
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్‌ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది.
ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది.
చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు..
Comments
Please login to add a commentAdd a comment