Closing ceremony
-
ఘనంగా ముగింపు వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చివరి మూడు రోజుల్లో మ్యూజికల్ నైట్‌తో పాటు నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాలు, రెస్టారెంట్లు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో 120 స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. భారీ స్థాయిలో డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో వంటి కార్యక్రమాలుంటాయన్నారు. 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్ ఆధ్వర్యంలో సినీ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని వివరించారు. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లక్ష మంది మహిళలతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం పెద్ద ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్షో ఉంటుందని, ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో ఐమాక్స్ హెచ్ఎండీఏ మైదానంలో మ్యూజికల్ నైట్ జరుగుతుందని తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి పీవీమార్గ్ వరకు ఐదు ప్రాంతాల్లో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇదే మార్గంలో ఫుడ్ స్టాల్స్, హస్తకళల స్టాల్స్, పలు శాఖల స్టాల్స్‌తో పాటు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్యాంక్‌బండ్ నుంచి రాజీవ్ గాంధీ జంక్షన్, సచివాలయం, ఇందిరా గాంధీ విగ్రహం, ఐమాక్స్ జంక్షన్ నుంచి పీవీ నర్సింహారావుమార్గ్ వరకు పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆమె అధికారులను కోరారు. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు తాగునీరు, టాయ్లెట్ల సదుపాయం, భద్రత కల్పించడం, పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ వెల్లడించారు. -
ముగిసిన పారిస్ ఒలింపిక్స్
-
Paris Olympics 2024: ముగిసిన విశ్వక్రీడలు.. క్లోజింగ్ సెర్మనీ అదరహో (ఫోటోలు)
-
Tom Cruise: ఘనంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్.. టామ్ క్రూస్ సందడి (ఫోటోలు)
-
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
మిస్ అండ్ మిసెస్ గుజరాతీ తెలంగాణ 2024 గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుక (ఫోటోలు)
-
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రానా సందడి (ఫొటోలు)
-
ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్
సాక్షి, తాడేపల్లి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. ప్రభుత్వ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు నిలిచింది. సర్వేలో విశేషంగా పాల్గొన్న ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెగా సర్వేతో వైఎస్సార్సీపీ క్యాడర్ మరింత ఉత్సాహవంతమైంది. వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఎం జగన్ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి.. "జగన్ నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇంత భారీ పబ్లిక్ సర్వే చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ సాహసం చేసింది. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. ఈ సర్వేతో వైఎస్సార్ సీపీ రాజకీయంగా బలంగా ఉందని నిరూపించింది. ఈ మెగా సర్వే అన్ని రకాలుగా పారదర్శకంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదు. తక్కువ సమయంలో ఈ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామస్థాయిలో కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న వాస్తవాలు తెలుసుకున్నాము. ఇంత భారీ సర్వే చేయగలమా అనుకున్నాం కానీ సీఎం జగన్ నేతృత్వంలో విజయవంతం పూర్తి చేసాము. సర్వే ప్రారంభంలో మా అధినేత సీఎం జగన్ తన విజన్ ని నేతలకు పూర్తిగా వివరించడంతో దానికి తగినట్లుగా పనిచేసాము. ఈ సర్వేలో గత ప్రభుత్వం చేసిన పనితీరును మా ప్రభుత్వ పని తీరును గురించి ప్రజలని అడిగి తెలుసుకున్నాము. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. మొత్తం ఆరు లెవల్స్ లో ఈ మెగా సర్వే పూర్తి చేసాము." అని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో ఓ చరిత్ర "రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మెగా సర్వేలో కకోటి 45 లక్షల కుటుంబాల మద్దతు సాధించి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వైఎస్సార్ సిపీ ఓ చరిత్ర సృష్టించింది. 7 లక్షల మంది గృహసారథులు, నాయకల ద్వారా ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయ్యింది. ప్రజల్లో సీఎం జగనన్న ప్రభుత్వం మీద మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారి భవిష్యత్తు కోసం మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం నమ్ముతున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజల స్వచ్చందంగా సమాధానాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఈ మెగా సర్వే ఫలితాలు ప్రదర్శిస్తాము. సిఎం జగన్ ఇచ్చే ప్రతి పథకం ప్రజలకి నేరుగా అందుతోంది." "చంద్రబాబు సంస్కార హీనుడిలా మాట్లాడటం సరికాదు. ప్రజల ఇష్టంతోన్ వారి ఇళ్లకు స్టిక్కర్ అంటించాము. అన్ని పార్టీల ప్రజలకి పథకాలు అందుతున్నాయి. మే 9 నుండి జగన్నన్నకి చెబుదాం అనే నూతన కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము." అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే.. "ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దత్తు వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం అయ్యింది. సిఎం జగన్ పాలనకు 80 శాతం ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రతి గడపకి మా నాయకులు వెళ్లి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నారు. కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలో సర్వే అద్భుతంగా జరిగింది. అవినీతి, వివక్ష లేని పాలనకు ప్రజలు మద్ధతుగా నిలిచారు.. ఇదే సర్వేలో స్పష్టమైంది. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా. తాము 15 వేల సచివాలయల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాము. సీఎం జగన్ చేస్తున్న మంచికి ప్రజల్లో ఆమోదం, సంతృప్తి ఉంది." అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలకు చేరువ "దేశంలోనే ఇలాంటి సర్వే చేసిన మొదటి ప్రభుత్వం మాది. గతంలో 40 ఏళ్ళు అనుభవం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. సీఎం జగనన్న చెప్పే మాటకు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది. కేవలం 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలను కలిసాము.ఇలాంటి కార్యక్రమం చేసే దమ్ము చంద్రబాబుకి ఉందా.. కులం, మతం అతీతంగా వైసీపీ పాలన చేస్తోంది. ఈ మాట చంద్రబాబు ఒక్కసారైనా తన ప్రభుత్వ హయాంలో చెప్పగలిగారా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా సర్వేను విజయవంతం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం." అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజా మద్దతు పుస్తకం ప్రజాభిప్రాయానికి ప్రతీక. "ఇలాంటి ఆలోచన దేశంలో ఎలాంటి సీఎంకి రాలేదు. ప్రజలోకి నేరుగా వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద అభిప్రాయం తీసుకున్నాము. ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజలు అభిప్రాయం చెప్పారు. కులం, మతం చూడకుండా ఓటు వేయని వారికీ కూడా లబ్ది చేకూరుతోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజలను ఈ సర్వేలో కలిసాము. చంద్రబాబు లాగా గాల్లో లెక్కలు వైఎస్సార్ సీపీ ఎన్నటికీ చెప్పదు. సీఎం జగనన్న పరిపాలన మీద ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేను ప్రజలు విశేష స్థాయిలో అందరించారు." అని విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ వివరించారు. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి -
Bharat Jodo Yatra: హింసను ప్రేరేపిస్తున్నారు
శ్రీనగర్: ‘‘దేశంలో స్వేచ్ఛాయుత, లౌకిక విలువలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ నిత్యం దాడి చేస్తున్నాయి. వాటికి పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం నిరంతరం హింసను ప్రేరేపిస్తున్నాయి’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆ విలువల పరిరక్షణకే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు పునరుద్ఘాటించారు. జోడో యాత్ర సోమవారం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. సభలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని, షేర్ ఏ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో సభ నిర్వహించింది. దీనిలో తొమ్మిది విపక్ష పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విపరీతంగా కురుస్తున్న మంచులో తడుçÜ్తూనే రాహుల్ మాట్లాడారు. హింస ఎంతటి బాధాకరమో మోదీ లాంటివారికి ఎన్నటికీ అర్థం కాదంటూ ఆక్షేపించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీల హత్యోదంతాలను గుర్తు చేసుకున్నారు. ‘‘వారిక లేరని ఫోన్ కాల్స్ ద్వారానే తెలుసుకున్నా. ఆ దుర్వార్తలు విని విలవిల్లాడిపోయా. అలాంటి ఫోన్ కాల్స్ అందుకోవాల్సి రావడంలో ఉండే అంతులేని బాధను, నొప్పిని కశ్మీరీలు అర్థం చేసుకోగలరు. పుల్వామా వంటి ఉగ్ర దాడులకు బలైన ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలు అర్థం చేసుకోగలవు. నేను, నా చెల్లెలు అర్థం చేసుకోగలం. అంతేగానీ మతిలేని హింసను ప్రేరేపించే మోదీ, అమిత్ షా (కేంద్ర హోం మంత్రి), అజిత్ దోవల్ (జాతీయ భద్రతా సలహాదారు), ఆరెస్సెస్ నేతల వంటివాళ్లు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దాని తాలూకు బాధను వాళ్లెప్పుడూ అనుభవించనే లేదు’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సైనికుడు కావచ్చు, సీఆర్పీఎఫ్ జవాను కావచ్చు, కశ్మీరీ కావచ్చు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ వారు ఇక లేరనే దుర్వార్త మోసుకొచ్చే అలాంటి ఫోన్ కాల్స్‌కు శాశ్వతంగా తెర దించడమే జోడో యాత్ర లక్ష్యం. అంతే తప్ప నా స్వీయ లబ్ధి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. దేశ ప్రజల కోసం. దేశ పునాదులను నాశనం చేయజూస్తున్న భావజాలానికి అడ్డుకట్ట వేయడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. కశ్మీర్లో నడవాలంటే వారికి భయం బీజేపీ అగ్ర నేతలకు దమ్ముంటే తనలా జమ్మూ కశ్మీర్లో పాదయాత్ర చేయాలని రాహుల్ సవాలు విసిరారు. ‘‘అది వారి తరం కాదు. చేయలేరు. ఒక్కరు కూడా జమ్మూ కశ్మీర్లో నాలా నడవలేరు. ఎందుకంటే వారికి అంతులేని భయం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కశ్మీర్లో పాదయాత్ర వద్దని నాకు సలహాలొచ్చాయి. బులెట్ ప్రూఫ్ కార్లో చేయాలని స్థానిక యంత్రాంగమూ సూచించింది. నడిస్తే నాపై ఏ గ్రెనేడో వచ్చి పడొచ్చని హెచ్చరించింది. బహుశా నన్ను భయపెట్టడం వారి ఉద్దేశం కావచ్చు. కానీ నేను భయపడలేదు. నన్ను ద్వేషించేవారికి నా తెల్ల టీ షర్టు రంగు (ఎర్రగా) మార్చే అవకాశం ఎందుకివ్వకూడదని ఆలోచించా. ఈ రాష్ట్రం నా సొంతిల్లు. కశ్మీరీలు నావాళ్లు. వాళ్లతో కలిసి నడిచి తీరాలని నిర్ణయించుకున్నా. కశ్మీరీలు నాపై గ్రనేడ్లు విసరలేదు. హృదయపూర్వకంగా అక్కున చేర్చుకున్నారు. అంతులేని ప్రేమతో ముంచెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మనస్ఫూర్తిగా స్వాగతించి నన్ను తమవాణ్ని చేసుకున్నారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘నాకు లేనిదీ, బీజేపీ నేతలకున్నదీ భయమే. నిర్భయంగా జీవించడాన్ని మహాత్మా గాంధీ నుంచి, నా కుటుంబం నుంచి నేర్చుకున్నా’’ అన్నారు. కాంగ్రెస్ ర్యాలీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రాతో పాటు డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), సీపీఐ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్ నేతలు మాట్లాడారు. 22 పార్టీలకు ర్యాలీకి కాంగ్రెస్ ఆహ్వానం పంపగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, జేడీ(యూ) తదితర ముఖ్య పక్షాలు గైర్హాజరయ్యాయి. సోదరితో సరదాగా... భారీ భద్రత, యాత్ర, రాజకీయాలు, ప్రసంగాలు, విమర్శల నడుమ రాహుల్ కాసేపు సోదరి ప్రియాంకతో సరదాగా స్నోబాల్ ఫైట్ చేస్తూ సేదదీరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక వీడియోలో రాహుల్ రెండు మంచు ముక్కలను వెనక దాచుకుని ప్రియాంకను సమీపించి ఆమె తలపై కొట్టి ఆట పట్టించారు. ఆమె కూడా ఆయన వెంట పడి తలంతా మంచుతో నింపేశారు. తర్వాత జోడో యాత్ర క్యాంప్ సైట్ వద్ద, అనంతరం పీసీసీ కార్యాలయంలోనూ రాహుల్ జాతీయ జెండా ఎగురవేశారు. యాత్రలో తనతో పాటు కలిసి నడిచిన భారత యాత్రీలకు కృతజ్ఞతలు తెలిపారు. వణికించే చలిలోనూ ఇన్ని రోజులుగా కేవలం తెల్ల టీ షర్టుతోనే యాత్ర చేసిన రాహుల్ ఎట్టకేలకు సోమవారం జాకెట్ ధరించారు. తర్వాత పొడవాటి సంప్రదాయ బూడిద రంగు కశ్మీరీ ఫేరన్ ధరించి ర్యాలీలో, సభలో పాల్గొన్నారు. ఇదే సొంతిల్లు కశ్మీర్ తన సొంతిల్లని రాహుల్ పదేపదే గుర్తు చేసుకున్నారు. ‘‘రాష్ట్రంలో నడుస్తుంటే అప్పుడెప్పుడో సరిగ్గా ఇవే దారుల గుండా నా పూర్వీకులు కశ్మీర్ నుంచి అలహాబాద్ వెళ్లారన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. నేను నా ఇంటికి తిరిగొస్తున్నట్టు ఫీలయ్యా. ఎందుకంటే నాకంటూ ఓ ఇల్లు లేదు. చిన్నతనం నుంచీ ప్రభుత్వ ఆవాసాల్లోనే బతికాను. వాటిని నా ఇల్లని ఎప్పుడూ అనుకోలేకపోయాను. నా వరకూ ఇల్లంటే ఓ ఆలోచన. జీవన విధానం. కశ్మీరియత్ శివుని ఆలోచనా ధార. శూన్యత్వం. అహంపై పోరాడి గెలవడం. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. దీన్నే ఇస్లాంలోనూ ఫనా అన్నారు. అస్సాం, కర్నాటక, మహారాష్ట్ర... అన్ని రాష్ట్రాల్లోనూ ఈ భావధార ఉంది. దీన్నే గాంధీ వైష్ణో జనతో అన్నారు. నా పూర్వీకులు ఇక్కణ్నుంచి వెళ్లి అలహాబాద్‌లో గంగా తీరాన స్థిరపడి కశ్మీరియత్‌ను యూపీలో ప్రచారం చేశారు. అదే గంగా యమునా పవిత్ర సంగమం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నా ఇంటికి వెళ్తున్నట్టు అన్పిస్తోంది’ అంటూ జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించే ముందు తల్లి సోనియాకు, తనకు రాహుల్ మెసేజ్ చేశారని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఎవరేమన్నారంటే... ఎన్నికల యాత్ర కాదు భారత్ జోడో యాత్ర ఎన్నికల్లో గెలుపు కోసం కాదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దేశ ప్రజలనందరినీ ఒక్కటి చేయగలనని రాహుల్ పాదయాత్రతో నిరూపించారు – మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు లౌకిక పార్టీలన్నీ ఒక్కటవాలి బ్రిటిష్ పాలనపై ఐక్యంగా పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. అలాగే బీజేపీ పాలనపైనా పోరుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలి. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి పశ్చిమం నుంచి తూర్పుకూ... శాంతి, సౌభ్రాతృత్వాలు కోరుకునే వారికి దేశంలో కొదవ లేదని జోడో యాత్ర నిరూపించింది. దక్షిణం నుంచి ఉత్తరానికి చేసినట్టుగానే దేశ పశ్చిమ కొస నుంచి తూర్పుకు కూడా రాహుల్ పాదయాత్ర చేయాలి. నేను ఆయన వెంట నడుస్తా. ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ రాహుల్ ఓ ఆశాకిరణం రాహుల్‌గాంధీలో దేశానికి ఒక నూతన ఆశా కిరణం దొరికింది. – మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు విభజన రాజకీయాలే ముప్పు విభజన రాజకీయాలు దేశానికెప్పుడూ హానికరమే. వాటిని వ్యతిరేకిస్తూ నా సోదరుడు చేసిన యాత్రకు జనం వస్తారో లేదోనని అని నేను మొదట్లో అనుకున్నా. కానీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆద్యంతం వారు భారీగా తరలి వచ్చి సంఘీభావంగా నిలిచారు. ఐక్యతా స్ఫూర్తిని చాటారు. దేశమంతా యాత్రకు ఇంతగా మద్దతుగా నిలవడం నిజంగా గర్వకారణం. – ప్రియాంకా గాంధీ వద్రా చదవండి: కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్.. -
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. డ్యాన్స్ చేయనున్న బాలీవుడ్ నటి
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్‌ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది. ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
ఎల్బీ స్టేడియంలో వైభవంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు (ఫొటోలు)
-
వైభవంగా ముగింపు వేడుకలు
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో సోమవారం వైభవంగా జరిగింది. వేడుకలకు రాష్ట్రం నలు మూలల నుంచి విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సీఎం ఘనంగా సన్మానించారు. సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్ కుమార్‌రెడ్డి, భాగ్యరెడ్డి వర్మ వారసుడు అజయ్‌గౌతమ్, కొమురం భీం వారసుడు కొమురం సోనేరావు, కల్నల్ సంతోష్‌బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్, భూదాన్ రాంచంద్రారెడ్డి తనయుడు అరవింద్‌రెడ్డి, వనజీవి రామయ్య, రా వెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, మహ్మద్ హుసాముద్దీన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణ, ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్, సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్షీ బ్రదర్స్‌ను సన్మానించారు. సీఎం తాతయ్యా.. సూపర్.. ►స్క్రీన్‌పై కేసీఆర్ కనిపించిన ప్రతిసారీ విద్యార్థులు ‘సీఎం తాతయ్యా సూపర్’ అంటూ కేరింతలు కొట్టారు. సీఎం సభా వేదికపైకి వెళ్తుండగా ఆ దృశ్యాలు ప్లే అవుతున్న క్రమంలో విద్యార్థులు సెల్ఫీలు తీసుకున్నారు. ►వేడుకల్లో శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ►సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి ప్రదర్శించిన ‘వజ్రోత్సవ భారతి‘ నృత్య రూపకంతో వేడు కలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం.. గంగా జమున తెహజీబ్ కు ప్రతీకగా వార్షీ బ్రదర్స్ ఖవ్వాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ►గణపతి ప్రార్థనతో ప్రారంభమైన శంకర్ మహదేవన్ సంగీత విభావరి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఇంటి పండుగలా వజ్రోత్సవాలు: సీఎస్ వజ్రోత్సవాల నివేదికను సీఎస్ సోమేశ్‌కుమార్ విడుదల చేశారు. వేడుకల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ ఇంటి పండగలా భావించి మమేకమయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 1.20 కోట్ల జాతీయ పతా కాలను ఉచితంగా అందచేశామని, ప్రతి ఇంటిపై ఎగుర వేసిన ఈ జెండాలన్నీ మన రాష్ట్రంలోనే తయారు కావడం సంతోషకరమన్నారు. 18,963 ప్రాంతాల్లో 37,66,963 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈనెల 16న 95.23 లక్షల మంది సామూహిక జాతీయ గీతాలాపన చేశారన్నారు. -
వైభవంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు (ఫొటోలు)
-
ఎంతోమంది త్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది: కేసీఆర్
-
వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
ఐపీఎల్ ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు.. సందడి చేయనున్న ఆస్కార్ విన్నర్
IPL 2022 Closing Ceremony: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. 2022 సీజన్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌లతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డుతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీతో కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు ముందు 45 నిమిషాల పాటు ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారని సమాచారం. ముగింపు వేడుకల సందర్భంగా బీసీసీఐ మరో ప్రోగ్రాంను కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వారందరినీ ఈ సందర్భంగా ఘనంగా సత్కరించాలని భావిస్తుందట. అలాగే స్వతంత్ర భారతావనిలో భారత క్రికెట్ ప్రస్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా రూపొందించినట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరబోయే 4 జట్లలో గుజరాత్ టైటాన్స్ తొలి బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విషయానికొస్తే.. మే 24న కోల్‌కతాలో తొలి ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్ టీమ్ 1 వర్సెస్ టీమ్ 2) జరుగనుంది. మే 25న అదే స్టేడియంలో ఎలిమినేటర్ (టీమ్ 3 వర్సెస్ టీమ్ 4)ను నిర్వహిస్తారు. మే 27న అహ్మదాబాద్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ (ఎలిమినేటర్ గేమ్ విజేత వర్సెస్ క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు) జరుగుతుంది. మే 29న అదే స్టేడియంలో క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 2 విజేతల మధ్య ఫైనల్ జరుగుతుంది. చదవండి: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం' -
Tokyo Olympics: నిరాడంబరంగా విశ్వక్రీడల ముగింపు వేడుకలు
-
నిరాడంబరంగా విశ్వక్రీడల ముగింపు వేడుకలు
టోక్యో: ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగిసాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. జపాన్ జాతీయ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. జపాన్ జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలయ్యాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ భజరంగ్ పునియా భారత బృందం ఫ్లాగ్ బేరర్‌గా ఉన్నాడు. వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్ గురించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్ టార్చ్‌ను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిస్తాయి. ఇదిలా ఉంటే, ఈ ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను ప్రస్తుత ఒలింపిక్స్‌లో అధిగమించి మరుపురానిదిగా మలుచుకుంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా.. భారత్ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా, జపాన్‌లు పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం), చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం), జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) సాధించాయి. -
ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుద్ధిజం మొదలైన కాలానికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో రెండ్రోజులుగా జరుగుతున్న బుద్ధ సంగీతి–2019 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యా న్ని వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బుద్ధిజానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. బుద్ధిజానికి ఆనవాళ్లు గా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని 5 ఆరామాలను కాపాడుకుంటామన్నారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగారం, తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బుద్ధిజానికి తెలంగాణ ప్రతీకలనేందుకు తార్కా ణాల న్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిషోర్ కుమార్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ లింబాద్రి, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జానపదం.. మంత్రముగ్ధం
-
కామన్వెల్త్ గేమ్స్.. ముగింపు వేడుకలపై విమర్శలు
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల(2018) నిర్వాహకులు క్రీడాభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల నిర్వహణ సక్రమంగా లేదని.. టీవీల్లో టెలికాస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ చీఫ్ పీటర్ బెట్టీ స్పందించారు. ‘ సాధారణంగా ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల కన్నా.. ముగింపు వేడుకలు క్రీడాకారులకు ఉపశమనం అందించేలా.. అందరిలో ఉత్సాహం నింపేలా నిర్వహించటం ఆనవాయితీ. కానీ, ఆ విషయంలో మేం పొరపాట్లు చేశాం. ముగింపు వేడుకల ముందే క్రీడాకారులను మేం మైదానంలోకి(కర్రారా స్టేడియం) లోకి పిలిచాం. మైదానంలో కొద్దిపాటి ప్రేక్షకులే ఉన్నారనుకుని టెలివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారు పొరపాటు పడ్డారు. క్రీడాకారులు జెండాలతో పెరేడ్ నిర్వహించటం కూడా కొన్ని ఛానెళ్లు సరిగ్గా ప్రసారం చేయలేకపోయారు. దీనికితోడు కొందరు క్రీడాకారులు ఇచ్చిన ఉపన్యాసాలు సుదీర్ఘంగా ఉండటం కూడా అందరికీ విసుగును పుట్టించాయి. వెరసి ముగింపు వేడుకలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే స్వయంగా క్షమాపణలు చెబుతున్నా అని బెట్టీ వరస ట్వీట్లలో పేర్కొన్నారు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ ప్రసార హక్కులు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఛానెల్ ‘సెవెన్’ కూడా ప్రోగ్రామ్‌ను సరిగ్గా టెలికాస్ట్ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తగా.. ఛానెల్ యాజమాన్యం కూడా ఓ ప్రకటనలో క్షమాపణలు తెలియజేసింది. -
చేయి చేయి కలుపుదాం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : ‘తెలుగు భాష గొప్పదనం, తెలుగు జాతి తియ్యదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. ఈ గొప్ప సంపదను కాపాడటానికి ప్రతి ఒక్కరం చేయి చేయి కలపాలి’’అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో ఆయన తెలుగులోనే ప్రసంగించారు. ‘‘తెలుగు మహాసభలు ముగిశాయి. కానీ మన బాధ్యత ఇప్పుడే మొదలైంది. మాతృభాష పరిరక్షణ కుటుంబం నుంచే మొదలుకావాలి. అందుకు ప్రతి తల్లి, తండ్రి, గురువు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల పుట్టిన రోజులు, ఇతర కార్యక్రమాలప్పుడు ఒక తెలుగు పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నా. ఐదు రోజులపాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అమ్మభాషకు తెలంగాణ ప్రణమిల్లింది. 15 రాష్ట్రాలు, 42 దేశాల నుంచి విచ్చేసిన భాషాభిమానులతో బమ్మెర పోతన ప్రాంగణం పులకరించింది. అవధానాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, గోష్టులు, ఇతర సాహిత్య రూపాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలతో మన అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మహాసభలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, ఇంత గొప్ప పండుగలో పాలుపంచుకున్న వారికి, భాగస్వాములైన వారికి అభినందనలు’అని ప్రసంగాన్ని ముగించారు. -
దేదీప్యమానం..!
–అంబరాన్నంటిన పుష్కర ముగింపు వేడుకలు · శ్రీశైలంలో వైభవంగా పుష్పాభిషేకం · 30 మంది వేదపండితులతో శాస్త్రోక్తపూజలు ·12 టన్నుల పూలతో పుష్పోత్సవం శ్రీౖశైలం: కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలు మంగళవారం శ్రీశైల మహాక్షేత్రంలో అంబరాన్నంటాయి. వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పాతాళగంగ వద్దకు మేళ తాళాలతో చేరుకున్నారు. ఓం నమఃశివాయ పంచాక్షరి నామజపం చేస్తూ కృష్ణవేణీ మాతను అనుగ్రహించాల్సిందిగా కోరారు. పుష్కర స్నానం చేసి కలశంలో పాతాళగంగలోని పుష్కర జలాన్ని నింపుకుని మల్లన్న ఆలయప్రాంగణం చేరుకున్నారు. మల్లన్న గర్భాలయ దక్షిణ ద్వారం నుంచి స్వామివార్ల వద్దకు చేరుకుని మూలవిరాట్‌ను అభిషేకించారు. ముపై ్ప మంది వేదపండితుల వేదమత్రోచ్చారణల మధ్య 12 టన్నుల పూలను మల్లన్న పుష్పాభిషేక మహోత్సవానికి వినియోగించారు. మల్లన్న పుష్పోత్సవ.... వైభోగం! అభిషేక ప్రియుడు, మల్లెపూలంటే విపరీతమైన ఆపేక్ష ఉన్న శ్రీమల్లికార్జునస్వామి రంగురంగుల గులాబీలు, అనేక రకాలైన చేమంతులు, వివిధరకాలైన టన్నుల కొద్ది పూలను రాశులుగా పోసి స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపం పక్కనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఓ వైపు వేదపండితులు మంత్రోచ్చారణలతో ఆలయప్రాంగణంలో ప్రతిధ్వనిస్తుండగా, జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామశివాచార్యా స్వామీజీ, దత్తగిరి పీఠాధిపతులు గణపతిపూజతో పుష్పాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, కలెక్టర్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికష్ణ, ఆర్డీఓ రఘుబాబు..తదితరులు స్వామివార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు వేదికపై ఉన్న శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు పుష్పాలను సమర్పించారు. బాణ సంచా వెలుగులు పుష్పాభిషేక మహోత్సవం ముగుస్తున్న సమయంలో బాణ సంచా వెలుగులు ఒక్కసారిగా విరజిమ్మాయి. దాదాపు గంటపాటు ఆకాశంలో బాణ సంచా వెలుగులు కనువిందు చేశాయి. కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలలో మల్లన్న వైభోగాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక తరంగాలలో తేలియాడారు. ముగింపు వేడుకలను పూసగుచ్చినట్లుగా డాక్టర్ దీవి హయగ్రీవాచార్య చేసిన ప్రత్యక్ష వాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు. -
రియో ఒలంపిక్స్ గ్రాండ్ సక్సెస్
-
రియో ముగింపు వేడుకలు
-
రియోకు బై బై.. టోక్యోకు వెల్కమ్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ క్రీడలు ముగిసాయి. పదహారు రోజుల పాటు అభిమానుల్ని అలరించిన ఒలింపిక్స్ పోటీలకు సోమవారం(భారతకాలమాన ప్రకారం) తెరపడింది. మారకానా స్టేడియంలో ఒలింపిక్ జ్యోతిని అర్పివేసిన అనంతరం ఈ మెగా ఈవెంట్‌కు ముగింపు పలుకుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. చివర్లో జరిగిన బాణసంచా విన్యాసాలతో ఒలింపిక్స్ కు రియో ఘనంగా వీడ్కోలు పలికింది. రియో మేయర్ ఎడ్యూర్డో పైస్ ఒలింపిక్ పతాకాన్ని 2020 ఒలింపిక్స్ జరిగే టోక్యో గవర్నర్ యురికే కొయికేకు అప్పగించారు. దీంతో రియోకు గుడ్ బై చెబుతూ, టోక్యోకు స్వాగతం పలికారు. ఈ ముగింపు వేడుకలకు జపాన్ ప్రధాని షింజూ అబే హాజరయ్యారు. ఆయన ఎరుపు టోపీ ధరించి సూపర్ మారియా వేష ధారణలో టోక్యో నుంచి రియోకు రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు నుజ్మాన్ కార్లోస్ ప్రసంగించిన అనంతరం థామస్ బాచ్ తన సందేశాన్ని వెల్లడించారు. -
మహాపర్వం.. చివరి అంకం
-
మహాపర్వం.. చివరి అంకం
మరికొద్ది గంటల్లో గోదావరి పుష్కర మహాపర్వానికి తెర ముగింపు సంబరానికి భారీగా ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్‌షో, ఆకాశదీపాల ఏర్పాటు ‘ఇంటింటా పుష్కర జ్యోతి’కి ప్రభుత్వం పిలుపు 11వ రోజూ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు రాజమండ్రి : పావనవాహిని మహాపర్వం చివరి అంకానికి చేరింది. గోదావరి పుష్కరాల ముగింపు ఘడియలు మరికొద్ది గంటల్లో ఆసన్నం కానున్నాయి. 11 రోజుల పాటు జరిగిన పుష్కరాలు 12వ రోజైన శనివారం సాయంత్రం 6.38 గంటలకు ముగియనున్నాయి. ఇన్ని రోజులుగా అంచనాలకు అందనట్టు.. ఆకాశమే హద్దన్నట్టుగా కోట్ల సంఖ్యలో యాత్రికులు గోదావరి స్నానఘట్టాలకు పోటెత్తి.. పుష్కర పుణ్యస్నానాలు చేశారు. పితృదేవతలకు సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ లక్షలాదిగా పిండప్రదానాలు నిర్వహించారు. ఈ మహాసంబరానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముగింపు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు గోదావరి పుష్కర మహోత్సవాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్, ఆర్ట్స్ కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పుష్కర ఘాట్ వద్ద గోదావరి నిత్యహారతి, లేజర్‌షోతోపాటు భారీ బాణసంచా కాల్పులు జరపనుంది. అలాగే రెండు రైల్వే వంతెనల మధ్య వేలాదిగా ఆకాశదీపాలు గాలిలోకి వదలనున్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కూడా బాణసంచా కాల్పులు ఏర్పాటు చేశారు. పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటిటా పుష్కరజ్యోతి’ నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాత్రి ఏడు గంటల సమయంలో ప్రతి ఇంటా పుష్కర జ్యోతి వెలిగించాలని కోరింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జన్మభూమి కమిటీలను వినియోగించుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం 5.30 గంటలకు కూచిభొట్ల ఆనంద్ ఆధ్వర్యంలో వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కచేరీ. రాత్రి 7.30 గంటలకు హరిప్రసాద్ చౌరాసియా, విశ్వమోహన్ బృందం ఆధ్వర్యంలో పంచతత్వ క్లాసికల్ ఇన్స్ట్రుమెంటేషన్. సాయంత్రం 4 గంటలకు ఆనం కళాకేంద్రంలో కె.దుర్గమ్మ బృందం ఆధ్వర్యంలో రేలా జానపద నృత్య ప్రదర్శన. 5 గంటలకు వై.నాగరాజు బృందం ఆధ్వర్యంలో యక్షగానం. 6 గంటలకు ప్రముఖ మృదంగ విద్వాంసులు యల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మృదంగం విన్యాసం. రాత్రి 8.30 గంటలకు సురభి నాటక ప్రదర్శన 11వ రోజూ భక్తుల తాకిడి మరొక్క రోజులో పుష్కరం ముగుస్తున్న నేపథ్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చారు. జిల్లావ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. రాజమండ్రి నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం భక్తుల తాకిడి అధికంగా ఉంది. రాజమండ్రిలో కోటిలింగాలు, పుష్కరఘాట్లు రద్దీతో కిటకిటలాడాయి. కోటిలింగాల ఘాట్‌లో 7 లక్షలమంది పైగా భక్తులు స్నానాలు చేసినట్టు అంచనా. గ్రామీణ ఘాట్లలో కోటిపల్లి, సోంపల్లి, అంతర్వేది, అప్పనపల్లిల్లో సైతం భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేశారు. కోటిపల్లిలో 1.80 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. రాజమండ్రిలో గోదావరి నిత్యహారతికి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 6.30 గంటలకు నిత్యహారతి మొదలవుతుండగా, సాయంత్రం 4 గంటలకే పుష్కరఘాట్ నిండిపోయింది. దీంతో ఈ కార్యక్రమానికి ఎంతో ఆశతో వచ్చినవారు నిరాశతో వెనుదిరిగారు. టీటీడీ నమూనా ఆలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకూ కోలాటాలు, బాజాభజంత్రీలతో సాగిన శ్రీనివాసుని ఊరేగింపులో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తులు వి.రామసుబ్రహ్మణ్యం, వాసుకి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనటి, మాజీ ఎంపీ జమున, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి తదితరులు పుష్కర స్నానాలు చేశారు. 3 కోట్లమంది పైగా భక్తుల పుణ్యస్నానాలు పుష్కరాలు ఆరంభమైన తరువాత జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి వరకూ 3.05 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గత పుష్కరాలకు 2.19 కోట్ల మంది భక్తులు వచ్చారు. శనివారం పుష్కరాలు పూర్తయ్యే సమయానికి సుమారు 3.40 కోట్ల మంది స్నానాలు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పుష్కరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది పుష్కరాలకు భారీ ఎత్తున భక్తుల రావడానికి ప్రభుత్వం, మీడియా, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఒక కారణమైంది. దీనికితోడు రవాణా వ్యవస్థ మెరుగుపడడం వల్ల కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
గోదావరి పుష్కరాల ముగింపులో కూచిపూడి మహాబృంద నాట్యం
రాజమండ్రి (తూర్పు గోదావరి) : గోదావరి పుష్కరాల ముగింపు రోజున వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కూచిపూడి నాట్యారామం అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. 18 నిముషాలపాటు కొనసాగే శ్రీమద్ పుష్కర గోదావరి నాట్య రూపకాన్ని డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి రూపకల్పన చేసినట్లు చెప్పారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జూలై 25న నాట్య ప్రదర్శన జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అద్భుత కావ్యాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనలో తమ ప్రతిభ చూపేందుకు ఐదో తరగతి ఆపై చదివే చిన్నారులు పాల్గొనవచ్చని, పాల్గొనదలిచేవారు తమ పేరు, వయస్సు, ఊరు వివరాలతో 8008889845 నెంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపించాలని కోరారు. -
కరీంనగర్లో 3k వాక్
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 3k వాక్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ చైర్మన్ తుల ఉమతో పాటు పలువురు పాల్గొని విజయవంతం చేశారు. -
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు
-
సాకర్ సంబరాల్లో షకీరా జోరు
-
ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం
రాష్ట్ర రాజధానిలో వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం బుధవారం ముగిసింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో 48 దేశాలకు చెందిన దాదాపు 200 చిత్రాలను ప్రదర్శించారు. బాలల చిత్రోత్సవంలో ప్రదర్శించినవాటిలో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఉత్తమ చిత్రంగా బ్రేకింగ్ ది సైలెన్స్, టమోటో చోర్ను ఎంపిక చేశారు. షార్ట్ ఫిలిం డివిజన్లో తొలి ఉత్తమ చిత్రంగా చింటి, రెండో ఉత్తమ చిత్రంగా ఓమోగియా నిలిచాయి. జ్యూరీ అవార్డు మై ష్యూస్ దక్కించుకోగా.. యానిమేషన్ విభాగంలో ఏమెస్ట్ సెల్సిలైన్, జరాఫా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. -
వైభవంగా సాక్షి పండుగ సంబరాల ముగింపు ఉత్సవం
సాక్షి, సిటీబ్యూరో: దసరాకు ముందుగానే పాఠకుల ఇంట ఆనందసాగరాలను పొంగించిన సాక్షి పం డుగ సంబరాల ముగింపు ఉత్సవం వైభవంగా జరిగింది. అమీర్‌పేట్ హోటల్ గ్రీన్‌పార్క్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ మహోత్సవంలో ‘సాక్షి’ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాదరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంబరాల విజేతలకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సాక్షి ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. బంపర్ప్రైజ్లంటే వాటి పారదర్శకతపై చాలామందికి సందేహాలుంటాయి. వాటిని పటాపంచలు చేస్తూ... రోజుకొకరికి లక్ష రూపాయల చొప్పున బహుమతిగా ఇస్తూ 16 రోజులపాటు దిగ్విజయంగా పండుగ సంబరాలు నిర్వహించాం. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రధాన స్పాన్సర్స్ ఆర్ఎస్ బ్రదర్స్, టీఎంసీ, లాట్ మొబైల్స్ సంస్థలకు కృతజ్ఞతలు. విజేతలు, సాక్షి పాఠకులకు దసరా శుభాకాంక్షలు’ అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ డెరైక్టర్ వెంకటేష్, టీఎంసీ సీఎండీ ఉమా అమర్నాథ్, హర్షా టయోటా సీఈఓ శివరామకృష్ణ, సౌత్ఇండియా షాపింగ్‌మాల్ డెరైక్టర్ రాజమౌళి, టీవీఎస్ టెరిటరీ మేనేజర్ అజయ్, వరుణ్ మోటర్స్ బ్రాంచ్ మేనేజర్ సిసిల్, బజాజ్ ఏరియా మేనేజర్ జగన్, రాధాకృష్ణా టయోటా సీనియర్ సేల్స్ మేనేజర్ గిరి, లక్ష్మి హుండై జీఎం కళ్యాణ్‌సింగ్, యశోదాకృష్ణా టయోటా మార్కెటింగ్ మేనేజర్ కృష్ణకిశోర్, సాక్షి సీజీఎం శ్రీధర్ పాల్గొన్నారు. బిగ్ ఎఫ్ఎం ఆర్జే శేఖర్, క్రాంతిల వ్యాఖ్యానం ఆహూతులను ఆకట్టుకుంది. రూ.లక్ష విజేతలు వీరే ఎం.ఐలయ్య, పి.కిరణ్‌కుమార్, బి.స్వాతి, లలితారాథోడ్, ఎం.సందీప్, డి.నవీనశ్రీజ, ఎస్.మురళీమోహన్‌గౌడ్, నామని సురేష్, ఇ.సందీప్, మాసం స్వామి, ఎస్.వసుశ్రీ, వినయ్గోయల్, ఎస్.శ్రీరామ్, బి.సౌమ్య, కె.మధుసూదన్‌రెడ్డి, కె.దినేష్ కుమార్ స్పాన్సర్లు, రూ.లక్ష విజేతలతో ‘సాక్షి’ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర్ప్రసాదరెడ్డి, సీజీఎం శ్రీధర్ విజేతలకు బహుమతులిస్తున్న వైఈపీ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్ డెరైక్టర్ వెంకటేష్, టీఎంసీ సీఎండీ ఉమాఅమర్నాథ్