
-
'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
విజయవాడ: మంత్రి నారా లోకేశ్ మంచివాడని, అందుకే ఆయనను పప్పు అంటున్నారేమోనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. పప్పు అనేది బూతు కాదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని, ఖజానా నిండగానే నిరుద్యోగభృతి చెల్లిస్తామని చెప్పారు. కృష్ణా నది కబ్జా విషయాన్ని టీవీలో చూశానని.. కబ్జాకు పాల్పడిన వారిలో తమ పార్టీ నేతలు ఎవరున్నా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నిరుగుద్యోగులకు వెంటనే భృతి చెల్లించాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత లేఖతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. త్వరలో యూత్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంప్లాయిమెంట్ బోర్డు ద్వారా నిరుద్యోగుల జాబితా ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. -
టీడీపీ గుండాగిరీ.. సారీతో సరి!
-
సారీతో సరి
‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గూండాగిరీ.. ⇒ సర్కారు తీరుపై అంతా విస్మయం ⇒ ఇదేం ప్రజాస్వామ్యం అంటూ అధికార వర్గాల మండిపాటు ⇒ దోషులను కాపాడటానికి స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ⇒ ‘సారీ’తో వివాదం ముగిసిందని కమిషనర్‌తో చెప్పించిన వైనం సాక్షి, అమరావతి: నడి రోడ్డులో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి.. ఆయనపై గూండాగిరీకి ప్రయత్నించి, అడ్డొచ్చిన ఆయన గన్‌మెన్‌పై దాడికి దిగిన టీడీపీ ఎంపీ కేశినేని బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. అధికారం అండ చూసుకుని నడిబజారులో పేట్రేగిన కేశినేని ట్రావెల్స్ అధినేత, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి సింపుల్‌గా ‘సారీ’తో సరి పెట్టించింది. విజయవాడ వీధుల్లో ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకుని నోటికొచ్చినట్లు దుర్భాషలాడితే కేసు కూడా పెట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇదేం ప్రజాస్వామ్యమని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయలేమంటూ అధికార వర్గాలు మండిపడుతున్నాయి. దౌర్జన్యం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించడం భవిష్యత్‌లో ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఇప్పటికీ న్యాయం చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు వనజాక్షినే తప్పు పట్టారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ తీరు పట్ల ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పౌర సమాజం ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. ఆదివారం ఆద్యంతం హై డ్రామా టీడీపీ నేతలు దాడికి పాల్పడి అత్యంత హేయంగా కమిషనర్‌ను దూషించిన సంఘటనపై ఆదివారం ఆద్యంతం పెద్ద హై డ్రామానే నడిచింది. దాడికి పాల్పడిన వారు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత.. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి వివాదాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసులు పెట్టించిన చంద్రబాబు.. తమ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకంగా ఐపీఎస్ అధికారిపై తిట్ల దండకం ప్రారంభించి గన్‌మెన్‌పై ఏకంగా దాడి చేసినా ‘సారీ’తో దారి మళ్లించారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ భవన్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గన్‌మెన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యే బొండా ఉమ, ఎంపీ కేశినేని నానిలపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పెన్‌డౌన్‌కు సిద్ధమన్నారు. ప్రభుత్వమంటే ఇదేనా? ప్రభుత్వం అంటే గూండాల్లా వ్యవహరించడమా? అని ఉద్యోగుల జేఏసీ ప్రశ్నించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఉద్యోగులు ప్రశాంతంగా విధులకు హాజరు కావాలా? వద్దా? అని నిలదీసింది. ఓ సీనియర్ ఐపీఎస్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పోలీస్ అధికారులు, వారి సంఘం ఏం చేస్తున్నారని మండిపడింది. సాయంత్రంలోగా కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఆ తర్వాత రవాణా ఉద్యోగులు, అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాంను కలిసేందుకు బయలుదేరారు. సీఎస్‌ను కలిసేందుకు వెళుతుండగా, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు నేరుగా సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. తన పట్ల ఎమ్మెల్యే బొండా ఉమ, కేశినేని వ్యవహరించిన తీరును కమిషనర్.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వివాదాలు మంచిది కాదని ముఖ్యమంత్రి.. కమిషనర్‌కు సూచించినట్లు తెలిసింది. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తన కార్యాలయంలో కూర్చొంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముగ్గురు వచ్చి క్షమాపణలు చెబుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో రవాణా ఉద్యోగులు, కమిషనర్ వెనుదిరిగి రవాణా కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది సేపటికే కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు ఆర్టీసీ హౌస్‌కు చేరుకుని కమిషనర్ బాలసుబ్రమణ్యంకు క్షమాపణలు చెప్పారు. వివాదం ముగిసినట్లే: బాలసుబ్రహ్మణ్యం కేశినేని నాని, బొండా ఉమ, బుద్దా వెంకన్నలు వచ్చి క్షమాపణలు చెప్పారని, అవగాహనా రాహిత్యంతోనే వారు అలా వ్యవహరించారని రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా అలానే వ్యవహరిస్తారని, తన సెక్యూరిటీ సిబ్బంది, రవాణా శాఖ అధికారుల నిబద్దతకు గర్వపడుతున్నాన న్నారు. ఒక ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో వివాదం రేగిందని, బస్సులో సాంకేతిక లోపం ఉందని నివేదిక ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని అనుచరుడు పట్టాభి అనే వ్యక్తి ఒత్తిడి చేశారన్నారు. తాము రూల్స్ ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాత వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం సరికాదని, ఇంతటితో వివాదం ముగిసినట్లేనన్నారు. మీ గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమా చేయి చేసుకున్నందున చట్టపరమైన చర్యలు ఏమీ ఉండవా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు రక్షణగా నిలిచిన గన్‌మెన్‌కు న్యాయం చేస్తానని, చర్యలు ఎలా ఉంటాయో మీరే చూస్తారంటూ ముక్తాయించారు. తనపై ఇంతలా, ఇలా దాడి జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర చర్చ సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రమణ్యం ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పని చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దగల దిట్టగా ఆయనకు పేరుంది. మావోయిస్టులు, సెటిల్మెంట్ గ్యాంగ్, అరాచక శక్తులకు టెర్రర్ పుట్టించే ట్రాక్ రికార్డు ఉన్న పోలీస్ అధికారి బాలసుబ్రమణ్యంనే కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు టార్గెట్ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం
‘దేశం’ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వైర విహారం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని బృందం దుర్భాషలు ⇒ గడ్డి తింటున్నావు... ఎంపీ అంటే లెక్కలేదా? అంటూ తిట్లదండకం ⇒ కొమ్ములొచ్చాయా.. ఏం బతుకు నీదంటూ ఎమ్మెల్యే బొండా చిందులు ⇒ ట్రావెల్స్ కేసులో తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ఎంపీ హుకుం ⇒ కమిషనర్ గన్‌మ్యాన్‌పై దాడి చేసిన బొండా సాక్షి, అమరావతి బ్యూరో / విజయవాడ : ‘నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా’ అని విజయ వాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. ‘ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది?’ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కారు. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి శనివారంనాడు కమిషనర్‌ను విజయ వాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను దాదాపు రెండుగంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. పైగా కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ ఆయన్ని ఘెరావ్ చేశారు. పోలీస్ డీసీపీ పాల్‌రాజ్, రవాణా శాఖ డీటీసీ మీరా ప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు ఎంతగా ప్రాధేయపడినా వెనక్కితగ్గలేదు. అధికార టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వ యంత్రాంగం నిర్ఘాంతపోయింది. కమిషనర్‌పై ఎంపీ ఒత్తిడి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు విజయవాడ ఆటోనగర్ వద్ద ఈ నెల 22న ఓ వ్యక్తిని ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును పోలీసులు సీజ్ చేసి విచారణ కోసం విజయవాడ రవాణాశాఖ ఉప కమిషనర్(డీటీసీ) కార్యాల యానికి పంపారు. రవాణా శాఖ అధికారులు ఆ బస్సు కండిషన్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ ఫైలును పరిశీలించేందుకు రవాణా శాఖ కమిషనర్ శనివారం విజయ వాడ బందరురోడ్డులోని డీటీసీ కార్యాలయా నికి వచ్చారు. ఇంతలో ఎంపీ కేశినేని నాని ప్రధాన అనుచరుడు పట్టాభి అక్కడకు చేరుకు న్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని పట్టాభి అక్కడి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటికే దాదాపు తయారైన నివేదికను మార్చి వేసి తాము సూచించినట్లు తయారు చేయాలని కేశినేని ఆదేశించారని కూడా పట్టాభి చెప్పినట్లు సమాచారం. ‘మాకు నిబంధనలు తెలుసు. నివేదిక ఎలా తయారు చేయాలో అలా చేస్తాం. ఇందులో మీరు ఒత్తిడి తేవడం సరికాదు’అని కమిషనర్ తన అభిప్రాయాన్ని అతనికి స్పష్టం చేశారు. నడిరోడ్డుపై కేశినేని వీరంగం... ఈ సమాచారం తెలుసుకున్న కేశినేని నాని తానే నేరుగా రంగంలోకి దిగారు. దాదాపు 200మంది టీడీపీ కార్యకర్తలతోసహా డీటీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే కమిష నర్ తన పని ముగించుకుని వాహనంలో బయలుదేరారు. కేశినేని తన వాహనాన్ని నేరుగా కమిషనర్ వాహనానికి ఎదురుగా నిలిపారు. వెంటనే కిందకు దిగి కమిషనర్ వాహనాన్ని తన అనుచరులతో చుట్టుముట్టి గట్టిగా కేకలు వేయసాగారు. వాహనం దిగిన కమిషనర్‌ను టీడీపీ కార్యకర్తలు అంతా చుట్టు ముట్టి కదలనీయకుండా చేశారు. ‘నేను వస్తు న్నానని తెలిసి వెళ్లి పోతున్నావా...? ఏం టీడీపీ ఎంపీ అంటే ఆ మాత్రం గౌరవం, భయం లేవా...? అంతా నీ ఇష్టమేనా?’ అని కేశినేని తీవ్రస్థాయిలో కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో కమిషనర్ నిశ్చేష్టులయ్యారు. ఆయనకు కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కేశినేని తీవ్రస్థా యిలో దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ‘నువ్వు గడ్డి తింటున్నావు. నీ సంగతి తేలుస్తా’ అని పెద్ద పెట్టున కేకలు పెట్టారు. అంతలోనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ కార్పొరేటర్లు, ఇతర కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారు కూడా కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డారు. కేశినేని నాని అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బంధువు అనిల్‌రెడ్డికి చెందిందంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయ త్నం చేయడం విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతు న్నప్పుడు మాత్రం జగన్ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. గన్‌మ్యాన్‌పై ఎమ్మెల్యే బోండా దాడి తన మాట విననందుకు కమిషనర్ తనకు క్షమాపణ చెప్పాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. లేకపోతే అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. బొండా ఉమ కూడా తీవ్రస్థాయిలో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీకు ఏమైనా కొమ్ములున్నాయా...? నువ్వు ఏమైనా దిగి వచ్చావా? ఏం బతుకు నీది?’ అని విరుచుకుపడ్డారు. అదే ఊపులో బొండా ఉమ.. కమిషనర్ మీదకు రాబోయా రు. దీన్ని గమనించిన కమిషనర్ గన్‌మ్యాన్ ఆయనకు అడ్డంగా వచ్చారు. దీంతో బొండా ఆగ్రహంతో ఆ గన్‌మ్యాన్‌పై దాడి చేశారు. పరిస్థితి దాదాపు అదుపుతప్పి కమిషనర్, ఇతర సిబ్బందిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి సిద్ధపడేంతవరకు వచ్చింది. విజయవాడ రవాణా శాఖ ఉప కమిషనర్ మీరా ప్రసాద్ దాదాపు ఐదారు సార్లు చేతులు ఎత్తి నమస్కరిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతూ కమిషనర్‌ను వదిలేయాలని ప్రాధేయపడ్డారు. అధికారుల దుస్థితి చూసి అంతా అవాక్కయ్యారు. విజయవాడ పోలీస్ డీసీపీ పాల్‌రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను శాంతించమని ప్రాధేయపడ్డారు. సోమవారం విధుల బహిష్కరణ తమ కమిషనర్‌పైనే టీడీపీ నేతల చౌకబారు విమర్శలు చేయడం, గన్‌మ్యాన్‌పై చేయి చేసుకోవడంపై రవాణా అధికారులు ఆందోళ నకు దిగనున్నారు. ఐజీ స్థాయి అధికారిపైనే ఈ మాదిరిగా వ్యవహరించిన టీడీపీ నేతలు కేశినేని, బొండా ఉమాలపై పోరు బాట పడతామని, ఆదివారం కార్యాచరణ ప్రకటిస్తామని రవాణా అధికారుల సంఘం నేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ప్రాథమికంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో విధులు బహిష్కరిస్తామని పేర్కొన్నారు. సొంత వ్యాపారం కోసమే గూండా గిరీ.. ట్రావెల్స్ రంగంలో ఉన్న ఎంపీ కేశినేని సొంత వ్యాపారం కోసమే రవాణాశాఖ కమిషనర్‌తో వివాదం పెట్టుకున్నారని రవాణా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన పోటీ ట్రావెల్స్ ఆరెంజ్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలని కేశినేని నాని, అతని అనుచరులు రవాణా శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. దీంతో ఆరెంజ్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేశారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకే కేశినేని దాడులు చేయిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి ఆలిండియా పర్మిట్లు పొందిన తమ బస్సులపై దాడులు చేయడం సరికాదని ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యం ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి తెచ్చింది. తెలంగాణాకు చెందిన తమను ఇలా వేధించడం సరికాదని వారు అభ్యర్థించారని సమాచారం. దాంతో ఏకపక్షంగా కేసులు నమోదు చేయవద్దని అధికారులకు కమిషనర్ సూచించినట్లు సమాచారం. ఈ లోగా విజయవాడలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. ఈ కేసులో తాను చెప్పినట్లు నివేదిక రూపొందించాలని ఎంపీ కేశినేని కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చారనేది విశ్వసనీయ సమాచారం. తాను కలిసేందుకు వస్తానని ఎంపీ ఫోన్లో కోరగా బాలసుబ్రహ్మణ్యం స్పందించలేదని ఆయన వర్గీయులు చెపుతున్నారు. దీంతో కేశినేని మందీమార్బలంతో కలిసి కమిషనర్‌ను కలిసేందుకు ఆర్టీసీ భవన్‌కు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో కృష్ణా డీటీసీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉన్న బాలసుబ్రహ్మణ్యంపై నోరు పారేసుకున్నారు. గతంలోనూ ఆరెంజ్ ట్రావెల్స్ వ్యవహారంలో జేసీ ప్రభాకర్, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ మధ్య పెద్ద దుమారమే నడిచింది. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి: కమిషనర్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. కమిషనర్ దగ్గరకు వచ్చి ఎంపీకి క్షమాపణ చెబితే విడిచిపెడతామని చెప్పారు. లేకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా డ్యూటీ నేను చేశా. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తా యి. మీడియా ముందు మాట్లాడటం ఇష్టం లేదు’ అని అన్నారు. అనంతరం డీసీపీ పాల్‌రాజ్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఒప్పించి.. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కార్యాల యానికి తీసుకు వెళ్లారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చర్చిం చారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారమైందని తెలిపారు. -
సమసిన ఫుడ్‌కోర్టు తరలింపు వివాదం
స్థానిక ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఫుడ్ కోర్టు తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఫుడ్‌కోర్టును తొలగించేందుకు ఆదివారం రాత్రి మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదులాట జరిగింది. ఇంతలోనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడికి చేరుకుని వ్యాపారులకు మద్దతు తెలిపారు. అనంతరం అంతా కలిసి కమిషనర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి చేరుకుని వారిని శాంతపరిచారు. ఫుడ్‌కోర్టు తరలింపు లేదని తెలపటంతో వ్యవహారం సద్దుమణిగింది. -
ఫుడ్‌కోర్టు తొలగింపు యత్నం.. వివాదం
విజయవాడ: ఫుడ్‌కోర్టు తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ఆదివారం అర్థరాత్రి సమయంలో మున్సిపల్ సిబ్బంది తొలగించే యత్నం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందికి వ్యాపారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అయితే వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్‌కోర్టు తొలిగించే నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యంతో ఫుడ్‌కోర్టు తొలగింపు వివాదం కాస్తా సద్దుమనిగింది. -
దుర్గ గుడిలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హల్చల్
-
'బాబు ఛరిష్మాను దెబ్బ తీస్తున్న బీజేపీ'
విజయవాడ : భారతదేశంలో ఏ నాయకుడికీ లేని ఛరిష్మా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆదివారం విజయవాడలో బుద్ధా వెంకన్న విలేకర్లతో మాట్లాడుతూ... అలాంటి నేత ఛరిష్మాకు దెబ్బతగిలేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి లాంటి అవినీతిపరులను బీజేపీ చేర్చుకుందని విమర్శించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
'వీధి రౌడీల్లా వ్యవహరించడం దారుణం'
విజయవాడ: వీధి రౌడీల్లాగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం దారుణమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల పదవిలో ఉన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న అసాంఘీక వ్యక్తులను ముందు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ఆలయాల తొలగింపు సరికాదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. హృదయ విచారంగా దేవుళ్ల విగ్రహాలను తొలగిస్తున్నారని వాపోయారు. స్వామీజీలు, మఠాధిపతులు కూడా విగ్రహాల తొలగింపును ఖండిస్తున్నారని చెప్పారు. గుజరాత్లో 300 గుళ్లు తొలగించారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బీజేపీని విమర్శించే వాళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కృష్ణుడిని బలిగొన్న ‘బుద్దా’
- టీడీపీ ఎమ్మెల్సీ నివాసాల కోసం గుడిని కూల్చేశారు.. - 40 అడుగులూ ఒకవైపే విస్తరించారు.. - ఆలయాల కూల్చివేతలో బాబుసర్కారు చేతివాటం... - బుద్దా వెంకన్న కోసం గోశాల, కృష్ణుడి మందిరాలు ధ్వంసం - ప్రత్నామ్నాయ స్థలం కేటాయింపుపైనా దొంగాట - రూ. 8 కోట్ల స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను సాక్షి, అమరావతి: గజనీ, ఘోరీల దండయాత్రలను మించిన స్థాయిలో విజయవాడలో ఆలయాల విధ్వంసం సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తమ్ముళ్ల ఆస్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలగకుండా రక్షణ కల్పిస్తోంది. పుష్కరాల పనులు, రోడ్ల విస్తరణ పేరుతో 30 ఆలయాలను ప్రొక్లైనర్లతో కూల్చివేసిన రాష్ర్టప్రభుత్వం... విస్తరించాల్సిన ప్రదేశంలోనే ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసాన్ని మాత్రం చెక్కుచెదరనీయలేదు. ఆయన నివాసానికి ఏమాత్రం నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఏకపక్షంగా రోడ్డును ఒకేవైపు విస్తరించింది. అందుకోసం దశాబ్దాల నాటి కృష్ణుడి మందిరాన్ని నామరూపాలు లేకుండా పెకలించేసింది. విస్తరణ ఒకవైపేనా..? అర్జున వీధిలో 40 అడుగుల మేర విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైనా రోడ్డును విస్తరించాలంటే రెండువైపులా సమానస్థాయిలో విస్తరిస్తారు. కానీ ఇక్కడ ఆ సూత్రాన్ని మార్చేశారు. రోడ్డుకు ఒకేవైపు ఏకంగా 40 అడుగులు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఎమ్మెల్సీ వెంకన్న నివాసాలు ఉన్నవైపు కాకుండా... ఎదురుగా కృష్ణుడి మందిరం ఉన్నవైపే పూర్తిగా 40 అడుగుల మేర రోడ్డు విస్తరించాలని నిర్ణయించారన్నమాట. అందుకు అడ్డువచ్చిన కృష్ణుడి మందిరాన్ని పూర్తిగా తొలగించేయడానికి కూడా వారు వెనుకాడలేదు. పనివేళలయితే అందరూ గ్రహిస్తారనుకున్నారో ఏమో.. అర్ధరాత్రి వేళ అధికారులు, సిబ్బందిని పంపి ఆలయాన్ని కూల్చివేశారు. ఆలయ నిర్వాహకులకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. విగ్రహాలను శాస్త్రబద్ధంగా పరిరక్షించే అవకాశం కూడా లేకుండా ఆలయాన్ని కూల్చివేయడంపై అర్చకులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను అర్జున వీధిలో గోశాల, కృష్ణుడి మందిరాల వెనుక నీటిపారుదల శాఖ భవనం కూడా ఉండేది. గోశాల, కృష్ణుడి మందిరాలను తొలగించినందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నీటిపారుదల శాఖకుచెందిన 800 గజాల స్థలాన్ని ఇస్తామని 20రోజుల క్రితం ప్రతిపాదించింది. ఈమేరకు కలెక్టర్ ఆలయ నిర్వాహకులతో చెప్పారు. దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే గోశాల, ఆలయాన్ని ప్రభుత్వం హడావుడిగా కూల్చివేసింది. ఆలయ నిర్వాహకులకు నోటీసు కూడా ఇవ్వనేలేదు. ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న నీటిపారుదల శాఖకుచెందిన 800 గజాల స్థలం గురించి కూడా అధికారులు సూటిగా స్పందించడం లేదు. 400 గజాలే అందుబాటులో ఉన్నాయని ఓసారి... అసలు ఆ ప్రదేశంలో స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని మరోసారి ఇలా పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ఆ 800గజాల స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను పడిందని తెలుస్తోంది. మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ దాదాపు రూ.8 కోట్లపైమాటే. అంత విలువైన ఆ స్థలాన్ని తమ పరం చేసుకునేందుకు ఆ ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నారు. అందుకే గోశాల, కృష్ణ మందిరం నిర్వాహకులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని అక్కడ కేటాయించలేమని అధికారులు పరోక్షంగా తేల్చిచెప్పేస్తున్నారు. అదే ప్రదేశంలో గోశాల, కృష్ణ మందిరం నిర్మించాలన్న హైందవ ధార్మిక సంస్థల డిమాండుపై ప్రభుత్వం స్పందించడమే లేదు. టీడీపీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసమే ఆలయాల విధ్వంసానికి చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. ఇవిగో సాక్ష్యాలు... ఇందులో కనిపిస్తున్నది విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి పాదాల చెంత ఉన్న అర్జునవీధి. ఆ ప్రాంతంలో మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం రూ.లక్షకు పైగా ధర పలుకుతోంది. ఆ వీధిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయం అనే బోర్డు కనిపిస్తోంది కదా. ఆయన నివాసం కూడా అదే. దానికి ఎదురుగా ఖాళీ ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం వరకు గోశాల, అందులో కృష్ణుడి మందిరం కూడా ఉండేవి. ఆ గోశాలలో దాదాపు 350 ఆవులను సంరక్షించేవారు. కృష్ణుడి మందిరంలో నిత్యపూజలు నిర్వహించేవారు. 60 అడుగుల వెడల్పు ఉన్న అర్జున వీధిని 100 అడుగుల వెడల్పుకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం రోడ్డుకు ఒక్కోవైపు 20 అడుగుల చొప్పున రెండువైపులా ఉన్న నిర్మాణాలను తొలగించాలి. అలా చేస్తే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసాన్ని సగం వరకు తొలగించాల్సి వస్తుంది. అదే వరుసలో ఉన్న ఆయనకు చెందిన మరో ఇంటితోపాటు ఆయన ప్రధాన అనుచరుల నివాసాలను కూడా కూల్చివేయాల్సి ఉంటుంది. ఎంతో విలువైన ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ, ఆయన అనుచరుల నివాసాలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని టీడీపీ ప్రభుత్వం భావించింది. అందుకే అడ్డగోలుగా వ్యవహరించింది. -
'పేరు చెడగొట్టుకుంటున్న పురందేశ్వరి'
విజయవాడ: బీజేపీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరి, కావురి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం విజయవాడలో నిప్పులు చెరిగారు. ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కోవర్టులు అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా వీరంతా ఓ కూటమిగా ఏర్పాడ్డారని విమర్శించారు. వీరికి బీజేపీ పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫునే పోటీ చేస్తామని వీరంతా ప్రమాణం చేస్తారా ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెగా దగ్గుబాటి పురందేశ్వరికి పేరుందని... ఉన్న పేరును ఆమె చెడగొట్టుకుంటున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు సోనియాగాంధీని పొగిడిన నోటీతోనే నేడు ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్‌కి నిధులు ఇస్తోందన్నారు. ఏపీకి ఏమైనా అధికంగా నిధులు ఇస్తున్నారా ? అని వారిని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. -
'లోకేష్‌పై వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌కి మంత్రి పదవి ఇవ్వాలంటూ తాను చేసిన ప్రకటనపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. గురువారం విజయవాడలో బుద్ధా వెంకన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... లోకేష్‌పై జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. తీరు మార్చుకోవాలంటూ జేసీకి బుద్ధా వెంకన్న హితవు పలికారు. టీడీపీ వల్లే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చిన సంగతి మరవరాదన్నారు. బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఓ అజెండాతో తమ పార్టీ నాయకుడు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. లోకేష్‌కి మంత్రి చేపట్టేందుకు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇటీవల ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తాని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అదే పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ అంశంపై బుధవారం హైదరాబాద్‌లో ఈ విధంగా స్పందించారు. లోకేష్‌కు మంత్రిని చేయడం ఆయన తండ్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఇష్టమని అన్నారు. లోకేష్ కోసం రాజీనామాలు చేస్తామనడం అంతా మెహర్భానీ మాటలుగా జేసీ అభివర్ణించారు. కులసంఘం తీర్మానించిందని లోకేష్‌ను మంత్రిని చేయడం కాదని జేసీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యాలపై బుద్ధా వెంకన్న పైవిధంగా స్పందించారు. -
లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: బుద్ధా వెంకన్న
గుణదల, వన్‌టౌన్ (విజయవాడ): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు. ఇందుకోసం తన పదవిని సైతం త్యాగం చేస్తానని, బుధవారం ముఖ్యమంత్రిని కలసి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో చురుగ్గా ఉండే లోకేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అటు పార్టీ, ఇటు ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు. చంద్రబాబు పాలన చూసే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని, లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తే మరింతమంది రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నా సీటు ఇస్తా : బోడె ప్రసాద్ లోకేశ్ కోసం అవసరమైతే తన సీటు ఖాళీ చేసి ఇస్తానని పెనమలూరు శాసనసభ్యు డు బోడె ప్రసాద్ అన్నారు. లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహగానాలపై ఒక టీవీ చానల్‌తో ఆయన మాట్లాడారు. లోకేశ్ కోసం పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. లోకేశ్ పోటీ చేస్తానని చెప్పగానే తాను రాజీనామా చేస్తానని, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. -
టీడీపీలో చేరికలను బీజేపీకి చెప్పాల్సిన అవసరం లేదు
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ (వన్‌టౌన్) : తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరితే బీజేపీ నేతలకు చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కార్యాలయంలో ఆయనతో కలిసి వెంకన్న గురువారం విలేకరులతో మాట్లాడారు. జలీల్‌ఖాన్ బలమైన నాయకుడని, అందుకే పార్టీలో చేర్చుకున్నామని పేర్కొన్నారు. అతనిపై వైఎస్సార్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జలీల్‌ఖాన్ మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని అన్నారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకుడిగా పనులు చేయించుకుంటానని పేర్కొన్నారు. -
మీ పార్టీ నాయకుడి వల్లే నష్టపోయాం
►సీఎం ఎదుట కాల్‌మనీ బాధితుల ఆందోళన ►వారించిన చంద్రబాబు నాయుడు విజయవాడ (పటమట): ‘మీ పార్టీ నాయకుడి వల్లనే నష్టపోయాం, మా ఆస్తిని ఆక్రమించుకున్నారు’ అంటూ కాల్‌మనీ బాధితులు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమావేశంలో ఆందోళన దిగారు. హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, ఫన్‌టైమ్స్ ఆధ్వర్యంలో ఫన్‌టైమ్ క్లబ్లో జరుగుతున్న రాష్ర్టస్థాయి ఫల, పుష్ప ప్రదర్శన-2016 ముగింపు సభ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కాల్‌మనీ బాధితుడు రేలంగి హనుమంతరావు, భార్య బేబి, బంధువులు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఫన్‌టైమ్ క్లబ్‌కు చేరుకున్నారు. సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే నగరంలోని విద్యాధరపురానికి చెందిన కాల్‌మనీ బాధితుడు హనుమంతరావు మేనల్లుడు శివరామ్ సభలోనే పైకి లేచి ‘సీఎం గారు.. మీ పార్టీ నాయకుడి వల్లనే మేము తీవ్రంగా నష్టపోయాం, మమ్మల్ని మోసం చేసి మా స్థలాన్ని ఆక్రమించుకున్నారు’ అని గట్టిగా గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో కంగుతిన్న సీఎం వెంటనే స్పందించి ‘ఏయ్.. ఇక్కడ అలజడి చేయవద్దు, నలుగురిలో ఉన్నాం, సమస్యలు చెప్పడానికి ఒక వే (మార్గం) ఉంది, క్యాంపు కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పండి’ అంటూ గదమాయించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని శివరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సభపై ఉన్న బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారిని వారించారు. సభ ముగిసి వెళ్లే సమయంలో బాధితులు ముఖ్యమంత్రిని కలిసి సమస్య విన్నవించగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. బాధితులు రేలంగి హనుమంతరావు తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమీప బంధువు బుద్దా భాస్కరరావు వద్ద తాను 2015 జూలై 31న రూ. 4 లక్షలను మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నామని, హామీగా కుమ్మరిపాలెం సెంటర్లోని 83గజాల పెంకుటింటి కాగితాలు పెట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో తనఖా రిజిస్ట్రేషన్ అని నమ్మించి విక్రయ దస్తావేజుపై, స్టాంపు పేపర్, తెల్ల కాగితాలు, ప్రామిసరీ నోట్లపై తనతోను, కుటుంబసభ్యులతో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. వడ్డీ చెల్లించేందుకు నెలాఖరుకు వెళ్లగా రూ.3 వడ్డీ అయితే రూ.6 వడ్డీ చెల్లించాలని.. లేకపోతే తీసుకోనని చెప్పడంతో ఆస్తి పోతుందన్న భయంతో రూ.6 వడ్డీ చెల్లించినట్లు చెప్పారు. నాలుగో నెలలో అసలు సొమ్ము చెల్లిస్తాను, దస్తావేజులు ఇవ్వాలని కోరగా అవి బుద్దా వెంకన్న వద్ద ఉన్నాయని చెప్పాడని పేర్కొన్నారు. తన ఆస్తి కాగితాలు తనకు ఇవ్వాలని పలుమార్లు కోరగా... భాస్కరరావు తనతో ఆస్తి కొనుగోలు చేసినట్లు కాగితాల్లో రాయించుకున్నట్లు తెలిసిందని చెప్పారు. దీంతో ఆయనను నిలదీయగా తీవ్ర పదజాలాలతో దూషించి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని, ఆస్తి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కలవగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని వివరించారు. ఆ తరువాత నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించగా ఆయన భాస్కరరావును పిలిపించి మాట్లాడుగా ఆయన కొనుగోలు చేసినట్లు దస్తావేజులు చూపించారని తెలిపారు. దీనిపైతమకు న్యాయం చేయాలని కోరామన్నారు. అప్పు చెల్లించేస్తాం, ఇంటి కాగితాలు ఇప్పించాలని వేడుకున్నామన్నారు. రూ.80లక్షలు విలువ చేసే ఆస్తిని నాలుగు లక్షలకు తీసుకోవడంతో ఏం చేయాలో తమకు తెలియడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చామని హనుమంతరావు వివరించారు. -
బాబు గారి భక్తులు!
-
నాకు ఎలాంటి సంబంధం లేదు
-
‘ఎమ్మెల్సీ’ సీట్లపై ‘దేశం’ కసరత్తు
వైవీబీ, బచ్చుల, వెంకన్న మధ్యే పోటీ నేడు ప్రకటించే అవకాశం విజయవాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధిష్టానం తలమునకలై ఉంది. జిల్లా నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలూ తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జిల్లాకు చెందిన నాయకులు హైదరాబాద్‌లో మకాం వేసి తమ శక్తి మేరకు ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక గురువారం రాత్రి వరకు కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం ఉదయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురి మధ్యే పోటీ! : జిల్లాలో ఉన్న రెండు స్థానాలకు ముగ్గురు నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో మకాం వేసి టిక్కెట్ దక్కించుకునేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ ప్రస్తుతం కొద్దిగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆమెకు గవర్నరు కోటాలో సీటు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అనూరాధ పార్టీ తనను గుర్తించి సీటు ఇస్తే తీసుకుందామని, లేకుండా మౌనంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎవరి ప్రయత్నాలు వారివి : చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వైవీబీ రాజేంద్రప్రసాద్ మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, మేయర్ తదితర కీలక పోస్టులన్నీ ఆ సామాజిక వర్గానికే ఉన్నందున మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబు హామీ ఇవ్వడం, స్థానిక సంస్థల్లో తనకు పట్టు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వైవీబీ సీటు కోసం ముమ్మరంగా యత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు బచ్చులకు మంత్రి దేవినేని ఉమా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే బందరు నుంచి ఇప్పటికే మంత్రి, ఎంపీ ఉన్నందున, శాసనమండలిలో ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఉండటం నేపథ్యంలో మరొకరికి అవకాశం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశీస్సులు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును బీజేపీకి ఇచ్చారని, ఆ నియోజకవర్గ నేతల్లో అసంతృప్తి తగ్గించాలంటే బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా వాదిస్తోంది. తొలుత నిర్ణయించినట్లు వైవీబీ, బచ్చుల పేర్లనే ఖరారు చేస్తారా.. లేక మార్చి ఇంకా ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి. -
టీడీపీ పదవులపై నేతల కన్ను
అర్బన్, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు సీనియర్లకు మొండి చెయ్యి? సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేతల కళ్లన్నీ పార్టీ పదవులపైనే ఉన్నాయి. ప్రస్తుతం అర్బన్, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర నూతన రాజధానిగా విజయవాడ కీలకం కావడంతో పార్టీ పదవులను దక్కించుకుంటే.. విజిటింగ్ కార్డు చూపించైనా అధికారులతో పనులు చేయించుకోవచ్చని భావిస్తున్న కొంతమంది నేతలు తమ బెర్త్‌ల కోసం పోటీపడుతున్నారు. కమిటీల ఏర్పాటుపై ముఖ్య నేతలు ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. అర్బన్ అధ్యక్షుడిగా బుద్ధా.. కార్యదర్శిగా పట్టాభి! టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్ననే తిరిగి కొనసాగించాలని నేతలు భావిస్తున్నారు. వివాదరహితుడు కావడంతో పాటు ముఖ్యనేతలకు అనుకూలంగా ఉండటంతో ఆయన్నే కొనసాగించాలని యోచిస్తున్నారు. గతంలో కార్యదర్శి పదవులను తూర్పు నియోజకవర్గం నుంచి ఎస్సీ (మాదిగ)కు చెందిన సొంగా రవీంద్రవర్మకు, పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎస్సీ(మాల)కు చెందిన కొట్టేటి హనుమంతరావుకు, సెంట్రల్నియోజకవర్గం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన గోగుల రమణారావుకు ఇచ్చారు. ఇప్పుడు వారు ముగ్గురినీ పక్కన పెట్టి చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీలను పక్కన పెట్టడం పై ఆవర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు వారికి చెందిన కల్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో ఆ వర్గం ప్రజలు టీడీపీ అంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో మరో కీలకమైన తెలుగుయువత పోస్టుకు కాట్రగడ్డ శ్రీనును ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనదీ చంద్రబాబు సామాజిక వర్గమే. అదే వర్గానికి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్.ఉషారాణిని కొనసాగించాలని భావిస్తున్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పార్టీలో సీనియర్ నేత పరిశపోగు రాజేష్(లాజరస్)ను పక్కన పెట్టి గత ఎన్నికలకు ముందు సీపీఎం నుంచి టీడీపీలోకి తీసుకొచ్చిన నరసింహారావును నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలోని సీనియర్లు అందరినీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి, చంద్రబాబు సొంత సామాజికవర్గానికి పెద్ద పీట వేయడం పై ఇతర సామాజికవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంపీలు, మంత్రి, మేయర్, జెడ్పీ చైర్మన్ వంటి కీలక పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే ఇచ్చారని, ఇప్పుడు అర్బన్ పార్టీలోని కీలక పదవులకూ వారినే ఎంపిక చేసేందుకు ప్రయత్నించడమేమిటని ఇతర సామాజిక వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో అర్జునుడు, బుల్లయ్య మధ్య పోటీ! జిల్లా అధ్యక్ష పదవికి బచ్చుల అర్జునుడు, ఎంపీ కొనగళ్ల నారాయణ సోదరుడు బుల్లయ్య మధ్య పోటీ నెలకొంది. బచ్చుల అర్జునుడికి జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నిస్తుండగా, బుల్లయ్యకు ఆ పదవి దక్కేందుకు కొనగళ్ల నారాయణ, మంత్రి కొల్లురవీంద్ర, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, బొడే ప్రసాద్ తదితరులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కేంద్ర మంత్రి సుజనాచౌదరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఆయన ద్వారా చంద్రబాబుకు చెప్పించి బుల్లయ్యకు జిల్లా అధ్యక్ష పదవిని దక్కేలాగా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా బుల్లయ్యకు అధ్యక్షపదవి ఇస్తే తనకే కావాలని పట్టుబట్టకూడదనే ఆలోచనలో అర్జునుడు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్, అధ్యక్ష పదవి ఇవ్వనందున ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరాలని అర్జునుడు యోచిస్తున్నారని సమాచారం. -
బుద్దా వెంకన్న కేసు కొట్టివేత
విజయవాడ లీగల్ : టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న అలియాస్ వెంకన్న పై కేసు కొట్టివేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2014 మార్చి 28న 26వ డివిజన్ ఏరియాలో టీడీపీ, కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణపడ్డారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలో బుద్దా వెంకన్న వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్తో దురుసుగా ప్రవర్తించినట్లుగా కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కాకపోవడంతో న్యాయమూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. -
చిన్నబోయిన బుద్దా
మాటలే తప్ప చేతల్లో బాబు తీరు మారలేదు.. బలహీన వర్గాల నేతలంటే ఆయనకున్న చిన్నచూపు పోలేదు.. పార్టీ పదవున్నా ఆయన ప్రాపకం లేకపోతే తగిన గౌరవం దక్కదనే విషయం మరోమారు రుజువైంది. నగరంలో మీడియా సమావేశం నిర్వహించి.. కొత్తగా పార్టీ అర్బన్ పగ్గాలు చేపట్టిన బుద్దా వెంకన్నకు ఆ వేదికపై చోటుకల్పించకపోవడంపై పలువురు కార్యకర్తలు, నేతలు విస్తుబోతున్నారు. ఇది కేడర్‌కు ఏ సంకేతాలు అందిస్తుందో అధినేతకు తెలియదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ : తెలుగుదేశం పార్టీలో బలహీనవర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో మరోమారు స్పష్టమైంది. అధినేత చంద్రబాబు సమక్షంలోనే పార్టీ అర్బన్ అధ్యక్షుడికి అవమానం జరిగిందంటూ ఆ పార్టీలోని కొందరు నేతలే ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగరంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు అర్బన్ అధ్యక్షుడికి ఆ వేదిక మీద చోటుకల్పించకపోవడం ఏం సంప్రదాయమంటున్నారు. ఇది కేడర్‌కు ఎటువంటి సంకేతాలు అందిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. హెలెన్ తుపాను బాధిత రైతులను పరామర్శించేందుకు మంగళవారం రాత్రి జిల్లాలో పర్యటించి నగరానికి వచ్చిన చంద్రబాబు ఓ హోటల్లో బసచేశారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై చంద్రబాబుతోపాటు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఆశీనులయ్యారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడికి మాత్రం చోటుదక్కలేదు. దీంతో ఆయన ఒక పక్కన సాధారణ కార్యకర్తలతోపాటు నిల్చోవాల్సి వచ్చింది. కొత్తగా పార్టీ పగ్గాలు అప్పగించిన వ్యక్తికి సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన కూడా అధినేతకు లేకపోవడం పలువురు నేతల్ని, కార్యకర్తలను ఆశ్చర్యపర్చింది. అధినేత సమక్షంలోనే నగర శాఖ అధ్యక్షుడికి ఇటువంటి మన్నన మర్యాద లభించిందంటే రేపటి నుంచి ఆయన మాటకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏం విలువ ఇస్తారనే ప్రశ్న ముందుకువచ్చింది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న అర్బన్ పార్టీని గాడిన పెట్టే ఆలోచన అధినేతకు ఏ మాత్రం లేదని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పార్టీలో బలహీనవర్గాల వారికి పదవిచ్చినా ప్రాధాన్యత ఇవ్వబోరని, పెత్తనం చేసే వారు వేరే ఉంటారని మరోమారు స్పష్టమైందని కొందరు నేతలు వాపోతున్నారు. పరామర్శపై రైతన్న విమర్శ తుపాన్‌కు పంట తీవ్రంగా దెబ్బతిన్న తమను పరామర్శించే తీరు ఇదేనా అని జిల్లాలోని రైతన్నలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. అర్ధరాత్రి వేళ పర్యటించి పంట నష్టం గురించి ఆయన ఏం తెలుసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కైకలూరు చేరుకున్న చంద్రబాబు అక్కడే విశ్రాంతి తీసుకుని బుధవారం పగటివేళ పొలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించి, అన్నదాతలను పరామర్శించి ఉంటే బాగుండేదని తెలుగుదేశం శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. అలా కాకుండా ఆ చీకట్లోనే ముదినేపల్లి, గుడివాడ, గన్నవరం మీదగా మొత్తం 12 గ్రామాల్లో మొక్కుబడిగా పర్యటించి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన రాత్రి ఒకటిన్నరకు జరిగింది. అర్ధరాత్రి పొలాల్లో పంటలు దెబ్బతిన్న వైనాన్ని ఆయన ఎలా చూశారో ఎవరికీ అర్థం కాలేదు. ఇళ్ల వద్ద నిద్రపోతున్న రైతులను బలవంతంగా లేపి బాబు పర్యటనలో పాల్గొనేలా చేశారు. ఇలా ఆయన పంటనష్టం పరిశీలనంతా మమ అన్న రీతిలో సాగింది. ఆ రాత్రి నగరానికి చేరుకున్న చంద్రబాబు 11 గంటల వరకూ హోటల్ గదినుంచి బయటకు రాలేదు. తర్వాత గంటసేపు శ్రీకాకుళం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. దానిలో చర్చంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపైనే జరిగినట్లు సమాచారం. ‘టికెట్లు మీకే ఇస్తాను. జాగ్రత్తగా పనిచేసుకోండి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయండి’ అంటూ నియోజకవర్గ ఇన్చార్జులను చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని, కేడర్‌ను కాపాడుకోవాలని హితబోధ చేశారు. అందరికీ ఒకే తరహా ఉపన్యాసం తప్ప నియోజకవర్గ సమస్యలపై చర్చించలేదని, ఇటువంటి సమీక్షలు, సమావేశాల వల్ల ప్రయోజనం ఏమిటని ఆ పార్టీ నేతలే కొందరు పెదవి విరిచారు.