Pinchan
-
ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందించిన వలంటీర్
సాక్షి,సింహాద్రిపురం(కడప): మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీకి చెందిన వలంటీర్ గర్భవతి అయిన రాజకుమారి పులివెందుల ఆసుపత్రిలో ఉన్న చర్మ కళాకారుడికి పింఛన్ అందించారు. పింఛన్ లబ్ధిదారుడు వెంకటేష్ వారం నుంచి పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది గమనించిన వలంటర్ రాజకుమారి పులివెందుల ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పింఛన్ అందించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను అభినందించారు. మరో ఘటన.. అభివృద్ధి పరిశీలన పులివెందుల టౌన్: పులివెందులలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని రోటరీపురంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. 10ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తు¯న్న ఏపీటీపీ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. హౌసింగ్ లేఔట్ల పరిశీలన పులివెందుల పట్టణంలోని జగనన్న హౌసింగ్ లే ఔట్లను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. భాకరాపురం, వెలమవారిపల్లె సచివాలయాలను పరిశీలించారు. చదవండి: సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు.. -
ఎవడబ్బ సొమ్మని.. బెదిరిస్తున్నారు
ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తీరాలన్న తాపత్రయంతో టీడీపీ వర్గాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. తాజాగా పింఛన్లు తీసుకుంటున్న పింఛన్‌దారులను టీడీపీకి ఓటు వేయకుంటే పింఛన్లు ఆగిపోతాయని బెదిరిస్తున్నారు. పింఛన్ల పంపిణీ చేస్తున్న అధికారులు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరి స్తున్నారు. కొన్నిచోట్ల టీడీపీకి అనుకూలంగా ఉన్న సిబ్బందికి పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఈ వ్యవహారాన్ని నిలదీసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదేమి చోద్యమంటూ పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, రాజానగరం: ‘టీడీపీకి ఓటు వేయకుంటే పింఛ ను రాద’ంటూ కొంతమం ది ప్రభుత్వోద్యోగులు సామాజిక పింఛన్ల బట్వా డాలో వృద్ధులు, దివ్యాం గులు, వితంతవులను బెదిరిస్తున్నారని వైఎస్సా ర్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. ఎవడబ్బ సొమ్ముని ఇలా బెదిరిస్తున్నారు? అవేమైనా మీ జేబులో సొమ్ములా? లేక చంద్రబాబు జేబులోంచి ఇస్తున్నారా? అంటూ పింఛన్లు బట్వాడా చేస్తున్న ఉద్యోగులను నిలదీశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జి. యర్రంపాలెంలో కొంతమంది పింఛనుదార్ల పాస్‌బుక్‌లు తీసుకుంటున్నారని తెలియడంతో మంగళవారం ఆమె అక్కడకు చేరుకున్నారు. టీడీపీకి చెందిన వారైతే వారి నుంచి పాస్‌బుక్‌లు తీసుకోకుండా, ఇతరుల నుంచే పాస్‌బుక్‌లు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఓటు వేయకపోతే పింఛను రాదని బెదిరించడమేమిటని వారిని ఆమె ప్రశ్నించారు. పంచాయతీలో కుళాయి నీటిని విడుదల చేసే వ్యక్తితో పింఛన్లు పంపిణీ చేయించడమే కాకుండా ఇలా ప్రచారం చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పంచాయతీ కార్యదర్శి, ఇతర ఉద్యోగులు.. ఉన్నతాధికారులు చెప్పినట్టుగా చేస్తున్నామంటూ నీళ్లు నమలారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని జక్కంపూడి చెప్పారు. సీతానగరం మండలం, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, ఇనుగంటివారిపేట, ముగ్గళ్ల, కొండేపూడిలలో కూడా సిబ్బంది సామాజిక పింఛనుదార్లను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.చంద్రబాబు తరపున ప్రచారం చేస్తున్న వారికి పింఛన్ల పంపిణీ బాధ్యతలు ఎలా అప్పగించారని అధికారులను నిలదీశారు. ఈ విషయంపై రాజానగరం ఎంపీడీఓ ఎ.రాధాకృష్ణ మాట్లాడుతూ పాస్‌బుక్‌లు తీసుకోమని తాను ఎవరికీ చెప్పలేదన్నారు. మండలంలోని ఇతర పంచాయతీ అధికారులను పిలిచి, పింఛన్ల పంపిణీని సక్రమంగా చేయమని ఆదేశించామన్నారు. ఎవరి నుంచి పాస్‌బుక్‌లు తీసుకోవడానికి వీలు లేదని చెప్పామన్నారు. రంపచోడవరం: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శులు బెదిరించి వారి పెన్షన్ పుస్తకాలు స్వాధీనం చేసుకోవడంపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పండా రామకృష్ణ, పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర రంపచోడవరం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయానికి వారు వెళ్లి పింఛనుదారుల పుస్తకాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నారని పంచాయతీ కార్యదర్శి మూర్తిని నిలదీశారు. వాట్సాఫ్ గ్రూపులో మెసేజ్ ఆధారంగా పింఛనుదారుల పుస్తకాలు ఎలా స్వాదీనం చేసుకుంటారని ప్రశ్నించారు. మండలం మొత్తం కార్యదర్శులు పింఛనుదారుల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారని ఆర్ఓకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికి వేశారో మిషన్‌లో తెలిసిపోతుందని, టీడీపీకి ఓటు వేస్తే పెన్షన్ వస్తుందని, వేరే పార్టీకి వేస్తే పెన్షన్ రద్దు అవుతుందని బెదిరించారని నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. రంపచోడవరం గ్రామంలో గొట్టాలరేవుకు చెందిన చవలం లక్ష్మి పింఛన్ పుస్తకాన్ని పంచాయతీ సిబ్బంది తీసుకున్నారని ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేస్తే నీ పెన్షన్ ఇంతకు ముందులాగే వస్తుందని, ప్యాన్ గుర్తుకు ఓటు వేస్తే పెన్షన్ రాదని ఆమెను వారు బెదిరించారన్నారు. మిగిలిన పెన్షన్‌దారుల పుస్తకాలతో పాటు తన పుస్తకాన్ని తిరిగి ఇప్పించాలనినామె ఫిర్యాదులో కోరారు. డీసీసీబి డైరెక్టర్ చాకలి నాగేశ్వరరావు, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగా తమన్న కుమార్, జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాంజనేయులు, యూత్ అధ్యక్షుడు రాపాక సుధీర్, బొబ్బ శేఖర్, వీఎం కన్నబాబు,మాజీ సర్పంచులు మంగా బొజ్జయ్య, చిట్టెమ్మ,లక్ష్మి, పండా నాగన్నదొర తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారుల్లో ‘పింఛన్’ టెన్షన్
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్.. ఆసరా పింఛన్ పథకాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్‌కు వయస్సును 57 ఏళ్లకు కుదిస్తామని ప్రకటించారు. కొత్త ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. కానీ ఏప్రిల్ నెల సమీపిస్తున్నప్పటికి అధికారులు అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా ఉండటంతో ఎన్నికల కోడ్ తో జాప్యమవుతుందని పేదలు నిరాశకు గురవుతున్నారు. పెరిగిన పింఛన్ వస్తుందో లేదోనని అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన పింఛన్‌ను త్వరగా వర్తింపజేయాలనిలబ్ధిదారులు కోరుతున్నారు. మండలంలో 10 వేల మంది లబ్ధిదారులు.. మండలంలో 19 గ్రామాలలో అన్ని రకాల పింఛన్లు పొందుతున్న 4,982 మంది లబ్దిపొందుతున్నారు. అయితే పింఛన్ డబ్బులను రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో కొత్త విధానంలో పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల హడావుడి ఉండటంతో పెరిగిన పింఛన్ డబ్బులు మంజూరయ్యేందుకు మరింత జాప్యం జరుగుతుందేమోనని లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. 57 ఏళ్లకు కుదింపుతో 2,393 మందికి లబ్ధి ఆసరా పింఛన్‌కు కొత్తగా కనీస వయస్సు అర్హతను 57 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ నిబంధనతో మండలంలోని 19 గ్రామాల్లో కొత్తగా 2,393 మందికి లబ్ధి చేకూరనుంది. 57 ఏళ్లకు పైబడినవారు సుమారు 11,341 మంది ఉన్నారు. 57 ఏళ్ల నిబంధన సైతం ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇవ్వడంతో ఆశావహులు ఏప్రిల్ నెల ఎప్పుడు వస్తుందా అంటూ ఆతృతగా ఎదిరిచూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి కొత్త పింఛన్ ప్రక్రియను త్వరగా అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నెలల తరబడి జాప్యం వద్దు ఆసరా పింఛన్ 57 ఏళ్లకే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో పేదల్లో సంతోషం వ్యక్తమైంది. ఎప్పుడు వస్తాయోనని నెలల తరబడి ఎదిరిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఆసరా పింఛన్ డబ్బులను రెట్టింపు చేసి మంజూరు చేయాలి. 57 ఏళ్లున్న వారికి త్వరగా పింఛను మంజూరు చేయాలి. – ఎం.డీ సత్తార్, గంభీర్పూర్ ప్రతి నెల ఒకటో తేదీన అందించాలి ఆసరా పింఛన్ డబ్బులు ప్రతి నెల ఒకటో తేదిన అందించాలి. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో తెలియని పరిస్థితులున్నాయి. డబ్బులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులపాలువుతున్నారు. ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ప్రతి నెల ఒకటో తేదిన పింఛన్ డబ్బులు మంజూరు చేయాలి. – గుగ్లొత్ రవినాయక్, దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఆదేశాలు రాగానే అమలు ఆసరా పింఛన్ డబ్బులను పెంచడంతోపాటు 57 ఏళ్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. గతంలో మంజూరైన పింఛన్లు యథావిధిగా లబ్ధిదారులకు అందుతున్నాయి. కొత్త విధానం అమలు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుంది. – కట్కం ప్రభు, ఎంపీడీవో, కథలాపూర్ -
పింఛన్ కోసం లైన్లో నిల్చుని ప్రాణాలు విడిచిన వృద్ధుడు
-
పింఛన్లకు కోత!
* సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు * వేలిముద్రలు, కంటిచూపు మ్యాచ్ అయితేనే చెల్లించాలని ఉత్తర్వులు * ఆధార్ ఆధారమే కాదంటూ నిర్ణయం తీసుకున్న పాలకులు * ఆందోళనలో లబ్ధిదారులు చిలకలూరిపేట రూరల్ : ఎన్టీఆర్ భరోసా పేరుతో అర్హులకు అందించే పింఛన్లలో కోతలు విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆధార్ కార్డుల ఆధారంగా ఇస్తున్న పింఛన్లను తగ్గించే ప్రయత్నాలకు తెరలేపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న సీఎం కార్యాలయం నుంచి సీఎంపీ నంబర్ 2809– జేఎస్–2016తో ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్న సెర్ప్ సీఈవో పి.కృష్ణమోహన్ జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ల అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు పంపారు. దీనివల్ల వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లకు కోత పడనుంది. ఇప్పటివరకు ఇలా... జిల్లా వ్యాప్తంగా 57 మండలాలు, 12 పురపాలక సంఘాలు, ఒక కార్పొరేషన్లో 63,616 మంది లబ్ధిదారులు రూ.7 కోట్ల 2 లక్షల 73 వేల 500 పింఛను పొందుతున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు, కంటిచూపు (ఐరిష్) ట్యాబ్‌లకు అనుసంధానం కాకపోవటంతో పింఛను పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు వారి వేలిముద్రలు సేకరించి, ఆధార్ కార్డుల నంబర్లను నమోదు చేసుకుని సొమ్ము అందజేస్తున్నారు. ప్రస్తుత ఆదేశాల్లో ఈ నెల నుంచి తప్పనిసరిగా వేలిముద్రలు, ఐరిష్‌లు వేయించాలని పేర్కొన్నారు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. మండిపడుతున్న ఉద్యోగులు... లబ్ధిదారులందరికీ పింఛను అందిస్తున్నామని, వృద్ధుల్లో చేతి వేలిముద్రలు, కంటిచూపు కోల్పోయిన వారికి మాత్రమే తమ వేలిముద్రలు వేసి వారి ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ట్యాబ్ ఆమోదించేవరకు పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని, అలాగైతే గంటలతరబడి వేలాదిమంది ప్రజలు నిరీక్షించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి వాస్తవాలను గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఇలాగైతే సమస్యలే.. వృద్ధుల వేలిముద్రలను ట్యాబ్ ఆమోదిస్తేనే పింఛను చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తే వేలాది మంది ఇబ్బందులు పడతారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజలు తమను నిలదీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే సక్రమంగా పింఛను అందక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఇకపై కొత్త నిబంధనలతో మరింత కష్టాల్లో పడతామని ఆందోళన చెందుతున్నారు. దీనిపై చిలకలూరిపేట ఎంపీడీవో వి.వసంతలక్ష్మిని వివరణ కోరగా, పింఛన్ల పంపిణీ త్వరగా ముగించేందుకు సిబ్బంది వారి వేలిముద్రలే ఎక్కువగా వేస్తున్నారని తెలిపారు. అర్హులు ఉన్నప్పటికీ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారని చెప్పారు. వీటిని నియంత్రించేందుకే ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుందని వివరించారు. -
కౌన్సిలర్ భర్తకు ‘ఆసరా’ !
చనిపోయిన వ్యక్తి పేరుతో చెల్లింపు సిరిసిల్లలో ఆలస్యంగా వెలుగుచూసిన వైనం నోటీస్ జారీ చేశాం : మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకం లక్ష్యం నీరుగారుతోంది. వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి స్త్రీలు, ఆర్థికంగా నిరుపేదలు పొందాల్సి ఆసరా పింఛన్ సిరిసిల్లలో ఓ కౌన్సిలర్ భర్త పొందుతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరిట మంజూరైన డబ్బులు సదరు వ్యక్తి ఖాతాలో జమ అవుతున్నాయి. ఎనిమిది నెలలుగా ఈ తంతుసాగుతున్న అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు బుధవారం వెలుగులోకి వచ్చింది. బాలయ్య పింఛన్ సత్తయ్యకు స్థానిక సాయినగర్‌కు చెందిన వేముల బాలయ్యకు 23062 ద్వారా ఆసరా పింఛన్ వచ్చేది. బాలయ్య 2015, డిసెంబరు 16న మరణించాడు. చనిపోయిన బాలయ్య పేరిట వస్తున్న ‘ఆసరా’ డబ్బులు మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కుల్ల నిర్మల భర్త కుల్ల సత్తయ్య బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. బాలయ్య చనిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆయన పేరిట ప్రతీ నెల పింఛన్ మంజూరవుతూనే ఉంది. బాలయ్య పింఛన్ నంబరుపై కుల్ల సత్తయ్య ఆధార్ నంబరు నమోదైంది. దీంతో ఎనిమిది నెలలుగా పింఛన్ డబ్బులు సత్తయ్య ఖాతాలో చేరుతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్వాకం ఆసరా పింఛన్లను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేశారు. కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పింఛన్లను నమోదు చేసిన మున్సిపల్ అధికారులు బాలయ్య పేరిట ఉన్న ఆసరా ఖాతాకు కుల్ల సత్తయ్య బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌నంబర్‌ను ఎలా అనుసంధానం చేశారనేది అంతుచిక్కని ప్రశ్న. మున్సిపల్ అధికారులు కళ్లు మూసుకుని కౌన్సిలర్ భర్త ఖాతాకు జమ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయమై కౌన్సిలర్ భర్త కుల్ల సత్తయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా తనకు తెలియకుండానే ఖాతాలో డబ్బులు జమయ్యాయన్నారు. ఇది ఎవరో కావాలని చేశారని, తిరిగి మున్సిపల్‌కు చెల్లిస్తానని వివరణ ఇచ్చారు. రికవరీకి నోటీసు జారీ చేశాం – బి.సుమన్‌రావు, కమిషనర్ ఎనిమిది నెలలుగా బాలయ్య పేరిట మంజూరైన డబ్బులు సత్తయ్య ఖాతాకు చేరాయి. పింఛన్ డబ్బుల రికవరీకి సత్తయ్యకు నోటీసు జారీ చేశాం. ఆన్లైన్లో నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌కు మెమో ఇచ్చాం. ఈ పొరపాటు ఎలా జరిగిందో విచారణ చేపడుతున్నాం. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో ఆరా తీస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
రూ.1.36 లక్షల పింఛన్లు స్వాహా
నిండ్ర: వుండలంలో పింఛన్ల పంపిణీ పరంగా రూ.1.36 లక్షలు స్వాహా చేసినట్లు వెల్లడైందని, దీనికి బాధ్యులైన పంచాయతీ కార్యదర్శులు, పోస్టల్ సిబ్బందిపై చర్యలు తప్పవని ఉపాధి ఏపీడీ ఉమాశంకర్ వెల్లడించారు. వుండలంలో కోటి 90 లక్షల రూపాయుల ఉపాధి పనుల పై నిర్వహించిన 8వ విడత సావూజిక తనిఖీకి సంబంధించి గురువారం ప్రజావేదిక నిర్వహించారు. ఏపీడీ మాట్లాడుతూ, 2014 నుంచి 2015 వరకు వుండలంలోని వివిధ పంచాయతీల్లో పంపిణీ చేసిన పింఛన్లను పరిశీలించినప్పుడు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. తనిఖీలో తేలిన అంశాలను వివరించారు. కోప్పెడు, వేదాంతపురం, కావునూరు, అగరంలో జాబ్ కార్డులు వుంజూరు చేయూలని ఆదేశించారు. ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఎంతెంత రికవరీ చేయాలో తెలిపారు. ఎంపీపీ వసంతవ్ము, జెడ్పీటీసీ సభ్యురాలు వూలతి, ఎంపీడీవో మోహన్వర్మ, ఏపీవో చంద్రశేఖర్‌రాజు, ఏపీడీ రవిశంకర్, సర్పంచులు అనిల్‌కువూర్, దీప, సత్యరాజ్, నారాయుణస్వామినాయుుడు తదితరులు పాల్గొన్నారు. -
చిరుద్యోగులకూ మే 24నే వేతనాలు
హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో మే నెల జీతాలు, పింఛన్లను అదే నెల 24వ తేదీన చెల్లించేయాలని నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ తాజాగా ఇప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, హోంగార్డుల వేతనాలను కూడా మే 24వ తేదీనే చెల్లించేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేసి చిరుద్యోగులను వదిలేస్తే అన్యాయం అవుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒకటీ రెండురోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.54,598 మంది కాంట్రాక్టు, 12,882 మంది వర్క్ చార్జ్డ్, 36,952 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 21,050 ఎన్‌ఎంఆర్‌లు, 2,59,368 మంది హోంగార్డులు కలిపి మొత్తం 3.84 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలను పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరికి మే నెల వేతనాలను చెల్లించకపోతే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఆ నెల వేతనాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనే సమస్య ఉత్పన్నమవుతుందని, దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆర్థిక శాఖ పై నిర్ణయం తీసుకుంది. ఇలావుండగా.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల సంబంధిత బిల్లులను మే 17వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. మిగతా అన్ని రకాల బిల్లుల సమర్పణకు కూడా మే 15 చివరితేదీగా ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
దారి చూపిస్తారని వస్తే.
‘పింఛన్ రావడం లేదు.. ఇంటి స్థలం లేదు.. పూట గడవాలంటే కష్టంగా ఉంది.. ఎలాగైనా మీరే దారి చూపించాల’ని జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకోవడానికి కదిరి నుంచి వచ్చిన ఎనిమిది మంది అంధులకు నిరాశే ఎదురైంది. సోమవారం గ్రీవెన్స్ ఉంటుందని వారు ఓ బాలిక సహాయంతో అనంతపురం వచ్చారు. అయితే వీఆర్ఓ, వీఆర్ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉండడంతో గ్రీవెన్స్‌ను రద్దు చేశారనే విషయం తెలుసుకుని జేసీ సత్యనారాయణను కలిశారు. కదిరి ఆర్డీఓను కలవాలని ఆయన సూచించారని వికలాంగులు తిరుపాలు, వెంకటరాముడు, భద్రి, సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ తిరుగుముఖం పట్టారు. -
పించన్లు అందక లబ్దిదారుల ఇక్కట్లు
-
పండుటాకుల పింఛన్ గోస
తాండూరు, న్యూస్‌లైన్: పేద వృద్ధులకు భరోసా.. పింఛన్. చాలా మంది నెలవారీ ఖర్చులకు దానిపైనే ఆధారపడతారు. బీపీ, షుగర్ మాత్రలు వాటితోనే కొనుక్కుంటారు. ఉన్నట్టుండి అది ఆగిపోవడంతో వృద్ధులు కలవరానికి గురవుతున్నారు. మా పింఛన్ ఎందుకు తీసేశారంటూ నిలదీసేందుకు వారంతా బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయానికి వెల్లువలా వచ్చారు. పింఛన్లు కావాలంటే ధ్రువపత్రాలు సమర్పించాలని మెలిక పెట్టడమే ఈ గందరగోళానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతినెలా సుమారు 5,804 మంది పింఛన్ తీసుకుంటారు. అందులో 3,553 మంది వృద్ధులు కాగా 461 వికలాంగులు. మరో 1,790 వితంతు పింఛన్లు కూడా ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నెల రూ.12లక్షలు పింఛన్ల రూపంలో పంపిణీ అయ్యేవి. అయితే ఈ 5,804 మంది పింఛన్‌దారుల్లో ప్రస్తుతం 1,600మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నాయి. ఇక మిగిలిన 4,204 మంది పింఛన్లకు బ్రేక్ పడింది. ‘లింకు’లే ముంచాయా? పింఛన్‌దారుల పూర్తి వివరాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డుతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలని డీఆర్డీఏ పెట్టిన మెలిక కారణంగా మున్సిపాలిటీలో చాలా మంది వృద్ధుల పింఛన్లకు కోత పడింది. నెలలుగా బ్యాంకులు, మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు రేపుమాపు.. అని కాలయాపన చేయడంతో మూడు నెలలుగా పింఛన్లు రావడం లేదని వృద్ధులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కార్యాలయంలో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ క్యాంపులో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇతర ఆధారాలను సమర్పించిన వారికి కూడా పింఛన్లు నిలిచిపోయాయి. చాలా మంది వికలాంగులు తమకు ఎందుకు పింఛన్లు నిలిచిపోయాయో తెలుసుకునేందుకు బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. నిలబడే ఓపిక లేక వృద్ధులు, నడిచే వీలులేక వికలాంగులు కార్యాలయం బయట అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నెలనెలా వచ్చే రూ.200 పింఛనే ఆధారమని, అది కూడా తీసేస్తే ఎలా బతికేదని తుల్జమ్మ అనే వృద్ధురాలు వాపోయింది. -
పింఛన్ 1500కు పెంచాలి వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు
సూర్యాపేటటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పింఛన్‌ను 500 నుంచి 1500కు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటు రథయాత్ర శుక్రవారం సూర్యాపేటకు చేరుకున్నది. ఈ సందర్భంగా స్థానిక గాంధీ పార్కులో రథయాత్ర సభ నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వర్తింపజేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదింప చేయాలన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్‌కు తీర్మానం చేసి పార్లమెంటుకు సిఫారసు చేయాలని చెప్పారు. వికలాంగుల అత్యాచార, అవమాన నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్నారు. అర్హులైన వికలాంగులకు ఉచిత విద్యుత్, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం రాష్ట్రంలోని వికలాంగులైన కళాకారులు, క్రీడాకారులను గుర్తించి జాతీయ పోటీలకు ప్రోత్సహించాలన్నారు. వికలాంగులకు అంత్యోదయ కార్డులు, సదరన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న సీఎం ఇల్లు ముట్టడి చేస్తున్నట్టు తెలిపారు. సంఘం జిల్లా నాయకుడు చింత సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా ఇన్చార్జి లింగాల పెద్దన్న, అధ్యక్షుడు గడ్డం ఖాసీం, చింతల సైదులు, ఎర్ర వీరస్వామి, భూతం లింగయ్య, గరిగంటి రజిత, గిద్దె రాజేష్, విజయరావు, కుంచం సైదమ్మ, ఎండీ.జహీర్‌బాబా, కలింగరెడ్డి, నాగయ్య, కొరివి సైదులు, జలేందర్, నాగేశ్వర్రావు, పేర్ల సోమయ్య, వెంకన్న, భిక్షపతి, సైదులు పాల్గొన్నారు. -
వికలాంగులపై దయచూపని సర్కార్
సాక్షి, సంగారెడ్డి: వికలాంగులకు ప్రభుత్వం చేయూత కరువైంది. వారి సమస్యలను ఎలాగూ పరిష్కరించలేకపోయినా కనీసం పింఛన్లు కూడా అందించలేకపోతోంది ఈ ప్రభుత్వం. తమ శరీరం సహకరించకపోయినప్పటికీ వికలాంగులు అష్టకష్టాలు పడుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. జిల్లా నలుమూలల నుంచి ఎంతోమంది వికలాంగులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ వరకు వచ్చి గ్రీవెన్స్ సెల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా వారికి న్యాయం జరగడం లేదు. పింఛన్ల కోసం సమర్పించే వినతులు స్వీకరిస్తున్న అధికారులు దానిపై ‘వెరిఫై’ అని గ్రీన్ ఇంకుతో రాసి మరో అధికారికి ఇస్తున్నారు. అక్కడే ఉండే ఓ క్లర్కు అప్పటికే కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ దరఖాస్తుల కింద ఆ కాగితాన్ని చొప్పిస్తాడు. ‘ఇక మీరొచ్చిన పని అయిపోయింది బయటకు పదండి’ అని అక్కడే ఉంటే అటెండర్ చెబుతాడు. ఇంకేముంది వచ్చిన దారిలో ఇంటిముఖం పట్టడం తప్ప వికలాంగులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటి దృశ్యాలు ప్రతి సోమవారం కలెక్టరేట్లో కన్పిస్తుంటాయి. వందల మంది బాధితుల గోసను నిత్యం ప్రత్యక్షంగా చూసే జిల్లా అధికారులకు మాత్రం ఇది సర్వ సాధారణ అంశం. ఏది ఏమైనా.. దాదాపు రెండేళ్ల తర్వాత పింఛన్ల దరఖాస్తులకు మోక్షం కల్పించిన సర్కారు వికలాంగులకు మాత్రం ముష్టి విదిల్చింది. తాజాగా ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడంతో సెప్టెంబర్ నుంచి జిల్లాలో 30,206 మందికి కొత్తగా పింఛన్లు అందనున్నాయి. ఇందులో 214 వికలాంగులు, 17,283 వృద్ధాప్య, 12,239 వితంతు, 381 చేనేత, 89 కళ్లు గీత కార్మికులకు సంబధించిన పింఛన్లు ఉన్నాయి. ఇందులో వికలాంగులకు కేవలం 214 పింఛన్లు మాత్రమే మంజూరు కావడం చూస్తుంటే ప్రభుత్వం వారికి ఏ మేరకు ఆసరాగా ఉందో అర్థమవుతుంది. రచ్చబండ-2లో వికలాంగ పింఛన్ల కోసం 1,867 దరఖాస్తులు వస్తే విచారణ అనంతరం 1,128 మంది అర్హులని అధికారులు నిర్ధారించారు. రచ్చబండ కాకుండా మిగతా రోజుల్లో ఇంకా వేలాది దరఖాస్తులు వచ్చాయి. సరైన వైకల్య ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు లేకపోవడంతో మిగిలిన దరఖాస్తుదారులకు పింఛన్లు మంజూరు కాలేదని డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. మండల కార్యాలయాల నుంచే నేరుగా దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారని, రేషన్‌కార్డు నంబరును అప్లోడ్ చేయకపోయినా పింఛన్ మంజూరయ్యే అవకాశాలు లేవన్నారు. ఇలాంటి కేసులుంటే రేషన్‌కార్డు నంబర్లను మళ్లీ అప్లోడ్ చేస్తే బాధితులకు పింఛన్లను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. కొంప ముంచుతున్న సాఫ్ట్వేర్.. వైకల్య నిర్ధారణ కోసం ప్రభుత్వం రెండేళ్ల క్రితం ‘సదెరెమ్’ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా వికలాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రతి నెలా మూడో మంగళ, బుధవారాల్లో ఈ ధ్రువ పత్రాలు జారీ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా వైకల్యం శాతానికి అనుగుణంగా ఈ ధ్రువీకరణ పత్రాలిస్తున్నారు. సాఫ్ట్వేర్ గుర్తించలేని వివిధ రకాల తీవ్ర వైకల్యాలతో బాధపడుతున్న వారికి ఈ ప్రక్రియ ప్రతిబంధకంగా మారింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా వైకల్యాన్ని తక్కువగా చూపుతూ పత్రాలు జారీ చేస్తున్నారు. 50 శాతం వైకల్యం కలిగి ఉంటేనే పింఛన్లకు అర్హులనే నిబంధన ఉండడంతో బాధితులు పింఛన్లకు అర్హత సాధించలేకపోతున్నారు.