FIFA World Cup 2018
-
'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా'
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్లోని లాకర్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్‌ను ప్రశ్నించాడు. ''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్ జడ్డి ఆదేశించారు. 2018 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
క్రీడాస్పూర్తి చాటిన అభిమానులు
పల్లెకెలె : క్రికెట్ అంటేనే ఓ పిచ్చిగా ఆరాధిస్తారు. తమ అభిమాన జట్టుకు ఆశించిన మేర ఫలితం రాకపోతే మైదానంలో వీరంగం సృష్టిస్తారు. అభిమాన ఆటగాళ్లనే నిందిస్తారు. ఇలా మైదానంలో బాటిళ్లు విసురుతూ.. మ్యాచ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఘటనలున్నాయి. అభిమాన క్రికెటర్ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి క్రికెట్లో శ్రీలంక అభిమానుల ప్రవర్తించిన తీరు ఔరా అనిపిస్తోంది. వారి చర్య యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. వారి ప్రవర్తన అసలు సిసలు క్రీడాస్పూర్తికి అద్దం పడుతోంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శ్రీలంక వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. పల్లెకెలె మైదానంలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లంక ఓడినా ఆ దేశ అభిమానులు చేసిన పనికి యావత్ క్రికెట్ ప్రపంచం గర్వపడుతోంది. ఓటమిని లెక్క చేయకుండా అభిమానులు స్టేడియంలోని చెత్త ఏరుతూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఈ వీడియోను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఇలా అభిమానులు క్రీడా స్పూర్తి చాటడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్ అభిమానులు తమ జట్టు ఓడినా.. పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. దీంతో అప్పట్లో వారిపై ప్రశంసల జల్లు కురిసింది. మూడో వన్డేలో సఫారీ అరంగేట్ర బ్యాట్స్‌మన్ రీజా హెండ్రీక్స్ అజెయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 78 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. రీజా హెండ్రీక్స్ 89 బంతుల్లో 102 పరుగులు చేయడంతో సఫారీ 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 285 పరుగులకు కుప్పకూలింది. අවවාදයට වඩා ආදර්ශය උතුම්...ඔබට අපෙන් පැසසුම්..🙏 #LKA #SLvSA pic.twitter.com/FWVjKuCBMK — Sri Lanka Cricket (@OfficialSLC) August 8, 2018 చదవండి: ఇదీ క్రీడా స్ఫూర్తి.! -
గెలిచినపుడు మాత్రమే మీ వాడినా..!?
బెర్లిన్ : ‘గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్‌గా గుర్తించడం. జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ఒక వలసదారుడి వల్లే ఇదంతా జరిగిందంటూ నిందించడం సరికాదు. నాకు రెండు హృదయాలు ఉన్నాయి. ఒకటి జర్మన్‌గా. మరొకటి టర్కిష్‌గా అంటూ జర్మనీ ఫుట్‌బాల్ ఆటగాడు మెసట్ ఒజిల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇకపై జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోవడం లేదని పేర్కొన్నాడు. జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కోచ్‌ల వేధింపుల కారణంగా ఫుట్‌బాల్ జట్టు నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన చేశాడు. రాజకీయాలతో సంబంధం లేదు.. టర్కీ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒజిల్ కొందరు సహచర ఆటగాళ్లతో కలిసి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిశాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు రావడంతో ఆవేదనకు గురైన ఒజిల్ వివరణ ఇచ్చాడు. కేవలం టర్కీ మూలాలు ఉన్న కారణంగానే తనను విమర్శిస్తున్నారంటూ ఆరోపించాడు. ‘ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ గత రెండు నెలలుగా నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నా పూర్వీకులు టర్కీకి చెందినవారు. కానీ నేను పెరిగిందంతా జర్మనీలోనే. నా సహచరులతో కలిసి టర్కీ అధ్యక్షుడితో దిగిన ఫొటోలను సాకుగా చూపి నాపై జాతి వివక్షకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపి జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, మా కోచ్ వివరణ ఇవ్వాల్సిందిగా నన్ను డిమాండ్ చేశారు. అయితే నేను కేవలం ఒక ఆటగాడిని మాత్రమే అన్న విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి’ అంటూ ఒజెల్ వ్యాఖ్యానించాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ జట్టు ఫిఫా ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే మెక్సికో చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ నుంచి తమ సీనియర్ ఆటగాడు ఒజిల్‌ను తుది జట్టు నుంచి పక్కన పెట్టేసింది. -
చాప్టర్ IX
పోలీస్ కమీషనర్ బంగ్లా. లోధి ఎస్టేట్. న్యూఢిల్లీ.నేటినుంచి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనున్న సౌదీ అరేబియా.ఇసుక తుపాన్లతో, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ రాజధాని. రెండు రోజుల నుండి కురుస్తున్న....‘‘హలో...’’...భయాందోళనలో ప్రజలు. మరో నాలుగు రోజుల వరకు పరిస్థితి ఇలానే కొనసా...‘‘నానీ! టీవీ వాల్యూం కొంచెం డౌన్ చెయ్. హలో.. కమిషనర్ అరవింద్ కుమార్ స్పీకింగ్..’’‘‘హలో అరవింద్ సర్! నేను రమేష్‌ని మాట్లాడుతున్నా. పదేళ్ళ క్రితం ఏలూరులో మీ సబార్డినేట్‌గా పనిచేశాను సర్.’’‘‘హే రమేష్! ఎలా ఉన్నావ్? ఏంటి ఇంత సడన్‌గా కాల్ చేశావ్? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ?’’‘‘అందరూ బావున్నాం సర్. ఒక ఇంపార్టెంట్ విషయం చెబ్దామని కాల్ చేశా. పదేళ్ళక్రితం మనం ఏలూరులో పనిచేసేటప్పుడు అన్ సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయిన రైల్వే హాకర్ మర్డర్ కేస్కి ఫైనల్‌గా సమాధానం దొరికింది సర్.’’‘‘వా... వాట్? కమ్ అగైన్.’’‘‘మీకు తెలిసే ఉంటుంది.. త్రీ డేస్ బ్యాక్ డెబ్బై రెండేళ్ళ నాగ్‌పూర్ మాఫియా డాన్ విలాస్ రావ్ దండేర్కర్ హార్ట్ అటాక్‌తో చనిపోయిన సంగతి. ఆఖరి కోరికగా తను చనిపోయిన తర్వాత వాడి ఆటో బయోగ్రఫీ విడుదల చెయ్యాలని ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పి బుక్స్ కూడా ఎప్పుడో ప్రింట్ చేయించేశాడంట సర్.’’ ‘‘సో..?’’‘‘ఆ బుక్ ‘మై కన్ఫెషన్స్ – విలాస్ రావ్ దండేర్కర్’ మార్కెట్లోకి నిన్నే రిలీజ్ అయ్యింది. ఆ బుక్‌లో చాప్టర్ 9 మీరొక్కసారి చదవండి సర్.’’‘‘కమాన్ రమేష్! అసలేముంది ఆ బుక్‌లో? ఏలూరులో జరిగిన మర్డర్‌కి, నాగ్‌పూర్ మాఫియా డాన్‌కి సంబంధం ఏంటి?’’‘‘బిలీవ్ మీ సర్. ఒక్కసారి చదవండి. మూడేళ్ళు ఆ కేస్ మీద మీరు పడ్డ స్ట్రగుల్‌కి ఆన్సర్ దొరుకుతుంది.’’‘‘ఓకే... ఓకే... డెఫినెట్‌గా చదువుతాను. బట్...’’‘‘పదేళ్ళ నాటి మర్డర్ మిస్టరీ వీడిపోయింది సర్. అది నేను చెప్పడం కంటే మీరు చదివి తెలుసుకుంటేనే బావుంటుంది. చాప్టర్ 9. బై సర్.’’‘‘ఓకే రమేశ్.. బై.’’ పోలీస్ కమిషనర్ అరవింద్ ఫోన్ పెట్టేశాడు.‘‘వాట్ హాపెండ్ డాడ్? ఎవరు ఫోన్లో..’’ అరవింద్ కొడుకు నాని అడిగాడు.‘‘నథింగ్. నేను బైటకి వెళ్తున్నా నానీ.’’‘‘ఇంత పెద్ద వర్షంలోనా? కమాన్ డాడ్.. మీరేగా కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామన్నారు..’’.‘‘సారీ నానీ! ఐ హావ్ టు గో నవ్. రియల్లీ సారీ. డిన్నర్ చేసేయ్, నాకోసం వెయిట్ చెయ్యకు.’’‘‘ఎంత టైం పడుతుంది డాడ్? ఆఫీస్ వర్కా? కాదంటే చెప్పండి ఈరోజు డ్రైవర్ రాలేదుగా నేనొచ్చి కార్ డ్రైవ్ చేస్తా...’’ ‘‘నో. బయట చూడు ఎంత పెద్ద వర్షం పడుతోందో. ఇట్స్ నాట్ సేఫ్ అవుట్ దేర్. మ్యాచ్ చూసి డిన్నర్ చేసి పడుకో. చిన్న పనే. చూసుకుని నేను వచ్చేస్తా.’’కార్ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది.హెడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. వైపర్స్ అటూ ఇటూ కొట్టుకుంటున్నాయి. కారు బంగ్లానుండి బయటకి వచ్చింది. అరవింద్‌ని కారు ముందుకి తీసుకువెళ్తోంటే... కాలం వెనక్కి తీసుకెళ్తోంది. 2008. ఏలూరు.గంటకి 182 కిలోమీటర్ల వేగంతో తీరం దాటనున్న తుఫాన్......దేశంలోని ప్రజల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న ఆ దేశ ప్ర...నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా......రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన సంఘటనకి...‘‘అబ్బబ్బబ్బా.. రేయ్ నానీ! ఒక్క చానల్ ఉంచలేవా, అస్తమానూ మారుస్తూ ఉంటావ్. అసలే అర్ధరాత్రెళ్లిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. చూస్తుంటే ఈ వానేమో ఆగి చచ్చేట్టులేదు. ఎక్కడున్నారో ఏంటో మీ నాన్నకోసారి ఫోన్ చెయ్.’’ టీవీ చూస్తున్న నానీతో అరుస్తున్నట్టు మాట్లాడింది వాళ్లమ్మ. పచ్చదనానికి, ప్రశాంతతకి నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు నగరం అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలిన తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో తుపాకీతో చేసిన హత్య ఇదేమొదటిదవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని జిల్లా ఎస్పీ అరవింద్ కుమార్ గార్ని అడిగి తెలుసుకుందాం.‘‘అమ్మా! ఇలా రా. ఫోనెందుకు, డైరెక్ట్‌గా టీవీలో చూద్దువుగాని నాన్నని.’’ అన్నాడు నాని చిన్నగా నవ్వుతూ. ‘‘ఇట్స్ ఎ క్వైట్æ షాకింగ్ ఇన్సిడెంట్ టు అస్. గన్ కల్చర్ అనేది ఈ జిల్లాలో ఇప్పటివరకు లేదు. సమ్ వన్, మేబీ సమ్ పీపుల్.. ఈ ఊరు పద్ధతుల్ని మార్చాలని అర్ధరాత్రి అలా జస్ట్ లైక్ దట్ ట్రిగ్గర్ పుల్ చేశారు. ఒక మనిషిని చంపారు. ఈ ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో హాకర్ అతను. పేరు నిమ్మకాయల నాగరాజు అలియాస్ రాజు. వి ఆర్ టేకింగ్ దిస్ కేస్ వెరీ సీరియస్ అండ్ హియర్ అయాం గివింగ్ మై వర్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఏలూరు – డోంట్ పానిక్. వి విల్ హంట్ దిస్ గై డౌన్ అండ్ బ్రింగ్ బాక్ పీస్ టు ది సిటీ..’’ మీడియాతో మాట్లాడి పక్కకొచ్చాడు అరవింద్. ‘‘రమేశ్! కమాన్ కమ్ హియర్. ఇంత వర్షంలో కూడా ఎలా వచ్చింది ఈ బ్లడీ మీడియా. అసలు జనాన్ని సగం భయపెట్టేది వీళ్లే. జనం బాగా భయపడుతున్నారని వాళ్లకి కొంచెం ధైర్యం చెబుదామని నేనే మాట్లాడా. సరే! కేస్ గురించి రైల్వే పోలీస్ ఏమంటున్నారు?’’ సబార్డినేట్ రమేశ్‌ని పిలిచి ప్రశ్నించాడు అరవింద్. ‘‘అదే సర్! వాళ్ళు హేండిల్ చేస్తారంట ఈ కేస్‌ని.’’‘‘హేండిల్ చేస్తారా? ఎవరు వాళ్ళేనా? అయినా కేస్ గురించి వాళ్ళనెవడగుతాడు రమేశ్. సొసైటీ, మీడియా, హయ్యర్ అథారిటీస్ అందరూ పడేది మనమీదేగా. వాళ్ళు గనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓ పదేళ్ళు పడుతుంది కేస్ క్లోజ్ చెయ్యడానికి. చెప్పు... కేస్ మనమే తీసుకుంటున్నామని.’’‘‘ఓకే సర్ మాట్లాడతా. రాజు బాడీని అటాప్సీకి పంపించేశాం సర్. నిన్నరాత్రి రాజుతో పాటున్న ఇంకో రైల్వే హాకర్ శీనుని రైల్వే పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నాం. ఏడుస్తున్నాడు కానీ ఏమీ చెప్పడంలేదు. షాక్‌లోనుండి ఇంకా తేరుకోలేదనిపిస్తోంది సర్.’’‘‘ఓకే! లెట్స్ సీ. పదండి’’.అరవింద్, రమేశ్ బయల్దేరారు. ‘‘ఈ రూమ్‌లో లైట్స్ లేవా? ఆన్ చెయ్యండి. వీడేనా?’’ అరవింద్ గట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. ‘‘ఎస్ సర్!’’‘‘ఆ కిటికీలు మూసేయండి. జల్లు పడుతోంది లోపలకి. నీ పేరేంటి?’’‘‘సర్ అడుగుతున్నారుగా సమాధానం చెప్పు.’’‘‘సారు. నా పేరు శీనండి.’’ శీను నోరువిప్పాడు భయపడుతూ. ‘‘రైల్వే స్టేషన్లో ఏం చేస్తుంటావ్?’’ ‘‘ప్లాట్ఫారంమీద, రైల్లో కూల్డ్రింకులు, వాటర్ బాటిల్లు అమ్ముతాను సారు.’’‘‘రాజు నీకెలా తెలుసు?’’‘‘రేయ్ రేయ్... ఆపరా ఆ ఏడుపు. ఇది సర్ వీడి పరిస్థితి. వాడి పేరెత్తంగానే వీడేడుపెత్తుకుంటున్నాడు.’’ రమేశ్ కోపంగా అన్నాడు.‘‘వాడ్ని వీడే చంపేసుంటాడు రమేశ్. మనదగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా దొంగేడుపులు ఏడుస్తున్నాడు.’’‘‘సారు...?’’‘‘మరేంటి చెప్పు. ఇటు చూడు శీనూ! ముందు నిన్నరాత్రి ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా నువ్వు ఆలస్యం చేసిన ప్రతి సెకనూ హంతకుడు పారిపోవడానికి హెల్ప్ అవుతుంది. హంతకుడికి హెల్ప్ చేస్తావా నువ్వు?’’‘‘లేదు సారు... లేదు. సెప్తా. రాజుగాడు, నేను సిన్నప్పట్నుండి స్నేహితులం సారు. పక్క పక్క ఇళ్లు. కలిసి పెరిగాం. ఒకేసోట సదువుకున్నాం. ఇప్పుడొకేసోట పనిజేత్తన్నాం సారు. ఆడు కూడా నాలానే ఇక్కడ కూల్డ్రింకులు, వాటర్ బాటిళ్లు అమ్ముతాడు. రోజూ ఇదే పనండి మాది. రోజూలానే నిన్న కూడా పన్లోకొచ్చాం. కానీ ఆ మాయదారి వాన పడకుండా ఉండుంటే రాజుగాడికి ఈ సావు తప్పేది సారు.’’‘‘ఊరుకో ఊరుకో. ఏడవకు. వానకి, రాజు హత్యకి సంబంధమేంటి?’’‘‘నిన్న కురిసిన వానకి స్టేషన్లో ఆఫీసర్లందరూ ఇంటికెళ్లిపోయారు సారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారొక్కరే ఉండిపోయారనుకుంట. పయానం సేసేదానికి జనం కూడా గుబులు పడ్డట్టున్నారు.ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. మేము కూడా ఇంటికి పోయేటోల్లమే కానీ కాలక్షేపానికి కబుర్లు సెప్పుకుంటా అలా ఉండిపోయాం. ఆ సరదా కబుర్లే ఇంత కొంప ముంచిద్దనుకోలేదు సారు.’’‘‘కరెక్ట్‌గా చెప్పు నిన్నరాత్రి ఏం జరిగిందో...’’‘‘సెప్తా సారు. నిన్నరాత్రి........... అప్పటికే రాత్రి పదకొండున్నర దాటింది.‘ఏరా రాజు. ఇంకిటికి పోదామా?’ అన్నాను నేను. ‘వెల్దాంలేహె! ఓ కంగారెందుకురా. ఆ స్పెషల్ ట్రైన్ కూడా సూసేసి పోదాం.’ అన్నాడు రాజుగాడు. సిగరెట్ తాగుతా, ‘ఆహా శీనుగా. భలే మజాగా ఉందిరా ఈ వానలో సిగరెట్టు తాగుతుంటే.’ అన్నాడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 07101 సికింద్రాబాద్ నుండి కాకినాడ వెళ్ళవలసిన సూపర్‌ఫాస్ట్ స్పెషల్ 11:45కి ప్లాట్ఫారం నంబర్ రెండు మీదకి వస్తుంది అని వినిపిస్తుంటే ‘ఒరేయ్ శీనుగా! ఎందుకురా అదలా ఓ కూత్తది. అయినా ఏ నా కొడుకున్నాడు ఈ స్టేషన్లో దాని మాటలిండానికి.’ అంటూ ఉషారుగా మాట్లాడాడు. తర్వాత కాసేపటికి ట్రైనొచ్చింది సారు. మేమిద్దరం అలాగే కబుర్లు సెప్పుకుంటున్నాం. ఏం సూసాడో ఏమో కానీ, ట్రైన్ ఆగుతుండగా డ్రింక్ బాటిల్లు వాటర్ బాటిల్లు ఉన్న ట్రే పట్టుకుని ట్రైన్ కేసే పరిగెత్తాడు రాజుగాడు. బండాగే దిక్కుకి నా ఈపెట్టి కూసోడంతో రాజుగాడ్ని ఎవరు పిలిసారో నాకు కనపడ్లేదు సారు. కానీ ఆ బండికున్న మొత్తం డోర్లు కిటికీలు అన్నీ యేసేసున్నాయి సారు ఒక్క కిటికీ తప్ప. వాన జోరుగా పడతానే ఉంది. మావోడు వానలో తడుత్తానే తీసిన ఆ కిటికీ ఉన్న పెట్టె దగ్గరకి పరిగెత్తుకుంటా ఎల్లాడు.’’‘‘ఓకే. రాజు ఆ కిటికీ దగ్గరకెళ్ళిన తర్వాత ఏం జరిగింది?’’‘‘అదే తెలియదు సారు. పెట్టె నాకు శానా దూరంలో ఆగింది. ఆడు కిటికీలోనుండి ఎవరితోనో మాట్టాడాడు. తర్వాత ఎనక్కి తిరిగి నా వంక సూసి నవ్వాడు సారు.’’‘‘వాట్. నీ వంక చూసి నవ్వాడా? ఎందుకు?’’‘‘తెలియదు సారు. నా వంక సూసి నవ్వాక మళ్లీ కిటికీకేసి తిరిగాడు. అంతే బండి కూత పెట్టడం, ముందుకి కదలడం, రాజుగాడు నున్చున్నోడు నున్చున్నట్టే ఫ్లాట్‌ఫారం మీద పడటం.. అన్నీ సిటికెలో జరిగిపోయినాయి సారు. నేను పరిగెత్తుకెల్లి సూసేసరికి అక్కడంతా రక్తం. అటు పక్కకి పడున్న రాజుగాడ్ని నాకేసి తిప్పాను సారు. అంతే! తలంతా రక్తం. నుదురుకి బెజ్జం పడి రక్తం వత్తానే ఉంది. ఆడ్ని పిలిశా. కొట్టా. ఏ ఉలుకూ పలుకూ లేకుండా అలా పడున్నాడు. నాకు బయ్యమేసి ఎంటనే 108కి కొట్టా సారు. పోలీస్ సార్లక్కూడా సెప్పా. ఆల్లొచ్చి సూసి పాణం లేదన్నారు. రాజుగాడ్ని తీసుకొచ్చి పొడి ప్రాంతంలో పొడుకోబెట్టాం. తర్వాత ఎనక్కి తిరిగి సూసేసరికి ఫ్లాట్ఫారంమ్మీద ఒక్కటంటే ఒక్క రక్తం సుక్క ఆనవాలన్నా లేకుండా ఆ వాన దేవుడు అంతా నీటితో కడిగేశాడు సారు. ‘‘ఊరుకో శీను. రమేశ్! తనకి మంచి నీళ్ళు ఇవ్వండి.’’ లేచాడు అరవింద్. శీను దగ్గర్నుంచి అంతకన్నా మించి ఇంకే సమాధానం వస్తుందని అతననుకోలేదు. ‘‘సర్ ఆటాప్సీ రిపోర్ట్ వచ్చింది. 9 ఎంఎం బుల్లెట్ క్లోజ్ రేంజ్డ్ స్ట్రయిట్ హెడ్ షాట్ సర్. ఫింగర్ ప్రింట్స్ ఏం ట్రేస్ చెయ్యలేకపోయాం. నాకు ఈ కేస్‌లో విట్నెస్ దొరకడం కూడా ఇంపాజిబుల్ అనిపిస్తోంది సర్.’’ రిపోర్ట్ పట్టుకొని చెబుతూ ఉన్నాడు రమేశ్. ‘‘వై ఈజ్ దట్ రమేష్?’’‘‘ఆ రోజు వచ్చింది డైలీ ట్రైన్ కాదు సర్, స్పెషల్ ట్రైన్. అండ్ తుఫాన్‌కి తొంభై శాతం మంది జనం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మేము గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ క్లాస్ స్లీపర్ మొత్తం ఆరోజు 50 మంది మాత్రమే ప్రయాణం చేశారు. శీను చెప్పినదాని ప్రకారం చూస్తే ఆరోజు విండో ఓపెన్ చేసుంచిన కోచ్ 9 అని సస్పెక్ట్ చేసి పాసెంజర్స్ లిస్ట్ తీసుకున్నాం. ఆరోజు 9లో ముగ్గురు మాత్రమే ప్రయాణించారు సర్. భార్యాభర్తలిద్దరూ అండ్ ఒక స్టూడెంట్. వాళ్ళ బాక్గ్రౌండ్ వెరిఫై చేశాం. అంతా క్లీన్‌గా ఉంది. విడివిడిగా అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురూ కూడా నాలుగో వ్యక్తిని చూడలేదనే చెప్పారు సర్. ఫైనల్లీ ఆరోజు జనమెక్కువ లేరని టీసీ కూడా టికెట్ చెకింగ్‌కి వెళ్లలేదంట సర్.’’ రమేశ్ తాను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ‘‘వాట్ ఈజ్ దిస్ రమేశ్! ఇంకొన్ని రోజులాగితే హంతకుడే ఆరోజు తుఫాన్ తెప్పించాడంటారా? అసలు అంత పెద్ద కోచ్‌లో ఆ ముగ్గురికి కనపడకుండా ఇంకో వ్యక్తి ఉండటానికి అవకాశం లేదంటావా? వీళ్ళు కోచ్‌కి ఒక ఎండ్‌లో ఉండి నాలుగో వ్యక్తి ఇంకో ఎండ్‌లో ఉండే అవకాశం లేదంటావా?’’‘‘ఆ అవకాశం ఉంది సర్. కానీ ఆరోజు ట్రైన్ ఏలూరు నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత వర్షం ఇంకా పెద్దది కావడంతో ట్రైన్‌ని కొవ్వూరులో నాలుగు గంటలపాటు ఆపేశారు. ఆ సమయంలో కోచ్‌లో ఉన్న ముగ్గురూ ఆ నాలుగో వ్యక్తిని చూసే అవకాశం లేదంటారా సర్?’’‘‘రైట్. అంటే వాడు ఆ కోచ్‌లో ఎక్కువసేపు ఉండుండడు. మనం ఎక్కడో ఏదో పాయింట్ వదిలేస్తున్నాం రమేశ్. ఒక రైల్వే హాకర్‌ని గన్‌తో కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? పైగా రాజుకి శత్రువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా గన్‌తో కాల్చేంత స్కెచ్ వెయ్యగలరని నేననుకోవడం లేదు. హత్యకి క్లూ దొరకలేదు. మోటివ్ కనిపించట్లేదు. విట్నెస్ కూడా లేరు. ఇదంతా పకడ్బందిగా చేసిన హత్యా లేదా ఎవరైనా ఆకతాయిల పనా? ఎవరు చేసుంటారు రమేశ్ ఇదంతా?’’ ‘‘.... ఎవరు? ఎవరు?’’. కాలం పదేళ్లనాటి సంగతుల్ని, కారు పావుగంట ప్రయాణాన్ని ముగించుకుని ఆక్స్ఫర్డ్ బుక్‌స్టోర్ ముందుకొచ్చి ఆగాయి.‘‘గుడ్ ఈవినింగ్ సర్! హౌ మే ఐ హెల్ప్ యు?’’ నవ్వుతూ పలకరించాడు స్టోర్‌కీపర్. ‘‘యా! డూ యు హావ్ ద బుక్ ‘మై కన్ఫెషన్స్’ బై విలాస్ రావ్ దండేర్కర్?’’ అరవింద్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.‘‘జస్ట్ ఏ సెకండ్ సర్! యా వియ్ హావ్ ద బుక్ సర్. ఓవర్ దేర్ సిక్స్త్ రో ఫోర్త్ రాక్ సర్.’’ చెయ్యి ఆ రేక్ వైపు చూపిస్తూ చెప్పాడు స్టోర్‌కీపర్. ‘‘థాంక్యూ.’’ అంటూ ఆ రేక్ వైపుకు బయలుదేరాడు అరవింద్. బుక్ అందుకొని నేరుగా చాప్టర్ 9 ఉన్న పేజీకి వెళ్లిపోయాడు. చాప్టర్ IX నా తోడబుట్టిన తమ్ముడే నన్ను చంపాలనుకున్నాడు. చంపి నా కుర్చిలో కూర్చుని నేను నిర్మించిన చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. భాయ్ భాయ్ అని ఆప్యాయంగా పిలుస్తూనే నన్ను చంపడానికి నా వెనుక పెద్ద కుట్ర రచించాడు.2008. అక్టోబర్. నాగ్‌పూర్‌లో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుండేది. తెల్లవారుజామున నాగ్‌పూర్ నుండి పెళ్లికని కారులో బయలుదేరి వెళ్తున్న మామీద దారి మధ్యలో ఎటాక్ జరిగింది. మేం కూడా వాళ్లమీద తిరిగి కాల్పులు జరిపాం. ఏడుగురున్న మా గుంపులో నలుగురు స్పాట్లో చచ్చిపోయారు. అందులో వికాస్ బాడీలో 32 బుల్లెట్లు దిగాయి నన్ను కవర్ చేసినందుకు. మిగిలిన ఇద్దర్ని నాగ్‌పూర్‌లో జరుగుతున్న విషయాలు తెలుసుకోమని పంపించి నేను ఆంధ్రా పారిపోయా. నా ప్రయాణమంతా వర్షమే. నేను తప్పించుకోవడానికి ఆ వర్షమే నాకు తోడయ్యింది. నేను ఆంధ్రాలోని వరంగల్ చేరే వేళకి చీకటి పడుతుంది. నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగే ఒక ఆంధ్రా స్నేహితుడి దగ్గరకి వెళ్ళడానికి వరంగల్‌లో ట్రైన్ ఎక్కాను.ట్రైన్ అంతా దాదాపు ఖాళీగా ఉంది. వర్షాల వల్లనేమో ట్రైన్కున్న డోర్లు, కిటికీలు అన్నీ మూసేశారు. ట్రైన్ ఎక్కినప్పటినుంచి ఏ కోచ్‌లోనూ అరగంటకి మించి ఎక్కువసేపు ఉండలేదు నేను. ప్రమాదం నాకెంత దూరంలో ఉందో తెలియక ప్రతి అరగంటకి ఒక్కో కోచ్ మారుతూ పోయా. ఏ కోచ్‌లోనూ పెద్ద జనం లేరు. నా అరవయ్యేళ్ళ వయసుకి నన్ను అనుమానించినవారు, ప్రశ్నించినవారు ఎవ్వరూ లేరు. ఓ రెండు గంటల తరవాత ఎప్పుడు పట్టిందో తెలియకుండా నిద్ర పట్టేసింది. ఎంతసేపు పడుకున్నానో అలా!మెలకువొచ్చేసరికి ట్రైన్ మెల్లగా వెళ్తోంది. బాగా దాహం వేసింది. ట్రైన్ విండో ఐరన్ షట్టర్ పైకెత్తి బయటకి చూశా. వర్షం, చల్లగాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాయి. చీకటి తప్ప బయటేమీ కనిపించలేదు. చాలాసేపట్నుంచి అదే కోచ్‌లో ఉండిపోవడంతో వెంటనే లేచి వేరే కోచ్‌కి వెళ్ళిపోయా. నా దాహానికి గొంతెండుకుపోయింది. ఏదైనా స్టేషన్ వస్తుందేమోనని షట్టర్ పైకెత్తి బయటకి చూస్తూనే ఉన్నా. మెల్లగా నా గొంతు పిడచకట్టుకుపోయింది. లాలాజలం ఊరక నాలుక ఎండిపోయి నోట్లో అటూ ఇటూ తిప్పడానికి కూడా కష్టంగా తయారయ్యింది. అప్పుడే జీవితంలో నీళ్ల విలువేంటో తెలిసింది. కిటికీలోనుండి నా కుడిచేయి బయటకి పెట్టా. వాన నీటికి తడిచిన చేతి వేళ్లని నాలుక మీద రాసుకున్నా. తేడా తెలియలేదు. నీళ్ళే కావాలి తాగడానికి. చూశా, చూశా, చూస్తూనే ఉన్నా. ట్రైన్ వెళ్తోంది కానీ ఏ స్టేషన్లోనూ ఆగట్లేదు. ఆ సమయంలో నీళ్ల కోసం నేను పడిన యాతనతో పోల్చుకుంటే ఇన్నేళ్ల నా జీవితంలో నేనసలు ఏ బాధలూ పడలేదనే చెప్పాలి. నేను నా ప్రాణాన్ని లెక్కచెయ్యను కానీ ఇంకిలాంటి బాధ ఎక్కువసేపు పడలేననిపించింది. ఎక్కడో నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన నాకు, ఇక్కడింత బాధేంటో అని అనుకుంటుండగానే ట్రైన్ వేగం తగ్గింది. షట్టర్ పైకెత్తి చూశా. ఏదో స్టేషన్ వచ్చింది. ఆనందంలో వాటర్ బాటిల్స్ ఎక్కడున్నాయో అని ప్లాట్ఫారం మీద వెతికాను. కనిపించాయి. రెండు ట్రేల్లో వాటర్ బాటిల్స్, డ్రింక్స్ పక్కన పెట్టుకుని ప్లాట్ఫారం మీద కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు మనుషులు కనిపించారు. నేను ట్రైన్లో నుండి చెయ్యి బయటకి పెట్టి ఊపుతూ వాటర్ అని బొటన వేలు చూపించా. ఇద్దరిలో ఒక వ్యక్తి నన్ను చూసి ట్రే తీసుకుని నేనున్న కోచ్ వైపుకి పరిగెత్తాడు. ట్రైన్ ఆగింది. వర్షం మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఆ మనిషి ట్రే పట్టుకుని నా దగ్గరకు రాగానే వాటర్ బాటిల్స్ అని చెప్పి నా పర్స్లోనుండి చేతికి తగిలిన నోటు తీసి అతనికిచ్చా. వర్షంలో తడిసిపోతుందని అతను నా చేతిలో ఉన్న నోటుని టక్కున లాక్కున్నాడు. లాక్కునేటప్పుడు చూశా, అది వెయ్యి రూపాయిల నోటు. అతను నోటుని తీసుకుని జేబులో పెట్టుకుని వాటర్ బాటిల్స్ ఇవ్వకుండా వెనక్కి తిరిగి అక్కడెక్కడో కూర్చుని ఉన్న ఇంకొకడి వైపు చూసి నవ్వాడు. వాడలా ఎందుకు నవ్వాడో ఆ క్షణంలో నాకర్థం కాలేదు. అలా నవ్వుతూనే వాడు నా వైపుకి తిరిగి మెల్లగా వెనక్కి జరిగాడు. నేను ట్రే వైపు చూపిస్తూ బాటిల్స్ అని కళ్ళతో అడిగా. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కానీ బాటిల్స్ ఇవ్వడం లేదు. అప్పుడర్థమైంది వాడు నన్ను మోసం చెయ్యబోతున్నాడని. నేను డబ్బుల్ని లెక్క చెయ్యను కానీ నాకివ్వాల్సిన వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వకుండా నా నుండి, వర్షం నుండి వెనక్కి జరుగుతుంటే కోపంతో నేను వాడ్ని అలా చూస్తూ ఉండిపోయా. వాడు కూడా ఈ అరవయ్యేళ్ళ ముసలోడు ఏం చేస్తాడ్లే అనే ఆలోచనతోనేగా నన్నిలా మోసం చేశాడు. నా జీవితంలో వాడికంటే దారుణమైన మనుషుల్ని చూశా. వాడినలాగే చూస్తూ నలభై ఏళ్లుగా నా వొంట్లో ఒక భాగమైపోయిన దానికోసం కుడి చేయి వెతికింది. పక్కన పెట్టిన కోట్లోకి చెయ్యి పోయింది.దొరికింది నా స్టార్ పిస్టల్. 92 మోడల్. టక్కున తీసి కిటికీలోపలనుండే ఆ మనిషికి గురి పెట్టా. అది కనబడగానే ఆ మనిషి మొహమ్మీద నవ్వు మాయం అయింది. గన్ చూడగానే చాలామంది షాక్‌లోకి వెళ్లిపోతారు. మెదడు మొద్దుబారిపోతుంది. వాడు కూడా షాక్లోకెళ్లిపోయాడు. వాడికి తగిలిన షాక్ భయంగా మారే సమయంలోనే... అసలు ఏం జరుగుతుందో మెదడుకి అర్థమయ్యే సమయంలోనే ట్రైన్ హార్న్ బ్లో చేశారు. నేను ట్రిగ్గర్ నొక్కాను. ట్రైన్ మెల్లగా కదిలింది. బులెట్ వేగంగా వెళ్లి వాడి నుదురిని చీల్చి తల్లోపలికెళ్లింది. వాడి చేతిలో ఉన్న ట్రే ఎగిరిపడింది. బాటిల్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. వాడు నున్చున్నోడు నున్చున్నట్టే కుప్పకూలిపోయాడు. ప్లాట్ఫారం మీద చిమ్మిన వాడి రక్తం వర్షం కడిగెయ్యడమే నాకాఖరిగా కనిపించింది. అప్పుడంటే ఉద్రేకంలో చేశా కానీ, తర్వాత నా జీవితంలో ఈ సంఘటన తలచుకుని చాలాసార్లు బాధపడ్డాను. ‘‘సర్! ఎక్స్క్యూజ్ మీ సర్. వి ఆర్ క్లోజింగ్. డు యు వాంట్ ద బుక్, సర్?’’ స్టోర్‌కీపర్ మాటలతో చాప్టర్ 9 నుంచి బయటకొచ్చాడు అరవింద్. ‘‘యా! బిల్ ఇట్ ఫర్ మీ.’’ అన్నాడు ఏ భావం లేకుండా. కమిషనర్ అరవింద్ కుమార్ బుక్ స్టోర్ బైట గోడకానుకుని బంగారు కాంతిని వెదజల్లే సోడియం లైట్ల వెలుగులో వర్షాన్ని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు –‘పదేళ్ల క్రితం ఓ వర్షం పడిన రాత్రి జరిగిన మర్డర్ మిస్టరీకి సమాధానం ఈరోజు రాత్రి ఈ వర్షంలో తెలిసింది. నిజంగా వర్షానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఇదంతా జస్ట్ కో ఇన్సిడెన్సా? ఏమో నిజంగా మనిషి మెదడుకి అందని విషయాలు ఇంకా ఎన్నున్నాయో!’అదే సమయంలో టీవీ చూస్తూ అరవింద్ కొడుకు నానీ కూడా తనలో తాను అనుకుంటున్నాడు – ‘డాడ్ ఇంకా రాలేదేంటి? ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసి పడుకోమన్నారుగా డాడ్, ఇప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారేమో?’టీవీ మోగుతూనే ఉంది – బ్రేకింగ్ న్యూస్... బ్రేకింగ్ న్యూస్...ఢిల్లీ జన్‌పథ్ రోడ్లో బ్రేక్స్ ఫెయిలయిన ఒక ట్రక్ రెండు బైకులు, ఒక కారు మీదనుండి దూసుకెళ్లడంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడుతుండటం వల్ల సహాయక చర్యలకి ఆలస్యమవుతుందని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం యాక్సిడెంట్‌కి గురైన కారు ఢిల్లీలోని ఒక ప్రభుత్వశాఖ ఉన్నతాధికారిదని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ కారులో ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. - కె.ఎన్. మనోజ్ కుమార్ -
టిప్ 16 లక్షలు!
ఏథెన్స్: రెస్టారెంట్లలో బిల్‌తో పాటు టిప్ ఇవ్వడం సర్వసాధారణం. మనకు హోటల్ సిబ్బంది సర్వీస్ ఎంత నచ్చితే అంత ఎక్కువ టిప్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఓ హోటల్ సిబ్బందికి ఏకంగా 16 లక్షల భారీ టిప్ ఇచ్చాడు. ఈ ఊహకందని భారీ మొత్తం చూడటంతో సిబ్బందే ఆశ్చర్యానికి గురయ్యారు. రొనాల్డో మాత్రం వారి సేవకు మెచ్చే ఇచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం రొనాల్డో ఇచ్చిన టిప్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పోర్చుగల్ జట్టు రౌండ్-16లో ఉరుగ్వేపై ఓటమి చెందడంతో ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో దొరికిన ఖాళీ సమయంలో ఆటగాళ్లు సేదతీరుతున్నారు. పోర్చుగల్ కెప్టెన్ మాత్రం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్రీస్‌లో సందడి చేస్తున్నాడు. సన్నిహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన రోనాల్డో అక్కడి సిబ్బంది మర్యాదలు నచ్చి భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. ఇటీవలే స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు రొనాల్డో బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఒప్పదం ప్రకారం నాలుగేళ్ల పాటు యువెంటస్‌కు ఆడతాడు. చదవండి: ఆ మాజీ క్రికెటర్ రెస్టారెంట్ బిల్లు ఏడు లక్షలు -
పోగ్బా ఫీలింగ్ కూడా అదే..!
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా... బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ‘అచ్చేదిన్’ (మంచి రోజులు) వస్తాయంటూ మోదీ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అచ్చేదిన్ గురించి పలువురు కాంగ్రెస్ నాయకులు ఎన్నోసార్లు ఎద్దేవా చేశారు. అయితే అచ్చేదిన్ గురించి.. ‘మాతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాడు పాల్ పోగ్బా ఫీలింగ్ కూడా అదే’ అంటూ ఓ వీడియోను కాంగ్రెస్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. వీడియోలో ఏముందంటే.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో సహచర ఆటగాడి కోసం వెదుకుతున్న పాల్ పోగ్బా ఉద్వేగంతో కాస్త భిన్న హావభావాలతో చుట్టూ చూశాడు. ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా అచ్చేదిన్ కోసం ఎక్కడా.. ఎక్కడా అని వెదుకుతున్నారనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. Pogba and us, same feels. @paulpogba pic.twitter.com/rIOqjY6bqT — Congress (@INCIndia) July 17, 2018 -
క్రొయేషియా జట్టుకు బ్రహ్మరథం..
ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2018 తుదిపోరులో ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైనా అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన క్రొయేషియా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఊహించని రీతిలో దేశ అధికారులు, అభిమానులు తమ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడాన్ని ఎంతో గౌరవంగా భావించారు. గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) అందుకున్న లుకా మోడ్రిచ్‌తో కరచాలనం చేసేందుకు క్రొయేషియా వాసులు పోటీపడ్డారు. దేశ రాజధాని జాగ్రిబ్ నగరంలో ఓపెన్ టాప్ బస్సులో వచ్చిన ఆటగాళ్లకు కరతాళ ధ్వనులతో, ప్లేయర్ల పేర్ల నినాదాలతో గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆటగాళ్ల రాక సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల కూడళ్లలో క్రొయేషియా జాతీయ గీతాన్ని ఆలపించి వారు సాధించిన ఘనతకు అసలుసిసలైన గుర్తింపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరిగ్గా 50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అందుకు కారణం రష్యాలో జరిగిన సాకర్ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరించడమే. అయితే ఫైనల్లో పటిష్ట ఫ్రాన్స్ జట్టుతో చివరివరకూ పోరాడిన క్రొయేషియా ఆటగాళ్లు దేశంలో సూపర్ స్టార్లయ్యారు. ఇప్పుడు క్రొయేషియాలో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఘనత గురించే. వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు.. అయినా అసాధారణ ఆటతీరుతో ఆ ప్లేయర్లు జననీరాజనాలు అందుకుంటున్నారు. ఒకవేళ క్రొయేషియా కప్ నెగ్గి ఉంటే.. అత్యధిక ర్యాంకుతో బరిలోకి కప్ సాధించిన జట్టుగా నిలిచి ఫ్రాన్స్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసేది. 1998 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్ నెగ్గడం విశేషం. మరోవైపు అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ సైతం దేశ ప్రజల మనసుల్ని గెలిచారు. ఫైనల్లో జట్టు ఓటమిని జీర్ణించుకోలేక ఏడుస్తున్న క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కన్నీళ్లు తుడిచి.. లీడర్ అంటే ఎలా ఉండాలో నేర్పారు. విజయం సాధించినప్పుడు సంబరాల్లో పాల్గొన్న ఆమె.. జట్టు ఓడిన సమయంలోనూ వారి వెన్నంటే నిలిచారు. ఆమెను చూసి ప్రపంచం నేర్చుకోవాలి! క్రొయేషియా.. మేనియా! -
క్రొయేషియా ఫుట్‌బాల్ జట్టుకు ఘన స్వాగతం
-
ఆమెను చూసి ప్రపంచం నేర్చుకోవాలి!
గత నెలన్నర రోజులుగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ముగిసింది. అంచనాలు లేని జట్టు టైటిల్ కైవసం చేసుకోగా... అనామక జట్టు శక్తివంచన లేకుండా పోరాడి ఓడింది. పోరాడి ఓడిన ఆ అనామక జట్టు దేశ అధ్యక్షురాలు ఇప్పుడు ప్రపంచానికే స్పూర్తిదాయకంగా నిలిచారు. ఆ అనామక జట్టు క్రొయేషియా అయితే ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్-కిటారోవిక్. మన హైదరాబాద్ నగరంలో సగం కూడా (50 లక్షలు) జనాభా లేని ఆ దేశం సంచలనాలు సృష్టిస్తూ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లడం గమనార్హం. ఫైనల్లో ఆ జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకున్నా.. ఆ దేశ అధ్యక్షురాలి ప్రదర్శన మాత్రం ప్రపంచం గర్వించేలా మిన్నంటింది. ఆమెను చూసి నాయకత్వం అంటే ఏమిటో ఇప్పుడు ప్రపంచానికే బోధపడింది. 736 మంది ఆటగాళ్లు 32 జట్లతో 31 రోజుల పాటు పోరాడి నెగ్గిన రెండు జట్లు తుదిసమరానికి సిద్దమైన సమయం. విజయం ఎవరిని వరిస్తుందా అని నరాలు తెగేంతా ఉత్కంఠకర ఫైనల్ మ్యాచ్.. మరోవైపు పలు దేశ అధ్యక్షులు ఆసీనులైన సందర్భం. మ్యాచ్ ప్రారంభమైంది. కానీ అందరీ చూపు వీఐపీ గ్యాలరీవైపే. అవును అక్కడ ఎరుపు తెలుపు రంగులతో కూడిన టీషర్టులు ధరించిన జట్టు జెర్సీతో క్రొయేషియా దేశ అధ్యక్షురాలు గ్రాబర్ కిటారోవిక్ సందడి చేస్తున్నారు. ఏ రేంజ్లో అంటే గంతులేస్తూ మరీ తమ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలుపున్నారు. కానీ పోరాడిన క్రోయేషియా చివరకు ఓటమిని చవిచూసింది. ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. చమర్చిన కన్నీళ్లతో అభిమానుల భావోద్వేగానికి గురయ్యారు. అంతటి ఉద్విగ్ఘమై క్షణాల్లో ఎవరైనా ఓటమిని జీర్ణించుకోలేక అసహనం, అసంతృప్తి, ఆవేదన వంటివెన్నో వ్యక్తం చేస్తారు. కానీ అలా చేస్తే ఆమె క్రొయేషియా అధ్యక్షురాలు ఎలా అవుతారు. అవును ఏమాత్రం దిగులు చెందని ఆమె తమ జట్టుకు అండగా నిలిచారు. ఓడిన జట్టుకు ఆమె అందించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కన్నీళ్లు తుడిచిన అధ్యక్షురాలు తన అద్భుత ప్రదర్శనతో ముందుండి ఫైనల్‌కు చేర్చిన క్రొయేషియా జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ ఓటమిని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇది చూసిన ఆ దేశాధ్యక్షురాలు అతడి దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడిచారు. బాధపడొద్దని ఓదార్చారు. ఈ ఘటన అభిమానులందరికి ఉద్వేగానికి గురిచేయగా.. ఆమె పక్కన నిలుచున్న ఇతర దేశ అధ్యక్షులను చప్పట్లతో అభినందించేలా చేసింది. మరోవైపు జోరు వాన కురుస్తున్నా.. ఆతిథ్య దేశపు అధ్యక్షుడు గొడుగుతో మైదానంలోకి వచ్చినా ఆమె మాత్రం అలానే ఆ వర్షంలో తడుస్తూ.. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్లను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలసి క్రొయేషియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమును సందర్శించారు. ఓటమితో దిగులు చెందుతున్న వారిని అభినందిస్తూ భరోసానిచ్చారు. ఇది చూసినప్పుడు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నేత నెల్సెన్ మండేలా చెప్పిన ‘కష్టాలు ఉన్నప్పుడే నాయకుడిగా ముందుండాలి.. అప్పుడే మీ నాయకత్వానికి విలువ ఉంటుంది’ అనే మాటలు గుర్తొస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అధ్యక్షురాలు కాకమందు.. ఆమె పుల్‌బ్రైట్ స్కాలర్, అమెరికాకు అంబాసిడర్, నాటో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం క్రొయేషియా అధ్యక్షురాలిగా తూర్పు యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలో తమ దేశాన్ని ముందంజలో నిలుపుతున్నారు. ఆమె 2015లో తొలిసారి ఆ దేశ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. చదవండి: విశ్వవిజేత ఫ్రాన్స్ భూతల స్వర్గం క్రొయేషియా -
పారిస్‌లో ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఘన స్వాగతం
-
రొనాల్డొ ‘ధనా’ధన్!
ట్యూరిన్ (ఇటలీ): అది వరల్డ్ కప్ కానీ, ప్రపంచవ్యాప్త లీగ్‌లు కానీ ఫుట్‌బాల్ అంటేనే ‘ధనా’ధన్! ఎటుచూసినా కోటాను కోట్ల డబ్బు ప్రవహిస్తుంటుంది. ఇక ఇందులో ఆటగాళ్ల ‘విలువ’ గురించి చెప్పేదేముంటుంది. పైగా క్రిస్టియానో రొనాల్డో వంటి ఆల్‌టైమ్ దిగ్గజం విషయంలో ప్రతిదీ సంచలనమే. అలాంటి మరో ఘటనే ఇది. ఇటీవలే రూ. 846 కోట్ల బదిలీ ఒప్పందంతో స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన యువెంటస్ క్లబ్‌కు మారిన ఈ పోర్చుగల్ సారథి... ఆ క్లబ్ జట్టు తరఫున బరిలో దిగకుండానే తన ధరలో సగం మొత్తం సంపాదించి పెట్టేశాడు. అదీ ఒక్క రోజులోనే కావడం విశేషం. క్రిస్టియానో రొనాల్డొ పేరును కుదించి, దానికి అతడి నంబరును జోడించి యువెంటస్ క్లబ్ ‘సీఆర్7’ పేరిట జెర్సీలను సోమవారం అమ్మకానికి పెట్టింది. ఇంకేం... 5 లక్షల 20 వేల జెర్సీలు హాట్‌కేకుల్లా ఎగిరిపోయాయి. వీటిలో 20 వేల జెర్సీలను అభిమానులు యువెంటస్ అధికారిక స్పాన్సర్ ఆడిడాస్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయగా, 5 లక్షల జెర్సీలకు ఆన్లైన్లో ఆర్డరిచ్చారు. తద్వారా ఒక్క రోజే 5 కోట్ల 40 లక్షల యూరోలు (రూ. 420 కోట్లు) సమకూరాయి. వీటిలో యువెంటస్ ప్రామాణిక షర్ట్ విలువ 104 యూరోలు (రూ. 8,300) కాగా, రెప్లికా షర్ట్ 45 యూరోలు (రూ. 3,600) ఉంటుంది. 2016 సీజన్ మొత్తంలో అమ్ముడైన యువెంటస్ జెర్సీలే 8.50 లక్షలు కావడం గమనార్హం. మరోవైపు రొనాల్డొ బదిలీ ఫీ -
కప్పు ఫ్రాన్స్‌ది కాదు.. ఆఫ్రికాది!
కరాకస్ (వెనిజువెలా): హోరాహోరీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సంగ్రామాన్ని ఆస్వా దించాం! ఆఖరి ఘట్టంలో ఫ్రాన్స్ జయకేతనం ఎగురవేయడాన్ని కళ్లారా చూశాం! కానీ, కప్ గెలిచింది ఆఫ్రికా అంటున్నారు వెనిజువెలా దేశాధ్యక్షుడు నికొలస్ మడురొ. ‘ఫ్రాన్స్... ఆఫ్రికా జట్టులా కనిపిస్తోంది. తక్కువ చూపు చూసిన వలస కుటుంబాల ఆటగాళ్లతో ఆఫ్రికానే కప్ గెలిచినట్లుంది. అందుకే వారికి ధన్యవాదాలు’ అని నికొలస్ వ్యాఖ్యానించారు. మడురో మాటల్లో కొంత తర్కం లేకపోలేదు. 23 మంది సభ్యుల ఫ్రాన్స్ జట్టులో 16 మంది ఆఫ్రికా మూలాలున్నవారే మరి. ఫైనల్లో గోల్స్ చేసిన ఎంబాపె తల్లిదండ్రులు కామెరూన్, అల్జీరియా వాసులు కాగా, పోగ్బా అమ్మానాన్న గినియాకు చెందినవారు. ఇక ఉమ్టిటి... కామెరూన్లో పుట్టాడు. మట్యుడి తల్లిదండ్రులు అంగోలా, కాంగో దేశస్తులు. ఎంగొలొ కాంటె పెద్దలది మాలి నేపథ్యం. రాఫెల్ వరానె తండ్రి కరీబియన్ దీవుల నుంచి వచ్చాడు. ఈ నేపథ్యంలో... ఫ్రాన్స్ సహా యూరప్ దేశాలు ఇకనైనా ప్రతిభావంతులు, ప్రభావవంతులైన ఆఫ్రికా, లాటిన్ అమెరిక్లను తక్కువగా చూడొద్దని మడురో కోరారు. ‘యూరప్‌లో జాతి వివక్షకు ఇది అంతం. కప్ సాధించి పెట్టినందుకు వారు మమ్మల్ని అభినందించాలి’ అని పేర్కొన్నారు. అయితే, మడురో నియంతలా వ్యవహరిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ గతంలో విమర్శించారు. మాక్రోన్ విమర్శలను మనసులో పెట్టుకొనే ప్రస్తుతం ఫ్రాన్స్ విజయాన్ని తక్కువ చేసి చూపేలా వెనిజువెలా అధ్యక్షుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. -
అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన క్రొయేషియా
-
ఫ్రాన్స్ టీమ్‌కు స్వదేశంలో గ్రాండ్ వెల్కమ్
-
విశ్వ విజేతలకు ఘన స్వాగతం
ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను గెలుచుకొని స్వదేశంలోకి అడుగు పెట్టిన ఫ్రాన్స్ జట్టుకు అపూర్వ రీతిలో ఘన స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగిన విక్టరీ పరేడ్‌లో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడి తమ హీరోలకు జేజేలు పలికారు. ఓపెన్ టాప్ బస్సులో జట్టు సభ్యులంతా ట్రోఫీని ప్రదర్శిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం దేశాధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చిన ప్రత్యేక విందుకు ఆటగాళ్లు హాజరయ్యారు. వారిని అత్యున్నత పౌర పురస్కారం ‘లెజియన్ ఆఫ్ ఆనర్’తో త్వరలో సత్కరిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు. -
సౌత్‌గేట్ రైల్వే స్టేషన్
లండన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు 1990 తర్వాత మరోసారి సెమీస్ చేరి అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దాంతో ఈ టోర్నీలో జట్టు కోచ్ గారెత్ సౌత్గేట్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. యువ ఆటగాళ్లతో నిండిన జట్టును అతను నడిపించిన తీరు, సానుకూల దృక్పథం, సౌత్‌గేట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టాయి. ఇప్పుడు లండన్‌లోని ఒక రైల్వే స్టేషన్ కూడా అతనిపై అదే తరహా అభిమానాన్ని ప్రదర్శించింది. ఉత్తర లండన్‌లోని ఎన్ఫీల్డ్లో ఉన్న అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్‌కు తాత్కాలికంగా (48 గంటల పాటు) గారెత్ సౌత్‌గేట్ స్టేషన్ అని పేరు పెట్టింది. దానికి అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌లు, టికెట్ కౌంటర్లు, స్టేషన్ బయట హోర్డింగ్‌లు అన్నింటిని మార్చేసింది. పారిస్‌లో కూడా...: ఇక వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో ఆటగాళ్లను పారిస్ ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్‌ఏటీపీ) కూడా ఇదే తరహాలో గౌరవించుకుంది. ఆరు రైల్వే స్టేషన్లకు పేర్లు మార్చింది. అయితే ఎన్ని రోజులో ఆర్‌ఏటీపీ స్పష్టం చేయలేదు. కెప్టెన్ హ్యూగో లోరిస్, కోచ్ డెచాంప్స్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మైమురిపించి!
గోలా కాదా అనే గగ్గోలును ‘వార్’ తీర్చింది... మెస్సీ, రొనాల్డొ లోటును గ్రీజ్మన్, లుకాకు పూడ్చారు... జర్మనీ, బ్రెజిల్‌కు తీసిపోమని క్రొయేషియా, బెల్జియం చాటాయి... ఫ్రాన్స్‌కు పూర్వవైభవం దక్కింది... ఇంగ్లండ్ చాన్నాళ్లకు మెరిసింది... రష్యాకు ఆతిథ్య సంతృప్తితో పాటు పోరాడామన్న కీర్తి మిగిలింది... మొత్తానికి 2018 ఫుట్‌బాల్ ప్రపంచకప్ సూపర్ హిట్ అయ్యింది... సాక్షి క్రీడా విభాగం:నెల పాటు సాగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఎన్నెన్నో మెరుపులు. అంతకుమించి అనుభూతులు. అభిమానులకు కావాల్సినంత వినోదం. బెల్జియం కెప్టెన్ హజార్డ్ దూకుడు, ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ కేన్ పోరాటం, ఫ్రాన్స్ కుర్రాడు ఎంబాపె వేగం, క్రొయేషియా సారథి మోడ్రిచ్ స్థయిర్యం... వెరసి 64 మ్యాచ్‌ల్లో 169 గోల్స్. మ్యాచ్‌కు 2.6 చొప్పున నమోదు. స్కోరు లేని పోరు ఒక్కటంటే ఒక్కటే.! అర్జెంటీనా మెస్సీ ఘనతలు, పోర్చుగల్ రొనాల్డొ విన్యాసాలు ఇక చరిత్రే. మున్ముందు చెప్పుకోవాల్సింది రొమేలు లుకాకు గొప్పలు, గ్రీజ్మన్ గెలుపు రహస్యాలే. అందరూ ఊహించినట్లు హూలిగన్ల బెడద ఎదురవలేదు, దేశాల మధ్య వివాదాలు తలెత్తలేదు, ఆటగాళ్ల నడుమ విద్వేషాలు రేగలేదు. ఆసాంతం సాఫీ! దిగ్గజాల బేజారు... చిన్న జట్ల సంచలనంతో పుట్టుకొచ్చిన నయా తారలు. క్రొయేషియా ఓడి గెలిచింది... ‘ఫిఫా’ అధ్యక్షుడు జియాని ఇన్ఫాటినొ వర్ణించినట్లు జగజ్జేత హోదాకు ఫ్రాన్స్ తగినదే. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన ఫ్రెంచ్ జట్టు సరైన సమయంలో శక్తియుక్తులు ప్రదర్శించింది. ఇవ్వదగినదా కాదా అన్న ‘పెనాల్టీ’ వివాదాన్ని పక్కనపెట్టి... ఫైనల్లో తాము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడామంటూ క్రొయేషియా కోచ్ జాల్టొ డాలిచ్, జట్టు సభ్యులు ప్రకటించి క్రీడా స్ఫూర్తిని చాటారు. పోరాటం అంటే ఏమిటో ఈ టోర్నీలో చాటిన క్రొయేషియా తడబాటుతో టైటిల్‌ను చేజార్చుకుంది. ఈసారి తుది సమరం గత రెండు కప్‌ల తరహాలో పోటాపోటీగా సాగకున్నా మరీ నిరాశపర్చలేదు. తరం మారుతోంది... ఈ ప్రపంచ కప్‌తో రొనాల్డొ, మెస్సీల శకం దాదాపు ముగిసినట్లేనని తేలింది. వచ్చే కప్ నాటికి 35 ఏళ్లు దాటే వీరిద్దరూ టోర్నీలో ఆడేది అనుమానమే. బ్రెజిల్ స్టార్ నెమార్కూ 30 ఏళ్లు వస్తాయి. ఈ తరం తర్వాత అలరించేందుకు నేనున్నానంటున్నాడు 19 ఏళ్ల ఎంబాపె. ఫ్రాన్స్ జగజ్జేతగా నిలవడం వెనుక గ్రీజ్మన్తో పాటు ఈ టీనేజ్ సంచలనం పాత్ర అంతాఇంత కాదు. జట్టులోని పోగ్బా, పవార్డ్, వరానె, కాంటె, హెర్నాండెజ్, ఉమ్టిటి... వీరంతా 20ల్లో ఉన్నవారే. రానున్న దశాబ్దం ఫ్రాన్స్‌దేనని వీరంతా చాటుతున్నారు. ఆ మూడింటికీ ఉంది భవిష్యత్! ప్రతిభను లెక్కలోకి తీసుకుంటే భవిష్యత్‌లో ఫ్రాన్స్‌కు పోటీగా వచ్చేది బ్రెజిలే అంటున్నారు. ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన సాంబా జట్టు... ఈసారి క్వార్టర్స్‌లో బెల్జియం దెబ్బకు ఔటైంది. అయినా, జీసస్ వంటి యువకులతో పాత ఘనతలను అందుకుంటుందనే నమ్మకం కలుగుతోంది. గారెత్ సౌత్‌గేట్ శిక్షణలో నిండా యువకులతో అడుగుపెట్టిన ఇంగ్లండ్ అదరగొట్టింది. పాతికేళ్లలోపు కుర్రాళ్లతో కళకళలాడుతున్న ఈ జట్టు 2022 నాటికైనా గట్టి పోటీదారేనని లోథర్ మథియాస్ లాంటి దిగ్గజమే కితాబిచ్చాడు. అందరూ ఫేవరెట్‌గా భావించిన బెల్జియం లుకాకు, హజార్డ్ వంటి ‘గోల్డెన్ జనరేషన్’ ఆటగాళ్లతో సెమీస్ చేరింది. అయితే, వచ్చే ప్రపంచకప్‌కు ఫ్రాన్స్, బ్రెజిల్ మాదిరిగా పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇక అర్జెంటీనా చేయాల్సింది మెస్సీ నీడ నుంచి బయటకు రావడమే. 2022 నాటికి వారికిదే పెద్ద సమస్య. ప్రపంచ కప్ రికార్డుల రారాజు జర్మనీ పునరుత్తేజం పొందే పనిలో పడాలి. 2000 సంవత్సరంలో యూరో కప్‌లో గ్రూప్ దశలో వెనుదిరిగిన జర్మనీ... తర్వాత మరింత మేటిగా తయారైంది.ఆసియా జట్లు ఈ కప్‌లోనూ ఒకటీ రెండు మెరుపులకే పరిమితమయ్యాయి. జర్మనీని ఇంటికి పంపి కొరియా ఔరా అనిపిస్తే, నాకౌట్లో ప్రతిఘటనతో జపాన్ ఆకట్టుకుంది. ఫేవరెట్లు కాకున్నా ప్రమాదకారులు అనిపించుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. రాజకీయం... సుహృద్భావం రష్యా వంటి దేశంలో ప్రపంచకప్ జరిగినా... పెద్దగా రాజకీయ ప్రస్తావనలకు అవకాశం లేకపోయింది. ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించిన అధ్యక్షుడు పుతిన్‌తో సౌదీ రాకుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ కరచాలనం ఆకట్టుకుంది. అయితే, ఈజిప్ట్ స్టార్ సలా వివాదాస్పద చెచెన్యా నేత రమ్జాన్ కదిరోవ్ను కలవడం చర్చనీయాంశమైంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న రీత్యా నైక్ సంస్థ బూట్లను ధరించకుండా ఇరాన్ ఆటగాళ్లు బరిలో దిగడం వార్తల్లో నిలిచింది. ఫైనల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ విజయ సంబరం... క్రొయేషియా దేశాధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిచ్ తమ జట్టు ఫైనల్‌కు వెళ్లాక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను అభినందించడం, వారితో కలసి నృత్యం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గాయాలు... గేయాలు ఇరాన్‌తో మ్యాచ్‌లో మొరాకో ఆటగాడు నార్డిన్ అమ్రాబట్ అపస్మారకంలోకి వెళ్లాడు. ముఖంపై నీళ్లు చల్లి అతడిని స్పృహలోకి తేవాల్సి వచ్చింది. బెల్జియంతో సెమీస్‌లో ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ మట్యుడి సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గోల్స్‌ను మరువలేం! సౌదీ అరేబియాపై అలెగ్జాండర్ గోలోవిన్ (రష్యా), స్పెయిన్‌పై రొనాల్డొ, క్రొయేషియాపై ట్రిపియర్ (ఇంగ్లండ్)ల ఫ్రీ కిక్‌లు అంత తేలిగ్గా మర్చిపోలేనివి. స్విట్జర్లాండ్‌పై కౌటిన్హొ (బ్రెజిల్), అర్జెంటీనాపై మోడ్రిచ్ (క్రొయేషియా), పనామాపై లిన్‌గార్డ్ (ఇంగ్లండ్), ఫ్రాన్స్‌పై డిమారియా (అర్జెంటీనా)లు సుదూరం నుంచి కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌లోకి చేరిన తీరు ముచ్చట గొలిపింది. కవానీ హెడర్ పోర్చుగల్ కథను ప్రి క్వార్టర్స్‌తోనే ముగించింది. ‘వార్’ తప్పించింది ‘వీఏఆర్’ ప్రపంచ కప్ అంటేనే ‘గోల్ గగ్గోలు’ సాధారణం. కానీ ఈసారి వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్)తో దీనికి అడ్డుకట్ట పడింది. బంతి శరీరానికి తగిలిందా లేదా అనే సంశయాలు, గాయాల నటన, రిఫరీని చుట్టుముట్టడం, ఆటగాళ్ల వేడుకోళ్లను తప్పించింది. ఆరంభంలోనే ఉన్నా ఈ పద్ధతి ఆశలు కల్పిస్తోంది. టెన్నిస్‌లో రివ్యూ, క్రికెట్లో హాక్ ఐ శైలిలో వీఏఆర్ కూడా కొన్నేళ్లలో ఫుట్‌బాల్‌లో మార్పు తేనుంది. టోర్నీలో 29 పెనాల్టీ (స్పాట్) కిక్‌లకు అనుమతివ్వగా వీటిలో 11 వీఏఆర్‌ను ఆశ్రయించి ఇచ్చినవే. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో క్రొయేషియాపై గ్రీజ్మన్ కొట్టిన గోల్స్ ‘వార్’ అందించినవే కావడం విశేషం. మొత్తం 32 జట్లలో 16 జట్లు ఒక్కసారైనా పెనాల్టీతో లబ్ధిపొందాయి. మరీ ముఖ్యంగా ‘గోల్డెన్ బూట్’ విజేత హ్యారీ కేన్ తన ఆరు గోల్స్‌లో మూడింటిని పెనాల్టీలోనే కొట్టాడు. వచ్చేసారి ‘ఖతర్’నాక్‌గా... 2022 కప్ కూడా కొత్త వేదికపైనే జరుగనుంది. ఈసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ‘ఖతర్’ ఏర్పాట్లు చేసుకుంటోంది. సహజంగా ప్రపంచకప్ జూన్–జూలైలలో నిర్వహిస్తారు. గల్ఫ్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2022 కప్ షెడ్యూల్‌ను నవంబరు–డిసెంబరుకు మార్చారు. ‘సెట్ పీస్’... ఇంగ్లండ్ సెమీస్ ప్రస్థానంలో పెనాల్టీలతో పాటు ‘సెట్ పీస్’ (ఫ్రీ కిక్, కార్నర్, త్రో ఇన్ల సహాయంతో వచ్చేవి) గోల్స్ది కీలక పాత్ర. తొమ్మిందిటిని ఇలానే సాధించింది మూడు సింహాల బృందం. చిత్రమేమంటే ఇంగ్లండ్ విజేతగా నిలిచిన 1966 తర్వాత (70) అత్యధికంగా సెట్పీస్ గోల్స్ ఇప్పుడే (48) నమోదయ్యాయి. -
‘ఫిఫా విజేత ఆఫ్రికా’ : బిగ్ బీపై విమర్శలు
ఫిఫా వరల్డ్ కప్ 2018 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో క్రొయేషియాను మట్టికరిపించి ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఫిఫా కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో.. ‘ టీ 2868- ఆఫ్రికా ప్రపంచ కప్-2018ని సొంతం చేసుకుంది’ అంటూ ట్వీట్ చేసి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ విమర్శల పాలవుతున్నారు. ప్రస్తుతం విజయం సాధించిన ఫ్రాన్స్ జట్టులో భాగస్వాములైన 16 మంది ఆటగాళ్లలో మొరాకో, అంగోలా వంటి పలు ఆఫ్రికన్ దేశాలకు చెందిన మూలాలు కలవారు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అమితాబ్ చేసిన ట్వీట్‌పై ఆయన అభిమానులతో సహా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరంటే చాలా గౌరవం ఉంది. కానీ మీరిచ్చిన స్టేట్మెంట్ తప్పు. వాళ్ల(ఆటగాళ్ల) తాత ముత్తాతలు ఆఫ్రికాకు చెందిన వారు కావచ్చు. కానీ ప్రస్తుతం వారంతా ఫ్రెంచ్ పౌరులుగా గుర్తింపు పొందారు. శాస్త్రీయంగా చూస్తే మనం(భారతీయులం) కూడా ఆఫ్రికన్లమే. 3 లక్షల ఏళ్ల క్రితం నాటి హోమో సెపియన్స్ చరిత్రే అందుకు ఆధారం. కృతఙ్ఞతలు.’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ... మీ నుంచి ఇలాంటి ట్వీట్ ఊహించలేదు. వలసవాదులను తమ దేశ పౌరులుగా ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేసిన ఫ్రాన్స్‌ను అభినందించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ ఇలా ఆ జట్టును విడదీసి చూడటం బాగాలేదంటూ’ అమితాబ్‌ను విమర్శించారు. కాగా ఫ్రాన్స్ జట్టును అభినందిస్తూ.. ‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్ కప్ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా.. ‘చిన్న సవరణ మేడమ్. భారత భూభాగాన్ని ఫ్రాన్స్ ఆక్రమించుకుంది. అంత మాత్రాన మీరన్నట్లు పుదుచ్చేరి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం అయిపోదు కదా. పుదుచ్చేరిని ఫ్రెంచ్ పాలిత ప్రాంతం, గోవాను పోర్చుగీసు పాలిత ప్రాంతం అనడానికి ఎవరూ సాహసించలేరంటూ’ ట్వీట్ చేశారు. T 2868 - Thats it then ... AFRICA won the World Cup 2018 !!! — Amitabh Bachchan (@SrBachchan) July 15, 2018 With all due respect to you, that was an uncalled for statement. May be their forefathers were African, but they all were FRENCH. Scientifically even our forefathers were AFRICAN as that's where Homo sapiens evolved 300,000 years ago. Thanks, A big fan of yours. — Kshitij Mohan (@MohanKshitij) July 15, 2018 Didn’t expect this Tweet from Big B. If a nation could integrate their immigrants to the mainstream of society so successfully, it’s a huge credit to them. — Sougata Banerji (@BanerjiSougata) July 15, 2018 We the Puducherrians (erstwhile French Territory) won the World Cup. 👏👏🤣🤣 Congratulations Friends. What a mixed team-all French. Sports unites. — Kiran Bedi (@thekiranbedi) July 15, 2018 Small correction, ma’am.Puducherry was never French Territory. It was always Indian territory, occupied/colonised by the French. Nobody would dare call Goa an erstwhile Portuguese territory. https://t.co/Ivh3RcwzrJ — Shekhar Gupta (@ShekharGupta) July 15, 2018 -
ఆట మధ్యలో మైదానంలోకి అభిమానులు
-
పుతిన్ బంపరాఫర్!
మాస్కో: ఫిఫా అభిమానులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బంపరాఫరిచ్చాడు. ప్రపంచకప్ టోర్నీ ముగిసినా.. విదేశీ అభిమానులు వీసా లేకుండా ఈ ఏడాదంతా రష్యాలో పర్యటించే అవకాశం కల్పించారు. అయితే ఇది ఫ్యాన్ ఐడీ కార్డులు ఉన్న విదేశీయులకు మాత్రమే వర్తించనుంది. ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా రష్యాకు వచ్చే విదేశీ అభిమానుల కోసం నిర్వాహకులు ఫ్యాన్ ఐడీలను జారీ చేశారు. ఈ ఐడీల కాలపరిమితి ఈ నెల 25 వరకు మాత్రమే ఉంది. ఆదివారంతో ఈ ప్రపంచకప్ టోర్నీ ముగియడంతో.. ఈ కార్డుల కాలపరిమితిని పెంచుతూ రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్ ఐడీలు కలిగిన విదేశీ అభిమానులు వీసా లేకుండానే ఈ ఏడాదంతా ఎన్నిసార్లైనా రష్యాలో పర్యటించొచ్చని ఫైనల్ అనంతరం పుతిన్ ప్రకటించారు. ఈ పోటీలను నిర్వహించినందుకు గర్వపడుతున్నామని తెలిపారు. మరోవైపు విజయవంతంగా ఫిఫా పోటీలు నిర్వహించినందుకు పలు దేశాలు రష్యాను అభినందించాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, క్రోయేషియా అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ హాజరయ్యారు. -
వైరల్: ఫిఫా ఫైనల్లో ఆసక్తికర సన్నివేశం!
మాస్కో : ఫిఫా తుది సమరం ఆద్యంతం ఆకసక్తికరంగా సాగింది. ఫ్రాన్స్-క్రోయేషియా మధ్య ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తొలి అర్థబాగం వరకు 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ఓ వైపు గోల్స్ కోసం పోటీ పడుతుండగా.. మరోవైపు మ్యాచ్ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు. అంతటితో ఆగకుండా అభిమాన ఆటగాళ్లకు హైఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఓ లేడీ అభిమానికి ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపే హైఫై ఇచ్చిన పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అతనిపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంబాపే అక్రమంగా మైదానంలోకి వచ్చిన అభిమానికి హైఫై ఇస్తే.. క్రొయేషియా ఢిఫెండర్ డేజన్ లోవెరన్ ఆ ప్రేక్షకులను పట్టుకోని సెక్యూరిటి సిబ్బందికి అప్పగించాడు. ఎంబాపెను ప్రశంసిస్తున్న అభిమానులు.. డేజన్ లోవెరన్పై మండిపడుతున్నారు. ఇక మైదానంలోకి దూసుకొచ్చిన ఆ నలుగురు ఒకే డ్రెస్‌కోడ్ ధరించడం విషేశం. ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అదరగొడుతున్న వలస ఆటగాళ్లు! ‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు? అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా! Was this the best #WolrdCup final? Lots of goals, lots of craziness, both teams with plenty to be proud of, Mbappe high fiving a Pussy Riot pitch invader. A beautiful game. pic.twitter.com/MK91bZGpdJ — Lincoln Michel (@TheLincoln) July 15, 2018 Dejan Lovren X Pitch Invader X Mbappe. #CRO #WorldCup #FRA pic.twitter.com/BeAzJvv3CG — Clattenbeurg mesut (@hakemmesut) July 15, 2018 -
‘హిందూ-ముస్లిం లొల్లి.. ఆ జట్టును చూసి నేర్చుకోండి’
హైదరాబాద్ : దేశంలో నెలకొన్న హిందూ-ముస్లిం గొడవల పట్ల టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఫ్రాన్స్-క్రొయేషియా ఫైనల్ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ‘కేవలం 50 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఆడుతోంది. కానీ 135 కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం హిందూ-ముస్లింలు అనుకుంటూ గొడవపడుతున్నాం’ అని ట్విటర్లో అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. लगभग 50 लाख की आबादी वाला देश क्रोएशिया फ़ुटबॉल वर्ल्ड कप का फाइनल खेलेगा और हम 135 करोड़ लोग हिंदू मुसलमान खेल रहे है।#soch bdlo desh bdlega — Harbhajan Turbanator (@harbhajan_singh) July 15, 2018 -
గొడుగేసుకున్న పుతిన్, ఆగని సోషల్ మీడియా
మాస్కో : తిరుగులేని ప్రదర్శనతో క్రొయేషియాను మట్టికరిపించిన ఫ్రాన్స్, ఫిఫా ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. రసవత్తరంగా సాగిన ఫైనల్లో ప్రపంచకప్ తన సొంతం కావడంతో, ఫ్రాన్స్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. మాస్కోలో జరిగిన ఈ ప్రపంచకప్ తుది సమరంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ప్రపంచ అభిమానులను అలరించాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఆనందమైతే ఇక పట్టరానిది. స్టేడియంలోనే ఎగిరి గెంతేశారు. ఇక ప్రపంచ కప్ ట్రోఫీని విజేతకు ఇచ్చే సంబురంలో, పలువురు దేశాధ్యక్షులు పాల్గొన్నారు. స్టేజీపై ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగబోతుండగా.. ఒక్కసారిగా ఫ్రెంచ్ వేడుకను వర్షం సైతం పలకరించింది. ప్రపంచ అధినేతలందరూ వర్షంలోనే తడిసిముద్దవుతూ.. ఈ వేడుకను ఎంజాయ్ చేస్తుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం చినుకు సైతం తనపై పడకుండా.. గొడుగు వేసుకుని నిల్చున్నారు. ప్రపంచ అధినేతలందరూ తడుస్తూ.. పుతిన్ మాత్రమే గొడుగు వేసుకోవడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పొడియంపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్, క్రొయేషియా అధ్యక్షుడు కోలిండా గ్రాబార్-కిటరోవిక్ మధ్యలో పుతిన్ నిల్చున్నారు. వారందరిన్నీ, ఫిఫా ట్రోఫీని కవర్ చేస్తూ.. పుతిన్ గొడుగేసుకుని నిల్చోవడంతో, సోషల్ మీడియా నవ్వులు పూయిస్తోంది. పుతిన్ గొడుగు దాదాపు ట్రోఫీ వేడుకను కప్పివేసిందని ఒక యూజర్ కామెంట్ చేయగా.. సర్, మనం ఎన్ని గొడుగులు తెచ్చుకున్నామేమిటీ? అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. పుతిన్‌పై వస్తున్న జోకులు ఏ విధంగా ఉన్నాయో ఓసారి మీరే చూడండి... Putin’s umbrella almost overshadowed the trophy ceremony #WorldCup — Omar Abdullah (@OmarAbdullah) July 15, 2018 Sir how many umbrellas should we bring? Putin: Just one. They didn't let us win. Let them soak! #FRACRO #WorldCup #WorldCupFinal pic.twitter.com/RM0Qzv1xW6 — The Writer Formerly Known As Elnathan (@elnathan_john) July 15, 2018 Do they only have one umbrella in Russia?!! 😂🙈 — Siobhan ⚽️👐🏼 (@Sio_Chamberlain) July 15, 2018 @PutinRF_Eng to @EmmanuelMacron : "My umbrella is my umbrella, its not your umbrella, you French fry get yourself soaked in rain first!!!"😉😉 #FIFAWorldCup #FRACRO #FrancevsCroatia #FinalRusia2018 #Russia #France #HighLevel #Attitude #Supreme Power #KokulaKrishnaHariK pic.twitter.com/HXNAcXHuNE — Kokula Krishna Hari™ (@kkkhari) July 16, 2018 As far back as I can remember, I always wanted to be a gangster. pic.twitter.com/KYzhucLPJM — southpaw (@nycsouthpaw) July 15, 2018 “France won MR. Putin what shall we do?” “Flood them.”#worldcupfinal pic.twitter.com/PNUvsI2qaD — K.J (@KJWLDN) July 15, 2018 So the Russians only remembered an umbrella for their own President Putin... left the leaders of France and Croatia out in the rain for minutes... pretty much sums up today’s international politics. #WorldCup18 pic.twitter.com/W5UDTTwMxS — Keir Simmons (@KeirSimmons) July 15, 2018 -
ఫ్రాన్స్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి
పారిస్ : విశ్వవేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగరడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో వారు పారిస్ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకల్లో విషాదం నెలకొంది. అభిమానుల సంబరాలు శృతి మించడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో రంగప్రవేశం చేసిన రియోట్ పోలీసులు వారిపై టియర్ గ్యాస్, వాటర్ గన్స్(జల ఫిరంగులు)లు ఉపయోగించి చెల్లా చెదురు చేశారు. అయితే ఈ ఘటనల్లో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2తో నెగ్గి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం లక్షల మంది అభిమానులు నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చి తమ జట్టు విజాయాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ జట్టు విజయానికి సూచికగా వేలమంది అభిమానులు పిరమిడ్ రూపంలో నిలబడ్డారు. రోడ్లపై పాటలు పాడుతూ.. డ్యాన్స్‌లు చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఓ 50 ఏళ్ల అభిమాని అత్యుత్సాహంగా కెనాల్‌పై నుంచి దూకడంతో మెడలు విరిగి మృతి చెందాడు. మరొక 30 ఏళ్ల అభిమాని విజయానందంలో కారు నడుపుతూ చెట్టుకు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరో వైపు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులు షాప్‌లపై దాడులు చేస్తూ ఆస్తుల ధ్వంసానికి ప్రయత్నించారని, దీంతో వారిని అడ్డుకోగా కవ్వింపు చర్యలకు పాల్గొన్నారని రియోట్ పోలీసులు పేర్కొన్నారు. అభిమానులు రాళ్లతో దాడిచేయడంతోనే తాము టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు ఉపయోగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇక పోలీసులు దాడిలో చాలా మంది గాయపడ్డారు. సంతోషం కాస్త విషాదంగా మారడంతో పోలీసులు రవాణ వ్యవస్థను నిలిపివేశారు. రోడ్లపై ఎలాంటి వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. ఆఖరికి మెట్రో ట్రైన్లను ఆపేశారు. 4 వేల మంది పోలీసులను మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చె ప్రయత్నం చేశారు. -
శృతి మించిన అభిమానుల సంబరాలు
-
ఫ్రాన్స్ విజయంపై కిరణ్ బేడీ ట్వీట్.. నెటిజన్ల ఫైర్!
న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4 - 2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్రాన్స్ జట్టుకి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్నినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కూడా ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాస్తా భిన్నంగా చెప్పడంతో ట్విటర్ ఫాలోవర్స్ కిరణ్ బేడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. We the Puducherrians (erstwhile French Territory) won the World Cup. 👏👏🤣🤣 Congratulations Friends. What a mixed team-all French. Sports unites. — Kiran Bedi (@thekiranbedi) July 15, 2018 ‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్ కప్ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతమున్న పుదుచ్చేరి ఒకప్పడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కిరణ్ బేడి పుదుచ్చేరి వాసులను ఒకప్పటి ఫ్రెంచ్ వలసవాదులుగా గుర్తిస్తూ ఇలా ట్వీట్ చేశారు. కానీ నెటిజన్లకు కిరణ్ బేడి ట్వీట్ నచ్చలేదు. దాంతో వారు కిరణ్ బేడిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము భారతీయులం మేడమ్.. మీ ప్రచార కార్యక్రమాలు ఆపండి’ అని ట్వీట్ చేయగా మరికొందరు ‘నేను మాత్రం మీరు భారత భూభాగానికే గవర్నర్ అయ్యారని భావిస్తున్నాను. కానీ మీరు మాత్రం మమ్మల్ని ఫ్రెంచ్ వలసవాదులుగా గుర్తించి సంతోషిస్తున్నారు. ఏం చేస్తాం మా ఖర్మ. ఇంకా ఢిల్లీలో ఉన్న మూర్ఖులు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. అదృష్టం అంత పని చేయలేదు’ అని ట్వీట్ చేశారు. There are other ways to celebrate a French victory than to be so servile I'm a born Pondicherrian, I don't feel I've won at all France won, and it's a game and I love the game.I don't need the crutch of a colonial mindset to enjoy Please do consider pulling this tweet down. — Alo Pal (@AloPal) July 15, 2018 మరొక నెటిజనైతే ఇంకాస్తా ఘాటుగానే స్పందించారు. ‘నేను పుదుచ్చేరి వాసిగానే జన్మించాను. ఫ్రెంచ్ టీం గెలిస్తే.. నేను గెలిచనట్లు అనుకోవడం లేదు. గెలిచింది ఫ్రాన్స్.. మేము కాదు. అయినా విజయాన్ని ఆస్వాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక వలసవాదిగానే గెలుపును ఆస్వాదించనవసరం లేదు. ముందు మీ ఆలోచనా విధనాన్ని మార్చుకొండి’ అంటూ విమర్శించారు. -
అద్భుతం: అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా!
మాస్కో: విశ్వ వేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో గెలుపొందడంతో రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మళ్లీ ‘ది బ్లూస్’ చెంత చేరింది. ఇలా ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో ఆ జట్టు కోచ్ దిదియర్ డెచాంప్స్ పాత్ర మరవలేనిది. 1998 సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తొలిసారిగా టైటిల్ అందుకోగా.. ఆ జట్టుకు దిదియర్ డెచాంప్సే కెప్టెన్ కావడం విశేషం. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ కెప్టెనే.. కోచ్‌గా మారి మరోసారి తమ జట్టును జగ్గజ్జేతగా నిలిపాడు. దీంతో అటు కెప్టెన్‌గా.. ఇటు కోచ్‌గా వరల్డ్‌కప్ సాధించిన మూడో ఆటగాడిగా దిదియర్ డెచాంప్స్ గుర్తింపు పొందాడు. జగాలో (బ్రెజిల్), బ్రెకన్‌బాయర్ (జర్మనీ)లు డెచాంప్స్ కన్నా ముందు ఇలా కోచ్, కెప్టెన్‌గా తమ జట్లకు ప్రపంచకప్ అందించారు. జగాలో 1958,1962లో బ్రెజిల్‌ను ఇలా రెండు సార్లు విశ్వ విజేతగా నిలపగా.. బ్రెకన్ బాయర్ కెప్టెన్‌గా 1974, కోచ్‌గా 1990లో జర్మనీకి ప్రపంచకప్ అందించారు. ప్రస్తుత టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా ప్రపంచకప్ అందుకోవడంలో కోచ్ దిదియర్ డెచాంప్స్ పాత్ర కీలకం. ముఖ్యంగా పిన్న వయసు ఆటగాళ్లకు అవకాశమివ్వడం.. వెన్ను తట్టి ప్రోత్సహించడం.. కోచ్‌గా దిదియర్ డెచాంప్స్ ప్రత్యేకత. ఎంబాపె వంటి మెరికల్లాంటి కుర్రాడి ప్రతిభను వెలికితీసి డెచాంప్స్ ప్రపంచానికి పరిచయం చేశాడు. బలహీనతలను పక్కన బెట్టి ఆటగాళ్లను మానసికంగా తీర్చిదిద్దడంతో డెచాంప్స్ విజయవంతమయ్యాడు. నిజానికి ఫైనల్ పోరులో ఫ్రాన్స్ అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడింది. దీనికి కూసింత అదృష్టం కూడా కలిసిరావడంతో సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. ఈ వ్యూహాలు వెనకుండి నడిపించిన వాడు డెచాంప్స్. గొప్పగా ఆడలేదనే విషయాన్ని మ్యాచ్ అనంతరం అతనే అంగీకరించాడు. విజయానంతరం మాట్లాడుతూ.. ‘మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది.’ తెలిపాడు. -
ఫిఫా ప్రపంచకప్: పీలే తర్వాత ఎంబాపెనే!
మాస్కో : ఫ్రాన్స్ యువ కెరటం కైలిన్ ఎంబాపె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు 65వ నిమిషంలో గోల్ సాధించి బ్రెజిల్ దిగ్గజం పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్ కప్ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2తో నెగ్గి 20 ఏళ్ల తర్వాత రెండోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక అంతకముందు నాకౌట్ సమరంలోను గోల్ సాధించిన ఎంబాపే ఇదే..పీలే రికార్డును సమం చేశాడు. మ్యాచ్ అనంతరం ‘మైలవ్’ అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. ‘కైలిన్ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే’ అని ట్వీట్ చేశాడు. అంతకు ముందు ‘వెలకమ్ టూ ది క్లబ్’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. If Kylian keeps equalling my records like this I may have to dust my boots off again... // Se o @KMbappe continuar a igualar os meus records assim, eu vou ter que tirar a poeira das minhas chuteiras novamente...#WorldCupFinal https://t.co/GYWfMxPn7p — Pelé (@Pele) July 15, 2018 క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్ (18వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరవగా... గ్రీజ్మన్ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్ (28వ ని.లో), మాన్‌జుకిచ్ (69వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. దీంతో ఫ్రాన్స్ సునాయస విజయం సాధించింది. -
ఫుట్‌బాల్ విశ్వ విజేత ఫ్రాన్స్
-
ఫ్రెంచ్ ఫెస్టివల్
ఫ్రెంచ్ కిక్ అదిరింది. విశ్వ వేదికపై ఫ్రాన్స్ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మళ్లీ ‘ది బ్లూస్’ చెంత చేరింది. అగ్రశ్రేణి జట్టుగా తమపై ఉన్న అంచనాలకు ఎక్కడా తగ్గకుండా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన ఫ్రాన్స్ చివరకు శిఖరాన నిలిచి సత్తా చాటింది. ఫైనల్ పోరులో అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడిన ఫ్రెంచ్ బృందం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చి సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. రెండో సారి వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. గ్రీజ్మన్, పోగ్బా, ఎంబాపెలాంటి స్టార్లు ఆఖరి పోరులో గోల్స్‌తో చెలరేగగా... 1998లో కెప్టెన్‌గా ప్రపంచ కప్ అందించిన దిదియర్ డెచాంప్స్ ఇప్పుడు కోచ్‌గా మళ్లీ ట్రోఫీని ముద్దాడగలిగాడు. అటు మాస్కోలో ఆఖరి విజిల్ మోగగానే ఇటు ఈఫిల్ టవర్ సాక్షిగా పారిస్ వీధుల నిండా విరామం లేకుండా ‘ఫ్రెంచ్ వైన్’ పొంగిపొర్లడం ప్రారంభమైపోయింది. మ్యాచ్ ఆసాంతం బంతిపై పట్టు... అటాకింగ్‌తో తిరుగులేని ఆట... ప్రత్యర్థి ఏరియాలోకి పదే పదే దూసుకుపోయిన ఫార్వర్డ్లు ... కానీ గోల్స్ లెక్కలో మాత్రం వెనుకబడిపోయిన క్రొయేషియాకు గుండెకోత తప్పలేదు. తొలిసారి ఫైనల్ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన ఈ జట్టుకు తుది ఫలితం చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. టైటిల్ పోరులో దురదృష్టం దగ్గరి బంధువులా క్రొయేషియా వెంట పరుగెత్తుకు వచ్చింది. ముందుగా సెల్ఫ్ గోల్, ఆపై రిఫరీ తప్పుడు నిర్ణయంతో ప్రత్యర్థికి పెనాల్టీ అవకాశం ఒక్కసారిగా జట్టును వెనుకంజ వేసేలా చేశాయి. ఆ తర్వాత ఎంత పోరాడినా అది మాజీ చాంపియన్‌ను నిలువరించడానికి సరిపోలేదు. మూడు నాకౌట్ మ్యాచ్‌లను కూడా అదనపు సమయంలో గెలుచుకొని పవర్ ప్రదర్శించిన ఈ టీమ్‌కు ఫైనల్ మాత్రం నిరాశనే పంచింది. ‘హృదయాలు గెలిచారు’ అనే ఓదార్పు మాట తప్ప ఇక రన్నరప్ ముద్రతోనే ఆ జట్టు వచ్చే నాలుగేళ్లు సహవాసం చేయాల్సిందే. మాస్కో: ఫ్రాన్స్ రెండోసారి ఫుట్‌బాల్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 2018 టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా అజేయంగా ముందుకు సాగిన ఫ్రెంచ్ బృందం ఫైనల్లోనూ చెలరేగింది. లుజ్నికి స్టేడియంలో జరిగిన తుది పోరులో ఫ్రాన్స్ 4–2 గోల్స్ తేడాతో క్రొయేషియాను చిత్తు చేసింది. క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్ (18వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరవగా... గ్రీజ్మన్ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్ (28వ ని.లో), మాన్‌జుకిచ్ (69వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. చివర్లో క్రొయేషియా ఎంత పోరాడినా లాభం లేకపోయింది. ఫ్రాన్స్‌తో పోలిస్తే ఏకంగా 61 శాతం క్రొయేషియా బంతిని నియంత్రణలో ఉంచుకున్నా... తుది ఫలితం విషయంలో మాత్రం అది ప్రతిఫలించలేదు. క్రొయేషియా బ్యాడ్‌లక్... తొలిసారి ఫైనల్ ఆడుతున్న క్రొయేషియా ఆరంభంలో చెలరేగింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో తొలి 15 నిమిషాల పాటు ఫ్రాన్స్‌కు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఏ దశలో కూడా ఫ్రాన్స్ ఆటగాళ్లు వరుసగా మూడు పాస్‌లు కూడా ఇవ్వలేకపోయారు. అయితే మంచి జోష్‌లో కనిపించిన క్రొయేషియా అదే జోరులో చేసిన పొరపాటు ఫ్రెంచ్ జట్టుకు కలిసొచ్చింది. గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీ కిక్ కోసం అతని సహచరుడు రాఫెల్ వరాన్ సిద్ధమయ్యాడు. అయితే దానిని అడ్డుకునే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన మాన్‌జుకిచ్ తమ గోల్ పోస్ట్లోకే బంతిని పంపించేశాడు. ప్రపంచ కప్ ఫైనల్లో నమోదైన తొలి సెల్ఫ్ గోల్ ఇదే కావడం విశేషం. అయితే కొద్దిసేపటికే పెరిసిచ్ గోల్ చేసి క్రొయేషియా ఆశలకు ఊపిరి పోశాడు. ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియాలో ప్రతీ ఒక్కరు బంతిపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న దశలో పెరిసిచ్ ప్రశాంతంగా అందు కొని ఏమాత్రం తడబాటు లేకుండా గోల్ కొట్టాడు. ఆ తర్వాత పెరిసిచ్ను దురదృష్టం పలకరించింది. అతను చేతితో బంతిని అడ్డుకున్నాడని రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ముందుగా పెనాల్టీకి అంగీకరించని రిఫరీ ‘వీఏఆర్’ ద్వారా సుదీర్ఘ సమయం తీసుకొని దానిని నిర్ధారించడం వివాదాస్పదమైంది. పెరిసిచ్ చేతికి బంతి తగలడం వాస్తవమే కానీ అది ఉద్దేశ పూర్వకంగా చేయలేదనే క్రొయేషియా వాదన చెల్లలేదు. గ్రీజ్మన్ అలవోకగా కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఫ్రాన్స్ దూకుడు... రెండో అర్ధభాగంలో కూడా క్రొయేషియా దూకుడుగానే ఆడే ప్రయత్నం చేయగా, ఫ్రాన్స్ తడబాటు కొనసాగింది. ల్యుకా మోడ్రిచ్, ఇవాన్ రాకిటిచ్ పదే పదే ఫ్రాన్స్ ఏరియాలో చొరబడినా గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేకపోయారు. ఈ దశలో ఒక్కసారిగా వ్యూహం మార్చిన ఫ్రాన్స్ ఫలితం సాధించింది. కౌంటర్ అటాక్‌తో ఆ జట్టు కీలక గోల్ నమోదు చేసింది. ముందుగా క్రొయేషియా డిఫెండర్ల నుంచి బంతిని లాక్కున్న పోగ్బా ఆ తర్వాత ఎంబాపెకు పాస్ ఇచ్చాడు. ఎంబాపె నుంచి పాస్ గ్రీజ్మన్కు వెళ్లి మళ్లీ పోగ్బాకు వచ్చింది. పోగ్బా కొట్టిన షాట్‌ను మోడ్రిచ్ అడ్డుకోవడంతో బంతి మళ్లీ వెనక్కి వచ్చింది. ఈసారి పొరపాటుకు చాన్స్ లేకుండా పోగ్బా గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఇదే జోరులో మరో ఆరు నిమిషాలకే ఎంబాపె సునాయాస గోల్ సాధించాడు. క్రొయేషియా ఏరియాలో అడ్డుకోవడానికి ఎవరూ లేకపోగా, కీపర్ కూడా అచేతనంగా మారిపోవడంతో... పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్ కప్ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె నిలిచాడు. తమ జట్టు ఆశలు కోల్పోయిన దశలో మాన్‌జుకిచ్ గోల్ కొట్టి ఊపు తెచ్చాడు. ఫ్రాన్స్ కీపర్ లోరిస్ తన వద్దకు వచ్చిన బంతిని కిక్ కొట్టకుండా అక్కడే డ్రిబ్లింగ్ చేస్తుండగా పైకి దూసుకొచ్చి మాన్‌జుకిచ్ అనూహ్యంగా గోల్ సాధించడం విశేషం. అయితే ఆ వెంటనే ఫ్రాన్స్ కోచ్ ముగ్గురు డిఫెండర్లను సబ్స్టిట్యూట్లుగా బరిలోకి దించి రక్షణాత్మక ప్రదర్శనకే మొగ్గు చూపాడు. దాంతో క్రొయేషియా ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించడంలో విఫలమై కన్నీటితో నిష్క్రమించింది. మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. –ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ ► 1970 (బ్రెజిల్) తర్వాత ఫైనల్లో 4 గోల్స్ కొట్టిన తొలి జట్టు ఫ్రాన్స్ ► 2002 నుంచి నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో కలిపి 6 గోల్స్ నమోదు కాగా... ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్ వచ్చాయి. 1958 ఫైనల్ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్ నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి. ► జగాలో (బ్రెజిల్), బ్రెకన్‌బాయర్ (జర్మనీ) తర్వాత అటు కెప్టెన్‌గా, ఇటు కోచ్‌గా కూడా వరల్డ్ కప్ సాధించిన మూడో ఆటగాడు దిదియర్ డెచాంప్స్. 1998 అతని నాయకత్వంలోనే సొంతగడ్డపై ఫ్రాన్స్ వరల్డ్ కప్ గెలిచింది. ఎవరికెంత వచ్చాయంటే...? ► విజేత ఫ్రాన్స్ జట్టుకు 3 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 260 కోట్లు) ► రన్నరప్ క్రొయేషియా జట్టుకు 2 కోట్ల 80 లక్షల డాలర్లు (రూ. 191 కోట్లు). ► మూడో స్థానం పొందిన బెల్జియం జట్టుకు 2 కోట్ల 40 లక్షల డాలర్లు (రూ. 164 కోట్లు). ► నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 2 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 150 కోట్లు). ► క్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 60 లక్షల డాలర్లు చొప్పున (రూ. 109 కోట్లు). ► ప్రిక్వార్టర్స్‌లో ఓడిన జట్లకు కోటీ 20 లక్షల డాలర్లు చొప్పున (రూ. 82 కోట్లు). ► లీగ్ దశలోనిష్క్రమించిన జట్లకు 80 లక్షల డాలర్లు చొప్పున (రూ. 54 కోట్లు). విశేషాలు ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్ -169 జరిగిన మ్యాచ్‌లు -64 ఎల్లో కార్డులు -219 రెడ్ కార్డులు -4 టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు బెల్జియం -16 ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్ (బెల్జియం 5–ట్యూనిషియా 2; ఇంగ్లండ్ 6–పనామా 1).- 7 గోల్స్ లేకుండా ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు (ఫ్రాన్స్–డెన్మార్క్).- 1 లీగ్ దశలో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లు -8 నాకౌట్ దశలో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్‌లు- 3 రన్నరప్ క్రొయేషియా జట్టు ఫెయిర్ ప్లే అవార్డు: స్పెయిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ సంబరం -
ఫిఫా ప్రపంచకప్ ఫ్రాన్స్ వశం
మాస్కో: పసికూనపై పెద్దన్నదే పైచేయి. ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఫ్రాన్స్ ప్రపంచకప్‌ను రెండో సారి ముద్దాడింది. 1998లో ప్రస్తుత కోచ్ డైడర్ డెచాంప్స్ సారథ్యంలో తొలి సారి టైటిల్ గెలిచిన ఫ్రాన్స్.. మరోసారి లోరిస్ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది. ఆట ప్రారంభం నుంచి ఫ్రాన్స్ దూకుడుగా ఆడటంతో క్రొయేషియా ఒత్తిడిలో చిత్తయి ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించింది. క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో తొలి గోల్ నమోదయింది. అనంతరం క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్ పెరిసిచ్(28వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆట 38వ నిమిషంలో పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఫ్రాన్స్ ఉపయోగించుకుంది. ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్ గ్రీజ్మన్ లెఫ్ట్ కార్నర్ నుంచి అద్బుతంగా గోల్ చేశాడు. దీంతో ప్రథమార్థం ముగిసే సరికి 2-1తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో ధాటిగా ఆడిన ఫ్రాన్స్, క్రొయేషియా రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ గోల్ పోస్ట్‌లపై దాడి చేసింది. రెండో భాగంలో గోల్ చేయడానికి ఇరు జట్లు కష్టపడినా మరో గోల్ నమోదు కాలేదు. పోగ్బా 59వ నిమిషంలో మరో గోల్ నమోదు చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడు గోల్స్ నమోదయ్యాయి. క్రొయేషియాను అయోమయంలోకి నెట్టుతూ ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపె 65వ నిమిషంలో మరో గోల్ చేశాడు. ఫ్రాన్స్ దూకుడుకు అడ్డుకట్టువేసేందుకు క్రోయేషియా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమైంది. 69వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మన్జుకిచ్ గోల్ చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. -
వార్
-
ఆ జట్టు జెర్సీలకు భారీ డిమాండ్
పారిస్: రష్యాలో జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన మొదటి జట్టు ఫ్రాన్స్. ఈరోజు(ఆదివారం) ఫ్రాన్స్-క్రొయేషియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. తమ దేశ జట్టుకు మద్దతిచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఫ్రాన్స్ అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లు ధరించే ముదురు నీలం రంగు జెర్సీలకు పారిస్‌లో భారీగా డిమాండ్ పెరిగింది. ఆటగాళ్ల జెర్సీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీనిలో భాగంగా తమ అభిమాన ఆటగాళ్ల జెర్సీలను సొంతం చేసుకునే పనిలో పడిపోయారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని వస్త్ర దుకాణాల్లో ఆ దేశ ఆటగాళ్ల జెర్సీలను కొనేందుకు అభిమానులు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు. ‘ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలు కావాలంటూ పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్ల పేర్లతో కూడిన జెర్సీలు కావాలని అభిమానులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలా షర్టులు విక్రయించాం. ఇంకా చాలా ఆర్డర్లు ఇచ్చాం.’ అని స్టోర్ల యజమానులు తెలిపారు. అలాగే స్థానిక రెస్టారెంట్లు, బార్లు కూడా నీలం రంగు విద్యుద్దీపాల వెలుగులతో ధగధగలాడుతున్నాయి. విద్యద్దీపాలంకరణ వెలుగుల్లో పారిస్ నగరం మరింత ఆకర్షణీయంగా మారింది. క్రొయేషియాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో క్రొయేషియా సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. మరి ఫైనల్లో గెలిచి ఏ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుందో చూడాలి. -
ఫిఫా వరల్డ్ కప్: మూడో స్థానంలో నిలిచిన బెల్జియం
-
ఇది సంకల్ప శక్తికి సంబంధించినది
చరిత్ర, నాటకీయత, భావోద్వేగం కనిపించే ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో గొప్ప క్షణాలకు సమయం ఆసన్నమైంది. 30 రోజులు, 63 మ్యాచ్‌ల తర్వాత ప్రతి అభిమాని ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది. ఫైనల్ సంకల్ప శక్తికి సంబంధించినది. అంతిమ సమరంలో వ్యూహాత్మక, సాంకేతిక అంశాలది కీలక పాత్ర. ప్రపంచంలో ఉత్తమ లైనప్‌ల మధ్య ఈ సందర్భంలో మనం ఏదైనా ఆశించవచ్చు. ఇదే సమయంలో బలీయమైన కోరిక అవసరం. నువ్వు ఇటువైపు ఎలా ఉన్నావన్నది కాదు, వచ్చిన అవకాశాన్ని ఎలా ఒడిసి పట్టావన్నదే ముఖ్యం. 1986 ఫైనల్లో మా ఆటగాడు జార్జ్ బరుచాగా జర్మనీ ఏరియాలో ఉన్న విషయాన్ని గమనించి నేను ఇలాంటి అవకాశమే అందించా. తర్వాతంతా చరిత్రే. ఫైనల్ వరకు ప్రయాణాన్ని గమనిస్తే, ఫ్రాన్స్ మూడు నాకౌట్ మ్యాచ్‌లను 90 నిమిషాల్లోనే ముగించింది. క్రొయేషియా మాత్రం అన్నిట్లో 120 నిమిషాలపైనే ఆడింది. డెచాంప్స్ కుర్రాళ్లు ఆటలో ఆధిపత్యం చాటారు. జాల్టొ డాలిచ్ బృందం చావోరేవో అన్నట్లు ఆడింది. ఇది క్రొయేషియా వైపు లోపాలను చూపుతోంది. చూసేందుకు బెదురే లేని పోరాటతత్వంతో కనిపిస్తోంది. విశేషమైన బాల్కన్ ఫుట్‌బాల్ సంప్రదాయాన్ని చాటుతూ వారు గొప్ప స్ఫూర్తిని చాటారు. ఫైనల్ రెండు భిన్న దృక్పథాల మధ్య సాగనుంది. ఫ్రాన్స్ ఆధిపత్యం చాటినా అది ఆసాంతం కాకపోవచ్చు. డెచాంప్స్ విశిష్ట శిక్షణలో వారు రాటుదేలారు. బ్యాక్‌లైన్, మిడిల్లో బలంగా ఉంటూ మ్యాచ్‌ను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. జట్టులో ఏ రంగు వారున్నారన్నది ఎందుకు పట్టించుకుంటారో నాకర్థం కాదు. వీరే ఫ్రాన్స్‌ను 2016 యూరో కప్ ఫైనల్ చేర్చినందున ఇది సహజమైనదే అనుకోవచ్చు. అçప్పటి ఓటమి చేదు అనుభవాలను చెరిపేసేందుకు ఇది మంచి వేదిక. చర్చంతా ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఎంబాపె చుట్టూనే సాగుతోంది. కానీ జట్టులో అతడి కంటే ఎవరూ తక్కువ కాదు. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు సమర్థులు ఉన్నారు. పోగ్బా, కాంటె ప్రత్యర్థుల కదలికలను దెబ్బతీసి... దాడులకు అవకాశమిస్తారు. దీంతో ఎంబాపె, గ్రీజ్మన్లకే కాదు డిఫెండర్లకూ గోల్ చేసే వీలు చిక్కుతోంది. క్రొయేషియా నాకౌట్ విజయాలు వెనుకబడి పుంజుకోవడంతో వచ్చినవే. ఒక్కసారి అయితే ధైర్యవంతులు అనుకోవచ్చు. ప్రతి సారి అంటే వారు సామాన్యులు కాదని అర్థం. పోరాడే జట్లను నేను ప్రేమిస్తా. క్రొయేషియా ఇదే చేస్తే... ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -
‘మూడు’తో ముగించిన బెల్జియం
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రపంచకప్‌లో బెల్జియంకు ఊరటనిచ్చే విజయం. ఫైనల్ చేరలేదన్న బాధ నుంచి తేరుకున్న రెడ్ డెవిల్స్... కప్‌లో తమ ప్రయాణాన్ని అత్యుత్తమ స్థానంతో ముగించింది. తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఈ మెగా టోర్నీలో తొలిసారిగా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకుంది. మూడోస్థానం కోసం శనివారం ఇక్కడ జరిగిన పోరులో బెల్జియం 2–0తో ఇంగ్లండ్‌పై గెలుపొంది టోర్నీని చిరస్మరణీయం చేసుకుంది. ఇప్పటివరకు ఈ మహాసమరంలో నాలుగో స్థానం (1986)లో నిలవడమే బెల్జియం ఘనత. థామస్ మ్యూనెర్ (4వ ని.లో), ఎడెన్ హజార్డ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేసి తమ జట్టుకు మరపురాని విజయాన్ని అందించారు. గెలిచి తీరాలన్న కసితో బరిలోకి దిగిన బెల్జియం మ్యాచ్ ప్రారంభంలోనే అదరగొట్టింది. 4వ నిమిషంలో గోల్ చేసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. ‘డి’ ఏరియా నుంచి చాడ్లీ ఇచ్చిన క్రాస్ పాస్‌ను అందుకున్న మ్యూనెర్ అదే ఊపులో బంతిని నెట్లోకి పంపి బెల్జియంను ఆనందంలో ముంచెత్తాడు. తర్వాత తేరుకున్న ఇంగ్లండ్ బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ తొలి అర్ధభాగం ప్రత్యర్థిని నిలువరించింది. రెండో అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాడు ఎరిక్ డెయిర్ (69వ నిమిషం) గోల్ ప్రయత్నాన్ని అల్డెర్విరాల్డ్ అద్భుత రీతిలో అడ్డుకున్నాడు. తర్వాత 82వ నిమిషంలో డి బ్రుయెన్ నుంచి బంతిని అందుకున్న బెల్జియం కెప్టెన్ హజార్డ్ ఇంగ్లండ్ గోల్ కీపర్ పిక్‌ఫోర్డ్‌ను బోల్తా కొట్టిస్తూ మరో గోల్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో స్థానంతో ముగించింది. -
పెద్దన్నా? పసి కూనా?
జర్మనీ తరం కాలేదు... స్పెయిన్ సత్తా సరిపోలేదు... అర్జెంటీనాకు వశపడలేదు...బ్రెజిల్ బేజారైపోయింది...బెల్జియం–ఇంగ్లండ్‌లది ‘మూడో’ ముచ్చటే!... ఫేవరెట్లన్నీ ఫట్ ఫట్‌మని తేలిపోయాయి!...‘ఫైనల్’గా ఫ్రాన్స్ ఒక్కటే మిగిలింది! పోర్చుగల్ పనైపోయింది...ఉరుగ్వే పరుగు ఆగింది...మెక్సికోకు కళ్లెం పడింది...కొలంబియా ఇంటికెళ్లిపోయింది......‘అండర్ డాగ్స్’ సంచలనం సమాప్తమైంది!...క్రొయేషియా ఒక్కటే కొరకరానిదిగా తేలింది! మాస్కో: అభిమానులను ఉర్రూతలూపి... ప్రేక్షకులను రంజింపజేసిన నెల రోజుల మహా సంరంభంలో ఆఖరి అంకం! ఫుట్‌బాల్ జగజ్జేతను తేల్చే సంగ్రామం! సరిగ్గా ముప్ఫై రోజుల క్రితం ఊహకైనా అందని రెండు జట్లు నేడు తుది సమరానికి నిలిచాయి. నవ యువకులతో కళకళలాడుతున్న ఫ్రాన్స్... అనుభవజ్ఞులతో రాటుదేలిన క్రొయేషియా! కప్పు నీదా నాదా అనేలా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెమార్ల గొప్పదనం కాదు.. మా ప్రతిభ చూడండి అంటు దూసుకొచ్చారు ఫ్రాన్స్ ఆశాకిరణాలు గ్రీజ్మన్, ఎంబాపె, క్రొయేషియా మొనగాళ్లు మోడ్రిచ్, పెరిసిచ్. నరాలు తెగే ఉత్కంఠను అధిగమించి వీరిలో మెరిసేదెవరో? తమ దేశానికి కప్ అందించేదెవరో? తేలేందుకు మరొక్క రోజే సమయం. చరిత్రకు ఎదురీది... ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఫేవరెట్లలో ఒకటిగా ఫ్రాన్స్ పేరు వినిపించినా ఏ మూలనో సందేహం! మెరికల్లాంటి ఆటగాళ్లున్నా కొన్నేళ్లుగా జట్టు తడబడుతుండటమే ఇందుకు కారణం. ఆతిథ్య దేశ హోదాలో, 1998లో ప్రస్తుత కోచ్ డైడర్ డెచాంప్స్ సారథ్యంలో, థియరీ హెన్రీ, జినెదిన్ జిదాన్ జోరుతో తొలిసారి టైటిల్ గెలిచిన ఫ్రాన్స్... 2002 కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. 2006లో రన్నరప్‌గా నిలిచినా, 2010లో గ్రూప్, 2014లో క్వార్టర్స్ అధిగమించలేకపోయింది. వీటన్నింటిని మించి సొంతగడ్డపై 2016 యూరో కప్‌ను పోర్చుగల్‌కు చేజార్చుకుంది. ఇంతటి అనిశ్చితి ఆట తీరుతోనే ఏమో... డెచాంప్స్ కూడా జట్టును సెమీస్ చేర్చితే చాలనుకున్నాడు. కానీ, దానిని మించి ముందుకెళ్లారు. యువతరంతో తొణికిసలాడుతున్న జట్టుకు, కెప్టెన్‌గా, కోచ్‌గా దేశానికి రెండుసార్లు కప్ అందించిన వాడిగా చరిత్రలో నిలిచేందుకు డెచాంప్స్కు ఇది సువర్ణావకాశమే. ఫ్రాన్స్ టైటిల్ కొట్టిన 1998లోనే... ఒక దేశం హోదాతో కప్‌లో ప్రవేశించిన క్రొయేషియా సెమీస్ చేరి పెను సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో దిగ్గజ జర్మనీని 3–0తో ఓడించినా, సెమీస్‌లో ఫ్రాన్స్‌కు 2–1తో తలొగ్గింది. అయితే, నెదర్లాండ్స్‌పై 2–1తో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. తర్వాతంతా పేలవ ప్రదర్శనే. మూడు కప్‌లలో (మధ్యలో 2010లో అర్హత పొందలేదు) గ్రూప్ దశ దాటలేదు. ప్రస్తుతం మాత్రం పదునైన ఆటతో ఫైనల్‌కు చేరింది. ఓ విధంగా జట్టు ఇప్పటికే చరిత్ర సృష్టించింది. మరో విధంగా రికార్డులకు ఎక్కే మహదావకాశం ముందుంది. పడుతూ లేస్తూ... లేచి పడుతూ! టోర్నీలో రెండు జట్లది పూర్తి భిన్న ప్రయాణం. లీగ్ దశలో ఆస్ట్రేలియా సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో గెలవగలిగిన ఫ్రాన్స్... తర్వాత పెరూపై 1–0తో బయట పడింది. డెన్మార్క్‌తో స్కోరేమీ లేకుండా ‘డ్రా’ చేసుకుంది. నాకౌట్లో మాత్రం జూలు విదిల్చింది. ప్రిక్వార్టర్స్‌లో 4–3తో అర్జెంటీనాను చిత్తు చేసి, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను 2–0తో సునాయాసంగా ఇంటికి పంపింది. సెమీస్‌లో ప్రమాదకర బెల్జియంకు పుంజుకునే అవకాశమే ఇవ్వకుండా 1–0తో ముగించింది. క్రొయేషియా మాత్రం నైజీరియాను 2–0తో, అర్జెంటీనాను 3–0తో, ఐస్లాండ్ను 2–1తో కొట్టేసి లీగ్‌లో అజేయంగా నిలిచింది. అయితే, నాకౌట్లో కిందామీదా పడింది. డెన్మార్క్, రష్యాలపై పెనాల్టీ షూటౌట్లలో, సెమీస్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌పై అదనపు సమయంలో గోల్‌తో ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు సార్లూ మ్యాచ్‌లో వెనుకబడినా... పుంజుకుని గెలుపొందడం క్రొయేషియా పోరాటం తీవ్రతను చాటుతోంది. రక్షణ శ్రేణి–మిడ్ ఫీల్డర్స్ మొండి రక్షణ శ్రేణితో ప్రత్యర్థికి పట్టు చిక్కనివ్వదు ఫ్రాన్స్. మిడ్ ఫీల్డర్ల దన్నుతో కడవరకు పోరాడుతుంది క్రొయేషియా. ఈ రెండింటి మధ్య మ్యాచ్, అదీ ఫైనల్ అంటే రసవత్తరంగా సాగడం ఖాయం. ఫ్రెంచ్ డిఫెండర్లు పవార్డ్, వరానె, ఉమ్టిటిలు కీలక సమయంలో కొట్టిన గోల్స్ టోర్నీలో ఆ జట్టుకు విజయాలు అందించాయి. క్రొయేషియా మిడ్ ఫీల్డర్లు ఇవాన్ రాకిటిచ్, కెప్టెన్ లూకా మోడ్రిచ్, బడెల్జ్లు ఎలాంటి పరిస్థితినైనా సమన్వయం చేయగల సమర్థులు. అయితే, ఆంటోన్ గ్రీజ్మన్, కిలియాన్ ఎంబాపె, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్, ఫెకిర్ వంటి మెరికల కలయికతో స్ట్రయికర్ల బలంలో మాజీ చాంపియన్‌దే కొంత పైచేయిగా ఉంది. ప్రత్యర్థి జట్టు స్ట్రయికర్లు ఇవాన్ పెరిసిచ్, మాన్‌జుకిచ్ సెమీస్‌లో గోల్స్ కొట్టి తామెంత ప్రమాదకారులమో చాటారు. వీరు తప్ప క్రమారిచ్, కలినిచ్, రెబిచ్లు పెద్దగా మెరవకపోవడం లోటు. ఫ్రాన్స్ మిడ్ఫీల్డ్లోని పోగ్బా, కాంటె, మటౌడి, క్రొయేషియా డిఫెండర్లలోని పివారిచ్, విదా, లొవ్రెన్ కూడా మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా ఉన్నవారే. మా ‘ఆకలి‘ తీరాలి... ఫ్రాన్స్ జట్టులోని యువ ఆటగాళ్లు ట్రోఫీని తాకాలని తహతహలాడుతున్నారు. 1998లో తమ దేశం కప్ గెలిచినపుడు వీరిలో చాలామంది ఐదేళ్లలోపు చిన్నారులే. అందుకేనేమో, ‘ఫైనల్లో ఆడటం చిన్ననాటి కల. అదిప్పుడు నెరవేరుతోంది. మేం టైటిల్‌కు దగ్గరగా వచ్చాం. ఈ మ్యాచ్ మాకు జీవితంతో సమానం’ అని మిడ్ ఫీల్డర్ మట్యుడి అంటున్నాడు. 2016 యూరో కప్ ఫైనల్లో ఓడిన అనుభవం పాఠాలు నేర్పిందని చెబుతున్నాడు. ఫ్రాన్స్ గోల్ కీపర్లు: లోరిస్, స్టీవ్ మండాండా, ఎరోలా డిఫెండర్లు: పవార్డ్, కింపెంబె, వరానె, ఉమ్టిటి, అదిల్, సిడిబి, హెర్నాండెజ్, మెండి. మిడ్ ఫీల్డర్లు: పోగ్బా, కాంటె, టొలిస్సొ, మట్యుడి, ఎంజొన్జి. ఫార్వర్డ్స్: గ్రీజ్మన్, లెమర్, గిరౌడ్, ఎంబాపె, డంబెల్, ఫెకిర్, థయువిన్. క్రొయేషియా గోల్ కీపర్లు: సుబాసిచ్, లివకోవిచ్, కలినిచ్. డిఫెండర్లు: వ్రసాల్కొ, స్టిరినిచ్, కొర్లుకా, లొవ్రెన్, జెడ్వాజ్, కలెట్ కార్, విదా, పివారిచ్. మిడ్ ఫీల్డర్లు: రకిటిచ్, కొవాసిచ్, మోడ్రిచ్, బ్రొజొవిచ్, బ్రడారిచ్, బడెల్జ్. ఫార్వర్డ్స్: పెరిసిచ్, క్రమారిచ్, కలినిచ్, మన్జుకిచ్, రెబిచ్, మార్కో జాకా. బలాన్నే నమ్ముకున్నాం మేం కఠిన మార్గంలో వచ్చాం. ఆడిన నిమిషాలను లెక్కిస్తే టోర్నీలో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడినట్లు లెక్క. బహుశా ఏ ప్రపంచ కప్‌లో ఏ జట్టుకూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. కష్టమైనదే అయినా ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. మేం బలాన్ని, ప్రేరణను నమ్ముకుని ముందుకెళ్తున్నాం. – క్రొయేషియా కోచ్ జాల్టొ ఇదో గొప్ప గౌరవం ఓ ఫుట్‌బాలర్‌కు ఇంతకంటే మించిన గొప్ప గౌరవం ఏమీ ఉండదు. మేం మొదటినుంచి నమ్ముకున్న నిశబ్దం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతలతోనే ఫైనల్‌కు శక్తి మేర సన్నద్ధమయ్యాం. క్రొయేషియా అనుభవం ఉన్న జట్టే. కానీ మేం ఇలాంటి అనుభవం ఉన్నవాటిని చాలా ఎదుర్కొన్నాం. ఆటగాడిగా శారీరక శ్రమ మాత్రమే ఉంటుంది. కోచ్‌గా మానసిక ఒత్తిడిని భరించాల్సి వస్తుంది. –ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ ►ఇటలీ, బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనాలలో ఏ ఒక్క జట్టూ లేకుండా జరుగుతున్న రెండో ఫైనల్ ఇది. 2010లో స్పెయిన్–నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఫైనల్ మొదటిది. ►ఫ్రాన్స్ కప్ గెలిస్తే రెండుసార్లు టైటిల్ కొట్టిన మూడో దేశంగా నిలుస్తుంది. ఉరుగ్వే (1930, 50), అర్జెంటీనా (1978, 86) రెండేసి సార్లు కప్ అందుకున్నాయి. ►ఫ్రాన్స్ టైటిల్ అందుకుంటే కెప్టెన్‌గా, కోచ్‌గా దేశానికి కప్ సాధించి పెట్టిన మూడో వ్యక్తిగా డెడర్ చాంప్స్ రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు మారియో జగాలో (బ్రెజిల్), ఫ్రాంజ్ బెకెన్‌బాయర్ (జర్మనీ) మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు. ►ఈసారి మొత్తం టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ గోల్స్ లేకుండా ముగిసింది. అది గ్రూప్ ‘సి’లో ప్రస్తుత ఫైనలిస్టు ఫ్రాన్స్... డెన్మార్క్ మధ్య జరిగిన మ్యాచ్ కావడం గమనార్హం. ►1998 కప్‌లో ఫ్రాన్స్... అరంగేట్ర క్రొయేషియా సెమీఫైనల్లో తలపడ్డాయి. నాడు లిలియన్ థురామ్ రెండు గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించాడు. తర్వాత ఫ్రెంచ్ జట్టు కప్‌నూ కైవసం చేసుకుంది. -
అదరగొడుతున్న వలస ఆటగాళ్లు!
మాస్కో : ఫిఫా ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారంతో ఈ మహాసంగ్రామం ముగియనుంది. 32 జట్లు..736 మంది ఆటగాళ్లు..11 నగరాల్లో.. 12 మైదానాలు..62 మ్యాచ్‌లతో 31 రోజులు పాటు జరిగిన ఈ సంగ్రామంలో యూరప్ దేశాలే పై చేయి సాధించాయి. అనూహ్యంగా ఫ్రాన్స్-క్రోయేషియా ఫైనల్‌కు చేరగా.. జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం ఫుట్‌బాల్ జట్ల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశమైంది. 11 మంది సభ్యులు గల ప్రతీ జట్టులో దాదాపు ఒక వలస ఆటగాడు ఉన్నాడు. ఇలా పుట్టిన దేశం తరపున కాకుండా ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు మొత్తం 98 మంది ఉన్నారు. వీరంతా ఫుట్‌బాల్‌పై ఉన్న పిచ్చితో తమ దేశం కాకపోయినా బరిలోకి దిగిన జట్టుకు ప్రాణం పెట్టి మరీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరి ఆటగాళ్ల తల్లితండ్రులు వలస వచ్చి స్థిరపడగా.. మరికొందరు ఆటకోసమే ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో జట్టులో ఏకంగా 61.5 శాతం మంది వలసవాదులు ఉండటం విశేషం. ఆ తర్వాతా మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్ జట్టులో 39.4శాతం మంది ఆటగాళ్లు.. యూరప్ దేశమైన పోర్చుగల్‌లో 32.1శాతం ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందినవారే కావడం గమనార్హం. ఇక బ్రెజిల్, జర్మనీ, మెక్సికోలతో పాటు కొన్ని జట్లలో మాత్రమే ఇలా వలస ఆటగాళ్లు లేరు. రోనాల్డో సైతం.. ఇక రీజినల్ ఫుట్‌బాల్ అసోసియేషన్లను పరిశీలిస్తే కాన్ఫడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్(సీఏఎఫ్)లో అత్యధికంగా వలస ఆటగాళ్లు ఉండగా.. యూరోపియన్ అసోసియేషన్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక నేషనల్ లీగ్స్‌ల్లో చాలా పేరున్న ఆటగాళ్లు సైతం ఇతర దేశాల లీగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్టియన్ రొనాల్డో సైతం లీగ్స్‌లో పాల్గొంటున్నాడు. పోర్చుగల్‌లో పుట్టి.. ఆదేశానికే ప్రాతినిథ్యం వహించే రొనాల్డో.. నేషనల్ లీగ్స్‌లో మాత్రం ఇంగ్లీష్, స్పానిష్ జట్లకు ప్రాతినిథ్య వహించాడు. గత తొమ్మిదేళ్లుగా రియల్ మాడ్రిడ్ క్లబ్(స్పెయిన్) తరపున ఆడుతున్న రొనాల్డోను తాజాగా ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్ దక్కించుకున్న విషయం తెలసిందే. ఈజిప్టుకు చెందిన మహ్మద్ సలహ్ సైతం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. అంతేగాకుండా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్స్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న తొలి ఈజిప్టియన్‌గా అతను గుర్తింపు పొందాడు. జాత్యహంకార దాడులు.. ఇతర దేశాల తరపున ఆడుతున్నా.. ఆటనే ప్రాణంగా భావించే ఆటగాళ్లు విజయం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. అయితే అనుకోకుండా ఆ జట్టు ఓడితే మాత్రమే అభిమానులు టార్గెట్ చేసెది వలస ఆటగాళ్లనే. ఇది మైగ్రెంట్ ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది. ఇలా స్విడిష్ మిడ్ ఫీల్డర్ జిమ్మీ డుర్మాజ్ జాత్యహంకర దాడులను ఎదుర్కొన్నాడు. జర్మనీకి ఫ్రికిక్ లభించే తప్పిదం చేసి తమ జట్టు ఓటమికి కారణం కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు దుమ్మెత్తి పోశారు. అస్సిరియన్ దంపతులకు జన్మించిన డుర్మాజ్ ఈ విమర్శలకు ఘటుగానే సమాధానమిచ్చాడు. ‘విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. నన్ను అసభ్య పదజాలంతో తిట్టినా పర్లేదు. కానీ ఇంతటితో ఆగకుండా నాకుటుంబాన్ని, నా పిల్లలను, తల్లితండ్రులను తిట్టడం ఏమిటి’ అని గట్టిగానే బదులిచ్చాడు. ఇక డుర్మాజ్కు స్విడిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సైతం మద్దతుగా నిలిచింది. చదవండి: ‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు? క్రొయేషియా.. మేనియా! మూడో స్థానం ఎవరిదో! -
క్రొయేషియా.. మేనియా!
జాగ్రెబ్: క్రొయేషియా.. 50 లక్షల జనాభా కూడా లేని ఈ దేశం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, దిగ్గజ జట్లను మట్టికరిపిస్తూ ఫైనల్ చేరి ఆ దేశ జట్టు పెను సంచలనమే సృష్టించింది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారం ఇంగ్లండ్‌ను సెమీఫైనల్లో ఓడించినప్పటి నుంచి నెటిజన్లు ఎక్కువగా అన్వేషిస్తున్నది క్రొయేషియా గురించే కావడం గమనార్హం. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ చిన్న దేశం గురించి కొన్ని వివరాలు.. పురాతన చారిత్రక నేపథ్యం.. ఆరు నుంచి 14వ శతాబ్దం వరకు క్రొయేషియన్లు అనేక ఒడిదుడుకులు చవిచూశారు. 1527లో ఒట్టోమన్ చక్రవర్తుల ఆక్రమణల నేపథ్యంలో క్రొయేషియన్ పార్లమెంట్ ఫెర్డినాండ్‌ను తమ అధినేతగా ఎన్నుకుంది. 1918 తొలి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత సెర్బ్‌లు, స్లోవియన్లతో కలిసి క్రొయేషియన్లు యుగోస్లావియా రాజ్యాన్ని స్థాపించారు. సొంతంగా దేశం ఏర్పాటు చేసుకోవాలన్న ఆకాంక్షల మధ్య తలెత్తిన గందరగోళ పరిస్థితుల్లో 1929లో రాజు అలెగ్జాండర్ పార్లమెంట్‌ను పక్కనపెట్టి నియంతృత్వ పాలన సాగించాడు. 1941, ఏప్రిల్ 6న జర్మనీ బలగాలు దాడిచేసి క్రొయేషియా రాజ్యాన్ని ఆక్రమించుకుని ఫాసిస్టు నాయకుడు ఉస్టేన్ నేతృత్వంలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత టిటో నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1980లో టిటో కన్ను మూశాక, 1989 నాటికి తూర్పు ఐరోపాలోని అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పాలన అంతమైంది. 1991లో క్రొయేషియన్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. క్రొయేషియా సరిహద్దుల్లో నివసిస్తున్న సెర్బ్ల రక్షణ పేరుతో యుగోస్లావియా సైన్యం దేశంలోకి చొచ్చుకురావడం సుదీర్ఘ యుద్ధానికి దారి తీసింది. 1992 జనవరి 15న క్రొయేషియాను ఐరోపా మండలి గుర్తించింది. ఎర్తుట్ ఒప్పందం వల్ల 1995లో ఆ యుద్ధం ముగిసింది. 1998 వరకు ఐరాస కింద ఉన్న తూర్పు స్లొవోనియాను క్రొయేషియాకు అప్పగించారు. 2009లో నాటో కూటమిలో, 2013లో ఐరోపా మండలిలో చేరింది. పొంచి ఉన్న సవాళ్లు.. ప్రస్తుతం క్రొయేషియా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వలసలతో పాటు యువతలో 43 శాతం నిరుద్యోగం దేశాన్ని పట్టిపీడిస్తోంది. కమ్యూనిజం నుంచి ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారీ విధానంవైపు అడుగులేస్తోంది. ఈయూ, ఐరాస, కౌన్సిల్ ఆఫ్ యూరోప్, నాటో, డబ్ల్యూటీవోలలో సభ్యదేశంగా కొనసాగుతోంది. ఐరాస శాంతి పరిరక్షక దళంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థలో సేవా, పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్–20 పర్యాటక ప్రాంతాల్లో క్రొయేషియా ఒకటిగా ఉంది. ఆసక్తికర విషయాలు... ► జనాభా: 41,63,968 (ఐరాస గణాంకాల ప్రకారం) ► జన సాంద్రత: చ.కి.మీకు 74 మంది ► వైశాల్యం: 55,960 చ.కి.మీ.లు ► పట్టణ జనాభా: 60.60 శాతం ► ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం (17–23 మంది మాత్రమే నివసిస్తారు) ‘హమ్’ ఇక్కడే ఉంది. ► అత్యంత సుందరమైన సూర్యాస్తమయాన్ని ఇక్కడి డాల్మేషియాలోని ‘జడర్’లో వీక్షించవచ్చు. ► ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘డాల్మేషియన్’ శునకాల మూలాలు 17వ శతాబ్దంలో ఇక్కడే బయటపడ్డాయి. ► క్రొయేషియాలో ఎనిమిది జాతీయ పార్కులు, 11 నేచర్ పార్కులు, రెండు నేచర్ రిజర్వులున్నాయి. ► హెచ్‌బీఓ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను డాల్మేషియన్ తీరంలో చిత్రీకరిస్తున్నారు. -
మూడో స్థానం ఎవరిదో!
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఓడిన వేదన నుంచి తేరుకుని, గౌరవప్రద స్థానంతో ప్రయాణం ముగించేందుకు బెల్జియం, ఇంగ్లండ్‌లకు ఓ అవకాశం. మూడో స్థానంలో నిలిచేదెవరో తేలేందుకు శనివారం ఇక్కడి సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియంలో రెండు జట్లు తలపడున్నాయి. టోర్నీలో ఒకే గ్రూప్ ‘జి’లో ఉన్న ఈ జట్లులీగ్ దశలో ఎదురుపడ్డాయి. మొత్తం లీగ్‌కే చివరిదైన ఆ మ్యాచ్‌లో బెల్జియం 1–0తో నెగ్గింది. రెండింటి చివరి ఘనత నాలుగే..! 1966 కప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్... 1990లో సెమీస్ చేరినా నాలుగో స్థానంతోనే సంతృప్తి పడింది. తర్వాత మరెప్పుడూ ఆ స్థాయి అందుకోలేదు. బెల్జియం కూడా 1986లో సెమీస్ చేరి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. కప్‌లో తమ రికార్డు మెరుగు పర్చుకోవడానికి ఓ విధంగా రెండింటికీ ఇదో అవకాశం. మరోవైపు టోర్నీ టాప్ గోల్ స్కోరర్ (6)గా ‘గోల్డెన్ బూట్’ రేసులో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌కు... ఈ సంఖ్యను మరింత పెంచుకునే వీలు దొరికింది. ఇంకొక్క గోల్ చేసినా 2002 (రొనాల్డొ, బ్రెజిల్–8 గోల్స్) తర్వాత అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడవుతాడు. ఒకవేళ కేన్ స్కోరు చేయలేకపోయి... బెల్జియం స్ట్రయికర్ రొమేలు లుకాకు రెండు గోల్స్ కొడితే ఇద్దరూ చెరో ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అందుకునేందుకు ముందువరుసలో ఉంటారు. బలాబలాల రీత్యా చూస్తే మ్యాచ్‌లో బెల్జియంకే కొంత మొగ్గు కనిపిస్తోంది. అయితే, ఫైనల్ చేరలేదన్న బాధను దిగమింగి, నిర్వేదాన్ని వీడి పునరుత్తేజంతో ఆడిన జట్టే విజేతగా నిలుస్తుంది. -
నంబర్‌వన్ దురదృష్టవంతుడు!
మాస్కో: ప్రపంచ కప్ ఆడే అవకాశం రావడమంటేనే గొప్ప ఘనత. అలాంటిది ఫైనల్ వరకు వెళ్లిన, అదృష్టం కలిసొస్తే విశ్వవిజేతగా కూడా నిలిచే జట్టులో భాగంగా ఉండి కూడా చేజేతులా దానిని పోగొట్టుకుంటే అతడిని ఏమంటారు? ఆ దురదృష్టం పేరు నికొలా కలినిక్. క్రొయేషియా తరఫున 41 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ ఫార్వర్డ్ 23 మంది సభ్యుల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా రష్యాకు వచ్చాడు. అయితే కాస్త పొగరు, మరికాస్త ఆవేశం కలగలిసి జట్టుకు దూరమయ్యాడు. టోర్నీలో భాగంగా నైజీరియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తొలి 11 మందిలో అతను లేడు. అయితే మ్యాచ్ మధ్యలో కలినిక్ను సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లమని కోచ్ జ్లాటో డాలిక్ ఆదేశించాడు. అయితే తన స్థాయికి సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లడం నామోషీ అంటూ అతను తిరస్కరించాడు. దాంతో చిర్రెత్తిన కోచ్ తర్వాతి రోజే కలినిక్ను ఇంటికి పంపించేశాడు. కాస్త ఓపిగ్గా ఉంటే నేడు జట్టు సంబరాల్లో భాగం కావాల్సినవాడు తన సహచరుల ఫైనల్‌ను టీవీలో చూడాల్సి వస్తోంది. ‘మీరెప్పుడూ కలినిక్లా చేయవద్దు’ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. -
సహజంగా ఆడితే వినోదం ఖాయం
ప్రపంచ కప్‌లో మూడో స్థానాన్ని నిర్ణయించే మ్యాచ్‌పై ఎవరికీ ఆసక్తి ఉండదు. సహజంగా తర్వాతి రోజు కప్ విజేతను తేల్చే పోటీ గురించే ప్రపంచం ఆలోచిస్తుంటుంది కాబట్టి శనివారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బెల్జియం–ఇంగ్లండ్ మ్యాచ్ కూడా ఇందుకు అతీతం కాదు. ఏదేమైనా ఈ రెండు జట్లు సెమీఫైనల్స్‌లో ఎలా ఆడాయో, ఎందుకు ప్రత్యర్థులను ఓడించలేక పోయాయో అందరికీ తెలుసు. బెల్జియం శక్తివంచన లేకుండా పోరాడినా ఫ్రాన్స్ దాని ఆటలను సాగనివ్వలేదు. క్రొయేషియాపై పరాజయం పాలైనా యువ ఇంగ్లండ్ జట్టు నన్ను ఆకట్టుకుంది. చాలామంది ఆటగాళ్లకు అనుభవం లేకున్నా, 28 ఏళ్ల అనంతరం సెమీస్ చేరడం ఘనతే. వారిని ఇది సానుకూల దృక్పథంలో ఉంచుతుంది. రక్షణాత్మకంగా ఆడినా గారెత్ సౌత్‌గేట్ (ఇంగ్లండ్ కోచ్) కుర్రాళ్లు ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించారు. స్కోరింగ్ అవకాశాలు సృష్టించుకుంటూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే వారికి కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సెమీస్ ఓటమి భారం నుంచి తేరుకుని పునరుత్తేజం పొంది మరో మ్యాచ్ ఆటడం కష్టమైనదే. అయినా ప్రత్యామ్నాయం లేదు. అప్పటికే నాకౌట్ చేరడంతో లీగ్ దశలో తలపడి నప్పుడు ఈ రెండు జట్లు సురక్షిత స్థితిలో ఉన్నాయి. శనివారం మాత్రం పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడతాయని భావిస్తున్నా. సహజంగా ఆడితే ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తమ ప్రతిభను సరైన తీరులో ప్రదర్శిస్తే మనం ఈ మ్యాచ్ నుంచి మంచి వినోదాన్ని ఆశించవచ్చు. -
‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం నలభై లక్షల జనాభా కలిగిన, అందులోనూ 1991లో స్వాతంత్య్రం సాధించిన క్రొయేషియా మొట్ట మొదటిసారి వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోవడం అసాధారణ విషయం. కేవలం 34 లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే, నాలుగు లక్షల లోపు జనాభా కలిగిన ఐస్లాండ్ క్రీడాకారులతో పోటాపోటీగా రాణించి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకోవడం క్రొయేషియా క్రీడాకారులకే దక్కిన అరుదైన గౌరవం. ఇంతటి చిన్న దేశాలు అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటున్నప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం ఇంతటి చిన్న దేశాలతోని ఎందుకు పోటీపడలేకపోతోందని, ఎందుకు ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాణించలేక పోతోందన్న ప్రశ్న తలెత్తక మానదు. ‘భారత్ నిద్రపోతున్న దిగ్గజం’ అని 2012లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించారు. ‘భారత్‌లో 130 కోట్ల జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్‌బాల్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్‌లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది’ అని బ్లాటర్ వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం’ ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్‌బాల్‌లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్‌కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్ వరల్డ్‌కప్ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్ ప్రస్తావన వస్తోంది. రాజకీయ నాయకులు, క్రీడా బోర్డులు చీఫ్‌లు అప్పటికప్పుడు నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారంటూ తలలు లెక్క పెట్టడం ద్వారా మంచి జాతీయ క్రీడాకారులను తయారు చేయలేం. దేశంలోని క్రీడా సంస్కృతిపైనే అది ఆధారపడి ఉంటుంది. భారత క్రీడాకారులు రాటుదేలి రాణించాలంటే సహజ నైపుణ్యంకన్నా మంచి వ్యవస్థలు ఎక్కువ అవసరం. ఆకర్షణీయమైన పథకాలకన్నా అకుంఠిత దీక్షతో కఠోర శ్రమ చేయడం ఎక్కువ అవసరం. 2017, అక్టోబర్ నెలలో అండర్–17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను భారత్ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్ వచ్చిందీ వెళ్లింది. భారత్ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్‌బాల్‌లో రాణించలేం. అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్‌లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉంది. దీని దృక్పథమే తలకిందులు. క్రీడాకారుల కోసం పైనుంచి కిందకు చూస్తోంది. అట్టడుగు లేదా గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించకుండా డబ్బు ఖర్చుతో కూడిన అతిపెద్ద లీగ్‌ల నిర్వహణపైనే దృష్టిని కేంద్రీకరిస్తోంది. క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది. క్రొయేషియా క్రీడాకారులు భలే రాణించారబ్బా! అంటూ అబ్బురపడితే మనకా క్రీడ అబ్బదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదోరోజు వారివలే మనమూ రాణిస్తామన్న ఆత్మవిశ్వాసంతో అడుగులేయాలనుకుంటే నిద్రమత్తు దానంతట అదే తొలగిపోతుంది. దిగ్గజం ఘీంకారం వినిపిస్తుంది. -
‘సెక్సీ’ అమ్మాయిలను జూమ్ చేస్తే..
మాస్కో : అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కెమెరాలతో జూమ్ చేస్తే చర్యలు తప్పవని ఫిఫా ప్రపంచకప్ నిర్వాహకులు బ్రాడ్కాస్టర్లను హెచ్చరించారు. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో బ్రాడ్కాస్టర్లు సెక్సీ అమ్మాయిలను పదేపదే చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని, దీనికి ఫిఫా వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే ఒక ఫుట్‌బాల్ ఆటలోనే కాకుండా అన్నీ క్రీడా టోర్నీల్లోను ఇలా అందమైన అమ్మాయిలను జూమ్ చేయడం టెలివిజన్ ప్రొడ్యూసర్లు ఓ అలవాటుగా మార్చుకున్నారు. ఈ తరహా సాంప్రదాయం 1970ల్లోనే మొదలైంది. దీనికి ఆద్యుడు అమెరికన్ టెలివిజన్ డైరెక్టర్ ఆండీ సిదారిస్. ఈ ఓల్డ్ మ్యాన్ క్రీడా టోర్నీల్లో ‘హానీ షాట్స్’ తీయడంపై ఆసక్తి కనబర్చేవాడు. ఇలా అమ్మాయిలను చూపించడం ఫుట్‌బాల్‌లోనే కాకుండా క్రికెట్‌లోను కనిపిస్తోంది. టెలివిజన్ల తీరుపై ఫిఫా బాస్ ఫెడెరికో అడెక్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిని ఫిఫా ఉపేక్షించబోదని, వీటిపై ఓ పాలసీ రూపొందించి ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నాడు. రష్యాలో అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షించటానికి ఫేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైరా పవర్ తెలిపారు. సెక్సీజమ్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓ సమస్యగా మారిందన్నారు. కొంత మంది ఆకతాయిలు సెక్సీ అమ్మాయిల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
రొనాల్డో ఎఫెక్ట్.. ఫియట్ కంపెనీకి షాక్
రోమ్ : ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను తమ యజమాని(ఆగ్నెల్లీ కుటుంబం- యువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ వాటాదారు) కొనుగోలు చేయడం పట్ల ఫియట్ కార్ల సిబ్బంది యూనియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. యూనియన్ లీడర్ లావోరో ప్రైవాటో మాట్లాడుతూ.. ‘ సంస్థను సమర్థవంతంగా నడిపించడానికి, అభివృద్ధి సాధించడానికి ఏళ్ల తరబడి ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. అయితే ఒక ఆటగాడి కోసం వందల మిలియన్ యూరోలు ఖర్చు చేయడం చూస్తుంటే కార్మికుల త్యాగాలకు విలువ లేదని అర్థమైంది. అందుకే ఎఫ్సీఏ, సీఎన్హెచ్ఐ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారని’ తెలిపారు. రొనాల్డో కోసం వెచ్చించిన డబ్బును ఉద్యోగ కల్పన కోసం ఖర్చు చేసి ఉంటే ఎంతో బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రచారం కోసమే... ప్రఖ్యాత కార్ల కంపెనీలు ఫెరారీ, ఫియట్, యువెంటస్ క్లబ్‌లకు మాతృసంస్థ అయిన ఎగ్జార్.. రొనాల్డోను కొనుగోలు చేయడం ద్వారా తమ మార్కెట్ వ్యాల్యూను పెంచుకోవాలని భావిస్తోంది. జీప్ లోగో కలిగి ఉన్న యువెంటస్ క్లబ్ జెర్సీని రొనాల్డో ధరించడం ద్వారా భారీ స్థాయిలో తమకు ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతోనే 10 కోట్ల 50 లక్షల యూరోలు(846 కోట్ల రూపాయలు) వెచ్చించినట్లు తెలిపింది. కాగా గత తొమ్మిదేళ్లుగా రియల్ మాడ్రిడ్ క్లబ్(స్పెయిన్) తరపున ఆడుతున్న రొనాల్డోను ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్ దక్కించుకున్న విషయం తెలసిందే. ఈ రెండు క్లబ్‌ల మధ్య కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం.. యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్ మాడ్రిడ్‌కు చెల్లించనుంది. అలాగే నాలుగేళ్ల పాటు యువెంటస్ తరపున ఆడనున్నందుకు గానూ రొనాల్డోకు సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున వేతనంగా లభిస్తాయని సమాచారం. -
ఇంగ్లండ్ ఇంటికి...
‘ఇట్స్ కమింగ్ హోమ్’...! ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఒక్కో విజయం సాధిస్తున్న కొద్దీ కప్పు తమదేనంటూ ఆ దేశంలో మార్మోగుతున్నదీ పాట. వారికిదో జాతీయ గీతమైపోయింది కూడా. జట్టు ఫైనల్‌కు చేరకముందే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జనం టీవీలకు అతుక్కుపోయారు. ఆ దేశ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్ అయితే... తమ దృష్టంతా భారత్‌తో వన్డే సిరీస్ మీద కాక ఫుట్‌బాల్ సెమీఫైనల్ పైనే ఉందన్నాడు. అభిమానులు మరింత ముందడుగేసి ఆదివారం వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ వేళలు మార్చాలని, సంబరాలు జరుపుకోవడానికి సోమవారం ఏకంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేసేశారు. కానీ ఈ కలంతా చెదిరింది. కలతే మిగిలింది. తమ చిన్న దేశానికీ ఒక జట్టుందని, అది ఈ స్థాయిలో ఆడుతుందని ఊహించని సగటు అభిమానికి క్రొయేషియా మాంచి కిక్ ఇచ్చింది. గోల్ మీద గోల్ కొట్టి లీగ్ దశలో అర్జెంటీనాను మట్టికరిపించి... ఒత్తిడిని ఓడించి డెన్మార్క్, రష్యాలను వరుసపెట్టి ‘పెనాల్టీ నాకౌట్’ చేసి... సెమీస్‌లో ఇంగ్లండ్‌పై శక్తికి మించి పోరాడి అద్భుతమే చేసింది. తమ చరిత్రలోనే గొప్పదనదగ్గ విజయంతో ప్రపంచ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. ఆదివారం టైటిల్ పోరులో ఫ్రాన్స్‌కు సవాల్ విసిరింది. మాస్కో :అంచనాలు లేకుండా వచ్చి, ఉత్కంఠను అధిగమిస్తూ ఒక్కో మ్యాచ్ నెగ్గుతూ వస్తున్న క్రొయేషియా... అంతే సంచలన రీతిలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిం ది. బుధవారం అర్ధరాత్రి ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఆ జట్టు 2–1 తేడాతో మాజీ చాంపియన్‌ను ఓడించి ఇంటికి పంపింది. అంతకుముందు రెండు పెనాల్టీ షూటౌట్ మ్యాచ్‌లు ఆడినా, ఈసారి యువకులతో నిండిన ప్రత్యర్థితో తలపడుతున్నా, కనీసం సబ్‌స్టిట్యూట్‌ను కూడా దింపకుండా ఏకబిగిన 90 నిమిషాల పాటు ఒకే జట్టును కొనసాగించిన క్రొయేషియా తమ శ్రమకు తగ్గ ఫలితం పొందింది. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన కీరన్ ట్రిప్పియర్ (5వ నిమిషం) ఇంగ్లండ్ ఖాతా తెరవగా..., ఇవాన్ పెరిసిచ్ (68వ ని.), మాన్‌జుకిచ్ (109వ ని.) గోల్స్ కొట్టి క్రొయేషియాకు విజయం అందించారు. ఆరంభంలోనే ఆధిక్యం ఇచ్చినా... వేలాదిగా హాజరైన అభిమానుల మద్దతు మధ్య మైదానంలో దిగిన ఇంగ్లండ్‌కు... అందుకు తగ్గట్లే ఆరంభంలోనే గోల్ దక్కింది. క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఫౌల్ చేయడంతో లభించిన ఫ్రీ కిక్‌ను ట్రిప్పియర్ 20 గజాల దూరం నుంచి నెట్లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీన్నుంచి తేరుకున్న క్రొయేషియా ప్రతి దాడులకు దిగింది. ఓ దశలో గోల్ చేసినంత పనిచేసింది. అయితే రక్షణ శ్రేణి లోపాలతో పదేపదే తప్పులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ చక్కటి అవకాశాన్ని జారవిడిచాడు. సరిగ్గా గోల్‌పోస్ట్ ముందున్న అతడు బంతిని నేర్పుగా నెట్లోకి కొట్టలేకపోయాడు. ఖాతా తెరిచి... విరుచుకుపడి ఇరు జట్ల ఆటగాళ్లు వెంటవెంటనే ఎల్లో కార్డులు ఎదుర్కొనడంతో రెండో భాగం పోటాపోటీగా ప్రారంభమైంది. గోల్‌పోస్ట్ ముందు కేన్‌కు దక్కిన మరో అవకాశాన్ని బంతిని పక్కకునెట్టి లోవ్రెన్ నిర్వీర్యం చేశాడు. బాక్స్ ఏరియా ఆవల చాలా చాన్స్‌లు దొరికినా వ్యూహంతో కదలక చేజార్చుకున్న క్రొయేషియా... ఎట్టకేలకు 68వ నిమిషంలో సఫలమైంది. సైమ్ వాల్జ్కో అందించిన క్రాస్‌ను పెరిసిచ్ పొరపాటు లేకుండా హెడర్‌తో నెట్లోకి చేర్చాడు. తర్వాత ఒక్కసారిగా ఆ జట్టు విజృంభించడంతో ఆటే మారిపోయింది. పదేపదే దాడులతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించింది. పెరిసిచ్ కొట్టిన ఓ షాట్ చివరి క్షణంలో గోల్ బార్‌ను తగిలి పక్కకు పోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోరు సమం కావడంతో అదనపు అరగంట తప్పలేదు. టోర్నీలో జట్టుకు వెన్నెముకలా నిలిచిన కీపర్ జోర్డాన్ పిక్ఫోర్డే ఈసారి ఉదాసీనతతో ఇంగ్లండ్ కొంపముంచాడు. సాధారణ పాస్‌తో బంతిని అందుకుని 109వ నిమిషంలో గోల్‌పోస్ట్ ముందుకు వచ్చిన మాన్‌జుకిచ్ కొట్టిన షాట్... పిక్‌ఫోర్డ్ నిర్లిప్తతతో నెట్లోకి వెళ్లిపోయింది. సబ్‌స్టిట్యూట్ అవకాశాలు అయిపోయి, గాయంతో ట్రిప్పర్ మైదానం వీడటంతో చివర్లో ఇంగ్లండ్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. మరో గోల్‌కు కూడా వీలు చిక్కకపోవడంతో ఆ జట్టు పరాజయ భారంతో మైదానం వీడింది. ►వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు. ఈ టోర్నీ మరో ఫైనలిస్టు ఫ్రాన్స్ 1998 వరల్డ్ కప్‌లో 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్ నెగ్గడం విశేషం. ►‘ఇట్స్ కమింగ్ హోమ్’ ఉంటూ ఉర్రూతలూగిన ఇంగ్లండ్ అభిమానులపై ప్రపంచ వ్యాప్తంగా వ్యంగ్య బాణాలు మొదలయ్యాయి. ‘ఎస్...ఇంగ్లండ్ కమింగ్ హోమ్’ అంటూ అన్ని వైపులనుంచి జనం విసుర్లతో విరుచుకు పడ్డారు. -
ఫిఫాలో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు షాక్
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పెనుసంచలనం. క్రొయేషియా తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫిఫా-2018 తుదిసమరానికి చేరింది. మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. ఆట 5వనిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు ట్రిపియర్ గోల్ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ లో సీన్ మారింది. క్రొయేషియా ప్లేయర్లు మైదానంలో చురుక్కుగా కదులుతూ ఇంగ్లండ్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. క్రొయేషియా ఆటగాడు పిరిసిక్ ఆట 68వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్‌లో ఇంగ్లండ్ కు షాకిచ్చింది క్రొయేషియా. 109వ నిమిషంలో క్రొయేషియా ప్లేయర్ మండూకిక్ గోల్ చేసి ఇంగ్లండ్ ఆశలను గల్లంతు చేశాడు. ఈ చిరస్మరణీయ విజయంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది. -
ఫ్రెంచ్ కిక్...
అసలు సమరంలో అనుభవమే గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ చేరిన బెల్జియం జట్టుకు మాజీ చాంపియన్ ఫ్రాన్స్ ఓటమి కిక్ ఇచ్చింది. దర్జాగా మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ తరఫున శామ్యూల్ ఏకైక గోల్ కొట్టి ఉండవచ్చు. ఈ ఒక్క గోల్‌తో ఫ్రాన్స్ గెలిచి ఉండొచ్చు. కానీ మ్యాచ్‌ను కంటికి రెప్పలా కాపాడింది మాత్రం కచ్చితంగా ఫ్రాన్స్ గోల్ కీపర్ హూగో లోరిసే. సెమీస్ చరిత్రను చెరిపేందుకు బెల్జి యం ముందు నుంచీ కష్టపడింది. ఆ పడిన కష్టం... లోరిస్ ‘గోడ’ను దాటి వెళ్లలేకపోయింది. మ్యాచ్‌లో ఇదొక్కటే తేడా! ఈ తేడానే ఫ్రాన్స్‌ను ‘చాంపియన్’ బరిలో ఉంచితే... బెల్జియంను మూడో స్థానం పోరాటానికి పంపింది. సెయింట్ పీటర్స్బర్గ్: ఫైనల్ దారిలో తొలి అడుగు పడింది. ఫ్రాన్స్ టైటిల్ వేటకు సిద్ధమైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మూడోసారి ‘ఫైనల్స్’ అర్హత సంపాదించింది. బెల్జియం కథ మళ్లీ సెమీఫైనల్‌కే పరిమితమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ 1–0 స్కోరుతో బెల్జియంపై విజయం సాధించింది. రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే శామ్యూల్ ఉమ్టిటి (51వ ని.) గోల్‌తో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది. బెల్జియం ఆటగాళ్లు గోల్ ప్రయత్నంలో విఫలమైనా... బరిలో దిగినప్పటి నుంచి చివరిదాకా కష్టపడ్డారు. ఫ్రాన్స్‌కు దీటుగా స్ట్రయికర్లు లక్ష్యంపై గురిపెట్టారు. కానీ ఈ ప్రయత్నంలో గోల్‌పోస్ట్ చేరిన ప్రతీసారి ప్రత్యర్థి గోల్‌కీపర్ లోరిస్ కళ్లు చెదిరే విన్యాసాలతో అడ్డుకున్నాడు. ఆట ఆరంభం నుంచి బెల్జియం బంతిపై పట్టుసాధించే పనిలో పడింది. 15వ నిమిషంలో స్ట్రయికర్ హజర్డ్ చేసిన తొలి ప్రయత్నం విఫలం కాగా... 21వ నిమిషంలో లోరిస్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా బెల్జియం బోణీ కొట్టేది. డిఫెండర్ అల్డర్విరెల్డ్ పెనాల్టీ బాక్స్‌లో కుడి వైపు నుంచి గోల్ పోస్ట్ ఎడమవైపు కొట్టిన మెరుపు షాట్‌ను లోరిస్ అంతే వేగంగా అద్భుతంగా డైవ్ చేస్తూ తప్పించాడు. మరోవైపు ఫ్రాన్స్ స్ట్రయికర్ల దాడుల్ని బెల్జియం గోల్‌కీపర్ కుర్టోయిస్ నిలువరించాడు. దీంతో గోల్ లేకుండా తొలి అర్ధభాగం ముగిసింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే ఫ్రాన్స్ విజయబావుటకు బీజం పడింది. 51వ నిమిషంలో ఫార్వర్డ్ గ్రీజ్మన్ కార్నర్ నుంచి కొట్టిన షాట్‌ను డిఫెండర్ ఉమ్టిటి హెడర్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రెంచ్ శిబిరం సంతోషంలో మునిగింది. 64వ నిమిషంలో బెల్జియం ఆటగాడు మెర్టెన్స్ ఇచ్చిన పాస్‌ను పెనాల్టీ బాక్స్‌లో ఉన్న అల్డర్విరెల్డ్ సూపర్ ఫాస్ట్‌గా తరలించేందుకు కొట్టిన హెడర్ షాట్ గురి తప్పింది. మళ్లీ 81వ నిమిషంలో హజర్డ్ స్టేడి యం సెంటర్ పాయింట్ నుంచి కొట్టిన లాంగ్ షాట్‌ను రెప్పపాటు సమయంలోనే లోరిస్ తప్పించాడు. బెల్జియం స్ట్రయికర్లు గురిపెట్టిన ప్రతీసారి లోరిస్ చాకచక్యంగా ఆపేశాడు. ఆధిక్యంలో ఇంగ్లండ్ క్రొయేషియాతో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆట మొదలైన ఐదో నిమిషంలోనే కీరన్ ట్రిపియర్ కళ్లు చెదిరేరీతిలో డైరెక్ట్ ఫ్రీ కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించడంతో ఇంగ్లండ్ ఖాతా తెరిచింది. -
ఇంగ్లండ్ గెలవాలి: సచిన్
హైదరాబాద్: ఫిఫా ప్రంపకప్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫ్రాన్ ఫైనల్ చేరుకోగా.. మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లండ్- క్రోయేషియా తలపడనున్నాయి. ఎవరికి అందని అంచనాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టే కప్పు గెలవాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. ట్విటర్ వేదికగా బ్రిటీష్ జట్టుకు మద్దతు తెలుపుతూ సచిన్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్, కేరళ బ్లాస్టర్ మేనేజర్ డేవిడ్ జేమ్స్‌ను ట్యాగ్ చేశాడు. ‘హాయ్ గాయ్స్, ఈ సారీ నేను పుట్‌బాల్‌లో ఇంగ్లండ్‌కు మద్దతు ఇస్తున్నాను.. కమాన్ ఇంగ్లండ్’ అంటూ సచిన్ వీడియోను చిత్రీకరించి పోస్ట్‌చేశారు. ఇప్పడా ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఇంగ్లండ్‌కు అభిమానుల మద్దతు మరింత పెరిగింది. ఇతర క్రీడలపై అభిమానం.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలపై అభిమానం ఎక్కువే. ఫుట్‌బాల్‌ను సచిన్ అమితంగా ఇష్టపడతాడు కాబట్టే ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమానిగా వ్యవహరిస్తూ ఫుట్‌బాల్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. టెన్సిస్‌ను కూడా ఇష్టపడే సచిన్ రోజర్ ఫెడరర్‌కు వీరాభిమాని. దేశంలో కబడ్డీని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్‌ను కొనుగోలు చేశారు. Come on England!! #FIFA18@JamosFoundation pic.twitter.com/S9PZ9EWQHk — Sachin Tendulkar (@sachin_rt) July 11, 2018 -
‘మా విజయం.. థాయ్ బాలలకు అంకితం’
సెయింట్ పీటర్స్బర్గ్: థాయ్‌లాండ్‌లో గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించిన సహాయక బృందంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. థాయలాండ్ ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇక ఫిఫా ప్రపంచకప్ సెమీస్‌లో బెల్జియంపై 0-1 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని గుహలో చిక్కుకున్న థాయ్ బాలలకు అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు పాల్ పొగ్బా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ‘మా విజయం ఈ రోజు హీరోలుగా నిలిచిన బాలలకు అంకితం. వెల్డన్ బాయ్స్.. మీరెంతో ధైర్యవంతులు’ అని పేర్కొంటూ ఆ బాలల ఫొటోలను ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను తెగఆకట్టుకుంటోంది. పాల్పొగ్బాను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో గుహలో చిక్కుకున్న చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 18 రోజుల నరకయాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, వారి కోచ్ జూన్ 23న థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలోకి వెళ్లి, భారీ వర్షాల కారణంగా బయటకు వచ్చే దారి మొత్తం పూర్తిగా నిండిపోవడంతో, గుహలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. This victory goes to the heroes of the day, well done boys, you are so strong 🙏🏾 #thaicaverescue #chiangrai pic.twitter.com/05wysCSuVy — Paul Pogba (@paulpogba) July 10, 2018 -
ఫ్రాన్స్ అభిమానుల సంబరాలకు పోలీసులు బ్రేక్
-
ఫ్యాన్స్ సంబరాలు.. పోలీసుల దాడి
సెయింట్ పీటర్స్బర్గ్ : ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో బెల్జియంను 0-1తేడాతో ఓడించి ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇక 12 ఏళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్‌కు చేరడంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారీ సంఖ్యలో అభిమానులు ప్యారిస్ వీధుల్లో రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే భారీ ఎత్తున క్రాకర్స్, బాణసంచా కాల్చడమే కాకుండా, బారీ కేడ్స్ అడ్డం పెట్టి సోఫాలపై కూర్చున్నారు. దీంతో అప్రమత్తమైన రియోట్ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తిరగబడ్డారు. దీంతో టియర్ గ్యాస్‌ను ఉపయోగించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మైదానంలో మరికొద్దీ సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
అందరిని థ్రిల్ చేస్తున్న ఫుట్‌బాల్ గోల్
-
వారెవ్వా ఏం గోల్.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్ !
హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంటే.. కొద్దీ సేపు ఆ టోర్నీనే మరిచిపొమ్మంటున్నాడు.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. క్రికెట్ వీడ్కోలు అనంతరం ట్విటర్ వేదికగా కొత్త కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఢిల్లీ ఆటగాడు తనదైన సెటైరిక్ ట్వీట్స్‌తో ప్రతి విషయంపై స్పందిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా ఫిఫా ఫీవర్‌తో ఊగిపోతుంటే.. దానికి సంబంధించే ఓ వీడియోను ట్వీట్ చేశాడు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా.. ‘ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్రొయేషియాలను మరిచిపోండి.. ఇతన్ని చూడండి’ అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పెద్దాయన కొట్టిన గోల్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను ఫుట్‌బాల్ మైదానంలో ఆ గోల్ సాధించలేదు. రోడ్డు పై నుంచి బంతిని నేరుగా ఓ ఇంటి కిటికీలో పంపించాడు. అయితే ఈ గోల్ అందరిని థ్రిల్ చేస్తోంది. దీంతో ఇది తెగ వైరల్ అయ్యింది. ఇక బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. Forget France , England, Croatia, here is the man #FRABEL pic.twitter.com/pzBkC4LNTn — Virender Sehwag (@virendersehwag) July 11, 2018 -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్
సెయింట్ పీటర్స్బర్గ్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను మట్టికరిపించిన ఫ్రాన్స్.. సెమీస్‌లో అదే ఉత్సాహంతో బెల్జియంను ఓడించింది. దీంతో టైటిల్‌ను అందుకోవాలన్న బెల్జియం ఆశలు ఆవిరయ్యాయి. ఇరు జట్లు హోరా హోరీగా పోరాడటంతో తొలి అర్ధభాగం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ప్రత్యర్థులిద్దరూ చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే 51వ నిమిషంలో గ్రీజ్మన్ కొట్టిన కార్నర్ క్రాస్ షాట్‌ను శామ్యూల్ ఉమ్టిటి అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో బెల్జియం గోల్ కోసం విపరీతంగా ప్రయత్నించినా ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ వారికి అడ్డుగోడలా నిలబడ్డాడు. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 1998లో విజేతగా నిలిచిన ఆ జట్టు 2006లో రన్నరప్‌గా నిలిచింది. నేడు ఇంగ్లండ్, క్రొయేషియా తలపడే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్ ఫైనల్ ఆడనుంది. ఇక మూడో స్థానం కోసం ఓడిన జట్టుతో బెల్జియం తలపడనుంది. -
12 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు ఫ్రాన్స్
-
రొనాల్డో ఇక యువెంటస్ క్లబ్‌కు
మాడ్రిడ్: పోర్చుగల్ కెప్టెన్, స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో... ఇకపై ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు ఆడనున్నాడు. గత తొమ్మిదేళ్లుగా అతడు స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఆడుతున్నాడు. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో నాలుగేళ్లపాటు యువెంటస్‌కు ఆడతాడు. సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున రొనాల్డోకు వేతనంగా లభిస్తాయని సమాచారం. ఒదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్ మాడ్రిడ్‌కు చెలిస్తుందని స్పెయిన్ మీడియా వెల్లడించింది. తాజా మార్పుపై రొనాల్డో స్పందిస్తూ... ‘మాడ్రిడ్‌కు ఆడిన సమయం నా జీవితంలో అత్యంత సంతోషకరమైనది. జట్టు, అభిమానులు, నగరానికి నా ధన్యవాదాలు. కొత్త అధ్యాయం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అందుకే బదిలీకి అంగీకరించమని కోరా. మద్దతుదారులంతా అర్ధం చేసుకోగలరు’ అని పేర్కొన్నాడు. రొనాల్డో ప్రాతినిధ్యంలో... రియల్ మాడ్రిడ్ ఈ సీజన్లో చాంపియన్స్ లీగ్‌ను గెల్చుకుంది. -
ఆ జట్టుకు బలమైన పరీక్ష
తీవ్ర మానసిక ఒత్తిడిని భరిస్తూ వరుసగా రెండు పెనాల్టీ షూటౌట్ మ్యాచ్‌ల్లో గెలవడం ఆషామాషీ కాదు. 1990 ప్రపంచ కప్ స్వీయానుభవంతో చెబుతున్నా... నాడు నా సారథ్యంలోని అర్జెంటీనా క్వార్టర్స్‌లో యుగోస్లేవియాను, సెమీస్‌లో ఇటలీని పెనాల్టీలోనే ఓడించింది. ఇప్పుడు క్రొయేషియాదీ ఇదే పరిస్థితి. 240 నిమిషాల పాటు నాకౌట్ మ్యాచ్‌లు ఆడటం, అందులోనూ షూటౌట్ అంటే ఆ ఒత్తిడి చెప్పలేనిది. జర్మనీతో 1990 కప్ ఫైనల్లో మేమిలాంటి ప్రభావానికే గురయ్యాం. నాడు మేం పెనాల్టీ కిక్‌తో కప్‌ను సమర్పించుకున్నాం. మా ఆటగాళ్లు ఇద్దరు రెడ్ కార్డులకు గురయ్యారు. ఓడినా విశ్వ ప్రయత్నం చేశాం. నాతోపాటు అభిమానులూ దీనిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. క్రొయేషియాను సరిగ్గా ఇదే ఇబ్బంది పెడుతుందని ఇదంతా చెబుతున్నా. దీనిని అధిగమించాలంటే సెమీస్‌కు ముందు మూడు రోజుల విరామంలో ఆ జట్టు పునరుత్తేజం కావాలి. ఫైనల్‌కు అతి దగ్గరగా వచ్చిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవాలని అనుకోరు. ప్రి క్వార్టర్స్‌లో పెనాల్టీతోనే గట్టెక్కినా 90 నిమిషాల్లో క్వార్టర్ ఫైనల్‌ను ముగించిన ఇంగ్లండ్ కుర్రాళ్లు తాజాగా ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య సామీప్యత కనిపిస్తోంది. ఇంగ్లండ్ గోల్స్‌లో ఎక్కువ శాతం పథకం ప్రకారం బంతిని బాక్స్ ఏరియాలోకి పంపి హెడర్‌తో సాధించినవే. నిబద్ధతతోపాటు సాను కూల దృక్పథంతో భీకరంగా పోరాడే క్రొయేషియా డిఫెండర్లంటే నాకిష్టం. ప్రాథమిక అంశాల్లో బలంగా ఉంటూ, స్థాన బలంతో వారు చాలా మ్యాచ్‌లను గాడినపెట్టారు. కానీ, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంగ్లండ్‌పై ఒత్తిడిని ఎదుర్కొని నిలవడం క్రొయేషియాకు బలమైన పరీక్ష. -
ఈనాటికైనా తీరేనా... ఈ నిరీక్షణ?
ఇంగ్లండ్... మంచి జట్టనే ముద్రతో ఎన్నోసార్లు ప్రపంచ కప్ బరిలో దిగింది. కానీ 1966లో చాంపియన్‌గా నిలవడం, 1990లో సెమీస్ చేరడం తప్ప మిగతాదంతా సాదాసీదా ప్రదర్శనే. ఇప్పుడు సైతం భారీ అంచనాల్లేకుండానే వచ్చింది. అయితే, ఒక్కో మ్యాచ్ గట్టెక్కుతూ కప్‌నకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. హ్యారీ కేన్లాంటి యువ సారథి ఆధ్వర్యంలో 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సువర్ణావకాశం ముందుంది. క్రొయేషియా... పెద్ద విశ్లేషణలు కూడా అవసరం లేని జట్టు. 1998లో అరంగేట్రంలోనే మూడో స్థానంలో నిలిచినా, తర్వాత కనీసం గ్రూప్ దశ దాటలేదు. ఈసారి మాత్రం లూకా మోడ్రిక్ సారథ్యంలో అసాధారణ పోరాటంతో ఆకట్టుకుంటోంది. లీగ్ దశలో అర్జెంటీనా లాంటి జట్టునే 3–0తో చిత్తుగా ఓడించింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లను తట్టుకుని మరీ సెమీస్ గడప తొక్కింది. మరో రెండు అడుగులు దిగ్విజయంగా వేస్తే చాలు... పట్టుమని 40 లక్షల జనాభా అయినా లేని తమ చిన్న దేశం కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది. ... బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో, చరిత్రకు చేరువలో ఉన్న ఈ రెండు జట్లలో ఏది నెగ్గుతుందో చూద్దాం.! మాస్కో: ప్రస్తుత ప్రపంచకప్‌లో టాప్ గోల్ స్కోరర్, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ వయసు 24 ఏళ్లు. తమ జట్టు చివరిసారిగా ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆడినపుడు అతడు పుట్టనే లేదు. కేన్ ఒక్కడే కాదు జట్టులోని 23 మందిలో 17 మంది ఆటగాళ్లు 1990 తర్వాత జన్మించినవారే. ఇప్పటికే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చి తమ ప్రత్యేకత చాటుకుందీ నవతరం. సంచలనాల క్రొయేషియాతో బుధవారం జరిగే సెమీఫైనల్లో నెగ్గితే చరిత్ర సృష్టించే అవకాశం ముంగిట నిలుస్తుంది. మరోవైపు ఆఖరి క్షణం వరకు పోరాడుతున్న క్రొయేషియాకూ ఇదో మహదవకాశమే. లీగ్ దశలో అజేయంగా నిలిచి... ‘పెనాల్టీ నాకౌట్’లను తట్టుకుని 20 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో అడుగిడిందీ జట్టు. ఈ నేపథ్యంలో విజయం కోసం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ‘హరికేన్’ను నిలువరిస్తేనే... ఓ పద్ధతి ప్రకారం ప్రత్యర్థుల శిబిరంలోకి చొచ్చుకెళ్లి గోల్స్ చేస్తూ మ్యాచ్‌లను గెలుస్తోంది ఇంగ్లండ్. చివరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియంపై పరాజయం, ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్లో నెగ్గినా, క్వార్టర్స్‌లో స్వీడన్‌ను తేలిగ్గా ఓడించింది. దాడులను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ హ్యారీ కేన్ జట్టుకు పెద్ద బలం. ఇతడికి లిన్‌గార్డ్, డెలె అల్లీ తోడైతే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. అయితే, ఇప్పటివరకు ఇంగ్లండ్ ప్రత్యర్థికి కనీసం ఒక గోల్ అయినా ఇస్తూ వస్తోంది. కొలంబియాతో మ్యాచ్‌లో కేన్ ఆధిక్యం సాధించి పెట్టినా, చివరి క్షణాల్లో ఆధిక్యం చేజార్చుకుని ఇబ్బంది పడింది. క్రొయేషియాకు ఇదే విధంగా అవకా శం ఇస్తే కోలుకోవడం కష్టమవుతుంది. కేన్‌ను ప్రత్యర్థులు నిలువరిస్తే... లిన్‌గార్డ్, మగ్యురె, అల్లీ బాధ్య తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారిద్దరితోనే ప్రమాదం... సాకర్ సమరంలో క్రొయేషియా ఇక్కడి వరకు వచ్చిందంటే కెప్టెన్ లూకా మోడ్రిక్, ఇవాన్ రాకిటిక్ల అసాధారణ ఆటే కారణం. ముఖ్యంగా మోడ్రిక్ దూకుడుకు అర్జెంటీనానే బెంబేలెత్తింది. ఇతడికి రాకిటిక్ నుంచి చక్కని సహకారం అందుతోంది. అటాకింగ్ మిడ్ ఫీల్డర్లయిన వీరు అద్భుత సమన్వయంతో గోల్స్ చేయడంతో పాటు స్ట్రయికర్ల పనిని సులువు చేస్తున్నారు. దీంతో జట్టుకు అదనపు బలం చేకూరుతోంది. వరుసగా రెండో పెనాల్టీ షూటౌట్లోనూ నెగ్గిన జట్టు తమ పోరాటతత్వం ఏ స్థాయిలో ఉందో చాటింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఆటగాళ్లు మానసికంగా అలసిపోయి సెమీస్‌లో ఇదే ప్రతిబంధకంగా మారే ప్రమాదం కూడా ఉంది. సెమీస్ చేరాయిలా... క్రొయేషియా నైజీరియాపై 2–0తో గెలుపు అర్జెంటీనాపై 3–0తో విజయం ఐస్లాండ్పై 2–1తో గెలుపు ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై షూటౌట్లో 3–2తో గెలుపు క్వార్టర్స్‌లో రష్యాపై షూటౌట్లో 4–3తో గెలుపు ఇంగ్లండ్ ట్యునీషియాపై 2–1తో గెలుపు పనామాపై 6–1తో విజయం బెల్జియం చేతిలో 0–1తో పరాజయం ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాపై షూటౌట్లో 4–3తో గెలుపు క్వార్టర్స్‌లో 2–0తో స్వీడన్‌పై జయభేరి -
బ్రెజిల్ జట్టుకు ఘోర అవమానం
బ్రాసిలియా: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలై కోట్లాది మంది హృదయాలను గాయపరిచిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం ఎదురైంది. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లతో దాడి చేశారు. రాళ్లు విసిరి హంగామా చేశారు. గత ప్రపంచకప్‌లో జర్మనీ చేతిలో 7-1తో బ్రెజిల్ ఓటమి పాలు కాగా, ఆ గాయం అభిమాలను వేధిస్తుండగానే ఈసారి బెల్జియం చేతిలో బ్రెజిల్‌కు పరాభవం ఎదురైంది. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న బ్రెజిల్ అభిమానలు తమ జట్టుకు గుడ్లతో దాడి చేసి స్వాగతం పలికారు. ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన అభిమానులు బస్సును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. దీంతో రాళ్ల దాడి నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
బ్రెజిల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం
-
‘మా ఫైనల్ మ్యాచ్ సమయాన్ని మార్చేది లేదు’
లండన్: వచ్చే ఆదివారం జరుగనున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయీస్ స్పష్టం చేశారు. ఆ సింగిల్స్ ఫైనల్ లండన్‌లో ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు మొదలుకానుంది. అయితే అదేరోజు సాయంత్రం 4 గంటలకు (యూకే సమయం ప్రకారం) ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఒకవేళ బుధవారంనాటి సెమీస్‌లో క్రొయేషియాపై ఇంగ్లండ్ గెలిచి తుదిపోరుకు చేరితే.. ఆదివారం నాడు అటు ప్రపంచ కప్ ఫైనల్.. ఇటు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ సమాంతరంగా జరుగుతాయి. దాంతో.. రెండు మ్యాచ్‌లను తిలకించడం ఎలా అన్న వాదనను క్రీడా ప్రేమికులు, ఫుట్‌బాల్ అభిమానులు లేవనెత్తుతున్నారు. ఈనేపథ్యంలో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సమయాన్ని మార్చాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ రిచర్డ్ మాత్రం ‘సంప్రదాయం ప్రకారం రెండు గంటలకే ఫైనల్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఆ టైమ్‌కే నిర్వహిస్తాం’ అని కుండబద్దలుకొట్టారు. -
సమఉజ్జీల సమరమిది
ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఒక్క దక్షిణ అమెరికా జట్టు కూడా లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. నిజానికి బ్రెజిల్, ఉరుగ్వే ముందుకు వెళ్లాల్సింది. అయితే బ్రెజిల్ పలు అవకాశాలు చేజార్చుకోగా, మ్యాచ్‌లో కోలుకుంటున్న సమయంలో గోల్‌కీపర్ చేసిన తప్పిదం ఉరుగ్వే ఆట ముగించింది. మాకు పొరుగు దేశాలైన రెండు జట్లను ఓడించిన టీమ్‌లు ఇప్పుడు తొలి సెమీఫైనల్లో తలపడబోతున్నాయి. సొంతగడ్డపై 2016 యూరో ఫైనల్లో ఓడిన చేదు జ్ఞాపకాలను తుడిచేయాలని భావిస్తున్న ఫ్రాన్స్ ఇప్పుడు అన్ని రంగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. దృక్పథంలో కొంత తేడా ఉన్నా, బెల్జియం కూడా అంతే బలంగా ఉంది. మా జట్టు చేతిలో1986లో సెమీఫైనల్లో, 2014లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన బెల్జియం జట్టులో ఈసారి పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే మున్ముందు కఠినమైన ‘డ్రా’ ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసినా బెల్జియం జాగ్రత్తగా ఆడి రెండో స్థానానికి పరిమితం కావాలని చూడలేదు. పెద్ద జట్లను ఎదుర్కోగల సత్తా తమలో ఉందని భావిస్తున్న ఆ టీమ్ ఎక్కడా తగ్గలేదు. ఫ్రాన్స్ మొదటి నుంచి కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే తరహా ఆటనే చూపిస్తోంది. ముఖ్యంగా కైలియాన్ ఎంబాపె వేగాన్ని, ఆంటోనీ గ్రీజ్మన్ స్ట్రయికింగ్ నైపుణ్యాన్ని ఆ జట్టు నమ్ముకుంది. దీంతో పోలిస్తే బెల్జియం ముందుగా చొరవ చూపించకుండా ఏదైనా జరిగితే అప్పటి పరిస్థితికి అనుగుణంగా ప్రతిస్పందించాలనే తరహా ఆట ఆడుతోంది. జట్టులో రొమెలు లుకాకులాంటి మెరుపు ఆటగాడికి హజార్డ్, డి బ్రూయిన్ తోడుగా ఉన్నారు. అయితే ఫ్రాన్స్ నుంచి ఆ జట్టుకు కొంత భిన్నమైన పరీక్ష ఎదురు కానుంది. కాసిమెరో లేకపోవడంతో మిడ్‌ఫీల్డ్‌లో బ్రెజిల్‌పై బెల్జియంకు మంచి పట్టు చిక్కింది. కానీ పాల్ పోగ్బా, ఎన్గొలో కాంటో వారికి ఆ అవకాశం ఇవ్వరు. కొత్త వ్యూహంతో బ్రెజిల్‌ను బెల్జియం ఓడించడంపై చాలా చర్చ జరుగుతోందని నాకు తెలుసు. టోర్నీ కీలక దశలో ఇలా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ నా దృష్టిలో వ్యూహాన్ని ఎంత బాగా అమలు చేశారన్నదే ముఖ్యం. వ్యూహాలు, ఆలోచనలు సరే కానీ ఇలాంటి మ్యాచ్‌లు నెగ్గాలంటే ఎంతో సాహసం, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. అటు వనరులకు కొదవ లేని, స్ఫూర్తివంతమైన జట్టు ఫ్రాన్స్ ఉండటంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటాక్, డిఫెన్స్, మిడ్‌ఫీల్డ్ అన్నింటిలో దాదాపు సమంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల గోల్‌కీపర్లు కూడా ఎంతో ప్రతిభావంతులు. కాబట్టి ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం. అయితే ఎలాగైనా గెలవాలనే కసి మాత్రమే ఇద్దరిలో ఒకరిని విజేతగా నిలుపుతుంది. నా దృష్టిలో దీనిని ‘మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్’గా చెప్పగలను. -
చిలుక జోస్యం కాదు.. ఎలుగుబంటి జోస్యం!
క్రస్లోయార్స్క్: చిలక జోస్యం సంగతేమో కానీ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రాగానే ప్రతీ జంతువుకు జ్యోతిష్య హోదా కట్టబెట్టేస్తున్నట్లున్నారు! ఆక్టోపస్ నుంచి మొదలు పెడితే పిల్లి, డాల్ఫిన్, పంది వరకు అన్ని జంతువులు వరల్డ్ కప్ విన్నర్ ఎవరో తేల్చేస్తున్నాయి. తాజాగా ఈ కోవలో ఎలుగు బంటి కూడా చేరింది. ‘పామిర్’ పేరు గల 11 ఏళ్ల తెల్ల ఎలుగు బంటి ఇప్పుడు బరిలోకి దిగింది. మంగళవారం జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి బెల్జియం విజేతగా నిలుస్తుందని పామిర్ చెబుతోంది. ఈ రెండు దేశాల జాతీయ పతాకాలు ముద్రించిన రెండు క్యాన్లను దీని ముందు ఉంచారు. వీటిలో బెల్జియంను పామిర్ ఎంచుకుంది. వీటిలో ఎన్ని నిజ్జంగా నిజం అయ్యాయనేది పక్కన పెడితే ‘వార్ ఆఫ్ వరల్డ్ కప్ ఎనిమల్స్’గా మారిపోయిందనేది మాత్రం చెప్పవచ్చు. -
బెల్జియం Vs ఫ్రాన్స్: ఫైనల్ చేరేదెవరు?
వేగంలో సమఉజ్జీలు... దాడుల్లో దీటైనవారు... రక్షణ శ్రేణిలో దుర్భేద్యులు... పోరాటంలో పోటాపోటీ! ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో తలపడనున్న ఫ్రాన్స్– బెల్జియం జట్ల ప్రదర్శనను విశ్లేషిస్తే ఇలానే ఉంటుంది. అన్ని విభాగాల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉన్న రెండింటి మధ్య ‘మాజీ చాంపియన్’ హోదా ఒక్కటే తేడా. 1998లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్... తర్వాత పడుతూ లేస్తూ ప్రయాణం సాగి స్తోంది. ఈసారి గ్రీజ్మన్ వంటి ఆటగాడికి ఎంబాపెలాంటి మెరిక తోడవడంతో ఆటతీరుతోపాటు జట్టు రాతే మారిపోయింది. లీగ్ దశలో సాధారణంగానే కనిపించినా నాకౌట్లో దుమ్ము దులిపేస్తోంది. ఇక 1986లో సెమీస్ చేరడమే ఈ మెగా టోర్నీలో బెల్జియంకు అత్యుత్తమం. ఇప్పుడు మాత్రం ముందునుంచి ఉన్న అంచనాలు నిలబెట్టుకుంటూ సంచలనా త్మకంగా ఆడుతోంది. రొమేలు లుకాకు, ఈడెన్ హజార్డ్, డి బ్రుయెన్ల త్రయం ముందు ఎంతటి ప్రత్యర్థైనా వణకాల్సిందే. ఈ నేపథ్యంలో సెమీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సెయింట్ పీటర్స్బర్గ్: రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ విజేతగా నిలవాలనే పంతంతో ఫ్రాన్స్! ‘గోల్డెన్ జనరేషన్’ ఆటగాళ్లతో ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కప్పు కొట్టలేమన్న పట్టుదలతో బెల్జియం! లీగ్ దశను అజేయంగా ముగించి, నాకౌట్లో ప్రత్యర్థులను పిండి చేసిన ఈ రెండు జట్లు మంగళవారం అర్ధరాత్రి ఇక్కడి సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియంలో తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఏ ఒక్కరి ప్రదర్శన మీదనో ఆధారపడకుండా, దూకుడే మంత్రంగా ఆడుతూ, బలా బలాల్లోనూ సమతూకంతో కనిపిస్తున్నందున ఈ మ్యాచ్‌లో ప్రేక్షకులకు మంచి పోరాటాన్ని వీక్షించే అవకాశం కలగనుంది. వీరి పోరాటం చూడండి... డి బ్రుయెన్ కాంటె బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో 20 గజాల దూరం నుంచి బెల్జియం ఆటగాడు డి బ్రుయెన్ కొట్టిన గోల్ చూస్తే ఔరా అనాల్సిందే. కచ్చితమైన పాస్‌లు ఇతడి ప్రత్యేకత. మరోవైపు కాంటె... ప్రపంచంలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం తన గొప్పతనం. మరి వీరిలో ఎవరు మిడ్ ఫీల్డ్‌లో మెరుస్తారో? లుకాకు (Vs) వరానె, ఉమ్టిటి టోర్నీలో నాలుగు గోల్స్ కొట్టడంతో పాటు సహచరులకు అవకాశాలు సృష్టిస్తున్నాడు బెల్జియం ఫార్వర్డ్ రొమేలు లుకాకు. మరోవైపు ప్రత్యర్థుల గోల్ అవకాశాలను నీరుగార్చడంలో ఫ్రాన్స్ సెంట్రల్ డిఫెన్స్ ఆటగాళ్లు వరానె, ఉమ్టిటి సిద్ధహస్తులు. క్వార్టర్స్‌లో ఉరుగ్వే స్టార్ సురెజ్‌ను వీరు కట్టిపడేశారు. ఈ ద్వయాన్ని దాటడం లుకాకుకు చిక్కుముడే. వెర్టాంగెన్(Vs) ఎంబాపె, గ్రీజ్మన్ బెల్జియం రక్షణ త్రయంలో కీలకం వెర్టాంగెన్. ఎడమ వైపున ఉండే ఇతడు డిపెండబుల్ ఆటగాడు. ఫ్రాన్స్ చిరుతలు గ్రీజ్మన్, ఎంబాపెలను నిలువరించడం తనకు పెద్ద పరీక్ష కానుంది. ఎంబాపె మిడ్ ఫీల్డ్ నుంచి వేగంగా పరిగెడుతూ ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాను ఎలా పడగొట్టాడో అందరూ చూశారు. ఇక గ్రీజ్మన్ గోల్ కొట్టాడంటే ఆ మ్యాచ్‌లో ఇప్పటిదాకా ఫ్రాన్స్‌కు పరాజయమన్నది ఎదురుకాలేదు. అనుభవజ్ఞుడైన వెర్టాంగెన్... ఈసారి గ్రీజ్మన్, ఎంబాపెలను ఎలా నిలువరిస్తాడో? హజార్డ్(Vs) పవార్డ్ ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడుతున్నాడు బెల్జియం కెప్టెన్ ఈడెన్ హజార్డ్. దాడులతో పాటు చురుకైన కదలికలకు పెట్టింది పేరు. క్వార్టర్స్‌లో బ్రెజిల్ ఇతడి ధాటికి వెనుకంజ వేసింది. రైట్ బ్యాక్‌లో తనకు ఫ్రాన్స్ యువ కెరటం పవార్డ్తో పోటీ తప్పదు. 22 ఏళ్ల పవార్డ్... ప్రి క్వార్టర్స్‌లో అర్జెంటీనాపై కీలక సమయంలో గోల్ కొట్టాడు. లోరిస్(Vs) కోర్టొయిస్ ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో గోల్ ఇచ్చి విమర్శల పాలైన ఫ్రాన్స్ గోల్‌కీపర్ హ్యుగో లోరిస్... తర్వాత తేరుకుని అడ్డుగోడలా మారాడు. ఉరుగ్వేపై అతడి ఆటే దీనికి నిదర్శనం. బెల్జియం పొడగరి కోర్టొయిస్... అగ్రశ్రేణి కీపర్. బ్రెజిల్‌తో క్వార్టర్స్‌లో నెమార్ షాట్‌ను కొనవేళ్లతో పైకి పంపి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. సెమీస్ చేరాయిలా... ఫ్రాన్స్ ►ఆస్ట్రేలియాపై 2–1తో గెలుపు ►పెరూపై 1–0తో విజయం ►డెన్మార్క్‌తో 0–0తో డ్రా ►ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై 4–3తో విజయం ►క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 2–0తో జయభేరి బెల్జియం ►పనామాపై 3–0తో గెలుపు ►ట్యూనీషియాపై 5–2తో విజయం ►ఇంగ్లండ్‌పై 1–0తో గెలుపు ►ప్రి క్వార్టర్స్‌లో 3–2తో జపాన్‌పై విజయం ►క్వార్టర్స్‌లో 2–1తో బ్రెజిల్‌పై జయభేరి హెన్రీ... నువ్వు సరైన పక్షాన లేవు బెల్జియం సహాయ కోచ్ థియరీ హెన్రీ ఫ్రాన్స్ ఒకనాటి మేటి ఫుట్‌బాలర్. కెప్టెన్ డెచాంప్స్, జినెదిన్ జిదాన్తో కలిసి 1998లో దేశానికి కప్ అందించాడు. ప్రస్తుతం బెల్జియం విజయాల్లో అతడి పాత్ర విస్మరించలేనిది. దీంతో హెన్రీని లక్ష్యంగా చేసుకుని ఫ్రాన్స్ వాగ్బాణాలు సంధిస్తోంది. అతడు సరైన పక్షాన నిలవలేదని ఎత్తిపొడుస్తోంది. మరో చిత్రమేమంటే... ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్–బెల్జియం చివరిసారిగా తలపడింది 1986లో. మూడో స్థానం కోసం సాగిన ఆ పోరులో ఫ్రాన్స్ 4–2 తేడాతో గెలుపొందింది. బెల్జియం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ జట్టుకిదే ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన. తర్వాత 8 అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో బెల్జియం రెండింటిలో నెగ్గింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఫ్రాన్స్, బెల్జియం జట్లు 73 మ్యాచ్‌ల్లో ముఖాముఖీ తలపడ్డాయి. ఫ్రాన్స్ 24 మ్యాచ్‌ల్లో... బెల్జియం 30 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో 19 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
ప్రధాని ఎదుట అధ్యక్షురాలి సంబరాలు!
సోచీ: ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య రష్యా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణీత సమయంలో(అదనపు సమయంతో కలుపుకుని) రష్యా, క్రొయేషియా జట్లు తలో రెండు గోల్స్ చేశాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్లో క్రొయేషియా 4-3తో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వరల్డ్‌కప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మెగా టోర్నీలో క్రొయేషియా జట్టు మరో సెమీస్‌కు చేరడంతో ఆ దేశ ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిక్ ఆనందానికైతే అవధుల్లేవు. క్రొయేషియా జెర్సీ ధరించి మరీ తమ దేశ ఆటగాళ్లకు ఆమె మద్దతు తెలిపారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆమె.. క్రొయేషియా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న తర్వాత ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రష్యా ప్రధానమంత్రి దిమిత్రి మెద్వెదేవ్ ఎదురుగానే ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ప్రధాని ఎదుట అధ్యక్షురాలి సంబరాలు!
-
క్రొయేషియా కొట్టేసింది
పోరు చివరిదాకా రసవత్తరంగా జరిగింది. ఆతిథ్య జట్టు ఆడుతుంది కాబట్టి ఫిష్ట్ స్టేడియం హోరెత్తింది. ఇరు జట్లు రెండు సార్లు సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణీత సమయంలో రష్యా, క్రొయేషియా చెరో గోల్ చేశాయి. అదనపు సమయంలోనూ ఒక్కో గోల్ చేశాయి. 2–2తో స్కోరు సమం కావడంతో షూటౌట్ తప్పలేదు. రష్యా ఆటగాళ్లు వెనుకబడితే క్రొయేషియా 4–3తో మ్యాచ్‌ను, సెమీస్ చాన్స్‌నూ కొట్టేసింది. సొచి: రష్యా ఆడినంతసేపూ బాగా ఆడింది. ఈ క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా కంటే ముందే గోల్ చేసింది. అదనపు సమయం దాకా దీటుగా బదులిచ్చింది. అదనపు సమయం ఒక దశలో 2–1తో గెలుస్తుందనుకున్న క్రొయేషియాను చివరి నిమిషాల్లో గోల్ చేసి 2–2తో మళ్లీ నిలువరించింది. కానీ షూటౌటే ఆతిథ్య జట్టు కొంపముంచింది. ఇద్దరు ఆటగాళ్లు షూటౌట్ ఒత్తిడిలో చిత్తవడంతో చివరకు క్రొయేషియా 4–3తో విజయం సాధించింది. రష్యా తరఫున డెనిస్ చెరిషెవ్ (31వ ని.), మరియో ఫెర్నాండెస్ (115వ ని.) చెరో గోల్ చేయగా... క్రొయేషియా తరఫున అండ్రెజ్ క్రామరిక్ (39వ ని.), డొమగొజ్ విదా (100వ ని.) గోల్ చేశారు. అయితే షూటౌట్లో రష్యా జట్టులో స్మొలొవ్తో పాటు ఫెర్నాండెస్ విఫలం కాగా జగొయెవ్, ఇగ్నాషెవిచ్, కుజియయెవ్ గోల్ సాధించారు. క్రొయేషియాలో మటే కొవసిక్ మినహా బ్రొజొవిక్, మోడ్రిక్, విదా, రకిటిక్ గోల్ చేయడంతో ఆ జట్టు సెమీస్ చేరింది. బుధవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో క్రొయేషియా తలపడుతుంది. ప్రపంచకప్‌లో క్రొయేషియా సెమీస్ చేరడం ఇది రెండోసారి. 1998లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆరంభం నుంచి రష్యా జాగ్రత్తగా ఆడింది. క్రొయేషియా స్ట్రయికర్లను నిలువరిస్తూ కదంతొక్కింది. బంతి చాలావరకు క్రొయేషియా ఆధీనంలోనే ఉన్నా... వారి దాడుల్ని గోల్పోస్ట్దాకా రానివ్వకుండా రష్యా అడ్డుకుంది. దీంతో అరగంట దాకా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆ మరుసటి నిమిషంలో రష్యా మిడ్‌ఫీల్డర్ చెరిషెవ్ (31వ ని.) పెనాల్టీ బాక్స్‌కు సమీపంలో 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. కానీ 8 నిమిషాల వ్యవధిలోనే క్రొయేషియా స్కోరు సమం చేసింది.రష్యా డిఫెండర్లను ఛేదిస్తూ మడ్జుకిచ్ ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ క్రామరిక్ (39వ ని.) హెడర్ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు తమ దాడులకు పదును పెట్టినప్పటికీ ఎవరు సఫలం కాలేదు. బంతి పదేపదే క్రొయేషియా ఆధీనంలోకి వెళ్లినా... ప్రత్యర్థి లక్ష్యంపై గురిపెట్టడంలో రష్యా ఆటగాళ్లు కూడా ఆకట్టుకున్నారు. 13 షాట్లు ఆడిన రష్యా ఐదు సార్లు లక్ష్యంపై గురిపెట్టగా... క్రొయేషియా 18 షాట్లలో కేవలం మూడు సార్లు లక్ష్యం దిశగా ఆడింది. అదనపు సమయం మొదలైన పది నిమిషాలకు క్రొయేషియా తరఫున విదా (100వ ని.) హెడర్ గోల్ చేయగా, ఇక మ్యాచ్ ముగిసే చివరి క్షణాల్లో ఫెర్నాండెస్ (115వ ని.) కూడా హెడర్తోనే గోల్ చేసి రష్యాకు ఊపిరి పోశాడు. దీంతో 2–2తో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. -
ఫిఫా ప్రపంచకప్: రష్యా కథ ముగిసింది
సమరా: ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఫిఫా 2018 వరల్డ్ కప్ నాకౌట్ సమరంలో ఆతిథ్య జట్టు రష్యా పోరాటం అనూహ్యంగా ముగిసింది. దీంతో ఆ దేశ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం నాలుగో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్టు పెనాల్టీ షూటౌట్లో 3-4 గోల్స్ తేడాతో క్రొయేషియాతో చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్లు రెండేసి గోల్స్ చేయడంతో స్కోర్ మ్యాచ్ డ్రా అయింది. రష్యా తరుపున డెనిస్ చెరిషెవ్ 31వ నిమిషంలో, మారియో ఫెర్నాండేజ్ 115వ నిమిషంలో గోల్స్ సాధించారు. క్రొయేషియా తరపున ఆండ్రెజ్ 39వ నిమిషంలో, డోమాగ్ విడా 100 నిమిషంలో గోల్స్ చేశారు. నాటకీయంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమయాన్ని పెంచినా ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ షూటౌట్లో రష్యా తొలి పెనాల్టీ కిక్‌ను చేజార్చుకోని ఒత్తిడికి లోనైంది. ఇలా రెండు సార్లు పెనాల్టీ షూటౌట్‌ను రష్యా వృథా చేయగా, క్రొయేషియా నాలుగు పెనాల్టీ గోల్స్ సాధించడంతో సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక సెమీస్‌లో క్రొయేషియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా క్వార్టర్ ఫైనల్లోనే దక్షిణ అమెరికా జట్లకు షాక్ తగలడంతో నాలుగు యూరప్ జట్లు సెమీస్‌కు చేరాయి. -
ఇంగ్లండ్ జిగేల్
ఫేవరెట్‌గా బరిలో దిగిన సందర్భాల్లోనూ... డేవిడ్ బెక్‌హామ్, వేన్ రూనీల హయాంలోనూ సాధ్యం కాని దానిని... యువ హ్యారీ కేన్ సారథ్యంలోని ఇంగ్లండ్ సాధించింది. తమకు మింగుడు పడని ప్రత్యర్థి అయిన స్వీడన్‌ను క్వార్టర్ ఫైనల్లో అలవోకగా ఓడించింది. మొదటి భాగం, రెండో భాగంలో ‘తల’మానికమైన గోల్స్‌తో 1990 తర్వాత తొలిసారి ప్రపంచ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సమారా: ఇప్పటివరకు వేర్వేరు టోర్నీల్లో 24 సార్లు స్వీడన్‌తో తలపడిన ఇంగ్లండ్ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడింది. 9 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. ఈ గణాంకాలు చాలు... వీటి మధ్య చిరకాల పోరాట తీవ్రతను చాటేందుకు. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో రెండు జట్లు ఎదురుపడటంతో అందరూ మరోసారి పోటాపోటీ తప్పదనుకున్నారు. కానీ, ఇంగ్లండ్ దాడి ముందు స్వీడన్ నిలవలేకపోయింది. కనీస ప్రతిఘటన చూపలేక చేతులెత్తేసింది. హ్యారీ మగ్యురె (30 నిమిషం), డెలె అల్లీ (59వ ని.)ల హెడర్ గోల్స్‌తో శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2–0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. 1990 తర్వాత ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్వీడన్ పొడిచేస్తుందనుకుంటే! ఓపికగా ఆడి పట్టు సాధించే ఇంగ్లండ్ మ్యాచ్‌లో అదే వ్యూహం మేరకు ఫలితం పొందగా, రక్షణాత్మక శైలితో దాడులకు దిగే స్వీడన్ మాత్రంఎవరూ ఊహించని పేలవ ప్రదర్శనతో లొంగిపోయింది. రెండు జట్లు పట్టుదలగా ఆడటంతో మ్యాచ్ సమంగానే ప్రారంభమైంది. అప్పటికీ ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ గోల్ ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. అయితే, 30వ నిమిషంలో ఎడమ వైపు నుంచి ఆష్లి యంగ్ కొట్టిన లాఫ్టెడ్ కార్నర్‌ను ఆటగాళ్లందరి మధ్యలో అందుకున్న డిఫెండర్ మగ్యురె... హెడర్‌తో నెట్లోకి పంపి స్కోరు చేశాడు. రహీమ్ స్టెర్లింగ్, కీరన్ ట్రిప్పర్ల సమన్వయంతో ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. అంతకుముందు స్టెర్లింగ్కే రెండు గోల్ అవకాశాలు వచ్చినా అవి లక్ష్యం చేరలేదు. మొదటి భాగంలో చిన్న పొరపాట్లతో వెనుకంజ వేసిన స్వీడన్... రెండోభాగంలో ప్రభావవంతంగా ఆడే తమ లక్షణాన్ని కూడా ప్రదర్శించలేదు. స్ట్రయికర్ మార్కస్ బెర్గ్ చక్కటి షాట్‌ను డైవ్‌తో అందుకున్న ఇంగ్లండ్ కీపర్ పిక్‌ఫోర్డ్ ఆసాంతం అడ్డుగోడలా నిలిచాడు. ఇంతలోనే ఇంగ్లండ్‌కు రెండో గోల్ దక్కింది. బాక్స్ నుంచి లిన్‌గార్డ్ ఇచ్చిన క్రాస్‌ను అందుకున్న అల్లీ సులువుగా తలతో గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టును 2–0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ ఇంకో 20 నిమిషాలు ఉందనగానే స్వీడన్ ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసినట్లు కనిపించారు. ఇదే అదనుగా పట్టు నిలబెట్టుకునేలా ప్రత్యర్థిపై ఇంగ్లండ్ దాడులు పెంచింది. స్వీడన్ చివర్లో ముగ్గురు సబ్స్టిట్యూట్లను దింపినా... ఉపయోగం లేకపోయింది. మ్యాచ్ మొత్తంలో స్వీడన్ మూడుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌పై గురి చూసి షాట్లు కొట్టింది. రష్యా, క్రొయేషియా జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. -
బ్రెజిల్ ఢమాల్
మాజీ చాంపియన్లకు ఈ ప్రపంచకప్ ఓ పీడకలేనేమో! లీగ్ దశలో జర్మనీ..! ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, స్పెయిన్..! క్వార్టర్స్‌లో ఉరుగ్వే, బ్రెజిల్..! ఇలా ఒక్కోటి వరుసగా ఇంటి ముఖం పడుతున్నాయి! ఇందులో మిగతావాటి సంగతెలా ఉన్నా... ఐదుసార్లు విజేతైన బ్రెజిల్‌ది మాత్రం స్వయంకృతమే. టోర్నీలో భీకరంగా ఆడకపోయినా, పుంజుకుంటున్నట్లు కనిపించిన సాంబా జట్టు... నాకౌట్ మ్యాచ్‌ల్లో చేయకూడని పొరపాటు చేసి బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. అంతకు కొన్ని గంటల క్రితమే ఉరుగ్వే నిష్క్ర మించగా, బ్రెజిల్ కూడా వెనుదిరగడంతో వరుసగా నాలుగోసారి సైతం కప్ యూరప్ దేశాల ఖాతాలో చేరడం ఖాయమైంది. కజన్: అసలే ప్రత్యర్థి జోరుమీదుంది. ఏమాత్రం వీలు చిక్కినా మింగేసేలా ఆడుతోంది. అలాంటి దానికి పైచేయి సాధించే అవకాశం ఇస్తే ఇంకేమైనా ఉంటుందా? బెల్జియంతో శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ఇలాగే ఆడి చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. మ్యాచ్‌లో బంతిపై 57 శాతం నియంత్రణ కనబర్చినా, ప్రత్యర్థి కంటే రెండు రెట్లు దాడులు ఎక్కువగానే చేసినా... ఫెర్నాండిన్హో (13వ నిమిషం) సెల్ఫ్ గోలే సాంబా బృందం కొంపముంచింది. ఆత్మరక్షణలో పడిన ఆ జట్టును... బెల్జియం మిడ్ ఫీల్డర్ డి బ్రుయెన్ (31వ ని.) రెండో గోల్తోమరింత దెబ్బకొట్టాడు. ప్రథమార్ధంలోనే 2–0తో వెనుకబడిన బ్రెజిల్‌కు ఆగస్టొ (76వ ని.) స్కోరు అందించినా, తర్వాత తీవ్రంగా ప్రతిఘటించినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో స్టార్ ఆటగాడు నెమార్ కొట్టిన షాట్‌ను రెడ్ డెవిల్స్ కీపర్ కోర్టొయిస్ చేతి కొనవేళ్లతో గోల్ పోస్ట్ పైకి పంపి... మాజీ చాంపియన్‌ను ఇంటి దారి పట్టించాడు. అదే దెబ్బకొట్టింది... ప్రారంభంలోనే బ్రెజిల్ డిఫెండర్ థియాగో సిల్వా కొట్టిన షాట్... గోల్ బార్ సమీపం నుంచి వెళ్లింది. సాంబా ఆటగాళ్ల దూకుడుతో బెల్జియం వెనుకంజ వేసింది. అయితే, 13వ నిమిషంలో ఆ జట్టుకే అదృష్టం కలిసొచ్చింది. విసెంట్ కంపానీ కార్నర్ కిక్‌ను తప్పించే క్రమంలో ఫెర్నాండిన్హో బంతిని తమ గోల్ పోస్ట్లోకే కొట్టుకున్నాడు. ఊహించని ఈ పరిణామాన్ని బ్రెజిల్ చాలాసేపు జీర్ణించుకోలేకపోయింది. ఆధిక్యం దక్కిన ఆనందంలో బెల్జియం ప్రతిదాడులతో ఒత్తిడి పెంచింది. డి బ్రుయెన్ పాస్‌ల నైపుణ్యం, లుకాకు వేగం, ఈడెన్ హజార్డ్ టెక్నిక్‌తో ప్రత్యర్థిని కట్టి పడేశారు. బ్రెజిల్ నష్ట నివారణకు చూస్తుండగా... 31వ నిమిషయంలో డి బ్రుయెన్ బుల్లెట్ షాట్‌తో ‘రెడ్ డెవిల్స్’కు గోల్ అందించాడు. ప్రత్యర్థులను తప్పిస్తూ మైదానం మధ్య నుంచి లుకాకు అందించిన పాస్‌ను... డి బ్రుయెన్ 20 గజాల దూరం నుంచి లక్ష్యానికి చేర్చాడు. రెండోభాగంలో బ్రెజిల్ తాడోపేడో అన్నట్లు ఆడింది. అయితే, నెమార్‌ను బెల్జియం కట్టడి చేసింది. దీంతో ఆగస్టొను సబ్‌స్టిట్యూట్‌గా పంపింది. 76వ నిమిషంలో కౌటిన్హొ క్రాస్ షాట్‌ను అతడు హెడర్ ద్వారా నెట్లోకి పంపి ఖాతా తెరిచాడు. సమయం ముగియనుండటంతో సాంబా జట్టు వరుసపెట్టి దాడులకు దిగినా గోల్ మాత్రం చేయలేకపోయింది. ►వరుసగా నాలుగో ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో యూరోప్ జట్టు చేతిలో బ్రెజిల్ ఓడిపోయింది. 2006లో ఫ్రాన్స్ చేతిలో... 2010లో నెదర్లాండ్స్ చేతిలో... 2014లో జర్మనీ చేతిలో ఓడింది. ►ప్రస్తుత ప్రపంచకప్‌లో బెల్జియం తరఫున తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు గోల్ చేశారు. 2006లో ఇటలీ, 1982లో ఫ్రాన్స్ తరఫున అత్యధికంగా పది మంది వేర్వేరు ఆటగాళ్లు గోల్ చేశారు. ►ప్రపంచకప్ చరిత్రలో బెల్జియం సెమీఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. తొలిసారి 1986లో సెమీస్ చేరిన ఆ జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. ►ఓవరాల్‌గా బ్రెజిల్‌పై బెల్జియం నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 1963లో ఒకే ఒక్కసారి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను బెల్జియం ఓడించింది. -
ఫిఫా 2018; సెమీస్‌కు ఇంగ్లండ్
సమరా: నాటకీయంగా సాగుతోన్న ఫిఫా 2018 వరల్డ్ కప్ నాకౌట్ దశలో నేడు మరో సంచలనం చోటుచేసుకుంది. ఎప్పుడో 1966లో కప్ గెలుచుకుని, ఇటీవల కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన బ్రిటిష్ జట్టు ఈ సారి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సమారా ఎరీనా వేదికగా శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో స్వీడన్‌పై 0-2 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత బ్రిటిష్ జట్టు సెమీస్‌కు చేరడంతో అభిమానుల అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రారంభం నుంచే ఆధిపత్యం: ఆట మొదలైన 30వ నిమిషంలోనే ఇంగ్లండ్ తొలిగోల్ సాధించింది. డిఫెండర్ హ్యారీ చాకచక్యంగా తలతో బంతిని స్వీడన్ గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. 0-1 ఆధిపత్యంతో సెకండ్ హాఫ్లోనూ బ్రిటిషర్లు రెచ్చిపోయారు. 59వ నిమిషంలో డేల్ అల్లీ చేసిన గోల్‌తో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-0కు పెరిగింది. ఎక్స్ట్రా ఇంజూరీ టైమ్‌లోనూ స్వీడన్ గోల్ చేయలేకపోవడంతో గెలుపు ఇంగ్లండ్ వశమైపోయింది. గెట్ రెడీ: చాన్నాళ్లకు ట్రోఫీకి చాలా దగ్గరగా వెళ్లిన ఇంగ్లండ్.. సెమీస్‌లో ఎవరితో తలపడనుందో మరికాసేపట్లో తేలిపోనుంది. నాలుగో క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా ఆతిథ్య రష్యా.. క్రొయేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఉరుగ్వేపై ఫ్రాన్స్, బ్రెజిల్‌పై బెల్జియంలు విజయం సాధించి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్-బెల్జియంల మధ్య తొలి సెమీస్ జులై 10న జరుగనుంది. -
ఫిఫా వరల్డ్ కప్: ఓటమితో ‘చావు’ బెదిరింపులు
బాగోట: ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓడి ఇంటిదారి పట్టిన కొలంబియా ఆటగాళ్లకు అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా పెనాల్టీ షూటౌట్లో గోల్స్ చేయడంలో విఫలమై జట్టు ఓటమికి కారణమైన కొలంబియా ఆటగాళ్లు మాటీస్, కార్లోస్ బాకాను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ‘కార్లోస్.. నిన్ను ద్వేషిస్తున్నా. మీ అందరిపై ద్వేషంతో ఉన్నా. నీ ఉదాసీనత, నీ ఆటలో లోపం, జంతువును సూచించే నీ పేరు (స్పానిష్‌లో బాకా అంటే ఆవు). ఇలా అన్నింటినీ ద్వేషిస్తున్నా’ అని ఓ అభిమాని ట్విట్టర్లో పోస్టు చేశాడు. మాటీస్ను ఉద్దేశించి.. ‘నువ్వు చనిపోతావనే నమ్మకం ఉంది’ అని మరో అభిమాని తెలిపాడు. ‘మాటీస్కు అదే చివరి మ్యాచ్. ఎందుకంటే అతను ఇప్పటికే చనిపోయాడు’ అని వేరొక అభిమాని పేర్కొన్నాడు. మరొకవైపు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ‘బాకా, మాటీస్ చనిపోవాలని కోరుకోకండి. గతంలో ఆండ్రూస్ ఎస్కోబార్‌కు జరిగిందే మళ్లీ పునరావృతం కావాలని అనుకుంటున్నారా? ఇది కొలంబియానేనా?’ అని ఇంకో అభిమాని పోస్టు చేశాడు. 1994 ప్రపంచకప్‌లో యుఎస్‌తో మ్యాచ్‌లో సెల్ఫ్‌గోల్ కొట్టినందుకు కొలంబియా వీధుల్లో ఆండ్రూస్‌ను కాల్చిచంపారు. దాంతో ప్రస్తుత హత్యా బెదిరింపులు కొలంబియా ఫుట్‌బాల్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
పెను సంచలనం.. బ్రెజిల్ అవుట్
ఫిఫా వరల్డ్‌కప్ 2018లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. హాట్ ఫెవరేట్ బ్రెజిల్ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కజస్ ఏరెనా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 2-1 తేడాతో సాంబా జట్టు ఘోర పరాభవం చవిచూసింది. దీంతో టోర్నీలో బ్రెజిల్ కథ ముగియగా, బెల్జియం సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే సెమీస్‌లో ఫ్రాన్స్‌తో బెల్జియం తలపడనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ రెండు జట్లకే నా ఓటు
విశ్లేషించాల్సిన జట్ల సంఖ్య తగ్గిపోయి ప్రపంచ కప్ పోటా పోటీ దశకు వచ్చేసింది. తమదైన పంథాలో ఆడిన ఈ జట్లన్నీ క్వార్టర్స్ చేరేందుకు అర్హమైనవే. కాగితంపై ఒక్క పేరుతో ఓ జట్టు ప్రత్యర్థి కంటే బలంగా కనిపించవచ్చు. కానీ మైదానంలో ఆ తేడా లెక్కలోకి రాదు. ఒకరినొకరు అధిగమించాలనే కాంక్ష ప్రతి జట్టులో ఉండటం సాధారణం. ఇప్పటివరకు చూస్తే స్వీడన్‌పై ఇంగ్లండ్‌కు, రష్యాపై క్రొయేషియాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. వారి దాడుల్లో అదనపు మెరుపు కనిపిస్తోంది. ఈ కప్‌లో అంచనాలన్నీ గల్లంతవుతున్నాయి కాబట్టి... క్వార్టర్స్‌లో విజేతలెవరో కచ్చితంగా చెప్పలేం. గారెత్ సౌత్ గేట్ శిక్షణలో ఇంగ్లండ్ రంజింపజేసేలా ఆడుతోంది. సమతూకంతోనూ ఉంది. 3–1–4–2 వ్యూహంతో బలంగానూ కనిపిస్తోంది. 52 ఏళ్ల తర్వాత కప్‌ను అందుకోవాలని ఆశిస్తోంది. క్రమశిక్షణతో ఆడుతున్న ఆ జట్టులో ఎక్కువ మంది యువకులే. సూపర్ స్టార్లెవరూ లేరు. వీరంతా ఆశలు రేకెత్తిస్తున్నారు. దాడులపైనే వారు దృష్టి పెడుతున్నారు. ప్రపంచ కప్‌లో గతంలో తమ జట్లు సాధించలేని పెనాల్టీ షూటౌట్ విజయాన్ని ఈసారి అందించారు. ఇద్దరు స్ట్రయికర్లకు ఎక్కువ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా వింగ్ బ్యాక్స్ మంచి జోరులో ఉన్నారు. పనామా, ట్యూనీషియాలపై ఇది పని చేసినా కొలంబియాపై కుదరలేదు. ఎత్తైన డిఫెండర్లున్న స్వీడన్‌కు బాక్స్ లోపలి ఏరియాలో గాలిలో బంతిని నియంత్రించగలిగే అవకాశం ఉంటుంది. సౌత్‌గేట్ దీనికి విరుగుడు వ్యూహం కనిపెట్టి ప్రత్యర్థిని ఆశ్చర్యానికి గురిచేస్తాడేమో చూడాలి. సొంతగడ్డపై లభించే మద్దతుతో సాధారణ జట్టు కూడా గొప్ప విజయాలు సాధిస్తుంది అనేందుకు రష్యానే ఉదాహరణ. వారి ప్రయాణం ఊహించినదాని కంటే మించినది. మరోసారి 45 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో పరీక్షకు నిలవనుంది. విధ్వంసక దాడుల క్రొయేషియా... ఆతిథ్య జట్టుతో సమరానికి సిద్ధమైంది. స్పెయిన్‌ను పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకొచ్చిన రష్యా తర్వాత దాని కథ ముగించింది. ఇలాంటివాటికి అపారమైన మానసిక బలం, ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం. దేశం కోసంప్రాణాలైనా అర్పించే ఈ స్వభావాన్ని నేను ఇష్టపడతా. రష్యా మళ్లీ మళ్లీ అలానే ఆడుతుందని ఆశిస్తున్నా. ముచ్చటైన ఆటతీరుతో అలరిస్తున్న మరో జట్టు క్రొయేషియా. లుకా మోడ్రిక్ రూపంలో వారికో మృదువైన ఆటగాడున్నాడు. జట్టు ఓ కారైతే... అతడు ఇంజిన్. బాధ్యతలు తెలుసుకుని, జాగరూకతతో ఆడే సభ్యులున్నందున వారు మోడ్రిక్పైనే ఆధార పడటం లేదు. అనుభవంతో కఠిన పరిస్థితులను తట్టుకునే ఇవాన్ రాక్టిక్, మారియో మండ్జుకిక్లు ఎక్కడైనా రాణించగలరు. -
ఫ్రాన్స్ ప్రతాపం...
ప్రపంచ కప్ ప్రయాణాన్ని నిదానంగా ప్రారంభించినా, క్రమంగా తనదైన ఆటను బయటకు తీస్తోంది మాజీ చాంపియన్ ఫ్రాన్స్. లీగ్ దశను అజేయంగా ముగించి... ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌నే ఓడించిన ఉరుగ్వేను... క్వార్టర్ ఫైనల్లో అలవోకగా మట్టికరిపించి సెమీస్ బెర్తును కొట్టేసింది. స్టార్ స్ట్రయికర్ ఎడిన్సన్ కవానీ లేని లోటుతో పాటు... మరో స్టార్ లూయీజ్ సురెజ్ మెరుపులు కొరవడటంతో ఉరుగ్వే ఉసూరుమంటూ వెనుదిరిగింది. నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులూ... కాచుకోండి! ఫ్రాన్స్ ఆట పదునెక్కుతోంది! మొదటి క్వార్టర్ ఫైనలే ఇందుకు నిదర్శనం! ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టే ఉరుగ్వేను గుక్క తిప్పుకోనీయకుండా మట్టికరిపించిన తీరే దీనికి సాక్ష్యం! ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆంటోన్ గ్రీజ్మన్ ప్రతిభతో శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–0తో గెలుపొంది దర్జాగా సెమీస్‌లో అడుగు పెట్టింది. 40వ నిమిషంలో రఫెల్ వరెన్కు ఫ్రీ కిక్ పాస్ అందించి అతడు గోల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గ్రీజ్మన్... 61వ నిమిషంలో స్వయం గా గోల్ కొట్టి జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. ఆటగాళ్ల దూకుడు, వరుస ఎల్లోకార్డులు, గోల్‌పోస్ట్ వద్ద పోరాటాలతో క్వార్టర్స్ మ్యాచ్ కొంత ఉత్కంఠ రేకెత్తించింది. ఓ దశ వరకు ఉరుగ్వే దీటుగానే కనిపించినా ఫినిషింగ్ లోపం వేధించింది. అందివచ్చిన ఒకటి, రెండు చక్కటి అవకాశాలను కాలదన్నుకున్న ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. సమంగా ప్రారంభమై... అంతా భావించినట్లే ఉరుగ్వే రక్షణ శ్రేణి, ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి పోటీలా ప్రారంభమైంది మ్యాచ్. ప్రత్యర్థిని ఆశ్చర్యానికి గురిచేస్తూ సురెజ్, టొరీరాల వేగంతో ఉరుగ్వేకే మొదట అవకాశాలు దక్కాయి. అయితే అవి కొంత క్లిష్టమైనవి. బంతి ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయింది. ఎంబాపె, గ్రీజ్మన్, గిరౌడ్‌ల పాస్‌లను ఉరుగ్వే మధ్యలోనే అడ్డుకుంది. ఎంబాపెకు కొన్ని హెడర్లు వచ్చినా సఫలం చేయలేకపోయాడు. 38వ నిమిషంలో బెంటాన్కర్ ప్రత్యర్థి ఆటగాడిని అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు ఫ్రీకిక్ లభించింది. దీనిని కార్నర్ నుంచి గ్రీజ్మన్ షాట్ కొట్టగా... గోల్‌పోస్ట్ ముందున్న వరెన్ హెడర్‌తో నెట్లోకి పంపాడు. గాయంతో కవానీ దూరం కావడం సురెజ్ ప్రదర్శనపైనా ప్రభావం చూపింది. సరైన సహకారం కరవైన అతడు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేకపోయాడు. రెండోభాగంలో రెండో గోల్... ఆధిక్యం కోల్పోయిన ఉరుగ్వే రెండో భాగంలో దాడుల తీవ్రత పెంచేందుకు రొడ్రిగెజ్, గోమెజ్లను సబ్స్టిట్యూట్లుగా దింపింది. కానీ, పేలవమైన ఆటతో ఫ్రాన్స్‌కు గోల్ ఇచ్చింది. పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకున్న గ్రీజ్మన్ మరో ఆలోచన లేకుండా గోల్‌పోస్ట్ దిశగా కొట్టాడు. దీనిని ఉరుగ్వే ఆటగాళ్లెవరూ అడ్డుకోలేకపోగా... కీపర్ ముస్లెరా గోల్‌పోస్ట్ వద్ద తడబడ్డాడు. దారి మళ్లించే క్రమంలో అతడు విఫలమవడంతో బంతి గోల్ లైన్‌ను తాకింది. 2–0 ఆధిక్యం దక్కడంతో ఫ్రాన్స్ మిగతా సమయం ప్రశాంతంగా ఆడుకుంటూ పోయింది.ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఆరోసారి సెమీస్ చేరింది. 1958, 82, 86, 98, 2006లలోనూ సెమీస్ చేరిన ఫ్రాన్స్ 1998లో విజేతగా, 2006లో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఎనిమిదిసార్లు ఉరుగ్వేతో ఆడిన ఫ్రాన్స్ రెండోసారి మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఏకైకసారి 1986లో ఉరుగ్వేను ఫ్రాన్స్ ఓడించింది. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... రెండింటిలో ఓడిపోయింది. -
సెమీస్‌కు ఫ్రాన్స్ క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై విజయం
-
ఫిఫా వరల్డ్ కప్; సెమీస్‌కు ఫ్రాన్స్
నిజ్ని నవ్‌గొరొడ్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా 2018 ప్రపంచ కప్ టోర్నీలో ఫ్రాన్స్ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 0-2 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. లీగ్ దశలో ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వని ఉరుగ్వే కీలకమైన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. 39వ నిమిషంలో రఫెల్ వారన్ మొదటి గోల్ చేయడం ద్వారా ఫస్టాఫ్‌లో ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట రెండో భాగంలోనూ అదే జోరుతో ప్రత్యర్థి గోల్పోస్టుపైకి పదే పదే దూసుకెళ్లింది. 61వ నిమిషంలో ఆంటోనీ గ్రిజ్మన్ రెండో గోల్ సాధించడంతో ఫ్రాన్స్ విజయావకాశాల్ని మరింత పదిలం చేసుకుంది. మ్యాచ్ ఏ దశలోనూ ప్రత్యర్థిని నిలువరించలేకోపోయిన ఉరుగ్వే ఓటమిభారంతో ఇంటిబాటపట్టింది. గెట్ రెడీ: రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్-బెల్జియంలు తలపడనున్నాయి. శుక్రవారం రాత్రి గం.11.30 నుంచి ఈ మ్యాచ్ సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారంకానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు వరల్డ్ కప్ ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్స్
-
ఫిఫాకు మారడోనా క్షమాపణలు
సోచి: ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్-కొలంబియా జట్ల మధ్య జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రిఫరీ నిర్ణయంపై మండిపడ్డ అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఎట్టకేలకు దిగివచ్చాడు.. ఈ మేరకు ఫిఫాకు, ఆ గవర్నింగ్ బాడీ అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినోకు క్షమాపణలు తెలియజేశాడు. ఆమ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి క్వార్టర్‌కు చేరిన సంగతి తెలిసిందే. కొలంబియాకు మారడోనా మద్దతుగా నిలిచిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పెనాల్టీ షూటౌట్లో విజయాన్ని నమోదు చేసింది. దాంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించే క్రమంలో రిఫరీ ఏకపక్షంగా వ్యవహరించాడంటూ మారడోనా ధ్వజమెత్తాడు. దీనిపై మారడోనా తాజాగా క్షమాపణలు తెలియజేశాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫరీ నిర్ణయాన్ని తప్పుపట్టడం సరికాదు. కొన్ని సందర్బాల్లో రిఫరీ నిర్ణయాలతో నా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారి నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. రిఫరీని విమర్శించినందుకు నన్ను క్షమించండి. ఫిఫా వరల్డ్ కప్‌లో రిఫరీ బాధ్యతల్ని నిర్వహించడం చాలా కష్టంతో కూడున్నది. వారి శ్రమ నాకు తెలుసు. నేను మాట తూలడం తప్పే. ఇందుకు ఫిఫాకు, అధ్యక్షుడు ఇన్‌ఫాన్‌టినోకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని మారడోనా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విన్నవించాడు. -
సాకర్ వర్ల్డ్ కప్ నేడు క్వార్టర్ ఫైనల్స్
-
కవాని లేకపోతే కష్టమే!
క్వార్టర్ ఫైనల్స్ తొలి రోజు రెండు దక్షిణ అమెరికా జట్ల కోసం సవాల్ ఎదురు చూస్తోంది. బ్రెజిల్, ఉరుగ్వేలు బెల్జియం, ఫ్రాన్స్‌లతో తలపడబోతున్నాయి. పోటీ తీవ్రంగానే ఉంటుందనడంలో సందేహం లేదు కానీ మా పొరుగు దేశపు రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్ల సేవలకు దూరం కానున్నాయి. కోచ్ టిటె మార్గదర్శనంలో కాస్మిరో బ్రెజిల్ డిఫెన్స్‌లో కీలకంగా మారాడు. జట్టు రక్షణశ్రేణిలో ప్రభావం చూపాడు. గత మ్యాచ్‌లో రెండు కార్డులు అందుకోవడంతో బెల్జియంతో మ్యాచ్‌కు దూరం కావడం బ్రెజిల్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయం. మరో వైపు ఉరుగ్వే స్టార్ ఎడిన్సన్ కవాని కూడా గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదని నాకు తెలిసింది. ఒక వేళ ఇదే జరిగితే ఇద్దరు అటాకింగ్ ఆటగాళ్లలో ఆ జట్టు ఒకరిని కోల్పోయినట్లే. నాలుగేళ్ల క్రితం పూర్తిగా నెమార్పై ఆధారపడినదానితో పోలిస్తే ఈ సారి బ్రెజిల్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే కాదు... నెమార్, కౌటిన్హోలతో కూడిన వారి అటాక్ మరింత పదునెక్కుతోంది. గత మ్యాచ్‌లో విలియన్ కూడా రాణించాడు. తొలి మ్యాచ్‌లో మినహా గత మూడు మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా ఇవ్వని డిఫెన్స్‌ను ప్రశంసించవచ్చు. 4–2–3–1తో టిటె పాటిస్తున్న వ్యూహంలో అంతా బాగుంది. అయితే ఒక ప్రధాన ఆటగాడు దూరమైన నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాలి. 0–2తో వెనుకబడి కూడా జపాన్‌పై గెలవడంతో వరుసగా నాలుగు విజయాలు పూర్తి చేసుకున్న బెల్జియంలో ఆత్మవిశ్వాసం నిండుగా కనిపిస్తోంది. ఎడెన్ హజార్డ్, డి బ్రూయిన్లాంటి మిడ్‌ఫీల్డర్లు, లుకాకు స్థాయి స్ట్రయికర్‌తో పటిష్టంగా ఉంది. పైగా మానసికంగా దృఢంగా ఉండటం జట్టును తిరుగులేనిదిగా మార్చింది. డిఫెన్స్ అంత గొప్పగా లేకపోయినా బ్రెజిల్‌ను ఒక ఆటాడించగలదు. 3–4–2–1 ఫార్మేషన్లో బెల్జియం బ్యాక్‌లైన్ బలహీనంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ విభాగంలో ప్రత్యర్థి తమపై ఒత్తిడి పెంచకుండా ఆ జట్టు చూసుకోవాలి. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను ఇంటికి పంపించిన జట్లు మరో క్వార్టర్ ఫైనల్లో తలపడుతున్నాయి. మెస్సీ జట్టు అర్జెంటీనాను ఫ్రాన్స్, రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను ఉరుగ్వే ఓడించడంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించలేదు. కేవలం ఒక్క ఆటగాడిపైనే ఆధారపడిన ఆ టీమ్‌లపై సమష్టి ఆటతో ఈ రెండు జట్లు విజయం సాధించాయి. గతంలో నేను చెప్పినట్లు బలమైన మిడ్‌ఫీల్డ్, అటాకింగ్ కలగలిపి ఫ్రాన్స్‌ను దుర్భేద్యంగా మార్చాయి. చిన్న అవకాశాలను కూడా అద్భుతంగా వాడుకోగల ఇద్దరు స్ట్రయికర్లు ఉన్న ఉరుగ్వే ప్రత్యర్థికి అంత తొందరగా లొంగే రకం కాదు. కవానీ గాయం ఉరుగ్వేనుబాధించేదే. అతను లేకుండా అటాక్ బలహీనంగా మారిపోతుంది. సురెజ్‌తో అద్భుత సమన్వయం ఉన్న కవాని లేకపోతే కోచ్ ఆస్కార్ తన 4–1–2–1–2 వ్యూహాన్ని మార్చుకోక తప్పదు. వారి డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. కానీ ఇలాంటి మ్యాచ్‌లో ప్రధాన ఆటగాడు లేకపోతే చాలా కష్టమే. ఫ్రాన్స్ బలమంతా మిడ్‌ఫీల్డర్లే. ఆ భాగంలో మెరుగ్గా ఉంటే జట్టు గెలవగలదు. ఎంబాపెలాంటి ఆటగాడు వెలుగులోకి రావడం సంతోషంగా ఉంది. అతనికి మంచి స్వేచ్ఛనివ్వడంతో తన వేగంతో అర్జెంటీనాపై అద్భుతం చేసి చూపించాడు. ప్రత్యర్థి దృష్టంతా అతనిపైనే ఉంటుంది కాబట్టి ఉరుగ్వేతో ఎంబాపెకు అంత సులభమైన అవకాశాలు రాకపోవచ్చు. అన్ని అంశాలను బట్టి చూస్తే ఫ్రాన్స్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఉరుగ్వే కూడా ఎక్కడ తగ్గకుండా ఆడటం ఖాయం. -
అష్ట దిగ్గజాల ఆట...
విశ్వ సమరంలో వీర రస ప్రదర్శనకు మళ్లీ రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు నుంచి మొదలు పెట్టి అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు తమ సత్తా చాటేందుకు సై అంటున్నాయి. తొలి రోజు ఖండాంతర పోరులో శుక్రవారం ఉరుగ్వే–ఫ్రాన్స్, బ్రెజిల్–బెల్జియం క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. వీటిలో సెమీస్ మెట్టును రెండు దక్షిణ అమెరికా (ఉరుగ్వే, బ్రెజిల్) జట్లే ఎక్కుతాయో... లేదా రెండు యూరప్ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం) ముందంజ వేస్తాయో చూడాలి...! నిజ్ని నవ్‌గొరొడ్: ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా... అయిదు గోల్స్ చేసి లీగ్ దశను అజేయంగా ముగించింది ఉరుగ్వే. ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్‌కు గోల్ ఇచ్చినా ప్రతిగా రెండు కొట్టి గెలుపొందింది. మరోవైపు ఫ్రాన్స్ ప్రయాణం నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్‌లో మాత్రం అర్జెంటీనాపై జూలు విదిల్చింది. మొత్తమ్మీద రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేశాయి. ఇక శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌ను 350 మ్యాచ్‌ల విశేష అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమెనెజ్, క్యాసెరెస్, లక్జాల్ట్ల ఆధ్వర్యంలోని ఉరుగ్వే రక్షణ శ్రేణికి... గ్రీజ్మన్, ఎంబాపెల ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి మధ్య పోరాటంగా పేర్కొనవచ్చు. స్టార్ స్ట్రయికర్ సురెజ్ ఫామ్ భరోసానిస్తున్నా, ప్రి క్వార్టర్స్‌లో రెండు గోల్స్‌తో గెలిపించిన మరో స్టార్ ఎడిన్సన్ కవాని గాయం ఉరుగ్వేను కలవరపరుస్తోంది. అతడు బరిలో దిగేది అనుమానంగానే ఉంది. గత మ్యాచ్‌లో అర్జెంటీనాపై విజయం ఫ్రాన్స్‌లో ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. టీనేజ్ సంచలనం ఎంబాపె తన వేగంతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అతడికి గ్రీజ్మన్, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్ తోడైతే తిరుగుండదు. వీరి ఆధ్వర్యంలోని ఫార్వర్డ్ బృందం ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించే ప్రయత్నాలు మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘ఫ్రాన్స్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం’ అని ఇప్పటికే ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రెజ్ వ్యాఖ్యానించాడు. ‘బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదురుకావొచ్చు’ అనేది ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ అంచనా. ►ఉరుగ్వే (vs) ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి కజన్: వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది. మాజీ చాంపియన్లు ఒక్కొక్కటే వెనుదిరుగుతున్నా, సాంబా జట్టు మాత్రం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. లీగ్ దశలో డ్రాతో స్విట్జర్లాండ్ విస్మయపర్చినా... కోస్టారికా, సెర్బియాలపై సాధికార విజయాలు సాధించింది. ప్రి క్వార్టర్స్‌లో మెక్సికోకు చిక్కకుండా తప్పించుకుంది. అటువైపు బెల్జియం మాత్రం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ లీగ్‌లో అజేయంగా నిలిచింది. ప్రి క్వార్టర్స్‌లో జపాన్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న తీరు అదెంత ప్రమాదకర జట్టో చాటింది. ప్రపంచ ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉన్న వీటి మధ్య క్వార్టర్స్‌లో భీకర పోరాటం ఖాయం. టోర్నీలో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన బ్రెజిల్... ప్రత్యర్థులకు ఒక్కటే ఇచ్చింది. బెల్జియం ఏకంగా 12 గోల్స్ కొట్టి... నాలుగు ఇచ్చింది. కీలక సమయంలో స్టార్ ఆటగాడు నెమార్ ఫామ్‌లోకి రావడంతో పాటు సాంబా జట్టు ఆట క్రమంగా పదునెక్కుతోంది. యువ గాబ్రియెల్ జీసస్ కూడా మెరిస్తే తిరుగుండదు. థియాగో సిల్వా, మిరండా వంటి సీనియర్లతో పటిష్ఠంగా కనిపిస్తున్న వీరి రక్షణ శ్రేణిని బెల్జియం స్టార్లు హజార్డ్, లుకాకు, మెర్టెన్స్‌లు ఏమేరకు ఛేదిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లోలా ఆధిక్యం కోల్పోతే కోలుకోవడానికి వీలుండదు. ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటంతో బెల్జియంను ‘గోల్డెన్ జనరేషన్’ జట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే మరె ప్పుడూ కప్పు గెలిచే అవకాశం రాదంటున్నారు. ఈ మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ను ఓడిస్తే 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లవుతుంది. ►బ్రెజిల్ (vs) బెల్జియం రాత్రి గం.11.30 నుంచి ►సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారం -
మూడే అడుగులు!
-
ఇదీ క్రీడా స్ఫూర్తి..!
ఫుట్‌బాల్ మ్యాచ్ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్ చివర్లో జపాన్ జట్టు ఆశలు గల్లంతు కావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రం చేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగు మ్యాచ్‌లలోనూ ఇదే రకమైన నైతిక విలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ తర్వాత నీలం రంగు ‘సమురాయ్ డ్రెస్’ ధరించిన అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఏరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటమి చవిచూసిన జపాన్ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియంలోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్ రూమ్‌లోని కుర్చీలు, సామగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్ భాషలో ‘ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా జపాన్ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం జపనీస్ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ స్కాట్ మ్యాక్ఇన్టైర్ చెబుతున్నారు. జపాన్ దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనెగల్ అభిమానులు కూడా గతంలో స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. -
‘జ్యోతిష్య’ ఆక్టోపస్‌ను చంపేశారు!
టోక్యో: ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో మూడు జపాన్ మ్యాచ్‌ల ఫలితాల గురించి సరిగ్గా జోస్యం చెప్పిన ఆక్టోపస్ పాపం తనకు ఇంత తొందరగా చావు రాసి పెట్టి ఉంటుందని ఊహించలేదేమో! ‘రాబియో’ పేరు గల ఈ ఆక్టోపస్‌ను కిమియో ఆబె అనే వ్యక్తి సముద్రం నుంచి తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాని జ్యోతిష్యం మొదలైంది. మూడు నీళ్లు నిండిన బకెట్లపై ఒక్కో ఫలితం రాసి వాటి మధ్యలో ఈ ఆక్టోపస్‌ను వదిలేవారు. అది దేనిని ఎంచుకుంటే అదే ఫలితం వచ్చింది. అయితే ఇప్పుడు కిమియో దానిని చంపేసి దుకాణంలో అమ్మకానికి పెట్టేశాడు. చేపలు పట్టడమే జీవనాధారమైన కిమియో తనకు మరో మార్గం లేకుండా పోయిందన్నాడు. రాబియోకు వస్తున్న పేరు ప్రఖ్యాతులకంటే దానిని మాంసంగా మార్చి అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తాడు కాబట్టి చంపక తప్పలేదని అతను అన్నాడు. గ్రూప్ దశలో కొలంబియాతో జపాన్‌తో గెలుస్తుందని, సెనెగల్‌తో ‘డ్రా’ చేసుకొని... పోలాండ్ చేతిలో ఓడుతుందని ఈ ఆక్టోపస్ చెప్పిన జోస్యం 100 శాతం నిజమైంది. ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఓడి జపాన్ ఆట ముగియగా... దానికి ముందే రాబియో మార్కెట్లో మాంసాహారంగా మారిపోయింది! -
ఇంగ్లండ్ నవ్వింది...
ఆధిపత్యం నీదా... నాదా? అన్నట్లు సాగింది ఆట. నీ గోల్‌కు నా గోల్ జవాబంటూ సమమైంది స్కోరు. అదనపు సమయంలోనూ ఎవరికీ దక్కలేదు గెలుపు. అటు ఇటు తిరిగి పెనాల్టీ షూటౌటే తేల్చింది ఫలితం. మరో ఉత్కంఠ పోరాటంతో ముగిసింది ప్రి క్వార్టర్స్. మాస్కో: ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రిక్వార్టర్స్ దశను ‘పెనాల్టీ నాకౌట్’గా పేర్కొనవచ్చేమో! మొత్తం 8 మ్యాచ్‌ల్లో మూడింటి ఫలితం షూటౌట్లోనే తేలింది మరి! మంగళవారం అర్ధరాత్రి కొలంబియాతో ఇక్కడ జరిగిన పోరులో ఇంగ్లండ్ ఈ తరహాలోనే 4–3తో విజయం సాధించింది. అంతకుముందు 57వ నిమిషంలో పెనాల్టీని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ కేన్ గోల్‌గా మలచడంతో ఇంగ్లండ్‌కు ఆధిక్యం దక్కింది. కొలంబియా స్టార్ ఎరి మినా ఇంజ్యూరీ (90+3వ ని.)లో స్కోరు కొట్టి లెక్క సమం చేశాడు. అదనపు అరగంట సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. నాలుగు, ఐదు కిక్‌లను కొలంబియా ఆటగాళ్లు నెట్లోకి కొట్టడంలో విఫలం కాగా, మూడో కిక్ మినహా మిగతా వాటిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. ఆసాంతం సమఉజ్జీలుగానే... బంతిపై నియంత్రణ, పాస్‌ల కచ్చితత్వంలో మ్యాచ్ మొదటి నుంచి రెండు జట్లు సమంగానే నిలిచాయి. అయితే, ప్రత్యర్థి కంటే గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఆడిన ఇంగ్లండే ఎక్కువ దాడులు చేసింది. 16వ నిమిషంలో కేన్ కొట్టిన హెడర్ గోల్ బార్‌కు కొద్ది దూరంలో వెళ్లింది. రహీమ్ స్టెర్లింగ్, కీరన్ ట్రిప్పియర్ల జోరుతో తర్వాత సైతం అవకాశాలు వచ్చాయి. మరోవైపు కొలంబియా కీపర్ డేవిడ్ ఒస్పినా అప్రమత్తత, శాంటియాగో ఎరియాస్, జువాన్ క్వాడ్రాడోల ప్రతిదాడులతో ఇంగ్లండ్‌ది పైచేయి కాలేదు. క్రమంగా పుంజుకున్న కొలంబియా ప్రత్యర్థి వెనుకంజ వేసేలా చేసింది. మొదటిభాగంలో 53 శాతం బంతి ఇంగ్లండ్ పరిధిలోనే ఉంది. పెనాల్టీ చెల్లించుకున్నారు... రెండో భాగంలో ప్రారంభంలోనే తప్పులు చేసిన కొలంబియా మూల్యం చెల్లించుకుంది. 54వ నిమిషంలో శాంచెజ్... కేన్‌ను కూలదోయడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ దక్కింది. కీపర్ ఒస్పినాను ఊరిస్తూ కేన్ కొట్టిన బంతి నెట్లోకి చేరింది. ఇక్కడినుంచి రెండు జట్లు వరుసగా సబ్స్టిట్యూట్లను దింపాయి. మ్యాచ్‌లో తీవ్రత పెరగడంతో 52–69వ నిమిషాల మధ్యలో ఏకంగా ఆరు ఎల్లో కార్డులు చూపించాల్సి వచ్చింది. ఇందులో కొలంబియానే నాలుగు ఎదుర్కొనడం గమనార్హం. రెండు జట్లకు రెండేసి అవకాశాలు వచ్చినా అవి గోల్‌పోస్ట్ సమీపం నుంచి పక్కకు వెళ్లాయి. ఇంజ్యూరీలో కార్నర్ కిక్‌ను డి బాక్స్ వద్ద నుంచి మినా హెడర్ గోల్‌గా మలిచాడు. అదనపు సమయం మొదటి భాగంలో కొలంబియా, రెండోభాగంలో ఇంగ్లండ్ పోరాడినా గోల్ చేయలేకపోయాయి. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. ►ప్రస్తుత ప్రపంచకప్‌లో షూటౌట్లో తొలి షాట్ తీసుకున్న మూడు జట్లూ ఓడాయి. ►1996 ‘యూరో’ టోర్నీలో స్పెయిన్‌పై షూటౌట్లో గెలిచాక మరో మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ షూటౌట్లో గెలుపొందడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఇంగ్లండ్ ఎనిమిది షూటౌట్లను ఎదుర్కొనగా... ఆరింటిలో ఓడిపోయి, రెండింటిలో మాత్రమే గెలిచింది. ►2006 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఈ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ►1939లో టామీ లాటన్ తర్వాత ఇంగ్లండ్ తరఫున ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ కొట్టిన ప్లేయర్‌గా హ్యారీ కేన్ నిలిచాడు. ►ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ ఆడిన గత 15 నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎనిమిది అదనపు సమయానికి వెళ్లడం విశేషం. -
ఇదీ క్రీడా స్ఫూర్తి.!
మాస్కో : ఫుట్‌బాల్ మ్యాచ్ అంటేనే యుద్ధం మాదిరిగా రెండు జట్ల మధ్య చావోరేవో అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఆశించిన మేర ఫలితం రాకపోతే ఇరుజట్ల అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, రక్తపాతాలకు దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచకప్ సందర్భంగా అందుకు పూర్తి విరుద్ధంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు అందరినీ ఔరా అని ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. బెల్జియంతో జరిగిన మ్యాచ్ చివర్లో జపాన్ జట్టు ఆశలు గల్లంతుకావడంతో స్టేడియంలోని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రష్యాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లు చూసేందుకు జపాన్ నుంచి వెళ్లిన వేలాదిమంది ఈ ఓటమితో ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ మ్యాచ్ తర్వాత నీలం రంగు ’సామురాయ్ డ్రెస్’ ధరించిన ఈ అభిమానులు స్టేడియమంతా కలియతిరుగుతూ చెత్త ఎరుతున్న ఫోటోలు, వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటమి చవిచూసిన జపాన్ జట్టు కూడా అత్యున్నత క్రీడా స్ఫూర్తిని, తమ దేశ క్రమశిక్షణను చేతల్లో చూపింది. స్టేడియం లోపల తమ జట్టుకు కేటాయించిన లాకర్ రూమ్ లోని కుర్చీలు, సామాగ్రిని ఆటగాళ్లు మిలమిల మెరిసేలా శుభ్రపరిచారు. ఓటమికి కుంగిపోకుండా రష్యన్ భాషలో ’ధన్యవాదాలు’ అనే నోట్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ప్రపంచకప్ పోటీల నుంచి తమ జట్టు నిష్క్రమించినా జపాన్ ఆటగాళ్లు, అభిమానులు అందరి మనసులు గెలుచుకున్నారు. జపాన్ వ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల తర్వాత అభిమానులు ఈ విధంగా స్టేడియాలను శుభ్రపరచడం జపనీస్ సంస్కృతిలో అంతర్భాగమని ఆ దేశానికి చెందిన జర్నలిస్ట్ స్కాట్ మ్యాక్ఇన్టైర్ చెబుతున్నారు. జపాన్‌దేశ క్రీడాభిమానుల నుంచి స్ఫూర్తి పొందిన సెనగల్ అభిమానులు కూడా స్టేడియాన్ని శుభ్రపరిచారు. తమ జట్టు పోలాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో వారు ఆ పనిచేశారు. -
రొనాల్డో- మెస్సీ దెబ్బకు విడాకులు తీసుకున్న జంట
మాస్కో: రొనాల్డో- మెస్సీ డిబేట్ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ గొడవ పెద్దదై చివరకు వీడాకుల వరకు తీసుకెళ్లింది. ఒకరు రొనాల్డో అభిమాని కాగా.. మరొకరు మెస్సీ అభిమాని. అయితే ఈ ఇద్దరిని కలిపింది కూడా ఈ ఫుట్ బాల్ ఆటనే కావడం విశేషం. ఓ రష్యన్ పత్రిక కథనం మేరకు.. అర్సెన్, ల్యూధ్మిలా అనే దంపతులు ఓ బార్లో 2002 ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ను చూస్తూ కలుసుకున్నారు. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కింది. అయితే 16 ఏళ్ల అనంతరం తమ అభిమాన ఆటగాళ్ల విషయంలో జరిగిన గొడవ వారి బంధానికి ఎండ్ కార్డ్ వేసింది. నైజీరియాపై అర్జెంటీనా విజయాన్ని భర్త ఆస్వాదిస్తుండగా.. ఆగ్రహానికిలోనైన భార్య.. మెస్సీ కన్న రోనాల్డో గొప్పవాడనే టాపిక్ తీసుకొచ్చింది. దీంతో ఈ దంపతులు మధ్య ఈ విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఇది చినికి చినికి పెద్ద గొడవకు దారీ తీసింది. ఫిఫా ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి తన అభిమాన ఆటగాడు మెస్సీని తక్కువ చేస్తూ తన భార్య మాట్లాడుతూనే ఉందని, ఆమె రోనాల్డోను పిచ్చిగా అభిమానిస్తుందని అతను మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది భరించలేకనే ఆమెకు దూరంగా వచ్చానని, ఇలా గొడవ జరగడం ఇదే తొలి సారి కాదన్నాడు. దీంతో విసుగు చెందే విడాకులకు దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల పోరు నాకౌట్లో ఒకే రోజు ముగిసిన విషయం తెలిసిందే. అర్జెంటీనా ఫ్రాన్స్ చేతిలో ఓడిపోగా.. పోర్చ్‌గల్ ఉరుగ్వే చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
చల్..చలోచలో..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచం సాకర్ ఫీవర్‌లో మునిగి తేలుతోంది. అంచనాలకు అంద కుండా సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్–2018ను చూసేందుకు అందరిలోనూ ఉత్సాహం ఉరక లేస్తోంది. రష్యా వేదికగా జరుగుతున్న ఈ సాకర్ మహాసంగ్రామాన్ని టీవీల్లో కోట్లాది మంది చూస్తుంటే.. ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది రష్యాకు వెళుతున్నారు. దీనికి భాగ్యనగరం కూడా మినహాయింపు కాదు. నగరం నుంచి వేలాది మంది రష్యా బాట పట్టినట్లు తెలిసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను కనులారా వీక్షించేందుకు రష్యా వెళ్లిన వారి సంఖ్య సమారు 30 వేల వరకు ఉన్నట్లు ట్రావ్‌కార్ట్, మేక్ మై ట్రిప్ ట్రావెల్స్ అంచనా వేశాయి. 40 శాతం పెరుగుదల గతంతో పోలిస్తే నగరం నుంచి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్లిన వారి సంఖ్య 40 శాతం మేర పెరగడం విశేషం. నగరంలోని ట్రావెల్ ఏజెంట్ల లెక్కల ప్రకారం.. దేశంలో మెట్రో నగరాల నుంచి సాకర్ మ్యాచ్‌లను వీక్షించేందుకు సుమారు పది లక్షల మంది రష్యా పయనమయ్యారట. ఇందులో హైదరాబాద్ నుంచి 12 శాతం మంది.. ఢిల్లీ నుంచి 22 శాతం, కోల్‌కతా నుంచి 18 శాతం, ముంబై నుం చి 15 శాతం మంది వెళ్లినట్టు తేలింది. మార్చిలోనే సాకర్ మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు ట్రావ్‌కార్ట్, మేక్ మై ట్రిప్ ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు తెలిపారు. సాకర్ ప్రపంచ కప్ నేపథ్యంలో రష్యా వెళ్లే పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యిందని, ప్రధానంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్న సోచి, వోల్గ్రోగార్డ్, సరాన్సిక్, మాస్కో, రస్తోవ్, కజాన్ తదితర నగరాలకు క్రీడాభిమానులు వెల్లువెత్తుతున్నారని తెలిసింది. సాకర్ మ్యాచ్‌లతోపాటు మాస్కో అందాలు వీక్షించడం, హాలిడేస్‌ను జాలీగా గడిపేందుకే పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. మ్యాచ్ టికెట్‌తో రష్యా వీసా.. వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు అవసరమైన టికెట్‌తోపాటే సులువుగా వీసా లభించడం హైదరాబాదీలు రష్యా బాట పట్టేందుకు ప్రోత్సహించిందని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రయాణ ఛార్జీలు, వసతి సౌకర్యాలకు ఒక్కో వ్యక్తికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోందని తెలిపారు. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ ఆధారంగా ఆన్లైన్లో వీసాకు దరఖాస్తు చేసుకుంటే పలువురికి ఇంటికే వీసా వస్తోంది. వీసా ప్రక్రియ సులభతరం కావడంతో రష్యాకు పయనమైన వారి సంఖ్య గతంతో పోలిస్తే అనూహ్యంగా పెరిగినట్లు అంచనా. -
ఆట లేకున్నా... అదృష్టం తోడై!
ఓవైపు పెనాల్టీ షూటౌట్లు... మరోవైపు పోటాపోటీ గణాంకాలతో సాగుతున్న ప్రపంచ కప్ నాకౌట్లో భిన్న పోరాటం! ఒకటికి నాలుగు గోల్స్ నమోదవుతున్న తీరుకు విరుద్ధంగా ఏకైక గోల్‌తోనే తేలిపోయిన ఫలితం! ఆటపై ఆసాంతం ఆధిపత్యం ఒక జట్టుదైతే... గెలుపు మాత్రం ఇంకో పక్షం ఖాతాలో చేరింది.! స్విట్జర్లాండ్ ఉసూరంటూ నిష్క్రమించగా... గండం గట్టెక్కిన స్వీడన్ క్వార్టర్స్ గడపతొక్కింది. సెయింట్ పీటర్స్బర్గ్: అయ్యో... స్విట్జర్లాండ్! 64 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకుని... ప్రత్యర్థిపై దాడుల్లోనూ మెరుగ్గా నిలిచినా... ఫలితాన్ని మాత్రం పొందలేకపోయింది. తమకంటే (6) నాలుగింతలు తక్కువ ర్యాంకున్న స్వీడన్ (24)కు మ్యాచ్‌ను చేజార్చుకుంది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫోర్స్‌బెర్గ్ (66వ నిమిషం) ఏకైక గోల్‌తో 1–0తో స్వీడన్ నెగ్గి 1994 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బంతి ప్రత్యర్థికి చిక్కకూడదు అన్నట్లు ఆడింది స్విట్జర్లాండ్. స్వీడన్ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించినా మ్యాచ్ ఏ దశలోనూ పట్టు సడలించలేదు. మార్కస్ బెర్గ్ గోల్ కొట్టిన వాలీని స్విస్ కీపర్ యాన్ సోమర్ కొనవేళ్లపై అద్భుతంగా నిలువరించగా, ఆల్బిన్ ఎక్దాల్ షాట్ గోల్‌పోస్ట్ బార్‌పై నుంచి వెళ్లింది. టోర్నీలో రక్షణాత్మకంగా ఆడుతున్న స్వీడన్... స్విస్ స్టార్ షకిరిని కట్టడి చేసింది. మొదటిభాగం ముగిసేసరికి బంతి 65 శాతం స్విస్ పరిధిలోనే ఉంది. ఇరు జట్లకూ అవకాశాలు దక్కడంతో రెండో భాగం ఆసక్తికరంగా ప్రారంభమైంది. స్విట్జర్లాండ్ ఒత్తిడి పెంచింది. అయితే, 66వ నిమిషంలో స్వీడన్‌కు అదృష్టం కలిసొచ్చింది. కార్నర్ నుంచి టొవొనెన్ ఇచ్చిన పాస్‌ను సరిగ్గా డి బాక్స్‌లో అందుకున్న ఫోర్స్‌బెర్గ్ గోల్‌పోస్ట్ దిశగా గట్టిగా కొట్టాడు. దీనికి స్విస్ ఆటగాడు అకంజి అడ్డురాగా... బంతి అతడి కాలికి తగిలి బౌన్స్ అయి నెట్లో పడింది. 0–1తో వెనుకబడిన తర్వాత స్విట్జర్లాండ్ పరిస్థితిని గమనించి ఇద్దరు సబ్స్టిట్యూట్లను బరిలో దింపింది. గోల్ చేసేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. ►ప్రపంచకప్‌లో స్వీడన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందడం 1958 తర్వాత ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో స్వీడన్ 1958 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో నెగ్గి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది. -
జపాన్ విలాపం...
90+4 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 47 నిమిషాలు స్కోరే లేదు! తుది ఫలితం మాత్రం 3–2. అంటే మిగతా 47 నిమిషాల్లో ఐదు గోల్స్! బెల్జియం, జపాన్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ నాకౌట్ పోరు తీవ్రతకు నిదర్శనమిది! ఓ వైపు రెండు జట్ల దూకుడైన ఆట... మరోవైపు గోల్‌పోస్ట్ వద్ద కీపర్ల అసమాన ప్రతిఘటన...! నిర్ణీత సమయంలో 2–2తో స్కోరు సమం. ఇంజ్యూరీలో పుంజుకున్న బెల్జియం ఔరా అనిపించేలా గెలవగా... ఆఖరి క్షణంలో గోల్ సమర్పించుకున్న జపాన్ కుదేలైంది! ఓ దశలో 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం దిశగా సాగుతున్న ‘బ్లూ సమురాయ్’ బృందం ఆ తర్వాత ఏకంగా మూడు గోల్స్ ఇచ్చుకొని ఓటమిని మూటగట్టుకుంది. రొస్తావ్ ఆన్ డాన్: ఈ ప్రపంచ కప్‌లో అందరూ తమ జట్టును ప్రమాదకరమైనదిగా ఎందుకు పేర్కొంటున్నారో చాటుతూ బెల్జియం అద్భుతం చేసింది. నాలుగు నిమిషాల వ్యవధిలో జపాన్‌కు రెండు గోల్స్ ఇచ్చి చేజారిందనుకున్న మ్యాచ్‌ను... ఐదు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి నిలబెట్టుకుంది. స్కోరు సమమైన వేళ, ఇంజ్యూరీ సమయంలో మెరుపు ఆటతో ఫలితాన్ని తమవైపు తిప్పుకొంది. ఓడినా జపాన్ చక్కటి పోరాటంతో ఆకట్టుకుంది. సంచలనం సృష్టించేలా కనిపించిన ఆసియా జట్టు... ఆధిక్యం కోల్పోయి, ఆఖర్లో అనూహ్యంగా పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3–2తో గెలుపొందింది. జెన్కి హరగూచి (48వ నిమిషం), తకాషి ఇనుయ్ (52వ ని.)లు జపాన్ తరఫున గోల్స్ చేశారు. జాన్ వెర్టన్గెన్ (69వ ని.), మరౌనె ఫెల్లాయిని (74వ ని.), నేసర్ చాడ్లీ (90+4వ ని.)లు బెల్జియంకు స్కోరు అందించారు. ఆధిపత్యం అటు... ఇటు పోటాపోటీ ఆటతో మ్యాచ్ రసవత్తరంగా ప్రారంభమైంది. బెల్జియం మిడ్ ఫీల్డర్లు ఈడెన్ హజార్డ్, డ్రీస్ మెర్టెన్స్‌లు వీలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రత్యర్థి లొంగలేదు. మొదటి నిమి షంలోనే జపాన్ ఆటగాడు కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ పక్కనుంచి వెళ్లింది. కొద్దిసేపటికే మెర్టెన్స్ అందించిన క్రాస్‌ను రొమేలు లుకాకు వృథా చేశాడు. హజార్డ్, లుకాకులకు సహచరుల నుంచిఅండ కరవై బెల్జియం ప్రభావవంతంగా కనిపించలేదు. జపాన్ సైతం ఓ గోల్ చాన్స్ చేజార్చుకుంది. మొదటి భాగంలో 55 శాతం బంతి బెల్జియం ఆధీనంలోనే ఉంది. ధనాధన్... రెండోభాగం మొదలవుతూనే జపాన్ దడదడలాడించింది. ఆటగాళ్ల మధ్య నుంచి వచ్చిన బంతిని వెంటాడిన హరగూచి... డి బాక్స్ లోపల ప్రత్యర్థిని ఏమారుస్తూ గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మరుసటి నిమిషంలో బెల్జియం దాడికి దిగినా బంతి గోల్బార్ను తాకి వెనక్కు వచ్చింది. ఇక 52 వ నిమిషంలో ఇనుయ్ డి బాక్స్ ముందు నుంచి కొట్టిన షాట్ నెట్లోకి చేరింది. జపాన్ ఒక్కసారిగా 2–0 ఆధిక్యంలోకి వెళ్లడంతో బెల్జియం దాడులు పెంచింది. ఫెల్లాయిని, చాడ్లీలను సబ్స్టిట్యూట్లుగా దింపింది. దీనికి ప్రతిఫలమే 69వ నిమిషంలో వెర్టన్గెన్ గోల్. కార్నర్లో ఉన్న అతడు హెడర్ ద్వారా కొట్టిన షాట్ ఎత్తులో వెళ్లి గోల్‌పోస్ట్‌లో పండింది. కొద్దిసేపటికే క్రాస్ షాట్‌ను ఫెల్లాయిని... తలతో గోల్‌గా మలిచాడు. సమయం దగ్గరపడటంతో బెల్జియం దూకుడు చూపినా కీపర్ కవాషియా రెండుసార్లు అద్భుతంగా అడ్డుకున్నాడు. స్కోర్లు సమమై... ఇంజ్యూరీ సమయం కూడా ముగుస్తుండటంతో మరో షూటౌట్ తప్పదని అనిపించింది. అయితే... ఆఖరి నిమిషంలో కుడివైపు నుంచి అందిన బంతిని చాడ్లీ నేర్పుగా గోల్ కొట్టి బెల్జియంకు విజయం కట్టబెట్టాడు. ‘థ్యాంక్యూ రష్యా’ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్లు అసహనంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అద్దాలు పగలగొట్టడం, వస్తువులను చిందరవందర చేయడం ఎన్నో సార్లు చూశాం. కానీ ఈ తరహాలో అతి శుభ్రంగా, అసలు అక్కడ అప్పటి వరకు ఎవరూ లేనట్లుగా ఉంచడం ఎప్పుడైనా చూశామా? కానీ జపాన్ మాత్రం అలాగే చేసింది. బెల్జియం చేతిలో పరాజయం బాధిస్తున్నా...తమ క్రమశిక్షణలో మాత్రం కట్టుతప్పలేదు. అక్కడినుంచి వెళ్లిపోయే ముందు అన్నీ క్రమపద్ధతిలో, కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకుండా సర్దిపెట్టింది. పైగా వెళుతూ వెళుతూ రష్యన్ భాషలో కృతజ్ఞతలు చెబుతూ ఒక కార్డును అక్కడ ఉంచింది. హ్యాట్సాఫ్ టు జపాన్! -
బ్రెజిల్ ఆటగాడిపై కుళ్లు జోక్స్
సమారా : ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్‌ను క్వార్టర్ ఫైనల్‌కు చేర్చిన ఆ దేశ స్టార్ స్ట్రయికర్ నెమార్ జూనియర్‌పై సోషల్ మీడియాలో కుళ్లు జోకులు పేలుతున్నాయి. సోమవారం మెక్సికోతో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 2-0తో మెక్సికోపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అద్బుత గోల్‌తో ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నెమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్ 70వ నిమిషంలో మైదానంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మెక్సికో ఆటగాడు మిగెల్ లయన్ కాలు నెమార్ మడమకు తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. అయితే రిఫరీని గమనించిన నెమార్ గాయంతో విలవిలాడుతున్నట్లు ప్రవర్తించాడు. మరికొద్ది సేపటికే అతను మాములు అయిపోవడం మెక్సికోఆటగాళ్లకు, మైదానంలోని అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. అదంతా సమయాన్ని వృథా చేయడానికి నెమార్ ఆడిన నాటకమని అర్థమైపోయింది. అయితే నెమార్ ఇలా నటించడం ఇదే తొలిసారి కాదు. గత మ్యాచ్‌లోను ఇలానే ప్రవర్తించాడు. ఈ ఘటనను ఆధారం చేసుకోని నెటిజన్లు తమ ఫొటో షాప్ నైపుణ్యానికి పదును పెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు. ‘ నెమార్ నీ నటన ఆస్కార్‌ను మించిందని’, ఒకరంటే.. ‘నెమార్ వెంటనే చర్చికెళ్లి పవిత్ర జలాన్ని తీసుకో’ అని ఇంకోకరు కామెంట్ చేశారు. సిగ్గుమాలిన చర్య: మెక్సికో కోచ్ మెక్సికో కోచ్ జువాన్ కార్లోస్ ఒసోరియో సైతం నెమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ చర్య ఫుట్‌బాల్ ఆటకే తలవంపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వల్ల చాలా సమయం వృథా అయిందన్నారు. అతని నటన మా జట్టు బలంపై ప్రభావం చూపిందన్నారు. Oscar performance from @neymarjr throughout this world cup! pic.twitter.com/aXVTErNLG4 — Nancy Mcphanny (@NancyMcphanny) July 3, 2018 Neymar went to church and got some of that holy water. pic.twitter.com/XUNofyLGwI — Miriti Murungi (@NutmegRadio) July 2, 2018 How to stop Neymar. pic.twitter.com/cs5gLBw9ml — 🤓 Dzul Izzat 🤓 (@dzulizzat_) July 3, 2018 -
ఫిఫా వరల్డ్ కప్: 48 ఏళ్లలో తొలిజట్టు
రోస్టోవ్: ఫిఫా వరల్డ్ కప్‌లో బెల్జియం సంచలన విజయం సాధించడంతో పాటు కొత్త అధ్యాయాన్ని లిఖించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్‌పై విజయం సాధించిన బెల్జియం క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరాగా సాగిన పోరులో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన బెల్జియం 3-2 తేడాతో జపాన్ను చిత్తుచేసింది. రెండో అర్థ భాగం ఆరంభంలో 2-0తో వెనుకబడిన బెల్జియం.. ఆ తర్వాత అరగంట లోపు మూడు గోల్స్ సాధించి జపాన్‌కు షాకిచ్చింది. బెల్జియం ఆటగాళ్లలో జాన్ వెర్టోన్‌గెన్ గోల్ సాధించగా, ఫెల్లానీ రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చరిత్రలో బెల్జియం క్వార్టర్స్‌కు చేరడం మూడోసారి కాగా, వరల్డ్ కప్ నాకౌట్ గేమ్‌లో 2-0 వెనుకబడి ఆపై విజయాన్ని అందుకోవడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. రెండో అర్థ భాగంలో జపాన్ స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌తో దూసుకుపోయింది. ఆట 48వ నిమిషంలో హరగుచి గోల్ సాధించగా, 52వ నిమిషంలో టకాషి ఇనుయ్ మరో గోల్ సాధించడంతో జపాన్ 2-0 ఆధిక్యం లభించింది. దాంతో జపాన్‌కు నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ దక్కాయి. అయితే ఈ ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. ఆ తర్వాత బెల్జియం రెచ్చిపోయింది. 70, 75 నిమిషాల్లో గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. తొలుత వెర్టోన్‌గెన్ గోల్ సాధించగా, ఐదు నిమిషాల వ్యవధిలో ఫెల్లానీ మరో గోల్స్ సాధించాడు. ఆపై నిర్ణీత సమయం వరకూ ఇరు జట్లు గోల్ సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా, అదనపు సమయంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బెల్జియం ఆటగాడు చాడ్లి గోల్ సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌తో బెల్జియం తలపడనుంది. -
ఫిఫా వరల్డ్ కప్ నుంచి మెక్సికో ఔట్
-
ఆఖరి ‘కిక్’ క్రొయేషియాదే
ప్రేక్షకులింకా స్టేడియంలో కుదురుకోనేలేదు...అభిమానులింకా టీవీల ముందు సర్దుకోనేలేదు...ఫటాఫట్... రెండు గోల్స్ పడిపోయాయి!ఆరంభం అదిరిందనుకుంటే... మళ్లీ స్కోరే లేదు!నాకౌట్ మొదటి రోజు రెండు దిగ్గజ జట్లు నిష్క్రమిస్తే...రెండో రోజు రెండు మ్యాచ్‌లూ పెనాల్టీ షూటౌట్‌కు దారితీశాయి!ఇందులో క్రొయేషియానే కొట్టేసింది... డెన్మార్క్ ‘అవుటైంది’...! నిజ్ని నవ్‌గొరొడ్: సాకర్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్‌లో మరో రసవత్తర పోరు. ఆదివారం రాత్రి మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా 4–3తో స్పెయిన్‌పై పెనాల్టీ షూటౌట్లో గెలుపొందగా... అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఫలితం వచ్చింది. కాకపోతే, మొదటిదాని కంటే ఇంకొంత ఉత్కంఠగా...! ఇందులో డెన్మార్క్ గట్టి పోటీనిచ్చినా, ఆఖరి కిక్ క్రొయేషియాదే. ఆజట్టు 3–2 తేడాతో నెగ్గింది. నిర్ణీత 90 నిమిషాలతో పాటు, అదనపు అరగంట ముగిశాక కూడా రెండు జట్లూ 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. అప్పటికీ తొలి, నాలుగో కిక్‌లను గోల్ కీపర్లు కాస్పర్ షమిచెల్ (డెన్మార్క్), డానిజెల్ కబాసిక్ (క్రొయేషియా) అడ్డుకోవడంతో స్కోరు 2–2తో నిలిచి ఉద్విగ్నత పతాక స్థాయికి చేరింది. అయిదో కిక్‌ను జొర్గెన్సన్ నెట్లోకి పంపడంలో విఫలం కాగా, రాక్టిక్ విజయవంతమయ్యాడు. ఒకట్లో ఒకటి... నాలుగులో రెండోది ఆటగాళ్లు గోల్పోస్ట్ల వద్దకు దూసుకురావడంతో వెంటవెంటనే ఇరువైపులా స్కోర్లు నమోదయ్యాయి. మొదటి నిమిషంలోనే దూరం నుంచి వచ్చిన పాస్‌ను పెనాల్టీ ఏరియాలో అందుకున్న మథియాస్ జొర్గెన్సన్... పెనుగులాట మధ్య గోల్ చేసి డెన్మార్క్‌ను ఆధిక్యంలో నిలిపాడు. తేరుకున్న క్రొయేషియా 4వ నిమిషంలోనే సమం చేసేసింది. కుడివైపు ప్రాంతంలో బంతిని దొరకబుచ్చుకున్న మారియో మన్డ్జుక్ చిక్కకుండా ముందుకెళ్లి గోల్‌గా మలిచాడు. క్రొయేషియా కళ్లెం వేసినా... డెన్మార్క్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. కానీ, క్రొయేషియా మిడ్‌ఫీల్డ్‌ను దాటి డెన్మార్క్ ముందుకు వెళ్లలేకపోయింది. తీవ్ర స్థాయిలో శ్రమించినా ఎవరూ గోల్ చేయలేకపోయారు. దీంతో అదనపు అరగంట అనివార్యమైంది. జొర్గెన్సన్ ఫౌల్‌తో 116వ నిమిషంలో క్రొయేషియాకు పెనాల్టీ కిక్ దక్కింది. అయితే, మొడ్రిక్ కొట్టిన ఈ షాట్‌ను షెమిచెల్ నిలువరించాడు. ఇది తప్ప మెరుపులు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను అశ్రయించారు. కీపర్ల ప్రతిభతో ఇందులో నాలుగో కిక్ వరకు హై డ్రామా నడించింది. అయిదో కిక్‌ను పొరపాటు చేయకుండా రాక్టిక్ నెట్లోకి కొట్టి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. -
జిల్ జిల్ బ్రెజిల్
జర్మనీ లీగ్ దశలోనే ఇంటికెళ్లింది. నాకౌట్ మొదలైన రోజే అర్జెంటీనా ఓడింది. పోర్చుగల్ కథ ముగిసింది. స్పెయిన్ షూటౌటైంది. ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జట్లన్నీ ఒక్కొక్కటిగా నిష్క్రమించాయి. కానీ మరో ఫేవరెట్ బ్రెజిల్ మాత్రం ఆ హోదాకు న్యాయం చేసింది. ప్రిక్వార్టర్స్‌లో మెక్సికోపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగని మెక్సికో అంత తేలిగ్గా తలవంచలేదు. బ్రెజిల్ దాడుల్ని ఎక్కడికక్కడ నిలువరించింది. అయితే ఐదుసార్లు చాంపియన్‌కు పోటీగా మెక్సికో గోల్స్ చేయడంలో విఫలమై... మళ్లీ ప్రిక్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. సమారా: బ్రెజిల్ తన స్థాయికి తగ్గ ఆటతీరుతో సత్తా చాటింది. సంచలనాన్ని ఆశించిన మెక్సికో కోరల్ని పీకేసింది. ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ దర్జాగా ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫేవరెట్ల నాక్‘ఔట్’లకు తెరవేసింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ 2–0తో మెక్సికోపై జయభేరి మోగించింది. స్టార్ స్ట్రయికర్ నెమార్, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రాబెర్టో ఫర్మినో చెరో గోల్ చేసి బ్రెజిల్ విజయాన్ని ఖాయం చేశారు. రెండు అర్ధభాగాల్లోనూ మెక్సికో ఆటగాళ్లు చక్కటి పోరాటం కనబరిచారు. బంతిని అందిపుచ్చుకోవడంలో ప్రత్యర్థి కంటే చురుగ్గా కదిలారు. కానీ బ్రెజిల్ డిఫెన్స్‌ను ఛేదించలేక గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా తొలి అర్ధభాగంలో మెక్సికో ఒక్కసారి కూడా లక్ష్యంపై గురిపెట్టలేకపోయింది. ఇలా విఫలమవడం టోర్నీలో ఇదే మొదటిసారి. మరోవైపు బ్రెజిల్ అదేపనిగా తమ దాడులకు పదునుపెట్టింది. కానీ ప్రత్యర్థి గోల్ కీపర్ ఒచొవా పాదరసంలా స్పందించడంతో మొదటి అర్ధభాగంలో ఏ ఒక్కటీ గోల్ కాలేకపోయింది. అయితే రెండో అర్ధభాగం మొదలైన ఆరు నిమిషాలకే నెమార్ (51వ ని.) ఈ బెంగ తీర్చాడు. పెనాల్టీ బాక్స్‌లో ఎడమవైపు నుంచి విలియన్ ఇచ్చిన పాస్ ఆపేందుకు ఒచొవా కాస్త ముందుకు డైవ్ చేశాడు. అతన్ని దాటుకుంటూ క్రాస్‌గా వెలుపలికి వెళుతున్న బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టేందుకు జీసెస్... అతని వెనకే నెమార్ ప్రయత్నించారు. జీసెస్‌ను దాటిన బంతి నెమార్ చొరవతో గోల్ అయింది. తర్వాత ఆట 86వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో (88వ ని.) రెండు నిమిషాలకే గోల్ చేసి బ్రెజిల్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. పాస్ల్లోనూ, బంతిని ఆధీనంలో ఉంచుకోవడంలోనూ మెక్సికో ఆటగాళ్లు ప్రత్యర్థులకు దీటుగా పోటీపడ్డారు. కానీ లక్ష్యంపై గురిపెట్టడంలోనే బాగా వెనకబడ్డారు. ఇదే ఈ మ్యాచ్‌లో తేడా. బ్రెజిల్ 20 షాట్లు ఆడింది. పది సార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. రెండుసార్లు సఫలమైంది. మెక్సికో షాట్లలో బ్రెజిల్ అంత కాకపోయినా... 14 షాట్లు ఆడింది. కానీ లక్ష్యంపై ఒక్కసారి మాత్రమే దూసుకొచ్చింది. దాన్ని గోల్‌గా మలచలేక పరాజయం పాలైంది. ►7 1986 ప్రపంచ కప్ నుంచి నాకౌట్లో ప్రిక్వార్టర్స్ చేర్చారు. అప్పటి నుంచి అందరి కంటే ఎక్కువగా ఏడు సార్లు ఓడింది మెక్సికోనే! ►6 ప్రపంచకప్ టోర్నీల్లో నెమార్ 6 గోల్స్ చేసేందుకు 38 షాట్లే ఆడాడు. ఆరేసి గోల్స్ సాధించేందుకు మెస్సీ (అర్జెంటీనా) 67 షాట్లు, రొనాల్డో (పోర్చుగల్) 74 షాట్లు ఆడారు. -
ఫిఫా వరల్డ్ కప్ : మెక్సికోపై బ్రెజిల్ విజయం
మాస్కో : ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన బ్రెజిల్ మరోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. సోమవారం మెక్సికోతో జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించింది. గ్రూప్ దశలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని మట్టికరిపించిన మెక్సికో ఈ మ్యాచ్‌లో ఆ సంచలనాన్ని నమోదు చేయలేక పోయింది. కనీసం ఒక్క గోల్ కూడా నమోదు చేయకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి అర్థబాగం ఇరుజట్లు సమతూకంగా పోరాడాయి. సెకండాఫ్‌లో 51వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు నెమార్ గోల్ సాధించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. అయితే మెక్సికో ఆటగాళ్లు బంతిని తమ ఆదీనంలో ఉంచుకున్నప్పటికి గోల్స్ చేయడంలో విఫలమయ్యారు. ఇక మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా మిడ్‌ఫీల్డర్ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో 88వ నిమిషంలో గోల్ సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లోని గోల్స్‌తో కలిపి బ్రెజిల్ మొత్తం ప్రపంచకప్ టోర్నీల్లో 228 గోల్స్ నమోదు చేసింది. ఓ జట్టుగా ఇవే అత్యధికం కావడం విశేషం. -
స్పెయిన్ ఓటమి.. వెంటనే ప్లేయర్ రిటైర్మెంట్!
మాస్కో : తమ జట్టు కనీసం క్వార్టర్స్ కూడా వెళ్లలేదన్న బాధతో మ్యాచ్ ఓడిన వెంటనే స్పెయిన్ స్టార్ ప్లేయర్ ఆండ్రెస్ ఇనీస్టా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని, ఎన్నటికీ ఈరోజును మరిచిపోలేనంటూ స్పెయిన్ మిడ్ ఫీల్డర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో 34 ఏళ్ల ప్లేయర్ ఆటకు వీడ్కోలు పలికాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2018లో భాగంగా ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓడిపోయి స్పెయిన్ జట్టు ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. ‘నా జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడేశాను. మనం కలలు కన్న తీరుగా కెరీర్‌ను ముగించలేం. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. స్పెయిన్ జట్టు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నానని’ ఆండ్రెస్ బాధతో మాట్లాడాడు. 2010లో ఫైనల్లో నెదర్లాండ్‌పై ఆండ్రెస్ గోల్‌చేసి స్పెయిన్‌కు ఫిఫా వరల్డ్‌కప్ అందించిన క్షణాలను స్పెయిన్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. ఈ ప్రపంచకప్‌లోనే స్పెయిన్ చేతిలో ఓడి గ్రూప్ దశలోనే జట్టు ఇంటిబాట పట్టడంతో ఇరాన్ ఆటగాడు సర్దార్ అజ్మౌన్(23) అతిపిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. అజమౌన్ తర్వాత ఫుట్‌బాల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన ఆటగాడిగా స్పెయిన్ స్టార్ ప్లేయర్ ఆండ్రెస్ ఇనీస్టా నిలిచాడు. తమ జట్లను కనీసం క్వార్టర్స్‌కు కూడా తీసుకెళ్లలేదని, రిటైరవ్వాలంటూ అర్జెంటీనా, పోర్చుగల్ స్టార్ ఫుటాబాల్ ప్లేయర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆతిథ్య రష్యా మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. -
20 ఏళ్ల తర్వాత క్రొయేషియా..
నిజ్నీ నోవ్గారోడ్(రష్యా): ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దుమ్మురేపిన క్రొయేషియా జట్టు ఊహించినట్లే క్వార్టర్స్‌కు చేరింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో క్రొయేషియా 3-2 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇరు జట్లు నిర్ణీత సమయానికి 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌల్లో క్రొయేషియా మూడు గోల్స్ సాధించగా, డెన్మార్క్ రెండు గోల్స్ మాత్రమే చేసింది. దాంతో క్రొయేషియా మరో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. శనివారం ఆతిథ్య రష్యాతో క్రొయేషియా క్వార్టర్స్‌లో తలపడనుంది. వరల్డ్ కప్‌లో క్రొయేషియా క్వార్టర్స్‌కు చేరడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో చివరిసారి క్రొయేషియా క్వార్టర్స్‌కు చేరగా, ఆపై ఇంతకాలానికి మరొకసారి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. నిన్నటి మ్యాచ్‌లో క్రొయేషియా-డెన్మార్క్‌లు మొదటి నాలుగు నిమిషాల వ్యవధిలోనే తలో గోల్స్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనిపించింది. కాగా, ఆపై ఇరు జట్లు అత్యంత రక్షణాత్మకంగా ఆడటంతో అదనపు సమయంలో కూడా గోల్స్‌ను సాధించలేకపోయాయి. దాంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. -
దేశానికి ఆడేందుకు డబ్బులెందుకు?
పారిస్: వరల్డ్ కప్ ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాను పడగొట్టిన కొత్త సంచలనం, 19 ఏళ్ల ఫ్రాన్స్ హీరో కైలియాన్ ఎంబాపె తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ ప్రపంచకప్ ద్వారా తనకు లభిస్తున్న మొత్తాన్ని ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు అతను ప్రకటించాడు. ‘దేశం తరఫున ప్రపంచ కప్ ఆడే అవకాశం రావడమే పెద్ద గౌరవం. దీని ద్వారా నా కల నిజమైంది. ఆడితే డబ్బులు వస్తాయి. కానీ నేను దాని కోసం ఆడటం లేదు’ అని ఎంబాపె పేర్కొ న్నాడు. ‘ఫిఫా’ వరల్డ్ కప్‌లో ఎంబాపెకు ఒక్కో మ్యాచ్‌కు 17 వేల పౌండ్లు (దాదాపు రూ.15 లక్షలు) చొప్పున మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇది కాకుండా ఇతర బోనస్‌ల రూపంలో మరో 3 వేల పౌండ్లు (రూ. 2 లక్షల 71 వేలు) దక్కుతాయి. ఫ్రాన్స్ ప్రపంచ కప్ గెలిస్తే మాత్రం ఈ యువ ఆటగాడికి మరో 2 లక్షల 65 వేల పౌండ్లు (రూ. 2.4 కోట్లు) కూడా లభిస్తాయి. -
రష్యా షూట్... స్పెయిన్ ఔట్
78 వేల మంది ప్రేక్షకులు దిక్కులు పిక్కటిల్లేలా ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా గర్జించింది. ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పెనాల్టీ షూటౌట్లో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసి సగర్వంగా ముందంజ వేసింది. అద్భుత ఆటతో స్పెయిన్‌కు అడ్డు గోడలా నిలిచిన కెప్టెన్, గోల్ కీపర్ అకిన్‌ఫీవ్... ఆఖర్లో రెండు స్పాట్ కిక్‌లను ఆపి రష్యా దేశం చిరకాలం గుర్తుంచుకునే కొత్త హీరోగా అవతరించాడు.120 నిమిషాల ఆటలో రికార్డు స్థాయిలో ఏకంగా 1006 పాస్‌లు...ఆటలో 74 శాతం పాటు బంతి తమ ఆధీనంలోనే... అయినా సరే షూటౌట్ వరకు వెళ్లకుండా గెలుపు అందుకోవడం స్పెయిన్ వల్ల కాలేదు. అతి రక్షణాత్మక ధోరణి ఆడి... గోల్ చేసేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది. మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న రష్యా షూటౌట్లో చెలరేగి వరల్డ్ నంబర్ 10 స్పెయిన్ జట్టును ఇంటిదారి పట్టించింది. ఆదివారం ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా 4–3 స్కోరు (పెనాల్టీ షూటౌట్)తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో రష్యా ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన సెల్ఫ్‌గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం లభించగా... 41వ నిమిషంలో జ్యూబా గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయాయి. ఈ టోర్నీలో తొలిసారి ఫలితం షూటౌట్ ద్వారా తేలగా, రష్యా 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ చేరింది. మ్యాచ్‌లో స్పెయిన్ కొట్టిన 24 షాట్లను గోల్ కాకుండా నిరోధించిన కీపర్ అకిన్‌ఫీవ్ షూటౌట్లోనూ అదే జోరు కొనసాగించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే నెగ్గడం విశేషం. డిఫెన్స్...డిఫెన్స్... రష్యా జట్టు తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ‘అతి పెద్ద’ మ్యాచ్‌లో అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలో 38 ఏళ్ల సీనియర్ ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన తప్పుతో తొలి గోల్ స్పెయిన్ ఖాతాలో పడింది. రష్యా గోల్ పోస్ట్ ఎడమ వైపు నాచోను జిర్కోవ్ అడ్డుకోవడంతో స్పెయిన్‌కు ఫ్రీ కిక్ లభించింది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఇగ్నాషెవిచ్ తన వైపు దూసుకొస్తున్న బంతిపై దృష్టి పెట్టకుండా స్పెయిన్ స్టార్ సెర్గియో రామోస్‌ను మార్కింగ్ చేసే ప్రయత్నం చేస్తూ అతడిని పడేశాడు. ఈ క్రమంలో ఇగ్నాషెవిచ్ కాలికి తగిలిన బంతి రష్యా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోయింది. ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్ గోల్. 1966లో బల్గేరియా తర్వాత ఒకే జట్టు రెండు సెల్ఫ్ గోల్స్ ఇవ్వడం ఇదే మొదటి సారి. అయితే స్పెయిన్ తమదైన శైలిలో ‘టికీ టకా’ పాస్‌లకే కట్టుబడగా... రష్యా మాత్రం ఆ తర్వాత ధాటిని పెంచింది. 41వ నిమిషంలో రష్యా శ్రమ ఫలించింది. ఫ్రీ కిక్‌ను హెడర్ ద్వారా జ్యూబా గోల్‌గా మలిచే ప్రయత్నంలో ఉండగా, బాక్స్ ఏరియాలో గెరార్డ్ పికే చేతితో దానిని అడ్డుకున్నాడు. పికేకు ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు రిఫరీ రష్యాకు పెనాల్టీ కిక్ అవకాశం కల్పించాడు. దీనిని జ్యూబా సునాయాసంగా గోల్‌గా మలచడంతో స్టేడియంలో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 1986 తర్వాత నాకౌట్ దశలో రష్యా చేసిన తొలి గోల్ ఇదే కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో రష్యాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చినా, అది చేజార్చుకుంది. కొద్దిసేపు గడిచే సరికి ఇరు జట్లు బాగా అలసిపోయినట్లు కనిపించాయి. దాంతో అంతా డిఫెన్స్ తరహా ఆటను ప్రదర్శించారు. ఒక దశలో పరిస్థితి ‘వాకింగ్ ఫుట్‌బాల్’లా కనిపించింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మరో అర గంట అదనపు సమయంలో కూడా పరిస్థితి ఏమీ మారలేదు. -
పోర్చు‘గల్లంతు’
ఇటు అర్జెంటీనా... అటు పోర్చుగల్... ఒకే రోజు ఒకే తీరు ఫలితాలు... ఇద్దరు దిగ్గజాల కలలు కల్లలయ్యాయి. మొదట మెస్సీ చిరకాల స్వప్నాన్ని ఎంబాపె (ఫ్రాన్స్) తుడిచిపెడితే... తర్వాత రొనాల్డో ‘ఫిఫా’ వేటను కవాని (ఉరుగ్వే) ముగించాడు. దీంతో ప్రిక్వార్టర్స్‌లోనే మేటి జట్లు నాక్ ‘ఔట్’ అయ్యాయి. ఉరుగ్వే సుడి బాగుంది. రొనాల్డో జట్టును నాకౌట్ దెబ్బకొట్టింది. స్ట్రయికర్ కవాని ‘డబుల్’ ధమాకా పోర్చుగల్‌ను ఇంటిదారి పట్టించింది. మ్యాచ్‌లో ఉరుగ్వే ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. బంతి ఎక్కువగా ప్రత్యర్థి ఆధీనంలో ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఉరుగ్వేదే! ఒక దశలో ఉరుగ్వే ఆటగాళ్లు అలసిపోయినా... గెలిచేదాకా చెమట చిందించారు. ఈ పోరాటానికి, వీరి దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను చూసి రొనాల్డోకు చిర్రెత్తిందేమో సహనం కోల్పోయి ‘ఎల్లో’కార్డు చూపించిన రిఫరీ మీదే ఒంటికాలిపై లేచాడు. స్ఫూర్తి మరిచాడు. సొచీ: పాపం... రొనాల్డోదీ మెస్సీ వ్యథే! పోర్చుగల్ జట్టుదీ అర్జెంటీనా బాటే! ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ అందించాలనుకున్న వీరిద్దరి ఆశలు ప్రిక్వార్టర్స్‌లోనే ఆవిరయ్యాయి. ప్రత్యర్థి పోరాటానికి సమకాలీన దిగ్గజాలు తలవంచక తప్పలేదు. నాకౌట్ దశ మొదలైన తొలి రోజే... ఫ్రాన్స్ దూకుడుకు అర్జెంటీనా, ఉరుగ్వే జోరులో పోర్చుగల్ గల్లంతయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మొదలైన రెండో నాకౌట్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–1తో ‘యూరో’ చాంపియన్ పోర్చుగల్‌ను కంగుతినిపించింది. అనుభవజ్ఞుడైన ఫార్వర్డ్ ఆటగాడు కవాని ఆరంభం నుంచి అంతా తానై నడిపించాడు. తొలి, రెండో అర్ధభాగాల్లో ఒక్కో గోల్ చేసి ఉరుగ్వేకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆట ఆరంభమైన ఏడు నిమిషాలకే సురెజ్ ఇచ్చిన పాస్ విజయవంతమైంది. పెనాల్టీ బాక్స్ వెలుపలి నుంచి సురెజ్ కొట్టిన షాట్‌ను స్ట్రయికర్ కవాని గోల్‌పోస్ట్ ముందే కాచుకున్నాడు. మెరుపు వేగంతో హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో ఉరుగ్వే శిబిరం సంబరాల్లో మునిగింది. స్కోరు సమం చేసేందుకు తొలి అర్ధభాగంలో పోర్చుగల్ స్ట్రయికర్లు పడ్డ కష్టమంతా వృథా అయింది. చురుగ్గా, తెలివిగా పాస్లిస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయింది. చివరకు రెండో అర్ధభాగం మొదలైన 10 నిమిషాలకు గురెరో ఇచ్చిన కార్నర్ పాస్‌ను పెపె (55వ ని.) గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అయితే స్కోరు సమమైన పోర్చుగల్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ కవాని కదంతొక్కాడు. ఆట 62వ నిమిషంలో ఈ సారి బెటంకుర్ ఇచ్చిన పాస్‌ను కవాని ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తాకొట్టిస్తూ రెండో గోల్ సాధించాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఎంత ప్రయత్నించినప్పటికీ గోల్ దిశగా సఫలం కాలేకపోయింది. ఆట 74వ నిమిషంలో కవాని కుడికాలికి గాయమవడంతో మైదానం వీడాడు. నొప్పితో విలవిలలాడుతున్న కవానికి రొనాల్డో సాయమందించాడు. ఈ మ్యాచ్ మొత్తం మీద పోర్చుగల్ షాట్లే ఎక్కువగా దూసుకొచ్చాయి. మ్యాచ్‌లో సింహభాగం వీరి స్ట్రయికర్ల ఆధీనంలోనే బంతి ఆడింది. దీంతో ఉరుగ్వే (273) కంటే పోర్చుగల్ (544) రెట్టింపు పాస్‌లను ప్లేస్ చేసింది. కానీ సరైన దిశ, ఫినిషింగ్ లేక మూల్యం చెల్లించుకుంది. పోర్చుగల్ 20 షాట్లు ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్ దిశగా ఆడారు. ఇందులో ఐదుసార్లు లక్ష్యంపై గురిపెడితే ఒక్కసారి మాత్రమే గోల్ అయింది. మరోవైపు ప్రత్యర్థి షాట్లను ఎక్కడికక్కడ నిలువరించిన ఉరుగ్వే మాత్రం కొట్టింది ఐదు షాట్లే. లక్ష్యంపై మూడు సార్లు గురిపెట్టిన ఆ జట్టు రెండు సార్లు గోల్ చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఉరుగ్వే తలపడనుంది. ► ‘ఫిఫా’ ప్రపంచకప్ చరిత్రలో ఉరుగ్వే వరుసగా 4 మ్యాచ్‌లు గెలవడం ఇది రెండోసారి. 1930లో ఉరుగ్వే విజేతగా నిలిచిన టోర్నీలో ఇలాగే జరిగింది. రిఫరీపై రొనాల్డో ఆగ్రహం పోర్చుగల్ అభిమాని కంట కన్నీరు ప్రపంచకప్‌లో నేడు ప్రిక్వార్టర్ ఫైనల్స్ బ్రెజిల్ x మెక్సికో రా.గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రా.గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఫిఫా వరల్డ్ కప్: ఎవరీ ఎంబాపె?
సోచి: కైలిన్ ఎంబాపె.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. అర్జెంటీనాతో మ్యాచ్ ముందు వరకు కైలిన్ ఎంబాపె గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. కారణం... 19 ఏళ్ల ఈ ఫ్రాన్స్ కుర్రాడు అర్జెంటీనాపై రెండు గోల్స్ చేసి.. మెస్సీ జట్టును ఇంటికి పంపించడంతో పాటు ఫ్రాన్స్‌ను వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. చివరిసారిగా ఫ్రాన్స్ 1998లో ప్రపంచకప్ గెలిచింది. ఆ కప్పు ఫ్రాన్స్ గెలిచే నాటికి ఎంబాపె పుట్టనేలేదు. ఆ ఏడాది డిసెంబర్లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎంబాపెకు పుట్ బాల్ అంటే ప్రాణం. ఇంట్లో, వీధిలో ఎక్కడ చూసినా బంతితోనే కనబడేవాడు. ఎంబాపె తండ్రి కూడా స్థానిక ఎఎస్ బాండి ఫుట్‌బాల్ కోచ్ కూడా. దీంతో 16 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ ఆరంభించాడు. ఫ్రెంచ్ క్లబ్ జట్లలో ఎక్కువగా ఆకట్టుకున్న ఎంబాపె.. స్పానిష్ క్లబ్ జట్లైన రియల్ మాడ్రిడ్, వాలెన్సియా తరపున కూడా ప్రాతినిథ్యం వహించాడు. 11 ఏళ్లకే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టైన చెల్సియా తరపున ఆడిన చరిత్ర ఎంబాపెది. పిన్నవయస్కుడిగా.. టోర్నీలో భాగంగా శనివారం అర్జెంటీనాతో జరిగిన నాకౌట్ పోరులో ఫ్రాన్స్ 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు కైలిన్ ఎంబాపె మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. పుట్‌బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్ ఆటగాడు కైలిన్ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డోనే స్ఫూర్తి.. ఎంబాపెకు అత్యంత ఇష్టమైన క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. తనకు అతనే స్ఫూర్తిగా చెబుతున్న ఎంబాపె.. దేశం కోసం మ్యాచ్‌లు గెలవడమే ఎక్కువ సంతోషాన్ని తీసుకొస్తుందన్నాడు. డబ్బు కంటే కూడా దేశం కోసం ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్‌లో వచ్చిన నజరానాను చారిటీలకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. -
రష్యాలో భారత అభిమాని దుర్మరణం
సోచి: ఫిఫా వరల్డ్‌కప్ చూడటానికి రష్యాకు వెళ్లిన ఓ భారత అభిమాని అక్కడ జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం పోర్చుగల్, ఉరుగ్వే మ్యాచ్ చూసి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగి ఆదిత్య రంజన్ అనే భారత అభిమాని మృత్యువాత పడినట్లు భారత అధికారులు వెల్లడించారు. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న సోచి నగరానికి సమీప ప్రాంతమైన కూబన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత అభిమాని మరణించిన విషయాన్ని అక్కడ భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. కారును ఓ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు భారత పౌరుడైన రంజన్ కూడా మరణించినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నోవోస్తి తెలిపింది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో భారతీయుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. బాధితుడి కుటుంబంతో ఎంబసీ టచ్‌లో ఉన్నదని ఆయన చెప్పారు. మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
మెస్సీని మించినోడు.. మంచి మనసున్నోడు!
మాస్కో: కైలిన్ ఎంబాపె.. ఎక్కడ చూసిన ఇప్పుడంతా అతని పేరే.. గూగలమ్మను కూడా అందరూ ఇతని గురించే అడుగుతున్నారంటా.. ఎందుకంటే ఫిపా ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన మెస్సీ బృందాన్ని ఫ్రిక్వార్టర్లోనే ఇంటికెళ్లగొట్టాడు.. ఈ 19 ఏళ్ల ఫ్రాన్స్ ఫార్వర్డ్ ప్లేయర్. పుట్‌బాల్ ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడైన మెస్సీకి తన ఆటతో భారీ షాక్ ఇచ్చాడు. శనివారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఎంబాపే దెబ్బకు అర్జెంటీనా 4-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో తన జట్టును గెలిపించి సూపర్ హీరో అయిన ఎంబాపే.. ఈ టోర్నీ ద్వారా తను ఆర్జించే జీతాన్ని ఓ చారిటీకి విరాళంగా ఇచ్చేస్తానని తెలిపి మంచి మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని లారస్ స్పోర్ట్స్ ట్విటర్లో ప్రకటించింది. ‘ఈ టోర్నీ ద్వారా ఎంబాపే సంపాదించే ప్రతి రూపాయిని చారిటీకి విరాళంగా ఇవ్వనున్నాడు. అతను ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.16 లక్షలు ఆర్జించనున్నాడు. ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చేయనున్నాడు. ఆటగాళ్లు దేశకోసం ఆడాలి తప్పా డబ్బుల కోసం కాదనే విషయాన్ని ఎంబాపే విశ్వసిస్తాడు’ అని ట్వీట్ చేసింది. ఇక ఎంబాపే నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఎం‘బాప్రే’..! -
పీలే తర్వాత ఎంబాపె!
మాస్కో: అర్జెంటీనాతో మ్యాచ్ ముందు వరకు కైలిన్ ఎంబాపె గురించి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా గూగ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి గత ప్రపంచకప్ ఫైనలిస్ట్‌ను ఇంటికి పంపించిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతపుట్బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు. 1958 సాకర్ ఫైనల్ సమరంలో స్వీడన్‌పై రెండు గోల్స్ చేసి పీలే ఈ ఘనత సాధించాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్ ఆటగాడు కైలిన్ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా- ఫ్రాన్స్ మ్యాచ్ అనంతరం ఎంబాపెకు ట్విటర్ ద్వారా పీలే అభినందనలు తెలపడం ఇక్కడ మరో విశేషం. Congratulations, @KMbappe. 2 goals in a World Cup so young puts you in great company! Good luck for your other games. Except against🇧🇷! 😅/ Parabéns, Kylian. Marcar 2 gols em uma partida da Copa te coloca em boa companhia! Boa sorte no resto da competição. Exceto contra o 🇧🇷! https://t.co/DW0XcJF49m — Pelé (@Pele) June 30, 2018 -
రొనాల్డో-మెస్సీలపై జోకులే జోకులు
సోచి : వారి పాదాల మధ్య బంతి పాదరసంలా జారుతుంది. గోల్ కొడితే గురి తప్పడం అరుదు.దశాబ్ద కాలానికి పైగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను మైమరిపించిన ఆ మాయగాళ్లే లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే ఈ పేర్లు ప్రపంచమంతా హోరెత్తాయి. ఈసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనీ వారు సైతం కలలు కన్నారు. కానీ.. ఆ కలలు నెరవేరలేదు. మెస్సీ, రొనాల్డోలు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఫిఫా ప్రపంచకప్ నుంచి ఒకే రోజు నిష్క్రమించాయి. ప్రధానంగా మెస్సీ, రొనాల్డోలు వైఫల్యం చెందడంతో టైటిల్ ఫేవరెట్లుగా దిగిన అర్జెంటీనా, పోర్చుగల్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా మెస్పీ, రొనాల్డోలపై జోకుల వర్షం కురుస్తోంది. ఆ ఇద్దర్నీ ఇప్పటివరకూ దిగ్గజ ఆటగాళ్లుగా అభిప్రాయపడిన అభిమానులు.. తమ అభిప్రాయాన్ని సైతం మార్చుకుని విమర్శలు గుప్పించారు. ‘ఏనాడు వరల్డ్‌కప్ నాకౌట్ గేమ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయని వీరిద్దరూ ఒకే రోజు ఒకే రకంగా వరల్డ్ కప్‌ను వీడారు’ అంటూ అని ఒక అభిమాని సెటైర్ వేయగా, ‘రొనాల్డ్ జట్టుతో మెస్సీ ఆడినట్లయితే అంతర్జాతీయ గోల్స్ కంటే కూడా ఎక్కువసార్లు వీడ్కోలు ప్రకటించే అవకాశం దక్కేది’అని మరొక అభిమాని విమర్శించాడు. ‘రొనాల్డో-మెస్సీలు ఎయిర్‌పోర్ట్‌లు ఎదురుపడితే అది కచ్చితంగా జోక్‌గా నిలిచిపోతుంది’అని మరొకరు చమత్కరించారు. ‘ఈరోజు రాత్రి వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. రొనాల్డో-మెస్సీలు ఎయిర్‌పోర్ట్‌లు కలిస్తే ఇలానే ఉంటుందంటూ రెండు మేకలు ఉన్న ఫొటోను మరొకరు ట్వీట్ చేశారు. -
సాకర్ సమరం: మరో ఫేవరేట్ జట్టు నిష్ర్కమణ
-
ఫిఫా ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం
ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు.. ఈసారైనా ఈ దిగ్గజ ఆటగాడు కప్ గెలుస్తాడనుకున్నారు.. కానీ అతని పయనం మెస్సీ దారిలోనే నడిచింది. ప్రపంచకప్ తీరని కలగానే మిగిలింది క్రిస్టియానో రొనాల్డోకు.. ఎక్కువ సేపు బంతి ఆధీనంలో ఉన్నా గోల్ చేయలేని నివ్వెర పరిస్థితి రొనాల్డో సేనది.. లీగ్ దశలో ఓటమెరుగని ఉరుగ్వే.. అదే పోరాటం, కసితో ఆడి పోర్చుగల్‌పై పోరాడి గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఢీ కొట్టడానకి సై అంటోంది. సోచి : ఫిఫా ప్రపంచకప్‌లో మరో దిగ్గజ జట్టు పోరాటం ముగిసింది. ఎన్నో అంచనాల నడుమ సాకర్ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్ ఫైనల్లో జులై 6న ఫ్రాన్స్‌తో తలపడనుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే రోనాల్డో సేనకు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు ఉరుగ్వే ఫార్వర్డ్ ప్లేయర్ ఎడిన్సన్ కావనీ. సువారెజ్ ఇచ్చిన పాస్‌ను ఈ స్టార్ స్ట్రైకర్ హెడర్ గోల్ చేసి ఉరుగ్వేకు తొలి గోల్ అందించాడు. అనంతంరం ఫ్రికిక్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రొనాల్డో మిస్ చేశాడు. మరో గోల్ నమోదు కాకుండానే తొలి భాగం ముగిసింది. ద్వితీయార్థం ముగియగానే దాడిని మరింత పెంచిన రొనాల్డో సేనకు ఫలితం లభించింది. 55వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో ఇచ్చిన పాస్‌తో డిఫెండర్ పెపె గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యాయి. పోర్చుగల్ శిభిరంలో ఆనంద ఎంతో సేపు నిలువలేదు. రొనాల్డో సేన డిఫెండింగ్ వైఫల్యంతో ఎడిన్సన్ కావనీ మరో అద్భుతమైన గోల్ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్లు మరో గోల్ కోసం పోటీపడినా ఇరు జట్ల రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. ఇక ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు చేయలేకపోయిన పోర్చుగల్ ఓటమితో నిష్క్రమించింది. మ్యాచ్‌లో 63 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలో ఉన్నా గోల్ చేయటంలో స్ట్రైకర్లు విఫలమ్యారు. రొనాల్డో సేన ఎనిమిది సార్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమయింది. ఈ మ్యాచ్‌లో ఏకైక ఎల్లో కార్డు రిఫరీలు రొనాల్డోకు చూపించారు. పోర్చుగల్ 12 అనవసర తప్పిదాలు చేయగా ఉరగ్వే 13 తప్పిదాలు చేసింది. -
ఆతిథ్య జట్టుతో ఆడటం సవాలే
స్పష్టమైన ఫేవరెట్ లేకుండా నాకౌట్ పోరు మొదలైంది. ఈ దశలో ఆట ఎప్పటికప్పుడు మారుతుంది. అయితే ఇక్కడ కొన్ని మ్యాచ్‌ల్లో విజేతలెవరో అంచనాకు రావొచ్చు. రష్యా కంటే స్పెయిన్, డెన్మార్క్ కంటే క్రొయేషియా మెరుగైన జట్లు కాబట్టి ఆ రెండు జట్లకు గెలిచే అవకాశాలుంటాయి. ఈసారి జర్మనీలాగే... 2010 చాంపియన్ స్పెయిన్ కూడా నాలుగేళ్ల క్రితం లీగ్ దశలోనే కంగుతింది. దీనికి కారణాలు కూడా ఒకలాగే ఉన్నాయి. విజేతలుగా నిలిచిన సమయంలో అనుభవజ్ఞులు బాగా ఆడారు. ఇప్పటి స్పెయిన్‌లో కొత్తగా వచ్చిన వాళ్లు చాలా ప్రతిభావంతులు. తాజా ఆలోచనలు... భిన్నమైన గేమ్ప్లాన్లతో దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇదే స్పెయిన్ జట్టును టాప్ గేర్‌లో దూసుకెళ్లెలా చేయొచ్చు. అలాగే... అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రష్యా ఆట కూడా చూడముచ్చటగా ఉంది. ఈ జట్టు తమదైన రోజు మేటి జట్లను ఘోరంగా దెబ్బతీస్తుంది. ప్రతిభపరంగా రష్యా మేటి జట్లకు దీటుగానే ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేతో ఎదురైన పరాజయం రష్యాను నిరాశపరిచి ఉండొచ్చు... కానీ లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య జట్టుతో మ్యాచ్ ఎలాంటి ప్రత్యర్థికైనా క్లిష్టమే! మరో మ్యాచ్ విషయానికొస్తే క్రొయేషియా పటిష్టమైన జట్టు. మోడ్రిక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అనుభవం, నైపుణ్యంతో ఈ జట్టు అదరగొడుతోంది. డెన్మార్క్‌ను ఓడించే సత్తా క్రొయేషియాకు ఉంది. -
ఎం‘బాప్రే’..!
కొదమ సింహాలు కదంతొక్కిన వేళ... ఆటగాళ్ల దూకుడుతో పోటీ రక్తికట్టింది... ఆధిపత్యం అటుఇటు చేతులు మారింది... గోల్స్‌పై గోల్స్‌తో నాకౌట్ కిక్కెక్కించింది... ఆఖరి క్షణాల వరకు ఉత్కంఠ రేకెత్తింది... ఫ్రాన్స్ టీనేజ్ మెరిక కైలిన్ ఎంబాపె మెరుపులకు అర్జెంటీనా వెలుగు మసకబారింది! ఫలితంగా సూపర్ స్టార్ మెస్సీ నాయకత్వంలోని జట్టు పయనం 2018 ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. కజన్: ప్రపంచ కప్ నుంచి అర్జెంటీనా నిష్క్రమించింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ అసహాయుడిగా మిగిలిపోగా... గత మ్యాచ్ హీరో మార్కస్ రొజొ ‘మొదటే’ ముప్పు తెచ్చిపెట్టగా... కీలక సమయంలో దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక... ప్రత్యర్థిని మరెవరూ నిలువరించలేని పరిస్థితుల్లో ఆ జట్టు పరాజయం మూటగట్టుకుంది. 19 ఏళ్ల యువ కెరటం కైలిన్ ఎంబాపె మెరుపులు... బెంజమిన్ పవార్డ్ చురుకైన ఆటతో తొలి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌దే పైచేయి అయింది. మాజీ చాంపియన్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన పోరులో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను మట్టికరిపించింది. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనాపై ఫ్రాన్స్ జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. ఫ్రాన్స్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎంబాపె (64వ, 68వ నిమిషాలు) రెండు గోల్స్ కొట్టగా, ఆంటోన్ గ్రీజ్మన్ (13వ ని.), పవార్డ్ (57వ ని.) చెరో గోల్ చేశారు. అర్జెంటీనాకు డి మారియా (41వ ని.), మెర్కాడో (48వ ని.), కున్ అగ్యురో (90+3వ ని.) స్కోరు అందించారు. ఆ హీరోనే దెబ్బకొట్టాడు... ఫ్రాన్స్ ఏకంగా ఆరు మార్పులతో మ్యాచ్‌లో దిగింది. దిగ్గజ జట్ల మధ్య పోటీ అందుకు తగ్గట్లే ప్రారంభమైంది. మాస్కెరనో షాట్‌తో అర్జెంటీనాకు మొదటి అవకాశం దక్కింది. మరోవైపు గ్రీజ్మన్ కొట్టిన ఫ్రీ కిక్ గోల్బార్ అంచుల్లోంచి పక్కకుపోయింది. 4–3–3 వ్యూహంతో దిగిన అర్జెంటీనా కంటే ఫ్రాన్సే (4–2–3–1) సౌకర్యంగా కనిపించింది. గత మ్యాచ్‌లో నైజీరియాపై కీలక గోల్‌తో హీరోగా నిలిచిన రొజొ ఈసారి పెద్ద పొరపాటు చేశాడు. 11వ నిమిషంలో పాస్‌ను అందుకుని పరిగెడుతున్న ఎంబాపెను కిందపడేశాడు. దీంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గ్రీజ్మన్... సునాయాసంగా నెట్లోకి కొట్టి జట్టుకు ఆధిక్యం అందించాడు. తర్వాత సైతం వేగం, బంతిని అట్టిపెట్టుకుంటూ పాస్‌లతో ప్రత్యర్థిని ఎంబాపె హడలెత్తించాడు. మరోవైపు 19వ నిమిషంలోనూ ఫ్రాన్స్‌కు ఫ్రీ కిక్ లభించినా పోగ్బా సద్వినియోగం చేయలేకపోయాడు. అటు సహచరుల నుంచి పాస్‌లు అందకపోవడంతో మెస్సీ వద్దకు బంతి రావడమే గగనమైంది. పైగా ఫ్రాన్స్ దాడులు చేసేలా అర్జెంటీనా దారిచ్చింది. ప్రతిఘటించే ప్రయత్నంలో వరుసగా ఇద్దరు ఆటగాళ్లు ఎల్లోకార్డులు అందుకున్నారు. అగ్యురో, హిగుయెన్లను దింపకపోవడం కూడా దెబ్బకొట్టింది. సెంటర్ ఫార్వర్డ్ లేకపోవడంతో ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని ఇబ్బంది పెట్టలేకపోయింది. ఐనా అర్జెంటీనా బంతిని నియంత్రణలో ఉంచుకుంది. తొలి భాగం ముగియవస్తుందనగా... బనేగా పాస్‌ను డి బాక్స్ ముందు అందుకున్న డి మారియా 25 గజాల నుంచి గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆధిక్యంలో నిలిచినా... రెండో భాగం ప్రారంభంలోనే అర్జెంటీనాకు ఊహించని రీతిలో గోల్ దక్కింది. బాక్స్ ఏరియా లోపల పాస్‌ను అందుకున్న మెస్సీ గోల్‌పోస్ట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. నేరుగా వస్తే ఫ్రాన్స్ కీపర్ దానిని నిరోధించేవాడే. కానీ మధ్యలో ఉన్న మెర్కాడొ కాలికి బంతి నెట్లోకి చేరింది. అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆనందాన్ని పవార్డ్ పది నిమిషాల్లోనే ఆవిరి చేశాడు. హెర్నాండెజ్ అందించిన క్రాస్ పాస్‌ను సరిగ్గా డి బాక్స్ దగ్గర దొరకబుచ్చుకున్న పవార్డ్... ఓవైపు ఒరుగుతూ ముచ్చటైన రీతిలో గోల్‌గా మలిచాడు. గణాంకాలు 2–2తో సమమై... అరగంట ఆట మాత్రమే మిగిలి ఉన్న దశలో ఎంబాపె విజృంభించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి ఫ్రాన్స్‌ను పైమెట్టున నిలబెట్టాడు. 64వ నిమిషంలో మరోసారి హెర్నాండెజ్ క్రాస్ ఇవ్వగా... గోల్‌పోస్ట్ ఎదుట జరిగిన డ్రామాలో ఎంబాపె చురుగ్గా స్పందించి బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. తర్వాతి గోల్‌ను అయితే మళ్లీమళ్లీ చెప్పుకొనేలా కేవలం మూడంటే మూడే పాస్‌ల్లో నెట్లోకి కొట్టాడు. అర్జెంటీనా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినా... దాదాపు అందుకోలేనంత ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ మ్యాచ్‌ను మరింత ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మెస్సీ బృందం చేసేదేమీలేకపోయింది. ఇంజ్యూరీ సమయంలో మెస్సీ క్రాస్ పాస్‌ను అగ్యురో హెడర్ గోల్‌తో ఒకింత ఆశ రేపాడు. చివరి క్షణం (90+6)లోనూ అద్భుతం జరుగుతుందేమో అనిపించింది. అయితే బంతి గోల్‌పోస్ట్ పైకి వెళ్లడంతో అర్జెంటీనా ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్ హర్షాతిరేకాల్లో మునిగిపోయింది. మెస్సీని మించినోడు... అర్జెంటీనాను ముంచినోడు అర్జెంటీనా దిగ్గజం, 31 ఏళ్ల లియోనల్ మెస్సీకి ప్రపంచ కప్‌ను తీరని కలగానే మిగిల్చిన ఈ మ్యాచ్... 19 ఏళ్ల ఫార్వర్డ్ ఎంబాపెను అంతర్జాతీయ స్టార్‌ను చేసింది. వాస్తవానికి రెండు జట్ల మధ్య తేడా ఎంబాపెనే. చిరుత పరుగుతో మ్యాచ్ గతినే మార్చేశాడతడు. పాస్‌లతో పాటు ఆట ఆసాంతం ఒకే వేగం కనబర్చిన ఎంబాపె నాలుగు నిమిషాల తేడాతో రెండు గోల్స్ కొట్టి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. అతడిని అందుకునే ప్రయత్నంలోనే అర్జెంటీనా గత మ్యాచ్ హీరోలు బనేగా, రొజొ ఎల్లో కార్డులకు గురయ్యారు. ఫ్రాన్స్ జట్టులో అందరి దృష్టి గ్రీజ్మన్, పోగ్బాపై ఉండగా... వారిని తోసిరాజంటూ ఎంబాపె సరికొత్త హీరోగా అవతరించాడు. మళ్లీ వస్తావా మెస్సీ...? అన్నీ తానే అయి రెండు ప్రపంచ కప్‌లలో అర్జెంటీనాను నడిపించిన మెస్సీ మరో కప్‌లో ఆడతాడనేది అనుమానమే. ఇప్పటికే ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి, అందరి ఒత్తిడితో విరమించుకున్న అతడు... రష్యాలో ఏమంత ప్రభావం చూపలేకపోయాడు. ఐస్లాండ్ వంటి ప్రత్యర్థి కూడా అతడే లక్ష్యంగా వ్యూహం రచించి విజయవంతమైంది. నైజీరియాతో మ్యాచ్‌లో మాత్రమే గోల్ కొట్టగలిగిన మెస్సీ ... ఫ్రాన్స్‌పై మెరుపు పాస్‌లు అందించి స్కోరుకు దోహదపడగలిగాడు. కానీ తన స్థాయి ఆటగాడు గోల్ కొడితేనే ప్రత్యర్థికి పంచ్ తగులుతుంది. ప్రపంచకప్‌లో తమ జట్టు పయనంపై తన రిటైర్మెంట్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని మెస్సీ నెల క్రితం ప్రకటించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో...? కొసమెరుపు: క్రీడల్లో 10వ నంబర్ జెర్సీకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. క్రికెట్లో సచిన్ ఇదే జెర్సీ ధరించేవాడు. మెస్సీది కూడా 10వ జెర్సీనే. ఈ మ్యాచ్‌లో మెరిసిన ఎంబాపె 10వ నంబరు జెర్సీతోనే ఆడాడు. మెస్సీ తన మార్కు చూపలేకపోయాడు. విశేషాలు ► తాను ఆడిన ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు మెస్సీ ఒక్క గోల్ చేయకపోవడం గమనార్హం. ► ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కేవలం ఐదోసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ సమర్పించుకుంది. ► 1986లో బెల్జియం (యూఎస్ఎస్ఆర్ చేతిలో 3–4తో ఓటమి) తర్వాత కనీసం మూడు గోల్స్ చేసి ప్రపంచకప్ మ్యాచ్‌లో పరాజయం పాలైన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. ► గ్రీజ్మన్ గోల్ చేసిన మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఫ్రాన్స్ ఓడిపోలేదు. -
ఫిఫా సమరం: మెస్సీ కథ ముగిసింది
మాస్కో: ఫుట్‌బాల్ దిగ్గజం.. అభిమానుల ఆరాధ్య దైవం లియోనల్ మెస్సీ పోరాటం ముగిసింది. శనివారం ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్ పోరులో అర్జెంటీనా 4-3 తేడాతో ఓటమి పాలైంది. గ్రూప్ దశలో వరుస విజయాలందుకున్న ఫ్రాన్స్ తన జైత్రయాత్రను కొనసాగించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న కైలియన్ ఎంబాపె వరుసగా రెండు అద్భుత గోల్స్ అందించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఒత్తిడికిలోనైన ఆర్జెంటీనా ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నారు. 68వ నిమిషంలో లభించిన పెనాల్టీ సాకర్యాన్నీ మెస్సీ వృథా చేశాడు. తొలి అర్థబాగం వరకు ఇరు జట్లు సముతుకంగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్‌తో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ 13వ నిమిషంలో తొలి గోల్ నమోదు చేశాడు. అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డి మారియా 41 వ నిమిషంలో గోల్ చేయడంతో స్కోర్స్ సమమయ్యాయి. ఇక బ్రేక్ అనంతరం అర్జెంటీనా ఆటగాడు గాబ్రియేల్ మెర్కాడో 48వ నిమిషంలో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఆధిక్యం సాధించింది. 57వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ పెవార్డ్ గోల్ అందించడంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా ఎంబాపె 64, 68వ నిమిషంలో స్టన్నింగ్ గోల్స్ అందించడంతో అర్జెంటీనా కోలుకోలేకపోయింది. చివర్లో మెర్కాడో గోల్ సాధించినా అర్జెంటీనా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది. -
ఘనంగా స్వాగతం పలికి.. గుడ్లతో దాడి చేశారు!
సియోల్ : ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన దక్షిణ కొరియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు తొలుత అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించినా ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఫొటోసెషన్ కోసం సిద్దమైన ఆటగాళ్లపై అభిమానులు గుడ్లు, దిండ్లతో దాడి చేశారు. కనీసం నాకౌట్‌కు కూడా చేరని ఆటగాళ్లకు ఫొటోసెషన్ ఎందుకని మీడియా సిబ్బందిని సైతం అడ్డుకున్నారు. అయితే ఢిఫెండింగ్ చాంపియన్, ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేత అయిన జర్మనీని ఓడించి దక్షిణ కొరియా పెను సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్నూ తనతో పట్టుకుపోయింది. కనీసం ఈ గెలుపుతోనైనా అభిమానులు సంతోషిస్తారని భావించిన కొరియా ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. గ్రూప్ దశలో నిష్క్రమించి జూన్‌లోనే స్వదేశం చేరుతామనుకోలేదని జట్టు మేనేజర్ షిన్ ఆవేదన చెందారు. నాకౌట్‌కు చేరి జూలై ఆసాంతం ఆడుతామని భావించామని, కానీ అలా జరగలేదన్నారు. అభిమానుల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ...క్షమాపణలు కూడా తెలియజేశారు. అభిమానులకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయామని, కానీ జర్మనీపై గెలవడంతో వారు కొంత సంతోషపడ్డారని భావిస్తున్నామని తెలిపారు. అయితే అభిమానులు విసిరిని గుడ్లు షిన్‌కు సమీపంలో పడటం గమనార్హం. -
1982 తర్వాత తొలి‘సారీ’
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ అందరి సరదాను తీరుస్తుందంటారు. అనుకోని జట్లు అద్బుత విజయాలతో దూసుకపోతుంటే.. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటాయి. సాకర్ సమరంలో ఒక ఘట్టం(గ్రూప్ దశ) పూర్తయింది. ఇక ప్రతీ మ్యాచ్ అన్ని జట్లకు చావోరేవో. చిన్నచితకా జట్లు, ఆగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఇంటికి పంపించిన ఈ మెగా టోర్నీలో ఆఫ్రికా అభిమానుల కోరిక మాత్రం తీరకుండా అలాగే మిగిలి ఉంది. తమ ఖండపు జట్టు కనీసం సెమీస్‌కు చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల ఆశలు ఈసారి కూడా ఆవిరయ్యాయి. రష్యాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ ఆఫ్రికా జట్టు రౌండ్16కు చేరలేకపోయింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండపు జట్టు నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. రష్యాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఈసారి అత్యధికంగా ఐదు ఆఫ్రికా జట్లు(నైజీరియా, మొరాకో, ట్యూనీషియా, ఈజిప్ట్, సెనెగల్) అర్హత సాధించాయి. అయితే ఈ దఫా విశ్వసమరంలో ఆఫ్రికా జట్లకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ హెచ్లో జపాన్, సెనెగల్ జట్లకు సమాన పాయింట్లు లభించినా ఫెయిర్ ప్లే కింద జపాన్(ఆసియా నుంచి ఏకైక జట్టు) రౌండ్ 16లోకి అడుగుపెట్టగా.. సెనెగల్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఒక్క జట్టైనా నాకౌట్‌కు చేరుతుందనుకున్న ఆఫ్రికా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఈజిప్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. మొరాకో కూడా 20 సంవత్సరాల తర్వాత సాకర్‌లోకి అడుగుపెట్టి రెండు ఓటములు, ఒక డ్రాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆఫ్రికన్ అభిమానులు, క్రీడా పండితులు ఎంతో నమ్మకం పెట్టుకున్న నైజీరియా ఒక్క విజయం రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదలొగింది. ట్యూనీషియా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించి అభిమానులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. సెమీఫైనల్ చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల కల రష్యాలో కుదరలేదు.. కనీసం ఖతార్‌లోనైనా సాధ్యపడుతుందో చూడాలి. -
‘నన్ను చంపినవారిని పట్టించండి’
మాస్కో: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డీగో మారడోనాకు చిర్రెత్తుకొచ్చింది. అర్జెంటీనా- నైజీరీయా మ్యాచ్ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైన ఈ దిగ్గజం.. స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పోందిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే మారడోనా గుండె పోటుతో మరణించాడంటూ కొందరు పుకార్లు సృష్టించారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో హల్ చల్ చేశారు. అవికాస్త వైరల్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. స్పందించిన దిగ్గజం.. ‘మరణ వార్త’పై మారడోనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించారు. చనిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కొందరు కల్పించారు అని మండిపడ్డారు. ఇక అంతటితో ఆగకుండా తనను చంపిన వారిని(చనిపోయినట్టు మెసేజ్ చేసినవారిని) పట్టించినవారికి పది వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఆ కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మారడోనా వ్యక్తిగత న్యాయవాది తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంజీనా- నైజీరియా మ్యాచ్ సందర్భంగా మారడోనా ప్రవర్తించిన తీరు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ ప్రేక్షకులను గేలి చేస్తూ చేతితో అసభ్యకర సంజ్ఞలు చేయండపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మారడోనాపై కోపంగానే కోందరు ఆకతాయిలు ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నాకౌట్ ‘బాల్’ మారింది...
సాకర్ ప్రపంచకప్‌లో బంతి మారుతోంది. లీగ్ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన బంతి స్థానంలో కొత్తగా ఎరుపు–తెలుపు బంతి రానుంది. ఇప్పటికైతే అడిడాస్ తయారు చేసిన ‘టెల్‌స్టార్ 18’ అనే బంతితో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. నాకౌట్ దశ నుంచి ఈ బంతికి బదులు ‘టెల్‌స్టార్ మెక్టా’ అనే బాల్‌ను వినియోగించనున్నారు. నాకౌట్‌కు చేరిన దేశాల జెండా రంగులు అందులో ప్రతిబింబించేలా టెల్‌స్టార్ మెక్టాను రూపొందించారు. మెక్టా అంటే ‘కల’ అని అర్థం. శనివారం నుంచి ఈ కల మన కళ్లముందు ఆడనుంది. -
అజేయ బెల్జియం
కలినిన్‌గ్రాడ్: ప్రపంచకప్ గెలవగల జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టిన బెల్జియం... అదే స్థాయి ఆటతో లీగ్ దశను అజేయంగా ముగించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి 9 పాయింట్లతో గ్రూప్ ‘జి’లో అగ్రస్థానం సాధించింది. గురువారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 1–0తో నెగ్గింది. జానుజాజ్ (54వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. రెండు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే నాకౌట్ చేరిన నేపథ్యంలో మ్యాచ్ గణాంకాలు గ్రూప్ టాపర్ ఎవరో తేల్చేందుకే ఉపయోగపడ్డాయి. పనామాపై ట్యూనీషియా విజయం గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో పనామాపై ట్యూనీషియా 2–1తో నెగ్గింది. ట్యూనీషియా ఆటగాడు యాసిన్ మెరాయ్ 33వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో పనామాకు ఆధిక్యం దక్కింది. అయితే, బెన్ యూసెఫ్ (51వ నిమిషం), ఖజ్రీ (66వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు. -
ఎవరిదో నాకౌట్ ‘కిక్’!
ఇదికాకుంటే... మరోటి అనుకునేందుకు లేదు. వెనుకబడితే... వెన్నులో వణుకు పుట్టినట్లే. గెలిస్తే ముందుకు... లేదంటే ఇంటికే. ‘కిక్’ ఎవరిదో... వారే నాకౌట్ విజేత! నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్ సమరం...! మాస్కో: అభిమానులను ఉర్రూతలూగిస్తూ... ఫుట్‌బాల్ ప్రపంచకప్ రెండో అంకానికి చేరింది. 32 జట్లు సగమై 16 మిగిలాయి. ఈ సగంలో మరింత ముందుకెళ్లే సగమేవో తేల్చేందుకు శనివారం నుంచే పోరు. కజన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచే దిగ్గజాలైన అర్జెంటీనా–ఫ్రాన్స్ మధ్య. ప్రిక్వార్టర్స్ దశలోనే తలపడుతున్న మాజీ విజేతలు ఈ రెండే కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఉరుగ్వే ‘ఢీ’ కొట్టనుంది. చిత్రమేమంటే ఇప్పటివరకు కప్ గెలుచుకున్న 8 దేశాల్లో ఇటలీ ఈసారి అర్హత సాధించలేదు. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. నేటి ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్‌తో ఓ మాజీ విజేత ఇంటిముఖం పట్టడం ఖాయం. మిగతా ఐదు మాజీ చాంపియన్లలో ఎన్నింటికి షాక్ తగులుతుందో చూడాలి. దృష్టంతా వారిపైనే... జట్లుగా తలపడుతున్నా అందరి కళ్లూ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ మెరిక ఆంటోన్ గ్రీజ్మన్ పైనే. వీరిద్దరూ టోర్నీలో చెరో గోలే చేసినా... ఆటతీరులో మొత్తం జట్టుపై వారి ప్రభావం తీసిపారేయలేనిది. బలాబలాల్లోకి వస్తే అర్జెంటీనాపై ఫ్రాన్స్‌కే కొంత మొగ్గు కనిపిస్తోంది. ఆ జట్టులోని పోగ్బా, ఎంబాపె ఫామ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ అవుతున్నాడు. లీగ్ దశలో ప్రత్యర్థులు అతడినే లక్ష్యం చేసుకోవడంతో జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. చివరి మ్యాచ్‌లో మార్కస్ రొజొ మెరిసినా... స్వతహాగా అతడు డిఫెండర్. మెస్సీకి హిగుయెన్, అగ్యురో తోడైతేనే ప్రత్యర్థిపై అర్జెంటీనా పైచేయి సాధించగలదు. ఫ్రాన్స్ లీగ్ దశలో ఓటమి లేకుండా ప్రిక్వార్టర్స్ చేరగా, అర్జెంటీనా మిశ్రమ ఫలితాలతో గట్టెక్కింది. ప్రపంచ కప్ చరిత్రలో ఫ్రాన్స్‌పై రెండుసార్లూ అర్జెంటీనాదే విజయం. 1930లో 1–0తో, 1978లో 2–1తో గెలుపొందింది. రొనాల్డో వర్సెస్ సురెజ్ సోచిలో శనివారం అర్ధరాత్రి 11.30కు జరుగనున్న మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో పోర్చుగల్ తో ఉరుగ్వే తలపడనుంది. 1972 తర్వాత ఈ రెండు జట్లు మరోసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉరుగ్వేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకసారి నెగ్గిన పోర్చుగల్, మరోసారి ‘డ్రా’తో సరిపెట్టుకుంది. పోర్చుగల్ ఆశలన్నీ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోపైనే. ఈ టోర్నీలో అతను ఇప్పటికి నాలుగు గోల్స్ చేశాడు. మరోవైపు ఉరుగ్వే స్టార్ ఆటగాడు సురెజ్ ఆటతీరుపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ జూన్ 30 అర్జెంటీనా x ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి పోర్చుగల్ x ఉరుగ్వే రాత్రి గం. 11.30 నుంచి జూలై 1 స్పెయిన్ x రష్యా రాత్రి గం. 7.30 నుంచి క్రొయేషియా x డెన్మార్క్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 2 బ్రెజిల్ x మెక్సికో రాత్రి గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 3 స్వీడన్ x స్విట్జర్లాండ్ రాత్రి గం. 7.30 నుంచి కొలంబియా x ఇంగ్లండ్ రాత్రి గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
మెస్సీకి సహకారం అందించాలి
ప్రపంచ కప్‌లో తొలి దశ డ్రామా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ నిష్క్రమించగా, 16 అత్యుత్తమ జట్లు నాకౌట్ బరిలో నిలిచాయి. ఇప్పుడు అసలైన ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది. అత్యుత్తమంగా ఆడినవారే ఇక్కడ నిలుస్తారు. ఈ దశలో కేవలం మంచి ఆట, వ్యూహాలు మాత్రమే సరిపోవు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా చాలా ముఖ్యం. దీనిని తట్టుకోలేనివారు అందరికంటే ముందే బయటకు వెళ్లిపోతారు. సాధారణంగా నాకౌట్ దశలో చూపు తిప్పుకోలేని విధంగా ఆట సాగుతుంది. ఈసారి కూడా అందులో లోటేమీ లేదు. టోర్నీ చివరి దశలో కాకుండా ముందే పెద్ద జట్ల మధ్య పోరు జరగనుంది. ఫ్రాన్స్‌తో అర్జెంటీనా, ఉరుగ్వేతో పోర్చుగల్ తలపడటం అంటే భారీ వినోదానికి అవకాశం ఉంది. ఈ టోర్నీ ఆరంభంలో అర్జెంటీనా చాలా ఇబ్బంది పడింది. డిఫెన్స్ బలహీనత, మెస్సీపై అతిగా ఆధారపడటం, తుది జట్లు ఎంపికపై వివాదంలాంటి చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఆఖరి మ్యాచ్‌లో సాహసోపేత ఆటతో పాటు అదృష్టం కూడా వారికి కలిసొచ్చింది. ఇప్పటికే నాకౌట్ మ్యాచ్ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం ఒక రకంగా వారికి మంచిదే. అర్జెంటీనా ఒక జట్టుగా ఆడటం ఎంతో ముఖ్యం. మెస్సీ తన పరిధిలో ఎంత చేయగలడో అంతా చేస్తాడు కానీ ఇతర ఆటగాళ్లు కూడా తమ బాధ్యత నెరవేరిస్తేనే అర్జెంటీనాకు మంచి ఫలితం లభిస్తుంది. -
ఇంగ్లండ్ ప్లాన్ ప్రకారమే ఓడిందా..?
మాస్కో : ఏ టోర్నీలోనైనా ఆడే ప్రతీ మ్యాచ్ గెలవాలని అన్ని జట్లు కోరుకుంటాయి. అందులోనూ ఫిఫా వంటి మెగా టోర్నీలో ప్రతీ మ్యాచ్ ఫైనల్ పోరును తలపిస్తూ ఉంటుంది. కాగా, లీగ్ దశలో బెల్జియంపై ఇంగ్లండ్ ఆడిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. ఆ జట్టు గెలుపు కంటే కూడా ఓటమి కోసం ఎక్కువ శ్రమించినట్లు కనబడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఫిఫా ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడకమందే ఇంగ్లండ్, బెల్జియం జట్లు నాకౌట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ జీలో టాప్ స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో బెల్జియం1-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ రౌండ్16లోకి అడుగుపెట్టింది. అయితే ఇంగ్లండ్ జట్టు పక్కా గేమ్ ప్లాన్ ప్రకారమే బెల్జియంపై ఓడిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఇంగ్లండ్‌కు అన్ని అనుకూలిస్తే క్వార్టర్స్‌లో బలమైన బ్రెజిల్ ప్రత్యర్థిగా ఎదురయ్యే పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా సాంబా జట్టు నుంచి ముప్పు తప్పించుకోవడానికే బెల్జియంపై ఇంగ్లండ్ ఓడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంగ్లండ్ నాకౌట్లో కొలంబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినట్లయితే మరో నాకౌట్ మ్యాచ్‌లో స్వీడన్, స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్‌తో పోలిస్తే వీటి(స్వీడన్, స్విస్)పై గెలవటం సులభం అనే ఉద్దేశంతో బెల్జియం పై ఓడిపోయిందనేది విశ్లేషకుల వాదన. బెల్జియంతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఏ కేటగిరి ఆటగాళ్లను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయటంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించని ఇంగ్లండ్ ఆటగాళ్లు సాదాసీదాగా ఆడి మ్యాచ్‌ను ఓటమితో ముగించారు. మ్యాచ్‌లో పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే మిస్ చేశారు. సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో జట్టు ఓడిపోతే కోచ్ ఆగ్రహాన్ని చవిచూడటం పరిపాటి. అటువంటిది మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కోచ్ ఆటగాళ్లను అభినందిస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది. ఇక బెల్జియంకు కూడా ఇంగ్లండ్‌పై గొప్ప రికార్డేమి లేదు. 1936(82 సంవత్సరాల) తర్వాత ఇంగ్లండ్‌పై బెల్జియం గెలవడం ఇదే తొలిసారి. -
ఓడినా.. నాకౌట్‌కు ఇంగ్లండ్
మాస్కో : సాదాసీదాగా సాగిన మ్యాచ్.. ఒక్క మెరుపు గోల్ తప్ప అభిమానులను అలరించిన క్షణాలు లేవు. నాకౌట్‌కు చేరామన్న ధీమాతో ఇరుజట్లు ఏ కేటగిరి ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసి బరిలోకి దిగాయి. ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ జీ టాపర్ కోసం జరిగిన పోరులో బెల్జియం 1-0తో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో 82 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌పై బెల్జియం విజయం సాధించింది. 1936లో ఇంగ్లండ్‌పై గెలిచిన బెల్జియం తాజాగా రెండో సారి విజయానందం పొందింది. ఓవరాల్‌గా ఇరుజట్లు 22సార్లు తలపడగా బెల్జియం కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. తొలి అర్థభాగం చప్పగా సాగింది. ఒక్క గోల్ నమోదు కాకుండానే ప్రథమార్థం ముగిసింది. ఇరు జట్లు గోల్ కోసం పోరాడిన రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. ద్వితీయార్థం మొదలైన ఆరు నిమిషాలకు బెల్జియం ఆటగాడు అద్నాన్ జనుజాజ్.. ఇంగ్లండ్ పెనాల్టీ ఏరియా మీదుగా ఆటగాళ్ల గ్యాప్ నుంచి కళ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు. దీంతో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో బెల్జియం విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం 14 అనవసర తప్పిదాలు చేయగా, ఇంగ్లండ్ 11 అనవసరం తప్పిదాలు చేసింది. రిఫరీలు బెల్జియం ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన బెల్జియం జలై 2న జపాన్‌తో రౌండ్ 16లో తలపడనుంది. ఇక ఓడిపోయిన ఇంగ్లండ్ జులై 3న కొలంబియాతో తలపడనుంది. -
గ్రూప్‘హెచ్’ టాపర్ కొలంబియా
సమారా: గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా కొలంబియా ప్రపంచకప్‌లో నాకౌట్ చేరింది. సెనెగల్‌తో గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరీ మినా (74వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. బంతిపై 43 శాతమే నియంత్రణ దక్కినా... అటాకింగ్ గేమ్‌తో సెనెగల్ పోరాడింది. అయితే, మినా అద్భుతమైన హెడర్ గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించాడు. దీనిని సమం చేసేందుకు అవకాశం చిక్కని సెనెగల్ ఉసూరుమంటూ నిష్క్రమించింది. జపాన్‌పై పోలాండ్ నెగ్గడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. కొలంబియా 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క జట్టు కూడా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి -
‘ఫెయిర్’ జపాన్
డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే పరిస్థితి జపాన్‌ది! గెలిచినా ముందుకెళ్లలేని స్థితి పోలాండ్‌ది! ఈ లెక్కల మధ్య... ఆసియా జట్టు అనూహ్యంగా ఓడింది. అయినా తదుపరి రౌండ్ చేరింది. ఊహించని గణాంకాలు తెరపైకి వచ్చి జపాన్ను ఒడ్డున పడేశాయి. వొల్గొగ్రాడ్: ప్రస్తుత ప్రపంచ కప్‌లో నాకౌట్ చేరిన ఏకైక ఆసియా జట్టుగా జపాన్ నిలిచింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పోలాండ్ చేతితో 0–1తో ఓడినా ఆ జట్టుకు కొంత అదృష్టం తోడై ముందుకెళ్లింది. పోలాండ్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెడ్నారెక్ (59వనిమిషం) గోల్ చేశాడు. ఆధిపత్యం అటు ఇటు... పెద్దగా మెరుపుల్లేకుండానే సాగిన ఆటలో మొదటి భాగంలో పోలాండ్, రెండో భాగంలో జపాన్ ఆధి పత్యం కనబర్చాయి. యొషినొరి మ్యుటో దాడితో ప్రారంభంలో ఆసియా జట్టుకే గోల్ అవకాశం దక్కింది. కీపర్ లుకాజ్ ఫాబియాన్స్కీ అడ్డుకోవడంతో స్కోరు కాలేదు. అయితే, ప్రత్యర్థి డిఫెన్స్ బలంగా ఉండటంతో పైచేయి చిక్కలేదు. ఓ దశలో పోలాండ్‌కు కమిల్ గ్రోస్కీ హెడర్ షాట్‌తో గోల్ తెచ్చినంత పని చేశాడు. కానీ, కీపర్ ఎజ్జి కవాషిమా చురుగ్గా స్పందించి నిలువరించాడు. జపాన్ మొదటి భాగంలోనే ఆరుగురు ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లుగా దింపి నా ఫలితం పొందలేకపోయింది. ఇటు పోలాండ్ కెప్టెన్ లెవాన్‌డొస్కీ ప్రత్యర్థి శిబిరంపై కనీసం షాట్ కూడా కొట్టలేకపోవడంతో స్కోరేమీ లేకుండానే తొలి 45 నిమిషాల సమయం ముగిసింది. ఏకైక గోల్... రెండో భాగమూ పోటాపోటీగానే ప్రారంభమైంది. అయితే, రఫల్ కుర్జావా కొట్టిన ఫ్రీ కిక్‌ను అద్భుత రీతిలో అందుకున్న బెడ్నారెక్ గోల్ పోస్ట్‌లోకి పంపడంతో ఆధిక్యం దక్కింది. సరిగ్గా ఈ సమయానికి అటువైపు మ్యాచ్‌లో సెనగల్‌పై కొలంబియా గోల్ చేయకపోవడంతో గ్రూప్‌లో జపాన్ మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఒక్కసారిగా దాడులు పెంచింది. అయితే, చివర్లో లెక్క అర్థం చేసుకుని ఎలాంటి ప్రయోగాలకు పోకుండా సమయాన్ని గడిపేసి ముగించింది. మ్యాచ్ మొదటి భాగంలో బంతి 56 శాతం పోలాండ్ ఆధీనంలోనే ఉంది. మొత్తం మీద చూస్తే జపానే (54 శాతం) బంతిని ఎక్కువ నియంత్రణలో ఉంచుకుంది. ఎల్లో కార్డులే కారణం వరల్డ్ కప్ చరిత్రలో ఇదో అరుదైన ఘటన. తొలి సారి ఒక జట్టు ‘ఫెయిర్ ప్లే’ ద్వారా నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘హెచ్’లో గురువారం అన్ని మ్యాచ్‌లు ముగిశాక కొలంబియా 6 పాయింట్లతో అగ్రస్థానంతో ముందంజ వేసింది. జపాన్, సెనెగల్ చెరో 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఇరు జట్లు ఒక మ్యాచ్ గెలిచి, ఒకటి ఓడి, మరోటి డ్రా చేసుకున్నాయి. చేసిన గోల్స్, ఇచ్చిన గోల్స్ కూడా సమానంగా (4) ఉన్నా యి. దాంతో ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం మైదానంలో ఆటతీరును బట్టి ఫెయిర్ ప్లే ప్రకారం ఇరు జట్లలో ఒకరిని ఎంపిక చేశారు. గ్రూప్ దశలో జపాన్ 4 ఎల్లో కార్డులకు గురి కాగా (–4 పాయింట్లు), సెనెగల్ ఆటగాళ్లు 6 ఎల్లో కార్డులు (–6 పాయింట్లు) అందుకున్నారు. ఫలితంగా జపాన్‌దే పైచేయి అయింది. అయితే పేరుకు ‘ఫెయిర్ ప్లే’ అయినా పోలాండ్‌తో మ్యాచ్‌లో జపాన్ క్రీడా స్ఫూర్తిపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. స్కోరులో వెనుకబడిన తర్వాత కూడా ఆ జట్టు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శించింది. మ్యాచ్ తర్వాత ఎల్లో కార్డుల లెక్క ముందుకు వస్తుందని గుర్తించిన జపాన్ చివరి పది నిమిషాల్లో అతి జాగ్రత్తగా, అసలు ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా ఆడింది. అటు గోల్స్ సంఖ్య పెరిగినా ఫలితం లేదని భావించి పోలాండ్ కూడా దాడులు చేయకపోవడంతో ఆఖర్లో ఆట ట్రైనింగ్ సెషన్‌లా సాగింది. వరల్డ్ కప్ ఫుట్‌బాల్‌లో నేడు విశ్రాంతి దినం -
స్విస్ ముందుకెళ్లింది..
నిజ్నీ నోవ్గొరడ్: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ నాకౌట్‌కు చేరింది. గ్రూప్ ‘ఇ’లో గురువారం స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో డ్రా అయింది. దీంతో ఈ గ్రూప్‌లో 5 పాయింట్లతో ఉన్న స్విస్, బ్రెజిల్ (7)తో పాటు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోస్టారికా అట్టడుగుకు పడిపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. స్విస్ తరఫున బ్లెరిమ్ జెమయిలి (31వ ని.), జోసిప్ డ్రిమిక్ (88వ ని.) గోల్ చేయగా, కోస్టారికా జట్టులో కెండల్ వాస్టన్ (56వ ని.) గోల్ సాధించాడు. మరో గోల్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సొమర్ ఇంజ్యూరీ టైమ్ (90+3వ ని.)లో సెల్ఫ్‌గోల్ చేశాడు. -
బ్రెజిల్ దూసుకెళ్లింది
సాకర్ ప్రపంచకప్‌లో జర్మనీలా బ్రెజిల్ కూలిపోలేదు. మరో షాక్‌కు తావివ్వలేదు. మరో పరాభవానికి చోటివ్వ లేదు. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ అంచనాలకు తగ్గట్టే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ దూసుకుపోయింది. మెరుగైన ప్రదర్శనతో సెర్బియాపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాస్కో: జోరుమీదున్న బ్రెజిల్ నాకౌట్ దశకు చేరింది. ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 2–0 గోల్స్‌తో సెర్బియాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో బ్రెజిల్కిది వరుసగా రెండో విజయం. స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో కోస్టారికాపై గెలిచింది. దీంతో గ్రూప్ ‘ఇ’లో ఓటమి ఎరుగని బ్రెజిల్ టాపర్‌గా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెర్బియాతో బుధవారం జరిగిన పోరులో పాలిన్హో, తియాగో సిల్వా ఆకట్టుకున్నారు. ఇద్దరు చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే బ్రెజిల్ దాడులు మొదలయ్యాయి. కానీ సమన్వయం కుదరక నాలుగో నిమిషంలోనే గోల్ చేసే చక్కని అవకాశాన్ని కోల్పోయింది బ్రెజిల్. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌కు అత్యంత సమీపంగా బంతిని తీసుకొచ్చిన జీసస్ షాట్... నెమార్, కౌటిన్హో సమన్వయలేమితో నిష్ఫలమైంది. ఆ తర్వాత కూడా బ్రెజిల్ పదేపదే లక్ష్యం దిశగా గురిపెట్టింది. ఎట్టకేలకు తొలి అర్ధభాగం ఆట 36వ నిమిషంలో కౌటిన్హో ఇచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్ పాలిన్హో మెరుపువేగంతో గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. దీంతో బ్రెజిల్ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. 1–0 ఆధిక్యంతో ఫస్టాఫ్‌ను ముగించింది. డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బంతిని బ్రెజిల్ గోల్‌పోస్ట్‌వైపు తీసుకెళ్లేందుకే సెర్బియా ఆపసోపాలు పడింది. ఇక ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్ ఆధిపత్యమే కొనసాగింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచేందుకు ఆటగాళ్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో బ్రెజిల్ రెండో గోల్ నమోదైంది. ఆట 68వ నిమిషంలో స్ట్రయికర్ నెమార్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్‌ను డిఫెండర్ తియాగో సిల్వా హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో 2–0 ఆధిక్యంతో దూసుకెళ్లిన బ్రెజిల్‌ను సెర్బియా ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ఆటగాళ్లు ఆరుసార్లు లక్ష్యంపై గురిపెట్టగా రెండు సార్లు విజయవంతమయ్యారు. ప్రత్యర్థి సెర్బియా జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే టార్గెట్‌కు చేరినప్పటికీ ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. జూలై 2న జరిగే ప్రిక్వా ర్టర్ ఫైనల్లో మెక్సికోతో బ్రెజిల్ ఆడుతుంది. అభిమానుల ఘర్షణ సాకర్ క్రేజ్ ఆకాశమంత అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్‌కప్ కోసం ప్రాణాలిస్తారు. చేదు ఫలితాలొస్తే జీర్ణించుకోలేక ప్రాణాలొదిలేస్తారు. మైదానంలో తమ జట్లు పోరాడితే... ప్రేక్షకుల గ్యాలరీల్లో అభిమానులు బాహాబాహీకి దిగుతుండటం కూడా ఇక్కడ సహజం. బ్రెజిల్, సెర్బియా మ్యాచ్ ముగిశాక ఇరు దేశాల అభిమానులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రేక్షకురాలు ఇదంతా చూసి భయాందోళనకు గురైంది. పోలీసులు ఈ సంఘటనలో బాధ్యులైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
డిఫెండింగ్ కాదు.. ‘డీలా’ చాంపియన్స్
ఏ మెగా టోర్నీలోనైనా డిఫెండింగ్ చాంపియన్ అనేది హాట్ ఫేవరేట్‌గా ఉండటం సహజం. అభిమానుల అంచనాలు కూడా ఆ జట్టుపైనే ఎక్కువగా ఉంటాయి. ‘ఏదో అన్నీ కలిసొచ్చి టైటిల్ నెగ్గారు.. దమ్ముంటే ఈసారి కప్ గెలవండి’ అనే విమర్శకుల నోళ్లు మూయించడానికైనా ఆయా జట్లు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఫిఫా ప్రపంచ కప్‌లలో మాత్రం డిఫెండింగ్ చాంపియన్స్ ఆశ్చర్యకర రీతిలో లీగ్‌దశ నుంచే నిష్క్రమిస్తున్నాయి. ఆ చరిత్ర ఓసారి పరిశీలిస్తే... ‘2002లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన సాకర్ సమరంలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇటలీ కూడా లీగ్ స్టేజీని దాటలేకపోయింది. 2014లో బ్రెజిల్లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను మరోసారి ముద్దాడాలనుకున్న స్పెయిన్ లీగ్ దశలోనే పోరాటం ముగించింది. ఇప్పుడు తాజాగా రష్యాలో జరుగుతున్న సాకర్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ కూడా నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఈ ప్రపంచ కప్‌లో బలమైన జట్టుగా పేరున్న జర్మనీ.. కలలో కూడా ఊహించని పరిణామం ఎదుర్కొంది. పసికూన దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాభావం చవిచూసింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగే ఏ జట్టైనా లీగ్ దశలోనే నిష్క్రమిస్తుందని ఓ అపనమ్మకం అభిమానుల్లో ఏర్పడింది. మరి 2022లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్‌లో నైనా ఈ సాంప్రదాయానికి తెరపడుతుందో చూడాలి. -
జర్మనీ చిత్తు.. ఆ ఆనందంలో...
అది మెక్సికో సిటీలోని దక్షిణ కొరియా ఎంబసీ కార్యాలయం. వందల కొద్దీ ఫుట్‌బాల్ అభిమానులు అక్కడికి చేరుకోవటంతో పండగ వాతావరణం కనిపించింది. ‘బ్రదర్.. ఇప్పటి నుంచి మీరు కూడా మెక్సికన్లే’ అంటూ సౌత్ కొరియన్లను కౌగిలించుకుంటూ, భుజాలపై ఎత్తుకుంటూ మెక్సికన్లు వేడుకలు చేసుకున్నారు. మెక్సికో సిటీ: ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్-2018.. గ్రూప్-ఎఫ్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం స్వీడన్ చేతిలో 3-0 తేడాతో మెక్సికో దారుణంగా ఓడింది. అయితే ఆ ఓటమి నుంచి తేరుకునేందుకు మెక్సికన్లను ఎంతో సమయం పట్టలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ.. దక్షిణకొరియా చేతిలో పరాజయం చెందడం వారిలో ఆనందాన్ని నింపింది. ఒకవేళ గనుక జర్మనీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే మెక్సికోకు ప్రిక్వార్టర్ అవకాశం దక్కేది కాదు. దీంతో దక్షిణ కొరియా-జర్మనీ మ్యాచ్ మెక్సికన్లలో టెన్షన్ పుట్టించింది. చివరకు దక్షిణ కొరియా 2-0 తేడాతో జర్మనీని చిత్తు చేయటంతో, దక్షిణ కొరియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెక్సికన్లు పండగ చేసుకున్నారు. ‘ఓ ఆసియా దేశం ఢిపెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేయటం మాములు విషయం కాదు. పైగా మాకు అవకాశం దక్కుతుందా? అన్న టెన్షన్లో ఉన్నాం. ఇలాంటి తరుణంలో దక్షిణ కొరియా పోరాటం మాకు మధురానుభూతిని మిగిల్చింది. అందుకే ఈ సెలబ్రేషన్స్’ అని కొందరు ఫ్యాన్స్ తెలిపారు. పాయింట్ల పట్టికలో ఆరేసి పాయింట్లతో ఉన్న స్వీడన్, మెక్సికోలు నాకౌట్‌కు క్వాలిఫై కాగా, దక్షిణ కొరియా.. చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించి మెక్సికన్ల కళ్లలో ఆనందాన్ని నింపి మరీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అన్నట్లు గ్రూప్ ఎఫ్‌లో తొలి మ్యాచ్‌లోనే జర్మనీని 1-0 తేడాతో మెక్సికో బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. -
సెర్బియా చిత్తు.. నాకౌట్‌కు సాంబా జట్టు
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో ఎన్నడూ లేనంతగా ఆగ్రశ్రేణి జట్లు నాకౌట్ చేరడానికి నానాతంటాలు పడుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లే పంజా విసిరి పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచకప్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ సులభంగా నాకౌట్‌కు చేరుతుందనుకున్నారు. కానీ లీగ్ చివరి మ్యాచ్‌లో సెర్బియాపై గెలిస్తేనే రౌండ్ 16కి వెళ్లే అవకాశం.. డ్రా అయితే కొంచెం కష్టం ఇది సాంబా జట్టు పరిస్థితి. అలాంటి మ్యాచ్‌లో బెబ్బులిలా పంజా విసిరింది. బుధవారం గ్రూప్ ఈలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో సెర్బియాను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన బ్రెజిల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో సాంబా జట్టు స్టార్ నెమార్ చిరుతలా కదిలాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు కూడా నెమార్ మీదే ఆధారపడకుండు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ప్రథమార్థంలో నెమార్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను మిడ్ ఫీల్డర్ పాలిన్హో హెడర్ గోల్ చేసి బ్రెజిల్ జట్టుకు తొలి గోల్ అందిచాడు. తొలి భాగం ముగిసే సరికి బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో భాగంలో బ్రెజిల్ మరో గోల్ నమోదు చేయడానికి చాలా సమయమే పట్టింది. బ్రెజిల్ చేసిన గోల్ ప్రయత్నాలను సెర్బియా రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 68వ నిమిషంలో టి సిల్వా మరో గోల్ చేసి జట్టుకు మరింత ఆధిక్యాన్ని పెంచాడు. రెండో భాగం ముగిసినా, ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు కాకపోవడంతో బ్రెజిల్ విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఈ లో టాపర్‌గా రౌండ్ 16 లోకి అడుగుపెట్టింది. జులై 2 న నాకౌట్ పోరులో మెక్సికోతో బ్రెజిల్ తలపడనుంది. -
ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం
-
సూపర్ స్వీడన్...
ఎకతెరీన్‌బర్గ్: నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో స్వీడన్ దుమ్మురేపింది. మెక్సికోతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో స్వీడన్ 3–0తో అద్భుత విజయం సాధించింది. స్వీడన్ తరఫున అగస్టిన్సన్ (50వ ని.లో), గ్రాన్‌క్విస్ట్ (62వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... 74వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ అల్వారెజ్ ‘సెల్ఫ్ గోల్’తో స్వీడన్ ఆధిక్యం 3–0కు చేరింది. మరోవైపు కొరియా చేతిలో జర్మనీ ఓడిపోవడంతో ఈ ఓటమి ప్రభావం మెక్సికోపై పడలేదు. రెండేసి విజయాలు సాధించిన స్వీడన్, మెక్సికో ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’ నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా స్వీడన్ గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. మెక్సికోకు రెండో స్థానం దక్కింది. జర్మనీతో మ్యాచ్‌లో చివరి సెకన్లలో విజయాన్ని చేజార్చుకున్న స్వీడన్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో భాగంలో స్వీడన్ చెలరేగిపోయింది. -
అర్జెంటీనా నిలిచింది
అర్జెంటీనా ఊపిరి పీల్చుకుంది! ఒక డ్రా, ఒక ఓటమితో... నాకౌట్ అవకాశాలను పీకల మీదకు తెచ్చుకున్న ఆ జట్టు... ఓ చక్కటి గెలుపుతో ప్రపంచ కప్ లీగ్ దశ గండాన్ని అధిగమించింది. ఢీ అంటే ఢీ అనేలా తలపడే నైజీరియాపై ఆధిపత్యం చాటుతూ లియోనల్ మెస్సీ మైమరపు గోల్ ఆధిక్యం అందించగా... మార్కొస్ రొజొ మెరుపు షాట్ గెలుపును కట్టబెట్టింది. సెయింట్ పీటర్స్బర్గ్: తరుముకొస్తున్న పరాభవాన్ని అర్జెంటీనా తప్పించుకుంది. ‘డ్రా’ సైతం సరిపోనంతగా... గెలుపు అత్యవసరమైన స్థితిలో పైకి లేచింది. కెప్టెన్ మెస్సీ (14వ నిమిషంలో), డిఫెండర్ మార్కొస్ రొజొ (86వ నిమిషంలో) గోల్స్‌తో మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో 2–1 తేడాతో నైజీరియాను ఓడించి నాకౌట్‌కు చేరింది. నైజీరియా తరఫున మోసెస్ (51వ నిమి షంలో) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఈ ఫలితంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన అర్జెంటీనా (4 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ విజేత ఫ్రాన్స్‌తో ఈ నెల 30న జరిగే నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుంది. మెస్సీ ‘బనేగా’ గోల్... జట్టుగా ఎలా ఉన్నా మైదానంలోకి వచ్చేసరికి అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ. దీనిని మరోసారి నిరూపిస్తూ అతడు ప్రారంభంలోనే గోల్ కొట్టి ఆధిక్యం అందించాడు. 14వ నిమిషంలో సహచరుడు బనేగా సుదూరం నుంచి ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ ముందు దానిని నియంత్రించి, ఆ తర్వాత ప్రత్యర్థి ఆటగాడిని ఏమారుస్తూ ముందుకెళ్లి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టా డు. ఆధిక్యం కోల్పోయి, జట్టుగా ఆడలేకపోతున్న నైజీరియాకు రెండో భాగంలో అదృష్టం తోడైంది. 49వ నిమిషంలో బాక్స్ లోపల బలోగన్‌ను మాస్కెరనో అడ్డుకోవడంతో ఆ జట్టుకు పెనాల్టీ దక్కింది. దీనిని మోసెస్ పొరపాటు లేకుండా నెట్లోకి పంపాడు. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా కుడి వైపు కార్నర్ నుంచి అందిన పాస్‌ను అందుకున్న రొజొ... అంతే వేగంగా నెట్లోకి పంపి జట్టుకు రెండో గోల్‌తో పాటు అద్భుత విజయాన్ని అందించాడు. గ్రూప్ ‘డి’ టాపర్ క్రొయేషియా రొస్తావ్ ఆన్ డాన్: ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన క్రొయేషియా... గ్రూప్ ‘డి’లో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో నెగ్గింది. బడెల్జ్ (53వ నిమిషంలో), పెరిసిక్ (90వ ని.లో) క్రొయే షియాకు గోల్స్ చేశారు. మధ్యలో సిగుర్డ్సన్ (76వ ని.లో) పెనాల్టీని గోల్‌గా మలిచి ఐస్లాండ్ను పోటీలో నిలిపాడు. మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించినా పెరిసిక్ స్కోరు చేసి ఫలితాన్ని మార్చాడు. ఇంతకుముందే నైజీరియా, అర్జెంటీనాలపై నెగ్గిన క్రొయే షియా ఈ ఫలితంతో గ్రూప్‌లో అజేయంగా నిలిచింది. జూలై 1న నాకౌట్లో డెన్మార్క్‌తో ఆడనుంది. ప్రపంచకప్‌లో నేడు జపాన్ x పోలాండ్ రా.గం. 7.30 నుంచి సెనెగల్ x కొలంబియా రా.గం. 7.30 నుంచి పనామా x ట్యూనిషియా రా.గం. 11.30 నుంచి ఇంగ్లండ్ x బెల్జియం రా.గం. 11.30 నుంచి -
జర్మనీ కూలింది
జర్మనీ... నాలుగుసార్లు చాంపియన్... మరో నాలుగుసార్లు రన్నరప్...! ప్రపంచ కప్‌లో కాలుపెట్టిందంటే కనీసం క్వార్టర్స్ ఖాయమనే బలీయ నేపథ్యం దానిది. ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేతకు నిర్వచనం అనదగ్గ జట్టు! మరీ ముఖ్యంగా గత నాలుగు కప్‌లలో ఓసారి రన్నరప్, రెండు సార్లు మూడో స్థానం, క్రితంసారి విజేత..! ఏ ఒక్కరిపైనో ఆధారపడని స్థితిలో, అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందనే అంచనాలతో అమేయ శక్తిగా ఈ కప్‌లో అడుగిడింది. ...కానీ బరిలో దిగాక అనుకున్నదంతా తలకిందులైంది! తొలి మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కి విలవిల్లాడి ఓడింది. రెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై చచ్చీ చెడి నెగ్గింది. చివరి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఏకంగా చావుదెబ్బ తిన్నది. గెలుపు మాత్రమే నాకౌట్ మెట్టెక్కించే స్థితిలో బోర్లాపడింది. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తమ జట్టు చరిత్రలోనే దారుణ పరాభవం మూటగట్టుకుంది. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్నూ తనతో పట్టుకుపోయింది. కజన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం. ఆ మాటకొస్తే ఫుట్‌బాల్ ప్రపంచంలోనే పెను సంచలనం. చిన్న జట్లు మాజీ చాంపియన్లను నిలువరిస్తున్న ప్రస్తుత కప్‌లో దక్షిణ కొరియా ఏకంగా జర్మనీకి జీవితాంతం మర్చిపోలేని షాక్ ఇచ్చింది. ఆటలో, చరిత్రలో, ర్యాంకులో తమకంటే ఎంతో మెరుగైన డిఫెండింగ్ చాంపియన్‌ను 2–0 తేడాతో ఓడించి టోర్నీ నుంచి తమతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. కప్‌కు ముందు ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండి, మొత్తం జట్టుకు జట్టే ప్రబలంగా కనిపించిన జర్మనీ... జట్టుగానే విఫలమై తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. 1938 తర్వాత గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జర్మనీకిదే తొలిసారి. గెలిస్తేనే నాకౌట్ చేరే పరిస్థితుల్లో బరిలో దిగి... చావోరేవో తేల్చుకోవాల్సిన వేళ జర్మనీ చతికిలపడింది. మ్యాచ్ రెండు భాగాల్లోనూ గోల్ చేయలేకపోయిన ఆ జట్టు... కొరియాకు (90+3వ నిమిషంలో వైజి కిమ్), (90+6వ నిమిషంలో హెచ్ఎం సన్) ఇంజ్యూరీ సమయంలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ఇందులో రెండో గోల్ నమోదైన తీరు జర్మనీ ఆటగాళ్ల దారుణ సమష్టి వైఫల్యానికి అద్దంపట్టింది. ఆఖరి నిమిషాలు కావడంతో కీపర్ మాన్యుయెల్ న్యూర్ సహా జర్మనీ ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి రాగా, బంతిని కొరియా ఆటగాడు బలంగా అవతలి ఏరియాలోకి కొట్టాడు. సన్... వాయువేగంతో పరిగెడుతూ దానిని అందుకుని గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ సమయంలో కీపర్ న్యూర్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. 2014 కప్‌లో అత్యుత్తమ కీపర్‌గా ‘గోల్డెన్ గ్లౌవ్’ అందుకున్న న్యూర్... దీన్నంతటినీ చూస్తూ ఉండిపోయాడు. ఇదే సమయంలో గోల్స్‌ను నిరోధించడంలో ప్రతిభ చూపిన కొరియా కీపర్ జేవో హియాన్వూకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం విశేషం. ఊదేస్తుందనుకుంటే... ఆఖరి క్షణాల్లోన్నైనా ఫలితాన్ని తనవైపు తిప్పుకొనే జర్మనీ బలాబలాల ముందు కొరియా ఏమాత్రం సరితూగనిది. దానికి తగ్గట్లే గోర్టెజ్కా, ఓజిల్, రూయిస్, క్రూస్, ఖెదిరాల సమన్వయంతో ఆ జట్టు ఆధిపత్యంతోనే మ్యాచ్ ప్రారంభమైంది. రక్షణాత్మక శైలితో ఆడిన కొరియాకు వీరిని కాచుకోవడంతోనే సరిపోయింది. అయితే, ఫ్రీ కిక్ రూపంలో మొదటి అవకాశం దానికే దక్కింది. జంగ్ వూయంగ్ షాట్‌ను కీపర్ న్యూర్ కొంత క్లిష్టంగానే తప్పించాడు. తర్వాత కూడా జర్మనీ ఒత్తిడి పెంచింది. 40వ నిమిషంలో బాక్స్ లోపల హమ్మెల్స్కు గోల్ చాన్స్ దక్కినా... హియెన్వూ తలతో పక్కకు నెట్టాడు. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని ఛేదించేందుకు కొరియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకుండా, గోల్సేమీ లేకుండానే మొదటి భాగం ముగిసింది. ఎన్నో అవకాశాలు వచ్చినా... రెండో భాగంలో ఎక్కువగా డిఫెండింగ్ చాంపియన్‌కే అవకాశాలు వచ్చాయి. మూడో నిమిషంలో గోర్టెజ్కా కొట్టిన హెడర్‌ను కీపర్ హియాన్వూ డైవ్ చేస్తూ నిరోధించాడు. గోమెజ్ దాదాపు గోల్ కొట్టినంత పనిచేశాడు. అటువైపు కొరియా కూర్పు మారుస్తూ ప్రయోగంతో పట్టు కోసం ప్రయత్నించింది. ఇరు జట్లలో ఇవేవీ ఫలించలేదు. ఇంజ్యూరీలో కుదేలు... ఇంజ్యూరీ రెండు నిమిషాలు కూడా గణాంకాలేమీ నమోదు కాకుండానే సాగింది. 90+3వ నిమిషంలో మాత్రం అద్భుతం జరిగింది. కార్నర్ నుంచి అందిన బంతిని యంగ్వాన్ షాట్ కొట్టగా నేరుగా జర్మనీ గోల్‌పోస్ట్‌లోకి చేరిపోయింది. ఇది ఆఫ్‌సైడ్ అంటూ అభ్యంతరాలు వచ్చినా వీఏఆర్‌లో కాదని తేలింది. 90+6 నిమిషంలో ఇంకో అద్భుతం చోటుచేసుకుంది. న్యూర్ సహా జట్టంతా కొరియా మిడ్ ఫీల్డ్ వద్ద ఉండగా... ఇటువైపు పడిన బంతిని ఛేదించిన సన్... గోల్ అందించడంతో వారి శిబిరం భావోద్వేగంలో మునిగిపోయింది. -
ఒక మహా యజ్ఞం
♦ జీవన కాలమ్ ఇదేమిటి! ఓ చిన్న ఆటకి ఇంత పెద్ద పేరు వాడుతున్నాడేమిటి ఈ పిచ్చి రచయిత అని చాలామంది ముక్కుమీద వేలు వేసుకోవచ్చు. చెప్పడానికి నాకు నిడివి చాలదు. కొన్నే సరదాగా చెప్తాను. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలోనూ ఫుట్‌బాల్ మీద రాయకూడదని నాకు నేనే శపథం చేసుకున్నాను. ఎందుకంటే అది మహా కావ్యం. ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. ఎందుకో తెలీదు. ఎలాగో తెలీదు. ఒక పద్ధతీ, ఒక లాజిక్, ఒక ఎమోషన్‌కి లొంగే ఆటకాదు– ఈ దుర్మార్గమైన ఆకర్షణ. చాలా సంవత్సరాల కిందట నేనూ, మా రెండో అబ్బాయి, మా ఆవిడా ఇటలీ వెళ్లాం. నేపుల్స్ చూపే డ్రైవర్ని– ఉన్నట్టుండి– మా ఆవిడ అడిగింది. ‘‘నేపుల్స్ చూశాక చచ్చిపోయినా ఫరవాలేదు అంటారు కదా? ఎందుకని?’’ అని. డ్రైవర్ నవ్వాడు. కారు ఒకే ఒక్క తిప్పు తిప్పాడు– అంతే. మా గుండెలు ఆగిపోయాయి. ఆ సముద్ర సౌందర్యం, ఆ దృశ్యం వర్ణనాతీతం. కాదు. అక్కడ ఆగలేదు. వెనక్కి తిరిగి– ఎదురుగా ఉన్న ఓ బంగళాకి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే పెట్టినట్టు నమస్కారం చేశాడు. ఏమిటన్నాను? ఇటలీవారి గొంతులు పెద్దవి, శరీరం పెద్దది, గుండెకాయ పెద్దది. దైవభక్తి పెద్దది. అన్నిటికీ మించి సౌందర్యం ‘పెద్దది’. బంగళాని చూపుతూ ‘మారడోనా!’ అన్నాడు. అది మారడోనా నివాసమట. అంతే అర్థమయింది. వివరాలు చెప్పకుండా ఒక జోక్ చెప్తాను. మరికొన్ని సంవత్సరాలకి పోప్ కావలసిన ఒక మత గురువు జోర్గే మారియో బెర్గోగ్లి అన్నాడు : ‘‘మారడోనా, మెస్సీ, పోప్ ఒకే దేశంలో ఉండటం ఆ దేశానికి చాలా అన్యాయం’’ అని. అయితే పోప్ అదృష్టవంతుడు– అతన్ని ఆ ముగ్గులోకి లాగితే!– ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఆయనెక్కడ ఉంటాడో చెప్పడం కష్టం. గణపతి సచ్చిదానంద స్వామిని విరాట్ కోహ్లీ గురించి, ధోనీ మధ్యకి– అసలు ఈ మాట అనడానికి నోరొస్తుందా? వస్తే? స్వామి ఎక్కడ ఉంటారు? ఇది సరదా మాట. ఓ అభిమాని మైకం. అంతవరకే. నాకనిపిస్తుంది– ఇక్కడ చెప్పకపోతే నాకు చోటు లేదు. ‘సెర్బియా’ వంటి అతి చిన్న దేశం– కేవలం మన హైదరాబాదు జనాభా– నుంచి వచ్చి ప్రపంచాన్ని కొల్లగొట్టే 80 పౌన్ల శరీరంలో – డోకోవిచ్లో– ఎక్కడ ఆ ‘వేడి’ని భగవంతుడు అమర్చాడా అని చూస్తూ మూర్ఛపోతాను. ఈ బంతి ఆట కథలు అపూర్వం. అనితర సాధ్యం. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ ఆటలు జరిగే మాస్కోలో కనీస ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు. ప్రస్తుతం పది. చూస్తున్న ప్రేక్షకులలో, ఆడే ఆటగాళ్లలో వాళ్ల శరీరాలు కాగే పెనాలు. ఏమి ఈ క్రీడ. ప్రపంచాన్ని ఊపి ఉర్రూతలూగించే ఈ ఆటలో పాల్గొన్న దేశాలు– కొన్ని మన టి.నగర్, బీబీ నగర్, వెలంపేట దాటవు– అనూహ్యం. ఒక్కరూ మన సినీమా ఎక్స్‌ట్రాల కాలి గోటికి పోలరు. వారిలో చాలామంది నల్లవారు. కానీ బంతి ఆట అభిమానులకి వారు గంధర్వులు, దేవతలు, కొందరికి పోప్లు (క్షమించాలి– ఇది నామాట కాదు). ఇంకా పీలేని, జిదానే, రొనాల్డో, రొనాల్డినోని తలుచుకోలేదు. అదృష్టం. ఇక దురదృష్టం ఏదంటే– నిన్ననే పోటీలో అర్జెంటీనా ఓడిపోయిందని మన దేశంలో కొట్టాయం అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలని మనస్సు పీకుతోంది. 1994 సెప్టెంబరు 19న రాత్రి 12 గంటలకి– బంతి ఆటలో పాల్గొనడానికి వస్తున్న చిన్న విమానం సహారా ఎడారిలో కూలిపోయింది. అందులో పోటీలో పాల్గొనవలసిన నైజీరియా పోటీ ఆటగాళ్లున్నారు. విమానంలో ఉన్న 39 మందీ చచ్చిపోయారు. ఓ శరీరం గుర్తుపట్టలేనంత కాలిపోయింది. బంతి ఆటలో పాల్గొనవలసిన 13 మంది అంతా చచ్చిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. అప్పుడేమవుతుంది? మరో దేశంలో అయితే సంతాప సభలు జరుగుతాయి. ప్రధాని, అధ్యక్షుడు సంతాప ప్రకటనలిస్తారు. ఆ ఆటగాళ్ల మీద జాతీయ జెండాలని కప్పి అంత్యక్రియలు చేస్తారు. పత్రికలు వారి ఫొటోలు ప్రకటిస్తాయి. అందులో 32 మంది టీం సభ్యులు, ఏడుగురు ఆటగాళ్లున్నారు. అయ్యా, ఆట ఆగలేదు. మరో నైజీరియా టీం పాల్గొంది. దేశం ఆనాడు ‘ఆట’ని ఓడిపోయింది. కానీ ‘ఆత్మవిశ్వాసాన్ని’ ‘పట్టుదల’ని నష్టపోలేదు. ఇంతకన్న ఈ దేశాల ఆట అంతకంటే వారు చూపే అభిమానం, అంతకంటే వారు ఆ ఆటగాళ్లకిచ్చే గౌరవాన్ని గురించి వేరే చెప్పనక్కరలేదు. ఇది బంతి ఆట మైకానికి నివాళి. అంతవరకే. ఇది నా నమూనా పాఠకులకి చిన్న రసగుళిక. గొల్లపూడి మారుతీరావు -
మారడోనా అతి ఆనందం.. అస్వస్థత
మాస్కో : తమ అభిమాన జట్టు మ్యాచ్ ఆడుతుంటే మైదానంలో అభిమానులను ఆపడం ఎవరి తరం కాదు. అలాగే తమ జట్టుకు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అయి, అందులో నరాలు తెగే ఉత్కంఠంగా సాగే మ్యాచ్, విజయం సాధిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఆ అవధుల శృతి మించితే మాత్రం కొంచెం కష్టం. ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్ అర్జెంటీనాకు కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సాకర్ సమరం నుంచి మెస్సీ సేన నిష్క్రమిస్తుంది. అలాంటి మ్యాచ్‌లో అర్జెంటీనా గోల్ కోట్టిన ప్రతీ సారీ అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. అభిమానుల కంటే ఎక్కువగా ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డిగో మారడోనాను ఆపడం అతడి స్నేహితులకు కూడా సాధ్యం కాలేదు. మారడోనా వీఐపీ గ్యాలరీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్నాడు. మెస్సీ సేన అద్భుత ఆట తీరు ప్రదర్శించినా లేక గోల్ కోట్టిన ప్రతీసారి ఈ దిగ్గజం స్టాండ్‌పైకి ఎక్కి ప్రేక్షకులవైపు చేతితో అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. మ్యాచ్ ఆసాంతం ఉద్విగ్నభరితంగా గడిపిన మారడోనా అర్జెంటీనా విజయం అనంతరం అస్వస్థతకు లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం కుర్చీలో నుంచి లేవలేకపోయాడు. స్నేహితుల సహాయంతో లేచి మైదానంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేరాడు. ప్రసుతం ఈ దిగ్గజ ఆటగాడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా మారడోనా చేసిన సంజ్ఞల ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ప్రవర్తించిన తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. మారడోనా తక్షణమే ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అర్జెంటీనా ఊపిరి పీల్చుకో..
మాస్కో : అర్జెంటీనాకు ఉపశమనం లభించింది. లియోనల్ మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎప్పుడూ లేనంతగా ఐస్లాండ్పై క్రొయేషియా గెలవాలి.. కనీసం ఈ మ్యాచ్ డ్రా అవ్వాలని ప్రార్ధించారు. వారి ప్రార్థనలు ఫలించాయి. ఐస్లాండ్పై 2-1తో క్రొయేషియా గెలిచి అర్జెంటీనాను నాకౌట్‌కు పంపించింది. ఫిఫా ప్రపంచకప్ తొలి నాకౌట్ పోరులో ఫ్రాన్స్‌తో అర్జెంటీనా శనివారం రోజు(జూన్ 30)న తలపడనుంది. మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరకు క్రోయేషియా విజయం సాధించింది. తొలి భాగం ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. రెండో అర్థభాగం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు బాడెల్జ్ (53వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేశాడు. గోల్‌పోస్ట్‌పై ఇరుజట్లు పోటీపడీ దాడులు చేసినా, రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 76వ నిమిషంలో పెనాల్టీ కిక్ రూపంలో ఐస్లాండ్ను అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐస్లాండ్ ఆటగాడు సిగుర్గ్స్సన్ గోల్‌గా మలిచాడు. రెండో అర్థభాగం పూర్తవుతుందనుకున్న సమయంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిక్ కళ్లుచెదిరే రీతిలో గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇంజ్యూరీ టైమ్‌లో ఇరుజట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో క్రొయేషియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఐస్లాండ్ అత్యధిక సార్లు(17) గోల్ కోసం ప్రయత్నించగా, క్రొయేషియా రక్షణశ్రేణి విజయవంతంగా ఆడ్డుకుంది. క్రొయేషియా అనవసర తప్పిదాలు 12 చేయగా, ఐస్ లాండ్ 10 తప్పిదాలు చేసింది. ఈ మ్యాచ్‌లో రిఫరీలు ఇద్దరు క్రొయేషియా, ముగ్గురు ఐస్లాండ్ ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. -
మెస్సీ నాకు ఫీజు చెల్లించాలి.. ట్వీట్ వైరల్
ముంబై : ఫిఫా వరల్డ్‌కప్ 2018లో తప్పక గెలవాల్సిన కీలక పోరులో లియోనల్ మెస్సీ టీమ్ అర్జెంటీనా విజయం సాధించింది. అయితే స్టార్ ప్లేయర్ మెస్సీ గోల్ చేయడంపై ఇండియన్ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. తరచుగా సోషల్ మీడియాలో కామెంట్లతో పలు విషయాలు షేర్ చేసుకునే మహీంద్ర.. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో తనకు నచ్చిన విషయాలపై ట్వీట్లు చేస్తూ తన ఫాలోయర్లకు వినోదాన్ని పంచుతున్నారు. ‘ఈ వరల్డ్‌కప్ చూడటం ఓ అదృష్టంగా భావిస్తాను. ఎంతో ఉత్సాహంగా ఉన్న నేను నైజీరియాతో అర్జెంటీనా మ్యాచ్ చూస్తూ మధ్యలోనే చాలా అలసిపోయాను. బోర్ కొడుతుందని ఇక టీవీ ఆఫ్ చేద్దామని రిమోట్ అలా పట్టుకున్నానో లేదో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ మ్యాజిక్ (గోల్) చేశాడు. రిమోట్‌ను చేతిలోకి తీసుకోవడం అలవాటుగా చేసుకుంటానని’ మహీంద్ర తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘సార్.. మీ రిమోట్ టెక్నిక్ మరోసారి ప్రయోగించండి’ అని ఫ్లై బాయ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. అందుకు మెస్సీ నాకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆనంద్ మహీంద్ర చమత్కరిస్తూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం మహీంద్ర ట్వీట్లు వైరల్‌గా మారాయి. కాగా, ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించిన విషయం తెలిసిందే. Messi will have to pay me a fee... https://t.co/2tQI9V6rDe — anand mahindra (@anandmahindra) 26 June 2018 I’m getting lucky this World Cup. I was tired & vowed I wouldn’t stay up to continue watching this match..and as I reached for the remote to switch it off, Messi rediscovered his magic & found his redemption..I’m going to make a habit of reaching for the remote from now on.. https://t.co/QloQky2lJx — anand mahindra (@anandmahindra) 26 June 2018 -
అర్జెంటీనా.. అదరగొట్టింది
తప్పక గెలవాల్సిన కీలక పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్ ఆశలను సజీవం చేసుకుంది. 14 వ నిమిషంలో లియోనల్ మెస్సీ అద్బుత గోల్‌తో ఖాతా తెరిచిన అర్జెంటీనా తొలి అర్థబాగంలో నైజీరియాపై ఆధిక్యం కనబర్చింది. అయితే రెండో అర్ధబాగంలో అనూహ్యంగా నైజీరియా నుంచి మెస్సీ బృందానికి గట్టి పోటీ ఎదురైంది. 49 వ నిమిషంలో అర్జెంటినా ఆటగాడు జేవియర్ మస్చెరానో ఫౌల్ చేయడంతో నైజీరియాకు పెనాల్టీ లభించింది. దీన్ని ఉపయోగించుకున్న నైజిరియా ఆటగాడు విక్టర్ మోసెస్ తెలివిగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ప్రపంచకప్‌లో పెనాల్టీగోల్ సాధించిన రెండో ఆటగాడిగా విక్టర్ మోసెస్ రికార్డు నమోదు చేశాడు. 2010 ప్రపంచకప్‌లో యాకుబ్ నెట్టెడ్ నైజీరియా తరపున తొలిసారి పెనాల్టీ గోల్ సాధించాడు. విక్టర్ సాధించిన గోల్‌తో స్కోర్ సమం అయ్యాయి. ఇక హోరాహోరిగా సాగిన గేమ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. 86 వ నిమిషంలో సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్ రోజో అనూహ్యంగా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి అర్జెంటీనాకు ఆధిక్యాన్నందించాడు. అనంతరం నైజీరియాకు అవకాశం లభించకపోవడంతో అర్జెంటీనా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు మెస్సీ మీద ఆధారపడకుండా అద్బుత ప్రదర్శన కనబర్చారు. ఇక అర్జెంటీనా నాకౌట్ చేరే అవకాశం క్రొయేషియా–ఐస్లాండ్ మ్యాచ్ ఫలితం పైనా ఆధారపడి ఉంది. ఇప్పటికే క్రోయేషియా నాకౌట్ చేరింది. ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కిన ఈ మాజీ విశ్వవిజేత క్రొయేషియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఖాతా కూడా తెరవకుండా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐస్లాండ్పై క్రొయేషియా గెలిచినా, మ్యాచ్ డ్రా అయినా అర్జెంటీనాకు నాకౌట్ చేరే అవకాశం లభిస్తోంది. -
ఒత్తిడిలో ఎలా ఆడతారో!
ఈ ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికా దిగ్గజ జట్లకు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. యూరప్ జట్లపై ఆరంభంలోనే ఆధిక్యం పొంది ఆ తర్వాత ‘డ్రా’తో సరిపెట్టుకున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత అర్జెంటీనా కంటే బ్రెజిల్ పరిస్థితి బాగుంది. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, కోస్టారికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రెజిల్ గెలిచిన తీరు వారిలో విజయకాంక్ష బలంగా ఉందని చాటి చెప్పింది. అయితే బ్రెజిల్‌కు చివరి మ్యాచ్ అంత తేలికేం కాదు. స్విట్జర్లాండ్ చేతిలో సెర్బియా దురదృష్టవశాత్తు ఓడిపోయింది. జర్మనీ రిఫరీ పెనాల్టీని ఇచ్చి ఉంటే సెర్బియా ఈ మ్యాచ్‌లో కనీసం ‘డ్రా’తో గట్టెక్కేది. నాకౌట్ దశకు చేరుకోవాలంటే సెర్బియాకు మూడు పాయింట్లు అవసరం కాబట్టి బ్రెజిల్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. బ్రెజిల్ ఫార్వర్డ్స్ నెమార్, కౌటిన్హో, జీసస్ సమన్వయంతో కదు లుతూ ముందుకు దూసుకెళితే సెర్బియా కు కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్ బ్రెజిల్ రక్షణ శ్రేణికి పరీక్షలాంటిది. స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల నుంచి బ్రెజిల్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోయినా సెర్బియాను తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా ఫార్వర్డ్ మిత్రోవిచ్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అతనిపై బ్రెజిల్ డిఫెండర్లు ప్రత్యేక్ష దృష్టి సారించాలి. బ్రెజిల్ సామర్థ్యంపై నాకు నమ్మకమున్నా ఒత్తిడిలో వారు ఎలా ఆడతారన్నది వేచి చూడాలి. -
ఫ్రాన్స్‌ను నిలువరించి నాకౌట్‌కు డెన్మార్క్
మాస్కో: ప్రపంచకప్ గ్రూప్ ‘సి’ నుంచి డెన్మార్క్ నాకౌట్ చేరింది. ఫ్రాన్స్‌తో మంగళవారం జరిగిన పోరును ఆ జట్టు 0–0తో డ్రా చేసుకుంది. మ్యాచ్‌లో ఫ్రాన్స్ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. 62 శాతం బంతి దాని ఆధీనంలోనే ఉంది. అయినా అడపాదడపా మినహా ఆ జట్టు దాడులకు దిగలేదు. ‘డ్రా’ చేసుకున్నా ముందంజ వేసే అవకాశం ఉండటంతో డెన్మార్క్ కూడా పెద్దగా ప్రయోగాలకు పోలేదు. దీంతో ఈ కప్‌లో తొలిసారిగా గోల్సేమీ నమోదు కాకుండానే మ్యాచ్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు డ్రాలతో 5 పాయింట్లు సాధించిన డెన్మార్క్ గ్రూప్‌లో ఫ్రాన్స్ (7 పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. పెరూకు ఊరట: ఇదే గ్రూప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పెరూ 2–0తో నెగ్గింది. పెరూ తరఫున కారిల్లో (18వ నిమిషం), గ్యురెరో (50వ నిమిషం) గోల్స్ చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒక్క విజ యమూ లేకుండానే నిష్క్రమించింది. ఫ్రాన్స్ చేతిలో డెన్మార్క్ భారీ తేడాతో ఓడి...పెరూపై నెగ్గితే ఆసీస్‌కు కొంత అవకాశాలు ఉండేవి. కానీ అవేవీ జరగలేదు. -
మొరాకో పౌరుషం
కలినిన్‌గ్రాడ్: మొరాకో దెబ్బకు ఉక్కిరిబిక్కిరై, ఓ దశలో వెనుకబడి, ఓటమి దిశగా వెళ్లినప్పటికీ మాజీ చాంపియన్ స్పెయిన్ నిలదొక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌ను అతి కష్టమ్మీద 2–2తో ‘డ్రా’ చేసుకున్న ఆ జట్టు గ్రూప్ ‘బి’ టాపర్‌గా నాకౌట్ చేరింది. ఫలితం ఎలా ఉన్నా మ్యాచ్ రెండు భాగాల్లోనూ ముందుగా గోల్ కొట్టి మొరాకోనే మొనగాడుగా నిలిచింది. పదేపదే దాడులు ఎదుర్కొన్నా, బంతిపై ఆధిక్యం దక్కకున్నా, పాస్‌లు అందుకోవడంలో విఫలమైనా, విపరీతంగా ఫౌల్స్ చేసినా, ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు ఎల్లో కార్డ్‌లకు గురైనా... ఆ జట్టు స్పెయిన్‌కు షాకిచ్చేలా కనిపించింది. అయితే, ఇంజ్యూరీ సమయంలో ఇయాగో అస్పాస్ (90+1వ ని.లో) గోల్ కొట్టి స్పెయిన్‌ను ఒడ్డున పడేశాడు. అంతకుముందు మొరాకో తరఫున ఖలిద్ బౌతైబ్ (14వ నిమిషం), ఎన్ నెసిరి (81వ ని.), స్పెయిన్ నుంచి ఇస్కో (19వ ని.) గోల్స్ చేశారు. ఆటలో అంతరం... ఫలితం సమం తమ స్థాయికి తగినట్లు మ్యాచ్‌ను స్పెయిన్ దూకుడుగా ప్రారంభించింది. మొరాకో ఇబ్బంది పడకుండానే ఆడింది. 14వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌లోని ఆండ్రెస్ ఇనెస్టాను తప్పిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లిన బౌతైబ్... కీపర్ డేవిడ్ డి గీని బోల్తా కొట్టించి ఎడమకాలితో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. అయితే, ఐదు నిమిషాల్లోనే స్పెయిన్ స్కోరు సమం చేసింది. ఇనెస్టా చురుకైన కదలికలతో అందించిన బంతిని ఇస్కో గోల్‌గా మలిచాడు. రెండు జట్లకు తర్వాత కూడా అవకాశాలు వచ్చినా సద్వినియోగం కాకపోవడంతో మొదటి భాగం 1–1తోనే ముగిసింది. రెండో భాగం ప్రారంభం నుంచే మొరాకో ఆటలో తీవ్రత పెంచింది. వీలైనంతగా ప్రత్యర్థి డిఫెండర్లను ఇబ్బందిపెట్టింది. స్ట్రయికర్ల దూకుడుతో స్పెయిన్ కూడా తగ్గలేదు. ఈ క్రమంలో ఇరుజట్లకు వరుసగా హెడర్ గోల్ అవకాశాలు వచ్చాయి. 70వ నిమిషంలో పికె కొట్టిన ఓ హెడర్ గోల్‌పోస్ట్‌కు కొద్ది దూరం నుంచి వెళ్లింది. కొద్దిసేపటికే అప్రయత్నంగా పికె చేతికి తగిలిన బంతి బయటకు వెళ్లింది. దీంతో మొరాకోకు కార్నర్ కిక్ లభించింది. దీనిని ఎన్ నెసిరి... హెడర్ ద్వారా స్కోరు చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. నిర్ణీత సమయం ముగిసే క్రమంలో స్పెయిన్ పరాజయం ముంగిట నిలిచింది. కానీ, ఇంజ్యూరీ (90+1)లో డ్రామా నడిచింది. డి బాక్స్ లోపల కుడి వైపు నుంచి అందిన పాస్‌ను... అస్పాస్ క్షణాల వ్యవధిలో గోల్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. సరిగ్గా మొరాకో గోల్‌పోస్ట్ ఎదుట ఉన్న అతడు కీపర్ తేరుకునేలోపే బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఇది ఆఫ్‌సైడ్ అంటూ అభ్యంతరాలు రావడతో వీఏఆర్ సాయం తీసుకున్నారు. అందులో స్పష్టమైన గోల్‌గా తేలింది. మిగతా రెండు నిమిషాల ఇంజ్యూరీ సమయమూ స్కోరేమీ లేకుండానే ముగిసింది. స్పెయిన్ డ్రాతో బయటపడింది. మొరాకో ఆటగాళ్లు ఆరుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. గ్రూప్ ‘బి’లో ఒక గెలుపు, రెండు డ్రాలతో స్పెయిన్, పోర్చుగల్ ఐదు పాయింట్లు పొంది పట్టికలో సమంగా నిలిచాయి. అయితే చేసిన గోల్స్ ( 6) ఆధారంగా స్పెయిన్‌కు అగ్రస్థానం లభించింది. పోర్చుగల్‌కు (5 గోల్స్) రెండో స్థానం దక్కింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఈనెల 30న ఉరుగ్వేతో పోర్చుగల్; జూలై 1న రష్యాతో స్పెయిన్ తలపడతాయి. -
ఇరాన్ రాజసం...
ఒక పెద్ద జట్టు... ఒక చిన్న జట్టు. మరో పెద్ద జట్టు... మరో చిన్న జట్టు! అన్నీ గ్రూప్ ‘బి’ లోనివే! వేర్వేరు వేదికలపై ఒకే రోజు ఒకే సమయానికి పరస్పరం తలపడ్డాయి...! ఓ రకంగా పెద్ద జట్లకిది పరువు పరీక్ష. ఓడిపోకుండా ఉంటేనే తదుపరి రౌండ్ చేరే పరిస్థితి వాటిది. కానీ, చిన్న జట్లు ఉడుంపట్టు పట్టాయి. ప్రత్యర్థి ఎంతదైనా లెక్కలేదంటూ చుక్కలు చూపాయి...! వాటి ధాటికి దిగ్గజాలకు దిమ్మతిరిగింది...! గెలుపు మాట దేవుడెరుగు..? బతుకుజీవుడా అంటూ ‘డ్రా’ చేసుకుని... స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ మెట్లెక్కాయి. విజయం దక్కకున్నా పోరాటంతో చిన్న జట్లు ఇరాన్, మొరాకో ఆకట్టుకున్నాయి. స్వదేశానికి తలెత్తుకుని వెళ్తున్నాయి. సరాన్స్క్: క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఆటగాడు కొట్టిన పెనాల్టీ కిక్కు గోల్ రాకుండా ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ, అలా ఊహించవచ్చని నిరూపించాడు ఇరాన్ కీపర్ అలీ బిరాన్వాండ్. ఈ అద్భుతం పోర్చుగల్‌తో మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ తరఫున క్వారెస్మా (45వ నిమిషం) స్కోరు చేశాడు. ఇంజ్యూరీ సమయంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇరాన్ ఆటగాడు కరీం అన్సారీఫర్ద్ (90+3 ని.) గోల్‌గా మలిచి ప్రత్యర్థికి విజయాన్ని దూరం చేశాడు. ఇరాన్... తేలిగ్గా లొంగలేదు మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించిన పోర్చుగల్ మొదట్లోనే ఆధిపత్యంలోకి వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరాన్ కీపర్, రక్షణ శ్రేణి తడబడింది. అయితే కొద్దిసేపటికే తేరుకుని ప్రతిఘటించింది. రొనాల్డోను ప్రత్యర్థులు నిలువరించినప్పటికీ క్వారెస్మో ప్రతిభ పోర్చుగల్‌కు గోల్ అందించింది. 45వ నిమిషంలో డి బాక్స్ వద్ద అందిన పాస్‌ను అతడు నేరుగా నెట్లోకి కొట్టాడు. ఆ వెంటనే మొదటి భాగం ముగిసింది. ఇందులో 71 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలోనే ఉండటం గమనార్హం. రెండోభాగం మొదలైన కాసేపటికే రొనాల్డోను ఎజతొలాహి అడ్డగించడంతో పోర్చుగల్‌కు పెనాల్టీ దక్కింది. వీఏఆర్‌ను ఆశ్రయించి ఫౌల్‌గా నిర్ధరించారు. 53వ నిమిషంలో దీనిని రొనాల్డోనే కిక్ కొట్టాడు. అయితే, బిరాన్వాండ్ ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక్కడినుంచి ఇరాన్ ఆట మారిపోయింది. పోర్చుగీస్ డిఫెన్స్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, గోల్ మాత్రం రాలేదు. 83వ నిమిషంలో రొనాల్డో ఎల్లోకార్డ్కు గురయ్యాడు. మ్యాచ్ ఇంజ్యూరీ సమయంలో తొలి రెండు నిమిషాలు ఇరాన్‌కు వీఏఆర్ పెనాల్టీ ఇవ్వడంపైనే గడిచాయి. 90+3వ నిమిషంలో కరీం ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ కొట్టి జట్ల స్కోరు సమం చేశాడు. -
గుండెపోటుతో కామెంటేటర్ మృతి
మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అభిమానులు ఆసక్తితో తిలకిస్తున్నారు. తమకిష్టమైన టీమ్ ఆటలో గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉన్నారు. ఒకవేళ ఓడితే ప్రాణాలు తీసుకునే పిచ్చి అభిమానులున్నారు. గతవారం అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా ఓ కామెంటేటర్ తమ టీమ్ ఓటమిని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో తమ దేశం ఓటమిపాలు కావడంతో ఈజిప్టు వ్యాఖ్యాత అబ్దుల్ రహీమ్ మహ్మద్ గుండెపోటుతో మరణించినట్టు తెలిపింది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుంది అనుకున్న సమయంలో సౌదీ అరేబియా డిఫెండర్ సలేం అల్ దాస్రి అదనపు సమయంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. అయితే ఆ సమమంలోనే ఆయనకు చాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు గుర్తించారు. అబ్దుల్ మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు తెలిపారు. మ్యాచ్ మొదట్లోనే ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్‌తో ఆధిక్యంలో దూసుకెళ్లినా, సెకండాఫ్‌లో పుంజుకున్న సౌదీ అరేబియా అనూహ్యంగా మ్యాచ్ గెలిచింది. وفاة نجم نادي #الزمالك الكابتن عبدالرحيم محمد اليوم في الاستديو التحليلي لمباراة #السعودية_مصر على قناة النيل نتيجة انفعاله من الخسارة تسببت له بجلطة و انتقل للمستشفي وفشلت محاولات الاسعاف. لا إله إلا الله و إنا لله وإنا إليه راجعون الدعاء له بالثبات عند السؤال pic.twitter.com/OnSTxeutMV — احمد صالح🇪🇬Ahmd Saleh (@iAHMEDsalih) June 25, 2018 -
ఫిఫా ప్రపంచకప్: మరో రెండు జట్లు ఔట్
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ బి నుంచి స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ దశకు చేరుకున్నాయి. సోమవారం గ్రూప్ బిలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఎక్సట్రా ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసి పోర్చుగల్‌తో మ్యాచ్‌ను ఇరాన్ డ్రాగా ముగించింది. మరో మ్యాచ్‌లో మొరాకాతో జరిగిన మ్యాచ్‌ను స్పెయిన్ 2-2తో డ్రా చేసింది. దీంతో గ్రూప్ దశలో ఒక్క విజయం సాధించని మొరాకోతో పాటు పోర్చుగల్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఇరాన్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి సౌదీ ఆరేబియా, ఈజిప్ట్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో గోల్.. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది.. పోర్చుగల్ గెలుస్తుందనుకున్న తరుణంలో ఇరాన్ జట్టు మాయ చేసింది. పెనాల్డీ రూపంలో వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంది. ఇరాన్ ఆటగాడు కరీమ్ (90+3 నిమిషంలో)గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించాడు. అంతకముందు తొలి అర్ధ భాగంలోనే పోర్చుగల్ స్టార్ మిడ్‌ఫీల్డర్ రికార్డో క్వారెస్మా తొలి గోల్(44వ నిమిషంలో) నమోదు చేశాడు. పోర్చుగల్ అటాకింగ్ గేమ్ ఆడతూ గోల్ పోస్ట్‌పై దాడి చేయగా ఇరాన్ రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకుంది. మ్యాచ్‌లో పోర్చుగల్ 14సార్లు గోల్ కోసం ప్రయత్నించగా, ఇరాన్ ఎనిమిది సార్లు ప్రయత్నించింది. దీంతో గ్రూప్ బిలో రన్నరప్‌గా ఉన్న పోర్చుగల్ నాకౌట్ పోరులో బలమైన ఉరుగ్వేతో తలపడనుంది. గ్రూప్-బి టాపర్ స్పెయిన్ గ్రూప్ బిలో మరో సమరం కూడా డ్రాగానే ముగిసింది. రసవత్తరంగా సాగిన స్పెయిన్, మొరాకో మ్యాచ్ 2-2తో డ్రా అయింది. రెండో అర్థభాగం ముగిసే సరికి 2-1తో ఆధిక్యంలో ఉన్న మొరాకోకు.. ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్‌లో స్పెయిన్ ఆటగాడు ఇయాగో ఆస్పస్ (90+1 నిమిషంలో) గోల్ చేసి మొరాకోకు షాక్ ఇచ్చాడు. అంతకముందు మొరాకో తరుపున ఖలీద్(13వ నిమిషంలో), ఎన్-నెస్రీ(80వ నిమిషంలో) గోల్స్ చేశారు. స్పెయిన్‌కు ఇస్కో(19వ నిమిషంలో)గోల్ అందించాడు. దీంతో ఒక్క విజయం, రెండు డ్రాలతో గ్రూప్ బి టాపర్‌గా స్పెయిన్ నాకౌట్లోకి ఆడుగుపెట్టనుంది. -
వైరల్ : మరోసారి మహిళ జర్నలిస్ట్‌పై..
యెకాటెరిన్బర్గ్(రష్యా) : రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ కవరేజ్‌కు వెళ్లిన మహిళ రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 15న ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జూలియట్ గోంజాలెజ్ థెరాన్ లైవ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్ స్పోర్ట్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్, యోకాటెరిన్బర్గ్ నుంచి రిపోర్ట్ చేస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. రిపోర్టింగ్ సమయంలో అప్రమత్తతో ఉన్న జూలియా అతని నుంచి తప్పించుకున్నారు. అంతేకాకుండా ఇంకెప్పుడు ఇలా చేయకు అంటూ జూలియా అతనిపై మండిపడ్డారు. ‘ఇది మంచి పద్దతి కాదు.. ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైనది కాదు.. దీనిని రిపీట్ చేయకు’ అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూలియా ట్విటర్లో స్పందించారు. ‘ఆ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. ఇక్కడ ఇలా జరగడం రెండోసారి.. రష్యా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్ సమయంలో కూడా మాస్కోలో ఇదే రకమైన అనుభవం ఎదురైంది. రష్యాలో కొన్ని పరిస్థితలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయ’ని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కాగా జూలియా చర్యను తోటి జర్నలిస్టులు.. నెటిజన్లు ప్రశంసిసస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
స్టేడియం బయట రిపోర్టర్‌కు అనూహ్య పరిణామం
-
అర్జెంటీనా... అదరగొట్టాలి!
ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను ఇలాంటి స్థితిలో చూడటం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆడాల్సిన ఒక్క మ్యాచ్‌లో విజయం తప్పనిసరి మాత్రమే కాక... క్రొయేషియా–ఐస్లాండ్ మ్యాచ్ ఫలితం పైనా ఆధారపడాల్సి వస్తోంది. ఏదేమైనా ఓ అభిమానిగా మా జట్టు ఓటమిని నేను వ్యతిరేకిస్తా. ఈ సందర్భం నాకు 1982, 1990 ప్రపంచ కప్‌లను గుర్తుకుతెస్తోంది. అప్పట్లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలో దిగిన మేం ఓటములతో ప్రయాణం ప్రారంభించాం. మొదటిసారి మిగతా రెండు మ్యాచ్‌లను గెలిచి నాకౌట్ చేరాం. రెండోసారి నేను కెప్టెన్‌గా ఉన్న జట్టు ఫైనల్‌కు వెళ్లింది. తదుపరి ఫలితం వేర్వేరుగా ఉన్నా... పోరాటపటిమతో గ్రూప్ అడ్డంకి దాటిన ఈ రెండు ఉదంతాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈసారి సైతం అలానే జరుగుతుందని నమ్ముతున్నా. నైజీరియాపై భారీ వ్యత్యాసంతో గెలవడం అర్జెంటీనాకు అవసరం. దీనికి పూర్తిస్థాయి సంసిద్ధత కావాలి. తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు ఆటగాళ్లకు ఇది చివరి అవకాశం. వారు సాధిస్తారని నాకు విశ్వాసం ఉంది. బలాబలాలకు తగ్గ ప్రణాళికలు వేయడంతో పాటు ప్రతి ఆటగాడికి కోచ్ సంపోలి బాధ్యతలు అప్పగించాలి. ఈ ప్రక్రియ పక్కాగా సాగాలి. తనొక్కడికే సాధ్యమైన దానిని మెస్సీ చేసి చూపాలి. ఇదే సమయంలో వన్ మ్యాన్ షోలా కాకుండా జట్టంతా సమష్టిగా ఆడాలి. నైజీరియా ప్రమాదకర ప్రత్యర్థి. గత ప్రపంచకప్ సహా వారితో చాలా సార్లు తలపడి ప్రతిసారీ గెలిచాం. మాకిది నైతికంగా బలాన్నిస్తుంది. మా కుర్రాళ్లు తమ ఆంకాక్ష ఎంత బలంగా ఉందో చాటుతూ... ఈ మ్యాచే తమ జీవితం అన్నట్లుగా ఆడాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ప్రపంచం ఇప్పుడు మెస్సీ వైపు చూస్తోంది. ఆ స్థాయి ఆటగాడికిది సాధారణమే. అయినా... నేను మళ్లీ చెబుతున్నా. ఇది ఒక్కడి ఆట కాదు. ఓటమి, గెలుపు అందరివి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి. -
ఉరుగ్వే ‘తీన్’మార్
రెండు జట్లూ ఇప్పటికే నాకౌట్‌కు చేరాయి. ఇక మ్యాచ్ గ్రూప్ ‘ఎ’లో టాపర్ ఫలితం కోసమే. ఇందులో కీలక ఆటగాళ్లు గాజిన్ స్కీ, చెరిషెవ్ల తప్పిదాలతో ఆతిథ్య రష్యా దెబ్బతినగా... స్టార్ ఆటగాడు సురెజ్ జోరుతో ఉరుగ్వే ‘తీన్’మార్ మోగించింది. లీగ్ దశను అజేయంగా ముగించింది. మ్యాచ్‌లో ఓ సెల్ఫ్ గోల్, ఓ రెడ్ కార్డ్ నమోదవడం కొంత ఆసక్తి రేపింది. సమారా: తొలి రెండు మ్యాచ్‌ల్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌లను ఓడించిన రష్యా... బలమైన ఉరుగ్వే ముందు తలొంచింది. ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 0–3 తేడాతో పరాజయం పాలైంది. ఉరుగ్వేకు లూయీ సురెజ్ (10వ నిమిషం)తో పాటు ఎడిన్సన్ కవానీ (90వ నిమిషం) గోల్స్ అందించగా, రష్యా ఆటగాడు చెరిషెవ్ (23వ నిమిషం) సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థి పనిని మరింత సులువు చేశాడు. ఉరుగ్వే నాకౌట్లో ఈ నెల 30న గ్రూప్ ‘బి’ రన్నరప్‌తో, రష్యా జూలై 1న గ్రూప్ ‘బి’ టాపర్‌తో తలపడతాయి. రష్యా ఆటగాడు స్మొల్నికవ్ (27వ, 36వ నిమిషంలో ఎల్లో కార్డ్) రెడ్ కార్డ్‌ను ఎదుర్కొని తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. కీలక ఆటగాళ్ల తప్పిదాలతో సొంతగడ్డ అనుకూలతతో కప్‌లో రాణిస్తున్న రష్యాకు ఈ మ్యాచ్‌లో ఏదీ కలిసిరాలేదు. కీలక ఆటగాళ్లు ల్యూరీ గాజిన్ స్కీ, చెరిషెవ్ల పొరపాట్లు ప్రత్యర్థికి అనుకోని వరంలా మారాయి. పెనాల్టీ ఏరియా ముందు గాజిన్ స్కీ ఫౌల్ చేయడంతో ఉరుగ్వేకు 10వ నిమిషంలోనే ఫ్రీ కిక్ లభించింది. కీపర్ అకిన్ఫీవ్ను తప్పిస్తూ దీనిని సురెజ్ తెలివిగా తక్కువ ఎత్తులోనే గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు ఆధిక్యం అందించాడు. రష్యాకు కూడా వెంటనే కార్నర్ కిక్ రూపంలో ఓ అవకాశం దక్కింది. దానిని డియుబా తలతో గోల్ పోస్ట్‌లోకి నెట్టే యత్నం చేసినా దూరంగా వెళ్లింది. టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్‌తో హీరోగా నిలిచిన చెరిషెవ్... 23వ నిమిషంలో మరో పెద్ద పొరపాటు చేశాడు. డిగో లక్సాల్ట్ (ఉరుగ్వే) షాట్‌ను తప్పించే యత్నంలో గురితప్పి అతడు అనూహ్యంగా సెల్ఫ్ గోల్ చేశాడు. ఓవైపు ఉరుగ్వే దూకుడుగా దాడులు చేస్తుండగా... స్మొల్నికవ్ 9 నిమిషాల వ్యవధిలో రెండు ఎల్లో కార్డ్‌లకు గురై మైదానాన్ని వీడాడు. దీంతో రష్యా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. పట్టు జారకుండా... 2–0తో సురక్షిత స్థితిలో ఉండటంతో ఉరుగ్వే ప్రశాంతంగా ఆడుతూ రెండో భాగంలో పట్టుజారకుండా చూసుకుంది. 90వ నిమిషంలో డిఫెండర్ డీగో గొడిన్ నుంచి అందిన బంతిని కవాని పొరపాటు లేకుండా గోల్‌గా మలిచాడు. సౌదీ... చివరకు గెలిచింది వోల్గోగ్రాడ్: సౌదీ అరేబియా విజయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం ఆఖరి మ్యాచ్‌లో సౌదీ జట్టు 2–1తో ఈజిప్ట్‌పై గెలిచింది. ఈ ప్రపంచకప్‌లోనే అతిపెద్ద వయస్కుడైన 45 ఏళ్ల ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎసామ్ ప్రత్యర్థి పెనాల్టీ కిక్‌ను అడ్డుకోవడం అకట్టుకుంది. 22వ నిమిషంలో ఈజిప్ట్ మిడ్‌ఫీల్డర్ సలాæ గోల్ చేయడంతో 1–0 ఆధిక్యం లోకి వెళ్లింది. 39వ నిమిషంలో మువల్లాద్ పెనాల్టీ కిక్‌ను ఎసామ్ అడ్డుకున్నాడు. కానీ నిమిషాల వ్యవధిలోనే మరో పెనాల్టీని పొందిన సౌదీ అరేబియాకు ఈ సారి సల్మాన్ ఇంజ్యూరీ టైమ్(45+6వ ని)లో గోల్ సాధించి పెట్టాడు. చివర్లో సలీమ్ కూడా ఇంజ్యూరీ టైమ్ (90+5వ ని.)లో గోల్ చేసి సౌదీని గెలిపించాడు. -
కొలంబియా చిందేసింది
జేమ్స్ రోడ్రిగ్స్... గత ప్రపంచ కప్‌లో ఆరు గోల్స్‌తో కొలంబియాను క్వార్టర్ ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆటగాడు. ఈ సారి టోర్నీలో జపాన్‌తో తొలి మ్యాచ్‌లో అతను గాయంతో కేవలం అరగంట ఆటకే పరిమితమయ్యాడు. జట్టు పరాజయానికి అది కూడా కారణమైంది. కానీ తన విలువేమిటో అతను పోలాండ్‌తో మ్యాచ్‌లో చూపించాడు. రోడ్రిగ్స్ తన అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌లో కీలక పాత్ర పోషించి కొలంబియాను గెలిపించగా... రెండు పరాజయాలతో పోలాండ్ నాకౌట్ అవకాశాలు కోల్పోయింది. మరోవైపు క్వాలిఫయింగ్‌లో చెలరేగి ప్రపంచకప్‌కు ముందు భారీ అంచనాలతో బరిలోకి దిగిన పోలాండ్ కెప్టెన్ లెవాండోస్కీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేశాడు. రెండు వరల్డ్‌కప్‌లకు దూరమైన తర్వాత ఈ సారి అర్హత సాధించిన పోలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి యూరోప్ జట్టుగా నిలిచింది. కజన్ ఎరీనా: గత డిసెంబర్లో వరల్డ్ కప్ గ్రూప్‌లు ఖరారైన తర్వాత పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ... రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ‘గత వరల్డ్ కప్‌లో నీ అద్భుత గోల్స్ చూశాను. ఈసారి రష్యా నుంచి నా గోల్స్ గుర్తు పెట్టుకుంటావని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత సవాల్ విసిరాడు. అయితే పోలాండ్ ఎత్తులేమీ కొలంబియాపై పని చేయలేదు. లెవాండోస్కీ విఫలం కాగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోడ్రిగ్స్ తన జట్టును గెలిపించుకున్నాడు. ఆదివారం రాత్రి ఏకపక్షంగా సాగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో కొలంబియా 3–0తో పోలాండ్‌పై ఘన విజయం సాధించింది. కొలంబియా తరఫున యెరీ మినా (40వ నిమిషం), రాడమెల్ ఫాల్కావో (70వ నిమిషం), యువాన్ క్వాడ్రాడో (75వ నిమిషం) గోల్స్ సాధించాడు. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న పోలాండ్... 16వ స్థానంలో ఉన్న కొలంబియాకు ఏ దశలోనూ పోటీనివ్వలేక చేతులెత్తేసింది. తాజా విజయంతో కొలంబియా నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ గ్రూప్‌లో గురువారం జరిగే మ్యాచ్‌లలో జపాన్‌తో పోలాండ్, సెనెగల్‌తో కొలంబియా తలపడతాయి. హోరాహోరీగా... టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన రెండు జట్లు కాస్త ఒత్తిడిలోనే బరిలోకి దిగాయి. అయితే ఆరంభం నుంచే కొలంబియా దూకుడుగా ఆడింది. ఏ దశలోనూ ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శించలేదు. రోడ్రిగ్స్‌తో పాటు క్వాంటెరో, క్వాడ్రాడో ప్రత్యర్థి వైపు పదే పదే దూసుకుపోయారు. మరోవైపు పోలాండ్ కూడా సెనెగల్‌తో ఓడిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కానీ లెవాండోస్కీని సమర్థంగా మార్కింగ్ చేయడంలో కొలంబియా సఫలమైంది. ఎట్టకేలకు 40వ నిమిషంలో కొలంబి యాకు అవకాశం వచ్చింది. ఫాల్కావోను పోలాండ్ ఆటగాళ్లు అడ్డుకోవడంతో జట్టుకు పెనాల్టీ దక్కింది. రోడ్రిగ్స్ ఇచ్చిన షార్ట్ కార్నర్‌ను క్వాంటిరో ప్రశాంతంగా అందుకొని మళ్లీ వెనక్కి పంపించాడు. చురుగ్గా ఉన్న రోడ్రిగ్స్ మళ్లీ క్రాస్ షాట్ కొట్టగా...దానిని హెడర్ ద్వారా మినా గోల్‌పోస్ట్‌లోకి పంపిం చాడు. తొలి అర్ధభాగం ముగిసే సరికి బంతి దాదాపు సమాన సమయం ఇరు జట్ల ఆధీనంలో ఉంది. కొనసాగిన జోరు... విరామం తర్వాత పోలాండ్ కౌంటర్ అటాక్ చేసింది. ఈ క్రమంలో కొన్ని అవకాశాలు సృష్టించుకోగలిగినా కొలంబియా కీపర్ డేవిడ్ ఒస్పినా వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఒక దశలో లెవాండోస్కీ గోల్ కొట్టేందుకు అత్యంత చేరువగా వచ్చినా మిడ్ ఫీల్డ్ నుంచి అతను కొట్టిన లాంగ్ పాస్ పోస్ట్‌ను ఛేదించలేకపోయింది. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అతనికి తగిన సహకారం లభించలేదు. ఆ తర్వాత కొలంబియా తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. 70వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించి దూసుకొచ్చిన క్వాంటిరో పాస్ అందించగా, ఫాల్కావో ఎలాంటి తప్పూ చేయలేదు. గాయంతో గత వరల్డ్‌కప్‌కు దూరమైన ఫాల్కావో ఈ గోల్‌తో ఉద్వేగంగా సంబరాలు చేసుకున్నాడు. ఐదు నిమిషాల తర్వాత కొలంబియా మళ్లీ చెలరేగింది. పోలాండ్ ఆటగాళ్లందరినీ వెనక్కి తోస్తూ జోరుగా దూసుకొచ్చిన రోడ్రిగ్స్ అందించిన క్రాస్ పాస్‌ను క్వాడ్రాడో గోల్‌గా మార్చడంతో ‘లాస్ కాఫిటోర్స్’కు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత మిగిలిన సమయంలో కొలంబియా పట్టు నిలబెట్టుకోగా, పోలాండ్ నిరాశగా వెనుదిరిగింది. చంపేస్తామంటూ బెదిరింపులు... జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడో నిమిషంలోనే కొలంబియా ఆటగాడు కార్లోస్ సాంచెజ్ రెడ్‌కార్డుకు గురై నిష్క్రమించాడు. పది మందితోనే ఆడిన కొలంబియా చివరకు పరాజయం పాలైంది. ఇప్పుడు అతడిని చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి. 1994 ప్రపంచకప్‌లో సెల్ఫ్ గోల్ చేసినందుకు కొలంబియాకు చెందిన ఎస్కోబార్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. ఇది తమకు ఆందోళన కలిగిస్తోందని జట్టు కోచ్ జోస్ పోకర్మన్ అన్నారు.‘సాంచెజ్ చాలా బాధలో, ఆందోళనలో ఉన్నాడు. అలాంటి సమయంలో మేమంతా ఈ విజయాన్ని అతనికి అంకితం ఇచ్చి సాంచెజ్ను ఆనందంలో భాగం చేయాలనుకుంటున్నాం. బెదిరింపులు నిజమా కాదా చెప్పలేను కానీ మాకూ సమాచారముంది. ఇలాంటి విషయాలను చిన్నదిగా చూడలేం. ఫుట్‌బాల్ ఆట మాత్రమే కాదని ఇప్పుడనిపిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
కేరళకు చెందిన మెస్సీ అభిమాని ఆత్మహత్య
కొట్టాయం: కేరళలో అర్జెంటీనా స్టార్ మెస్సీ వీరాభిమాని బినూ అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్రొయేషియా చేతిలో అర్జెంటీనా ఘోరంగా ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయిన 30 ఏళ్ల అలెక్స్ మీనాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను నివాసం ఉండే అరుమన్నూర్ గ్రామం నుంచి 30 కి.మీ. దూరంలో అలెక్స్ శవం లభించింది. ‘ఇక ఈ ప్రపంచంలో జీవించలేనని, తన మృతికి ఎవరు కారణం కాదని’ అతడు సూసైడ్ నోట్లో రాశాడు.