Korean Actress In Prabhas Movie: ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసి ఒక్కొక్కొ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ తన 25వ చిత్రం సందీప్ వంగ డైరెక్షన్‌లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం.
చదవండి: ‘నాటు.. నాటు’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చెర్రి, తారక్
ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడి కట్టబోయే హీరోయిన్ ఎవరా? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా సౌత్ కొరియన్ బ్యూటీ నటించనుందని టాక్ వినిపిస్తోంది. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇందులో లేడీ విలన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూన్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి:
ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment