Messi
-
మెస్సీ మ్యాజిక్...
బ్యూనస్ ఎయిర్స్: డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 2026 ప్రపంచకప్ దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఏడో విజయం నమోదు చేసింది. బొలీవియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. చీలమండ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మొత్తం 90 నిమిషాలు ఆడిన 37 ఏళ్ల మెస్సీ తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు.మూడు గోల్స్‌తో మెరిసిన మెస్సీ (19వ, 84వ, 86వ నిమిషాల్లో) సహచరులు లా మారి్టనెజ్ (43వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (45+3వ నిమిషంలో) గోల్స్ చేసేందుకు సహాయపడ్డాడు. మెస్సీ అందించిన పాస్‌లతో మారి్టనెజ్, అల్వారెజ్ గోల్స్ సాధించారు. అర్జెంటీనా తరఫున అల్మాదా (69వ నిమిషంలో) మరో గోల్ చేశాడు. మరో మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత బ్రెజిల్ 4–0 గోల్స్‌తో పెరూ జట్టును ఓడించింది. ఉరుగ్వే–ఈక్వెడార్ మ్యాచ్ 0–0తో ‘డ్రా’కాగా... పరాగ్వే 2–1తో వెనిజులాపై, కొలంబియా 4–0తో చిలీ జట్టుపై విజయం సాధించాయి. దక్షిణ అమెరికాకు చెందిన 10 దేశాలు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్న ఈ టోరీ్నలో అన్ని జట్లు 10 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. నిరీ్ణత 18 మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–6లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ టోరీ్నకి నేరుగా అర్హత సాధిస్తాయి. 2026 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోరీ్నకి కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. -
మెస్సీ, రొనాల్డో లేకుండానే.. ‘బాలన్ డోర్’ అవార్డు నామినేషన్లు
పారిస్: దిగ్గజాలు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) లేకుండానే ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించే ‘బాలన్ డోర్’ 2024 అవార్డీల నామినీల జాబితా తయారైంది. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్లకు ప్రతి ఏటా అందించే ఈ అవార్డును ఇప్పటి వరకు 37 ఏళ్ల మెస్సీ 8 సార్లు అందుకోగా... రొనాల్డో ఐదుసార్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 28న ‘బాలన్ డోర్’ అవార్డులను ప్రదానం చేయనుండగా... దీని కోసం కుదించిన 30 మంది ప్లేయర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో మెస్సీ, రొనాల్డోకు చోటు దక్కలేదు. ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాపె, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్, స్పెయిన్ యువ స్ట్రయికర్ లామినె తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మెస్సీ, రొనాల్డో రేసులో లేకపోవడం 2003 తర్వాత ఇదే తొలిసారి. 2006లో మొదటిసారి ‘బాలన్ డోర్’ పురస్కారానికి నామినేట్ అయిన మెస్సీ... 2009లో తొలి అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు 2004లో మొదటిసారి నామినేట్ అయిన రొనాల్డో... ఐదుసార్లు అవార్డు అందుకున్నాడు. కాగా యూరోపియన్ లీగ్‌ల్లో ప్రదర్శన ఆధారంగానే ఈ పురస్కారాన్ని అందించడం ఆనవాయితీ. ప్రస్తుతం మెస్సీ అమెరికా లీగ్‌లలో... రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్–నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే వీరిద్దరిని బాలన్ డోర్ అవార్డుకు నామినేట్ చేయలేదు. -
ఆస్కార్ అవార్డు వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్..! ఏం చేసిందంటే..
బోర్డర్ కోలి బ్రీడ్‌కి చెందిన మెస్సీ అనే కుక్క నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా ఆస్కార్స్ 2024కి నామినేట్ అయ్యింది. అయితే ఆ మూవీకి అవార్డులు రాకపోయినా ఈ కుక్క మంచి ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దాని హావభావాలతో అందర్నీ కట్టిపడేసింది. ఆ మూవీతో 2023లో మంచి స్టార్డమ్ తెచ్చుకున్న ఈ కుక్క ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో మాత్రం అందరి అటెన్షన్ తనవైపుకి తిప్పుకుని మరీ హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలకు ఆ మెస్సీ డాగ్ బో టై ధరించి హుందాగా వచ్చింది. ఈ కార్యక్రమంలో 'ఓపెన్ హైమర్' మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రంలో రాబర్డ్ డౌనీ జూనియర్ పాత్రలో అలరించిన ఐరన్ మ్యాన్ నటుడుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఈ ఆస్కార్ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆ అవార్డుని ప్రకటించగానే.. మెస్సీ తన ముందరి కాళ్లతో తప్పట్లుకొడతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో హెస్ట్ జిమ్మీ ఆ కుక్క ఆటిట్యూడ్‌ని హైలెట్ చేస్తూ మెచ్చుకున్నాడు. the dog from anatomy of a fall looks just like cillian murphy when he's in a public place and needs to socialize, so cute of him. i love you messi pic.twitter.com/cR7vPzoNkp — pau la 🦢 (@sexiestlawyer) March 11, 2024 అంతేగాదు 2006లో వచ్చిన " ది షాగీ డాగ్" మూవీ గురించి ప్రస్తావిస్తూ దానికి సీక్వెల్‌గా సినిమా తీయాలనుకుంటే ఈ మెస్సీని పెట్టుకుంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మెచ్చుకోలుగా అన్నాడు. ఇక ఈ మెస్సీ డాగ్ నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' మూవీలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ఈ కుక్క ప్రేక్షకుల మనుసులో చెరగని ముద్ర వేయించుకుందని ప్రశంసించాడు. ఈ వేడుకల్లో మెస్సీ డాగ్ హైలైట్‌గా నిలిచి అందర్నీ అలరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. they really had Messi, the dog from Anatomy of a Fall, applauding Robert Downey Jr. after his acceptance speech lol #Oscars pic.twitter.com/XBrxoAPGq2 — Spencer Althouse (@SpencerAlthouse) March 11, 2024 (చదవండి: ఆస్కార్ 2024: రెడ్ కార్పెట్‌పై తడబడినా..భలే గమ్మత్తుగా కవర్ చేసిన నటి!) -
వాళ్లతో పోలిస్తే ఐపీఎల్లో క్రికెటర్లు సంపాదించేదెంత.. ఆడుకోనివ్వండి..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందించాడు. ఈ విషయంలో లాయిడ్ ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై క్రికెటర్లు విఫలం కావడాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడం సమంజసంకాదని అన్నాడు. ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యమని అనే వాళ్లు అర్దంపర్దం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. ఆటగాళ్లు దాదాపు 10 నెలల పాటు దేశం తరఫున ఆడుతున్నారు.. అలాంటప్పుడు రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి నాలుగు డబ్బులు వెనకేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. మైఖేల్ జోర్డన్ లాంటి బాస్కెట్‌బాల్ ప్లేయర్లు.. రొనాల్డో, మెస్సీ లాంటి ఫుట్‌బాలర్లు మిలియన్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నప్పుడు, క్రికెటర్లు ఐపీఎల్ ఆడి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు పాల్గొనేలా ఐపీఎల్‌కు ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని సూచించాడు. కాగా, క్లైయివ్ లాయిడ్ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. -
మెస్సీ నీ కోట్ ఇచ్చెయ్... 8.2 కోట్లు ఇస్తాం
-
ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా
-
Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె...
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు... వేడిమి వాతావరణంతో ఇబ్బందులు తప్పవేమోనని ఆటగాళ్ల సందేహాలు... ఆంక్షల మధ్య అభిమానులు ఆటను ఆస్వాదిస్తారో లేదోనని ఏమూలనో అనుమానం... కానీ ఒక్కసారి ‘కిక్’ మొదలుకాగానే... గోల్స్ మోత మోగింది... సంచలనాలతో సాకర్ సంరంభం షురూ అయింది... ఫైనల్ మ్యాచ్ చివరి క్షణం దాకా అదే ఉత్కంఠ కొనసాగింది... విశ్వవ్యాప్తంగా అభిమానులందరూ చిరకాలం గుర్తుండేలా ‘ఖతర్’నాక్ ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. ప్రపంచ నంబర్‌వన్ బ్రెజిల్ జిగేల్ మనలేదు... బెంబేలెత్తిస్తుందనుకున్న బెల్జియం బోల్తా కొట్టింది... పూర్వ వైభవం సాధిస్తుందనుకున్న జర్మనీ ఇంకా సంధికాలంలోనే ఉన్నామని సంకేతాలు పంపించింది... క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చు‘గల్లంతయింది’... ఆతిథ్యంలో అద్భుతమనిపించినా... ఆతిథ్య జట్టు ‘ఖతర్’నాక్ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 56 ఏళ్లుగా మరో ప్రపంచకప్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ దానిని మరో నాలుగేళ్లకు పొడిగించుకోగా... నెదర్లాండ్స్ ‘షూటౌట్’లో అవుట్ అయింది... సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా అడపాదడపా మెరిసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితంకాగా... డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలను నిలబెట్టుకుంది. అర్జెంటీనా ఆరంభ విఘ్నాన్ని అధిగమించి ఆఖరకు జగజ్జేతగా నిలిచి ఔరా అనిపించి సాకర్ సంగ్రామానికి శుభంకార్డు వేసింది. అంచనాలను మించి... 29 రోజులపాటు సాగిన ఈ సాకర్ సమరంలో అందరి అంచనాలను తారుమారు చేసి ఆకట్టుకున్న జట్టు మొరాకో. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, రెండో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించి... మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌పై ‘షూటౌట్’లో గెలిచిన మొరాకో క్వార్టర్ ఫైనల్లో 1–0తో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టును ఇంటిదారి పట్టించి ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడిన మొరాకో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలోనూ ఓడిపోయి నాలుగో స్థానంతో ఈ మెగా ఈవెంట్‌ను ముగించింది. మెస్సీ ఇంకొన్నాళ్లు... 36 ఏళ్ల అర్జెంటీనా ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకొని దిగ్గజాల సరసన చేరిపోయాడు. సౌదీ అరేబియా చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయినా తన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మెస్సీ ఆ తర్వాత ట్రోఫీ ముద్దాడేవరకు వెనుదిరిగి చూడలేదు. ఫ్రాన్స్‌తో ఫైనల్ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ జట్టు జగజ్జేతగా నిలవడంతో తన నిర్ణయంపై పునరాలోచించాడు. ప్రపంచ చాంపియన్ అనే హోదాను ఇంకొన్నాళ్లు ఆస్వాదిస్తానని... జాతీయ జట్టుకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. మెస్సీ కోరుకుంటే 2026 ప్రపంచకప్‌లోనూ ఆడవచ్చని అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్ సాధించిన మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. భవిష్యత్ ఎంబాపెదే... నాలుగేళ్ల క్రితం రష్యా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ టైటిల్ సాధించడంలో యువస్టార్ కిలియాన్ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఖతర్‌లోనూ ఎంబాపె అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి పది నిమిషాల్లో ఎంబాపె ఆటతో అర్జెంటీనా హడలెత్తిపోయింది. మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య కాకుండా ఎంబాపె, అర్జెంటీనా మధ్య జరుగుతోందా అనే అనుమానం కలిగింది. చివరకు ‘షూటౌట్’లో ఫ్రాన్స్ ఓడిపోయినా ఎంబాపె పోరాట యోధుడిలా అందరి దృష్టిలో నిలిచాడు. జిరూడ్, గ్రీజ్మన్, కరీమ్ బెంజెమాలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో భవిష్యత్ ఎంబాపెదే కానుంది. 23 ఏళ్ల ఎంబాపె ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రపంచకప్‌లోనూ ఫ్రాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ‘యునైటెడ్’లో కలుద్దాం... అందరి ఆటగా పేరున్న ఫుట్‌బాల్ విశ్వసమరం వచ్చేసారి మూడు దేశాల్లో జరగనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు 2026 ప్రపంచకప్‌నకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని జట్లకు అవకాశం లభించాలనే సదుద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) 2026 ప్రపంచకప్‌ను 32 జట్లకు బదులుగా 48 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లకు నేరుగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. మిగతా 45 బెర్త్‌ల కోసం వచ్చే ఏడాది మార్చి నుంచి క్వాలిఫయింగ్ దశ మ్యాచ్‌లు మొదలై 2026 మార్చి వరకు కొనసాగుతాయి. మొత్తం 48 జట్లను 16 గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు) విభజిస్తారు. గ్రూప్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 32 జట్లు నాకౌట్ తొలి రౌండ్ దశకు అర్హత సాధిస్తాయి. సాక్షి క్రీడా విభాగం -
మరపురాని క్షణాలు
ఫుట్‌బాల్ ప్రియుల జ్ఞాపకాలలో డిసెంబర్ 18 నాటి రాత్రి అనేక సంవత్సరాలు గుర్తుండిపోతుంది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ సాగిన తీరు అలాంటిది. ప్రపంచ ఫుట్‌బాల్ సంఘం ‘ఫిఫా’ సారథ్యంలో నాలుగేళ్ళకోసారి జరిగే ఈ క్రీడా ఉత్సవంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల ఫైనల్ వంద కోట్ల పైచిలుకు మందిని తెర ముందు కట్టిపడేసింది. దిగ్గజాలైన 35 ఏళ్ళ మెస్సీ (అర్జెంటీనా), 24 ఏళ్ళ ఎంబాపే (ఫ్రాన్స్)ల మధ్య పోటాపోటీలో నిర్ణీత 90 నిమిషాలు, ఆపై అదనపు సమయాల్లోనూ ప్రత్యర్థులను సమవుజ్జీలుగా నిలిపిన ప్రతి ఘట్టం కుర్చీ అంచున కూర్చొని చూసేలా చేసింది. చివరకు పెనాల్టీ షూటౌట్లో 4–2 గోల్స్ తేడాతో అర్జెంటీనా, ఫ్రాన్స్నుఓడించడంతో ఉద్విగ్నత ముగిసింది. అయితే, ఈ 2022 విశ్వక్రీడా కిరీట పోరాటంపై చర్చ మాత్రం ఇప్పుడప్పుడే ఆగదు. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అనేక ఏళ్ళుగా తనను ఊరిస్తున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 1986 తర్వాత 36 ఏళ్ళకు తమ దేశానికి మరోసారి ప్రపంచ కప్ తెచ్చిపెట్టి, నవతరం క్రీడాభిమా నుల్లో తమ దేశానికే చెందిన మునుపటి ఫుట్‌బాల్ మాంత్రికుడు డీగో మారడోనాను మరిపించారు. తమ దేశం సాధించిన ఈ 3వ వరల్డ్ కప్ ట్రోఫీని చిరకాలం గుర్తుంచుకొనేలా చేశారు. ఫుట్‌బాల్ క్రీడాచరిత్రలో 5 వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఆరుగురు ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచారు. ఏకంగా 4 ఛాంపియన్స్ లీగ్స్ సహా అనేక ఘనతలు సాధించినా, వరల్డ్‌కప్ ట్రోఫీ మాత్రం చిరకాలంగా మెస్సీకి అందకుండా ఊరిస్తూ వచ్చింది. 2014లో ఆఖరి దాకా వెళ్ళినా, ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు. ఇప్పుడా లోటు భర్తీ చేసుకోవడమే కాక, ఈ వరల్డ్ కప్‌లో ప్రతి నాకౌట్ గేమ్‌లోనూ గోల్ చేసిన అరుదైన ఆటగాడయ్యారు. ఒకటీ రెండు కాదు... 13 వరల్డ్ కప్ గోల్స్ చేసి, దిగ్గజ ఆటగాడు పీలేను సైతం అధిగమించారు. ఫిఫా వరల్డ్ కప్‌లో 2 సార్లు గోల్డెన్ బాల్ ట్రోఫీని గెల్చిన ఏకైక ఆటగాడనే ఖ్యాతి గడించారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీఓఏటీ) పట్టానికి అర్హుడినని నిరూపించారు. పీలే, మార డోనా తర్వాత సరికొత్త ప్రపంచ ఫుట్‌బాల్ దేవుడిగా అవతరించారు. ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు సృష్టించినా, గాయాల బారినపడ్డ ఫ్రాన్స్‌కు కిరీటం కట్టబెట్టలేకపోతేనేం... 23 ఏళ్ళ ఎంబాపే కోట్లాది జనం మనసు గెలిచారు. ప్రపంచం కళ్ళప్పగించే మరో సాకర్ స్టార్ అనిపించుకున్నారు. కాలం మారింది. తాజా ప్రపంచ కప్ పోటీలు పాత కథను చెరిపేశాయి. వివిధ జట్ల మధ్య అంతరాన్ని చెరిపేశాయి. మరుగుజ్జులని అంతా భావించిన ఆసియా, ఆఫ్రికా ప్రాంత జట్లు ఆకలి గొన్న పులుల లాగా మైదానంలో ప్రత్యర్థి జట్లను వేటాడి, విజయాలు సాధించాయి. ప్రపంచంలో 80 శాతం జనాభా నివసించే ఈ ప్రాంత జట్లు విశ్వవేదికపై ఫేవరెట్లు కాదని అందరూ భావించినా, అగ్రస్థానంలోకి దూసుకొచ్చాయి. ఈ సాకర్ పోరాటంలో జపాన్ జట్టు 2014, 2010 వరల్డ్ ఛాంపి యన్స్ జర్మనీ, స్పెయిన్‌లను ఓడించి, ఆశ్చర్యపరిచింది. నరాలు తెగే ఉత్కంఠలోనూ స్థిమితంగా ఉంటూ, పూర్తి భిన్నమైన ఆట తీరు చూపడం జపాన్ జట్టు ప్రధాన కోచ్‌నే అబ్బురపరిచింది. ఒక్క జపానే కాదు... మొరాకో, సెనెగల్ లాంటి అనేక ఇతర నాన్ ఫేవరెట్ జట్లూ, బలమైన యూరోపియన్ జట్లకు చెమటలు పట్టించాయి. సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంత జట్లు టైటిల్ విజేతలు కాకపోతేనేం, తమను ఇక తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని చాటాయి. ఇంకా అనేక ఆశ్చర్యాలకు ఖతర్‌లో సాగిన ఈ 2022 వరల్డ్ కప్ వేదికైంది. జగజ్జేత అర్జెంటీనా సైతం సౌదీ అరేబియా చేతిలో, రన్నరప్ ఫ్రాన్స్ జట్టు ట్యునీసియా చేతిలో మట్టికరిచాయి. టోర్నమెంట్‌కు ముందు ఫేవరెట్లుగా భావించిన బెల్జియమ్, జర్మనీ, డెన్మార్క్‌లు మధ్యలోనే ఇంటి ముఖం పట్టాయి. అయితే, ఆద్యంతం వినోదానికి కొరవ లేదు. అదే సమయంలో స్వలింగ సంపర్కుల ఆకాంక్షలపై షరతులు, వేదికగా నిలిచిన ఖతార్ మానవ హక్కుల రికార్డులపై విమర్శలు, వివాదాలూ లేకపోలేదు. ప్రపంచమంతటి లాగే భారత్‌లోనూ సాకర్‌పై ఆసక్తి అపారం. మన దేశంలో 1982లో వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. యాంటెన్నాలతో, చుక్కలు నిండిన బ్లాక్ అండ్ వైట్ టీవీలే మహాప్రసాదంగా ప్రపంచ శ్రేణి ఆటగాళ్ళ ఆటను తొలిసారి తెరపై సామాన్యులు చూశారు. ఆ దెబ్బకు అప్పుడే బెంగుళూరులో జరుగుతున్న ఐటీఐ, హెచ్ఏఎల్ లాంటి అగ్రజట్ల మధ్య ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్‌లకు స్టేడియమ్‌లు నిండిపోయాయట. నిజానికి, బెంగాల్, కేరళల్లో సోకర్పై పిచ్చి ప్రేమ ఆది నుంచీ ఉన్నదే. ఈసారీ దేశంలో టీవీని దాటి, 11 కోట్ల మందిపైగా వీక్షకులు యాప్‌ల ద్వారా డిజిటల్‌గా ఈ వరల్డ్ కప్ చూశారు. డిజిటల్ వ్యూయర్షిప్లో ఇది ఓ రికార్డ్. ఇంతగా ప్రేమి స్తున్న ఆటకు ప్రభుత్వ ప్రోత్సాహమెంత? విశ్వవేదికపై కనీసం క్వాలిఫై కాని మన ఆట తీరేంటి? ఈ వరల్డ్ కప్ ఫైనల్ దెబ్బతో 1998లో స్థాపించిన గూగుల్ సెర్చ్‌లో గత పాతికేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతటి రద్దీ ఆదివారం ఏర్పడింది. ఫైనల్ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు జనం ఆతురత చూపారు. క్రికెట్ లాంటివెన్ని ఉన్నా, ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూపేది ఫుట్‌బాల్ అనేది అందుకే. అదే సమయంలో క్రీడాస్ఫూర్తిని పెంచాల్సిన ఆటలో ఫలితాలు వచ్చాక గ్రూప్ దశలో, ఫైనల్ తర్వాత ఫ్రాన్స్ సహా వివిధ దేశాల్లో విధ్వంసాలు రేగడం విషాదం. మారాల్సిన వికృత నైజానికివి నిదర్శనం. ఏమైనా, ఇవన్నీ 2026లో వచ్చే వరల్డ్ కప్‌కు పాఠం కావాలి. వర్ణాలు, వర్గాలకు అతీతంగా ఫుట్‌బాల్ గెలవాలి. వట్టి మెస్సీ, ఎంబాపేల నామ జపం కన్నా అది ముఖ్యం. -
ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా
-
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. డ్యాన్స్ చేయనున్న బాలీవుడ్ నటి
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్‌ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది. ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. -
FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ
17 రోజులలో 56 మ్యాచ్‌లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్ గెలవలేని ఖతర్ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్లో హైలైట్‌గా నిలిచాయి. నాకౌట్ పోరులో రెండు మ్యాచ్‌లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్ కీపర్ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే... ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్ కప్‌తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్ అల్వారెజ్ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జోరు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్ రూపంలో మరో స్టార్ ఉదయించాడు. టీమ్ తరఫున మూడు గోల్స్ చేసిన రిచర్ల్సన్... రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తమకు ‘9వ నంబర్ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్ అభిమానులు చెబుతున్నారు. యువ ఆటగాళ్ల జోరు... గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్ ఒంటి చేత్తో జట్టును ఫైనల్ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్‌లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్ డిఫెండర్’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్ క్లబ్‌లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్ కీపర్ డొమినిక్ లివకోవిక్ కూడా పెనాల్టీ సేవింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్‌తో మ్యాచ్‌లో ఇది కనిపించింది. కైల్ ఎంబాపె ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్ సాధించిన అతను 2 గోల్స్‌లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్ ఆటగాడు. మొరాకో మెరుపులు... ప్రపంచకప్ మొత్తానికి హైలైట్‌గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తోనే టీమ్ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్ ఇచ్చింది. అదీ సెల్ఫ్ గోల్ మాత్రమే! 2018లో అత్యధిక గోల్స్ చేసిన బెల్జియం, రన్నరప్ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్‌లో 2010 చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్ స్కోర్ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్ కప్‌లో ఒక్క హ్యారీ కేన్ మాత్రమే 6 గోల్స్ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది. పోర్చుగల్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్ మ్యాన్ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్‌పై 6–1తో విజయం వరల్డ్‌కప్ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్ రూపంలో కొత్త స్టార్ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో చేసిన హ్యాట్రిక్‌తో అతను క్లబ్ ఫుట్‌బాల్‌లో ఒక్కసారిగా హాట్ స్టార్‌గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్ టైటిల్ ఆశలు పెంచారు. - సాక్షి క్రీడా విభాగం ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్ ఈ సారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. క్వార్టర్స్ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌లలో కూడా బ్రెజిల్ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్ టిటె నాయకత్వంలో అటాకింగ్నే నమ్ముకొని బ్రెజిల్ ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్ ప్లేయర్ నెమార్, అలెక్ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్‌కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్‌లో ఉన్న బ్రెజిల్‌ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్తో పాటు బ్రొజోవిక్ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది. మరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్ కప్ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది. వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ కోచ్ వాన్ గాల్ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్‌లో డచ్ బృందం 19 మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్ డంఫ్రైస్ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్ 1 గెలిచాయి. మరో మ్యాచ్ డ్రా అయింది. -
సౌదీ అరేబియా కమాల్ కియా...
లుజైల్ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! ఆరంభంలోనే సూపర్ స్టార్ మెస్సీ గోల్‌తో అర్జెంటీనాకు ఆధిక్యం... మరో మూడుసార్లు బంతి గోల్‌పోస్ట్‌లోనికి... వాటిని రిఫరీ అనుమతించకపోయినా, మెస్సీ బృందం జోరును చూస్తే ఏకపక్ష మ్యాచ్ అనిపించింది... కానీ రెండో అర్ధభాగంలోకి వచ్చేసరికి ‘గ్రీన్ ఫాల్కన్స్’ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు... ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టేశారు... ఇరు జట్లు సమంగా ఉన్న స్థితిలో 53వ నిమిషం...నవాఫ్ అల్ అబీద్ బంతిని గోల్‌పోస్ట్ వరకు తీసుకురాగలిగినా, రొమేరో దానిని హెడర్‌తో సమర్థంగా వెనక్కి పంపగలిగాడు... అయితే పెనాల్టీ ఏరియా కుడివైపు నుంచి అనూహ్యంగా దూసుకొచ్చి న మిడ్‌ఫీల్డర్ సలేమ్ అల్దవ్సరి ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతడిని నిలువరించేందుకు లియాండ్రో ప్రయత్నించినా లాభం లేకపోయింది. సలేమ్ అద్భుత కిక్ అర్జెంటీనా కీపర్ మార్టినెజ్‌ను దాటి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. సలేమ్ ‘సోమర్సాల్ట్’తో జట్టు సంబరాలు మిన్నంటగా, అభిమానులతో స్టేడియం దద్దరిల్లింది. చివరి వరకు అదే ఆధిక్యం నిలబెట్టుకొని సౌదీ అరేబియా వరల్డ్ కప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాకు షాక్ ఇచ్చి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని కుదిపేసింది. దోహా: వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడే సమయానికి మాజీ చాంపియన్ అర్జెంటీనా జోరు మీదుంది. గత 36 మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడిపోలేదు... 25 గెలవగా, 11 ‘డ్రా’ అయ్యాయి... టైటిల్ గెలిచే జట్లలో ఒకటిగా మెస్సీ సేన ఖతర్‌లో అడుగు పెట్టింది. మరోవైపు ప్రపంచ 51వ ర్యాంక్ సౌదీ అరేబియా.. 1994 నుంచి ఐదుసార్లు వరల్డ్ కప్ ఆడిన ఆ టీమ్ 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. అవీ చెప్పుకోదగ్గవి కావు. కానీ ఆ దేశ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ విజయాన్ని మంగళవారం అందుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ పోరులో సౌదీ 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. సౌదీ తరఫున సలేహ్ అల్ షహరి (48వ నిమిషం), సలేమ్ అల్ దవసరి (53వ నిమిషం) గోల్స్ నమోదు చేయగా... లయోనల్ మెస్సీ అర్జెంటీనాకు ఏకైక గోల్ (10వ నిమిషం) అందించాడు. తొలి హాఫ్‌లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించిన అర్జెంటీనా ఆట రెండో హాఫ్‌లో ఒక్కసారిగా పట్టు తప్పగా, సౌదీ దానిని సొమ్ము చేసుకుంది. ఆఖరి వరకు దానిని కొనసాగించి సరైన ఫలితాన్ని అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో అది పెద్ద సంచలనాల్లో ఈ మ్యాచ్ కూడా ఒకటిగా మిగిలిపోనుంది. ఆ మూడు గోల్స్ ఇచ్చి ఉంటే... మ్యాచ్ ఆరంభంలో అర్జెంటీనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. రెండు నిమిషాల్లోపే జట్టు ఖాతాలో గోలే చేరేది. అయితే మెస్సీ షాట్‌ను సౌదీ కీపర్ ఒవైస్ అడ్డుకోగలిగాడు. అయితే లియాండ్రోను హమీద్ దురుసుగా అడ్డుకోవడంతో మాజీ చాంపియన్‌కు పెనాల్టీ అవకాశం లభించింది. ప్రశాంతంగా గోల్ కొట్టి మెస్సీ జట్టును ముందంజలో నిలిపాడు. అయితే తర్వాతి మూడు షాట్లు అర్జెంటీనాకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. వరుసగా మెస్సీ, మార్టినెజ్ (రెండు సార్లు) చేసిన గోల్స్‌ను ‘ఆఫ్ సైడ్’ నిబంధన ద్వారా రిఫరీ తిరస్కరించాడు. బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపే సమయంలో గోమెజ్, మార్టినెజ్, రోడ్రిగో చేసిన తప్పులు జట్టును దెబ్బ తీశాయి. లేదంటే అర్జెంటీనా 4–0తో దూసుకుపోయేదే. రెండో అర్ధ భాగంలో మాత్రం సౌదీ చెలరేగింది. ఆట ఆరంభమైన మూడు నిమిషాల్లోనే షహరి గోల్‌తో లెక్క సమం చేశాడు. అతడిని ఆపేందుకు రొమెరో చేసిన ప్రయత్నం విఫలమైంది. మరో ఐదు నిమిషాల తర్వాత చేసిన గోల్‌తో అరబ్ టీమ్ ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్ సహా మరో 60 నిమిషాల పాటు ఆట సాగినా... అర్జెంటీనా స్కోరును సమం చేయడంలో విఫలమైంది. మెస్సీ అద్భుతంగా ఆడుతూ గోల్‌పోస్ట్‌కు చేరువగా వచ్చిన క్షణంలో హసన్ అల్ తంబక్తి అతడిని టాకిల్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. చివరకు సౌదీ ఆటగాళ్ల ఆనందానికి హద్దు లేకపోగా, మెస్సీ విషణ్ణ వదనంతో నిష్క్రమించాడు. మ్యాచ్ అంకెల ప్రకారం చూస్తే ఎక్కువ శాతం (69) బంతి అర్జెంటీనా ఆధీనంలోనే ఉన్నా... 14 సార్లు గోల్పోస్ట్పైకి దాడులు చేసినా (సౌదీ 3 సార్లు), ప్రత్యర్థితో పోలిస్తే ఎక్కువ కార్నర్లు (6–2) లభించినా... సౌదీ చేసిన 21 ఫౌల్స్తో పోలిస్తే 6 ఫౌల్సే చేసినా... ఆరుగురు సౌదీ ఆటగాళ్లు ఎల్లోకార్డుకు గురైనా చివరకు విజయం మాత్రం సౌదీదే కావడం విశేషం! 1958 మ్యాచ్‌లో తొలి గోల్ సాధించాక ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఓడిపోవడం 1958 (జర్మనీ చేతిలో) తర్వాత ఇదే తొలిసారి. తొలి అర్ధ భాగం వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌లో ఓటమి చవిచూడటం అర్జెంటీనాకు 1930 తర్వాత ఇదే తొలిసారి. నేడు జాతీయ సెలవు దినం అర్జెంటీనాపై గెలుపు నేపథ్యంలో సౌదీ అరేబియాలో పెద్ద ఎత్తున సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ ఆనందాన్నిరెట్టింపు చేస్తూ బుధవారం ఆ దేశంలో సెలవు ఇచ్చేశారు. ప్రజలు ఈ క్షణాన్ని వేడుకలా జరుపుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంస్థలతో పాటు విద్యా సంస్థలకు కూడా సెలవు ఇస్తున్నట్లు దేశపు రాజు సల్మాన్ ప్రకటించారు. -
భార్యతో మెస్సీ భావోద్వేగ క్షణాలు: వైరల్ వీడియో
28 ఏళ్ల నిరీక్షణ తర్వాత అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. అయితే ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా బ్రెజిల్‌ను 1-0తో ఓడించడంతో మెస్సీ తన భార్య ఆంటోనెల్లా రోకుజోతో భావోద్వేగ విజయ క్షణాలు పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం బార్సిలోనాలోని క్యాంప్ నౌలో మెస్సీ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. వాళ్ల పేర్లు వరుసగా థియాగో, మాటియో, సిరో. కాగా, ఈ వీడియో పై మెస్సీ భార్య ఆంటోనెల్లా స్పందిస్తూ.. "మీ ఆనందం నాది! మీకు నా అభినందనలు, ప్రేమ" అని కామెంట్ చేశారు. ఇక "వామోస్ అర్జెంటీనా" అనే క్యాప్షన్‌తో మరో వీడియోను మెస్సీ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కేవలం రెండు గంటల్లో మూడు మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ రెండు వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 🤩🔟📱🥇#CopaAmérica#VibraElContinente#VibraOContinente pic.twitter.com/Av4B3knLms — Copa América (@CopaAmerica) July 11, 2021 View this post on Instagram A post shared by Antonela Roccuzzo (@antonelaroccuzzo) -
విశ్వ విజేతలకు ఘన స్వాగతం
ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను గెలుచుకొని స్వదేశంలోకి అడుగు పెట్టిన ఫ్రాన్స్ జట్టుకు అపూర్వ రీతిలో ఘన స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగిన విక్టరీ పరేడ్‌లో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడి తమ హీరోలకు జేజేలు పలికారు. ఓపెన్ టాప్ బస్సులో జట్టు సభ్యులంతా ట్రోఫీని ప్రదర్శిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం దేశాధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చిన ప్రత్యేక విందుకు ఆటగాళ్లు హాజరయ్యారు. వారిని అత్యున్నత పౌర పురస్కారం ‘లెజియన్ ఆఫ్ ఆనర్’తో త్వరలో సత్కరిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు. -
సాకర్ వర్ల్డ్ కప్ నేడు క్వార్టర్ ఫైనల్స్
-
కవాని లేకపోతే కష్టమే!
క్వార్టర్ ఫైనల్స్ తొలి రోజు రెండు దక్షిణ అమెరికా జట్ల కోసం సవాల్ ఎదురు చూస్తోంది. బ్రెజిల్, ఉరుగ్వేలు బెల్జియం, ఫ్రాన్స్‌లతో తలపడబోతున్నాయి. పోటీ తీవ్రంగానే ఉంటుందనడంలో సందేహం లేదు కానీ మా పొరుగు దేశపు రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్ల సేవలకు దూరం కానున్నాయి. కోచ్ టిటె మార్గదర్శనంలో కాస్మిరో బ్రెజిల్ డిఫెన్స్‌లో కీలకంగా మారాడు. జట్టు రక్షణశ్రేణిలో ప్రభావం చూపాడు. గత మ్యాచ్‌లో రెండు కార్డులు అందుకోవడంతో బెల్జియంతో మ్యాచ్‌కు దూరం కావడం బ్రెజిల్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. మరో వైపు ఉరుగ్వే స్టార్ ఎడిన్సన్ కవాని కూడా గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదని నాకు తెలిసింది. ఒక వేళ ఇదే జరిగితే ఇద్దరు అటాకింగ్ ఆటగాళ్లలో ఆ జట్టు ఒకరిని కోల్పోయినట్లే. నాలుగేళ్ల క్రితం పూర్తిగా నెమార్పై ఆధారపడినదానితో పోలిస్తే ఈ సారి బ్రెజిల్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే కాదు... నెమార్, కౌటిన్హోలతో కూడిన వారి అటాక్ మరింత పదునెక్కుతోంది. గత మ్యాచ్‌లో విలియన్ కూడా రాణించాడు. తొలి మ్యాచ్‌లో మినహా గత మూడు మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా ఇవ్వని డిఫెన్స్‌ను ప్రశంసించవచ్చు. 4–2–3–1తో టిటె పాటిస్తున్న వ్యూహంలో అంతా బాగుంది. అయితే ఒక ప్రధాన ఆటగాడు దూరమైన నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాలి. 0–2తో వెనుకబడి కూడా జపాన్‌పై గెలవడంతో వరుసగా నాలుగు విజయాలు పూర్తి చేసుకున్న బెల్జియంలో ఆత్మవిశ్వాసం నిండుగా కనిపిస్తోంది. ఎడెన్ హజార్డ్, డి బ్రూయిన్లాంటి మిడ్‌ఫీల్డర్లు, లుకాకు స్థాయి స్ట్రయికర్‌తో పటిష్టంగా ఉంది. పైగా మానసికంగా దృఢంగా ఉండటం జట్టును తిరుగులేనిదిగా మార్చింది. డిఫెన్స్ అంత గొప్పగా లేకపోయినా బ్రెజిల్‌ను ఒక ఆటాడించగలదు. 3–4–2–1 ఫార్మేషన్లో బెల్జియం బ్యాక్‌లైన్ బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ విభాగంలో ప్రత్యర్థి తమపై ఒత్తిడి పెంచకుండా ఆ జట్టు చూసుకోవాలి. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను ఇంటికి పంపించిన జట్లు మరో క్వార్టర్ ఫైనల్లో తలపడుతున్నాయి. మెస్సీ జట్టు అర్జెంటీనాను ఫ్రాన్స్, రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను ఉరుగ్వే ఓడించడంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించలేదు. కేవలం ఒక్క ఆటగాడిపైనే ఆధారపడిన ఆ టీమ్‌లపై సమష్టి ఆటతో ఈ రెండు జట్లు విజయం సాధించాయి. గతంలో నేను చెప్పినట్లు బలమైన మిడ్‌ఫీల్డ్, అటాకింగ్ కలగలిపి ఫ్రాన్స్‌ను దుర్భేద్యంగా మార్చాయి. చిన్న అవకాశాలను కూడా అద్భుతంగా వాడుకోగల ఇద్దరు స్ట్రయికర్లు ఉన్న ఉరుగ్వే ప్రత్యర్థికి అంత తొందరగా లొంగే రకం కాదు. కవానీ గాయం ఉరుగ్వేనుబాధించేదే. అతను లేకుండా అటాక్ బలహీనంగా మారిపోతుంది. సురెజ్‌తో అద్భుత సమన్వయం ఉన్న కవాని లేకపోతే కోచ్ ఆస్కార్ తన 4–1–2–1–2 వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. వారి డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. కానీ ఇలాంటి మ్యాచ్‌లో ప్రధాన ఆటగాడు లేకపోతే చాలా కష్టమే. ఫ్రాన్స్ బలమంతా మిడ్‌ఫీల్డర్లే. ఆ భాగంలో మెరుగ్గా ఉంటే జట్టు గెలవగలదు. ఎంబాపెలాంటి ఆటగాడు వెలుగులోకి రావడం సంతోషంగా ఉంది. అతనికి మంచి స్వేచ్ఛనివ్వడంతో తన వేగంతో అర్జెంటీనాపై అద్భుతం చేసి చూపించాడు. ప్రత్యర్థి దృష్టంతా అతనిపైనే ఉంటుంది కాబట్టి ఉరుగ్వేతో ఎంబాపెకు అంత సులభమైన అవకాశాలు రాకపోవచ్చు. అన్ని అంశాలను బట్టి చూస్తే ఫ్రాన్స్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఉరుగ్వే కూడా ఎక్కడ తగ్గకుండా ఆడటం ఖాయం. -
మెస్సీకి సహకారం అందించాలి
ప్రపంచ కప్‌లో తొలి దశ డ్రామా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ నిష్క్రమించగా, 16 అత్యుత్తమ జట్లు నాకౌట్ బరిలో నిలిచాయి. ఇప్పుడు అసలైన ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది. అత్యుత్తమంగా ఆడినవారే ఇక్కడ నిలుస్తారు. ఈ దశలో కేవలం మంచి ఆట, వ్యూహాలు మాత్రమే సరిపోవు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా చాలా ముఖ్యం. దీనిని తట్టుకోలేనివారు అందరికంటే ముందే బయటకు వెళ్లిపోతారు. సాధారణంగా నాకౌట్ దశలో చూపు తిప్పుకోలేని విధంగా ఆట సాగుతుంది. ఈసారి కూడా అందులో లోటేమీ లేదు. టోర్నీ చివరి దశలో కాకుండా ముందే పెద్ద జట్ల మధ్య పోరు జరగనుంది. ఫ్రాన్స్‌తో అర్జెంటీనా, ఉరుగ్వేతో పోర్చుగల్ తలపడటం అంటే భారీ వినోదానికి అవకాశం ఉంది. ఈ టోర్నీ ఆరంభంలో అర్జెంటీనా చాలా ఇబ్బంది పడింది. డిఫెన్స్ బలహీనత, మెస్సీపై అతిగా ఆధారపడటం, తుది జట్లు ఎంపికపై వివాదంలాంటి చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఆఖరి మ్యాచ్‌లో సాహసోపేత ఆటతో పాటు అదృష్టం కూడా వారికి కలిసొచ్చింది. ఇప్పటికే నాకౌట్ మ్యాచ్ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం ఒక రకంగా వారికి మంచిదే. అర్జెంటీనా ఒక జట్టుగా ఆడటం ఎంతో ముఖ్యం. మెస్సీ తన పరిధిలో ఎంత చేయగలడో అంతా చేస్తాడు కానీ ఇతర ఆటగాళ్లు కూడా తమ బాధ్యత నెరవేరిస్తేనే అర్జెంటీనాకు మంచి ఫలితం లభిస్తుంది. -
అర్జెంటీనా.. అదరగొట్టింది
తప్పక గెలవాల్సిన కీలక పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్ ఆశలను సజీవం చేసుకుంది. 14 వ నిమిషంలో లియోనల్ మెస్సీ అద్బుత గోల్‌తో ఖాతా తెరిచిన అర్జెంటీనా తొలి అర్థబాగంలో నైజీరియాపై ఆధిక్యం కనబర్చింది. అయితే రెండో అర్ధబాగంలో అనూహ్యంగా నైజీరియా నుంచి మెస్సీ బృందానికి గట్టి పోటీ ఎదురైంది. 49 వ నిమిషంలో అర్జెంటినా ఆటగాడు జేవియర్ మస్చెరానో ఫౌల్ చేయడంతో నైజీరియాకు పెనాల్టీ లభించింది. దీన్ని ఉపయోగించుకున్న నైజిరియా ఆటగాడు విక్టర్ మోసెస్ తెలివిగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ప్రపంచకప్‌లో పెనాల్టీగోల్ సాధించిన రెండో ఆటగాడిగా విక్టర్ మోసెస్ రికార్డు నమోదు చేశాడు. 2010 ప్రపంచకప్‌లో యాకుబ్ నెట్టెడ్ నైజీరియా తరపున తొలిసారి పెనాల్టీ గోల్ సాధించాడు. విక్టర్ సాధించిన గోల్‌తో స్కోర్ సమం అయ్యాయి. ఇక హోరాహోరిగా సాగిన గేమ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. 86 వ నిమిషంలో సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్ రోజో అనూహ్యంగా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు ఆధిక్యాన్నందించాడు. అనంతరం నైజీరియాకు అవకాశం లభించకపోవడంతో అర్జెంటీనా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు మెస్సీ మీద ఆధారపడకుండా అద్బుత ప్రదర్శన కనబర్చారు. ఇక అర్జెంటీనా నాకౌట్ చేరే అవకాశం క్రొయేషియా–ఐస్లాండ్ మ్యాచ్ ఫలితం పైనా ఆధారపడి ఉంది. ఇప్పటికే క్రోయేషియా నాకౌట్ చేరింది. ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కిన ఈ మాజీ విశ్వవిజేత క్రొయేషియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఖాతా కూడా తెరవకుండా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐస్లాండ్పై క్రొయేషియా గెలిచినా, మ్యాచ్ డ్రా అయినా అర్జెంటీనాకు నాకౌట్ చేరే అవకాశం లభిస్తోంది. -
ఒత్తిడిలో ఎలా ఆడతారో!
ఈ ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికా దిగ్గజ జట్లకు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. యూరప్ జట్లపై ఆరంభంలోనే ఆధిక్యం పొంది ఆ తర్వాత ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత అర్జెంటీనా కంటే బ్రెజిల్ పరిస్థితి బాగుంది. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, కోస్టారికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రెజిల్ గెలిచిన తీరు వారిలో విజయకాంక్ష బలంగా ఉందని చాటి చెప్పింది. అయితే బ్రెజిల్‌కు చివరి మ్యాచ్ అంత తేలికేం కాదు. స్విట్జర్లాండ్ చేతిలో సెర్బియా దురదృష్టవశాత్తు ఓడిపోయింది. జర్మనీ రిఫరీ పెనాల్టీని ఇచ్చి ఉంటే సెర్బియా ఈ మ్యాచ్‌లో కనీసం ‘డ్రా’తో గట్టెక్కేది. నాకౌట్ దశకు చేరుకోవాలంటే సెర్బియాకు మూడు పాయింట్లు అవసరం కాబట్టి బ్రెజిల్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. బ్రెజిల్ ఫార్వర్డ్స్ నెమార్, కౌటిన్హో, జీసస్ సమన్వయంతో కదు లుతూ ముందుకు దూసుకెళితే సెర్బియా కు కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్ బ్రెజిల్ రక్షణ శ్రేణికి పరీక్షలాంటిది. స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల నుంచి బ్రెజిల్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోయినా సెర్బియాను తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా ఫార్వర్డ్ మిత్రోవిచ్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అతనిపై బ్రెజిల్ డిఫెండర్లు ప్రత్యేక్ష దృష్టి సారించాలి. బ్రెజిల్ సామర్థ్యంపై నాకు నమ్మకమున్నా ఒత్తిడిలో వారు ఎలా ఆడతారన్నది వేచి చూడాలి. -
అర్జెంటీనా... అదరగొట్టాలి!
ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను ఇలాంటి స్థితిలో చూడటం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆడాల్సిన ఒక్క మ్యాచ్‌లో విజయం తప్పనిసరి మాత్రమే కాక... క్రొయేషియా–ఐస్లాండ్ మ్యాచ్ ఫలితం పైనా ఆధారపడాల్సి వస్తోంది. ఏదేమైనా ఓ అభిమానిగా మా జట్టు ఓటమిని నేను వ్యతిరేకిస్తా. ఈ సందర్భం నాకు 1982, 1990 ప్రపంచ కప్‌లను గుర్తుకుతెస్తోంది. అప్పట్లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలో దిగిన మేం ఓటములతో ప్రయాణం ప్రారంభించాం. మొదటిసారి మిగతా రెండు మ్యాచ్‌లను గెలిచి నాకౌట్ చేరాం. రెండోసారి నేను కెప్టెన్‌గా ఉన్న జట్టు ఫైనల్‌కు వెళ్లింది. తదుపరి ఫలితం వేర్వేరుగా ఉన్నా... పోరాటపటిమతో గ్రూప్ అడ్డంకి దాటిన ఈ రెండు ఉదంతాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈసారి సైతం అలానే జరుగుతుందని నమ్ముతున్నా. నైజీరియాపై భారీ వ్యత్యాసంతో గెలవడం అర్జెంటీనాకు అవసరం. దీనికి పూర్తిస్థాయి సంసిద్ధత కావాలి. తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు ఆటగాళ్లకు ఇది చివరి అవకాశం. వారు సాధిస్తారని నాకు విశ్వాసం ఉంది. బలాబలాలకు తగ్గ ప్రణాళికలు వేయడంతో పాటు ప్రతి ఆటగాడికి కోచ్ సంపోలి బాధ్యతలు అప్పగించాలి. ఈ ప్రక్రియ పక్కాగా సాగాలి. తనొక్కడికే సాధ్యమైన దానిని మెస్సీ చేసి చూపాలి. ఇదే సమయంలో వన్ మ్యాన్ షోలా కాకుండా జట్టంతా సమష్టిగా ఆడాలి. నైజీరియా ప్రమాదకర ప్రత్యర్థి. గత ప్రపంచకప్ సహా వారితో చాలా సార్లు తలపడి ప్రతిసారీ గెలిచాం. మాకిది నైతికంగా బలాన్నిస్తుంది. మా కుర్రాళ్లు తమ ఆంకాక్ష ఎంత బలంగా ఉందో చాటుతూ... ఈ మ్యాచే తమ జీవితం అన్నట్లుగా ఆడాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ప్రపంచం ఇప్పుడు మెస్సీ వైపు చూస్తోంది. ఆ స్థాయి ఆటగాడికిది సాధారణమే. అయినా... నేను మళ్లీ చెబుతున్నా. ఇది ఒక్కడి ఆట కాదు. ఓటమి, గెలుపు అందరివి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి. -
కేరళకు చెందిన మెస్సీ అభిమాని ఆత్మహత్య
కొట్టాయం: కేరళలో అర్జెంటీనా స్టార్ మెస్సీ వీరాభిమాని బినూ అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్రొయేషియా చేతిలో అర్జెంటీనా ఘోరంగా ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయిన 30 ఏళ్ల అలెక్స్ మీనాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను నివాసం ఉండే అరుమన్నూర్ గ్రామం నుంచి 30 కి.మీ. దూరంలో అలెక్స్ శవం లభించింది. ‘ఇక ఈ ప్రపంచంలో జీవించలేనని, తన మృతికి ఎవరు కారణం కాదని’ అతడు సూసైడ్ నోట్లో రాశాడు. -
ఫుట్‌బాల్ పిచ్చి ప్రాణం తీసింది..
కొట్టాయం: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ వీరాభిమాని డీనూ అలెక్స్(30) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో అర్జెంటీనా దారుణంగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్జెంటీనా ఓటమి తర్వాత ‘ఇక లోకాన్ని విడిచి వెళుతున్నా’ అని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కొట్టాయంకు సమీపంలో ఉన్న మీనాచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని నదిలో గుర్తించారు. ‘మ్యాచ్ జరిగిన రోజు రాత్రి గం. 11.30ని.లకు వరకూ అలెక్స్ టీవీ ముందు కూర్చొని ఉన్నాడు. అయితే మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోవడం అవమానంగా భావించి ఉంటాడు. స్నేహితులకు ముఖం చూపించలేక ప్రాణం తీసుకుని ఉంటాడు’ అని తండ్రి పీవీ అలెగ్జాండర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఫిఫా ప్రపంచకప్‌లో లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా.. క్రొయేషియా చేతిలో 0-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని జీర్ణించుకోలేని అలెక్స్ ఒక సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‘ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా.. ఇంకా నేను చూడటానికి ఏం లేదు’ అని లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు మృతదేహంగా లభించడం స్థానికంగా విషాదం మిగిల్చింది. -
అన్నింటికి అతడే కారకుడా?
గత ప్రపంచకప్ ఫైనలిస్టులు ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. జర్మనీ... మెక్సికో చేతిలో ఓడి కోలుకునే ప్రయత్నంలో ఉంది. క్రొయేషియాపై దారుణ ఓటమితో అర్జెంటీనా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిచినా... ఆ జట్టు నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఇతర జట్ల దయపై ఆధారపడి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యేకించి రెండోది అర్జెంటీనాకు చాలా కష్టంగా సాగింది. యూరోపియన్ ప్రత్యర్థి, జట్టు పరిస్థితి, వ్యూహ లోపాలు, మెస్సీపై అతిగా ఆధార పడటం ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఏదైనా మంచి జరుగుతుందని ఇప్పటికీ నా మనసులో ఓ మూలన ఆశ ఉంది. అయితే... ప్రేక్షకుల్లో కూర్చుని కరిగిపోతున్న కలను చూడటం చాలా విషాదకరం. పోరాట స్ఫూర్తి కొరవడటం సమస్యలను మరింత అధికం చేస్తుంది. జట్టులో స్ఫూర్తి నింపలేకపోయాడంటూ ఇప్పుడు వేళ్లన్నీ మెస్సీ వైపే చూపుతారని నాకు తెలుసు. ప్రతిసారి మనం అతడిపై ఆశలు పెట్టుకుంటున్నాం. ఈసారి చురుకుగా లేని మెస్సీని ప్రత్యర్థులు కట్టడి చేస్తున్నారు. ఐస్లాండ్పై పెనాల్టీని అతడు గోల్ కొట్టలేకపోవడం చాలా తేడా చూపింది. ఇక క్రొయేషియాపై ప్రభావం చూపలేకపోయాడు. తను ఎంత ప్రయత్నిస్తున్నా లయ అందుకోలేకపోవడం దురదృష్టకరం. ఫుట్‌బాల్ ఒక్క వ్యక్తి ఆట కాదు. ఇప్పుడే కాదు, 1986లో నా సారథ్యంలో కప్ గెలిచినప్పుడు కూడా...! మెస్సీ ప్రభావవంతంగా లేడంటే దానికి కారణం అతడి చుట్టూ నాణ్యమైన ఆటగాళ్లు లేకపోవడమే. గెలుపు ఘనతంతా క్రొయేషియాకే దక్కుతుంది. ఓటములకు మెస్సీని నిందించడం సులువే. అయితే దీనిని వేరే కోణంలో చూడటం ముఖ్యం. ఇప్పుడు అర్జెంటీనాకో పెద్ద విజయం కావాలి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలూ అనుకూలంగా రావాలి. ఇది సమష్టి వైఫల్యం. దీనికి మెస్సీని తప్పుబట్టడం అంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే. ఇలాంటివి నైజీరియాతో చివరి మ్యాచ్ తర్వాత మాట్లాడుకోవాలి. జర్మనీకి సైతం పరిస్థితి సులువుగా ఏమీ లేదు. దక్షిణ కొరియాను ఓడించినా, స్వీడన్‌తో కష్టమే. ఇదే జరిగితే డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టకాలమే. -
అయ్యో... అర్జెంటీనా!
నిజ్నీ నొవోగొరోడ్: రక్షణ శ్రేణిలో లోపాలు... మిడ్ ఫీల్డర్ల నుంచి స్టార్ ప్లేయర్ మెస్సీకి సహకారం కొరవడటం... వెరసి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా కష్టాలు కొనసాగుతున్నాయి. ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కిన ఈ మాజీ విశ్వవిజేత క్రొయేషియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయింది. అర్జెంటీనా బలహీనతలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న క్రొయేషియా 3–0తో నెగ్గి గ్రూప్ ‘డి’ నుంచి తొలి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. క్రొయేషియా తరఫున రెబిక్ (53వ ని.లో), మోడ్రిక్ (80వ ని.లో), రాకిటిక్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రపంచకప్‌లో క్రొయేషియా చేతిలో 1998లో ఏకైకసారి ఆడి ఓడిపోయిన అర్జెంటీనాకు ఈసారి ఏదీ కలిసిరాలేదు. అవకాశం దొరికినపుడల్లా దాడులు చేసిన అర్జెంటీనా ఆటగాళ్లు బంతిని లక్ష్యానికి మాత్రం చేర్చలేకపోయారు. విరామ సమయానికి రెండు జట్లు ఖాతా తెరవలేదు. రెండో అర్ధభాగంలో క్రొయేషియా దూకుడుగా ఆడి ఫలితాన్ని సాధించింది. 53వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ మెర్సాడో ‘డి’ ఏరియాలో తమ గోల్‌కీపర్‌కు బంతిని పాస్ ఇవ్వగా... అతను దానిని చేతితో పట్టుకోకుండా కాలితో తన్నాడు. బంతి కాస్తా అక్కడే గాల్లోకి తేలడం.. అక్కడే ఉన్న క్రొయేషియా ఆటగాడు రెబిక్ దానిని గోల్‌పోస్ట్‌లోకి పంపడం జరిగిపోయాయి. ఇక 80వ నిమిషంలో మోడ్రిక్ 20 గజాల దూరం నుంచి డైరెక్ట్ కిక్‌తో అర్జెంటీనా గోల్కీపర్ను బోల్తా కొట్టించాడు. ఇంజ్యూరీ సమయంలో కొవాచిచ్తో సమన్వయంతో రాకిటిక్ గోల్ చేశాడు. -
అరంగేట్రంలోనే అద్భుతం
ఆడుతున్నది ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్... ప్రత్యర్థి దిగ్గజం... అయినా ఐస్లాండ్ అదరలేదు... బెదరలేదు! విపరీతమైన దాడులు ఎదురైనా, బంతి ఎక్కువసేపు తమ ఆధీనంలో లేకున్నా దీటుగా నిలిచింది. మెస్సీలాంటి మహామహుడున్న అర్జెంటీనాను నిలువరించింది. అద్భుత ఆటతో అరంగేట్ర మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. మరోవైపు మెస్సీ పెనాల్టీ కిక్‌ను వృథా చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మాస్కో: ఫుట్‌బాల్ పసికూన ఐస్లాండ్ తమ తొలి ప్రపంచ కప్‌ను ఘనంగా ప్రారంభించింది. కొండలాంటి అర్జెంటీనాతో తలపడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడింది. సులువుగా గెలిచేస్తుందనుకున్న లియోనల్ మెస్సీ జట్టుకు చుక్కలు చూపింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి 1–1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితం ఐస్లాండ్కు విజయంతో సమానం కాగా, ఓడకపోయినా అర్జెంటీనాకు మింగుడుపడని పరిణామమే. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఎన్నడూ లేనంతగా ఏకంగా 11 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా ఒక్కసారీ విజయవంతం కాలేకపోవడం గమనార్హం. ఓ పెనాల్టీ కిక్‌తో పాటు మెస్సీని అన్నిసార్లు అడ్డుకున్న ఐస్‌ల్యాండ్ గోల్ కీపర్ హాన్స్ హాల్డర్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండూ మొదటి భాగంలోనే... అర్జెంటీనా స్థాయి జట్టు ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందని భావించిన ఐస్లాండ్ రక్షణాత్మక ఆటను ఎంచుకుని మ్యాచ్‌లో ఒక్కడే ఫార్వర్డ్ ప్లేయర్‌తో బరిలో దిగింది. దీనికి తగ్గట్లే, మెస్సీ నుంచి రెండు ఫ్రీ కిక్‌లు ఎదురై ప్రారంభం కఠినంగానే సాగినా వెంటనే కోలుకుంది. ఇదే సమయంలో ఆ జట్టుకూ అవకాశం వచ్చినా సఫలం కాలేదు. అనూ హ్యంగా మెస్సీ ఒత్తిడిలో పడటంతో అర్జెంటీనాకూ పైచేయి చిక్కలేదు. అయితే, క్రమంగా అటాకింగ్ గేమ్‌లోకి దిగింది. దీని ఫలితం 19వ నిమిషంలోనే కనిపించింది. మార్కస్ రోజో అందించిన క్రాస్ పాస్‌ను బాక్స్ ఏరియా నుంచి కున్ అగ్యురో అద్భుతమైన రీతిలో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఈ ఆధిక్యాన్ని ఆస్వాదించే లోపే ఒక్కసారిగా మెస్సీ జట్టుకు షాక్ తగిలింది. అర్జెంటీనా డిఫెన్స్‌లోని అనిశ్చితిని సొమ్ము చేసుకుంటూ 23వ నిమిషంలో ఫిన్బొగాసన్ ఐస్లాండ్కు చరిత్రాత్మక గోల్ అందించాడు. అప్పటికీ మెస్సీ బృందం అప్రమత్తమై దాడులతో ఆధిపత్యానికి ప్రయత్నించింది. ఐస్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించలేక ఫలితం రాబట్టలేకపోయింది. పట్టు వదల్లేదు... అత్యుత్తమ ఆటతో తొలి భాగంలో అర్జెంటీనాను కాచుకుని నిలిచిన ఐస్లాండ్... రెండో భాగంలోనూ పట్టుదల చూపింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ వరకు వెళ్లలేకపోయినా, వారి డిఫెన్స్ బలహీనతను సొమ్ము చేసుకుంటూ దూకుడు చూపింది. అయితే 63వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు మాగ్నసన్ కారణంగా అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ లభించింది. దీనిని మెస్సీ పేలవంగా కొట్టగా... గోల్ కీపర్ హాల్డర్సన్ కుడి వైపునకు ఒరిగిపోతూ అడ్డుకున్నాడు. ఉపేక్షిస్తే గెలుపు దక్కే పరిస్థితి లేదని భావించిన అర్జెంటీనా... జోరు పెంచి ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసింది. అయినా ఐస్లాండ్ డిఫెన్స్‌ను దెబ్బతీయలేకపోయింది. వ్యూహం మార్చిన మెస్సీ దూరం నుంచి గోల్‌కు ప్రయత్నించినా, కీలక ఆటగాడైన హిగుయెన్ను 84వ నిమిషంలో బరిలో దింపినా ఇవేమీ ఐస్లాండ్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయాయి. ఇంజ్యూరీ సమయం (90+5) ఆఖర్లో వచ్చిన ఫ్రీ కిక్నూ మెస్సీ సద్వినియోగం చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్ 1–1తో డ్రా అయింది. గెలుపు చిక్కకపోయినా... బంతిని ముప్పావు వంతు ఆధీనంలో ఉంచుకోవడం, తీవ్రంగా దాడులకు దిగడం వంటివి అర్జెంటీనాకు ఉపశమనం కలిగించాయి. -
అభిమానం రంగేసుకుంది
కోల్‌కతా: అతను కోల్‌కతాకు చెందిన చాయ్‌వాలా. పేరు శివశంకర్ పాత్రా. ఉండేది నార్త్ 24 పరగణాస్. తనకు అక్కడ మూడంతస్తుల ఇల్లుంది. గ్రౌండ్ ఫ్లోర్లో టీ కొట్టు నిర్వహిస్తాడు. కోల్‌కతాలో చాలామందిలాగే అతనూ సాకర్ ప్రియుడు. కానీ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే తన ఇంటి మొత్తానికి అర్జెంటీనా జెర్సీ రంగేసుకున్నాడు. ప్రపంచకప్ జరిగే ప్రతీసారి అతను చేసే పనే ఇది. ఈసారి రష్యాకు వెళ్లి ప్రత్యక్షంగా చూడాలనుకున్నా... ఆర్థికస్థోమత లేక ఆగిపోయాడు. అయితే అర్జెంటీనా అభిమాని అయిన శివశంకర్ తన ఇంటినే అర్జెంటీనాలా మార్చేశాడు. గదుల్లో మెస్సీ ఫ్లెక్సీలను అంటించాడు. మొత్తానికి తన ఒంటికి సాకర్ ఫీవర్‌ను, ఇంటికి అర్జెంటీనా ఫ్లేవర్‌ను అద్దేశాడు. అదేమంటే మెస్సీ అంటే పిచ్చి అభిమానం. 2012 నుంచి మెస్సీ పుట్టినరోజు అతని ఇంట్లో పండగ రోజు. ఇంటిని చక్కగా అలంకరించి, కేక్ కట్ చేసి మెస్సీ బర్త్‌డేని ఘనంగా జరుపుతాడు. ఆ రోజు కస్టమర్లకు టీ, స్నాక్స్‌ను ఉచితంగా అందిస్తాడు. దీనిపై అతను మాట్లాడుతూ ‘నేనెవర్నీ పైసా అడగను. అలాగని ఆర్థికలోటు ఉండదు. ఆ టైమ్‌కు అన్నీ సమకూరుతాయి. సాకర్ ప్రియులు కొంత స్పాన్సర్ చేస్తారు’ అని అన్నాడు. అర్జెంటీనా మ్యాచ్‌లు జరిగే రోజు తన టీ కొట్టులో వీక్షించేవారికి చాయ్‌తో పాటు సమోసాలు ఉచితంగా పంపిణీ చేస్తాడు. ఆంజనేయస్వామిని ఆరాధించే శివశంకర్ మ్యాచ్ రోజు మెస్సీ జట్టు గెలవాలని ప్రార్థన చేస్తాడు. ఈసారి అర్జెంటీనాకు మెస్సీ కప్‌ను అందిస్తాడని శివశంకర్ తెగ నమ్మకం పెట్టుకున్నాడు. -
జబివాక అనే నేను
జబివాక... జబివాక... జబివాక... ఇప్పుడు ఫుట్‌బాల్ అభిమానులంతా ఈ పేరు జపం చేస్తూ గోల చేస్తున్నారు. ఎవరీ జబివాక? సడెన్‌గా మన కవర్ మీదికి ఎందుకొచ్చిందీ? ఎలా వచ్చిందీ? అనేగా మీ ప్రశ్న? జబివాక ఈసారి ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు అఫీషియల్ మాస్కట్. చిన్ని చిన్ని గంతులేస్తూ ఆడి పాడే తోడేలు ఇది. ఆకారంలో చిన్నదే కానీ, గోల్ కొట్టిందంటే గ్రౌండ్ అంతా అరుపులే! అలాంటి జబివాక ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చూద్దురు రండీ అంటూ ప్రపంచాన్ని పిలుస్తోంది! మనవరకు ఆటంటే క్రికెట్. ఇక్కడ అదొక మతం. కానీ క్రికెట్‌తో పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఆట ఇంకొకటి ఉంది. అదే ఫుట్‌బాల్. సాకర్. ఎలా పిలిస్తే అలా! కళ్లు, కాళ్లు, చేతులు, బాడీ మొత్తం ఒకే ఒక్క దిశగా కదుల్తుంది, ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లందరికీ! ఈ ఆటను ఇష్టపడేవాళ్లైతే కళ్లంతా అప్పగించేసి టీవీల ముందు, స్టేడియంలలో వాలిపోతారు. అలాంటి ఫుట్‌బాల్‌కు అతిపెద్ద పండుగ వరల్డ్ కప్. ఈసారి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మరో నాలుగు రోజుల్లో (అంటే జూన్ 14న) మొదలుకానుంది. నెలరోజుల పాటు (జూలై 15 వరకు) ఈ సంబరం జరుగుతుంది. క్రికెట్ సీజన్ అయిపోయిందిగా, స్పోర్ట్స్ చానల్ లిస్ట్‌లో ఫుట్‌బాల్‌కు మారిపోండి! పండుగకు సిద్ధమైపోండి!! జబివాకను పలకరించండి!!! ఫుట్‌బాల్ పుట్టిందిలా.... ఇంగ్లండ్‌లో తొలిసారి 1863లో ఈ ఆట మొదలైంది. ప్రపంచ క్రీడా చరిత్రలో క్రీడలకు సంబంధించిన తొలి సంఘం ‘ది ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇన్ ఇంగ్లండ్’కు అప్పుడే అంకురార్పణ జరిగింది. మొదట్లో ఆట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా ఆ దేశంలోనే. ఆ తర్వాత కొందరు వలసవాదుల వల్ల దక్షిణ అమెరికాకు ఈ క్రీడ వేగంగా వ్యాపించింది. 1901 మే 16న రెండు దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2తో ఉరుగ్వేను ఓడించింది. మరో ఏడాది తర్వాత బ్రిటన్ బయట (వియన్నాలో) జరిగిన తొలి యూరోపియన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆస్ట్రియా 5–0తో జర్మనీని చిత్తుగా ఓడించింది. రంగంలోకి ఫిఫా... 1904 మే 21న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్–ఫిఫా) మొదటి సమావేశం జరిగింది. ఈ గ్రూప్‌లో ఉండేందుకు ఆరంభంలో ఇంగ్లండ్ నిరాకరించింది. ఫిఫా అధికారికంగా నిర్వహించిన తొలి టోర్నీలో (దక్షిణ అమెరికా చాంపియన్‌షిప్స్) అర్జెంటీనా 4–1తో ఉరుగ్వేను ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో భాగంగా... ఆరంభంలో ప్రపంచ స్థాయి టోర్నీ నిర్వహించాలన్న ఫిఫా ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఒలింపిక్స్ క్రీడల్లోనే భాగంగా ఉంటూ దానినే వరల్డ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌గా భావించాలని ఫిఫా నిర్ణయించింది. 1920, 1924, 1928 ఒలింపిక్స్‌లలో ఫుట్‌బాల్ నిర్వహణ బాధ్యతలను తానే తీసుకుంది. అదే సమయంలో యూరోప్‌తో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో కూడా ఈ ఆట వేగంగా దూసుకుపోయింది. అందుకే 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ పోటీలను అసలైన అంతర్జాతీయ టోర్నీగా అంతా పరిగణించారు. ఎట్టకేలకు వరల్డ్ కప్... 1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఫిఫా సమావేశంలో ఎలాగైనా ప్రపంచ కప్ నిర్వహించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణకు ఐదు దేశాలు ముందుకొచ్చాయి. అయితే 1929లో ఉరుగ్వే తమ 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఆతిథ్య జట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో మిగతా నాలుగు దేశాలు స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. కేవలం 20 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం ఉరుగ్వే 1930లో జూలై 13 నుంచి 30 వరకు తొలి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వటంతో కొత్త శకం ప్రారంభమైంది. వరల్డ్ కప్ విశ్వవ్యాపితం... గత 88 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ పిచ్చిపిచ్చిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఫిఫా పరిధిలో 210 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు మాత్రం వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 12 దేశాలు మాత్రమే ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఫైనల్ వరకు వెళ్లి ఒక్క టైటిల్ కూడా నెగ్గని దురదృష్ట దేశాల జాబితాలో నెదర్లాండ్స్, హంగేరీ, చెకొస్లవేకియా, స్వీడన్ నిలిచాయి. ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ఫిఫా ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేసింది. 1938లో ఈస్ట్ ఇండీస్ (ప్రస్తుత ఇండోనేసియా) వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగం కాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్ వరకు చేరాయి. ఇదే అత్యుత్తమం. ఏ ఆఫ్రికా జట్టు కూడా ఒక్కసారీ సెమీఫైనల్‌కు చేరలేదు. వరల్డ్ కప్ సక్సెస్ స్టోరీ... ఫుట్‌బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్ ఉంది. ఆటగాళ్ల పేరు చెబితే చాలు అభిమాన లోకం ఊగిపోతుంది. అదే స్థాయిలో చాంపియన్స్ లీగ్, లా లిగా వంటి క్లబ్ టోర్నీలను జనం విరగబడి చూస్తారు. అయినా సరే వరల్డ్ కప్‌కు ఉండే క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. తమ హీరోలను ఆయా దేశాల జాతీయ జట్లలో చూసుకొని మురిసిపోయేందుకు ఫ్యాన్స్ ఎప్పటికీ సిద్ధమే అని ఈ మెగా టోర్నీ మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ వరల్డ్ కప్‌ను సూపర్ సక్సెస్ చేయడంలో ఫిఫా వ్యూహం కూడా ఉంది. అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఈ స్టార్లంతా పాల్గొంటే వరల్డ్‌కప్‌కు ఈ స్థాయి క్రేజ్ ఉండకపోయేదేమో. ఒలింపిక్స్‌లో కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లను ఆడించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఫిఫా తగ్గకుండా పట్టుదలను ప్రదర్శించింది. అందుకే వరల్డ్ కప్‌లో పాల్గొనని ఆటగాళ్లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపించాలని ఫిఫా నిబంధనలు రూపొందించింది. 1984, 1988లలో ఇలాగే అన్ని దేశాల ద్వితీయ శ్రేణి జట్లే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి. ఆ తర్వాత ఫిఫా మళ్లీ నిబంధన మార్చింది. 1992 ఒలింపిక్స్ నుంచి ఫుట్‌బాల్ ఈవెంట్ అండర్–23 స్థాయికే పరిమితం చేసింది. 23 ఏళ్లు దాటిన ఆటగాళ్లు గరిష్టంగా ముగ్గురు ఉండవచ్చు. దాంతో ఒలింపిక్స్ నుంచి పోటీ అనేదే లేకుండా ప్రపంచ కప్ విశ్వవ్యాప్తంగా అతి పెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్‌గా నిలిచింది. డబ్బులే డబ్బులు... ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ను తొలిసారి 1954లో టీవీలో ప్రసారం చేశారు. 25 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా ఫిఫాకు ప్రసార హక్కుల ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు. అదే 2010 ప్రపంచకప్‌కు వచ్చేసరికి టీవీ హక్కులను ఏకంగా 2.4 బిలియన్ డాలర్లకు అమ్మగలిగింది. రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగిన 2014 ఫైనల్‌ను టీవీల్లో 695 మిలియన్ల మంది చూశారు. స్టాటిస్టా డాట్‌కామ్ అనే ప్రఖ్యాత వెబ్సైట్ లెక్క ప్రకారం 2017లో ఫిఫా వరల్డ్ కప్ బ్రాండ్ వ్యాల్యూ 229 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు). ఒక్క వరల్డ్‌కప్ నిర్వహణతో ఫిఫాకు భారీ ఆదాయం లభిస్తుంది. 2014 వరల్డ్ కప్ ద్వారా ఫిఫా మొత్తం 4.82 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇందులో 50.3 శాతం టీవీ రైట్స్ అమ్మకాల ద్వారానే కావడం విశేషం. 32.7 శాతం మార్కెటింగ్ రైట్స్ ద్వారా అయితే కేవలం 10.9 శాతం మాత్రమే టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం. 2018 వరల్డ్ కప్ నుంచి కూడా దాదాపు ఇదే తరహా ఆదాయాన్ని నిర్వాహకులు ఆశిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం తీవ్రంగా చుట్టుముట్టిన ఆర్థికపరమైన వివాదాలు ఆదాయంపై ప్రభావం చూపించవచ్చనివిశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికా ఈసారి అర్హత సాధించకపోవడంతో కూడా పెద్ద దెబ్బ పడనుంది. మరో పెద్ద జట్టు, నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఇటలీ కూడా అర్హత సాధించకపోవడంతో ఒక బిలియన్ యూరోల నష్టం జరగనుందని అంచనా. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా వరల్డ్ కప్ ఆర్థికపరంగా కూడా గత స్థాయికి తగ్గకుండా సక్సెస్ అవుతుందని ఫిఫా విశ్వసిస్తోంది. కప్ కహానీ... ప్రపంచకప్ విజేతలకు ఇచ్చే ట్రోఫీ 1930 నుంచి ఒకసారి మారింది. 1930 నుంచి 1970 వరకు ఒక ట్రోఫీని ఇచ్చారు. మొదట్లో దీనిని ‘విక్టరీ’ పేరుతో పిలవగా... ఆ తర్వాత ఫిఫా మాజీ అధ్యక్షుడు ‘జూల్స్ రిమెట్’ పేరుతో దీనిని ఇవ్వడం మొదలు పెట్టారు. 3.8 కిలోల బరువు, 35 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ట్రోఫీని వెండితో తయారు చేసి బంగారు పూత పూశారు. టోర్నీ విజేతలకు దీని ‘రెప్లికా’ను మాత్రమే బహుమతిగా ఇచ్చేవారు. అయితే 1970లో బ్రెజిల్ మూడోసారి టైటిల్ గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఒరిజినల్ ట్రోఫీ’ని బ్రెజిల్‌కు ఇచ్చేయాల్సి వచ్చింది. దాంతో ఫిఫా కొత్త ట్రోఫీని రూపొందించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఇస్తున్న ట్రోఫీ అదే. 1974 టోర్నీ నుంచి దీనిని ఇస్తున్నారు. రెండు చేతులు గ్లోబ్‌ను మోస్తున్నట్లుగా ఉండే చిత్రంతో ఇది తయారైంది. దీని ఎత్తు 36.5 సెంటీమీటర్లు కాగా, బరువు 5 కిలోలు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దిగువ భాగంలో ఉండే ప్లేట్‌పై విజేతల జాబితా ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ ట్రోఫీని ఎవరికీ శాశ్వతంగా ఇవ్వరు. విజేతకు అదే తరహాలో ఉండే కంచు ట్రోఫీని మాత్రం అందజేస్తారు. జబివాక గురించి... రష్యాలో జరగనున్న వరల్డ్ కప్‌కు అఫీషియల్ మాస్కట్ (సింబల్ లాంటిది) జబివాక వుల్ఫ్. వైట్, రెడ్, బ్లూ కలర్స్ ఉన్న టీషర్ట్‌ను ధరించిన ఫన్నీ వుల్ఫ్ ఇది. జబివాక అంటే రష్యన్లో ‘బాగా స్కోర్ చేసేది’ అని. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు జోష్‌ను తెచ్చేందుకు జోష్‌ఫుల్‌గా ఉండేలా జబివాకను డిజైన్ చేశారు. ఆన్లైన్లో ఓటింగ్ ద్వారా దీన్ని ఎంపికచేశారు. రెడ్, వైట్, బ్లూ.. రష్యా టీమ్ నేషనల్ కలర్స్. దీనికి స్టైల్‌గా ఆరెంజ్ కలర్లో ఒక కళ్లజోడు కూడా ఉంటుంది! 2016లోనే దీన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పటికే జబివాక సోషల్ మీడియాలో బాగా ఫేమస్!! జబివాక గురించి... రష్యాలో జరగనున్న వరల్డ్ కప్‌కు అఫీషియల్ మాస్కట్ (సింబల్ లాంటిది) జబివాక వుల్ఫ్. వైట్, రెడ్, బ్లూ కలర్స్ ఉన్న టీషర్ట్‌ను ధరించిన ఫన్నీ వుల్ఫ్ ఇది. జబివాక అంటే రష్యన్లో ‘బాగా స్కోర్ చేసేది’ అని. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు జోష్‌ను తెచ్చేందుకు జోష్‌ఫుల్‌గా ఉండేలా జబివాకను డిజైన్ చేశారు. ఆన్లైన్లో ఓటింగ్ ద్వారా దీన్ని ఎంపికచేశారు. రెడ్, వైట్, బ్లూ.. రష్యా టీమ్ నేషనల్ కలర్స్. దీనికి స్టైల్‌గా ఆరెంజ్ కలర్లో ఒక కళ్లజోడు కూడా ఉంటుంది! 2016లోనే దీన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పటికే జబివాక సోషల్ మీడియాలో బాగా ఫేమస్!! వరల్డ్‌కప్ చరిత్రలో ఎందరో సూపర్ స్టార్లు తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. అందులో కొందరు అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి టాప్–5 వరల్డ్‌కప్ స్టార్స్... పీలే (బ్రెజిల్): ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో దిగ్గజ క్రీడాకారుడిగా అందరికంటే ముందు గుర్తుకొచ్చే పేరు పీలే. బ్రెజిల్ గెలిచిన మూడు వరల్డ్‌కప్‌లలో అతను భాగం కావడం విశేషం. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు కూడా పీలేనే. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో అతనిదే కీలక పాత్ర. స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే, మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తులో తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. 1958 ప్రపంచకప్‌లో నాకౌట్ దశలోనే సంచలన ప్రదర్శనతో ‘బ్లాక్ పెర్ల్’ పీలే ఆరు గోల్స్ కొట్టాడు. డీగో మారడోనా (అర్జెంటీనా): 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుతోనే డీగో మారడోనా ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే ఆజానుబాహులందరినీ వెనక్కి తోసి ఔరా అనిపించాడు. పీలేతో సంయుక్తంగా ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ’గా నిలిచిన అతను, దేశాలతో సంబంధం లేకుండా ఫుట్‌బాల్ అభిమానులందరి హృదయాలను కొల్లగొట్టాడు. 1986 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడంతో అతను సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. 1990లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్ చేర్చిన అతను 1994 వరల్డ్ కప్ సమయంలో డ్రగ్స్ వాడి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఫ్రాన్జ్ బెకన్‌బాయర్ (పశ్చిమ జర్మనీ): జర్మనీ అందించిన ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడు. తన స్టయిల్, నాయకత్వ లక్షణాలతో అతను ‘ది ఎంపరర్’గా పేరు తెచ్చుకున్నాడు. 1966, 1970 ప్రపంచకప్‌లలో అతను పాల్గొన్న పశ్చిమ జర్మనీ జట్టు అద్భుతమైన ఆట కనబర్చినా... కప్‌ను అందుకోలేకపోయింది. ఈ రెండు సార్లు అతను చెలరేగినా లాభం లేకపోయింది. 1966 ఫైనల్లో అదనపు సమయంలో ఇంగ్లండ్ చేతిలో ఓడిన జర్మనీ... 1970లో ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఇటలీకి తలవంచింది. అయితే 1974లో సొంతగడ్డపై బెకన్‌బాయర్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ నుంచే జట్టును విజయ పథంలో నడిపించి ఫైనల్లో 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయాడు. గెర్డ్ ముల్లర్ (పశ్చిమ జర్మనీ): ‘ద నేషన్స్ బాంబర్’ అనే నిక్‌నేమ్ ఉన్న గెర్డ్ ముల్లర్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లలో ఒకడు. రెండు ప్రపంచకప్‌లలో (1970, 1974 ) 13 మ్యాచ్‌లలోనే మొత్తం 14 గోల్స్ కొట్టిన ముల్లర్ ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 1970 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చిరస్మరణీయ విజయం సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. సొంతగడ్డపై తర్వాతి ప్రపంచకప్ ఫైనల్లో ముల్లర్ చేసిన గోల్‌తో జర్మనీ రెండో సారి విజేతగా నిలిచింది. రొనాల్డో (బ్రెజిల్): ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే బ్రెజిల్లో పీలే తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాడు రొనాల్డో లూయీ డి లిమా. మూడు సార్లు ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, రెండు సార్లు ‘గోల్డెన్ బాల్’ గెలుచుకోవడం మాత్రమే రొనాల్డో గొప్పతనం కాదు. పీలే రిటైర్మెంట్ తర్వాత 24 ఏళ్ల పాటు వరల్డ్ కప్ విజయానికి నోచుకోకుండా నిరాశగా కనిపించిన బ్రెజిల్ అభిమానులకు కొత్త ఊపిరి పోసింది అతనే అనడంలో అతిశయోక్తి లేదు. 17 ఏళ్ల వయసులో 1994లో బ్రెజిల్ కప్ గెలిచినప్పుడు జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ సమయానికి నివురుగప్పిన నిప్పులా ఉన్న రొనాల్డో మరో నాలుగేళ్ల తర్వాత మండుతున్న అగ్నికణికే అయ్యాడు. ఫైనల్లో బ్రెజిల్ ఓడినా... రొనాల్డో అద్భుత ఆటకు ‘గోల్డెన్ బాల్’ పురస్కారం దక్కింది. ఫుట్‌బాల్ అక్షరమాల... సాకర్ – ఫుట్‌బాల్‌కు మరో పేరు.సమయం– ఫుట్‌బాల్ మ్యాచ్ 45 నిమిషాల నిడివిగల రెండు భాగాలతో కలిపి మొత్తం 90 నిమిషాలు జరుగుతుంది. నిర్ణాయక మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయం పూర్తయ్యాక స్కోరు సమంగా నిలిస్తే ఫలితం తేలడానికి 15 నిమిషాలు నిడివిగల రెండు అర్ధభాగాలను ఆడిస్తారు. అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోతే ‘పెనాల్టీ షూటౌట్’ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇంజ్యూరీ టైమ్ – మ్యాచ్ సమయంలో ఏవైనా కారణలతో ఆటకు అంతరాయం ఏర్పడితే ఆ అంతరాయం కలిగిన సమయాన్ని నిర్ణీత సమయం పూర్తయ్యాక జోడించి ఆటను కొనసాగిస్తారు. సభ్యుల సంఖ్య – 23 మంది సభ్యులతో పూర్తి జట్టు ఉంటుంది. అయితే మ్యాచ్‌లో మాత్రం ఒక్కో జట్టు తరఫున 11 మంది ఆటగాళ్లు మాత్రమే బరిలోకి దిగాలి. కొలతలు – మైదానం పొడవు 105 మీటర్లు... వెడల్పు 68 మీటర్లకు తక్కువగా ఉండకూడదు. గోల్‌పోస్ట్ ఎత్తు 2.44 మీటర్లు, వెడల్పు 7.32 మీటర్లు ఉంటుంది. డిఫెండర్ – రక్షణ పంక్తి ఆటగాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే దాడులను నిరోధించడం ఇతని విధి.ఫార్వర్డ్ – ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించేవాడు.హెడర్ – తలతో బంతిని షాట్ కొట్టడం. సాధారణంగా ‘డి’ ఏరియాలో ఇలాంటి షాట్లు ఆడతారు.బైసైకిల్ కిక్ లేదా సిజర్స్ కిక్ – తల భాగం కిందికి వచ్చి, కాళ్లు పైకి లేపి గాల్లోనే ఉంటూ కొట్టే షాట్. పెనాల్టీ కిక్ – ‘డి’ ఏరియాలో ప్రత్యర్థి ఆటగాళ్లను డిఫెండింగ్ జట్టు సభ్యులెవరైనా మొరటుగా అడ్డుకుంటే రిఫరీ పెనాల్టీ కిక్‌ను ప్రకటిస్తాడు. గోల్‌పోస్ట్‌కు 11 మీటర్ల దూరంనుంచి ప్రత్యర్థి ఆటగాడు సంధించే ఈ కిక్‌ను గోల్‌కీపర్ మాత్రమే నిలువరించాలి. పెనాల్టీ షూటౌట్æ– నిర్ణాయక మ్యాచ్‌లో రెండు జట్లు సమ ఉజ్జీగా నిలిస్తే విజేతను నిర్ణయించేందుకు షూటౌట్నుఉపయోగిస్తారు. ఈ షూటౌట్లో ఒక్కో జట్టు తరఫున ఐదుగురు ఆటగాళ్లు ‘కిక్’లను తీసుకుంటారు. అత్యధికసార్లు సఫలమైన వాళ్లు విజేతగా నిలుస్తారు. సడన్‌డెత్ – షూటౌట్లోనూ స్కోరు సమంగా అయ్యాక రెండు జట్లకు అదనంగా అవకాశాలు ఇస్తారు. గోల్ చేయడంలో ఒక జట్టు సఫలమై, మరో జట్టు విఫలమైతే ఫలితాన్ని ప్రకటిస్తారు.డ్రిబ్లింగ్ – ఆటగాళ్లకు బంతి అందకుండా కాళ్లతో చాకచక్యంగా చేసే విన్యాసం.రెడ్ కార్డు – ప్రత్యర్థి క్రీడాకారుడిని అత్యంత మొరటుగా అడ్డుకున్న డిఫెండింగ్ జట్టు సభ్యుడికి ‘రెడ్‌కార్డు’ ప్రకటించి ఆ మ్యాచ్ నుంచి తొలగిస్తారు. ఎల్లో కార్డు – ప్రత్యర్థి క్రీడాకారుడిని ప్రమాదకరంగా అడ్డుకున్న డిఫెండింగ్ జట్టు సభ్యుడిని హెచ్చరిస్తూ అంపైర్ ‘ఎల్లో కార్డు’ ఇస్తాడు. వరుసగా రెండు ఎల్లో కార్డులు వచ్చిన ఆటగాడు తదుపరి మ్యాచ్‌లో పాల్గొనే అర్హత కోల్పోతాడు. ఎవరి కల ఫలించేను... లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో... ఆధునిక ఫుట్‌బాల్‌లో వీళ్లిద్దరిని మించిన సూపర్ స్టార్లు లేరు. చాంపియన్స్ లీగ్‌తో పాటు ఇతర క్లబ్ టోర్నీలలో తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మాయగాళ్లు. వీరు సాధించిన రికార్డులు, కీర్తి కనకాదులకు లెక్కే లేదు. అడుగు తీసి అడుగేస్తే కోట్లాభిషేకమే. కానీ వీరిద్దరి కెరీర్లో ఒకే ఒక వెలితి తమ జాతీయ జట్టు తరఫున ప్రపంచ కప్ గెలవలేకపోవడం. పోర్చుగల్ తరఫున రొనాల్డో, అర్జెంటీనా తరఫున మెస్సీ ఒక్క వరల్డ్ కప్ విజయంలోనూ భాగం కాలేకపోయారు. 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాకపోగా... రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. క్లబ్‌లతో పోలిస్తే దేశం తరఫున వీరి ఆట చాలా సందర్భాల్లో సాదాసీదాగానే సాగింది. అలాంటి వీరిద్దరు ఆఖరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నారు. ఈసారైనా వీరు తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తారా లేక ఎప్పుడూ కప్ గెలవలేకపోయిన దిగ్గజాల జాబితాలో చోటుతో ఆటను ముగిస్తారా చూడాలి! ఫుట్‌బాల్ పుట్టిందిలా.... ఇంగ్లండ్‌లో తొలిసారి 1863లో ఈ ఆట మొదలైంది. ప్రపంచ క్రీడా చరిత్రలో క్రీడలకు సంబంధించిన తొలి సంఘం ‘ది ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇన్ ఇంగ్లండ్’కు అప్పుడే అంకురార్పణ జరిగింది. మొదట్లో ఆట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా ఆ దేశంలోనే. ఆ తర్వాత కొందరు వలసవాదుల వల్ల దక్షిణ అమెరికాకు ఈ క్రీడ వేగంగా వ్యాపించింది. 1901 మే 16న రెండు దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2తో ఉరుగ్వేను ఓడించింది. మరో ఏడాది తర్వాత బ్రిటన్ బయట (వియన్నాలో) జరిగిన తొలి యూరోపియన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆస్ట్రియా 5–0తో జర్మనీని చిత్తుగా ఓడించింది. రంగంలోకి ఫిఫా... 1904 మే 21న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్–ఫిఫా) మొదటి సమావేశం జరిగింది. ఈ గ్రూప్‌లో ఉండేందుకు ఆరంభంలో ఇంగ్లండ్ నిరాకరించింది. ఫిఫా అధికారికంగా నిర్వహించిన తొలి టోర్నీలో (దక్షిణ అమెరికా చాంపియన్‌షిప్స్) అర్జెంటీనా 4–1తో ఉరుగ్వేను ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో భాగంగా... ఆరంభంలో ప్రపంచ స్థాయి టోర్నీ నిర్వహించాలన్న ఫిఫా ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఒలింపిక్స్ క్రీడల్లోనే భాగంగా ఉంటూ దానినే వరల్డ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌గా భావించాలని ఫిఫా నిర్ణయించింది. 1920, 1924, 1928 ఒలింపిక్స్‌లలో ఫుట్‌బాల్ నిర్వహణ బాధ్యతలను తానే తీసుకుంది. అదే సమయంలో యూరోప్‌తో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో కూడా ఈ ఆట వేగంగా దూసుకుపోయింది. అందుకే 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ పోటీలను అసలైన అంతర్జాతీయ టోర్నీగా అంతా పరిగణించారు. ఎట్టకేలకు వరల్డ్ కప్... 1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఫిఫా సమావేశంలో ఎలాగైనా ప్రపంచ కప్ నిర్వహించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణకు ఐదు దేశాలు ముందుకొచ్చాయి. అయితే 1929లో ఉరుగ్వే తమ 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఆతిథ్య జట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో మిగతా నాలుగు దేశాలు స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. కేవలం 20 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం ఉరుగ్వే 1930లో జూలై 13 నుంచి 30 వరకు తొలి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వటంతో కొత్త శకం ప్రారంభమైంది. వరల్డ్ కప్ విశ్వవ్యాపితం... గత 88 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ పిచ్చిపిచ్చిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఫిఫా పరిధిలో 210 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు మాత్రం వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 12 దేశాలు మాత్రమే ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఫైనల్ వరకు వెళ్లి ఒక్క టైటిల్ కూడా నెగ్గని దురదృష్ట దేశాల జాబితాలో నెదర్లాండ్స్, హంగేరీ, చెకొస్లవేకియా, స్వీడన్ నిలిచాయి. ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ఫిఫా ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేసింది. 1938లో ఈస్ట్ ఇండీస్ (ప్రస్తుత ఇండోనేసియా) వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగం కాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్ వరకు చేరాయి. ఇదే అత్యుత్తమం. ఏ ఆఫ్రికా జట్టు కూడా ఒక్కసారీ సెమీఫైనల్‌కు చేరలేదు. వరల్డ్ కప్ సక్సెస్ స్టోరీ... ఫుట్‌బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్ ఉంది. ఆటగాళ్ల పేరు చెబితే చాలు అభిమాన లోకం ఊగిపోతుంది. అదే స్థాయిలో చాంపియన్స్ లీగ్, లా లిగా వంటి క్లబ్ టోర్నీలను జనం విరగబడి చూస్తారు. అయినా సరే వరల్డ్ కప్‌కు ఉండే క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. తమ హీరోలను ఆయా దేశాల జాతీయ జట్లలో చూసుకొని మురిసిపోయేందుకు ఫ్యాన్స్ ఎప్పటికీ సిద్ధమే అని ఈ మెగా టోర్నీ మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ వరల్డ్ కప్‌ను సూపర్ సక్సెస్ చేయడంలో ఫిఫా వ్యూహం కూడా ఉంది. అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఈ స్టార్లంతా పాల్గొంటే వరల్డ్‌కప్‌కు ఈ స్థాయి క్రేజ్ ఉండకపోయేదేమో. ఒలింపిక్స్‌లో కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లను ఆడించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఫిఫా తగ్గకుండా పట్టుదలను ప్రదర్శించింది. అందుకే వరల్డ్ కప్‌లో పాల్గొనని ఆటగాళ్లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపించాలని ఫిఫా నిబంధనలు రూపొందించింది. 1984, 1988లలో ఇలాగే అన్ని దేశాల ద్వితీయ శ్రేణి జట్లే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి. ఆ తర్వాత ఫిఫా మళ్లీ నిబంధన మార్చింది. 1992 ఒలింపిక్స్ నుంచి ఫుట్‌బాల్ ఈవెంట్ అండర్–23 స్థాయికే పరిమితం చేసింది. 23 ఏళ్లు దాటిన ఆటగాళ్లు గరిష్టంగా ముగ్గురు ఉండవచ్చు. దాంతో ఒలింపిక్స్ నుంచి పోటీ అనేదే లేకుండా ప్రపంచ కప్ విశ్వవ్యాప్తంగా అతి పెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్‌గా నిలిచింది. డబ్బులే డబ్బులు... ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ను తొలిసారి 1954లో టీవీలో ప్రసారం చేశారు. 25 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా ఫిఫాకు ప్రసార హక్కుల ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు. అదే 2010 ప్రపంచకప్‌కు వచ్చేసరికి టీవీ హక్కులను ఏకంగా 2.4 బిలియన్ డాలర్లకు అమ్మగలిగింది. రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగిన 2014 ఫైనల్‌ను టీవీల్లో 695 మిలియన్ల మంది చూశారు. స్టాటిస్టా డాట్‌కామ్ అనే ప్రఖ్యాత వెబ్సైట్ లెక్క ప్రకారం 2017లో ఫిఫా వరల్డ్ కప్ బ్రాండ్ వ్యాల్యూ 229 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు). ఒక్క వరల్డ్‌కప్ నిర్వహణతో ఫిఫాకు భారీ ఆదాయం లభిస్తుంది. 2014 వరల్డ్ కప్ ద్వారా ఫిఫా మొత్తం 4.82 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇందులో 50.3 శాతం టీవీ రైట్స్ అమ్మకాల ద్వారానే కావడం విశేషం. 32.7 శాతం మార్కెటింగ్ రైట్స్ ద్వారా అయితే కేవలం 10.9 శాతం మాత్రమే టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం. 2018 వరల్డ్ కప్ నుంచి కూడా దాదాపు ఇదే తరహా ఆదాయాన్ని నిర్వాహకులు ఆశిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం తీవ్రంగా చుట్టుముట్టిన ఆర్థికపరమైన వివాదాలు ఆదాయంపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికా ఈసారి అర్హత సాధించకపోవడంతో కూడా పెద్ద దెబ్బ పడనుంది. మరో పెద్ద జట్టు, నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఇటలీ కూడా అర్హత సాధించకపోవడంతో ఒక బిలియన్ యూరోల నష్టం జరగనుందని అంచనా. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా వరల్డ్ కప్ ఆర్థికపరంగా కూడా గత స్థాయికి తగ్గకుండా సక్సెస్ అవుతుందని ఫిఫా విశ్వసిస్తోంది. మహిళలకు కూడా... ఫిఫా నేతృత్వంలోనే మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ పేరుతో 1991లో తొలిసారి ఈ టోర్నీ నిర్వహించారు. పురుషులలాగే నాలుగేళ్లకు ఒకసారి టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య దేశం మినహా మిగతా జట్ల ఎంపిక కోసం మూడేళ్ల పాటు క్వాలిఫయింగ్స్ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 7 మహిళా ప్రపంచ కప్‌లు జరిగాయి. ఇందులో మూడుసార్లు అమెరికా టైటిల్ గెలవగా... జర్మనీ రెండుసార్లు, నార్వే, జపాన్ ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. 2015లో కెనడాలో నిర్వహించిన వరల్డ్ కప్‌లో అమెరికా చాంపియన్ అయింది. 2019 ప్రపంచకప్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. నాడు గొప్ప.. నేడు! 97. ఫిఫా తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం. గత కొన్నేళ్లలో ఎప్పుడూ వందకు చేరువలో రాని మన ప్రదర్శనతో పోలిస్తే ఇది మెరుగైన ర్యాంక్ అనే చెప్పాలి. క్రికెట్ మాయలో పడి మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అనేక మంది ఆటగాళ్లు తమ వ్యక్తిగత ప్రదర్శనతో అప్పట్లో అందరినీ ఆకర్షించారు. అయితే ఆ తర్వాత 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే కొన్ని సార్లు అద్వితీయ ప్రదర్శనతో మెరిసి భారత్ బయట కూడా తమదైన గుర్తింపు తెచ్చుకోగలిగారు. బెంగాల్లో భలే... భలే... దేశంలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌బాల్‌కు వీరాభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఎక్కువగా బెంగాల్ రాష్ట్రంలో ఆట చురుగ్గా కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్‌కతాలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు గత ప్రాభవాన్ని కొనసాగిస్తున్నాయి. భారత్‌లో ఏడు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఫుట్‌బాల్‌ను బతికిస్తున్నాయి. ఇటీవల మిజోరాంలోని ఐజ్వాల్‌లో అండర్–14 స్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తే ఏకంగా 811 మంది హాజరయ్యారు. దేశంలో 3 శాతం జనాభా లేని ఈ ప్రాంతం నుంచి భారత ఫుట్‌బాల్‌లో 20 శాతంకు పైగా ఆటగాళ్లు వస్తున్నారు. ఇంకా బాలీవుడ్, క్రికెట్ సరిగా చేరని ఆ రాష్ట్రాల్లో అందరికీ ఏకైక వినోదం ఫుట్‌బాల్ మాత్రమే అని విశ్లేషకుల అభిప్రాయం. వారి దృఢమైన శరీర నిర్మాణం, ఎంత ఎత్తుకు పరుగెత్తినా ఇబ్బంది పెట్టని బలమైన ఊపిరితిత్తులు కూడా ఈ ఆటను ఎంచుకునేలా చేస్తున్నాయి. సిక్కిం నుంచి వచ్చిన బైచుంగ్ భూటియా వీరందరికీ ఆదర్శం. మన ఘనమైన గతం... ఒకప్పుడు హైదరాబాద్‌లో కూడా ఫుట్‌బాల్ అద్భుతంగా రాజ్యమేలింది. మొత్తం 16 మంది హైదరాబాదీలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా 25 మంది అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఆడారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో 9 మంది హైదరాబాదీలు ఉండటం విశేషం. జుల్ఫిఖరుద్దీన్, బలరామ్, పీటర్ తంగరాజ్, మొహమ్మద్ సలామ్, లతీఫ్, అహ్మద్ హుస్సేన్, అజీజ్, నూర్ మొహమ్మద్‌లు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగారు. ఈ జట్టుకు మరో దిగ్గజం రహీం సాబ్ కోచ్‌గా వ్యవహరించారు. అయితే 80ల నుంచి పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. నగరంలో ప్రతిష్టాత్మక రహీం లీగ్ నిర్వహణ ఆగిపోవడంతో కొత్త ప్రతిభను గుర్తించే అవకాశమే లేకుండా పోయింది. 2000 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘంలో వచ్చిన చీలికలు, గొడవల కారణంగా ఫుట్‌బాల్ దాదాపుగా చచ్చిపోయింది. ఆహ్వానంతోనే ఆఖరు... వరల్డ్ కప్ వచ్చిన ప్రతీసారి మన భారత్ ఉంటే బాగుండేది అనుకోవడం లేదంటే మన జట్టు ఒక్కసారైనా ఆడగలదా అని ఆశపడటం సగటు ఇండియన్ ఫ్యాన్‌కు అతి సహజం. అయితే 68 ఏళ్ల క్రితం 1950 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌కు ఆడే అవకాశం దక్కింది. కానీ మన టీమ్ మాత్రం టోర్నీలో పాల్గొనలేకపోయింది. దీనికి సంబంధించి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అరుదైన అవకాశానికి సంబంధించిన విశేషాలు మాత్రం ఆసక్తికరం. రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సం తర్వాత జరిగిన తొలి ప్రపంచ కప్‌ను 1950లో బ్రెజిల్లో నిర్వహించారు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో దేశాలు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా క్వాలిఫయింగ్‌లో ఇప్పుడున్న తరహాలో 210 దేశాలు కాకుండా 33 జట్లే పోటీ పడ్డాయి. అప్పట్లో ఫిఫా ర్యాంకింగ్ వ్యవస్థ లేదు. గ్రూప్‌లు నిర్ణయించే విషయంలో ఫిఫా భౌగోళిక సౌలభ్యాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. దాంతో మన జట్టు క్వాలిఫయింగ్‌లో బర్మా, ఫిలిప్పీన్స్‌ల గ్రూప్‌లో నిలిచింది. ఆ రెండు జట్లు తప్పుకోవడంతో భారత్ ఆటోమెటిక్‌గా అర్హత సాధించింది. అయితే చివరి నిమిషంలో టోర్నీ నుంచి భారత్ తప్పుకుంది. ఏఐఎఫ్ఎఫ్ (అఖిల భారత ఫుట్‌బాల సమాఖ్య) అధికారిక వివరణ ప్రకారం... జట్టు ఎంపికపై భేదాభిప్రాయాలు, తగినంత ప్రాక్టీస్ సమయం లేకపోవడం దీనికి కారణాలు.ఆ తర్వాత 1954లో కూడా మన జట్టు ఆహ్వానం తిరస్కరించడంతో చాలా ఏళ్ల పాటు ఫిఫా, ఏఐఎఫ్ఎఫ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. చివరకు అంతా సమసిన తర్వాత 1986లో మన జట్టు క్వాలిఫయింగ్ ఆడింది. అప్పటి నుంచి అన్నిసార్లూ బరిలోకి దిగినా... ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది. మండేలాను మెరిపించిన ఆట... దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాకు ఫుట్‌బాల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకు ఈ ఆటంటే విపరీతమైన అభిమానం. అదే కారణంగా 2010 వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు మండేలా తీవ్రంగా కృషి చేశారు. ఇందులో సఫలమయ్యారు కూడా. 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉండి కూడా ఆ మెగా టోర్నీ ముగింపు ఉత్సవానికి హాజరై అభిమానులను అలరించారు. దక్షిణాఫ్రికాలో 2010 ప్రపంచ కప్ నిర్వహించబోతున్నట్లుగా ఫిఫా అధికారిక ప్రకటన చేసిన తర్వాత మండేలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘జనాలను ఏకం చేసి, వారిలో స్ఫూర్తి నింపే శక్తి క్రీడలకు ఉంది. ఆఫ్రికాలో సాకర్‌కు ఎంతో ఆదరణ, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తొలిసారి దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ జరగడం ఎంతో ముఖ్యమని నేను భావించా. ఆతిథ్య దేశంగా మాకు అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వరల్డ్ కప్‌ను అద్భుతంగా నిర్వహించి మా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసేందుకు మనందరం శ్రమించాలి. సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాఫ్రికా ప్రజలు సహనంతో ఎలా ఉండాలో నేర్చుకున్నారు. ఎంతో కాలం వేచి చూసిన తర్వాత వరల్డ్ కప్ నిర్వహణకు ఫిఫా ఇచ్చిన అవకాశానికి తగిన విలువను చూపించాలి’ అని మండేలా అన్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ స్పోర్ట్స్ డెస్క్, సాక్షి. -
ముందడుగు అర్జెంటీనాది... మలి జట్టు నైజీరియా
ఒకటి దిగ్గజం... రెండు ప్రమాదకరం... మరోటి అరంగేట్రం... ప్రపంచకప్ గ్రూప్ ‘డి’ జట్ల ముఖచిత్రమిది. పోయినసారి త్రుటిలో చేజారిన కప్‌ను ఈసారైనా ఒడిసిపట్టాలనేది మాజీ చాంపియన్ అర్జెంటీనా ప్రయత్నం కాగా... అంచనాలను తలకిందులు చేసే నైజీరియా, కొన్నాళ్లుగా ఎదుగుతున్న క్రొయేషియాలు సామర్థ్యం చాటేందుకు సిద్ధమవుతున్నాయి. తమ దేశం స్థాయికి ఊహకైనా చిక్కని ఘనతను అందుకున్న ఐస్లాండ్... ఒక్క విజయం సాధించినా విశ్వ సమరంలో పాల్గొన్నామన్న తృప్తి పొందుతుంది. అర్జెంటీనా... మెస్సీ మయం అది క్లబ్ జట్టయినా సరే, లియోనల్ మెస్సీ ఉంటే ఆ ఆకర్షణే వేరు. ఇక అతడు కెప్టెన్‌గా ఉన్న జాతీయ జట్టు ప్రపంచకప్‌లో ఆడుతోందంటే చూపు తిప్పుకోలేం. క్వాలిఫయింగ్ పోటీల్లో ఓ దశలో వెనుకబడినా, మెస్సీ మాయతోనే గట్టెక్కింది అర్జెంటీనా. దీన్నిబట్టి జట్టుపై అతని ప్రభావం అంచనా వేయొచ్చు. కెరీర్ చరమాంకానికి చేరుకున్నందున ఆటగాడిగానూ 31 ఏళ్ల మెస్సీకిది కీలక టోర్నీ. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతడు... దేశానికి కప్ అందిస్తే మరో మారడోనాగా చరిత్రలో నిలిచిపోతాడు. తద్వారా 2014లో తన నాయకత్వంలో కప్ చేజారిం దన్న వేదన కూడా తీరుతుంది. సెర్గియో అగ్యురో, గొంజాలో హిగుయెన్, డారియా బెన్డెట్టో సైతం రాణిస్తే కప్పు కోసం అర్జెంటీనా 32 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. బలాబలాల రీత్యా చూస్తే గ్రూప్‌లో అగ్రస్థానంతో నాకౌట్ చేరే అవకాశాలే ఎక్కువ. కీలకం: మెస్సీ, అగ్యురో, హిగుయెన్. గత కప్‌లో మెస్సీ రాణించినా హిగుయెన్ ఫామ్‌లో లేకపోవడం దెబ్బతీసింది. బెన్డెట్టోపైనా అంచనాలున్నాయి. కోచ్: జార్జ్ సంపోలి. ఏడాదిలో జట్టుకితడు మూడో కోచ్. సంపోలి బాధ్యతలు స్వీకరించాక కూడా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. నాలుగు అధికారిక మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచింది. ప్రపంచ ర్యాంక్ : 5 చరిత్ర : రెండుసార్లు (1978, 1986) విజేత. రెండుసార్లు (1990, 2014) రన్నరప్. క్రొయేషియా... కొరుకుడు పడేనా! క్లబ్ జట్ల తరఫున అద్భుతంగా ఆడిన ఆటగాళ్ల కారణంగా... కాగితంపై క్రొయేషియా బలమైనదిగానే కనిపిస్తుంది. వేగంగా కదిలే కెప్టెన్ లూకా మోడ్రిక్తో పాటు, మారియో మండ్జుక్, ఇవాన్ రాక్టిక్, ఇవాన్ పెర్సిక్ వంటి వారున్న ఈ జట్టును తక్కువ అంచనా వేయలేం. ‘క్రొయేషియా’ దేశం హోదాతో అడుగిడిన తొలి ప్రపంచకప్ (1998)లోనే సెమీస్‌కు చేరింది. కీలకం: లూకా మోడ్రిక్. కెప్టెన్‌గా జట్టును ముందుకు తీసుకెళ్తాడని భావిస్తున్నారు. కోచ్: జ్లాట్కో డాలిక్. క్వాలిఫయింగ్ పోటీల్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నాడు. ఉక్రెయిన్, గ్రీస్లపై విజయాలకు వ్యూహాలు పన్ని ప్రపంచకప్ అర్హత సాధించి పెట్టాడు. ప్రపంచ ర్యాంక్ : 20 చరిత్ర: నాలుగుసార్లు అర్హత సాధించింది. 1998లో సెమీస్ చేరడం అత్యుత్తమం. 2014లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. నైజీరియా... గద్దలా తన్నుకుపోగలదు ఆఫ్రికా చాంపియన్స్ కామెరూన్, జాంబియాలు ఉన్న గ్రూప్‌లో తొలి స్థానంలో నిలిచి ఆ ఖండం నుంచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన తొలి దేశం నైజీరియా. వరుస దాడులతో బెంబేలెత్తించి తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఈ సూపర్ ఈగల్స్ సొంతం. క్వాలిఫయింగ్ సమీకరణాల్లో ఓ దశలో అర్జెంటీనా అవకాశాలనే ప్రభావితం చేసింది. గత ఆరు కప్‌లలో అయిదింటిలో ఆడింది. గ్రూప్‌లో రెండో స్థానంతో నాకౌట్‌కు వెళ్లగలదు. కీలకం: కెప్టెన్ జాన్ ఒబి మికెల్. మిడ్ ఫీల్డ్‌లో మెరిక. అలెక్స్ ఇవోబి, విక్టర్ మోసెస్, కెలెచి ఇహెనాకో కూడా ప్రమాదకారులే. కోచ్: గెర్నాట్ రోర్. 2014 నుంచి జట్టుకు ఎనిమిదో కోచ్. మౌనంగానే పనిచేసుకుపోయే వ్యక్తి. ప్రపంచ ర్యాంక్ : 48 చరిత్ర: 1994లో అరంగేట్రం చేసింది. ఇప్పటికి ఐదుసార్లు క్వాలిఫై అయింది. మూడుసార్లు నాకౌట్‌కు చేరింది. ప్రతిభ, అంకితభావం... ఐస్లాండ్ ప్రస్తుతం కప్ బరిలో ఉన్న దేశాలన్నింటిలో అతి తక్కువ జనాభా ఉన్న దేశం. దీని జనాభా 3 లక్షల 30 వేలు. ఆతిథ్య రష్యా రాజధాని మాస్కోలోనే ఇంతకంటే 40 రెట్లు జనం ఉండటం విశేషం. అయినా ఆటలో ప్రతిభకు హద్దేముంది అన్నట్లు... జెయింట్ కిల్లర్‌లా అరంగేట్రం చేస్తోంది. ఇంగ్లండ్‌ను ఓడించి 2016 యూరో కప్‌లో క్వార్టర్స్‌కు చేరింది ఐస్లాండ్. కాబట్టి అదృష్టవశాత్తు తొలిసారి ప్రపంచకప్ బెర్త్ దక్కిందనుకుంటే పొరపాటే. క్రొయేషియా కంటే ముందే రష్యా టికెట్ సంపాదించింది. ఆశావహ దృక్పథమే జట్టును నడిపిస్తోంది. కీలకం: అరాన్ గునర్సన్. పదే పదే దాడులకు దిగే జిల్ఫీ సిగుర్డ్సన్ కూడా ప్రమాదకారే. కోచ్: హీమర్ హల్గ్రిమ్సన్. మాజీ ఆటగాడు. వృత్తి రీత్యా దంత వైద్యుడు. గతేడాది సహాయ కోచ్ లార్స్ లాగర్బ్యాక్ వైదొలగాక పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. ప్రపంచకప్ వరకు తీసుకొచ్చాడు. ప్రపంచ ర్యాంక్ : 22 -
ఈసారి కాకుంటే...
వ్యక్తిగతంగా వందల కొద్ది గోల్స్ చేసుండొచ్చు!లీగ్‌ల్లో ఫ్రాంచైజీలకు టైటిల్స్ కొట్టి పెట్టి ఉండొచ్చు!ఆటతో కోటానుకోట్ల మందిని మైమరపించి ఉండొచ్చు!తమ తరానికి సూపర్ స్టార్లుగా వెలుగొంది ఉండొచ్చు!...అయినా ఏం లాభం?...చంద్రుడిలో మచ్చలా ఆ ఒక్క లోటే పెద్దగా కనిపిస్తుంటే!...దేశం గర్వంగా చెప్పుకొనేంతటి ఆ ఘనత సాధించకుంటే!...వ్యక్తిగతంగానూ తీరని కోరికగా మిగిలి వెంటాడుతుంటే! ...కలకాలం నిలిచే ఆ కలికితురాయి కీర్తి కిరీటంలో లేకుంటే! సాక్షి క్రీడా విభాగం: ఎప్పుడో ఒకప్పుడు ఫుట్‌బాల్ వార్తలను చదివే వారినో, అప్పుడో ఇప్పుడో మ్యాచ్‌లను చూసే వారినో... మీకు తెలిసిన ఆటగాళ్ల పేర్లు చెప్పండని కదిలిస్తే ఠక్కుమని వచ్చే సమాధానం లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. మధ్యలో వేన్ రూనీ, నెయ్మార్ వంటివారు తళుక్కుమన్నా దశాబ్ద కాలంగా మెస్సీ, రొనాల్డోల ప్రభ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు వీరి మధ్య రెండుగా చీలిపోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే ఆధునిక ఫుట్‌బాల్ రూపురేఖలు మార్చిన, అత్యంత ప్రతిష్ఠాత్మక బ్యాలన్ డి ఓర్ పురస్కారాన్ని చెరో ఐదుసార్లు గెల్చుకున్న ఇద్దరూ గొప్ప వారే. తమ జట్లకు పెద్ద దిక్కు... సమకాలీనులు... ఫార్వర్డ్ ఆటగాళ్లు... ఇలా సామీప్యతలకు తోడు ఉమ్మడిగా ఓ లోటు కూడా నీడలా వస్తోంది. ...అదే ఫిఫా ప్రపంచకప్. ‘ఆ ఒక్కటీ తప్ప’ అన్నట్లు కెరీర్ ఆసాంతం ఊరిస్తోన్న కప్‌ను అందుకునేందుకు బహుశా వీరికిదే చివరి అవకాశం. రాబోయే సమరంలో ఎవరైతే కప్ గెలిపిస్తారో... ఇద్దరి మధ్య సాగుతున్న పదేళ్ల పరోక్ష పోటీలోనూ వారే విజేతగా మిగులుతారు. ఈ నేపథ్యంలో ఎవరి పరిస్థితి ఏంటి? అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే...! మెస్సీ... మళ్లీ మిస్ చేయవుగా! ఒకటి కాదు రెండు కాదు అర్జెంటీనా ప్రపంచకప్ సాధించి 32 ఏళ్లయిపోయింది. ఎప్పుడో 1986లో మెస్సీ పుట్టకముందు.... మారడోనా ‘గోల్డెన్ హ్యాండ్’తో అందించిన కప్పే ఇప్పటికీ వారికి మురిపెంగా మిగిలుంది. ఈలోగా పొరుగు దేశమైన బ్రెజిల్ రెండుసార్లు కప్ ఎగరేసుకుపోయింది. జర్మనీ సైతం రెండుసార్లు జగజ్జేతగా నిలిచింది. కానీ ఎన్నో ఆశలతో అడుగిడడం, ఉసూరుమంటూ వెనుదిరగడం మూడు దశాబ్దాలుగా అర్జెంటీనాకు అలవాటైపోయింది. అయితే, ఇన్నేళ్లలో తమకు ట్రోఫీ ఖాయంగా అందించే మొనగాడు వచ్చాడని ఆ దేశం భావించింది మాత్రం మెస్సీ వచ్చాకే. 2014 కప్ సందర్భంగా అయితే ఈ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలా దిగ్గజాలు ఒక్కొక్కటిగా వెనుదిరగడంతో ‘వైట్ అండ్ స్కై బ్లూస్’ అభిమానులు కప్ తమకేననుకున్నారు. ఇందుకుతగ్గట్టే ‘షో మ్యాన్’ మెస్సీ తమ జట్టును ఫైనల్‌కు తీసుకొచ్చాడు. హోరాహోరీ తుది సమరంలో జర్మనీ ఆటగాడు మారియో గోట్జె చేసిన ఏకైక గోల్... అర్జెంటీనా కప్ నిరీక్షణను మరింత పెంచింది. అప్పటికీ ఓసారి బంతిని గోల్‌పోస్ట్‌కు అతి సమీపంగా కొట్టిన మెïస్సీకి పెనాల్టీ కిక్ రూపంలో చరిత్రలో నిలిచిపోయే అవకాశం వచ్చింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పదికి తొమ్మిదిసార్లు పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మలిచే మెస్సీ... ఆ ఒక్కదానిని అత్యంత కీలక సమయంలో ‘మిస్’ అవడం చిత్రమనే చెప్పాలి. ప్రస్తుతానికి వస్తే ఎప్పటిలానే జట్టు కెప్టెన్‌గా మెస్సీ దేశ ఆశలన్నిటినీ మోస్తున్నాడు. ఇప్పటికే ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి, అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో విరమించుకున్న మెస్సీ... వచ్చే నెలతో 31 ఏళ్లు పూర్తిచేసుకోనున్నాడు. వచ్చేసారి 35 ఏళ్ల ప్రాయంలో తను మహాద్భుతం చేస్తాడని మాత్రం ఊహించలేం. అంటే అతడికి ఇదే దాదాపు చివరి కప్. అందుకని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుధవారం హైతీతో సన్నాహక మ్యాచ్‌లో 50 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ కొట్టిన మెస్సీ... తర్వాత తన మాటల్లోనూ చాలా కసిని చూపాడు. అయితే, గ్రూప్ డిలో ఉన్న ఆ జట్టుకు క్రొయేషియా, నైజీరియాలతో ముప్పు పొంచి ఉంది. మేటి ఆటగాడైనా, గత కప్‌లో విఫలమైన హిగుయెన్తో పాటు అగ్యురో వంటి వారు మెస్సీ మ్యాజిక్కు తోడైతే మాత్రం అర్జెంటీనాకు ఎదురుండదు. ‘లీగ్’ రారాజు రాణిస్తాడా...? లీగ్‌ల రారాజు... క్రిస్టియానో రొనాల్డో గురించి ఒక్క ముక్కలో చెప్పే మాట ఇది. లా లీగా, కోపాస్ డెల్ రే, యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ఇలా ప్రపంచంలో ఏ లీగ్ చూసినా రొనాల్డో ప్రభంజనం కనిపిస్తుంది. తాజాగా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రియల్ మాడ్రిడ్ చాంపియన్స్ లీగ్‌లో విజేతగా నిలిచింది. కానీ, ప్రపంచకప్‌నకు వచ్చేసరికి అతడి ప్రభ మసకబారుతుంది. పోర్చుగల్ జట్టు అంత బలంగా లేకపోవడం కూడా రొనాల్డోపై ప్రభావం చూపుతోంది. 2014లో అతడి ఫామ్ అత్యుత్తమంగా ఉన్నప్పుడే పోర్చుగల్ 18వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా క్రిస్టియానో పైనే జట్టు మొత్తం ఆశలు పెట్టుకుంది. ప్రాటిసియో, పెపె, గ్యురెరోలు ఓ చేయి వేస్తేనే పోర్చుగల్ ముందుకెళ్తుంది. గ్రూప్ బిలో ఉన్న స్పెయిన్, మొరాకో గండాలను దాటాల్సి ఉంటుంది. కప్ సాధిస్తామని రొనాల్డోకూ నమ్మకం లేనట్లుంది. బ్రెజిల్, స్పెయిన్, జర్మనీ, అర్జెంటీనాలే ఫేవరెట్లంటూ తనే ప్రకటించాడు కూడా. ప్రపంచంలో అత్యంత ధనిక ఆటగాడిగా పేరున్న 33 ఏళ్ల రొనాల్డో... ప్రపంచంలో తానే మేటి ఫుట్బాలర్నంటూ ప్రకటించుకున్నాడు. తాజాగా కప్ లేకున్నా తన కీర్తి ఏమాత్రం తగ్గదంటూ వ్యాఖ్యానించాడు. దీన్నిబట్టి అతడు వాస్తవంలో ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. తానెంత చెప్పినా ప్రపంచకప్ లేని లోటు లోటే కదా! -
రొనాల్డోకు ‘బ్యాలన్ డి ఓర్’ పురస్కారం
-
రొనాల్డోకు ‘బ్యాలన్ డి ఓర్’ పురస్కారం
ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును 2017 సంవత్సరానికి క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) గెలుచుకున్నాడు. ఐదోసారి ఈ అవార్డును గెలుచుకున్న రొనాల్డో తన తరంలో మరో సూపర్ స్టార్ అయిన మెస్సీతో సమంగా నిలిచాడు. ఈ అవార్డు కోసం జరిగిన పోటీలో చివరకు మెస్సీ రెండో స్థానంలో నిలవగా, నెయ్‌మార్‌కు మూడో స్థానం దక్కింది.రొనాల్డో గతంలో 2008, 2013, 2014, 2016లలో ‘బ్యాలన్ డి ఓర్’ను గెలుచుకున్నాడు. -
కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది
ఇన్నేళ్లుగా అతను దేశం భారం మోశాడు. కొద్ది సేపు మేం అతడిని మోయడం గౌరవంగా భావిస్తున్నాం... ఈ మాట ఎక్కడో విన్నట్లుందా! దశాబ్ద కాలంగా దేశం తరఫున ఒక్కడే పోరాడి నిలిచాడు. ఇప్పుడు అతను నిలబడలేని స్థితిలో ఉంటే మేం చేయి అందించి నడిపించడం మాకు ఎంతో గౌరవం... మళ్లీ ఇప్పుడూ అదే మాట! అవును... మొదటిది క్రికెట్ ప్రపంచ కప్ విజయం సమయంలో సచిన్ గురించి జట్టు సభ్యులు చెబితే, ఇప్పుడు యూరో విజయంతో రొనాల్డో గురించి సహచరులు ఉద్వేగంగా చేసిన వ్యాఖ్య. ఈ రెండు దృశ్యాలు దిగ్గజ క్రీడాకారులు చిరకాలం వేచి చూసిన తర్వాత విజయం దక్కినపుడు కనిపించే భావోద్వేగాలకు అద్దం పడతాయి. యూరో విజయంతో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా దేశం తరఫున టైటిల్ గెలవలేకపోయిన లోటును అతను ఇప్పుడు తీర్చుకున్నాడు. సాక్షి క్రీడావిభాగం: సమకాలీన ఫుట్‌బాల్ ప్రపంచంలో మెస్సీ, రొనాల్డో మధ్య పోలికలతో ఎవరు అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు దానికి స్పష్టత వచ్చేసింది! మెస్సీ ఖాతాలో లేని మేజర్ టోర్నీ రొనాల్డో సాధించేశాడు. ఫలితం గా ఇద్దరి మధ్య అంతరం పెంచేశాడు. 2004 యూ రో ఫైనల్లో 19 ఏళ్ల టీనేజర్‌గా పోర్చుగల్ ఓటమిలో భాగమైన రొనాల్డో, పుష్కర కాలం తర్వాత జట్టు చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 25 నిమిషాల్లోనే... టైటిల్ లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టిన రొనాల్డోకు ఫైనల్లో 9వ నిమిషంలోనే షాక్ తగిలింది. ఫ్రాన్స్ ఆటగాడు పాయెట్ అడ్డుకోవడంతో మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. అయితే చికిత్స తర్వాత మరో 8 నిమిషాలు ఆడినా... నొప్పి భరించలేక ఏడుస్తూ మైదానం వీడాడు. మరో 3 నిమిషాలకు ప్లాస్టర్‌తో తిరిగొచ్చి ఆడే ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. ఒక వైపు జట్టును మధ్యలోనే వదిలేసి పోతున్నాననే బాధ వెంటాడుతుండగా, 25వ నిమిషంలో కన్నీళ్లతో స్ట్రెచర్‌పై అతను మళ్లీ నిష్ర్కమించాల్సి వచ్చింది. మైదానం బయటినుంచే... రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో రొనాల్డో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఒక దశలో పక్కన కూర్చున్న సహచరుడి తొడపై బలంగా కొట్టి ఆగ్రహం ప్రదర్శించాడు! ఇక ఆగలేనంటూ ఒంటికాలితోనే లేచి వచ్చేసి బయటినుంచే ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ మేనేజర్ పాత్ర పోషించాడు. గోల్ కొట్టడానికి నాలుగు నిమిషాల ముందు ఎడెర్తో మాట్లాడి నువ్వే గెలిపిస్తున్నావంటూ స్ఫూర్తి నింపాడు. అతని మాటల మంత్రం ఏం అద్భుతం చేసిందో... ఎడెర్ గోల్‌తో పోర్చుగల్‌ను చరిత్రలో నిలిపాడు. ఇక ప్రపంచకప్ మిగిలింది మూడు సార్లు ‘ఫిఫా’ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రొనాల్డో తొలి సారి దేశం తరఫున గర్వపడే ప్రదర్శన కనబర్చాడు. టోర్నీలో పోర్చుగల్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా హంగేరీ, వేల్స్లపై రొనాల్డో అద్భుత ఆట జట్టును గెలిపించింది. ఫైనల్లో గెలుపు తర్వాత హద్దుల్లేని సంబరాల్లో భాగమైన రొనాల్డో తనదైన శైలిలో షర్ట్ విప్పి పోజు ఇవ్వడమే కాదు... ప్రేక్షకుల్లోకి వెళ్లి తనకు ఈ స్థాయి తెచ్చిన మాంచెస్టర్ మాజీ మేనేజర్ అలెక్స్ ఫెర్గూసన్‌ను ఆత్మీయంగా కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పడం కూడా మరచిపోలేదు. అయితే రొనాల్డోకు ఇంకా ఓ లోటు ఉంది. ఒక్కసారి ప్రపంచకప్‌ను కూడా ముద్దాడితే... ఇక రొనాల్డో దిగ్గజాలకే దిగ్గజంగా ఎదుగుతాడు. నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. అందుకే భావోద్వేగాలు ఆపుకోలేక ఏడ్చేశాను. నేను భవిష్యత్తు చెప్పేవాడిని కాదు. కానీ అదనపు సమయంలో ఎడెర్ ఆట మార్చగలడని నాకు అనిపించింది. అందుకే అతడిపై నమ్మకముంచాం. - రొనాల్డో -
మెస్సీ.. 'ఫోర్త్ టైం లక్కీ'..!
బ్యూనస్ ఎయిర్స్: కోపా అమెరికా ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో చిలీతో ఓటమి అనంతరం 'దేశం తరపున నా చివరి మ్యాచ్ ఆడేశాను' అంటూ మెస్సీ చేసిన ప్రకటనను అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం బ్యూనస్ ఎయిర్స్ నగర మేయర్ మెస్సీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెస్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 29 ఏళ్ల మెస్సీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. అర్జెంటీనా ప్రెసిడెంట్ మారిసియో మాక్రితో పాటు ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా సైతం మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఒలంపిక్స్‌లో అర్జెంటీనాకు గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మెస్సీ.. మూడు ప్రతిష్టాత్మక ఫైనల్స్( 2015, 2016 కోపా అమెరికా, ప్రపంచకప్ 2014)లో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. రష్యాలో 2018లో జరగనున్న వరల్డ్ కప్‌లో మెస్సీ ఆడాలని అర్జెంటీనాతో పాటు ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులు కోరుకుంటున్నారు. దీంతో 'ఫోర్త్ టైం లక్కీ' నినాదంతో మెస్సీని వెనక్కిరావాలని కోరుతున్నారు. -
ఇక నా వల్ల కాదు
మెస్సీ అస్త్ర సన్యాసం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన క్లబ్ ఫుట్‌బాల్‌లో తిరుగు లేని సూపర్ స్టార్... వేసే ప్రతి అడుగు, మైదానంలో పరుగుకు కోట్లాది రూపాయల కనకవర్షం కురుస్తుంది. మెస్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఒక మాయ. నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిల్స్, ఏకంగా ఎనిమిది స్పానిష్ లీగ్ ట్రోఫీలు, లెక్క లేనన్ని అవార్డులు, రివార్డులు, లెక్క పెట్టలేనంత మంది ఫ్యాన్స్. దేశం తరఫున 11 ఏళ్ల కెరీర్... చెప్పుకోదగ్గ అంతర్జాతీయ టైటిల్ ఒక్కటి కూడా లేదు. మూడు కోపా అమెరికా ఫైనల్స్‌లో ఓటమి. వరల్డ్ కప్ ఫైనల్ పోరు కూడా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఐదు సార్లు ‘ఫిఫా’ ఉత్తమ ఆటగాడే అయినా ఆ ఉత్తమ ప్రదర్శన అర్జెంటీనాకు మాత్రం ఏ టైటిల్‌నూ తేలేదు. అతను ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ పరాభవమే. సాక్షి క్రీడా విభాగం:- 29వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇక దేశం తరఫున ఆడలేనంటూ అస్త్ర సన్యాసం చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమై, నిరాశా నిస్పృహకు లోనై, చివరకు ‘కోపా’ పరాజయ భారంలో ప్రధాన భాగమై అతను నిష్ర్కమించాడు. ఫైనల్లో చిలీ చేతిలో ఓడిన తర్వాత ‘నేను అర్జెంటీనా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాను’ అని అతను ప్రకటించాడు. 2005లో అర్జెంటీనా జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన మెస్సీ మొత్తం 113 మ్యాచ్‌లలో 55 గోల్స్ చేశాడు. ‘నేను చేయాల్సిందంతా చేశాను. నాలుగు ఫైనల్స్ ఆడినా గెలుపు దక్కలేదు. దేశం తరఫున టైటిల్ గెలవాలని అందరికంటే ఎక్కువగా భావించాను. రిటైర్మెంట్ కఠిన నిర్ణయమే. వెనక్కి వచ్చే ఆలోచన లేదు’ అని మెస్సీ స్పష్టం చేశాడు. రికార్డులే రికార్డులు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ను శిఖరాన నిలిపిన మారడోనా తర్వాత మెస్సీనే ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో తన దేశానికి అండర్-20 ప్రపంచకప్‌ను అందించాక ఈ కుర్రాడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత అతి పిన్న వయసులో దేశం తరఫున ‘ఫిఫా’ ప్రపంచ కప్ ఆడిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవటం లాంఛనమే అయింది. 5’7’’ ఎత్తు అంటే సాధారణంగా ఫుట్‌బాలర్లలో తక్కువగానే లెక్క. కానీ దీంతోనే అతను మైదానంలో చురుగ్గా దూసుకుపోయి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు. వరుసగా నాలుగు సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా నీరాజనాలందుకున్న మెస్సీ... తక్కువ వ్యవధిలోనే దిగ్గజ ఫుట్‌బాలర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశాడు. ఆ ఒక్కటీ తప్ప... క్లబ్ ఆటగాడిగా ఉన్న గుర్తింపును పక్కన పెడితే అర్జెంటీనా తరఫున కూడా మెస్సీ ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. జట్టులో సీనియర్లు ఎంత మంది ఉన్నా... ఒంటిచేత్తో పలు మ్యాచ్‌లలో గెలిపించాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో దురదృష్టం అతడిని వెంటాడింది. ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం గుర్తుంచుకునే ప్రధాన టోర్నీలలో మాత్రం అతనికి విజయానందం దక్కలేదు. మెస్సీ జట్టులోకి వచ్చిన తర్వాత మూడు ప్రపంచకప్‌లు, కోపా అమెరికా కప్‌లలో అర్జెంటీనా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దాంతో కీలక టోర్నీల్లో జట్టును గెలిపించలేడనే విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటతో ఎంత మెప్పించినా... ఈ విషయంలో మాత్రం మారడోనాను అతను మరిపించలేకపోయాడు. ఫలితంగా ఈ ‘పదో నంబర్’ ఆటగాడికి ప్రపంచం అర్జెంటీనా తరఫున రెండో స్థానమే ఇచ్చింది! 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ఒక్కటే అతనికి కాస్త ఊరటనిచ్చే విషయం. 31 ఏళ్ల వయసులో మరో ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశం ఉన్నా అతను దానిని వద్దనుకున్నాడు. తిరిగొస్తాడా..! మెస్సీ అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఓటమి కారణంగా ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తుండగా, మరో వరల్డ్ కప్ ఆడినా అతని అంతర్జాతీయ కెరీర్‌కు పెద్దగా లాభం లేదని మరి కొందరు చెబుతున్నారు. అర్జెంటీనా సహచరులు రొమెరో, అగ్వెరో, హిగుయెన్ మాత్రం మెస్సీ లేని జట్టును ఊహించలేమని, అతను మళ్లీ ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. జట్టు మేనేజర్ గెరార్డో వ్యాఖ్యలు కూడా మెస్సీని ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించినట్లు తమకే తెలీదని ఆయన మీడియా సమావేశంలో చెప్పడం విశేషం. ‘మేం ప్రపంచ కప్ అర్హత పోటీలు ఆడుతున్నాం. వీటిని అర్ధాంతరంగా వదిలేసి అతను వెళ్లిపోలేడు. అసలు కొనసాగకపోవడానికి తగిన కారణం కనిపించడం లేదు. అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఫైనల్లో ఓటమి ఎవరినైనా బాధిస్తుంది’ అని గెరార్డో వ్యాఖ్యానించారు. -
మెస్సీ మ్యాజిక్
► ఫైనల్లో అర్జెంటీనా ► సెమీస్‌లో అమెరికాపై ఘన విజయం ► కోపా అమెరికా కప్ హూస్టన్: వ్యూహాత్మక కదలికలు... సహచరులతో చక్కని సమన్వయం... ప్రత్యర్థులను బురిడి కొట్టించే షార్ట్ పాస్‌లతో అలరించిన స్టార్ స్ట్రయికర్ లియోనల్ మెస్సీ... కోపా అమెరికా కప్‌లో మరోసారి మ్యాజిక్ చేశాడు. కీలక సమయంలో గోల్ సాధించడంతో పాటు సహచరుల గోల్స్‌లోనూ ప్రముఖ పాత్ర పోషించడంతో... బుధవారం జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 4-0తో అమెరికాపై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. లావెజ్జీ (3వ ని.), మెస్సీ (32వ ని.), హిగుయాన్ (50, 86వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. 1993 తర్వాత ఇంతవరకు కోపా టైటిల్‌ను గెలవని అర్జెంటీనా.... గతేడాది ఫైనల్‌కు చేరినా చిలీ చేతిలో ఓడింది. దీంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అర్జెంటీనాకు నిలకడ విజయాలు అందిస్తున్న మెస్సీ... అమెరికాపై కూడా తన ప్రభావాన్ని చూపెట్టాడు. రెండు ఫ్లాంక్ల నుంచి అటాకింగ్ మొదలుపెట్టడంతో ఆరంభంలో అమెరికా డిఫెన్స్ కాస్త తడబడింది. దీంతో మూడో నిమిషంలో బనేగా ఇచ్చిన కార్నర్ పాస్‌ను లావెజ్జీ నేర్పుగా నెట్లోకి పంపి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తర్వాత యూఎస్ స్ట్రయికర్లు.. అర్జెంటీనా రక్షణశ్రేణిని ఛేదించినా గోల్స్ మాత్రం చేయలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాక్‌లైన్ నుంచి మెస్సీ ఇచ్చిన పాస్‌ను లావెజ్జీ వృథా చేశాడు. కానీ మరో 29 నిమిషాల తర్వాత బెకర్మెన్, క్రిస్‌లు సమన్వయం తప్పడంతో బంతిని అందుకున్న మెస్సీ 26 గజాల నుంచి కొట్టిన ఫ్రీకిక్ గోల్ పోస్ట్‌ను ఛేదించింది. అంతర్జాతీయ కెరీర్లో మెస్సీకి ఇది 55వ గోల్. రెండో అర్ధభాగం మొత్తం యూఎస్.. మెస్సీని లక్ష్యంగా చేసుకుంది. దీంతో చిన్నచిన్న పాస్‌లను సహచరులకు అందిస్తూ స్కోరు చేసే అవకాశాలు కల్పించాడు. ఫలితంగా ఐదు నిమిషాల తర్వాత ఆఫ్‌సైడ్ నుంచి యూఎస్ ఆటగాళ్లను తప్పిస్తూ లావెజ్జీ ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ ఎలాంటి తేడా లేకుండా లక్ష్యాన్ని చేర్చాడు. దీంతో యూఎస్‌పై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. మరో 36 నిమిషాల తర్వాత బ్రిన్బామ్ చేసిన ఘోర తప్పిదం అర్జెంటీనాకు నాలుగో గోల్ తెచ్చిపెట్టింది. 20 గజాల దూరం నుంచి మెస్సీ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను హిగుయాన్ అంతే అద్భుతంగా నెట్లోకి పంపడంతో అమెరికా నివ్వెరపోయింది. కొలంబియా, చిలీల సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో... ఆదివారం జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. -
సీజన్ మారింది
ఇక తడుద్దాం గోల్స్ వర్షంలో! మూడు నెలల పాటు టి20 క్రికెట్ వేడిని ఆస్వాదించిన క్రీడాభిమానుల కోసం కొత్త పండుగలు రాబోతున్నాయి. ఇక బౌండరీల స్థానంలో రాబోయే నెల రోజులు గోల్స్ వర్షం కురవబోతోంది. అవును... సీజన్ మారిపోయింది. క్రీడాభిమానుల కోసం ఫుట్‌బాల్‌లో రెండు పెద్ద సంబరాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచకప్‌తో సరిసమానంగా... ప్రతి క్రీడాకారుడూ ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్, యూరో కప్ రెండూ ఒకేసారి జరగబోతున్నాయి. కోపా అమెరికా కప్ ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకంగా ఈ సెంటినరీ కప్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 3 నుంచి 26 వరకు అమెరికాలో ఈ కప్ జరుగుతుంది. అమెరికా ఖండాల్లోని అన్ని ప్రధాన జట్లు బరిలోకి దిగే ఈ టోర్నీ ద్వారా మెస్సీ మెరుపులు మరోసారి చూడొచ్చు. ఇక యూరోప్‌లో ఫుట్‌బాల్ అభిమానులంతా ప్రాణం పెట్టి చూసే యూరో కప్ ఈ నెల 10 నుంచి జులై 10 వరకు ఫ్రాన్స్‌లో జరుగుతుంది. 24 జట్లు కప్ కోసం అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు టోర్నీల ద్వారా కావలిసినంత కిక్కే కిక్కు..! అటు కోపాలో మెస్సీ మెరుపులు చూడొచ్చు... ఇటు యూరోలో రొనాల్డో మ్యాజిక్‌ను ఆస్వాదించొచ్చు. -సాక్షి క్రీడావిభాగం -
మెస్సీని మించినోడు...
న్యూఢిల్లీ: ప్రతీ ఫార్మాట్లో పరుగుల ప్రవాహం సాగిస్తూ ప్రపంచ క్రికెట్‌ను ఊపేస్తున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లి ‘విలువ’ మరోసారి వెల్లడైంది. ‘స్పోర్ట్స్ ప్రొ’ మ్యాగజైన్ సర్వే ప్రకారం ‘అత్యధిక మార్కెటింగ్ సామర్థ్యం ఉన్న క్రీడాకారుల’లో కోహ్లికి మూడో స్థానం దక్కింది. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి కోహ్లి ఈ స్థానంలో నిలవడం విశేషం. ఎన్బీఏ ఆటగాడు స్టీఫెన్ కర్రీ, ఫ్రెంచ్ ఫుట్‌బాలర్ పాల్ పోగ్బా స్పోర్ట్స్ ప్రొ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టాప్-50లో చోటు దక్కించుకున్న మరో భారత ప్లేయర్ సానియా మీర్జా కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల ప్రదర్శన, వయసు, పాపులార్టీ, ఇతర దేశాల్లోనూ ఉన్న గుర్తింపు, వారితో ఉన్న బ్రాండింగ్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అధ్యయనం చేసే స్పోర్ట్స్ ప్రొ గత ఏడేళ్లుగా ఈ జాబితాను ప్రకటిస్తోంది. -
రక్షణ కోసం పాక్‌కు వెళ్లిన చిన్నారి 'మెస్సీ'
స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మోస్సీ చేసిన ఒక్క ట్విట్‌తో ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడైన ఆఫ్ఘన్ కుర్రాడు ముర్తజా అహ్మదీ(5)కు బెదిరింపులు ఎక్కువ అవ్వడంతో పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. మెస్సీ సాకర్ మ్యాచ్‌లో ధరించే టీ షర్ట్ తరహాలో ప్లాస్టిక్ కవర్‌తో రూపొందించిన షర్టును ధరించిన బుడతడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఎప్పటికైనా మెస్సీ అంతటి ఆటగాడిగా కావాలని ఎన్నో కలలు కంటున్న అతని కుటంబానికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేదేమీలేక ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు కుటుంబంతో సహా వెళ్లిపోయినట్టు బాలుడి తండ్రి ముహమ్మద్ ఆరిఫ్ ఆహ్మదీ తెలిపాడు. ప్రస్తుతం క్వెట్టాలో ఉన్న వారు పాక్‌లో శాశ్వత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 'రోజుకు 20 నుంచి 30 వరకు తెలియని వ్యక్తు నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. నా కుమారుడికి ఖురాన్ నేర్పించకుండా ఫుట్‌బాల్ ఎందుకు నేర్పిస్తున్నావు' అని బెదిరంచేవారని బాలుడి తండ్రి ముహమ్మద్ ఆరిఫ్ ఆహ్మదీ తెలిపారు. ప్రాణ రక్షణ కోసం మా కుటుంబంతో సహా ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్‌కు 40 రోజుల కింద వచ్చామని తెలిపాడు. బాలుడు ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన టీ షర్టు వేసుకున్న ఫోటోను మెస్సీ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ అభిమాని పంపిన సమాచారంతో ఆ స్టార్ ప్లేయర్ ఆ ట్విట్ చేశారు. ఇరాన్లో ఓ బాలుడు అంటూ ..ట్విట్ చేశారు. కానీ, నిజానికి ఆ బాలుడు ఇరాన్‌కు చెందకపోయినా ఆ ఒక్క ట్విట్ తో ఫేమస్ అయిపోయాడు. ముర్తజా అహ్మదీ కుటుంబం అఫ్ఘనిస్తాన్ లోని మారుమూల జగోరీ అనే గ్రామంలో నివాసం ఉంటోంది. పాకిస్తాన్లో తమ బంధువుల ఇంటికి సమీపంలో బాలుడి కుటుంబం ప్రస్తుతం ఉంటోంది.'ఐ లవ్ మెస్సీ ఎప్పటికైనా మెస్సీని కలుస్తా' అని ఇంటి బయట ఫుట్ బాల్ ఆడుతూ కనిపించిన బుడతడు అన్నాడు. -
మెస్సీ, రోనాల్డో కంటే అతనే బెస్ట్!
గోథెన్ బర్గ్(స్వీడన్): తన దృష్టిలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ, పోర్చుగల్ దిగ్జజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డ్ లు అత్యుత్తమ ఆటగాళ్లు కానేకాదని బ్రెజిల్ లెజెండ్ రాబొర్టో కార్లోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచమంతా వారిద్దర్ని అత్యుత్తమ ఆటగాళ్లుగా భావిస్తున్నా.. వారు తమ తమ జట్లుకు సాధించి పెట్టింది ఏమీ లేదంటూ కార్లోస్ ఎద్దేవా చేశాడు. ఐసీఎల్(ఇండియన్ సూపర్ లీగ్)లో ఢిల్లీ డైనమాస్ కు ఆటగాడిగా, మేనేజర్ గా కొనసాగుతున్న కార్లోస్.. తన దృష్టిలో ఫుట్ బాల్ లో చెప్పుకోదగిన ఆటగాడు ఎవరైనా ఉంటే అది నెయమార్ మాత్రమేని స్పష్టం చేశాడు. 'లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డ్ లు గొప్ప ఆటగాళ్లుగా ప్రపంచలోని ఫుట్ బాల్ అభిమానులు అనుకుంటారు. నా దృష్టిలో వారికంటే నెయమార్ ఓ గొప్ప ఆటగాడు. బ్రెజిల్ ను నెయమార్ అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లడమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది' అని కార్లోస్ తెలిపాడు. -
'మెస్సీ గోల్స్ చేయకపోయినా సంతోషంగా ఉంది'
కాన్సెప్సియన్ (చిలీ):కోపా అమెరికా ప్రపంచకప్ లో అర్జెంటీనా ఫైనల్ కు చేరడం పట్ల కోచ్ జెరార్డో మార్టిన్ సంతోషం వ్యక్తం చేశాడు. మంగళవారం పరాగ్వేతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో మెస్సీ చెలరేగడంతో అర్జెంటీనా తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మెస్సీది కీలకపాత్రే కానీ వ్యక్తిగతంగా గోల్స్ మాత్రం అతని ఖాతాలో లేవు. జట్టు సహచరులకు పాస్ లను అందిస్తూ జట్టు ఐదు గోల్స్ సాధించడంలో మాత్రం ప్రముఖ పాత్ర పోషించాడు. దీనిపై ఆ జట్టు కోచ్ మార్టిన్ తనదైన శైలిలో స్పందించాడు. తమ స్టార్ ఆటగాడు గోల్స్ చేయకపోయినా తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించాడని కొనియాడాడు. డీప్ ఫార్వర్డ్ లో విఫలమైన మెస్సీ ఆ తరువాత మిడ్ ఫీల్డ్ కు వెళ్లాడని.. ఆ క్రమంలోనే బంతిని ప్రత్యర్థి జట్టుకు అందనీయకుండా పాస్ లు అందించిన తీరు అమోఘమన్నాడు. దీంతో మెస్సీ గోల్స్ చేయడంలో ప్రత్యక్ష పాత్ర పోషించకపోయినా.. తమకు సంతోషాన్నిచ్చాడని మార్టిన్ పేర్కొన్నాడు. శనివారం జరిగే తుదిపోరులో చిలీతో అర్జెంటీనా ఆమీతుమీ తేల్చుకోనుంది. -
‘టార్చ్’ టార్చర్!
సరదాగా... ఈ ఫొటోలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ మీద పడిన ఆకుపచ్చ రంగు లైట్ చూశారా! కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మెస్సీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అభిమానులు ఇలా లైట్ వేశారు. అయితే యూరోప్‌లోని అనేక లీగ్‌లలో ఆటగాళ్లను దెబ్బతీయడానికి అభిమానులు ఈ ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. సాధారణంగా మన దగ్గర ఎరుపు రంగులో ఇలాంటి టార్చ్‌లు దొరుకుతాయి. దీని కాంతి మీద పడితే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ పెద్దగా ప్రమాదం ఉండదు. ఈ ఆకుపచ్చ లైట్ నేరుగా క ళ్ల మీద పడితే చాలా ప్రమాదం అట. కొద్దిసేపు కంటిచూపు పోతుందట. వెయ్యి రూపాయలకు దొరికే ఈ లైట్ ద్వారా రెండు కిలోమీటర్ల దూరం కూడా కాంతి పడుతుందట. స్టేడియాలలోకి గ్రీన్ టార్చ్ తేవడంపై నిషేధం ఉంది. మెస్సీ ఉదంతం నేపథ్యంలో ఇకపై మరింత జాగ్రత్తగా అభిమానులను తనిఖీ చేస్తారట. -
సంబరాల్లో జర్మనీ!
-
నాకు ఏదీ ఓదార్పు ఇవ్వలేదు!
అర్జెంటీనా: మరోసారి కప్ గెలుచుకునే సువర్ణావకాశం చేజారిందనే ఆవేదనలో ఉన్నాడు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. 'అసలు నాకు ఈ ప్రైజ్ అక్కర్లేదు. నేను దేన్నీ లెక్కచేయను. నాకు ఏదీ ఓదార్పును ఇవ్వలేదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే చాలామంది తమ జట్టు ఈ టోర్నీలో చూపిన ప్రతిభపై సంతోషం వ్యక్తం చేసినా ఇంకొందరు మాత్రం తమ కోపాన్ని విధ్వంసకర రీతిలో వ్యక్తం చేశారు. ఫైనల్ అవగానే కొందరు ఫలితంతో సంబంధం లేకుండా తమ దేశ పతాకాలతో తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. మెస్సీ బృందాన్ని పొగుడుతూ బాణసంచా కాల్చారు. జట్టు సభ్యులతో స్వదేశానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ.. తనకు ఎవరి ఓదార్పు అక్కర్లేదని స్పష్టం చేశాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచిన లియొనల్ మెస్సీకి గోల్డెన్ బాల్ అవార్డు ఇవ్వడంపై అర్జెంటీనా దిగ్గజం డీగా మారడోనా మండిపడటంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మెస్సీ ఆ అవార్డుకు అర్హుడు కాడని విమర్శించాడు. ఒకవేళ సాధ్యమైతే అతనికి స్వర్గాన్ని బహూకరిస్తానని వ్యంగ్యోక్తి విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదురుతోంది. 'అసలు నాకు ఈ ప్రైజ్ అక్కర్లేదు. నేను దేన్నీ లెక్కచేయను. నాకు ఈ ప్రైజ్ ఓదార్పు ఇవ్వలేదు' అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు మెస్సీ. -
బ్రెజిల్.. 'మూడై'నా దక్కాలని..!
-
మెస్సీ నా ఫేవరేట్
- కృతి సనన్ నాకు ఆటలంటే చాలా ఇష్టం. అందులోనూ ఫుట్‌బాల్ అంటే పిచ్చి. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్ట్రైకర్ మెస్సీకి నేను వీరాభిమానిని. మెస్సీ అర్జెంటీనాకు కప్ ఇస్తాడని కోరుకుంటున్నా. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నా’ అంటూ సాకర్ ఫీవర్ తనకెంతుందో చాటుకుంది క్యూట్‌గాళ్ కృతి సనన్. ఇలా టాలీవుడ్లోకి అడుగుపెట్టిందో లేదో.. మహేష్ సరసన నటించే చాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. శుక్రవారం నగరంలో సందడి చేసింది. టిస్సాట్ వాచ్‌ల క్విక్స్టార్ వరల్డ్‌కప్ కలెక్షన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో ముచ్చటిస్తూ టాలీవుడ్లో సక్సెస్ సాధించడమే తన లక్ష్యమని చెప్పింది. మొదటి సినిమా మహేష్‌తో కలసి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. మహేష్ అందగాడు మాత్రమే కాదు.. మంచి స్నేహశీలని కితాబిచ్చింది. ‘ సుధీర్‌వర్మ డెరైక్షన్‌లో నాగచైతన్య సరసన నటించబోతున్నా. తొందర్లోనే సెట్స్‌పైకి వెళ్తున్న ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అంటూ అప్‌కమింగ్ మూవీ ముచ్చట్లు వెల్లడించింది. వాచ్‌లు ధరించడం చాలా ఇష్టమన్న కృతి.. టిస్సాట్ వాచ్‌ల కలెక్షన్ మనసు దోచేసిందని మురిసిపోయింది. - సుమన్ -
మన ‘మెస్సీ’ల కోసం...
నెల రోజులుగా ఉదయాన్నే ఏ పేపర్ తీసినా... ఏ టీవీ ఆన్ చేసినా ఫుట్‌బాల్... ఫుట్‌బాల్... ఇదొక్కటే మంత్రం. ఆటలోని మజాను ఆస్వాదిస్తున్న అనేక మంది చిన్నారులు... తామూ మెస్సీలా మెరవాలని తపిస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డను నెయ్‌మార్‌ను చేసేదెలా అని ఆలోచిస్తున్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆడుతున్న దేశాలతో పోలిస్తే ఆటలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్ ఉంటుందా అనే భయం కూడా ఉంది. ఫుట్‌బాల్ ఆడాలనే ఆసక్తి ఉన్నా... ఎక్కడ ఎలా ఆడాలో తెలియని వాళ్లు అనేక మంది. వాళ్లందరి కోసం ఈ కథనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు, పట్టణాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న అవకాశాలపై కథనం. - మొహమ్మద్ అబ్దుల్ హాది ఫుట్‌బాల్‌కు గతంలో పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్‌తో పాటు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల్లోనూ ఈ ఆట పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న కోర్టు వివాదాలు సంఘం కార్యకలాపాలకు అడ్డంకిగా మారాయి. ఫలితంగా టోర్నీలు లేక, ఆటగాళ్లు వెలుగులోకి రాక ఫుట్‌బాల్‌ను చరిత్రలోనే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇప్పుడు ఆ కారు చీకట్లు తప్పుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత ఇటీవలే ఆంధ్రప్రదేశ్ (సమైక్య) జట్టు జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పాల్గొంది. గత వారం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసమే అంటూ రిక్రూట్మెంట్ ప్రకటన ఇచ్చి ఆటను ప్రోత్సహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని ఉద్దేశాన్ని చాటి చెప్పింది. ఇవన్నీ ఆటకు సంబంధించి ఇరు రాష్ట్రాల్లో కలిగిన శుభపరిణామాలు. విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో సంఘాలు ప్రత్యేకంగా పని చేయబోతున్న కారణంగా కాస్త మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఫుట్‌బాల్ ఆటకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. చాలా తక్కువ చోట్ల మాత్రమే ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. ఇప్పుడు ఏ మాత్రం శిక్షణ కొనసాగుతున్నా...టోర్నీలు నిర్వహిస్తున్నా అదంతా ఏపీ ఫుట్‌బాల్ సంఘం కార్యకలాపాల్లో భాగంగానే జరుగుతున్నాయి. వివిధ జిల్లా సంఘాలు చొరవ చూపించి ఆటను నడిపించుకుంటున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట, పరిచయాలతో క్లబ్ లీగ్, స్కూల్ లీగ్ టోర్నీలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయా ఆటగాళ్లకు గుర్తింపు లభించకపోయినా ఆటపై ఆసక్తితో చాలా మంది ఈ టోర్నీల్లో పాల్గొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సెలక్షన్స్ ద్వారా పూర్తి స్థాయి రాష్ట్ర జట్లను నిర్మించుకునేందుకు అవకాశం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఫుట్‌బాల్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఎ డివిజన్ స్థాయిలో 27 క్లబ్‌లు, బి డివిజన్ స్థాయిలో 11 క్లబ్‌లు ఉన్నాయి. అండర్-14 మొదలు సీనియర్ స్థాయి వరకు క్యాంప్‌లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే, మున్సిపల్ గ్రౌండ్లలో శిక్షణ లభిస్తుంది. మహిళా ఫుట్‌బాల్ జట్టు కూడా ఇక్కడ ఉంది. విజయవాడలో 12 జట్ల మధ్య రెగ్యులర్‌గా టోర్నీల నిర్వహణ జరుగుతుంది. శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 9 జట్ల మధ్య క్లబ్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఇక గుంటూరు జిల్లా కూడా చురుగ్గానే ఉంది. ఇక్కడ కూడా రెగ్యులర్‌గా లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాత్రం శాప్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. దాదాపు 200 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండటం విశేషం. వీరిలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కూడా ఉండటం విశేషం. జిల్లాలో 16 జట్లతో రెగ్యులర్‌గా టోర్నీలు జరుగుతున్నాయి. ఇతర చోట్ల చూస్తే తూర్పు, పశ్చిమ గోదావరిల్లో మాత్రం పెద్దగా ఫుట్‌బాల్ కనిపించడం లేదు. ఏలూరు, కాకినాడల్లో కొంత మంది ఆటపై ఆసక్తి చూపిస్తున్నా...ఒక క్రమపద్ధతిలో లేదు. అదే విధంగా ప్రకాశం జిల్లా కూడా ఆటలో వెనుకబడే ఉంది. అయితే ఒంగోలులో మాత్రం స్థానిక చర్చి భాగస్వామ్యంతో ఏటా రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం... విశాఖపట్నం - జగన్నాథరావు (99121 82717) శ్రీకాకుళం - రమణ (94406 77121) విజయనగరం - లక్ష్మణ్ రావు (99632 37596) విజయవాడ - కొండా (94411 20228) తూర్పు గోదావరి - కిషోర్ (98480 41486) నెల్లూరు - శాప్ కోచ్ శ్రీనివాస్ (94402 75291) రాయలసీమలో ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫుట్‌బాల్ సంస్కృతి ఉంది. ముఖ్యంగా రాయలసీమ ఫుట్‌బాల్ టోర్నీ పేరుతో రెగ్యులర్‌గా టోర్నమెంట్ నిర్వహణ కొనసాగుతోంది. ఇక్కడి రెండు జిల్లాల్లో ప్రభుత్వ పరంగా ఆటకు అవకాశం ఉంటే...మరో జిల్లాలో ప్రైవేట్ ఆధ్వర్యంలోనే అయినా అద్భుతమైన సౌకర్యాలు ఉండటం విశేషం. కర్నూల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాయ్ సెంటర్లో ఫుట్‌బాల్ శిక్షణ సాగుతోంది. ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. జిల్లాలో 14 జట్లతో టోర్నీ నిర్వహణ సాగుతోంది. ఇక్కడ రెండు మహిళా జట్లు కూడా ఉన్నాయి. కడప జిల్లాలో 12 జట్లు లీగ్స్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్లో ఇటీవల మెరుగైన సౌకర్యాలతో శిక్షణ అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో మంచి ఆసక్తి ఉన్నా...ఇప్పుడు కొంత తగ్గింది. ప్రస్తుతం ఎనిమిది జట్లు అక్కడ లీగ్‌ల కోసం నమోదై ఉన్నాయి. అనంతపురం జిల్లాది మాత్రం ఫుట్‌బాల్‌కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. మాంచూ ఫై స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్న వేర్వేరు క్రీడాంశాల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ఇక్కడే దాదాపు వేయిమంది వరకు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉన్న హాస్టల్లో 45 మంది ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇదే కాకుండా జిల్లాలోని ప్రతీ మండలంలో కనీసం ఒక బాలుర, ఒక బాలికల జట్టు ఉండేలా ప్రణాళికలతో ఫై అకాడమీ ముందుకు సాగుతోంది. గత కొన్నేళ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగినవి కొన్ని టోర్నీలే అయినా ప్రతి చోటా అనంతపురం ఆటగాళ్లే అద్భుతంగా రాణించారు. మరిన్ని వివరాల కోసం... అనంతపురం - మాంచూ ఫై అకాడమీ, భాస్కర్ (98667 14822) కర్నూల్ - సాయ్ సెంటర్, రాజు (98852 40365) కడప - హసన్ (93474 10724) చిత్తూరు - జగన్నాథరెడ్డి (91771 42739) తొలి ప్రైవేట్ అకాడమీ... ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 22 మంది కాంట్రాక్ట్ కోచ్‌లు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రౌండ్లు, స్టేడియంలను బట్టి నిర్ణీత సమయం ప్రకారం వారు శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు బేసిక్స్ నేర్చుకునేందుకు ఇది సరిపోతుంది. అయితే ఫుట్‌బాల్‌లో సౌకర్యాలు, శిక్షణకు సంబంధించి ఆయా జిల్లా క్రీడాభివృద్ధి అధికారుల (డీఎస్డీఓ) పాత్ర నామమాత్రంగానే ఉంటోంది. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ (కడప), కర్నూల్ సాయ్ హాస్టల్, ఖమ్మం ట్రైబల్ హాస్టల్లలో మాత్రమే హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఫుట్‌బాల్‌లో కోచింగ్ లభిస్తోంది. అయితే తొలి సారి నిజామాబాద్‌లో ఒక ప్రైవేట్ ఫుట్‌బాల్ అకాడమీ ఇటీవల ఏర్పాటయింది. హాస్టల్ సౌకర్యంతో సహా పూర్తి స్థాయిలో ఈ అకాడమీ ఫుట్‌బాల్‌పైనే ఫోకస్ పెడుతుండటం విశేషం. తెలంగాణలో ఒకప్పుడు ఒలింపిక్ క్రీడాకారులను అందించిన హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు ఆనాటి కళ లేదు. అయితే గతంతో పోలిక లేకున్నా...ఇప్పటికీ కొన్ని మైదానాల్లో ఫుట్‌బాల్ ప్రాణంగా భావించే ఆటగాళ్లు, కోచ్‌లు ఉన్నారు. ఎల్బీ స్టేడియం, జింఖానా మైదానం, బొల్లారం, తిరుమలగిరి, అల్వాల్, సీసీఓబీ, బార్కస్ తదితర గ్రౌండ్లలో పాటు కొన్ని జీహెచ్ఎంసీ మైదానాల్లో చురుగ్గా మ్యాచ్‌లు జరుగుతు న్నాయి. ఆసక్తి ఉన్నవారు నేర్చుకునేందుకు, రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఆయా చోట్ల మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని సైనిక్‌పురి భవాన్స్ కాలేజీ మైదానంలో, అల్వాల్ లయోలా కాలేజీలో ఫుట్‌బాల్ కొనసాగుతోంది. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ నుంచి కూడా మంచి ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 15 జట్లు ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ అంతర్ జిల్లా టోర్నీ భారీ ఎత్తున జరిగింది. వరంగల్‌లో ఒక మహిళా జట్టు సహా 9 టీమ్‌లు ఉన్నాయి. గతంలో చురుగ్గా ఉన్న మెదక్‌లో ప్రస్తుతం ఆ జోరు మందగించింది. నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో కూడా పెద్దగా ఫుట్‌బాల్ మనుగడలో లేదు. ఖమ్మం జిల్లాలో అసోసియేషన్ తరఫున పెద్దగా ఆట లేదు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన హాస్టల్లో ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ కోచ్ ఉన్నారు. నిజామాబాద్‌లో 11 జట్లతో లీగ్ కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం... రంగారెడ్డి - జాన్ విక్టర్ (77025 36075) ఆదిలాబాద్ - రఘునాథ్ (98494 44744) నిజామాబాద్ - నాగరాజు (98855 17151) వరంగల్ - సురేందర్ (98858 75082) కరీంనగర్ - గణేశ్ (99088 39896) మెదక్ - నాగరాజు (93473 44440) నల్లగొండ - కుమార్ (99129 75877) మహబూబ్‌నగర్ -వెంకట్ (9440075365) హైదరాబాద్ ఎల్బీ స్టేడియం:హరి (90000 90701) జింఖానా మైదానం: అలీముద్దీన్ (99893 35840) తిరుమలగిరి: టోనీ (94927 28100) -
మైదానంలోనే కాదు.. అంతర్జాలంలోనూ ఆడుకున్నారు!
-
సాక్షి స్పోర్ట్స్ 10th July 2014
-
సాక్షి స్పోర్ట్స్ 9th July 2014
-
బ్రజిల్.. గాయంతోనే వెనుతిరిగి..!
-
అర్జెంటీనా ఏళ్ల కలను మెస్సీ నెరవేర్చేనా?!