
దారి చూపిస్తారని వస్తే.
‘పింఛన్ రావడం లేదు.. ఇంటి స్థలం లేదు.. పూట గడవాలంటే కష్టంగా ఉంది.. ఎలాగైనా మీరే దారి చూపించాల’ని జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకోవడానికి కదిరి నుంచి వచ్చిన ఎనిమిది మంది అంధులకు నిరాశే ఎదురైంది.
సోమవారం గ్రీవెన్స్ ఉంటుందని వారు ఓ బాలిక సహాయంతో అనంతపురం వచ్చారు. అయితే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉండడంతో గ్రీవెన్స్‌ను రద్దు చేశారనే విషయం తెలుసుకుని జేసీ సత్యనారాయణను కలిశారు. కదిరి ఆర్డీఓను కలవాలని ఆయన సూచించారని వికలాంగులు తిరుపాలు, వెంకటరాముడు, భద్రి, సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ తిరుగుముఖం పట్టారు.