'మెస్సీ గోల్స్ చేయకపోయినా సంతోషంగా ఉంది' | Messi doesn't need goals to be happy, Coach Gerardo Martino | Sakshi
Sakshi News home page

'మెస్సీ గోల్స్ చేయకపోయినా సంతోషంగా ఉంది'

Published Thu, Jul 2 2015 3:13 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

'మెస్సీ గోల్స్ చేయకపోయినా సంతోషంగా ఉంది'

'మెస్సీ గోల్స్ చేయకపోయినా సంతోషంగా ఉంది'

కాన్సెప్సియన్ (చిలీ):కోపా అమెరికా ప్రపంచకప్ లో అర్జెంటీనా ఫైనల్ కు చేరడం పట్ల కోచ్ జెరార్డో మార్టిన్ సంతోషం వ్యక్తం చేశాడు. మంగళవారం పరాగ్వేతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో మెస్సీ చెలరేగడంతో అర్జెంటీనా తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మెస్సీది కీలకపాత్రే కానీ వ్యక్తిగతంగా గోల్స్ మాత్రం అతని ఖాతాలో లేవు. జట్టు సహచరులకు పాస్ లను అందిస్తూ జట్టు ఐదు గోల్స్  సాధించడంలో మాత్రం ప్రముఖ పాత్ర పోషించాడు. దీనిపై ఆ జట్టు కోచ్ మార్టిన్ తనదైన శైలిలో స్పందించాడు.

 

తమ స్టార్ ఆటగాడు గోల్స్ చేయకపోయినా తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించాడని కొనియాడాడు. డీప్ ఫార్వర్డ్ లో విఫలమైన మెస్సీ ఆ తరువాత మిడ్ ఫీల్డ్ కు వెళ్లాడని.. ఆ క్రమంలోనే బంతిని ప్రత్యర్థి జట్టుకు అందనీయకుండా పాస్ లు అందించిన తీరు అమోఘమన్నాడు. దీంతో మెస్సీ గోల్స్  చేయడంలో ప్రత్యక్ష పాత్ర పోషించకపోయినా..  తమకు సంతోషాన్నిచ్చాడని మార్టిన్ పేర్కొన్నాడు.  శనివారం జరిగే తుదిపోరులో చిలీతో అర్జెంటీనా ఆమీతుమీ తేల్చుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement