కైలిన్ ఎంబాపె
మాస్కో: కైలిన్ ఎంబాపె.. ఎక్కడ చూసిన ఇప్పుడంతా అతని పేరే.. గూగలమ్మను కూడా అందరూ ఇతని గురించే అడుగుతున్నారంటా.. ఎందుకంటే ఫిపా ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన మెస్సీ బృందాన్ని ఫ్రిక్వార్టర్‌లోనే ఇంటికెళ్లగొట్టాడు.. ఈ 19 ఏళ్ల ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్. పుట్‌బాల్ ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడైన మెస్సీకి తన ఆటతో భారీ షాక్ ఇచ్చాడు. శనివారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఎంబాపే దెబ్బకు అర్జెంటీనా 4-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో తన జట్టును గెలిపించి సూపర్ హీరో అయిన ఎంబాపే.. ఈ టోర్నీ ద్వారా తను ఆర్జించే జీతాన్ని ఓ చారిటీకి విరాళంగా ఇచ్చేస్తానని తెలిపి మంచి మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని లారస్ స్పోర్ట్స్ ట్విటర్‌లో ప్రకటించింది. ‘ఈ టోర్నీ ద్వారా ఎంబాపే సంపాదించే ప్రతి రూపాయిని చారిటీకి విరాళంగా ఇవ్వనున్నాడు. అతను ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.16 లక్షలు ఆర్జించనున్నాడు. ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేయనున్నాడు. ఆటగాళ్లు దేశకోసం ఆడాలి తప్పా డబ్బుల కోసం కాదనే విషయాన్ని ఎంబాపే విశ్వసిస్తాడు’ అని ట్వీట్ చేసింది. ఇక ఎంబాపే నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment