
‘టార్చ్’ టార్చర్!
సరదాగా...
ఈ ఫొటోలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ మీద పడిన ఆకుపచ్చ రంగు లైట్ చూశారా! కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మెస్సీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అభిమానులు ఇలా లైట్ వేశారు. అయితే యూరోప్‌లోని అనేక లీగ్‌లలో ఆటగాళ్లను దెబ్బతీయడానికి అభిమానులు ఈ ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. సాధారణంగా మన దగ్గర ఎరుపు రంగులో ఇలాంటి టార్చ్‌లు దొరుకుతాయి. దీని కాంతి మీద పడితే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ పెద్దగా ప్రమాదం ఉండదు.
ఈ ఆకుపచ్చ లైట్ నేరుగా క ళ్ల మీద పడితే చాలా ప్రమాదం అట. కొద్దిసేపు కంటిచూపు పోతుందట. వెయ్యి రూపాయలకు దొరికే ఈ లైట్ ద్వారా రెండు కిలోమీటర్ల దూరం కూడా కాంతి పడుతుందట. స్టేడియాలలోకి గ్రీన్ టార్చ్ తేవడంపై నిషేధం ఉంది. మెస్సీ ఉదంతం నేపథ్యంలో ఇకపై మరింత జాగ్రత్తగా అభిమానులను తనిఖీ చేస్తారట.