India
-
యూఎస్.. డబుల్ ఇస్మార్ట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శత్రువు కనిపిస్తే చాలు.. తేరుకునేలోగా మెరుపుదాడి చేసే వార్‌షిప్ ఒకటైతే.. దొంగచాటుగా దెబ్బతీయాలనుకున్న వారిపై దాడి చేసి మట్టుబెట్టే యుద్ధ నౌక ఇంకోటి. వైరి దేశాలపై బరిలో దిగితే వార్ వన్‌సైడ్ అని డిసైడ్ చేసే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ వద్ద మోహరించాయి. కదన రంగంలో ఎంతటి భయంకరంగా శత్రువును భయపెడతాయో.. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందించడంలోనూ అంతే గంభీరంగా వ్యవహరిస్తాయి ఈ వార్‌షిప్స్.వీటిలో ఒకటి అమెరికా నౌకాదళంలో తొలిసారిగా పురుషులు, మహిళా నావికులతో కూడిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45) కాగా.. మరోటి మెరుపు వేగంతో దాడి చేసి మృత్యువును పరిచయం చేసే (స్విఫ్ట్ సైలెంట్ డెడ్లీ) యుద్ధనౌకగా పేరున్న యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ (డీడీజీ–114). ఒక యుద్ధ నౌకలో రాత్రిళ్లు కూడా గ్రెనేడ్లతో దాడి చేసేఅవకాశం ఉన్న లాంచర్లు.. ఏకంగా 8,200 అడుగుల దూరంలోని శత్రువును కూడా మట్టుబెట్టగలిగే సామర్థ్యం ఉన్న రైఫిల్ ఉన్నాయి. మరోదానికి శత్రువుపై 2 సీ హాక్ హెలికాప్టర్ల ద్వారా దాడి చేసే సామర్థ్యం ఉంది. చాటుగా దెబ్బతీసేందుకు శత్రు దేశాలు అమర్చిన మైన్లను గుర్తించి నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉంది. ఇవి భారత్–అమెరికా దేశాల త్రివిధ దళాలతో టైగర్ ట్రయాంఫ్–25 నాలుగో ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ నౌకల విశేషాలను యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ కమాండింగ్ ఆఫీసర్ జాక్ సీజర్, కామ్‌స్టాక్ కమాండింగ్ ఆఫీసర్ బి.స్టాక్స్ వివరించారు. యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45)» జల ప్రవేశం – 1990, ఫిబ్రవరి 3 »తరగతి, రకం – విడ్బీ ఐల్యాండ్–క్లాస్ డాక్ ల్యాండింగ్ షిప్ » బరువు – 16,190 టన్నులు » పొడవు – 609 అడుగులు(186 మీటర్లు) » వెడల్పు – 84 అడుగులు (26 మీటర్లు) »వేగం – 20 నాట్స్ (37 కిమీ/గం) » సిబ్బంది సామర్థ్యం– 450 ఆయుధ సామర్థ్యం 2‘‘25 ఎంఎం, ఎంకే 38 కెనాన్స్, 2‘‘20 ఎంఎం ఫాలాన్కస్ సీఐడబ్ల్యూస్ మౌంట్స్, 6‘‘50 కాలిబర్ ఎంఈహెచ్బీ మెషిన్ గన్స్, 2 రామ్స్ » యూఎస్ఎస్ కామ్‌స్టాక్ యూఎస్ నేవీలో ఒక డాక్ ల్యాండింగ్షిప్ » జలమార్గంలో నిర్దేశిత ప్రాంతాలకు రక్షణ దళాలు, యుద్ధ సామగ్రి తరలింపులో కీలక పాత్ర పోషిస్తోంది. » ఉభయచర కార్యకలాపాల సమయంలో శత్రువులపై గగనతలం నుంచి విరుచుకుపడేందుకు వీలుగా ఈ నౌకపై హెలికాప్టర్ లాంచింగ్ సౌకర్యముంది. » ఈ నౌకలో నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సదుపాయాలతో పాటు మూడు రకాల మెషిన్ గన్లు, రెండు రోలింగ్ ఎయిర్‌ఫ్రేమ్ మిస్సైల్స్ మౌంట్స్ ఉన్నాయి. » పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతికతతో ఈ నౌక యుద్ధ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. » 1992లో సోమాలియాలో ‘ఆపరేషన్ రిస్టోర్ హోప్’ పేరుతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన సహాయ కార్యక్రమంలో పాలుపంచుకుంది. యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ (డీడీజీ–114)» జల ప్రవేశం: 2018, మార్చి 24 » తరగతి, రకం: ఆర్లీగ్ బర్కీ–క్లాస్ డిస్ట్రాయర్ » బరువు–9217 టన్నులు » పొడవు– 513 అడుగులు (156 మీటర్లు) » వెడల్పు– 66 అడుగులు (20 మీటర్లు) » వేగం– 30 నాట్స్ (56 కిమీ/గం) » సిబ్బంది సామర్థ్యం– 300 ఆయుధ సామర్థ్యం » 8 రకాల లైట్, మెషిన్, కాలిబర్ గన్నులు ఉన్నాయి. » ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేందుకు 96 సెల్స్‌తో క్షిపణులు, నాలుగు రకాల టార్పిడోలు, 2 సీహాక్ హెలికాప్టర్లు, డబుల్ హ్యాంగర్, హెలీప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయి. » యూఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ నౌక యుద్ధ క్షేత్రంలో 9 రకాల పోరాట వ్యవస్థలను కలిగి ఉంది. » ఈ నౌకను అమెరికా 7వ నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ 15కు కేటాయించారు. » ఇందులో సమీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐఎంఎండీ)తో పాటు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. » వెర్టికల్ లాంచింగ్ సిస్టం ద్వారా 96 సెల్స్ నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం దీని సొంతం. » అంతర్జాతీయ జలాల్లో యూఎస్ నౌకాదళ శక్తి సామర్థ్యాలు చాటిచెప్పేలా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. » దాడి కోసం శత్రుదేశాలు వ్యూహాత్మకంగా మోహరించిన మైన్లను కనుగొని నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానం ఈ యుద్ధ నౌక సొంతం. » ఏ మాత్రం రాజీలేని, వెనుదిరగని యుద్ధ నౌకగా దీనికి పేరుంది. ఎం–320 గ్రెనైడ్ లాంచర్ యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45) యుద్ధ నౌకలో ఉండే ఎం–320 గ్రెనైడ్ లాంచర్ అన్ని సమయాల్లో శత్రువులపై గ్రెనైడ్లతో దాడికి ఉపయోగిస్తారు. పగటి వేళలోనే కాక తక్కువ కాంతి ఉన్న సమయాలు, రాత్రిళ్లు కూడా ఇది గ్రెనైడ్లతో దాడి చేస్తుంది. ఏకంగా 36.. 40 ఎంఎం గ్రెనైడ్లను ఈ లాంచర్‌తో తీసుకెళ్లే వీలుంది. ప్రధానంగా రాత్రిళ్లు శత్రువులపై దాడికి దీనిని ఉపయోగిస్తారు. కార్ల్ గుస్తఫ్ రైఫిల్ యూఎస్ఎస్ కామ్‌స్టాక్ (ఎల్ఎస్డీ–45) యుద్ధ నౌకలో ఉన్న మరో ముఖ్య ఆయుధం. స్వీడన్ తయారుచేసిన ఈ రైఫిల్‌ను పట్టుకునేందుకు రెండు గ్రిప్ పాయింట్లు ఉన్నాయి. కదులుతున్న వాహనం నుంచి 350–400 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించవచ్చు. నిలబడిన సమయంలో మాత్రం 500 మీటర్ల దూరంలోని లక్ష్యంపై కూడా దాడి చేసే వీలుంటుంది. 8,200 అడుగుల దూరంలోని శత్రువుపై కూడా ఈ రైఫిల్‌లో లేజర్ గైడెడ్ మందుగుండును ఉపయోగించి మట్టుబెట్టొచ్చు. ఒకే వ్యక్తి ఉపయోగించేందుకు వీలుగా కూడా తయారుచేశారు. ఫైర్ చేసే సమయంలో భుజంపై వెనక్కి తన్నే ఒత్తిడి తక్కువగా ఉండడం దీని ప్రత్యేకత. -
యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకు!
భారత్ నుంచి గత ఏడాది 87.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ కాలంలో అమెరికా నుంచి భారత్‌కు అయిన దిగుమతులు 41.8 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అగ్రరాజ్యంతో వ్యాపారంలో మనదే పైచేయి అన్నమాట. యూఎస్‌లో పాగా వేసిన భారత్.. ప్రస్తుత మార్కెట్లలో మరింత చొచ్చుకుపోవడంతోపాటు కొత్త మార్కెట్లకు విస్తరించే సమయం ఆసన్నమైంది.అయితే ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదపడం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల నేపథ్యంలో భారత్ ముందు సవాళ్లు లేకపోలేదు. ఈ సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం యూఎస్ ప్లస్ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ మార్కెట్‌కు నమ్మదగిన ఆకర్షణీయ, ఆర్థిక భాగస్వామిగా అవతరించాలని అంటున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్చూపు భారత్ వైపు.. రిస్క్ ను తగ్గించడానికి లేదా కొత్త మార్కెట్ల కోసం చూస్తున్న గ్లోబల్ కంపెనీలు సుంకం లేని లేదా తక్కువ సుంకం కలిగిన కేంద్రంగా భారత్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అధిక సుంకం కారణంగా భారత్‌కు అతిపెద్ద ప్రయోజనం చేకూరవచ్చని బోరా మల్టీకార్ప్ ఎండీ ప్రశాంత్ బోరా తెలిపారు. అలాగే, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలు భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. వచ్చే 2–3 ఏళ్లలో భారతీయ ఎగుమతిదార్లకు 50 బిలియన్ డాలర్లకుపైగా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా.. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అపార దేశీయ వినియోగం, బలమైన స్వ దేశీ సరఫరా వ్యవస్థ దృష్ట్యా మన దేశం సా పేక్షంగా మంచి స్థానంలో ఉంది. ట్రంప్ సుంకాలు భారత్‌కు అపార అవకాశాలను తేవొచ్చు. పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న దేశాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా మా రడానికి గల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడాని కి వేగంగా అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలి. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ వ్యూహాత్మక స్థానంగా.. ప్రతీకార సుంకాల నేపథ్యంలో కంపెనీలు తమ దృష్టిని భారత్‌పైకి మళ్లించవచ్చు. భారీ, పెరుగుతున్న వినియోగదారుల కేంద్రంగా విదేశీ సంస్థలకు వ్యూహాత్మక స్థా నంగా మన దేశం మారొచ్చు. వివిధ దేశాలకు విస్తరించాలని చూస్తున్న కంపెనీలకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుంది. ప్రపంచ ఎల్రక్టానిక్స్ తయారీదారులకు ప్రాధాన్యత గమ్యస్థానంగా మారే చాన్స్ ఉంది. ఏఐ, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో ఆవిష్కరణ, ఆర్అండ్డీ కేంద్రంగా అవతరించడానికి భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. – డి.విద్యాసాగర్, ఎండీ, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ప్రత్నామ్నాయం లేదు.. జనరిక్ డ్రగ్స్ విషయంలో భారత్‌కు ప్రత్నామ్నాయ దేశం లేదు. టారిఫ్‌లకు సంబంధించి అమెరికాతో బ లంగా చర్చించే స్థానంలో ఉన్నాం. యూఎస్ తన ఆర్థిక బలాన్ని ప్రద ర్శిస్తే.. జనరిక్స్‌లో యూఎస్‌కు అతిపెద్ద సరఫరాదారుగా మన స్థానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే పూర్తిగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇందుకు యూఎస్ ప్లస్ విధానం సరైన పరిష్కారం. – రవి ఉదయ్ భాస్కర్మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్ కొత్త మార్కెట్లకు విస్తరించాలి.. ఇప్పటివరకు వివిధ దేశాలు చైనాపై ఆధారపడకూడదని చైనా ప్లస్ నినాదం అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగుమతుల విషయంలో యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024లో భారత్ నుంచి ఎగుమతులు 5.58 శాతం ఎగిసి 814 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇందులో యూఎస్ వాటా 10.74 శాతం మాత్రమే. అంటే సింహభాగం ఎగుమతులు ఇతర దేశాలకు జరుగుతున్నాయన్న మాట. ఎగుమతుల పరంగా యూఎస్‌పై ఆధారపడటం తగ్గించి కొత్త మార్కెట్లకు విస్తరించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లు అంత మెరుగ్గాలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో దేశాలు నిమగ్నమవుతాయి. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే మార్కెట్‌వైపు దృష్టిసారిస్తాయి. ఈ పరిస్థితిని భారత్ అవకాశంగా మలుచుకోవాలి. దీర్ఘకాలంలో భారత్ తన ఉత్పాదకతను మెరుగుపరచాలి. డిమాండ్ పెంచేందుకు తయారీ ఖర్చులను తగ్గించాలి. భారత్‌లో ఉత్పత్తులు ఖరీదు ఎక్కువన్న భావన తొలగేలా చేయాలి. దీనికోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సూచించింది.2024లో భారత్ –అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ: 129.2 బిలియన్ డాలర్లుభారత్ నుంచి యూఎస్‌కు ఎగుమతులు: 87.4 బిలియన్ డాలర్లు. వృద్ధి 4.5 శాతం యూఎస్ నుంచి భారత్‌కు దిగుమతులు: 41.8 బిలియన్ డాలర్లు. వృద్ధి 3.4 శాతం వాణిజ్య లోటు: 45.7 బిలియన్ డాలర్లు. వృద్ధి 5.4 శాతం 2005తో పోలిస్తే ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 2023 నాటికి రెండింతలై 2.4 శాతానికి చేరిక -
రుద్రాంక్ష్ పాటిల్ ‘పసిడి’ గురి
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల రుద్రాంక్ష్ 252.9 పాయింట్ల స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మార్టన్ పెనీ (హంగేరి; 251.7 పాయింట్లు) రజతం, జూలియన్ గుటిరెజ్ (అర్జెంటీనా; 230.1 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఫైనల్లో పోటీపడ్డ మరో భారత షూటర్ అర్జున్ బబూటా 144.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 47 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో అర్జున్ 643.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో, రుద్రాంక్ష్ 633.7 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచి నాలుగు పతకాలతో రెండో స్థానంలో ఉంది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో రుద్రాంక్ష్ కిది ఐదో పతకం కావడం విశేషం. గతంలో అతను రెండు స్వర్ణాలు (2023 కైరో), రెండు కాంస్యాలు (2023 భోపాల్) సాధించాడు. -
ఏఐలో మనం మేటి కావాలంటే...
కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్ ఆర్–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?డీప్‌సీక్ ఆర్–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్ ఏఐ మిషన్ స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్ లాంగ్వేజ్ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్ఎల్ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్ఎల్ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్ఎల్ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్ అండ్ డెవలప్మంట్ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నారు. పెర్ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్ శ్రీనివాస్ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్ అండ్ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. మోదీ ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ , అమెరికాకు చెందిన నేషనల్ సైన్ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్ఎల్ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్ సోర్స్ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్–ఆర్1, మిస్ట్రల్ వంటివి అన్నీ ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్ జీపీటీ వంటి క్లోజ్డ్ సోర్స్ ఎల్ఎల్ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్ సీక్‌లు ఓపెన్ సోర్స్ బాట పట్టాయి. భారత్ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్ సోర్స్ ద్వారా భారతీయ స్టార్టప్ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్ సోర్స్ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్ సోర్స్ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్ అండ్ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.అనిరుధ్ సూరి వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
నైజీరియాకు డ్రగ్స్ సొమ్ము
సాక్షి, హైదరాబాద్: మన దేశంతోపాటు విదేశాల్లో నిషేధిత మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) పోలీసులు రట్టు చేశారు.గత ఏడేళ్లలో ఈ ముఠా రూ.125 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. ఈ కేసు వివరాలను టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య టీజీఏఎన్‌బీ ఎస్పీలు రూపేశ్, రఘువీర్‌తో కలిసి శనివా రం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠాలోని ఇద్దరు నైజీరియన్లతోపాటు ఒక ఫారెక్స్ ఏజెంట్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. అంతా వాట్సాప్‌లోనే.. బ్లెస్సింగ్ అలియాస్ జో అనే మహిళ హైదరాబాద్‌లోని నైజీరి యన్ డ్రగ్స్ ముఠా కింగ్‌పిన్ ఎబుకా సుజీ సోదరుడు కేలేశీకి ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి 200 గ్రాముల కొకైన్ తీసుకువస్తుండగా 2024 జూలైలో టీజీఏఎన్‌బీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను విచారించగా ఈ ముఠా డొంకంతా కదిలింది. ⇒ డ్రగ్స్ ఆర్డర్ తీసుకోవడం, డబ్బు అందిన విషయాన్ని నిర్ధారించుకోవడం, ఒక ప్రదేశంలో డ్రగ్స్‌ను వదిలి..వాటి ఫొటో, లొకేషన్‌ను కస్టమర్‌కు చెప్పి.. డ్రగ్స్ వారికి చేరవేయడం వరకు అన్నింటికీ వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ⇒ కింగ్‌పిన్ ఎబుకా సుజీ ఆదేశాలతో డ్రగ్స్‌ను స్థానిక కస్టమర్లకు చేర్చడంలో కెలేశీకి ఎమ్మా, బిగ్జో సహకరించేవారు. ఎబుకా సుజీ తన డ్రగ్స్ దందాను అమెరికాలోనూ మొదలు పెట్టినట్లు గుర్తించారు. ⇒ యూఎస్ కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తీసుకోకుండా తొలుత ఇండియాకు తరలించి ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు ఈ ముఠా తరలిస్తోంది. యూఎస్ నుంచి డబ్బును భారత్‌కు చేర్చేందుకు పాత మలక్‌పేటకు చెందిన మహ్మద్ మతీన్ సిద్ధిఖీ అనే పైన్ మల్టీ సర్విసెస్ ప్రొప్రైటర్ సహకారం తీసుకునేవారు. ⇒ మతీన్ తనకున్న పరిచయాలతో గోయమ్ ఫారెక్స్‌కు చెందిన ఆనంద్ జైన్ ద్వారా అమెరికాలోని పలువురు భారతీయుల బ్యాంకు ఖాతాలు సేకరించాడు. డ్రగ్స్ అమ్మగా వచ్చిన సొమ్మును ఆ ఖాతాల్లో వేయించి భారత్‌లోని వారి బంధువుల ద్వారా ఇక్కడ తీసుకునేవారు. ⇒ ఆ డబ్బును ముంబైకి వస్త్ర వ్యాపారం కోసం వచ్చే నైజీరియన్ వ్యాపారులు డానియల్, మాలిక్, స్టాన్లీల ద్వారా నైజీరియాకు తరలించేవారు. ఇలా ప్రతిదశలోనూ ఎవరికి వారు కమీషన్లు తీసుకుంటూ దందా చేస్తున్నారు. ఇలా 40 శాతం వరకు కమీషన్లు తీసుకుని, మిగిలిన మొత్తాన్ని నైజీరియాలోని ఎబుకా సుజీకి చేరవేస్తున్నారు. – ఈ నెల 3న ఏ–1 ఎమ్మా, ఏ–2 బిగ్ జో, ఏ–3 మతీన్ సిద్దిఖీలను అరెస్టు చేశారు. డివైన్ ఎబుకా సుజీ, కేలేశీతోపాటు సయ్యద్ సోహిల్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ నసీర్ అహ్మద్, మహ్మద్ అవైజ్, మహ్మద్ మతీన్, సయ్యద్ యూసుఫ్ హక్, ఆనంద్‌జైన్, శాంతిలాల్ సురేశ్కుమార్జైన్, ఉత్తమ్ జైన్ పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తేనే డ్రగ్స్ కట్టడి డ్రగ్స్ దందా మొత్తం ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఉంది. ఈ ముఠాల ఆర్థిక మూలాలను దెబ్బకొడితేనే డ్రగ్స్ కట్టడి సాధ్యం. డ్రగ్స్ వల్ల భారత యువత బానిసలుగా మారుతున్నారు. చదువుకోసం నైజీరియా సహా పలు దేశాల నుంచి వచ్చే యువత డ్రగ్స్ దందాలోకి దిగి చెడిపోతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ధనికులు సైతం డ్రగ్స్ వాడకాన్ని మానుకోవాలి.టీజీఏఎన్‌బీ సాంకేతికంగా, నైపుణ్యం పరంగా ఎంతో పటిష్టంగా మారింది. డ్రగ్స్ దందా చేసేవారిని వదిలే ప్రసక్తే లేదు. 2020 నుంచి 260 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపాం. విదేశీయులకు ఇల్లు, అపార్టమెంట్లు అద్దెకు ఇచ్చేముందు ఫారినర్స్ రీజినల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్స్ (ఎఫ్ఆర్ఆర్ఎ)కు ఫామ్–సీలో, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో వారి వివరాలు ఇవ్వాలి. – సందీప్ శాండిల్య, టీజీఏఎన్‌బీ డైరెక్టర్. -
ఏఐలో ప్రయివేట్ పెట్టుబడులు గుడ్
న్యూయార్క్: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్ టాప్–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్ అత్యధికంగా 67 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్ డాలర్లు, భారత్ 1.4 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది. యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్ ఆర్అండ్డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. -
లంకతో ఆరు రక్షణ ఒప్పందాలు
కొలంబో: పొరుగు దేశం శ్రీలంకతో భారత్ ఆరు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. లంకలోని ట్రింకోమలీని ఇంధన హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు పవర్ గ్రిడ్ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరాయి. శనివారం లంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకెతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చల అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సంపూర్ సౌర విద్యుత్కేంద్రాన్ని నేతలిద్దరూ వర్చువల్‌గా ప్రారంభించారు. భద్రత విషయంలో ఇరుదేశాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దిస్సనాయకె అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలి విదేశీ పర్యటనకు భారత్‌నే ఎన్నుకున్నారు. ఆయన హయాంలో లంకను సందర్శించిన తొలి విదేశాధినేతను నేనే. ద్వైపాక్షిక బంధానికి ఇరు దేశాలూ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం’’ అన్నారు. అనంతరం జరిగిన చర్చల్లో పలు కీలకమైన అంశాలు వారి నడుమ ప్రస్తావనకు వచ్చాయి. లంక జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులను విడిచి పెట్టాల్సిందిగా మోదీ కోరారు. ఈ విషయంలో ఇరు దేశాలూ మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘ఆర్థిక సాయంలో భాగంగా లంకకు ఇచ్చిన రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నాం. వాటిపై వడ్డీరేటును మరింత తగ్గిస్తున్నాం. లంకకు ఇచ్చిన 10 కోట్ల డాలర్ల మేరకు రుణాలను గ్రాంట్లుగా మార్చాం. శ్రీలంక ప్రజలకు భారత్ అన్నివిధాలా అండగా నిలుస్తుంది’’ అని పునరుద్ఘాటించారు. లంక తూర్పు ప్రాంతాల ఆర్థికాభివృద్ధి నిమిత్తం 240 కోట్ల శ్రీలంక రూపాయల సాయాన్ని ప్రకటించారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు దిస్సనాయకె తెలిపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు లంక భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. శ్రీలంకలోని కీలక నౌకాశ్రయాలు, భూభాగాలను నిఘా తదితర కార్యకలాపాలకు వాడుకునేలా చైనా పథక రచన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్లో ఆరావళి ప్రాంతాల్లో 1960లో దొరికిన బుద్ధుని పవిత్ర అవశేషాలను లోతైన పరిశోధనల నిమిత్తం లంకకు పంపుతున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు. అధ్యక్షుడు దిస్సనాయకె ఆయనకు స్వయంగా అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో మోదీ కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీన్ని 140 కోట్ల పై చిలుకు భారతీయులకు లభించిన గౌరవంగా ప్రధాని అభివరి్ణంచారు. ఘనస్వాగతం అంతకుముందు రెండు రోజుల థాయ్‌లాండ్ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి బ్యాంకాక్ నుంచి కొలంబో చేరుకున్నారు. నగరంలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శనివారం ఆయనకు అత్యంత ఘనస్వాగతం లభించింది. అధ్యక్షుడు దిస్సనాయకె స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ఒక విదేశీ నేతలకు ఈ స్థాయి స్వాగతం లభించడం శ్రీలంక చరిత్రలో ఇదే తొలిసారి.తమిళులకు న్యాయం చేయండి శ్రీలంక తమిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, వారికి న్యాయం జరిగేలా చూసేందుకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటన సందర్భంగా శనివారం స్థానిక తమిళ నేతలతో సమావేశమయ్యాక ఆయన ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు దిస్సనాయకెతో చర్చల సందర్భంగా కూడా ఈ అంశాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘లంక తమిళుల ఆకాంక్షలను గౌరవించండి. హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం రాజ్యాంగంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చండి. ప్రొవిన్షియల్ కౌన్సిళ్లకు తక్షణం ఎన్నికలు జరిపించండి’’ అని సూచించారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లంక తమిళుల ఆకాంక్షలను దిస్సనాయకె సర్కారు నెరవేరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. భారత మూలాలున్న తమిళులకు 10 వేల ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు తమకు కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలని తమిళులు చిరకాలంగా కోరుతున్నారు. -
ఎల్ఐసీకి ఎలాంటి అనుచిత లబ్ధి అందడం లేదు
న్యూఢిల్లీ: భారత బీమా మార్కెట్లో ఎల్ఐసీ అసమంజసమైన పోటీ ప్రయోజనం పొందుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) చేసిన ఆరోపణలను ప్రభుత్వరంగ బీమా సంస్థ తోసిపుచ్చింది. గత 25 ఏళ్లుగా పోటీతో కూడిన మార్కెట్లో 24 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరే ఎల్ఐసీ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తుస్తోందని స్పష్టం చేసింది. యూఎస్టీఆర్ అభిప్రాయాలు భారత బీమా నియంత్రణలు, ఎల్ఐసీ పనితీరు గురించి సమగ్రంగా అర్థం చేసుకోకుండా చేసినవిగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఐఆర్డీఏఐ, సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఏ ఇతర నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేదని వివరించింది. భారత్‌లో ఆర్థిక సేవల విస్తృతికి, పాలసీదారుల ప్రయోజనం విషయంలో ఎల్ఐసీ చేసిన కృషిపై మరింత తటస్థ, వాస్తవిక ప్రశంసను తాము కోరుకుంటున్నట్టు పేర్కొంది. హామీని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు.. ‘‘ప్రైవేటు బీమా సంస్థల కంటే చాలా మంది కస్టమర్లు ఎల్ఐసీ పాలసీలనే ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా ఎల్ఐసీకి అనుచిత పోటీ ప్రయోజనం లభిస్తోంది’’అని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూఎస్టీఆర్ తన తాజా నివేదికలో విమర్శించడం గమనార్హం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాలన, సేవలు, కస్టమర్ల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఎల్ఐసీ కట్టుబడి ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి ప్రకటించారు. 1956లో ఎల్ఐసీని ఏర్పాటు చేసినప్పు డు ప్రభుత్వం కలి్పంచిన హామీ అన్నది.. జాతీయీకరణ ఆరంభ కాలంలో ప్రజా విశ్వాసాన్ని పొందడం కోసమే. అంతేకానీ దీన్ని ఎప్పుడూ మార్కెటింగ్ సాధనంగా ఎల్ఐసీ ఉపయోగించుకుని ప్రయోజనం పొందలేదని ఎల్ఐసీ తెలిపింది. -
భారత్ సార్వభౌమత్వం నిలుపుకోవాలి
న్యూఢిల్లీ: భారత్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలని నితి ఆయోగ్ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల సాంకేతికతల కాలనీగా మారొద్దంటూ స్టార్టప్ మహాకుంభ్ ప్రసంగంలో సూచించారు. తెలివైన.. చౌక ఆవిష్కరణల ఆవశ్యకత ఉన్నట్లు నొక్కి చెప్పారు. పశ్చిమ దేశాల మోడళ్లను అవలంబించడంవల్ల దేశీ సంప్రదాయాలు, సంస్కృతి, గుర్తింపులను కోల్పోతామని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతలలో దేశ సార్వభౌమత్వాన్ని కొనసాగించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుండి నడిపించడంలో పశ్చిమ దేశాల లేదా ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతాల కాలనీగా మారకూడదని వ్యాఖ్యానించారు. అతితక్కువ ఇంధన వినియోగం, తక్కువ వ్యయాలతోకూడిన చురుకైన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు తెలియజేశారు. పశ్చిమ ప్రభావానికి లోనుకాకుండా సొంత డేటా ఆధారంగా దేశ సార్వభౌమత్వానికి అనుగుణమైన మోడళ్లను ఆవిష్కరించవలసి ఉన్నట్లు వివరించారు. 22 ప్రాంతీయ భాషలుగల దేశ భిన్నత్వానికి అనుగుణంగా వివిధ భాషల ఏఐ మోడళ్లకు తెరతీయవలసి ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం సేవలు అందించగలుగుతామని సూచించారు. స్వీయనియంత్రణ స్టార్టప్‌లు భారీ కార్పొరేట్లుగా ఎదగాలంటే స్వీయనియంత్రణకుతోడు.. సుపరిపాలనకు చోటు ఇవ్వాలని అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఒకప్పుడు స్టార్టప్‌గా ప్రారంభమై భారీ మల్టీనేషనల్ ఐటీ దిగ్గజంగా అవతరించిన ఇన్ఫోసిస్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. నైతిక పాలన, ఆడిట్లు, పటిష్ట ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌సహా స్వీయనియంత్రణ స్టార్టప్‌లకు కీలకమని వివరించారు. కాంత్ శుక్రవారం ఫిన్‌టెక్ పరిశ్రమకు స్వీయనియంత్రణ సంస్థ(ఎస్ఆర్వో) అయిన ఇండియా ఫిన్‌టెక్ ఫౌండేషన్(ఐఎఫ్ఎఫ్)ను ప్రారంభించారు. ఎస్ఆర్వో– ఫిన్‌టెక్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఎస్‌ఆర్‌వోఎఫ్‌టీ–డీఎఫ్)గా పేర్కొనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా ప్రతిపాదిత ఎస్ఆర్వో బోర్డులో ఇప్పటికే 100మంది సభ్యులున్నట్లు వెల్లడించారు. డిజిటల్ లెండింగ్ పేమెంట్స్, వెల్త్‌టెక్, ఇన్సూర్టెక్, అకౌంట్ అగ్రిగేషన్‌సహా డెఫీ, వెబ్3 తదితర వర్ధమాన టెక్నాలజీల నుంచి సభ్యులు చేరినట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రమాణాలు నెలకొల్పడంలో ఎస్ఆర్వో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. నియంత్రణ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీల మద్య వారధిగా వ్యవహరించనున్నట్లు వివరించారు.విమర్శించడం సులభం దేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పలువురు ఎంట్రప్రెన్యూర్స్ స్పందించారు. సెమీకండక్టర్, మెషీన్ లెరి్నంగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా గోయల్ సూచించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా లోతైన సాంకేతిక నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యూఎస్, చైనాతో పోల్చి దేశీ కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లను విమర్శించడం సులభమేనని పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జెప్టో సీఈవో ఆదిత్ పలీచా లింక్డ్ఇన్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. నిండా మూడున్నరేళ్ల వయసుకూడా లేని జెప్టో ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్విక్‌కామర్స్ సంస్థలు ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. ఇంటర్నెట్ కన్జూమర్ కంపెనీలు టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి వ్యాఖ్యలు వేలెత్తి చూపడం అనికాకుండా.. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు సవాళ్లు విసురుతున్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. మంత్రులు విశ్వాసాన్ని ఉంచాలని, డీప్‌టెక్ స్టార్టప్‌లకు సహాయసహకారాలు అందించాలని, సమస్యలను తొలగించాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ సూచించారు. చైనాతో పోలిక సరికాదని, పరిశ్రమ దేశీయంగా సైతం చిన్నస్థాయిలో స్టార్టప్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లో పలు డీప్‌టెక్ కంపెలతో సమావేశమైనట్లు షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ తెలిపారు. -
మే 24న నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరుతో మనదేశంలో ఓ అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మే 24న హరియాణాలోని పంచ్‌కుల వేదికగా జరగనున్న ఈ టోర్నీకి ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ అని పేరు పెట్టారు. దివంగత మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ స్టేడియంలో ఈ మీట్‌ను నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లు పాల్గొనే ఈ ఈవెంట్‌కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ హోదాను కేటాయించింది. ప్రస్తుతానికి ఈ ఈవెంట్‌కు ప్రపంచ అథ్లెటిక్స్ క్యాలెండర్లో చోటు దక్కకపోయినా... ప్రతి ఏటా దీన్ని నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్తంగా ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాయి. నీరజ్ చోప్రా కూడా నిర్వాహక కమిటీలో భాగం పంచుకుంటున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిశాడు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ ఈవెంట్‌కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో ఆమోదం తెలిపారు. భారత్‌లో మెగా టోర్నీలు నిర్వహించే సామర్థ్యాన్ని ఇది ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ దేశ అథ్లెటిక్స్ ప్రతిష్టను పెంపొందిస్తుందని ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నీరజ్ జావెలిన్ శిక్షణ ప్రారంభించిన ప్రాంతంలోనే ఈ టోర్నీ జరగనుంది. నీరజ్ భాగస్వామ్యంతో దేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం భారత అథ్లెటిక్స్‌కు గొప్ప విషయం’ అని బహదూర్ సింగ్ అన్నారు. హరియాణా, పానిపట్ సమీపంలోని ఖంద్రా గ్రామంలో జన్మించిన నీరజ్ చోప్రా... 2012 నుంచి 2015 వరకు పంచ్కులలో జావెలిన్ శిక్షణ పొందాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన నీరజ్... ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ పొందుతున్న నీరజ్... మే 16న జరిగే దోహా డైమండ్ లీగ్‌తో సీజన్ ప్రారంభించే అవకాశాలున్నాయి. -
టారిఫ్‌పై మళ్లీ తూచ్
న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎడాపెడా టారిఫ్‌లతో బాదేయడం తెలిసిందే. వైట్‌హౌస్ రూపొందించిన టారిఫ్‌ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్‌లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ‘‘భారత్ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లను వైట్‌హౌస్ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్‌పై టారిఫ్‌ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్‌ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్‌లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్ టీమ్‌పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది. -
ఈ సుంకాలతో లాభనష్టాలు
భారత్ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.అమెరికా వాదన2024లో అమెరికాకు సంబంధించి భారత్ ఎగుమతుల విలువ 91.23 బిలియన్ డాలర్లు. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికాకు సంబంధించిన పాసింజర్ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్ రంగాలపై; చైనాలో సోలార్ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.భారత్‌పై ప్రభావంప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్టైల్స్ – అప్పారెల్ రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా టెక్స్టైల్ – అప్పారెల్ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.భారత్ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్ మార్కెట్ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్ గార్మెంట్స్ ఎగుమ తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.సిద్ధించే ప్రయోజనాలుఅమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్ నుండి సాఫ్ట్వేర్ సర్వీ సులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ, బిజినెస్ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్ ఇంజినీరింగ్ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడంతోపాటు భారత్ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.చేయాల్సిందిఅయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.-వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఇ., హైదరాబాద్- డా‘‘ తమ్మా కోటిరెడ్డి -
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
బ్యాంకాక్: భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించారు.‘భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు.‘ ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీప్ అడ్వైజర్ ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.భారత్ గురించి బంగ్లా చీఫ్ అడ్వైజర్ ఏమన్నారంటే.. చైనా పర్యటన సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకోగా, దీనికి తాజాగా ప్రధాని మోదీ కౌంటర్ తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. ఆ ఒక్కటే కారణమా?
-
వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు
బ్యాంకాక్: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా యుత, సమ్మిళిత, న్యాయబద్ధమైన విధానాలకు కట్టుబడి ఉంటామని భారత్, థాయ్‌లాండ్ ప్రకటించాయి. విస్తరణ వాదం కాదు, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని పెటొంగ్టర్న్ షినవత్ర గురువారం బ్యాంకాక్‌లో సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అంతకుముందు, రెండు దేశాల ప్రతినిధుల స్థాయి మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు, థాయ్‌లాండ్ మధ్య పర్యాటకం, సాంస్కృతిక, విద్యా రంగాలతోపాటు పరస్పర వాణిజ్యం, పెట్టుబడుల్లో సహకారానికి గల అవకాశాలపై షనవత్రతో చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చేనేత, హస్తకళల్లో సహకారంపై ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇండో–పసిఫిక్, యాక్ట్ ఈస్ట్ విధానంలో థాయ్‌లాండ్‌కు భారత్ ప్రత్యేక స్థానం కల్పిస్తుందని తెలిపారు. భద్రతా విభాగాల మధ్య వ్యూహాత్మక సమావేశాలపైనా చర్చ జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా, మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రాతోనూ మోదీ సమావే శమయ్యారు. తన పర్యటనను పురస్కరించుకుని 18వ శతాబ్దినాటి రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసినందుకు థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని షినవత్ర తనకు బహూకరించిన త్రి పీఠకను బుద్ధుని భారత్ తరఫున వినమ్రుడనై స్వీకరించినట్లు తెలిపారు. బౌద్ధమత నియమాలతో కూడిన వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిదమ్మ పీఠకాలని త్రిపీఠకాలని పేరు. మార్చి 28వ తేదీన భూకంపంతో సంభవించిన ప్రాణనష్టంపై భారత ప్రజల తరఫున నివాళులర్పించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అంతకుముందు, బిమ్స్టెక్ 6వ శిఖరాగ్రానికి హాజరయ్యేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని మోదీకి ఉపప్రధాని సురియా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన థాయ్ రామాయణం, సిక్కులు ప్రదర్శించిన భాంగ్రా నృత్యం అలరించింది. అనంతరం ప్రధాని మోదీ బిమ్స్టెక్లోని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యూనుస్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ సైనిక పాలకుడు మిన్ ఔంగ్ తదితరులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకాక్ నుంచి ఆయన శ్రీలంకకు వెళ్లనున్నారు. -
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
న్యూఢిల్లీ,సాక్షి: లోక్‌సభలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూముని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ దిగువ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘భారత్ భూభాగంలో ఏం జరుగుతోంది నాకు అర్ధం కావడం లేదు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు .. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు లేఖ రాయాలి. చైనా 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించుకుంది. ఈ విషయం నన్ను మరింత షాక్‌కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి? అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్‌పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది?’ అని అడిగారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. భారత్ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్‌కు హితువు పలికారు. -
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు. -
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025 -
సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్‌లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్‌లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. సవాళ్లూ ఉన్నాయి.. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆశాభావంతో కంపెనీలు.. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్‌ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు. -
గువాహాటిలో తొలిసారి టెస్టు
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. -
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్.. ఎవరీ పూనమ్ గుప్తా?
ఢిల్లీ : కేంద్రం మరో మహిళా అధికారిణికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిణి నిధి తివారీని ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది. తాజాగా, పూనమ్ గుప్తా అనే అధికారిణిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఏడాది జనవరిలో రిటైరైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకల్ పత్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పూనమ్ గుప్తా ఎవరు?కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ పూనమ్ గుప్తా నియామకాన్ని ఆమోదించింది. ఆమె ప్రస్తుతానికి ప్రధానమంత్రికి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యురాలు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా బాధత్యలు స్వీకరించే ముందు ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్లో గ్లోబల్ మాక్రో, మార్కెట్ రీసర్చ్ లీడ్ ఎకానమిస్ట్‌గా పనిచేశారు. భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలిలో ప్రొఫెసర్‌గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ బోధించడంతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆమె 16వ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.ఇక ఆమె చదువు విషయానికి వస్తే ఎకానమిక్స్‌లో పీహెచ్డీ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1998)స్పెషలైజేషన్: మాక్రో ఎకానమిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ,ఇంటర్నేషనల్ ట్రేడ్ఎం.ఎ ఎకానమిక్స్ : యూనివర్శిటీ ఆఫ్ మారీల్యాండ్, కాలేజ్ పార్క్ (1995)ఎం.ఎ ఎకానమిక్స్ : ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ (1991)బీఏ ఎకానమిక్స్ : హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్శిటీ (1989)ఆమె 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంపై చేసిన పీహెచ్‌డీకి EXIM బ్యాంక్ అవార్ను గెలిచారు -
ఆ హెలికాప్టర్ షాట్‌కు 14 ఏళ్లు.. సిక్స్ కొట్టి ప్రపంచకప్ గెలిపించిన ధోని..! (ఫొటోలు)
-
Best Places to Visit వేసవి విహారం
వేసవి విహారానికి నగరం సన్నద్ధమవుతోంది. నచ్చిన ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక ప్రియులు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల సందర్శనకు బయలుదేరుతారు. కొందరు కుటుంబాలతో సహా కలిసి పర్యటిస్తే, మరికొందరు సోలో టూర్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక ఏజెన్సీలు పర్యాటకుల అభిరుచికి తగినవిధంగా విభిన్న వర్గాలకు చెందిన ప్యాకేజీలను అందజేస్తున్నాయి. జాతీయ పర్యటనల్లో ఎక్కువ మంది హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, ఊటీ, కూర్గ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుండగా, అంతర్జాతీయ పర్యటనల్లో ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారినట్లు టూరిజం సంస్థలు పేర్కొంటున్నాయి. తక్కువ బడ్జెట్లో యూరప్‌లో పర్యటించిన అనుభూతిని కలిగించే కజఖిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కమెనిస్తాన్ తదితర దేశాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది చల్లటిప్రదేశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ తరువాత ఆధ్యాతి్మక, చారిత్రక ప్రదేశాలకు సైతం డిమాండ్ ఉందని పర్యాటక సంస్థలు చెబుతున్నాయి. ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, కర్ణాటకలోని హిల్‌స్టేషన్‌గా పేరొందిన కూర్గ్, తమిళనాడులోని ఊటీకి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ తరువాత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొందిన హంపి, విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలు. రాతి దేవాలయాలు, శిలలతో కూడిన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన మహాబలిపురం. వారణాసి, అయోధ్య, ఢిల్లీ, జైపూర్ వంటి ప్రదేశాలకు సైతం ఎక్కువ మంది తరలి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అంచనా. ప్రైవేటు సంస్థలతో పాటు ఐఆర్సీటీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఏటా రెండు లక్షల మంది..జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తునట్లు అంచనా. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ సుమారు 15,000 మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, బంధువుల వద్దకు వెళ్లేవాళ్లు కాకుండా కనీసం 5 వేల మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. అలాగే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 30 వేల మందికి పైగా కేవలం పర్యాటకప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లేవాళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆహ్లాదం.. ఆనందం.. ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాల పర్యటనలకు వెళ్లేవారిలో దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా తదితర దేశాల తరువాత మధ్య ఆసియా దేశాలకు ఎక్కువమంది వెళ్తున్నారు. కజికిస్తాన్‌లోని ఎత్తైన పర్వతాలు, రిసార్ట్‌లతో ఆకట్టుకునే ప్రాంతాలు, అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ను తలపించే అందమైన ప్రాంతం చారిన్ కాన్యన్, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన బైకనూర్ కాస్మోడ్రోమ్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరాలు, మధ్యయుగపు ఇస్లామిక్ కట్టడాలతో నిండి ఉన్న బుఖారా, మౌసోలియమ్స్, ఖివా వంటి ప్రాంతాలను పర్యాటకులు ఎంపిక చేసుకుంటున్నారు. నగర పర్యాటకులను ఆకట్టుకుంటున్న మరో అందమైన దేశం అజర్బైజాన్. తక్కువ బడ్జెట్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఈ దేశంలో రాజధాని బాకు ఆధునిక ఆర్కిటెక్చర్‌తో చారిత్రక ప్రదేశాలతో నిండి ఉంటుంది. షెకీ మరో పురాతన నగరం. ఇది ప్యాలెస్‌ల నగరంగా పేరొందింది. అలాగే ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, వినోదభరితమైన పార్కులతో కూడిన గాబాలా నగరం కూడా అజర్‌బైజాన్‌లోనే ఉంది. -
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది. -
ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. -
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ సాధించింది. తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో వందన పలుమార్లు భారత విజయాల్లో ముఖ్యపాత్ర పోషించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో... 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత జట్టులో వందన సభ్యురాలిగా ఉంది. ‘బరువెక్కిన హృదయంతో నేను అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటిస్తున్నా. నాలో ఇంకా ఆడే సత్తా లేదనిగానీ, నాలో ఆడాలనే కోరిక తగ్గిపోయిందనిగానీ వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. కెరీర్‌పరంగా ఉన్నతస్థితిలో ఉన్నపుడే అంతర్జాతీయస్థాయిలో ఆటకు గుడ్‌బై పలకాలని భావించా. అయితే హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ క్లబ్ జట్టుకు ఆడతా. నేనీ స్థాయికి చేరుకోవడానికి వెన్నంటే నిలిచి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు’ అని వందన వ్యాఖ్యానించింది. 2009లో భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన వందన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ‘హ్యాట్రిక్’ సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారతీయ హాకీ క్రీడాకారిణిగా ఘనత వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021లో ‘అర్జున అవార్డు’... 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న వందన వరుసగా మూడు (2014లో కాంస్యం, 2018లో రజతం, 2022లో కాంస్యం) ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. -
అంతరిక్షం నుంచి ‘అద్భుత’ భారతం: సునీతా విలియమ్స్
‘అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంది?’ ఈ ప్రశ్నకు నాడు భారత వ్యోమగామి రాకేష్ శర్మ(Indian astronaut Rakesh Sharma) ప్రముఖ కవి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన ‘సారే జహాన్ సే అచ్చా’ అంటూ సమాధానం చెప్పారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే ప్రశ్నకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సమాధానమిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అద్భుతమైన హిమాలయాలను చూసిన సంగతిని ఆమె గుర్తుచేసుకున్నారు.286 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత సునీతను.. భారతదేశం అంతరిక్షం నుండి ఎలా కనిపించింది? అని అడిగినప్పుడు ఆమె ‘అద్భుతం.. అత్యద్భుతం’ అనే సమాధానం ఇచ్చారు. ‘భారతదేశం అద్భుతమైనది. మేము హిమాలయాల(Himalayas) మీదుగా వెళ్లిన ప్రతిసారీ అద్భుత దృశ్యాలను చూశాం’ అని సునీతా విలియమ్స్ అన్నారు. తన భారతీయ మూలాల గురించి తరచూ మాట్లాడే అమెరికా వ్యోమగామి సునీత అంతరిక్షం నుంచి భారత్‌కు సంబంధించిన ప్రకృతి దృశ్యాలను చూసి మంత్రముగ్ధురాలయ్యారు.పశ్చిమాన ఉన్న నౌకాదళాల నుండి ఉత్తరాన మెరుస్తున్న హిమాలయాల వరకు అంతా అద్భుతంగా కనిపించింది. తూర్పు నుండి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్ళినప్పుడు అద్భుత దృశ్యం కనిపించింది. భారతదేశం అంతటా రాత్రిపూట లైట్ల నెట్వర్క్ అమోఘంగా ఉంది. పగటిపూట కనిపించిన హిమాలయాల సౌందర్యం భారతదేశానికే తలమానికంగా నిలిచింది. భారత అంతరిక్ష విమానయాన కార్యక్రమానికి సహాయం చేస్తారా? అని ఆమెను అడిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి వస్తాను. మా అనుభవాలను అక్కడివారితో పంచుకుంటాను. భారత్ ఒక గొప్ప దేశం. అద్భుతమైన ప్రజాస్వామ్యం(Democracy) ఇక్కడుంది. భారత్ అంతరిక్షయానంలో ముందడుగు వేస్తోంది. దానిలో భాగం కావడానికి, వారికి సహాయం చేయడం తనకు ఇషమేనని ఆమె సమాధానం చెప్పారు.భారతదేశంలో జన్మించిన విలియమ్స్ తన తండ్రి పూర్వీకుల ప్రాంతానికి రావాలని అనుకుంటోంది. తన సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను కూడా భారత్‌కు తీసుకురావాలని భావిస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారు చివరికి మొన్న మార్చి 19న స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు.ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు -
నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్
అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్ డ్రీమ్. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎన్నో పాట్లుపడుతున్నారు. మనం ఇంతలా ప్రయాస పడుతుంటే ఓ అమెరికన్ అమ్మ మాత్రం సింపుల్‌గా అసలైన ఆనందం భారత్‌లోనే ఉందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. అంతేకాదండోయ్ సంపాదన పరంగా అమెరికా బెస్ట్ ఏమో కానీ సంతోషం మాత్రం భారత్‌లోనే దొరకుతుందని దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఆ తల్లి. అదెలాగో ఆమె మాటల్లోనే విందామా..! గత నాలుగు సంత్సరాలు ఢిల్లీలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ తన పిల్లలు యునైటెడ్ స్టేట్స్ వద్దని భారత్‌లోనే ఎందుకు పెంచాలనుకుంటుందో షేర్ చేసుకుంది. స్కైఫిష్ డెవలప్మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన క్రిస్టెన్ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పిల్లలు భారతదేశంలోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారని విశ్వసిస్తున్నా అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేవారు. అదెలాగో కూడా సవివరంగా వెల్లడించింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లోనే గడిస్తేనే ఎందుకు మంచిదో.. ఎనిమిది కారణాలను వివరించారామె. అవేంటంటే.. భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం: భారతదేశంలో నివశిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల సామజిక నైపుణ్యాలు మెరగవ్వడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో తెలుస్తుంది. స్ట్రాంగ్ రిలేషన్స్: భారతీయుల కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుంది. ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది. అందువల్ల వాళ్లు ఈ వాతావరణంలో పెరిగితే గనుక అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటారు.కృతజ్ఞత, సద్దుకుపోవడం: సంపద, పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా బతకడం, సర్దుకుపోవడం వంటివి తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల మద్య వాళ్లు కృతజ్ఞుడుగా ఉండటం, అవతలి వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తెలుసుకుంటారు. గ్లోబల్ నెట్వర్క్ కనెక్షన్: అంతేగాదు ఇక్కడ పెరిగితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు స్నేహితులవుతారు. ఇది వారికి ప్రపంచ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో సహయపడతుంది. ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్‌కు నిర్మించుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇలా ఆ ఆమెరికన్ తల్లి క్రిస్టెన్ ఫిషర్ ఇక్కడే తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్లు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతానంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేగాదు అమెరికాను వ్యక్తిత్వం కలిగిన దేశంగా, సామాజికంగా ఒంటరిగా ఉన్న దేశంగా అభివర్ణించింది. అయితే భారతదేశం అందర్నీ స్వాగతిస్తూ సంబంధాలను నెరుపుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది.పైగా ఒకరికొకరు సహాయ చేసుకోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అందువ్లల తన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే దినదినాభివృద్ధి చెందుతారని నమ్మకంగా చెప్పారు క్రిస్టిన్. కాగా, ఆమె గతేడాది అమెరికాని వీడుతూ భారత్‌లోనే ఎందుకు నివశించాలనుకుంటుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారామె. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: స్ట్రోక్ బారినపడిన జెరోధా సీఈవో నితిన్ కామత్..ఏకంగా 14 నెలలు..!) -
మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి. -
జాతి పునర్నిర్మాణంలో... 'ఆర్ఎస్ఎస్'@100
దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం. అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్ స్థాపకులైన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది? దేశం కోసం జీవించేలా...డాక్టర్ హెడ్గేవార్‌లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్‌కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.శాఖోపశాఖలుగా ‘శాఖ’మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. రెండవ సర్సంఘ్చాలక్ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు. ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్ దృష్టి సారించింది. లోక మాత అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్ నిర్ణయించింది. గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.గత వంద సంవత్సరాలలో, సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్‌కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్‌లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది. ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!దత్తాత్రేయ హోసబాళె వ్యాసకర్త ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి) -
ఆపరేషన్ బ్రహ్మ.. మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం
న్యూఢిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సాయం వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట హుటాహుటిన రంగంలోకి దిగింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగు లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్లైట్లు, జెనరేటర్ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున మూడింటికే సైనిక విమానాల్లో మయన్మార్‌కు పంపింది. ఉదయం 8 గంటలకల్లా వాటిని స్థానికంగా బాధిత ప్రాంతాలకు పంపే కార్యక్రమం మొదలైపోయింది. అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ ఆస్పత్రిని కూడా వాయుమార్గాన శనివారం రాత్రికల్లా మయన్మార్‌కు తరలించింది! వాళ్లంతా ఇప్పటికే మాండలే ప్రాంతంలో రంగంలోకి దిగా రు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వాయుసేన విమానాల్లో మరింత సామగ్రిని పంపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేగాక మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగూన్కు తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. కమాండెంట్ పి.కె.తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు శనివారం సాయంత్రానికే బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయని చెప్పారు. ‘‘రెస్క్యూ డాగ్స్ కూడా వెంట వెళ్లాయి. వాయు మార్గాన ఆరు అంబులెన్సులను తరలిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి కూడా సహాయక సామగ్రి మయన్మార్ చేరుతోంది. ఆ దేశంతో భారత్ 1,643 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. అందుకే ‘బ్రహ్మ’ ‘‘బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్‌లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషన్‌కు బ్రహ్మ అని పేరు పెట్టాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ మీడియాకు వివరించారు. మరింత సాయం పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. గతేడాది యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్‌కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. సహాయక సామగ్రి బాధిత ప్రాంతాలకు తక్షణం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మయన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. -
జెన్ ఏఐలో ఇంకా వెనుకబాటే..!
సాక్షి, హైదరాబాద్: ‘జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’(జెన్ ఏఐ) వల్ల కలిగే ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో భారత పరిశ్రమలు, సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా గుర్తింపు పొందడంతో పాటు టెక్నాలజీ ట్రేడ్‌లో 250 బిలియన్ డాలర్ల పరిశ్రమగా 50 లక్షల మంది ఐటీ నిపుణులతో విరాజిల్లుతున్న భారత ఐటీ పరిశ్రమ ‘జెన్ ఏఐ’కీలక మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి అవుట్ సోర్సింగ్ రంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న దశలో ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల్లో యువతరం (నెక్స్్ట–జనరేషన్) ‘51 శాతం మేర స్కిల్డ్ టాలెంట్ గ్యాప్’ను ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో కృత్రిమ మేథ ఏఐ సంబంధిత ఆవిష్కరణల్లో తమ ప్రాధాన్యతలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన భారత నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ‘జెన్ ఏఐ’వల్ల కలిగే ఉత్పాదకత వృద్ధి ప్రయోజనాలను 83 శాతం డెవలపర్లు గుర్తించినా, వారు దీనిని ఉపయోగిస్తున్నది 39 శాతమేనని, దానిని అనుసరిస్తూ, తమకు తగ్గట్టుగా వర్తింప చేసుకునే నవయువ డెవలపర్లు 31 శాతానికే పరిమితమవుతున్నట్టు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తాజా అధ్యయనంలో తేలింది.ఈ సవాళ్లను సరైన పద్ధతుల్లో సమాధానాలు వెతుక్కోవడంతో పాటు వాటిని అధిగమించే దిశలో చర్యలు చేపట్టకపోతే గ్లోబల్ ఏఐ లీడర్లుగా ఉన్న యూఎస్ఏ, చైనాల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ రంగంలో మధ్యస్థ శక్తులుగా ఎదిగిన దక్షిణ కొరియా, జపాన్, సౌదీ ఆరేబియా కూడా పైస్థాయికి చేరుకునే ప్రయత్నాలు చురుగ్గా సాగిస్తున్న సమయంలో భారత్‌కు ఇది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి కృత నిశ్చయంతో ముందుకు సాగేందుకు అవసరమైన శిక్షణ కొరవడడం, ఈ అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్న క్రమంలో ఎదురవుతున్న భద్రతాపరమైన సందేహాలు, జెన్ ఏఐ వంటి వాటితో ఉద్యోగాలు పోతాయనే భయం తదితర కారణాలతో వివిధ కంపెనీలు ఆచితూచి స్పందిస్తున్నాయని తెలిపింది. మారుతున్న సాంకేతికతలకు తగ్గట్టుగా ఐటీ సర్వీసుల్లో జెన్ ఏఐ వర్తింపును వేగవంతం చేయడం ద్వారా పైచేయి సాధించాలంటే భారత్ వివిధ చర్యలు చేపట్టాలని అధ్యయనం సూచించింది. రెండేళ్లు గడుస్తున్నా వెనుకబాటే.. 2022 చివర్లో ఏఐ, జెన్ ఏఐ అనేవి పరిశ్రమల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అయితే రెండేళ్లు గడుస్తున్నా జెన్ ఏఐను అందిపుచ్చుకుని, వర్తింపజేసుకునే విషయంలో అధిక శాతం పరిశ్రమలు వెనుకబడ్డాయి. ఇందుకు కారణం టెక్నాలజీ కాదని మానవ స్వభావం, ప్రవర్తనదేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మొదలు డెవలపర్లలో ఉద్యోగాలు కోల్పోతామనే భయం వెంటాడుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అధునాతన టూల్స్‌ను ఉద్యోగులు ఉపయోగించి మంచి ఫలితాలను సాధించేలా చేయడమనేది పెద్ద సవాల్‌గా మారుతోందని అంటున్నారు. ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో కస్టమర్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నట్టుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. భారత్ ఏం చేయాలంటే.. » వివిధ ప్రావీణ్యాలు, నైపుణ్యాల ఆధారిత శిక్షణా పద్ధతులు (ట్రైనింగ్ మోడళ్లు) చేపట్టాలి. »ఏఐ, జెన్ ఏఐలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న దానిపై ‘ప్రొఫిషియెన్సీ బేస్డ్ ట్రైనింగ్ మోడల్స్ తీసుకురావాలి. » మేనేజ్మెంట్, వర్క్‌ఫోర్స్ తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, ఉత్తమ శిక్షణ నిమిత్తం ‘ఎగ్జిక్యూటివ్ స్పాన్షర్షిప్’ చేపట్టాలి.» భద్రతా పరమైన ఆందోళనలు, సమస్యలు అధిగమించేందుకు పరిశ్రమ క్లయింట్లతో దృఢమైన బంధాలు కొనసాగించేలా వ్యూహాలు రూపొందించుకోవాలి.జనరేటివ్ ఏఐ అంటే.. జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) అనేది యూజర్ కోరుకున్న కంటెంట్ లేదా విజ్ఞప్తికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ కోడ్‌ను రూపొందించుకుంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్, ట్యూనింగ్, జనరేషన్ అనే మూడు దశలుగా పనిచేస్తుంది. టెక్ట్స్, ఇమేజేస్, ఆడియోల రూపంలో ఒరిజనల్ కంటెంట్‌ను తయారు చేయగలదు. అధునాతన మెషీన్ లెర్నింగ్ మోడళ్లు మరి ముఖ్యంగా డీప్ లెరి్నంగ్ మోడళ్లపై ఆధారపడి ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఇది మనుషుల మెదళ్ల మాదిరిగా నేర్చుకోవడం, నిర్ణయం తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. -
‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రధాని నరేంద్రమోదీని మెచ్చుకున్నారు. వాషింగ్టన్- భారతదేశం మధ్య సుంకాల చర్చలపై ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తి అని సుంకాల విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర సమన్వయం ఉంటుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ ఆ మర్నాడే భారత్ సుంకాలపై స్పందించారు. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా వచ్చారని, తమ మధ్య మంచి స్నేహం ఉన్నదన్నారు. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చాలా తెలివైన వ్యక్తి అని, తామ సుంకాల విషయంలో చర్చలు జరిపామని, ఇది అమెరికా, భారత్‌లకు మంచి చేస్తుందన్నారు. అమెరికాలోకి దిగుమతి చేసుకున్న వాహనాలపై ట్రంప్ సర్కారు 25 శాతం సుంకాన్ని విధిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇది ఏప్రిల్ 2 నుండి అమలులోకి రానుంది.భారతదేశం విధించే అధిక సుంకాలను హైలైట్ చేసిన ట్రంప్ తాము కూడా త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని, వారు మా నుంచి వసూలు చేస్తే, మేము వారి నుంచి వసూలు చేస్తామన్నారు. భారత్, చైనాలు లేదా అక్కడి కంపెనీల విషయంలో తాము న్యాయంగా ఉండాలనుకుంటున్నామని, పరస్పర అంగీకారంలో సుంకాల విధింపు ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీని సందర్శించి ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు తమ నూతన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ‘మిషన్ 500’గా నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల వస్తు, సేవల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్థారించారు.ఇది కూడా చదవండి: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు -
Earthquake Updates: మయన్మార్‌లో మరోసారి భూకంపం
Earthquake Live Rescue OP Updatesమయన్మార్‌లో మరోసారి భూకంపం👉రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1 గా నమోదు👉భారీగానే భూకంప మృతులు.. శిథిలాల కింద వందల మందిమయన్మార్, పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు భారీ భూకంపం తీరని నష్టం కలుగ జేసింది.ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరిందిసగాయింగ్ కేంద్రంగా శుక్రవారం మధ్యాహ్నాం 12.50గం. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంనిమిషాల వ్యవధిలో మరో భారీ భూకంపం.. ఆపై స్వల్ప తీవ్రతతో పలుమార్లు కంపించిన భూమికేవలం 10 కి.మీ. లోతులో భూకంపం ఏర్పడడంతో భారీ నష్టంఈ ప్రభావంతో పొరుగున ఉన్న.. భారత్, చైనా, కంబోడియా, లావోస్, బంగ్లాదేశ్‌లలోనూ కంపించిన భూమి థాయ్‌లాండ్‌లో ఛాటుఛక్ మార్కెట్లో కుప్పకూలిన నిర్మాణంలోని భారీ భవనం10 మంది మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 100 మందిప్రపంచ దేశాల తక్షణ సాయంఏ దేశమైనా సరే.. ఏ సంస్థ అయినా సరే.. మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించాలని ప్రపంచ దేశాల సాయం కోరుతున్న జుంటూ మిలిటరీ చీఫ్ అవుంగ్తక్షణమే స్పందించి సాయానికి ఆదేశించిన ప్రధాని మోదీభారత్ తరఫున ప్రత్యేక విమానాల్లో ఇప్పటికే చేరుకున్న సాయపు సామాగ్రియూరప్ దేశాలతో పాటు అమెరికా సాయం ప్రకటనథాయ్లో భారతీయులు సేఫ్భూకంపంపై అత్యవసర సమావేశం నిర్వహించిన థాయ్ ప్రధాని షినవత్రాభారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని ప్రకటించిన ఎంబసీఅయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన👉వెయ్యి దాటిన భూకంప మృతులుమయన్మార్, థాయ్‌లాండ్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్యమయన్మార్లోనే మృతులు అత్యధికంశిథిలాల నుంచి పలువురిని రక్షిస్తున్న సహాయక బృందాలు 👉 మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృత్యు ఘోషభారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యు ఘోషమయన్మార్, థాయ్‌లాండ్‌లో 700కి పెరిగిన భూకంప మృతుల సంఖ్యఒక్క మయన్మార్‌లోనే 694 మంది మృతి, 1500 మందికి పైగా గాయాలుబ్యాంకాక్‌లో ఇప్పటిదాకా 10 మంది మృతి చెందినట్లు ప్రకటనసహాయక చర్యల్లో భాగంగా.. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు సజీవంగా బయటపడుతున్నవాళ్ల సంఖ్య తక్కువేరెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలుమయన్మార్‌లో కూలిపోయిన సగాయింగ్ బ్రిడ్జిశిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయంమృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండొచ్చని అమెరికా సంస్థ అంచనా 👉 భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కుప్పకూలిన భారీ భవనంకుప్పకూలిన 33 అంతస్తుల భవనంనాలుగు మృతదేహాల వెలికితీత90 మంది ఆచూకీ గల్లంతుకొనసాగుతున్న శిథిలాల తొలగింపు👉మయన్మార్, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం200 దాటిన మృతుల సంఖ్యమయన్మార్‌లో నేలమట్టమైన 40 భారీ అపార్ట్‌మెంట్లుబ్యాంకాక్‌లోనూ కూలిన భవనాలుశిథిలాల కింద వందలాది మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలురక్షించాలంటూ శిథిలాల నుంచి కేకలుఅయినవాళ్ల కోసం కన్నీళ్లతో గాలిస్తున్న పలువురుమృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా👉అఫ్గాన్‌లో భూకంపంరిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదుఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ👉భూకంప బాధితులకు భారత్ ఆపన్న హస్తం15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపించిన భారత్గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ 👉మయన్మార్‌లో మళ్లీ భూకంపంమయన్మార్‌ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశంA huge earthquake hits Bangkok Capita Thai and Mayanmar.#trending #breakingnews #viralreels #viral #earthquake #bangkok #mayanmar #NEW pic.twitter.com/AoNn9P30Oq— Dr Maroof (@maroof2221) March 28, 2025👉హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు👉మయన్మార్, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్ నెంబర్ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్‌మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి -
‘పెద్దన్న’తో విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడేలా.. దాయాది దేశాల్లో వేళ్లూనుకుంటున్న ఉగ్రవాదానికి హెచ్చరికలు జారీ చేసేలా 2019 నుంచి నిర్వహిస్తున్న త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలకు విశాఖ నగరం మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే విన్యాసాల్లో భారత్ తరఫున ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌక ప్రాతినిధ్యం వహిస్తోంది. వరుసగా నాలుగో పర్యాయం విశాఖలోనే నిర్వహిస్తుండటం విశేషం.ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ త్రివిధ దళాల విన్యాసాలను ‘టైగర్ ట్రయాంఫ్’ గా పిలుస్తుంటారు. 2019 నుంచి ప్రారంభం భారత్, అమెరికాల్లో సైనిక, వైమానిక, నౌకాదళ విన్యాసాలు వేర్వేరుగా జరిగాయి. కానీ 2019లో తొలిసారిగా..మూడు విభాగాలు కలిపి విన్యాసాల్లో ప్రప్రథమంగా పాల్గొనడంతో అన్ని దేశాలూ భారత్–అమెరికా మధ్య బంధం గురించి చర్చించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు, భద్రతా పరమైన అంశాల్లో పరస్పర సహకారం, విపత్తు సమయంలో ఒకరికొకరు సాయం చేసుకునేందుకు అవసరమైన విధానాలను బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఈ ఏడాది జనవరిలో ఇరుదేశాల రక్షణ శాఖల అధికారులు సమావేశమై విన్యాసాలపై చర్చించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో..టైగర్ ట్రయాంఫ్ జరగదేమో అనుకున్నారంతా. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘టైగర్ ట్రయాంఫ్’– 4 ప్రారంభం కానుండటంతో ప్రధాన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.టైగర్ ట్రయాంఫ్వేదిక: విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంఎడిషన్: 4 ప్రారంభం: ఏప్రిల్ 02, 2025 లక్ష్యం » ఇండో పసిఫిక్ సాగర జలాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం » ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయుధ సంపత్తి సత్తా చాటడం » ఇండో–పసిఫిక్ జలాల్లో అక్రమ రవాణా, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట. విన్యాసాలు చేసేది.. వీళ్లే » అమెరికా తరపున మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్మెన్లు » భారత్ సైనిక దళం, నావికులు, ఎయిర్మెన్లు » భారత్ తరపున ఐఎన్ఎస్ జలాశ్వ » అమెరికా యుద్ధ నౌకలు -
భారత్ పై మయన్మార్ భూకంపం ఎఫెక్ట్!
-
శిశు మరణాల తగ్గింపులో భారత్ భేష్
ఐరాస: శిశు మరణాలను అరికట్టడంలో భారత్ ప్రయత్నాలు, పురోగతిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టలిటీ ఎస్టిమేషన్ ఇటీవల నివేదికను విడుదల చేసింది. శిశు మరణాలను తగ్గించిన ఐదు ‘ఆదర్శవంతమైన దేశాల’ను, నివారించదగిన శిశు మరణాలను తగ్గించడంలో పురోగతి కోసం వాటి వ్యూహాలను ఉదాహరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా పలు అల్ప, మధ్య ఆదాయ దేశాలు ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను 2000 నుంచి బాగా తగ్గించగలిగాయి. భారత్‌తో పాటు అంగోలా, భూటాన్, బొలీవియా, కాబో వెర్డే, మొరాకో, సెనెగల్, టాంజానియా, జాంబియా శిశు మరణాలను మూడింట రెండొంతులు తగ్గించగలిగాయి’’ అని నివేదిక పేర్కొంది.వ్యూహాత్మక పెట్టుబడులతో ..ఆరోగ్య వ్యవస్థపై వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా భారత్ ఇప్పటికే లక్షలాది శిశువుల ప్రాణాలను కాపాడిందని ఐరాస నివేదిక పేర్కొంది. 2000 నుంచి చూస్తే ఐదేళ్లలోపు శిశువల మరణాల్లో 70 శాతం తగ్గింపును, నవజాత శిశు మరణాల్లో 61 శాతం తగ్గింపును సాధించిందని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని కొనియాడింది.‘‘ఇందులో భాగంగా ప్రతి గర్భిణీ ఉచిత ప్రసవానికి అర్హురాలు. శిశు సంరక్షణ, ప్రజారోగ్య సంస్థల్లో ఉచిత రవాణా, మందులు, రోగనిర్ధారణ, ఆహార మద్దతును అందిస్తున్నారు. సమగ్ర కవరేజీ, ఆరోగ్య సేవల అమలుకు ప్రసూతి వెయిటింగ్ హోమ్స్, మాతా శిశు ఆరోగ్య విభాగాలు, నవజాత శిశు స్థిరీకరణ యూనిట్లు, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు సంరక్షణ యూనిట్లు, తల్లి సంరక్షణ యూనిట్లు, జనన లోపాల స్క్రీనింగ్‌కు ప్రత్యేక కార్యక్రమం, మౌలిక సదుపాయాల బలోపేతం తదితరాలు కూడా ప్రశంసనీయం. ఫలితంగా ఏటా లక్షలాది మందికి ఆరోగ్యకర గర్భధారణ సాధ్యమవుతోంది. బిడ్డలు ఆరోగ్యంగా పుడుతున్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలకు మంత్రసానులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం, శిక్షణ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. డేటా వ్యవస్థలు, మాతా, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సూచికలను ఎప్పటికప్పుడు డిజిటైజ్ చేస్తున్నారు. భిన్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థ నిర్మాణాలున్నా భారత్ (India) ఈ ఘనత సాధించింది’’అని ప్రశంసించింది.చదవండి: అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో! ‘‘భారత్‌లో 2000 నాటికి ఐదేళ్లలోపు శిశువుల్లో కేవలం 56 శాతం మందికే తట్టు టీకాలు వేసేవారు. దాంతో ఏకంగా 1,89,000 మంది శిశువులు తట్టుతో మరణించారు. 2023 నాటికి 93 శాతం శిశువులకు తట్టు టీకా (Vaccine) వేశారు. దాంతో తట్టు మర ణాలు 97 శాతం తగ్గి 5,200కు పరిమితమయ్యాయి. వ్యాక్సిన్లు, పోషకాహారం, సురక్షితమైన నీరు, ప్రాథమిక పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిబద్ధత వల్ల లక్షలాది మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి’’ అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ రస్సెల్ ప్రశంసించారు. శిశు మరణాలను భారత్ రికార్డు స్థాయికి తగ్గించడం గొప్ప విషయమన్నారు. -
నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ - వీడియో
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయడం గురించి అందరికీ తెలుసు. ముందుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి.. వ్యాలిడిటీ ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఇవ్వాల్సి, రెన్యువల్ కోసం ఫామ్ 9 ఫిల్ చేయాలి. మెడికల్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అవసరమైన డాక్యుమెంట్స్ అందించిన తరువాత.. బయోమెట్రిక్, ఫీజు చెల్లింపులు వంటివి చేయాలి. ఇలా అన్నీ పూర్తి చేసిన తరువాత మీ చేతికి రెన్యూవల్ డ్రైవింగ్ లైసెన్స్ అందటానికి కనీసం 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. అయితే దుబాయ్‌లో కేవలం రెండే నిమిషాల్లో రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ ఆర్టీఏ స్మార్ట్ కియోస్క్ ద్వారా రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందటం చూడవచ్చు. మహిళ మెషీన్ దగ్గరకు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి అవసరమైన ఆప్షన్స్ ఎంచుకుని.. కేవలం నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందుతుంది. ఇది చూడటానికి ఓ ఏటీఎం మెషీన్స్ మాదిరిగా ఉంటుంది. ఇలాంటి మెషీన్స్ దుబాయ్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి.ఇదీ చదవండి: బ్రిటన్ వీడనున్న స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్?: కారణం ఇదే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ.. ఇలాంటిది మనదేశంలో కూడా ఉండుంటే బాగుంటుందని అంటున్నారు. రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కోడం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.Compare this to the process of renewal of driving licence in India. pic.twitter.com/Xs2eXygI99— Tushar (@Tusharufo2) March 27, 2025 -
మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటాం : ప్రధాని మోదీ
ఢిల్లీ : మయన్మార్ (Myanmar earthquake)ను కుదిపేసిన భూకంపంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూకంపం కుదిపేసింది. భూకంపం ధాటికి భవనాలు ఊగాయి. బహుళజాతి భవనాలు నేల మట్టమయ్యాయి. ఓ భవనం కూలడంతో శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నారు. నేల మట్టమైన భవనాల కింద వేలాది మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో వేలాది భారీ నిర్మాణాలు నేల మట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది.Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…— Narendra Modi (@narendramodi) March 28, 2025ముఖ్యంగా మయన్మార్‌లో వరుసగా స్వల్ప వ్యవధిలో రిక్టర్ స్కేలుపై 7.7,6.4 భూకంప తీవ్రత నమోదైంది. ఆ భూకంపంపై ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపం ప్రభావం నేపథ్యంలో మయన్మార్, థాయిలాండ్ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుంది. అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025భూమి లోపల.. పది కిలోమీటర్ల మేర భూకంపం మయన్మార్ వాయువ్య భాగమైన సాగైంగ్‌కు 16కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మయన్మార్‌లో గతంలో కూడా సాగైంగ్‌కు భూకంపాలు సంభవించిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావడం గమనార్హం. -
Amit Shah: భారతదేశం ధర్మశాల కాదు
న్యూఢిల్లీ: భారతదేశం ధర్మశాల కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దేశానికి ముప్పు కలిగించేవారు ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తామంటే సహింబోమని హెచ్చరించారు. విదేశాల నుంచి పర్యాటకులుగా లేదా విద్య, వైద్యం, వ్యాపారం, పరిశోధనల కోసం ఎవరైనా వస్తామంటే సాదరంగా ఆహా్వనించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ, దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడేవారిపై కన్నేసి ఉంచుతామన్నారు. కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రమాదకరమైన ఉద్దేశాలతో దేశానికి వచ్చేవారిని కచి్చతంగా అడ్డుకుంటామని తెలిపారు. అందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇది ధర్మశాల కాదన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని అనుమతించబోమన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారడానికి వచ్చేవారిని స్వాగతిస్తామన్నారు. ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంతో దేశ భద్రత మరింత పటిష్టంగా మారుతుందని అమిత్ షా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మన దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ చట్టం అవసరమని తెలియజేశారు.బెంగాల్‌పై ధ్వజంపశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను ముద్దు చేస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం భూమిని అప్పగించకపోవడం వల్ల భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో 450 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు. అక్కడ కంచె నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అలజడి సృష్టిస్తున్నారని, మతపరమైన నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. చొరబాటుదార్లపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తుండడం వల్లే కంచె నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయిందని అన్నారు. ఏమిటీ బిల్లు? → ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు–2025 ప్రకారం.. నకిలీ పాస్‌పోర్టు లేదా నకిలీ వీసాతో ఇండియాలోకి ప్రవేశించినా, ఇక్కడ నివసిస్తున్నా, బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. → తమ వద్ద బస చేస్తున్న విదేశీయుల వివరాలను హోటళ్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాలి. విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్‌లలో కూడా విదేశీయులు ఉంటే ఆ సమాచారాన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికి తెలియపర్చాలి. → చెల్లుబాటు అయ్యే పాసుపోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ లేకుండా ఇండియాలోకి ప్రవేశిస్తే ఐదేళ్ల దాకా జైలు శిక్ష లేదా రూ.5 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి ఈ రెండు శిక్షలు కలిపి విధించవచ్చు. -
బంగ్లాతో మళ్లీ చెలిమి!
నిరుడు ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచీ భారత–బంగ్లాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్‌కు లేఖ రాయటం ఆహ్వానించదగ్గ పరిణామం. బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా త్యాగాల పునాదులపై నిర్మితమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. పదిహేనేళ్లు పాలించిన హసీనా మత ఛాందసుల్ని అదుపులో పెట్టడంలో సాధించిన విజయాలు ప్రశంసనీయమైనా, రిగ్గింగ్‌తో విజయాన్ని చేజిక్కించుకోవటం, విపక్ష నేతలను ఏళ్ల తరబడి జైళ్లపాలు చేయటం వంటి ధోరణుల్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. తిరుగుబాటు జరి గాక, జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. హసీనా పార్టీ అవామీ లీగ్ నేత లపైనా, కార్యకర్తలపైనా దాడులతో పాటు ఆ పార్టీకి మద్దతు పలికారంటూ పలువురి ఆస్తుల్ని ధ్వంసం చేయటం మితిమీరింది. ఈ అరాచకం ఆపకపోగా అంతా సవ్యంగా ఉందంటూ యూనుస్ దబాయింపులకు దిగారు. మతఛాందసులది పైచేయి అయి మహిళలపైనా, మైనారిటీ హిందూ వర్గంపైనా దాడులకు పూనుకుంటున్నా... వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు బాగా పెరిగినా అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. గత డిసెంబర్లో ఆ దేశాన్ని సందర్శించిన మన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బంగ్లా విదేశాంగ సలహాదారు మహమ్మద్ తౌహిద్ హుస్సేన్‌కు అందజేశారు. భౌగోళిక రాజకీయ కోణంలో బంగ్లాదేశ్‌తో చెలిమి భారత్‌కు చాలా అవసరం. అది చిన్న దేశమే అయినా దానితో మనకు 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దువుంది. ఇందులో నదీ పరీవాహక ప్రాంతం వేయి కిలోమీటర్లపైన ఉంటుంది. తాగునీటికైనా, సాగునీటికైనా తీస్తా నదీజలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. ఆ నది ప్రవహించే 315 కిలోమీటర్లలోనూ 130 కిలోమీటర్లు బంగ్లాదేశ్ భూభాగంలోనే ఉంటుంది. పశ్చిమబెంగాల్లోని గజల్డోబా బరాజ్ వల్ల భారీ మొత్తం జలాలు ఆ రాష్ట్రానికే పోతాయని, తమకు మిగిలేది అతి తక్కువని బంగ్లా వాదిస్తోంది. ఆ జలాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని కోరుకుంటోంది. చివరకు కనీసం తొలి దశలో 25 శాతం ఇస్తే చాలని రాజీ కొచ్చింది కూడా. కానీ మమత అందుకు కూడా ససేమిరా అన్నారు. వాస్తవానికి 2011లో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ తీస్తా నదీజలాల పంపకంపై బంగ్లాతో సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు. ఒప్పందం రూపొందింది. కానీ అప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ సీఎంగా వున్న మమతా బెనర్జీ యూపీఏ భాగస్వామి కావటం, ఆ ఒప్పందానికి ఆమె ససేమిరా అనటంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫెనీ జలాల విషయంలోనూ ఇలాంటి పీటముడే పడింది. నదీజలాల అంశం తప్ప ఇతరేతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవి. భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తమ ప్రయోజనాలను బేఖాతరు చేస్తున్నదని బంగ్లా ప్రజానీకంలో చాన్నాళ్ల నుంచి అసంతృప్తి వుంది. దానికితోడు హసీనాకు భారత్ గట్టి మద్దతుదారుగా ఉండటంవల్లే ఆమె ఇష్టారాజ్యం సాగిందని, లక్షలాదిమంది తమ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని విపక్షాల ఆరోపణ. ఈశాన్య భారత్‌లో తరచు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకునే మిలిటెంట్లను ఆమె హయాంలో భారత్‌కు అప్పగించేవారు. ఇది కూడా అక్కడి ఛాందసవాదులకు మింగుడుపడలేదు. అయినా ఇరు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొనాల్సిన సమస్యలూ ఉన్నాయి. ఉదాహరణకు టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించతలపెట్టిన మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది కాబోతోంది. అది మనతోపాటు బంగ్లాదేశ్ ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. బంగ్లా సాగు అవసరాల్లో 55 శాతం బ్రహ్మపుత్ర నదీజలాలు తీరుస్తాయి. చైనాలోని టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పోగా మొదలై మన దేశంలో ప్రవేశించేసరికి బ్రహ్మపుత్ర అయి, బంగ్లాలో అది జమునా నదిగా మారుతుంది. ప్రస్తుత బంగ్లా వాటా జలాల్లో 5 శాతం తగ్గినా సాగు ఉత్పత్తులు 15 శాతం పడిపోతాయని మూడేళ్ల క్రితం బంగ్లా పర్యావరణ శాఖ అంచనా వేసింది. బరాజ్ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపాలపరంగా ప్రమాదకరమైనది. భూ అంతర్భాగంలోని టిబెట్ పలక చురుగ్గా ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే మన దేశం చైనాకు ఆందోళనను తెలియజేయగా, బంగ్లాదేశ్ సైతం ఆ బరాజ్ ప్రభావంపై రూపొందించిన నివేదికలు తమకందించాలని ఆ దేశానికి లేఖ రాసింది.బంగ్లా విముక్తి దినోత్సవంపై ప్రస్తుత పాలకులకు అంత పట్టింపు లేదు. హసీనా పతనానికి దారితీసిన ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విద్యార్థులు తమది తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో గణతాంత్రిక్ ఛాత్ర సంగ్సద్ (ప్రజాతంత్ర విద్యార్థి మండలి) పేరిట గత నెలలో పార్టీ స్థాపించారు. అయితే ఛాందస వాదులు దీన్ని ఎంతవరకూ సాగనిస్తారో తెలియదు. దేశాన్ని మళ్లీ తూర్పు పాకిస్తాన్‌గా మార్చాలని వారు తహతహలాడుతున్నారు. ఇస్లామిక్ సంప్రదాయాలను అమలు చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకూ బ్యాంకాక్‌లో జరగబోయే బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంఘం బిమ్స్టెక్ సమావేశం సందర్భంగా మోదీతో భేటీకి బంగ్లా ఆసక్తి చూపుతోంది. తాజా పరిణామంతో అది సాకారమైతే మళ్లీ ఇరు దేశాల స్నేహసంబంధాలూ పట్టాలెక్కుతాయి. -
భారత గడ్డపై మళ్లీ మెస్సీ... ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడైన లయోనల్ మెస్సీ ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం భారత అభిమానులకు కలగనుంది. 14 సంవత్సరాల తర్వాత అతను మళ్లీ భారత్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది అక్టోబరులో కేరళలోని కొచి్చలో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. దీనిపై చాలా కాలం క్రితమే కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్రహమాన్ ప్రకటన చేసినా... ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ప్రముఖ బ్యాంక్ ‘హెచ్ఎస్బీసీ’ ఈ పర్యటనలో అర్జెంటీనా టీమ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌లో పుట్‌బాల్‌ను ప్రమోట్ చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిస్తూ అర్జెంటీనా రాకను హెచ్ఎస్బీసీ హెడ్ సందీప్ బత్రా ఖరారు చేశారు. 2025లో భారత్‌తో పాటు సింగపూర్‌లో కూడా మ్యాచ్‌లు ఆడేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం ‘హెచ్ఎస్బీసీ’తో ఒప్పందం చేసుకుంది. 2011లో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు మెస్సీ మొదటిసారి భారత్‌కు వచ్చాడు. కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెనిజులాతో తలపడిన అర్జెంటీనా 1–0తో విజయం సాధించింది. -
ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయి
సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. భారత్ మీద ఆ ప్రభావాన్ని కొంత తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బోర్బన్ విస్కీ అండ్ కాలిఫోర్నియా వైన్స్ మీద దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు కొన్ని ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించి.. వాణిజ్య సంబంధాలను పెంచుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయి.ప్రభుత్వం గతంలో హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దీనిని మరింత తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. ఈ ప్రీమియం బైకులోను దేశంలో సరసమైన బైకుల జాబితాలోకి చేరుతాయి.బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. రెండు దేశాల మధ్య సజావుగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరి కొంత ట్యాక్స్ తగ్గించనున్నారు. ఈ వాణిజ్య చర్చలు మోటార్ సైకిళ్ళు, ఆల్కహాలిక్ పానీయాలకే పరిమితం కాలేదు. ఎందుకంటే ఇందులో ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతుల విస్తరణలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు.భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఔషధ రంగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అమెరికా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే భారతదేశం అమెరికాకు తన ఎగుమతులకు అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది. -
ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్‌కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్‌లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్‌లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్‌పీ, వాల్‌మార్ట్, ఫోర్డ్, స్టార్‌బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్‌ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్‌బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్‌లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్‌లో అంత లేదు.. భారత్‌లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్‌లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్‌లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్‌కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్‌లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్ -
ముల్లాన్‌పూర్‌లో మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ వేదికల వివరాలు బహిర్గతమయ్యాయి. ముల్లాన్‌పూర్ (పంజాబ్)లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. 34 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంగల ఈ స్టేడియం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండో హోంగ్రౌండ్‌గా ఉంది.ముల్లాన్పూర్తోపాటు విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, రాయ్‌పూర్‌లలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ముల్లాన్‌పూర్, తిరువనంతపురం, రాయ్‌పూర్‌లలో ఇప్పటి వరకు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. » అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ ఈ ఏడాది సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది. అయితే ఈ తేదీలను ఐసీసీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. » ఎనిమిది దేశాల మధ్య వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్య దేశం భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. » ఏప్రిల్ 9 నుంచి 19 వరకు లాహోర్‌లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు జట్లు ఖరారవుతాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహిస్తారు. » భారత్ నాలుగోసారి మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. గతంలో భారత్ 1978, 1997, 2013లలో ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్ 12 సార్లు జరగ్గా... భారత్ రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలిచింది. -
సుంకాల కోతకు సిద్ధం!
న్యూఢిల్లీ: ఇండియాలో సుంకాలు అధికంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా సుంకాలు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపై అదేస్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. ఇందులో చైనా, ఇండియా, మెక్సికో వంటి దేశాలు ఉన్నాయి. అమెరికాలో వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ ప్రతీకార టారిఫ్‌లు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.అమెరికా నుంచి దిగుమతి అయ్యేవాటిలో 55 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని నిర్ణయాని కొచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ను ఉటంకిస్తూ ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలియజేసింది. తగ్గించే సుంకాల విలువ 23 బిలియన్ డాలర్లు(రూ.1.96 లక్షల కోట్లు)గా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయం నుంచి మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటిపై టారిఫ్‌లు యథాతథంగా అమలవుతాయని వివరించింది. అల్మాండ్స్, పిస్తా, ఓట్మీల్, క్వినోవా వంటి వాటిపై సుంకాలు తగ్గుతాయని తెలిపింది.అమెరికా–ఇండియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలోభాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికాలో ప్రతీకార సుంకాల వల్ల భారతదేశ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌ల భారాన్ని భారత ప్రభుత్వం తగ్గించబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటుప్రస్తుతం ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై 5 శాతం నుంచి 30 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలను క్రమంగా తగ్గిస్తూ.. పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదన ఇప్పటికైతే చర్చల దశలోనే ఉంది. అమెరికాలో పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చేలోగానే ఆ దేశంతో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. టారిఫ్‌ల భారం ఇరుదేశాలపై పడకుండా ఈ ఒప్పందం ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలు తగ్గిస్తే... ఇండియా ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోతే భారత ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంది. భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. టారిఫ్‌ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సాధ్యమైనంత త్వరగా వాణిజ్య చర్చలు ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుతం ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 45.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును పూర్తిగా పూడ్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. -
కెనడా ఎన్నికల్లో పాక్ జోక్యం?: కెనడా ఆరోపణ
న్యూఢిల్లీ: భారతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్(Pakistan) ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వెనెస్సా లాయిడ్ ఈ ఆరోపణలు చేశారు.పాకిస్తాన్లో రాజకీయ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు, భారతదేశానికి(India) పెరుగుతున్న మద్దతును ఎదుర్కొనేందుకు పాక్ తన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా కెనడాతో విదేశీ దౌత్య కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా కెనడా.. పాక్, భారత్‌లపై ఇలాంటి ఆరోపణలను మోపింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల(Canadian general election) సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఎన్డీటీవీ ఒక కథనంలో.. రాబోయే కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న సమాఖ్య 2024లో గూఢచారి సంస్థ అందించిన సమాచారాన్ని విడుదల చేసిందని పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతిపరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనాడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ అనుకూల అభ్యర్థులకు అక్రమ ఆర్థిక సహాయం అందించిన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయిని లాయిడ్ ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు -
Manabendra Nath Roy మానవవాద విప్లవకారుడు
ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసు కోవాలంటే ఎం.ఎన్. రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాప కుడు (1917) కావడమేమిటీ? ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనను ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండ నివ్వలేదు. ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాప నతో పాటు భారత రాజ్యాంగ చిత్తుప్రతిని తయారు చేసి ప్రచురించారు. భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదానికి మేనిఫెస్టో’ని (న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో) రూపొందించి విడుదల చేశారు. తను స్థాపించిన ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్ ద్వారా దేశాన్నే కదిలించారు. డెహ్రాడూన్‌లో ఆయన నివాసమున్న చోటు నుండే ఆ సంస్థను నిర్వ హించారు. అది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. ఉత్తర భారత దేశం నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఆయన అనుచరులు, అభిమా నులు అక్కడికి తరలి వెళ్ళారు. మతతత్వ భావనకు వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమ న్నారు రాయ్. అందుకే ‘ఎడ్యుకేట్ ద ఎడ్యు కేటెడ్’ – విజ్ఞానవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచనని వ్యాప్తి చేశారు. 1887 మార్చ్ 21న పశ్చిమ బెంగాల్లో రాయ్ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. క్యాలిఫోర్నియాలో ఉండగా అక్కడి నిఘా విభాగాల దృష్టి మరల్చడానికి మానవేంద్ర నాథ్ రాయ్‌గా పేరు మార్చుకున్నారు. 14వ ఏటే అనుశీలన్ సమితిలో చేరారు. అది రహస్యంగా పని చేసే ఒక విప్లవ సంఘం. కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగాంతర్ గ్రూపులో చేరారు. ‘జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు’ అని తన గ్రంథం (చైనాలో నా అనుభావాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగాంతర్ సభ్యులు ఎన్నో కార్య క్రమాలు చేస్తుండేవారు. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్ళి వస్తుండేవారు. ఆయుధాలు సమకూర్చు కుని, బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది ఆయన ఉద్దేశం.రహస్యంగా అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎవిలిన్ ట్రెంట్‌తో స్నేహం పెరిగి పెండ్లి చేసుకున్నారు. తప్పనిసరై అక్కడి నుండి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపు లభించాయి. అందుకే ఆయన ‘జ్ఞాపకాల పుస్తకం’లో – మెక్సికో తనకు కొత్త జన్మ నిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు.మానవేంద్ర నాథ్ రాయ్ తర్వాత కాలంలో వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్‌ను కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్‌లో భాగస్వాము లయ్యారు. 1926లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఆ విధి విధానాల్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించేట్లు ఒప్పించ డానికి రాయ్ 1927లో చైనా వెళ్ళారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. రాయ్ ఒప్పించ లేక పోయారని కాబోలు, 1929లో ఆయ నను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుండి బహి ష్కరించారు. 1930లో రాయ్ భారత్‌కు తిరిగి రాగానే, ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిషు ప్రభుత్వం 1924 నాటి కాన్పూర్ బోల్షివిక్ కుట్ర కేసుతో అరెస్ట్ చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలై వచ్చాక రాయ్ నాలుగేళ్ళ పాటు ఇండి యన్ నేషనల్ కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉండి బయటపడ్డారు. 1946లో డెహ్రాడూన్‌లో భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత, బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయ్యింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతిపాదించిన ర్యాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్‌లు,కాంగ్రెస్ వాదులు, పార్టీరహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రేరణ పొందారు. 1954 జనవరి 25న తన 67వ ఏట గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ‘ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్య్ర సాధన’ అన్నది రాయ్ ఆశయాలలో ఒకటి. -వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతడా. దేవరాజు మహారాజు -
సమ సమాజమా? సంక్షేమ రాజ్యమా?
సామ్యవాద సమాజాన్ని నిర్మించడానికి ఇండియా కమ్యూనిస్టు పార్టీలు రెండు మార్గాలను ఎంచుకున్నాయి. మొదటిది– సాయుధ పోరాటం. రెండోది– పార్లమెంటరీ ఎన్నికలు. ఆయా పార్టీల నాయకులు అభిమానులు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోనూవచ్చు గానీ, అవి ఎంచుకున్న రెండు మార్గాలూ ఇప్పుడు దాదాపు మూసుకునిపోయాయి. ‘‘దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు’’ అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఓ యాభై ఏళ్ళ క్రితం చాలా గట్టిగా మాట్లా డేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యమాల్లో పాతవాళ్ళు తగ్గిపోతున్నారు; కొత్తవాళ్ళు రావడం లేదు. ఇది నేటి వాస్తవ స్థితి. దీనికి కారణం ఆ యా పార్టీలు అనుసరించిన విధానాలా? మరొకటా? అనే చర్చల వల్ల ఇప్పుడు ప్రయో జనం లేదు. చరిత్రలో జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిందేమిటీ? అనేదే చర్చనీయాంశం కావాలి. ప్రత్యామ్నాయ మార్గాలుసోషలిస్టు కలను సాకారం చేసుకోవడానికి అభిమా నులు వందేళ్ళు ఎదురుచూడటమే మహత్తర విషయం. దీర్ఘకాల పోరాటం కనుక ఇంకో వందేళ్ళు ఆగాలి అని ఎవరయినా చెప్పవచ్చు. వందేళ్ళు గడిచిపోయాయి కనుక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. సమ సమాజం కుదరకపోతే దానికి దగ్గరి ప్రత్యామ్నాయాలు ఏమిటీ? అనేది. దానికి వెంటనే స్ఫురించే సమాధానం సంక్షేమ రాజ్యం. నార్డిక్ దేశాలయిన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ సంక్షేమ దేశాలని చాలామందికి తెలుసు. పశ్చిమ యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్ కూడా తమవైన పద్ధతుల్లో సంక్షేమ రాజ్యాలని బయటికి అంత తెలీదు. వీటిల్లో జర్మనీ రాజకీ యార్థిక పరిణామాలతో ఇండియాకు పోలికలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1919 నుండి 1933 వరకు జర్మనీలో కొనసాగిన ‘వైమర్ రిపబ్లిక్’ను స్థూలంగా ప్రజాస్వామ్యయుత పాలన అనవచ్చు. 1933 నుండి 1945 వరకు అడాల్ఫ్ హిట్లర్ ‘నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ’ పేరిట ‘నాజీ’ పాలన సాగించాడు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి గరిష్ఠ రూపం... నాజీజం. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోయిన తరువాత జర్మనీ ‘మిత్రరాజ్యాల’ అధీనంలో వలస దేశంగా మారిపోయింది. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసి యూకే, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలు తలో భాగాన్ని తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఓ నాలుగేళ్ళు ప్రత్యక్ష వలస పాలన సాగాక జర్మనీ రెండుగా విడిపోయింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ల ప్రాబ ల్యంలోని పశ్చిమ ప్రాంతం 1949 మే 23న ‘ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ’ (ఎఫ్ఆర్జీ)గా అవతరించింది. అదే ఏడాది అక్టోబరు 7న రష్యా ప్రాబల్యంలోని తూర్పు ప్రాంతం ‘జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్’గా ఏర్పడింది. అప్పట్లో పశ్చిమ జర్మనీని పెట్టుబడిదారీ దేశంగానూ, తూర్పు జర్మనీని సోషలిస్టు దేశంగానూ చెప్పు కునేవారు. కారణాలు ఏమైనాగానీ, తూర్పు జర్మనీవాళ్ళకు పశ్చిమ జర్మనీ మీద గొప్ప మోజు వుండేది. వాళ్ళు పెద్ద ఎత్తున పశ్చిమ జర్మనీకి వలస పోయేవారు. దీనిని అరికట్టడానికి బెర్లిన్ నగరాన్ని రెండు ముక్కలు చేసి 1961 ఆగస్టు నెలలో అడ్డంగా భారీ గోడ కట్టింది తూర్పు జర్మనీ. దీనికి ‘ఫాసిస్టు వ్యతిరేక రక్షణ గోడ’ అని గొప్ప పేరు పెట్టారు. అయినా జీడీఆర్ నుండి వలసలు ఆగలేదు.హంగేరీ, జకోస్లోవేకియాల మీదుగా పశ్చిమ జర్మనీకి చేరు కోవడం మొదలెట్టారు. 1980ల చివర్లో తూర్పు జర్మనీతో పాటు పోలాండ్, హంగేరి, చెకోస్లావియా, రొమేనియా, బల్గేరియా తదితర తూర్పు యూరోప్ దేశాల్లోనూ సోష లిస్టు పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు మొదల య్యాయి. ఇవి ముదిరి 1989 నవంబరు 9న బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ తరువాత ఆరు దేశాలు సంయుక్తంగా చర్చించి 1990 అక్టోబరు 3న తూర్పు జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో విలీనం చేశాయి. జర్మనీ, ఇండియాల సామ్యం...రెండు జర్మనీల విలీనం అంటే విధానపరంగా పెట్టుబడిదారీ, సోషలిస్టు సమాజాల సంకీర్ణం అని అర్థం. ఇప్పటి జర్మనీలో ఈ రెండు ధోరణులేగాక ఉదారవాదం, మతవాదం తదితర అనేక ధోరణులు కనిపిస్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మితవాదులు పుంజుకున్న ప్పటికీ మధ్యేవాదులకు అధికారం దక్కింది. మనలాగే ప్రజాస్వామిక, నాజీయిస్టు, వలస, సోషలిస్టు, పెట్టుబడి దారీ దశలన్నింటినీ చవిచూసిన జర్మనీ ఇప్పుడు పశ్చిమ యూరప్‌లో ఒక మెరుగయిన సంక్షేమ రాజ్యంగా కొనసాగుతోంది. ఇండియా, జర్మనీ స్థూల జాతీయోత్ప త్తులు కూడా దాదాపు సమానం. ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావం మీద ఫాసిస్టా? కొత్త ఫాసిస్టా? సగం ఫాసిస్టా? అంటూ చర్చ సాగుతోంది. మన దేశంలో కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం కొన సాగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. దేశంలోని సహజ వనరుల్ని, మౌలికరంగాలను ఎలాగూ కార్పొరేట్ల పరం చేసేస్తారు. మనం గతంలో ఎన్నడూ ఊహించనంతటి భీకర విస్తాపన సాగుతుంది. దానిని ఇప్పట్లో ఎవరూ ఆపలేరు. సోషలిజం సాధించగల సత్తాగల పార్టీ ఒక్కటీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఆశించడం ఒక్కటే సమంజసంగా ఉంటుంది. మనం ఆ దిశగా ఆలోచించాలి. దానికోసం ప్రయత్నించాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776 -
'కీలక టెక్నాలజీ భాగస్వామిగా భారత్'
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత గల కీలక భాగస్వామిగా భారత్ ఉంటోందని ఆయన నాస్కామ్ గ్లోబల్ కాన్ఫ్లుయెన్స్ 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.అసాధారణ ప్రతిభావంతుల లభ్యత భారత్‌కి సానుకూలాంశంగా ఉంటోందని నంబియార్ వివరించారు. గ్లోబల్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ మొదలైన విభాగాలు) మార్కెట్లో భారత్‌కి 28 శాతం, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో 23 శాతం వాటా ఉందని తెలిపారు.మరోవైపు, అందరికీ ఏఐ ప్రయోజనాలు లభించాలన్న లక్ష్య సాధన దిశగా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని వాణిజ్య, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద చెప్పారు. పరిశ్రమ దిగ్గజాలు పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. -
కొంటే... కొరివి దయ్యమే!
‘‘భారత్ ఒక సరికొత్త ప్రపంచానికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది’’ – ట్రంప్‌ను ఉద్దేశించి విదేశీ వ్యవహా రాల మాజీ కార్యదర్శి ఒకరు అన్న మాట. ఈ కొత్త ప్రపంచం కేవలం ఒప్పందాలు, వ్యాపారాలకు మాత్రమే పరిమితమనీ; మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనీ కూడా ఆయన అన్నారు. ఒక దౌత్యవేత్త ఈ అంచనాకు వచ్చారంటే కచ్చితంగా అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యమైన వ్యక్తిత్వమే కారణమై ఉంటుంది.తేలిగ్గా చెప్పాలంటే... ఈ రోజుల్లో పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. కొత్త సంవత్సరంలో యూఎస్ఏ తన లావా దేవీలను వేగంగా మొదలు పెట్టేసింది. ఈ ఏకపక్ష ధోరణితో అమెరికా మిత్రులు, శత్రువులు కూడా తమని తాము కాపాడు కునేందుకు దాక్కుండిపోతున్నారు. లేదంటే వ్యక్తిగతంగా ట్రంప్ ముందు ప్రత్యక్షమై ఆయన శీతకన్ను పడకుండా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల కూడా ఏదో అర్థవంతమైన పని జరుగుతుందని ఎవరూ ఆశించడం లేదు.ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ట్రంప్ ఇప్పుడు అమెరికన్ కంపెనీ ‘లాక్‌హీడ్ మార్టిన్ ’ తయారు చేసిన ఎఫ్–35 యుద్ధ విమానాలు కొనమని భారత్‌కు చెబుతున్నారు. భారత్‌తో ఉన్న సుమారు 3,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అన్నమాట. అయితే ఏ అంత ర్జాతీయ ఒప్పందం, వ్యాపారమైనా కేవలం అమ్ముతామంటే సరిపోదు. కొంటున్నామని అవతలి వారు చెప్పాలి. భారత్దృష్టి కోణం నుంచి చూస్తే – అమెరికా అమ్ముతానూ అంది, మరి కొనదలుచుకుంటే ఆ ఎఫ్–35 యుద్ధ విమానాలు ఎలాంటివో పరిశీలించాలి కదా?తడిసి మోపెడు ఖర్చురవాణా, గాల్లోంచి సామగ్రి పడవేసే ‘డగ్లస్ డీసీ–3 డకోటా’, ‘ఫెయిర్ ఛైల్డ్ ప్యాకెట్ సీ119 జీ’ మినహా మరే ఇతర అమెరికా విమానాన్నీ భారతీయ వైమానిక దళం ఇంతవరకు వాడలేదు. 1947 నుంచి చూసినా అమెరికా యుద్ధ విమానం మన వద్ద ఎప్పుడూ లేదు. కాబట్టి అకస్మాత్తుగా ఎఫ్–35లను కొనుగోలు చేయడం అంటే, అది కూడా ట్రంప్ మాటపై ఆధారపడి అంటే... కొంచెం అనుమానంగా చూడాల్సిన వ్యవహారమే! అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు, చరిత్ర లను పరిగణనలోకి తీసుకుంటే ఇలా చూడటం మరీ ముఖ్య మవుతుంది. ఒక విషయమైతే స్పష్టం. భారత్ వంటి అతిపెద్ద దేశంలో వైమానిక దళం ఒక్క రోజులో సిద్ధం కాదు. వైమానిక దళాన్ని నిర్మించడం అంత తేలికైన వ్యవహారమూ కాదు. భారీ పెట్టు బడులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, రిస్క్ తీసుకో గలిగిన తెగువ, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ‘జేన్ ్స ఆల్ ద వరల్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్’ మ్యాగజైన్∙ప్రకారం... ఎఫ్–35 యుద్ధ విమానాలకు (ఐదో తరం, బహుళార్థక, స్టెల్త్ రకం) ఆర్డర్ పెట్టిన తరువాత మొదటి విమానం అందేందుకు 15 ఏళ్లు పడుతుంది! ఇంకో విషయం – భారత్ ఏ రోజు కూడా లాక్ హీడ్ తయారు చేసే యుద్ధ విమానపు కొనుగోలుదారుగా కానీ, అమెరికా పారిశ్రామిక భాగస్వామిగా కానీ లేదు. నిజానికి ఎఫ్–35 యుద్ధ విమానాలు హైటెక్ పాశ్చాత్య దేశాల కోసం, అమెరికా రక్షణకు, సెక్యూరిటీ భాగస్వాములైన ఇతర దేశాల కోసం ఉద్దేశించినవి. 1996లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్, సింగపూర్, స్పెయిన్ , స్వీడన్ లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఎఫ్–35లు ఖరీదైనవని అప్పుడే అర్థమైపోయింది (ట్రంప్ సుంకాల తీరుతో తాజాగా నాటో దేశాలు కూడా వీటి కొనుగోలు గురించి పునరాలోచనలో పడ్డాయి).ముందుగా యూకేతో కలిసి పనిచేయాలని, పది శాతం ఖర్చులు ఆ దేశం భరించాలని యూఎస్‌తో ఒప్పందం జరిగింది. ఇటలీ, నెదర్లాండ్స్ చెరి ఐదు శాతం ఖర్చులు భరించేలా ఒప్పందాలు కుదిరాయి. మూడో దశలో డెన్మార్క్, నార్వే... 1–2 శాతం ఖర్చులు భరించేలా భాగస్వాములైనాయి. అనంతరం, ఆస్ట్రేలియా, కెనడా, టర్కీ తమ ఖర్చు తామే భరించేలా చేరాయి. 2012–13 నాటి ‘జేన్ ్స ఆల్ ద వరల్డ్స్ ఎయిర్‌క్రాఫ్ట్’ పత్రికను చూస్తే ఒక్కో ఎఫ్–35ఎ యుద్ధ విమానం ఖరీదు సుమారు 3.73 కోట్ల డాలర్లు. 2017 నాటికి ఇది 9.43 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు సుమారు పది కోట్ల డాలర్ల పైమాటే (రూ.860 కోట్లు). మారకం విలువలు, రూపాయి బలహీనపడటం వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్–35ల కొనుగోలు భారత్ ఖజానాకు భారీగా కన్నమేసేదే! ఇంత భారీ ఖర్చు కచ్చితంగా రాజకీయంగానూ సంచలనంసృష్టిస్తుంది.దీంతోపాటే ఎఫ్–35 యుద్ధ విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత సమస్యలు చాలానే ఉన్నాయి. అమెరికాలోనూ దీని గురించి వివాదాలు ఉన్నాయి. సమస్యలు ఒకవైపు, ఎప్పటికప్పుడు పెరిగిపోయే ఖర్చులు ఇంకోవైపు ఈ యుద్ధ విమానపు కొనుగోలుపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఆర్థికాంశాలు, సాంకేతిక పరిజ్ఞాన అంశాలూ కాసేపు పక్కన పెడదాం. యుద్ధ విమానం భద్రత కూడా ఇక్కడ ప్రశ్నా ర్థకమే. 2010 అక్టోబరులో ఇలాంటి ఒక సమస్యను గుర్తించారు. విమానం ఎగురుతూండగానే ఎలాంటి ఆదేశాలూ లేకుండానే ఇంజిన్ ఆఫ్ అయ్యేందుకు వీలు కల్పించే ఓ సాఫ్ట్ వేర్ సమస్య తలెత్తింది. అప్పట్లో ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఈ విమానాలను కొంత సమయం పాటు నిలిపివేశారు కూడా! పదిహేనేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ యుద్ధ విమానం ప్రయాణిస్తూండగా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 జూన్ , జూలైల్లో ఎగ్లిన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం వద్ద కొన్నింటిలో ఇంజిన్ వైఫల్యం చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత వాటి వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కనుక అలాంటి విమానాలను కొని, కొరివితో తలగోక్కునే పరిస్థితిని భారత్ తెచ్చు కోదనే ఆశిద్దాం! అభిజిత్ భట్టాచార్యవ్యాసకర్త ‘ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ శాశ్వత సభ్యులు -
CWG 2030: భారత్ సిద్ధం! నిర్వహణ కోసం బిడ్ దాఖలు
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల (Commonwealth Games 2030) నిర్వహణ కోసం భారత్ అధికారికంగా బిడ్‌ను దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్‌లో నగరం పేరును కూడా పేర్కొన్నారు. భారత్‌కు ఈ క్రీడలు నిర్వహించే అవకాశం దక్కితే వాటికి అహ్మదాబాద్ వేదిక అవుతుంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ ప్రక్రియను పూర్తి చేసిందని కేంద్ర క్రీడా శాఖలోని ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.‘అవును, మనం 2023 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం పోటీ పడుతున్నాం. భారత్ తరఫున ఐఓఏ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా బిడ్‌ను సమర్పించాయి’ అని ఆయన చెప్పారు. నిర్వహణా కమిటీ ‘కామన్వెల్త్ స్పోర్ట్’ ఈ బిడ్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ కోసం పరిగణలోకి తీసుకుంటుంది. 2010లో భారత్‌లో కామన్వెల్త్ క్రీడలకు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ప్రకారం 2036 ఒలింపిక్స్‌ను కూడా మన దేశంలో నిర్వహించాలనే యోచన ఉంది. ఇందు కోసం కూడా ప్రాధమికంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దానికి ముందు సన్నాహకంగా ఈ కామన్వెల్త్ క్రీడల నిర్వహణతో తమ స్థాయిని ప్రదర్శించాలని భారత్ భావిస్తోంది. ఆసియా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యంఆరేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఆసియా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు అహ్మదాబాద్‌లోని నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక కానుంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల నుంచి మేటి స్విమ్మర్లు ఈ మెగా ఈవెంట్‌కు వచ్చే అవకాశముంది.‘గుజరాత్ ప్రభుత్వం, ఆసియా అక్వాటిక్స్ నుంచి ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు ఆమోదం లభించింది. వచ్చే నెలలో ఎంఓయూ కూడా జరుగుతుంది’ అని భారత స్విమ్మింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ మోనల్ చోక్సి తెలిపారు. చివరిసారి భారత్ 2019లో ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆసియా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో స్విమ్మింగ్, డైవింగ్, ఆరి్టస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో ఈవెంట్స్‌ను నిర్వహిస్తారు. -
మిత్ర దేశమే..కానీ టారిఫ్‌లే
వాషింగ్టన్: ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ, ఇండియాలో టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి టారిఫ్‌లు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు.ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులపైనా తాము అలాంటి చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇండియా సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలను క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఆ విధంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఇండియాలో అమెరికా ఉత్పుత్తులపై ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో ఏప్రిల్ 2 నుంచి ఇండియా ఉత్పత్తులపై తమ దేశంలో అలాంటి టారిఫ్‌లే అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్–ఎకనామిక్ కారిడార్(ఐమెక్)ను సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పారు. వ్యాపారం, వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. తమ శత్రువులను మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వారికి ఎలాంటి మర్యాద చేయాలో తమకు బాగా తెలుసని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు. -
దేశంలో ధనిక, పేద ఎమ్మెల్యేలు.. ఇద్దరూ బీజేపీవారే..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే, అత్యంత పేద ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీకి చెందినవారే. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 28 అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులను వారి అఫిడవిట్ల ఆధారంగా సంస్థ అధ్యయనం చేసింది. వారి మొత్తం ఆస్తులు మూడు చిన్న రాష్ట్రాల వార్షికబడ్జెట్‌ను మించిపోవడం విశేషం.ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. కర్నాటకలో మొత్తం 223 మంది ఎమ్మెల్యేలకు కలిపి రూ.14,179 కోట్ల ఆస్తులుండగా మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యే లదగ్గర రూ.12,424 కోట్ల సంపద ఉంది. మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ను మించి... 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.73,348 కోట్లు. ఇది 2023–24లో మేఘాలయ (రూ.22,022 కోట్లు), నాగాలాండ్ (రూ.23,086 కోట్లు), త్రిపుర (రూ.26,892 కోట్లు) రాష్ట్రాల ఉమ్మడి వార్షిక బడ్జెట్ల కంటే ఎక్కువ. ప్రధాన పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు అత్యధిక ఆస్తులున్నాయి. ఆ పార్టీకి చెందిన 1,653 మంది రూ. 26,270 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. 646 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.17,357 కోట్ల సంపద ఉంది. 134 టీడీపీ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.9,108 కోట్లు. 59 మంది శివసేన ఎమ్మెల్యేల వద్ద రూ.1,758 కోట్లున్నాయి. నిరుపేద ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ పశ్చిమబెంగాల్లోని ఇండస్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార అత్యంత పేద ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1,700 మాత్రమే. అత్యల్ప ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలున్న రాష్ట్రాలుగా త్రిపుర, మణిపూర్, పుదుచ్చేరి నిలిచాయి. 60 మంది త్రిపుర ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ.90 కోట్లు. మణిపూర్‌లోని 59 మంది ఎమ్మెల్యేలకు రూ.222 కోట్లు, పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలకు రూ.297 కోట్ల ఆస్తులున్నాయి. -
ఆన్లైన్ గేమింగ్.. జూమింగ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ హద్దే లేదన్నట్టుగా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ వింజోగేమ్స్, ఐఈఐసీ సంయుక్త అంచనా ప్రకారం.. 2024లో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ 3.7 బిలియన్ డాలర్లుగా ఉంటే (సుమారు రూ.32,000 కోట్లు).. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) వృద్ధి చెందనుంది. ముఖ్యంగా 86 శాతం వాటాతో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) విభాగం ఈ మార్కెట్‌ను శాసించనుంది. శాన్ఫ్రాన్సిస్కోలో గేమ్ డెవలపర్ల సదస్సులో భాగంగా ఈ సంయుక్త నివేదికను వింజోగేమ్స్, ఐఈఐసీ విడుదల చేశాయి. ‘‘భారత్‌లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ అసాధారణ వృద్ధి పథంలో కొనసాగుతోంది. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్ల మార్కెట్‌తో.. ఇన్వెస్టర్లకు 63 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలను అందించనుంది. టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు (ఐపీ), యూజర్లతో అనుసంధానం (ఎంగేజ్మెంట్) ద్వారా గేమింగ్‌కు భారత్‌ను బలమైన కేంద్రంగా (పవర్‌హౌస్) మార్చేందుకు వింజో కట్టుబడి ఉంది’’అని వింజో సహ వ్యవస్థాపకుడు పవన్ నంద తెలిపారు. 59 కోట్ల యూజర్లు.. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం చూస్తే దేశంలో 59.1 కోట్ల మంది గేమర్స్ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉన్న గేమర్లలో 20 శాతం ఇక్కడే ఉన్నారు. 11.2 బిలియన్ మొబైల్ గేమ్ యాప్ డౌన్లు నమోదయ్యాయి. 1,900 గేమింగ్ కంపెనీలతో ఈ రంగం సుమారుగా 1.3 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం 3 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం గమనార్హం. ప్రస్తుతం రూ.32 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ మార్కెట్లో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) వాటా 85.7 శాతంగా ఉంటే, 2029 నాటికి రూ.80 వేల కోట్ల మార్కెట్లోనూ 80 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. నాన్ రియల్ మనీ గేమ్స్ మార్కెట్ వాటా ఇదే కాలంలో 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో ఏకైక లిస్టెడ్ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ అంతర్జాతీయంగా లిస్టెడ్ గేమింగ్ కంపెనీల్లో అధిక ప్రీమియం వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత ఆన్లైన్ గేమింగ్ రంగం మార్కెట్‌కు (32వేల కోట్లు) నజారా మాదిరే విలువను ఆపాదించినట్టయితే.. అప్పుడు ఇతర గేమింగ్ కంపెనీల ఐపీవోల రూపంలో ఇన్వెస్టర్లకు 26 బిలియన్ డాలర్ల విలువ సమకూరనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకుతోడు, బలపడుతున్న గేమ్ డెవలపర్ ఎకోసిస్టమ్, సానుకూల నియంత్రణ వాతావరణంతో 2034 నాటికి ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 20 లక్షల ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది’’అని వివరించింది. -
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్‌తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్‌లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్‌గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్‌ట్రిప్‌గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
High Alert: పాక్‌లో వరుస ఉగ్రదాడులు.. జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా పాకిస్తాన్(Pakistan)లో ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతను మరింతగా పెంచుతూ, హై అలర్ట్ జారీ చేశారు. భద్రతా దళాలు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచాలంటూ ఆదేశాలు అందాయి. అలాగే జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ నేతలు, వీఐపీలు భద్రతా ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆర్మీ అధికారులు సూచించారు. పాక్‌లోని బలూచిస్తాన్‌లో ఇటీవల జరిగిన వరుస ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు(Safety warnings) జారీ చేశారు. కాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో ఉగ్రవాది కతాల్ హస్తముంది. కతాల్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తునిగా పేరొందాడు. అతనికి పూంచ్, రాజౌరిలలో నెట్వర్క్ ఉంది. పాక్‌లో అతని హత్య జరిగిన దరిమిలా, అతని వర్గం దాడులకు తెగబడే అవకాశాలున్నామని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో వీఐపీలంతా తమ టూర్ షెడ్యూళ్లను సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ముందుగానే తెలియజేయాలని రక్షణదళ అధికారులు తెలిపారు.వీఐపీలు తమ పర్యటన కార్యక్రమాలను చివరి నిమిషంలో మార్చుకోకూడదని, సూర్యాస్తమయం తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. వీఐపీలు, రాజకీయ నేతలు తమ కార్యక్రమాలను గోప్యంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహాయం తీసుకోవాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సమావేశం కాకుడదని, బహిరంగ సమావేశాలకు హాజరు కావద్దని సూచించారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ కలుసుకోవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా -
రెచ్చిపోయిన రిషి ధవన్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌గా ఆసియా స్టార్స్
తొట్ట తొలి ఆసియా లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆసియా స్టార్స్ కైవసం చేసుకుంది. ఉదయ్‌పూర్‌లోని మిరాజ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న (మార్చి 18) జరిగిన ఫైనల్లో ఇండియన్ రాయల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆసియా ప్రాంతానికి చెందిన మాజీలు, దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు. ఐదు జట్లు (ఇండియన్ రాయల్స్, ఆసియా స్టార్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొన్న ఈ టోర్నీలో ఆసియా స్టార్స్ విజేతగా అవతరించింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన ఇండియన్ రాయల్స్ ఫైనల్లో ఆసియా స్టార్స్ చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. 19.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఆసియా బౌలర్లు ఈశ్వర్ పాండే (4-0-31-3), రిషి ధవన్ (3.5-0-27-2), మునవీర (4-0-33-2), పవన్ సుయాల్ (4-0-19-1) రాయల్స్‌ను దెబ్బేశారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో సంజయ్ సింగ్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. నమన్ ఓఝా 5, రాహుల్ యాదవ్ 4, కెప్టెన్ ఫయాజ్ ఫజల్ 11, నగార్ 16, మనన్ శర్మ 14, సక్సేనా 15, బిపుల్ శర్మ 5, గోని 2, అనురీత్ సింగ్ 15 పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆసియా స్టార్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన రిషి ధవన్ (57 బంతుల్లో 83; 11 ఫోర్లు, సిక్స్) బ్యాటింగ్‌లో రెచ్చిపోయి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ధవన్‌కు మరో ధవన్ (రాఘవ్) సహకరించాడు. రాఘవ్ ధవన్ 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఆసియా స్టార్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసియా స్టార్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ డకౌట్ కాగా.. కశ్యప్ ప్రజాపతి 15, దిల్షన్ మునవీర 2, సరుల్ కన్వర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇండియన్ రాయల్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, అనురీత్ సింగ్, బిపుల్ శర్మ, మనన్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధవన్, మునాఫ్ పటేల్, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆడారు. -
మహిళల ప్రపంచకప్ కోసం...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న కోల్‌కతాలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజు అక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ కమిటీపై కసరత్తు పూర్తి చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ఉత్పాదనలకు సంబంధించిన ప్రకటనలు క్రికెట్ మైదానంలో నిషేధం, క్రిప్టో కరెన్సీపై గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే మెగా ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కౌన్సిల్ అజెండాలో కమిటీ ఏర్పాటుతో పాటు మెగా ఈవెంట్ వేదికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు 2025–26 దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారని, అలాగే భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్ వేదికలపై కూడా అపెక్స్ కౌన్సిల్ చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. పొగాకు, మద్యం ప్రకటనలపై ఇదివరకే ఐపీఎల్ సీజన్లో విధించిన నిషేధాన్ని బోర్డు అమలు చేయనుంది. టీమిండియా పురుషుల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను రెండుసార్లు గెలిచినప్పటికీ... భారత మహిళల జట్టుకు మాత్రం ఆ ‘కప్’ అందని ద్రాక్షే అయ్యింది. ఫైనల్ చేరిన రెండు సార్లు కూడా అమ్మాయిల జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కనీసం ఈ ఏడాదైన సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో చూడాలి! -
చైనా వాల్ తరహాలో భారత్ వాల్.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారతదేశం సరిహద్దు వెంబడి ఒక భారీ గోడను నిర్మించనుంది. ఈ గోడ 1,400 కిలోమీటర్ల పొడవున ఉండనుంది. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. పాకిస్తాన్(Pakistan) సరిహద్దుల్లో ఉన్న ఎడారి ప్రాంతాలను తిరిగి పచ్చగా మార్చడమే లక్ష్యంగా ఈ గోడను నిర్మించనున్నారు.ఆరావళి పర్వత శ్రేణి(Aravalli mountain range)ని పచ్చగా మార్చడం, సహజ అడవులను కాపాడటం, చెట్లు, మొక్కల పరిరక్షణ, వ్యవసాయ భూమి, నీటి వనరులను కాపాడేందుకు ఈ భారీ గోడను నిర్మించాలని భారత్ భావిస్తోంది. ఇది చైనా గ్రేట్ వాల్ మాదిరిగా ఉంటుదనే మాట వినిపిస్తోంది. గుజరాత్‌లోని పోర్బందర్ నుండి ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు 1,400 కి.మీ పొడవైన గ్రీన్ వాల్‌ను నిర్మించనున్నారు. ఇది మహాత్మా గాంధీ జన్మస్థలం, సమాధి స్థలాలను అనుసంధానిస్తుంది.ఇది రాజస్థాన్, హర్యానాలోని 27 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆరావళి అటవీ పునరుద్ధరణ ప్రాజెక్ట్. దీని వలన 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా భూభాగంలో అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్‌కు చెందిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొందింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 7,500 కోట్లు. దీనికి కేంద్రం 78 శాతం, రాష్ట్రాలు 20 శాతం, అంతర్జాతీయ సంస్థలు రెండు శాతం నిధులు సమకూర్చనున్నాయి. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి -
భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా
బీజింగ్: భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా.. ప్రధాని నరేంద్ర మోదీ చేసి వ్యాఖ్యలను స్వాగతించింది. తమ దేశం భారత్ తో స్నేహం కోసం ఎదురుచూసే వేళ మోదీ ఈ తరహాలో పాజిటివ్ గా మాట్లాడగం నిజంగా అభినందనీయమని చైనా విదేశాంగ ప్రతినిధి మావ్ నింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తాము భారత్ నుంచి ఆశిస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆమె. ఇరు దేశాలది ఎన్నో ఏళ్ల చరిత్రభారత్, చైనాలకు గత కొన్ని శతాబ్దాలుగా చారిత్రాత్మ ఘనతలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని రాటుదేలిన దేశాలు భారత్, చైనాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పాడ్ కాస్టర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంతర్జాతీయ అంశాలను మోదీ ప్రసావించారు. దీనిలో భాగంగా చైనాతో సంబంధాల గురించి ప్రస్తావించగా మోదీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ప్రధానంగా ఇటీవల ఎలిఫెంట్, డ్రాగన్’ కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై పాడ్ కాస్ట్ లో అడగ్గా మోదీ సూటిగా బదులిచ్చారు.పోటీ అనేది వివాదం కాకూడదు..ఎక్కడైనా పోటీ అనేది వివాదం కాకూడదని, బేధాభిప్రాయాలు అనేవి ఘర్షణ వాతావరణాకి దారితీయకూడదని అంటూ చైనాను ఉద్దేశించి మోదీ సుతిమెత్తని శైలిలో చెప్పుకొచ్చారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఇరు దేశాల జీడీపీ.. వరల్డ్ జీడీపీలో 50 శాతానికి పైగానే ఉందన్నారు మోదీ. తమ మధ్య ఎంతో బలమైన సంబంధాలున్నాయనే తాను నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు.ఎలిఫెంట్, డ్రాగన్ డ్యాన్స్ కలిసి చేద్దాంసరిగ్గా పదిరోజుల క్రితం భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కొంత కాలంగా ఇరుదేశాల మధ్య సామరస్య వాతావరణం2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
చిగురిస్తున్న డాలర్ కల..
భారతీయుల అమెరికా కలలు మళ్లీ చిగురిస్తున్నాయి. విద్య, పర్యాటక వీసాల విషయంలో భారత్ పై అగ్రరాజ్యం కాస్త సానుకూల దృక్పథంతో ఉండటం కలిసొచ్చే అంశం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత వివిధ దేశాలపై కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. అక్రమ వలసల పేరుతో వేట కొనసాగుతోంది. తాజాగా 41 దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ దేశాలను మూడు కేటగిరీలుగా విభజించి పర్యాటక వీసాలపై ఆంక్షలు పెట్టాలని నిర్ణయించినట్టు అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ మూడు జాబితాల్లోనూ భారత్ ప్రస్తావన లేకపోవడంతో మనవాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాత రోజులు మళ్లీ రాబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థలు భావిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో తాత్కాలిక ఉద్యోగాలపై కూడా భారతీయులకు ఊరట లభిస్తుందని ప్రవాస భారతీయులూ అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్41 దేశాలు... మూడు కేటగిరీలు 41 దేశాల నుంచి వచ్చే పర్యాటక, విద్యాపరమైన వీసాలపై ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలుగా విభజించారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న 11 దేశాలను చేర్చారు. వాణిజ్య మైత్రి కొనసాగుతున్న ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలున్న దేశాలను ఆరెంజ్ కేటగిరీలో పెట్టారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా 10 దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. మనవాళ్ల అవసరం ఉండబట్టే.. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11.26 లక్షలు. వారిలో 29% భారతీయులే. సాఫ్ట్వేర్ రంగంలో కీలకమైన ఉద్యోగాల్లోనూ భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో గతంలో చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవాళ్లు. ఈ స్థానాన్ని భారత్ అధిగమించింది. ఈ కారణంగానే ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించే సాహసం అమెరికా చేయడం లేదనేది కన్సల్టెన్సీల అభిప్రాయం. అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్టులోనూ ఇదే వెల్లడైంది. పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది 10% పెరిగి 1,96,567కు చేరింది. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 13% పెరిగి 36,053కు చేరింది. అమెరికాలోనే ఉపాధి పొందాలని భావిస్తూ.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) తీసుకుంటున్న భారతీయుల సంఖ్య 97,556 (2024లో 41% ఎక్కువ)కు చేరింది. ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఐటీ సెక్టార్లో పనిచేసే సామర్థ్యం భారతీయులకే ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్టు పేర్కొంది. దీంతో భవిష్యత్‌లోనూ భారతీయ వీసాలపై పెద్దగా ఆంక్షలు ఉండవనే సంకేతాలు వస్తున్నాయని ప్రవాసులు అంటున్నారు.శుభ సంకేతాలేఆంక్షల విషయంలో భారత్‌ను కొంత సానుకూలంగా చూడటం శుభ పరిణామం. అయితే, తాత్కాలిక ఉద్యోగాల విషయంలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. నిబంధనలకు విరుద్ధంగా చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేయాలనే ఆలోచనలో విద్యార్థులు ఉండొద్దు. ఇప్పటికీ అమెరికాలో ఇలాంటి వారిని గుర్తించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే, వాణిజ్యపరంగా చూస్తే, ఆంక్షల వల్ల మానవవనరుల కొరత ఉంది. కాబట్టి ఎక్కువ కాలం ఆంక్షలు ఉండకపోవచ్చు. కొన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను ఏరేసిన తర్వాత భారతీయులకు కొంత స్వేచ్ఛ ఉండే వీలుంది. –వి.నరేష్, అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయుడుకొంత ఊరట లభించినట్టేమూడు కేటగిరీల్లో భారత్ లేకపోవడం ఆశాజనకం. అమెరికాలో విద్యకు వెళ్లే ప్రతీ విద్యార్థి అక్కడ తాత్కాలిక ఉపాధి కోసం యత్నిస్తారు. మనవాళ్లకు కష్టపడి పనిచేసే స్వభావం ఉంది. అమెరికన్ కంపెనీలు ఈ విషయాన్ని గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న భయాలు భవిష్యత్‌లో తొలగిపోతాయని భావిస్తున్నాం. – ఈవీఎల్ఎన్ మూర్తి (కన్సల్టెంట్ సంస్థ ఎండీ, హైదరాబాద్)వీసాలపై అమెరికా ఆంక్షలు విధించే 3 కేటగిరీ దేశాలురెడ్ జోన్: అఫ్గానిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తరకొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనెజువెలా, యెమన్ఆరెంజ్ జోన్: బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియెరాలియోన్, సౌత్ సూడాన్, తుర్క్మెనిస్తాన్ఎల్లో జోన్: అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరాన్, కేప్‌వెర్డ్, చాడ్, కాంగో, డీఆర్ కాంగో, డొమినీసియా, గునియా, గాంబియా, లైబేరియా, మాలావి, మాలి, మారింటానియా, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్, లూసియా, సావో టామ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే -
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ., లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు. -
భారత్‌కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.వ్యాధి నిర్మూలనలుపోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.నేడు క్షయవ్యాధి (TB)పై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.డిజిటల్ విప్లవంబ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటోభారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది. -
లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటైందే తప్ప, రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కాదని సీపీఎం నేత, పార్టీ మధ్యంతర సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష లౌకిక పార్టీలతో కూడిన విస్తృత వేదిక ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి విస్తృత కూటమి మాత్రమే ఎన్నికల రాజకీయ ప్రయో జనాలకు పరిమితమై పోకుండా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.శనివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మా ట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సా రథ్యంలోని ఎన్డీఏను దీటుగా ఎదు ర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడటం తెల్సిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని కారత్ వివరించారు. ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నారు. కూటమి పార్టీలకు రాష్ట్రాల్లో తమ సొంత రాజకీయ సమీకరణాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇండియా కూటమి ఏర్పాటు, అన్ని రాష్ట్రాల్లో కాకున్నా కనీసం కొన్ని చోట్లయినా సభ్య పార్టీల్లో సమన్వయం కుదరడంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కోల్పోయేందుకు కారణమైందన్న విషయం మాత్రం వాస్తవమని కారత్ విశ్లేషించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్రలో ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మెరుగైన పనితీరు కనబరిచి, బీజేపీకి షాక్ ఇవ్వగలిగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కూటమిలో అనైక్యత కారణంగా ఫలితాలు తారుమారయ్యాయి’అని కారత్ చెప్పారు. ‘జార్ఖండ్‌కు వచ్చే సరికి ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు ఇక్కడ ఐక్యంగా పనిచేసి, బీజేపీని ఓడించాయి.పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఫలితాలు మారుతూ వచ్చాయి’అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష లౌకికవాద పార్టీలు విశాల వేదిక ఏర్పాటు కోసం ముందుగా ఆయా పార్టీల అవసరాలను, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక రూపు తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే, బిహార్, తమిళనాడుల్లో ఇటువంటి కూటములు కొనసాగుతున్నాయని గుర్తు చేసిన ప్రకాశ్ కారత్.. పశ్చిమబెంగాల్, ఢిల్లీల్లో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. బెంగాల్లో టీఎంసీ, సీపీఎంలకు పొసగనట్లే ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆప్‌లు కలిసి సాగడం సాధ్యం కాని నేపథ్యముందని తెలిపారు.అసలు ఇండియా కూటమి లక్ష్యం ఎన్నికలేనా? అదే అయితే, ఎన్నికల నుంచి ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగుతుందా?అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కారత్ వ్యాఖ్యానించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఇండియా కూటమి వైఖరి ఎంతో సంక్లిష్టంగా తయారవుతుందని చెప్పారు. ‘ప్రతిపక్ష ఐక్య వేదిక పూర్తిగా ఎన్నికలకు సంబంధించింది అనుకోరాదు. మోడీ ప్రభుత్వం, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల వేదిక ఇది’అని కారత్ తెలిపారు.లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం పరిరక్షణ గురించి ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నట్లయితే ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ఇప్పటికీ అవకాశాలున్నాయని, ఇదే ప్రాతిపదికగా ఈ ఉద్యమాన్ని తీసు కువెళ్లవచ్చునని పేర్కొన్నారు. మోదీ ప్ర భుత్వం, దాని విధానాలకు ప్రత్యామ్నా యమే లక్ష్యమైతే ఆ దిశగా ఇండియా కూ టమిని నిర్మించుకోవాల్సి ఉంటుందని కారత్ తెలిపారు.బెంగాల్లో సీపీఎంను మళ్లీ నిలబెడతాంపశ్చిమబెంగాల్లో సీపీఎంను మళ్లీ బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ప్రకాశ్ కారత్ వివరించారు. ఇందులో భాగంగా, వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా ఏకం చేస్తా మన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని కారత్ వెల్లడించారు.బెంగాల్లో పార్టీ పునాదులు బలహీనమయ్యాయని, అందుకే ఎన్నికల్లో ఫలితాలను సాధించలేక పోతోందని వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్దతును తిరిగి కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఈ విషయంలో కొంతమేర ఫలితాలు కనిపించాయన్నారు. అదే సమయంలో కేరళలో అనూహ్యంగా వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి, దీర్ఘ కాలం అధికారంలో కొనసాగడంపై దృష్టి సారించిందని అన్నారు.త్రిభాష సూత్రంపై కేంద్రం మొరటు ధోరణినూతన విద్యా విధానంలోని త్రిభాష సిద్ధాంతం అమలుపై కారత్ మాట్లాడు తూ..‘దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల విష యంలో కేంద్రం సున్నితంగా వ్యవహరించడం లేదు. అన్ని భాషలకు సమాన ప్రా ముఖ్యం ఇవ్వాలే తప్ప, ఒక భాషను బల వంతంగా అమలు చేసేందుకు ప్రయత్నించరాదు’అని కారత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విషయంలో తమిళనాడు అభి ప్రాయాలకు తగు ప్రాతిపదిక ఉందని చె ప్పారు. హిందీని ప్రోత్సహించాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉందన్నారు. దక్షిణాది రా ష్ట్రాల అభ్యంతరాలకు కారణమిదేనని కార త్ తెలిపారు. విద్యావిధానంపై కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వా లని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ విషయంలో కేంద్రం పెత్తనమే కనిపిస్తోందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ చెప్పారు. -
దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్‌లకు ఏమి దక్కాయి?
పొరుగుదేశం పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్‌ప్రెస్(Jaffer Express) హైజాక్ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపద్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య రైల్వే సంబంధాలపై చర్చ జరుగుతోంది. దేశవిభజన జరిగాక రైల్వే విషయంలో ఏం జరిగింది? ఆ సమయంలో భారత్, పాక్‌లకు ఏమేమి దక్కాయనే అంశంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.1947లో భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించాక దేశం విభజనతో పాటు రైల్వేలను కూడా విభజించారు. నాడు మన దేశంలో రైల్వే నెట్వర్క్(Railway network) చాలా తక్కువగా ఉండేది. విభజన తర్వాత పాకిస్తాన్‌కు కొన్ని రైళ్లు, ఉద్యోగులు, కొంత నగదు అప్పజెప్పారు. భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టిన ఘనత బ్రిటిష్ వారికే దక్కుతుంది. భారతీయ రైల్వేలు 1845 మే 8న ప్రారంభమయ్యాయి. అయితే రైల్వే లైన్ వేసే పని 1848లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక, భూసేకరణ తదితర పనులకు మూడేళ్లు పట్టాయి.1853లో బొంబాయి (ఇప్పుడు ముంబై)- థానే మధ్య దాదాపు 34 కి.మీ.ల మొదటి ట్రాక్ నిర్మించారు. ఈ ట్రాక్‌పై మొదటి రైలు 1853, ఏప్రిల్ 16న నడిచింది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు 11 వేల కి.మీ.లకు పైగా పొడవైన రైల్వే లైన్ పాకిస్తాన్ వైపునకు వెళ్ళింది. దీని కారణంగా రైల్వే పెట్టుబడి మూలధనంలో దాదాపు రూ. 150 కోట్లు పాకిస్తాన్ వాటాలోకి వచ్చాయి. విభజన సమయంలో పాకిస్తాన్‌కు పలు రైళ్లు అప్పగించారు. రైల్వే డివిజన్ వర్క్‌షాప్(Railway Division Workshop) కూడా పాకిస్తాన్‌కు దక్కింది. అయితే రైల్వే వర్క్‌షాప్‌ను రెండు దేశాలు ఉపయోగించుకోవాలని నాడు నిర్ణయం తీసుకున్నారు.ఈ వర్క్‌షాప్‌ను రెండు దేశాలు చాలా కాలం పాటు ఉపయోగించుకున్నాయి. రైల్వే కార్మికులను కూడా రెండు దేశాల మధ్య విభజించారు. రైళ్లను నడపడం నుండి రైల్వేలను నిర్వహించడం వరకు ఇరు దేశాల మధ్య విభజన జరిగింది. దేశ విభజన సమయంలో, దాదాపు 1.26 లక్షల మంది రైల్వే కార్మికులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో భారతదేశంలోనే దాదాపు లక్ష మంది రైల్వే కార్మికులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకూ కూడా రెండు దేశాల మధ్య ఒక రైలు నడిచింది. దాని పేరు సంఝౌతా ఎక్స్‌ప్రెస్. ఈ రైలు 1976 జూలై 22న ప్రారంభమైంది. దీనిని సిమ్లా ఒప్పందం కింద నడిపారు. ఈ రైలు నాడు పంజాబ్‌లోని అట్టారి నుండి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు నడిచేది. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపధ్యంలో 2019, ఫిబ్రవరి 28న ఈ రైలును రద్దు చేశారు.ఇది కూడా చదవండి: బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు -
ఫైర్ లేని వాల్స్!
సాక్షి, హైదరాబాద్: ప్రతీ రంగంలో సాంకేతికత అత్యంత కీలకంగా మారింది. అదేస్థాయిలో సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంటోంది. ఏదైనా సంస్థ నెట్‌వర్క్‌ను భద్రంగా ఉంచేందుకు పటిష్టమైన ఫైర్‌వాల్ రక్షణ వ్యవస్థ తప్పనిసరి. అయితే, హ్యాకర్ల దాడుల విషయంలో భారతీయ కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లు బలహీనమని గ్రూప్–ఐబీ సంస్థ ఇటీవల విడుదల చేసిన హైటెక్ క్రైం ట్రెండ్స్ రిపోర్ట్–2025లో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన సైబర్ దాడుల్లో అత్యధికంగా 13 శాతం ఘటనలు భారత్‌లోనే జరిగినట్టు ఆ నివేదిక స్పష్టంచేసింది. ప్రధానంగా విద్యాసంస్థలకు సంబంధించిన నెట్వర్క్లపైనే హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ప్రభుత్వరంగ సంస్థల నెట్వర్క్, మిలిటరీ, ఆర్థికసేవల సంస్థల నెట్‌వర్క్‌లు హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. హ్యాకర్లు ఫైర్‌వాల్స్‌ను ఛేదించి సదరు నెట్‌వర్క్‌లోకి చొరబడి మొత్తం వ్యవస్థను తమ అ«దీనంలోకి తీసుకుని సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు తెలిపింది. డేటా లీకేజీలో అమెరికాది తొలిస్థానంపబ్లిక్ డొమైన్లో ఉండే డేటా లీకేజీలో అమెరికా తొలిస్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2024లో ఈ తరహా ఘటనలు అమెరికాలో 214 నమోదైనట్టు పేర్కొంది. తర్వాత స్థానంలో రష్యా (195 ఘటనలు) ఉండగా.. భారత్ (60) మూడో స్థానంలో నిలిచినట్టు గ్రూప్–ఐబీ నివేదిక పేర్కొంది. ఈ–మెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, పాస్వర్డ్లు ఈ డేటా లీకేజీలో ఉంటున్నాయి. 2024లో ఈ–మెయిల్ అడ్రస్‌లు, పాస్‌వర్డ్‌లను డార్క్‌వెబ్‌లో విక్రయించడం ద్వారానే సైబర్ నేరగాళ్లు రూ.248.9 కోట్లు కొల్లగొట్టారు.ఫైర్‌వాల్స్ అంటే? అనధికారికంగా నెట్‌వర్క్‌లోకి చొరబడకుండా, హానికరమైన డేటాను నెట్‌వర్క్‌లోకి చొప్పించకుండా రక్షించే భద్రతా పరికరమే ఫైర్‌వాల్. ఇది హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ కావొచ్చు. నెట్వర్క్ ప్యాకెట్లను పరిశీలించి వాటిని అనుమతించాలా లేదా నిరోధించాలా అనేదాన్ని ఫైర్‌వాల్ నిర్ణయిస్తుంది. ఫైర్‌వాల్స్ ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయకుండా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను నిరోధించగలవు. -
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!
2025లో ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల యొక్క విస్తరించిన జాబితాలో 7 భారతీయ రెస్టారెంట్లు స్థానం పొందాయి. 2025లో ఆసియాలోని ఉత్తమ రెస్టారెంట్ల సంకలనం 51వ నుండి 100వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైంది. ఏడు భారతీయ సంస్థలు దీనిలో చోటు దక్కించుకున్నాయి. ఈ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో ఏడు భారతీయ సంసథలు చోటు దక్కించుకున్నాయి. ఈ రెస్టారెంట్ల అవార్డుల ప్రదానోత్సవం ఆవిష్కరణ ఈ నెల ఆఖరున సియోల్ జరగనుంది. ఆ జాబితాలో చోటు దక్కించుక్ను ఏడు భారతీయ రెస్టారెంట్లు వరుసగా కసౌలిలోని నార్ (66వ స్థానం), బెంగళూరులోని ఫార్మ్లోర్ (68వ స్థానం), ముంబైలోని అమెరికానో (71వ స్థానం), న్యూఢిల్లీలోని ఇంజా (87వ స్థానం), ముంబైలోని ది టేబుల్ (88వ స్థానం), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (89వ స్థానం), ముంబైలోని ది బాంబే క్యాంటీన్ (91వ స్థానం). అంతేగాదు ముంబైలోని ది టేబుల్ రెండోసారి ఈ జాబితో నిలిచింది. గతంలో ఈ లిస్ట్‌లో నిలవడమేగాక "వన్ టు వాచ్ " అవార్డుని కూడా దక్కించుకుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నార్, ఫార్మ్లోర్, ఇంజా రెస్టారెంట్లు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇక తొలిస్థానంలో సియోల్‌లోని బోర్న్ అండ్ బ్రెడ్ నిలిచింది. మొదటి పది స్థానాలలో బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ సియోల్‌కి సంబంధించిన ఆరు రెస్టారెంట్లు ఉండటం విశేషం. కాగా, గతేడాది ఐదు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోగా ఈ ఏడాది మరో రెండు రెస్టారెంట్లు ఈ జాబితాలో చేరడం విశేషం. (చదవండి: మత్స్యకారుడి కూతురు జలక్రీడల్లో సత్తా చాటుతోంది..!) -
రైలు హైజాక్‌లో ఢిల్లీ హస్తమంటూ పాక్ కూతలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇటీవల బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్ పాత్ర ఉంది పాకిస్థాన్ ఆరోపించింది. అంతేకాకుండా పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్ కృషి చేస్తోందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇటీవల బలుచిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భారత్ కారణమంటూ తాజాగా పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. భారత మీడియా బీఎల్ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తోంది అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.ఈ నేపథ్యంలో షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ నిరాధార ఆరోపణలు చేస్తోంది. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందు అవ్వన్నీ చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025ఇదిలాఉండగా.. ఇటీవల పాక్‌లోని బలోచిస్థాన్‌లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పటికే బలోచ్ మిలిటెంట్లు 33 మందిని చంపేసినట్లు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు వారి చేతిలో హతమయ్యారని తెలిపింది. -
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు షురూ..(ఫొటోలు)
-
మూడేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీ..
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న వినియోగ మార్కెట్‌గా భారత్ మారుతోందంటూ.. స్థూల ఆర్థిక స్థిరత్వానికితోడు, మెరుగైన మౌలిక వసతులతో ప్రపంచ ఉత్పాదకతలో భారత్ తన వాటా పెంచుకోనున్నట్టు తెలిపింది. 2023 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. 2026 నాటికి 4.7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడం ద్వారా యూఎస్, చైనా, జర్మనీ తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. 2028లో 5.7 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరుతుందని పేర్కొంది. 1990లో ప్రపంచంలో 12వ స్థానంలో భారత్ ఉన్నట్టు తన నివేదికలో గుర్తు చేసింది. ఆ తర్వాత 2000 నాటికి 13వ స్థానానికి దిగిపోయిందని..తిరిగి 2020లో 9వ ర్యాంక్నకు, 2023లో 5వ స్థానానికి మెరుగుపడినట్టు వివరించింది. ప్రపంచ జీడీపీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2029 నాటికి 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది. 2035 నాటికి 10.3 ట్రిలియన్ డాలర్లు.. భారత ఆర్థిక ప్రగతి విషయమై మోర్గాన్ స్టాన్లీ మూడు రకాల అంచనాలు వేసింది. ‘‘బేర్ కేసులో (ప్రతికూల పరిస్థితుల్లో) భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి ఉన్న 3.65 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2035 నాటికి 6.6 ట్రిలియన్ డాలర్లకు విస్తరించొచ్చు. బేస్ కేసులో (తటస్థ పరిస్థితుల్లో) 8.8 ట్రిలియన్ డాలర్లకు.. బుల్ కేసులో (సానుకూల పరిస్థితుల్లో) 10.3 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది’’అని తెలిపింది. 2025లో తలసరి ఆదాయం 2,514 డాలర్లుగా ఉంటే బేర్ కేసులో 4,247 డాలర్లకు, బేస్ కేసులో 5,683 డాలర్లకు, బుల్ కేసులో 6,706 డాలర్లకు వృద్ది చెందుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఉత్పాదకతలో భారత్ వచ్చే దశాబ్ద కాలంలో తన వాటాను పెంచుకుంటుంది. జనాభాలో వృద్ధి, స్థిరమైన ప్రజాస్వామ్యం, విధానపరమైన మద్దతుతో స్థూల ఆర్థిక స్థిరత్వం, మెరుగైన మౌలిక వసతులు, పెరుగుతున్న వ్యాపార వర్గం, సామాజిక పరిస్థితుల్లో మెరుగుదల అనుకూలించనున్నాయి’’అని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. అతిపెద్ద వినియోగ మార్కెట్ ప్రపంచంలో టాప్ వినియోగ మార్కెట్‌గా భారత్ అవతరించనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా. ఇంధన పరివర్తనం దిశగా భారత్ అతిపెద్ద మార్పును చూడనుందని.. జీడీపీలో రుణ నిష్పత్తి పెరుగుతోందని, అదే సమయంలో జీడీపీలో తయారీ రంగం వాటా సైతం వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘ఇటీవలి వారాల్లో అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ, కొన్ని నెలల క్రితంతో పోల్చి చూస్తే మెరుగ్గా ఉన్నాయి. ద్రవ్య, పరపతి విధాన మద్దతుకుతోడు, సేవల ఎగుమతులు పుంజుకోవడంతో 2024 ద్వితీయార్ధంలో మందగమనం నుంచి వృద్ధి కోలుకుంటుందని భావిస్తున్నాం’’అని పేర్కొంది. 2024–25లో జీడీపీ 6.3 శాతం మేర, 2025–26లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో వినియోగం అన్ని విభాగాల్లోనూ కోలుకోవచ్చంటూ.. ఆదాయ పన్ను తగ్గింపు పట్టణ డిమాండ్‌కు ప్రేరణనిస్తుందని, గ్రామీణ వినియోగానికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. 2024–25లో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, 2025–26లో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. సేవల ఎగుమతుల్లో ఉన్న వృద్ధి వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతను కొంత వరకు భర్తీ చేస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా మందగమనం లేదా సమీప కాలంలో మాంద్యం వంటి పరిస్థితులు తలెత్తితే అవి తమ అంచనాలకు సవాలు కాగలవని.. అలాంటి పరిస్థితుల్లో 2025లో భారత ఈక్విటీలు గరిష్ట స్థాయిలకు దూరంగా ఉండొచ్చని పేర్కొంది. -
Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా మార్చి 14న జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతీ ఇంటిలోనూ సన్నాహాలు మొదలయ్యాయి. రంగులను కొనుగోలు చేసి, వాటితో ఆటలాండేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సహజసిద్ధమైన రంగులనే వాడాలంటూ పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ రంగుల కేళి హోలీని కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.హోలీ పండుగ అందరూ కలసి చేసుకునే వేడుక. ఇది ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. మనుషుల మధ్య ఉండే శతృత్వాలను కూడా హోలీ తరిమికొడుతుందని చెబుతుంటారు. పలు దేశాలలో స్థిరపడిన భారతీయులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటారు.నేపాల్హోలీ పండుగను మన పొరుగుదేశమైన నేపాల్లోనూ అత్యంత వేడుకగా జరుపుకుంటారు. దీనిని నేపాల్‌లో ఫాల్గుణ పూర్ణిమ అని అంటారు. కాఠ్మాండు తదితర నగరాల్లో హోలీ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జనం ఈ వేడుకల్లో పాల్గొని ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని, ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగిస్తారు.యునైటెడ్ కింగ్డమ్హోలీ పండుగ బ్రిటన్‌లోని భారతీయులు అంత్యంత వేడుకగా చేసుకునే ఉత్సవం. హోలీ వేడుకలు లండన్‌తో పాటు బర్మింగ్‌హామ్‌లో అంత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి భారతీయులు హోలీ వేళ బాలీవుడ్ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటారు.అమెరికాఅగ్రరాజ్యం అమెరికాలో హోలీ వేడుకలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో రంగుల ఉత్సవం జరుగుతుంది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.మారిషస్మారిషస్లో భారతీయ మూలాలు కలిగినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతుంటాయి. మారిషస్‌లో హోలీ వేళ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకోవడమే కాకుండా, ఆలయాలలో పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే సాంప్రదాయ వంటకాలను చేసుకుని ఆరగిస్తుంటారు.బంగ్లాదేశ్బంగ్లాదేశ్లోని హిందువులు హోలీ వేడుకలను అంత్యంత వైభవంగా చేసుకుంటారు. ఆలయాలకు వెళ్లి, భక్తిప్రపత్తులతో పూజలు చేస్తారు. సాయంత్రం వేళ ఆలయాలలో భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందిస్తారు.ఇది కూడా చదవండి: Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!! -
మినీ ఇండియా.. మారిషస్
పోర్ట్ లూయిస్: భారత్‌కు, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వంతెన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, భారతదేశ కుటుంబంలో ఒక అంతర్భాగమని చెప్పారు. మారిషస్ అంటే ‘మినీ ఇండియా’ అని అభివర్ణించారు. ఆయన మంగళవారం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్, వీణా దంపతులు, మంత్రివర్గ సభ్యులు సైతం పాల్గొన్నారు.భారత్, మారిషస్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులను రామ్‌గూలమ్ దంపతులకు మోదీ అందజేశారు. మారిషస్‌లోని ఏడో తరం భారతీయులకు కూడా ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి చిరస్మరణీయమైన స్వాగతం లభించింది.రాజధాని పోర్ట్ లూయిస్‌లోని సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌తోపాటు ఉప ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత, విదేశాంగ మంత్రి, కేబినెట్ సెక్రెటరీ తదితరులు ఘన స్వాగతం పలికారు. మోదీని స్వాగతించడానికి మొత్తం మంత్రివర్గం తరలిరావడం గమనార్హం. మంత్రులు, అధికారులు సహా 200 మందికి ఆయన కోసం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బిహారీ సంప్రదాయ స్వాగతం మారిషస్‌లో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్ వద్ద భారతీయ మహిళలు సంప్రదాయ బిహారీ సాంస్కృతిక సంగీతభరిత నృత్యం ‘గీత్ గవాయ్’తో ఆయనను స్వాగతించారు. అలాగే భోజ్‌పురి సంప్రదాయ గీతం ఆలపించారు. భారత త్రివర్ణ పతాకం చేతబూని ‘భారత్ మాతాకీ జై’ అని బిగ్గరగా నినదించారు. తనకు లభించిన అపూర్వమైన గౌరవ మర్యాదల పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మారిషస్ అధ్యక్షుడికి గంగాజలం బహూకరణ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక అందజేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద జరిగిన మహా కుంభమేళా సమయంలో ఇత్తడి, రాగి పాత్రలో సేకరించిన పవిత్ర గంగజలాన్ని బహూకరించారు. బిహార్‌లో సాగు చేసిన సూపర్‌ఫుడ్ మఖానాతోపాటు మరికొన్ని బహుమతులు సైతం అందించారు. అలాగే ధరమ్ గోకుల్ భార్య బృందా గోకుల్‌కు బనారసీ చీరను కానుకగా ఇచ్చారు. గుజరాత్ కళాకారులు తయారు చేసిన సందేలి చెక్కపెట్టెలో ఈ చీరను అందజేశారు. అలాగే ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును ధరమ్ గోకుల్ దంపతులకు అందించారు.దివంగత నేతలకు నివాళులు భారత్, మారిషస్ ప్రధానమంత్రులు మోదీ, నవీన్‌చంద్ర రామ్‌గూలమ్ సర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మారిషస్ దివంగత నేత సీర్ సీవూసాగర్ రామ్‌గూలమ్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులల్పించారు. అలాగే మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్ సమాధి వద్ద నివాళులల్పించారు. వారిని స్మరించుకున్నారు.మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం భారత ప్రధానమంత్రి మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించనున్నట్లు మారిషస్ ప్రధాని రామ్‌గూలమ్ ప్రకటించారు. మోదీకి ప్రతిష్టాత్మక ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్’ అవార్డు అందజేస్తామని వెల్లడించారు. ఈ పురస్కారం అందుకోనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డుకెక్కబోతున్నారు. -
లక్ష్యసేన్ శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్‌లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్‌ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది. -
15 నిమిషాల్లో అంబులెన్స్: జెంజో సంస్థ కీలక నిర్ణయం
ముంబై: ఎమర్జెన్సీ సేవల సంస్థ జెంజో దేశవ్యాప్తంగా 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. 15 నిమిషాల్లోపే స్పందించే విధంగా ఈ నెట్వర్క్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రథమ చికిత్స, సీపీఆర్ ట్రైనింగ్ మొదలైన వాటిపై అవగాహన పెంచేందుకు జొమాటోతో పాటు ఇతరత్రా డెలివరీ ప్లాట్‌ఫాంలు, ఈకామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది.దీని టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298గా ఉంటుంది. 5 కి.మీ. పరిధికి బేసిక్ అంబులెన్స్ చార్జీలు రూ. 1,500గా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ. 50 చెల్లించాలి. కార్డియాక్ అంబులెన్స్కైతే 5 కి.మీ.కు రూ. 2,500, ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటరుకు రూ. 100 చార్జీలు వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని నగరాల్లో మరిన్ని అంబులెన్స్‌లను జోడిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా మంగళ్ తెలిపారు. -
భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్‌స్కిల్.. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్‌స్కిల్) అత్యవసరం. -
ఈసారైనా ‘ఆల్ ఇంగ్లండ్’ అందేనా!
ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకునే టోర్నీ, గెలవాలనుకునే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ మాత్రమే. బ్యాడ్మింటన్ క్రీడలో అతి పురాతన టోర్నీలలో ఒకటిగా, ప్రపంచ చాంపియన్‌షిప్ స్థాయి ఉన్న టోర్నీగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌నకు పేరుంది. 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ టోర్నమెంట్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాక... అత్యున్నత శ్రేణి సూపర్–1000 నాలుగు టోర్నీలలో (మలేసియా, ఆల్ ఇంగ్లండ్, ఇండోనేసియా, చైనా ఓపెన్) ఒకటిగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఆదివారం జరిగే ఈ టోర్నీకి బరి్మంగ్‌హమ్ ఆతిథ్యమివ్వనుంది. బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని మరో మెగా టోర్నీకి భారత క్రీడాకారులు సమాయత్తమయ్యారు. నేటి నుంచి ఆదివారం వరకు జరిగే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత్ నుంచి మొత్తం 17 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఆసియా క్రీడల చాంపియన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్‌లో గత రెండేళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. శ్రుతి మిశ్రా–ప్రియా కొంజెంగ్‌బమ్... మిక్స్డ్ డబుల్స్‌లో గద్దె రుత్విక–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... ఆద్యా–సతీశ్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో మాత్రమే ఇద్దరు చాంపియన్స్‌గా నిలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొనే... 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయారు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్... 2022లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఫైనల్‌కు చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. ఈసారి స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018, 2021లలో సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్ గా యున్ కిమ్‌తో సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హాన్ యువెతో సింధు తలపడే అవకాశముంది. భారత్‌కే చెందిన మాళవిక నేడు జరిగే తొలి రౌండ్లో జియా మిన్ యో (సింగపూర్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో లి యాంగ్ సు (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్...టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్‌గార్డ్–మాడ్స్ వెస్టర్‌గాడ్ (డెన్మార్క్)లను సాత్విక్–చిరాగ్ ఢీకొంటారు. -
నవ భారత ప్రణాళిక
ఒక సమాఖ్య దేశంగా భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్బీఐ ప్రైమ్ లెండింగ్ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. సహజ వనరులపై హక్కురైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్... మద్రాస్ రెజిమెంట్. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి.- వ్యాసకర్త ఫ్రీలాన్స్ కామెంటేటర్, రచయితmohanguru@gmail.com-మోహన్ గురుస్వామి -
వన్డే విజయం తెచ్చిన ఆనందం...
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్ 29, 2024... టి20 ఫార్మాట్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్ ముద్ర... భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. గంభీర్‌కు ఊరట... ద్రవిడ్ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్ అభినందనలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? విజేత భారత్ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్ కివీస్ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు) -
మనమే చాంపియన్స్
భారత జట్టు మరోసారి తమ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్ లైనప్ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్ టీమ్ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను భారత్ సొంతం చేసుకుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్ బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్ హాఫ్ సెంచరీ... కివీస్ ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్ యంగ్ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్ చేసి అతను ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్ (14 బంతుల్లో 11; 1 ఫోర్)ను పెవిలియన్ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్... ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్ స్మిత్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 31; 1 సిక్స్) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 49వ ఓవర్ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్; 1 ఫోర్) డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో భారత్ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్బీ) (బి) వరుణ్ 15; రచిన్ (బి) కుల్దీప్ 37; విలియమ్సన్ (సి అండ్ బి) కుల్దీప్ 11; మిచెల్ (సి) రోహిత్ (బి) షమీ 63; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (బి) వరుణ్ 34; బ్రేస్‌వెల్ (నాటౌట్) 53; సాంట్నర్ (రనౌట్) 8; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్ యాదవ్ 10–0–40–2, అక్షర్ పటేల్ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76; శుబ్‌మన్ గిల్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) రచిన్ (బి) సాంట్నర్ 48; అక్షర్ పటేల్ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 29; కేఎల్ రాహుల్ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జేమీసన్ 18; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్: జేమీసన్ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్ 2–0–22–0, సాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్‌వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0. ఫిలిప్స్ అసాధారణంఫీల్డింగ్ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్ కవర్ వైపు గిల్ షాట్ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్‌లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ మరో క్యాచ్ వదిలేశాడు. మిచెల్ స్కోరు 38 వద్ద రోహిత్ క్యాచ్ వదిలేయగా, ఫిలిప్స్ స్కోరు 27 వద్ద గిల్ క్యాచ్ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్ కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్ 1 పరుగు వద్ద మిచెల్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్ శర్మ వరుసగా 12వసారి టాస్ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు! ‘నేను రిటైర్ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్పై). –విరాట్ కోహ్లి -
కప్ కొట్టేది ఎవరు ?.. సర్ ప్రైజ్ ఇచ్చేది ఎవరు ?
-
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్
-
కౌన్ బనేగా ఛాంపియన్?
-
భారతీయుల ఖర్చు మాములుగా లేదు..!
భారత్ ఖర్చు చేస్తోంది. షాపింగ్ ద్వారా సంతోషాన్ని కొని తెచ్చుకునేవారు కొందరైతే, ఇతరులకు పోటీగా హోదా ప్రదర్శించేవారు మరికొందరు. మారుమూల పల్లెలకూ ఇంటర్నెట్ చేరువ కావడం; చౌకగా డేటా లభించడం; విరివిగా స్మార్ట్ఫోన్ల వాడకం; ఈ–కామర్స్ దూకుడు; స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాలు; ఊరిస్తున్న ఫ్యాషన్ ప్రపంచం; ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు; సానుకూల మార్కెట్ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రజలకు రుణాలను వేగంగా, విరివిగా అందించడమూ ఖర్చులకు ఆజ్యం పోస్తోంది. దినసరి కూలీలు, వేతన జీవులు, వ్యాపారస్తులు– ఉపాధిమార్గం ఏదైనా, ఆదాయం ఎంత ఉన్నా, డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట! రూ.40 వేల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులైతే అవసరాలను మించి అనవసర వ్యయాలు చేస్తున్నారంటే ప్రజలు హంగు, ఆర్భాటాలకు ఎంతలా ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది. జనం ఎంతగా వెచ్చిస్తున్నారంటే, తాము చేసిన పెట్టుబడుల గడువు తీరక ముందే వాటిని ఉపసంహరించుకుని మరీ ఖర్చు చేస్తున్నారు.బలమైన వృద్ధి, పెరుగుతున్న మధ్య, అధిక–ఆదాయ తరగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వెరసి పెట్టుబడి, వినియోగదారుల కార్యకలాపాలకు ప్రపంచ హాట్‌స్పాట్‌గా భారత్ ఉద్భవించింది. భారత మార్కెట్లోకి భారీగా మూలధనం వెల్లువెత్తుతోంది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సేవల రంగంలో పెరుగుతున్న డిజిటలైజేషన్ తిరుగులేని ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, విస్తరిస్తున్న గ్రామీణ మార్కెట్లు, మెరుగైన డిజిటల్ అనుసంధానత, జనాభాలో పెరుగుతున్న ఆకాంక్షల ఫలితంగా 2027 నాటికి భారత్ రెండు మెట్లు ఎక్కి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్ పరివర్తన దిశగా పయనిస్తోంది. వినియోగదారుల ప్రవర్తనలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ డైనమిక్ మార్కెట్లో భాగస్వామ్యం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆర్థిక సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారులకు భారతీయులు ఖర్చు పెడుతున్న తీరును అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ భారతీయ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని విశ్లేషించి, వారు చేసే ఖర్చులను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనం వివిధ ఆదాయ స్థాయులు, ప్రదేశాలలోని వ్యక్తుల ఖర్చు అలవాట్ల గురించి తెలియజేస్తుంది. భారతీయ వినియోగ, వ్యయ ధోరణులలోని మార్పులకు ఈ నివేదిక అద్దం పడుతుంది. ప్రజలు తప్పనిసరి ఖర్చులకు అత్యధిక మొత్తంలో డబ్బు కేటాయిస్తున్నారు. ఇది వారి మొత్తం వ్యయంలో 39 శాతం ఉంటోంది. అవసరాలకు 32 శాతం, హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు 29 శాతం వెచ్చిస్తున్నారు.అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.అనవసర ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ జీవనశైలి కొనుగోళ్లకు సంబంధించివే! అంటే ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు ఖర్చు చేస్తున్నారు.నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న ఎంట్రీ–లెవల్ సంపాదనపరుల్లో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 22 శాతం ఉంది.టైర్–1 నగరాల కంటే టైర్–2 నగరాల్లో ఇంటి అద్దెకు సగటున 4.5 శాతం ఎక్కువ ఖర్చు అవుతోంది. టైర్–2 నగరాల్లో నివసించే ప్రజలు వైద్య ఖర్చులకు సగటున రూ.2,450 వెచ్చిస్తున్నారు. మెట్రోలలో ప్రజలు నెలకు సగటున వైద్య ఖర్చులకు రూ.2,048 వెచ్చిస్తున్నారు.తప్పనిసరి ఖర్చులకు, అవసరాలు, అనవసర ఖర్చుల చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల దేశంగా భారత్ ఆకర్షిస్తోంది. 2023లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం (వస్తు సేవలకు జనం చేసిన ఖర్చు) వాటా 60% నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2031 నాటికి ఏటా 13.4 శాతం వార్షిక సగటు వృద్ధితో దేశ వినియోగ ఆర్థిక వ్యవస్థ రూ.426.4 లక్షల కోట్లను తాకనుందని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న మధ్యతరగతి, వస్తు సేవల వినియోగం, పట్టణీకరణ, పెరుగుతున్న ఆకాంక్షలు, యువజన జనాభా ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. వేతన జీవుల సంఖ్యలో 2019 నుంచి ఏటా సగటున 9.1 శాతం వృద్ధి నమోదవుతోంది. ఆదాయాల్లో స్థిర వృద్ధి గృహ వినియోగం పెరగడానికి, వస్తు సేవల గిరాకీకి కారణమవుతోంది. అయితే, భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, బాండ్స్, లోన్ల వంటి తమ ఆర్థిక ఆస్తులలో క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ధోరణి నెలకొనడం గమనార్హం. దేశ జీడీపీలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 2022లో 7.2 శాతం నుంచి 2023లో 5.1 శాతానికి పడిపోయింది. గత యాభయ్యేళ్లలో ఇదే అత్యల్పస్థాయి అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి పర్సనల్ లోన్స్ 13.7 శాతం వార్షిక వృద్ధితో ఏకంగా రూ.55.3 లక్షల కోట్లకు చేరుకున్నాయంటే జనం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.డిజిటల్ అక్షరాస్యతవిభిన్న ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ఫోన్లు, సామాన్యులకు చేరువైన టెలికం సేవలు 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ను చేర్చింది. వాస్తవ వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం జనాభాలో 72% మించిపోయింది. దేశంలో డిజిటల్ అక్షరాస్యత 38 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 61 శాతం ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్లతో సేవలను అందించడం ద్వారా ఆర్థిక సేవల రంగం ఈ ధోరణిని ఉపయోగించుకుంటోంది. ఈ అంశమే వ్యక్తిగత రుణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.ఆదాయాల జోరుదేశవ్యాప్తంగా 2019–24 మధ్య వ్యక్తుల వేతనాలు ఏడాదికి 9.1 శాతం కంటే ఎక్కువ రేటుతో పెరిగింది. వ్యక్తుల ఆదాయంలో ఈ పెరుగుదల వినియోగదారుల వ్యయాల తీరును నిర్ణయించే కీలక అంశాలలో ఒకటి. భారతీయుల తలసరి ఖర్చు చేయదగ్గ ఆదాయం 13.3 శాతం వృద్ధి రేటుతో 2023–24లో రూ.2.14 లక్షలకు పెరిగింది. 2023–24లో స్థూల పొదుపు 30 శాతం తగ్గింది. పొదుపులో తగ్గుదల పెరిగిన వ్యయాలను సూచిస్తుంది. ఉపాధి, ఉద్యోగ భద్రత2017–19 నుంచి 2022–23 మధ్య ఉపాధి రేటు 46.8 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. పెరిగిన ఉపాధి రేటు వ్యక్తుల వినియోగ వ్యయం పెరగడానికి దోహదపడుతోంది.భావోద్వేగ వ్యయంసాధారణంగా వినియోగదారులు సంతోషం, ఒత్తిడి, ఆందోళన మొదలైన మానసిక స్థితి ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి వ్యయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చాలామంది కస్టమర్లు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అంటే తమ సంతోషం కోసం ఇష్టమైన బ్రాండ్లు, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే రిటైల్ థెరపీలో పాల్గొంటున్నారు.సామాజిక ప్రభావంకుటుంబం, సహచరుల ప్రభావం, సామాజిక స్థితి, జీవనశైలి, సాంస్కృతిక ధోరణులు వంటి అనేక సామాజిక అంశాలు కస్టమర్ల ఖర్చు ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చులు, ఆదా చేసే విధానం వారి పిల్లల వ్యయ ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తోటివారి ఒత్తిడి యువ వినియోగదారులను వారి సామాజిక స్థితిని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఖర్చు పెట్టేలా చేస్తోంది. భారతీయ సాంస్కృతిక పద్ధతులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 దీపావళి సీజన్లో భారత రిటైల్ మార్కెట్లో రూ.3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.సాంకేతికతతో వినియోగం దూకుడుటెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఈ–కామర్స్ వృద్ధి, ఫిన్ టెక్ పరిష్కారాల పెరుగుదల భారతీయ వినియోగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల విస్తృతితో ఈ–కామర్స్ వృద్ధి వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. దేశంలో 2024లో ఈ కామర్స్ ఆధారిత అమ్మకాలు రూ.4,41,700 కోట్లు నమోదయ్యాయి. 2029 నాటికి ఏటా 11.45% వార్షిక వృద్ధితో ఇది రూ.7,59,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ విధానాలు, పన్నుల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలువినియోగదారుల ఖర్చును వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటూ, అమ్మకాలను మాత్రమే కాకుండా, బ్రాండ్ విధేయతను కూడా పెంచుతున్నాయి. దేశంలో ప్రకటన ఖర్చులు 2024లో 10.2 శాతం పెరిగి రూ.1,55,386 కోట్లు నమోదయ్యాయి. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వినియోగదారులను ప్రభావితం చేయడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.ఈఎంఐలే తప్పనిసరి..తప్పనిసరి ఖర్చుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు చెల్లించే ఈఎంఐలే సింహభాగం ఉంటున్నాయి. రుణ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో అప్పులు తీసుకోవడంలో వృద్ధి నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం క్రెడిట్లో వ్యక్తిగత రుణాల వాటా 2023లో 30.6 శాతం నుంచి 2024 ఫిబ్రవరిలో 32.6 శాతానికి పెరిగింది. 2023 నాటికి మొత్తం రిటైల్ రుణాలలో గృహరుణాల వాటా ఏకంగా 47.2 శాతానికి చేరింది. ఈఎంఐలు 42 శాతానికి పెరిగాయి. మదుపు చేయడమూ తెలుసుఖర్చులే కాదు మదుపు చేయడమూ జనానికి తెలుసు. షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను నిల్వ చేసుకునే డీమ్యాట్ ఖాతాలు దేశవ్యాప్తంగా 2022 ఆగస్ట్ నాటికి 10 కోట్లు. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 18.8 కోట్లకు చేరిందంటే, పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తిపెరుగుతోందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం), బీమా, పదవీ విరమణ పొదుపులు 2013 నుంచి 2023 వరకు ఏటా 15% పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా అదే కాలానికి 9% వార్షిక సగటు వృద్ధి నమోదు చేశాయి.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
నారీ శక్తికి సలాం
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్లో నవాసరీ జిల్లా వన్శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు. ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసుల రక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. -
రూ. 1.5 లక్షల కోట్లకు రష్యా చమురు కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ దాదాపు 112.5 బిలియన్ యూరోల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ముడి చమురు కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా) ఒక నివేదికలో తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి శిలాజ ఇంధనాలకు సంబంధించి రష్యాకు లభించిన చెల్లింపుల వివరాలను ఇందులో పొందుపర్చింది. దీని ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ద్వారా 835 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జించినట్లు వివరించింది. చైనా అత్యధికంగా 235 బిలియన్ యూరోల (170 బిలియన్ యూరోల చమురు, 34.3 బిలియన్ యూరోల బొగ్గు, 30.5 బిలియన్ యూరోల గ్యాస్) ఇంధనాలు కొనుగోలు చేసింది. భారత్ 205.84 బిలియన్ యూరోల ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 112.5 బిలియన్ యూరో క్రూడాయిల్, 13.25 బిలియన్ డాలర్ల బొగ్గు ఉంది. యుద్ధం వల్ల విధించిన ఆంక్షలతో రష్యా చమురు చౌకగా లభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ గణనీయంగా కొనుగోళ్లు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బ్యారెల్‌కి 18–20 శాతం వరకు లభించిన డిస్కౌంటు ఇటీవలి కాలంలో 3 డాలర్ల దిగువకు పడిపోయింది. -
చాంపియన్ నువ్వా.. నేనా
పుష్కర కాలం క్రితం భారత జట్టు ఐదు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించి అజేయంగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లి, జడేజా ప్రస్తుత టీమ్‌లోనూ భాగంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్‌తో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది. భారత్ మూడో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిల్లో ఎలా ఆడినా మన టీమ్‌పై ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్‌దే పైచేయిగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాడటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడినా ఆ మ్యాచ్‌తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు. గెలుపోటములతో పాటు మరో కీలకాంశం ఈ మ్యాచ్‌కు సంబంధించి చర్చకు వస్తోంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు మూల స్థంభాలుగా అద్భుత విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈమ్యాచ్‌తో తమ వన్డే కెరీర్‌ను ముగిస్తారా...టి20 వరల్డ్ కప్ తరహాలో ఘనంగా ఆటను ముగిస్తారా అనేది చూడాలి. మరో వైపు కివీస్ కూడా తమ స్టార్ విలియమ్సన్కు ఒక్క ఐసీసీ వన్డే టోర్నీతోనైనా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది.దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో పలు ఆసక్తికర సమరాల తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ఒక వైపు... నిలకడగా రాణించిన కివీస్ మరో వైపు తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత్ అంతకు ముందు రెండు సార్లు టైటిల్ సాధించింది. 2000లో చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. భారత్ తమ బలమైన బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌పై ఆధారపడుతుండగా...పరిస్థితులకు తగినట్లు స్పందించే తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తికరం. మార్పుల్లేకుండా... టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశమే లేదు. ఆటగాళ్లంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా గిల్ కీలకం కానుండగా... మిడిలార్డర్లో అయ్యర్, రాహుల్ జట్టు భారం మోస్తారు. రాహుల్ బ్యాటింగ్ దూకుడు సెమీఫైనల్లో కనిపించింది కాబట్టి అతని ఫామ్‌పై కూడా ఆందోళన పోయింది. వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌పై సెంచరీ చేసినప్పటినుంచి ఆ జట్టుపై అయ్యర్ మన బెస్ట్ బ్యాటర్. వరుసగా అన్ని మ్యాచ్‌లలో అతను చెలరేగిపోయాడు. స్టార్ బ్యాటర్ కోహ్లి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 217 పరుగులు సాధించాడు. అతని స్థాయి ఇన్నింగ్స్ మరొకటి వస్తే చాలు భారత్‌కు తిరుగుండదు. అన్ని ఫార్మాట్లలో కలిపి తాను ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3 అర్ధసెంచరీలు చేశాడు. దీనిని మరింత మెరుగుపర్చుకునే అవకాశం అతని ముందుంది.అయితే ఇప్పుడు భారత జట్టుకు సంబంధించి రోహిత్ బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. దూకుడుగా 20–30 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే నిష్క్రమిస్తుండటం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. దీనిని అధిగమించి రోహిత్ భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 10 ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు! ఇప్పుడు తన స్థాయిని చూపించేందుకు ఇది సరైన వేదిక. మరో వైపు భారత స్పిన్నర్లు ప్రత్యర్థిపై చెలరేగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లీగ్ దశలో ఐదు వికెట్లతో కివీస్‌ను దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి జట్టు ప్రధానాస్త్రం కాగా, లెఫ్టార్మ్ మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే కివీస్‌కు కష్టాలు ఖాయం. మన నలుగురు స్పిన్నర్లు కలిపి టోర్నీలో 21 వికెట్లు తీశారు. పేస్‌తో షమీ ఆకట్టుకోగా, పాండ్యా కూడా అండగా నిలుస్తున్నాడు. హెన్రీ ఆడతాడా! లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా న్యూజిలాండ్‌పై ఆ మ్యాచ్ ఫలితం పెద్దగా పడలేదు. ఆ మ్యాచ్లోజరిగిన లోపాలను సవరించుకొని బరిలోకి దిగుతున్నామని టీమ్ మేనేజ్మెంట్ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. టీమ్ బ్యాటింగ్ విషయంలో కివీస్ బలంగా కనిపిస్తోంది. రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగిపోతుండగా... విలియమ్సన్ కూడా అదే స్థాయి ఆటను ప్రదర్శించాడు. ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఒకే ఒక అర్ధ సెంచరీ చేసినా... అతను ఈ టోర్నీలో రాణిస్తున్న తీరు జట్టుకు అదనపు బలంగా మారింది. యంగ్, మిచెల్ కూడా ఆకట్టుకోగా... ఫిలిప్స్ తన ఫీల్డింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు. ధాటిగా ఆడగల సత్తా ఉన్న ఫిలిప్స్ కూడా చెలరేగితే కివీస్ కూడా భారీ స్కోరు సాధించగలేదు. జట్టు స్పిన్ కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ సాంట్నర్, బ్రేస్వెల్లతో పాటు ఫిలిప్స్ కూడా బంతిని బాగా టర్న్ చేయగల సమర్థుడు. పేసర్లు జేమీసన్, రూర్కేలు కీలకం కానుండగా అసలు మ్యాచ్‌కు ముందు హెన్రీ గాయం ఆందోళన రేపుతోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హెన్రీ జట్టు ప్రధానాయుధం. అతను కోలుకొని బరిలోకి దిగితే కివీస్‌కు ఊరట. పిచ్, వాతావరణం ఫైనల్‌కు కూడా నెమ్మదైన పిచ్ అందుబాటులో ఉంది. ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. వన్డే టోర్నీ గెలిపిస్తాడా! భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. ఇందులో రెండు ఫైనల్స్‌లో పరాజయం పాలైన జట్టు టి20ల్లో విశ్వవిజేతగా నిలిచింది.ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి మ్యాచా! కోహ్లి, రోహిత్‌ల భవిష్యత్తు ఈ మ్యాచ్‌తో తేలుతుందని అంతటా చర్చ వినిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జట్టును సిద్ధం చేసేందుకు వీరు తప్పుకుంటారని అనుకుంటున్నా దీనిపై ఇప్పుడు స్పష్టత రాకపోవచ్చు. నిజానికి వీరి స్థాయి, ఆటను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోహ్లి అయితే చెలరేగిపోతున్నాడు. అతని ఫిట్‌నెస్‌కు కూడా ఢోకా లేదు. అయితే స్టీవ్ స్మిత్ తరహాలోనే తానే స్వయంగా దూరమవుతాడా అనేది చెప్పలేం. మరో వైపు రోహిత్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఇప్పటికి టి20లనుంచి తప్పుకున్న రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమైన దానిపై కూడా సందేహాలు రేపాడు. ఇక మిగిలిన ఫార్మాట్ వన్డేలు మాత్రమే. అయితే నిజంగా కొనసాగే ఆలోచన లేకపోయినా ఈ మ్యాచ్ ముగియగానే అధికారికంగా రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన రాకపోవచ్చని వినిపిస్తోంది. భారీగా బెట్టింగ్‌లు... ఫైనల్‌పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఈ మొత్తం సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని వెనక పెద్ద మాఫియా సామ్రాజ్యం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌పై పెద్ద స్థాయిలో బెట్టింగ్‌లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 2000భారత్, న్యూజిలాండ్ మధ్యే 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ. -
‘అది ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కాదు.. యుద్ధ విమానం’
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను భారత్ కు అమ్మడానికి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అధునాతన ఐదో తరం ఎఫ్ 35 జెట్ విమానాలను భారత్ కు విక్రయించడానికి ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ ఒక్కో ఫైటర్ జెట్ విమానం విలువ 80 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 680 కోట్లు) ఉంటుంది. ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వస్తువు కాదు..అయితే దీనిపై భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ జెట్ ఫైటర్స్ ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అది ఏమీ మార్కెట్ కు ఇలా వెళ్లి అలా తెచ్చుకునే వాషింగ్ మిషీన్, ఫ్రిడ్జ్ లాంటి కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ కు అధునాతన యుద్ధ విమానాల ఆవశక్యత ఉందంటూనే, మనం వాటిని కొనుగోలు చేసే క్రమంలో టెక్నాలజీని అన్ని విధాలు పరిక్షీంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఒక జెట్ ఫైటర్ ను కొనుగోలు చేస్తున్నామంటే దాని సామర్థ్యంతో పాటు దాని ఖరీదును కూడా బేరీజు వేసుకోవాలన్నారు. ఆ జుట్ ఫైటర్స్ ను కొనుగోలు చేయడానికి ఇంకా తమకే అమెరికా నుంచి ఆపర్ ఏమీ రాలేదని, వచ్చినప్పుడు దానిపై సమ గ్రంగా పరిశీలన చేసిన నిర్ణయం తీసుకుంటామన్నారుమన దేశం నుంచి 2035లోనే..ప్రస్తుతం చైనా ఆరో జనరేషన్ యుద్ధ విమానాలను వాడటానికి సిద్ధమైన క్రమంలో మనం ఇంకా ఐదో జనరేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నామన్నారు. మన దేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ లో భాగంగా అడ్వాన్స్డ్ ఇండియా కాంబేట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మన దేశం నుంచి అధునాతన యుద్ధ విమానం 2035లో అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు. అప్పటివరకూ యుద్ధ విమానాలను బయట నుంచే తెచ్చుకోక తప్పదన్నారు. ప్రస్తుత తరుణంలో చైనా ఆరో తరం ఫైటర్ జెట్ ల వాడకానికి సిద్ధం కాగా, పాకిస్తాన్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ల కోసం అమెరికా నుంచి నిధులు సమకూరుస్తున్న తరుణంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి న అవసరం ఉందని ఏపీ సింగ్ తేల్చి చెప్పారు. ఎఫ్-35.. అంతు ‘చిక్కదు’ -
ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్‌లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్‌గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్‌పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్‌బైజాన్‌లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025 -
రేపు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
-
భారత్‌తో చాలా కష్టం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందని తెలిపారు. అందుకే తాము కూడా భారత్‌కు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.తాజాగా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పన్నులను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. భారత్ అధిక సుంకాలు విధించే దేశం. అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోంది. భారత్ వసూలు చేస్తోన్న టారిఫ్ ఇలాగే కొనసాగితే ఏ ఒక్క వస్తువును కూడా అక్కడ విక్రయించలేం. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారింది.#WATCH | Washington, DC: US President Donald Trump says, "...India charges us massive tariffs. Massive. You can't even sell anything in India...They have agreed, by the way; they want to cut their tariffs way down now because somebody is finally exposing them for what they have… pic.twitter.com/XwytKPli48— ANI (@ANI) March 7, 2025అమెరికా నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అందుకే మేము కూడా సుంకాలు విధించాలనే నిర్ణయానికి వచ్చాం. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు ప్రారంభం అవుతాయి. ఫలితంగా తమ దేశంపై విధించిన టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించింది. నేను ఎవరికి నిందించడం లేదు. వ్యాపారం చేయడానికి ఇది వేరొక మార్గం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు.అలాగే, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా వంటి దేశాలు కూడా అమెరికా వస్తువుల విషయంలో భారీగా సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయం. మా దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదు. ఇప్పుడు మా వంతు వచ్చింది. సుంకాల విధింపు విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఏప్రిల్ 2న విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. ఇక, ట్రంప్ సుంకాల ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. -
మళ్లీ అదే మాట !
న్యూయార్క్: అమెరికా ఉత్పత్తులపై విదేశాలు వసూలు చేస్తున్న టారిఫ్‌ల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వెళ్లగక్కారు. భారతదేశంలో అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నారని మళ్లీ అసంతృప్తి వ్యక్తంచేశారు. నిజంగా అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధం కాదని చెప్పారు. తమకు న్యాయం జరగాలంటే అదే రీతిలో ప్రతిస్పందించక తప్పదని స్పష్టంచేశారు. ప్రతీకార సుంకాలు విధించబోతున్నామని, వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తేలి్చచెప్పారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపైనా అదే స్థాయిలో టారిఫ్‌లు విధించబోతున్నామని ఉద్ఘాటించారు. ఇండియా, చైనాతోపాటు ఏ దేశమైనా సరే తమ ఉత్పత్తులు వాడుకుంటే భారీగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇన్నాళ్లూ అమెరికాను దోచుకున్నారని, ఇకపై అది సాగనివ్వబోమని హెచ్చరించారు. ఆయన గతంలో కూడా ఇండియాను ‘టారిఫ్ కింగ్’, ‘బిగ్ అబ్యూసర్’ అని నిందించారు. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్లుగా(రూ.8.70 లక్షల కోట్లు) ఉందని ట్రంప్ చెబుతున్నారు. దీన్ని తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాకు గేమ్ ఛేంజర్ వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో గురువారం కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అమెరికా పాల ఉత్పత్తులతోపాటు ఇతర వస్తువులపై కెనడాలో 250 శాతం టారిఫ్‌లు విధిస్తున్నారని ఆక్షేపించారు. కెనడా ఉత్పత్తులు ఇకపై తమకు అవసరం లేదని, ఒకవేళ దిగుమతి చేసుకున్నా భారీగా సుంకాలు విధిస్తామని స్పష్టంచేశారు. విదేశీ ఉత్పత్తులపై ఇప్పుడు విధిస్తున్న టారిఫ్‌లు తాత్కాలికమేనని, అసలైన మోత ఏప్రిల్ 2 నుంచి మోగబోతోందని, అందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అమెరికాకు ఇదొక గేమ్ ఛేంజర్ కాబోతోందని వివరించారు. -
రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే...
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్‌నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. ‘హిట్‌మ్యాన్’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్ 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్‌ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్ గుర్తుంచుకోవాలి. ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయ్. రోహిత్ ఆట ఇన్నింగ్స్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్ పాక్‌పై 20, న్యూజిలాండ్‌పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు. న్యూజిలాండ్‌కు నాసిర్ హుస్సేన్ మద్దతు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు. -
CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్
దుబాయ్: న్యూజిలాండ్ జట్టుకు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) బెంగపట్టుకుంది. అతనితోనే పెద్ద ముప్పు అని స్వయంగా కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)’ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్ స్టెడ్ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ తిప్పేశాడు. అతని 5 వికెట్ల ప్రదర్శనే మ్యాచ్‌లో మేం కోలుకోకుండా చేసింది. అతనొక క్లాస్ బౌలర్. తన స్పిన్ నైపుణ్యంతో ఎవరికైనా ఉచ్చు బిగించగలడు. ఫైనల్లోనూ అతనే మాకు పెద్ద సమస్య. అందుకే మేం అతని బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎలాగైనా ఫైనల్ రోజు అతని ఉచ్చులో పడకుండా బ్యాటింగ్ చేయాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతాం’ అని అన్నారు. పలువురు క్రికెటర్లు దుబాయ్ అనుకూలతలపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ‘టోర్నీ షెడ్యూల్, వేదికలనేవి మన చేతుల్లో ఉండవు. అందుకే దానిపై అతిగా ఆలోచించం. ఆందోళన చెందం. భారత్ అన్నీ మ్యాచ్‌లు అక్కడ ఆడి ఉండొచ్చు. అలాగే మేం కూడా అక్కడ ఓ మ్యాచ్ ఆడాం. కాబట్టి అక్కడి పరిస్థితులెంటో మాకూ బాగా తెలుసు. ఇలాంటి పెద్ద టోర్నీలో అదికూడా ఎనిమిది జట్ల నుంచి రెండు జట్లు ఫైనల్ దశకు వచ్చాక అనుకూలతలు, ప్రతికూలతలనే సాకులు వెతక్కొద్దు. టైటిల్‌కు ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాం. దాని గురించే ఆలోచిస్తాం. వ్యూహాలు రచిస్తాం. మిగతా విషయాల్ని పట్టించుకోం’ అని కోచ్ వివరించారు. షెడ్యూల్ పాక్ నుంచి దుబాయ్‌కి... అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి బిజిబిజీగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఎలాంటి బడలిక ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఫైనల్‌కు హెన్రీ దూరం! పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడటం అనుమానంగా మారింది. భుజం నొప్పితో బాధపడుతున్న అతను ఆదివారం మ్యాచ్ సమయానికల్లా కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ గంపెడాశలు పెట్టుకుంది. 33 ఏళ్ల హెన్రీ భారత్‌పై లీగ్ మ్యాచ్‌లో 5/42 గణాంకాలు నమోదు చేయడంతోపాటు ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు తీశాడు. తన ప్రదర్శనతో ప్రధాన బౌలర్‌గా మారిన అతను దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డాడు. ‘మ్యాచ్ సమయంలో కిందపడటంతో అతని భుజానికి స్వల్పగాయమైంది. ఇదేమంత తీవ్రమైంది కాదు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కూడా తీశాం. సానుకూల రిపోర్టు వస్తుందనే ఆశిస్తున్నాం. ఫైనల్లో అతను ఎలాగైనా ఆడాలని మేమంతా గట్టిగా కోరుకుంటున్నాం’ అని కోచ్ స్టెడ్ చెప్పారు. -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా. భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్ సహకారం కావాలంటోంది డ్రాగన్.ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రిభారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. -
తహవూర్ రాణాకు బిగ్ షాక్
వాషింగ్టన్: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana)కు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.ముంబై దాడుల కేసులో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు(Extradition) అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో.. ఈ కారణాన్ని చూపిస్తూ భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీం కోర్టు(US Supreme Court)లో తహవూర్ పిటిషన్ వేశాడు. ‘‘ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న నన్ను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే. నా అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే. కనుక అప్పగింతపై స్టే విధించండి’’ అని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. పాక్ సంతతికి చెందిన ముస్లిం వ్యక్తిని కావడంతో తనను కచ్చితంగా హింసిస్తారని, భారత్‌కు అప్పగిస్తే తాను బతికే అవకాశమే లేదని వాదించాడతను. అయితే తహవూర్ రాణా వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే తహవూర్‌ను అమెరికా భారత్‌కు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరీ తహవూర్ రాణా..?పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. 2009లో FBI అతన్ని అరెస్టు చేసింది. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి అమెరికా పర్యటనలో.. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయం ప్రకటన చేశారు. ఇందుకుగానూ ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం దాదాపు ఖాయమని భావించారంతా. -
భారత్‌లో టెస్లాకు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్ చాలా స్మార్ట్. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు. కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్‌లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్స్ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది. -
IND vs NZ: ‘పిచ్‌పై భారత్‌కు స్పష్టత ఉంది’
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై, ఒకే మైదానంలో ఆడుతూ, కనీసం ప్రయాణం చేసే అవసరం కూడా లేకుండా భారత్‌కు అన్ని అనుకూలతలు ఉన్నాయని వస్తున్న విమర్శల్లో మరో కీలక ఆటగాడు గొంతు కలిపాడు. టీమిండియాతో ఆదివారం జరిగే తుది పోరుకు ముందు కివీస్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ పరోక్షంగా ఇదే విషయంపై మాట్లాడాడు. దుబాయ్‌లో పరిస్థితులపై భారత్‌కు మంచి అవగాహన ఉంది కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘దుబాయ్‌లో ఎలాంటి వ్యూహాలు పని చేస్తాయో భారత్‌కు బాగా తెలుసు. అన్ని మ్యాచ్‌లు ఒకే చోట ఆడిన జట్టుకు అక్కడి పరిస్థితులు, పిచ్ ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంటుంది కదా. కానీ షెడ్యూల్ అలా ఉంది కాబట్టి ఏమీ చేయలేం. ఇతర అంశాల ప్రభావం ఉన్నా సరే... మేం ఫైనల్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాం. లాహోర్‌లో ఆడిన వాటితో పోలిస్తే అక్కడి పరిస్థితులు భిన్నం. మేమూ ఒక మ్యాచ్ దుబాయ్‌లో ఆడాం. ఫైనల్ కోసం అందుబాటులో ఉన్న సమయాన్ని వాడుకొని సన్నద్ధమవుతాం. భారత్ చేతిలో ఓడిన గత లీగ్ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని విలియమ్సన్ అన్నాడు. మరోవైపు కివీస్ కెప్టెన్ మైకేల్ సాంట్నర్ కాస్త భిన్నంగా స్పందించాడు. విభిన్న పరిస్థితుల్లో ఆడాల్సి రావడం అంతర్జాతీయ క్రికెట్ స్వభావమని, టోర్నీ షెడ్యూల్‌ను నిర్ణయించేది తాను కాదన్న సాంట్నర్ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. -
జైశంకర్ పర్యటనలో ఖలిస్థానీల అత్యుత్సాహం.. ఖండించిన యూకే
లండన్ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వాహనంపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడి యత్నాన్ని యూకే ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) అధికారికంగా స్పందించింది."యూకే చాఠమ్ హౌస్ బయట భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కారుపై దాడి యత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూకే శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తుంది. కానీ ఇలా దాడులకు యత్నించడం, బెదిరించడం, ప్రజా కార్యక్రమాల్ని అడ్డుకోవడం సరైందని కాదని’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు సైతం జైశంకర్‌పై జరిగిన దాడి యత్నాన్ని ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మా అతిథుల భద్రతను పర్యవేక్షించడం, వారి సంరక్షణ బాధ్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నామని మరో ప్రకటనలో స్పష్టం చేసింది. -
జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్
ఢిల్లీ : లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారుపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ దాడిని భారత్ ఖండించింది. భద్రతా లోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.మంత్రి జై శంకర్ బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన కారుపై దూసుకువచ్చారు. పలువురు భారత జాతీయ జెండాలను చించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.🚨 Breaking: In London, a Khalistan protester tries to assault EAM S Jaishankar and shreds the Indian flag | Watch the video. pic.twitter.com/HRGcMAgDGt— Indian InSight (@IndianInsight_) March 6, 2025 -
నన్ను భారత్‌కు పంపొద్దు.. ప్లీజ్
వాష్టింగన్: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణా ఆఖరి ప్రయత్నంగా అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఓ అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడతను.భారత్‌కు తనను పంపొద్దని.. అక్కడ తనను దారుణంగా హింసించే అవకాశాలు ఉన్నాయని.. తాను పాకిస్థాన్ మూలాలున్న ముస్లింను కావడమే అందుకు కారణమని పిటిషన్లో తహవూర్ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. 2008 ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో రాణా భారతదేశానికి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడం ఖాయమని అంతా భావించారు. -
బిగెస్ట్ ఫైట్ కోసం కోట్లాది భారత అభిమానుల ఎదురుచూపులు
-
ఫైనల్స్ లో భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్
-
అమెరికా ఇక ఎందులో గొప్ప?
డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి నోరు వెళ్లబెడు తున్నారా? బహుశా లెక్క పెట్టలేనన్ని సార్లు అయ్యుంటుంది. నాది మాత్రం అదే పరిస్థితి. మీరు అమెరికా అధ్యక్షుడి అభిమాని కావచ్చు, కాకపోవచ్చు; అది సమస్య కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీ యాలు సంక్షోభంలో పడిపోయాయి, ఉన్నత వర్గాల చర్మం మొద్దుబారింది, మితవాదం జనాదరణ పొందుతోంది... ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటినీ పక్కన పెడదాం. ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడచి పోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయట పడింది. అమెరికా అసామాన్యత (అమెరికన్ ఎక్సెప్షనలిజం) అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే? ‘ఎన్సైక్లోపీడియా బ్రిటానికా’ నిర్వచనం ప్రకారం, ‘చారిత్రక, సైద్ధాంతిక, మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైనది, నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన.’అమెరికా ప్రతి చర్యలోనూ... కపటమైన సైనిక జోక్యాల్లో,అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసా ల్లోనూ ఈ అహంభావపూరితమైన ఆధిక్యతా భావన కనబడుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటిమాటికీ ‘విలువల ఆధారిత వ్యవస్థ’ అంటూ అరిగిపోయిన పదాలతో ఊదరగొట్టిన వారు, భారత్ దౌత్య విధానానికి వంక పెట్టిన వారు, ఆ తర్వాత ఏం చేశారు? అదే అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహకే అందని విధంగా రష్యాతో చేయి కలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతి రేకంగా ఓటేసింది. యుద్ధ సమయంలోనూ ఆచితూచి వ్యవహరించినభారత్ ఓటింగ్‌కు హాజరు కాకుండా తటస్థ వైఖరి అవలం బించింది.హక్కుల గురించి మీరా మాట్లాడేది?విదేశీ దేశీ విధానాలను తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు వినోదం కలిగిస్తున్నప్పటికీ, అవి ప్రమాదభరితమైనవి. ఏమైనా, అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్నస్వామ్యం (అలిగార్కీ)... ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేనివిధంగా పటాపంచలైంది. అమెరికా మేధావులు ఇకమీదట ఎప్పుడన్నా భారత ప్రజాస్వామ్యాన్ని శల్యపరీక్షకు పెడితే నేనేం చేస్తానో తెలుసా? పడిపడి కాకున్నా ముసిముసిగా నవ్వుకుంటాను! యూఎస్ ప్రభుత్వం భారత్‌లో మానవ హక్కుల మీద నివేదిక వెలువరించినా అంతే చేస్తా. భారతీయ అక్రమ వలసదారులను మీరెలా ట్రీట్ చేశారు? వారిని 40 గంటల పాటు ఉక్కు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్‌తో వీడియోలు రూపొందిస్తారా? జన్మలో ఇక మీరు మానవ హక్కులంటూ భారతీయులకు ఉపన్యాసాలు ఇవ్వలేరు. ఈ క్షణాన యూఎస్ ప్రభుత్వాన్ని నడుపు తున్న టెస్లా, ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్లు ట్రంప్ ప్రమాణస్వీకార ఉత్సవంలో బారులు తీరడం మేము చూడలేదనుకుంటున్నారా? ఇక మీదట మీరు ఏ ముఖం పెట్టుకుని భారత్ మీడియాకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ విమర్శిస్తారు? ట్రంప్ గెలుపు ఖాయం అనుకోక ముందు నుంచే మస్క్ ఆయన పక్షం నిలిచి ఉన్నారు. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి మెటా/ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వాస్తవ నిర్ధారణ, రాజకీయాలు వంటి అంశాల మీద ఏళ్ల తరబడిగా అవలంబిస్తున్న విధానాలను వాషింగ్టన్ పెద్దలకు అనుకూల రీతిలో రాత్రికి రాత్రే రివర్స్ చేసుకున్నాడంటే ఏమనుకోవాలి? ఇన్ఫ్లుయెన్సర్లకు పీటఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ సంగతేంటి? నేను కూడా చాలా సంవత్సరాల పాటు ఆ వార్తాపత్రికలో కాలమ్ రాశాను. ఆ పత్రికలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. సంపాదకీయ నాయకత్వంలో వరసగా అనేక ఆకస్మిక మార్పులు చేశారు. యజమాని అయిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెజోస్ గందరగోళంగా ఆ పత్రిక దిశను మార్చడంతో అదిప్పుడు అనిశ్చితిలో పడింది. ‘ఒపీనియన్ పేజీ’ ఎడిటర్ డేవిడ్ షిప్లీ ఈ మార్పులకు నిరసనగా వైదొలిగారు. ‘స్వేచ్ఛా విపణులు, వ్యక్తిగత స్వాతంత్య్రం’ ఆదర్శాన్ని పత్రిక ఎలా అనుసరించాలో నిర్దేశిస్తూ బెజోస్ ‘ట్విట్టర్’ వేదికగా చేసిన ప్రకటన (బహుశా మస్క్, ట్రంప్‌ల అనుమతి కోసం) ప్రమోటర్‌కు, ఎడిటర్‌కు మధ్య ఒక గోడ ఉంటుందన్న భ్రమను ఈ ఆదేశం బద్దలు కొట్టింది.దీనికి తోడు, లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వైట్‌హౌస్ నియమిస్తోంది. వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అనుకూలురుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా స్వేచ్ఛకు ఈ చర్య అశనిపాతం. అలిగార్క్లు చలాయించే అహంకారపూరిత అధికారం, పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్ర దించే వీలు తగ్గిపోతూ ఉండటం... ఇవన్నీ సీరియస్ అంశాలు. ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నట్లే భారత్ లోనూ ఈ సమస్యలు ఉంటాయి. కానీ అంత సమర్థంగా వీటిపై పోరాడలేక పోవచ్చు. అయితే, ఈసారి ఏదైనా అమెరికా వార్తాపత్రిక... మసకబారుతున్న ఇండియా మీడియా గురించి సంపాదకీయం రాసినప్పుడు మనం వారిని వేలెత్తి చూపించగలం. అత్యంత హేయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టేట్ బ్రదర్స్’ రొమేనియా నుంచి అమెరికాలో ప్రత్యక్షం కావడం ఈవారం కొసమెరుపు. ఆండ్రూ టేట్, ట్రిస్టాన్ టేట్ సోదరులు అత్యాచారం, సెక్సువల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. మహిళలందరూ సెక్స్ వర్కర్లనీ, అత్యాచారాలకు వారే బాధ్యత వహించాలనీ... ఇంకా ఇలాంటి దుర్మార్గమైన, అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ అన్న దమ్ములు ట్రంప్ ఫాన్స్! వీరు స్వదేశం తిరిగి వచ్చేందుకు అనుమతించాలంటూ ట్రంప్ ప్రభుత్వం రొమేనియాను సంప్రదించినట్లు ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చివరకు, అతివాద రిపబ్లికన్ నేతలు సైతం వారిని ఏవగించుకుంటున్నారు. ట్రంప్ రాజకీయంగా మరింత బలపడవచ్చు. కానీ అమెరికా పతనమౌతోంది. ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా అసామాన్యత (అసలు అలాంటిది ఎప్పుడూ లేదని నేనంటాను) చావుదెబ్బ తినబోతోంది!బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అమెరికాలో కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో దుండగులు తెలంగాణలోకి రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన ప్రవీణ్‌పై (27) కాల్పులు జరిపారు.దుండగుల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతి చెందాడు. ఎంఎస్ సెకండియర్ చదువుతున్న ప్రవీణ్ మృతిపై సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రపంచం చూపు.. భారత్ వైపు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీ స్థాయిలో చర్యలు చేపట్టాలని పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణలు, పెట్టుబడులు, సులభతరమైన వ్యాపార నిర్వహణకు సంబంధించిన సంస్కరణలపై బడ్జెట్ తదనంతర వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు.ప్రపంచ డిమాండ్‌ను తీర్చగలిగేలా భారత్‌లో తయారు చేయగల కొత్త ఉత్పత్తులను గుర్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘దీన్ని సాకారం చేసే సత్తా మన దేశానికి, మీకు (పరిశ్రమలు) ఉంది. ఇదొకొ గొప్ప అవకాశం. ప్రపంచ ఆకాంక్షల విషయంలో మన పరిశ్రమలు ప్రేక్షక పాత్ర వహించకుండా, అందులో కీలకపాత్ర పోషించాలి. మీకు మీరే అవకాశాలను అందింపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ సూచించారు. ‘భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్‌గా నిలుస్తోంది. అందుకే ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మన తయారీ రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు చౌక రుణాలివ్వాలి... దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు సకాలంలో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులను అందించే దుకు కొత్త తరహా రుణ పంపిణీ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తొలిసారిగా రూ. 2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం రుణాలివ్వడమే కాకుండా, మార్గనిర్దేశం, తోడ్పాటు అందించేలా మెంటార్షిప్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలన్నారు. ఏ దేశ ప్రగతికైనా మెరుగైన వ్యాపార పరిస్థితులు చాలా కీలకమని, అందుకే తమ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 40,000కు పైగా నిబంధనల అమలు అడ్డంకులను తొలగించిందన్నారు. జనవిశ్వాస్ 2.0 చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రుణాలపై గ్యారంటీ కవరేజీని రెట్టింపు స్థాయిలో రూ.20 కోట్లకు పెంచామని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ.5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. -
ఆ దేశాలపై సుంకాలు.. భారత్‌కు అవకాశాలు
న్యూఢిల్లీ: చైనా, మెక్సికో, కెనడాపై అమెరికా అధిక దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) మోపడం అన్నది, భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో అవకాశాలను విస్తృతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి వ్యవసాయం, ఇంజనీరింగ్, మెషిన్ టూల్స్, గార్మెంట్స్, టెక్స్టైల్స్, రసాయనాలు, లెదర్ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మొదటి నాలుగేళ్ల పదవీ కాలంలో చైనాపై అధిక సుంకాల బాదుడు నుంచి ఎక్కువగా లాభపడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ లోగడే ప్రకటించారు. చైనా ఉత్పత్తులపైనా టారిఫ్‌ను 20 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికా విధించిన సుంకాలతో అమెరికా మార్కెట్లో చైనా, మెక్సికో, కెనడా వస్తువుల ధరలను పెంచేస్తాయి. దీంతో వాటి పోటీతత్వం తగ్గిపోతుంది. భారత ఎగుమతిదారులు ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలి’’అని భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. భారత్‌కు ప్రయోజనం: జీటీఆర్ఐ ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. వాణిజ్య యుద్ధం భారత్‌కు అనుకూలిస్తుందని, ఎగుమతులను పెంచుకోవడంతోపాటు అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాయపడుతుందని పేర్కొంది. చైనాపై అధిక సుంకాలు భారత్ తన తయారీరంగాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. ఒప్పందాలకు కట్టుబడని ట్రంప్ వైఖరి దృష్ట్యా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు. దీనికి బదులు జీరోకి జీరో టారిఫ్ డీల్‌ను కుదుర్చుకోవాలని సూచించారు. సుంకాలేతర చర్యలు భారత ఎగుమతులకు అడ్డు: డీజీఎఫ్టీ అభివృద్ధి చెందిన దేశాలు విధించిన నాన్ టారిఫ్ (సుంకాలు కాని ఇతర చర్యలు)లు భారత వస్తువులకు మార్కెట్ అవకాశాలను పరిమితం చేయొచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన కార్బన్ ట్యాక్స్, డీఫారెస్టేషన్ నిబంధనలను ప్రస్తావించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానమై ఉండకపోవడం, అధిక దిగుమతి సుంకాలు, టెక్నాలజీ పరంగా అననుకూలత, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు వంటి ఇతర సవాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల దుందుడుకు పారిశ్రామిక విధానాలు సైతం భారత ఎగుమతులకు అవరోధంగా మారొచ్చన్నారు. ‘‘2023–24లో 437 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులకు గాను 284 బిలియన్ డాలర్ల రుణ సాయం అవసరం. కానీ, అందించిన రుణ సాయం 125 మిలియన్ డాలర్లుగానే ఉంది. 2030 నాటికి ఎగుమతుల రుణ డిమాండ్ 650 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’అని సారంగి వివరించారు. -
దుబాయ్ లో జరిగే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా
-
కొడితే కొట్టాలిరా ఆసీస్‌ను...
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు ఏకపక్షంగా మారిపోయాయి... వేర్వేరు కారణాలతో యాషెస్ సమరాలు గత కొన్నేళ్లుగా కళ తప్పాయి... అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడు అన్నింటికంటే ఆసక్తికర పోరు అంటే భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగేదే. ఫార్మాట్ ఏదైనా హోరాహోరీ పోరాటాలు, అత్యుత్తమ స్థాయిలో వ్యక్తిగత ప్రదర్శనలు వెరసి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లను ఆకర్షణీయంగా మార్చేశాయి. ఇప్పుడు అభిమానులు ఎదురు చూసినట్లుగా మరోసారి రెండు అగ్రశ్రేణి టీమ్‌ల మధ్య నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఐసీసీ టోర్నీల్లో ప్రత్యేకంగా నాకౌట్ మ్యాచ్‌లలో భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్ ఉండే తీవ్రతే వేరు... వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే తలపడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌కు, వరల్డ్ కప్ ఫైనల్‌కు మధ్య స్థాయి అంతరం ఎంతో ఉన్నా... ఆసీస్‌ను ఓడించి ఇంటికి పంపిస్తే వచ్చే మజాయే వేరు. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి టీమిండియా అజేయంగా నిలవగా, అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా... ఇంగ్లండ్‌పై ఛేదన ఆసీస్ పట్టుదలను చూపించింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ తర్వాత ఇప్పుడు అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్లు భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. వనరులు, ఫామ్‌ను బట్టి చూస్తే రోహిత్ బృందానిదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తుండగా, చెప్పుకోదగ్గ బౌలింగ్ లేని ఆసీస్ పూర్తిగా తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. భారత్ స్పిన్ చతుష్టయాన్ని కంగారులు ఎలా ఎదుర్కొంటారనేదే ఆసక్తికరం. అదే జట్టుతో... న్యూజిలాండ్‌తో చివరి లీగ్‌కు ముందు పేసర్ హర్షిత్ రాణాకు విశ్రాంతినిస్తూ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంచుకుంది. తనకు లభించిన ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న అతను ఐదు వికెట్లతో తన విలువను ప్రదర్శించాడు. ఆసీస్ టాప్–7 ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్, స్మిత్‌లకు మాత్రమే వరుణ్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. స్టీవ్ స్మిత్ కూడా 2021 తర్వాతి అతని బౌలింగ్‌లో ఆడలేదు. ఆ తర్వాతే వరుణ్ తన బౌలింగ్‌ను మెరుగుదిద్దుకొని మరింతగా రాటుదేలాడు. కాబట్టి అతడిని పక్కన పెట్టి మళ్లీ రెండో పేసర్‌ను ఆడించే అవకాశం లేదు. మిగతా ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఎంతో ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడి పిచ్‌పై మన నలుగురు స్పిన్నర్లు మంత్రం బాగా పని చేస్తున్నట్లే. షమీకి తోడుగా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగలిగితే చాలు. బ్యాటింగ్‌లో టాప్–3 గత మ్యాచ్‌లో విఫలమైనా... ఈ కీలక పోరులో చెలరేగిపోగల సత్తా వారికి ఉంది. శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగిస్తుండగా, కేఎల్ రాహుల్ కూడా రాణించాడు. అయితే రాహుల్ తన కీపింగ్‌లో మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అక్షర్ బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణిస్తుండటం సానుకూలాంశం. పాండ్యా దూకుడైన బ్యాటింగ్ చివర్లో భారత్‌కు భారీ స్కోరు అందించగలదు. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటర్లు రాణిస్తేనే... ముగ్గురు ప్రధాన పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ దూరం కావడంతో టోర్నీకి ముందే ఆ్రస్టేలియా విజయావకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇంగ్లండ్‌పై 352 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడంతో ఆ జట్టు స్థాయి ఏమిటో కనిపించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రద్దు కాగా, అఫ్గానిస్తాన్‌పై కూడా మ్యాచ్ ఆగే సమయానికి ఆసీస్ విజయం వైపు వెళుతోంది. బ్యాటింగ్‌లో ట్రవిస్ హెడ్, ఇన్గ్లిస్లు దూకుడుగా ఆడగల సమర్థులు కాగా... లబుషేన్, స్మిత్ ఇన్నింగ్స్‌ను నడిపించగలరు. మన టీమ్‌పై హెడ్ ఆట ఏమిటో కొత్తగా చెపాల్సిన అవసరం లేదు. చివర్లో కేరీ, మ్యాక్స్‌వెల్ వేగంగా పరుగులు రాబట్టగలరు. షార్ట్ గాయంతో దూరం కావడంతో అతని స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ కూపర్ కనోలీ బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్‌తో పాటు అతని లెఫ్టార్మ్ స్పిన్ కూడా కీలకం కానుంది. రెగ్యులర్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఒక్కడే కాగా, మ్యాక్స్‌వెల్‌పై అదనపు భారం ఉంది. పిచ్‌ను బట్టి చూస్తే ముగ్గురు పేసర్లుతో ఆసీస్ ఆడుతుందా అనేది సందేహమే. డ్వార్షూయిస్ స్థానంలో మరో స్పిన్నర్ తన్వీర్ సంఘాను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. స్పిన్, అనుభవం లేని పేస్‌తో భారత్‌ను నిలువరించడం అంత సులువు కాదు కాబట్టి అనుభవజ్ఞులైన బ్యాటర్లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్, వాతావరణం టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల తరహాలోనే ఇప్పుడూ నెమ్మదైన పిచ్ సిద్ధంగా ఉంది. స్పిన్నర్లు సహజంగానే ప్రభావం చూపిస్తారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెపె్టన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, వరుణ్. ఆ్రస్టేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్, ఇన్‌గ్లిస్, లబుõÙన్, కనోలీ, కేరీ, మ్యాక్స్‌వెల్, ఎలిస్, స్పెన్సర్, జంపా, డ్వార్షుయిస్/సంఘా. -
విదేశీ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2024–25, క్యూ3)లో ఎఫ్‌డీఐలు 5.6 శాతం తగ్గి 10.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో దేశంలోకి 11.55 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ.. → 2024–25 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 13.6 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. వార్షికంగా 43 శాతం పెరిగాయి. → ఏప్రిల్–డిసెంబర్ తొమ్మిది నెలల కాలానికి చూస్తే 27 శాతం ఎగసి, 40.67 డాలర్లను తాకాయి. 2023–24 ఇదే కాలంలో దేశంలోకి వచి్చన ఎఫ్‌డీఐల విలువ 32 బిలియన్ డాలర్లు. → ఈక్విటీ పెట్టుబడులు, తిరిగి ఇన్వెస్ట్ చేసిన లాభాలు, ఇతర మూలధన పెట్టుబడులు తొలి తొమ్మిది నెలల్లో 21.3 శాతం వృద్ధితో 62.48 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 51.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → భారీగా ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టబడులు వెచి్చంచిన దేశాల్లో సింగపూర్ (12 బిలియన్ డాలర్లు), అమెరికా (3.73 బి.డాలర్లు), నెదర్లాండ్స్ (4 బి.డాలర్లు), యూఏఈ (4.14 బి.డాలర్లు), సైప్రస్ (1.8 బి.డాలర్లు) నిలిచాయి. → మారిషస్, జపాన్, యూకే, జర్మనీ నుంచి ఎఫ్‌డీఐలు క్షీణించాయి. → రంగాల వారీగా చూస్తే, సేవల రంగ కంపెనీలకు తొలి 9 నెలల్లో అత్యధికంగా 7.22 బిలియన్ డాలర్లు లభించాయి. → పునరుత్పాదక రంగం 3.5 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించింది. → మహారాష్ట్ర అత్యధికంగా 16.65 బిలియన్ డాలర్లను చేజిక్కించుకోగా, తర్వాత స్థానాల్లో కర్నాటక (4.5 బిలియన్ డాలర్లు), గుజరాత్ (5.56 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. -
ఫార్మా ఎగుమతుల్లో భారత్ జోరు
సాక్షి, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధాల సరఫరాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఎగుమతుల పరంగా కొత్త వృద్ధి శకానికి సిద్ధంగా ఉందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ), మెకిన్సే అండ్ కంపెనీ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు 5 శాతం కంటే వేగంగా ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి చెందుతూ కొత్తపుంతలు తొక్కుతోందని వివరించింది. ప్రపంచ ఫార్మా ఎగుమతులు 2011లో 424 బిలియన్ డాలర్ల నుంచి 2023 నాటికి 797 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత్ విషయంలో ఇది 10 బిలియన్ డాలర్ల నుంచి 28 బిలియన్ డాలర్లుగా ఉందని నివేదిక వివరించింది. మౌలిక వసతులకు భారీ పెట్టుబడులు, వ్యయ నియంత్రణ చర్యలు, మెరుగైన నిర్వహణ, మొత్తం పరిశ్రమలో సామర్థ్యం పెరుగుదల ఇందుకు దోహదం చేసింది. విదేశాల్లోనూ పాగా.. భారత్ ఇప్పుడు ప్రపంచ జెనరిక్ ఔషధ డిమాండ్‌లో 20 శాతం సమరుస్తోంది. ఇందులో యూఎస్ జెనరిక్ ఔషధ అవసరాలలో 40 శాతం, యూకే మార్కెట్లో 25 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. అంతర్జాతీయంగా ఎగుమతుల విషయంలో పరిమాణం పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానం మనదే. భారత్‌కు వ్రస్తాల తర్వాత సుమారు 20 బిలియన్ డాలర్లతో అత్యధిక విదేశీ మారకం సమకూరుస్తున్న విభాగం ఇదే. ప్రపంచ వ్యాక్సిన్ డిమాండ్‌లో 60 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. 70 శాతం యాంటీ రెట్రోవైరల్ మందులు భారత్ నుంచి వెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే మందుల ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకుపైగా అధికమై ఏటా 8 శాతం వృద్ధి చెందుతోంది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీలో భారత్ వాటా 8 శాతం ఉంది. బయోటెక్నాలజీ విభాగంలో 12వ ర్యాంకుతో పోటీపడుతోంది. ఆమోదం పొందిన బయోసిమిలర్ల సంఖ్య 2005లో 15 ఉంటే, 2023 నాటికి 138కి ఎగసింది. ఆమోదం పొందిన ఏఎన్‌డీఏల్లో టాపికల్స్, ఇంజెక్టేబుల్స్, నాసల్, ఆఫ్తాలి్మక్ వంటి సంక్లిష్ట డోసేజ్‌ల వాటా 2013లో 25 నుంచి 2023లో 30 శాతానికి చేరింది. యూఎస్‌ను మించిన కేంద్రాలు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదించిన తయారీ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2024 నాటికి 752కి చేరుకుంది. సంఖ్య పరంగా యూఎస్‌ను మించిపోయాయి. డబ్లు్యహెచ్‌వో జీఎంపీ ధ్రువీకరణ అందుకున్న ప్లాంట్లు 2,050, అలాగే యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ (ఈడీక్యూఎం) ఆమోదం పొందిన ప్లాంట్లు 286 ఉన్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో యూఎస్ఎఫ్డీఏ అధికారిక చర్య సూచించిన (ఓఏఐ) కేసులు 50 శాతం తగ్గాయి. నిబంధనల తాలూకా యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) కేసులు 27 శాతం క్షీణించాయి. కారి్మక వ్యయాలు తక్కువగా ఉండడం, సామర్థ్య మెరుగుదల, డిజిటల్ స్వీకరణ కారణంగా భారత కంపెనీలు అమెరికా, యూరోపియన్ తయారీదారుల కంటే 30–35 శాతం తక్కువ ధరకే ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రాధాన్య గమ్యస్థానంగా.. తక్కువ వ్యయానికే ఔషధాలు అందుబాటులో ఉండడంతో ప్రాధాన్య ఔట్సోర్సింగ్ గమ్యస్థానంగా భారత్ నిలిచింది. ఎంఆర్ఎన్ఏ, కణ, జన్యు చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో సహా అభివృద్ధి చెందుతున్న చికిత్సలకు ఉపయోగించే ఔషధాలు ఏటా 13–14 శాతం పెరుగుతున్నాయి. సంప్రదాయ ఔషధ వృద్ధి రేటును ఇవి అధిగమించాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ ఆధారిత పురోగతి కారణంగా అదనపు ఆదాయాన్ని 60 బిలియన్ డాలర్ల నుండి 110 బిలియన్ డాలర్లకు పెంచగలవని నివేదిక అంచనా వేసింది. మార్జిన్లను 4–7 శాతం మెరుగుపరుస్తాయని, ఉత్పాదకతను 50 శాతం పెంచగలవని వెల్లడించింది. ప్రపంచ ఫార్మా సరఫరా వ్యవస్థలో భారత పాత్రను బలోపేతం చేస్తూ తమ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి అయిదు అగ్రశ్రేణి భారతీయ కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సంస్థలు (సీడీఎంఓలు) 650 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. వెన్నంటే సవాళ్లు..ఔషధ రంగంలో భారత్ పురోగతి ఉన్నప్పటికీ.. పరిశ్రమ ఒక కీలక దశకు చేరుకున్నప్పుడు క్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదిక వివరించింది. డిజిటల్ పరివర్తన, స్మార్ట్ ఆటోమేషన్, కొత్త చికిత్సా విధానాల పెరుగుదల వంటి అంతరాయాలు ఔషధ కార్యకలాపాలను పునరి్నరి్మంచగలవని తెలిపింది. భౌగోళిక రాజకీయ మార్పులు, కొత్త పోకడలు, పెరుగుతున్న స్థిరత్వ డిమాండ్లు కూడా ముప్పును కలిగించే అవకాశం ఉందని వివరించింది. భారతీయ ఫార్మా కంపెనీలు పరిగణించవలసిన ఎనిమిది కీలక అంశాలలో లోపరహిత కార్యకలాపాలను సాధించడం, ఏఐ, డిజిటల్ సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, స్థిరత్వ ప్రయత్నాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. ‘దశాబ్ద కాలంలో నిర్మించిన పునాది కారణంగా భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నేడు బలంగా ఉంది. అంతరాయాలు ఎదురుకానున్నందున అధిక పనితీరును నడిపించడానికి, ప్రపంచ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కంపెనీలు తమ నిర్వహణ విధానాలను పునరాలోచించాలి’ అని మెకిన్సే అండ్ కంపెనీ భాగస్వామి విష్ణుకాంత్ పిట్టి తెలిపారు. -
అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడికి ఐఎస్ఐ కుట్ర.. భగ్నం చేసిన భారత్
గాంధీనగర్: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్(Pakistan) ఐఎస్ఐ ఉగ్రదాడిని భారత్ భగ్నం చేసింది. గుజరాత్, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది. ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్ వేశాడు. అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్, ఫరీదాబాద్ ఏటీఎస్ స్క్వాడ్ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి. -
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు
-
దేశీ మద్యం గుబాళింపులు
ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్‌లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే వీస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, ఓడ్కా, బ్రాండీ... ఇలా అన్ని రకాలూ కలిపి భారత్‌లో మద్యం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.59 లక్షల కోట్లకు చేరింది. మరో మూడేళ్లలో రూ.5.59 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంతటి భారీ మార్కెట్లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాండీ, ఓడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకూ స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ ధోరణి నానాటికీ పెరుగుతోందనేందుకు పెరిగిన దేశవాళీ సరకు అమ్మకాలే నిదర్శనం.టోంగ్బా.. జుడియా సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లలో టోంగ్బా అనే స్థానిక మద్యం మద్యపాన ప్రియులకు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్‌లో సేక్మాయ్ యూ... ఇలా స్థానిక రుచులకు జనం నానాటికీ ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్. ఈ స్థానిక మద్యాన్ని పులియబెట్టిన జీడిపప్పుల నుంచి తయారుచేస్తారు. గోవాలో ఏ మూలన చూసినా, ఏ బార్లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచి్చన పర్యాటకులతోపాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ‘‘పోర్చుగీస్ మూలాలున్న ఫెనీకి స్థానిక రుచిని కలపడంతో గోవా సంస్కృతిలో భాగంగా మారింది’’ అని మిస్టర్ బార్ట్రెండర్గా ఇన్‌స్టాలో ఫేమస్ అయిన కాక్టేల్ నిపుణుడు నితిన్ తివారీ చెప్పారు. దేశవ్యాప్తంగా మారిన టేస్ట్శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక మద్యం రకాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో అవి బార్లలోనూ అందుబాటులోకి వస్తున్నట్టు తులీహో సీఈఓ, 30బెస్ట్బార్స్ ఇండియా, ఇండియా బార్టెండర్ వీక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆచంట చెప్పారు. ఈ ట్రెండ్ గతేడాది నుంచి మొదలైందని నెట్‌ఫ్లిక్స్ మిడ్నైడ్ ఆసియా కన్సల్టెంట్, ప్రముఖ కాక్టేల్ నిపుణుడు అమీ ష్రాఫ్ వెల్లడించారు. ‘‘స్థానిక మద్యానికి జై కొట్టడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యువత చేస్తున్న ప్రచారమే. హిమాచల్‌లో ధాన్యం, గింజలను ఉడకబెట్టి తయారుచేసే రైస్ వైన్ వంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది’’ అని పీసీఓ, ఢిల్లీ జనరల్ మేనేజర్ వికాస్ కుమార్ చెప్పారు. ‘‘ఇదేదో గాలివాటం మార్పు కాదు. పక్కాగా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. దేశవాళీ మద్యానికి గుర్తింపు తేవాలని ఇక్కడి కంపెనీలు నడుం బిగించాయి’’ అని డియాజియో ఇండియా చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ విక్రమ్ దామోదరన్ అన్నారు. విలాస వస్తువుగా..‘‘ఇండియా అగావే, ఫెనీ, మహువా వంటి స్థానిక మద్యం ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. ఆ రకం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అయినా సరే, రానుపోను ఖర్చులు, బస, ఇతరత్రా ఖర్చులను కూడా లెక్కచేయకుండా ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లి మద్యం సేవించి రావడం ట్రెండ్‌గా మారింది. దీంతో స్థానికేతరులకు స్థానిక మద్యం కూడా విలాస వస్తువుగా మారుతోంది’’ అని మాయా పిస్టోలా అగావెపురా మద్యం సంస్థ మహిళా సీఈఓ కింబర్లీ పెరీరా చెప్పారు. ‘మహువా రకం మద్యం బ్రిటన్‌కు భారత్ వలసరాజ్యంగా మారకముందు చాలా ఫేమస్. తర్వాత మరుగున పడింది. ఇప్పుడు కొందరు దాంట్లో పలు రుచులు తెస్తున్నారు. వాటిని కాక్టేల్ నిపుణులు మరింత మెరుగుపరుస్తున్నారు. సిక్స్ బ్రదర్స్ మహువా పేరుతో దేశంలోనే తొలిసారిగా లగ్జరీ మహువా మద్యం తెస్తున్నాం’’ అని సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ రూపీ చినోయ్ చెప్పారు. అయితే, ‘‘స్థానిక మద్యం మొత్తానికీ వర్తించే సింగిల్ బ్రాండ్ అంటూ ఇప్పటికైతే ఏమీ లేదు. ఈ సమస్య పరిష్కారమైతే లైసెన్సింగ్ సమస్యలు తీరతాయి. అప్పుడు దేశవాళీ మద్యం అమ్మకాలు, నాణ్యత పెరుగుతాయి’’ అని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్థానిక కంటెంట్‌తో షార్ట్ వీడియోలకు డిమాండ్
న్యూఢిల్లీ: భారత్‌లో స్వల్ప నిడివి వీడియోలకు (షార్ట్ వీడియోలు) బూమింగ్ ఇప్పుడే మొదలైందని షేర్‌చాట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మనోహర్సింగ్ చరణ్ పేర్కొన్నారు. సృజనాత్మకతతో కూడిన స్థానిక కంటెంట్‌ను చిన్న పట్టణాల్లోనూ ఆదరిస్తుండడం డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన విభిన్నమైన సేవలు స్థిరమైన డిమాండ్‌కు దోహపడుతున్నట్టు, ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు బ్రాండ్లకు కొత్త అవకాశాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. దేశ జనాభాలో ఇంటర్నెట్ చేరువ 60%కి వచి్చనట్టు, 65 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమైన వారు సోషల్ మీడియా, షార్ట్ వీడియోలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు.లాభాలకు చేరువలో..: కన్సాలిడేటెడ్ స్థాయిలో ఎబిటా పాజిటివ్‌కు కంపెనీ చేరువలో షేర్ చాట్ ఉన్నట్టు చరణ్ తెలిపారు. లాభాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో నియామకాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గూగుల్ మద్దతుతో నడుస్తున్న షేర్‌చాట్ వచ్చే రెండేళ్లలో ఐపీవోకు వచ్చే ప్రణాళికలతో ఉంది. ఆదాయంలో 33% వృద్ధిని సాధించగా, నష్టాలు మూడింట ఒక వంతుకు తగ్గిపోయినట్టు ప్రకటించారు. స్టాండలోన్ ప్రాతిపదికన షేర్‌చాట్ ఎబిటా స్థాయిలో లాభాల్లోకి వచి్చనట్టు వెల్లడించారు. -
భారత్-కివీస్ మధ్య ఫైట్
-
India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా రైలులోనూ మన దేశం నుంచి విదేశాలకు వెళ్లవచ్చనే సంగతి మీకు తెలుసా? త్వరలో భారత్- భూటాన్‌ల మధ్య నడవబోయే రైలు దీనిని సాకారం చేయనుంది. అస్సాంలోని కోక్రాఝర్ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకు రైల్వే లైన్ వేయడానికి భారత రైల్వేలు(Indian Railways) ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్)ప్రతినిధి తాజాగా మీడియాకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.ప్రతిపాదిత 69.04 కి.మీ రైల్వే లైను అస్సాంలోని కోక్రాఝర్ స్టేషన్‌ను భూటాన్‌లోని గెలెఫుకు అనుసంధానిస్తుందని, ఇందుకోసం రూ.3,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రతినిధి తెలిపారు. ఈ రైల్వే లైన్‌కు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం పొందాల్సివుంది. ఈ ప్రాజెక్టులో బాలజన్, గరుభాస, రునిఖాత, శాంతిపూర్, దద్గిరి గెలెఫు.. ఇలా మొత్తం ఆరు కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గం భారత్-భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది.ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి(Cultural exchange)ని పెంపొందిస్తుంది. ఈ రైల్వే లైను ఏర్పాటుపై భూటాన్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. భారత్- భూటాన్లను రైలు ద్వారా అనుసంధానించేందుకు రెండు దేశాలు 2018 నుండి చర్చలు జరుపుతున్నాయి. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు అధికారికంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రైలు మార్గంలో రెండు ప్రధాన వంతెనలు, 29 భారీ వంతెనలు, 65 చిన్న వంతెనలు, ఒక రోడ్డు ఓవర్ బ్రిడ్జి, 39 రోడ్డు అండర్-బ్రిడ్జిలు, 11 మీటర్ల పొడవు గల రెండు వంతెనలు నిర్మాణం కానున్నాయి. -
కాలా అజార్.. భారత్ నుంచి పరార్
సాక్షి, అమరావతి: కాలా అజార్.. రెండు దశాబ్దాలకు పైగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వ్యాధిని భారత్ విజయవంతంగా నిర్మూలించింది. మలేరియాకంటే ప్రాణాంతకమైనదిగా భావించే ఈ వ్యాధి నిర్మూలనలో భారత్ పటిష్ట వ్యూహాన్ని అమలు చేసింది. 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని 2023 నాటికి చేరుకుంది. గతేడాది ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. దీంతో త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను కాలా అజార్ రహిత దేశంగా ప్రకటించనుంది. వెక్టర్ బార్న్ డిసీజెస్‌లో మలేరియా తర్వాత రెండో ప్రాణాంతకమైన వ్యాధి కాలా అజార్ అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1824 – 25లో అప్పట్లో భారత భూభాగంలో ఉన్న జెస్సోర్‌లో (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఈ వ్యాధి ప్రబలింది. మూడేళ్లలోనే 7.50 లక్షల మందిని బలి తీసుకుంది. 1970లలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మనదేశంలోనే 11.5 శాతం ఉన్నాయి. 1990–91లో ఈ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ, వైద్యం అందించడం, సమర్థవంతమైన సరై్వలెన్స్ వంటి వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. దీంతో క్రమంగా వ్యాధి తీవ్రత తగ్గింది. 1992లో దేశంలో 77,102 కేసులు 1,419 మరణాలు సంభవించగా, 1995లో కేసులు 22,625కు, మరణాలు 277కు తగ్గాయి. 2010 నాటికే ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించగా, దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ 2023 వరకు పొడిగించింది. 2023లో 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని సాధించింది. 2023లో దేశవ్యాప్తంగా కేవలం 524 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. పశి్చమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గతేడాది 438 కేసులు, రెండు మరణాలకు వ్యాధి తీవ్రత తగ్గినట్టు వెల్లడైంది. దీంతో వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.ఇదీ వ్యాధి కాలా అజార్ వ్యాధి ‘లీష్మానియా డోనోవానీ’ అనే పరాన్నజీవి సోకిన సాండ్ దోమలు కుట్టడం ద్వారా సోకుతుంది. కాలా (నలుపు) అనే హిందీ పదం, అజార్ (వ్యాధి) అనే పర్షియన్ పదం కలిపి ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. వ్యాధి సోకిన వారిలో క్రమం తప్పకుండా జ్వరం వస్తుంది. బరువు గణనీయంగా తగ్గుతారు.ప్లీహం, కాలేయం వాపు, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రెండు సంవత్సరాల లోపు చనిపోతారు. 95 శాతంకంటే ఎక్కువ కేసుల్లో చికిత్స లేకుండానే బాధితులు ప్రాణాలు వదిలేస్తుంటారు. -
Champions Trophy: సెమీస్ సన్నాహకం
భారత్, న్యూజిలాండ్ వన్డేల్లో చివరిసారిగా గత వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీస్‌లో కూడా భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయాలు అందుకుంది. అంతకు ముందు కివీస్‌తో వరుసగా మూడు వన్డేల్లో కూడా టీమిండియాదే పైచేయి. అయితే ఫార్మాట్లు వేరైనా ఇటీవల మన గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆ జట్టు కొట్టిన దెబ్బ ఇంకా తాజాగానే ఉంది. ఇరు జట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆ సిరీస్‌లో ఆడినవారే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో తమ సత్తా చాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ కోణంలో ఇది నామమాత్రపు మ్యాచే అయినా సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఇది ఉపయోగపడనుంది. ఇరు జట్ల సెమీస్ ప్రత్యర్థి ఎవరో కూడా ఈ మ్యాచ్‌తోనే తేలనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’నుంచి ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన భారత్, న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ నెగ్గిన టీమ్‌లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. పంత్‌కు చాన్స్! గత రెండు మ్యాచ్‌లలో ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి భారత జట్టు లక్ష్యాలను సునాయాసంగా ఛేదించింది. మన ప్రదర్శనను బట్టి చూస్తే అంతా ఫామ్‌లో ఉండటంతో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ అవకాశం ఇచ్చే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. వికెట్ కీపర్‌గా రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమైంది. కారు ప్రమాదం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత పంత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే గత ఏడాది ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత ఒకే రోజు విరామంతో సెమీఫైనల్ ఆడాల్సి ఉండటంతో ప్రధాన పేసర్ షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం కూడా ఉంది. అతని స్థానంలో అర్ష్ దీప్ ఆడవచ్చు. కివీస్ టాప్–8లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ స్థానంలో సుందర్ జట్టులోకి రానున్నాడు. పంత్ బరిలోకి దిగితే అక్షర్ బ్యాటింగ్ అవసరం కూడా టీమ్‌కు అంతగా ఉండకపోవచ్చు. మరో వైపు కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఆడిస్తే అతని వన్డే ప్రదర్శనను అంచనా వేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌పరంగా రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్‌లతో టాప్–4 పటిష్టంగా ఉండగా పాండ్యా, జడేజా అదనపు బలం. అదే జట్టుతో... న్యూజిలాండ్ కూడా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. రచిన్, యంగ్, లాథమ్ ఇప్పటికే సెంచరీలు సాధించగా, కాన్వే కూడా ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ బ్యాటర్ విలియమ్సన్ వైఫల్యమే కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో కీలక మ్యాచ్‌లలో భారత్‌పై రాణించిన రికార్డు ఉన్న మాజీ కెపె్టన్ తన స్థాయికి తగినట్లు ఆడితే టీమ్‌కు తిరుగుండదు. ఫిలిప్స్‌లాంటి ఆల్‌రౌండర్ జట్టుకు మరింత కీలకం. జేమీసన్, రూర్కే, హెన్సీలతో పేస్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. కివీస్ స్పిన్ కూడా చాలా బలంగా ఉండటం విశేషం. సాంట్నర్, బ్రేస్‌వెల్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా కివీస్ కూడా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, పంత్, పాండ్యా, జడేజా, సుందర్, రాణా, వరుణ్, అర్ష్ దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), కాన్వే, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షసూచన ఏమాత్రం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. కోహ్లి @300 భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 299 వన్డేల కెరీర్లో కోహ్లి 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లికి ముందు భారత్ నుంచి సచిన్, ధోని, ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, యువరాజ్ 300 వన్డేలు ఆడారు. -
క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్.. మరోసారి ఇండియా-పాక్ మ్యాచ్
-
పట్టాలెక్కనున్న ఎఫ్‌టీయూ
న్యూఢిల్లీ: భారత్–యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య చాలాఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం(ఎఫ్‌టీయూ) త్వరలో పట్టాలకెక్కే దిశగా అడుగు ముందుకు పడింది. చరిత్రాత్మకంగా భావిస్తున్న ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి కుదుర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ నిర్ణయించారు. ఈ మేరకు ఒక డెడ్‌లైన్ విధించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుండడంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఈయూ దేశాలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, ఉర్సులా ఒక అంగీకారానికి వచ్చారు. వారిద్దరూ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. నిజానికి ఇండియా, ఈయూ మధ్య ఈ ఒప్పందం కోసం గత 17 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి రావడం లేదు. 2013లో సంప్రదింపులు నిలిచిపోయాయి. 2022 జూన్‌లో పునఃప్రారంభమయ్యాయి. కానీ, ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. కొన్ని అంశాలపై ఈయూ గట్టిగా పట్టుబడుతుండగా, ఇండియా సమ్మతించడం లేదు. కార్లు, వైన్, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేయాలని ఈయూ కోరుతుండగా, భారత ప్రభుత్వం తిరస్కరిస్తోంది. మోదీ, ఉర్సులా భేటీ కావడంతో ఇక ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కలసికట్టుగా పనిచేద్దాం భారత్, ఈయూ మధ్య సంబంధాలపై మో దీ, ఉర్సులా విస్తృతంగా చర్చించారు. ఇరుపక్షాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా కలసికట్టుగా పనిచేయాలని తీర్మానించారు. ఇండియాతో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ఉర్సులా పేర్కొన్నారు. ఇండియా–ఈయూ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక కచి్చతమైన రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు. తదుపరి ఇండియా–ఈయూ శిఖరాగ్ర సదస్సు నాటికి రోడ్‌మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు. ఈ సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరుగనుంది. మరోవైపు భేటీ తర్వాత మోదీ, ఉర్సులా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, ఈయూ మధ్య వ్యాపారం వాణిజ్యం, టెక్నాలజీ, పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ, భద్రత, నైపుణ్యాభివృద్ధి, రవాణా వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. -
ఏటా 7.8 శాతం వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: భారత్ అధిక ఆదాయ దేశంగా 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశం) అవతరించాలంటే ఏటా 7.8 శాతం సగటు వృద్ధిని, వచ్చే 22 ఏళ్లపాటు సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందుకు గాను ఆర్థిక రంగ, భూమి, కార్మిక మార్కెట్‌కు సంబంధించి సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ 2000 నుంచి 2024 మధ్య కాలంలో వృద్ధిని సగటున 6.3 శాతానికి వేగవంతం చేసుకుందంటూ.. గత విజయాలు భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పటి మాదిరే సాధారణ పనితీరుతో సాధ్యపడదు. తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి ఎనిమిది రెట్లు వృద్ధి చెందాలి. అందుకోసం వృద్ధి మరింత వేగాన్ని అందుకుని, వచ్చే రెండు దశాబ్దాల పాటు స్థిరంగా కొనసాగాలి. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు సరిపోవు. సంస్కరణలను మరింత విస్తరించడంతోపాటు, వేగవంతం చేయాలి. అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్ మారుతుంది’’అని ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. విధానపరమైన చర్యలు, పెట్టుబడులు పెంచడం, నిర్మాణాత్మక పరివర్తనతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనపై భారత్ దృష్టి సారించాలని పేర్కొంది.చిలీ, కొరియా, పోలండ్ నిదర్శనాలు.. ‘‘చిలీ, కొరియా, పోలండ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం కావడం ద్వారా మధ్యస్థ ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా విజయవంతంగా మారాయి. వాటి నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్వాలి’’అని ప్రపంచబ్యాంక్ భారత్ డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే పేర్కొన్నారు. 2000 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగిందని, జీడీపీలో తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు అధికమైనట్టు ప్రపంచబ్యాంక్ నివేదిక గుర్తు చేసింది. ఇందుకు మిగిలిన ప్రపంచంతో పోల్చితే భారత్ వేగంగా వృద్ధి చెందినట్టు తెలిపింది. ఇది కఠిన పేదరికం గణనీయంగా తగ్గేందుకు, సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేసినట్టు వివరించింది. గత విజయాల మాదిరే భారత్ తన సంస్కరణలను వేగవంతం చేసి, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని కౌమే పేర్కొన్నారు.అధిక యువ జనాభా సౌలభ్యం నేపథ్యంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, కార్మిక శక్తిలో మహిళల ప్రతినిధ్యాన్ని 35.6 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచడం అవసరమని ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన ఎమిలీయా స్కాక్, రంగీత్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ‘‘మౌలిక వసతులు మెరుగుపడాలి. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. కార్మిక మార్కెట్ నిబంధనలను క్రమబదీ్ధకరించాలి. నిబంధనల భారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకతతోపాటు పోటీతత్వం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ చర్యలతో భారత్ థాయిలాండ్, వియత్నాం, చైనాతో సమానంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటుంది’’అని ప్రంపచబ్యాంక్ నివేదిక సూచించింది. -
అస్తిత్వాల పోరులో రాజ్యాంగ స్ఫూర్తి
భారతదేశంలో త్రిభాషా సూత్రంపై మరొక సారి విస్తృతమైన చర్చ జరుగుతోంది. దక్షిణ భారత రాష్ట్రాలు భాషా అస్తిత్వాలపరంగా తమ ఉనికిని చాటుకోవటానికి ఎప్పటినుండో పోరాటం చేస్తున్నాయి. ప్రపంచంలోనే దక్షిణ భారత భాషలకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళ భాషలకు మూలం ద్రావిడ భాషే. అయితే అవి 21 భాషలుగా అభివృద్ధిచెందాయి: బ్రాహుయీ, మాల్తో, కూడుఖ్, గోండి, కొండ, కూయి, మండ, పర్జి, గదబ, కోలామీ, పెంగో, నాయకీ, కువి, తెలుగు, తుళు, కన్నడం, కొడగు, టోడా, కోత, మలయాళం, తమిళం. మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు ఉంది. దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం ఉంది. వాఙ్మయ దృష్టితో కాకుండా భాషా చారిత్రక దృష్టితో చూస్తే మధ్య ద్రావిడ భాషల్లో గోండి, కొండ, కూయి; దక్షిణ ద్రావిడ భాషల్లో తుళు, టోడా ప్రాచీనమైనవి. క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్స రాల నాడు మూల ద్రావిడ భాష నుంచి ఈ భాషలు ఒకటొకటి స్వతంత్రతను సంతరించుకున్నాయని భాషా చరిత్రకారులు చెబు తుంటారు. ఒకటొకటి స్వతంత్ర భాషగా రూపొందడానికివెయ్యేండ్లు పట్టింది. ఈ భాషల మూలాలు దక్షిణాది జీవన వ్యవస్థల నుండి ఆవిర్భవించాయి. అంబేడ్కర్ తన ‘రాష్ట్రాలు – అల్పసంఖ్యాక వర్గాలు’ పుస్తకంలో వీటి అస్తిత్వాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.ఏ మూడు భాషలు?దేశ పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించాలన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగా ప్రసిద్ధమయింది. 1968లో ఈ సూత్రానికి సర్వజనామోదం లభించింది. ఈ ప్రకారం పాఠశాల బాలలకు, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ఆధు నిక భారతీయ భాష (ఏదైనా ఒక దక్షిణాది భాష)ను బోధించాలి. హిందీయేతర రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషను బోధించాలి. దక్షిణ భారతావనిలో హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లు వెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ త్రిభాషా సూత్రం ఆమోదం పొందింది. తొలుత రాధాకృష్ణన్ కమిషన్ (1948) ప్రతిపాదించిన ఈ త్రిభాషా సూత్రాన్ని విద్యావేత్త కొఠారి నేతృత్వంలోని తొలి విద్యా కమిషన్ అంగీకరించింది. దరిమిలా 1960లో, 1980ల్లో కేంద్రం రూపొందించిన ప్రథమ, ద్వితీయ జాతీయ విద్యా విధానాలలో ఈ సూత్రం భాగమైంది. అయితే నేర్పవలసిన త్రిభాషలు ఏవి అనేది ఆయా భాషా రాష్ట్రాల పాలకులు నిర్ణయించుకోవాల్సి వుంది.అందుకే హిందీని రెండవ భాషగానో, మూడవ భాషగానోఅంగీకరించకపోతే ‘సర్వ శిక్షా అభియాన్’ కింద పంపే నిధులు పంప మని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.కేంద్ర పాలకులు భాషా అస్తిత్వాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తు న్నారు. రాజ్యాంగంలో రాష్ట్రాల అస్తిత్వం గురించి ఇలా చెప్పారు: భారత రాష్ట్రాలు కలిసి శాసన, కార్యనిర్వాహక, పరిపాలనా అవస రాల కోసం భారత సంయుక్త రాష్ట్రాలు అనే పేరు మీద ఒక రాజకీయ రూపాన్ని తీసుకోవటానికి ఆదేశించుకుంటున్నాయి. ఈ స్ఫూర్తితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ నాడుపై హిందీని బలవంతంగా రుద్దకపోతే డీఎంకే దానిని వ్యతిరేకించదన్నారు. ‘డీఎంకే ఇప్పటికీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తుందని అడిగే వారికి, మీలో ఒకరిగా నా వినయపూర్వక సమాధానం ఏమి టంటే... మీరు రుద్దకపోతే మేము వ్యతిరేకించం. తమిళనాడులో హిందీ పదాలను నలుపు రంగులోకి మార్చం. ఆత్మగౌరవం అనేది తమిళుల ప్రత్యేక లక్షణం. ఎవరైనా దానితో ఆడుకోవడానికి మేము అనుమతించం’ అన్నారు. రాష్ట్రంలో భాషా వివాదం చెలరేగు తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన డీఎంకే శ్రేణులకు లేఖ రాశారు. భాషల కోసం పోరాటంస్టాలిన్ వాదనలో ఒక సత్యం ఉంది. మాతృభాష ప్రతి రాష్ట్రంలోని విద్యార్థికి అత్యవసరం. దక్షిణాదిలో ఉన్న భాషా మూలాలను బట్టి వారికి రెండవ భాషగా దక్షిణాది భాష త్వరగా వస్తుంది. ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లిష్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు నేర్చుకోవడం వల్ల ఏ దేశంలోనైనా ఉపాధిని సంపాదించుకోవచ్చు. తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ కాలంలోనే తమిళ భాషా అస్తిత్వం కోసం పోరాడిన చరిత్ర ఉంది. అలాగే తెలుగువారు కూడా తమ భాషా అస్తిత్వాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. నిజానికిఆంధ్రులు అనేక భాషల వారితో బాధింపబడినా తమ అస్తిత్వ పోరా టాల్ని బలంగా చేశారు. శాతవాహనుల కాలం నుండి సంస్కృత భాషలో, ప్రాకృత భాషలో పాలకులు ఉన్నప్పుడు, తెలంగాణలో ఉర్దూ భాష పాలకులు ఉన్నప్పుడు కూడా తెలుగువారు తమ లిఖిత భాషా సంప్రదాయాన్ని కొనసాగించారు. తమిళనాడును ఎంతో కాలం పాలించిన కరుణానిధి ప్రెస్మీట్లో కూడా తమిళంలోనే మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విలేఖరులకు ఉందని చెప్పడం ఒక ఆత్మాభిమాన ప్రకటన!క్రీ.శ.1901లో శ్రీ కృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం కొమర్రాజు లక్ష్మణరావు పంతులు ప్రోత్సాహంతో స్థాపించబడిన తరువాత తెలుగులో భాషోద్యమంతో పాటు, గ్రంథాలయాల ప్రాధా న్యత పెరిగింది. 1906వ సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి ప్రారంభంతో సాహిత్య ప్రచురణకు కూడా ఉత్సాహం వచ్చింది. తెలుగు భాషాభివృద్ధికి అన్ని ప్రాంతాల మేధావులు కృషి చేశారు. ఏ భాషోద్యమమైనా ఆ భాషా ప్రజల చరిత్రకు, పరిణామాలకు మూల శక్తి అవుతుంది. భాషను విస్మరించిన రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పో తాయి. తెలుగు భాష గ్రంథస్తం కాకపోవడానికి వీరికి రాజ భాషగా సంస్కృత, ప్రాకృతాలు 900 యేండ్లు వ్యవహరించడం. అయినా తట్టుకొని నిలబడటమే గొప్ప అంటారు బి.ఎన్.శాస్త్రి. ‘‘ఆంధ్ర దేశ మున రాజభాషగా ప్రాకృతము క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 300 వరకు వర్ధిల్లినది. అటు పిమ్మట క్రీ.శ. 300–600 వరకు సంస్కృతము రాజ భాషయైనది.... గాథాసప్తశతి, బృహత్కథ, లీలావతి వంటి ప్రాకృత గ్రంథములందు అనేక తెలుగు పదములున్నవి. ప్రాకృత, సంస్కృత భాషల కన్న భిన్నమైన దేశభాష అనగా తెలుగు వాడుకలోనున్నట్లు శర్వవర్మ–గుణాఢ్యుల సంవాద గాథ తెలుపుచున్నది.’’ ఉత్తరాదివారూ నేర్చుకోవాలి!వాస్తవానికి మోదీ సర్కార్ జాతీయ విద్యా విధానంలో హిందీని ప్రస్తావించకపోవడం ద్వారా త్రిభాషా సూత్రాన్ని అస్పష్టపరిచింది. ఈ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎంపిక చేసిన ఏ మూడు భాషలనైనా బోధించవచ్చు. అయితే ఆ మూడు భాషలలో రెండు తప్పనిసరిగా దేశీయ భాషలు అయివుండాలి. ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటే, తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో ఒకదాన్ని, ఆంగ్ల భాషను బోధించవచ్చు. నిజానికి ఉత్తరాదికి దక్షిణాదివారు, దక్షిణాదికి ఉత్తరాదివారు ప్రయాణం చేస్తున్న కాలం ఇది.దక్షిణాది భాషలు ఉత్తరాదిలో ఎగ తాళికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇంగ్లిష్‌ను ఎటూ ప్రపంచ భాషగా చదువుతున్నారు. ఉత్తరాది వారికి దక్షిణాది చరిత్ర, దక్షిణాది వారికి ఉత్తరాది చరిత్ర తెలియాలి. ఒకరి భాషా ఒకరికి, ఒకరి వస్తువుల పేర్లు మరొకరికి, ఒకరి తినుబండారాల పేర్లు మరొకరికి అర్థం కావాలంటే ఉత్తరాది వారు కూడా దక్షిణాది భాషల్లో ఒక భాషను నేర్చుకోవాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నీ భారతీయ భాషలే, అన్నింటికీ సమ ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెప్పారు. ఫెడరల్ సూత్రాలను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాది సంప్రదాయశీలమైంది, దక్షి ణాది పురోగమన శీలమైంది. ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన హక్కుల్ని కాపాడటం కేంద్ర ప్రభుత్వ విధి.» పాఠశాలల్లో బాలలకు మూడు భాషలు బోధించా లన్న విధానం అధికారికంగా త్రిభాషా సూత్రంగాప్రసిద్ధం. 1968లో దీనికి ఆమోదం లభించింది.» హిందీని బలవంతంగా రుద్దకపోతే దానిని వ్యతిరేకించం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.» త్రిభాషా సూత్రం ప్రకారం, హిందీ భాషా రాష్ట్రాలలో హిందీ, ఇంగ్లిష్తో పాటు ఒక ఆధునిక భారతీయభాష (ఏదైనా దక్షిణాది భాష)ను బోధించాలి. కానీ ఇది విస్మరణకు గురైంది.-వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695-డా‘‘ కత్తి పద్మారావు -
భారత గ్రాడ్యుయేట్ల కోసం...గోల్డ్ కార్డు కొనండి
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే. ‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. -
బెడ్ ఎక్కిస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్
సాక్షి, అమరావతి: దేశంలో సంప్రదాయ ఆహారపు అలవాట్లు పాశ్చాత్య జీవనశైలి వైపు మారుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పానీయాల వినియోగం సర్వసాధారణమైంది. పండ్లు, కూరగాయలు తినడం తగ్గుతోంది. ఫలితంగా ఆహారంలో పోషకాల తగ్గి.. అధిక కేలరీలకు దారి తీస్తోంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 20–40 ఏళ్ల వయసు్కల్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఆరోగ్యాన్ని దిగజారుస్తున్నట్టు చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ఖర్చు చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలపై పెరిగిన ఖర్చు మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ సమస్యలు వంటి నాన్–కమ్యూనికబుల్ వ్యాధుల పెరుగుదలతో ముడిపడి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా గృహ వ్యయ సర్వేలో గ్రామీణ భారతంలోని నెలవారీ ఖర్చులో 47 శాతం ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ఇందులో ఏకంగా 10 శాతం మొత్తాన్ని ప్రాసెస్ చేసిన ఆహారానికి కేటాయించడం గమనార్హం.ఇది పండ్లు (3.85 శాతం), కూరగాయలు (6.03 శాతం), తృణధాన్యాలు (4.99 శాతం), గుడ్లు, చేపలు, మాంసంపై (4.92 శాతం) కంటే అధికంగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. నెలవారీ ఖర్చులో 39 శాతం ఆహారం కోసం వెచ్చిస్తే ఇందులో పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌పై 11 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. ఇది పండ్లు (3.87 శాతం), కూరగాయలు (4.12 శాతం), తృణధాన్యాలు (3.76 శాతం), గుడ్లు, చేపలు, మాంసం (3.56 శాతం) ఖర్చును అధిగమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై సగటు నెలవారీ తలసరి వ్యయం 2022–23లో 46.38 శాతం నుంచి 2023–24లో 47.04 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 39.17 శాతం నుంచి 39.68 శాతానికి వృద్ధి చెందింది. ప్రమాదంలో ప్రజారోగ్యం గత ఏడాది నాన్–కమ్యూనికబుల్ వ్యాధులు (ఎన్సీడీ) రిస్క్ ఫ్యాక్టర్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ప్రకారం 2022లో.. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారిలో 62 శాతం మందికి ఎటువంటి చికిత్స అందటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయంతో బాధపడుతున్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. దాదాపు 8 కోట్ల మంది స్థూలకాయ బాధితులు ఉంటే.. 5–19 సంవత్సరాల వయస్కుల్లో కోటి మంది ఉండటం గమనార్హం. ఈ సమస్యతో ఏటా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనారోగ్యాలపై 6 ట్రిలియన్ల ఖర్చు ఇలా దీర్ఘకాలిక అనారోగ్యాలపై 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా. దేశంలో అత్యున్నత వైద్య ప్యానల్ అయిన ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా మొత్తం వ్యాధుల్లో 56.40 శాతం అనారోగ్యకర ఆహారాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఒత్తిడి, నిశ్చల జీవనానికి విఘాతం కలిగించే అలవాట్లు కూడా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉప్పు, చక్కెరలను పరిమితంగా తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని పెంచడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలని నివేదికలు సిఫారసు చేస్తున్నాయి. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు కేవలం 10 నిమిషాల్లోనే భోజనాన్ని అందిస్తున్నాయి. ఇదే ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా డెలివరీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి ఫుడ్ డెలివరి ప్లాట్‌ఫామ్‌లతో దేశంలో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వినియోగం పెరిగింది. అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ చైన్లు పాశ్చాత్య ఆహార ధోరణులను భారతీయ గృహాలకు పరిచయం చేశాయి. ఇక్కడే ఫుడ్ డెలివరీ మార్కెట్ 2030 నాటికి రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. పైగా దేశంలో ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక ప్రకారం భారతదేశ గృహ వ్యయం 2027 నాటికి 3 ట్రిలియన్ల డాలర్లను దాటనుంది. అప్పటికి.. దాదాపు 25.80 శాతం భారతీయ కుటుంబాల్లో సాధారణ ఖర్చులు పోనూ రూ.86 వేలు అదనంగా వ్యయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.రెండు దశాబ్దాల కిందటి వరకు గ్రామీణ భారతం జంక్ ఫుడ్ కోసం కేవలం 4 శాతం మాత్రమే ఖర్చు చేసేది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.35 శాతంగా ఉండేది. 2004–05, 2009–10 మధ్య కాలంలో పెద్దఎత్తున జంక్ ఫుడ్ ధరలు, వినియోగం కూడా పెరిగాయి. -
కొంచెం అతి ఖర్చుకు 100 కోట్ల మంది దూరం
ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో వినియోగదారుల వర్గం పెరగడం లేదు. సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతోంది. ఏకంగా 100 కోట్ల మంది వద్ద వస్తువులు, సేవల మీద వెచ్చించేందుకు డబ్బు లేదు! బ్లూమ్ వెంచర్స్ సంస్థ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 143 కోట్ల జనాభాలో అత్యవసరం కాని వస్తువులు, సేవలపై, అంటే ఓ మాదిరి విలాసాలపై ఖర్చు చేసే ప్రజల సంఖ్య చాలా తక్కువని తెలిపింది. వెంచర్ క్యాపిటల్ నివేదిక ప్రకారం దేశంలో 13 నుంచి 14 కోట్ల మందే ‘వినియోగ వర్గం’గా ఉన్నారు. కనీసావసరాలకు మించి కొనుగోలు చేయగల సామర్థ్యం వీరికే ఉంది. ఈ వినియోగదారుల వ్యయంపైనే దేశ జీడీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంతో ఎక్కువ వెచ్చిస్తున్నా చాలావరకు అది అత్యవసర సేవల కోసమే ఉంటోందని తెలిపింది. కొత్త స్టార్టప్‌ల సేవలకు వారు డబ్బు వినియోగించడం లేదని తెలిపింది. భారత్‌లో వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా విస్తరించడం లేదని, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఉన్నవారే మరింత సంపన్నుల వుతున్నా రని ఈ సర్వే మరోసారి తేల్చిందని నిపుణులంటున్నారు. ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.మధ్యతరగతిపై రోకటిపోటు1990లో జాతీయాదాయంలో 34 శాతంగా ఉన్న భారతీయ సంపన్నుల వాటా ఇప్పుడు ఏకంగా 57.7 శాతానికి పెరిగింది. దిగువ సగం జనాభా వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. ఆర్థిక పొదుపు కూడా క్షీణిస్తోంది. మెజారిటీ భారతీయుల రుణాలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న వినియోగదారులు కొనుగోళ్ల కోసం దాదాపుగా రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరక్షిత రుణాల నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేయడం వారిని బాగా ప్రభావితం చేస్తోంది. వినియోగదారుల డిమాండ్‌కు ప్రధాన చోదకశక్తిగా ఉన్న మధ్యతరగతి కుంచించుకుపోతోంది. దేశంలో పన్ను చెల్లించే మధ్య తరగతిలో సగం మందికి దశాబ్దం కాలంగా వేతనాల్లో పెరుగుదల లేదు. పైపెచ్చు ద్రవ్యోల్బణంతో పోలిస్తే వారి ఆదాయాలు సగానికి పడిపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం మధ్యతరగతి పొదుపును దాదాపుగా నాశనం చేసేసింది. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి చేరిందని ఆర్బీఐ పదేపదే చెబుతోంది. దాంతో మధ్యతరగతి గృహ వ్యయాలతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలకు మున్ముందు గడ్డుకాలమేనని నివేదిక సూచిస్తోంది.ఏఐ దెబ్బ...సాంకేతికత, యాంత్రీకరణ దెబ్బకు వైట్ కాలర్ ఉద్యోగాలు శరవేగంగా మాయమవుతున్నట్టు మార్సెలస్ నివేదిక హెచ్చరిస్తోంది. క్లరికల్, సెక్రటేరియల్ పోస్టులను క్రమంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు భర్తీ చేస్తున్నాయి. దాంతో తయారీ రంగంలో పర్యవేక్షక ఉద్యోగాలూ తగ్గుతున్నాయి. ఏఐ తాలూకు ఈ దుష్ప్రభావం గురించి ఆర్థిక సర్వే–2025 కూడా పేర్కొంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నా కార్మికులపై ఆధారపడే మన ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బ తీస్తుందని హెచ్చరించింది. వృద్ధిని కూడా ఇది దెబ్బ తీస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యా సంస్థల మధ్య సహకారం, సమగ్ర విధానం అవసరమని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం విషయంలో అలసత్వం చూపితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ముందడుగు
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యం, పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షికవాదం కొత్త ఉ్రత్పేరకంగా కనిపిస్తుందన్నారు. బీఎస్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. సవాళ్లతో కూడిన కాలంలో భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్ట చెప్పారు. ‘‘ద్వైపాక్షికవాదం ఇప్పుడు ప్రముఖ అజెండాగా మారుతోంది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఇతోధికం చేసుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్యం లేదా పెట్టుబడుల కోసమే కాదు, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా కూడా అవసరమే. కొత్త ప్రపంచ క్రమంలో భారత్ తనకున్న టెక్నాలజీ, నిపుణుల బలంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారగలదు’’అని వివరించారు. మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయంటూ.. వాటి పునరుద్ధరణకు చేసే ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో మార్పులు.. ప్రపంచ వాణిజ్యం పూర్తిగా మార్పునకు గురవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్లు, వాటి సేవలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమర్థంగా పని చేయడం లేదు. ప్రాధాన్య దేశం హోదా (ఎంఎఫ్ఎన్) అన్నదానికి అర్థం లేకుండా పోయింది. ప్రతి దేశం తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటోంది. ఒకవేళ డబ్ల్యూటీవో బలహీనపడితే లేదా మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్లు సమర్థవంతంగా పనిచేయకపోతే.. అప్పుడు వాణిజ్యం విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలే కీలకంగా మారతాయి’’అని మంత్రి చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి బ్రిటన్ (యూకే) సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్ చర్చలు ప్రారంభించినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. 27 దేశాల సమూహం అయిన ఐరోపా యూనియన్ (ఈయూ)తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రుణ నిర్వహణ, ద్రవ్య క్రమశిక్షణ పరంగా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘సంస్కరణలన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వ అజెండాగానే ఉండిపోకూడదు. ప్రతి రాష్ట్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని కోరుకుంటున్నాను’’అని మంత్రి సీతారామన్ చెప్పారు. పోటీతత్వాన్ని పెంచుకోవాలి స్వీయ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్ పిలుపు ముంబై: పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడకుండా.. తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి, మరింత పోటీతత్వంతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గోయల్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ సహకారం కోసం ఎంత కాలం పాటు చూస్తారు? లేదా సబ్సిడీలు, సహకారం, ప్రోత్సాహకాలు, అధిక దిగుమతి సుంకాలు ఎంతకాలం పాటు కోరుకుంటారు? ప్రపంచంతో రక్షణాత్మక వైఖరి ఎంత కాలం? ఈ తరహా రక్షణాత్మక మనస్తత్వం, బలహీన ఆలోచనా ధోరణి నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకోవాలి’’అంటూ దేశీ పరిశ్రమ స్వీయ సామర్థ్యాలతో ఎదగాలన్న సంకేతం ఇచ్చారు. ఆవిష్కరణలు, తయారీ విధానాల నవీకరణ, నైపుణ్యాలు, సామర్థ్యాల నుంచే పోటీతత్వం వస్తుందన్నారు. పోటీతత్వంతో ఎదగనంత వరకు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరవని, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోకపోతే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చమురు, రక్షణ, ఆహారం వంటి కొన్ని రంగాల్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నట్టు చెప్పారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి పీయూష్ గోయల్.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాల నడుమ తీరిక లేకుండా ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ విధానాలతో దేశాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు మొదలైనట్టు తెలిపారు. భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యత భారత్‌కు దీర్ఘకాలిక సవాలుగా ఉన్నట్టు గోయల్ గుర్తు చేశారు. ఫార్మాలో తగిన అనుమతులు ఉన్న బడా సంస్థలు చిన్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని సూచించారు. -
భారత్ గురించి మాట్లాడే స్థాయిలో పాక్ లేదు: త్యాగి కౌంటర్
ఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటరిచ్చింది. జమ్ముకశ్మీర్ అంశంపై పాక్ మరోసారి ఆరోపణలు చేయడంతో దాన్ని భారత్ ఖండించింది. ఈ క్రమంలో భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాకిస్థాన్ లేదని స్పష్టం చేసింది. అలాగే, భారత్‌పై ఆరోపణలు చేయడం మానేసి.. వారి దేశ ప్రజలకు సుపరిపాలన అందించడంపై ఫోకస్ పెట్టాలని చురకలు అంటించింది.అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రతీసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్ముకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో పాక్ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్ తరార్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటరిచ్చింది.పాక్ వ్యాఖ్యలపై భారత రాయబారి క్షితిజ్ త్యాగి స్పందిస్తూ..‘మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని పాకిస్థాన్.. భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టిసారిస్తుంది. పాకిస్థాన్ మాపై ఆరోపణలు చేయడం మానేసి.. తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలి. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తుంది. అనవసర వ్యాఖ్యలు చేసి కౌన్సిల్ సమయాన్ని వృధా చేయడం దురదృష్టకరం’ అని వ్యాఖ్యలు చేశారు. #WATCH | Geneva: At the 7th Meeting - 58th Session of Human Rights Council, Indian Diplomat Kshitij Tyagi says, "India is exercising its right of reply in response to the baseless and malicious references made by Pakistan. It is regrettable to see Pakistan's so-called leaders and… pic.twitter.com/7Bg5j8jZJX— ANI (@ANI) February 26, 2025 -
ఖాళీలు 2.. దరఖాస్తులు 1,200..
ఢిల్లీ: యువ భారత శక్తి సామర్థ్యాలు ఆధునిక పారిశ్రామిక, సేవారంగాల వాస్తవిక అవసరాలను అనుగుణంగా లేవన్న చేదు నిజం మరోసారి నిరూపితమైన ఘటన ఇది. సరైన విద్యార్హతలున్నాసరే ఖాళీలకు మించి నిరుద్యోగులు భారత్‌లో పోగుబడుతున్నారని టెక్నాలజీ సంస్థ అయిన ఆన్మ్యాన్డ్ డైనమిక్స్ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, సీఈఓ శ్రీనాథ్ మల్లికార్జునన్ వ్యాఖ్యానించారు. అందుకు తన సంస్థకు వెల్లువెత్తిన ఉద్యోగ దరఖాస్తులను ఆయన సాక్ష్యంగా చూపారు.తాజాగా శ్రీనాథ్..‘భారత్‌లోని మా కార్యాలయంలో ఇంటర్న్‌షిప్‌ల కోసం కేవలం రెండు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేసేందుకు తగు అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరాం. ఊహించనంతగా ఏకంగా 1,200 దరఖాస్తులు వచ్చాయి. రెండు ఉద్యోగాలకు 1,200 అప్లికేషన్లు అందుకోవడమంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తిష్టవేసిందో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. ఈ 1,200 దరఖాస్తులను పూర్తిగా వడబోసి మేం చివరకు అత్యంత నైపుణ్యవంతులైన అభ్యర్థులకు చెందిన కేవలం 20 దరఖాస్తులను మాత్రమే ఉద్యోగాల కోసం పరిశీలిస్తాం’ అని తన లింక్డ్ఇన్ ఖాతాలో శ్రీనాథ్ రాసుకొచ్చారు. ఉద్యోగ విపణిలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిలో చేరేంత సత్తాను సాధించడంతో నేటి యువత వెనకబడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగ వేటలో యువ భారతం ఎందుకు విఫలమవుతోందో ఆయన కొన్ని కారణాలను విశ్లేషించారు.కారణాలు ఇవే..జేఈఈ పరీక్ష రాసి ఐఐటీల్లో చదువులు పూర్తిచేసుకున్న చాలా మంది తర్వాతి ఉన్నత విద్య చదివేందుకు ఆసక్తి చూపట్లేదు.ఐఐటీల్లో చదివినా వీరిలోనూ నేటి పరిశ్రమలు, సేవారంగాల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు కొరవడుతున్నాయి.ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో సమర్థవంతమైన విద్య లభించట్లేదు.నాలుగేళ్ల డిగ్రీలు పూర్తిచేస్తున్నా వారిలో అభ్యసన సామర్థ్యం వంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ పాళ్లు తగ్గుతున్నాయి.కాలం చెల్లిన సిలబస్, కఠిన స్థాయి తగ్గిన పరీక్షలు, పూర్తి సమర్థత లేని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనా సిబ్బంది మరో కారణం.ఎక్కువ మంది విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి కేవలం కాల్ సెంటర్లు, క్లర్క్ వంటి బ్యాక్ ఆఫీస్ క్లరికల్ ఉద్యోగాలకే పరిమితం అవుతోంది.కృత్రిమ మేథ(ఏఐ) విజృంభిస్తుండటంతో ఇలాంటి ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో కనుమరుగు అవుతాయి.శ్రీనాథ్ ఇస్తున్న సూచనలు..కాలేజీ విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ సిలబస్‌ను క్షుణ్ణంగా చదవండి.మీ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెరి్నంగ్(ఎన్పీటీఈఎల్) కోర్సులనూ చదవండిసొంతంగా చిన్నపాటి ప్రాజెక్టులను మీరే ప్రయత్నించండి. ఇందుకోసం ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోండి. సమయం వృథా చేయకండి.స్పందించిన నిపుణులు..శ్రీనాథ్ పోస్ట్‌పై పలు రంగాల నిపుణులు స్పందించారు. సర్టిఫికెట్లను సాధించడం కంటే నైపుణ్యాలను సాధించడంపై యువత దృష్టిపెట్టాలని వాళ్లు వ్యాఖ్యానించారు. వృత్తివిద్యా కోర్సులను విస్తృత స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని వాళ్లు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడుల వరద మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు ఆధునిక కోర్సులను నేర్చుకుంటూ సన్నద్ధం కావాలని మరో నిపుణుడు అన్నారు. అంకుర సంస్థల వంటివి తాత్కాలికంగా ఉపాధి కల్పించినా అది శాశ్వత పరిష్కారం చూపలేవని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. -
అమెరికా సుంకాలపై స్పష్టత లేదు
సాక్షి హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తే వాటి ప్రభావం ఫార్మా రంగంపై ఎంత మేరకు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ కో–ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ వ్యాఖ్యానించారు. సుంకాలు ఎంత మేరకు ఉంటాయన్నది తెలియకపోయినా.. వాటి వల్ల అమెరికాకే నష్టమని భావిస్తున్నా మన్నారు. ఫార్మా రంగంలో భారత్ ఇతరులను అనుకరించడం కాకుండా.. సొంతంగా ఉత్పత్తులను ఆవిష్కరించాల్సిన సమయం ఇదేనన్నారు. మంగళవారం హైదరా బాద్‌లో ప్రారంభమైన బయో ఆసియా సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పలు అంశాలపై విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ప్రశ్న: భారత్‌లో ఇన్నోవేషన్‌ను ప్రోత్స హించాలని మీరు బయో ఆసియా వేదికగా ప్రకటించారు. మరి ఈ అంశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు?జవాబు: ప్రభుత్వం నుంచి సహకారం ఆశించట్లేదు. మాకు బెంగళూరులో కేన్సర్‌పై పరిశోధనల కోసం ఆరిజిన్ పేరుతో ప్రత్యేక కేంద్రం ఉంది. అక్కడ కేన్సర్ చికిత్స కోసం సొంతంగా మందులను అభివృద్ధి చేస్తున్నాం. అలాగే కణ, జన్యుస్థాయిలో పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం.వాటిలో కేన్సర్ చికిత్సపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్ర: ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌పై విస్తృత పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లభిస్తుందనుకోవచ్చా?జ: కేన్సర్‌కు పూర్తిస్థాయిలో చికిత్స లభించేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇంకా చాలా సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం కణ, జన్యుస్థాయిలో కొంత ముందడుగు సా ధించాం. రకరకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ (రోగనిరోధక శక్తి కణాల మాదిరిగా పనిచేసే కణాలు. కేన్సర్ కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి), సహజసిద్ధ యాంటీబాడీలకు మందులను జోడించి వాడటం (ఏడీసీలు అంటారు) వంటి అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీలో భాగంగా వాటిని కేన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను బెంగళూరులోని సెల్ అండ్ జీన్ థెరపీ సెంటర్లో తయారు చేస్తున్నాం. అయినప్పటికీ అన్ని రకాల కేన్సర్ల చికిత్సకు ఇంకా సమయం పడుతుంది.ప్ర: భారత్‌పై 25% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో దీని ప్రభావం ఫార్మా రంగంపై ఎంత మేరకు ఉంటుంది?జ: దీనిపై మాతోపాటు ఇతర ఫార్మా కంపెనీలకు స్పష్టత లేదు. సుంకాలు ఎంత మేరకు ఉంటాయన్నది కూడా తెలియదు. సుంకాలు విధిస్తే అమెరి కాలోని వినియోగదారులు, ఇంటర్మీడియరీస్లపైనే ఆ భారం పడుతుంది. సుంకాల నుంచి తప్పించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ కేంద్రాలను అమెరికాకు తరలించడం ఆచరణ సాధ్యం కాదు. అంత సామర్థ్యం అక్కడ లేదు. పైగా అక్కడ తయారీ ఖర్చులు చాలా ఎక్కువ. సుంకాలు విధించినప్పటికీ భారత్, చైనా కంపెనీలు ఇతర దేశాలతో పోటీపడగలవు. మొత్తమ్మీద చూస్తే సుంకాల విషయమై ప్రస్తుతం మేము వేచి చూస్తున్నాం. ఒక స్పష్టత వచ్చే వరకు ఏం చేయాలన్నది నిర్ణయించలేం. ఈ విషయమై ప్రభుత్వంతోనూ ఇప్పటివరకూ సంప్రదింపులు జరపలేదు. ప్ర: కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. మీరు ఎంత వరకు దీన్ని వాడుకుంటున్నారు?జ: కొత్త మందుల ఆవిష్కరణకు మేము కృత్రిమ మేధను వాడుకుంటున్నాం. కానీ పరిమిత స్థాయిలోనే... బెంగళూరులోని ఆరిజిన్ కేంద్రంలో వాడుతున్నాం.ప్ర: చైనా ఫార్మా రంగంలో సృజనకు ఎంతమేర ప్రాధాన్యత ఉంటోంది? జ: చైనా ఒక పెద్ద మార్కెట్. సృజనాత్మక ఆవిష్కరణలకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. అధిక లాభాలు తీసుకోవడానికి కంపెనీలకు మోనోపలి హక్కులు కల్పిస్తోంది. స్థానికంగా మంచి మార్కెట్ కూడా ఉండటంతో అక్కడ ఇన్నోవేషన్ బాగా జరుగుతోంది. పైగా ఫార్మా ఉత్పత్తుల విషయంలో పరిశోధనలు కూడా బాగా చేస్తున్నారు. పలు భారతీయ కంపెనీలు కూడా చైనా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. -
రష్యా నుంచి రూ.4.45 లక్షల కోట్ల చమురు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యా నుంచి భారత్ వరుసగా మూడో ఏడాదీ 49 బిలియన్ యూరోల విలువైన (రూ.4.45 లక్షల కోట్లు సుమారు) చమురు కొనుగోలు చేసింది. ఈ వివరాలను ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక రూపంలో వెల్లడించింది.భారత్ సాధారణంగా మిడిల్ఈస్ట్ దేశాల నుంచి చమురు సమకూర్చుకుంటుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత మారిన సమీకరణాలతో.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా పెంచడం గమనార్హం. పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం, యూరోపియన్ దేశాలు కొనుగోళ్లను తగ్గించడంతో.. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ కంటే రష్యా చాలా తక్కువ ధరకే చమురును ఆఫర్ చేయడం ఇందుకు కారణం. అంతకుముందు వరకు దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతంలోపే ఉండగా.. అక్కడి నుంచి 40 శాతానికి పెరిగాయి.‘‘రష్యా నుంచి మూడో ఏడాది అత్యధికంగా చైనా 78 బిలియన్ యూరోల చమురు కొనుగోలు చేయగా, భారత్ 49 బిలియన్ యూరోలు, టర్కీ 34 బిలియన్ యూరోల చొప్పున కొనుగోలు చేశాయి. దీంతో రష్యా చమురు ఆదాయాల్లో ఈ మూడు దేశాలు 74 శాతం సమకూర్చాయి’’అని సీఆర్ఈఏ తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన మూడో ఏడాది రష్యాకి శిలాజ ఇంధనాల ద్వారా 242 బిలియన్ యూరోలు, ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన తర్వాత మొత్తం 847 బిలియన్ యూరోల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. ఒకానొక దశలో మార్కెట్ రేటు కంటే బ్యారెల్‌కు 18–20 డాలర్లు తక్కువే చమురును రష్యా ఆఫర్ చేసినట్టు తెలిపింది. దీంతో భార్ తక్కువ రేటుపై చమురును సొంతం చేసుకోగలిగినట్టు పేర్కొంది. అయితే ఇటీవలి కాలంలో రష్యా ఆఫర్ చేసే డిస్కౌంట్ బ్యారెల్‌పై 3 డాలర్లకు తగ్గినట్టు వెల్లడించింది. యూరప్, జీ7 దేశాలకు ఎగుమతులు భారత్‌లోని రిఫైనరీలు చౌకగా లభించిన రష్యా ముడి చమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా మార్చి యూరప్, జీ7 దేశాలకు ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన మూడో ఏడాది జీ7 దేశాలు 18 బిలియన్ యూరోల ఆయిల్‌ను భారత్, టరీ్కలోని రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. భారత్, టర్కీ రిఫైనరీల నుంచి ఈయూ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా నిలిచింది. రిఫైనరీల మొత్తం ఉత్పత్తిలో 13 శాతం ఇలా ఎగుమతి అయినట్టు ఈ నివేదిక తెలిపింది. ఐరోపా యూనియన్‌లో నెదర్లాండ్స్ 3.3 బిలియన్ యూరోలు, ఫ్రాన్స్ 1.4 బిలియన్ యూరోలు, రొమానియా 1.2 బిలియన్ యూరోలు, స్పెయిన్ 1.1 బిలియన్ యూరోల చొప్పున భారత్, టర్కీ రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. -
Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్‌ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్‌ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. -
మహాశివరాత్రి- ద్వాదశ జ్యోతిర్లింగాలు (ఫోటోలు)
-
అరగంటలో 350 కిలోమీటర్ల జర్నీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి జైపూర్(రాజస్థాన్) మధ్య దూరం 300 కిలోమీటర్లు ఉంటుంది. అంతటి దూరాన్ని నిమిషాల్లో చేరుకోగలిగితే ఎలా ఉంటుంది?.. ఇలాంటి హైస్పీడ్ ప్రయాణం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ తొలి అడుగు వేసింది. ఐఐటీ మద్రాస్ ఆలోచనతో భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. హైపర్‌లూప్(Hyperloop) అనేది అత్యంత అధునాతనమైన రవాణా వ్యవస్థ. గంటకు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం ఈ రవాణా వ్యవస్థ లక్ష్యం. సుదుర గమ్యాలను నిమిషాల వ్యవధిలో చేరుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అందుకే దీన్ని రవాణా వ్యవస్థలో హైపర్‌లూప్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. వందేభారత్ తర్వాత బుల్లెట్ రైల్ మీద దృష్టిసారించిన భారతీయ రైల్వే(Indian Railways) ఇప్పుడు మరో ఘనత వైపు అడుగులేస్తోంది. భారత తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు తెలియజేశారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో 422 మీటర్ల దూరం ఉన్న ట్రాక్‌ను రూపొందించారు. ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టు వాస్తవరూపం దాలిస్తే అరగంటలోపే ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకోవచ్చన్నమాట. The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025రోడ్డు, రైలు, నీరు, వాయు రవాణా మార్గాల తర్వాత ఫిఫ్త్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా హైపర్లూర్ను చెబుతుంటారు. వాక్యూమ్ ట్యూబ్స్‌లో పాడ్స్ ద్వారా ప్రయాణమే హైపర్‌లూప్. గొట్టాల్లాంటి ఆ నిర్మాణాల్లో గాలి నిరోధకత.. పాడ్లను అధిక వేగంతో ప్రయాణించేలా చేస్తుంది. 2013లో ఇలాన్ మస్క్ ప్రచారంతో దీని గురించి ఎక్కువ చర్చ నడిచింది. అమెరికా, చైనా ఇలా చాలా దేశాలు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రధాన నగరాలను అనుసంధానించడం కోసమైనా హైపర్‌లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తేవాలని యూఏఈ సైతం భావిస్తోంది. -
ఇంటర్నెట్ షట్‌డౌన్.. టెన్షన్
ఇంటర్నెట్ షట్డౌన్లో ఇండియా వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది. ఎక్కువసార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రజాస్వామ్య దేశాల్లో మనమే ముందున్నాం. డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ (Access Now) తాజా నివేదిక ప్రకారం.. గతేడాది అంటే 2024లో వేర్వేరు కారణాలతో మనదేశంలో 84 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. అయితే 2023తో పోల్చుకుంటే భారత్‌లో ఇంటర్నెట్ షట్డౌన్లు బాగా తగ్గాయి. 2023లో 116 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలు ఉన్న 54 దేశాల్లో గతేడాది 296 పర్యాయాలు ఇంటర్నెట్ సేవలపై షట్‌డౌన్ విధించడం జరిగింది. 2023లో 39 దేశాల్లో 283 సార్లు ఇంటర్నెట్ నిలివేసిన ఘటనలు (internet shut downs) నమోదయ్యాయి.భారత్ (India) కంటే మయన్మార్‌లో ఎక్కువ సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. 2024లో అక్కడ 85 పర్యాయాలు ఇంటర్నెట్ బంద్ చేశారు. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం ఉందన్న విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకే అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక మన దాయాది దేశం పాకిస్థాన్‌లో 21 సార్లు ఇంటర్నెట్ నిలిపివేసింది. ఆ దేశ చరిత్రలో ఇన్నిసార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 19 పర్యాయాలు ఇంటర్నెట్ రాకుండా చేసింది. ఇందులో ఏడు సార్లు ఉక్రెయిన్‌లోనే ఇంటర్నెట్ ఆపేసింది. యుద్ధం, హింసాత్మక ఘటనల కారణంగా 2024లో ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 103 సందర్భాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు.మణిపూర్‌లో అత్యధికంమనదేశంలో గతేడాది కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 16 రాష్ట్రాల్లో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్ను నిలిపివేయడం జరిగింది. కల్లోలిత మణిపూర్‌లో అత్యధికంగా 21 పర్యాయలు ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. హరియాణా(12), జమ్మూకశ్మీర్(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆందోళన కార్యక్రమాలతో 41 సార్లు, మతఘర్షణలతో 23 సార్లు, ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల సమయంలో ఐదు పర్యాయాలు ఇంటర్నెట్ నిలిపివేశారు.తరచుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్లోబల్ లీడర్షిప్ కోసం ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఇటీవల ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023,టెలికాం సస్పెన్షన్ రూల్స్ 2024 గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయానికి గల కారణాలను సమీక్షించడానికి చట్టంలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాలు లేవని విమర్శకులు వాదించారు.చదవండి: ఒహియో గవర్నర్ రేసు.. వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతుకూడా ఆయన నివేదిక ఆందోళనలను లేవనెత్తింది, ఇది 1885 టెలిగ్రాఫ్ చట్టం నుండి వలసరాజ్యాల కాలం నాటి నిబంధనలను నిలుపుకుంది. షట్‌డౌన్ ఆర్డర్లను సమీక్షించడానికి చట్టంలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాలు లేవన్న విమర్శలు బలంగా వినిపించాయి. -
బంగ్లాదేశ్‌కు జైశంకర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పట్ల వారి వైఖరి స్థిరంగా ఉండడం లేదన్నారు. అక్కడి మధ్యంతర ప్రభుత్వం భారత్‌ను రోజుకో విధంగా అపఖ్యాతి పాలుచేయాలని చూస్తోందని విమర్శించారు. భారత్‌పై రోజుకు ఒక రకంగా మాట్లాడుతూ మంచి సంబంధాలు కావాలంటే కుదరదన్నారు. ఏది కావాలో బంగ్లాదేశ్ ముందు తేల్చుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు, ఆ దేశ అంతర్గత రాజీకీయాలు భారత్‌తో సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు. భారత్‌తో శత్రుభావం పెంచుకోవాలనుకునే సంకేతాలివ్వడం బంగ్లాదేశ్‌కు మంచిది కావన్నారు. ఇటీవలే జైశంకర్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హుస్సేన్‌తో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదంపై మెతక వైఖరితో వ్యవహరించకూడదని ఈ భేటీలో జైశంకర్ స్పష్టం చేశారు.కాగా, బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు జరిగిన షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మద్యంతర ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. మహ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుభావంతో వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి. -
ఆసియాపసిఫిక్ దేశాలకు టారిఫ్ ముప్పు
న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో పలు ఆసియా పసిఫిక్ దేశాలకు అధిక టారిఫ్‌ల రిస్క్ లు నెలకొన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. భారత్, దక్షిణ కొరియా, థాయ్‌ల్యాండ్ తదితర దేశాలకు ముప్పు ఉందని ఒక నివేదికలో పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే తైవాన్, వియత్నాం, థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియాలాంటివి అమెరికాపై ఎక్కువగా ఆధారపడినందువల్ల టారిఫ్‌లు విధిస్తే ఆర్థికంగా వాటిపై ప్రభావం పడుతుందని వివరించింది. భారత్, జపాన్‌లో దేశీ మార్కెట్ కాస్త భారీగా ఉండటం వల్ల టారిఫ్‌ల ప్రభావం నుంచి కొంత ఉపశమనం ఉండొచ్చని వివరించింది. భారత్ సహా వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియా పసిఫిక్‌లోని కొన్ని దేశాలు తమ ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలకన్నా అత్యధికంగా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై విధిస్తున్నాయని నివేదిక వివరించింది. ప్రతీకార టారిఫ్ చర్యల కోసం సదరు దేశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది. -
స్కిల్ లేని పట్టభద్రులకు ఉద్యోగాలు నిల్!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఏం చదివామన్నది కాదు.. ఎలా చదివామన్నది చాలా ముఖ్యం. డిగ్రీ వస్తే చాలదు నైపుణ్యం కూడా ఉండాల్సిందే. లేకపోతే ఉద్యోగాలు రావని ఓ శాస్త్రీయ అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. కానీ, దేశంలోని గ్రాడ్యుయేట్లలో 42.6 శాతం మందికే ఉద్యోగం పొందడానికి అర్హత ఉందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మెర్సర్ మెటిల్ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్స్ ఇండెక్స్–2025’ అధ్యయనంలో పట్టభద్రుల నైపుణ్యాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.2023లో ఉద్యోగాలకు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ల సంఖ్య 44.3 శాతం కాగా.. 2024లో 1.7 శాతం పడిపోయి 42.6 శాతానికి తగ్గిపోయింది. కొత్తగా పట్టభద్రులైన వారి నుంచి అంచనాలు అధికంగా ఉండటం వల్ల ఈ కొరత ఏర్పడిందని నివేదికలో తేలింది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,700కి పైగా క్యాంపస్‌లలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులపై అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అత్యంత సమర్థత ఉన్న పట్టభద్రుల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కాలేజీలు వరుసగా టాప్–3లో ఉన్నాయి. అలాగే.. అత్యధిక అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ 10స్థానంలో ఉండటం విశేషం. ఉత్తరాది రాష్ట్రాలదే హవా... ⇒ దేశంలో కనీసం 50 % మంది గ్రాడ్యుయేట్లు ఉపా«ది పొందగల రాష్ట్రాలు కేవలం 4 ఉన్నాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో రాజస్తాన్‌కు టాప్10లో చోటు దక్కలేదు. కానీ, సాంకేతిక అర్హతలున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తర్వాత 48.3 శాతంతో రాజస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. ⇒ నాన్–టెక్నికల్ విభాగంలో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ (54%), ఢిల్లీ (54%), పంజాబ్ (52.7%) ఉన్నాయిమొక్కుబడిగా చదవొద్దు..సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసినా, అంతగా నైపుణ్యాలు నేర్చుకోకుండా, కొత్త కోర్సులు చేయకుండా ఇంజనీరింగ్ చదివినా వెంటనే ఏదో ఉద్యోగం వచ్చేస్తుందని ఆశిస్తే ఇబ్బందే. కమ్యూనికేషన్, ఇన్‌డెప్త్ డొమైన్ నాలెడ్జి, టెక్నాలజీ, మేనేజ్మెంట్ (ఫోర్ పిల్లర్స్) వంటి వాటిపై పట్టుసాధించి ఇండస్ట్రీ సర్టిఫికేషన్ పొందగలిగితే నాన్–టెక్‌లో ఉన్నా నైపుణ్యంతోపాటు మంచి ప్యాకేజీ పొందగలరు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీనైపుణ్యాలు ఉండాల్సిందే..నాన్–టెక్ గ్రాడ్యుయేట్స్ అంశంపై గత 15 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విశ్వవ్యాప్తం కావడంతో... భారత్‌లో విదేశీ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల తగిన శిక్షణ పొందడంతోపాటు అవసరమైన డొమైన్లలో నైపుణ్యాలు ఉంటే నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్‌కూ మంచి అవకాశాలు లభిస్తాయి. – ఎస్.లావణ్యకుమార్, సహవ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ -
దాయాది పాక్ పై భారత్ ఘన విజయం
-
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
-
డెల్టా ఎల్రక్టానిక్స్ 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై 50 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తైవాన్‌కి చెందిన డెల్టా ఎల్రక్టానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజమిన్ లిన్ తెలిపారు. స్మార్ట్ తయారీ, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి భారత్ స్వయం సమృద్ధిని సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ’ఎలెక్‌రమా 2025’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు. బెంగళూరుకు దగ్గర్లోని కృష్ణగిరిలో ఉన్న ప్లాంటులో ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌కి అవసరమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, టెలికం పరిశ్రమలో ఉపయోగించే డైరెక్ట్ కరెంట్ కన్వర్టర్లు, రెక్టిఫయర్లు మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నామని లిన్ చెప్పారు. ఈ ప్లాంటును కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. 2003లో భారత మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు లిన్ చెప్పారు. -
అవమానిస్తున్నా నోరు మెదపరా?
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఇన్చార్జ్) జైరాం రమేశ్ ఆదివారం ‘ఎక్స్’లో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది. 2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్‌కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఎలాన్ మస్క్ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్ ఢిల్లీ అన్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్ అన్నారు. సీఈపీపీఎస్కు 48 కోట్ల డాలర్లు ‘‘డోజ్ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్(సీఈపీపీఎస్)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి. ఇందులో తొలిగ్రాంట్ ఏఐడీ117ఎల్ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్‌కు భారత్‌కు వెళ్లాల్సి ఉందని మస్క్ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్ వాస్తవానికి బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్‌ను వినియోగించాలని బంగ్లాదేశ్‌లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్ఎయిడ్ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు. -
కొత్త మలుపు తీసుకున్న యూఎస్ఎయిడ్ వివాదం
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా నుంచి యూఎస్ఎయిడ్ తరఫున 2.1 కోట్ల డాలర్ల నిధులు వచ్చాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోదీ ప్రభుత్వం కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023–24 ఆర్థికసంవత్సరంలో భారత్‌లో ఏడు ప్రాజెక్టుల కోసం యూఎస్ఎయిడ్ 75 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చిందని భారత ఆర్థికశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ మొత్తంగా 75 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారత ప్రభుత్వ భాగస్వామ్యంలో యూఎస్ఎయిడ్ చేపట్టింది. అందులో 2023–24 కాలంలో 9.7 కోట్ల డాలర్లను ఖర్చుచేశారు. ఇందులో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ లేదు. వ్యవసాయం, ఆహార భద్రత, నీరు, శుభ్రత(వాష్ ప్రోగ్రామ్), పునరుత్పాదక ఇంధనం, విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, సుస్థిర అడవులు, పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఇంధన సమర్థ వినియోగ సాంకేతికలను అందుబాటులోకి తేవడం, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి’’ అని వార్షిక నివేదిక పేర్కొంది. 1951 ఏడాదిలో మొదలైన ద్వైపాక్షిక అభివృద్ధి సాయంలో భాగంగా భారత్‌కు అమెరికా ఇప్పటిదాకా 555కుపైగా ప్రాజెక్టుల్లో ఏకంగా 17 బిలియన్ డాలర్ల సాయం అందించిందని వార్షిక నివేదిక పేర్కొంది. ద్వైపాక్షిక నిధుల వ్యవహారాలను చూసే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థికవ్యవహారాల విభాగం సైతం ఈ వివరాలను వెల్లడించింది. -
కోహ్లి‘నూరు’.. పాకిస్తాన్ చిత్తు
ఇంట (పాక్‌లో) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో... దుబాయ్‌లో జరిగిన పోరులో భారత్ చేతిలో... చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌కు ఇక ఆతిథ్య మురిపెమే మిగలనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే దారైతే మూసుకుపోయింది. 2017 విజేత పాక్.. గ్రూప్ ‘ఎ’లో అందరికంటే ముందే ని్రష్కమించే జట్టుగా అట్టడుగున పడిపోనుంది. ఈ ఆదివారం కోసం అందరూ ఎదురుచూసిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. 2017లో తమపైనే ఫైనల్లో గెలిచి కప్‌ను లాక్కెళ్లిన పాక్ జట్టును టీమిండియా ఈసారి పెద్ద దెబ్బే కొట్టింది. అసలు కప్ రేసులో పడకముందే లీగ్ దశలోనే ని్రష్కమించేలా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు), రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసి గెలిచింది. సులువైన విజయం ముంగిట విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) బౌండరీ కొట్టి సెంచరీని పూర్తి చేసుకోగా.. భారత్ కూడా లక్ష్యాన్ని అధిగమించింది. శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ టీమ్‌కంటే ఒక ‘కాంతి సంవత్సరం’ ముందుంది! దుబాయ్‌లో ఇది మరోసారి రుజువైంది. అందరిలోనూ ఆసక్తి, చర్చను రేపుతూ ప్రసారకర్తలు, ప్రకటనకర్తలకు అతి పెద్ద బ్రాండ్ ఈవెంట్‌గా మారిన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మళ్లీ ఏకపక్షంగా ముగిసింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా, ఏ దశలోనూ పాక్ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు.పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు... పరుగులు రావడం కష్టంగా మారవచ్చు... అయినా సరే పాక్ బ్యాటింగ్ బృందం పేలవ ఆటతో అతి సాధారణ స్కోరుకే పరిమితమైంది... మన బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి ని పూర్తిగా అడ్డుకున్నారు. ఆపై ఛేదనలో భారత్ అలవోకగా దూసుకుపోయింది... పాక్ బౌలర్లు టీమిండియాను ఏమాత్రం నిలువరించలేకపోయారు. పిచ్ ఎలా ఉన్నా సత్తా ఉంటే పరుగులు రాబట్టవచ్చనే సూత్రాన్ని చూపిస్తూ మన బ్యాటర్లంతా తమ స్థాయిని ప్రదర్శించాడు.ఎప్పటిలాగే ఛేదనలో వేటగాడైన విరాట్ కోహ్లి తన లెక్క తప్పకుండా పరుగులు చేస్తూ ఒకే షాట్‌తో భారత్‌ను గెలిపించడంతో పాటు తన శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజా గెలుపుతో భారత్ దాదాపు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకోగా... రెండు పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపుగా ఖాయమైంది. ఆతిథ్య దేశమైన ఆ జట్టు ఇక తమ సొంతగడ్డకు వెళ్లి అభిమానుల మధ్య నామమాత్రమైన చివరి పోరులో ఆడటమే మిగిలింది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ దాదాపుగా సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన రోహిత్ శర్మ బృందం ఇప్పుడు గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46; 3 ఫోర్లు), ఖుష్దిల్ షా (39 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా...హార్దిక్ పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) సెంచరీ సాధించాడు. శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46; 7 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. కోహ్లి, అయ్యర్ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. తమ ఆఖరి మ్యాచ్‌లో వచ్చే ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. షకీల్ అర్ధ సెంచరీ... షమీ నియంత్రణ కోల్పోయి వేసిన తొలి ఓవర్‌తో పాక్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ ఓవర్లో అతను ఏకంగా 5 వైడ్లు వేయడంతో మొత్తం 11 బంతులతో ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది! ఆ తర్వాత బాబర్ ఆజమ్ (26 బంతుల్లో 23; 5 ఫోర్లు) చక్కటి కవర్‌డ్రైవ్‌లతో పరుగులు రాబట్టాడు. అయితే బాబర్‌ను పాండ్యా వెనక్కి పంపించగా, అక్షర్ ఫీల్డింగ్‌కు ఇమామ్ ఉల్ హక్ (10) రనౌటయ్యాడు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. ఒకదశలో 32 బంతుల తర్వాత గానీ బౌండరీ రాలేదు.హార్దిక్ పాండ్యా చక్కటి స్పెల్ (6–0–18–1)తో పాక్‌ను కట్టి పడేసాడు. తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆ తర్వాతా ఒక దశలో వరుసగా 53 బంతుల పాటు ఫోర్ రాలేదు! అనంతరం కాస్త ధాటిని పెంచిన షకీల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయే క్రమంలో రిజ్వాన్ బౌల్డ్ కావడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకీల్, తాహిర్ (4) వెనుదిరగ్గా... ఆపై కుల్దీప్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. చివర్లో ఖుష్దిల్ కాస్త వేగంగా ఆడటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా భారత్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఛేదనలో రోహిత్ శర్మ (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), గిల్ చకచకా పరుగులు రాబట్టారు. అయితే షాహిన్ అఫ్రిది అద్భుత బంతితో రోహిత్‌ను క్లీన్»ౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అఫ్రిది వరుస రెండు ఓవర్లలో కలిపి 5 ఫోర్లు బాదిన గిల్ జోరు ప్రదర్శించాడు. మరోవైపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆధిక్యం ప్రదర్శించాడు. కోహ్లితో రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత గిల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లి, అయ్యర్ పార్ట్నర్íÙప్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది.వీరిద్దరు ఎక్కడా తడబాటు లేకుండా చక్కటి సమన్వయంతో దూసుకుపోయారు. వీరిని నిలువరించేందుకు పాక్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో కోహ్లి 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 పరుగుల వద్ద అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను షకీల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం 63 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 28 పరుగుల దూరంలో అయ్యర్... 19 పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా (8) అవుటైనా ... అక్షర్ పటేల్ (3 నాటౌట్)తో కలిసి కోహ్లి మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ (రనౌట్) 10; బాబర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 23; షకీల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 62; రిజ్వాన్ (బి) అక్షర్ 46; సల్మాన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 19; తాహిర్ (బి) జడేజా 4; ఖుష్దిల్ (సి) కోహ్లి (బి) రాణా 38; అఫ్రిది (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; నసీమ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 14; రవూఫ్ (రనౌట్) 8; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–41, 2–47, 3–151, 4–159, 5–165, 6–200, 7–200, 8–222, 9–241, 10–241. బౌలింగ్: షమీ 8–0–43–0, హర్షిత్ రాణా 7.4–0–30–1, హార్దిక్ పాండ్యా 8–0–31 –2, అక్షర్ పటేల్ 10–0–49–1, కుల్దీప్ యాదవ్ 9–0–40–3, జడేజా 7–0–40–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) షాహిన్ అఫ్రిది 20; గిల్ (బి) అబ్రార్ 46; విరాట్ కోహ్లి (నాటౌట్) 100; శ్రేయస్ అయ్యర్ (సి) ఇమామ్ (బి) ఖుష్దిల్ 56; పాండ్యా (సి) రిజ్వాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; అక్షర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (42.3 ఓవర్లలో 4 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–31, 2–100, 3–214, 4–223. బౌలింగ్: అఫ్రిది 8–0–74–2, నసీమ్ షా 8–0–37–0, హారిస్ రవూఫ్ 7–0–52–0, అబ్రార్ 10–0–28–1, ఖుష్దిల్ 7.3–0–43–1, సల్మాన్ 2–0–10–0. 14000 వన్డేల్లో 14 వేల పరుగులు దాటిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్ (350), సంగక్కర (378)కంటే చాలా తక్కువ ఇన్నింగ్స్ (287)లలో అతను ఈ మైలురాయిని దాటాడు.158 వన్డేల్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య. అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా అజహరుద్దీన్ (156) రికార్డును అతను అధిగమించాడు. 82 అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లి శతకాల సంఖ్య. వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టి20ల్లో 1 సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో నేడున్యూజిలాండ్ X బంగ్లాదేశ్మధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈసారి ఎంతమందంటే?
అమెరికాలో అక్రమ వలసదారుల డిపోర్టేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 12మంది భారతీయుల్ని ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి తరలించినట్లు అధికారులు ప్రకటించారు.అమెరికాలో భారతీయ అక్రమ వలసదారులను ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో 12మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించింది. వారిని ఈ రోజు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో వలస దారుల్ని ఢిల్లీకి తీసుకువచ్చింది. వారిని పనామా నుంచి భారత్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారుల్లో పంజాబ్ వాసులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. -
తిరుపతిలో క్రికెట్ అభిమానుల సందడి
-
పాకిస్తాన్ పై మ్యాచ్ అంత ఈజీ కాదు..