Lionel Messi
-
Copa America: సంచలన విజయం.. ఫైనల్లో కొలంబియా
కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొలంబియా సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఉరుగ్వేను 1-0తో ఓడించింది. తద్వారా ఇరవై మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది.పోటాపోటీగా సాగిన ఆట 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా గోల్ కొట్టి కొలంబియా గెలుపును ఖరారు చేశాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే, ఓటమిని జీర్ణించుకోలేని ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఉరుగ్వే స్ట్రైకర్ నూనెజ్ సహా మరికొందరు ఆటగాళ్లు.. ప్రేక్షకులు ఉన్న స్టాండ్‌లోకి దూసుకొచ్చి కొలంబియా మద్దతుదారులపై పిడిగుద్దులు కురిపించాడు.దీంతో మ్యాచ్‌కు వేదికైన బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాహకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో 28 విజయాలతో అజేయంగా నిలిచిన కొలంబియా ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. మియామీ వేదికగా ఇరు జట్లు ఆదివారం టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. కాగా 2001లో కొలంబియా తొలిసారి ఈ టోర్నమెంట్లోట్రోఫీ గెలిచింది.30వసారి టైటిల్ పోరుకు అర్హత కాగా వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 30వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో లయనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టుపై గెలిచింది.ఆట 22వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 51వ నిమిషంలో మెస్సీ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేసుకుంది. అర్జెంటీనా తరఫున మెస్సీకిది 109వ గోల్ కావడం విశేషం. ఇక మెస్సీ 38 వేర్వేరు దేశాలపై గోల్స్ చేశాడు.అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 130 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీ ఘనత సాధించాడు.After defeat to Colombia, Uruguayan players entered the stands at Bank of America Stadium and began to throw punches. Liverpool forward Darwin Nunez amongst those at the forefront. pic.twitter.com/VE3unKObSa— Kyle Bonn (@the_bonnfire) July 11, 2024 -
Copa America Cup: అర్జెంటీనా బోణీ.. మెస్సీ అరుదైన రికార్డు
అట్లాంటా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో కెనడా జట్టును ఓడించింది.అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (49వ ని.లో), లాటారో మార్టినెజ్ (88వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మెస్సీ అందించిన పాస్‌లతో ఈ రెండు గోల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెస్సీ వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోపా అమెరికా కప్‌లో అత్యధికంగా 35 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.ఇప్పటి వరకు ఈ రికార్డు చిలీకి చెందిన సెర్జియో లివింగ్‌స్టోన్ (1941 నుంచి 1953 వరకు; 34 మ్యాచ్‌లు) పేరిట ఉంది. ఈనెల 26న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ చిలీతో అర్జెంటీనా ఆడుతుంది. View this post on Instagram A post shared by CONMEBOL Copa América™ USA 2024 (@copaamericaeng) -
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన మెస్సీ
స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) క్లబ్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ.. క్లెర్మాంట్ క్లబ్ చేతిలో 2-3 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. మెస్సీతో పాటు సెర్గియో రామోస్‌కు కూడా పీఎస్జీ తరఫున ఇదే చివరి మ్యాచ్. తొలి అర్ధ భాగంలో పీఎస్జీ తరఫున రామోస్, ఎంబపె చెరో గోల్ సాధించగా.. క్లెర్మాంట్ తరఫున జోహన్ గస్టీన్, మెహ్ది జెఫ్ఫానే గోల్స్ చేశారు. అనంతరం సెకెండ్ హాఫ్‌లో (63వ నిమిషం) గ్రెజాన్ కై గోల్ చేసి క్లెర్మాంట్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇదే లీడ్ చివరి వరకు కొనసాగడంతో క్లెర్మాంట్.. పీఎస్‌జీపై విజయం సాధించింది. సెకెండ్ హాఫ్‌లో మెస్సీకి రెండు గోల్స్ చేసే అవకాశం (ఫ్రీ కిక్) వచ్చినా, అవి వర్కౌట్ కాలేదు. మొత్తంగా ప్రస్తుత తరంలో ఫుట్‌బాల్ దిగ్గజాలుగా చెప్పుకునే మెస్సీ, రామోస్ ఓటమితో పీఎస్జీకి వీడ్కోలు పలికారు. కాగా, మెస్సీ.. సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్ క్లబ్‌తో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అల్ హిలాల్ ప్రకటిస్తుందని తెలుస్తోంది. మెస్సీ సహచరుడు, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సైతం సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: జొకోవిచ్ రికార్డు -
ప్రతిష్టాత్మక అవార్డు కోసం కొదమ సింహాల్లా..
గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కలను కూడా సాకారం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రదర్శనకు గాను గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నాడు. క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు(Laureus Sport) కోసం మెస్సీ సహా వరల్డ్ గ్రేటెస్ట్ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్, ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్, పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన మొండో డుప్లాంటిస్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ గార్డ్ స్టీఫెన్ కర్రీలు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఈ అవార్డును కొల్లగొట్టబోతున్నారనేది వేచి చూడాల్సిందే. చదవండి: క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' -
మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్..
నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్.. ఫ్రాన్స్ ఒక వైపు.. అర్జెంటీనాకు మద్దతుగా మిగతా ప్రపంచమంతా ఓవైపు అన్నట్లుగా జరిగిన గేమ్.. దానికి కారణం.. మెస్సీ... అతడి కోసమైనా అర్జెంటీనా గెలవాలి అన్నట్లుగా ఫుట్‌బాల్ అభిమానులు ప్రార్థనలు చేశారు.. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు. జగజ్జేతగా నిలిచిన తర్వాత అటు అర్జెంటీనాలో లక్షలాదిగా జనం రోడ్డు మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటే.. ఇటు సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల ఫన్నీ మీమ్స్‌లో సందడి చేశారు. అందులో ఎక్కువ మందిని ఆకర్షించిన మీమ్.. ఇదిగో ఈ కాంతారా మీమ్.. ఇరుపక్షాల స్కోర్ సమమై.. మెస్సీ నీరసపడినప్పుడు అతడిలోని మహాశక్తిని నాటి మేటి దిగ్గజం మారడోనా మేల్కొలుపుతున్నట్లుగా రూపొందించిన ఈ మీమ్ ట్విట్టర్లో అందరినీ ఆకర్షిస్తోంది. చదవండి: అర్జెంటీనా జెర్సీలో వరుడు.. ఫ్రాన్స్ జెర్సీలో వధువు.. Messi and Maradona ( Kantara Inspired) Hats off to whoever done this edit#FIFAWorldCup pic.twitter.com/ZXLiunReue — Mr.S (@SarangSuresh95) December 18, 2022 -
మెస్సీ అసోంలో పుట్టాడు..!
ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేతగా అర్జెంటీనా ఆవిర్భవించిన క్షణం నుంచి ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. విశ్వం నలుమూలల్లో ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని సంబోధిస్తూ ఆకాశానికెత్తుతున్నారు. ఫైనల్ మ్యాచ్ పూర్తై 24 గంటలు గడుస్తున్నా మెస్సీ నామస్మరణతో ప్రపంచ వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి హైరేటెడ్ సెలబ్రిటీల వరకు మెస్సీని అభినందనలతో (సోషల్‌మీడియా వేదికగా) ముంచెత్తుతున్నారు. ఎంతో మంది లాగే మన దేశంలోని అసోం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ట్విటర్ వేదికగా మెస్సీని అభినందించాడు. అసోంకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖలీక్ మెస్సీని అభినందిస్తూ.. అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నామంటూ పొంతన లేని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు. మెస్సీ ఏంటి.. అసోంతో సంబంధం ఏంటీ అంటూ సందిగ్ధంలో ఉండిపోయారు. సదరు ఎంపీ గారు చెప్పింది నిజమేనా అని ఓ సారి క్రాస్ చెక్ కూడా చేసుకున్నారు. ఓ నెటిజన్ అయితే మెస్సీకి అసోంతో కనెక్షన్ నిజమేనా అని ఎంపీ గారిని ప్రశ్నించాడు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. అవును, మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ బదులిచ్చాడు. assam connection? — Aditya Sharma (@strangecrickkk) December 19, 2022 ఈ ట్వీట్లు కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చేసుకుని ఫేక్ న్యూస్ అని తేల్చేసిన నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీని ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. ఎంపీ గారి అజ్ఞానాన్ని ఏకి పారేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో తప్పు తెలుసుకున్న సదరు ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. అబ్దుల్ ఖలీక్ అసోంలోని బార్ పేట్ లోక్‌సభ స్థానానికి పాత్రినిధ్యం వహిస్తున్నాడు. కాగా, ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా నిన్న (డిసెంబర్ 18) ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో మెస్సీ 2 గోల్స్‌తో మాయాజాలం చేసి అర్జెంటీనాను జగజ్జేతగా నిలపడమే కాకుండా వరల్డ్‌కప్ గెలవాలన్న తన చిరకాల కోరికను సైతం నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్‌ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి మూడోసారి (1978, 1986, 2022) జగజ్జేతగా ఆవిర్భవించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నిర్ణీత సమయంతో పాటు 30 నిమిషాల అదనపు సమయం తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో (3-3) మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో మెస్సీ సేన 4 గోల్స్ కొట్టగా.. ఫ్రాన్స్ 2 గోల్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. నిర్ణీత సమయంలో ఆర్జెంటీనా తరఫున మెస్సీ 2 గోల్స్, ఏంజెల్ డి మారియ ఒక గోల్ సాధించగా.. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబపే హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. -
మెస్సీ, రొనాల్డోలకు ఊహించని షాక్..
ప్రస్తుత తరం ఫుట్‌బాల్ స్టార్లుగా వెలుగొందుతున్న లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం ప్రకటించిన ఫిఫా 23 అల్టిమేట్ టీమ్ పేరిట అత్యధిక రేటింగ్ కలిగిన స్టార్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఎప్పుడు టాప్‌లో ఉండే మెస్సీ, రొనాల్డోలు తొలిసారి కిందకు పడిపోయారు. మెస్సీ ఐదో స్థానంలో ఉండగా.. రొనాల్డో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 23 మందితో ప్రకటించిన ఈ జాబితాలో అగ్రభాగం ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్‌కు ఆడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. 23 మందిలో 11 మంది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన వారు కాగా.. మిగతా 12 మంది వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఆడుతున్నారు. ఇక తొలి ఐదు స్థానాలకు 91 రేటింగ్ పాయింట్లే ఇచ్చినప్పటికి ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకటించారు. రియల్ మాడ్రిడ్‌కు చెందిన కరీమ్ బెంజెమా 91 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. బార్సిలోనాకు చెందిన రాబర్ట్ లెవాన్‌డోస్కీ(91 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో.. పారిస్ సెయింట్ జర్మన్(పీఎస్జీ)కు చెందిన కైలియన్ మేపీ(91 రేటింగ్) మూడో స్థానంలో.. మాంచెస్టర్ సిటీకి చెందని కెవిన్ డిబ్రూయోన్(91 రేటింగ్) నాలుగో స్థానంలో.. పీఎస్జీకి చెందిన లియోనల్ మెస్సీ(91 రేటింగ్) ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 90 రేటింగ్‌తో మహ్మద్ సాలా(లివర్‌పూల్), వర్జిల్ వాన్ డిజ్క్(లివర్ పూల్), క్రిస్టియానో రొనాల్డో(మాంచెస్టర్ యునైటెడ్) వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. అత్యధిక రేటింగ్ కలిగిన 23 స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ►కరీమ్ బెంజెమా (రియల్ మాడ్రిడ్) - 91 రేటింగ్ ►రాబర్ట్ లెవాండోస్కీ (బార్సిలోనా) - 91 రేటింగ్ ►కైలియన్ మేపీ (పారిస్ సెయింట్-జర్మైన్) - 91 రేటింగ్ ►కెవిన్ డి బ్రూయ్నే (మాంచెస్టర్ సిటీ) - 91 రేటింగ్ ►లియోనెల్ మెస్సీ (పారిస్ సెయింట్-జర్మైన్) - 91 రేటింగ్ ►మొహమ్మద్ సలా (లివర్‌పూల్) - 90 రేట్ చేయబడింది ►వర్జిల్ వాన్ డిజ్క్ (లివర్‌పూల్) - 90 రేట్ చేయబడింది ►క్రిస్టియానో రొనాల్డో (మాంచెస్టర్ యునైటెడ్) - 90 రేటింగ్ ►తిబౌట్ కోర్టోయిస్ (రియల్ మాడ్రిడ్) - 90 రేటింగ్ ►మాన్యుయెల్ న్యూయర్ (బేయర్న్ మ్యూనిచ్) - 90 రేట్ చేయబడింది ►నేమార్ జూనియర్ (పారిస్ సెయింట్-జర్మైన్) - 89 రేటింగ్ ►హ్యూంగ్-మిన్ సన్ (టోటెన్హామ్ హాట్స్పుర్) - 89 రేట్ చేయబడింది ►సాడియో మనే (బేయర్న్ మ్యూనిచ్) - 89 రేట్ చేయబడింది ►జాషువా కిమ్మిచ్ (బేయర్న్ మ్యూనిచ్) - 89 రేట్ చేయబడింది ►కాసెమిరో (మాంచెస్టర్ యునైటెడ్) - 89 రేటింగ్ ►అలిసన్ (లివర్‌పూల్) - 89 రేట్ చేయబడింది ►హ్యారీ కేన్ (టోటెన్హామ్ హాట్స్పుర్) - 89 రేట్ చేయబడింది ►ఎడెర్సన్ (మాంచెస్టర్ సిటీ) - 89 రేటింగ్ ►గోలో కాంటే (చెల్సియా) - 89 రేటింగ్ ►జాన్ ఓబ్లాక్ (అట్లెటికో మాడ్రిడ్) - 89 రేట్ చేయబడింది ►ఎర్లింగ్ హాలాండ్ (మాంచెస్టర్ సిటీ) - 88 రేటింగ్ ►టోని క్రూస్ (రియల్ మాడ్రిడ్) - 88 రేటింగ్ ►మార్క్వినోస్ (పారిస్-సెయింట్ జర్మైన్) - 88 రేటింగ్ చదవండి: Ishwar Pandey: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ -
'బాస్ నేను మనిషినే'.. స్టార్ ఫుట్‌బాలర్‌కు వింత అనుభవం
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి ఒక అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. ఫిఫా వరల్డ్‌కప్ 2022 క్వాలిఫయింగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈక్వెడార్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ అభిమాని ఒకరు ''మెస్సీ.. మెస్సీ'' అని గట్టిగా అరుస్తూ గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చాడు. ఇది గమనించకుండా వెళ్తున్న మెస్సీకి అడ్డుగా వెళ్లి.. అతని భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. అయితే పొరపాటు ఆ అభిమాని తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. దీంతో మెస్సీ కోపంతో.. ''బాస్ నేను మనిషినే.. సెల్ఫీ కోసం నన్ను ఇబ్బంది పెట్టకు'' అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యురిటీ వచ్చి అతన్ని స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. కాగా అర్జెంటీనాకు క్వాలిఫయింగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా 11 మ్యాచ్‌లు గెలిచి.. ఆరు డ్రా చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. కాగా అర్జెంటీనాతో పాటు బ్రెజిల్, ఉరుగ్వే, ఈక్వెడార్‌లు ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. చదవండి: Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు? View this post on Instagram A post shared by @jossuegarzon -
ఇంచు కూడా కదల్లేదు.. మెస్సీకి ఏమైంది
Lionel Messi Shocking Video.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మైదానంలా పాదరసంలా కదులడం చూస్తుంటాం. కానీ లీగ్ 1లో భాగంగా పీఎస్జీ, లిల్లే మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కొన్ని సెకన్ల పాటు ఇంచు కూడా కదలకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిమిషంలో హాఫ్ టైమ్ ముగుస్తుందనగా.. నెయమర్, అంజెల్ డీ మారియాలు గోల్ కోసం ప్రయత్నిస్తుంటే ఇతర ఆటగాళ్లు అడ్డుకోవడం కోసం పరిగెత్తారు. కానీ మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న మెస్సీ మాత్రం కొన్ని సెకన్లపాటు కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలో అది స్పష్టంగా కనిపించింది. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రిస్టియానో రొనాల్డొ.. కాగా మెస్సీకి మోకాలి గాయం తిరగబెట్టడంతో అలా చేశాడని మ్యాచ్ అనంతరం పీఎస్జీ వివరించింది. ఇక మెస్సీని ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని.. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తప్ప తర్వాతి గేమ్‌కు అందుబాటులో ఉంటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పీఎస్జీ లిల్లేపై 2-1 తేడాతో గెలిచింది. పీఎస్జీ తరపున మారిక్వినోస్, ఎంజెల్ డి మారియాలు ఆట 74, 88వ నిమిషంలో గోల్ కొట్టారు. Lionel Messi mannequin challenge 2k21🔥🔥🔥 pic.twitter.com/KoK2bCLIQj — J📌 (@jugga75490069) October 31, 2021 -
ఈ విజయం మారడోనాకు అంకితం..
బ్యూనెస్ ఎయిరెస్: 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా అవతరించిన అర్జెంటీనా ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. ఆ జట్టు టైటిల్ గెలిచాక తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ప్రతిష్టాత్మక టైటిల్‌ను దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సహా కరోనా బాధిత కుటుంబాలకు అంకితమిచ్చాడు. అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలవాలని మారడోనా ఆకాంక్షించాడని, అతని కలను నా సారధ్యంలోని అర్జెంటీనా జట్టు సాకారారం చేయడం నా అదృష్టమని మెస్సీ పేర్కొన్నాడు. మారడోనా భౌతికంగా తమ మధ్య లేకపోయినా, అతని ఆత్మ జట్టును ప్రోత్సహిస్తూ ఉండిందని తెలిపాడు. మరోవైపు అభిమానులు విజయోత్సవాలను జరుపుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ విజయంతో లభించిన సంతోషంతో బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చాడు. తన జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు, ముఖ్యంగా తనను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ మెస్సీ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది మెస్సీ కెరీర్లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడంతో అతని ఆనందానికి హద్దులు లేవు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన మెస్సీ.. జట్టు విజయాన్ని కోవిడ్ బాధిత కుటుంబాలకు, అలాగే గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు తెలిపిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. -
బాల్‌ను ఓ రేంజ్లో ఆడేసుకుందిగా..
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ దిగ్గజాలు అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ. వీరు మైదానంలో అడుగుపెడితే ప్రేక్షకుల ఈలలు, కేరింతలు, చప్పట్లకు కొదవే లేదు. అయితే వీరిని సైతం ఆశ్చర్యపరిచేలా ఓ యువతి ఫుట్‌బాల్‌ను రఫ్ఫాడిస్తోంది. అది కూడా సన్నని హీల్స్ ధరించి! రక్వెల్ బెనట్టీ అనే యువతి మైదానంలో అడుగుపెట్టకపోయినా కావాల్సినంత క్రేజ్ తెచ్చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక్క వీడియోతో స్టార్ అయిపోయింది. (అతను ఆడలేదుగా.. డబ్బులు ఇచ్చేయండి!) ఇందులో ఆమె ఫుట్‌బాల్‌ను కాలితో క్యాచ్‌లు, నెత్తిన పెట్టుకుని డ్యాన్సులు, హీల్స్‌తో కిక్కులు, పుషప్స్‌లు, పడుకుని బాల్‌ను పల్టీలు కొట్టించడాలు.. ఇలా ఒకటేమిటీ.. ఎన్నో చేసింది. 50 సెకండ్లలో ఒక్కసారి కూడా బాల్‌ను కిందపడనివ్వకుండా విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచింది. ఇది పాత వీడియోనే అయినప్పటికీ సోషల్ మీడియాలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె టాలెంట్‌కు మంత్రముగ్ధుడైన ఓ నెటిజన్ "రొనాల్డో, మెస్సీ.. ఈ భూమ్మీద ఉన్న ఏ ఒక్కరూ హీల్స్ ధరించి ఇలా ఆడలేరు" అని ప్రశంసించాడు. మరో వ్యక్తి ఈ వీడియోను తిరిగి ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. "క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ.. 24 గంటల్లోగా దీనిపై స్పందించాల"ని క్యాప్షన్ జోడించాడు. చూడాలి మరి, ఫుట్‌బాల్ దిగ్గజాలు స్పందిస్తాయో లేదో! (రొనాల్డోను దాటేసిన మెస్సీ..) -
వైరల్ : వారెవ్వా! క్యా గోల్ హై..
తిరువనంతపురం : ఫుట్‌బాల్ ఆట తెలిసినవారికి లియోనెల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ ప్రపంచంలో అత్యంత పాపులర్ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. క్రిస్టియానో రొనాల్డొ, బెక్‌హమ్, రొనాల్డినో లాంటి ఆటగాళ్లతో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నాడు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో ఫ్రీకిక్‌ను మెస్సీ వాడుకున్నంతగా ఎవరు వాడుకోరనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రీకిక్లో పుట్‌బాల్‌ను తన్నాడంటే బంతి వెళ్లి గోల్‌పోస్ట్‌లో పడాల్సిందే. ఆ విషయంలో అతని టైమింగ్ అంత కచ్చితంగా ఉంటుంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. (కిచెన్‌లో గోడలు లేని బాత్రూం.. నెటిజన్లు ఫైర్) కేరళకు చెందిన 12 ఏళ్ల కుర్రాడు ఒక వీడియోలో అచ్చం మెస్సీని దించేశాడు. ఆ వీడియోలో మెస్సీ జెర్సీ నెంబర్ 10ని ధరించి అచ్చం మెస్సీలా నిలబడి బంతిని దగ్గరకు తెచ్చుకొని తన చేత్తో హెయిర్ నిమురుకున్నాడు. తర్వాత బంతిని తన్నగానే ఎదురుగా ఉన్న గోల్కోస్ట్కు ఏర్పాటు చేసిన టైర్ మద్యలో నుంచి బంతి వెళ్లింది.అనంతరం ఆ కుర్రాడు అచ్చం మెస్సీలా మొకాళ్ల మీద నిల్చుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియోనూ కేరళకు చెందిన ఆల్ కేరళ సెవెన్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మరో మెస్సీ పుట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 52 ఏళ్ల మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లో 697 గోల్స్ చేశాడు. -
ఎగిరి గంతేసిన కామెంటేటర్..!
-
మెస్సీని మించినోడు.. మంచి మనసున్నోడు!
మాస్కో: కైలిన్ ఎంబాపె.. ఎక్కడ చూసిన ఇప్పుడంతా అతని పేరే.. గూగలమ్మను కూడా అందరూ ఇతని గురించే అడుగుతున్నారంటా.. ఎందుకంటే ఫిపా ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన మెస్సీ బృందాన్ని ఫ్రిక్వార్టర్లోనే ఇంటికెళ్లగొట్టాడు.. ఈ 19 ఏళ్ల ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్. పుట్‌బాల్ ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడైన మెస్సీకి తన ఆటతో భారీ షాక్ ఇచ్చాడు. శనివారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఎంబాపే దెబ్బకు అర్జెంటీనా 4-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో తన జట్టును గెలిపించి సూపర్ హీరో అయిన ఎంబాపే.. ఈ టోర్నీ ద్వారా తను ఆర్జించే జీతాన్ని ఓ చారిటీకి విరాళంగా ఇచ్చేస్తానని తెలిపి మంచి మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని లారస్ స్పోర్ట్స్ ట్విటర్లో ప్రకటించింది. ‘ఈ టోర్నీ ద్వారా ఎంబాపే సంపాదించే ప్రతి రూపాయిని చారిటీకి విరాళంగా ఇవ్వనున్నాడు. అతను ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.16 లక్షలు ఆర్జించనున్నాడు. ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేయనున్నాడు. ఆటగాళ్లు దేశకోసం ఆడాలి తప్పా డబ్బుల కోసం కాదనే విషయాన్ని ఎంబాపే విశ్వసిస్తాడు’ అని ట్వీట్ చేసింది. ఇక ఎంబాపే నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఎం‘బాప్రే’..! -
మెస్సీ ఆడేటపుడు మాత్రమే: విద్యాబాలన్
ముంబై: సగటు అభిమానుల నుంచి క్రీడాకారులు, సినీ తారల వరకు ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడతారు. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్‌కు కూడా ఫుట్‌బాల్ అంటే ఇష్టమట. అయితే అర్టెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఆడేటపుడు మాత్రమే ఫుట్‌బాల్ ఆటను చూస్తానని ఈ భామ చెబుతోంది. 'ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మెస్సీ అంటే ఇష్టం. అతను ఆకట్టుకునేలా ఉంటాడు. మెస్సీ మ్యాచ్ టీవీలో వస్తున్నప్పుడు నా స్నేహితులు చెబుతారు. వెంటనే టీవీ ఆన్ చేసి ఫుట్‌బాల్ చూస్తా. ఇంతకంటే పెద్దగా ఆసక్తి లేదు' అని విద్యా చెప్పింది.