స్థానిక ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఫుడ్ కోర్టు తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.
స్థానిక ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఫుడ్ కోర్టు తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఫుడ్‌కోర్టును తొలగించేందుకు ఆదివారం రాత్రి మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదులాట జరిగింది. ఇంతలోనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడికి చేరుకుని వ్యాపారులకు మద్దతు తెలిపారు. అనంతరం అంతా కలిసి కమిషనర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి చేరుకుని వారిని శాంతపరిచారు. ఫుడ్‌కోర్టు తరలింపు లేదని తెలపటంతో వ్యవహారం సద్దుమణిగింది.