ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మృణాల్ ఠాకూర్ చేయనున్నారనే టాక్ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది.
అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్‌లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ సరసన మృణాళ్ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కన్‌ఫార్మ్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment