handicap
-
సర్కారు ఏడిపింఛన్!
రెండు కాళ్లూ దెబ్బ తిన్నా పింఛన్ ఇవ్వట్లేదురోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బ తిని పనిచేయడం లేదు. రెండు నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌కు వచ్చి పోతున్నాను. అయినా నాకు పింఛన్ మంజూరు చేయడంలేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తేనే జీవించగలుగుతా. – ప్రభాకర్, కల్యాణపురం ఎస్టీ కాలనీ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే కాకుండా.. వలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని చెప్పి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడిన విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే.. సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పింఛన్ల పంపిణీ, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సవ్యంగా సాగేలా శ్రద్ధ తీసుకునేది. అందుకు అవకాశమే లేకుండా చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా పింఛన్లను తగ్గించాలా అని చూస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వివిధ సాకులు చూపుతూ ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 1.57 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. ఇది చాలదన్నట్లు అనర్హుల ఏరివేత అంటూ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్దిదారులపై వేటు వేసేందుకు వెరిఫికేషన్ కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై ప్రభుత్వం వెరిఫికేషన్‌ను చేపట్టనుంది. సంబంధిత సచివాలయాలనికి గానీ, అసలు మండలానికే సంబంధమే లేని.. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేపడతారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన ఒక్కో బృందం 40 మంది లబ్దిదారుల చొప్పున వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆయా సచివాలయ పరిధిలో ఉండే మొత్తం పింఛను దారుల సంఖ్య ఆధారంగా ఒక్కో సచివాలయ పరిధిలో 7 నుంచి 13 బృందాలను ఇప్పటికే ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఏ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వ్యక్తి పేరు సీపాన ఆనందరావు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామానికి చెందిన ఇతను అంధుడు. 2019 నుంచి పింఛన్ అందుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఆనందరావు దివ్యాంగుడు కాదని తప్పుడు ఫిర్యాదు చేయడంతో అతని పింఛన్ నిలుపుదల చేశారు.రిమ్స్ నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా కనికరించలేదు. ఎంపీడీవోను కలిసినా ఫలితం లేకపోయింది. మూడు నెలలుగా పింఛన్ ఆపేస్తే తన పింఛన్ రద్దయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్టుగానే మూడు నెలలు పూర్తయ్యాయి. పింఛన్ రద్దయింది. ఎంతగా వేడుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదు. ఒక్క టిక్‌తో అంతా తారుమారువెరిఫికేషన్కు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఈ యాప్‌లో అన్ని పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలనే పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు వెరిఫికేషన్ చేసే ఉద్యోగి ‘అవును’/ ‘కాదు..లేదు’ అని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా ‘మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘అవును’/ ‘లేదు’ అని స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క ‘టిక్’తో పేద పింఛన్ లబ్ధిదారుల తలరాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగి అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి.1. లబ్ధిదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉందా?2. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?3. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా?4. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా?5. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా?6. కుటుంబానికి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?7. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా?8. కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారా?9. మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా? రాజకీయ పైరవీలకు చోటు గత ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసే సమయంలో దరఖాస్తుదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది స్థానిక సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్ణయించేవారు. ఆపై ఆన్లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్) జరిపేవారు. ఆ తర్వాత పింఛన్ మంజూరు చేసేవారు. అయితే, ఇప్పుడు వెరిఫికేషన్‌లో ఆ లబి్ధదారుడు పింఛను మంజూరు అర్హత నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది వెరిఫికేషన్ ఉద్యోగి నిర్ణయిస్తారు. ప్రభుత్వం అనర్హుల గుర్తింపు పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడంలోనే ఏదో మతలబు ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ప్రస్తుత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులపై ఆయా ప్రాంతాల్లో అధికార కూటమి పార్టీల నేతల ప్రభావం, ఒత్తిడి ఉంటుందని.. దీంతో అర్హులైన లబ్దిదారులను కూడా అనర్హులుగా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో 1.57 లక్షల పింఛన్లు తగ్గుదలరాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య నెల నెలకూ తగ్గిపోతోంది. ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, డిసెంబర్ నెలకు వచ్చే సరికి 63,92,702 మంది లబ్దిదారులకు మాత్రమే పింఛన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 1,57,162 మేర పింఛన్లు తగ్గిపోయాయి. సెపె్టంబర్లో 22,601, అక్టోబర్‌లో 24,710, నవంబర్‌లో 21,472.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 88,379 పింఛన్లు తగ్గిపోయాయి. 2 లక్షల మంది వెయిటింగ్.. కొత్తగా దరఖాస్తులకు అవకాశమే లేదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పింఛన్ల మంజూరు కోసం కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ సేవలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో.. అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలు పని చేయడం లేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పింఛను మంజూరు చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కొత్త పింఛన్లే మంజూరు కాలేదు. గత ఐదేళ్ల కాలంలో పింఛన్ల పంపిణీ అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అప్పటి దాకా కొత్తగా గుర్తించిన పింఛన్ లబ్దిదారులందరికీ పింఛన్ల డబ్బుల పంపిణీ మొదలు కాగా.. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వరకు ‘ఏపీ సేవ’ అనే ఆన్లైన్ వెబ్‌పోర్టల్ ద్వారా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. ఆ సమయంలో దాదాపు రెండు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దయలేకుండా తొలగించారయ్యా.. దివ్యాంగుడని కూడా చూడకుండా నా పింఛన్ తొలగించారు. నేనేం పాపం చేశానో తెలియడం లేదు. మూడు నెలల క్రితం నా పింఛన్ తొలగించారు. ఈ కుట్ర ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. దివ్యాంగుడైన నాకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. నేను ఎలాంటి పనులు చేయలేను. నాకొచ్చే పింఛన్ సొమ్ముతోనే నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. పింఛన్ ఆపేయడంతో తినడానికి కూడా కష్టంగా ఉంది. నాకు జరిగిన అన్యాయంపై ఇటీవల శ్రీరంగరాజపురం మండల కార్యాలయం వద్ద కుటుంబంతో నిరసన తెలిపాను. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని విన్నవించినా పట్టించుకోలేదు. నాకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – హేమాద్రి, దివ్యాంగుడు, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా పింఛన్ ఇప్పించండి సారూ.. మా బిడ్డ హరీష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన మేము మా బిడ్డ వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.7 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నాం. మా బిడ్డకు పింఛన్ మంజూరు చేయండి. – ఏ.హరీష్ తల్లిదండ్రులు, కల్యాణపురం ఎస్టీకాలనీ, పుత్తూరు మండలం, చిత్తూరు జిల్లాఅర్హత ఉన్నా అందని పింఛన్ వైజాగ్ జీవీఎంసీ 47వ వార్డు కంచరపాలెం కొండవాలు ప్రాంతం జయప్రకాష్ నగర్లో టి.సునీత అనే మూగ–వినికిడి లోపం గల మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. జీవీఎంసీ జోన్–5 పరిధిలో యూసీడీ అధికారులకు ఎన్నోసార్లు పింఛన్ కోసం విన్నవించగా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో దరఖాస్తు చేసి కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించలేదని సునీత సైగలా ద్వారా వాపోతోంది. ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
నెల్లూరు, సాక్షి: పోలింగ్‌తో ఏపీలో జన జాతర నడుస్తోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి కావలికి వచ్చిన ఓ దివ్యంగురాలి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేయడానికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ దివ్యాంగురాలు భావోద్వేగంగా మాట్లాడారు. జగనన్న ద్వారా తాను లబ్ధి పొందానని.. అందుకే కృతజ్ఞతతో జగన్ అన్నకు ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.అన్నా.. సాయం అంటే చాలూ.. అప్పటికప్పుడే అధికారుల్ని పిలిపించుకుని గంటల వ్యవధిలోనే సాయం అందేలా చూడడం సీఎం జగన్ నైజం. అలా ఈ 59 నెలల్లో లక్షల మంది వ్యధలను సీఎం జగన్ స్వయంగా విని.. వాళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం చూశాం కూడా. -
చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా..
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, వాహనాలను డ్రైవ్ చేయాలంటే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం దాదాపు అందరికి తెలుసు. ఇటీవల రెండు చేతులూ లేని ఓ మహిళకు కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన 'జిలుమోల్ మరియెట్ థామస్' (Jilumol Mariet Thomas) ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఐదు సంవత్సరాలు కృషి చేసి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. జిలుమోల్ కారు డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు గమనించినట్లయితే ఈమె కాళ్లతోనే కారుని డ్రైవ్ చేయడం చూడవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం మొదట్లో అప్లై చేసుకున్నప్పుడు అధికారులు తిరస్కరించారు. కానీ పట్టు వదలకుండా డ్రైవింగ్ నేర్చుకుని చివరికి సంబంధిత అధికారుల చేతులమీదుగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. లైసెన్స్ కోసం జిలుమోల్ చేసిన అభ్యర్థనను ఐదేళ్ల క్రితం అధికారులు తిరస్కరించడంతో ఆమె రాష్ట్ర వికలాంగుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను కోరింది. ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలని ఎర్నాకులం జిల్లాలోని మోటారు వాహన శాఖ అధికారులను రవాణా కమిషనర్ ఆదేశించింది. జిలుమోల్ కారుని సవ్యంగా డ్రైవింగ్ చేయగలదా లేదా అనే విషయాన్నీ మోటారు వాహన శాఖ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే ఈమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఉండాలని వారు తీర్మానించారు. దీంతో ఒక సంస్థ 2018 మోడల్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌కి కావలసిన మార్పులను చేస్తూ సవరించింది. జిలుమోల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని ఆమె తన పాదాలతోనే ఆపరేట్ చేయవచ్చు. అంతే కాకుండా ఈ కారులోని కొన్ని ఫీచర్స్ యాక్టివేట్ చేయడానికి వాయిస్ రికగ్నిషన్ కూడా అందించింది. ఈమె ఈ ఏడాది మార్చిలో లెర్నర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నవంబర్‌లో డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసయ్యింది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు కస్టపడి అనుకున్నది సాధించిన 'జిలుమోల్'కు కేరళ ముఖ్యమంత్రి స్వయంగా డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన మొదటి మహిళా ఈమె కావడం గమనార్హం. జిలుమోల్ ఆర్టిస్ట్ కావడం వల్ల ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తోంది. -
దివ్యాంగుడిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె అనుచరుల జులుం
పటమట(విజయవాడతూర్పు): ‘రూ.2వేలు ఇస్తామని చెప్పి లోకేశ్ యువగళం పాదయాత్రకు తీసుకువెళ్లారు. వెళ్లిన తర్వాత కేవలం రూ.500 ఇచ్చి మోసం చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు బెదిరిస్తున్నారు. దాడికి ప్రయత్నించారు.’ అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్ దుర్గారావుపై పటమట కృష్ణానగర్‌కు చెందిన గద్దె తంబి అనే దివ్యాంగుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు... ‘ఈ నెల 20వ తేదీన విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో జరిగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు వస్తే రూ.2వేలు ఇస్తామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాకు చెప్పారు. అయితే, కేవలం రూ.500 మాత్రమే ఇచ్చారు..’ అని గతంలో తంబి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరుడు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, ఆయన కారు డ్రైవర్ దుర్గారావు సోమవారం సాయంత్రం అశోక్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు తనను తీసుకువెళ్లారని తంబి ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తనతో బలవంతంగా ఎమ్మెల్యేకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఈ స్టేట్మెంట్ను సోషల్ మీడియాలో పెట్టడంతో తాను ప్రశ్నించానని, దీంతో తనపై దాడికి ప్రయత్నించారని తంబి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. తనను బెదిరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ముమ్మినేని ప్రసాద్, దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సీఐ కాశీవి«శ్వనాథ్ దర్యాప్తు చేస్తున్నారు. -
బుద్ధి తక్కువై లోకేష్ పాదయాత్రకెళ్లా!
Viral Video: పాదయాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రజల కష్టాలు దగ్గరగా వెళ్లి చూడాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అలా చేసి ప్రజల కష్టాలు చూశారు కాబట్టే.. ఆశీర్వదించి ఘన విజయం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?.. అసలు తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తోంది ఏం యాత్ర?.. ఆ అనుమానాల్ని నివృత్తి చేసే వీడియో మరొకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్రలో ఓ దివ్యాంగుడిని పరామర్శించిన(యాక్టింగ్లేండి) పరామర్శించాడు నారా లోకేష్. బ్యాక్‌గ్రౌండ్‌లో టీడీపీ సాంగ్ మారుమోగుతుంటే.. ఆ పెద్దాయనతో చిరునవ్వుతో రోడ్డు మీద ఓ ఫొటో కూడా దిగాడు. కానీ, ఈలోపు పక్క నుంచి ఓ పచ్చ నేత ఐదొందల నోటును ఆ దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన తీసుకున్నాడు. కట్ చేస్తే.. తన మానాన తాను చర్చికి వెళ్తుంటే.. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఉందని చెబుతూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీసుకెళ్లాడని, 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 500లే ఇచ్చారని, వికలాంగుడినైన తనని కూడా మోసం చేశారని, పాదయాత్రకెళ్లి బుద్ధి తక్కువ పని చేశానని చెంపలేసుకున్నాడు పాపం ఆ పెద్దాయన. -
పింఛన్ వల్లేనని మీకు చెప్పిందా రామోజీ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరోమారు తన నైజాన్ని చాటుకున్నారు. దివ్యాంగురాలు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే దానిని ఈ ప్రభుత్వానికి అంటగడుతూ ‘పింఛన్ పోరాటంలో ఉరితాడే దిక్కైంది..’ అంటూ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తూ విషం చిమ్మారు. పింఛన్‌కు అర్హురాలిగా నిరూపించుకొనేందుకు, సర్కారుపై పోరు సల్పే సత్తువలేక ఉరి వేసుకొని చనిపోయిన ఓ దివ్యాంగురాలి దీనగాథ అంటూ అడ్గగోలు రాతలు రాశారు. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని 43వ డివిజన్ ఊర్మిళానగర్‌లో ఇరువూరి ప్రశాంతికుమారి (38), తన తల్లి వెంకట నర్సమ్మతో కలిసి నివసిస్తోంది. వెంకటనర్సమ్మ స్కిల్‌డెవలప్‌మెంట్‌లో ఆయాగా పొరుగు సేవల ఉద్యోగినిగా పని చేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రశాంతి కుమారి చిన్నతనం నుంచి కాళ్లు పనిచేయక పోవడంతో వీల్ ఛైర్ ఆధారంగా జీవనం సాగిస్తోంది. ఆమె గతంలో దివ్యాంగ పింఛన్ పొందేది. అయితే ఇటీవల విచారణ సమయంలో 2,705.12 చదరపు అడుగులు గల మూడు బిల్డింగులు ఉన్నట్లు ఆన్లైన్లో వ చ్చింది. అసెస్మెంట్ నంబర్ 1073034342కు సంబంధించిన భవనం 866.65 చదరపు అడుగులు, అసెస్మెంట్ నంబర్ 1073034343లో 489.94 చదరపు అడుగులు, అసెస్మెంట్ నంబరు 1073032643లో 1348.53 చదరపు అడుగులు, మొత్తం 2,705.12 చదరపు అడుగుల అర్బన్ ప్రాపర్టీ ఉందని విచారణలో తేలింది. తల్లి వెంకట నరసమ్మకు సీఎఫ్ఎంసీ ఐడీ క్రియేట్ అయినందున సిక్స్ స్టెప్ వెరిఫికేషన్‌లో, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించినట్లు నమోదు కావడంతో ఆన్లైన్ వెరిఫికేషన్‌లో పింఛన్ రద్దయింది. ఆమె పింఛన్‌ను ఉద్దేశ పూర్వకంగా ఎవరూ తొలగించలేదు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది.. స్థానిక రెవెన్యూ పోలీసు విచారణలో ప్రశాంతి కుమారికి కుటంబ సభ్యులతో వివాదాలు ఉన్నాయని, అనారోగ్యంతో చికిత్స పొందుతోందని తేలింది. తల్లి వెంకట నరసమ్మ సైతం పోలీసులకు ఇ చ్చిన ఫిర్యాదులో తీవ్రమైన తలనొప్పి, అనారోగ్యంతో చికిత్స పొందుతూ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. ప్రశాంతి కుమారి ఇంట్లోనే ఉరి వేసుకొని మరణించడంతో భవానీపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ దాచిన ఈనాడు పనిగట్టుకుని ప్రభుత్వంపై విషం చిమ్మింది. కట్టుకథ ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కుట్ర పన్నడం దారుణం. సదరు మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మీకేమైనా ఫోన్ చేసిందా రామోజీ? -
వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం
మీర్జాపూర్: సాయం చేయాలంటే డబ్బు ఉండవలసిన అవసరం లేదు సహాయం చేయాలనే మంచి మనస్సు ఉంటే చాలంటారు. ప్రతి దానికి డబ్బు అవసరం లేదు. చాలా మంది అవయవాలు సక్రమంగా ఉన్నా తమ ప్రాణాలకు తెగించి విపత్కర సమయంలో పక్కవాళ్లను కాపాడటానికి ముందుకు రారు. కానీ ఒకతను ఒక చేయి లేదు పైగా వరద ఉదృతి అయినా లక్ష్య పెట్టక ముగ్గురు గర్భిణిలను ఆస్పత్రికి తరలించడానికి సాయం చేశాడు. (చదవండి: తాను విసిరేస్తోంది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్) వివరాల్లోకెళ్లితే....ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగంగా నది ఒడ్డున ఉన్న కునియా గ్రామాన్ని ఇటీవల కురిసిన వర్షాలకి వరద నీరు చుట్టిముట్టింది. దీంతో ఆ గ్రామంలో ఉంటున్న సుమ, శ్యామ అనే గర్భిణులకు ప్రసవ వేదనతో బాధపడుతున్నారు. వరదల కారణంగా ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేక దిక్కుతోచని స్థితితో ఉండిపోయారు. అదే గ్రామనికి చెందిన రామ్‌నరేష్ ఒక ప్రమాదంలో ఒక చేతిని కోల్పోయినప్పటికీ వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. పైగా ఆ ముంపు ప్రాంతం న ట్రాక్టర్ ట్రాలీలో ఆ గర్భిణీలను మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు ఆస్పత్రికి తరలించే మార్గంలో తన ట్రాక్టర్ పూర్తిగా నీటితో నిండిపోయినప్పటికీ తన ఒంటి చేత్తోనే డ్రైవ్ చేసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ మరుసటి రోజు గోమతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించి సాయం చేశాడు. అయితే ఆ ముగ్గురు మహిళల్లో ఇద్దరికి మగ బిడ్డలు ఒక్కరికి ఆడపిల్లక పుట్టడమే కాక వారు సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఆ గ్రామ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ సౌరభ్ భట్ అత్యవసర సమయంలో ఆ ముగ్గురు మహిళలకు సహాయం చేసినందుకు నరేష్‌ని అభినందిచటమే కాక అతన్ని సత్కరించమని అధికారులను ఆదేశించారు. (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) -
మునివేళ్లతో ప్రపంచ రికార్డులు
జార్ లిఫ్టింగ్‌లో రెండు ప్రపంచ రికార్డులు సాధించి వరల్డ్ విజేతగా నిలిచింది 31 ఏళ్ళ అంజు రాణి. దివ్యాంగురాలైన అంజురాణి జార్ లిఫ్టరే కాదు థియేటర్ ఆర్టిస్ట్, రైటర్, మోడల్, బిజినెస్ ఉమన్, సోషల్ వర్కర్ కూడా. మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్న అంజురాణి రెండు దక్షిణ భారత చిత్రాల్లోనూ నటించింది. కేరళలోని ఎర్నాకులం వాసి అయిన అంజురాణి రెండు చేతులతోనూ ఒకే స్పీడ్‌తో అదీ అద్దంలో చూస్తూ రాయగలదు. దేశంలో మొట్టమొదటి వీల్ చైర్ ఆర్టిస్ట్ కూడా అంజురాణియే. వన్‌గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని స్వయంగా తయారు చేస్తూ ఆన్లైన్లో విక్రయిస్తుంటుంది. అలా వచ్చిన డబ్బుతో తనలాంటి దివ్యాంగులకు సాయం చేస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ముందుకు సాగడానికి అంజురాణి లాంటివాళ్లు మనలో ధైర్యాన్ని నింపుతారు. ఒక అమ్మాయి అత్యున్నత దశకు చేరుకోవడానికి చేసిన పోరాటాన్ని అంజు వివరిస్తూ.. ‘నాకు పుట్టుకతోనే పారాప్లేజియా (వెన్నుపూసకు వచ్చిన వ్యాధి) వల్ల శరీరం దిగువ భాగం పనిచేయడం ఆపేసింది. శరీర లోపం ఉన్నప్పటికీ మానసికంగా నేను ధైర్యవంతురాలిని. నాకు నేనుగా బతకే సై్థర్యాన్ని పెంచుకోవాలనుకున్నాను. అందుకు నా తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు..’ అంటూ తన గురించి తెలిపింది అంజు. మొదటి వీల్ చైర్ ఆర్టిస్ట్ దేశంలో వీల్ చైర్ ఆర్టిస్ట్ టీమ్ ‘ఛాయ’లో మొట్టమొదటి సభ్యురాలు అంజు. ఇప్పటివరకు చాలా ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంది. రెండు దక్షిణ భారత దేశ సినిమాల్లోనూ నటించింది. ‘పలావి ప్లస్’ యూ ట్యూబ్ ఛానెల్ మీడియా డైరెక్టర్ పనిచేస్తోంది. దీని ద్వారా దివ్యాంగులలోని ప్రతిభను వెలికి తీసూ, వారికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ ఇస్తోంది. వికలాంగుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడమే తన కలగా చెబుతుంది అంజు. ఇంటి నుండే చదువు.. అంజు తండ్రి పేరు జాయ్, తల్లి జెస్సీ. అంజు పుట్టినప్పుడు ఆమెకున్న ఈ వ్యాధి గురించి డాక్టర్లు చెప్పారు. దాంతో ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటో అని ఆందోళన చెందాడు తండ్రి. కాని ఆమె పెరుగుదలలో ఏ లోపం రాకుండా ప్రతి సందర్భంలోనూ అంజుకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. కేరళలోని ఇడుక్కి రాష్ట్రంలో స్పోర్ట్స్ టీచర్. అయిన జాయ్, తనతో పాటు రోజూ అంజును స్కూల్‌కి తీసుకువెళ్ళేవాడు. అలా అంజు అక్కడ నాల్గవ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత అంజు ఇంట్లో ఉండే స్కూల్ చదువును కొనసాగించింది. ఆ తర్వాత ఓపెన్ యూనివర్శిటీ ద్వారా సోషియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. టీవీ చూస్తున్నప్పుడు ఓ కార్యక్రమంలో ఒక వ్యక్తి జార్ లిఫ్టింగ్ చేస్తున్నట్లు చూసిన అంజు తనూ అలాంటి పోటీలో పాల్గొనాలనుకుంది. అందుకోసం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. సాధనతోనే రెండు బరువైన జాడీలను ఒకేసారి ఎత్తే కళను నేర్చుకుంది. కేజీ బరువున్న జార్‌ను ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు వేళ్ళతో పట్టుకోవాలి. దీనికి యూనివర్సల్ రికార్డ్ ఫోరం గుర్తింపు లభించింది. రెండు వేళ్ళతో రెండు కిలోల కూజాను ఎత్తి ప్రశంసలు, ప్రపంచ రికార్డులను పొందింది అంజు. ఆన్లైన్ బొటిక్ అంజుకు ఆన్లైన్లో ‘లిసా క్వీన్ బొటిక్’ కూడా ఉంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ కూడా చేస్తుంటుంది. సమాజంలో ప్రజలు వికలాంగుల పట్ల తమ వైఖరిని మార్చుకోవాలని అంజు పలు అంశాల ద్వారా చూపుతుంది. ‘భగవంతుడు మనకు ఒక సాధారణ వ్యక్తికి సమానమైన సామర్ధ్యాలను ఇచ్చాడు. ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకోవాలి’ అంటోంది. కూతురు సాధించిన విజయాన్ని చూసి అంజు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆమె ఎదుగుదలలో ఎప్పుడూ వెన్నంటే ఉన్న జెస్సీ, జాయ్లు మాట్లాడుతూ– ‘మా కూతురే ఇప్పుడు మాకు బలం. మీ కుమార్తె దివ్యంగురాలు అయితే బాధపడకండి. ఆమె జీవితంలో విజయం సాధించడానికి తగినంత ప్రోత్సాహం ఇవ్వండి’ అని దివ్యాంగుల తల్లిదండ్రులకు చెబుతున్నారు. -
సదరం.. నరకం
సాక్షి, కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపు నిర్వహణ తీరుపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపులో దివ్యాంగులు, వృద్ధులు, మానసిక వికలాంగులు నరకం చూశారు. ఎండలో గంటల తరబడి భారీ క్యూలలో నిల్చున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. కనీసం అక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరు. ప్రతి నెల మూడు, నాల్గో శుక్రవారాల్లో సదరం క్యాంపు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు కానీ ఇతరులు కానీ ఈ శిబిరానికే వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలోని పిట్లం, మద్నూర్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, నస్రుల్లాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చి నానా తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకే సదరం క్యాంపు ఏరియా ఆస్పత్రిలో నిర్వహించడంతో సమస్య ఏర్పడుతోంది. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపు కోసం కొందరు ఉదయం 7 గంటలకే వచ్చి ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నా గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కొందరు మహిళలు చంటి పిల్లలను ఎత్తుకుని ఎండలో క్యూలో నిల్చున్నారు. శిబిరం నిర్వహించే అధికారులు సౌకర్యలు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తాకిడికి తట్టుకోలేక విలవిలలాడుతున్నామని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండలాల్లో శిబిరం క్యాంపులను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని, తక్షణమే అధికారులు స్పందించి మండలానికో శిబిరం ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆజయ్కుమార్ను వివరణ కోరగా డీఆర్డీఏ పీడీతో మాట్లాడానని తెలిపారు. ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపామన్నారు. అర్హులు మాత్రమే రావాలని, అనర్హులు కూడా వస్తున్నారని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా క్యాంపు నిర్వహణ నేను పిట్లం నుంచి పొద్దున 7 గంటలకు మా తండ్రితో వచ్చా. ఎండలో చస్తున్నాం. క్యాంపు కనీస సౌకర్యాలు లేవు. తాగే నీరు కూడా లేదు. ప్రతి మండలంలో రెగ్యులర్‌గా క్యాంపులు నిర్వహిస్తే దివ్యాంగులకు ఇబ్బందులు తప్పుతాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. –శ్రీనివాస్, పిట్లంవాసి. -
దివ్యాంగులకు ఊరట..
పాల్వంచ రూరల్/చుంచుపల్లి: గతంలో దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, పోలింగ్ కేంద్రాల వద్దకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. దీంతో చాలామంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. దీన్ని గమనించిన ఎన్నికల సంఘం దివ్యాంగులు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. దివ్యాంగులతోపాటు వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులను ముందుగానే గుర్తించి పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా వాహనాల ద్వారా తరలించనున్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో కూడా ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. గతంలో ర్యాంపులు ఏర్పాటు చేసి ఉంటే మరమ్మతులు చేపడుతున్నారు. మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచనున్నారు. దివ్యాంగులను నేరుగా పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంల వద్దకు పంపించనున్నారు. జిల్లాలో 15665 మంది దివ్యాంగ ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 995 పోలింగ్ కేంద్రాల పరిధిలో 8,47,528 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,274 మంది దివ్యాంగులు ఉన్నారు. వారిలో 15665 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇల్లెందు నియోజక వర్గంలో అత్యధికగా 3565 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా, అత్యల్పంగా 2952 మంది భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నారు. వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం దివ్యాంగుల కోసం వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌కు ముందురోజే లైజన్ ఆఫీసర్, గ్రామదీపికలు దివ్యాంగుల ఇంటికి వెళ్లి సమాచారం ఇస్తారు. వారిని ఆటో ద్వారా తీసుకొచ్చి, ఓటేశాక అదే ఆటోలో ఇంటికి చేర్చుతాం. గర్భిణులు, బాలింతలను ఇంటికి సురక్షితంగా చేరుస్తాం. జిల్లాలో దివ్యాంగులు, గర్భిణులు 100 శాతం ఓటుహక్కును వినియోగించుకునే విధంగా కృషి చేస్తున్నాం. –జగత్‌కుమార్‌రెడ్డి,జిల్లా ఎన్నికల నోడల్ అధికారి -
కాళ్లకు కత్తెర.. టూరిస్ట్‌పై విరుచుకుపడ్డాడని..!
ఫ్లోరిడా : పర్యాటకుడిపై కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడన్న ఆరోపణలతో ఓ దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేతులు లేకున్నా ఆ స్థానికుడు ఆవేశంతో ఎందుకు చెలరేగిపోయాడని పోలీసులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మియామీ బీచ్ పోలీసుల కథనం ప్రకారం.. జోనాథన్ క్రెన్షా(46) మియామీ బీచ్ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి రెండు చేతులు లేవు. అతడు బీచ్ దక్షిణ ప్రాంతంలో పెయింటింగ్స్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం చికాగోకు చెందిన పర్యాటకుడు సీజర్ కోరొనాడో తన స్నేహితుడితో కలిసి క్రెన్షా వద్దకు రాగా ఏదో గొడవ మొదలైంది. క్షణికావేశానికి లోనైన క్రెన్షా.. సీజర్ తలపై కత్తెరతో రెండుసార్లు పొడిచి దాడికి పాల్పడ్డాడు. సీజర్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా నిందితుడు క్రెన్షా పరారయ్యాడు. బాధితుడి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో క్రెన్షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్రెన్షా మాట్లాడుతూ.. సీజర్ తన స్నేహితుడితో కలిపి నా వద్దకు వచ్చాడు. నా తలపై కొట్టడంతో కింద పడిపోయానని చెప్పాడు. బాధితుడు క్రెన్షా మిత్రుడు మాత్రం క్రెన్షా చెప్పింది అబద్దమని ఆరోపించాడు. బీచ్‌లో ఉన్న క్రెన్షాను ఓ అడ్రస్ వివరాలు అడగగా.. అతడు కాళ్లకు కత్తెరతో సీజర్ తల, చేతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై చికిత్స నిమిత్తం సీజర్‌ను ఆస్పత్రికి తరలించామని వివరించాడు. -
విధిని ఎదిరించిన విజేత!
జియా బోయు.. నిరాశ, డిప్రెషన్‌తో కుంగిపోయేవారికి అద్భుతమైన ఔషధంగా పనిచేసే పేరు అతనిది. తమ జీవితం ఇంతటితో ముగిసిపోయిందనుకునే వారుసైతం ఏదైనా సాధించేలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి అతను. ఈ రెండు మాటలు చదివిన తర్వాత అంతలా గొప్పదనం ఏముంది అతనిలో? అని తెలుసుకోవానిపిస్తోంది కదూ..! నిజంగా చెప్పాలంటే అతడు సామాన్యుడి కంటే కూడా బలహీనుడు. అయితే అది శారీరకంగా మాత్రమే. మానసికంగా ఎంతో బలవంతుడు. ఎంతగా అంటే... చదవండి.. సాక్షి, స్టూడెంట్ ఎడిషన్: రెండు కాళ్లు లేకున్నా ఎవరైనా ఎవరెస్టు ఎక్కగలరా? పైగా బ్లడ్ క్యాన్సర్ ఓవైపు శరీరాన్ని తొలిచేస్తుంటే.. పర్వతాలను అధిరోహించాలన్న ఆలోచన ఎవరైనా చేస్తారా? అదీ ఏడు పదుల వయసులో.. ఎవరికైనా సాధ్యమేనా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతని గురించి తెలుసుకోకుండా ఉండడం భావ్యమా? అందుకే జియా బోయును మీ ముందుకు తీసుకొచ్చాం. కల నెరవేరే రోజు కోసం..: కళ్లు లేనివారు, కాళ్లు లేనివారు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వీల్లేకుండా నేపాల్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో జియా బోయు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇక తన కల.. కలగానే మిగిలిపోతుందని కుమిలిపోయాడు. ఎందుకంటే బోయుకు రెండు కాళ్లు లేవు. నలభై ఏళ్ల కిందట ‘మంచుకాటు’తో రెండు కాళ్లు కోల్పోయాడు. కానీ ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటంతో ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో బోయు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మరోసారి ప్రపంచ పైకప్పుపైకి ఎక్కి సగర్వంగా నిలబడాలనుకుంటున్నాడు. ఐదోసారి ఎక్కేందుకు..: ఇప్పటికి నాలుగుసార్లు ఎవరెస్టు అధిరోహించాడు జియా. చివరిసారిగా 1975లో చైనాకు చెందిన ఓ బృందంతో కలిసి ఎవరెస్టును ఎక్కుతుండగా మంచు తుపాను ముంచెత్తింది. దీంతో తమతో వచ్చినవారంతా భయపడి వెనకడుగు వేశారు. జియా, మరికొంత మంది మాత్రం శిఖరంవైపే వెళ్లారు. మరికొన్ని అడుగులు వేస్తే ఎవరెస్టును చేరుకుంటామనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెళ్లినవారంతా మంచులో కూరుకుపోయారు. వారిలో జియా కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినా మంచుకాటు కారణంగా అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. చేసేదిలేక వైద్యులు రెండు కాళ్లను తొలగించారు. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ కూడా ఉన్నట్లు తేలింది. విధిని ఎదిరించి.. : వయసు పైడుతున్నా, బ్లడ్ క్యాన్సర్ మరణానికి చేరువ చేస్తున్నా.. అంగవైకల్యాన్ని మర్చిపోయి జియా బోయు ఎవరెస్టు వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏప్రిల్‌లోనే పర్వాతారోహణకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో త్వరలోనే తన యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఎవరెస్టు అధిరోహిస్తాడా? లేదా? అన్నది పక్కనబెడితే.. జీవితంలో ఇన్ని ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడిన జియా మనందరి దృష్టిలో విజేతే. -
సైకిల్ దొరికింది.. స్వాతి మురిసింది!
పాన్‌గల్ మండలం మల్లాయపల్లికి చెందిన 11ఏళ్ల స్వాతి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అమ్మానాన్నలు నిరుపేద కూలీలు.. తల్లి తోడు లేనిదే బయటికి రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మ చంకనెక్కాల్సిందే..! బిడ్డకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని ఆమె తల్లి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో చంద్రయ్యకు విన్నవించింది. ఆయన ఆదేశాల మేరకు డీడబ్ల్యూఓ వరప్రసాద్ ఆమెకు అరగంటలోనే ట్రై సైకిల్‌ను సమకూర్చారు. జేసీ నిరంజన్, డీఆర్వో చంద్రయ్య తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా స్వాతికి మోములో చిరునవ్వు వెల్లివిరిసింది. – ఎం.యాదిరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, వనపర్తి -
దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
సాక్షి, తిరుమల : వయో వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో ప్రత్యేక దర్శనాల ను కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 9, 29 తేదీల్లో వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. 5 సంవత్సరా లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 10, 30 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. -
కూతురి వైద్యమంటే.. ట్రిపుల్ తలాక్!
లక్నో : ఓవైపు ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ నేరంగా పరిగణించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా షరా మాములుగా ట్రిపుల్ తలాక్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే బిల్లు వార్తల్లో నిలుస్తున్న తరుణంలో అలాంటి కేసులు ఇంకా ఎక్కువ నమోదు అవుతుండటమే ఇక్కడ గమనించదగ్గ అంశం. ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఒక్క రోజే రెండు ట్రిపుల్ తలాక్ వ్యవహారాలు వెలుగుచూశాయి. గోండా ప్రాంతంలో ఓ మహిళకు తన భర్త మూడుసార్లు తలాక్ చెప్పి వెళ్లగొట్టాడని మీడియా ముందు వాపోయింది. వికలాంగురాలైన కూతురి చికిత్స కోసం డబ్బులు అడిగితే.. తన భర్త ఈ చర్యకు పాల్పడ్డాడని ఆమె వాపోయింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె మత పెద్దలను, పోలీసులను కోరుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇక మరో ఘటనలో దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు ఫోన్లో సందేశం ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. సుల్తాన్‌పూర్‌కు చెందిన రుబినా బానోకు, హఫీజ్ ఖాన్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త యూఏఈలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె అత్తవారింట్లో ఉంటోంది. అయితే గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే రుబినా ఫోన్‌కు హఫీజ్ ట్రిపుల్ తలాక్ సందేశం పంపటంతో ఆమె షాక్ తింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు భర్త తనకు విడాకులు ఇచ్చి ఉంటాడని ఆమె భావిస్తోంది. గత రెండు నెలల్లో యూపీలో ట్రిపుల్ తలాక్ కేసులు 30 దాకా నమోదు కావటం గమనార్హం. రుబినా బానో ఫోటో ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అది ఏ రూపకంలో(ఫోన్ సందేశం, సోషల్ మీడియా ద్వారా అయినా) ఉన్నా సరే నేరమే. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. లోక్‌సభలో బిల్లుకు క్లియరెన్స్ లభించగా.. రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. -
‘నా కుటుంబానికి న్యాయం చేయండి’
సర్కిల్ ఏర్పాటు కోసం ఇల్లు కోల్పోతున్న దివ్యాంగుడి ఆవేదన కుప్పం: ‘ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సర్కిల్ ఏర్పాటు అంటూ ఇంటినే ఖాళీ చేయమంటున్నారు. కుదరదంటే బలవంతంగానైనా ఖాళీ చేయిస్తాం అంటున్నారు. న్యాయం కోసం మూడు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ దివ్యాంగుడు, హార్మోనియం కళాకారుడైన ప్రకాష్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. పట్టణ సమీపంలోని దళవాయికొత్తపల్లె గ్రామానికి చెందిన దివ్యాంగుడు ప్రకాష్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. 1982లో ఈయనకు ప్రభుత్వం గృహాన్ని మంజూరు చేసింది. అప్పట్నుంచి దళవాయికొత్తపల్లె సమీపంలోని ఎస్టీ కాలనీలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఇదిలాఉంటే, ప్రకాష్ ఇంటి పక్కన మూడు రోడ్ల కూడలి ఉండటంతో సర్కిల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే పడగొడతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న తమను ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమనడంతో దిక్కుతోచడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఉన్నది కేవలం ఒక ఇల్లు మాత్రమే.. దీన్ని కూడా స్వాధీనం చేసుకుంటే తాము చెట్ల కింద జీవనం సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. న్యాయం కోసం మూడు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకొనే నాథుడు లేడని విలేకరుల ఎదుట వాపోయాడు. తాము నివసించేందుకు ప్రత్యామ్నాయం చూపాలని సంబంధిత అధికారులను వేడుకున్నాడు. -
దయ చూపించండి సారూ
ఏలూరు (మెట్రో) : ఆరేళ్లుగా ఆ దంపతులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. అప్పట్లో వయసు లేదన్నారు.. వయసు వచ్చాక రేషన్ కార్డు కావాలన్నారు.. తీరా అన్నీ సమకూర్చుకుంటే ఆధార్ అనుసంధానం కావడం లేదంటున్నారంటూ ద్వారకాతిరుమలకు చెందిన నార్కేడుమిల్లి బ్రహ్మానందరావు, స్వరాజ్యలక్ష్మి దంపతులు దివ్యాంగుడైన కుమారుడిని తీసుకుని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. తమ కుమారుడిపై జాలి చూపి పెన్షన్ మంజూరు చేస్తారని కోటి ఆశలతో వచ్చి ‘మీ కోసం’లో కలెక్టర్ భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించినా మరోమారు అవే మాటలు అధికారుల నుంచి వినిపించాయని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గతంలో పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ అధికారులు చెప్పారని, మండలస్థాయిలో నాయకులు, ఎంపీడీవోలు కూడా అదే చెప్పారని, ప్రస్తుతం మీ కోసం కార్యక్రమంలోనూ డీఆర్డీఏ అధికారులకు కలెక్టర్ సూచించారన్నారు. ఇప్పటిౖకైనా తన కుమారునికి పెన్షన్ మంజూరు చేస్తే కనీసం మందులు కొనుగోలుకైనా సహాయం చేసినవారవుతారని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. -
వికలాంగులంటే ఇంత నిర్లక్ష్యమా?
* ఆడ, మగ తేడాలేకుండా ఆరుబయటే నిర్ధారణ పరీక్షలు * సదరం క్యాంపులో ఓ వైద్యుడి నిర్వాకం నిజామాబాద్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షల కోసం సదరం క్యాంపునకు వచ్చిన వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చిన వారిని రేపు మాపు అంటూ వైద్యాధికారులు తిప్పుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన సదరం శిబిరంలో ఓ వైద్యుడు ఆడ, మగ తేడా లేకుండా ఆరుబయటే వికలాంగ నిర్ధారణ పరీక్షలు జరిపారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులున్నా ఆరు బయటే నిర్వహించడం విమర్శలకు తావి స్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్, ఇతర పథకాల్లో లబ్ధి పొందేందుకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు ప్రతి శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు వస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన శిబిరం సోమవారానికి వాయిదా వేశారు. వైద్యుల రాక కోసం గంటల తరబడి క్యూలో వేచి చూశారు. అయితే ఉదయమే రావాల్సిన ఆర్థోపెడిక్ వైద్యుడు మధ్యాహ్న సమయంలో వచ్చి కేవలం 20 నిమిషాల పాటే పరీక్షలు నిర్వహించాడు. సమయం లేదంటూ ఆడ, మగ తేడా లేకుండా ఆరబయటే పరీక్షలు చేయడంతో వారు డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన తమ పట్ల వైద్యాధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ వికలాంగులు వాపోయారు. శిబిరంలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు పట్టింకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజనం
ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: చదవులతో నిమిత్తం లేకుండా గ్రామాల్లోని నిరుపేద పిల్లలతోపాటు గ్రామాల్లోని వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఈ మేరకు టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్‌తో కలసి ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. -
నడుస్తోంది నడిపిస్తోంది
మొన్న ‘ఊపిరి’ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఆ పేరెందుకు పెట్టారు? ఎందుకంటే ఆ కథ మార్పుకు ఊపిరి. వికలాంగులను చూసే దృక్పథంలో... వారిని పునరావిష్కృతం చేసే మార్గంలో మార్పుకు సాయి పద్మ ఒక ఊపిరి. మార్పు చలనానికి సందేశం. చిన్నప్పట్నుంచీ ఆ చలనానికి నోచుకోకపోయినా మార్పుకి ప్రయత్నిస్తూనే ఉంది. ఇతరుల కోసం తన సంస్థ నడుస్తోంది. తను ఇతరులను నడిపిస్తోంది. కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి వైకల్యాన్నయినా జయించవచ్చని నిరూపించారు సాయిపద్మ. బాల్యం నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె ఎప్పుడూ ఓడిపోలేదు. నైరాశ్యం పొందలేదు. తను కదల్లేకపోయినా తన ఆశను, ఆకాంక్షను కదిలిస్తూనే ఉన్నారు. తన జీవితం గురించి ఆమె మాటల్లోనే.. ‘నాన్న బీఎస్ఆర్ మూర్తి, అమ్మ ఆదిశేషు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో డాక్టర్లు. నా తమ్ముడు, చెల్లెలు కూడా వైద్యులే. 1971లో మా స్వస్థలం విజయనగరం జిల్లా గజపతినగరంలో పుట్టాను. నాకు పోలియో రాకుండా ముందుజాగ్రత్తతో వ్యాక్సిన్ తెచ్చి ఉంచారు అమ్మానాన్న. కానీ నెలన్నరకే పోలియో సోకింది. అప్పటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన ప్రకారం 90 రోజులు నిండిన వారికే ఈ వ్యాక్సిన్ వేయాలి. అందువల్ల అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నా నాకు వేయలేని పరిస్థితి. ఇలా విశాఖ కేజీహెచ్‌లో తొలి పోలియో కేసు నాదే. పోలియోతో నా కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గొంతు మూగబోయింది. 52 షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఎట్టకేలకు కాళ్లు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయడం మొదలెట్టాయి. పన్నెండేళ్లు వచ్చేవరకు నన్ను ఎత్తుకునే వారు. అవయవాలు బలం పుంజుకోవడానికి ఒంటికి ‘పులి’కొవ్వు రాసేవారట. బీచ్‌లో ఇసుకలో మెడ వరకు పాతిపెట్టి ఉంచేవారట. నా వెన్నెముక ‘ఎస్’ ఆకారంలో వంగిపోతే పక్కటెముకలను కట్ చేసి సరిచేశారు. సెలవులకు పిల్లలందరూ అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు వెళ్తే నన్ను విశాఖలోని అమెరికన్ ఆస్పత్రికి తీసుకెళ్లేవారు శస్త్రచికిత్సల కోసం. అలా నా శరీరానికి 18 సర్జరీలు జరిగాయి. మెడిసిన్ చదవడానికి నా శరీరం సహకరించదని అసలు ఆ ఆలోచన చేయలేదు నేను. నేను నలుగురికి ఉపయోగపడాలి అన్నిరకాల ఆసరా ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి ఆసరా లేని వికలాంగుల పరిస్థితి ఏమిటన్నది నా ఆవేదన.. ఆలోచన. సీఏ చదివి, డబ్బు సంపాదించి నాలాంటి వారికి ఉపయోగపడేలా ఓ సంస్థను స్థాపించాలన్నది కోరిక. ఎంకాం పూర్తి చేసి మంచి కాలేజీలో ఎంబీఏ చేయాలని, ఉన్నత ఉద్యోగం చేయాలని అనుకునేదాన్ని. వెలుగు పథకంలో ప్రాజెక్టు డెరైక్టర్‌గా పోస్టు వచ్చినా చేరలేదు. బీఎల్ చేసి న్యాయవాదిగా పనిచేస్తూ జూనియర్ సివిల్ జడ్జి ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాను. రెండున్నర గంటల సమయం ఉండే ఫైనల్ ఎగ్జామ్‌ను రాయలేను. స్క్రైబ్‌ను అడిగితే టెన్త్, ఇంటర్ వారినే ఇస్తామన్నారు. అందువల్ల నాకు న్యాయం జరగదని దీనిపై కోర్టులో ఫైట్ చేస్తున్నా. కౌన్సెలింగ్.. ఉచిత న్యాయ సలహా మాలాంటి వారి హక్కుల గురించి ఎవరూ అడగరు. మామూలు వారికంటే మాకే ఎక్కువ అవసరాలుంటాయి. మాలాంటి వారి కోసం ఉచితంగా కోర్టులో కేసులు వాదిస్తున్నా. వికలాంగులకే కాదు.. ఇతరుల దాంపత్య జీవితాల్లో తలె త్తే వివాదాలపై కౌన్సెలింగ్ ఇస్తుంటాను. ఇప్పటిదాకా వంద డిజేబుల్డ్ ఫ్యామిలీలకు కౌన్సెలింగ్ ఇచ్చాను. వీటిలో 75 శాతం సక్సెస్ అయ్యాయంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. అనురాగ బంధం సాయి పద్మ జీవితంలోకి ఆనంద్ ప్రవేశం విచిత్రంగానే జరిగింది. 2005-06లో ప్రజ్ఞానంద్ ఓ స్వచ్ఛంద సంస్థకు కన్సల్టెంట్‌గా పనిచేసేవారు. వికలాంగులకు చేయూతనివ్వడంలో భాగంగా వివిధ సంస్థలతో సాయిపద్మ మెయిల్ ద్వారా సంప్రదింపులు చేసేవారు. అలాంటి ఒక సందర్భంలోనే ప్రజ్ఞానంద్‌తో ఆమెకు పరిచయమేర్పడింది. ఆయన 2006లో విజయనగరం వచ్చినప్పుడు తొలిసారిగా ఒకరికొకరు చూసుకున్నారు. ప్రజ్ఞానంద్ చిన్నాన్న, సాయిపద్మ తండ్రి ఆంధ్ర మెడికల్ కళాశాలలో సహచరులని పరిచయాల ద్వారా తెలిసింది. దీంతో పద్మ బంధువులు ప్రజ్ఞానంద్‌తో పెళ్లి ప్రతిపాదన చేశారు. సామాజిక సేవ కోసం తపిస్తున్న పద్మతో పరిణయానికి సుముఖత వ్యక్తం చేశారు ప్రజ్ఞానంద్. అలా 2008లో వాళ్ల పెళ్లి జరిగింది. ఇప్పుడామె కాళ్లకు చక్రాలు, కాలిపర్సులు ఆయనే. కాళ్లకు బ్రేసెస్ వేయించుకుని ఇప్పుడిప్పుడే నడ‘కల’ను నెరవేర్చుకుంటోంది పద్మ. మరణానంతరం తమ శరీరాలను దానమివ్వడానికి అంగీకారపత్రాన్ని రాసిచ్చి మరో ఆదర్శానికి అంకురార్పణ చేశారీ దంపతులు! మంచంపై ఉన్నప్పుడూ.. ఆపరేషన్లు జరిగినప్పుడు రెండేళ్ల పాటు మంచంపైనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లిష్‌లో ‘లైఫ్’ అనే కవితల పుస్తకాన్ని రాశాను. తెలుగులో 15 కథలు, ట్రావెలాగ్, తమ్మిమొగ్గలు (కలువ మొగ్గలు) వంటి పుస్తకాలు రాశాను. ఇలా నా బాధను కాస్త మరిచిపోయే మార్గం ఎంచుకున్నాను. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కథల పోటీల్లో నా కథకు ప్రథమ బహుమతి వచ్చింది. సంగీతంపై ఆసక్తితో ఏయూ నుంచి మ్యూజిక్‌లో డిప్లొమా చేశాను. 2007లో అమెరికాలో నేను పాడిన ‘వైష్ణవజనతో’ పాటకు ఏడు నిమిషాల్లో రూ.20 లక్షలు సమకూరింది. ఆ సొమ్ము వికలాంగుల సర్జరీల కోసం ఇచ్చేశాను. నాకన్నా ఆమె గొప్పది నాకన్నా ఆమే చాలా టాలెంటెడ్. కొన్ని నేను చేయలేను. ఆమె చేయలేనిది నేను చేస్తాను. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వల్ల హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మా ఇద్దరికీ సామాజిక సేవా ధృక్పథం ఉంది. దాంతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. -ప్రజ్ఞానంద్, సాయి పద్మ భర్త గ్లోబల్ ఎయిడ్ ద్వారా.. నాలాంటి వారికి ఏదైనా సాయం చేయడం కోసం అమెరికా వెళ్లి అధ్యయనం చేశాను. ఆ తర్వాత ఎనిమిదేళ్ల్ల కిందట గ్లోబల్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. దీని ద్వారా వికలాంగులకు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు విద్య, వైద్య సాయం, వీల్చైర్లు, కాలిపర్స్ల పంపిణీ వంటివి చేపడుతున్నాం. గజపతినగరంలో వికలాంగులు, పేదల కోసం హాస్టల్ నడుపుతున్నార.. నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగావకాశాలకు తోడ్పాటునందిస్తున్నాం. కార్లకు మోడిఫికేషన్ చేయించి వికలాంగులు స్వయంగా నడిపేలా ఒక నిపుణుడికి పూణేలో శిక్షణ ఇప్పించాం. ఇలా ఇప్పుడు నగరంలో సుమారు 80 మంది వికలాంగులు తమ కార్లను మోడిఫికేషన్ చేయించుకుని తిరుగుతున్నారు. స్పోర్ట్స్‌లోనూ వికలాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నా. నేనూ పారా షూటింగ్ నేర్చుకున్నాను. భవిష్యత్తులో.. వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి స్పోర్ట్సుపై ఆసక్తి పెంచుతాం. మావద్దకు వచ్చే పేద, అనాథ పిల్లలను హీల్ ఇండియా నడుపుతున్న విద్యాలయానికి పంపుతాం. అక్కడ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుంది. కాలిపర్స్‌ని ఇండియాలో అవసరమైన వారికి అందుబాటులోకి తేవాలన్నది నా ప్రయత్నం. దీనిపై అమెరికాలోని డైనమిక్ బ్రేసింగ్ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదిరింది. వారే ఇక్కడకు వచ్చి తయారు చేసిస్తారు. దీంతో సగం ధరకే వాటిని పొందే వీలుంది. వీటితో చిన్నారుల్లో వైకల్య తీవ్రతను తగ్గించవచ్చు. వికలాంగుల కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. జీవితంలోకి ‘ఆనంద’ం నాకు లేని కాళ్లు నా భర్త ప్రజ్ఞానంద్. నేను ఆలోచించలేని పరిధి ఆయన. అన్నీ బాగున్నా ఆడపిల్ల పుట్టిందని పుట్టింటికి పంపేసే భర్తలున్న రోజులివి. అలాంటిది ఉన్నత విద్యావంతుడైన (నాలుగు ఎంఏలు, ఎంఫిల్) ఆయన వైకల్యం ఉన్న నన్ను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఓ యోగితో జీవితాన్ని పంచుకున్న అదృష్ట్టవంతురాలిని. ప్రేమకన్నా గొప్పది నమ్మకం. ఆ నమ్మకమే జీవితం. నాకది ఆనంద్ రూపంలో దొరికింది. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం, ఫొటోలు: ఎమ్.డి.నవాజ్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
వికలాంగులకు ఉపశమనంగా... డిజేబిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్
లీగల్ కౌన్సెలింగ్ నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి వినికిడి సమస్య ఉంది. పూర్తిగా చెవుడు లేకున్నా, సరిగ్గా వినిపించదు. అతి బిగ్గరగా మాట్లాడితేనే వినిపిస్తుంది. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అతికష్టం మీద చదివించారు. నా సమస్య తెలిసినా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాక్టర్లను సంప్రదించలేదు. చిన్నా చితకా లోకల్ డాక్టర్ల దగ్గర (ఆర్ఎంపీ) మందులు తీసుకున్నా నా సమస్య తగ్గక పోగా, ఇపుడు ఇంకా ఎక్కువైంది. తెలిసినవారు వికలాంగులకు ఉద్యోగంలో రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. దానికి సంబంధించి చట్టం ఉందన్నారు. దయచేసి తెలియజేయగలరు. - గట్టయ్య, నిజామాబాద్ ఆర్థిక బాధలో ఉండీ మిమ్మల్ని చదివించినందుకు మీ తల్లిదండ్రులను అభినందించాలి. కానీ మీరు కనీసం సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే బాగుండేది. మీకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్న మాట నిజమే. దానికి పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995 (పి.డబ్ల్యూ.డి) అంటారు. ఈ చట్టం ప్రకారం అంధులకు, దృష్టి లోపం ఉన్నవారికి, కుష్టువ్యాధి నుండి కోలుకుంటున్న వారికి, చెవిటి వారికి, శారీరక వైకల్యం ఉన్నవారికి, మెంటల్ రిటార్డేషన్ ఉన్నవారికి, మెంటల్ ఇల్నెస్ ఉన్నవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. కాకుంటే మీకు ఎంత శాతం డిజేబిలిటీ ఉన్నదో దానికి సంబంధిత డాక్టర్లు నిర్ణయించాక 40 శాతం పైగా డిజేబిలిటీ ఉంటే మీకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ‘డిజేబిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్’ వారిని సంప్రదించండి. మేడమ్, చట్టాలు కేవలం మహిళలకేనా? భార్యాబాధితుల మాటేంటి? మా వివాహమై మూడు సంవత్సరాలైంది. మా సంసారం మూణ్ణాళ్ల ముచ్చటలాగే ఉంది. అమ్మాయి సంప్రదాయబద్దంగా ఉందని, ఇంటి పనులు చక్కదిద్దుకుంటే చాలని పెళ్లి చేసుకున్నా. మీరు నమ్మండి; నమ్మకపోండి పైసా కట్నం తీసుకోలేదు. మా వివాహమయ్యే నాటికే మామగారు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. పెళ్లి ఖర్చులకు కూడా ఆశించకుండా వివాహం చేసుకున్నా. ఏం చెప్పమంటారు, చిన్న విషయాలకు కూడా నన్ను నానా తిట్లు తిట్టడం మొదలెట్టింది. పెళ్లికి మా వాళ్లు తెచ్చిన చీరలు నచ్చలేదని నోటికొచ్చినట్లు తిట్టింది. కొత్త కదా అని సర్దుకున్నాను. నా ఫ్రెండ్స్ కొత్తకాపురం చూడ్డానికి వస్తే నన్ను కల్చర్ లేదని, వట్టి ఏబ్రాసి గాడ్నని, భార్యను కనీసం హనీమూన్‌కైనా తీసుకెళ్లలేదని వాళ్లందరి ముందు నన్ను అవమానించింది. విమానాల్లో హనీమూన్లకు తీసుకెళ్లే స్థోమత నాకు లేదని చెబితే నన్నూ, నా వాళ్లనూ తీవ్రంగా దూషించింది. అప్పటి వరకూ సంపాదించిన సొమ్ము లెక్క చెప్పమని గొడవలు ప్రారంభించింది. వంట రాదంటే నేనే చేయడం ప్రారంభించా. చూసి నేర్చుకోమని బుజ్జగించా. నేను చేసిన వంట బాగాలేదని నా ముఖాన ప్లేట్ విసిరికొట్టింది. ఇవి చెప్పాలంటే పెద్ద వాల్యూమ్ అవుతుంది. అత్త మామగార్లను అడిగితే ఒకే అమ్మాయని గారంగా పెంచామని, చిన్నప్పటి నుంచి కాస్త దూకుడెక్కువని, సర్దుకు పొమ్మని చెప్పారు. చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాను. లాభం లేదు. మొన్న బస్టాండ్‌లో నా ఫిమేల్ కొలీగ్‌తో మాట్లాడుతుంటే పబ్లిగ్గా నాపై, ఆమెపై చేయి చేసుకుంది. నాకు మరణమే శరణ్యమా? - కృష్ణ, అమలాపురం మీ వేదన నాకు అర్థమైంది. ఒక విషయం... చట్టాలు కేవలం మహిళలకే కాదు, అవి అందరికీ వర్తిస్తాయి. కాకుంటే కొన్ని సాంఘిక దురాచారాల నుండి మహిళలను కాపాడాలని కొన్ని చట్టాలు వచ్చాయి. మీ విషయంలో అన్ని ప్రయత్నాలు ముగిశాయని అంటున్నారు. ఇక మీకు విడాకులే శరణ్యమని అనుకుంటున్నా, మీరు వర్ణించిన బాధలు ఒకవేళ నిజమైతే, అవన్నీ ‘క్రూర ప్రవర్తన’ కిందకు వస్తాయి. హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం అలాంటి క్రూర ప్రవర్తన ఎవరు ఎవరి పట్ల చూపినా, విడాకులకు సహేతుకమైన కారణమౌతుంది. న్యాయవాదిని సంప్రదించండి. నమస్తే ఆంటీ. నేనొక మైనర్ బాలుణ్ణి. నా వయస్సు 11 సం॥6వ తరగతి చదువుతున్నాను. మా తాతయ్య మీకు రాయమంటే రాస్తున్నాను. నేను మా నానమ్మ తాతయ్య దగ్గర చిన్నప్పటి నుంచి పెరుగుతున్నా. 3వ తరగతి నుండీ వీరి వద్దనే ఉంటున్నా. నన్ను మంచి స్కూల్లో చదివిస్తున్నారు. మా తాతగారు రిటైర్డ్ హెడ్మాస్టారు. మా అమ్మానాన్నలు నిత్యం పోట్లాడుకునేవారు. ఎప్పుడూ గొడవలే గొడవలు. అందువల్ల తాతగారు నన్ను తెచ్చుకున్నారు. మా అమ్మయితే నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఒకటే గొడవలు. మా ముందే అమ్మా నాన్నలు కొట్టుకునేవారు. ఇప్పుడేమో వాళ్లు విడాకులకు అప్లై చేశారని తెలిసింది. అమ్మ నా కస్టడీ కోసం కేసు వేసిందంట. నాన్న నన్ను కోర్టుకు రావాలని చెప్పారు. నాన్నేమో నేను తన దగ్గరే ఉండాలంటున్నాడు. నాకు ఇద్దరి దగ్గర ఉండటం ఇష్టం లేదు. నన్ను తాతయ్య, నాన్నమ్మ బాగా చూసుకుంటున్నారు. జడ్జిగారు నాతో మాట్లాడతారని తెలిసింది. భయంగా ఉంది. నా మనసులో మాట చెప్పవచ్చా? - రవిచంద్ర, హైదరాబాద్ భార్యాభర్తల మధ్య అగాథాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నీ ఉత్తరం చదివాక ఇంకా బాగా అర్థమైది. పిల్లలకు అంటే మైనర్లకు తండ్రి సహజ సంరక్షకుడు, అతని తర్వాత తల్లి. లేదా పిల్లలు ఎవరి దగ్గర ఆనందంగా, పెరుగుతారో ఎవరి దగ్గర వారి భవిష్యత్ బాగుంటుందో వారికే కస్టడీ ఇస్తారు. కాకుంటే పిల్లల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురి దగ్గర పిల్లలు ఉండలేరని భావిస్తే మూడోవారికి కస్టడీ ఇస్తారు. జడ్జిగారు మిమ్మల్ని తమ ఛాంబర్లోకి పిలిచి అడుగుతారు. అక్కడ వారికి నీ మనస్సులో ఏముందో నిర్భయంగా చెప్పవచ్చు. పిల్లల ఇష్టాలను, వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని, మీ తాతయ్య/నానమ్మల పరిస్థితులు విచారించి, వారి వద్ద నీకు అన్ని రకాల అభివృద్ధి ఉంటుందని కోర్టు వారు భావిస్తే తప్పకుండా నిన్ను వారి దగ్గరే ఉంచుతారు. మీ అమ్మా/ నాన్నలు అప్పుడప్పుడూ వచ్చిపోయే ఏర్పాటును ఆమోదిస్తారు. భయపడవద్దు బాబూ, తప్పకుండా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే నీవు హైస్కూల్ విద్యార్థివి. ఆలోచనా శక్తి ఉంటుంది. దానిని కోర్టు వారు గమనించి నిర్ణయం తీసుకుంటారు. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
యాదమ్మకు ఎన్ని కష్టాలో..
సూరారం (హైదరాబాద్ సిటీ): నిరంతరం రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి సాధారణ మనుషులే చాలా ఇబ్బంది పడుతారు. అలాంటిది వికలాంగురాలు అయిన యాదమ్మ అనేక కష్టాలు పడి ఎలాగోలా రోడ్డు దాటింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సురారంలో ఆదివారం జరిగింది. సూరారం ప్రాంతానికి చెందిన యాదమ్మకు రెండు కాళ్లు లేవు. దీంతో చక్రాలు అమర్చిన చెక్క సహాయంతో ఆమె రెండు చేతులు ఉపయోగించి ప్రయాణం చేస్తుంది. కాగా, ఆదివారం ఒక పక్క వర్షం, మరో పక్క రోడ్డుపై పెద్ద పెద్ద వాహనాలు, ఇవన్నీ చాలవన్నట్లు రోడ్డుకు అడ్డంగా ఉన్న డివైడర్.. వీటినన్నింటిని దాటుకొని యాదమ్మ ఎలాగోలా చివరికి రోడ్డు దాటింది. ప్రభుత్వం ఇప్పటికైనా వికలాంగుల గురించి ఆలోచించాలని అక్కడి వారు కోరారు. -
పెళ్లి చేసుకున్నాడు..పొమ్మంటున్నాడు
మదనపల్లె క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకుని 5 నెలల కాపురం తర్వాత కాదు పొమ్మంటున్నాడని ఒక వివాహిత మంగళవారం రూరల్ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరిట ఉన్న డబ్బు, నగలు మొత్తం అతనికే ఇచ్చేశానని, న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె కథనం మేరకు.. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన వెంకట్రమణ కుమార్తె గంగాదేవి(25) వికలాంగురాలు. మూడేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పనిచేస్తోంది. ఇదే కంపెనీలో పలమనేరు మండలం జీడిమెట్లకు చెందిన రెడ్డెప్పరెడ్డి పనిచేసేవాడు. ఇద్దరికి పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. రెడ్డెప్పరెడ్డి మాయమాటలకు పడిపోయిన గంగాదేవి తల్లిదండ్రులు తన పేర బ్యాంకులో డిపాజిట్ చేసిన 2లక్షలను అతనికే ఇచ్చేసింది. ప్రతినెలా జీతం కింద వచ్చే రూ.10వేలను అతనికే ఇచ్చేది. ఈ క్రమంలో ఇద్దరు ఈ ఏడాది జూన్ 18న చిప్పిలిలోని దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గంగాదేవి ఇంటివద్దే కాపురం పెట్టారు. తర్వాత రెడ్డెప్పరెడ్డి భార్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ రెండు నెలలు కాపురం ఉన్నారు. తర్వాత ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన భర్త రెడ్డెప్పరెడ్డి, అతని భాస్కర్‌రెడ్డి, అమ్మ పద్మమ్మ పథకం ప్రకారం కొడుకు, కోడలిని నెల రోజుల క్రితం అత్తారింటికి పంపారు. రెండు రోజులు అక్కడే ఉన్న రెడ్డెప్పరెడ్డి పనిమీద బెంగళూరుకు వెళుతున్నానని చెప్పి భార్యను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. రెండు మూడు వారాలు గడిచినా రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. గంగాదేవి అత్త పద్మమ్మ, బావ భాస్కర్‌రెడ్డికి ఫోన్‌చేస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. మోసపోయానని తెలుసుకున్న గంగాదేవి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఉన్నదంతా భర్తకే ఊడ్చిపెట్టానని, వికలాంగురాలినని, న్యాయం చేయాలని వేడుకుంది. -
వైకల్యం.. ప్రతిభకు అడ్డుకాలేదు..!
-
మానవతకు ప్రేరణ
ఈ విద్యార్థి బృందం తమ సెలవులను గడపడంలో ఓ సృజనాత్మకత ఉంది. వారు తమ కార్యకలాపాలకు పెట్టుకున్న పేరు... ‘ప్రేరణ’లో ఓ చైతన్యం ఉంది. వారు వేసే అడుగులకు ఒక సత్సంకల్పం ఊతమైంది. వారి సంకల్పబలం ఎంతోమందికి జీవితాన్ని ఇస్తోంది. అనాథలు, వికలాంగులు, వృద్ధులు అని లేకుండా... అవసరంలో ఉన్నవారెవరి వద్దకైనా వాళ్లు వెళ్తారు. వారి అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సహకరిస్తారు. ఐదుగురు స్నేహితులు మానవత్వంతో తిరుపతిలో మొదలు పెట్టిన ఈ సేవ, ఇప్పుడు ఆ పట్టణాన్ని దాటి, రాష్ట్రాన్ని దాటి, మెల్లగా ఇతర రాష్ట్రాలలోనూ విస్తరిస్తోంది! తల్లిదండ్రులు చేతిఖర్చులకిచ్చే డబ్బుతో పబ్‌లు, డిస్కో థెక్‌లు, సినిమాలు, విందులు వినోదాల్లో రిలాక్సవడం - ఆ తర్వాత చదువులు, ఉద్యోగాల్లో బిజీ అవడమే యువతరం జీవన విధానం అనుకుంటాం. కానీ కొందరు విద్యార్థులు అలా కాదు. సెలవుల్లో అనాథలు, వికలాంగులు, వృద్ధుల ఆలనాపాలనాలో మునిగిపోతారు. వీరిలో నాన్న ఇచ్చిన పాకెట్ మనీలో కొంత అనాథలకు వెచ్చిస్తారు. నెల జీతంలో పది శాతాన్ని సేవలకు ఖర్చు చేసేవారూ ఉన్నారు. సేవామార్గంలో సాగుతూ మానవత్వానికి ‘ప్రేరణ’గా నిలుస్తోన్న మిత్రబృందం... సుధాకర్, రాజశేఖర్, భార్గవి, ఆక్లేష, ప్రవీణ్‌కుమార్‌ల కథ ఇది. ఈ స్నేహితులందరూ ఒక క్లాసు వాళ్లు కాదు, ఒక కాలేజీ వాళ్లు కూడా కాదు. తిరుపతిలో వేర్వేరు కాలేజీల్లో చదువుకునేవారు. 2007లో అనుకోకుండా ఒకరికొకరు పరిచయమయ్యారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలూ ఉండటంతో... అనాథలు, వికలాంగులు, వృద్ధులకు ఆనందాన్ని పంచి వారికి జీవితం పట్ల భరోసా కల్పించాలని భావించారు. అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన తిరుపతిలో జగన్మాత చర్చి అనాథాశ్రమంలో ‘ప్రేరణ’ అనే సంస్థను స్థాపించారు. సెలవు రోజుల్లో తిరుపతి, ఆ పరిసరాల్లోని అనాథ, వృద్ధ ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో అనాథలకు అవసరమైన వస్తువులను సమకూర్చి, వైద్యం చేయిస్తున్నారు. ఒక ఆదివారం రోజు... ప్రేరణ బృందం తిరుపతిలోని నవజీవన్ బ్లైండ్ స్కూల్‌ను సందర్శించింది. విద్యార్థులకు అవసరమైన సబ్బులు, తలనూనెలు, షాంపూ, టూత్పేస్టుతోపాటు తినుబండారాలు ఇచ్చింది. అంధ విద్యార్థులను ఆ రోజంతా ఆటపాటలతో ఉత్సాహపరిచింది. సాయంత్రం బయటకు వచ్చే సమయంలో రోజా అనే విద్యార్థిని.. ‘నా కాళ్లపై నేను నిలబడగలిగేలా చేయండి అన్నా’ అన్నది. ‘‘ఆ మాటలు వారిని కదిలించాయి. ఆమె కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. సంగీతం పట్ల రోజాకు ఉన్న అభిరుచిని గుర్తించి, ఆ విభాగంలో ఆమెకు శిక్షణ ఇప్పించారు. ఆగస్టు 15, 2008న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రేరణ ప్రథమ వార్షికోత్సవంలో రోజా ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. తన కాళ్లపై తాను నిలబడగలననే ధైర్యం రోజాకు వచ్చింది. ఇది ప్రేరణ బృందానికి గొప్ప ప్రేరణ అయింది. విస్తరించిన సైన్యం... ఏడేళ్ల కిందట ఐదుగురితో ప్రారంభమైన ‘ప్రేరణ’ సైన్యం ఇప్పుడు 250 మందికి చేరుకుంది. తిరుపతి నుంచి చెన్నై, బెంగుళూరు వంటి నగరాలతోపాటూ కడప జిల్లాకూ సేవలను విస్తరించింది. అప్పటి విద్యార్థులు ఇప్పుడు తలా ఓ చోట ఉద్యోగంలో చేరి కూడా తమ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూసుకుంటున్నారు. జీతంలో పది శాతాన్ని ‘ప్రేరణ’కు అందిస్తున్నారు. తమ సేవా కార్యక్రమాలను విస్తరించారు. స్నేహితులను కలుపుకుంటూ తమ సైన్యాన్ని పెంచుకుంటున్నారు. సెలవు దొరికితే చాలు... అందరూ కలిసి తిరుపతి, చెన్నై, బెంగళూరుల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగుల కేంద్రాలకు వెళ్తున్నారు. వికలాంగుల బాగోగులను విచారిస్తూ... వారిలో దాగిన నైపుణ్యాన్ని వెలికితీసి, సానపడుతున్నారు. ప్రేరణ బృందం సహాయంతో తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం సమీపంలోని అక్షయ కేంద్రంలోని మానసిక వికలాంగ బాలలైన నారాయణ, జ్యోతిలు వైకల్యం పోయి సాధారణ బాలలుగా మారారు. ఇదే కేంద్రంలోని మానసిక వికలాంగులు నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. ఢిల్లీలో నవంబర్ 14, 2014న నిర్వహించే బాలల దినోత్సవంలో నృత్య ప్రదర్శనకు ఈ బృందం ఎంపికైనట్లు ‘ప్రేరణ’ కో-ఆర్డినేటర్ బాషా చెప్పారు. తమ సేవలను ఇంతగా విస్తరించడం వెనుక ప్రేరణ సభ్యులు పడిన శ్రమ చాలానే ఉంది. ఆర్థిక సమస్యలతో పాలు ఇతరత్రా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అమ్మాయిలకు అయితే... ఇంట్లో అనుమతి దొరికేదు కాదు. అబ్బాయిలుంటారు కాబట్టి సేవ చేయడానికి పంప డానికి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. కానీ ‘ప్రేరణ’ చేస్తున్న కార్యక్రమాలు చూశాక వారి మన సులు మారాయి. ఆడపిల్లలను సైతం ధైర్యంగా పంపించారు. పాకెట్ మనీని అధికంగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాంతో చాలామంది అమ్మాయిలు కూడా ప్రేరణ కార్యక్రమాల్లో పాలుపంచు కుంటున్నారు. వీళ్లందరి సేవలూ అనాథ, వృద్ధ, మానసిక వికలాంగుల ఆశ్రమాలకే పరిమితం కాలేదు. బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు, వైద్య శిబిరాలు, బస్టాండులు, దేవాలయాలను శుభ్రం చేయడం వరకూ విస్తరించాయి. ఇంత చిన్న వయసులో వీరు చేస్తోన్న సేవకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి! - ఎ.రామగోపాల్‌రెడ్డి, సాక్షి, తిరుపతి ఫొటోలు: కె.గిరిబాబు