budha
-
ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!
శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో చిన్న భూభాగం. ఇందులో సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది కాండీ నగరం. ఈ నగరంలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశం బుద్ధుడి దంత అవశిష్టంతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని టూత్ రిలిక్ టెంపుల్ గా వ్యవహారిస్తారు. ఈ ఆలయం కంటే ముందు ఇక్కడ ఉన్న నేషనల్ మ్యూజియాన్ని తప్పక చూడాలి. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యాలెస్‌లున్నాయి. ఆలయంతోపాటు రాజప్రాసాదాలు కూడా ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారిపోవడానికి ఒకప్పుడు ఎర్రటి బంగ్లా పెంకు కప్పే వాళ్లు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు రేకులు కప్పుతున్నారు. ఇక ఈ నగరంలో మరో విశిష్ఠత ఏమిటంటే... పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు కలోనియల్ కాలనీలను తలపిస్తున్నాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. బౌద్ధమే ప్రధానం.. బుద్ధుడి దంతాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దంత అవశిష్టం మన భారతదేశం నుంచి శ్రీలంక చేరడం కూడా రసవత్తరమైన నాటకీయతను తలపిస్తుంది. బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఇలా ఒక్కొక్క దేహభాగాలను ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించారు. అలా ఈ దంతాన్ని కళింగ రాజులు సొంతం చేసుకున్నారు. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. యువరాణి హేమమాలిని, యువరాజు దంత ఈ దంతాన్ని రహస్యంగా లంకాపట్టణానికి తెచ్చారు. హేమమాలిని తల మీద శిఖలో దాచి తెచ్చిందని చెబుతారు. ఆ దంతాన్ని అనూరాధపురను పాలించిన రాజు సిరిమేఘవన్నకు ఇచ్చింది హేమమాలిని. మొదట ఆ దంతాన్ని మేఘగిరి విహార (ఇసురు మునియ) లో భద్రపరిచారు. క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని ఒకింత పోటీ పడేవారు కూడా. ఆలయ సౌందర్యం! ఆనాటి రాజులు బౌద్ధ స్థూపాలు, ఆలయాల నిర్మాణానికి తమవంతుగా సమృద్ధిగా నిధులు కేటాయించేవారు. కాండీలోని ఆలయనిర్మాణం అత్యంత సుందరంగా, అంతకు మించిన సంపన్నతతో ఉంది. ఆలయం ఆర్కిటెక్చర్ గొప్పతనానికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఈ తలుపులను ఒకరు తెరవడం సాధ్యం కాదు. తిరుమల వేంకటేశ్వర ఆలయం మహాద్వారం తలుపుల్లాగ భారీగా ఉంటాయి. ఉలి నైపుణ్యం గోడలు, స్తంభాల్లోనే కాదు తలుపు గడియల్లో కూడా చూడవచ్చు. నెమలి పింఛం ఆకారంలో ఉన్న గడియ కనీసం రెండు కిలోల బరువుంటుంది. సరదాపడి పైకి తీద్దామన్నా ఒక చేతితో కదిలించలేం. మనకు ఆలయాల్లో ప్రవేశద్వారాలే తెలుసు, కానీ ఇక్కడ ప్రవేశ భవనమే ఉంది. తొలి భవనంలో అడుగు పెట్టగానే గర్భగుడి కోసం చూస్తాం. కానీ అదంతా ప్రవేశ మార్గమే. అసలు ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బుద్ధభగవానుడి దర్శనం చేసుకునే వరకు మనల్ని మనం మరిచిపోతాం. ఇప్పటి వరకు మనం చూడని మరోలోకంలో ఉన్న భావన కలుగుతుంది. ఆలయం పై కప్పు జామెట్రికల్ డిజైన్లు కూడా తేలికరంగులతో కంటికి హాయినిస్తూ నిర్మాణకౌశలానికి అద్దం పడుతుంటాయి. ప్రకృతి మనకు కలువలను ఎన్ని షేడ్లలో ఇస్తోందో ఈ ఆలయంలో చూడాల్సిందే. ఆలయ అలంకరణలో తెల్లని పూలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధావలంబకులు కూడా (భిక్కులు కాదు) బుద్ధుని దర్శనానికి శ్వేత వస్త్రాలు ధరించి వస్తారు. చంటిబిడ్డలకు కూడా తెల్లని వస్త్రాలే వేస్తారు. వర్షం పడినా చలి ఉండదు! కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సును, ఒడ్డున ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. కాండీ రిలిక్ టెంపుల్ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలిని తలపిస్తుంది. ఇక్కడ వర్షం సీజన్‌తో పని లేకుండా రోజూ ఏదో ఒక సమయంలో చిరుజల్లయినా పడుతుంది. అందుకే గొడుగు దగ్గర ఉండడం అవసరం. ఇక్కడ మనకు ఒకింత ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే వర్షం కురుస్తుంది, కానీ చలి ఉండదు. వర్షం జల్లు ఆగిన వెంటనే ఉక్కపోత కూడా ఉంటుంది. మొత్తానికి శ్రీలంకలో ఉన్నది ఎండాకాలం, వర్షాకాలం రెండు సీజన్లేనని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..
ఒక రోజున బుద్ధుడు అబిరవతి నదీ తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే ఒక ఆరామం కూడా ఉంది. బుద్ధుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆ పరిసర గ్రామ వాసులు ఎందరో అక్కడికి వచ్చారు. బుద్ధుని ధర్మోపదేశం పూర్తి చేయగానే... ఒక యువకుడు లేచి నమస్కరించి... ‘‘భగవాన్! కోరికలు చెడ్డవా? వాటి వల్ల ప్రయోజనం ఉండదా? వివరించి చెప్పగలరు’’ అని ప్రార్థించాడు. ‘‘ఓ యువకా! జాగ్రత్తగా విను. ఒక మాంసం వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చిన కుక్కకు మాంసం గీకేసిన ఎముకను వేస్తాడు. ఆ ఎముకకు మాంసం చెమ్మ, కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉంటాయి. కానీ... ఆ కుక్క ఆ ఎముకను కరచుకొని నానా తంటాలు పడుతుంది. దానివల్ల దాని ఆకలి తీరదు. దౌర్బల్యమూ తొలగదు. కోరికల వల్ల దొరికేది కూడా ఇంతే! అలాగే... వెలుగు కోసం ఒకడు ఒక గడ్డిదివిటీని పట్టుకుని గాలికి ఎదురుగా పరుగులు తీస్తుంటాడు. దివిటీ మంట చెలరేగి, పెద్దదవుతుంది. దివిటీని పట్టుకున్న వాని ముఖం మీదకే జ్వాలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు వాడు ఆ దివిటీని వదిలి పెట్టకపోతే.. తన దివిటీనే తనని కాల్చేస్తుంది. మనలో రేగిన కామాగ్నులు కూడా మనల్ని అలానే దహిస్తాయి. నిలువెత్తు లోతులో నిప్పుల గుండం ఉంటుంది. అది రగిలి చల్లారింది. పైకి మంట గానీ, పొగ గానే లేవడం లేదు. పైపై బొగ్గులన్నీ చల్లారాయి. కానీ... దానిలో దిగిన వాడు మాత్రం నిప్పుల్లో దిగబడిపోతాడు. మాడి బొగ్గులా మారిపోతాడు. కామం అనే నిప్పుల గుండంలో దిగబడిన వారు కూడా అలానే నశించిపోతారు. అలాగే... ఒకడు స్వప్నంలో అందమైన పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. రంగురంగుల పూలచెట్లు, అందమైన సీతాకోకచిలుకలు, తుమ్మెదల ఝుంకార నాదాలూ... మత్తు కలిగించే చల్లని గాలి, వాడు ఆనందం లో తేలిపోయి, మైమరచిపోతాడు. అంతలో మెలకువ వస్తుంది. ఆనంద దృశ్యాలన్నీ అదృశ్యమై పోతాయి. మధురానుభూతి మాయమైపోతూ ఉంటుంది. కామ సుఖాలు కూడా అలాంటివే... ఇంకా ఒకరు అందమైన, విలువైన నగల్ని అరువు తెచ్చుకుంటారు. ధరిస్తారు. దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ అంగడిలో వాటిని అమ్మకానికి పెడతారు. బేరం జరుగుతూ ఉండగా, అసలైన నగల యజమాని వస్తాడు. దూషించి తన నగలు తాను పట్టుకుపోతాడు. అవమానంతో బేలతనంతో ఆ అరువు తెచ్చుకున్న వారు హేళన పాలవుతారు. కామాలు అంటే కోరికలు కూడా మనకి చివరికి అవమానాల్ని తెస్తాయి. హేళన పాల్జేస్తాయి. కాబట్టి కోరికలల వెంటపడి పరుగుతీసే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి.’’ అని చెప్పాడు. ఆ యువకునితో పాటు, అక్కడ ఉన్న వారందరికీ కోర్కెల వల్ల కలిగే కీడు అర్థమైంది. ఆ యువకుడు లేచి, బుద్ధునికి వంగి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు) -
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్‌ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి..
బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది. మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది. వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. ‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి. అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. – బొర్రా గోవర్ధన్మిత్రధర్మం (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!) -
ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!
అది మండు వేసవి. అప్పుడే సూర్యోదయం అయింది. లేత కిరణాలు సోకి సాలవృక్షం పచ్చదనాన్ని వెదజల్లుతూ పరవశించిపోతోంది. ఆ అడవిలో తానే ఎత్తైన వృక్షాన్ని అనే గర్వంతో కూడిన ఆనందం అది. అంతలో..ఒక కాకి ఎగిరి వచ్చి ఆ వృక్షం కొమ్మల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో వాలింది. దాని ముక్కున పండిన మాలువా పండు ఉంది. ఆ పండును కాలివేళ్ళతో తొక్కి పట్టి, గుజ్జునంతా తినేసింది. ముక్కును అటూ ఇటూ రాచి, వాలుగా చూసి, ‘కా..కా’’ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది. అలా కాకి వెళ్ళిపోగానే, తన మీద వదిలి వెళ్ళిన మాలువా విత్తనాన్ని గమనించిన ఆ సాలవృక్షం ఆలోచనలో పడింది. భయం పుట్టి వణికింది. అయినా తనని తాను సమాధాన పరచుకుని శాంతించింది. వేసవి ముగిసింది. మాలువా విత్తనం టెంకె పగిలింది. దానిలోంచి నిగనిగలాడే విత్తనం బయటకొచ్చి పడింది. ఆ విత్తనాన్ని చూడగానే సాలవృక్షానికి వేళ్ళు కుంగినట్లయింది. పెనుగాలికి కూలినట్లు భావించింది. కార్చిచ్చుకి తగలబడి బూడిద అయినట్లు అనిపించింది. నిలువెల్లా వణకసాగింది. మొత్తుకోసాగింది. అప్పుడు ఆ వృక్షం చుట్టూ ఉండే ఇతర వృక్ష మిత్రులంతా ‘‘దుఃఖ కారణం ఏమిటి?’’ అని అడిగారు. ‘‘సాలవక్షం విషయం చెప్పింది. అప్పుడు ‘‘సాలవృక్షమా! చింతించకు. అనవసరంగా భయపడుతున్నావెందుకు? ఆ విత్తనాన్ని నెమలి తినవచ్చు. జింక నమిలి వేయవచ్చు. కార్చిచ్చు కాల్చవచ్చు. ఎవరైనా మనిషి చూసి తీసుకుపోవచ్చు. ఎండకు ఎండిపోవచ్చు. నీడలో నాని కుళ్ళిపోవచ్చు. చెద పురుగులు తినొచ్చు. చీమలు తీసుకుపోవచ్చు. ఇన్ని అవరోధాలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని అది మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా వెంటనే వానలు ఆగిపోతే, మొలకలోనే మాడిపోవచ్చు. కాబట్టి లేనిపోని భయాన్ని ఊహించుకుని వణికిపోకు’’ అంటూ ధైర్యం చెప్పాయి. తోటి వృక్షాల ఓదార్పుకు ఆ సాలవృక్షం ధైర్యాన్ని తెచ్చుకుంది. కానీ ఆ విత్తనం మొలవడానికి ఏ అవరోధం కలగలేదు. ఆ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో చక్కగా మొలకెత్తింది. వేగంగా పెరిగింది. పెద్ద పెద్ద తమలపాకుల్లా లేత పచ్చని ఆకుల తీగపైకి లేచింది. దాన్ని చూసి సాలవృక్షం లబోదిబోమంది. మరలా వృక్షాలన్నీ– ‘‘నీవు మహావృక్షానివి. అది చిన్న తీవె. అయినా ఆ బుజ్జి కాడ ఎంత ముచ్చటగా, అందంగా ఉందో, అది నీకు మంచి అలంకారంగా ఉంది. ఈ చిన్న తీవె నిన్నేమి చేయగలదు’’ అని మరలా ధైర్యం చెప్పాయి. వాటి మాటలు విని సాలవృక్షం కొంత సాంత్వన పడింది. కానీ.. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ బలపడింది. దాని బెరడును చీల్చుకుని వేళ్ళను లోనికి పంపింది. ఆ వృక్ష సారాన్నే పీల్చుకోసాగింది. చివరికి చెట్టంతా కమ్ముకుపోయింది. సారాన్ని కోల్పోయిన సాలవృక్షం ఎండి.. క్రమంగా జీవాన్నీ కోల్పోయింది. ఒకప్పుడు అడవిలో తిరిగే మనుషులు ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటూ ‘‘ఆ పెద్ద సాలవృక్షం దగ్గర ఆ మహా సాలవృక్షం పక్కన..’’ అని ఆనవాళ్ళను చెప్పుకుంటూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు.. ఆ మాలువా పొద పక్కన’’ అంటూ చెప్పుకోసాగారు. చెడ్డవారిని చేరదీయడం వల్ల, చెడ్డతనం పట్ల ఉపేక్ష భావంతో ఉండటం వల్ల అది మన ఉనికికే చేటు తెస్తుంది. మనిషి మనసులో చెడు కోరికలు రేగినప్పుడు.. ‘‘ఇది చిన్న కోరికే కదా! ఈ ఒక్కసారికీ ఈ పని చేసి ఇక ఆ తరువాత చేయకుండా ఉంటే మనకు వచ్చే నష్టం లేదు. కలిగే కష్టమూ లేదు’’ అనుకుని ఆ చెడ్డ కర్మలకు పూనుకుంటారు. కానీ, ఆ తర్వాత వాటిని మానడం అటుంచి, మరింత లోతుకు కూరుకుపోతారు. కామ రాగాలన్నీ ఇలానే ప్రవేశించి, పెరిగి పెరిగి మన ఉనికికే ప్రమాదాన్ని తెస్తాయి. వాటిని మనస్సులో పుట్టకుండా చేసుకోవాలి. లేదా పుట్టిన వెంటనే నివారించుకోవాలి. ఆపేక్షతో ఉపేక్ష చూపితే మన ఉనికికే నిక్షిప్తం చేస్తాయి. ఇది కామరాగాల పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో బుద్ధుడు చెప్పిన కథ ఇది. ఆ రోజుల్లో ‘మోక్షానికి కామం కూడా ఒక మార్గమే’ అని చెప్పే సాధువులు కొందరు ఉండేవారు. వారికి కనువిప్పు కలిగించడం కోసం, బుద్ధుడే ఈ కథ చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!) -
ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుద్ధిజం మొదలైన కాలానికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో రెండ్రోజులుగా జరుగుతున్న బుద్ధ సంగీతి–2019 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యా న్ని వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బుద్ధిజానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. బుద్ధిజానికి ఆనవాళ్లు గా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని 5 ఆరామాలను కాపాడుకుంటామన్నారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగారం, తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బుద్ధిజానికి తెలంగాణ ప్రతీకలనేందుకు తార్కా ణాల న్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిషోర్ కుమార్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ లింబాద్రి, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శ్రీ పర్వతారామం.. బుద్ధవనం
సాక్షి, సిటీబ్యూరో: శ్రీ పర్వతారామం అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. బుద్ధవనం అంటే కొందరికి గుర్తుకు రావచ్చు. కానీ నాగార్జున సాగర్ చెంతన వెలసిన బుద్ధవనం అంటే ఓ ఆధ్యాత్మిక భావన మనసును రంజింపజేయకమానదు. బుద్ధుడి జ్ఞాపకాలతో వెలసిన ఈ ప్రాంతం దక్షిణాదిలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిన వైనాన్ని ఇక్కడ వేలాదిగా ఉన్న శిల్పాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన జీవితంలో జరిగిన అనేక ఘట్టాలను జాతక కథలుగా చూసిరావచ్చు. ప్రపంచంలోని బౌద్ధారామాలను పోలిన స్తూపాన్ని సందర్శించి తరించవచ్చు. పర్యాటకులు సాధారణంగా నాగార్జుసాగర్ డ్యామ్‌ను, నాగార్జున కొండను చూసేందుకు వెళ్తుంటారు. డ్యామ్‌కు కూతవేటు దూరంలో 275 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం వెలసింది. ఆచార్య నాగార్జునుడు నడయాడిన కృష్ణా నదీ లోయ పరీవాహక ప్రాంతం. బౌద్ధాన్ని ప్రచారం చేసిన ఇక్ష్వాకుల సాంస్కృతిక వైభవం. శాతవాహనుల తొలి తెలుగు(బౌద్ధ) సంస్కృతి ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. గ్రాండ్‌గా ఎంట్రన్స్ ప్లాజా.. నాగార్జున సాగర్ డ్యామ్‌కు మూడు కిలోమీటర్లకు ముందే (నల్లగొండ జిల్లా పరిధి) కుడివైపున శ్రీ పర్వతారామం బోర్డు కనిపిస్తుంది. ప్రవేశ ద్వారం వద్ద స్వాగతిస్తున్న రెండు ఏనుగు శిల్పాల మధ్య నుంచి లోపలికి వెళితే మూడు వైపులా మార్గాలుంటాయి. గేటుకు ఎదురుగా మధ్యలో ధర్మచక్రం.. దానికి ఇరుపక్కలా మార్గాలు.. ధర్మచక్రం చుట్టూ గోడలపై అనేక శిల్పాలు కనువిందు చేస్తాయి. కొత్తగా చెక్కినవే అయినా అలనాటి అమరావతి శిల్పకళకు అద్దం పడతాయి. ఈ శిల్పాల మధ్యలో అశోకుడు బౌద్ధవ్యాప్తికి చేసిన సేవకుగుర్తుగా ధర్మచక్రం ఉన్న స్తంభంవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వసతులు.. బుద్ధవనంలో ఫుడ్ కోర్టు, ఆరు కాటేజీలు ఉన్నాయి. నాగార్జున సాగర్ టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నడిచే హరిత విజయ విహార్ గ్రాండ్ హోటల్ ఉంది. ఎలా వెళ్లాలి.. నగరం నుంచి 152 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్, మల్లేపల్లి, పెద్దపుర నుంచి నాగార్జున సాగర్ చేరుకోవాలి. అక్కడ డ్యామ్‌కు 3 కి.మీ ముందే శ్రీ పర్వత ఆరామం (బుద్ధవనం) వస్తుంది. హైదరాబాద్ నుంచి నిరంతరం ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. బృందంగా వెళ్లాలనుకునే వారు టీఎస్‌టీడీసీ వారి నుంచి అద్దె వాహనాలు తీసుకోవచ్చు. వీటిని సందర్శించవచ్చు.. ♦ ప్రవేశ ద్వారం నుంచి ముందుకెళితే ఎడమ వైపు కనిపించేది బుద్ధచరిత వనం ♦ బుద్ధ చరిత వనం నుంచి ముందుకు వెళితే జాతక (బోధిసత్వ) వనం ఉంటుంది ♦ స్తూప వనంలో భారత్ పాటు దక్షిణాసియా దేశాల్లోని వివిధ స్తూపాకృతుల నమూనా కట్టడాలు కనిపిస్తాయి ♦ బుద్ధవనానికి వచ్చే పర్యాటకుల మానసిక ప్రశాంత కోసం ధ్యాన వనం ఉంది. బుద్ధుని జీవితంతో ముడిపడిన వివిధ రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. వీటి కింద ధ్యానం చేసుకునే సౌకర్యం ఉంది ♦ 42 మీటర్ల వ్యాసార్థం, 21 మీటర్ల ఎత్తుతో నిర్మించిన మహాస్తూపం.. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దది. దాని కింది అంతస్తులో బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే శిల్పాలు ఉన్నాయి. -
వారెవ్వా హన్సిక!
తమిళసినిమా: ఆలోచనలకు సాన పడితే అద్భుతాలు సాక్షాత్కరిస్తాయి. నటి హన్సిక కూడా అదే చేశారు. ఈమె తన చక్కని నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళంలో క్రేజీ నటిగా పేరు తెచ్చుకున్న హన్సికకు ఇక్కడ సక్సెస్ రేటు ఎక్కువే. తన ఈ మధ్య ప్రభుదేవాతో కలిసి నటించిన గులేబాకావళి చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణను పొందింది. అయితే ప్రస్తుతం హన్సికకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయన్నది నిజం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మలో మరో టాలెంట్ కూడా మెండుగా ఉంది. అవును మంచి నటే కాదు మంచి చిత్రకారిణి కూడా. చిత్రలేఖనాలంటే ఎంతో మక్కువ. షూటింగ్ లేని సమయాల్లో కుంచె చేతబట్టి క్యాన్వాస్పై తన మనసులోని భావాలకు అబ్బురపరిచే రూపాలను ఇస్తుంటారు. అవి మోసిన చిత్ర కళాకారుడి కళారూపాలకు దీటుగా ఉంటాయి. అలా తన మనసులోని ఆలోచనలకు రూపం ఇచ్చిన ఒక చిత్రలేఖనాన్ని హన్సిక సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.ఆ చిత్ర లేఖనం పలువురి ప్రశంసలను అందుకుంటోంది. ఈమె తాను రూపొందించిన కళాకృతుల గురించి పలు మార్లు చెప్పారు కానీ, వాటిని ఏనాడు ప్రదర్శించలేదు. ప్రదర్శనలకు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం చెప్పారు. దీంతో ఆమెలోని చిత్రకారిణి గురించి ఎవరూ పెద్దగా ఊహించలేదు. అలాంటిది హన్సిక కుంచెతో రంగులద్దిన బుద్ధుడి చిత్రలేఖనం కళాహృదయులను రంజింపజేస్తోంది. ఆహా హన్సికలో ఇంత గొప్ప ఆర్ట్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ప్రముఖ హాస్య నటుడు వివేక్ లాంటి వారు తను కళా రూపకాలకు ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచనలిస్తున్నారు. అలా వచ్చిన నిధిని సమాజసేవకు ఉపయోగించవచ్చునని ట్విట్టర్లో సలహా ఇస్తున్నారు. అందుకు బదులిస్తూ వారికి థ్యాంక్స్ చెబుతూ తనకు అలాంటి ఆలోచన ఉందని హన్సిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ అందాల భామ సామాజిక సేవలోనూ ముందే ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 23 ఏళ్ల అమ్మాయి 30 మంది పిల్లలకు అమ్మ అయ్యారు. అవును హన్సిక 30 మంది అనాథ పిల్లలను చేర దీసి వారి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లతోనే గడుపుతానంటున్న హన్సిక 30 మంది పిల్లలు తనను అమ్మ అనే పిలుస్తారని, అంత మందికి అమ్మ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వారందరికీ ఒక ఆశ్రమాన్ని కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు హన్సిక తెలిపారు. వారెవ్వా హన్సికా! -
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఒంటరేళ తుంటరోడు ఒంటిగుంటే ఒదిలిపోడు గండు చీమలాగ నన్ను కుట్టినాడు బుద్ధుడల్లె ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు అతడు: చందనాల చెక్కలాంటి చక్కనైన పిల్లా చాందినీల చుక్క సిగ్గు చెక్కి పోతే ఎల్లా చెంపకేసి అద్దు ముద్దు పావడాల బిళ్ల చేతులోంచి జారిపోకే ఓసి సబ్బు బిళ్ల నేతి అరిసెలా పూల బరిసెలా సానబెట్టి సూది కళ్లు గుండెలోన గుచ్చమాకలా కుర్ర ఈడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి గుంజుతుంటే గింజుకోవ ఆశలన్ని పాతికేళ్ల మీసకట్టు ఒక్క చూపుతోటే ఫట్టు చేసుకోవే జిల్లుమన్న దిల్లు బోణి చరణం : 1 ఆ: పావుగంట కౌగిలిస్తే తీయగా అ: పావుసేరు తేనెకైనా అంత తీపి లేదుగా ఆ: ఎక్కడో తళుక్కు మంది పిల్లగా అ: పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా ఆ: లేడికళ్ల చిన్నదాన్ని వాటి చూపులేసి ప్రేమతోటి కొట్టినావుగా గాజు బొమ్మలాంటి దాన్ని జారిపోనివ్వకుండా ప్రాణమేసి పట్టినావుగా అ: సిగ్గు పడకలా నెగ్గినావే పిల్లా చిలిపి చిలకలా కలికి కులుకులా జారుతున్న దోర గుండె కోరికోరి కోరకమాకలా ॥ఈడు॥ చరణం : 2 ఆ: ఇక్ డోలు డోలు డోలునా అ: పరికిణీలో చందమామ పరిణయం కోరేనా ఆ: ఇక్ డోలు డోలు డోలునా అ: చుక్కలాంటి చక్కనమ్మ బుగ్గ చుక్క అడిగేనా ఆ: పొయ్యి మీద పాలకుండ పొంగి పొర్లి పోయే పండగేదో ముందరుందనా పక్కమీద సన్నజాజి పూలే జల్లే సంగతేదో సణుగుతోందనా అ: సొగసు సంకెలా విసరకే పిల్లా కొసరు నడుముతో ఎసరు ముసరగా తస్సదియ్య కస్సుమన్న కన్నెతోడు కన్ను కొట్టగా ॥ఈడు॥ చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013) రచన : శ్రీమణి సంగీతం : ఎస్.ఎస్.థమన్ గానం : శంకర్‌మహదేవన్, సుచిత్ర నిర్వహణ: నాగేశ్