ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు.
ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment