
సాక్షి,సింహాద్రిపురం(కడప): మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీకి చెందిన వలంటీర్ గర్భవతి అయిన రాజకుమారి పులివెందుల ఆసుపత్రిలో ఉన్న చర్మ కళాకారుడికి పింఛన్ అందించారు. పింఛన్ లబ్ధిదారుడు వెంకటేష్ వారం నుంచి పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది గమనించిన వలంటర్ రాజకుమారి పులివెందుల ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పింఛన్ అందించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను అభినందించారు.
మరో ఘటన..
అభివృద్ధి పరిశీలన
పులివెందుల టౌన్: పులివెందులలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని రోటరీపురంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. 10ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తు¯న్న ఏపీటీపీ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళీధర్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
హౌసింగ్ లేఔట్ల పరిశీలన
పులివెందుల పట్టణంలోని జగనన్న హౌసింగ్ లే ఔట్లను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. భాకరాపురం, వెలమవారిపల్లె సచివాలయాలను పరిశీలించారు.
చదవండి: సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు..
Comments
Please login to add a commentAdd a comment