South Korean
-
లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు
పుణె: సౌత్ కొరియాకు చెందిన లేడీ యూట్యూబర్‌ను వేధించిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.నవంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. సౌత్ కొరియాకు చెందిన యూ ట్యూబర్ కెల్లీ పుణె పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో వ్లాగ్ చేసుకుంటూ అక్కడి స్థానికులతో ముచ్చటిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆకతాయి కెల్లీని దగ్గరకు లాక్కొని ఆమె మెడపై చేయి వేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఇదంతా వీడియోలో రికార్డైంది. ఈ ఘటన జరుగుతుండగానే వెంటనే మరోవ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడిని కూడా దగ్గరకు రమ్మని మొదటి వ్యక్తి సూచించాడు. దీంతో కెల్లీ వారిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ‘నేనిక్కడి నుంచి పారిపోవాలి. వాళ్లు నన్ను హగ్ చేసుకునేందెకు ప్రయత్నిస్తున్నారు’ అనికెల్లీ అనడం క్లిప్‌లో రికార్డైంది. గతంలో ముంబైలోనూ ఓ ఆకతాయి సౌత్‌కొరియాకు చెందిన లేడీ యూ ట్యూబర్‌ను వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఇదీచదవండి..అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్ పోటీపై కోర్టు సంచలన తీర్పు -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
సౌత్ కొరియన్ యువ సింగర్ మృతి.. విషాదంలో ఫ్యాన్స్!
సౌత్ కొరియన్ యువ సింగర్, సాంగ్ రైటర్ లిమ్ నాహీ మృతి చెందారు. నాహీ (Nahee)గా పాపులర్ అయిన ఈ 24 ఏళ్ల గాయని బుధవారం(నవంబర్ 8) ఆకస్మికంగా మరణించినట్లు స్థానిక వార్తా సంస్థ కొరియాబూ వెల్లడించింది. అయితే నాహీ మరణానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ఆమె కుటుంబ సభ్యులు కానీ, సంబంధిత అధికారులు కానీ ఇంతవరకూ వివరాలను వెల్లడించలేదు. నాహీ అంత్యక్రియలు గియాంగి ప్రావిన్స్‌లోని ప్యాంగ్‌టెక్ జరుగుతాయని కొరియాబూ వార్తా సంస్థ పేర్కొంది. తమ అభిమాన సింగర్ ఆకస్మికంగా దూరమవడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సంతాపం తెలియజేస్తూ కామెంట్లు వెల్లువెత్తాయి. మూడు రోజుల క్రితం నాహీ ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిసారిగా కొన్నిఫొటోలను అప్లోడ్ చేశారు. ఆమె మరణవార్త తెలిసిన ఫ్యాన్స్ తమ అభిమాన సింగర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నాహీ చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కామెంట్లు పెట్టారు. నాలుగేళ్లలోనే అత్యంత పాపులారిటీ కొరియాబూ కథనం ప్రకారం.. నాహీ సౌత్ కొరియాలో అత్యంత ఆదరణ ఉన్న సింగర్. 2019లో ‘బ్లూ సిటీ’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో అరంగేట్రం చేసిన లిమ్ నాహీ ఆ తర్వాత బ్లూ నైట్, గ్లూమీ డే వంటి పలు ఆల్బమ్స్ చేశారు. ‘హెచ్’, ‘రోజ్’ నాహీ చివరిసారిగా చేసిన ఆల్బమ్స్. View this post on Instagram A post shared by 나히(Nahee) (@im_na._.hee) -
నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష? ఎందుకలా?
ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి వస్తే.. అది మన ఊహకు అందదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ఆ దేశంలో అమలులో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పేరు ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి. ఇక్కడ చట్టం అమలయ్యే తీరు తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ నేరానికి ఇంతటి శిక్ష విధిస్తారనే ప్రశ్న ఇప్పుడు మన మదిలో మెదులుతుంది. దేశంలోని ఏ ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని సమాచారం. ఇక ఉత్తర కొరియాలోని ప్రత్యేక చట్టాల విషయానికొస్తే జుట్టు కటింగ్‌కు సంబంధించి కూడా చట్టాలు రూపొందించారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం 28 హెయిర్ కటింగ్ స్టైల్స్‌కు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో మహిళలకు 18, పురుషులకు 10 హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ కాకుండా, ఎవరైనా వేరే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లయితే దానిని నేరంగా పరిగణిస్తారు. అందుకు తగిన శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇటువంటి చట్టాలు కనిపించవు. 21వ శతాబ్దంలో కూడా ఉత్తరకొరియా ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!
విదేశాల్లో కొన్ని రకాల సముద్ర జాతులు చూసేందుకే చాలా భయంకరంగా ఉంటాయి. ఐతే వాటిని కొంతమంది తింటుంటారు. ఇలాంటివి తినేటప్పుడూ అజాగ్రత్తతో తింటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలానే ఓ వృద్దుడు లైవ్ ఆక్టోపస్‌ని తింటూ.. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఎలా జరిగింది? ఏవిధంగా చనిపోయాడు తదితరాల గురించే ఈ కథనం!. అసలేం జరిగిందంటే..ఆక్టోపస్ ఎలా ఉంటుందో తెలిసిందే. మెలికలు తిరిగిన కాళ్ల మాదిరి చాలా ఉంటాయి. అది వాటితోటే ఏదైన జీవిపై అటాక్ చేసి చంపి తింటుంది. దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్‌లతో చేసే ప్రముఖ సాన్ నాజ్కి వంటను ఆస్వాదించాడు. ఈ వంకాన్ని పచ్చిగా ఉన్న ఆక్టోపస్ మాంసలపై నువ్వులు వేసి కొన్ని రకాల సుగంధద్రవ్యాలను కలిపి నేరుగా తినేస్తారు. ఆ వృద్ధుడు కూడా ఇలానే తిన్నాడు వృద్ధుడు. ఐతే అతను తింటున్నప్పుడూ ఆ ఆక్టోపస్‌కు ఉండే టెన్టకిల్స్(కాళ్ల మాదిరిగా ఉండే భాగాలు) మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఆనందంగా తినడంపైనే దృష్టి పెట్టాడు. ఇంతలో ఆ టెన్టకిల్ ముక్క ఒకటి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయాడు. అందుకే ఆరోగ్య నిపుణులు పలుమార్లు ఈ ఆక్టోపస్ రెసిపీలు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఇలానే వ్యవహరించి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని అన్నారు. నిజానికి ఇలా లైవ్ ఆక్టోపస్ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ఈ రెసిపీ అందరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ ఇలానే టేస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా లైవ్ ఆక్టోపస్ డిషిని తిని సుమారు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కూడా. వాస్తవానికి సజీవంగా ఉన్న ఆక్టోపస్ ముక్కలు చేసినా.. దాని భాగాలు ఇంకా కదులుతూనే ఉంటాయి. అందులోని ఈ రకమైన సాన్‌నాజ్కి డిష్‌ని వండకుండా పచ్చిగానే తింటారు. అలాంటప్పుడు అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్టు గురవ్వడం జరుగుతోంది. ఊపిరాడకపోతే కార్డియాక్ అరెస్టు జరుగుతుందా..? ఒక వస్తువు గొంతులో ఇరుక్కుపోతే వాయు మార్గాన్ని మూసేస్తుంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దీంతో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ప్రభావం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సమీపంలో ఉన్నవాళ్లు బాధితులకు ఊపిరి ఆడేలా ఆక్కిజన్ అందించేలా చూడాలి. లేదా ఆ అడ్డంకి తొలగించే యత్నం అయినా చేయాలి. కొందరికైతే గొంతులో ఇరుక్కుపోయి పెద్ద పొలమారిన దగ్గులా వచ్చి రక్తపోటు పెరగిపోవడం జరుగుతంది. చివరికి గుండె మీద ప్రభావం ఏర్పడి ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే గొంతులో ఉన్న అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసీ సీపీఆర్ చేస్తే మనిషి బతికే అవకాశాలు ఉంటాయి. (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఐదోదైన 123 ఫ్లోర్ల బిల్డింగ్‌ను తాళ్లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కొరియా సియోల్‌లోని లొట్టే వరల్డ్ టవర్.. 123 ఫ్లోర్లతో ప్రపంచంలోనే ఐదో ఎత్తైన బిల్డింగ్. దీన్ని ఎక్కడానికి 24 ఏళ్ల బ్రిటీష్ యువకుడు ప్రయత్నించాడు. చిన్న షార్ట్ ధరించి ఎలాంటి తాళ్లు లేకుండా గంటలోనే సగానికి పైగా 73 అంతస్తులు ఎక్కేశాడు. యువకున్ని గమనించిన పోలీసులు..అక్కడికి చేరుకుని బిల్డింగ్ ఎక్కడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్ని మాపక సిబ్బంది పైకి చేరుకుని యువకున్ని భవనంలోకి లాగారు. అనంతరం అతన్ని పోలీసులు నిర్బంధించారు. ఆ యువకున్ని బ్రిటన్‌కు చెందిన జార్జ్ కింగ్-థాంప్సన్‌గా గుర్తించారు. అయితే..ఆ యువకునికి 2019లోనే షార్డ్ బిల్డింగ్‌ను ఎక్కినందుకు జైలు శిక్ష కూడా పడింది. 2018లో లొట్టే వరల్డ్ టవర్‌ను ఎక్కే ప్రయత్నం చేసినందుకు ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్ అలైన్ రాబర్ట్‌ను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
కొరియన్ కంపెనీలతో వేదాంత గ్రూప్ ఒప్పందం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా గ్రూప్ తాజాగా 20 కొరియన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. డిస్ప్లే గ్లాస్ తయారీ పరిశ్రమకు మద్దతుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వేదాంతా పేర్కొంది. తద్వారా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం అభివృద్ధికి తెరతీయనున్నట్లు తెలియజేసింది. కొరియా ప్రభుత్వ నిధులతో అక్కడ ఇటీవల ఏర్పాటైన 2023 కొరియా వాణిజ్య షోకు వేదాంతా హాజరైంది. వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ కోట్రా ఏర్పాటు చేసిన ట్రేడ్ షోలో భాగంగా కొరియన్ డిస్ప్లే గ్లాస్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నట్లు వేదాంతా సెమీకండక్టర్ విభాగం గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె.హెబ్బర్ తెలియజేశారు. 50 కంపెనీలకుపైగా తమతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. ఇవి ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ వేల్యూ చైన్‌కు ఉపకరించనున్నట్లు వివరించారు. -
పారాగ్లైడింగ్ చేస్తుండగా.. సరిగా ఓపెన్ కాకపోవడంతో విషాదం
ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తుండగా సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విసత్‌పురా గ్రామంలోని పాఠశాలలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల షిన్ బైయాంగ్ మూన్ గుజరాత్‌లోని కడి పట్టణంలో పారాగ్లైడింగ్ చేస్తుండగా.. పారాగ్లైడర్ కనోపి సరిగా తెరుచుకోవడంలో విఫలమైంది. అంతే అతను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అతను దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటినా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి పడిపోతున్నానన్న షాక్‌లో గుండెపోటుకి గురవ్వడంతో మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఆ కోరియన్ గుజరాత్‌లోని వదోదర పర్యటనలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సదరు కొరియన్ షిన్, అతని స్నేహితుడితో కలిసి పారాగ్లైడింగ్‌కి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి కొరియన్ ఎంబసీకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని అతడి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. (చదవండి: క్రిస్మస్ చెట్టుకు బైడెన్ దంపతుల అలంకరణ.. ఫోటో వైరల్) -
Molestation: ‘ఐ లవ్యూ అంటూ నడుం పట్టుకున్నాడు’
క్రైమ్: దేశ వాణిజ్య నగరంలో విదేశీ యువతికి ఎదురైన చేదు అనుభవ ఘటనను ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరు టీనేజర్లు ఆమెను లైంగికంగా వేధించే యత్నం చేశారు. ఘటన సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌ను ముంబై ఖర్ వీధుల్లో ఇద్దరు టీనేజర్లు వేధించిన సంగతి తెలిసిందే. అరుస్తూ ఆమె వెంట పడుతూ.. లైంగికంగా వేధించే యత్నం చేశారు. అయితే ఆమె మాత్రం చాకచక్యంగా వ్యవహరించి వాళ్ల నుంచి తప్పించుకుంది. ఈ కేసులో నిందితులిద్దరూ మోబీన్ చాంద్(19), మొహమ్మద్ నఖ్వీబ్ అన్సారీ(20)లను అరెస్ట్ చేశారు. ఇక.. ఈ ఘటనలో బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించుకోకుండానే.. మహిళా కానిస్టేబుల్ ద్వారా స్టేట్మెంట్ను రికార్డు చేశారు ఖర్ పోలీసులు. ఈ క్రమంలో ఆ భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకుంది ఆ కొరియన్ వ్లోగర్. మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. ఇద్దరిలో ఒకతను ఐ లవ్యూ అంటూ నన్ను చూసి అరిచాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆపై నా నడుం పట్టుకుని లాగాడు. నన్ను బలవంతంగా చెయ్యి పట్టుకుని వాళ్ల టూవీలర్‌పై కూర్చోబెట్టుకునే యత్నం చేశారు. నేను వద్దని చెప్పా. ఆపై అతను నా మెడ చుట్టూ చేతులేసి.. బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. అది చూసి నేను నిర్ఘాంతపోయా. అతని విదిలించుకునేందుకు యత్నించా. కానీ, అతను నా నడుం పట్టుకునే ఉన్నాడు. ఆ తర్వాత కూడా వాళ్లు నా వెంట పడ్డారు. నా ఫోన్ నెంబర్ అడిగారు. కానీ, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు తప్పుడు నెంబర్ ఇచ్చా. ఇంతలో నా వ్యూయర్స్‌లో ఒకతను దగ్గర్లోనే ఉండడం.. సమయానికి అతను రావడంతో అతని సాయంతో తప్పించుకోగలిగా అని ఆమె తెలిపింది. @MumbaiPolice A streamer from Korea was harassed by these boys in Khar last night while she was live streaming in front of a 1000+ people. This is disgusting and some action needs to be taken against them. This cannot go unpunished. pic.twitter.com/WuUEzfxTju — Aditya (@Beaver_R6) November 30, 2022 ‘‘వాళ్లతో చనువుగా నేను వ్యవహరించానని, అందుకే వాళ్లు అలా ప్రవర్తించానని కొందరు వ్యూయర్స్ ఆ టైంలో కామెంట్లు చేశారు. కానీ, చుట్టూ కొంతమంది ఉన్నా నన్ను వాళ్ల నుంచి రక్షించే యత్నం చేయలేకపోయారు కదా. భారత్ ఒంటరి మహిళా వ్లోగర్స్కు సురక్షితమైన ప్రాంతమని చాలామంది అంటుంటారు. కానీ, అది నిజం కాదు. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ ప్రదేశం సురక్షితం కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరుగుతాయి. నాకు వేరే దేశంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ, ఆ సమయంలో నేను పోలీసులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భారతదేశంలో మాత్రం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నేను 3 వారాలకు పైగా ముంబైలో ఉన్నాను. ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాను అని ఆమె ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసింది. -
ముంబైలో నడిరోడ్డు పై కొరియన్ యూట్యూబర్ తో అసభ్య ప్రవర్తన
-
ఇండియాలో కంపెనీ పేరుతో దారుణం.. మహిళా ఉద్యోగుల ఇంటికి వెళ్లి..
తిరువళ్లూరు: కార్లకు కీ తయారు చేసే కంపెనీలో మహిళ ఉద్యోగినులపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంపెనీ డైరెక్టర్ కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తొడుగాడులో కార్లకు కీ తయారు చేసే పరిశ్రమ ఉంది. కాగా, ఈ కంపెనీలో 300 మంది పని చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్‌గా దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ, హెచ్ఆర్గా రాము పని చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే యువతులకు డైరెక్టర్ కియాంగ్ జూ లీ, హెచ్ఆర్ రాము సాయంతో తరచూ లైగింక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బాధిత యువతులు మప్పేడు పోలీసులకు, మేనేజ్మెంట్కు గతంలో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీకుదిర్చినట్లు తెలిసింది. దీంతో కక్ష్యకట్టిన డైరెక్టర్ లీ, తనపై ఫిర్యాదు చేసిన వారిలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. మరికొందరిని అక్కడి నుంచి వేరే బ్రాంచీకి బదిలీ చేసినట్లు తెలిసింది. పోలీసుల హెచ్చరికతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న లీ, ఇటీవల వేధింపుల పర్వానికి తెరతీశాడు. కంపెనీలో పనిచేసే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నేరుగా యువతులు నివాసం ఉండే రూమ్‌లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తాళలేక బాధిత యవతులు స్థానిక పోలీసులు, పంచాయతీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు చేశారు. తమపై లైగింక వేధింపులకు గురిచేస్తున్న కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడియో వైరల్ కంపెనీలో పనిచేసే 27 ఏళ్ల యువతిపై రెండు నెలల నుంచి లీ వేధింపుల ఎక్కువైనట్లు తెలిసింది. యువతి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లిన లీ తనతో సహాజీవనం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగం నుంచి బయటకు పంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీ బెదిరింపులపై యువతి కంపెనీ యాజమాన్యానికి ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదు ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “నాకు త్వరలోనే వివాహం కానుంది. ఈ సమయంలో లీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటికి వచ్చి మరీ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని’ యువతి యాజమాన్యంతో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. -
కొరియన్ భామతో ప్రభాస్ రొమాన్స్!
Korean Actress In Prabhas Movie: ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసి ఒక్కొక్కొ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ తన 25వ చిత్రం సందీప్ వంగ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చదవండి: ‘నాటు.. నాటు’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చెర్రి, తారక్ ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడి కట్టబోయే హీరోయిన్ ఎవరా? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా సౌత్ కొరియన్ బ్యూటీ నటించనుందని టాక్ వినిపిస్తోంది. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇందులో లేడీ విలన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూన్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ -
నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..!
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను నోచుకుంది. స్క్విడ్‌గేమ్‌ను చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎగబడుతున్నారు. గత నెల 17న రిలీజైన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ డ్రామా సిరీస్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది వీక్షించారు. చదవండి: రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు భారీగా పెరిగిన సబ్స్క్రిప్షన్స్...! దక్షిణకొరియన్ వెబ్‌సిరీస్ స్క్విడ్‌గేమ్ రాకతో నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసింది. కంపెనీ ఊహించని రీతిలో కొత్త కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ తలుపును తట్టారు. జూలై నుంచి సెప్టెంబర్‌లో సుమారు 4. 38 మిలియన్ల కొత్త కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్రైబ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్క్విడ్‌గేమ్ సిరీస్‌తోనే భారీగా కొత్త సబ్స్క్రిప్షన్స్ పెరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ రాకతో ఓటీటీ ఇండస్ట్రీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా ఓటీటీ సబ్స్క్రిప్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. 2020 ప్రథమార్థంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ల సంఖ్య దూసుకుపోయింది. ఈ సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ప్రైమ్, హట్‌స్టార్ డిస్నీ, హెచ్‌బీవో మ్యాక్స్ మొదలైన వాటికి కాసుల వర్షం కురిసింది. అదే 2021తో పోలీస్తే ఓటీటీ యూజర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దక్షిణ కొరియన్ డ్రామా సిరీస్ రాకతో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య ఇతర ఒటీటీ సంస్థలతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. సెప్టెంబర్ నాటికి నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 213.6 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. కలెక్షన్ కింగ్‌గా స్క్విడ్‌గేమ్..! సెప్టెంబర్ 17న "స్క్విడ్ గేమ్" విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగింది. ఇలా సంస్థ విలువ $278.1 బిలియన్లకు చేరుకుంది. ఇటు కొత్త చందాదారులు చేరడం, షేర్లు విలువ భారీగా పెరగడంతో సంస్థ విలువ కూడా భారీగా పెరిగింది. చదవండి: Ola Electric :ఓలా బైక్, నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభం -
అతను ఆడలేదుగా.. డబ్బులు ఇచ్చేయండి!
సియోల్: క్రిస్టియానో రొనాల్డోనా... మజాకా... అతనొస్తే వేలం వెర్రిగా టికెట్లు అమ్ముడవుతాయ్! మరి కోర్టా... మజాకా... అతను ఆడకపోతే ఆ డబ్బులన్నీ తిరిగివ్వాల్సిందే కదా! సియోల్‌లో అప్పుడు జరిగిన మ్యాచ్‌లో సాకర్ స్టార్ ఆడకపోవడంతో ఇప్పుడు తిరిగి డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గతేడాది జూలైలో ‘ది ఫాస్టా’ సంస్థ కె–లీగ్ ఆల్‌స్టార్స్, యువెంటాస్ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించింది. అయితే ఆ సంస్థ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో యువెంటాస్ తరఫున బరిలోకి దిగుతాడని తెగ ప్రచారం చేసింది. దీంతో 65 వేల టికెట్లు మూడు నిమిషాల్లోపే అమ్ముడయ్యాయి. కొరియా కరెన్సీలో 30,000 వన్ల నుంచి 4,00,000 వన్ల వరకు (రూ.1800–రూ. 24,000) ధరలు వెచ్చింది టికెట్లు కొన్నారు. తీరా మ్యాచ్ వేదికైన సియోల్ వరల్డ్‌కప్ స్టేడియానికి వచ్చాక చూస్తే రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. బరిలోకే దిగలేదు. ఇది అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం పది నిమిషాలైనా అతను ఆడి ఉంటే కొరియన్లంతా ఎంతో సంతోషంగా ఇంటికెళ్లేవారు. సాకర్ స్టార్ ఆడకపోవడంతో నిరాశ చెందిన ఇద్దరు అభిమానులు కోర్టుకెళ్లారు. విచారించిన ఇంచ్‌యోన్ జిల్లా కోర్టు ఒక్కొక్కరికి 3,71,000 వన్లు (రూ.22,285) చెల్లించాలని ‘ది ఫాస్టా’ సంస్థను ఆదేశించింది. (ఇక్కడ చదవండి: 20 కోట్ల ఫాలోవర్లు! ) -
ఇంకో పోలీస్ కావలెను!
బాలీవుడ్లో ఓ లేడీ పోలీసాఫీసర్ కోసం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారట నటుడు షారుక్ ఖాన్, దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. వీరిద్దరి కాంబినేషన్లో గత ఏడాది విడుదలైన ‘జీరో’ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఇప్పుడు షారుఖ్ –ఆనంద్ ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ఇది ఓ సౌత్ కొరియన్ సినిమాకు హిందీ రీమేక్ అట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు లేడీ పోలీసాఫీసర్లు ఉంటారట. అందులో ఒక పోలీసాఫీసర్ పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారని బాలీవుడ్ టాక్. మరో లేడీ పోలీసాఫీసర్ కోసం హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తున్నారట. విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఇంకా ఫైనలైజ్ కాలేదట. ప్రస్తుతం ‘సూర్యవన్షీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు కత్రీనాకైఫ్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరో. -
నటి కొంపముంచిన ఆల్చిప్ప!
బ్యాంకాక్ : జెయింట్ క్లామ్ ఆల్చిప్ప నటి కొంపముంచింది. అంతరించిపోతున్న ఆల్చిప్ప జాతికి చెందిన జీవిని పట్టుకున్న కారణంగా సౌత్ కొరియా నటికి ఐదేళ్ల జైలు శిక్ష పడనుంది. వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాకు చెందిన లీ ఇయోల్ ఎమ్ అనే నటి గత కొద్దినెలలుగా ‘‘లా ఆఫ్ ది జంగిల్’’ అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. జూన్ 30వ ఎపిసోడ్ చిత్రీకరించటానికి రియాలిటీ షో టీం బ్యాంకాక్‌లోని థాయ్ మెరైన్ నేషనల్ పార్క్‌కు వచ్చింది. షోలో భాగంగా సముద్రంలోకి దిగిన లీ ఇయోల్ ఎమ్ నీటి అడుగున ఉన్న ఆల్చిప్పలను బయటకు తీసువచ్చారు. అవి అంతరించిపోతున్న జాతికి చెందినవని ఆమెకు తెలియదు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ‘హట్ చావో మాయ్ నేషనల్ పార్క్’ అధికారులు నేషనల్ పార్క్, థాయ్ వన్య ప్రాణుల సంరక్షణా చట్టాలను ఉల్లంఘించిందంటూ ఆమెపై కేసు పెట్టారు. నటిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకోసం అన్వేషణ ప్రారంభించారు. రియాలిటీ షో నిర్వాహకులు క్షమాపణలు చెప్పినప్పటికి వన్య ప్రాణి సంరక్షణా అధికారులు కేసు వెనక్కితీసుకోవటానికి ఒప్పకోలేదు. థాయ్ మెరైన్ నేషనల్ పార్క్ అధికారి నారంగ్ కొంగైడ్ మాట్లాడుతూ.. ‘‘ నటిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు కోర్టు పరిథిలో ఉంది. ఆమెను శిక్షించాలా లేక వదిలేయాలా అన్నది కోర్టుకు సంబంధించిన విషయ’’ మని పేర్కొన్నారు. -
భారత్‌లో ఓ కొరియా వాసి ఆవేదన
లక్నో : భారతదేశ సంస్కృతి , సంప్రదాయాలు నచ్చి, ఇక్కడే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న కొరియా వాసికి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 15 లోపు దేశం విడిచి పోవాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఆయన తన డాక్యుమెంట్లో భారతీయ పౌరుడిగా పేర్కొనడమే. కానీ తానేమీ తప్పు చేయలేదని, భాష సరిగ్గా తెలియక పోవడం వల్ల అధికారులే ఈ తప్పుకు ఒడిగట్టారని, తాను ఈ తప్పు సరిదిద్దుకోవడానికి చాలా కాలం నుంచే ప్రయత్నిస్తున్నానని కొరియా వాసి చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొరియా వ్యక్తి బియ్యుంగ్ కిల్ కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చాడు. కొంతకాలం పాటు చెన్నైలో పనిచేశాడు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. ఇక ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. లక్నోను తన వ్యాపార ప్రదేశంగా ఎంచుకున్నాడు. దీనికోసం 2012లో బిజినెస్ వీసా కూడా పొందాడు. బారాబంకి జిల్లా ఫతేపుర్ మండలంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొరియా వాసిని అధికారులు, భారతీయ పౌరుడిగా పేర్కొన్నారు. ఒక కొరియా వాసిని భారతీయ పౌరుడిగా ఎలా నమోదుచేస్తారంటూ.. ఈ భూమిని అతను అక్రమంగా పొందాడని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు బారాబంకి ఎస్పీ అనిల్ కుమార్ సింగ్ నోటీసులు జారీచేశారు. అయితే అది అక్కడ పనిచేసే సిబ్బంది వల్ల జరిగిన తప్పిదమని, భాష తెలియక వారు అలాచేశారని కొరియా వాసి చెబుతున్నాడు. దాన్ని సరిదిద్దడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. కొరియా వాసి తాను కొన్న ఆ ప్రాపర్టీలో పాఠశాలను నిర్మించాడు. తన సంపదంతా ధారపోసి దాన్ని ఏర్పాటుచేశాడు. కానీ ఆ భూమి ఇప్పుడు ఇరకాటంలో పడింది. స్కూల్ నిర్మించిన ఆ ప్రాపర్టీలోనే కొరియా వాసి, ప్రధాన మంత్రి కౌశల్య యోజనలో భాగమైన స్కిల్ ఇండియా తరగతులు నిర్వహించాలని బియ్యుంగ్ కిల్ నిర్ణయించాడు. వెంటనే అక్కడి యువకులకు అనేక రంగాల్లో శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు. దీని ద్వారా భారత్‌లో నైపుణ్యాలను పెంపొందించాలనే అతని ఆశయాన్ని సాకారం చేసుకుంటున్నాడు. యువతకు రిటైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో శిక్షణనిస్తున్నాడు. అయితే అధికారులు తప్పుగా చేసిన నమోదు వల్ల కొరియా వాసికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా అతన్ని దేశం విడిచి వెళ్లమని నోటీసులే అందాయి. ''నాకు ఇండియా అంటే ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి కలలను నిజం చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి యువత స్వతంత్రంగా బతికేలా వారికి శిక్షణ ఇవ్వాలనేది నాకు ఇష్టం. ఇక్కడ కమ్యూనికేషన్ వల్ల నాకు చాలా కష్టాలు వచ్చాయి. నా తరపునుంచి ఆలోచించకుండా, నా వాదన వినకుండా నాకు ఎలా నోటీసులు ఇస్తారు? ఇక్కడి న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వాదన వినిపించుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది'' అని బియ్యుంగ్ ఓ ఆంగ్ల ఛానెల్‌కు తెలిపారు. 2015 నుంచి బియ్యుంగ్తో కలిసి పనిచేస్తున్న మనోజ్‌వర్మ మాట్లాడుతూ... ''సిబ్బంది ఎవరో తప్పుగా టైప్ చేసి ఉంటారు. తరువాత మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని సరిదిద్దలేదు. మేము లాయర్‌ను కలిస్తే.. నోటీసులు వచ్చే వరకు చూడండి అన్నారు. లోకల్ ఛానల్ బియ్యుంగ్ని కొరియన్ గూఢచారి అని ప్రచారం చేస్తోంది. ఇది చాలా బాధాకరం. అతను భారత యువత కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మన కోసం ఇంత చేస్తే మనం ఆయనకు ఇచ్చేది ఇదేనా?'' అని ప్రశ్నించారు. జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేశ్ తివారి ఈ విషయంపై స్పందిస్తూ.. బియ్యుంగ్ అక్కడి యువతకు శిక్షణనిస్తూ, ఎంతో మంచి పేరు సంపాదించారు. అతని కేసు వివరాలు, సర్టిఫికేట్లను పరిశీలించమని ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. -
శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై దాడి
సియోల్ : దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ ప్రధాన కార్యాలయంపై ఆ దేశ న్యాయవాదులు దాడి చేశారు. శాంసంగ్ కంపెనీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో వారు ఈ రైడ్ నిర్వహించారు. సియోల్ కేంద్ర జిల్లా న్యాయవాదుల ఆఫీసు ప్రత్యేక విచారణ బృందం,శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై రైడ్ నిర్వహించినట్టు బుధవారం ఉదయం జిన్హువా న్యూస్ రిపోర్టు చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ హై, చిరకాల మిత్రురాలు చోయి సూన్ సిల్ నిర్వహించే రెండు లాభాపేక్ష లేని ఫౌండేషన్లకు మిలయన్ల కొద్దీ అమెరికా డాలర్లను తరలించినట్టు శాంసంగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణల్లో శాంసంగ్ వైర్ 2.8 మిలియన్ల యూరోలను చోయి ఆధ్వర్యంలోని జర్మన్ కంపెనీకి తరలించినట్టు తెలిసింది. అదేవిధంగా తన రెండు సబ్సిడరీల విలీనానికి కంపెనీ మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యాలయ నేషనల్ పెన్షన్ ఫండ్ ఆపరేటర్‌పై కూడా న్యాయవాదులు దాడిచేశారని జిన్హువా పేర్కొంది. అధ్యక్షురాలితో తనకు గత దీర్ఘకాలిక స్నేహబంధాన్ని ఉపయోగించుకుని చోయి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకున్నట్టు ప్రాసిక్యూటర్లు ఇంతకముందు నుంచే ఆరోపిస్తున్నారు. -
శ్యామ్‌సంగ్ నుంచి మడతేసే ఫోన్..
-
శ్యామ్‌సంగ్ నుంచి మడతేసే ఫోన్ వచ్చే ఏడాదే..
సియోల్: వచ్చే ఏడాది నుంచి మడుచుకోగల శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ కొరియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ హక్కుల దరఖాస్తును పూర్తి చేసింది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లతోపాటు, వాషింగ్ మెషిన్లూ కూడా పేలిపోవడం, అవినీతి చోటుచేసుకోవడంవల్లే వాషింగ్ మెషిన్ల పనితీరులో లోపాలు వచ్చాయని ఆరోపణలు రావడంవంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్యామ్ సంగ్ సగానికి మడతవేసుకోగల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా ఉపశమనం పొందాలని భావిస్తోంది. చాలా ఏళ్లు డిస్ప్లేను మడుచుకోగల ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం శ్యామ్ సంగ్ ఎంతో శ్రమిస్తున్నదని, చివరకు అది పూర్తయిందని 2017లో మార్కెట్లోకి తీసుకొస్తామని జీఎస్ఎంఏ ఎరెనా సంస్థ తెలిపింది. కొత్తగా రానున్న ఫోన్ ను గెలాక్సీ 10గా పిలవనున్నారు. ఇందులో వెనుకకు తీసుకెళ్లే బటన్ కుడివైపు, మెనూ బటన్ ఎడమవైపు, హోం బటన్ ఈ రెండింటి మధ్యలో ఉండనుంది. -
కల్యాణ వైభోగమే!
-
ఫిఫా అధ్యక్ష పదవి రేసులో చంగ్
-
అమ్మో.. రాక్షస పిరానాలు కనిపించాయి
సియోల్: పిరానా చిత్రాన్ని మీరు చూసే ఉంటారుగా. అందులో ఉండే పిరానా చేపలు ఎంతటి బీభత్సం సృష్టిస్తాయి కదా.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచేంత క్రూరంగా అవి ప్రవర్తిస్తాయి. స్వయంగా మాంసాహారులైన ఫిరానాలు ఒక చెరువులో చేరాయంటే మొత్తం చేపలన్నీ మాయమవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి వాటిని అమాంతం తినేసి చెరువును డొల్ల చేస్తాయి. ఎవరైనా అందులోకి దిగారంటే కుక్కలకంటే హీనంగా పీక్కు తింటాయి. అరుదైన జలాల్లోనే ఇవి నివాసం ఉంటాయి. అలాంటి ఈ రాక్షస చేపలు నాలుగింటిని దక్షిణ కొరియాలోని ప్రభుత్వాధికారులు గుర్తించారు. ఇవి మంచి నీళ్లల్లో ఉండటమనేది అత్యంత అరుదైన విషయంకాగా.. హోంగ్సియాంగ్ రాష్ట్రంలోని ఓ పర్వత పాదం వద్ద ఉన్న పదివేల స్క్వేర్ మీటర్లు విశాలమైన మంచినీటి రిజర్వాయర్ లో ఇవి కనిపించడంతో అక్కడి వారు ఆందోళన చెందడం ప్రారంభించారు. తొలుత ఓ స్థానికుడు ఈ చేపను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించి తొలుత 19 సెంటీ మీటర్ల ఫిరానాను గుర్తించారు. ఆతర్వాత మరో రోజు 15 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల ఫిరానాలను గుర్తించారు. ఫిరానా చేపలు అత్యంత ప్రమాదకరమైనవి. -
ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉల్సాలోని హన్వా కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే మంటల్లో కాలిబూడిదయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కెమికల్ ట్యాంక్‌లోకి దిగి మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా పేలుడు జరిగి ఉండొచ్చని అగ్రిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంతమంది కార్మికులు ఈ మంటల్లో చిక్కుకున్నారు, వారిలో ఎంతమంది బతికి ఉండే అవకాశముందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పేలుడుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
గల్లంతైన వారి కోసం గాలింపు
దక్షిణ కొరియా నౌక ప్రమాదంలో తొమ్మిదికి పెరిగిన మృతుల సంఖ్య సహాయ సిబ్బందికి పలు ఆటంకాలు మోక్పొ (దక్షిణ కొరియా): దక్షిణ కొరియా తీరంలో సంభవించిన నౌక ప్రమాదంలో గల్లంతైన వారి జాడ కోసం సహాయక సిబ్బంది రెండో రోజు గురువారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే పసుపు సముద్రంలో బలమైన అంతర్గత ప్రవాహాలు, వర్షం, మసక వాతావరణం సహాయక సిబ్బందికి ఆటంకంగా నిలుస్తున్నాయి. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నుంచి జెజు దీవి మధ్య ప్రయాణించే ఓడ బుధవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఓడలో మొత్తం 475 మంది ప్రయాణికులు ఉండగా అందులో 325 మంది విద్యార్థులే. ఈ ప్రమాదంలో గురువారం నాటికి 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 287 మంది జాడ తెలియలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్న కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారిలో చాలా మంది నౌకలోనే చిక్కుకుని ఉండవచ్చని, ఒక వేళ ఎవరైనా నీటిలోకి దూకినా విపరీతమైన చల్లదనం వల్ల ఎక్కువసేపు బతికే అవకాశాలు లేవని వారు అంచనాకు వస్తున్నారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులతో దేశాధ్యక్షురాలు పార్క్ గుయెన్ హైయి ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ప్రమాదం జరిగి ఇంతసేపైనా ఏం చేస్తున్నారంటూ ప్రెసిడెంట్‌ను నిలదీశారు. అంతకుముందే ఆమె ప్రమాదస్థలిని సందర్శించారు. అమ్మా నువ్వంటే చాలా ఇష్టం.. దేశాన్ని కుదిపేసిన ఈ ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు పంపిన మెసేజ్‌లు హృదయాలను ద్రవింపచేసేలా ఉన్నాయి. ఓడ క్రమక్రమంగా మునిగిపోతున్న సమయంలో.. ‘‘ అమ్మా నీకు మళ్లీ చెప్పగలనో లేదో, ఐ లవ్యూ’’ అని ఒక విద్యార్థి పంపిన సందేశం, ఓడ ప్రమాదం తెలియని ఆ తల్లి ‘‘ఐ లవ్యూ టూ’’ అని ప్రత్యుత్తరమిచ్చిన మెసేజ్‌లు టీవీల్లో చూస్తున్న ప్రజల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఇలాంటి సంక్షిప్త సందేశాలు చాలా మంది తమ వారికి పంపినవి ఒక్కొక్కటి బహిర్గతం అవుతుంటే దేశం అంతా తల్లడిల్లిపోతోంది.