Octopus
-
'జై హనుమాన్' ప్రాజెక్ట్‌ను పక్కనపెడుతున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఇదేనా?
భారీ సినిమాలతో పోటీ పడి ఈ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉంటుందని.. అది 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. 'హనుమాన్' సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఇప్పుడు 'జై హనుమాన్' అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తీయబోయే సినిమా 'జై హనుమాన్' ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయన అనుకున్న నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో మరికొంత సమయం పడుతుందని సమాచారం. దీంతో ఆయన డైరెక్ట్ చేసి పెండింగ్‌లో ఉన్న మరో ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించాలని ఉన్నారట. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న 'ఆక్టోపస్' సినిమాపై ఆయన ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌తో తెరకెక్కనుందని టాక్. ఇందులో ఐదుగురు మహిళా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్తుందని గతంలో ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇండిస్ట్రీలో ప్రచారం జరుగుతున్నట్లు జై హనుమాన్ ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి 'ఆక్టోపస్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం ఎవరికీ తెలియదు. అనుపమ కూడా గతంలో లేడి ఓరియెంటెడ్ చిత్రమైన బటర్ ఫ్లై ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.. త్వరలో ఆమె డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే లైన్లో ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ చిత్రం కూడా త్వరగా పూర్తి చేసుకుని థియేటర్లోకి వస్తే ఈ బ్యూటీకి మరో కొన్ని ప్రాజెక్ట్‌లు వచ్చే ఛాన్స్ ఉంది. -
ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!
విదేశాల్లో కొన్ని రకాల సముద్ర జాతులు చూసేందుకే చాలా భయంకరంగా ఉంటాయి. ఐతే వాటిని కొంతమంది తింటుంటారు. ఇలాంటివి తినేటప్పుడూ అజాగ్రత్తతో తింటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలానే ఓ వృద్దుడు లైవ్ ఆక్టోపస్‌ని తింటూ.. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఎలా జరిగింది? ఏవిధంగా చనిపోయాడు తదితరాల గురించే ఈ కథనం!. అసలేం జరిగిందంటే..ఆక్టోపస్ ఎలా ఉంటుందో తెలిసిందే. మెలికలు తిరిగిన కాళ్ల మాదిరి చాలా ఉంటాయి. అది వాటితోటే ఏదైన జీవిపై అటాక్ చేసి చంపి తింటుంది. దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ సాన్ నాజ్కి వంటను ఆస్వాదించాడు. ఈ వంకాన్ని పచ్చిగా ఉన్న ఆక్టోపస్ మాంసలపై నువ్వులు వేసి కొన్ని రకాల సుగంధద్రవ్యాలను కలిపి నేరుగా తినేస్తారు. ఆ వృద్ధుడు కూడా ఇలానే తిన్నాడు వృద్ధుడు. ఐతే అతను తింటున్నప్పుడూ ఆ ఆక్టోపస్‌కు ఉండే టెన్టకిల్స్(కాళ్ల మాదిరిగా ఉండే భాగాలు) మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఆనందంగా తినడంపైనే దృష్టి పెట్టాడు. ఇంతలో ఆ టెన్టకిల్ ముక్క ఒకటి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయాడు. అందుకే ఆరోగ్య నిపుణులు పలుమార్లు ఈ ఆక్టోపస్ రెసిపీలు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఇలానే వ్యవహరించి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని అన్నారు. నిజానికి ఇలా లైవ్ ఆక్టోపస్ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ఈ రెసిపీ అందరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ ఇలానే టేస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా లైవ్ ఆక్టోపస్ డిషిని తిని సుమారు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కూడా. వాస్తవానికి సజీవంగా ఉన్న ఆక్టోపస్ ముక్కలు చేసినా.. దాని భాగాలు ఇంకా కదులుతూనే ఉంటాయి. అందులోని ఈ రకమైన సాన్‌నాజ్కి డిష్‌ని వండకుండా పచ్చిగానే తింటారు. అలాంటప్పుడు అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్టు గురవ్వడం జరుగుతోంది. ఊపిరాడకపోతే కార్డియాక్ అరెస్టు జరుగుతుందా..? ఒక వస్తువు గొంతులో ఇరుక్కుపోతే వాయు మార్గాన్ని మూసేస్తుంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దీంతో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ప్రభావం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సమీపంలో ఉన్నవాళ్లు బాధితులకు ఊపిరి ఆడేలా ఆక్కిజన్ అందించేలా చూడాలి. లేదా ఆ అడ్డంకి తొలగించే యత్నం అయినా చేయాలి. కొందరికైతే గొంతులో ఇరుక్కుపోయి పెద్ద పొలమారిన దగ్గులా వచ్చి రక్తపోటు పెరగిపోవడం జరుగుతంది. చివరికి గుండె మీద ప్రభావం ఏర్పడి ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే గొంతులో ఉన్న అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసీ సీపీఆర్ చేస్తే మనిషి బతికే అవకాశాలు ఉంటాయి. (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
సముద్ర గర్భంలో లభించే ప్రతి ఒక్క జంతువు ఓ అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటికీ ఏదో ఒక వింత వింత జలచరాలు కనిపిస్తూనే ఉంటాయి. సముద్ర గర్భంలో మనిషికి అంతుపట్టని ఎన్నో గమ్మత్తు విషయాలు చెబుతూనే ఉంటుంది. ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అచ్చం అలాంటి అరుదైన ఘటనే పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత అరుదైన డంబో ఆక్టోపస్ కనిపించింది.రిమోట్ పనిచేసే ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ వాహనంలో అమర్బడిన డీప్ సీ కెమెరా ఈ ఫోటోని తీసింది. ఈ అరుదైన ఆక్టోపస్ దాదాపు 7 వేల కిలోమీటర్ల లోతులో నివశిస్తుంది. వీటిని ప్రంపచంలోనే అందమైన ఆక్టోపస్లుగా పిలుస్తారట. ఈ ఆక్టోపస్లకి చెవులు "డంబో ది ఎలిఫెంట్" వలే ఉంటాయట. అంటే చెవులు వలె కనిపించే రెక్కలు ఏనుగు చెవుల మాదిరిగా పెద్దగా ఉండటంతో అలా పిలుస్తారు. ప్రత్యేకమైన చెవిలాంటి రెక్కలతో కదులుతుంది. అందుకు సంబంధించిన వీడియోని ఓషన్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది మీరు ఓ లుక్కేయండి. (చదవండి: 'అత్యంత స్వచ్ఛమైన గాలి' లభించేది ఇక్కడే..బాటిల్లో నింపి..) -
ఆ జీవులతో ‘ఎన్ని గుండెలు నీకు’ అనలేరు.. కారణమిదే!
సజీవంగా ఉండాలంటే ప్రతీ జీవికి గుండె ఎంతో అవసరం. గుండె అనేది శరీరం అంతటికీ రక్తం సరఫరా చేయడంతోపాటు పలు విధులు నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఒకటి కన్నా ఎక్కువ గుండెలు కలిగిన జీవుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపచంలో అనేక జీవజాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని భూమిపైన, కొన్ని భూమి కింద, మరొకొన్ని చెట్ల మీద నివాసం ఏర్పరుచుకుంటాయి. వీటిలో కొన్ని జీవులకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ గుండెలు ఉంటాయి. వీటిలో ఆక్టోపస్‌కు 3 గుండెలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలుసు. అయితే ఆక్టోపస్తోపాటు మరి ఏ జీవులకు అత్యధిక గుండెలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్టోపస్ ఇది సముద్ర జీవి దీనికి 3 గుండెలు, 8 కాళ్లు ఉంటాయి. దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. దీని జీవిత కాలం 6 నెలలు మాత్రమే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్క్విడ్ ఈ చేప చూసేందుకు ఆక్టోపస్ మాదిరిగానే కనిపిస్తుంది. దీనికి కూడా 3 గుండెలు ఉంటాయి. దీనిలో ఒక గుండె దాని శరీరానికంతటికీ రక్తం సరఫరా చేస్తుంది. మిగిలిన రెండు గుండెలు గిల్స్‌లో ఆక్సిజన్ పంప్ చేస్తాయి. గిల్స్ అనేది చేపకు ఆక్సిజన్ అందించే అవయవం. ఎర్త్‌వార్మ్ ఎర్త్‌వార్మ్ అంటే వానపాము. ఇది వ్యవసాయదారులకు ఎంతో మేలు చేస్తుంది. దీనికి కూడా పలు గుండెలు ఉంటాయి. దీని హృదయం పనిచేసే విధానాన్ని ‘ఎరోటిక్ ఆర్చ్’ అని అంటారు. ఇది పంపింగ్ ఆర్గాన్ మాదిరిగా పనిచేస్తుంది. శరీరం అంతటికీ ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది. కాక్రోచ్ కక్రోచ్కు ఒకే గుండె ఉన్నప్పటికీ దానికి 13 చాంబర్లు ఉంటాయి. దీని గుండెలోని ఒక చాంబర్‌కు గాయమైతే, మిగిలిన చాంబర్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా హృదయానికి గాయమైనా అది చనిపోదు. ఇది కూడా చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! -
AU Vizag-Mock Drill: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి ఉగ్రవాదులు!
విశాఖపట్నం: మంగళవారం రాత్రి 9 గంటలు.. ఆయుధాలు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారు. జిహాద్ అంటూ మెయిన్‌గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్‌పై దాడి చేసి లోపలకు ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డ్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఉగ్రవాదులు ఏయూ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళనకు గురై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆక్టోపస్ బృందానికి సమాచారం చేరవేశారు. ఆక్టోపస్ బృందాలు వెంటనే అప్రమత్తమై.. ఏయూ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఆక్టోపస్ బృంద సభ్యులు కొంత సేపు సమాలోచనలు జరిపారు. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతం, భవనం పరిసరాలు, లోపలకు వెళ్లే మార్గాలు, లోపల పరిస్థితులు తదితర అంశాలపై ప్రాథమికంగా అవగాహన ఏర్పరుచుకుని.. ఐదుగు రు సభ్యులు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కొంత మంది ఆక్టోపస్ స్నైపర్ సభ్యులు భవనాలపైకి చేరుకుని మాటువేశారు. మరోవైపు ఆక్టోపస్ బృందాలు లోపలకు ప్రవేశించి ప్రతీ గదిని తనిఖీ చేశారు. ఉగ్రవాదులు ఎవరినైనా బంధించారా లేదా పరిశీలించారు. బాంబులను నిరీ్వర్యం చేసే బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఆపరేషన్ అర్ధరాత్రి దాటి సాగింది. చివరకు ఇరువర్గాల మధ్య దాడుల అనంతరం ఆక్టోపస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో ఆక్టోపస్ బృందాలు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటే! విపత్కర సమయాల్లో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడానికి ఆక్టోపస్ నిర్వహించిన మాక్‌డ్రిల్ ఇది. ఆపరేషన్ పైతాన్ పేరుతో స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా ముగిసింది. -
ఆక్టోపస్‌కు.. మనకు.. ముత్తాత ఒకరే.. మనుషుల్లా కలలు కూడా కంటాయట!
భూమ్మీద ప్రతి జీవికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. కొన్నింటికి ఎక్కువ, కొన్నింటికి తక్కువ. పెద్ద జంతువులు ఏమోగానీ కొన్నిరకాల సాధారణ జీవులు వాటి స్థాయికి మించి తెలివి చూపుతుంటాయి. ఇందులో ఆక్టోపస్‌లు ప్రత్యేకం. అవి కొన్నిసార్లు మనుషుల్లాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటాయి. మనుషులకు, ఆక్టోపస్‌లకు కామన్‌గా ఉన్న పాయింటే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఆ తెలివి ఎక్కడిదనే పరిశోధనతో... సాధారణంగా జలచరాలతో పోలిస్తే జంతువులకు జ్ఞానం ఎక్కువ. వాటి మెదడు క్లిష్టమైన నిర్మాణంతో, ఎక్కువ సామర్థ్యంతో ఉండటమే దీనికి కారణం. కానీ జలచరాలే అయినా ఆక్టోపస్‌లు చిత్రంగా తెలివిని ప్రదర్శిస్తాయి. మనుషులు, జంతువులను గుర్తించగలడం, అందులో నచ్చినవారిని ఇష్టపడటం, డబ్బాల మూతలను తిప్పితీయడం, కర్రపుల్లలు, ఇతర వస్తువులను పరికరాల్లా వాడగలగడం, గుర్తు పెట్టుకోగలగడం వంటివి చేస్తాయి. వాటికి ఉన్న ఎనిమిది టెంటకిల్స్‌ను మనం చేతులను వినియోగించినట్టుగా.. సున్నితంగా నత్తగుల్లలను తెరవడానికి, శత్రువులపై వేగంగా దాడి చేయడానికి వాడగలవు. పూర్తిస్థాయిలో ఎదిగిన మెదడు, విస్తృతమైన నాడీ వ్యవస్థనే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఒక జలచరం ఇలా ఎదగడానికి కారణమేమిటన్న అన్వేషణలో ఒకనాటి మూలాన్ని గుర్తించారు. 51.8 కోట్ల ఏళ్ల కిందట.. భూమ్మీద జీవం ఆవిర్భవించిన తొలినాళ్లు అవి. సూక్ష్మజీవుల స్థాయిలో మొదలైన జీవం సుదీర్ఘకాలం ప్రాథమిక స్థాయిలోనే.. సముద్రాల్లో వివిధ రకాల పురుగులు, ఇతర రూపాల్లో ఉండేది. అలాంటి ఓ పురుగులాంటి జీవి పేరు ‘ఫసివెర్మిస్ యున్ననికస్’. సముద్రం అడుగున నేలకు అతుక్కుని జీవించేది. ఇది సుమారు 51.8 కోట్ల ఏళ్ల కింద పరిణామ క్రమంలో.. రెండు వేర్వేరు జీవులుగా మారిపోయింది. ఆ రెండింటిలో ఒకటి మనుషులకు ముత్తాత అయితే.. మరొకటి ఆక్టోపస్‌లకు మూలం అని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. నాడీ వ్యవస్థలోని మైక్రో ఆర్ఎన్ఏలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ తెలివి నుంచే.. జీవుల జన్యువుల పనితీరును నియంత్రించే మూల పదార్థాలే మైక్రో ఆర్ఎన్ఏలు. ఇందులో కొన్ని మైక్రో ఆర్ఎన్ఏలు మెదడు నిర్మాణం తీరు, సామర్థ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ మైక్రో ఆర్ఎన్ఏలు సాధారణంగా జలచరాల్లో తక్కువగా, నేలపై తిరుగాడే జంతువుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే జలచరాల్లో చాలా వరకు వివిధ రకాల జీవుల నుంచి అభివృద్ధి చెందగా.. మనుషులు, ఆక్టోపస్‌లు రెండు జాతులు కూడా ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచే రూపొందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ జీవులు అప్పట్లోనే కాస్త తెలివిని ప్రదర్శించేవని.. శరీరంలో అవసరం లేని భాగాలను స్వయంగా వదులుకుంటూ పరిణామం చెందాయని తేల్చారు. నాటి జీవుల్లో మైక్రో ఆర్ఎన్ఏలే ఈ సామర్థ్యానికి కారణమని అంటున్నారు. మైక్రో ఆర్ఎన్ఏలను నిలుపుకొని.. ఈ అంశంపై పరిశోధన చేసిన జర్మనీలోని బెర్లిన్ మాక్స్ డెల్‌బ్రక్ సెంటర్ శాస్త్రవేత్త నికోలస్ రజేవ్స్కీ తాము గుర్తించిన వివరాలను వెల్లడించారు. ఆక్టోపస్‌ల మెదడు, నాడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి.. వాటిలో కొత్తగా 42 మైక్రోఆర్ఎన్ఏ రకాలను గుర్తించినట్టు తెలిపారు. మొత్తంగా వీటిలో 90 మైక్రో ఆర్ఎన్ఏలు ఉన్నట్టు వివరించారు. అదే ఆక్టోపస్‌లకు సమీప జీవులైన ఆయ్స్టర్లు, స్క్విడ్లు వంటివాటిలో ఐదే మైక్రో ఆర్ఎన్ఏలు ఉన్నాయని తెలిపారు. ఒకనాటి ‘ఫసివెర్మిస్ యున్ననికస్’ నుంచి విడిపోతూ పరిణామం చెందినప్పుడు ఆక్టోపస్‌లు మైక్రో ఆర్ఎన్ఏలను నిలుపుకోగలిగాయని.. అందుకే మెదడు ఎదిగి, జ్ఞానాన్ని చూపగలుగుతున్నాయని వివరించారు. కొసమెరుపు ఏమిటంటే.. ఆక్టోపస్‌లు మనుషుల్లా కలలు కూడా కంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి నిద్రపోయినప్పుడు కలల వల్లే వాటి రంగు, చర్మంపై ఆకారాలు మారిపోతూ ఉంటాయని అంటున్నారు. -
వైరల్ వీడియో: వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
-
వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
ఎన్నో అద్భుతాలు, అందమైన జీవులకు నిలయం సముద్ర గర్భం. అక్కడ కన్పించే జలచరాలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక్కసారైనా వాటి దగ్గరకు వెళ్తే బాగుండనిపిస్తుంది. సాధారణ మనుషులకు ఇది కష్టమే అయినా స్కూబా డైవర్లు చాలా ఈజీ. వారు చాలా సార్లు సముద్రం అడుగుకు వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటి స్కూబా డైవర్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సముద్ర గర్భంలో అతడు ఆక్టోపస్‌తో సరదాగా ఆడుకున్నాడు. అది కూడా అతనితో చనువుగా మెదిలింది. స్కూబ్ డైవర్ అరచేతి చూపగానే ఆక్టోపస్ అటువైపే దూసుకెళ్లింది. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత.. ఆక్టోపస్ అతని చేతిపైకి వెళ్లి సేదతీరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి దాదాపు 30లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. స్కూబా డైవర్‌కు ఆక్టోపస్ హగ్ ఇచ్చిందని, అతను చాలా లక్కీ అని చమత్కరించారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
వింత జీవి: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!!
Interesting Facts In Telugu About Octopuses: మన పురాణాలు, కథల్లో ఆక్టోపస్‌ను గ్రహాంతర జీవిగా చెప్పుకోవడం వినేవుంటారు. అందుకు కారణం దాని శరీరం రూపం వింతగా ఉండటమే! ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు దీనికి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. సహజంగా జపాన్, అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న అలూటియన్ దీవుల్లో జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లు అధికంగా కనిపిస్తాయి. ఆక్టోపస్ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు చొప్పున ఉంటుంది. కంట్రోల్ మూవ్మెంట్ మధ్యలో ఉండే ప్రధాన మెదడు నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్షంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆక్టోపస్‌కు ఏకంగా మూడు గుండెలు ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లో కాపర్ అధికంగా ఉండే హిమోసైనిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఈ ఆక్టోపస్‌లో క్రొమటోఫోర్స్ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు. ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్‌లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి. ఆక్టోపస్ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి... గమనించారా? ఐతే ఆడ ఆక్టోపస్‌లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్‌లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆడ ఆక్టోపస్‌లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయి. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! -
టిక్టాక్స్టార్కు ఊహించని షాక్: తృటిలో తప్పిన ప్రాణాపాయం
టిక్‌టిక్ స్టార్, మహిళా టూరిస్ట్ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వణికిపోయింది. అందంగా ఉందికదా అని ఒక సముద్ర జీవిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయింది. బుజ్జి..బుజ్జిగా భలే ఉంది అనుకుంటూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి షాక్ అయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవినా ఇంతసేపు తాను పట్టుకున్నదీ అని గజగజ వణికిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. వివరాల్లోకి వెళితే...కైలిన్ మేరీ అనే మహిళ బాలీ దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి బీచ్‌లో గోధుమరంగు శరీరం, గుండ్రటి మచ్చలతో అందంగా కనిపించిన చిన్న అక్టోపస్‌ను అబ్బురంగా తన అరచేతితో పట్టుకుంది. ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరవాత ఆసక్తికొద్దీ దీనిపై ఆన్లైన్లో సెర్చ్ చేసింది. అప్పుడు అర్థమైంది అమెకు అసలు సంగతి. సముద్రంలో ప్రాణాంతక జంతువులలో ఒకటిగా పరిగణించే నీలిరంగు అక్టోపస్ అని. చూడ్డానికి చాలా చిన్నదిగా కనిపించినా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అని తెలుసుకొని నివ్వెరపోయింది. ఈ భయానక సంఘటనపై తన తండ్రికి ఫోన్ చేసి భావోద్వేగానికి లోనైంది. ఈ విషయాలను ఆమె నెటిజనులతో పంచుకున్నారు. దీంతో వారుకూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదృష్టవంతులు..మీకు ఎలాంటి ప్రమాదం జరగనందుకు సంతోషం వ్యక్తం చేశారు. నీలిరంగు చుక్కల ఆక్టోపస్ : కేవలం 12 నుండి 20 సెం.మీటర్ల పరిమాణంతో చిన్నగా ఉన్నప్పటికీ ఇది చాలా విషపూరితమైన సముద్ర జీవి. ఈ నీలిరంగు చుక్కల ఆక్టోపస్‌లు మానవులకు ఎంత ప్రమాదకర మైనవంటే 26 మందిని నిమిషాల్లో అంతం చేసేంత విషాన్ని కలిగి ఉంటాయి. ఇది కాటు వేసినపుడు ఎలాంటి నొప్పి తెలియదట. విష ప్రభావంతో శ్వాసకోస ఇబ్బంది, పక్షవాతం లాంటి లక్షణాలతో బాధితులు విల విల్లాడుతున్నపుడు తప్ప విషయం అర్థం కాదట. అంతేకాదు దీని విషయానికి ఇంతవరకూ విరుగుడు కూడా అందుబాటులో లేదట. -
ఆక్టోపస్ హాయ్ చెప్పడం చూశారా..
-
వైరల్ : ఆక్టోపస్ ఎంత బాగా హాయ్ చెప్పిందో..
మీరు ఎప్పుడైనా ఆక్టోపస్ హాయ్ చెప్పడం చూశారా.. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే ఈ వీడియోలో చూసేయండి. ఆక్టోపస్‌లు మనుషులు చేసే పనులు అనుకరిస్తాయని కొంతమంది చెబుతుంటారు. అది నిజామా కాదా అనే విషయం కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోనూ గమనించండి. వీడియోలో ఒక వ్యక్తి ఆక్టోపస్‌కు చేతులు ఊపాడు. అది చూసిన ఆక్టోపస్ దానికి ప్రతిస్పందనగా తన చేతులను కూడా ఊపడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపడ్డారు. దాదాపు 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అచ్చం మనిషిలాగానే ఆక్టోపస్ తన చేతులతో హాయ్ చెప్పింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు.ఆక్టోపస్ హాయ్ చెప్పడం ఆశ్చర్యంగా కలిగించిందని... ఆక్టోపస్ చాలా తెలివైన జంతువులను,మనుషులను తొందరగా సంగ్రహించే శక్తి ఉంటుందంటూ కామెంట్లు పెట్టారు. కానీ కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ... అది హాయ్ చెప్పలేదని, దాని మీద ఏదో పడితే అది తీయడానికి అలా చేసిందని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఆక్టోపస్ తాను చేసిన పనికి సోషల్ మీడియాలో ఒక్కసారగా హీరోగా మారిపోయిందనడంలో సందేహం లేదు. The octopus is one of the most intelligent animals on the planet. Here’s one copying a wave “hello” pic.twitter.com/DUit3H8DBe — Nature is Lit🔥 (@NaturelsLit) February 22, 2020 -
‘కాళేశ్వరం’లో ఉగ్ర అలజడి!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో శుక్రవారం ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్త కలకలం రేపింది! ఆక్టోపస్ బృందం 46 మందితో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొంది. అన్నారంలోని సరస్వతి, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ ప్రాంతాల్లో ఆక్టోపస్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. తుపాకులు, బాంబుల మోతతో అన్నారం, మేడిగడ్డ పరిసర పొలాల్లోని రైతులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఇదంతా ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్ అని తర్వాత తెలుసుకున్న జనం ఊపిరి పీల్చుకున్నారు -
వైరల్ : బతుకు జీవుడా అనుకున్న గద్ద
సాధారణంగా గద్దలు ఆహారం కోసం సముద్రమార్గంలో అన్వేషిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. వాటి అన్వేషణలో భాగంగా దొరికిన చేపలను,పాములను నోట కరచుకొని వెళ్తుంటాయి. కానీ కెనెడాలోని వాంకోవర్ ఐలాండ్‌లో మాత్రం ఒక గద్దకు వింత అనుభవం ఎదురైంది. ఆహారం కోసమని నీటిలో దిగగా ఒక ఆక్టోపస్ వచ్చి గద్దను తన కబంద హస్తాలలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. దాని నుంచి విడిపించికునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆక్టోపస్ గద్దను ఇంకా గట్టిగా పట్టుకోవడంతో హాహాకారాలు మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయానికి చేపలను పెంచే సాల్మన్ బృందం పడవలో వెళ్తూ గద్ద అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆక్టోపస్ హస్తాలలో చిక్కుకున్న గద్ద బయటికి వచ్చేందుకు చేస్తున్న పోరాటాన్ని ఆ బృందం గమనించింది. ఎలాగైనా గద్దను కాపాడాలనే ప్రయత్నంలో ఒక కర్రకు హుక్‌ను తగిలించి దానితో ఆక్టోపస్‌ను కదిలించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆక్టోపస్ తన పట్టు విడవడంతో చివరికి ఎలాగోలా గద్ద బతుకుజీవుడా అంటూ పక్కనే ఉన్న ఒడ్డుకు చేరుకుంది. మొత్తం 54 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ కాస్తా సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ యూట్యూబ్‌లో 1.78 మిలియన్ల మంది వీక్షించారు. ఆక్టోపస్ చేతులలో బంధీగా మారిన గద్దను సురక్షితంగా కాపాడిన బృందాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. -
వైరల్ : ఇంతకీ ఈ వింత ఆకారం ఏంటి?
అదేంటి ఆక్టోపస్ ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఏంటి అనుకుంటున్నారా!. కానీ ఇది నిజం.. అయితే ఒక్కోసారి మనం చూసే కొన్ని వీడియోలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. మనకు ఎప్పుడైనా వింత జంతువులు కనపడితే దానిని కనిపెట్టలేక అదొక మిస్టరీగా మిగిలిపోతుంది. తాజాగా ఒక ఆక్టోపస్ సముద్రంలో వేగంగా ఈదుతూ ఊసరవెల్లిలా రంగు మారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియోలో ఆక్టోపస్ వేగంగా ఈదుతూ సముద్రం రంగుకు అణుగుణంగా తన ఆకృతితో పాటు రంగును మార్చుకోవడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చూసిన వారంతా మంత్ర ముగ్దులవుతున్నారు. వీడియోలో ఆక్టోపస్ రంగులు మార్చడం చూసి కొంతమంది ఆశ్చర్యానికి లోనవ్వగా, మరికొందరు మాత్రం ఇది వేరే ప్రపంచం నుంచి వచ్చిన వింత ఆకారం అని కామెంట్లు పెడుతున్నారు. ' కేవలం మనల్ని మభ్యపెట్టేందుకు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు. అయినా ఆక్టోపస్ సముద్రంలో అంత వేగంగా ఈదుతూ రంగుల ఎలా మారుస్తుందో తనకు అర్థం కావడం లేదని' ఒక నెటిజన్ ట్విటర్లో అభిప్రాయపడ్డాడు. నిజంగా ఇది ఆక్టోపస్ అవునో కాదో నిర్థారించుకోవాలంటే మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి. -
వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?
ఆక్టోపస్‌తో ఆటలాడిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ముఖంపై ఆక్టోపస్‌ను వేసుకుని ఫొటోలకు ఫోజులిస్తున్న క్రమంలో తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చేరింది. వివరాలు... వాషింగ్టన్కు చెందిన జామీ బెసీగ్లియా అనే(45) మహిళ స్థానికంగా జరుగుతున్న చేపలు పట్టే పోటీకి వెళ్లింది. అక్కడ కొంతమంది జాలరుల వలకు ఆక్టోపస్ చిక్కడాన్ని చూసి ఉత్సాహంగా అక్కడికి పరిగెత్తింది. ఇంకేముంది దానిని చేతుల్లోకి తీసుకుని ముఖం మీద వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలుత గమ్మున ఉన్న ఆక్టోపస్.. కాసేపటి తర్వాత ఆమెను కొరకడం ప్రారంభించింది. అయినప్పటికీ జామీ మాత్రం దాన్ని వదలకుండా అలాగే ఉండిపోయింది. కానీ ఆక్టోపస్ విజృంభించడంతో నొప్పితో విలవిల్లాడిపోతూ ఆస్పత్రికి పరిగెత్తింది. ఇక తన చేదు అనుభవం గురించి జామీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ....‘నాకు పిచ్చిపట్టిందని మీరు అనుకోవచ్చు! అవును నా ముఖం మీద ఉన్నది ఆక్టోపస్!!. దానికి కత్తుల్లాంటి కోరలు ఉంటాయని.. శరీరంలోకి దిగుతాయని నాకు తెలుసు. అదే జరిగింది కూడా. నా చిన్ ఉబ్బిపోయింది. రక్తం కారుతూనే ఉంది. గొంతు, శరీరంలోని కొన్ని గ్రంథులు తీవ్రంగా ఉబ్బిపోయాయి. అయితే నేను దాన్ని వదిలిపెట్టబోవడం లేదు. రాత్రికి వండుకుని తినేస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో.. ‘పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్లడం అంటే ఇదే. అన్నీ తెలిసి ఇలా ఎందుకు చేశావు. మళ్లీ దాన్ని వండుకు తింటా అంటావు. పిచ్చి పట్టిందా ఏంటి’ అంటూ నెటిజన్లు జామీ చర్యను విమర్శిస్తున్నారు. View this post on Instagram Can you say CRAZY 😜! Yes, that is an octopus 🐙 on my face!! I didn’t know they had a beak that they can inject into you. Well it happened to me. Ouch 😬🙄! My chin is swollen up and would not stop bleeding and now it’s just oozing. But, I’m going to cook it for dinner! LMFAO Great day on the water! #southsoundsalmonsisters #yeti #southsoundsalmonqueen #octopus A post shared by Jamie Bisceglia (@south_sound_salmon_queen) on Aug 2, 2019 at 4:39pm PDT -
భయానక అనుభవం; ఆక్టోపస్‌ను తిందామనుకుంటే..
బతికున్న ఆక్టోపస్‌ను తిందామనుకున్న ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ప్రాణాలు రక్షించుకునేందుకు ఆక్టోపస్ చేసిన ఎదురుదాడిలో సదరు యువతి ముఖంపై గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఓ చైనీస్ బ్లాగర్ ప్రాణాలతో ఉన్న ఆక్టోపస్‌ను తింటూ వీడియో తీసేందుకు ప్రయత్నించింది. దానిని ఎత్తుకుని నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆక్టోపస్ తన మీసాలతో ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో దానిని విడిపించుకునేందుకు ఆమె చాలా ప్రయత్నించింది. కానీ అది ఒక పట్టాన వదలకపోవడంతో ఏడుపు లంకించుకుంది. బాధతో విలవిల్లాడుతూ.. చివరకు ఎలాగోలా దానిని వదిలించుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘అసలు నీకు మతి ఉండే ఇలా చేశావా... బతికున్న ఆక్టోపస్‌ను తినాలని ఎలా అనుకున్నావు’ అంటూ నెటిజన్లు ఆమె చర్యను తప్పుబడుతున్నారు. ఇంకేం మీరు కూడా వీరిద్దరి ఫైట్‌పై ఓ లుక్కేయండి. -
ఏంటా పని... చావును చేతిలో పట్టుకున్నావే!
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వైరల్ వీడియో కోసమని ఇటీవలే ఓ వ్యక్తి క్రూయిజ్ షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నీళ్లలో దూకిన సంగతి తెలిసిందే. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ నెటిజన్ల చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. తాజాగా ఓ టూరిస్టు కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. దాని విషానికి విరుగుడు లేదు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఓ వ్యక్తి బీచ్‌లో సరదాగా నడుస్తూ అత్యంత విషపూరితమైన నీలం రంగు వలయాలు కలిగి ఉన్న ఆక్టోపస్(బ్లూ రింగ్డ్)ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత దానితో ఆటలాడుతూ టిక్ టాక్ వీడియో రూపొందించి.. ‘ఈ బుజ్జి ఆక్టోపస్’ ఎంత బాగుందో అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు టూరిస్టు తీరుపై మండిపడుతున్నారు. ‘ ఏంటా పని. అది విషపూరితమైన ఆక్టోపస్రా నాయనా.. దాని విషానికి విరుగుడు కూడా లేదు.. చావును చేతిలో పట్టుకోవడం సరదా అనుకుంటున్నావా’ అంటూ ఒకరు చీవాట్లు పెడితే.. ‘ ఇంతటి పిచ్చి పనిచేసిన నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే నిజంగా అదృష్టం అంటే నీదే’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా చూడటానికి ఎంతో అందంగా కనిపించే బ్లూ రింగ్డ్ ఆక్టోపస్‌లు అత్యంత విషపూరితమైనవి. వాటి విషం మానవ శ్వాస కోశ వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుంది. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ విషం గనుక ఎక్కినట్లైతే నిమిషాల వ్యవధిలో మనుషులు ప్రాణాలు కోల్పోతారు. వీటి విషానికి ఇంతవరకు విరుగుడు కనుగొనలేదు. -
మౌంట్ ఎస్పీ
రెండేళ్ల క్రితం రెండు శిఖరాలు, రెండువేల పదిహేడులో మూడు, రెండువేల పద్దెనిమిదిలో రెండు శిఖరాలు.. పద్ధతిగా పాఠాలు విని పరీక్షలు రాసినట్లు, ఒద్దిగ్గా దేశ పతాకాన్ని ఆరుచోట్ల ఆవిష్కరించారు ఆక్టోపస్ ఎస్పీ రాధిక. శిఖరాలను అధిరోహించిన రికార్డులతోపాటు ఆక్టోపస్ ఉద్యోగమూ ఓ రికార్డే. ఆక్టోపస్ విభాగంలో తొలి మహిళా పోలీస్ అధికారి ఆమె.పర్వతారోహణల్లోనూకొన్ని తొలి రికార్డులు సాధించిన రాధిక... ఈ శిఖరాలన్నింటికంటే తండ్రి కోరుకున్న శిఖరాన్ని చేరుకున్నప్పుడే ఎక్కువ సంతోషాన్ని పొందానంటారు! ఏపీ ‘ఆక్టోపస్’ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాధిక పుట్టింది అనంతపూర్, పెరిగింది కడప. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో. తండ్రి కోరిక ప్రకారం ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. ఐదున్నరేళ్లు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. తండ్రి కోరిక ప్రకారమే గ్రూప్ వన్ అధికారి కావాలనుకున్నారు, పోలీసు అధికారి అయ్యారు. బంగారంలాంటి లెక్చరర్ ఉద్యోగం వదులుకుని పోలీసు ఉద్యోగానికి వెళ్తానంటావా!, ఆడపిల్లకు అంత రిస్క్ ఎందుకు, పైగా మంచి ఉద్యోగం వదులుకుని మరీ రిస్క్ ఎక్కువగా ఉండే ప్రొఫెషన్లోకి పోతారా ఎవరైనా!.. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు ఇవన్నీ. ‘‘నాన్నకు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ని కావడం ఇష్టం. లైఫ్ చాలెంజింగ్‌గా ఉండటం నాకిష్టం. పోలీస్ ఉద్యోగంతో ఇద్దరి ఇష్టాలు నెరవేరుతాయి’ ఇదీ రాధిక సమాధానం. మౌంటనియరింగ్ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటూ.. ‘ఎన్ని శిఖరాగ్రాలు చేరినా నేలకు దిగాల్సిందే, ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాల్సిందే’ అన్నారు రాధిక. అన్నింటికంటే నాన్న కోరుకున్నట్లు గ్రూప్ వన్‌కి సెలెక్ట్ అయినప్పుడు నిజంగా శిఖరాన్నధిరోహించిన సంతోషాన్ని పొందాను. నాన్నయితే తాను ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషపడ్డారు. ఆయనకు అంత సంతోషాన్నిచ్చిన దేవుడు.. నన్ను యూనిఫామ్‌లో చూసే వరకు ఆయన్ని ఉంచలేదు. నా అచీవ్‌మెంట్స్‌ను చూస్తున్న అమ్మ... తాను సంతోష పడుతూ నాన్న చూడలేకపోయాడని బాధ పడుతుంటుంది’’ అని ఉద్వేగంగా చెప్పారు రాధిక. భక్తిగా తొలి పర్వతం రాధిక తొలి పర్వతారోహణ హిమాలయాల్లో మానస సరోవర్ యాత్ర. హిమాలయాల మీద ఇష్టంతో ఒక భక్తురాలిగా మాత్రమే మానస సరోవర్ పరిక్రమ చేశానన్నారు. ఆ పరిక్రమకు చాలా మంది పోనీ (పొట్టి గుర్రాలు), పోర్టర్ల సహాయం తీసుకుంటారు. రాధిక తన సామాను తానే మోసుకుంటూ కాలి నడకన పరిక్రమ పూర్తి చేయడం చూసిన తోటి ప్రయాణికురాలు దీప్తి (ముంబయిలో అడ్వొకేట్) ‘ఫిట్నెస్ బాగుంది, మౌంటనియరింగ్ కోర్సు చేయవచ్చు కదా’ అన్న మాటలే రాధికను పర్వతాల బాట పట్టించాయి. మానస సరోవర్ యాత్ర పూర్తి చేసుకుని డ్యూటీకి వచ్చిన తర్వాత రాధిక తన పై అధికారులను పర్వతారోహణకు అనుమతి అడిగినప్పుడు వాళ్లు సంతోషంగా అంగీకరించారు. ‘డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్‌ను ఎంకరేజ్ చేస్తుంటాం. అడ్వెంచర్ స్పోర్ట్ అయిన మౌంటనియరింగ్లోనూ రాణించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నో అంటాం’ అని తెలంగాణ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది ప్రోత్సహించారు. అలా 2013లో కశ్మీర్ రాష్ట్రం, పెహల్గామ్లో మౌంటనియరింగ్ కోర్సులు చేశారు రాధిక. శిక్షణలో భాగంగా గోలప్ కాంగ్రి శిఖరాన్నీ అధిరోహించారు. ఎవరెస్టు అధిరోహణకు ముందు ఐఎమ్ఎఫ్ ఆల్ ఉమెన్ ఎక్స్‌పెడిషన్‌లో మౌంట్ మెంటోసా శిఖరాన్ని చేరుకున్నారు. ఆ శిఖారోహణ చేసిన తొలి దక్షిణ భారత మహిళ రాధిక. తర్వాత కార్గిల్‌లో మౌంట్ కున్ శిఖరాన్ని చేరారు. ఈ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఆమె. ఇవన్నీ ఎవరెస్టు అధిరోహణ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి తనకు తాను పెట్టుకున్న పరీక్షలు. ఇక నెక్స్›్ట గోల్ ఎవరెస్టే! హిమాలయాల్లో తరచూ మారే వాతావరణానికి అనుగుణంగా బాడీ తట్టుకోవడం కోసం స్కీయింగ్ కోర్సు కూడా చేశారామె. ‘‘మూడు దశల కోర్సు(బేసిక్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్డ్) కోసం ఆరు వారాల పాటు గడ్డకట్టే చలిలో ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ప్రాక్టీస్ చేయడంతో ఎవరెస్ట్‌ను ఎక్కగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’’ అన్నారు రాధిక. అమ్మా.. నీ కేదయినా అయితే! ‘‘ఎవరెస్టు అధిరోహణకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుంటున్నప్పుడు మా చిన్నవాడు నా దగ్గరగా వచ్చి ‘‘అమ్మా! నీకేదైనా అయితే’’ అన్నాడు. అప్పటికేదో సర్ది చెప్పాను. ఎవరెస్టు ఎక్కే వరకు కూడా ఆ మాట గుర్తు రాలేదు. దిగి వచ్చేటప్పుడు మృతదేహాలు కనిపిస్తాయి. అప్పుడు మా చిన్నవాడి మాటలు గుర్తొచ్చాయి. నిజానికి యుద్ధం ఎలాంటిదో మౌంటనియరింగ్ కూడా అలాంటిదే. యుద్ధరంగంలో అడుగు పెట్టే వరకే ఆలోచించాల్సింది. ఆ తర్వాత యుద్ధం చేయడం ఒక్కటే మన ముందుండే ఆప్షన్. చిన్నప్పటి నుంచి ఆటలు, సైక్లింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం. ప్రతి రోజూ చాలెంజింగ్గానే ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ని, మౌంటనియరింగ్నీ అంతగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఏడు శిఖరాల కోరిక ఆదిలాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్సూచనతో మౌంట్ కిలిమంజారోకి వెళ్లాను. అది పూర్తయిన తర్వాత ఏడు ఖండాలు, ఏడు శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలిగింది. ఆస్ట్రేలియాలో ఎల్తైన శిఖరం కోసియోస్కోతో కలిపి ‘టెన్ అస్సీ పీక్ చాలెంజ్’కి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫండింగ్ ఇచ్చింది. తర్వాత విభజన క్రమంలో ఏపీకి మారాను. చిత్తూరు అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ సహకారంతో యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అంకాకాగువాకి వెళ్లాను. మిగిలిన రెండింటికీ ఏపీ ప్రభుత్వం సహకరించింది. ప్రకృతిదే పై చేయి అలాస్కాలో మౌంట్ దేనాలి పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ప్రకృతి విషమ పరీక్ష పెట్టింది. ఇరవై రోజుల పాటు పాతిక కేజీల బ్యాగ్ మోసుకుంటూ, తాడు పట్టుకుని అరవై డిగ్రీల కోణంలో పర్వతాన్ని ఎక్కిన తర్వాత, ఇక కేవలం 338 మీటర్లు ఎక్కితే సమ్మిట్ పూర్తవుతుందనగా విధిలేక ఆపేయాల్సి వచ్చింది. రాళ్లతో చాచి ముఖం మీద కొట్టినట్లు చిమ్ముతోంది మంచు. వాతావరణం సహకరించే వరకు ఆగక తప్పని స్థితి అది. అప్పుడు కలిగింది మాటల్లో చెప్పలేనంత బాధ. రెండున్నర గంటలు వెదర్ సహకరిస్తే ఆరోహణ పూర్తయ్యేది. మేము విరామం తీసుకున్నప్పుడు మంచు తుపాను రాలేదు. మళ్లీ కదిలిన రోజు వెదర్ వికటించింది. రెండు రోజులు ఉండి ప్రయత్నిద్దామా అంటే... మమ్మల్ని పికప్ చేసుకోవాల్సిన ఫ్లయిట్ వచ్చేసింది. ప్రైవేట్ ఎక్స్‌పెడిషన్ అయితే మరొక చాన్స్ కోసం ఎదురు చూడవచ్చు. కానీ అది చాలా ఖరీదవుతుంది. మాకున్న ఫండింగ్ సరిపోదు. ప్రకృతి నిర్ణయానికి తలవంచాల్సిన పరిస్థితి అది. అప్పుడు వెళ్లిన టీమ్‌లన్నీ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. మనమెంత చిన్నవాళ్లమో ‘మౌంటనియరింగ్ వల్ల ఏం సాధిస్తారు’ అనే ప్రాథమిక ప్రశ్న దాదాపుగా ప్రతి మౌంటనియర్కీ ఎదురవుతుంది. పర్వతాన్ని అధిరోహించినప్పుడు మనం ఎంత చిన్న వాళ్లమో తెలుస్తుంది. ఇంత పెద్ద చరాచర జగత్తులో మనం పిపీలికంతో సమానమనే వాస్తవాన్ని తెలుసుకుంటాం. అన్నింటికంటే ప్రధానంగా మనలోని ఇగో తొలగిపోతుంది. మనం ఎందులోనూ అధికులం కాదని తెలుసుకుంటాం. ఇది సమ్మిట్ విఫలమైనప్పుడు కలిగే భావన కాదు, సక్సెస్ అయినప్పుడు కూడా నేర్చుకునే పాఠం ఇదే. ఇలాంటి ప్రతికూల పరిస్థితి గత నెలలో చేసిన ఆరవ ఎక్స్‌పెడిషన్ అంటార్కిటికా విన్సన్లోనూ జరిగింది. అయితే పీక్‌ను చేరుకుని తిరిగి బేస్ క్యాంపుకి వచ్చిన తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో ఫ్లయిట్ రాలేదు. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది రోజులు ఎదురుచూశాం. మాతో తీసుకెళ్లిన రేషన్.. మరో రెండు మూడు రోజులకే వస్తుంది. పది రోజులు రావాలంటే ఉన్నదే సర్దుకుంటూ తిన్నాం. నీటి కోసం మంచు కరిగించుకున్నాం. ఆ ఫ్యూయెల్ కూడా మరీ ఎక్కువేమీ ఉండదు. రోజుకు ఒకటిన్నర– రెండు లీటర్ల నీటితో సరిపెట్టుకున్నాం. వయసు అడ్డంకి కాదు నాతోపాటు అంటార్కిటికాలో విన్సన్ పర్వతారోహణకు వచ్చిన వారిలో నార్వే నుంచి వచ్చిన లీస్జెత్కి 61 ఏళ్లు. కెనడా సిల్వీకి 54, మొరాకో బుష్షాకు 48. మా టీమ్‌లో నేనే చిన్నదాన్ని. నన్ను నలభై దాటాక, ఈ వయసులో పర్వతాలెక్కడానికి వెళ్లడమా అన్న వాళ్లున్నారు. తీరా దేశం బయట అడుగు పెడితే నేను పెద్దదాన్ని కాదు చిన్నదాన్ని అనిపించింది. ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడం చాలా అవసరం. ‘ఎ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ’ అనేది అన్ని కాలాలకూ అన్ని ప్రదేశాలకూ వర్తిస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి, జీవితం ఆరోగ్యకరంగా ఉంటుందని నమ్ముతాను. ఇక నా ఫ్యామిలీ అంటారా.. మాది లవ్ కమ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కాబట్టి మా వారు (వేణుగోపాల్‌రెడ్డి) దేనికీ అడ్డు చెప్పరు. అన్నింటిలోనూ మంచి సపోర్టును ఇస్తారు’’ – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటో : వి. రూబిన్ బెసాలియల్ పెద్ద గీత ముందు అన్నీ చిన్న గీతలే ప్రకృతి పెట్టే పరీక్షలకు ఓర్చి పర్వతాలెక్కి సాధించేదేమిటంటే... మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని, చీర కొనివ్వలేదని, లవ్ బ్రేకప్ అయిందని ఆత్మహత్యకు పాల్పడే వాళ్లకు, అది ఎంత అవివేకమైన పనో తెలియజెప్పాలనిపిస్తుంది. జీవితాన్ని ఉపయుక్తంగా మలచుకోవాలి. సాధించగలిగిన గోల్స్‌ను నిర్దేశించుకోవాలి, వాటిని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమ అవసరమో అంతగా శ్రమించాలని అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలకు పరిధులు గీయవద్దని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడానికి నన్ను నేను ఉదాహరణగా చూపించుకోగలుగుతున్నాను. – జి.ఆర్. రాధిక, ఎస్.పి, ఆక్టోపస్ విభాగం, ఆంధ్రప్రదేశ్ సప్త పర్వత ఆరోహణ ►మౌంట్ ఎవరెస్ట్ 2016 మే 20 ►మౌంట్ కిలిమంజారో 2016 ఆగస్టు 14 ►మౌంట్ కోసియోస్కో 2017 మార్చి 17 ►మౌంట్ ఎల్బ్రస్ 2017 సెప్టెంబర్ 8 ►మౌంట్ అకాంకాగువా 2017 డిసెంబర్ 30 ►మౌంట్ దేనాలి 2018 జూలై 4 (వాతావరణం సహకరించక శిఖరాన్ని చేరలేదు) ►మౌంట్ విన్సన్ 2018 డిసెంబర్ 16 -
తిరుమల : ఆక్టోపస్ మాక్‌డ్రిల్‌లో అపశృతి
సాక్షి,తిరుమల : మాక్‌డ్రిల్ చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. పాంచజన్యం అతిథి గృహం వద్ద మాక్ డ్రిల్ చేస్తున్న సమయంలో ఆక్టోపస్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు నాలుగో అంతస్థు నుంచి పడిపోయాడు. ట్రైనింగ్ సందర్భంగా జరుగుతున్న ఈ శిక్షణలో గాయపడిన కానిస్టేబుల్ గోయల్ సందీప్‌ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
‘జ్యోతిష్య’ ఆక్టోపస్‌ను చంపేశారు!
టోక్యో: ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో మూడు జపాన్ మ్యాచ్‌ల ఫలితాల గురించి సరిగ్గా జోస్యం చెప్పిన ఆక్టోపస్ పాపం తనకు ఇంత తొందరగా చావు రాసి పెట్టి ఉంటుందని ఊహించలేదేమో! ‘రాబియో’ పేరు గల ఈ ఆక్టోపస్‌ను కిమియో ఆబె అనే వ్యక్తి సముద్రం నుంచి తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాని జ్యోతిష్యం మొదలైంది. మూడు నీళ్లు నిండిన బకెట్లపై ఒక్కో ఫలితం రాసి వాటి మధ్యలో ఈ ఆక్టోపస్‌ను వదిలేవారు. అది దేనిని ఎంచుకుంటే అదే ఫలితం వచ్చింది. అయితే ఇప్పుడు కిమియో దానిని చంపేసి దుకాణంలో అమ్మకానికి పెట్టేశాడు. చేపలు పట్టడమే జీవనాధారమైన కిమియో తనకు మరో మార్గం లేకుండా పోయిందన్నాడు. రాబియోకు వస్తున్న పేరు ప్రఖ్యాతులకంటే దానిని మాంసంగా మార్చి అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తాడు కాబట్టి చంపక తప్పలేదని అతను అన్నాడు. గ్రూప్ దశలో కొలంబియాతో జపాన్‌తో గెలుస్తుందని, సెనెగల్‌తో ‘డ్రా’ చేసుకొని... పోలాండ్ చేతిలో ఓడుతుందని ఈ ఆక్టోపస్ చెప్పిన జోస్యం 100 శాతం నిజమైంది. ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఓడి జపాన్ ఆట ముగియగా... దానికి ముందే రాబియో మార్కెట్లో మాంసాహారంగా మారిపోయింది! -
నల్లమలలో ‘ఆక్టోపస్’ ఎట్రాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కొత్త పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. నల్లమల అటవీ అందాలు, కృష్ణా తీర సొగసులు, లోయల అందాలను తిలకించేందుకు వీలుగా ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కృష్ణా నదీ ఆక్టోపస్‌లా మెలికలు తిరిగి కనిపిస్తుండటంతో ఆ పేరు పెట్టినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్–శ్రీశైలం హైవే మార్గంలో మన్ననూర్ నుంచి 42 కి.మీ. దూరంలో, దోమలపెంటకు 5 కి.మీ. ముందు ఈ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎం.సి.పర్గెయిన్ దీన్ని ప్రారంభించారు. సందర్శకులు సేదతీరేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించడం కోసం ఒక వాచ్ టవర్, ఫారెస్ట్ ట్రయల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పర్గెయిన్ పేర్కొన్నారు. వ్యూ పాయింట్ సందర్శనకు వచ్చే పర్యాటకులు అటవీ ప్రాంత ప్రశాంతతను కాపాడాలని, ప్లాస్టిక్ కవర్లు విసిరేయొద్దని సూచించారు. -
ఆక్టోపస్ అదుర్స్
-
ఆర్టిఫిషియల్ ఆక్టో‘పట్టు’
సియోల్: అక్టోపస్ ఏ ప్రాణినైనా పట్టుకుందంటే దాని ఊపిరి తీసేంతవరకు వదలదు. అంతటి గట్టిపట్టునే శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించారు. దీనిని ఎలక్ట్రానిక్, మెడికిల్ రంగాలలో వినియోగించనున్నారు. దక్షిణ కొరియాలోని సంగ్క్యున్క్వాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాలిమర్ షీట్లను ఉపయోగించి ఈ కృత్రిమ పట్టును సృష్టించారు. మృధువైన గోళాలవంటి నిర్మాణాలను కలిగి, 50 మైక్రో మీటర్ల సైజులో ఉన్న పాలిమర్ షీట్లతో ఈ పట్టును సాధించారు. ఆక్టోపస్ పట్టుత్వాన్ని సూక్ష్యదర్శినిలో పరిశీలించిన మీదట శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. ఇవి నీటిలో సమర్దవంతంగా పనిచేస్తాయి. ఈ గోళము వంటి నిర్మాణంలో ఖాళీ ప్రదేశం ఉండి అధిక పీడనాన్ని కలిగి ఉండడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్యాచ్‌లను వెయ్యిసార్లు ఉపయోగించవచ్చని, ఆ తర్వాత ఇవి కొంత పట్టును కోల్పోతాయని, మరింత పట్టుకోసం వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
వేలల్లో కాసే ఆక్టోపస్ టమాటా చెట్లు..!
ఒకే ఒక్క చెట్టుకు సుమారు 32,000 టమాటాలు వరకూ కాయడం ఎక్కడైనా చూశారా? 40 నుంచి 50 చదరపు మీటర్ల పరిథిలో విస్తరించే ఆ అరుదైన హైబ్రీడ్ టమాటా మొక్కలు ప్రతి సీజన్ లోనూ వేలాదిగా కాయడం వాల్డ్ డిస్నీవరల్డ్ రిసార్ట్ లో అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఆక్టోపస్ చెట్లు ఏ ప్రాంతానికి చెందినవి అన్న వివరాలు మాత్రం పూర్తిగా అందుబాటులో లేకపోయినా.. ఇంటర్నెట్ ఆధారంగా తెలిసిన వివరాలను బట్టి అవి చైనాకి చెందినవిగా తెలుస్తోంది. మొదటిసారి ఆక్టోపస్ టమోటా చెట్లను ఫోటోల్లో చూసిన ఓ వ్యక్తి.. వాటిపై అధ్యయనం మొదలు పెట్టాడు. ఒకే ఒక్క చెట్టు వేలల్లో కాయలు కలిగి ఉండటం బూటకం అనుకున్నానని, అయితే ఆఫోటోలు ఎంతో ఆకట్టుకోవడంతో ఆచెట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కొన్ని గార్డెనింగ్ సైట్లలో తీవ్రంగా వెతికినా వాటి పెరుగుదల, విత్తనాలు, ఎక్కడ దొరుకుతాయి అన్నఇన్ఫర్మేషన్ పెద్దగా దొరకలేదని తెలిపాడు. అనంతరం ఓ ట్రావెల్ బ్లాగ్ ద్వారా అటువంటి ఆక్టోపస్ టమాటో చెట్లు వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ లో అందర్నీ ఆకట్టుకుంటున్నాయని తెలియడంతో అవి నిజమైన చెట్టుగా నమ్మకం కుదిరిందని తెలిపాడు. కానీ ఆ ఆక్టోపస్ టమాటా చెట్లను ఎలా పొందాలో తెలుసుకునేందుకు ఈబే, అలి ఎక్స్ ప్రెస్ వంటి మరిన్ని వెబ్ సైట్లలో వెతికిన అతడు.. అక్కడ కొందరు ఆ మొక్కల అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియడంతో.. ఆ అద్భుతమైన ఆక్టోపస్ టమాటా చెట్ల ఉనికి గురించి తెలియనివారికి కూడా చెప్పాలనుకున్నాడు. తనకు తెలిసిన కొద్దిపాటి సమాచారం ప్రకారం అవి చైనాకు చెందినవిగా తెలుస్తోందని, దాన్ని నిర్థారించలేకపోతున్నట్లు తెలిపాడు. వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ థీమ్ పార్కుల్లో ఒకటైన ఎప్కాట్ కు చెందిన వ్యవసాయ శాస్త్ర మేనేజర్ యాంగ్ హాంగ్ ద్వారా ఆక్టోపస్ టమాటా చెట్లు చైనా బీజింగ్ కు చెందినవిగా తెలిసిందని..., ఫ్లోరిడా ఎంటర్ టైన్మెంట్ పార్కులో వాటిని ప్రదర్శనకు ఉంచిన సందర్భంలో అక్క్డడినుంచీ కొన్ని గింజలను తెచ్చిన యాంగ్.. వాటిని నాటి, కొంతమంది సహాయంతో పెంపకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఆక్టోపస్ టమాటో మొక్కలు పూర్తిశాతం పెరగడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ మొక్కలు మొదటి 7-8 నెలల వరకూ ఎటువంటి ఫలాలను ఇవ్వవు, పరిపక్వతకు చేరిన అనంతరం సగటున ఒక్కో కాపుకు 14,000 టమాటోల వరకూ పంట వస్తుంది. ప్రస్తుతం ఎప్ కాట్ లోని రెండు మొక్కల్లో ఒకటి ఇంచుమించుగా 522 కేజీల బరువైన 32,000 టమాటాలకు వరకూ కాసి, భారీ పంటను ఇచ్చిన మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించింది. ఈ మొక్కలు ఒక్కోటి సుమారు 40-50 చదరపు మీటర్లలో వ్యాపించి ఉండటం విశేషం. అయితే ఇటువంటి మొక్కలు పెంచుకోవాలనుకునేవారు వాల్ డిస్నీ రిసార్ట్ కు టూర్ వెళ్ళి, అక్కడి గ్రీన్ హౌస్, ల్యాబ్ లలో ఓ గంటపాటు కాలినడకన తిరుగుతూ వాటిని దగ్గరగా చూస్తూ గడపొచ్చు. అంతేకాదు.. వాటి కేర్ టేకర్లతో మొక్కల గురించిన వివరాలను మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే వాల్ డిస్నీ రిసార్ట్ లో పండించే ఈ ఆక్టోపస్ టమాటాలు ఎప్ కాట్ లోని రెస్టరెంట్లలో కూడా విరివిగా వాడటం ఆసక్తికరంగా ఉంటుంది. -
విశాఖలో ఆక్టోపస్
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తం వచ్చే నెల విశాఖలో సైబర్ క్రై మ్పై ప్రత్యేక సెమినార్ డీజీపీ ఎన్.సాంబశివరావు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: పీఎల్‌జిఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తమయ్యామని డీజీపీ ఎన్.సాంబశివరావు అన్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం విశాఖ మన్యంలో హెలికాఫ్టర్‌లో పర్యటించారు. అనంతరం గ్రేహౌండ్స్ అధికారులు, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ చంద్రశేఖరరావులతో విశాఖలోని గ్రేహౌండ్స్ కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. నగర పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించి కమిషనర్ టి,యోగానంద్‌తో పాటు ఉన్నతాధికారులతో నేర సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి ఉన్నతాధికారులను, ప్రజా ప్రనితిధులను అప్రమత్తం చేశామన్నారు. మావోయిస్టుల ఉ ద్యమం 32 ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు ఏమంత లేదన్నారు. విశాఖలో గ్రే హౌండ్స్ ఇప్పటికే ఉండగా, ఆక్టోపస్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. సైబర్‌క్రై మ్స్, రాత్రివేళ గహల్లో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు నగర నేర సమీక్షలో గుర్తించామన్నారు. త్వరలోనే కొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టి వీటిని తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. మోసాలు చేసేవాళ్లు ఎక్కువయ్యారని, సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడుకొని నేరాలకు పాల్పడుతుంటే అందుకు తగ్గట్టుగా నిందితులను పట్టుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే పోలీసులు పరిష్కరిస్తున్నారన్నారు. సైబర్ నేరాలను ఎలా అరికట్టాలనేదానిపై వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిపుణులను రప్పించి వర్క్‌షాప్ నిర్వహించున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, కొద్ది రోజులుగా వస్తున్న ఆ మార్పు గమనించవచ్చని తెలిపారు. ఊహించని చోట్ల ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో వారి కదలికలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సాంబశివరావు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు 24వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. డిప్లొమా, ఇంటర్మీడియెట్ చదివిన వారికి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అవకాశంపై పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీకి సాదర స్వాగతం గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో డీజీపీ సాంబశివరావుకు పోలీసు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. హైదరాబాదు నుంచి వచ్చిన ఆయన్ని పోలీసు కమిషనర్ యోగానంద్, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, సహాయ పోలీసు కమిషనర్ భీమారావు తదితర అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
బాలుడి గొంతులో ఆక్టోపస్
హోస్టన్: రెండేళ్లు కూడా నిండని బాలుడి గొంతులో నుంచి వైద్యులు ఓ ఆక్టోపస్‌ను బయటకు తీశారు. అంతచిన్న పిల్లాడి గొంతులోకి ఆక్టోపస్ ఎలా వెళ్లిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పిల్లాడిని చంపేందుకే ఎవరైనా కుట్ర పన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన అమెరికాలోని విచితా నగరానికి సమీపంలోగల కాన్సాస్ గ్రామంలో చోటుచేసుకుంది. తల్లి ఆఫీస్ నుంచి తిరిగొచ్చేసరికి ఆమె ప్రియుడు మ్యాథ్యూ పిల్లాడికి కృత్రిమంగా శ్వాస అందించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని గమనించి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. కృత్రిమ శ్వాసను అందించేందుకు వైద్యులు కూడా ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. బయటకు తీసిచూస్తే ఆక్టోపస్! దాని తలే దాదాపు 5 సెంటీమీటర్లుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ అందని కారణంగా మెదడుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు మ్యాథ్యూను అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. -
అది ఆమె ప్రియుడి పనేనా!
హ్యూస్టన్: అమెరికాలో ఓ రెండేళ్ల బాలుడి గొంతులో ఇరుక్కుపోయిన చనిపోయిన ఆక్టోపస్‌ను డాక్టర్లు అతికష్టం మీద బయటకు తీసి అతని ప్రాణాలను కాపాడారు. అయితే బాలుడి గొంతులోకి ఐదు సెంటీమీటర్ల వ్యాసానికి పైగా ఉన్న ఆ ఆక్టోపస్ ఎలా ప్రవేశించిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడి తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హ్యూస్టన్ ప్రాంతానికి చెందిన కన్సాస్ అనే 21 ఏళ్ల యువతి తన బాయ్ ఫ్రెండ్ మ్యాథ్యూ గల్లాగర్తో సహజీవనం చేస్తోంది. ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోన్న కన్సాస్.. తన రెండేళ్ల కొడుకుని బాయ్ ఫ్రెండ్ సంరక్షణలో వదిలేసి ఆఫీసుకు వెళ్లింది. అయితే.. ఆఫీసు నుంచి తిరిగొచ్చే సరికి తన కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి కన్సాస్ షాక్‌కు గురైంది. కొడుకు ఊపిరాడని స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పరిశీలించి బాలుడి గొంతులో ఆక్టోపస్ ఇరుక్కుపోయిందనే ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు. ఊపిరాడకపోవడంతో మెదడుకు ఆక్సీజన్ సరఫరా తగ్గి.. బాలుడి ఆరోగ్యపరిస్థతి విషమంగా ఉండటంతో డాక్టర్లు ఆ ఆక్టోపస్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు.. ఆ ఆక్టోపస్‌ను కన్సాస్ కుటుంబం పెంపుడు జంతువులా పెంచుకోవడం లేదని, ఆ సముద్రజీవి బాలుడి గొంతులోకి ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందని తెలిపారు. బాలల హక్కుల చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కన్సాస్ ప్రియుడు గల్లాగస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఆక్టోపస్‌కు ఆధునిక ఆయుధాలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద వ్యతిరేక దళం ఆక్టోపస్‌కు అత్యాధునిక ఆయుధాలు సమకూరుతున్నాయి. ఆక్టోపస్ కమాండోలు ప్రధానంగా అర్బన్ వార్ ఫేర్ ఆధారంగానే శత్రువుతో పోరాడాల్సి ఉంటుంది. దీనికి ప్రస్తుత వాటి కంటే ఆధునికమైనవి అవసరమని గుర్తించిన ఉన్నతాధికారులు వీటిని ఆర్డర్ చేశారు. లెన్స్, కెమెరా, టార్గెట్ లేజర్ బీమ్ లాంటి హంగులు ఈ రైఫిళ్లకు ఉంటాయి. ఏపీ, తెలంగాణలకు కలిపి 1500 ఆయుధాలను సమీకరించుకుంటున్నారు. విమానాల ద్వారా 800 వచ్చాయి. అన్నీ వచ్చాక ఇరు రాష్ట్రాల డీజీపీలు వీటిని ఆవిష్కరించనున్నారు. -
బెజవాడకు తరలిన ఆక్టోపస్!
తిరుపతిలో నెలకొల్పాల్సిన ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో ప్రధాన కార్యాలయ భవనం, అడిషనల్ డీజీపీ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి రూ.4.29 కోట్లను మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి బి.ప్రసాదరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను తుంగలో తొక్కుతూ తిరుపతిలో ఏర్పాటుచేయాల్సిన ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం.. నిరోధించడం.. తిప్పికొట్టడం కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ కేంద్రంగా అక్టోబరు 1, 2007న ఆక్టోపస్‌ను ఏర్పాటుచేశారు. పోలీసుశాఖలో పనిచేసే 500 మంది మెరికల్లాంటి అధికారులను ఎంపిక చేసి.. వారికి కమెండో శిక్షణ ఇప్పించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సూచనల మేరకు తిరుమల శ్రీవెంకటేశ్వరుని ఆలయానికి 90 మంది సభ్యులున్న ఆక్టోపస్ దళం భద్రత కల్పిస్తోన్న విషయం విదితమే. రాష్ట్ర విభజన నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో నెలకొల్పాలని ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ ప్రభుత్వానికి సూచిం చాయి. ఈ నివేదికలపై ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం.. తిరుపతిలో ఆక్టోపస్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రేణిగుంట సమీపంలో 400 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములను పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం.. అక్కడ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసేం దుకు అంగీకరిస్తూ జూలై నెలాఖరులో ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చుతోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధానిని ఏర్పాటుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు కూడా అక్కడే ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. ఈ క్రమంలోనే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే నెలకొల్పాలని నిర్ణయించింది. విజయవాడలో కార్యాలయం, కమెండో బృందాలకు వసతి, అడిషనల్ డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించడం కోసం రూ.4.29 కోట్లను మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతి నుంచి విజయవాడకు తరలించడంపై నిఘా వర్గాలే తప్పుపడుతున్నాయి. గత ఏడాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అక్టోబరు 6, 2013న పుత్తూరులో ఓ ఇంట్లో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్(ఐఎల్ఎఫ్) తీవ్రవాద విభాగానికి చెందిన ఫకృద్దీన్, ఇస్మాయిల్ పన్నా, బిలాల్ మాలిక్ తిష్ట వేశారు. ఇందులో ఇస్మాయిల్ పన్నా బెంగళూరులో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిలో ప్రధాన భూమిక పోషిస్తే.. తమిళనాడులో సేలంలో బీజేపీ నేత రమేష్ హత్య కేసులో బిలాల్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఫకృద్దీన్ ఐఎల్ఎఫ్ తీవ్రవాద సంస్థ అధినేత. ఈ ముగ్గురూ కలిసి తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఎన్ఐఏ సూచనల మేరకు రంగంలోకి దిగిన ఆక్టోపస్ బృందం పుత్తూరులో తీవ్రవాదులు మకాం వేసిన ఇంటిపై దాడిచేసి అదుపులోకి తీసుకుంది. తీవ్రవాదులపై ఆక్టోపస్ దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల తిరుపతిలో ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్ఐఏ తనిఖీలు చేయడం గమనార్హం. వీటిని ఉదహరిస్తోన్న నిఘా సంస్థల అధికారులు.. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటుచేస్తే ఉగ్రవాదుల కదలికలకు చెక్ పెట్టవచ్చునని స్పష్టీకరిస్తున్నారు. రేణిగుంటలో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం, క్యాంపస్, క్వార్టర్స్‌కు కేటాయించిన భూములు.. విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండడం వల్ల రాష్ట్రంలో ఎక్కడ తీవ్రవాదుల కదలికలు కన్పించినా నిముషాల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుండడం గమనార్హం. -
తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్
-
తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్
సాక్షి, తిరుమల: యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ కమాండోలు గురువారం తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తీవ్రవాది ప్రయాణించే వాహనాన్ని మరో వాహనంతో ఛేజ్ చేయడం.. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకునే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. గురువారం ఉద యం తిరుమలలో బాలాజీనగర్ రింగ్‌రోడ్డులో నిర్వహించిన మాక్ డ్రిల్ సాగిందిలా.. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా ఓ కారు రింగ్‌రోడ్డుపైకి దూసుకుపోయింది. వెనుకే మరో కారు మెరుపు వేగంతో దూసుకొచ్చింది. వాహనం నుంచే కమాం డో సిబ్బంది తుపాకులు చేతపట్టి ముందు వెళ్లే వాహనంపై గురిపెట్టారు. చాకచక్యంగా ముందుకారును అడ్డగించారు. సెకన్ల వ్యవధిలోనే కమాం డోలు తుపాకులు, పిస్తోళ్లు చేతపట్టుకుని వాహనం దిగారు. అంతకుముందే ఆ రహదారి, ముళ్లపొదలు, చెట్ల మధ్యలో బృందాలుగా కాపుకాచిన ఆక్టోపస్ కమాండోలు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి ఆయుధాలతో అడ్డగించారు. వాహనం వద్దకు వెళ్లి తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఆలయ భద్రత కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ యూనిట్ కమాండో దళాలకు ప్రతినెలా ఏదో ఒక అంశంపై మాక్ డ్రిల్ చేస్తూ ఉగ్రవాదులు, నేరస్తులు, నిందితులను పట్టుకునే విషయంలో ఇలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. -
కొత్త సరుకు
కిట్‌క్యాట్‌తో శామ్సంగ్ స్టార్-2 లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే మరో స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘స్టార్-2’ ప్లస్‌గా పిలుస్తున్న ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ధర రూ.7335. గెలాక్సీ స్టార్-2 అప్‌గ్రేడ్ మాదిరిగా లభిస్తున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ కలిగి ఉంది. ప్రాసెసర్ వేగం 1.2 గిగాహెర్ట్జ్ (డ్యుయెల్‌కోర్) కాగా, ర్యామ్ 512 ఎంబీ. ప్రధాన కెమెరా సామర్థ్యం మూడు మెగాపిక్సెళ్లు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా ఏదీ దీంట్లో లేదు. ఫోన్ మెమరీ నాలుగు జీబీలైనప్పటికీ మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. త్రీజీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. సెల్కాన్ మిలీనియం వోగ్.. కేవలం 7.9 మిల్లీమీటర్ల మందం... 1.2 క్వాడ్‌కోర్ ప్రాసెసర్.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్‌క్యాట్.. ఇవీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెల్కాన్ కంపెనీ తాజాగా విడుదల చేసిన మిలీనియం వోగ్ క్యూ455 స్మార్ట్‌ఫోన్ విశేషాలు. మోటరోలా ఇటీవల విడుదల చేసిన మోటో-ఈ ఫీచర్లను పోలిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణ 16 జీబీల ఇంటర్నల్ మెమరీ. ఎస్డీ కార్డు ద్వారా దీన్ని 64 జీబీల వరకూ పెంచుకోగలగడం మరో విశేషం. ఫొటోల కోసం 8 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్. ధర రూ.7999. ఓబీ ఆక్టోపస్ ఎస్ 520 ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో జాన్ స్కలీ స్థాపించిన కొత్త కంపెనీ ఒబీ తాజాగా భారత మార్కెట్లో అక్టోపస్ ఎస్ 520 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.7 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే... ఆక్టోపస్ ఎ520 దాదాపు 5 అంగుళాల స్క్రీన్, 1280 బై 720 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంది. ఒక సాధారణ సిమ్, ఒక మైక్రోసిమ్‌ను సపోర్ట్ చేయగలదు. కిట్‌క్యాట్‌తో నడుస్తున్నప్పటికీ వన్ జీబీ వరకూ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల మల్టీటాస్కింగ్ మరింత వేగంగా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది గిగాబైట్ల ఇంటర్నర్ మెమరీని ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. రెజల్యూషన్ 8 ఎంపీ. ఫ్రంట్ కెమెరా 2 ఎంపీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రాక్సిమిటీ, ఆక్సెలరోమీటర్ సెన్సర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. దీంతో నాలుగు గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ అంటోంది. -
పాల్ వారసుడు ‘రెజీనా’?
ప్రపంచకప్ ఫలితాలపై ఆక్టోపస్ జోస్యం బెర్లిన్: దక్షిణాఫ్రికాలో 2010 సాకర్ ప్రపంచకప్ ఫలితాలను ముందే ఊహించి విశేష ప్రాచుర్యం పొందిన ‘ఆక్టోపస్ పాల్’ గుర్తుందా! ఇప్పుడు దాని వారసుడిగా ‘ఆక్టోపస్ రెజీనా’ బయటకు వచ్చింది. బెర్లిన్ అక్వేరియం ‘అక్వా డామ్’లో ఉంటున్న రెజీనా... బ్రెజిల్ టోర్నీలో మ్యాచ్ ఫలితాలను ముందే ఊహిస్తోంది. ఈనెల 16న పోర్చుగల్‌తో జరగనున్న మ్యాచ్‌లో జర్మనీ గెలుస్తుందని తేల్చేసింది. ఆహార పదార్థాలతో కూడిన ఓ పాత్రకు రెండు రంధ్రాలు చేసి వాటిని ఇరు దేశాల పతకాలతో కప్పి ఉంచి అక్వేరియంలో ప్రవేశపెట్టారు. అయితే జర్మనీ పతాకం ఉన్న రంధ్రం గుండా రెజీనా తన టెంటకిల్‌ను లోపలికి దూర్చింది. నిజమైన తాబేలు జోస్యం మరోవైపు ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ గెలుస్తుందని ఆ దేశంలోని సముద్రపు తాబేలు ‘బిగ్ హెడ్’ చెప్పిన జోస్యం నిజమైంది. బ్రెజిల్, క్రొయేషియాతో పాటు డ్రాకు సంబంధించిన పతాకాన్ని ఒక్కో చేపకు కట్టి ఉంచి తాబేలు ముందుపెట్టారు. బ్రెజిల్ పతాకం ఉన్న చేపను బిగ్ హెడ్ ఎంపిక చేసుకుంది. -
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభజన పూర్తి: రాజీవ్ త్రివేది
* తెలంగాణ ఆక్టోపస్ ఇన్చార్జిగా అదనపు డీజీ రాజీవ్ త్రివేది * గ్రేహౌండ్స్ ఐజీగా మహేష్ భగవత్ బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యాంటీ నక్సలైట్ కమాండో విభాగం గ్రేహౌండ్స్‌తో పాటు రాష్ట్ర యాంటీ టైస్ట్ కమాండో విభాగం ఆక్టోపస్ రెండుగా విడిపోయాయి. తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ ఇన్చార్జిగా రాష్ట్ర స్పెషల్ బెటాలియన్ అదనపు డీజీ రాజీవ్‌త్రివేది గురువారం బాధ్యతలను స్వీకరించారు. అలాగే ఆక్టోపస్ ఐజీగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ మహేష్ మురళీధర్ భగవత్ బాధ్యతలను చేపట్టారు. గ్రేహౌండ్స్‌కు సంబంధించి కీలకమైన కమాండోలను రెండు రాష్ట్రాలకు విభజించారు. తెలంగాణకు కొంత తక్కువగా కేటాయింపు జరిగినా వచ్చే రెండు, మూడు నెలల్లో గ్రేహౌండ్స్‌కు అవసరమైన సిబ్బందిని సమకూర్చుతారని ఉన్నతాధికారులు తెలిపారు. -
చిత్తూరు జిల్లా కోర్టుకు అల్-ఉమ్మా ఉగ్రవాదులు
చిత్తూరు : గత ఏడాది అక్టోబర్ 5న పుత్తూరులో పట్టుబడ్డ ముగ్గురు ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితులకు 13 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వేలూరు జైలుకు తరలించారు. కాగా పుత్తూరులో ఉగ్రవాదులు మకాం వేశారన్న పక్కా సమాచారం తమిళనాడు పోలీసులకు అందటంతో రాష్ట్ర పోలీసులతో కలిసి కమాండో ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదులను గత ఏడాది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల కమాండో ఆపరేషన్‌లో బిలాల్ మాలిక్, మున్నా ఇస్మాయిల్ ప్రాణాలతో చేతికి చిక్కగా, వారితోపాటు బిలాల్ భార్య హుస్సేన్ బాను (27), కుమార్తెలు అయేషా (4), ఫాతిమా (3), కుమారుడు యాసిన్ (1)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరినుండి 80 జిలిటెన్‌టిక్స్, ఐఇడిలు, పిస్టల్స్, రెండు బాంబులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఉగ్రవాదులైన బిలాల్ బృందాన్ని పట్టుకోవడంలో ఆక్టోపస్ పోలీసులుకాని తమిళనాడు, చిత్తూరు జిల్లా పొలీసులు ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా టియర్ గ్యాస్‌తో ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వహించడం గమనార్హం. -
లగడపాటి అండ్ కో సర్వేల గారడీ
ఏలూరు కేంద్రంగా బెట్టింగ్ శిబిరం! వందల కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం టీడీపీదే గెలుపంటూ బోగస్ ప్రచారం ఆయన పేరు లగడపాటి రాజగోపాల్. బెట్టింగ్‌ల విషయంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ సన్యాసం స్వీకరించి తెరమరుగయ్యారు. సార్వత్రిక సమరం అనంతరం సర్వేల పేరుతో హల్చల్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని తొలుత చెప్పిన లగడపాటి తర్వాత తూచ్ అన్నారు. తాజాగా టీడీపీకి చాన్స్ ఉందంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా లగడపాటి రంగులు మార్చడం వెనుక బడా బెట్టింగ్ స్కాం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా లగడపాటి బెట్టింగ్ దందాకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సర్వేల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారు. లడగపాటి అండ్ కో భారీ బెట్టింగ్ స్కీ(స్కా)ం కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సర్వేల పేరుతో వందల కోట్లు దండుకున్న లగడపాటి తాజాగా అదే మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. గతంలో సర్వేల రాయుడిగా జనంలో కొంత ఇమేజ్ సంపాదించుకున్న రాజగోపాల్ దాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం రూపొందించారు. ఏలూరు కేంద్రంగా భారీ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. స్వాహాకు వ్యూహం... ఏలూరు అడ్డాగా నడిచే బెట్టింగ్ శిబిరానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ లగడపాటేనని తెలుస్తోంది. తెరపైకి మాత్రం బుకీలు కనిపిస్తారు. సర్వేలు తారుమారు చేయడం ద్వారా పందేల బరిని సిద్ధం చేస్తారు. ఆనక ఒకటికి రెండిస్తామని పందేలరాయుళ్లను రెచ్చగొడతారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే పార్టీకి అనుకూలంగా సర్వే నివేదికలు సృష్టిస్తారు. విజయం సాధించే పార్టీ తరఫున లగడపాటి వర్గం పందెం వేస్తోంది. వందల కోట్లు స్వాహా చేస్తోంది. ఇది లగడపాటి మార్క్ సర్వేల వెనుక దాగున్న లోగుట్టు. ఇవేమీ తెలియని అమాయక జనం పందేల పేరుతో సర్వం పోగొట్టుకుంటున్నారు. అంతా బోగస్... సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గాలిని కోరుకున్నారు. విజయవాడలో లగడపాటి ఓటు వేసే సమయంలో కొన్ని టీవీ చానళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాయి. అప్పటికి 50 శాతం పోలింగ్ పూర్తయింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోందని విలేకరులు ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనని లగడపాటి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని గురువారం లగడపాటి సర్వే విడుదల చేశారు. బెట్టింగ్ వ్యాపారంలో ఆరితేరిన లగడపాటికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బోగస్ సర్వేతో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో లగడపాటి గందరగోళానికి తెరతీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన సర్వే ఏమైంది... రాష్ట్రం ముమ్మాటికీ విడిపోదు. నా వద్ద సర్వేలు ఉన్నాయి అని నానా హడావిడి చేసిన లగడపాటి సర్వే ఏమైందని పలువురు ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. తప్పుడు సర్వేలు సృష్టించడం, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందడం లగడపాటికి వెన్నతో పెట్టిన విద్య అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకొని తెరమరుగైన రాజగోపాల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సర్కస్‌లో బఫూన్లా మారడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లీకేజ్ రాయుడు... 2009 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తోందని లగడపాటి తన అనుచరగణం ద్వారా లీకులిప్పించారు. అప్పటివరకు సందిగ్ధంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి పందేలు కాశారు. కాంగ్రెస్ గెలుస్తోందని లగడపాటి అనధికారికంగా సర్వే విడుదల చేశారు. దీంతో పందేలు రెండింతలయ్యాయి. నగర ంలోని ఒక సహకార బ్యాంక్‌లో పందెం సొమ్ము డిపాజిట్ చేసే విధంగా పందేల ఒప్పందం కుదిరింది. ఈ ఎన్నికల్లో లగడపాటి సుమారు రూ.100 కోట్లు పందెం గెలిచినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అంతర్జాతీయ బుకీలతో లగడపాటికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాజగోపాల్ సర్వేల కోసం లక్షలు ఖర్చు చేసి బెట్టింగ్‌ల రూపంలో కోట్లు దండుకుంటారని భోగట్టా. -
ఇక పోలీస్ డెన్‌గా తిరుపతి
-
పుత్తూరు ఘటనలో కరుడుగట్టిన ఉగ్రవాదులు
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్) చేపట్టిన మొట్ట మొదటి ఆపరేషన్ విజయవంతమైంది. ఆక్టోపస్ కమాండోలు చాకచక్యంగా వ్యవహరించి కరుడుగట్టిన ఇద్దరు తీవ్రవాదులను పట్టుకున్నారు. గేటుపుత్తూరు మేదరవీధిలోని ఒక ఇంట్లో దాక్కున్నవారిలో ఒకరు ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా కాగా, రెండవ వాడు అల్-ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ మాలిక్. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని చెన్నై తరలించారు. ఈ ఆపరేషన్‌లో తమిళనాడు, స్థానిక పోలీసులతోపాటు ఆక్టోపస్ కమాండోలు, ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) సిబ్బంది పాల్గొన్నారు. అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది పోలీస్ ఫక్రుద్దీన్‌ను తమిళనాడు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. చెన్నైలో దాడులు చేయాలన్న లక్ష్యంగా అతను చెన్నై పెరియార్ మేడలోని ఒక లాడ్జిలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా పుత్తూరులో శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. శనివారం తెల్లవారు జామునుంచి పోలీసులను ఉగ్రవాదులు నానా తిప్పలు పెట్టారు. తమిళనాడుకు చెందిన సిఐ లక్ష్మణన్‌ను కత్తితో అయిదారు చోట్ల పొడిచారు. అతను తీవ్రంగా గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆక్టోపస్ కమాండోలను 50 మందిని తిరుమల నుంచి పుత్తూరుకు రప్పించారు. పోలీసులు బెదిరించడంతో బిలాల్ తన భార్య, ముగ్గురు పిల్లలను మధ్యాహ్నం బయటకు పంపించాడు. లొంగిపోయిన వారిని పోలీసులు పుత్తూరు ఆస్పత్రికి పంపారు. సుమారు 11 గంటల సేపు పోరాడి బిలాల్, ఇస్మాయిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో తీవ్రవాది అలీం తప్పించుకున్నాడు. తప్పించుకుపోయిన ఉగ్రవాది జాడ కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వీరు అనేక పేలుడు సంఘటనలలో నిందితులని తెలుస్తోంది. ఆ ఇంట్లో పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆల్-ఉమా తీవ్రవాదుల లక్ష్యం తిరుమలేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బిలాల్, ఇస్మాయిల్ మరో ఇద్దరు కలిసి తిరుమలలో రెక్కీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు ఫక్రుద్దీన్ కోసం ఏళ్ల తరబడి గాలిస్తున్నారు. ఇమాం అలీ అనే తీవ్రవాదిని 2002లో మదురై కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతుండగా ఫక్రుద్దీన్ పోలీసులపై బాంబులు విసిరి అతడిని విడిపించుకుపోయాడు. బీజేపీ అగ్రనేత అద్వానీపై 2011లో హత్యాయత్నం, హిందూమున్నని తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి వెల్లయప్పన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, ఆడిటర్ రమేష్ హత్యకేసుల్లో ఫక్రుద్దీన్ నిందితుడు. మదురై జిల్లా సుంగంపల్లివాసల్ వీధికి చెందిన పోలీస్ ఫక్రుద్దీన్ (48), ఇతని అనుచరులైన తిరునల్వేలి మేల్పాలయూనికి చెందిన ఇస్మాయిల్ (35), బిలాల్మాలిక్ (25), అబూబకర్ సిద్ధిక్ (48) కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వీరిని పట్టిస్తే 20 లక్షల రూపాయలు, సమాచారమిచ్చినా ఒక్కోక్కరికి 5 లక్షలు రూపాయల బహుమతి ప్రకటించారు. బాంబులు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడం వంటి విషయాల్లో కాశ్మీర్‌లోని తీవ్రవాదుల వద్ద పోలీస్ ఫక్రుద్దీన్ శిక్షణ పొందాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం ముమ్మరంగా వేట సాగించారు. ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడైన ఇస్మాయిల్ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఇస్మాయిల్, మాలిక్, ఫక్రుద్దీన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది.