‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్‌ పౌరులకు కేంద్రం హెచ్చరిక | India Suspends Indus Water Treaty with Pakistan After Pahalgam Terror Attack | Sakshi
Sakshi News home page

Pahalgam: ‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్‌ పౌరులకు కేంద్రం హెచ్చరిక

Published Wed, Apr 23 2025 9:23 PM | Last Updated on Wed, Apr 23 2025 9:46 PM

India Suspends Indus Water Treaty with Pakistan After Pahalgam Terror Attack

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి. పాక్‌ పౌరులను భారత్‌లోకి అనుమంతించేది లేదు. పహల్గాం దాడి వెనుక పాక్‌ హస్తం ఉంది. అందుకు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి’ అని భారత విదేశాంగ కార్యదర్శి  విక్రమ్‌ మిస్రీ స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో రెండున్నర గంటల పాటు భద్రత వ్యవహారాల కేబినేట్‌ కమిటీ (Cabinet Committee on Security) సమావేశం కొనసాగింది. అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. 

👉ఇండస్ వాటర్‌ ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత
1960లో కుదిరిన ఇండస్ వాటర్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భద్రత వ్యవహారాల కేబినేట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేత కొనసాగుతుంది. 

👉అటారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు తక్షణమే మూసివేత
అటారి చెక్‌పోస్టును తక్షణమే మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చట్టబద్ధమైన డాక్యుమెంట్లతో ఆ మార్గం గుండా భారత్‌కు వచ్చిన పాకిస్తానీయులు మే 1వ,2025  తేదీ లోపు తిరిగి వెళ్లాల్సిందేనని ఆదేశించింది.  

👉పాక్‌ పౌరులకు SAARC వీసా మినహాయింపు నిలిపివేత
SAARC Visa Exemption Scheme (SVES) ద్వారా పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ వీసాతో భారత్‌లో ఉన్న వారు 48 గంటల్లో దేశాన్ని విడిచిపెట్టాలని సూచించింది.

👉 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సైనిక సలహాదారులకు 'పర్సోనా నాన్ గ్రాటా'విధింపు 
భారత్‌లో ఉన్న పాక్‌ రక్షణ, నౌకా, వాయుసేన సలహాదారులపై ''persona non grata' విధించింది. ఒక వారంలోగా వారందరూ భారత్ విడిచిపెట్టాలి.

👉  ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ నుంచి సైనిక సలహాదారుల ఉపసంహరణ
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో  పాక్‌లోని ఇస్లామాబాద్ హైకమిషన్ నుండి భారత రక్షణ, నౌకా,వాయుసేన సలహాదారులను ఉపసంహరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement