
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడైన లయోనల్ మెస్సీ ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం భారత అభిమానులకు కలగనుంది. 14 సంవత్సరాల తర్వాత అతను మళ్లీ భారత్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది అక్టోబరులో కేరళలోని కొచి్చలో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. దీనిపై చాలా కాలం క్రితమే కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్రహమాన్ ప్రకటన చేసినా... ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది.
ప్రముఖ బ్యాంక్ ‘హెచ్‌ఎస్‌బీసీ’ ఈ పర్యటనలో అర్జెంటీనా టీమ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌లో పుట్‌బాల్‌ను ప్రమోట్ చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిస్తూ అర్జెంటీనా రాకను హెచ్‌ఎస్‌బీసీ హెడ్ సందీప్ బత్రా ఖరారు చేశారు.
2025లో భారత్‌తో పాటు సింగపూర్‌లో కూడా మ్యాచ్‌లు ఆడేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం ‘హెచ్‌ఎస్‌బీసీ’తో ఒప్పందం చేసుకుంది. 2011లో వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడేందుకు మెస్సీ మొదటిసారి భారత్‌కు వచ్చాడు. కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెనిజులాతో తలపడిన అర్జెంటీనా 1–0తో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment