సాక్షి, సిటీబ్యూరో: దసరాకు ముందుగానే పాఠకుల ఇంట ఆనందసాగరాలను పొంగించిన సాక్షి పం డుగ సంబరాల ముగింపు ఉత్సవం వైభవంగా జరిగింది. అమీర్‌పేట్ హోటల్ గ్రీన్‌పార్క్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ మహోత్సవంలో ‘సాక్షి’ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాదరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంబరాల విజేతలకు చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సాక్షి ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. బంపర్‌ప్రైజ్‌లంటే వాటి పారదర్శకతపై చాలామందికి సందేహాలుంటాయి. వాటిని పటాపంచలు చేస్తూ... రోజుకొకరికి లక్ష రూపాయల చొప్పున బహుమతిగా ఇస్తూ 16 రోజులపాటు దిగ్విజయంగా పండుగ సంబరాలు నిర్వహించాం. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రధాన స్పాన్సర్స్ ఆర్‌ఎస్ బ్రదర్స్, టీఎంసీ, లాట్ మొబైల్స్ సంస్థలకు కృతజ్ఞతలు. విజేతలు, సాక్షి పాఠకులకు దసరా శుభాకాంక్షలు’ అన్నారు.
కార్యక్రమంలో ఆర్‌ఎస్ బ్రదర్స్ డెరైక్టర్ వెంకటేష్, టీఎంసీ సీఎండీ ఉమా అమర్‌నాథ్, హర్షా టయోటా సీఈఓ శివరామకృష్ణ, సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్ డెరైక్టర్ రాజమౌళి, టీవీఎస్ టెరిటరీ మేనేజర్ అజయ్, వరుణ్ మోటర్స్ బ్రాంచ్ మేనేజర్ సిసిల్, బజాజ్ ఏరియా మేనేజర్ జగన్, రాధాకృష్ణా టయోటా సీనియర్ సేల్స్ మేనేజర్ గిరి, లక్ష్మి హుండై జీఎం కళ్యాణ్‌సింగ్, యశోదాకృష్ణా టయోటా మార్కెటింగ్ మేనేజర్ కృష్ణకిశోర్, సాక్షి సీజీఎం శ్రీధర్ పాల్గొన్నారు. బిగ్ ఎఫ్‌ఎం ఆర్‌జే శేఖర్, క్రాంతిల వ్యాఖ్యానం ఆహూతులను ఆకట్టుకుంది.
రూ.లక్ష విజేతలు వీరే
ఎం.ఐలయ్య, పి.కిరణ్‌కుమార్, బి.స్వాతి, లలితారాథోడ్, ఎం.సందీప్, డి.నవీనశ్రీజ, ఎస్.మురళీమోహన్‌గౌడ్, నామని సురేష్, ఇ.సందీప్, మాసం స్వామి, ఎస్.వసుశ్రీ, వినయ్‌గోయల్, ఎస్.శ్రీరామ్, బి.సౌమ్య, కె.మధుసూదన్‌రెడ్డి, కె.దినేష్ కుమార్ స్పాన్సర్లు, రూ.లక్ష విజేతలతో ‘సాక్షి’ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర్‌ప్రసాదరెడ్డి, సీజీఎం శ్రీధర్ విజేతలకు బహుమతులిస్తున్న వైఈపీ రెడ్డి, ఆర్‌ఎస్ బ్రదర్స్ డెరైక్టర్ వెంకటేష్, టీఎంసీ సీఎండీ ఉమాఅమర్‌నాథ్
వైభవంగా సాక్షి పండుగ సంబరాల ముగింపు ఉత్సవం
Published Sat, Oct 12 2013 5:07 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement