
టోక్యో: ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో మూడు జపాన్ మ్యాచ్‌ల ఫలితాల గురించి సరిగ్గా జోస్యం చెప్పిన ఆక్టోపస్ పాపం తనకు ఇంత తొందరగా చావు రాసి పెట్టి ఉంటుందని ఊహించలేదేమో! ‘రాబియో’ పేరు గల ఈ ఆక్టోపస్‌ను కిమియో ఆబె అనే వ్యక్తి సముద్రం నుంచి తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాని జ్యోతిష్యం మొదలైంది. మూడు నీళ్లు నిండిన బకెట్లపై ఒక్కో ఫలితం రాసి వాటి మధ్యలో ఈ ఆక్టోపస్‌ను వదిలేవారు. అది దేనిని ఎంచుకుంటే అదే ఫలితం వచ్చింది. అయితే ఇప్పుడు కిమియో దానిని చంపేసి దుకాణంలో అమ్మకానికి పెట్టేశాడు.
చేపలు పట్టడమే జీవనాధారమైన కిమియో తనకు మరో మార్గం లేకుండా పోయిందన్నాడు. రాబియోకు వస్తున్న పేరు ప్రఖ్యాతులకంటే దానిని మాంసంగా మార్చి అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తాడు కాబట్టి చంపక తప్పలేదని అతను అన్నాడు. గ్రూప్ దశలో కొలంబియాతో జపాన్‌తో గెలుస్తుందని, సెనెగల్‌తో ‘డ్రా’ చేసుకొని... పోలాండ్ చేతిలో ఓడుతుందని ఈ ఆక్టోపస్ చెప్పిన జోస్యం 100 శాతం నిజమైంది. ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఓడి జపాన్ ఆట ముగియగా... దానికి ముందే రాబియో మార్కెట్‌లో మాంసాహారంగా మారిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment