సూర్యాపేటటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పింఛన్‌ను 500 నుంచి 1500కు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటు రథయాత్ర శుక్రవారం సూర్యాపేటకు చేరుకున్నది. ఈ సందర్భంగా స్థానిక గాంధీ పార్కులో రథయాత్ర సభ నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వర్తింపజేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదింప చేయాలన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్‌కు తీర్మానం చేసి పార్లమెంటుకు సిఫారసు చేయాలని చెప్పారు. వికలాంగుల అత్యాచార, అవమాన నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్నారు. అర్హులైన వికలాంగులకు ఉచిత విద్యుత్, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని వికలాంగులైన కళాకారులు, క్రీడాకారులను గుర్తించి జాతీయ పోటీలకు ప్రోత్సహించాలన్నారు. వికలాంగులకు అంత్యోదయ కార్డులు, సదరన్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న సీఎం ఇల్లు ముట్టడి చేస్తున్నట్టు తెలిపారు. సంఘం జిల్లా నాయకుడు చింత సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి లింగాల పెద్దన్న, అధ్యక్షుడు గడ్డం ఖాసీం, చింతల సైదులు, ఎర్ర వీరస్వామి, భూతం లింగయ్య, గరిగంటి రజిత, గిద్దె రాజేష్, విజయరావు, కుంచం సైదమ్మ, ఎండీ.జహీర్‌బాబా, కలింగరెడ్డి, నాగయ్య, కొరివి సైదులు, జలేందర్, నాగేశ్వర్‌రావు, పేర్ల సోమయ్య, వెంకన్న, భిక్షపతి, సైదులు పాల్గొన్నారు.
పింఛన్ 1500కు పెంచాలి వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు
Published Sat, Aug 24 2013 3:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement