Sandeep Vanga
-
స్పిరిట్‌లో..?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ డ్రామాగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మృణాల్ ఠాకూర్ చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ ఈ చిత్రంలో ఓ రోల్ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్ సరసన మృణాళ్ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కన్ఫార్మ్ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే. -
అర్జున్ రెడ్డిగా ఎన్టీఆర్.. అదిరిపోయిన కాంబో ...
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కాస్త ఆలస్యంగా ‘స్పిరిట్’?
‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నారట ప్రభాస్. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్΄ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారభించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందట. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోని ‘రాజా సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలో హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూట్లో పాల్గొంటారు ప్రభాస్. అర్షద్ పిల్లలకు టాయ్స్ పంపుతా: నాగ్ అశ్విన్‘కల్కి 2898 ఏడీ’లోని ప్రభాస్ ΄పాత్రను తక్కువ చేస్తూ ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అర్షద్ కామెంట్స్‌పై ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ‘‘నార్త్ వర్సెస్ సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వంటి అంశాలకు తావు లేదు. అంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అర్షద్ సాబ్ మెరుగైన పదాలు వాడి ఉండాల్సింది... అయినా ఫర్వాలేదు. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్ (‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కనిపిస్తాయి) పంపిస్తాను. నేను మరింత కష్టపడతాను. ‘కె 2’ (కల్కి 2898 ఏడీ సినిమా రెండో భాగాన్ని ఉద్దేశించి) సినిమా అన్ని థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో పూర్తి కాగానే ప్రభాస్ పాత్ర చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్స్ వస్తాయి’’ అని ఓ నెటిజన్ పోస్ట్‌కు ‘ఎక్స్’ ద్వారా స్పందించారు నాగ్ అశ్విన్. అలాగే మరో నెటిజన్ పోస్ట్‌కు స్పందిస్తూ –‘‘ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో నెగిటివిటీ ఉంది. మనం దాన్ని పెంచకూడదు. ప్రభాస్‌గారు అలానే అనుకుంటారని నేను అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలైంది. ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. -
అమిర్ ఖాన్ మాజీ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
యానిమల్ ఫ్యాన్స్ కు దారుణంగా మోసం చేసిన సందీప్ వంగా
-
యానిమల్ మూవీ ఎవరెవరో సాంగ్
-
స్పిరిట్ తో సంచలనాలు సృష్టించేందుకు సిద్దమైన సందీప్ రెడ్డి వంగా..
-
యానిమల్ అందుకే 1000 కోట్లు అందుకోలేకపోయింది..
-
2025 క్రిస్మస్ కు స్పిరిట్ రిలీజ్..
-
'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్
రణ్‌బీర్ కపూర్ - రష్మిక కాంబినేషన్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఈ చిత్రం రన్ అవుతుంది. ఈ సినిమాలో సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటుల ప్రదర్శనను ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. రేణు దేశాయ్, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ వంటి వారందరూ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు. ఇదిలా ఉంటే మరోవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ కూడా నడుస్తుంది. సమాజానికి ఈ సినిమా ఏ మేసేజ్‌ను ఇస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్న సమయంలో తాజాగా ఛత్తీస్ ఘడ్కు చెందిన ఓ మహిళా ఎంపీ యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రంజీత్ రంజన్ ఈ టాపిక్‌పై ఏకంగా రాజ్యసభలోనే మాట్లాడారు. సమాజానికి పట్టిన జబ్బుగా యానిమల్ సినిమాను ఆమె అభివర్ణించారు. యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ ఆమె చెప్పుకొచ్చారు. యానిమల్ సినిమాలో మహిళల పట్ల హింస దారుణంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 'సినిమా అనేది సమాజంలో చాలా ప్రభావం చూపించగలదు. మనం సినిమాను చూస్తూనే పెరిగాం. కాబట్టి సినిమా అనేది యువతను ప్రేరేపిస్తుంది. వారిపై సినిమా ప్రభావం కూడా పడుతుంది. నా కూతురు తన స్నేహితులతో కలిసి యానిమల్ చిత్రానికి వెళ్లింది. కానీ సినిమా మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది.' అని రాజ్యసభలో ఎంపీ రంజీత్ రంజన్ చెప్పారు. యానిమల్ సినిమాలో సిక్కుల యుద్ధ గీతం అయిన అర్జన్ వైలీని దారుణమైన ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మొఘల్స్, బ్రిటీష్‌తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన ఈ పాటను ఇలా వాడుకోవడం ఏ మాత్రం సహించలేని విషయం అని ఆమె తెలిపారు. -
యానిమల్కు 'A' సర్టిఫికెట్.. ఆనందించిన సందీప్ రెడ్డి వంగా
యానిమల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ - రష్మిక కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ సినిమాను సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. విభిన్న కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్ టైమ్ 3:20 నిమిషాలు అని డైరెక్టర్ ప్రకటించడంతో అందరూ చూడటం కష్టం అంటూ కామెంట్లు చేశారు. తీరా ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ భారీగా జరిగిపోయాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే!) యానిమల్ మూవీకి సెన్సార్ వాళ్లు 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనడం గమనార్హం. ఈ సినిమా పిల్లలు చూసేది కాదని ఆయన క్లియర్‌గా చెప్పాడు. డిసెంబర్ 1న వచ్చే ఈ సినిమాకు పిల్లలతో వెళ్లకండని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా లేదని సందీప్ బహిరంగంగా చెప్పడం విశేషం. చిన్నపిల్లలకు యానిమల్ సినిమా సెట్ కాదని .. తన కుమారుడితో పాటు కజిన్స్ పిల్లలను కూడా ఈ సినిమాకు తీసుకుపోనని ఆయన చెప్పాడు. అవకాశం ఉంటే ఈ సినిమాలో కొంత భాగాన్ని కట్ చేసి ఆ తర్వాత వారికి చూపించే ప్రయత్నం చేస్తానని సందీప్ తెలిపాడు. ఇలా సినిమా గురించి ఓపెన్‌గా చెప్పడం ఇండస్ట్రీలో చాలా అరుదు. తన వంతు బాధ్యతాయుతంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు ఇలా చెప్పడంతో నెటిజన్ల నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇందులో అశ్లీలత అంతగా లేకున్నా కొంచెం వయలెన్స్ ఎక్కువుగా ఉంటుందని టాక్. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ... ఏ మేరకు రాబడుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పిన సందీప్ సినిమా మాత్రం ఆందరనీ ఆలోచింపజేస్తుందని తెలిపాడు. కానీ యానిమల్ రూ.800 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
త్వరలో అర్జున్ రెడ్డి కాంబో రిపీట్..!
-
యానిమల్ అప్డేట్.. లిప్ లాక్ పోస్టర్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్' .ఇప్పటికే కబీర్ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యానిమల్’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ చిత్రం గురించి మరోక క్రేజీ సమాచారాన్ని షేర్ చేశారు. (ఇదీ చదవండి: షాండ్‌విచ్ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్ హీరోయిన్) కొద్ది సేపటి క్రితం ఓ రొమాంటిక్ పోస్టర్‌ను వదులుతూ యానిమల్ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల గురించి వివరాలు ప్రకటించారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో మొదటి సాంగ్‌ను అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో ఈ పాటు విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని సందీప్ వంగాతో పాటు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రణ్‌బీర్‌కపూర్- రష్మిక ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను విడుదల చేశారు. సందీప రెడ్డి మొదటి చిత్రం అయిన అర్జున్ రెడ్డి పోస్టర్‌తో ఫ్యాన్స్ పోలుస్తున్నారు. అందులో విజయ్ దేవరకొండ- షాలినీ కూడా లిప్‌లాక్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇప్పుడు యానిమల్ పోస్టర్‌తో మూవీతో పాటు సాంగ్‌పై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా యానిమల్ విడుదల అవుతుంది. #AnimalTheFilm pic.twitter.com/oI3ko5YnEz — Sandeep Reddy Vanga (@imvangasandeep) October 10, 2023 Hua main ❤️ Out tomorrow.. this song is 🔥🔥🔥🔥 And I personally love it in all the versions.. Hindi Kannada telugu tamil and Malayalam .. 💃🏻🥳#HuaMain #Ammayi #Neevaadi #OhBhaale #Pennaale#AnimalTheFilm@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23… pic.twitter.com/JH7eADNoDs — Rashmika Mandanna (@iamRashmika) October 10, 2023 -
నాడు అర్జున్ రెడ్డి, నేడు యానిమల్.. ఇదీ మామూలు అరాచకం కాదు
టాలీవుడ బిగ్ హిట్ 'అర్జున్ రెడ్డి' మొదటి సినిమాతోనే దర్శకుడిగా సత్తా చాటాడు సందీప్ రెడ్డి వంగా. ఆ చిత్రంతోనే విజయ్ దేవరకొండ సన్సేషన్ స్టార్‌గా మారిపోయాడు. ఇదే సినిమా హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి బాలీవుడ్లో తన మార్క్ ఎంటో చూపించాడు సందీప్. తాజాగా తన నుంచి వస్తున్న 'యానిమల్' ప్రీ టీజర్‌ను విడుదుల చేశాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక నటిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్) ఇక ప్రీ టీజర్ విషయానికొస్తే.. హిందీ సాంగ్‌తో మొదలవుతుంది. విలన్స్ గుంపులు గుంపులుగా ఒకపక్క వస్తుంటే.. ఇంకోపక్క రణబీర్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తూ.. చేతిలో గొడ్డలి పట్టుకొని ఒక్కోక్కరిని నరకడం చూపించాడు సందీప్. ప్రీ టీజరే ఇంత భయంకరంగా ఉంటే 11న వచ్చే టీజర్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదీ మామూలు అరాచకం కాదు భయ్యో అంటూ... ఈ సినిమాతో సందీప్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) -
ప్రభాస్‌ను పక్కకు నెట్టిన బన్నీ.. ఏ విషయంలోనో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 చిత్రంపైనే దృష్టి సారించారు. ఇటీవలే రాజస్థాన్ వేకేషన్‌కు వెళ్లిన బన్నీ అక్కడి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. అయితే తాజాగా బన్నీకి సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. రెమ్యూనరేషన్ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ను దాటేశారని టాక్ వినిపిస్తోంది. సందీప్ వంగా డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న తొలి హిందీ మూవీకి ఐకాన్ స్టార్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ప్రభాస్‌ను వెనక్కినెట్టి అత్యధిక రెమ్యూనరేషన్‌గా అందుకున్న టాలీవుడ్ హీరోగా నిలుస్తారు. టీ సిరీస్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.125 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. బన్నీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్‌లతో అల్లు అర్జున్ పనిచేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్‌రెడ్డితో కలిసి సూపర్ హిట్ సినిమా అందిస్తామని అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారు. Been looking forward for this combination for quite some time now . @imvangasandeep garu’s magic is something that personally touches me . Hopefully we give a memorable film that will be remembered for a long long time . pic.twitter.com/i24uOyoFkI — Allu Arjun (@alluarjun) March 4, 2023 -
నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తీసుకొచ్చిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’నుంచి ఓ డిలీట్ సీన్‌ని విడుదల చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ప్రీతి(షాలినీ పాండే) ఇంటికి వెళ్లిన అర్జున్ రెడ్డి... అక్కడ ఆమెను ముద్దు పెట్టుకోవడం.. అది చూసి ప్రీతి నాన్న గొడవపెట్టుకోవడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. (చదవండి: రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా?) ‘అమ్మ, నాన్న, నానమ్మ .. ఒక పది రోజుల తర్వాత వాళ్లను కలిస్తే.. నాకు హగ్ ఇచ్చి కిస్ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే. వేరే ఉద్దేశంతో కాదు. దాన్ని ఆమె తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు’అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ఆ వీడియో మొదలవుతుంది. ఈ డిలీట్ సీన్‌ని దర్శకుడు సందీప్ వంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘అర్జున్‌రెడ్డి’కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్‌ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’అని రాసుకొచ్చాడు. ఆసక్తికరమైన ఈ డిలీటెడ్ సీన్‌పై ఓ లుక్కేయండి. 5 years for ARJUN REDDY 🙂 Very happy to share this scene 🙏 Thanks to the entire cast & crew🙏@TheDeverakonda #ShaliniPandey @eyrahul @VangaPranay @VangaPictures @rameemusic @Synccinema#5yearsforarjunreddy https://t.co/3qiQhM3YvW — Sandeep Reddy Vanga (@imvangasandeep) August 25, 2022 -
క్రేజీ రూమర్.. ఆ దర్శకుడితో మహేశ్ బాబు 30వ సినిమా!
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఈజీగా రెండేళ్లు పడుతుంది. అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మహేశ్ బాబుతో తీయబోయే సినిమా మాత్రం పక్కా రెండేళ్లలో పూర్తి చేస్తానని చెబుతున్నాడు. కానీ ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్నది రేండేళ్లు ఆగితే కాని తెలియదు. ఇప్పటి వరకు అయితే ఇచ్చిన మాట రాజమౌళి ఎప్పుడు నిలబెట్టుకోలేదు. ప్రతీసారి ఏళ్ల ఏళ్లు సినిమాలు తీస్తూనే వస్తున్నాడు. రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. మహేశ్ కెరీర్ లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో మూవీ తర్వాత సుకుమార్ లేదా సందీప్ వంగాతో సినిమా చేసేందుకు మహేశ్ ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నాడట. (చదవండి: అప్పుడే డైరెక్టర్ సక్సెస్ అయినట్టు!) అదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే. కాని ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ముందు రాజమౌళితో మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వేశాడు. తిరిగి ఇండియాకు రాగానే త్రివిక్రమ్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. 2023 ప్రారంభంలో రాజమౌళి- మహేశ్ బాబు కొత్త సినిమా ప్రారంభం కానుంది. -
రష్మికకు బంపర్ ఆఫర్, ఐటెం సాంగ్‌లో కాదు.. ఏకంగా హీరోయిన్ చాన్స్..
బాలీవుడ్ చిత్రం ‘ఎనిమల్’లో రష్మిక మందన్నా ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్నట్లు కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికి దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ వార్తలపై టీ-సిరీస్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అర్జున్ రెడ్డి ఫేం, తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా ఎనిమల్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్, డైరెక్టర్ సందీప్ వంగ అధికారిక ప్రకనట ఇచ్చారు. ఈ మేరకు టీ-సిరీస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది. ‘ఈ ఉగాది, గుడి పూజ సందర్భంగా రష్మిక మందన్నాకు ‘ఎనిమల్’ టీం స్వాగతం పలుకుతోంది. ఈ సమ్మర్లో ఎనిమల్ సెట్స్‌పైకి రానుంది’ అంటూ వెల్లడించింది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ Happy Ugadi people 🙂 We welcome Rashmika Mandanna to the world of ANIMAL to play Geetanjali 🤝#Ranbirkapoor @AnilKapoor @iamRashmika@deol #BhushanKumar @TSeries @VangaPranay@VangaPictures#krishnakumar @MuradKhetani#Bhadrakalipictures @dop_santha @cowvala @anilandbhanu — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 2, 2022 అలాగే సందీప్ వంగ ట్వీట్ చేస్తూ.. ‘అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రష్మిక మందన్నాకు ఎనిమల్కు టీం స్వాగతం. ఇందులో రష్మిక.. గీతాంజలి పాత్ర పోషించనుంది’ అని తెలిపాడు. కాగా ఇప్పటికే రష్మిక హిందీలో మిషన్ మజ్నుతో పాటు అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన మూడో సినిమాకే ఏకంగా రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసింది. యాక్షన్, రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సమ్మర్ సెట్స్‌పై రానున్న ఎనిమల్ వచ్చే ఏడాది 2023 అగష్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. View this post on Instagram A post shared by T-Series (@tseries.official) -
సందీప్ వంగ మూవీలో రష్మిక ఐటెం సాంగ్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌లో హీరోయిన్లు స్టెప్పులు వేయడం సాధారణ విషయమైంది. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్, సమంతలు స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక వారి బాటలోనే నడిచేందుకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం సిద్ధం అంటోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మీక.. గీతా గోవిందం మూవీతో టాలీవుడ్ స్టార్డమ్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం పుష్పతో జాతీయ స్తాయిలో గుర్తింపు పొందింది. చదవండి: ఈ యంగ్ హీరో 50 రోజుల కష్టం, సుకుమార్‌పై అరుదైన దృశ్యం ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ ఆఫర్స్ అందుకుంటూ ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చింది. ఇలా సౌత్, నార్త్‌లో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌తోనూ అలరించనుందుకు సై అంటుంది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ హీరో రణ్‌బిర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ కాంబినేషన్లో రూపొందనున్న యానిమల్ మూవీలో ఐటెం సాంగ్ కోసం రష్మికను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట అయితే కొన్ని చర్చల అనంతరం ఈ పాటకు రష్మికను ఫిక్స్ చేసిన దర్శక-నిర్మాతలు ఇదే విషయమై ఆమెను కలిశారట. అయితే దీనికి ఒకే చెప్పిన రష్మిక వారు అవాక్కాయ్యే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ ఐటెం సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ. 2 కోట్లు ఇవ్వాలని నిర్మాతలకు చుక్కలు చూపించిందట. సినిమా మొత్తానికి రూ. 2 కోట్లు తీసుకునే రష్మిక.. ఒక ఐటెం సాంగ్‌కు భారీగా డిమాండ్ చేయడం చూసి నిర్మాతలు షాకయ్యారట. చివరకు ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి కోటిన్నర ఇవ్వడానికి రెడీ అయ్యారని, దీంతో రష్మిక కన్విన్స్ అయ్యి వారం రోజుల కాల్షీట్ కూడా ఇచ్చినట్లు బీ-టౌన్లో గుసగుసల వినిపిస్తున్నాయి. -
స్పెషల్ సాంగ్‌కి రష్మిక స్టెప్పులు.. ఏ హీరో సినిమా అంటే?
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో టాలీవుడ్ ఇప్పటికే చాలా సార్లు చూసింది. జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమె దగ్గరికి రిక్వెస్ట్ వెళ్లిందట. వివరాల్లోకి వెళితే అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా..ఆ తర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రణభీర్ కపూర్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం రష్మిక డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట సందీప్ వంగా. పుష్పతో బాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మిక.ఇప్పటి వరకు సౌత్ లోనే రష్మిక హవా కనిపిస్తూ వచ్చింది. పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది.జూన్ 10న రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అమితాబ్ తో కలసి నటించిన గుడ్ బై మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇప్పుడు యానిమల్ మూవీలో రణభీర్ తో రష్మిక స్టెప్పులేస్తే మాత్రం బీటౌన్ లో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
కొరియన్ భామతో ప్రభాస్ రొమాన్స్!
Korean Actress In Prabhas Movie: ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఆనంతరం అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసి ఒక్కొక్కొ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ తన 25వ చిత్రం సందీప్ వంగ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చదవండి: ‘నాటు.. నాటు’ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చెర్రి, తారక్ ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడి కట్టబోయే హీరోయిన్ ఎవరా? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా సౌత్ కొరియన్ బ్యూటీ నటించనుందని టాక్ వినిపిస్తోంది. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇందులో లేడీ విలన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూన్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ ప్రభాస్ గురించి ట్వీట్ చేసిన సన్నీ సింగ్, ‘డార్లింగ్’ ఫ్యాన్స్ ఫైర్ -
ప్రభాస్-సందీప్ వంగ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 25వ చిత్రం అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చదవండి: Prabhas25: 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తోనే ప్రభాస్ 25వ చిత్రం ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ‘బెబో’ కరీనా కపూర్ నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరీనా ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. తొలి చిత్రంలోనే బెబో నెగిటివ్ షేడ్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోందట. ఇందులో ఆమె లేడీ విలన్‌గా కనిపించనుందని చెబుతున్నారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ చిత్రంలో హీరో పాత్రకు ధీటుగా శక్తివంతంగా కరీనా పాత్ర ఉండబోతుందట. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్, జపాన్ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ నిలవనున్నారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను దుబాయ్‌లో పూర్తి చేసుకుని ఇటీవల చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగి వచ్చింది. అక్కడ మహేష్ బాబుతో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరించినట్లు సమచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ఈ మూవీ రెండవ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో మహేష్ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో నటించనున్నాడు. అయితే అది మూవీ కాదు. ఓ యాడ్ షూటింగ్ అట. హ్యావెల్స్ అనే ఎలక్రిక్ కంపెనీ ప్రకటనలో మహేష్ నటించనున్నాడు. ఈ ప్రకటనకు సంబంధించి షూటింగ్ ఈ రోజు జరగనుంది. అయితే ఈ యాడ్‌ను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో మహేష్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. త్వరలోనే ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. చదవండి: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్ బాబు మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య -
‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ రిపీట్?
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2017లో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ కెరీర్ మరో లెవల్‌కి వెళ్లింది. సందీప్ అయితే ఏకంగా బాలీవుడ్‌కి వెళ్లి, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కభీర్ సింగ్’ని తెరకెక్కించారు. ఇప్పుడు విజయ్, సందీప్ కలిసి మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ స్టోరీ లైన్‌ను కూడా రెడీ చేశారట సందీప్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ‘లైగర్’ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్ దేవరకొండ సినిమాలు చేయాల్సి ఉంది. ఇటు సందీప్ వంగా కూడా రణ్‌బీర్ కపూర్‌తో ‘యానీమల్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరూ తమ పాజెక్ట్స్ను కంప్లీట్ చేసిన తర్వాత వీరి కాంబినేషన్ సినిమా ఆరంభమవుతుందని భోగట్టా. చదవండి: నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి తలైవా తయార్!.. ఫ్యాన్స్ ఖుషీ -
నా దృష్టిలో కబీర్ సింగ్ సినిమా కాదు: షాహిద్
ముంబై: అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్ సింగ్ చిత్రం విడుదలై ఆదివారం నాటికి ఏడాది గడిచింది. హిట్ అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో షాహిద్ కపూర్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాలో షూటింగ్ సమయంలో సెట్స్‌లోని పలు సన్నివేశాల ఫొటోలు సోమవారం తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాడు. అంతేగాక అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. (అల.. బాలీవుడ్ తెరపైకి!) ‘వివాదాస్పదమైన నా పాత్రను ప్రేమించిన వారందరికీ హృదయపూర్వ ధన్వవాదాలు. ‘కబీర్ సింగ్’ అనేది నా దృష్టిలో కేవలం సినిమా కాదు. ఇది నిర్భయం.. నిజాయితీ.. బేర్.. నిజమైన భావోద్వేగం. విరిగిన హృదయంతో ఆగ్రహంతో ఉండే ప్రేమికుడి మనసును అర్థం చేసుకున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో సరైన తీర్పు కావాల్సిన సమయం అది. ప్రేక్షకులు ఘనవిజయాన్ని ఇచ్చి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ‘కబీర్ సింగ్’ అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. నిజంగా ఇది ప్రత్యేకమైనది’ అంటూ తన సహ నటి కియరా అద్వానీ, దర్శకుడు సందీప్ వంగాలను ట్యాగ్ చేసి షేర్ చేశాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) View this post on Instagram To all those who gave so much overwhelming love to such a complex, conflicted character. Thank you. #kabirsingh was never just a film to me.. it was an emotional arc that was raw.. bare.. unabashed .. honest .. fearless .. REAL!! In a time where people are quick to judge (others not themselves ) you understood him. You understood our interpretation of the angst of a broken heart. This one will always be special. So so special. And it would just not have been possible without @kiaraaliaadvani , @sandeepreddy.vanga , @muradkhetani and @ashwinvarde @bhushankumar @santha_dop , Payal and so so many others. Thank you all once again. And remember. Keep it real and make it count. Be kind. Be good. Spread positivity. And always believe. 🙌💕👊 A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Jun 21, 2020 at 9:32am PDT అదే విధంగా హీరోయిన్ కియారా అద్వానీ కూడా కబీర్ సింగ్ సినిమలో పలు సన్నివేశ ఫొటోలను షేర్ చేశారు. డియర్ కబీర్ సింగ్.. హ్యాపీ యానివర్సరీ’’ అంటూ సినిమాలోని తన పాత్ర పేరు ప్రీతి అని సంతకం చేశారు. కాగా తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడైన సందీప్ వంగా హిందీ కబీర్ సింగ్‌కు కూడా దర్శకుడిగా వ్వవహరించాడు. కబీర్ సింగ్ విడుదల సమయంలో వివాదంలో చిక్కుకున్నప్పటికీ బీ-టౌన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం షాహిద్ క్రిడా నేపథ్యంలో సాగే మరో తెలుగు రిమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్నాడు.