శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై దాడి
శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై దాడి
Published Wed, Nov 23 2016 3:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
సియోల్ : దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ ప్రధాన కార్యాలయంపై ఆ దేశ న్యాయవాదులు దాడి చేశారు. శాంసంగ్ కంపెనీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో వారు ఈ రైడ్ నిర్వహించారు. సియోల్ కేంద్ర జిల్లా న్యాయవాదుల ఆఫీసు ప్రత్యేక విచారణ బృందం,శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై రైడ్ నిర్వహించినట్టు బుధవారం ఉదయం జిన్హువా న్యూస్ రిపోర్టు చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ హై, చిరకాల మిత్రురాలు చోయి సూన్ సిల్ నిర్వహించే రెండు లాభాపేక్ష లేని ఫౌండేషన్లకు మిలయన్ల కొద్దీ అమెరికా డాలర్లను తరలించినట్టు శాంసంగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ ఆరోపణల్లో శాంసంగ్ వైర్ 2.8 మిలియన్ల యూరోలను చోయి ఆధ్వర్యంలోని జర్మన్ కంపెనీకి తరలించినట్టు తెలిసింది. అదేవిధంగా తన రెండు సబ్సిడరీల విలీనానికి కంపెనీ మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యాలయ నేషనల్ పెన్షన్ ఫండ్ ఆపరేటర్పై కూడా న్యాయవాదులు దాడిచేశారని జిన్హువా పేర్కొంది. అధ్యక్షురాలితో తనకు గత దీర్ఘకాలిక స్నేహబంధాన్ని ఉపయోగించుకుని చోయి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకున్నట్టు ప్రాసిక్యూటర్లు ఇంతకముందు నుంచే ఆరోపిస్తున్నారు.
Advertisement