ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి! | South Korean Man Dies From Heart Attack After Choking Live Octopus Dish | Sakshi
Sakshi News home page

ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!

Oct 27 2023 3:17 PM | Updated on Oct 27 2023 3:28 PM

South Korean Man Dies From Heart Attack After Choking Live Octopus Dish - Sakshi

విదేశాల్లో కొన్ని రకాల సముద్ర జాతులు చూసేందుకే చాలా భయంకరంగా ఉంటాయి. ఐతే వాటిని కొంతమంది తింటుంటారు. ఇలాంటివి తినేటప్పుడూ అజాగ్రత్తతో తింటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలానే ఓ వృద్దుడు లైవ్‌ ఆక్టోపస్‌ని తింటూ.. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఎలా జరిగింది? ఏవిధంగా చనిపోయాడు తదితరాల గురించే ఈ కథనం!.

అసలేం జరిగిందంటే..ఆక్టోపస్‌ ఎలా ఉంటుందో తెలిసిందే. మెలికలు తిరిగిన కాళ్ల మాదిరి చాలా ఉంటాయి. అది వాటితోటే ఏదైన జీవిపై అటాక్‌ చేసి చంపి తింటుంది. దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ సాన్‌ నాజ్కి వంటను ఆస్వాదించాడు. ఈ వంకాన్ని పచ్చిగా ఉన్న ఆక్టోపస్‌ మాంసలపై నువ్వులు వేసి కొన్ని రకాల సుగంధద్రవ్యాలను కలిపి నేరుగా తినేస్తారు. ఆ వృద్ధుడు కూడా ఇలానే తిన్నాడు వృద్ధుడు. ఐతే అతను తింటున్నప్పుడూ ఆ ఆక్టోపస్‌కు ఉండే టెన్టకిల్స్‌(కాళ్ల మాదిరిగా ఉండే భాగాలు) మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఆనందంగా తినడంపైనే దృష్టి పెట్టాడు. ఇంతలో ఆ టెన్టకిల్‌ ముక్క ఒకటి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై చనిపోయాడు. అందుకే ఆరోగ్య నిపుణులు పలుమార్లు ఈ ఆక్టోపస్‌ రెసిపీలు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఇలానే వ్యవహరించి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని అన్నారు. 

నిజానికి ఇలా లైవ్‌ ఆక్టోపస్‌ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ఈ రెసిపీ అందరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ ఇలానే టేస్ట్‌ చేయడం ప్రారంభించారు. ఇలా లైవ్‌ ఆక్టోపస్‌ డిషిని తిని సుమారు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కూడా. వాస్తవానికి సజీవంగా ఉన్న ఆక్టోపస్‌ ముక్కలు చేసినా.. దాని భాగాలు ఇంకా కదులుతూనే ఉంటాయి. అందులోని ఈ రకమైన సాన్‌నాజ్కి డిష్‌ని వండకుండా పచ్చిగానే తింటారు. అలాంటప్పుడు అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్‌ అరెస్టు గురవ్వడం జరుగుతోంది. 

ఊపిరాడకపోతే కార్డియాక్‌ అరెస్టు జరుగుతుందా..?
ఒక వస్తువు గొంతులో ఇరుక్కుపోతే వాయు మార్గాన్ని మూసేస్తుంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దీంతో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ప్రభావం ఏర్పడుతుంది.  అలాంటప్పుడు సమీపంలో ఉన్నవాళ్లు బాధితులకు ఊపిరి ఆడేలా ఆక్కిజన్‌ అందించేలా చూడాలి. లేదా ఆ అడ్డంకి తొలగించే యత్నం అయినా చేయాలి.  కొందరికైతే గొంతులో ఇరుక్కుపోయి పెద్ద పొలమారిన దగ్గులా వచ్చి రక్తపోటు పెరగిపోవడం జరుగుతంది. చివరికి గుండె మీద ప్రభావం ఏర్పడి ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే గొంతులో ఉన్న అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసీ సీపీఆర్‌ చేస్తే మనిషి బతికే అవకాశాలు ఉంటాయి.

(చదవండి: రైస్‌ వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement