Gadde Ram Mohan
-
మంత్రి పదవులు వస్తాయని ఆశించిన గద్దే రామ్మోహన్, శ్రీరాం తాతయ్య
-
సభలో బాలకృష్ణ రచ్చ రచ్చ.. సినిమా రేంజ్లో రెచ్చిపోయి..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు కూడా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యతారాహిత్యంతో సభలో విజిల్స్ వేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కాగితాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. విజిల్స్ వేస్తూ బాలకృష్ణ హంగామా.. వివరాల ప్రకారం.. రెండోరోజు సమావేశాల సందర్బంగా టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన బాలకృష్ణ.. ఈరోజు కూడా రెచ్చిపోయారు. అసెంబ్లీలో చంద్రబాబు కూర్చిలో నిలుచుని బాలకృష్ణ.. విజిల్ పట్టుకుని విజిల్స్ వేశారు. సభలో సభ్యులను చూస్తూ విజిల్స్ వేస్తూ హంగామా క్రియేట్ చేశారు. ప్రజాప్రతినిధి అనే స్పృహ కూడా లేకుండా రచ్చ చేశారు. బాలకృష్ణకు మద్దతిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఆయనతో కలిసి విజిల్స్ వేశారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. విజిల్స్ తీసుకోవాలన్న స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ వెళ్లడంతో వారితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు. ఇలా సభా సంప్రదాయాలకు బాలకృష్ణ తిలోదకాలు పలికారు. కాగా, నిన్న కూడా సభలో బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్ద మీసం మెలేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన పనిని మొదటి తప్పుగా పరిగణిస్తూ స్పీకర్ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు సభ్యులు సస్పెండ్.. ఇదిలా ఉండగా.. సభలో మిగతా టీడీపీ సభ్యులు కూడా సభా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సభలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సభ్యులపై స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ విధించారు. అచ్చెన్నాయుడు, బి.అశోక్‌లను సస్పెండ్ చేశారు. వీరిద్దరిని పూర్తిగా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. టీడీపీ సభ్యులు తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం.. ► రచ్చచేసే ఉద్దేశమే తప్ప చర్చించాలనే ఆలోచనే వారికి లేదు. బజారులో ఊదాల్సిన ఈలను ఇక్కడ ఊదుతున్నారు. సభ్యులను రెచ్చగొట్టే విధంగా టీడీపీ మాట్లాడుతోంది. టీడీపీ సభ్యులు సీట్లపైకి ఎక్కి నిల్చున్నారు. చర్చలో పాల్గొనే దమ్ము వారికి లేదు. బాబు మోసగాడని టీడీపీకి బాగా తెలుసు: అంబటి రాంబాబు. ► దేవాలయంలాంటి అసెంబ్లీని కించపరిచారు. చిల్లర కోసమే విజిల్స్ వేస్తున్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదు. దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలి, టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరు: కాకాణి ► టీడీపీ సభ్యుడు ప్రతీ ఒక్కరూ సైకోనే: నారాయణ స్వామి -
బుద్ధి తక్కువై లోకేష్ పాదయాత్రకెళ్లా!
Viral Video: పాదయాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రజల కష్టాలు దగ్గరగా వెళ్లి చూడాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అలా చేసి ప్రజల కష్టాలు చూశారు కాబట్టే.. ఆశీర్వదించి ఘన విజయం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?.. అసలు తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తోంది ఏం యాత్ర?.. ఆ అనుమానాల్ని నివృత్తి చేసే వీడియో మరొకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్రలో ఓ దివ్యాంగుడిని పరామర్శించిన(యాక్టింగ్లేండి) పరామర్శించాడు నారా లోకేష్. బ్యాక్‌గ్రౌండ్‌లో టీడీపీ సాంగ్ మారుమోగుతుంటే.. ఆ పెద్దాయనతో చిరునవ్వుతో రోడ్డు మీద ఓ ఫొటో కూడా దిగాడు. కానీ, ఈలోపు పక్క నుంచి ఓ పచ్చ నేత ఐదొందల నోటును ఆ దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన తీసుకున్నాడు. కట్ చేస్తే.. తన మానాన తాను చర్చికి వెళ్తుంటే.. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఉందని చెబుతూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీసుకెళ్లాడని, 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 500లే ఇచ్చారని, వికలాంగుడినైన తనని కూడా మోసం చేశారని, పాదయాత్రకెళ్లి బుద్ధి తక్కువ పని చేశానని చెంపలేసుకున్నాడు పాపం ఆ పెద్దాయన. -
ఇదేం ఖర్మ! స్పందన లేకపోవడంతో కంగుతిన్న చంద్రబాబు.. హడావుడిగా
సాక్షి, అమరావతి: చంద్రబాబు సభలకు జనాన్ని రప్పించడం ఆ పార్టీ నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. టీడీపీ తన అడ్డాగా చెప్పుకునే విజయవాడలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం విజయవాడలోని రాణీగారితోట ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించగా కనీసం ఆ ప్రాంతలోని ప్రజలు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో కంగుతిన్న చంద్రబాబు హడావుడిగా నిష్క్రమించారు. ఆ తర్వాత బందరు వెళుతూ కానూరు, పోరంకి ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు రోడ్‌షోలు ప్లాప్ కావడంతో బెజవాడ టీడీపీ నేతలు మొహాలు వేలాడేశారు. గేరు మార్చామంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా చేస్తున్న ప్రచారంలో పస లేదని విజయవాడ పర్యటనతో తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. బందరులో మాడిపోయిన బాబు మొహం మచిలీపట్నంలో చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు మరో షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం పలికి నినాదాలు చేయడంతో మచిలీపట్నం సభ చంద్రబాబును ‘ఇదేం ఖర్మ’ అనుకునేలా చేసింది. సభకు జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో బాబు మొహం మాడిపోయింది. నాయకులకు ఇండెంట్లు ఇచ్చి మరీ జన సమీకరణకు ప్రణాళిక రూపొందించినా స్పందన కరువవడంతో ఇరుకు సందులను ఎంచుకుంటున్నారు. టీడీపీ నేతలు ఫేక్ ప్రచారానికి ఎల్లో మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు పర్యటనలు, లోకేశ్ పాదయాత్రకు స్పందన కొరవడటంతో ప్రజలను నమ్మించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇన్‌చార్జ్‌లు కరువు టీడీపీకి జనాదరణ లేదని గ్రహించడంతో చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇన్చార్జిలు లేకుండా పోయారు. సుమారు 52 నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిలు లేరు. మరో 38 చోట్ల 3వ స్ధానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. గన్నవరం, కైకలూరులో నాయకులు ఎవరో తెలియని దుస్థితి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నానిని ఇన్చార్జిగా ప్రకటించినా ఆయన్ను వ్యతిరేకించే నేతలు ఒప్పుకోవడం లేదు. నూజివీడు, గుడివాడలో పార్టీ పరిస్థితి అంతా అయోమయం. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లికి ఇన్చార్జి లేరు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పూతలపట్టు, చిత్తూరు నియోజవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడే లేడు. అనంతపురం జిల్లాలోని శింగనమల, మడకశిరలో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదు. -
సమసిన ఫుడ్‌కోర్టు తరలింపు వివాదం
స్థానిక ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఫుడ్ కోర్టు తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఫుడ్‌కోర్టును తొలగించేందుకు ఆదివారం రాత్రి మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదులాట జరిగింది. ఇంతలోనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడికి చేరుకుని వ్యాపారులకు మద్దతు తెలిపారు. అనంతరం అంతా కలిసి కమిషనర్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి చేరుకుని వారిని శాంతపరిచారు. ఫుడ్‌కోర్టు తరలింపు లేదని తెలపటంతో వ్యవహారం సద్దుమణిగింది.