Viral Video: పాదయాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రజల కష్టాలు దగ్గరగా వెళ్లి చూడాలి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అలా చేసి ప్రజల కష్టాలు చూశారు కాబట్టే.. ఆశీర్వదించి ఘన విజయం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?.. అసలు తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తోంది ఏం యాత్ర?.. ఆ అనుమానాల్ని నివృత్తి చేసే వీడియో మరొకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్రలో ఓ దివ్యాంగుడిని పరామర్శించిన(యాక్టింగ్‌లేండి) పరామర్శించాడు నారా లోకేష్. బ్యాక్‌గ్రౌండ్‌లో టీడీపీ సాంగ్ మారుమోగుతుంటే.. ఆ పెద్దాయనతో చిరునవ్వుతో రోడ్డు మీద ఓ ఫొటో కూడా దిగాడు. కానీ, ఈలోపు పక్క నుంచి ఓ పచ్చ నేత ఐదొందల నోటును ఆ దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన తీసుకున్నాడు. కట్ చేస్తే..
తన మానాన తాను చర్చికి వెళ్తుంటే.. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఉందని చెబుతూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తీసుకెళ్లాడని, 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 500లే ఇచ్చారని, వికలాంగుడినైన తనని కూడా మోసం చేశారని, పాదయాత్రకెళ్లి బుద్ధి తక్కువ పని చేశానని చెంపలేసుకున్నాడు పాపం ఆ పెద్దాయన.
Comments
Please login to add a commentAdd a comment