నిండ్ర: వుండలంలో పింఛన్ల పంపిణీ పరంగా రూ.1.36 లక్షలు స్వాహా చేసినట్లు వెల్లడైందని, దీనికి బాధ్యులైన పంచాయతీ కార్యదర్శులు, పోస్టల్ సిబ్బందిపై చర్యలు తప్పవని ఉపాధి ఏపీడీ ఉమాశంకర్ వెల్లడించారు. వుండలంలో కోటి 90 లక్షల రూపాయుల ఉపాధి పనుల పై నిర్వహించిన 8వ విడత సావూజిక తనిఖీకి సంబంధించి గురువారం ప్రజావేదిక నిర్వహించారు.
ఏపీడీ మాట్లాడుతూ, 2014 నుంచి 2015 వరకు వుండలంలోని వివిధ పంచాయతీల్లో పంపిణీ చేసిన పింఛన్లను పరిశీలించినప్పుడు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. తనిఖీలో తేలిన అంశాలను వివరించారు. కోప్పెడు, వేదాంతపురం, కావునూరు, అగరంలో జాబ్ కార్డులు వుంజూరు చేయూలని ఆదేశించారు. ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఎంతెంత రికవరీ చేయాలో తెలిపారు. ఎంపీపీ వసంతవ్ము, జెడ్పీటీసీ సభ్యురాలు వూలతి, ఎంపీడీవో మోహన్‌వర్మ, ఏపీవో చంద్రశేఖర్‌రాజు, ఏపీడీ రవిశంకర్, సర్పంచులు అనిల్‌కువూర్, దీప, సత్యరాజ్, నారాయుణస్వామినాయుుడు తదితరులు పాల్గొన్నారు.
రూ.1.36 లక్షల పింఛన్లు స్వాహా
Published Fri, Nov 6 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement