30 ఏళ్ల తర్వాత నటిస్తున్న నాటి హీరోయిన్‌ | Kanchana set for comeback after three decades | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తర్వాత నటిస్తున్న నాటి హీరోయిన్‌

Nov 29 2016 12:24 PM | Updated on Jul 14 2019 1:14 PM

30 ఏళ్ల తర్వాత నటిస్తున్న నాటి హీరోయిన్‌ - Sakshi

30 ఏళ్ల తర్వాత నటిస్తున్న నాటి హీరోయిన్‌

అలనాటి దక్షిణాది మేటి నటి కాంచన దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటించబోతోంది.

చెన్నై: అలనాటి దక్షిణాది మేటి నటి కాంచన దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటించబోతోంది. విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తెలుగు సినిమా అర్జున్‌ రెడ్డిలో ఆమె నటించనున్నట్టు దర్శకుడు సందీప్‌ వంగా చెప్పాడు.

ఎంతో కష్టపడి కాంచనతో మాట్లాడగలిగామని, సినిమాలో నటించేందుకు తొలుత ఆమె అంగీకరించలేదని, సుదీర్ఘ చర్చల అనంతరం ఒప్పుకున్నారని సందీప్‌ తెలిపాడు. విజయ్‌కు బామ్మగా కాంచన నటించనుందని, సినిమాలో ఆమెది కీలక పాత్రని చెప్పాడు. బుధవారం నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందని తెలిపాడు. కాంచన వయసు 77 ఏళ్లు. ఆమె చివరిసారిగా శ్రీదత్త దర్శనం అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా 1985లో విడుదలైంది. ఆత్మగౌరవం, నవరాత్రి, ప్రైవేట్‌ మాస్టర్‌ వంటి తెలుగు సినిమాలతో ఆమె పాపులర్‌ అయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement