రాజమండ్రి (తూర్పు గోదావరి) : గోదావరి పుష్కరాల ముగింపు రోజున వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కూచిపూడి నాట్యారామం అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. 18 నిముషాలపాటు కొనసాగే శ్రీమద్ పుష్కర గోదావరి నాట్య రూపకాన్ని డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి రూపకల్పన చేసినట్లు చెప్పారు.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జూలై 25న నాట్య ప్రదర్శన జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అద్భుత కావ్యాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనలో తమ ప్రతిభ చూపేందుకు ఐదో తరగతి ఆపై చదివే చిన్నారులు పాల్గొనవచ్చని, పాల్గొనదలిచేవారు తమ పేరు, వయస్సు, ఊరు వివరాలతో 8008889845 నెంబరుకు సంక్షిప్త సందేశాన్ని పంపించాలని కోరారు.
గోదావరి పుష్కరాల ముగింపులో కూచిపూడి మహాబృంద నాట్యం
Published Thu, Jun 25 2015 6:48 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement