Pahalgam: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి | Terrorist Attack In jammu kashmir Pahalgam | Sakshi
Sakshi News home page

Pahalgam: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి

Published Tue, Apr 22 2025 5:19 PM | Last Updated on Tue, Apr 22 2025 8:50 PM

Terrorist Attack In jammu kashmir Pahalgam

జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహెల్‌ గామ్‌లో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల దాడిలో 27మంది టూరిస్టులు మరణించారు. పదిమందికిపై టూరిస్ట్‌లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

సమ్మర్‌ సీజన్‌ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరీన్‌ వ్యాలీ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. అయితే, ఈ బైసరీన్‌ వ్యాలీని సందర్శించాలంటే కాలినడకన లేదంటే గుర్రాలమీద చేరాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా భావించిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు.

 

భారత ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. పెహల్‌ గామ్‌లో ట్రెక్కింగ్‌ టూర్‌కు వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులను చెక్‌ చేశారు.మతం అడిగి తెలుసుకున్నారు. ముస్లింలు కాని వారిని పక్కన నిలబెట్టి కాల్పులు జరిపారు.పేరు, మతం అడిగి తన భర్తపై కాల్పులు జరిపారని ఓ బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ముష్కరులపై ఎదురుదాడికి దిగాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించాయి.టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. భారీగా బద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. ఈ దాడులు జరిగిన కొద్ది సేపటికే.. పర్యాటకులపై దాడి చేసింది తామేనని టీఆర్‌ఎఫ్‌ సంస్థ ప్రకటించింది.

 

ప్రధాని మోదీ ఆరా
కాల్పుల ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని దుబాయ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఖండించారు. కాల్పుల ఘటనపై అమిత్‌షాతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లోనే పరిస్థితులను అమిత్‌షా వివరించారు. అయితే  ఘటనాస్థలికి వెళ్లాలని అమిత్‌షాకు సూచించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో అమిత్‌షా హుటాహుటీన కాశ్మీర్‌కు బయల్దేరారు.  

న్యాయ స్థానం ముందు నిలబెడతాం
మరోవైపు ఈ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పెట్టే ప్రసక్తిలేదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయ పడిన వారు త్వరగా కోలుకోవాలని నా ఆకాంక్ష. ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం గొప్పది. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయ స్థానంలో నిలబెడతాం’అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

ఇది క్రూరమైన చర్య : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖండించారు. ఇది క్రూరమైన చర్య. అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానిది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.

 

 

 

ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిపై హోంశాఖ అ‍త్యున్నత సమీక్ష నిర్వహించింది.  ఉగ్రవాదుల దాడి నన్ను కలిచి వేసింది. ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. 

 

 

ఉగ్రవాదులను వదిలి పెట్టే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడికి పాల్పడిన దేశ వ్యతిరేక శక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కటై నిలబడుతుందని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement