ఫ్లోరిడా : పర్యాటకుడిపై కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడన్న ఆరోపణలతో ఓ దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేతులు లేకున్నా ఆ స్థానికుడు ఆవేశంతో ఎందుకు చెలరేగిపోయాడని పోలీసులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మియామీ బీచ్ పోలీసుల కథనం ప్రకారం.. జోనాథన్ క్రెన్షా(46) మియామీ బీచ్ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి రెండు చేతులు లేవు. అతడు బీచ్ దక్షిణ ప్రాంతంలో పెయింటింగ్స్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం చికాగోకు చెందిన పర్యాటకుడు సీజర్ కోరొనాడో తన స్నేహితుడితో కలిసి క్రెన్షా వద్దకు రాగా ఏదో గొడవ మొదలైంది. క్షణికావేశానికి లోనైన క్రెన్షా.. సీజర్ తలపై కత్తెరతో రెండుసార్లు పొడిచి దాడికి పాల్పడ్డాడు. సీజర్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా నిందితుడు క్రెన్షా పరారయ్యాడు.
బాధితుడి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో క్రెన్షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్రెన్షా మాట్లాడుతూ.. సీజర్ తన స్నేహితుడితో కలిపి నా వద్దకు వచ్చాడు. నా తలపై కొట్టడంతో కింద పడిపోయానని చెప్పాడు. బాధితుడు క్రెన్షా మిత్రుడు మాత్రం క్రెన్షా చెప్పింది అబద్దమని ఆరోపించాడు. బీచ్‌లో ఉన్న క్రెన్షాను ఓ అడ్రస్ వివరాలు అడగగా.. అతడు కాళ్లకు కత్తెరతో సీజర్ తల, చేతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై చికిత్స నిమిత్తం సీజర్‌ను ఆస్పత్రికి తరలించామని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment