Watch: Vijay Deverakonda Arjun Reddy Movie Deleted Scene Goes Viral - Sakshi
Sakshi News home page

Arjun Reddy Deleted Scene: నెట్టింట వైరల్‌ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్‌ సీన్‌

Published Fri, Aug 26 2022 2:39 PM | Last Updated on Fri, Aug 26 2022 4:59 PM

Arjun Reddy Deleted Scene Goes Viral - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు స్టార్‌ హోదా తీసుకొచ్చిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్‌ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్‌ వంగా ‘అర్జున్‌ రెడ్డి’నుంచి ఓ డిలీట్‌ సీన్‌ని విడుదల చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సీన్‌లో విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ప్రీతి(షాలినీ పాండే) ఇంటికి వెళ్లిన అర్జున్‌ రెడ్డి... అక్కడ ఆమెను ముద్దు పెట్టుకోవడం.. అది చూసి ప్రీతి నాన్న గొడవపెట్టుకోవడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

(చదవండి: రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్‌మెంట్, ‘ఆర్‌ఆర్‌’కి చాన్స్‌ ఉందా?)

‘అమ్మ, నాన్న, నానమ్మ .. ఒక పది రోజుల తర్వాత వాళ్లను కలిస్తే.. నాకు హగ్‌ ఇచ్చి కిస్‌ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే. వేరే ఉద్దేశంతో కాదు. దాన్ని ఆమె తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు’అంటూ విజయ్‌ చెప్పే డైలాగ్‌తో  ఆ వీడియో మొదలవుతుంది. ఈ డిలీట్‌ సీన్‌ని దర్శకుడు సందీప్‌ వంగా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘అర్జున్‌రెడ్డి’కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్‌ని షేర్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’అని రాసుకొచ్చాడు.  ఆసక్తికరమైన ఈ డిలీటెడ్‌ సీన్‌పై   ఓ లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement