Buzz: Rashmika Mandanna Special Song In Sandeep Vanga And Ranbir Kapoor Movie - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: స్పెషల్‌ సాంగ్‌కి రష్మిక స్టెప్పులు.. ఏ హీరో సినిమా అంటే?

Published Sat, Mar 12 2022 4:16 PM | Last Updated on Sat, Mar 12 2022 5:43 PM

Rashmika Mandanna Is Ready For Special Song - Sakshi

స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో టాలీవుడ్ ఇప్పటికే చాలా సార్లు చూసింది. జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమె దగ్గరికి రిక్వెస్ట్ వెళ్లిందట. వివరాల్లోకి వెళితే

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా..ఆ తర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రణభీర్ కపూర్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం రష్మిక డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట సందీప్ వంగా.

పుష్పతో బాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మిక.ఇప్పటి వరకు సౌత్ లోనే రష్మిక హవా కనిపిస్తూ వచ్చింది. పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది.జూన్ 10న రష్మిక నటించిన తొలి హిందీ చిత్రం మిషన్ మజ్ను రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అమితాబ్ తో కలసి నటించిన గుడ్ బై మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇప్పుడు యానిమల్ మూవీలో రణభీర్ తో రష్మిక స్టెప్పులేస్తే మాత్రం బీటౌన్ లో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement