Copa America Cup
-
ఉరుగ్వేకు మూడో స్థానం
చార్లోటి (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ ఉరుగ్వే జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఉరుగ్వే ‘షూటౌట్’లో 4–3 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించింది.నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. రెగ్యులర్ టైమ్‌లో కెనడా తరఫున ఇస్మాయిల్ కోన్ (20వ ని.లో), జొనాథన్ డేవిడ్ (80వ ని.లో)... ఉరుగ్వే తరఫున రోడ్రిగో కోల్మన్ (8వ ని.లో), లూయిస్ స్వారెజ్ (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
23 ఏళ్ల తర్వాత...
చార్లోటి (నార్త్ కరోలినా): రెండోసారి కోపా అమెరికా కప్ చాంపి యన్‌గా నిలిచేందుకు కొలంబియా జట్టు విజయం దూరంలో నిలిచింది. గతంలో 15 సార్లు చాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వే జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా సొలిస్ గోల్ చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొలంబియా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి అర్ధభాగం చివర్లో కొలంబియా ప్లేయర్ మునోజ్ రెడ్ కార్డుకు గురై మైదా నం వీడాడు. దాంతో రెండో అర్ధభాగం మొత్తం కొలంబియా పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో ఉరుగ్వే 62 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా కొలంబియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయడంలో విఫలమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా ఆడుతుంది. 1975లో తొలిసారి ఈ టోరీ్నలో ఫైనల్ చేరిన కొలంబియా రన్నరప్‌గా నిలువగా ... 2001లో రెండోసారి ఫైనల్ ఆడి తొలి టైటిల్ సొంతం చేసుకుంది. -
Copa America: సంచలన విజయం.. ఫైనల్లో కొలంబియా
కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొలంబియా సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఉరుగ్వేను 1-0తో ఓడించింది. తద్వారా ఇరవై మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది.పోటాపోటీగా సాగిన ఆట 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా గోల్ కొట్టి కొలంబియా గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే, ఓటమిని జీర్ణించుకోలేని ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఉరుగ్వే స్ట్రైకర్ నూనెజ్ సహా మరికొందరు ఆటగాళ్లు.. ప్రేక్షకులు ఉన్న స్టాండ్‌లోకి దూసుకొచ్చి కొలంబియా మద్దతుదారులపై పిడిగుద్దులు కురిపించాడు.దీంతో మ్యాచ్‌కు వేదికైన బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాహకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో 28 విజయాలతో అజేయంగా నిలిచిన కొలంబియా ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. మియామీ వేదికగా ఇరు జట్లు ఆదివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. కాగా 2001లో కొలంబియా తొలిసారి ఈ టోర్నమెంట్లోట్రోఫీ గెలిచింది.30వసారి టైటిల్ పోరుకు అర్హత కాగా వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 30వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది.ఆట 22వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 51వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేసుకుంది. అర్జెంటీనా తరఫున మెస్సీకిది 109వ గోల్ కావడం విశేషం. ఇక మెస్సీ 38 వేర్వేరు దేశాలపై గోల్స్ చేశాడు.అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 130 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.After defeat to Colombia, Uruguayan players entered the stands at Bank of America Stadium and began to throw punches. Liverpool forward Darwin Nunez amongst those at the forefront. pic.twitter.com/VE3unKObSa— Kyle Bonn (@the_bonnfire) July 11, 2024 -
COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్‌లో కెనడాపై విజయం
కోపా అమెరికా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్ సాధించారు. రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
బ్రెజిల్‌కు చుక్కెదురు
లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ బ్రెజిల్ జట్టు కథ ముగిసింది. ‘షూటౌట్’ ద్వారా ఫలితం తేలిన క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వే 4–2తో బ్రెజిల్ జట్టును ఓడించి 2011 తర్వాత ఈ టోరీ్నలో మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్స్ చేయలేదు. ‘షూటౌట్’లో ఉరుగ్వే తరఫున నలుగురు ప్లేయర్లు వల్వెర్డె, బెంటాన్కర్, అరాసెటా, ఉగార్టె... బ్రెజిల్ తరఫున ఇద్దరు ప్లేయర్లు పెరీరా, మారి్టనెల్లి గోల్స్ సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్లో కొలంబియా 5–0తో పనామా జట్టు ను ఓడించింది. బుధవారం జరిగే తొలి సెమీఫైన ల్లో కెనడాతో అర్జెంటీనా; గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వేతో కొలంబియా ఆడతాయి. -
బ్రెజిల్ ముందుకు...
సాంటాక్లారా (అమెరికా): కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ విజేత బ్రెజిల్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రెజిల్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. బ్రెజిల్ తరఫున రాఫినా (12వ ని.లో), కొలంబియా తరఫున డేనియల్ మునోజ్ (45+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఏడు పాయింట్లతో కొలంబియా గ్రూప్ ‘టాపర్’గా నిలువగా... ఐదు పాయింట్లతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఈక్వెడార్‌తో అర్జెంటీనా; వెనిజులాతో కెనడా; పనామాతో కొలంబియా; ఉరుగ్వేతో బ్రెజిల్ తలపడతాయి. -
Copa America Cup: అర్జెంటీనా బోణీ.. మెస్సీ అరుదైన రికార్డు
అట్లాంటా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించింది.అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (49వ ని.లో), లాటారో మార్టినెజ్ (88వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మెస్సీ అందించిన పాస్‌లతో ఈ రెండు గోల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెస్సీ వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్‌లో అత్యధికంగా 35 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.ఇప్పటి వరకు ఈ రికార్డు చిలీకి చెందిన సెర్జియో లివింగ్‌స్టోన్ (1941 నుంచి 1953 వరకు; 34 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఈనెల 26న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చిలీతో అర్జెంటీనా ఆడుతుంది. View this post on Instagram A post shared by CONMEBOL Copa América™ USA 2024 (@copaamericaeng) -
ఈ విజయం మారడోనాకు అంకితం..
బ్యూనెస్ ఎయిరెస్: 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా అవతరించిన అర్జెంటీనా ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. ఆ జట్టు టైటిల్ గెలిచాక తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ప్రతిష్టాత్మక టైటిల్‌ను దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సహా కరోనా బాధిత కుటుంబాలకు అంకితమిచ్చాడు. అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలవాలని మారడోనా ఆకాంక్షించాడని, అతని కలను నా సారధ్యంలోని అర్జెంటీనా జట్టు సాకారారం చేయడం నా అదృష్టమని మెస్సీ పేర్కొన్నాడు. మారడోనా భౌతికంగా తమ మధ్య లేకపోయినా, అతని ఆత్మ జట్టును ప్రోత్సహిస్తూ ఉండిందని తెలిపాడు. మరోవైపు అభిమానులు విజయోత్సవాలను జరుపుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ విజయంతో లభించిన సంతోషంతో బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చాడు. తన జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు, ముఖ్యంగా తనను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ మెస్సీ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది మెస్సీ కెరీర్లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడంతో అతని ఆనందానికి హద్దులు లేవు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన మెస్సీ.. జట్టు విజయాన్ని కోవిడ్ బాధిత కుటుంబాలకు, అలాగే గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు తెలిపిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. -
28 ఏళ్ల నిరీక్షణకు తెర, కన్నీళ్లతో ఆటగాళ్లు..
అద్భుతమైన జట్టుగా పేరు.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది అర్జెంటీనా టీం. చివరకు మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన టోర్నీ అది. అలాంటిది ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. తద్వారా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు. దీంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది. #CopaAmérica 🏆 ¡ACÁ ESTÁ LA COPA! Lionel Messi 🔟🇦🇷 levantó la CONMEBOL #CopaAmérica y desató la locura de @Argentina 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/PCEX6vtVee — Copa América (@CopaAmerica) July 11, 2021 మెస్సీ-నెయ్మర్.. ఇద్దరూ కన్నీళ్లే ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. #CopaAmérica 🏆 ¡LO LINDO DEL FÚTBOL! Emotivo abrazo entre Messi 🇦🇷 y Neymar 🇧🇷 ¡ÍDOLOS! 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/ecknhlv2VI — Copa América (@CopaAmerica) July 11, 2021 తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్ టైటిల్ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది. Messi is tossed in the air by his Argentina teammates. It means everything ❤️pic.twitter.com/cIMJahlCAQ — ESPN India (@ESPNIndia) July 11, 2021 ఇక ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్ కోపాను గెల్చుకోలేకపోయింది. -
34 టైటిల్స్ గెలిచిన మెస్సీకి ఆ లోటు తీరేనా?!
రియో డి జనీరో: తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయెనల్ మెస్సీ దేశం తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క గొప్ప టైటిల్‌ను కూడా గెలవలేకపోయాడు. కోపా అమెరికా కప్ రూపంలో ఆ లోటును తీర్చుకునే అవకాశం మళ్లీ మెస్సీకి లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌తో అర్జెంటీనా తలపడనుంది. చివరిసారి అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను నెగ్గాలనే కసితో మెస్సీ బృందం కనిపిస్తోంది. ఫైనల్ ఆదివారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి సోనీసిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. -
రొనాల్డో రికార్డ్‌ను బద్దలు కొట్టిన మెస్సీ..
బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న ఫ్రీకిక్ గోల్స్ రికార్డును ఈ అర్జెంటీనా సంచలన ఫుట్‌బాలర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొత్తం మూడు గోల్స్ చేయగా.. అన్నింటిలోనూ మెస్సీ భాగస్వామిగా ఉన్నాడు. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి అర్జెంటీనా లీడ్‌ను 3-0కు పెంచాడు. ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును మెస్సీ అధిగమించాడు. ఇప్పటివరకు రొనాల్డో ఫ్రీకిక్స్తో 57 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 58వ సారి ఫ్రీకిక్ గోల్ సాధించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతానికి 76 గోల్స్ సాధించిన మెస్సీ.. మరొక్క గోల్ చేస్తే, అత్యధిక గోల్స్ సాధించిన సౌత్ అమెరికన్‌గా చరిత్ర పుటల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో దిగ్గజ ఫుట్‌బాలర్, బ్రెజిల్ మాజీ కెప్టెన్ పీలే 77 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఇక నా వల్ల కాదు
మెస్సీ అస్త్ర సన్యాసం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన క్లబ్ ఫుట్‌బాల్‌లో తిరుగు లేని సూపర్ స్టార్... వేసే ప్రతి అడుగు, మైదానంలో పరుగుకు కోట్లాది రూపాయల కనకవర్షం కురుస్తుంది. మెస్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఒక మాయ. నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిల్స్, ఏకంగా ఎనిమిది స్పానిష్ లీగ్ ట్రోఫీలు, లెక్క లేనన్ని అవార్డులు, రివార్డులు, లెక్క పెట్టలేనంత మంది ఫ్యాన్స్. దేశం తరఫున 11 ఏళ్ల కెరీర్... చెప్పుకోదగ్గ అంతర్జాతీయ టైటిల్ ఒక్కటి కూడా లేదు. మూడు కోపా అమెరికా ఫైనల్స్‌లో ఓటమి. వరల్డ్ కప్ ఫైనల్ పోరు కూడా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఐదు సార్లు ‘ఫిఫా’ ఉత్తమ ఆటగాడే అయినా ఆ ఉత్తమ ప్రదర్శన అర్జెంటీనాకు మాత్రం ఏ టైటిల్‌నూ తేలేదు. అతను ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ పరాభవమే. సాక్షి క్రీడా విభాగం:- 29వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇక దేశం తరఫున ఆడలేనంటూ అస్త్ర సన్యాసం చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమై, నిరాశా నిస్పృహకు లోనై, చివరకు ‘కోపా’ పరాజయ భారంలో ప్రధాన భాగమై అతను నిష్ర్కమించాడు. ఫైనల్లో చిలీ చేతిలో ఓడిన తర్వాత ‘నేను అర్జెంటీనా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాను’ అని అతను ప్రకటించాడు. 2005లో అర్జెంటీనా జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన మెస్సీ మొత్తం 113 మ్యాచ్‌లలో 55 గోల్స్ చేశాడు. ‘నేను చేయాల్సిందంతా చేశాను. నాలుగు ఫైనల్స్ ఆడినా గెలుపు దక్కలేదు. దేశం తరఫున టైటిల్ గెలవాలని అందరికంటే ఎక్కువగా భావించాను. రిటైర్మెంట్ కఠిన నిర్ణయమే. వెనక్కి వచ్చే ఆలోచన లేదు’ అని మెస్సీ స్పష్టం చేశాడు. రికార్డులే రికార్డులు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ను శిఖరాన నిలిపిన మారడోనా తర్వాత మెస్సీనే ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో తన దేశానికి అండర్-20 ప్రపంచకప్‌ను అందించాక ఈ కుర్రాడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత అతి పిన్న వయసులో దేశం తరఫున ‘ఫిఫా’ ప్రపంచ కప్ ఆడిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవటం లాంఛనమే అయింది. 5’7’’ ఎత్తు అంటే సాధారణంగా ఫుట్‌బాలర్లలో తక్కువగానే లెక్క. కానీ దీంతోనే అతను మైదానంలో చురుగ్గా దూసుకుపోయి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు. వరుసగా నాలుగు సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా నీరాజనాలందుకున్న మెస్సీ... తక్కువ వ్యవధిలోనే దిగ్గజ ఫుట్‌బాలర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశాడు. ఆ ఒక్కటీ తప్ప... క్లబ్ ఆటగాడిగా ఉన్న గుర్తింపును పక్కన పెడితే అర్జెంటీనా తరఫున కూడా మెస్సీ ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. జట్టులో సీనియర్లు ఎంత మంది ఉన్నా... ఒంటిచేత్తో పలు మ్యాచ్‌లలో గెలిపించాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో దురదృష్టం అతడిని వెంటాడింది. ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం గుర్తుంచుకునే ప్రధాన టోర్నీలలో మాత్రం అతనికి విజయానందం దక్కలేదు. మెస్సీ జట్టులోకి వచ్చిన తర్వాత మూడు ప్రపంచకప్‌లు, కోపా అమెరికా కప్‌లలో అర్జెంటీనా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దాంతో కీలక టోర్నీల్లో జట్టును గెలిపించలేడనే విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటతో ఎంత మెప్పించినా... ఈ విషయంలో మాత్రం మారడోనాను అతను మరిపించలేకపోయాడు. ఫలితంగా ఈ ‘పదో నంబర్’ ఆటగాడికి ప్రపంచం అర్జెంటీనా తరఫున రెండో స్థానమే ఇచ్చింది! 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ఒక్కటే అతనికి కాస్త ఊరటనిచ్చే విషయం. 31 ఏళ్ల వయసులో మరో ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశం ఉన్నా అతను దానిని వద్దనుకున్నాడు. తిరిగొస్తాడా..! మెస్సీ అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఓటమి కారణంగా ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తుండగా, మరో వరల్డ్ కప్ ఆడినా అతని అంతర్జాతీయ కెరీర్‌కు పెద్దగా లాభం లేదని మరి కొందరు చెబుతున్నారు. అర్జెంటీనా సహచరులు రొమెరో, అగ్వెరో, హిగుయెన్ మాత్రం మెస్సీ లేని జట్టును ఊహించలేమని, అతను మళ్లీ ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. జట్టు మేనేజర్ గెరార్డో వ్యాఖ్యలు కూడా మెస్సీని ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించినట్లు తమకే తెలీదని ఆయన మీడియా సమావేశంలో చెప్పడం విశేషం. ‘మేం ప్రపంచ కప్ అర్హత పోటీలు ఆడుతున్నాం. వీటిని అర్ధాంతరంగా వదిలేసి అతను వెళ్లిపోలేడు. అసలు కొనసాగకపోవడానికి తగిన కారణం కనిపించడం లేదు. అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఫైనల్లో ఓటమి ఎవరినైనా బాధిస్తుంది’ అని గెరార్డో వ్యాఖ్యానించారు. -
ఓటమిపై మెస్సీ ఆవేదన
ఈస్ట్ రూథర్‌ఫర్డ్: కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ తుది పోరులో అర్జెంటీనాను విజేతగా నిలపడంలో విఫలమైన ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జెంటీనాకు కప్ సాధించి పెట్టాలని శతవిధిలా తనవంతు ప్రయత్నం చేసినా, అది సాధ్యం కాలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ఓటమిపై విశ్లేషించే సమయం కాకపోయినా, గెలుపు సాధించడం కష్టంగా మారిందన్నాడు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఫుట్ బాల్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పినట్లు మెస్సీ తెలిపాడు. ఇక జాతీయ జట్టుతో ఆడనందుకు బాధగా ఉన్నా ఓటమికి నైతిక బాధ్యతగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. ' జట్టును కోపా అమెరికా చాంపియన్‌గా నిలుపుదామని ప్రయత్నించా. అయితే అది జరగలేదు. ఓటమికి బాధ్యత నాదే. ఇక అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించను. ఎంతో ముఖ్యమైన పెనాల్టీ షూటౌట్‌ను సాధించలేకపోయా. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదు 'అని మ్యాచ్ అనంతరం మెస్సీ పేర్కొన్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన కోపా ఫైనల్ పోరులో చిలీ 4-2 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. తద్వారా వందేళ్ల సుదీర్ఘ చరిత్రలోభాగంగా నిర్వహించిన ఈ కప్‌ను చిలీ సగర్వంగా వరుసగా రెండోసారి అందుకుంది. 2015లో కూడా చిలీ చేతిలోనే అర్జెంటీనా ఓటమి పాలైంది. అప్పుడు కూడా పెనాల్టీ షూటౌట్లోనే చిలీ జయకేతనం ఎగురువేసింది. ఆనాటి ఫైనల్లో చిలీ 4-1 తేడాతో విజయం సాధించగా, ఈ ఏడాది పోరులో 4-2 తో గెలిచింది. ఈ రెండు సార్లు అర్జెంటీనా కెప్టెన్‌గా మెస్సీని ఉండటం గమనార్హం.క్లబ్ జట్టు బార్సిలోనాకు ఎన్నో ట్రోఫీలు అందించిన మెస్సీ.. అర్జెంటీనా కేవలం రెండు ప్రధాన ట్రోఫీలను సాధించడంలో మాత్రమే మెస్సీ భాగస్వామి అయ్యాడు. అండర్-20 వరల్డ్ కప్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్జెంటీనా జట్టులో మాత్రమే మెస్సీ పాలు పంచుకున్నాడు. -
కొలంబియాకు మూడో స్థానం
► అమెరికాపై 1-0తో విజయం ► కోపా అమెరికా కప్ గ్లెండేల్ (అమెరికా): కోపా అమెరికా కప్‌లో కొలంబియా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య అమెరికా జట్టుతో ఆదివారం మూడు, నాలుగో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో కొలంబియా 1-0 గోల్‌తో నెగ్గింది. స్ట్రయికర్ కార్లోస్ బాకా (31వ నిమిషంలో) కొలంబియా తరఫున ఏకైక గోల్ సాధించాడు. అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో 0-4తో ఓడిన అమెరికా ఈ మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గోల్ కీపర్ డేవిడ్ ఓస్పినా అడ్డుగోడలా నిలవడంతో పలు గోల్ ప్రయత్నాలు కూడా వమ్ము అయ్యాయి. ఈ టోర్నీలో కొలంబియా చేతిలో అమెరికా ఓడటం ఇది రెండోసారి. మ్యాచ్ తొలి 12వ నిమిషంలోనే స్టార్ ఆటగాడు జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ అవకాశాన్ని కీపర్ టిమ్ హోవర్డ్ అడ్డుకున్నాడు. అయితే ఆ తర్వాత అతనే ఇచ్చిన పాస్‌ను 31వ నిమిషంలో బాకా అతి సమీపం నుంచి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ద్వితీయార్ధంలో డెంప్సీ ఫ్రీకిక్ దాదాపు గోల్‌పోస్టులోకి వెళ్లినట్టే అనిపించినా ఓస్పినా ఒంటి చేత్తో దాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు. -
వరుసగా రెండోసారి..
► కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ ► సెమీస్‌లో కొలంబియాపై 2-0తో విజయం ► అర్జెంటీనాతో అమీతుమీ షికాగో: డిఫెండింగ్ చాంపియన్ చిలీ మరోసారి పంజా విసిరింది. క్వార్టర్స్‌లో మెక్సికోను 7-0తో చిత్తు చేసి జోరు మీదున్న ఈ చాంపియన్ జట్టు గురువారం జరిగిన సెమీఫైనల్లో కొలంబియాను 2-0తో ఓడించింది. దీంతో వరుసగా రెండోసారి కోపా అమెరికా ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది జరిగిన తుది పోరులోనూ ఈ రెండు జట్లే పోటీపడ్డాయి. మూడో స్థానం కోసం ఆదివారం జరిగే మ్యాచ్‌లో కొలంబియా, అమెరికాతో తలపడుతుంది. చిలీ తరఫున చార్లెస్ అరంగిజ్ (7వ నిమిషంలో), జోస్ పెడ్రో ఫ్యూంజలిడా (11) గోల్స్ సాధించారు. అయితే ప్రథమార్ధం ముగిసిన అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఆటకు రెండున్నర గంటలు అంతరాయం ఏర్పడింది. ఓ దశలో మిగతా మ్యాచ్‌ను వాయిదా వేయాలని భావించినా వర్షం ఆగడంతో కొనసాగించారు. ఆట మొదలైన 11 నిమిషాలకే రెండు గోల్స్ చేసిన చిలీ ప్రథమార్ధం మొత్తం ఆధిపత్యం కనబరచింది. ద్వితీయార్ధంలో కొలంబియా స్టార్ రోడ్రిగ్వెజ్ మెరుపు ఆటను చూపినా చిలీ డిఫెన్స్‌ను అధిగమించలేకపోయాడు. -
మెస్సీ మ్యాజిక్
► ఫైనల్లో అర్జెంటీనా ► సెమీస్‌లో అమెరికాపై ఘన విజయం ► కోపా అమెరికా కప్ హూస్టన్: వ్యూహాత్మక కదలికలు... సహచరులతో చక్కని సమన్వయం... ప్రత్యర్థులను బురిడి కొట్టించే షార్ట్ పాస్‌లతో అలరించిన స్టార్ స్ట్రయికర్ లియోనల్ మెస్సీ... కోపా అమెరికా కప్‌లో మరోసారి మ్యాజిక్ చేశాడు. కీలక సమయంలో గోల్ సాధించడంతో పాటు సహచరుల గోల్స్‌లోనూ ప్రముఖ పాత్ర పోషించడంతో... బుధవారం జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 4-0తో అమెరికాపై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. లావెజ్జీ (3వ ని.), మెస్సీ (32వ ని.), హిగుయాన్ (50, 86వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. 1993 తర్వాత ఇంతవరకు కోపా టైటిల్‌ను గెలవని అర్జెంటీనా.... గతేడాది ఫైనల్‌కు చేరినా చిలీ చేతిలో ఓడింది. దీంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అర్జెంటీనాకు నిలకడ విజయాలు అందిస్తున్న మెస్సీ... అమెరికాపై కూడా తన ప్రభావాన్ని చూపెట్టాడు. రెండు ఫ్లాంక్ల నుంచి అటాకింగ్ మొదలుపెట్టడంతో ఆరంభంలో అమెరికా డిఫెన్స్ కాస్త తడబడింది. దీంతో మూడో నిమిషంలో బనేగా ఇచ్చిన కార్నర్ పాస్‌ను లావెజ్జీ నేర్పుగా నెట్లోకి పంపి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తర్వాత యూఎస్ స్ట్రయికర్లు.. అర్జెంటీనా రక్షణశ్రేణిని ఛేదించినా గోల్స్ మాత్రం చేయలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాక్‌లైన్ నుంచి మెస్సీ ఇచ్చిన పాస్‌ను లావెజ్జీ వృథా చేశాడు. కానీ మరో 29 నిమిషాల తర్వాత బెకర్మెన్, క్రిస్‌లు సమన్వయం తప్పడంతో బంతిని అందుకున్న మెస్సీ 26 గజాల నుంచి కొట్టిన ఫ్రీకిక్ గోల్ పోస్ట్‌ను ఛేదించింది. అంతర్జాతీయ కెరీర్లో మెస్సీకి ఇది 55వ గోల్. రెండో అర్ధభాగం మొత్తం యూఎస్.. మెస్సీని లక్ష్యంగా చేసుకుంది. దీంతో చిన్నచిన్న పాస్‌లను సహచరులకు అందిస్తూ స్కోరు చేసే అవకాశాలు కల్పించాడు. ఫలితంగా ఐదు నిమిషాల తర్వాత ఆఫ్‌సైడ్ నుంచి యూఎస్ ఆటగాళ్లను తప్పిస్తూ లావెజ్జీ ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ ఎలాంటి తేడా లేకుండా లక్ష్యాన్ని చేర్చాడు. దీంతో యూఎస్‌పై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. మరో 36 నిమిషాల తర్వాత బ్రిన్బామ్ చేసిన ఘోర తప్పిదం అర్జెంటీనాకు నాలుగో గోల్ తెచ్చిపెట్టింది. 20 గజాల దూరం నుంచి మెస్సీ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను హిగుయాన్ అంతే అద్భుతంగా నెట్లోకి పంపడంతో అమెరికా నివ్వెరపోయింది. కొలంబియా, చిలీల సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో... ఆదివారం జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. -
మెస్సీ ‘రికార్డు’ షో
► సెమీఫైనల్లోకి అర్జెంటీనా ► వెనిజులాపై 4-1తో విజయం ► కోపా అమెరికా కప్ ఫాక్స్‌బరో (అమెరికా): కోపా అమెరికా కప్‌లో సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో నాలుగో గోల్ సాధించడంతో పాటు అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ (54) చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆదివారం వెనిజులాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ను మెస్సీ అంతా తానై శాసించడంతో అర్జెంటీనా 4-1తో నెగ్గి సెమీస్‌కు చేరింది. 60వ నిమిషంలో చేసిన గోల్‌తో మెస్సీ ఇప్పటిదాకా గాబ్రియల్ బటిస్టుటా పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును సమం చేశాడు. అలాగే జట్టు సాధించిన మరో రెండు గోల్స్‌లోనూ తన పాత్ర ఉండడం విశేషం. గోంజలో హిగువాన్ (8వ, 28వ నిమిషాల్లో), లమేలా (71వ నిమిషంలో) మిగతా గోల్స్ చేశారు. వెనిజులా నుంచి రోండన్ (70వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు అమెరికాతో తలపడుతుంది. అంతకుముందు ప్రథమార్ధం నుంచే మెస్సీ తన మేజిక్‌ను చూపాడు. దీంతో 8వ నిమిషంలోనే జట్టు ఆధిక్యం సాధించింది. టచ్‌లైన్ నుంచి పెనాల్టీ ఏరియాలోకి మెస్సీ ఇచ్చిన అద్భుత పాస్‌ను అందుకున్న హిగువాన్ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా గోల్ చేశాడు. ఆ తర్వాత కూడా వెనిజులా గోల్‌పోస్టుపై అర్జెంటీనా దాడులను కొనసాగించింది. అయితే 27వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గోంజలెజ్ను అడ్డుకున్నందుకు నికోలస్ గైటాన్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. దీంతో తను అమెరికాతో సెమీస్‌కు దూరం కానున్నాడు. వర్గాస్ నాలుగు గోల్స్... సాంటా క్లారా (అమెరికా): వరుస విజయాలతో దూసుకెళుతున్న మెక్సికో జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ చిలీ బ్రేక్ వేసింది. ఫార్వర్ట్ ఆటగాడు ఎడ్వర్డో వర్గాస్ (44, 52, 57, 74వ నిమిషాల్లో) ఏకంగా నాలుగు గోల్స్‌తో అదరగొట్టడంతో పాటు పేలవమైన ఆటతీరుతో మెక్సికో మూల్యం చెల్లించుకుంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0తో మెక్సికోను చిత్తుగా ఓడించింది. ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టు ఇంత ఘోరంగా ఓడడం ఇదే తొలిసారి. గతంలో 1978 ప్రపంచకప్‌లో మెక్సికో 0-6తో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడింది. 70 వేలకు పైగా ఉన్న మెక్సికో మద్దతుదారుల మధ్య చిలీ ఈ మ్యాచ్‌లో అసమాన ప్రతిభను చూపింది. 13 నిమిషాల వ్యవధిలోనే వర్గాస్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఎడ్సన్ పూచ్ (16వ, 87వ ని.లో) రెండు గోల్స్, అలెక్సిస్ సాంచెజ్ (49వ ని.లో) ఓ గోల్ చేశాడు. -
చిలీ 'సూపర్' షో
శాంతా క్లారా(యూఎస్): కోపా అమెరికా ఫుట్ బాల్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ చిలీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0 తేడాతో మెక్సికోను కంగుతినిపించి సెమీస్‌లోకి ప్రవేశించింది. చిలీ ఆటగాడు వార్గాస్ నాలుగు గోల్స్ చేసి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆట 16వ నిమిషంలో ఎడ్సన్ పచ్ తొలి గోల్‌ను అందించి చిలీని ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం 13 నిమిషాల వ్యవధిలో చిలీ ఆటగాడు వార్గాస్ హ్యాట్రిక్ గోల్స్ అదరగొట్టాడు. 44, 52, 57వ నిమిషాల్లో వార్గాస్ మూడు గోల్స్ సాధించాడు. ఆపై 74వ నిమిషంలో వార్గాస్ ఖాతాలో మరో గోల్ నమోదు చేశాడు. చిలీ మిగతా ఆటగాళ్లలో సాంచెజ్(49వ నిమిషం), ఎడ్సన్ పచ్(87వ నిమిషంలో) గోల్స్ నమోదు చేసి జట్టుకు 7-0 తేడాతో సంపూర్ణ విజయాన్ని అందించారు. దీంతో చారిత్రాత్మక విజయం చిలీ ఖాతాలో చేరగా, ఒక ప్రధాన టోర్నమెంట్లో దారుణమైన ఓటమిని మెక్సికో తొలిసారి మూటగట్టుకుంది.. అంతకుముందు 1978 వరల్డ్ కప్ లో వెస్ట్ జర్మనీ చేతిలో 6-0తేడాతో మెక్సికో ఓటమి పాలైన తరువాత ఆ జట్టుకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన కావడం గమనార్హం. -
లియోనల్ మెస్సీ రికార్డ్
ఫాక్స్ బారో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నిలో అర్జెంటీనా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగి క్వార్టర్ ఫైనల్లో వెనిజులాను 4-1 తో ఓడించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ రికార్డ్ గోల్ తో వెనిజులాను ఇంటిదారి పట్టించాడు. ఈ బార్సిలోనా సూపర్ స్టార్ ఆట 60 నిమిషంలో గోల్ సాధించాడు. ఈ టోర్నమెంట్ అతడు చేసిన నాలుగో గోల్ ఇది. 54 అంతర్జాతీయ గోల్స్ తో గాబ్రియల్ బాటిస్టుటా రికార్డును సమం చేశాడు. ఆట ఆరంభం నుంచి వెనిజులాపై అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట ద్వితీయార్థంలో ఎరిక్ లమేలా గోల్ కొట్టాడు. గొంజాలో హిగారియన్ రెండు గోల్స్ చేశాడు. కాగా, అత్యధిక గోల్స్ రికార్డును సమం చేయడం పట్ల మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. దీని కంటే మ్యాచ్ గెలవడమే తనకు ఎక్కువ సంతోషం కలిగించిందన్నాడు. టైటిల్ దక్కించుకోవడమే తన ముందు లక్ష్యమని చెప్పాడు. గతేడాది ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయింది. -
సెమీస్ కు దూసుకెళ్లిన అమెరికా
కోపా అమెరికా కప్ క్వార్టర్స్‌లో ఈక్వెడార్‌పై విజయం సీటెల్: కోపా అమెరికా సెంటినరీ కప్‌లో ఆతిథ్య అమెరికా జట్టు దుమ్ము రేపుతోంది. వెటరన్ ఫార్వర్డ్ ఆటగాడు క్లింట్ డెంప్సీ తన సూపర్ ఫామ్‌ను మరోసారి చాటుకోవడంతో పాటు జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చాడు. గురువారం ఈక్వెడార్‌తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్ఫైనల్లో అమెరికా 2-1తో విజయాన్ని అందుకుంది. 1995 అనంతరం ఈ టోర్నీలో అమెరికా సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. శనివారం అర్జెంటీనా, వెనిజులా మధ్య జరిగే క్వార్టర్స్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు సెమీస్‌లో తలపడుతుంది. 22వ నిమిషంలోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించిన డెంప్సీకి ఈ టోర్నీలో ఇది మూడో గోల్. గ్యాసీ జార్డెస్ (65) మరో గోల్ సాధించాడు. ఈక్వెడార్ నుంచి మైకేల్ అరోయో (74) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభంలో అమెరికా జోరును కనబరిచింది. ఈక్వెడార్ డిఫెన్స్‌ను ఏమార్చుతూ స్ట్రయికర్ బాబీ వుడ్ వేగవంతమైన ఆటను ప్రదర్శించినా గోల్స్ మాత్రం నమోదు కాలేదు. అయితే 22వ నిమిషంలో జెర్నెన్ జోన్స్ ఇచ్చిన పాస్‌ను గాల్లోకి ఎగిరి హెడర్ ద్వారా డెంప్సీ గోల్ చేశాడు. మరో ఐదు నిమిషాల్లోనే డెంప్సీ ప్రమాదకర షాట్‌ను ఈక్వెడార్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే ద్వితీయార్ధం ఆరంభం నుంచే ఈక్వెడార్ గోల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 48వ నిమిషంలో ఎన్నెర్ వాలెన్సియా హెడర్ షాట్ కొద్దిలో మిస్సయ్యింది. 52వ నిమిషంలో ఇరు జట్లకు రిఫరీ షాక్ ఇచ్చారు. జెర్నెన్ జోన్స్ (అమెరికా) ప్రత్యర్థిని దురుసుగా అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురికాగా ఆంటోనియో వాలెన్సియా (ఈక్వెడార్)కు రెండో ఎల్లో కార్డ్ చూపడంతో రెండు జట్లు పది మందితోనే మిగతా మ్యాచ్ ఆడాయి. 65వ నిమిషంలో డెంప్సీ అందించిన పాస్‌ను గోల్‌పోస్టుకు అత్యంత సమీపంలో అందుకున్న జార్డెస్ ఏమాత్రం పొరపాటు చేయకుండా జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే కొద్దిసేపటికే ఈక్వెడార్ తమ ఏకైక గోల్ చేయగలిగింది. 74వ నిమిషంలో మైకేల్ అరోయో తక్కువ ఎత్తులో సంధించిన షాట్ గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. మరో రెండు నిమిషాల్లోనే ఎన్నెర్ వాలెన్సియా హెడర్ అతి సమీపం నుంచి వెళ్లిపోవడంతో అమెరికా ఊపిరిపీల్చుకుంది. ఇంజ్యూరీ సమయంలోనూ ఈక్వెడార్ శాయశక్తులా గోల్ కోసం ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. చివర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈక్వెడార్ కోచ్ గుస్తావో క్వింటెరోస్కు సైతం రిఫరీ రెడ్ కార్డ్ చూపించి స్టాండ్స్‌లోకి పంపారు. -
క్వార్టర్స్‌లో చిలీ
* గ్రూప్-డి టాపర్‌గా అర్జెంటీనా * కోపా అమెరికా కప్ ఫిలడెల్ఫియా: ఆరంభంలోనే ప్రత్యర్థులు గోల్‌తో ఒత్తిడి పెంచినా... మ్యాచ్ మధ్యలో తమదైన శైలిలో చెలరేగిన డిఫెండింగ్ చాంపియన్ చిలీ జట్టు.. కోపా అమెరికా కప్‌లో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-డి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిలీ 4-2తో పనామాపై నెగ్గింది. చిలీ తరఫున ఎడ్వర్డో వర్గాస్ (15, 43వ ని.), అలెక్సిస్ సాంచేజ్ (50, 89వ సె.) చెరో రెండు గోల్స్ చేశారు. మిగుయెల్ కామర్గో (5వ ని.), అబ్డెల్ అరోయ్ (75వ ని.) పనామాకు గోల్స్ అందించారు. ఆట ప్రారంభంలోనే పనామా మిడ్‌ఫీల్డర్ కామర్గో గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన గోల్ చేశాడు. అయితే మరో పది నిమిషాల్లోనే సాంచేజ్ ఇచ్చిన చక్కని పాస్‌ను వర్గాస్ చాలా దగ్గర్నించి నెట్లోకి ట్యాప్ చేసి స్కోరును సమం చేశాడు. బ్రేక్‌కు రెండు నిమిషాల ముందు లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి వర్గాస్ కొట్టిన బంతి; బ్రేక్ తర్వాత ఐదు నిమిషాలకు పెనాల్టీ ఏరియా నుంచి సాంచేజ్ కొట్టిన లాఫ్టెడ్ పాస్‌లు పనామా గోల్ పోస్ట్‌ను ఛేదించాయి. 25 నిమిషాల తర్వాత అరోయ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు. ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా సాంచేజ్ రెండో గోల్‌తో చిలీ ఘన విజయం సాధించింది. బొలీవియాపై అర్జెంటీనా విజయం మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో బొలీవియాపై గెలిచింది. దీంతో తొమ్మిది పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఎరిక్ లామెల్లా (13వ ని.), జీక్వెల్ లావెజ్జి (15వ ని.), విక్టర్ క్యుయేస్టా (32వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఫార్వర్డ్ లియోనల్ మెస్సీ రెండో అర్ధభాగం ఆరంభంలో బరిలోకి దిగాడు. క్వార్టర్‌ఫైనల్స్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం) 1. అమెరికా X ఈక్వెడార్ శుక్రవారం ఉ. గం 7 నుంచి 2. పెరూ X కొలంబియా శనివారం ఉ. గం 5.30 నుంచి 3. అర్జెంటీనా X వెనిజులా ఆదివారం ఉ. గం 4.30 నుంచి 4. మెక్సికో X చిలీ ఆదివారం ఉ. గం 7.30 నుంచి -
గ్రూప్ ‘సి’ టాపర్‌గా మెక్సికో
* వెనిజులాతో మ్యాచ్ ‘డ్రా’ * కోపా అమెరికా కప్ హూస్టన్: ఆరంభంలోనే ప్రత్యర్థి ఆధిక్యం పొందినా ఒత్తిడిని అధిగమించిన మెక్సికో చివర్లో గోల్ కొట్టి మ్యాచ్‌ను కాపాడుకుంది. దీంతో గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. కోపా అమెరికా కప్‌లో భాగంగా సోమవారం వెనిజులాతో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ రెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరాయి. మ్యాచ్ ఆరంభమైన 10వ నిమిషంలోనే వెనిజులా గోల్ చేసి మెక్సికోకు షాక్‌నిచ్చింది. క్రిస్టియాన్ సాంటోస్ హెడర్ ద్వారా ఇచ్చిన పాస్‌ను అందుకున్న వెలాజ్క్వెజ్ చక్కటి వ్యాలీతో గోల్‌ను సాధించాడు. అయితే ద్వితీయార్ధం 49, 56వ నిమిషాల్లోనూ స్కోరును సమం చేసేందుకు వచ్చిన అవకాశాలను మెక్సికో వినియోగించుకోలేకపోయింది. ఇక 80వ నిమిషంలో జీసస్ మాన్యుయల్ టెకాటిలో కొరోనా చేసిన గోల్‌తో మెక్సికో ఊపిరిపీల్చుకుంది. 84వ నిమిషంలో వెనిజులా నుంచి జోసెఫ్ మార్టినెజ్ గోల్ కోసం యత్నించినా మెక్సికో కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఉరుగ్వేకు ఓ విజయం: కోపా అమెరికా కప్‌ను ఉరుగ్వే జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే నాకౌట్‌కు దూరమైన ఈ జట్టు గ్రూప్ ‘సి’ నామమాత్రపు మ్యాచ్‌లో 3-0తో జమైకాను ఓడించింది. -
అయ్యో... బ్రెజిల్!
* రిఫరీ తప్పిదంతో తొలి రౌండ్లో నిష్ర్కమణ * కోపా అమెరికా కప్ క్వార్టర్స్‌లో పెరూ ఫాక్స్‌బరో (యూఎస్): కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ జట్టును దురదృష్టం వెంటాడింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు పాలిట రిఫరీ విలన్‌గా మారారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి చేతికి తాకి నెట్‌లోనికి వెళ్లిన బంతిని గోల్‌గా ప్రకటించడంతో ఈ ప్రఖ్యాత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో పెరూ ఈ వివాదాస్పద గోల్‌తో 1-0తో నెగ్గింది. 31 ఏళ్లలో బ్రెజిల్‌పై పెరూకిదే తొలి విజయం. మ్యాచ్ తొలి అర్ధభాగం బ్రెజిల్ హవా కనిపించింది. అయితే ద్వితీయార్ధం 74వ నిమిషంలో బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. బై లైన్ నుంచి పెరూ ఆటగాడు ఆండీ పోలో ఇచ్చిన క్రాస్‌ను రౌల్ రూడియాజ్ గోల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో బంతి అతడి చేతిని తాకి గోల్‌పోస్టులోకి వెళ్లింది. అనూహ్యంగా ఉరుగ్వేకు చెందిన రిఫరీ ఆండ్రెస్ కున్హా దీన్ని గోల్‌గా ప్రకటించడంతో బ్రెజిల్ ఆటగాళ్లు నిశ్చేష్టులయ్యారు. రిఫరీతో వాగ్వాదానికి దిగి తమ నిరసన వ్యక్తం చేశారు. రీప్లేలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించినప్పటికీ రిఫరీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంజ్యూరీ సమయం (90+2)లో బ్రెజిల్‌కు స్కోరును సమం చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన పెరూ క్వార్టర్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ ఆడిన రెండింటిలో ఒకటి గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా క్వార్టర్స్‌కు చేరేది. కానీ ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. క్వార్టర్స్‌కు చేరిన ఈక్వెడార్ ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (యూఎస్): గ్రూప్ ‘బి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఈక్వెడార్ 4-0తో హైతీని ఓడించింది. ఎన్నెర్ వాలెన్సియా (11), అయోవి (20), నొబోవా (57), ఆంటోనియో వాలెన్సియా (78) గోల్స్ చేశారు. దీంతో ఈ గ్రూపులో రెండో స్థానం పొందిన ఈక్వెడార్ క్వార్టర్స్‌లో 16న అమెరికాతో తలపడనుంది. -
క్వార్టర్స్‌లో అమెరికా
ఫిలాడెల్ఫాయా:కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య అమెరికా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అమెరికా 1-0 తో పరాగ్వేపై విజయం సాధించింది. దీంతో అమెరికా క్వార్టర్స్ కు చేరగా, పరాగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆట తొలి అర్థ భాగంలో అమెరికా ఆటగాడు క్లింట్ డెంప్సీ గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం పరాగ్వే దూకుడును కొనసాగించిన గోల్ చేయడంలో విఫలమైంది. ఆట 11వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని జాడ విడుచుకున్న పరాగ్వే కడవరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. -
మెస్సీ మ్యాజిక్
* క్వార్టర్స్‌లో అర్జెంటీనా * బొలీవియాపై చిలీ గెలుపు * కోపా అమెరికా కప్ షికాగో: వెన్ను నొప్పి కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఫార్వర్డ్ లియోనల్ మెస్సీ... బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లోనే తన మ్యాజిక్‌ను చూపెట్టాడు. కేవలం 19 నిమిషాల్లోనే ‘హ్యాట్రిక్’ గోల్స్ చేసి అర్జెంటీనాను నాకౌట్ దశకు తీసుకెళ్లాడు. కోపా అమెరికా కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-డి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో పనామాపై నెగ్గింది. దీంతో ఆరు పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. నికోలస్ ఒటమెండి (7వ ని.), మెస్సీ (68, 78, 87వ ని.), సెర్గియో అగురో (90వ ని.) అర్జెంటీనాకు గోల్స్ అందించారు. నొప్పి నుంచి నెమ్మదిగా కోలుకుంటుండటంతో అర్జెంటీనా కోచ్ గెరార్డో మార్టినో ఊహించని రీతిలో మెస్సీని సబ్‌స్టిట్యూట్‌గా ఎంపిక చేశాడు. దీంతో 61వ నిమిషంలో అగుస్టో ఫెర్నాండేజ్ స్థానంలో మైదానంలో అడుగుపెట్టిన ఈ బార్సిలోనా సూపర్ స్టార్ సమయాన్ని ఏమాత్రం వృథా చేయలేదు. ఏడు నిమిషాల్లోనే గోంజాలో హిగుయాన్ కొట్టిన బౌన్స్ బంతిని తనదైన శైలిలో నెట్లోకి పంపి తొలి గోల్ నమోదు చేశాడు. మరో పది నిమిషాల తర్వాత బంతిని కర్లింగ్ చేస్తూ కొట్టిన ఫ్రీ కిక్ బార్ టాప్ కార్నర్ నుంచి లక్ష్యాన్ని చేరడంతో రెండో గోల్ వచ్చింది. తనను లక్ష్యంగా చేసుకొని ఆడుతున్న పనామా ఆటగాళ్లను ఓ తొమ్మిది నిమిషాల పాటు తిప్పలుపెట్టి పెనాల్టీ ఏరియా నుంచి పంపిన బలమైన షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకుపోవడంతో ‘హ్యాట్రిక్’ పూర్తయింది. అర్జెంటీనా ఐదో గోల్లోనూ మెస్సీ కీలక పాత్ర పోషించాడు. లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి పనామా డిఫెన్స్‌ను ఛేదిస్తూ అందించిన అద్భుతమైన పాస్‌ను అగురో గోల్‌గా మలిచాడు. చిలీ ఆశలు సజీవం మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చిలీ 2-1తో బొలీవియాపై నెగ్గి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆర్థురో విడాల్ (46, 100వ ని.) చిలీ తరఫున రెండు గోల్స్ చేయగా, జాస్మాని కాంపోస్ (61వ ని.) బొలీవియాకు ఏకైక గోల్ అందించాడు. ఇంజ్యూరీ టైమ్‌లో విడాల్ కొట్టిన పెనాల్టీ కార్నర్ వివాదాస్పదమైంది. -
మెస్సీ మ్యాజిక్: క్వార్టర్స్‌కు అర్జెంటీనా
చికాగో: గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ పునరాగమన మ్యాచ్‌లో అదరగొట్టాడు. కోపా అమెరికా కప్‌లో భాగంగా గ్రూప్-డిలో పనామాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్ చేశాడు. 19 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి జట్టును క్వార్టర్స్ చేర్చాడు. ఆట 61వ నిమిషంలో అగస్టో ఫెర్నాండేజ్ స్థానంలో ఫీల్డ్‌లోకి వచ్చిన మెస్సీ మెరుపు వేగంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. ఆట 68వ నిమిషంలో తొలి వ్యక్తిగత గోల్ చేసిన మెస్సీ, ఆపై 78 నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా మరో గోల్ చేసి జట్టును మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆపై 87వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఇక ఆట చివర్లో ఆగ్యురో మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 5-0తేడాతో సంపూర్ణ విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. -
ఉరుగ్వే అవుట్
► కీలక మ్యాచ్‌లో వెనిజులా చేతిలో ఓటమి ► మెక్సికో, వెనిజులాకు క్వార్టర్స్ బెర్త్ ► కోపా అమెరికా కప్ ఫిలడెల్ఫియా: ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15సార్లు చాంపియన్... బరిలోకి దిగితే ఎంతటి ప్రత్యర్థినైనా వణికించగల సత్తా ఉన్న జట్టు... ఒంటిచేత్తో విజయాలు అందించే ఆటగాళ్లకు కొదువేలేదు. కానీ కోపా అమెరికా కప్ టోర్నమెంట్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ఉరుగ్వే జట్టుకు ఏదీ కలిసిరాలేదు. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో వెనిజులా 1-0తో ఉరుగ్వేపై సంచలన విజయం సాధించి క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో ఉరుగ్వే పాయింట్లేమీ లేకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 1997 తర్వాత ఉరుగ్వే గ్రూప్ దశలోనే ఓడటం ఇదే తొలిసారి. గాయం కారణంగా స్టార్ ఆటగాడు లూయిస్ సారేజ్ ఈ మ్యాచ్ ఆడలేదు. డిఫెండర్ మ్యాక్సీ పెరీరా ఉరుగ్వే తరఫున అత్యధిక మ్యాచ్‌లు (113) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ సందర్భంగా డియాగో ఫ్లోరాన్ను అధిగమించాడు. వెనిజులా తరఫున సాలోమన్ రోండన్ (36వ ని.) ఏకైక గోల్ చేశాడు. జమైకాపై మెక్సికో గెలుపు: మరో మ్యాచ్‌లో మెక్సికో 2-0తో జమైకాపై గెలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. మెక్సికో తరఫున జేవియర్ హెర్నాం డేజ్ (18వ ని.), ఓర్బీ పెరాల్టా (81వ ని.)లు గోల్స్ చేశారు. రెండో అర్ధభాగంలో స్ట్రయికర్ క్లెటాన్ డోనాల్డ్సన్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను రిఫరీలు తోసిపుచ్చడంతో జమైకా నిరాశకు గురైంది. -
కౌంటిన్హో ‘హ్యాట్రిక్’
► బ్రెజిల్ అద్భుత విజయం ► పెరూను నిలువరించిన ఈక్వెడార్ ► కోపా అమెరికా కప్ లాస్ ఏంజెల్స్: ప్రత్యర్థి అనుభవలేమిని సొమ్ము చేసుకున్న బ్రెజిల్ జట్టు... కోపా అమెరికా కప్‌లో గోల్స్ వర్షం కురిపించింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ ఫిలిప్పీ కౌంటిన్హో ‘హ్యాట్రిక్’ గోల్స్ నమోదు చేయడంతో బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 7-1తో హైతీపై విజయం సాధించింది. కౌంటిన్హో (14, 29, 92వ ని.), రెనాటో అగుస్టో (35, 86వ ని.), గాబ్రియోల్ (59వ ని.), లుకాస్ లిమా (67వ ని.)లు బ్రెజిల్‌కు గోల్స్ అందించగా, జేమ్స్ మెర్సిలిన్ (70వ ని.) హైతీ తరఫున ఏకైక గోల్ చేశాడు. పోటీ మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌ను తొలిసారి ఎదుర్కొన్న హైతీ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా నాకౌట్ ఆశలు గల్లంతు కావడంతో టోర్నీ నుంచి నిష్ర్కమిస్తున్న తొలి జట్టుగా నిలిచింది. మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ కౌంటిన్హో ఆరంభం నుంచే తన గారడీని ప్రదర్శించాడు. 14వ నిమిషంలో ఎడమ వైపు నుంచి బంతిని అందుకున్న కౌంటిన్హో... నేర్పుగా కుడి కాలి వైపు తీసుకొని కళ్లు చెదిరే రీతిలో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మరో 15 నిమిషాల్లోనే బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ డానీ అల్విస్, జొనాస్‌ల సాయంతో రెండో గోల్ సాధించాడు. రెండు ఫ్లాంక్ల నుంచి దాడులు మొదలుపెట్టిన బ్రెజిల్‌కు ఆరు నిమిషాల తర్వాత మిడ్‌ఫీల్డర్ అగుస్టో మూడో గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలోనూ హైతీ కౌంటిన్హోను కట్టడి చేయడంపై ఎక్కువగా దృష్టిపెట్టడంతో... గాబ్రియోల్, లిమా బ్రెజిల్‌కు గోల్స్ అందించారు. 70వ నిమిషంలో వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని హైతీ ఆటగాడు మెర్సిలిన్ అద్భుతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. తర్వాత అగుస్టో బ్రెజిల్‌కు ఆరో గోల్ అందించగా, ఇంజ్యూరీ టైమ్‌లో కౌంటిన్హో మూడో గోల్ చేసి బ్రెజిల్‌కు స్పష్టమైన విజయాన్ని అందించాడు. పోరాడిన ఈక్వెడార్: ఈక్వెడార్, పెరూల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. పెరూ తరఫున క్రిస్టియన్ క్యుయేవా (5వ ని.), ఎడిసన్ ఫ్లోరెస్ (13వ ని.) గోల్స్ చేయగా, ఎన్నార్ వాలెన్సియా (39వ ని.), మిల్లర్ బొలానోస్ (49వ ని.)లు ఈక్వెడార్‌కు గోల్స్ అందించారు. -
క్వార్టర్స్‌లో కొలంబియా
► పరాగ్వేపై 2-1తో గెలుపు ► కోస్టారికాపై అమెరికా గెలుపు ► కోపా అమెరికా కప్ పసడెనా (అమెరికా): ప్రత్యర్థులు ఎన్ని దాడులు చేసినా.. అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న కొలంబియా జట్టు.. కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో క్వార్టర్‌ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో 2-1తో పరాగ్వేపై విజ యం సాధించింది. కొలంబియా తరఫున కార్లోస్ బాకా (12వ ని.), జేమ్స్ రోడ్రిగ్వేజ్ (30వ ని.) గోల్స్ చేయగా... విక్టర్ అయేలా (71వ ని.) పరాగ్వేకు ఏకైక గోల్ అందించాడు. ఆరంభంలో డిఫెన్స్‌లో కాస్త ఇబ్బందులుపడ్డ ప్రపంచ మూడో ర్యాంకర్ కొలంబియా... ఆ తర్వాత అంచనాలకు అనుగుణంగా రాణిం చింది. ముఖ్యంగా రోడ్రిగ్వేజ్ మ్యాచ్ ఆసాంతం చెలరేగిపోయాడు. సహచరులతో చిన్న చిన్న సెటప్‌లు చేస్తూ బంతిని ఎక్కువశాతం ఆధీనంలో ఉంచుకున్నాడు. 12వ నిమిషంలో రోడ్రిగ్వేజ్ కార్నర్ నుంచి ఇచ్చిన బంతిని బాకా హెడర్‌తో గోల్‌గా మలిచాడు. మరో 18 నిమిషాల తర్వాత బాక్స్ నుంచి రోడ్రిగ్వేజ్ కొట్టిన సూపర్ షాట్ నేరుగా లక్ష్యాన్ని చేరడంతో తొలి అర్ధభాగంలోనే కొలంబియా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో పరాగ్వే ఫార్వర్డ్స్ దూకుడుగా ఆడారు. పదేపదే దాడులు చేశారు. కానీ కొలంబియా గోల్ కీపర్ డేవిడ్ ఊస్పినా అడ్డుగోడగా నిలవడంతో వాళ్ల ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అయితే 71వ నిమిషంలో కొలంబియా డిఫెన్స్‌ను తప్పిస్తూ విక్టర్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. 81వ నిమిషంలో ఆస్కార్ రొమారియో రెండోసారి ఎల్లో కార్డ్‌కు గురికావడంతో పరాగ్వే అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న కొలంబియా.. శనివారం కోస్టారికాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా గ్రూప్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంటుంది. అమెరికా గెలుపు మరో మ్యాచ్‌లో అమెరికా 4-0తో కోస్టారికాపై నెగ్గింది. స్టార్ స్ట్రయికర్ క్లింట్ డెంప్సే (9వ ని.), జెర్మీని జోన్స్ (37వ ని.), బాబీ వుడ్ (42వ ని.), గ్రాహం జూసీ (87వ ని.)లు అమెరికాకు గోల్స్ అందించారు. గత మ్యాచ్‌లో కొలంబియా చేతిలో ఓడిన అమెరికా ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికలతో ఆడింది. డెంప్సే పెనాల్నీ స్పాట్‌తో ఖాతా తెరిచిన యూఎస్ తొలి అర్ధభాగానికే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. డెంప్సేకు అంతర్జాతీయ కెరీర్లో ఇది 50వ గోల్. మ్యాచ్ చివరి నిమిషాల్లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన జూసీ నాలుగో గోల్ నమోదు చేయడంతో అమెరికా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. -
ఉరుగ్వేకు మెక్సికో షాక్
3-1తో ఘనవిజయం కోపా అమెరికా కప్ గ్లెండేల్ (అరిజోనా): చివరి ఐదు నిమిషాల్లో రెండు మెరుపు గోల్స్ సాధించిన మెక్సికో జట్టు ఉరుగ్వేకు షాక్ ఇచ్చింది. సోమవారం గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో 3-1తో నెగ్గింది. గాయంతో బాధపడుతున్న సూపర్ స్ట్రయికర్ లూయిస్ సారెజ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం ఉరుగ్వేను దెబ్బతీసింది. ఐదో నిమిషంలో ప్రత్యర్థి క్రాస్ షాట్‌ను అడ్డుకోబోయిన ఉరుగ్వే ఆటగాడు అల్వరో పెరీరా సెల్ఫ్ గోల్ చేయడంతో మెక్సికోకు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత గోల్స్ కోసం ఇరు జట్ల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. దీనికి తోడు 45వ నిమిషంలో మటియాస్ వెసినో రెండో ఎల్లో కార్డ్‌కు గురై మైదానం వీడడంతో ఉరుగ్వే పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ద్వితీయార్ధం 58వ నిమిషంలో డీగో రోలన్ (ఉరుగ్వే) ఎడమకాలితో సంధించిన షాట్ తృటిలో మిస్ అయ్యింది. ఇక 73వ నిమిషంలో ఆండ్రెస్ గాండ్రాడోకు రిఫరీ రెడ్ కార్డ్ చూపించడంతో మెక్సికో కూడా పది మందితోనే ఆడింది. ఆ మరుసటి నిమిషంలోనే కార్లోస్ సాంచెజ్ అందించిన పాస్‌ను డీగో గాడిన్ హెడర్ గోల్‌తో ఉరుగ్వే 1-1తో సమంగా నిలిచింది. అయితే మ్యాచ్ డ్రా దిశగా వెళుతున్న తరుణంలో 85వ నిమిషంలో రాఫెల్ మార్క్వెజ్, ఇంజ్యూరీ సమయం (90+2)లో హెక్టర్ హెరేరా చేసిన గోల్స్‌తో మెక్సికో సంబరాల్లో మునిగింది. అంతకుముందు మ్యాచ్ ఆరంభంలో ఉరుగ్వే జాతీయగీతానికి బదులు చిలీ గీతం వినిపించడం వివాదాస్పదమైంది. దీంతో ఆటగాళ్లు గందరగోళానికి గురి కాగా నిర్వాహకులు జరిగినదానికి క్షమాపణలు తెలిపారు. జమైకాపై వెనిజులా విజయం షికాగో: వార్మప్ మ్యాచ్‌లో కోపా చాంపియన్ చిలీని కంగుతినిపించిన జమైకా తమ ప్రారంభ మ్యాచ్‌లో తడబడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0తో జమైకాపై వెని జులా నెగ్గింది. 15వ నిమిషంలో వెనిజులాకు జోసెఫ్ మార్టినెజ్ ఏకైక గోల్ అందించాడు. -
బ్రెజిల్‌ను నిలువరించిన ఈక్వెడార్
► 0-0తో మ్యాచ్ డ్రా ► కోపా అమెరికా కప్ టోర్నమెంట్ లాస్ ఏంజిల్స్: ప్రపంచ మాజీ చాంపియన్ బ్రెజిల్‌ను ఈక్వెడార్ జట్టు సమర్థవంతంగా నిలువరించింది. దీనికి తోడు వివాదాస్పద రిఫరీ నిర్ణయం బ్రెజిల్‌కు అనుకూలంగా మారడంతో ఓటమి నుంచి గట్టెక్కింది. ఫలితంగా కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా బ్రెజిల్ గోల్ చేయడంలో విఫలమైంది. అయితే ద్వితీయార్ధం ఈక్వెడార్ ఆటగాళ్ల నుంచి ఎదురుదాడి ఎక్కువ కావడంతో బ్రెజిల్ ఇబ్బంది పడింది. 66వ నిమిషంలో ఈక్వెడార్ ఆటగాడు మిలర్ బోలనోస్ సంధించిన క్రాస్ షాట్‌ను అడ్డుకోవడంలో బ్రెజిల్ గోల్ కీపర్ విఫలం కావడంతో బంతి నెట్‌లోనికి వెళ్లింది. అయితే సంబరాల్లో మునిగిన ఈక్వెడార్ రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్నది. క్రాస్ షాట్ ఆడడానికి ముందే బంతి ఎండ్ లైన్ దాటిందని ప్రకటించడం ఆ జట్టును అసహనానికి గురి చేసింది. 83వ నిమిషంలో లుకాస్ (బ్రెజిల్) హెడర్ వైడ్‌గా వెళ్లడంతో గోల్ మిస్ అయ్యింది. అయితే ఆట ముగిశాక బ్రెజిల్ ఆటగాళ్లను 53 వేలకు పైగా ఉన్న ప్రేక్షకులు గేలి చేశారు. పెరూ విజయం సీటల్: మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పెరూ 1-0 తేడాతో హైతీని ఓడించింది. ద్వితీయార్ధం 61వ నిమిషంలో స్ట్రయికర్ గెరెరో తమ జట్టుకు ఏకైక గోల్‌ను అందించాడు. హైతీ డిఫెన్స్ సమర ్థవంతంగా అడ్డుకోవడంతో పెరూకు మరిన్ని గోల్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. కోస్టారికా, పరాగ్వే మ్యాచ్ డ్రా ఓర్లాండో: గ్రూప్ ‘ఎ’లో భాగంగా పరాగ్వే, ఈక్వెడార్ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇంజ్యురీ సమయంలో డిఫెండర్ కెండాల్ వాస్టన్ రెడ్ కార్డుకు గురవ్వడంతో కోస్టారికా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. 33 డిగ్రీల అధిక వేడిలో మ్యాచ్ జరగడం కూడా ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది. -
తొలిపోరులో అమెరికాకు నిరాశ
శాంతా క్లారా: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో సుదీర్ఘ ప్రస్థానం కల్గిన కోపా అమెరికా కప్‌లో స్వదేశీ జట్టు యూఎస్‌కు చుక్కెదురైంది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం కొలంబియాతో జరిగిన తొలిపోరులో అమెరికా ఓటమి పాలైంది. పటిష్టమైన కొలంబియాను నిలువరించడంలో విఫలమైన అమెరికా కనీసం గోల్ కూడా చేయకుండానే పరాజయం చెందింది. కొలంబియా ఆటగాళ్లు జేమ్స్ రోడ్రిగ్స్, క్రిస్టినా జపాతాలు తలో గోల్ చేసి జట్టుకు 2-0 తో విజయాన్ని అందించారు. -
శత వసంతాల....కోపా పిలుస్తోంది
ప్రపంచ ఫుట్‌బాల్‌కు ఇది పండుగ వేళ... ఘన చరిత్ర కలిగిన కోపా అమెరికా కప్ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక టోర్నమెంట్ ఇది. గెలిస్తే చరిత్రలో పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది. అందుకే బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీ... ఇలా అమెరికా ఖండాల దేశాల క్రీడాకారులంతా సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రతి రోజూ వినోదమే. మెస్సీ డ్రిబ్లింగ్... రోడ్రిక్స్ హెడర్స్... హల్క్ హంగామా... నేటి నుంచే..! ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత పాపులర్ టోర్నీలలో ఒకటైన ‘కోపా అమెరికా’కు వందేళ్ల చరిత్ర ఉంది. 1916లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఉరుగ్వే విజేతగా నిలిచింది. ఆరంభంలో కేవలం దక్షిణ అమెరికా ఖండపు దేశాలకే (కాన్మెబాల్) ఈ టోర్నీ పరిమితం కాగా... 1993నుంచి ఉత్తర అమెరికా ఖండపు జట్లకు (కాన్కెకాఫ్) కూడా చోటు కల్పించారు. కోపా అమెరికా కప్ మొదట్లో ఏడాదికి ఒకసారి, మధ్యలో రెండేళ్లకు, తర్వాత మూడేళ్లకు... వేర్వేరు కారణాలతో చాలా సార్లు క్రమం తప్పుతూనే నిర్వహించారు. గత మూడు టోర్నీలు (2007, 2011, 2015) మాత్రం అనుకున్నట్లుగా సరిగ్గా నాలుగేళ్ల వ్యవధి ప్రకారం జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది కోపా కప్ నిర్వహించకూడదు. అయితే టోర్నమెంట్ ప్రారంభమై సరిగ్గా వందేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మరోసారి ప్రత్యేక టోర్నీని జరుపుతున్నారు. సాధారణంగా 12 జట్లతో నిర్వహించే ఈ టోర్నీలో సంఖ్యను పెంచి 16 జట్లకు అవకాశం కల్పించారు. ఇందులో దక్షిణ అమెరికానుంచి 10, ఉత్తర అమెరికానుంచి 6 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2019 నుంచి మళ్లీ 12 జట్లే ఆడతాయి. కోపా కప్‌కు యూఎస్ఏ తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటం విశేషం కాగా... తొలిసారి దక్షిణ అమెరికా బయట ఈ టోర్నీ జరుగుతోంది. జూన్ 3 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీకి సంబంధించిన మరిన్ని విశేషాలు... గ్రూప్- ఏ అమెరికా, కొలంబియా, కోస్టారికా, పరాగ్వే అమెరికా: ఆతిథ్య హోదాలో అమెరికా ఉత్సాహంగా కనిపిస్తున్నా... జట్టు ముందుకెళ్లటం అంత సులువు కాదు. జెర్మైన్ జోన్స్ జట్టులో స్టార్ ఆటగాడు. ఇటీవల సంచలన రీతిలో దూసుకొచ్చిన 17 ఏళ్ల క్రిస్టియాన్ ప్యూలిసిక్ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్నాడు. కొలంబియా: గ్రూప్ విజేతగా నిలిచే అవకాశం ఉంది. గత టోర్నీలో ఈ జట్టు ఒకే గోల్ చేసి ఘోరంగా విఫలమైనా... ఆ తర్వాత కొత్త వ్యూహాలతో ఆటను మార్చుకుంది. రోడ్రిగ్స్‌పై జట్టు బాధ్యత ఉంది. కోస్టారికా: ఇటీవలి కాలంగా వేగంగా ఎదిగిన ఈ జట్టు తమ అత్యుత్తమ దశలో ఉంది. రియల్ మాడ్రిడ్‌ను చాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ కీలర్ నవాస్ ఇప్పుడు తన జాతీయ జట్టుకు పెట్టని గోడగా మారాడు. పరాగ్వే: సంచలనాలు సాధించే సత్తా ఉన్న జట్టు. గత కొన్నేళ్లలో కోపాలో మంచి రికార్డు ఉంది. డిఫెన్స్ జట్టు బలం. గోంజాలెజ్ జట్టులో స్టార్ ఆటగాడు. గ్రూప్- బి బ్రెజిల్, ఈక్వెడార్, హైతీ, పెరూ బ్రెజిల్: గత ఏడాది పెనాల్టీస్లో పరాగ్వే చేతిలో ఓడి నిష్ర్కమించింది. తమ స్థాయిలో రాణించలేకపోతున్న ఆ జట్టు ఫామ్ కొన్నాళ్లుగా ఆందోళనకరంగా ఉంది. అయితే గ్రూప్ దశను దాటడంలో సమస్య ఉండకపోవచ్చు. నేమార్ అందుబాటులో లేకపోవడంతో విలియాన్పై బాధ్యత పెరిగింది. 19 ఏళ్ల కొత్త కుర్రాడు గాబ్రియెల్ బార్బోసాపై ఎన్నో ఆశలున్నాయి. పెరూ: సీనియర్ ఆటగాళ్ల ఫిట్నెస్ బాగా లేదంటూ కోచ్ దాదాపు అంతా కుర్రాళ్లతోనే కొత్త జట్టును సిద్ధం చేయడంతో ఈ జట్టు అంచనాలకు అందడం లేదు. వీరంతా రాణిస్తే నాకౌట్‌కు వెళ్లవచ్చు. పావ్లో గ్యురెరోతో పాటు క్రిస్టియాన్ క్యూవా కీలక ఆటగాళ్లు. ఈక్వెడార్: నాకౌట్ చేరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. బ్రెజిల్‌కు కూడా షాక్ ఇచ్చే స్థితిలో మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. ఎన్నర్ వెలెన్సియా, ఆంటోనియో వెలెన్సియా, జెఫర్సన్ మోంటిరో అత్యంత ప్రతిభావంతులు. హైతీ: ఈ గ్రూప్‌లో బలహీన జట్టు. ఏ ప్రత్యర్థినీ భయపెట్టే పరిస్థితిలో లేదు. ఇటీవల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో కూడా ఘోరంగా విఫలమైంది. గ్రూప్- సి మెక్సికో, ఉరుగ్వే, జమైకా, వెనిజులా ఉరుగ్వే: ఈ గ్రూప్‌నుంచి అగ్రస్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కోపా కప్‌లో హవా నడిపించిన ఈ జట్టు మరో టైటిల్‌పై గురి పెట్టింది. నిస్సందేహంగా సారెజ్ ఈ టీమ్‌లో సూపర్ స్టార్. ఈ సీజన్లో 59 గోల్స్ చేసిన అతను ప్రపంచ ఫుట్‌బాల్‌లో అందరికంటే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అయితే గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరమైనా... నాకౌట్ దశకు సిద్ధంగా ఉంటాడు. మెక్సికో: నాకౌట్‌కు చేరగల స్థాయి ఉన్న జట్టు. జట్టు పటిష్టంగా ఉండటంతో పాటు అమెరికాలో మ్యాచ్‌లు జరుగుతున్నందున మెక్సికోకు అభిమానులనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించనుంది. జేవియర్ హెర్నాండెజ్ ఇప్పుడు అందరిలోకి స్టార్. వెనిజులా: గత ఆరు నెలలుగా టీమ్ దశా దిశా లేకుండా గొడవలతో సాగుతోంది. ఆటగాళ్లంతా కలిసి కోచ్‌పై తిరుగుబాటు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏమీ ఆశించలేం. జమైకా: గత టోర్నీలో అగ్రశ్రేణి జట్టు ఉరుగ్వేతో మ్యాచ్ డ్రా చేసుకోవడంతో పాటు డిఫెండింగ్ చాంపియన్ చిలీని వార్మప్ మ్యాచ్‌లో ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సారి కూడా కనీసం ఒక సంచలనాన్ని ఆశిస్తోంది. వెస్ మోర్గాన్ ఇటీవల ఈపీఎల్‌లో లెస్టర్‌ను విజేతగా నిలిపాడు. గ్రూప్- డి అర్జెంటీనా, చిలీ, పనామా, బొలీవియా అర్జెంటీనా: 2015లో చిలీ చేతిలో ఫైనల్లో ఓడినా...ఈ సారి కూడా మళ్లీ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. మెస్సీలాంటి దిగ్గజం తనదైన శైలిలో ఆడితే అర్జెంటీనాకు తిరుగుండదు. వెన్ను నొప్పితో బాధపడుతున్నా.... గతంలో ఒక్కసారి కూడా జాతీయ జట్టు తరఫున టైటిల్ గెలవని మెస్సీ, ఈ సారి దానిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిలీ: డిఫెండింగ్ చాంపియన్. కొత్త కోచ్ నేతృత్వంలో కొత్త టీమ్ సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కనీసం సెమీ ఫైనల్ వరకూ వెళ్లొచ్చు. సాంచెజ్ గత ఏడాది అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. బొలీవియా: చివరి స్థానం దక్కకుండా కనీసం పనామానైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోచ్‌తో విభేదాలతో సీనియర్ ఆటగాళ్లు రొనాల్డ్ రాల్డ్స్, మార్సెలో మార్టిన్స్ అనూహ్యంగా తప్పుకోవడం జట్టును మరింత బలహీనంగా మార్చింది. పనామా: ఆఖరి స్థానంలో నిలిచినా... ఇది తమకు ఏమీ అవమానకరం కాదని ఆ జట్టు చెబుతోంది. కోపా అమెరికా టోర్నీ మొత్తంలో బలహీనమైన టీమ్. ► 32 టోర్నీలో జరిగే మొత్తం మ్యాచ్‌లు ► 10 అమెరికాలో వేదికలు. కనీసం 50 వేల సామర్థ్యం ఉన్నవాటినే బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేశారు. ► 368 బరిలోకి దిగుతున్న మొత్తం ఆటగాళ్లు ► 44 ఇప్పటి వరకు జరిగిన టోర్నీలు ► 9 అర్జెంటీనా అత్యధికంగా 9 సార్లు ఆతిథ్యమిచ్చింది ► 15 ఉరుగ్వే అత్యధికంగా టైటిల్స్ గెలిచింది. చిలీ డిఫెండింగ్ చాంపియన్ భారత కాలమానం ప్రకారం కోపా అమెరికా కప్ షెడ్యూల్ మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నాకౌట్ (క్వార్టర్ ఫైనల్)కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీస్, ఫైనల్ నిర్వహిస్తారు. ప్రతీ గ్రూప్‌లో పటిష్టమైన జట్లతో పాటు సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న టీమ్‌లు కూడా ఉన్నాయి. -
చాంపియన్ చిలీ
- తొలిసారి ‘కోపా అమెరికా కప్’ సొంతం - ఫైనల్లో అర్జెంటీనాపై విజయం - మెస్సీ బృందానికి మళ్లీ నిరాశ సాంటియాగో (చిలీ): ఒకటా... రెండా... ఏకంగా 99 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చిలీ జట్టు తొలిసారి ‘కోపా అమెరికా కప్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో చిలీ ‘పెనాల్టీ షూటౌట్’లో 4-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టుపై సంచలన విజయం సాధించింది. ఈ ఓటమితో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరోసారి మెగా ఈవెంట్లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది ప్రపంచకప్‌లోనూ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది. టైటిలే లక్ష్యంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన అర్జెంటీనా తుది మెట్టుపై బోల్తా పడింది. దూకుడుగా ఫైనల్‌ను ఆరంభించిన చిలీ ఆ తర్వాత జోరు తగ్గించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని నిలువరించడమే లక్ష్యంతో చిలీ ఆటతీరు సాగింది. మెస్సీ వెనుక ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను పెట్టి అతని కదలికలకు బ్రేక్ వేసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాత అదనంగా మరో అరగంట ఆడించినా ఫలితం లేకపోయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో చిలీ తరఫున వరుసగా ఫెర్నాండెజ్, విడాల్, అరాన్గుయెజ్, అలెక్సిస్ శాంచెజ్ గోల్స్ చేయగా... అర్జెంటీనాకు మెస్సీ మాత్రమే గోల్ సాధించగా.. హిగుయెన్, బనెగా విఫలమవ్వడంతో చిలీ విజయం ఖాయమైంది. హిగుయెన్ షాట్ గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లగా... బనెగా షాట్‌ను చిలీ గోల్‌కీపర్ క్లాడియో బ్రావో నిలువరించాడు. - కోపా అమెరికా కప్ చరిత్రలో అర్జెంటీనాపై చిలీకిదే తొలి విజయం. ఫైనల్‌కు ముందు గతంలో అర్జెంటీనాతో తలపడిన 24 మ్యాచ్‌ల్లో చిలీ ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మిగతా 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. - మూడో ప్రయత్నంలో చిలీ జట్టు కోపా అమెరికా కప్ విజేతగా అవతరించింది. గతంలో ఈ జట్టు 1979, 1987లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. - విజేతగా చిలీ జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 25 కోట్ల 37 లక్షలు), రన్నరప్ అర్జెంటీనాకు 30 లక్షల డాలర్లు (రూ. 19 కోట్లు), మూడో స్థానం పొందిన పెరూ జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ.12 కోట్ల 68 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన పరాగ్వేకు 10 లక్షల డాలర్లు (రూ. 6కోట్ల34లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. - ఆతిథ్య దేశం హోదాలో ‘కోపా అమెరికా కప్’ నెగ్గిన ఏడో జట్టుగా చిలీ నిలిచింది. గతంలో ఉరుగ్వే, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బొలి వియా, కొలంబియా ఈ ఘనత సాధించాయి. - వచ్చే ఏడాదితో కోపా అమెరికా కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అమెరికాలో ‘సెంటినరీ టోర్నీ’ని నిర్వహిస్తారు. 2019 కోపా అమెరికా కప్‌కు బ్రెజిల్, 2023 టోర్నీకి ఈక్వెడార్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
నిజంగా ఆ 'కిక్' అద్భుతం!
శాంటింగో:కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ- 2015లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ పోరులో చిలీ ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు కోచ్ జార్జ్ సాంపౌలీ ఆనందంలో మునిగితేలుతున్నాడు. పెనాల్టీ షూటౌట్ లో చిలీ విజయం కైవశం చేసుకోవడంతో తమ చిరకాల కోరిక నెరవేరిందన్నాడు. ఆ షూటౌట్ విజయం నిజంగా అద్భుతమైనది అభివర్ణించాడు. పెనాల్టీ షూటౌట్ లో అలెక్సిస్ శాంచెజ్ అద్భుతం చేసి తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే, నమ్మశక్యం కాని ఆనందాన్నిచ్చాడన్నాడు. 'ఆ పెనాల్టీ విజయం నాకు మరిచిపోలేని జ్ఞాపికను అందించింది. జట్టు సమిష్టిగా రాణించి అర్జెంటీనాను కంగుతినిపించింది. మా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాం. బలమైన అర్జెంటీనాను మట్టికరిపించాలంటే బంతిని ఎక్కువ సమయం తమ అధీనంలోనే ఉంచుకోవాలనే మా వ్యూహం విజయవంతమైంది. ఈ ఆనంద క్షణాల్ని ఆటగాళ్లతో కలిసి పంచుకోవాలనుకుంటున్నా' అని సాంపౌలీ తెలిపాడు. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుటే శరణ్యమైంది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ- 2015లో చిలీ విజేతగా నిలవడంతో వారి 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్‌లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో షూట్ అవుటే శరణ్యమైంది. చిలీ గోల్ కీపర్ క్లౌడియో బ్రావో సమయ స్పూర్తితో ఒక గోల్ తప్పించడం, అర్జెంటీనా ఆటగాళ్లుకూడా బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో రెండు దఫాలు విఫలం కావడంతో 4-1 తేడాతో చిలీ విజయం సాధించింది. -
28 ఏళ్ల తర్వాత...
♦ కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ ♦ సెమీస్‌లో పెరూపై 2-1తో గెలుపు సాంటియాగో : వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న చిలీ జట్టు... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో చిలీ 2-1తో పెరూపై విజయం సాధించింది. ఎడ్యురాడో వెర్గాస్ (42వ, 64వ నిమిషాల్లో) చిలీకి రెండు గోల్స్ అందించగా, గ్యారీ మెడెల్ (60వ ని.) పెరూ తరఫున ఏకైక గోల్ చేశాడు. 1987 తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించడం చిలీకి ఇదే మొదటిసారి. గోల్స్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడినా... రెండో అర్ధభాగంలో చిలీ కౌంటర్ అటాకింగ్‌తో ఆకట్టుకుంది. 42వ నిమిషంలో గోల్ పోస్ట్ సమీపం నుంచి వెర్గాస్ కొట్టిన బంతి కాస్త ఆఫ్‌సైడ్ దిశగా వెళ్లినా... రిఫరీ గోల్‌గా ప్రకటించడం కాస్త వివాదాస్పదమైంది. మొరటుగా ఆడిన కార్లోస్ జాంబ్రానో ఆట మొదలైన 20 నిమిషాల తర్వాత మ్యాచ్‌కు దూరం కావడంతో పెరూ 10 మందితోనే ఆడింది. అయినప్పటికీ ఫార్వర్డ్స్ సమయోచితంగా దాడులు చేసి స్కోరును సమం చేశారు. అయితే 64వ నిమిషంలో ఓ మామూలు బంతిని మిడ్‌ఫీల్డ్ నుంచి అందుకున్న వెర్గాస్ డ్రిబ్లింగ్ చేస్తూ 30 గజాల నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు పెరూ ఒకటి, రెండు షాట్లు కొట్టినా... లక్ష్యాన్ని చేరలేకపోయాయి. -
గట్టెక్కిన అర్జెంటీనా
♦ కోపా అమెరికా కప్ సెమీస్‌లో మెస్సీ బృందం ♦ షూటౌట్లో కొలంబియాపై గెలుపు వినా డెల్ మార్ (చిలీ) : నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన చేదు ఫలితాన్ని మరచిపోయేలా అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 2011 టోర్నీలో ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘షూటౌట్’లో ఓడిపోయింది. నాటి షూటౌట్లో గురి తప్పి అర్జెంటీనా ఓటమికి కారణమైన కార్లోస్ టెవెజ్ ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయలేదు. షూటౌట్లో కీలకమైన స్పాట్ కిక్‌ను గోల్‌గా మలిచిన టెవెజ్ ఈసారి అర్జెంటీనా తరఫున హీరో అయ్యాడు. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాలు, ఆ తర్వాత అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో అర్జెంటీనా తరఫున మెస్సీ, గారె, బనెగా, లావెజి, టెవెజ్ గోల్స్ చేయగా... బిగ్లియా, రోజో విఫలమయ్యారు. కొలంబియా జట్టు నుంచి జేమ్స్, ఫల్కావో, కుడ్రాడో, కార్డోనా గోల్స్ సాధించగా... మురియెల్, జునిగా, మురిలో గురి తప్పారు. -
‘టార్చ్’ టార్చర్!
సరదాగా... ఈ ఫొటోలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ మీద పడిన ఆకుపచ్చ రంగు లైట్ చూశారా! కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మెస్సీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అభిమానులు ఇలా లైట్ వేశారు. అయితే యూరోప్‌లోని అనేక లీగ్‌లలో ఆటగాళ్లను దెబ్బతీయడానికి అభిమానులు ఈ ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. సాధారణంగా మన దగ్గర ఎరుపు రంగులో ఇలాంటి టార్చ్‌లు దొరుకుతాయి. దీని కాంతి మీద పడితే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ పెద్దగా ప్రమాదం ఉండదు. ఈ ఆకుపచ్చ లైట్ నేరుగా క ళ్ల మీద పడితే చాలా ప్రమాదం అట. కొద్దిసేపు కంటిచూపు పోతుందట. వెయ్యి రూపాయలకు దొరికే ఈ లైట్ ద్వారా రెండు కిలోమీటర్ల దూరం కూడా కాంతి పడుతుందట. స్టేడియాలలోకి గ్రీన్ టార్చ్ తేవడంపై నిషేధం ఉంది. మెస్సీ ఉదంతం నేపథ్యంలో ఇకపై మరింత జాగ్రత్తగా అభిమానులను తనిఖీ చేస్తారట. -
గురెరో ‘హ్యాట్రిక్’
కోపా అమెరికా కప్ సెమీస్‌లో పెరూ టెమ్కో (చిలీ) : స్టార్ స్ట్రయికర్ పావోలో గురెరో (20, 23, 74వ ని.) హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడంతో కోపా అమెరికా కప్‌లో పెరూ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 3-1తో బొలివియాపై విజయం సాధించింది. మార్టిన్ మోరెనో (84వ ని.) పెనాల్టీ ద్వారా బొలివియాకు ఏకైక గోల్ అందించాడు. -
‘కోపా’ సెమీస్‌లో చిలీ
క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 1-0తో గెలుపు సాంటియాగో: మ్యాచ్ చివరి దశలో అమోఘమైన ఆటతీరుతో చెలరేగిన చిలీ... కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో 1-0తో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేపై విజయం సాధించింది. దీంతో తొలిసారి కోపా కప్‌ను గెలవాలన్న కలకు చిలీ మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. డిఫెండర్ మురిసియో ఇస్లా (81వ ని.) చిలీ తరఫున ఏకైక గోల్ సాధించాడు. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
అర్జెంటీనా ‘టాప్’
సాంటియాగో (చిలీ): సాదాసీదా ఆటతీరు కనబరిచిన అర్జెంటీనా జట్టు రెండో విజయంతో కోపా అమెరికా కప్‌లో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. జమైకాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లతో నిండిన అర్జెంటీనా జట్టు 1-0తో శ్రమించి గెలిచింది. తన కెరీర్లో 100వ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ లియోనెల్ మెస్సీ నుంచి గోల్స్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఆట 11వ నిమిషంలో హిగుఐన్ గోల్ చేసి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత జమైకా పట్టుదలతో ఆడి అర్జెంటీనా దూకుడును నిలువరించింది. మొత్తం ఏడు పాయింట్లతో అర్జెంటీనా ‘బి’ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ఇదే గ్రూప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వే, పరాగ్వే జట్లు కూడా క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాయి. 2011 టోర్నీ ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. ఉరుగ్వే తరఫున జిమినెజ్ (29వ నిమిషంలో), పరాగ్వే తరఫున బారియోస్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. -
నెయమార్ పై వేటు
సాంటియాగో:కోపా అమెరికా కప్‌లో భాగంగా కొలంబియాతో గురువారం జరిగిన మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన బ్రెజిల్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ నెయమార్ పై బహిష్కరణ వేటు పడింది. బ్రెజిల్ ఆడే తదుపరి నాలుగు మ్యాచ్ ల నుంచి నెయమార్ ను బహిష్కరిస్తున్నట్లు దక్షిణ అమెరికా ఫుట్ బాల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ సభ్యులు శుక్రవారం నెయమార్ పై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందే నెయమార్ ఒక ఎల్లో కార్డ్ బారిన పడటంతో.. అతనిపై వేటు తప్పలేదు. ఇటీవల కొలంబియాతో మ్యాచ్ లో బ్రెజిల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కొలంబియా ఆటగాళ్లు రెచ్చగొట్టినా.. మ్యాచ్‌లో ఓపికగా ఉన్న స్టార్ ప్లేయర్ నెయ్మార్ మ్యాచ్ ముగిశాక అదుపుతప్పాడు. ఒక్కసారిగా గోల్ స్కోరర్ మురిలోను తలతో బాదాడు. దీంతో రెచ్చిపోయిన కొలంబియా ఆటగాళ్లు బ్రెజిల్ ప్లేయర్లపై తిరగబడ్డారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకున్నారు. సంఘటనకు కారకుడైన నెయ్‌మార్‌కు రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చారు. -
బ్రెజిల్‌కు షాక్
సాంటియాగో: ప్రత్యర్థిపై వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం... గత 24 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడని చరిత్ర.. ప్రస్తుత ఫామ్ పరంగా చూసినా తమదే పైచేయి... అయినా కోపా అమెరికా కప్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కొలంబియా 1-0తో బ్రెజిల్‌పై విజయం సాధించింది. దీంతో గతేడాది జరిగిన ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కొలంబియా డిఫెండర్ జీసన్ మురిలో (36వ ని.) కొలంబియాకు ఏకైక గోల్ అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ మొరటుగా ఆడితే.. పక్కా ప్రణాళికతో కొలంబియా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 36వ నిమిషంలో రైట్ ఫ్లాంక్ నుంచి కడ్రాడో కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్ ముందర డ్రాప్ అయ్యింది. అయితే అక్కడే ఉన్న మురిలో నేర్పుగా బంతిని అందుకుని లో షాట్‌తో గోల్ పోస్ట్‌లోకి పంపడంతో బ్రెజిల్ నివ్వెరపోయింది. రెండో అర్ధభాగంలోబ్రెజిల్ అటాకింగ్‌ను మరింత పెంచింది. చివరి వరకు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. నెయ్‌మార్‌కు రెడ్ కార్డ్ మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కొలంబియా ఆటగాళ్లు రెచ్చగొట్టినా.. మ్యాచ్‌లో ఓపికగా ఉన్న స్టార్ ప్లేయర్ నెయ్మార్ మ్యాచ్ ముగిశాక అదుపుతప్పాడు. ఒక్కసారిగా గోల్ స్కోరర్ మురిలోను తలతో బాదాడు. దీంతో రెచ్చిపోయిన కొలంబియా ఆటగాళ్లు బ్రెజిల్ ప్లేయర్లపై తిరగబడ్డారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకున్నారు. సంఘటనకు కారకుడైన నెయ్‌మార్‌కు రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చారు. కొలంబియా స్ట్రయికర్ బాకా కూడా రెడ్‌కార్డుకు గురయ్యాడు. -
గట్టెక్కిన అర్జెంటీనా
ఉరుగ్వేపై 1-0తో గెలుపు కోపా అమెరికా కప్ లా సెరినా (చిలీ): గెలవాల్సిన తొలి మ్యాచ్‌ను ‘డ్రా’తో సరిపెట్టుకున్న అర్జెంటీనా... రెండో మ్యాచ్ లో మాత్రం ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడింది. డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వేతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో విజ యం సాధించింది. ఆట 56వ నిమిషంలో పాబ్లో జబలెటా కొట్టిన క్రాస్ షాట్‌ను ‘డి’ బాక్స్‌లో అందుకున్న సెర్గియో అగుయెరో హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఈ విజయంతో అర్జెంటీనా గ్రూప్ ‘బి’లో నాలుగు పాయింట్లతో పరాగ్వేతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ ల్లో పరాగ్వేతో ఉరుగ్వే, జమైకాతో అర్జెంటీనా తలపడతాయి. పరాగ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో చివరి నిమిషంలో గోల్ సమర్పించుకొని ‘డ్రా’తో సంతృప్తిపడిన అర్జెంటీనా... ఉరుగ్వేతో మాత్రం ఏ దశలోనూ దూకుడు తగ్గించకుండా ఆడింది. ఈ రెండు జట్ల మధ్య ఇది 199వ మ్యాచ్ కావడం విశేషం. కోపా అమెరికా కప్‌లో నేడు పెరూ ఁ వెనిజులా ఉదయం గం. 5.00 (శుక్రవారం) నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
భళా... బొలివియా
ఈక్వెడార్‌పై సంచలన విజయం ► చిలీ, మెక్సికో మ్యాచ్ ‘డ్రా’ ► కోపా అమెరికా కప్ శాంటియాగో (చిలీ) : కలసికట్టుగా, కసితీరా ఆడితే పటిష్ట జట్టును బోల్తా కొట్టించవచ్చని బొలివియా జట్టు నిరూపించింది. కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బొలివియా జట్టు తమకంటే 58 స్థానాలు మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఈక్వెడార్‌పై సంచలన విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్ బొలివియా 3-2 గోల్స్ తేడాతో ప్రపంచ 31వ ర్యాంకర్ ఈక్వెడార్‌ను ఓడించింది. ఈ క్రమంలో బొలివియా 20 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో విజయాన్ని రుచి చూసింది. అంతేకాకుండా 1997 తర్వాత బొలివియా కోపా అమెరికా కప్‌లో ఓ మ్యాచ్‌లో గెలిచింది. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలోనే బొలివియా తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. 5వ నిమిషంలో రాల్డెస్, 18వ నిమిషంలో స్మెడ్బెర్గ్ డాలెన్స్, 43వ నిమిషంలో మొరెనో ఒక్కో గోల్ చేసి బొలివియాకు 3-0 ఆధిక్యాన్ని అందించారు. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ తేరుకున్నా ఫలితం లేకపోయింది. 48వ నిమిషంలో వాలెన్సియా... 81వ నిమిషంలో బొలానోస్ ఈక్వెడార్‌కు ఒక్కో గోల్ అందించినా అప్పటికే ఆలస్యమైపోయింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో చిలీ, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్ 3-3 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. చిలీ తరఫున విడాల్ (22వ, 55ని.లో), వర్గాస్ (42వ ని.లో) గోల్స్ చేశారు. మెక్సికో జట్టుకు వుసో (21వ, 66వ ని.లో), జిమెనిజ్ (29వ ని.లో) గోల్స్ అందించారు. రెండేసి మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్ ‘ఎ’లో చిలీ, బొలివియా జట్లు నాలుగేసి పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
బ్రెజిల్‌ను గెలిపించిన నెమార్
కోపా అమెరికా కప్ టెముకో (చిలీ): అంతా తానై ఆడిన కెప్టెన్ నెమార్ కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో పెరూ జట్టుపై విజయం సాధించింది. 23 ఏళ్ల వయస్సులోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నెమార్ ఆట ఐదో నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేయడంతోపాటు... ఇంజ్యూరీ టైమ్‌లో (90+2వ నిమిషంలో) సహచరుడు డగ్లస్ కోస్టా గోల్ చేసేందుకు తోడ్పడ్డాడు. నెమార్ అద్వితీయ ఆటతీరు కారణంగా ‘డ్రా’ చేసుకోవాల్సిన మ్యాచ్‌ను బ్రెజిల్ జట్టు విజయం తో ముగించింది. ఆట మూడో నిమిషంలోనే క్యూ వా చేసిన గోల్‌తో పెరూ 1-0 ఆధిక్యంలోకి వెళ్లిం ది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లోనే ఆ విరైంది. ఐదో నిమిషంలో కుడివైపు నుంచి డానీ అల్వెస్ కొట్టిన క్రాస్ పాస్‌ను డి బాక్స్ ముందున్న నెమార్ తలతో గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఈ గోల్‌తో నెమార్ అంతర్జాతీయ కెరీర్లో 44 గోల్స్ చేసినట్టయింది. బ్రెజిల్ దిగ్గజం పీలే 24 ఏళ్ల వయస్సులో 44 గోల్స్ చేయగా... నెమార్ 23 ఏళ్లకే ఈ ఘనత సాధించడం విశేషం. మరోవైపు ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో వెనిజులా 1-0తో కొలంబియా జట్టుపై నెగ్గి సంచలనం సృష్టించింది. 60వ నిమిషంలో సాలమన్ రాన్డాన్ గోల్‌తో వెనిజులా ఆధిక్యంలోకి వెళ్లింది. -
అయ్యో... అర్జెంటీనా
♦ చివరి నిమిషంలో గోల్ సమర్పణ ♦ పరాగ్వేతో మ్యాచ్ ‘డ్రా’ ♦ కోపా అమెరికా కప్ లా సెరినా (చిలీ) : రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న కోపా అమెరికా కప్‌ను ఈసారి గెల్చుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టుకు తొలి మ్యాచ్ ఫలితం నిరాశను కలిగించింది. విజయంతో బోణీ చేస్తుందని భావించిన ఆ జట్టు నిర్లక్ష్య ఆటతీరుతో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున పరాగ్వేతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను అర్జెంటీనా జట్టు 2-2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. ఈ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు మ్యాచ్ చివరి నిమిషంలో గోల్ సమర్పించుకోవడం గమనార్హం. ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా విరామ సమయానికి 2-0తో ముందంజలో ఉంది. ఆట 29వ నిమిషంలో సెర్గియో అగుయెరో... 36వ నిమిషంలో లియోనెల్ మెస్సీ ఒక్కో గోల్ చేసి అర్జెంటీనాకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే రెండో అర్ధభాగంలో పరాగ్వే చక్కటి పోరాటపటిమ కనబరిచి అర్జెంటీనా దూకుడుకు కళ్లెం వేసింది. 60వ నిమిషంలో నెల్సన్ వాల్దెజ్ పరాగ్వేకు తొలి గోల్ అందించగా... 90వ నిమిషంలో లుకాస్ బారియోస్ రెండో గోల్ చేసి స్కోరును సమం చేసి అర్జెంటీనా విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. మరోవైపు ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వే 1-0తో జమైకాపై గెలిచింది. ఆట 52వ నిమిషంలో రోడ్రిగ్వెజ్ గోల్ చేసి ఉరుగ్వేను గెలిపించాడు. -
చిలీ శుభారంభం
కోపా అమెరికా కప్ శాంటియాగో : సొంతగడ్డపై ఆతిథ్య జట్టు చిలీ టైటిల్ వేటను విజయంతో ప్రారంభించింది. కోపా అమెరికా కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిలీ 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఆట 67వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను అర్తురో విడాల్ గోల్‌గా మలచగా... 84వ నిమిషంలో ఎడుఆర్డో వర్గాస్ గోల్‌తో చిలీ విజయం ఖాయమైంది. ఆట ఆరంభం నుంచే చిలీ గోల్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈక్వెడార్ రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండటంతో తొలి అర్ధభాగంలో చిలీ ఖాతా తెరువలేకపోయింది. రెండో అర్ధభాగంలో చిలీ తమ ప్రయత్నాలను కొనసాగించింది. ఆఖరికి 67వ నిమిషంలో ‘డి బాక్స్’లో విడాల్‌ను ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ చిలీకి పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. ఈ అవకాశాన్ని విడాల్ సద్వినియోగం చేసుకొని చిలీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత శాంచెజ్ అందించిన పాస్‌ను వర్గాస్ లక్ష్యానికి చేర్చడంతో చిలీ ఖాతాలో రెండో గోల్ చేరింది. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ఈ మెగా ఈవెంట్ 99 ఏళ్ల చరిత్రలో చిలీ ఇప్పటివరకు విజేతగా నిలువలేదు. నాలుగుసార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.