Copa America Cup: అర్జెంటీనా బోణీ.. మెస్సీ అరుదైన రికార్డు | Copa America Cup 2024: Argentina Beat Canada Watch Highlights Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Copa America Cup 2024: అర్జెంటీనా బోణీ.. మెస్సీ అరుదైన రికార్డు

Jun 22 2024 10:59 AM | Updated on Jun 22 2024 11:22 AM

అట్లాంటా: కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో లియోనల్‌ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 2–0 గోల్స్‌ తేడాతో కెనడా జట్టును ఓడించింది.

అర్జెంటీనా తరఫున జూలియన్‌ అల్వారెజ్‌ (49వ ని.లో), లాటారో మార్టినెజ్‌ (88వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. మెస్సీ అందించిన పాస్‌లతో ఈ రెండు గోల్స్‌ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెస్సీ వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్‌లో అత్యధికంగా 35 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు చిలీకి చెందిన సెర్జియో లివింగ్‌స్టోన్‌ (1941 నుంచి 1953 వరకు; 34 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఈనెల 26న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ చిలీతో అర్జెంటీనా ఆడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement