సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుద్ధిజం మొదలైన కాలానికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో రెండ్రోజులుగా జరుగుతున్న బుద్ధ సంగీతి–2019 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యా న్ని వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బుద్ధిజానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. బుద్ధిజానికి ఆనవాళ్లు గా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని 5 ఆరామాలను కాపాడుకుంటామన్నారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగారం, తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బుద్ధిజానికి తెలంగాణ ప్రతీకలనేందుకు తార్కా ణాల న్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిషోర్ కుమార్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ లింబాద్రి, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment