కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొలంబియా సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఉరుగ్వేను 1-0తో ఓడించింది. తద్వారా ఇరవై మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది.
పోటాపోటీగా సాగిన ఆట 39వ నిమిషంలో జెఫర్‌సన్ లెర్మా గోల్ కొట్టి కొలంబియా గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే, ఓటమిని జీర్ణించుకోలేని ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఉరుగ్వే స్ట్రైకర్ నూనెజ్ సహా మరికొందరు ఆటగాళ్లు.. ప్రేక్షకులు ఉన్న స్టాండ్‌లోకి దూసుకొచ్చి కొలంబియా మద్దతుదారులపై పిడిగుద్దులు కురిపించాడు.
దీంతో మ్యాచ్‌కు వేదికైన బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాహకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో 28 విజయాలతో అజేయంగా నిలిచిన కొలంబియా ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. మియామీ వేదికగా ఇరు జట్లు ఆదివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. కాగా 2001లో కొలంబియా తొలిసారి ఈ టోర్నమెంట్లోట్రోఫీ గెలిచింది.
30వసారి టైటిల్ పోరుకు అర్హత
కాగా వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 30వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది.
ఆట 22వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 51వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేసుకుంది. అర్జెంటీనా తరఫున మెస్సీకిది 109వ గోల్ కావడం విశేషం. ఇక మెస్సీ 38 వేర్వేరు దేశాలపై గోల్స్ చేశాడు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 130 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.
After defeat to Colombia, Uruguayan players entered the stands at Bank of America Stadium and began to throw punches. Liverpool forward Darwin Nunez amongst those at the forefront. pic.twitter.com/VE3unKObSa
— Kyle Bonn (@the_bonnfire) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment