Arjun reddy
-
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్‌తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్‌ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్వీర్ సింగ్ సరసన జయేష్‌భాయ్ జోర్దార్లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది. -
అర్జున్ రెడ్డిగా ఎన్టీఆర్.. అదిరిపోయిన కాంబో ...
-
అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆ వార్డును 2018లో వేలం వేశాడు. తాజాగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది. ఏప్రిల్ 5న ఆయన నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్థావన మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యామిలీస్టార్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ పాల్గొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిలింఫేర్ అవార్డును భారీ మొత్తానికి వేలం వేసినట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎలాంటి అవార్డులంటే ఇష్టం లేదని చెప్పిన విజయ్.. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డ్స్లలో కొన్ని ఆఫీసులో ఉంటే, మరికొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. 2018లో ఏం జరిగిందంటే.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా విజయ్‌కు అవార్డు దక్కింది. దానిని 2019లో ఆయన వేలం వేశారు. మొదట రూ. 5లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్లైన్లో వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫిలింఫేర్ అవార్డును ఆమెకు అందించారు విజయ్. అనంతరం ఆమె ఇచ్చిన రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) అందించారు. The 1st @TheRowdyClub Sundowner Party. Filmfare given away. 25 lakhs raised for CMRF 😁 Divi labs you are now a part of my journey. This blacklady is special to all of us. I shall show my appreciation by visiting you all :) pic.twitter.com/OgqA8Q0P3U — Vijay Deverakonda (@TheDeverakonda) July 15, 2018 -
నెగెటివ్ అప్రోచ్.. కచ్చా బాదం..సందీప్ రెడ్డి సీక్రెట్ ఇదే!
ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్‌రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అంతా కచ్చా బాదం. ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్ల.. బూతు సీన్లు కూడా హీరో, హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరయినా అడిగితే .. ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్‌లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్రూమ్ సీన్లు.. ఇవన్నీ హాలీవుడ్‌ను తలపించేలా చేయడం సందీప్‌రెడ్డి సీక్రెట్‌గా మారింది. కథ, కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్‌రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే.. అంత రియాల్టీ అంటున్నాడు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్‌రెడ్డితో సంచలనం తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు. అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్‌గా చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు..ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్‌గా చూపించినా.. కథంతా బోల్డ్‌గా నడిపించినా కంటికి అది అసహ్యంగా కనిపించదు. హీరోకి కోపమొస్తే పచ్చి బూతులు తిడతాడు.. ప్రేమ పొంగుకొస్తే.. చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్వేర్లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్‌పై మనకు ప్రేమే కలుగుతుంది తప్పా ఎక్కడా నెగెటివ్ ఇంప్రెషన్ రాదు. అంతాలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి రెండు సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ..అటు షాహిద్ కపూర్ల హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి. ‘యానిమల్’తో మరో ప్రయోగం సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి.. ప్రారంభం ఇలా.. ఇక్కడ ఇంటర్వెల్.. క్లైమాక్స్ అలా అని కొన్ని పద్దతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా.. తండ్రి కొడుకుల ఎమోషన్ని బోల్డ్‌గా, వయోలెన్స్‌గా చూపిస్తూ..సినిమా ఇలా కూడా చెయ్యొచ్చు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్‌రెడ్డి. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస్తవానికి ఈ కథ రొటీన్ రివేంజ్ డ్రామా. ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం.. హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సినిమా చూస్తే.. దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్‌రెడ్డి చెప్పాలనుకే పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. వంగాపై బాలీవుడ్ ఫోకస్ యానిమల్ సినిమాతో మరోసారి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. ఇప్పుడీ సెన్సెషనల్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణ్‌బీర్ కపూర్ అయితే మరోసారి సందీప్‌తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్‌పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్‌కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్‌రెడ్డికి అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్‌ని కూడా ఖారారు చేశారు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేశ్‌బాబు, రామ్‌చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ సినిమా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. -
అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్ చేసిన బేబీ
-
వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ!
తక్కువ సినిమాలతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమాల కంటే తన యాటిట్యూడ్‌తో యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ రౌడీ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరో.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ స్టార్డమ్ విజయ్‌కి అంత ఈజీగా రాలేదు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్లూ తిరిగాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను చేశాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆపై గీత గోవిందం, టాక్సివాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తదితర చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచినా.. విజయ్‌కి మాత్రం నార్త్‌లో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విజయ్ బర్త్‌డే నేడు(మే 9). ఈ సందర్భంగా ఈ రౌడీ హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ► విజయ్ దేవరకొండ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తమ్మన్ పేట గ్రామం. నటనపై ఉన్న ఆసక్తితో విజయ్ తండ్రి గోవర్దన్‌రావు ఫ్యామిలీతో కలిసి హైదారాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. యాక్టర్‌గా అవకాశాలు లభించకపోవడంతో టెలివిజన్ డైరెక్టర్‌గా మారాడు. సినిమా రంగంపై తనకున్న ఇష్టంతోనే విజయ్ యాక్టర్ అవుతానంటే.. ఆయన అడ్డుచెప్పలేదు. ► విజయ్ తన పాఠశాల విద్యను పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్, డిగ్రీని హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజిల్లో పూర్తి చేశాడు. (చదవండి: ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది ) ► డిగ్రీ పూర్తయిన తర్వాత విజయ్ నటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంలో అవకాశం లభించింది.అందులో విష్ణు పాత్రను పోషించాడు. ► నువ్విలా సినిమా చేస్తున్న సమయంలోనే శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని అందరిలాగే అడిషన్స్‌కి వెళ్లాడు విజయ్. ఆ చిత్రంలో అజయ్ అనే చిన్న పాత్రను పోషించాడు. ► తొలి రెండు సినిమాలు విజయ్‌కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో పోషించిన రిషి పాత్ర మాత్రం విజయ్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. అయినా కూడా హీరోగా అవకాశాలు లభించలేదు. కొన్నాళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చిత్రానికి హీరోగా విజయ్‌ని సెలక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాను నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. చివరకు రాజ్ కందుకూరి ముందుకొచ్చి ఆ చిత్రాన్ని నిర్మించాడు. అదే విజయ్ కెరీర్‌ని మలుపు తిప్పింది. హీరోగా తొలి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డితో స్టార్‌గా హీరోగా ఎదిగాడు. ► అర్జున్ రెడ్డి తర్వాత విజయ్‌కి వరుస అవకాశాలు లభించాయి. ఏ మంత్రం వేసావే, నోట, డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలకు మిశ్రమ స్పందల రాగా.. గీత గోవిందం చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’విజయ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ చూసి షూటింగ్ ప్రారంభించిన ‘జనగణమన’ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ► ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’. ‘పుష్పక విమానం’లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ► 'ది రౌడీ వేర్' పేరుతో విజయ్ దేవరకొండ సొంతంగా ఓ క్లాతింగ్ బ్రాండ్ స్థాపించాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) ► ఇక విజయ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పేద ప్రజలకు సాయం చేయడం కోసం తన అవార్డును కూడా అమ్మేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్‌కి బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఆ అవార్డుని వేలం వేసి రూ.25 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బంతా ప్రజా సేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలిఫ్ ఫండ్‌కి విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. ► ప్రతీ ఏడాదికి ఒకసారి ‘ 'దేవర శాంటా’ పేరిట అభిమానులను సర్ఫ్రైజ్ చేయడం విజయ్‌కి అలవాటు. ఇలా పేద ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిలుస్తున్న విజయ్ కెరీర్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ‘సాక్షి’ తరపున, అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్‌లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్‌కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. -
నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తీసుకొచ్చిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’నుంచి ఓ డిలీట్ సీన్‌ని విడుదల చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ప్రీతి(షాలినీ పాండే) ఇంటికి వెళ్లిన అర్జున్ రెడ్డి... అక్కడ ఆమెను ముద్దు పెట్టుకోవడం.. అది చూసి ప్రీతి నాన్న గొడవపెట్టుకోవడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. (చదవండి: రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా?) ‘అమ్మ, నాన్న, నానమ్మ .. ఒక పది రోజుల తర్వాత వాళ్లను కలిస్తే.. నాకు హగ్ ఇచ్చి కిస్ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే. వేరే ఉద్దేశంతో కాదు. దాన్ని ఆమె తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు’అంటూ విజయ్ చెప్పే డైలాగ్‌తో ఆ వీడియో మొదలవుతుంది. ఈ డిలీట్ సీన్‌ని దర్శకుడు సందీప్ వంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘అర్జున్‌రెడ్డి’కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్‌ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’అని రాసుకొచ్చాడు. ఆసక్తికరమైన ఈ డిలీటెడ్ సీన్‌పై ఓ లుక్కేయండి. 5 years for ARJUN REDDY 🙂 Very happy to share this scene 🙏 Thanks to the entire cast & crew🙏@TheDeverakonda #ShaliniPandey @eyrahul @VangaPranay @VangaPictures @rameemusic @Synccinema#5yearsforarjunreddy https://t.co/3qiQhM3YvW — Sandeep Reddy Vanga (@imvangasandeep) August 25, 2022 -
రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడదు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ నాయక త్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదని,, ఆ పార్టీని వీడి వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేసిన కల్వకుర్తికి చెందిన యువనేత చీమర్ల అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి చీమర్ల అర్జున్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అర్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదట పాలేరు.. ఆ తర్వాత కుల్వకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అర్జున్ రెడ్డి జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్.. మునుగోడు కోసమేనా? -
లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్ఆర్ఆర్ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
‘అర్జున్ రెడ్డి’ ముద్దుగుమ్మ రైజా విల్సన్ (ఫోటోలు)
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
అర్జున్ రెడ్డి @ 4
-
‘అర్జున్‌రెడ్డి’ని వదులుకున్నందుకు బాధపడుతోన్న హీరోయిన్
Parvathy Nair Missed Arjun Reddy Movie: అన్ని కథలు అందరికీ నచ్చవు. అందుకే తారలు కొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్తారు, మరికొన్నింటిని సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే తిరస్కరించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా రికార్డు సృష్టించినప్పుడు మాత్రం అనవసరంగా మంచి అవకాశం చేజార్చుకున్నామే అని నాలుక్కరుచుకుంటారు. ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది హీరోయిన్ పార్వతీ నాయర్. టాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసుకున్న అర్జున్‌రెడ్డిని చేజేతులా వదిలేసుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాలితో తన్నేసుకున్నట్లైందని ఇప్పటికీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమెను ఓ అభిమాని 'అర్జున్ రెడ్డిలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయనే మీరు ఆ సినిమాకు నో చెప్పారా? ఆ మూవీని వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారా?' అని ప్రశ్నించాడు. దీనికి పార్వతీనాయర్ బదులిస్తూ.. 'అవును, నిజమే. కానీ అర్జున్‌రెడ్డి ఓ మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉంటే బాగుండేది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను' అని పేర్కొంది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నప్పటికీ మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని పాండేకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో రౌడీ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది హిందీలో కబీర్ సింగ్, తమిళంలో ఆదిత్మ వర్మ పేరుతో రీమేక్ అవగా అక్కడ కూడా హిట్ కొట్టింది. -
‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓల్డ్ పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు యూత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. హిట్లు ప్లాప్‌లకు అతీతంగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. తొలి సినిమా నుంచే ఆయన ప్రత్యేకమైన అభిమానుల సంపాదించుకున్నాడు. అప్పట్లో పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఓ సెన్సేషన్. తాజాగా అప్పటి పవన్ కల్యాణ్ స్టైల్ గురించి చర్చించుకుంటున్నారు ఆయన అభిమానులు. దానికి కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఓల్డ్ ఫోటోనే. అచ్చం అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను పోలి ఉన్న పవన్ అన్ సీన్ పిక్ నిన్న సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.దాన్ని మళ్లీ రకరకాల ఎడిట్స్ లో కూడా షేర్ చేసుకుంటు పాత పవన్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్.. ఇటీవల ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది. దీంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియం’రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కీలకపాత్రలో నటిస్తున్నాడు. చదవండి: నా హృదయం ఉప్పొంగిపోయింది: మహేశ్‌బాబు -
ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా మూడో సినిమా షురూ అయింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ . బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్ తేజ్ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయితేజ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఉప్పెన’తో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించనున్నాం’’ అన్నారు బీవీయస్‌యన్ ప్రసాద్. -
సెట్స్‌పైకి వైష్ణవ్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటించింది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్ చేస్తున్న మూడో సినిమా గురించి అప్డేట్ వచ్చేసింది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలోనూ నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా అనగానే కేతిక వెంటనే ఓకే చేసిందట. మరి రెండవ సినిమాతో వైష్ణవ్..మరో హిట్‌ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి : వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ‘సైకిల్’
పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌రెడ్డి మాట్టాడుతూ... "భారతీయ సినిమాలో ఇంకా చెప్పటానికేం లేవు అన్నట్లుగా బోలెడన్ని కథలతో సినిమాలొచ్చాయి." "ఐనా కొత్త కథలు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పుట్టిన్పప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజన్‌కాని, ఇంధనం కానీ లేకుండా నడుస్తూ, మనతో కలిసి ప్రయాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్ సీన్లోనే దానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తీశాము. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుదర్శన్, అనితా చౌదరి, క్యారెక్టర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్లతోపాటు, సూర్య, మధుమణి నవీన్‌నేని, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ జోగీబ్రదర్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. కామెడీ జోనర్ సినిమాకి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, ఎంత కొత్తగా వుంటుందో, మా చిత్రంతో చూస్తారు" అని తెలిపారు. (చదవండి: స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 90 స్క్రీన్లలో విడుదల చేస్తోంది చిత్రయూనిట్. త్వరలో టీజర్‌తోపాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేటర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమాకు నిర్మాతలు, పి.రాంప్రసాద్, డి.నవీన్‌రెడ్డి, సహనిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమనోహర్, సంగీతంః జి.ఎం.సతీష్, ఎడిటింగ్ః గడుతూరిసత్య, ఆర్ట్ః రామ్‌కుమార్, పిఆర్వో శ్రీ, పబ్లిసిటీ డిజైనర్ ఓంకార్ కడియం. (చదవండి: ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్) -
విజయ్ ఎదురుగానే అర్జున్ రెడ్డిని ఏకిపారేసిన నటి
‘అర్జున్ రెడ్డి’ విడుదలై రెండేళ్లు అయినా ఆ సినిమాపై వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలోనూ తెరకెక్కించడంతో విమర్శకులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించేదాన్నే కాదంటూ కుండబద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్ట్‌వల్ వేదికలో విజయ్ దేవరకొండ ఎదురుగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంపదెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను’ అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్ వ్యాఖ్యలపై హీరో విజయ్ స్పందిస్తూ.. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం.. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. అయినా దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సోషల్ మీడియా హడావుడే తనకు చికాకు కలిగిస్తోందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు’ అంటూ చివరాఖరకు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యాడు రౌడీ. -
ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ
ఆదిత్య వర్మ చిత్రంతో పోటీకి మాగీ చిత్రం సిద్ధం అవుతోంది. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఈ చిత్రం 22న తెరపైకి రానుంది. కాగా ఆదిత్య వర్మతో పోటీ పడుతోంది మాగీ చిత్రం. సాయిగణేశ్ పిక్చర్స్ పతారంపై ఆర్.కార్తికేయన్ జగదీశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాగీ. రియా, నిమ్మి, హరిణి ముగ్గురు కథానాయికలు నటించిన ఈ చిత్రంలో డౌట్ సెంథిల్, తిథియన్ కథానాయకులుగా నటించారు. రేయ, లియో, చిన్నసామి, మన్నై సాధిక్, ప్రదీప్, సాయి, జీవా, తిలక్ శంకర్, వీరలక్ష్మి, విజయరాఘవ్, పొన్.కరుణ, సాయిరాం ముఖ్యపాత్రల్లో నటించారు. మణిరాజు ఛాయాగ్రహణం, ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ చిత్రాన్ని పూర్తిగా కొడైకెనాల్, ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రం జనరంజకమైన అంశాలతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించే విధంగా ఉంటుందన్నారు. హర్రర్‌తో కూడిన నూరు శాతం వినోదభరిత కథాచిత్రంగా మాగీ ఉంటుందని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ నెల 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆదిత్య వర్మకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కోలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందులోనూ చియాన్ విక్రమ్ వారసుడు తెరంగేట్రం చేస్తున్న చిత్రం కావడంతో ఆదిత్య వర్మపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వినూత్న కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మాగీ.. ఆదిత్య వర్మను ఢీ కొట్ట బోతోంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో.. బాక్సీఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రిమేక్‌గా ‘ఆదిత్య వర్మ’ వస్తున్న విషయం తెలిసిందే. -
దీపికా, అలియాలతో విజయ్ దేవరకొండ సందడి
‘అర్జున్‌రెడ్డి’ సక్సెస్‌తో టాలీవుడ్లో క్రేజీ హీరో అయ్యాడు విజయ్‌దేవరకొండ. సినిమాలలో, అడియో రిలీజ్ ఫంక్షన్లతో పాటు పలు సినిమా కార్యక్రమాలలో తనదైన రీతి మాట్లాడుతూ తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో వరస విజయాలతో దూసుకుపోతూ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు ఈ ‘గీత గోవిందం’ హీరో. ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహర్ అర్జున్‌రెడ్డిని హీందీలో రీమేక్‌లో నటించమని అడగడంతో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఇటీవల విజయ్ నటించిన డియర్ కామ్రేడ్‌ను కూడా కరణ్ హీందీలో రీమేక్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్‌కి టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలో ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోకి బాలీవుడ్లో ఆఫర్లు కూడా వస్తున్నాయంటా. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో బీజీగా ఉండటంతో బీటౌన్‌కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెపుకొస్తున్నాడు రౌడీ. తాజాగా ఇంటర్నేషనల్ సింగర్ ‘క్యాటీ పెర్రి’ మ్యుజిక్ షో కోసం ముంబాయిలోని వన్ప్లేస్ హోటల్లో ఏర్పాటు చేసిని పార్టీకి నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ పార్టీకి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వనం అందింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, కైరా అద్వానీ, దీపికా పదుకోన్, జాక్వేలిన్ ఫేర్నాండేస్, హీరో రణ్వీర్ సింగ్ తమిళ హీరో విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్, సిధ్దార్థ చతుర్వేది, అభిషేక్ బచ్చన్‌లతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ను అలియా భట్ హాయ్ అంటూ పలకరించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న రౌడీ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Vijay deverakonda ❣️ Vijay ❤️ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫_______________ Turn on Post Notification 🔔 _______________⏫_______________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫______________ #arjunreddyfever #arjunreddy😎 #arjunreddy #arjunreddymania #shalinipandey #vijay #vijayfans #vijaydeverakonda # #rowdywear #kajal #rowdies #rowdy #rowdyclub #geethagovindam #NOTA # #ajith #tamil #taxiwaala #teluguactress rajini #dearcomrade #alluarjun #prabhas #samantha #bollywoodactress #tamilactress #kollywoodcinema #thedeverakondafc _________________________________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf @thedeverakonda A post shared by Vijay Deverakonda🔵 (@thedeverakondaf) on Nov 15, 2019 at 12:57am PST -
‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ద్రువ్ విక్రమ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘అదిత్య వర్మ’తో వెండితెరకు పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ద్రువ్తో కలిసి సినిమాను ప్రమోట్ చేయడంలో విక్రమ్ కూడా బీజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అదిత్య వర్మ’ ద్రువ్కు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. ద్రువ్ సినిమా కెరీర్‌కు అదిత్య వర్మ సరైన చిత్రం అన్నారు. తెలుగు అర్జున్ రెడ్డి చుశానని అది నాకు బాగా నచ్చిందని, ఈ సినిమా పలు బాషాల్లో రీమేక్ అవ్వడం సవాలుతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే నిర్మాత ముఖేష్ మెహతా అర్జున్ రెడ్డి మిళ రీమేక్‌కు ద్రువ్‌ను ఎంచుకున్నారని విక్రమ్ అన్నారు. ఇక గిరిసయ్య దర్శకత్వం వహిస్తున్న అదిత్య వర్మ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు అర్జున్ రెడ్డి హీరోయిన్ ప్రీతి పాత్రలో బనితా సింధు అదిత్య వర్మతో తమిళ తెరంగేట్రం చేయగా, ప్రియానంద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా గత నెలలో జరిగిన అదిత్య వర్మ అడియో లాంచ్‌లో ద్రువ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తాను నటించడానికి మా నాన్న విక్రమ్ చాలా శ్రమించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే ‘నా తండ్రి అంకితాభావం ఉన్న నటుడని నాకు తెలుసు, మా నాన్న ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రోత్సహం, ప్రమేయం లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదని’ అన్నాడు. -
నాన్న పదేళ్ల స్ట్రగుల్ చూశా!
సినిమా: తన తండ్రి 10 ఏళ్ల స్ట్రగుల్స్‌ను అనుభవించినట్లు ఆయన వారసుడు ధ్రువ్ విక్రమ్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఇది తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధ్రువ్ విక్రమ్‌కు జంటగా భవితసంధు నటించిన ఇందులో నటి ప్రియాఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోహీరోయిన్లు ధ్రువ్‌విక్రమ్, భవితసంధు బుధవారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. నటుడు ధ్రువ్ ముచ్చట్లు చూద్దాం.. ప్ర: ఆదిత్యవర్య చిత్రం గురించి చెప్పండి? జ: ఆదిత్యవర్మ చిత్రం చాలా కేర్‌ఫుల్‌గా యూనిట్ అంతా కలిసి శ్రమించిన చిత్రం ఇది. ప్ర:అర్జున్‌రెడ్డి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం? జ: నాకు హీరో పాత్ర హ్యాబిట్. నాకు చాలెంజింగ్ అనిపించింది. ప్ర: చిత్రంలో హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశాలు గురించి? జ: అవన్నీ స్క్రిప్ట్‌లో భాగంగానే చేశాం. భవితసంధు చాలా బాగా నటించింది. ప్ర:చిత్రం చూశారా? జ:నేనింకా చూడలేదు. నాన్న అయితే ఇప్పటికి వంద సార్లు చూసి ఉంటారు. ఆయన హ్యాపీ. ప్ర: మీ నాన్నగారిలో మీకు నచ్చిన విషయం? జ: ఆయన డెడికేషన్, తపన. పాత్ర కోసం పడే శ్రమ అన్నీ నన్ను ఆశ్చర్యపరిచేవే. అలా భవిష్యత్‌లో నేను కూడా చేస్తానోలేదో చెప్ప లేను. ఆయన ప్రారంభంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి 10 ఏళ్లు స్ట్రగుల్స్ పడ్డారు. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్న నటించిన చిత్రాలన్నీ బాగున్నాయి.సేతు, పితామగన్, బీమ, దూళ్ అన్నీ నచ్చాయి. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల రీమేక్‌లో ఏ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు? జ: భీమ చిత్ర రీమేక్ చేస్తే అందులో నటించాలని ఆశగా ఉంది. ప్ర:నాన్నతో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరగడం గురించి? జ: దర్శకుడు వెట్రిమారన్ నాన్నను కలిసి మా ఇద్దరితో చిత్రం చేయాలని చెప్పారు. మాకోసం ఆయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లున్నారు. అది నాన్నకు వినిపించారు.అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్ర:మీకు నచ్చిన నటుడు? జ: నాకు అందరు నటులు ఇష్టమే.అయితే అందరికంటే నాన్న ఎక్కువ ఇష్టం. ప్ర: మీరు నటించే చిత్రాల కథలను మీరే ఎంపిక చేసుకుంటారా? మీ నాన్న సెలెక్ట్ చేస్తారా? జ: ప్రస్తుతానికి అలాంటి సందర్భం రాలేదు. అయితే కథ నాకు నచ్చితే ఆ తరువాత నాన్న దృష్టికి తీసుకెళ్లతాను. ప్ర:తదుపరి చిత్రం? జ: ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆదిత్యవర్య చిత్రంపైనే నా దృష్టి అంతా. ఈ చిత్రం విడుదలైన తరువాత కొత్త చిత్రంపై దృష్టిసారిస్తాను -
సీన్ టు సీన్ అర్జున్‌రెడ్డే..!!
తెలుగులో అర్జున్‌రెడ్డి.. హిందీలో కబీర్ ఖాన్.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ‘కబీర్ సింగ్’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్ టు సీన్ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్లో ధ్రువ్ తనదైన ఒరిజినల్, ఇంటెన్స్, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్, ఆల్కాహల్ ఆడిక్ట్గా ఎమోషనల్ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ తమిళ ట్రైలర్‌పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్లో మాత్రం పూర్తిగా ‘అర్జున్‌రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
నాన్న లేకుంటే నేను లేను
సినిమా: నాన్న లేకుంటే తాను లేను అని పేర్కొన్నారు నవ నటుడు ధ్రువ్ విక్రమ్. నటుడు విక్రమ్ వారసుడైన ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ధ్రువ్ విక్రమ్‌కు జంటగా బనిత, ప్రియా ఆనంద్, అన్భుదాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గిరిసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు. కాగా ఆదిత్యవర్మ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. చిత్ర నిర్మాత ముఖేశ్ మెహతా మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్ర షూటింగ్లో నటుడు విక్రమ్ ఎప్పుడు ఒక స్టార్ నటుడిగా నడుచుకోలేదన్నారు. 2021లో విక్రమ్, ధ్రువ్‌విక్రమ్ కలిసి నటించి మనల్ని ఆనందపరుస్తారని భావిస్తున్నానన్నారు. ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ తాను పలు పాఠాశాలల్లో, కళాశాల్లో ప్రసంగించానన్నారు. అయితే ఈ వేడుక కొంచెం ప్రత్యేకం అన్నారు. కారణం తన కుటుంబం ఇక్కడ ఉందన్నారు. చిత్ర దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడి గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ప్రతిభావంతులు ఉండడం చూసి ఘనతగా భావించానన్నారు. తన తండ్రి విక్రమ్ గురించి చెప్పడానికి మాటలు లేవన్నారు. ఈ చిత్రానికి అంకితభావం 100 శాతం అని చెప్పారు. తన తండ్రి మంచి నటుడన్నదానికంటే మంచి తండ్రి అన్నదే తనకు తెలుసన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ధ్రువ్ మాదిరి మాట్లాడడం తనకు రాదన్నారు. తనకు 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడో, తాను నటించిన సేతు చిత్రం విడుదల కోసం ఎదురు చూసినప్పుడో ఎలాంటి ఆందోళనకు గురి కాలేదన్నది ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా తాను చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ చిత్రంలో ధ్రువ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నందుకు, అతనిపై నమ్మకం పెట్టినందుకు నిర్మాత ముఖేష్ మెహతాకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడు షరియా లేకుంటే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని పేర్కొన్నారు. -
వైరల్ ట్రైలర్స్
‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం). ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్‌రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అమిత్గాడి హాస్టల్‌కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్‌రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్‌లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్. పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్‌లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్‌లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్‌లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్‌కి క్యాంపస్‌లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు. ‘‘జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్‌ని ఊపేస్తోంది. అర్జున్‌రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్‌రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి. విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్‌లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది. -
మహేష్ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!
‘అర్జున రెడ్డి’ సినిమాతో సౌత్‌లో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్, అదే సినిమా రీమేక్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్ హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే అర్జున్ రెడ్డి హిట్ తరువాత సందీప్, మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలని భావించాడు. సందీప్ చెప్పిన లైన్‌కు ఓకె చెప్పిన మహేష్ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని చెప్పాడు. ఈలోగా సందీప్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీ కావటంతో మహేష్ మూవీ పనులు ఆగిపోయాయి. హిందీలో సూపర్ హిట్ రావటంతో సందీప్‌కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో మహేష్ మూవీని సందీప్ పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి వంగా, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
తమిళ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాల దర్శకత్వం వహించారు. అయితే బాల రూపొందించిన సినిమాతో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ధృవ్ సరసన బనిటా సందు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతమందిస్తున్నాడు. -
మేబీ అది ప్రేమేనేమో!
మన ఉద్దేశం ఏదైనా అది అవతలి వాళ్లకు ఎలా అర్థమయిందో అదే మన అసలు ఉద్దేశం అవుతుంది! హృదయం అచ్చుయంత్రమై అందులోంచి మన ఉద్దేశాన్ని ప్రింట్ అవుట్ తీసి ఇచ్చినా కూడా ఎవరికి వాళ్లు అర్థం చేసుకున్నదే అచ్చులో ఉన్నది అవుతుంది తప్ప, అచ్చులో ఉన్నది అందరికీ ఒకేలా అర్థమవదు.-మాధవ్ శింగరాజు ‘కబీర్‌సింగ్’ దర్శకుడు సందీప్రెడ్డిఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మిస్‌ఫైర్ అయినట్లే.. నాగపూర్‌లో ఓ యువతి హత్యపై ట్విట్టర్లో తాప్సీ పెట్టిన కామెంటు బ్యాక్‌ఫైర్ అయింది. ‘మేబీ అది కూడా ప్రేమేనేమో’ అని తాప్సీ సందీప్‌రెడ్డిపై సర్కాస్టిక్‌గా చేసిన ట్వీట్ ఏ కొద్దిమందికో అర్థమైనట్లుగా కనిపిస్తోంది. యావద్దేశ ప్రజలందరి ఐక్యూ లెవల్స్ ఒకలా ఉండనట్లే, వాళ్ల ఎత్తిపొడుపు లెవల్సన్నీ ఒకేలా ఉండవు. ఐక్యూ కన్నా ఎత్తిపొడుపు మోర్ కాంప్లికేటెడ్. పైన ఉండే వాళ్ల ఐక్యూను ఒకనాటికి కాకున్నా ఒకనాటికి కింద ఉండేవాళ్లు అందుకోగలుగుతారు. ఐక్యూ కన్నా ఇంకా ఎత్తున ఎత్తిపొడుపు ఉంటుంది కనుక అది ఏనాటికీ సామాన్యుల చేతికి అందదు. ఎంత ఐక్యూ ఉన్నా, ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్లూ సామాన్యుల కిందే లెక్క. ‘సర్కాజం’ అంటారు ఎత్తిపొడుపును ఇంగ్లిష్‌లో. నటి తాప్సీ ట్విట్టర్లో సర్కాస్టిక్‌గా చేసిన ఒక కామెంట్‌పై ఇప్పుడు నెట్లో ఆగ్రహావేశాలు రగులుకుంటున్నాయి. అర్థం కాకపోవడం వల్ల జరిగిన అనర్థం అది. అంత పీక్‌లో ఉంది మరి తాప్సీ సర్కాజం. నాగపూర్‌లో ఒక యువకుడు తన ప్రియురాలి క్యారెక్టర్ని శంకించి, ఆమె తలను మోది చంపేశాడు. దారుణమైన ఘటన. ఇద్దరూ ఫ్రెండ్స్. అతడి పేరు అష్రాఫ్ షేక్. ఆ అమ్మాయి ఖుషీ పరిహార్. ఆమె ఉండటం నాగపూర్‌లో. మోడలింగ్ అంటే ఇష్టం. లోకల్‌గా ఫ్యాషన్ షోలు చేస్తుంటుంది. అలా అష్రాఫ్ పరిచయం. అలాగే మరికొందరు పరిచయం. వాళ్లతో మాట్లాడొద్దంటాడు ఖుషీని. గత శనివారం పంధుర్న–నాగపూర్ హై వే మీద పోలీసులకు ఓ యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. సోషల్ మీడియాలో శోధించి ఆమెను, ఆమె ఫ్రెండ్ అష్రాఫ్నీ గుర్తించారు పోలీసులు. చంపింది తనేనని ఒప్పుకున్నాడు అష్రాఫ్. ఎందుకు చంపావు అంటే.. ‘వేరే మగాళ్లతో కూడా మాట్లాడుతోంది. తన క్యారెక్టర్ మంచిది కాదనిపించి చంపేశాను’ అన్నాడు. చంపడమే ఘాతుకం అనుకుంటే, క్యారెక్టర్ మంచిది కాదని చంపేయడం ఇంకా ఘాతుకం. ఈ ఘాతుకంపైనే తాప్సీ సర్కాస్టిక్‌గా చేసిన కామెంట్ బ్యాక్ ఫైర్ అయింది. ‘మేబీ అతడు ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాడేమో! మేబీ ఆ పిచ్చి ప్రేమతోనే అతడు ఆమెను చంపేశాడేమో!’ అని తాప్సీ ట్వీట్ చేశారు. ‘కబీర్ సింగ్’ డైరెక్టర్ సందీప్ రెడ్డిని ఎత్తిపొడవడం ఇది. అయితే ట్వీట్లో సందీప్ పేరు లేకపోవడంతో ఈ ఎత్తిపొడుపు ఎవరికీ అర్థమైనట్లు లేదు. అర్థంకాకపోవడం అర్థం చేసుకోలేనివాళ్ల తప్పైతే కాదు. ఈ ఒక్కచోట ఎత్తిపొడుపులో తన ఐక్యూ లెవల్స్‌ని తాప్సీ తగ్గించుకోవలసింది. సున్నితమైన సంగతి కదా. ఆమె సర్కాజం అర్థమైనవాళ్లకు కూడా తాప్సీ ఎవరికో భలే పంచ్ ఇచ్చారని మాత్రమే అనిపిస్తుంది. ఏ కొద్దిమందికో ఆమె సందీప్‌ని అంటున్నారని తెలుస్తుంది.. ఆయన ఇంటర్వ్యూపై జరుగుతున్న రగడను ఫాలో అవుతున్నవారికి. మిగతావాళ్లంతా నిజంగానే తాప్సీ.. ఆ చంపిన యువకుడిని సమర్థిస్తోందనే అనుకున్నారు. ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘కబీర్‌సింగ్’లో హీరో హీరోయిన్ని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంది. ఇలా స్త్రీ చెంపపై పురుషుడు చెయ్యి చేసుకునే సీన్లు సినిమాలు పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి కానీ ఇది కొంచెం వేరుగా ఉంది. ఆ కొట్టడంలో ‘టాక్సిక్ మాస్క్యులినిటీ’ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా చూస్తున్న మగపిల్లల కండల్లోకి విషపూరిత పురుషత్వాన్ని ఇంజెక్ట్ చేసేశాడు డైరెక్టర్.. ప్రియుడి చేత ప్రియురాలిని ఫిజికల్‌గా అసాల్ట్ చేయించి! పైగా అలా కొట్టడాన్ని ప్రేమ అన్నాడు సందీప్‌రెడ్డి అనుపమా చోప్రాతో. ఆమె ఫిల్మ్ క్రిటిక్. ‘‘స్త్రీని తక్కువ చెయ్యడం కదా అది’’ అని అనుపమ అన్నప్పుడు.. ‘‘గాఢమైన ప్రేమలో ఇలాగే జరుగుతుంది. ఇలా జరగలేదంటే అక్కడేం లేనట్లు’’ అని సందీప్ అన్నాడు! ఆయన ఇలా అనడం చెంపదెబ్బ సీన్ కన్నా పెద్ద సీన్ అయింది! ఆయన చెప్పదలచుకున్నది ఏదో ఉంది. దాన్నే డెప్త్కి వెళ్లి మాట్లాడాడు. అంతే డెప్త్కి వెళ్లి తాప్సీ ఆయన్ని ఎత్తిపొడిచారు. ఇంటర్వ్యూలో ఆయన కామెంట్స్ మిస్‌ఫైర్ అయినట్లే, ట్విట్టర్లో తాప్సీ కామెంటు బ్యాక్‌ఫైర్ అయింది. దానిపై మళ్లొక ట్వీట్ పెట్టారు తాప్సీ. ‘‘ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేనివాళ్లు దయచేసి నా ట్వీట్‌ను పట్టించుకోకండి. థ్యాంక్యూ, మీరెవరో నాకు తెలియకపోవడం మంచిదైంది’’ అని కామెంట్ పెట్టారు. సందీప్‌రెడ్డి అంతకుముందే తన మాటలపై వివరణ ఇచ్చారు. అది కొంచెం బెటర్ వెర్షన్లో ఉంది. అంటే.. అర్థం చేయించే భాషలో. ‘‘మీరు నా మాటల్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కబీర్‌సింగ్ తన ప్రియురాలిని కొట్టడం కొట్టినట్లు కాదు. ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంతగా దగ్గరైనప్పుడు కోపాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను తీసుకోకుండా ఉండలేకపోవడం అది. అమ్మాౖయెనా అంతే, అబ్బాౖయెనా అంతే’’ అని అన్నాడు. ఈ మాట ఎంతమందికి ఎంత మేరకు అర్థమైయిందో మరి. తాప్సీని, సందీప్నీ వదిలేద్దాం. అంతగా డెప్త్ లేని, అంతగా సర్కాజం లేని మనం కూడా నెత్తీనోరూ మొత్తుకుంటూనే ఉంటాం.. ‘నా ఉద్దేశం అది కాదు’ అని చెప్పడానికి. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, బాగా దగ్గరి ఫ్రెండ్స్! ఉద్దేశాన్ని వేరేలా అర్థం చేసుకున్నారంటే.. ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారనో, అపార్థం చేసుకున్నారనో కాదు. మన ఉద్దేశం వేరేలా కూడా అర్థమయ్యేలా ఉందని. -
హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!
తెలుగులో సంచనల విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను వర్మ పేరుతో బాలా దర్శకత్వంలో రూపొందించారు. అయితే నిర్మాతలకు అవుట్‌పుట్ నచ్చకపోవటంతో గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. అయితే రెండో వర్షన్ విషయంలోనూ రకరకాల అనుమానలు వచ్చాయి. షూటింగ్ అనుకున్నట్టుగా సాగటం లేదని, ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. చివరి షాట్‌కు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేశారు. హీరో హీరోయిన్లపై చివరి షాట్‌ను చిత్రీకరించారు. ఈ షూటింగ్ జరుగుతుండగా చియాన్ విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. View this post on Instagram Adithya Varma will always be the most beautiful thing that’s ever happened to me. He gave me a purpose, gave my life meaning, gave me clarity about myself and most importantly, taught me how to never give up. So much love for all the people in this video, especially the man in the last frame. Couldn’t have done it without you. #itsawrap 💫 A post shared by த்ருவ் (@dhruv.vikram) on Jul 15, 2019 at 4:54am PDT -
నెక్ట్స్ సూపర్ స్టార్‌తోనే!
తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్, ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాను బాలీవుడ్లో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో కబీర్ సింగ్ ఫీవర్ నడుస్తోంది. ఇక సందీప్ తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోంది. వరుసగా రెండు సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించిన సందీప్ ఫైనల్ నేరేషన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని సందీప్ ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. -
క్రిటిక్స్‌పై అర్జున్ రెడ్డి దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయం అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సందీప్, అర్జున్ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లోనూ సంచలనాలు నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. కానీ రివ్యూలతో సంబంధం లేకుండా కబీర్ సింగ్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. వీళ్లంతా ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగుంటూ ఘాటుగా స్పందించాడు. సినిమాలోని టెక్నికల్ అంశాలను చర్చించకుండా కొన్ని సీన్స్‌ను మాత్రమే విమర్శిస్తున్నారని ఓ ప్రముఖ ఎనలిస్ట్ పేరును కూడా ప్రస్తావించాడు సందీప్ రెడ్డి వంగా. అంతేకాదు కబీర్ సింగ్‌ను వైలెంట్ సినిమా అంటున్నారు, నా నెక్ట్స్ సినిమాతో వైలెంట్ సినిమా అంటే ఏంటో చూపిస్తా, ఆ సినిమా చూసాక ఈ క్రిటిక్స్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందన్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ ఎనలిస్ట్‌లపై విమర్శలు చేసిన సందీప్‌పై మీడియా ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. సందీప్ ఇంటర్య్వూపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ‘ సందీప్ రెడ్డి వంగా అమాయకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్ సింగ్‌పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం’ అంటూ ట్వీట్ చేశారు. I think @imvangasandeep is the most perfect mix of innocent honesty and truthful courage ..This interview of his,is as pathbreaking as his #KabirSingh https://t.co/ai1zb0P3iy pic.twitter.com/cqzYCpy91b — Ram Gopal Varma (@RGVzoomin) 7 July 2019 -
‘అర్జున్ రెడ్డి’ని మించేలా!
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన నిర్మాత రాకేష్ రెడ్డి మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రకటన తిరుమల నుంచి చేశారు. రచయిత చిన్న కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నట్టుగా తెలిపారు. అర్జున్ రెడ్డిని మించే కథను చిన్న కృష్ణ అందించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న రాకేష్ రెడ్డి, వచ్చేనెలలో హీరో, దర్శకులను ప్రకటిస్తామన్నారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాకేష్ రెడ్డి, చిన్నికృష్ణలు ఈ ప్రకటన చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో రాకేష్ రెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా భారీగా రావటంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. -
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడికి బంపర్ ఆఫర్!
సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమా తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్, అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఏడాది టాప్ 3 గ్రాసర్స్‌లో నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు. కబీర్ సింగ్ సక్సెస్‌తో సందీప్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కబీర్ సింగ్ సక్సెస్ గురించి విన్న సల్మాన్ ఖాన్, సందీప్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై సల్మాన్, సందీప్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
సిడ్నీలో ఎన్నారై అర్జున్ రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి అర్జున్ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన అర్జున్ రెడ్డిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన సామ అర్జున్ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మాట్లాడిన అర్జున్.. మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు. అర్జున్ మృతి వార్త వినగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్న ఎప్పుడూ నా వెనకుంటారు
నటుడికి తొలి సినిమా చాలా ముఖ్యం. ఏ అడ్డంకులు లేకుండా మంచి హిట్ సాధించాలనుకోవడం సహజం. అలాంటిది ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా రాలేదని మళ్లీ మొదటి నుంచి తీయాలని నిర్మాతలు అనుకుంటే? ఆ యాక్టర్ కాన్ఫిడెన్స్‌లో కచ్చితంగా డిస్ట్రబెన్స్ వస్తుంది. అయితే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌కి ఇలా జరిగినా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ధృవ్. మొదట బాలా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘వర్మ’ టైటిల్‌తో తీశారు. ఆ చిత్రాన్ని ఆపేసి, ‘ఆదిత్యవర్మ’ పేరుతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి, పూర్తి చేశారు. ‘ఆదిత్య వర్మ’ పూర్తి కావడం వెనక తన తండ్రి సహకారం ఉందని భావోద్వేగంతో ధృవ్ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘సెట్‌ను ప్రతిరోజూ సందర్శిస్తూ, మమ్మల్ని మా శక్తిమేరకు పని చేసేలా ప్రోత్సహిస్తూ,్త, మా అందరి విజన్‌ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ నన్ను ‘ఆదిత్య వర్మ’ను చేశారు మా నాన్న. నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా, నా వెనకే ఉంటూ, నాకన్నీ నేర్పిస్తూ ఉన్నావు, ఉంటావు కూడా నాన్నా! నువ్వు లేకుండా ఏదీ అంత సులువుగా జరిగేది కాదు. నన్నెవరో అడిగారు.. ‘సినిమాకు అంత కష్టపడ్డారు కదా, టీజర్లో మీ నాన్నగారి పేరెక్కడా? అని. ఆయన పేరు నా పేరు వెనక, ఆయనెప్పుడూ నా వెనక ఉంటారు’ అని బదులిచ్చాను. నువ్వు గర్వపడేలా చేస్తాను నాన్నా’’ అని పేర్కొన్నారు. ‘ఆదిత్య వర్మ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
కబీర్ సింగ్ సూపర్.. షాహిద్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!
ముంబై: తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే, ఒకరోజు ముందే ఈ సినిమా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో విడుదలైంది. దీంతో అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని, షాహిద్ కపూర్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇదని కితాబిస్తున్నారు. అయితే, మరికొంతమంది విజయదేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలాగే ఈ సినిమా కూడా చాలావరకు ఉందని, పెద్దగా మార్పులేమీ దర్శకుడు హిందీ వర్షన్లో చేయలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రేమలో విఫలమైన ఓ వైద్య విద్యార్థి స్వీయ హననానికి పాల్పడుతూ.. ఏవిధంగా మారిపోయాడు? అతని ప్రేమకథ ఎలా కొలిక్కి వచ్చిందన్న నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆద్యంతం షాహిద్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడని గల్ఫ్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమలో పడి.. అంతా సజావుగా సాగిపోయే సాధారణ ప్రేమకథ చిత్రం ఇది కాదని, బాలీవుడ్లో ఇప్పటివరకు ఇలాంటి ప్రేమకథా చిత్రాన్ని చూడలేదని, షాహిద్ అద్భుతంగా నటన కనబర్చగా.. దర్శకుడు సందీప్ వంగా సినిమాను చక్కగా తెరకెక్కించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు. Saw #KabirSingh at Censor Board ! What a BOMBASTIC Film ! @shahidkapoor Stole the Show all the way. What a Film ! 👏👏👏 — Umair Sandhu (@UmairFilms) June 19, 2019 #KabirSingh review: ⭐⭐⭐⭐1/2. First of all let us tell you, this is not a normal lovestory where a boy & a girl meets & they fall in love & eventually everything goes smooth. This story is something which Bollywood never witnessed. Stunning 2nd half which reveals heroin's part — AlwaysBollywood (@AlwaysBollywood) June 20, 2019 #KabirSingh is a must watch movie!!! @shahidkapoor 's best performance so far. Mind blowing.Aur @Advani_Kiara kya baath hai 😍 An absolutely trippy film. The audience is going to go mad. The background score just compliments everything. Superb Direction by Sandeep Reddy Vanga. — Mukesh Chhabra CSA (@CastingChhabra) June 20, 2019 Shahid Kapoor 👌👌👌👌👌👌👌👌 What an outstanding perfomance Boss. Mind still quaking.#KabirSingh — Z Aaris (@iamZaidaaris) June 20, 2019 -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ మెప్పిస్తాడా!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఒరిజినల్‌ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే తెరకెక్కించాడు. కబీర్ సింగ్ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తమిళ రీమేక్ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాలా దర్శకత్వం వహించారు. అయితే అవుట్‌పుట్ విషయంలో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి రూపొందించారు. ఆదిత్య వర్మ పేరుతో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే ఈ సారి కూడా ఆదిత్య వర్మ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో పాత్రకు ధృవ్ వయసు సరిపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడిసిన్, పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా ధృవ్ కనిపించటంలేదంటున్నారు విశ్లేషకులు. నటన పరంగా మెప్పించినా లుక్ కన్విన్సింగ్‌గా లేకపోతే కష్టమే అంటున్నారు. మరి ఈ విమర్శల నేపథ్యంలో తమిళ అర్జున్ రెడ్డి ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. -
ఇది షాహిద్ సినిమా కాదు!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ దర్శకత్వంలోనే ‘కబీర్‌సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ అయింది. ఈ నెల 21న చిత్రం విడుదల కానున్న సందర్భంగా షాహిద్, కియారా చెప్పిన విశేషాలు. ► ‘కబీర్‌సింగ్’ చిత్రం కోసం తిరిగి కాలేజీకి వెళ్లడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా భయం వేసింది. ఎందుకంటే ఇందులో నేను దాదాపు పాతికేళ్ల కుర్రాడిలా కనిపించాలి. ఇప్పుడే వచ్చిన కొత్త హీరో అనే ఫీల్‌ని ఆడియన్స్‌కి కలగజేయాలి. ఈ సినిమాలోలా రియల్ లైఫ్‌లోనూ నేను ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ కావడంతో ఈజీ అయింది. టీజర్ చూసినవాళ్లు కాలేజీ స్టూడెంట్‌లానే ఉన్నారని చెప్పగానే ఆనందం అనిపించింది. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు నా వయసు పాతికేళ్లు కాదు. ► తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా? చూశాను. బాగా నచ్చింది. సినిమాలోని క్యారెక్టర్, ఎమోషనల్ థింగ్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ ఫిల్మ్ మేకింగ్‌ని ఎంజాయ్ చేశాను. హీరోది చాలా గొప్ప పాత్ర. విజయ్ బాగా చేశాడు. ► ‘అర్జున్‌రెడ్డి’ అప్పుడు విజయ్ చేసింది తక్కువ సినిమాలు. మీరు 30కి పైగా సినిమాలు చేశారు కాబట్టి అంచనాలు ఉంటాయి. ప్రెషర్ ఏమైనా? ఇలాంటి సబ్జెక్ట్‌ను కొత్త హీరో అయితే డిఫరెంట్ ఎనర్జీతో చేస్తారు. అలాగే నాలాంటి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు కూడా డిఫరెంట్‌గానే ట్రై చేస్తారు. అయితే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్‌కు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కొంచెం కష్టం అనిపించొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ ఒకసారి సినిమా చూశారు. అంతకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయినా ఈ సినిమా వరకూ ఆడియన్స్ ఇందులోని క్యారెక్టర్ని చూస్తారు. మన గురించి అంతగా ఆలోచించరు. కథ అలాంటిది. అందుకే ఇది షాహిద్ కపూర్ సినిమా కాదు. కబీర్ సింగ్ సినిమా. అఫ్కోర్స్ ఈ పాత్ర చాలెంజింగ్ అని మాత్రం ఒప్పుకుంటాను. ► ఈ రీమేక్ ఆలోచన మీకు వచ్చిందా? ‘అర్జున్‌రెడ్డి’ని ఒకరు చూపించారు. చాలా బాగుందనిపించింది. అయితే మనం చేసి ఇప్పుడు స్పాయిల్ చేయడం ఎందుకు అనుకున్నా. కానీ ఎప్పుడైతే సందీప్‌రెడ్డి హిందీ రీమేక్ పట్ల ఇంట్రెస్ట్‌గా ఉన్నారని తెలిసిందో అప్పుడు చేయాలనిపించింది. అతని వర్క్ బాగా నచ్చింది. ఓ మంచి సినిమాని ఎక్కువమంది చూడాలని కోరుకునే మనస్తత్వం నాది. ఈ సినిమాను హిందీ ఆడియన్స్ నా వల్ల చూస్తారు అన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. ► ‘కబీర్‌సింగ్’ ట్రైలర్‌ని ప్రభాస్ ప్రశంసించారు.. నాకు, ప్రభాస్‌కు హకీమ్ హెయిర్ స్టైలిష్‌గా ఉన్నారు. ప్రభాస్ గురించి చాలా విన్నాను. సో కైండ్. ట్రైలర్‌ని అభినందిస్తూ ప్రభాస్ నాతో మాట్లాడారు. తనతో మాట్లాడటం అదే ఫస్ట్ టైమ్. ► అర్జున్‌రెడ్డి, కబీర్సింగ్లకు పోలికలు పెడతారు. ఆ విషయం గురించి ఏమంటారు? పోలిక పెట్టకూడదు. ఎందుకంటే ఒకటి బాగుందంటే అది ఎప్పటికీ బాగున్నట్లే. దానికి ఆ గౌరవం ఇవ్వాలి. ‘అర్జున్ రెడ్డి’ బాగుంది. అలాంటప్పుడు ‘కబీర్‌సింగ్’తో పోలికపెట్టడం దేనికి? అర్జున్‌రెడ్డి నాకూ నచ్చింది. ఇప్పుడు ‘కబీర్..’ని ప్రేక్షకులు కొత్త సినిమా అనుకుని చూడాలి. ► ‘ఉడ్తా పంజాబ్, కబీర్‌సింగ్, కమీనే’.. ఇలా డార్క్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నట్లున్నారు? డార్క్, లైట్ అని కాదు భిన్నమైన పాత్రలు చేయడానికి నేను ఇష్టపడతాను. కానీ అవుటాఫ్ ది బాక్స్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయడంలో ఉన్న ఫీల్‌ని ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ రోల్స్ చేయాలనుకుంటాను. ► ‘కబీర్ సింగ్’లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. మరి మీ ఆవిడ మీరా దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నిజానికి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తనకు నచ్చింది. ఈ పాత్ర నీ కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని తనే చెప్పింది. ఈ వృత్తిలో ఉన్న విషయాలను అర్థం చేసుకునే పరిణితి తనకు ఉంది. ► ‘కబీర్‌సింగ్’ లవ్‌లో ఫెయిలై, ఫైనల్లీ ప్రేమికురాలిని దక్కించుకుంటాడు. రియల్ లైఫ్‌లో మీకూ లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా? అందరి జీవితాల్లో ఉన్నట్లే నా లైఫ్‌లోనూ కొన్ని లవ్ ఫేజెస్ ఉన్నాయి. అది కామన్ (నవ్వుతూ). ► కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘హిందీ రీమేక్ ఒప్పుకోక ముందు ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశాను. సైన్ చేశాక మాత్రం చూడలేదు. ఎందుకంటే ఆ ప్రభావం నా నటన మీద పడే అవకాశం ఉంది. క్యారెక్టర్ని నా స్టైల్లో నేను చేయాలనుకున్నాను. కథానుగుణంగానే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రేమికులను తీసుకుందాం. వాళ్ల మధ్యమాటలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది కదా. సినిమాలో షాహిద్, నేను ప్రేమికులం కాబట్టి మా మధ్య రొమాన్స్ ఉంటుంది. అవి లేకుండా ప్రేమ ఉండదు. షాహిద్ కపూర్ నటించిన కొన్ని సినిమాలు నేను చూశాను. అన్నింటికన్నా ‘కబీర్‌సింగ్’లో ‘ది బెస్ట్ పర్ఫార్మెన్స్’ ఇచ్చాడు. ఓ 25, 30 సినిమాలు చేశాక కాలేజీ సబ్జెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కొత్త హీరో అనిపించేలా చేశాడు. సందీప్ రెడ్డి అమేజింగ్ డైరెక్టర్ అనాలి. అసలు కథే వండర్ఫుల్ అంటే పాత్రలను ఆయన మలిచిన తీరూ అద్భుతమే. -
ఆదిత్య వర్మ రెడీ
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ పడాల్సిన ఇబ్బందులు పడింది. చూడాల్సిన చిక్కులు చూసేసింది. ఇక ఆడియన్స్ సినిమా చూడటమే తరువాయి. ఈ రీమేక్ ద్వారా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్నారు. తొలుత ఈ సినిమాని ‘వర్మ’ టైటిల్‌తో బాలా డైరెక్ట్ చేశారు. అవుట్‌పుట్ నచ్చలేదని నిర్మాణ సంస్థ మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలెట్టారు. ప్రస్తుతం వర్మ టైటిల్‌ను ‘ఆదిత్య వర్మ’గా మార్చి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గిరీశయ్య పని చేయడం విశేషం. ఇందులో బన్నితా సంధు, ప్రియా ఆనంద్ కథానాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. టీజర్ ఆదివారం రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. రిలీజ్‌కు ‘ఆదిత్య వర్మ’ రెడీ అంటోంది చిత్రబృందం. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ వచ్చేసింది!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. తమిళ్లో ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్ లాంటివి యాజిటీజ్‌గా దించేశారు. టీజర్లో లుక్స్, యాక్టింగ్ పరంగా ధృవ్ ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ సినిమాను సీనియర్ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్‌పుట్ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్ సరసన బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. -
మహేష్‌తో మూవీపై సందీప్ క్లారిటీ
ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అనిల్ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత చేయబోయే సినిమాపై కూడా చర్చ మొదలైంది. చాలా కాలంగా అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్, ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించినట్టుగా తెలిపాడు. లైన్ మహేష్‌కు నచ్చటంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నారని, పూర్తి కథ చెప్పిన తరువాతే సినిమాపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన కబీర్ సింగ్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆదిత్యవర్మగా ‘అర్జున్ రెడ్డి’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కొత్త చరిత్రను సష్టించిన అలనాటి బెంగాలీ ‘దేవదాస్ (1935)’ చిత్రానికి, తెలుగులో వచ్చిన ఇప్పటి ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలకే కాకుండా వాటిలో నటించిన దర్శక నటుడు ప్రమతేష్ చంద్ర బారువా (పీసీ బారువా)కు, విజయ దేవరకొండకు మధ్య పలు విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో నటించిన హీరోలు రాత్రికి రాత్రి స్టార్ హీరోలయ్యారు. నాటి దేవదాస్, నేటి అర్జున్ రెడ్డి చిత్రాల్లో హీరోలిద్దరు భగ్న ప్రేమిక పాత్రలే. హదయాన్ని కలచివేస్తోన్న ప్రేమానుభూతులను మద్యం మత్తులో మరచిపోయేందుకు ప్రయత్నించే పాత్రలే. నాటి దేవదాస్ చిత్రంతో చలనచిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితమన్న భావన నుంచి సామాజిక స్పహ కూడా ఉంటుందన్న కొత్త భావాన్ని జనంలోకి తీసుకెళ్లింది. అలాగే అర్జున్‌రెడ్డి చిత్రానికి కూడా కాలేజీలు మన కళ్ల ముందు కనిపించే వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందన్న ప్రశంస కూడా వచ్చింది. నాటి ‘దేవదాస్’ చిత్రంతో దాన్ని రాసిన ప్రముఖ బెంగాలీ కవి శరత్ చంద్ర చటోపాధ్యాయ్ పేరు కూడా బెంగాల్ రాష్ట్రంలో ఇంటింట తెల్సింది. అప్పటి వరకు పెద్దగా చిత్రాలను పట్టించుకోని శరత్ చంద్ర అప్పటి నుంచి దక్షిణ కోల్‌కతాలోని ‘న్యూ థియేటర్స్ స్టుడియో’కు తరచుగా వెళ్లడం ప్రారంభించారట. ఆ తర్వాత పీసీ బారువా అంటే దేవదాస్, దేవదాస్ అంటే పీసీ బారువాగా పేరు పడింది. దాంతో బారువా ఆ చిత్రాన్ని హిందీలో తీయాలనుకున్నారు. అయితే తన హిందీ ఉచ్ఛారణ బాగుండదని తలచి, అప్పటికే పాటలతో పరిచయమున్న కేఎల్ సైగల్ హీరోగా హిందీ ‘దేవదాస్’ తీశారు. అది కూడా ప్రేక్షకుల ప్రజాదరణ పొందడమే కాకుండా కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెలుగులో వచ్చిన ‘దేవదాసు’ కూడా సూపర్‌డూపర్ హిట్టయింది. ఆ తర్వాత హిందీలోనే దిలీప్‌కుమార్, షారూక్ ఖాన్లు హీరోలుగా దేవదాస్ చిత్రాలు వచ్చాయి. నాటి బెంగాలీ దేవదాస్‌కు, అర్జున్‌రెడ్డి చిత్రాలకు మరో పోలిక కూడా ఉంది. అదే దేవదాస్ చిత్రం ద్వారా రచయిత శరత్ చంద్ర పేరు ఇల్లిళ్లు తెలిసిపోగా, అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా ఎవరికి తెలియని ఆ సినిమా కథా రచయిత ‘సందీప్ రెడ్డి వంగా’ గురించి తెలుగు ప్రేక్షకులకు తొలిసారి తెలిసింది. ఆయనకు అర్జున్‌రెడ్డి కథ రాయడానికి రెండేళ్లు పట్టగా, అది సినిమాగా రావడానికి మరో నాలుగేళ్లు (2017) పట్టింది. ఇప్పుడు అదే కథ ఆధారంగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. మరోపక్క ఇదే కథతో ‘ఆదిత్య వర్మ’ చిత్రం తమిళంలో నిర్మాణం అవుతోంది. ఆ సినిమాలో ‘ధృవ్ విక్రమ్’ హీరోగా పరిచయం అవుతున్నారు. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ రెడీ!
టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తమిళ అర్జున్ ఆదిత్మ వర్మ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే బాల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవుట్‌పుట్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ని చూసి సిగ్గుపడాలి : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌కు నాంధి పలికిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ కంటెంట్‌తో సంచలన విజయం సాదించిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మీ గోల్స్ ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను కొన్నేళ్ల తరువాత అర్జున్ రెడ్డి సినిమా చూస్తే సిగ్గుపడాలి. కొన్ని సంవత్సరాల తరువాత కూడా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డే అంటే నటుడిగా నేను ఏ మాత్రం ఇంప్రూవ్ కాలేదని అర్ధం. నటుడిగా నేను ఇంకా ఎంతో సాధించాలి’ అన్నాడు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషలన్నింటి మీద దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. -
కబీర్‌సింగ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ, షాలినీపాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’కి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్’ ని తెరకెక్కించడం విశేషం. భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషణ్ కుమార్, అశ్విన్ వర్డే నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘అర్జున్‌రెడ్డి’లోని అనుభూతిని ఎక్కడా మిస్ కాకుండా ‘కబీర్‌సింగ్’ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 21న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్లో ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందే వేచి చూడాలి. -
ట్వీట్‌లోనూ అదే యాటిట్యూడ్
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ... తరువాత కూడా తనదైన యాటిట్యూడ్‌తో టాలీవుడ్లో స్టార్ గా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న విజయ్ తన సినిమాల ప్రమోషన్ విషయంలోనూ అంతా తానే అయి వ్యవహరిస్తున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న డియర్ కామ్రేడ్ సినిమాలోని సెకండ్ సింగిల్ ఆదివారం విడుదల కానుంది. అయితే విషయాన్ని తన ట్విటర్లో ప్రకటించిన విజయ్ ఏకంగా ఆ పాటను సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సెకండ్ సింగిల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే పాట రిలీజ్ కాకముందే విజయ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని ప్రకటించటంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. This Sunday. The 12th of May. You will experience what I call "The Song of the Year"#DearComrade pic.twitter.com/zZg2QTBTSu — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2019 -
'డిగ్రీ కాలేజీ'లో విశృంఖలత్వం..
ముషీరాబాద్: ప్రస్తుతం విడుదలవుతున్న కొన్ని సినిమాలలో ఆశ్లీల దృశ్యాలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయిని, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలతో మరింత అశ్లీలత పెరిగిందని, నేడు ‘డిగ్రీ కాలేజీ’ పేరుతో వస్తున్న సినిమాలో మరింత విశృంఖలత్వంతో కూడిన దృశ్యాలున్నాయని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సినిమా ఇటీవల ట్రైలర్ మూడు నిమిషాలే ఉందని, దానిని చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోందన్నారు. బుధవారం పీవైఎల్ నాయకులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రదీప్ మాట్లాడుతూ... సినిమాలలో వస్తున్న శృంగార విశృంఖలత్వం చూసి యువత చెడిపోయే ప్రమాదముందన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. పీవైఎల్ నాయకులు కె.రాజేందర్, డివిఎస్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, రాకేశ్‌రెడ్డి, అశోక్, సమీర్, సాయి, సందీప్ పాల్గన్నారు. -
హిందీ ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ వచ్చేస్తోంది!
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి స్టైల్లోనే కట్ చేసిన టీజర్‌కు బాలీవుడ్లో సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 13న కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 21న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Trailer out on 13th May! #KabirSingh@Advani_Kiara @imvangasandeep @itsBhushanKumar @MuradKhetani #KrishanKumar @ashwinvarde @TSeries @Cine1Studios @KabirSinghMovie pic.twitter.com/RnrRsAtibv — Shahid Kapoor (@shahidkapoor) 8 May 2019 -
అర్జున్‌రెడ్డి విడుదలకు సిద్ధం
సినిమా: అర్జున్‌రెడ్డి ఈ పేరు తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తమిళంలోకి రానుంది. విజయ్‌దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళనాట విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. కాగా అదే విజయ్‌దేవరకొండ నేరుగా తమిళంలో నటించిన నోటా చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఆయన హీరోగా నటించిన మరో తెలుగు చిత్రం ద్వారక. ఈ చిత్రానిప్పుడు అర్జున్‌రెడ్డి పేరుతో తమిళంలోకి శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలా అనువదిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా పూజాజవేరి నటించగా, ఇతరు ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేశ్‌వాణి పృథ్వీరాజ్ నటించారన్నారు. అర్జున్‌రెడ్డి పూర్తి వినోదభరితంగా సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అర్జున్‌రెడ్డి కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. దీనికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. -
జెట్ స్పీడులో తమిళ ‘అర్జున్ రెడ్డి’
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా తమిళ అర్జున్ రెడ్డికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. ముందుగా బాల దర్శకత్వంలో ఈ రీమేక్ చిత్రీకరించారు. కానీ అవుట్ పుట్ నచ్చకపోవటంతో ఆ వర్షన్ పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా కొత్త దర్శకుడితో సినిమా మొత్తం రీషూట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఆదిత్య వర్మ పేరుతో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 65 శాతానికి పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనితా సందు హీరోయిన్ నటిస్తోంది. రథన్ సంగీతమందిస్తున్నాడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫారిన్లో పాట
తెలుగు సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’లో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతోంది. హిందీ చిత్రం ‘అక్టోబర్’ ఫేమ్ బన్నితా సాంధు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. నటి ప్రియా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ముకేశ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. ‘‘చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పోర్చుగల్‌లో సాంగ్ షూట్ చేస్తున్నాం. 65 శాతం సినిమా పూర్తయింది. ఈ మధ్యే సినిమా ప్రారంభించాం. అంతలోనే 65 శాతం పూర్తి చేశాం. రికార్డు టైమ్’’ అన్నారు సినిమాటోగ్రఫర్ రవి. కె. చంద్రన్. ఇది వరకు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ధ్రువ్ హీరోగా బాల దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో ప్రారంభమై, రిలీజ్‌కి రెడీ అయిన విషయం తెలిసిందే. కాకపోతే అవుట్‌పుట్ తాము ఆశించినట్లుగా రాలేదని భావించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఆదిత్య వర్మ’గా టైటిల్‌ని మార్చారు. పూర్తయిన సినిమాని మళ్లీ మొదలుపెట్టి, తీయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
కబీర్ సింగ్‌కు ప్రభాస్ ప్రశంసలు
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ టీజర్ ఇటీవల రిలీజైంది. కబీర్ సింగ్‌గా నటించిన షాహిద్ కపూర్‌కు అభినందనలు కురిపిస్తోంది బాలీవుడ్. టీజర్లో షాహిద్‌ను చూసి మన ‘బాహుబలి’ ప్రభాస్ కూడా ఫ్లాట్ అయిపోయారట. షాహిద్‌ను పర్సనల్‌గా అభినందించారట కూడా. షాహిద్‌కు, ప్రభాస్‌కు కనె„ý న్ ఎక్కడ కుదిరిందీ అనుకుంటున్నారా? ఇద్దరి హైయిర్ స్టైలిస్ట్ ఒక్కరే. ప్రభాస్ ‘సాహో’ సినిమాకు హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు హకీమ్ అలీ. షాహిద్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా ఇతనే. ‘సాహో’ షూటింగ్ టైమ్‌లో ‘కబీర్ సింగ్’ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసిన ప్రభాస్, ‘సాహో’ బృందం చాలా బావుందని మాట్లాడుకోవడం హకీమ్ అలీ చెవిలో పడింది. వెంటనే షాహిద్‌కు కాల్ చేసి ఫోన్ ప్రభాస్ చేతిలో పెట్టారట. ‘‘టీజర్ చాలా బావుందని సుమారు 7 నిమిషాల పాటు షాహిద్, ప్రభాస్ మాట్లాడుకున్నారు’’ అని హకీమ్ అలీ పేర్కొన్నారు. ‘కబీర్ సింగ్’ జూన్ 21న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. -
అప్పుడు టెంపర్ రీమేక్‌లో.. ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్‌లో..
-
హిందీ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ వచ్చేసింది!
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ మూవీ అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ పాత్రలో అలరించనుంది. సినీ 1 స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ దాదాపు అర్జున్ రెడ్డి స్టైల్లో ఉంది. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్, డైలాగ్స్ అన్ని అర్జున్ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. మరి టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతి
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ తెరకెక్కిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా తెలుగు అర్జున్ రెడ్డి విజయ్, హిందీ ప్రీతి కియారాలు ఓ ఈవెంట్లో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఈవెంట్లో విజయ్, కియారా అద్వాని కలిశారు. బాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ హాటెస్ట్ స్టైలిస్ట్‌గా అవార్డు అందుకున్నాడు. విజయ్ తోపాటు షారూఖ్ ఖాన్ దంపుతులు, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లతో పాటు మరికొంతమంది బాలీవుడ్ యంగ్ స్టార్స్ ఈకార్యక్రమంలో సందడి చేశారు. This ones for you @imvangasandeep When Preeti Met Arjun 😎 Hey Rowdy! @TheDeverakonda pic.twitter.com/zxQaQbNoTV — Kiara Advani (@Advani_Kiara) 30 March 2019 -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌లో స్టార్ డైరెక్టర్
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ధృవ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను గిరీశయ్య దర్శకత్వంలో మరోసారి తెరకెక్కిస్తున్నారు. కొత్త తెరకెక్కిస్తున్న రీమేక్‌లో నటీనటులను కూడా మార్చేశారు చిత్రయూనిట్. తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌లో హీరోగా తండ్రి పాత్రలో సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా తాను నిర్మించిన సినిమాలన్నీ ఆగిపోవటంతో గౌతమ్ మీనన్ పూర్తి నటన మీద దృష్టిపెట్టాడు. ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన గౌతమ్, అర్జున్ రెడ్డి రీమేక్‌లో మాత్రం ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవ్ సరసన బానిటా సంధు హీరోయిన్గా నటిస్తుండగా ప్రియా ఆనంద్, అన్బులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!
అలాంటి వాడైతే కచ్చితంగా ప్రేమిస్తానంటోంది ‘ప్రీతి’ అలియాస్ శాలినిపాండే. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టిర ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్నారు ప్రీతి. టాలీవుడ్లో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం విజయం సాధించడంతో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అయ్యారు శాలినిపాండే. ‘100 శాతం కాదల్’ చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్న శాలినిపాండే ఆ చిత్రం విడుదల కాకముందే మరో రెండు మూడు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘100 శాతం కాదల్’ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన ‘100% లవ్’ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీంతో పాటు జీవాకు జంటగా గొరిల్లా, విజయ్ ఆంటోని సరసన అగ్ని సిరగుగళ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు శాలిని పాండే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి ముచ్చటించారు శాలిని పాండే. సినిమాలంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. చదుకుంటున్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగిందని చెప్పిందన్నారు. అయితే తాను నటించడం తన తండ్రికి అసలు ఇష్టం లేదని తెలిపారు. వేరేదన్నా ఉద్యోగం చేసుకోమని ఒత్తిడి చేశారని, దీంతో తాను ముంబై వెళ్లి సినిమా అవకాశాల వేటలో పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తినడానికే చాలా కష్ట పడ్డానని అన్నారు. అలా కొన్ని నెలల తరువాతనే తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి కోసం నిర్వహించిన ఆడిషన్లో ఎంపికై నటించే అవకాశాన్ని పొందినట్లు తెలిపారు. అప్పుడు కూడా ముద్దు సన్నివేశాల్లో, హీరోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటింపజేయరాదని దర్శకుడికి తన తండ్రి షరతులు విధించారని చెప్పుకొచ్చారు. అలాంటిది ఆ చిత్రం విడుదలై సక్సెస్ కావడంతో ప్రశంసల వర్షం కురిపించారని అన్నారు. ఇకపోతే ప్రేమ గురించి అడుగుతున్నారని, నిజ జీవితంలో ‘అర్జున్‌రెడ్డి’ లాంటి వ్యక్తి లభిస్తే కచ్చితంగా ప్రేమిస్తానని చెప్పారు శాలిని పాండే. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అదే విధంగా రెండేళ్ల సినీ జీవితంలో చాలా నేర్చుకున్నానని అన్నారు. గ్లామరస్‌గా ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. నటుడు కమలహాసన్, దర్శకుడు మణిరత్నంలకు వీరాభిమానినని చెప్పుకొచ్చారు శాలిని పాండే. ఇక తిండి విషయంలో ఎలాంటి నియమాలు లేవని, వారానికి ఐదు రోజులు మాత్రం శారీరక కసరత్తులు చేస్తానని చెప్పారు. పుస్తకాలు బాగా చదువుతానని, స్నేహితులు తక్కువేనని నటి శాలినిపాండే చెప్పుకొచ్చారు. -
అర్జున్ రెడ్డి జోడి.. రిపీట్!
టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహు భాషా చిత్రాలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్‌ను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత కూడా ఓ ట్రై లింగ్యువల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్, షాలినిల జోడి మరోసారి తెర మీదకు వస్తుండటం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయ్యింది. -
వర్మ కాదు... ఆదిత్యవర్మ
తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. అవుట్‌పుట్ నచ్చక మళ్లీ ఈ సినిమా తీయాలని నిర్మాతలు అనుకున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ను ప్రారంభించారు. రీషూట్ చేయాలనుకున్న తర్వాత హీరోగా ధృవ్‌నే ఉంచారు కానీ దర్శకుడు బాలా స్థానంలో గిరీశాయ అనే దర్శకుడిని తీసుకున్నారు. హీరోయిన్గా బన్నితా సాదును తీసుకున్నారు. రవి. కె చంద్రన్‌ను కెమెరామెన్‌గా తీసుకున్నారు టీమ్. తాజాగా ఈ సినిమాకు ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు ధృవ్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక చిత్రదర్శకుడు గిరీశాయ గురించి చెప్పాలంటే... తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారట. అలాగే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధన్నే ‘ఆదిత్యవర్మ’కు మ్యూజిక్ అందించబోతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా కంప్లీట్ చేసి జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వర్మ ప్రేయసి
తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ‘తూచ్.. అవుట్‌పుట్ నచ్చలేదు’ అంటూ నిర్మాతలు మళ్లీ తీయడానికి రెడీ అయిపోయారు. ధృవ్‌నే హీరోగా ఈ సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్ ఇతర తారాగణం స్థానంలో కొత్తవారు ఉంటారు. ఈ కొత్త వెర్షన్‌కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాత వెర్షన్లో హీరోయిన్గా నటించిన మేఘా చౌదరి స్థానంలో బన్నితా సాంధును ఎంపిక చేశారు టీమ్. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. ఇంతకుముందు వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘అక్టోబర్’లో హీరోయిన్గా నటించారు బన్నిత. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘అక్టోబర్’ చిత్రంలో నటించడానికి ముందు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారామె. 2016లో గాయకుడు కిశోర్ కుమార్ ‘ఏక్ అజ్నబీ హసీనా’ అనే పాటను రీ–క్రియేట్ చేసిన మ్యూజిక్ వీడియోతో ఫేమస్ అయ్యారు బన్నిత. -
అర్జున్ రెడ్డి రీమేక్‌కు హీరోయిన్ ఫిక్స్!
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్‌పుట్‌తో నిర్మాతలు సంతృప్తిగా లేకపోవటంతో సినిమాను మరోసారి కొత్త టీంతో తెరకెక్కించే పనిలో ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా దర్శకుడి పేరు ఫైనల్ చేయని ఈ సినిమాలో హీరోయిన్ను కూడా మార్చేస్తున్నారు. మేఘా చౌదరి స్థానంలో బాలీవుడ్ నటి అక్టోబర్ ఫేం బనితా సందు నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన గిరీషయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. CONFIRMED... #October leading lady Banita Sandhu to star in #Tamil remake of #ArjunReddy... Dhruv Vikram, son of Chiyaan Vikram, to essay the title role. pic.twitter.com/QPM4FYenuT — taran adarsh (@taran_adarsh) 16 February 2019 -
నేనే తప్పుకున్నాను
‘‘దర్శకుడు బాలా రూపొందించిన ‘వర్మ’ చిత్రం మాకు సంతృప్తికరంగా లేదు. సినిమాను మళ్లీ మొదటి నుంచి చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ4 ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ పేర్కొంది. అయితే బాలా లాంటి దర్శకుడుని తప్పించడమేంటి? అనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్ విక్రమ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘వర్మ’ కొత్త ప్రాజెక్ట్‌ను దర్శకుడు గౌతమ్ మీనన్ టేకప్ చేస్తారని టాక్. -
‘వర్మ’ వివాదంపై స్పందించిన బాలా
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నిర్మాతలు సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలా ఇచ్చిన ఫస్ట్ కాపీ సంతృప్తిగా లేకపోవటంతో మరో దర్శకుడితో సినిమాను రీ షూట్ చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్శకుడు బాలా స్పందించారు. ప్రాజెక్ట్ నుంచి తనను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన బాలా అందుకు సాక్ష్యాలుగా నిర్మాణ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
వివాదాస్పద చిత్రంలో జాన్వీ?
వివాదాస్పద చిత్రంలో నాయకిగా అతిలోకసుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీకపూర్ నటించనుందా? జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల చాలానే చర్చ జరుగుతోంది. ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ హిందీ చిత్రం పింకూను తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అజిత్ కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ద్వారా జాన్వీ కోలీవుడ్‌కు పరిచయం కానుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ గురించి మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది. వర్మ చిత్ర వ్యవహారం తెలిసిందే. తెలుగు సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డికి రీమేక్‌గా తమిళంలో బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, మళ్లీ పూర్తిగా రీషూట్ చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అతని తొలి చిత్రమే ఇలా అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్మ చిత్రాన్ని తెరకెక్కించింది సాధారణ దర్శకుడు కాదు. తమిళ సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలను అందించిన జాతీయ అవార్డులను తమిళ సినిమాకు అందించిన దర్శకుడు బాలా. అలాంటి దర్శకుడిని ఇది అవమానించే చర్చగా భావిస్తూ పలువురు దర్శకులు ఆయనకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియదు. వర్మ చిత్ర నిర్మాత మాత్రం ఆ చిత్రాన్ని రీషూట్ చేయడానికి ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్, 96 చిత్రం ఫేమ్ సీ ప్రేమ్‌కుమార్, మలయాళ సినీ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్, బిజాయ్ నంబియార్‌లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే వర్మ చిత్రంలో ధృవ్‌నే మళ్లీ నటిస్తాడని నిర్మాతలు పేర్కొన్నారు. అతనికి జంటగా నటించిన బెంగాలీ బ్యూటీ మేఘా చౌదరి పరిస్థితినే అర్థం కావడం లేదు. ఆమె పాత్రలో ఇప్పుడు శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాన్వీ వివాదాస్పదంగా మారిన అర్జున్‌రెడ్డి రీమేక్‌లో నటించడానికి అంగీకరిస్తుందా? అన్నది వేచి చూడాలి. -
ప్రేమలో పడిపోయా : విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ రోజు రోజుకి తన ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. కేవలం ఒక సెక్షన్‌కే పరిమితమై పోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యూత్‌లోనే కాదు చిన్నారుల్లోనే విజయ్‌కి మంచి ఫాలోయింగ్. తాజాగా ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఇద్దరు తెలుగు చిన్నారులు విజయ్ దేవరకొండకు గురంచి మాట్లాడుతున్న వీడియోపై ఈ యంగ్ హీరో స్పందించాడు. డియర్ కామ్రేడ్ షూటింగ్ లో గాయపడిన విజయ్ ఫోటోను చూస్తూ ‘విజయ్ దేవరకొండ డాక్టర్ దగ్గరికి వెళ్లు’అంటూ ఇద్దరు చిన్నారు ముద్దు ముద్దుగా మాట్లాడిన వీడియోను వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన విజయ్ ‘ప్రేమలో పడ్డా.. నాకు డాక్టర్ అవసరం లేదు. మిమ్మల్ని కలవాలనుంది. కలుస్తారా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. వెంటనే స్పందించిన చిన్నారుల తండ్రి ‘మా పిల్లలు నిన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ శనివారం మేం హైదరాబాద్ వస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. I Just fell in ❤ Vijay Konda doesn't need a doctor, but he would love to meet you two. Will you? https://t.co/82jhgz1Drl — Vijay Deverakonda (@TheDeverakonda) 7 February 2019 -
కోలీవుడ్‌కూ అర్జున్‌రెడ్డిగా..
సినిమా: టాలీవుడ్లో క్రేజీ కథానాయకుడిగా వెలుగొందుతున్న యువ నటుడు విజయ్‌దేవరకొండ. అక్కడ ఈయన సినీ జీవితంలో అర్జున్‌రెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంత సంచలన విజయాన్ని ఆ చిత్రం సాధించింది. ఇప్పుడు అదే చిత్రం విక్రమ్ వారసుడు ధ్రువ్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్‌దేవరకొండ నటించిన గీతగోవిందం చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆయన నటించిన మరో చిత్రం ద్వారకా. ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా నటి పూజాజవేరి నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేఖవాణి పృథ్వీరాజ్ నటించారు. శ్రీనివాస రవీంద్ర కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయ్కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని జీఆర్.వెంకటేశ్ భాగ్య హోమ్స్ సంస్థ సమర్పణలో శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలాజి తమిళ ప్రేక్షకులకు అర్జున్‌రెడ్డి పేరుతో అందించనున్నారు. ఈయన ఇంతకు ముందు నంబర్ 1, బిజినెస్మెన్, హలో వంటి చిత్రాలను అనువదించారు. అర్జున్‌రెడ్డి చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రం తెలుగులో ద్వారకా పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించిందన్నారు. తెలుగులో విజయ్‌దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం సంచలన విజయాన్ని సాధించిందని తెలిపారు. అదేవిధంగా ఆయన నోటా చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు ప్రేక్షకులకు దగ్గర అయ్యారని, తాజాగా తమ అర్జున్‌రెడ్డి తమిళ ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంటూ కమర్శియల్ ఫార్ములాలో తెరకెక్కిన అర్జున్‌రెడ్డి చిత్రం తమిళ ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత బాలాజి తెలిపారు. -
బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి
అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఎస్.ఎ. రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది. అనాథ అయిన అర్జున్ బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. శ్రీవెంకట్ పాటలకు చక్కని స్పందన వచ్చింది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరరావు కథ చెప్పగానే విభిన్నంగా ఉందనిపించింది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. మంచి విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి రెడీ. నేటి జనరేషన్లో రాజమౌళి మాత్రం విలన్ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ‘బాహుబలి’లో హీరో ప్రభాస్ కాదు.. రానా. ఆయన పాత్ర అంత బాగుంది’’ అన్నారు. -
సినిమా షూటింగ్లో ప్రమాదం.. వ్యక్తి మృతి
డెహ్రాడూన్ : షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘కబీర్ సింగ్’ టీమ్ విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్ సెన్సేషన్ మూవీ అర్జున్ రెడ్డికి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముస్సోరీలో షూటింగ్ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేస్తోంది. ఈ క్రమంలో రామ్ కుమార్(35) అనే క్రూ మెంబర్ ప్రమాదవశాత్తు జనరేటర్లో చిక్కుకుని చనిపోయాడు. జనరేటర్లో నీటి లెవల్ చెక్ చేస్తున్న సమయంలో అతడి మఫ్లర్ జనరేటర్ ఫ్యాన్‌కు చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా రామ్ కుమార్ మృతి పట్ల కబీర్ సింగ్ యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. రామ్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం. అతడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో షాహిద్ సరసన ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్
2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్టార్ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం 100% లవ్ తమిళ రీమేక్‌తో పాటు కల్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 118 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా తెరకెక్కుతున్న బాంఫాడ్ సినిమాలో షాలిని హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రంజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
ఈ బుడ్డోడు ఇప్పుడు సెన్సేషనల్ స్టార్..!
ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగా ఉంది కదు. అవును ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ ఆలోచననే మార్చేసిన హీరో. తన యాటిట్యూడ్‌తో అమ్మాయిల మనసు గెలుచుకున్న రౌడీ. ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ చిన్ననాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 1999లో ఓ టీవీ సీరియల్లో షావుకారు జానకితో కలిసి విజయ్ నటించిన వీడియోను ఓ అభిమాని విజయ్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియ పేజ్‌లో పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ వీడియోను పోస్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. My childhood trends so much 😂 that little fellow is also a star - even I am watching it on loop. Whoever found this you made my mum's day, mine and so many others. https://t.co/EEE9Rkq6uo — Vijay Deverakonda (@TheDeverakonda) 21 January 2019 -
క్రైమ్ డ్రామాలో సూపర్ స్టార్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా రొమాంటిక్ డ్రామా అన్న ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు మహేష్ ఓకె చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. మహేష్ కోసం డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేశాడట. మహేష్ ఇంతవరకు చేయని క్రైమ్ డ్రామా తరహా కథను సూపర్ స్టార్ కోసం రెడీ చేశాడట. ఇప్పటికే కథ విన్న మహేష్ ఓకె చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే సుకుమార్ సినిమా తరువాత సందీప్ సినిమానే పట్టాలెక్కే అవకాశం ఉంది. -
ప్లే బాయ్‌గా ‘అర్జున్ రెడ్డి’..!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ యంగ్ హీరో టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గీత గోవిందంలో మరో ఘనవిజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్ మరో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. రాశీఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్ తరహా పాత్రో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
‘అర్జున్ రెడ్డి’ నటితో విశాల్ పెళ్లి!
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో హీరో విశాల్ వివాహం చేయబోతున్నామని ఇటీవల ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాల్ పెళ్లి చేసుకోబోయే అనీషా ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరిచారు. అయితే వారందరి కోసం సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా. విశాల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్ బిజినెస్‌మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన ఆమె.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు. గతంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై విశాల్ స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు. ఇది మంచిది కాదు. ఇది నా వ్యక్తిగత జీవితం. నా పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించడం కంటే సంతోషం ఎముంటుంది.. త్వరలోనే ఆ వివరాలు ఆనందంగా ప్రకటిస్తాన’ని ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Happy Sankranti! To the start of something new. Thank you all for everything you've done; Been a part of my growth, my learning, my observations, my inspiration, my truth, my hurt, my strength, my reason or all that has brought me to where I am today, who I am today. Soon enough, I will be on a new journey and I yearn to live up to all of my dreams and goals and the challenges I have put up for myself. I finally found somebody to go down the path of life with, loving him and life with true passion. I look up to this man for all that he stands for and for all of his heart. I vow to give back to him, the families and the people around with this step forward. I vow to be the best that I can be, intention towards collective learning, love and moral value. #LoveAlways A post shared by Anisha Alla (@bluewatermelon17) on Jan 15, 2019 at 4:13am PST -
ఆ బయోపిక్‌లో విజయ్ దేవరకొండ లేడట..!
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్లో కూడా విజయ్‌కి మంచి క్రేజ్ రావటంతో బాలీవుడ్ ఎంట్రీపై కూడా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. 83లో విజయ్ దేవరకొండ నటించటం లేదని తెలుస్తోంది. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తే హీరోగానే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న విజయ్, కపిల్ బయోపిక్ ఆఫర్‌కు నో చెప్పటంతో ఆ పాత్రకు తమిళ యువ కథానాయకుడు జీవాను తీసుకున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. -
అర్జున్ రెడ్డి దర్శకుడితో ఎన్టీఆర్..!
ఒక్క సినిమాతోనే క్రేజీ డైరెక్టర్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సందీప్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాదించటంతో పాటు సినీ ప్రముఖులు స్టార్ హీరోల ప్రశంసలు సాధించింది. దీంతో సందీప్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు దర్శకులు క్యూ కట్టారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ ఖాన్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సందీప్, ఇంత వరకు తెలుగు సినిమాను ప్రకటించలేదు. కొద్ది రోజులుగా మహేష్ బాబు హీరోగా సందీప్ సినిమా ఉంటుదన్న టాక్ గట్టిగా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం సందీప్.. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్‌కు కథ కూడా వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సందీప్ సినిమా ఉండే చాన్స్ ఉంది. -
బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సక్సెస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న ఈ క్రేజీ హీరో బాలీవుడ్ సినిమాలో ఆఫర్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. విజయ్ క్రేజ్ దృష్య్టా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కాయం అన్న ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారట. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఆ జనరేషన్‌కు చెందిన ఓ క్రికెటర్ పాత్రకు విజయ్ను సంప్రదించారు. అయితే బాలీవుడ్ లో హీరోగానే ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్న విజయ్ క్యారెక్టర్ రోల్స్ చేయటం కరెక్ట్ కాదన్న ఆలోచనలో సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. -
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడికి నో చెప్పిన శర్వా
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే ఒక్క హిట్ ఇచ్చిన దర్శకుడు వెంటనే బిజీ అయిపోతాడు. అదే ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే ఆ దర్శకుడి రేంజే మారిపోతుంది. అలా టాలీవుడ్‌కు సెన్సేషన్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి చిత్రం అర్జున్ రెడ్డితో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సందీప్. ఈ సినిమా సక్సెస్‌తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఆఫర్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ సినిమా చేసే చాన్స్కొట్టేశాడు. అయితే ఇంత క్రేజ్ ఉన్న దర్శకుడికి నో చెప్పాడు యంగ్ హీరో శర్వానంద్. అసలు అర్జున్ రెడ్డి సినిమా శర్వానంద్ చేయాల్సింది. కథ నచ్చినా కొన్ని కారణాలవల్ల శర్వా ఆ సినిమా చేయలేదు. అయితే తరువాత మరో కథతో సందీప్.. శర్వాను కలిసినా ఆ ప్రాజెక్ట్‌కు కూడా నో చెప్పాడట శర్వానంద్. ప్రస్తుతం పడి పడి లేచే మనసు సినిమా ప్రమోషన్లో భాగంగా శర్వానంద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు కథ నచ్చటంతో పాటు. ఆ క్యారెక్టర్లో తాను కంఫర్టబుల్‌గా ఫీల్ అయితేనే నటిస్తానని క్లారిటీ ఇచ్చాడ శర్వానంద్. శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఇప్పటికే మంచి సక్సెస్ సాధించటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. -
ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తరువాత కూడా గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేస్తున్న విజయ్ తాజాగా ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీల లిస్ట్‌ను రిలీజ్ చేసింది ఫోర్బ్స్. ఈ లిస్ట్‌లో 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్‌జాబితాలో స్థానం సంపాదించడం కూడా ఓ రికార్డ్‌గానే చెపుతున్నారు ఫ్యాన్స్. ఈ లిస్ట్ సౌత్ నుంచి అగ్రస్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిలవగా పవన్ కల్యాణ్, విజయ్, ఎన్టీఆర్, విక్రమ్, మహేష్ బాబు, సూర్య, విజయ్ సేతుపలి లాంటి తారలు ఉన్నారు. ఈ లిస్ట్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతారకు కూడా చోటు దక్కటం విశేషం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు. -
బాలీవుడ్‌కి అతిథిగా..!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో మెప్పించిన విజయ్ నోటా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అదే జోరులో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటంతో అక్కడ కూడా విజయ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పట్లో బాలీవుడ్ లో హీరోగా ఆలోచన చేసే ఆలోచన విజయ్‌కు లేదని తెలుస్తోంది. కానీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో విజయ్ కనిపించనున్నాడట. ఓ భారీ చిత్రంలో విజయ్ అతిధి పాత్రలో కనిపించటం కన్ఫామ్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2020లో రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. మరి విజయ్ నటిస్తున్న ఆ బాలీవుడ్ మూవీ ఎదో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ సెకండ్ లుక్
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈసినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమాలో షాహిద్ కపూర్‌కు సంబంధించిన రఫ్ లుక్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. షాహిద్ గుబురు గడ్డంతో ఉన్న స్టిల్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా మరో లుక్కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. సినిమాలో కాలేజ్‌కు సంబంధించిన సీన్స్‌లో షాహిద్ క్లీన్ షేవ్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. క్లీన్ షేవ్‌తో ఇంటెన్స్‌గా కనిపిస్తున్న షాహిద్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 జూన్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. -
అర్జున్ రెడ్డి ఈజ్ కబీర్ సింగ్
‘అర్జున్ రెడ్డి’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బిగించి ఉన్న పిడికిలిని లవ్ సింబల్‌గా చేసి ఉన్న గుర్తుతో ఉన్న టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘‘అర్జున్‌రెడ్డి’ ని ప్రేమించారు, అభినందించారు. ఇప్పుడు ‘కబీర్ సింగ్’ వంతు వచ్చింది. వేచి చూడండి’’ అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. -
‘కబీర్ సింగ్’గా ‘అర్జున్ రెడ్డి’
విజయ్ దేవరకొండ హీరో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సక్సెస్‌తో విజయ్ స్టార్‌గా మారిపోయాడు. అంతేకాదు దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా అర్జున్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాలో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. హిందీ వర్షన్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు సందీప్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. -
ఓ ఇంటివాడవుతున్న యువ కమెడియన్..!
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా తనదైన స్టైల్లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాహుల్. తన సోషల్ మీడియా పేజ్‌లో బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్ చేశాడు. రాహుల్ కు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్, కమెడియన్ వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ రామన్ లు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Psst.. I’m getting married on January 15th. Don’t tell anyone. Seriously. pic.twitter.com/fx4mVulayv — Rahul Ramakrishna (@eyrahul) 22 October 2018 -
జూనియర్ దేవరకొండ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..!
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల సక్సెస్ తో విజయ్ దేవరకొండ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాడు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా సినిమా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రారంభం కానుంది. షార్ట్ ఫిలింస్‌తో సత్తా చాటిన కేవీఆర్ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
అలియాస్ ప్రీతి
బాలీవుడ్లో ఇప్పుడందరూ కథానాయిక కియారా అద్వానీని ప్రీతీ.. ప్రీతీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె నెక్ట్స్ సినిమాలో ప్రీతి అనే క్యారెక్టర్ చేయబోతున్నారు. తెలుగులో సూపర్‌హిట్ సాధంచిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలో రీమేక్ అవ్వనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారు. తెలుగులో హీరో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ చేయనున్నారు. అలాగే హీరోయిన్ షాలిని పాండే రోల్ (ప్రీతి)ను ఫైనల్‌గా కియారా అద్వానీ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది టీమ్. ‘‘హిందీ ‘అర్జున్‌రెడ్డి’కి హీరోయిన్ దొరికింది. కియారా అద్వానీ అలియాస్ ప్రీతికి స్వాగతం’’ అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. ‘‘వన్నాఫ్ మై ఫెవరెట్ ఫిల్మ్స్‌లో ‘అర్జున్‌రెడ్డి’ కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీక్రియేట్ చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. అమేజింగ్ టీమ్ కుదిరింది. ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు కియారా. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అవుతుందని బాలీవుడ్ టాక్. -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌లో క్రేజీ భామ!
టాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఈ సినిమాలో తన నటనతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఇక ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డిని పలుభాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ్లో ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తోండగా.. బాలీవుడ్లో షూటింగ్‌కు రెడీ అవుతోంది. సందీప్ వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో షాహిద్ కపూర్ నటించగా, హీరోయిన్గా కియారా అద్వాణీ నటించబోతున్నట్లు సమాచారం. భరత్ అనే నేను సినిమాతో తెలుగులో పరిచయమైన ఈ భామ ప్రస్తుతం రామ్‌చరణ్-బోయపాటి కాంబినేషన్లో రాబోతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కియారా అద్వాణీ రీసెంట్గా వచ్చిన ‘లస్ట్ స్టోరిస్’ వెబ్ సిరీస్‌లో నటించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
విరాళంగా తొలి పారితోషికం
పెరంబూరు: నవ నటుడు ధృవ్ తన తొలి పారితోషికాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం అందించారు. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్ అమెరికాలో నటనలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ్ తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. తండ్రి విక్రమ్‌కు సేతు చిత్రం ద్వారా నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు బాలానే ధృవ్ తొలి చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇటీవల వరద బీభత్సంతో కేరళ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆర్థికంగా, ఇతరత్రా సాయం చేశారు. తాజాగా ధృవ్ వర్మ చిత్ర హీరోగా అందుకున్న పారితోషికాన్ని వరద బాధితుల సహాయార్థం అందజేసి దాతృత్వం చాటుకున్నాడు. ఆయన కేరళ సీఎం పినరాయి విజయన్ను సోమవారం కలిసి తన తొలి చిత్ర పారితోషికాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయనతో పాటు వర్మ చిత్ర నిర్మాత ముఖేశ్ ఆర్.మెహతా, ఏవీ.అనూప్ ఉన్నారు. ఇప్పటికే ధృవ్ తండ్రి, నటుడు విక్రమ్ కేరళ వరద బాధితులకు సహాయంగా రూ.35లక్షలను అందించిన విషయం తెలిసిందే. -
వర్మ వచ్చేశాడు
తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ‘వర్మ’లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించారు. ఇందులో బెంగాలీ మోడల్ మేఘా చౌదరి కథానాయికగా నటించారు. ఈశ్వరీరావ్, రైజా విల్సన్, ఆకాశ్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి రధన్ స్వరకర్త. ఆదివారం ధృవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేశారు. అలాగే ‘వర్మ’ తెలుగు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టీమ్. సో... ‘వర్మ’ చిత్రం తెలుగులో కూడా ఏమైనా డబ్ అవుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే హిందీ ‘అర్జున్‌రెడ్డి’లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్‌ని తెరకెక్కించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ రీమేక్‌కి దర్శకుడు. ఈ చిత్రానికి ముందుగా తారా సుతారియాను హీరోయిన్గా అనుకున్నారు. కానీ డేట్స్ కుదరక వీలు పడలేదట. ఇప్పుడీ పాత్రను కియారా అద్వానీ చేయబోతున్నారని బాలీవుడ్ లేటెస్ట్ టాక్. -
‘అర్జున్ రెడ్డి’ తమిళ్ టీజర్ వచ్చేసింది!
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ పలు భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్‌లో అర్జున్ రెడ్డి రీమేక్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్లో సందీప్ వంగా డైరెక్షన్లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోంది. తమిళ్లో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా అర్జున్ రెడ్డిని ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ బాలా.. ఈ రీమేక్‌ను తమిళ నేటీవిటికి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మరి ఈ రీమేక్ కోలీవుడ్‌లో సంచలనం సృష్టించి..ధృవ్‌ని కూడా ఓవర్‌నైట్ స్టార్ చేస్తుందో లేదో చూడాలి. Teaser of #Varma Introducing #DhruvVikram#Bala Film#E4Entertainment Mukesh R Mehta #VarmaTeaser #HBDDhruvVikram https://t.co/o2cAyAGWQS@e4echennai @filmmakerbala @iammegha_c @raizawilson@radhanmusic @onlynikil pic.twitter.com/MZrdJG6f7u — BARaju (@baraju_SuperHit) 23 September 2018 -
బాలీవుడ్‌కు విజయ్ దేవరకొండ..!
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. గీత గోవిందంతో మరోసారి సత్తా చాటాడు. ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో దర్శక నిర్మాత విజయ్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నోటా తో పాటు టాక్సీవాలా సినిమాల్లో నటిస్తున్న విజయ్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడట. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, కృష్ణ డికెలు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్లో షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గోన్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ దర్శకద్వయం తాజా స్త్రీ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. తెలుగులో ఢీ ఫర్ దోపిడి సినిమాకు దర్శకత్వం వహించారు. -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ పూర్తయ్యింది..!
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగాని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా టాలీవుడ్లో ఎంతటి సంచలన సృష్టించిందో అందరికి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి తరువాత ఘన విజయం సాధించటంతో అర్జున్ రెడ్డి రీమేక్ కోసం భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా తమిళ రీమేక్‌తో విక్రమ్ తనయుడు ధ్రువ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకుడు. చెన్నై తో పాటు నేపాల్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాలు జరుపుకుంటున్న వర్మ టీం త్వరలో ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌కు సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తుండగా షాహిద్ కపూర్ గా హీరోగా నటించనున్నాడు. -
ఇక మాలీవుడ్‌లోనూ!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా టాలీవుడ్లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో బాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరో. అలాగే షాహిద్ కపూర్ హీరోగా హిందీ ‘అర్జున్ రెడ్డి’ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగానే ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మలయాళంలో కూడా రీమేక్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మల్లూ అర్జున్‌రెడ్డి ఎవరు? అనే విషయం పై మాలీవుడ్‌లో చర్చ జరగడం ఖాయం. -
డేట్ రెడీ
బాలీవుడ్ అర్జున్ రెడ్డి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి డేట్ రెడీ చేసుకున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయితే ఇక నో బ్రేక్స్ అంటున్నారు. గతేడాది తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. పలుమార్లు డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న స్టార్ట్ కానుంది. ఈ క్యారెక్టర్ కోసం మరింత గడ్డం పెంచడానికి టైమ్ తీసుకున్నారు షాహిద్ కపూర్. తొలుత ఈ సినిమాలో తారా సుతారియాని హీరోయిన్గా అనుకున్నారు కానీ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ నుంచి హీరోయిన్ అవుట్
టాలీవుడ్ సెన్సేషన్ హిట్ అర్జున్ రెడ్డి కోలీవుడ్, బాలీవుడ్‌లలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ రీమేక్‌కు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యువ కథానాయకుడు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించేందుకు ఓకె చెప్పారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు హీరోయిన్ తారా షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ భామ టైగర్ ష్రాఫ్ సరసన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటంతో అర్జున్ రెడ్డి రీమేక్‌కు డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నారట. అయితే మరో కారణం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే బోల్డ్ క్యారెక్టర్ చేయటం కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తారా తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి భారీ వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్‌కు బాల దర్శకత్వం వహిస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ ఫొటో
గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో హీరోగా విజయ్, దర్శకుడిగా సందీప్ ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిపోయారు. అర్జున్ రెడ్డి రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ ఆసక్తికర ఫొటోనూ ట్వీట్ చేశారు. గ్లౌస్ ధరించి ఉన్న చేతికి బాగా రక్తం అంటి ఉండటం, అదే చేత్తో సిగరెట్ తాగుతున్న ఫొటోను విజయ్ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు, అర్జున్ రెడ్డి కోసం తీసిన తొలి ఫొటో అని కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ సరసన షాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ ప్రస్తుతం తమిళ్లో వర్మగా రీమేక్ అవుతుండగా బాలీవుడ్ లో సందీప్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 1 year! Until next time me and @imvangasandeep meet, you'll have to make do with this. #ArjunReddy P.S. This was the first picture we took. pic.twitter.com/HZGVRRxek0 — Vijay Deverakonda (@TheDeverakonda) 25 August 2018 -
బ్రేకప్ లవ్‌స్టోరీ
అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే జంటగా కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉప శీర్షిక. ఎస్.ఏ. రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి. చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. రిలీజ్ తర్వాత ఇందులోని మెసేజ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి వినోదాత్మక చిత్రాలను కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘వినాయక్ వంటి దర్శకులు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి మెచ్చుకోవడం గర్వంగా ఉంది. ‘కష్టపడి జీవితంలో పైకి వచ్చేవాడు లక్కీ ఫెలో. ఇతరుల కష్టంతో ఓసీగా బతుకుతూ పేదవాడిగా, బిచ్చవాడిగా జీవించేవాడు అన్ లక్కీఫెలో’ అనే ఫిలాసఫీ ఆధారంగా సినిమాను తెరకెక్కించాం. సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’’ అని బి. చంద్రశేఖర్‌రావు అన్నారు. -
గడ్డం కహానీ!
గడ్డం ఫుల్‌గా పెరగనిదే సెట్స్‌లోకి రానని చెప్తున్నారట షాహిద్ కపూర్. ఎందుకంటే తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో ఆయన హీరోగా నటించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే హిందీ కూడా చేయనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈపాటికే స్టార్ట్ కావాల్సింది. క్యారెక్టర్ దృష్ట్యా హీరో గడ్డం పెంచాల్సి ఉంది. కానీ షాహిద్‌కు గుబురు గడ్డం రావడానికి ఇంకా టైమ్ పడుతుందట. డూప్లికెట్ గడ్డంతో ప్రొసీడ్ అవుదామన్నా ఒరిజనలే ముద్దు అని ఫిక్సయ్యారట. అందుకే ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ఆరంభమవుతుంది. ఫైనల్లీ ఈ నెల 20న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన తర్వాత షాహిద్ బ్రేక్ తీసుకుంటారట. ఆయన సతీమణి మీరా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అవుతుండటమే ఇందుకు కారణం. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. హిందీ ‘అర్జున్ రెడ్డి’ వచ్చే ఏడాది జూన్ 21న థియేటర్స్‌లోకి వస్తాడట. -
‘అర్జున్ రెడ్డి’ మొదలవుతోంది!
అర్జున్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమాతోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్‌లు ముందుకు వచ్చాయి. కోలీవుడ్‌లో విక్రమ్ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ..విలక్షణ దర్శకుడు బాలా తమిళ్లో అర్జున్ రెడ్డిని ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీవుడ్లో ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ టైటిల్‌తో.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుందని, అంతే కాకుండా.. వచ్చే ఏడాది జూన్ 21న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #BreakingNews: #ArjunReddy to release on 21 June 2019... Stars Shahid Kapoor... Directed by Sandeep Vanga... Produced by Bhushan Kumar, Murad Khetani, Krishan Kumar and Ashwin Varde... Filming begins Aug 2018... Remake of Telugu hit #ArjunReddy. — taran adarsh (@taran_adarsh) 31 July 2018 -
‘ఉయ్యాల జంపాల’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో బ్రేక్
గుంటూరు, తెనాలి: సినిమా పాటతో చదువుకునే రోజుల్నుంచి ప్రయాణం కట్టాడో యువకుడు. పాటను పలవరిస్తూ, కలవరిస్తూ, పాటే జీవితమనుకున్నాడు. తెలుగు సినిమా వేదికగా నిరూపించుకోవాలని కలలుగన్నాడు. చదువు పూర్తవగానే తన కలలు నెరవేర్చుకునేందుకు ఓ సుముహూర్తాన హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగాయి. ఒకే ఏడాది పది సినిమాలకు పాటలు రాసే ఘనతను పొందాడు. ఉయ్యాల జంపాల, మజ్నూ, అర్జున్‌రెడ్డి సినిమాలతో యువతరానికి దగ్గరైన ఆ గీత రచయిత గోసాల రాంబాబు. సాదాసీదాగా మన పక్కింటి కుర్రోడిలా కనిపించే ఆ యువకుడి కలం అన్ని రకాల ఎమోషన్లను ప్రతిబింబించే పాటలు రాస్తుందన్న ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమా పాటల నిమిత్తం తెనాలి వచ్చిన రాంబాబు పాటతో తన ప్రయాణాన్ని ఇలా వివరించారు. ఈ ఏడాది పది సినిమాలు... టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్‌రాజా దర్శకత్వంలో తీస్తున్న ‘పండుగాడి ఫొటోస్టూడియో’ సినిమాకు పాటలు రాస్తున్నా. యాజమాన్య సంగీత దర్శకత్వంలో నాలుగు పాటలు రికార్డయ్యాయి. మొత్తం అయిదుపాటలు. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉంటాయి. చివరిపాట టైటిల్సాంగ్పై డిస్కషన్‌కు తెనాలి వచ్చాను. గ్రామీణ నేపథ్యంలోని కథ, చక్కని కామెడీతో జంధ్యాల మార్కు సినిమాలో పాటలు రాయడం మంచి అవకాశం. సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాట ఏ విధంగా ఉండాలనేది దర్శకుడు సూచించారు. యాజమాన్య అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ సినిమా ‘తేజ్ ఐ లవ్ యూ’తో ఈ ఏడాది నేను పాటలు రాసిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. మరో నాలుగు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి ఇంకో మూడు సినిమాలకు పాటలు రాస్తున్నా. మొత్తంమీద ఈ ఏడాది పది సినిమాలకు రాసినట్టవుతుంది. యువతరానికి దగ్గర చేసిన సినిమాలు... నిజానికి 2007 నుంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతూ పాటలు రాస్తున్నా. తొలి గుర్తింపు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వచ్చింది. రాజ్‌తరుణ్, అవికాగోర్ నటించిన ఈ సినిమాకు విరించివర్మ దర్శకుడు. ‘నిజంగా... అది నేనేనా/ ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే’ అన్న పాట నేనొకడిని ఉన్నానని జనానికి తెలియజేసింది. ఇదే దర్శకుడు నానీతో తీసిన ‘మజ్నూ’లో ‘జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే’ లవ్ మెలోడీ సాంగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ పాట చరణంలోని ‘వాలు కనులలోన దాచేసినావా/ ఆ నింగిలోన లేదు నీలం’ చక్కని భావగీతంగా భుజం తట్టారు. అన్నిటికీ మించి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నన్ను యువతరానికి బాగా దగ్గర చేసింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే లవ్ బ్రేకప్ పాటతో సినిమా ఆరంభమవుతుంది. అదే సినిమాలో క్లైమాక్స్‌లో కథంతా చెబుతున్నట్టుగా ‘ఊపిరాడుతున్నదే ఉన్నపాటుగా ఇలా...దారేంటో తోచకున్నదే నిన్ను చూడగా ఇలా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్. ఆ రెండు పాటలు రాసే అవకాశం నిజంగా నా అదృష్టమే. మరో పది సినిమాల్లో అవకాశాలను తెచ్చింది. ఈ సినిమాతోనే నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసింది. పాటతో ప్రయాణం రేడియోతోనే... మా స్వగ్రామం ఏలూరు దగ్గర్లోని కృష్ణాజిల్లా గ్రామం వేల్పుచర్ల, సాధారణ పల్లెటూరు. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, దానయ్య. వ్యవసాయ కూలీ కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడినప్పటికీ నన్నూ, తమ్ముడినీ, చెల్లెలినీ చదివించారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చేశాను. పాటపై మమకారం పెరగడానికి కారణం ఇంట్లో రేడియో. తాతయ్య అమ్మకు కొనిచ్చారట. ఇంట్లో ఉన్నంతసేపు రేడియోలో పాటలు వింటూ హమ్ చేసేవాడిని. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నాలుగు కి.మీ దూరంలోని హైస్కూలుకు వెళ్లేవాడిని. తర్వాత ఇంటర్, ఇంజినీరింగ్ ఏలూరులో. బస్టాండులో పాటల పుస్తకాలు కొనుక్కుని, అందులో పాటలు పాడుకుంటూ ప్రయాణించేవాడిని. మధ్యమధ్యలో నేనే సొంతంగా పాటలు అల్లుతూ వచ్చాను. ఆ రకంగా పాఠ్యపుస్తకాలతో పాటు పాటతో నా విద్యార్థి జీవితం గడించింది. తర్వాతి జీవితం పాటతోనే సాగించాలనుకుంటూ, 2007లో చదువైపోగానే హైదరాబాద్ బయలుదేరి వెళ్లా. ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి దగ్గర పనిలో చేరడం నా అదృష్టం. అద్భుతమైన ప్రతిభామూర్తి, అర్ధగంటలో పాట రాసేవారు. నేను చేరిన ఆర్నెల్ల తర్వాత ఆయన కాలం చేశారు. 30 సినిమాల్లోవంద పాటలు... 2007లో ఉదయ్‌కిరణ్, శ్రీహరిల ‘వియ్యాలవారి కయ్యాలు’ నా తొలి సినిమా. రమణ గోగుల సంగీత దర్శకుడు. నేను అనుకున్న ట్యూన్‌లోనే పాటని కంపోజ్ చేయడం మంచి అనుభూతి. తర్వాత ‘టిక్‌టిక్‌టిక్’, ‘లవ్ చేస్తున్నా’ వంటి సినిమాలకు రాస్తూ వచ్చాను. ఉయ్యాల జంపాల తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ‘బందిపోటు’కు ‘ఏదో మాయవై ఉన్నాదే మనసాగనన్నాదే’ మెలోడీ పాట రాశా.మజ్నూ తర్వాత జగపతిబాబు హీరోగా తీసిన ‘పటేల్ సార్’ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. పద్మాలయ మల్లయ్యగారు కుమారుడు హీరోగా తీసిన సినిమాలో ‘ఓ సజనా ఓ సజనా’ రాశాను. శ్రీకాంత్ ‘నాటుకోడి’లో ‘కన్ను పడిందే, కన్ను పడిందే నీపై నా కన్ను పడిందే’ మాస్ మసాలా పాట రాయించారు. సాయిధరమ్ తేజ సినిమాలో ‘హ్యాపీ ఫ్యామిలీ’ పాటతో ఫ్యామిలీ సాంగ్‌కు అవకాశం లభించింది. ‘ప్రేమెంత పనిచేసెను నారాయణ’, ‘సమీరం’, సీతాపహరణం’ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. మొత్తంమీద 30 సినిమాల్లో వంద పాటలు రాశాను. అందరు హీరోలతో అన్ని రకాల ఎమోషన్లతో రాయాలనేది నా ఆశ... -
బిచ్చగాళ్లు లేని సమాజం కోసం...
‘‘నిర్మాత చంద్రశేఖర్ అన్నీ తానే అయి కె.ఎస్.నాగేశ్వర రావు నుంచి చాలా మంచి ఔట్పుట్ తీసుకున్నారు. భవిష్యత్‌లో తను చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బాగుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ సినిమా మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఎ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, టైటిల్ సాంగ్ ఆలపించిన బాబూమోహన్ విడుదల చేశారు. కె.ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా రిలీజ్ అవుతోన్న మా ‘బిచ్చగాడా మజాకా’ విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అన్నారు. ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఎటువంటి మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు బి.చంద్రశేఖర్. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, శ్రీ వెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.బాషా, లైన్ ప్రొడ్యూసర్ తేజా రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఏ.రెహమాన్. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’తో శేఖర్ కమ్ముల..!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో ధృవ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ధృవ్ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. విక్రమ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన వారసుడ్ని రెండు భాషల్లో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్లో బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ధృవ్, తెలుగులో అందుకు భిన్నంగా ఓ క్లాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధృవ్ టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వేలంలో అమ్ముడుపోయిన ‘అర్జున్ రెడ్డి’ అవార్డు
అర్జున్ రెడ్డి సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా.. దీని ఫీవర్ మాత్రం అంత ఈజీగా తగ్గడం లేదు. ఈ మధ్య వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా అర్జున్ రెడ్డిలా ఉందంటూ పోల్చేస్తున్నారు. అంతగా ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌పై తన ముద్రను వేశాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటించిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందే. అర్జున్ రెడ్డి పాత్రకు గాను ఉత్తమ నటుడిగా తను అందుకున్న మొదటి ఫిలింఫేర్ అవార్డను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ అవార్డును వేలం వేయగా దివి ల్యాబరేటరీస్ సొంతం చేసుకుంది. వేలం వేయగా వచ్చిన 25లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. గతకొన్ని రోజులుగా ఒంటిపై షర్ట్ లేకుండా కేవలం జీన్స్ వేసుకుని ఉన్న ఫోటోలను షేర్ చేస్తోన్న విజయ్.. ‘రౌడీ వియర్స్’ బ్రాండెడ్ జీన్స్‌ను ఆదివారం లాంచ్ చేశారు. -
ధ్రువకు జోడీ కుదిరింది!
తమిళసినిమా: కొన్ని చిత్రాలకు కథానాయికలు త్వరగా దొరకరు. కారణం దర్శక నిర్మాతలకు నచ్చకపోవడం కావచ్చు. కథానాయకులకు సెట్ కాకపోవచ్చు. ఆయా పాత్రలకు నప్పకపోవచ్చు. ఇంకేదైనా కావచ్చు. అలా నవ నటుడు ధ్రువ విక్రమ్‌కు జంటగా నటించే హీరోయిన్ కోసం కొన్ని నెలలుగా అన్వేషణ జరుగుతోంది. ధ్రువ విక్రమ్ అనగానే అతను హీరో విక్రమ్ వారసుడని ఇట్టే అర్థమవుతుంది. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ యువ నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఈ చిత్రం రీమేక్. విజయ్ దేవరకొండ నటించిన పాత్రను తమిళంలో ధ్రువ విక్రమ్ పోషిస్తున్నారు. తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే హీరోయిన్ ఎంపిక కాకుండానే ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు దర్శకుడు బాలా. తెలుగులో శాలినీపాండే నటించిన పాత్రను తమిళంలో పోషించే నటి కోసం చిత్ర యూనిట్ తెగ వెతికింది. పలువురు నటీమణులను పరిశీలించారు. చాలామంది పేర్లు ప్రచారమయ్యాయి కూడా. చివరికి బెంగాలీ బ్యూటీకి ఆ అదృష్టం దక్కింది. బెంగాలీలో పలు టీవీ, మూవీ చిత్రాల్లో నటించిన మేఘాచౌదరి వర్మ చిత్రంలో ధ్రువ్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ బ్యూటీ హిందీ సీరియల్స్‌లోనూ నటించింది. మోడల్‌గా రాణించిన మేఘా చౌదరి తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘చిల్లన్ను ఒరు కాదల్’ చిత్రంలో ఆయన కూతురిగా నటించిందన్నది గమనార్హం. తాజాగా వర్మ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మరి ఇక్కడ కథానాయకిగా ఏ పాటిగా నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలో ప్రారంభం కానున్న వర్మ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్లో మేఘా చౌదరి పాల్గొననుందన్నది తాజా సమాచారం. ఇ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజుమురుగన్ సంభాషణలను రాస్తున్నారు. -
జాన్వీ.. అర్జున్‌రెడ్డి ఎలా మిస్సయ్యింది?
టాలీవుడ్ సెన్సేషన్ మూవీ అర్జున్‌రెడ్డి బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్-తార సుటారియా జంటగా మాతృక దర్శకుడు సందీప్ వంగ ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రం కోసం తొలుత జాన్వీ కపూర్ పేరును పరిశీలించారన్న వార్త ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ‘నిజానికి జాన్వీ కపూర్‌నే అర్జున్ రెడ్డి రీమేక్ కోసం తొలుత సంప్రదించారు. అయితే ప్రముఖ దర్శక-నిర్మాత, ఆమె మెంటర్ అయిన కరణ్ జోహర్ అందుకు ఒప్పుకోలేదు. కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ సినిమాలు చేయటం మంచిది కాదని కరణ్.. జాన్వీకి సూచించాడంట. దీంతో జాన్వీ ఈ ప్రాజెక్టు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారంట. అంతేకాదు తార పేరును కూడా అర్జున్ రెడ్డి రీమేక్‌కు సూచించింది కరణే’ అని ఓ ప్రముఖ బాలీవుడ్ మాగ్జైన్ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ నటించిన ధడక్ ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఇషాన్, జాన్వీలు చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. శశాంక్ ఖైటన్ దర్శకత్వంలో మరాఠీ హిట్ సైరాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ధడక్ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అర్జున్ రెడ్డి’ ఇంటికి వెళ్లిన కేటీఆర్!
అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగారు. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంకా అర్జున్ రెడ్డిని మర్చిపోలేక పోతున్నారు సినీ జనాలు. అర్జున్ రెడ్డి నటనకు గానూ విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. తాజాగా కేటీఆర్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్ ట్విటర్ ద్వారా తెలుపుతూ.. మీ ఇంటికి లంచ్ చేయడానికి మీకు ఇష్టమైన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం.. అసలు ఏం జరుగుతోంది బాసూ.. బేసికల్లి ఏమైనా జరుగొచ్చు. మనకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే...అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. When your favourite Leader comes home for lunch ☺ One second 🤔Asalu em jargutundi bossu? Basically em aina jargochu🤘🏼We just have to keep doing what we love to do. pic.twitter.com/8aZ0qv1NCu — Vijay Deverakonda (@TheDeverakonda) June 24, 2018 -
వరలక్ష్మి మరణానికి అర్జున్‌రెడ్డే కారణం
సాక్షి, కడప అర్బన్ : తన కుమార్తె వరలక్ష్మి మరణానికి అర్జున్‌రెడ్డి అనే వ్యక్తే కారణమని వల్లూరు మండలం బీచువారి పల్లెకు చెందిన వేల్పుచెర్ల మంజులాదేవి కడప రైల్వే పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రారాజు తెలిపారు. పోలీసుల కథనం, మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. వల్లూరు మండలం బీచువారిపల్లెకు చెందిన మంజులాదేవికి, పుల్లారెడ్డితో 31 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమె భర్త పుల్లారెడ్డి మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో వరలక్ష్మి కడప రిమ్స్ ఆవరణంలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 18న ఇంటికి వస్తానని తల్లికి ఫోన్‌చేసి, వార్డెన్ అనుమతి తీసుకుని బయలు దేరి, మరలా తల్లికి ఫోన్ చేసి తాను హాస్టల్లోనే ఉంటానని చెప్పింది. కానీ, అదే రోజు సాయంత్రం తనకు, అర్జున్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తనను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి, ఇపుడు తనకు ఫోన్ చేసి వివాహం చేసుకోనని, తనకు ఇదివరకే వివాహమైందని తెలిపి మోసం చేశాడని పేర్కొంది. తనను చావమన్నాడని.. బెదిరించాడని వరలక్ష్మి, తన తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమెను హాస్టల్లోనే ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈనెల 18న రైలు కిందపడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని రెండు రోజుల తర్వాత గుర్తించిన పోలీసులు మృతురాలి వద్ద ఫోన్ ద్వారా తల్లికి విషయం తెలిపారు. మృతురాలి తల్లి మంజులా దేవి శనివారం కడప రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
క్యాస్టింగ్ కౌచ్‌పై ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాకింగ్ నిజాలు
సాక్షి, సినిమా: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమని ఊపేస్తున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఈ అంశాన్ని నటి శ్రీరెడ్డి తెరపైకి తీసుకొచ్చి పలువురిపై ఆరోపణలు చేస్తూ టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే తాజాగా ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’ సినిమా పాటల రచయిత శ్రేష్ఠ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టారు. శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని తెలిపింది. ఏకంగా ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు ఆమెను పంపే ప్రయత్నం చేశారని తెలిపింది. అదేవిధంగా ఓ మహిళా దర్శకురాలు ఓ వ్యక్తి నిన్ను ఇష్టపడ్డాడని నీకు ప్రపోజ్ చేయడానికి గోవాలో పార్టీ ఏర్పాటుచేశాడని తనతో చెప్పిందని తెలిపారు. కానీ నేను ఆమె మాటలు ఏ మాత్రం లెక్కచేయకపోవడంతో.. ఆ వ్యక్తి శ్రేష్ఠకు ఫోన్ చేసి దారుణంగా తిట్టాడని పేర్కొన్నారు. దీని వల్ల ఇండస్ట్రీలో మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా వేధింపులకు గురిచేస్తారని తెలిసిందన్నారు. తనకు ఎదురైన ఇలాంటి కొన్ని సంఘటనల వలనే కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. శ్రేష్ఠ ఇప్పటివరకు ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘మధురం మధురం’, ‘యుద్ధం శరణం’ సినిమాలకు గేయ రచయిత్రిగా పనిచేశారు. -
సౌత్ ఫిలింఫేర్ అవార్డులు-2018
సాక్షి, హైదరాబాద్: దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్ సత్తా చాటింది. 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగులో బాహుబలి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అర్జున్ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో వెంకటేష్ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవి, క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజమౌళికి బాహుబలి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం(లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల అవార్డులను కేటగిరీలుగా పరిశీలిస్తే... తెలుగు ఉత్తమ చిత్రం - బాహుబలి 2 ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2) తమిళం (కోలీవుడ్) ఉత్తమ చిత్రం - అరమ్ ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) ఉత్తమ నటి - నయనతార (అరమ్) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) మాలీవుడ్(మళయాళం) ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి కన్నడ(శాండల్‌వుడ్) ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) ఉత్తమ నటుడు - రాజ్ కుమార ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ -
విజయ్ ‘రౌడీ క్లబ్’
-
విజయ్ ‘రౌడీ క్లబ్’లో చేరతారా?
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ఫుల్ బిజీగా ఉన్న ఈ యూత్ స్టార్ ప్రస్తుతం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా అవార్డు వేడుకలకు తనతో పాటుగా తన అభిమానుల్లో ఒకరిని తనవెంట తీసుకువెళ్లనున్నట్లు విజయ్ తెలిపారు. ప్రస్తుతం నోటా మూవీ షూటింగ్ కోసం చెన్నైలో ఉన్న విజయ్ గత రాత్రి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ... చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి వాళ్లతో పాటు నేను బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యాను. ఇదే నాకు అవార్డు గెలిచినట్లు అంటూ చెపుతూ.. తనతో పాటు ఈ వేడుకలకు ఒకర్ని తన వెంట తీసుకెళ్తానని, అందుకుగానూ www.rowdyclub.in లో మీ వివరాలను నమోదు చేసుకోవాలని, అందులోంచి ఒకర్ని వేడుకలకు తనవెంట తీసుకెళ్తానని తెలియజేశారు. -
షూటింగ్లో నరకం అనుభవించా!
తమిళసినిమా: తారల ఆరంభ జీవితాలు బాధాకరంగా, అయ్యో పాపం అనేంతగా ఉంటాయనిపిస్తాయి. కొందరైతే లైంగిక వేధింపులు, ప్రేమలో విఫలం వంటి దుస్థితులకు గురైన వారై ఉంటారు. అలా తన ఆరంభం శోక కథే అంటోంది నటి శాలిని పాండే. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డితో ఈ నటి పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్ర షూటింగ్‌లోనే నరకయాతన అనుభవించానంటోందీ భామ. ఈ మధ్య నడిగైయార్ చిత్రంలో మెరిచిన శాలినిపాండేకు ప్రస్తుతం కోలీవుడ్‌లోనే అవకాశాలున్నాయి. యువ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా 100% లవ్, జీవాతో గొరిల్లా చిత్రాల్లో నటిస్తోంది. తన సినీరంగప్రవేశం గరించి శాలినిపాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సినిమాల్లో నటించడానికి తన తల్లిదండ్రులు వ్యతిరేకించారని చెప్పింది. ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చూసుకోమని ఒత్తిడి చేశారని అంది. తాను పట్టుబట్టి రంగస్థల నటిగా మారానని, ఆ తరువాత సినిమా అవకాశాల కోసం ఇంట్లో గొడవ పడి ముంబై వచ్చేశానని తెలిపింది. అప్పుడు తన తండ్రి శాపనార్థాలు కూడా పెట్టారని చెప్పింది. ఇకపోతే ముంబైలో ఒంటరి అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఇల్లు అద్దెకు ఇవ్వరని తెలిపింది. దీంతో తాను మరో అమ్మాయితో కలిసి ఇద్దరు అబ్బాయిలు ఉంటున్న ఇంట్లో అద్దెకు ఉన్నానని చెప్పింది. ఆ అబ్బాయిలు చాలా మంచి వాళ్లని, తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని అంది. వారి సాన్నిహిత్యంలో కొత్త లోకాన్ని చూశానని పేర్కొంది. అర్జున్‌రెడ్డి చిత్రం సంచలన విజయం సాధించి తనకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో తన కుటుంబ సభ్యులు తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పింది. తన జీవితంలో కళాశాలలో చదువుతున్న సమయంలో, సినిమాకు పరిచయం అయిన తరువాత రెండు సార్లు ప్రేమలో పడి విఫలం అయ్యానని చెప్పింది. దీంతో అర్జున్‌రెడ్డి చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ ప్రేమ వైఫల్యంతో బాధ పడ్డానని చెప్పింది. అదే సమయంలో ఆ చిత్ర హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించల్సి వచ్చినప్పుడు నరకయాతన అనుభవించానని శాలినిపాండే చెప్పింది. -
హిందీ అర్జున్ రెడ్డి ప్రేయసిగా..
టాలీవుడ్లో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సెన్సేషనల్ హిట్. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం ద్వారా షాలినీ పాండే కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తమిళ రీమేక్ ‘వర్మ’ ద్వారా విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త కథానాయికను తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనా ఇంకా కథానాయికపై క్లారిటీ రాలేదు. ఇక.. హిందీ రీమేక్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాను సందీప్‌రెడ్డి వంగానే తెరకెక్కించనుండటం విశేషం. షాహిద్ కపూర్ హీరో. ఈ సినిమాలో కథానాయికగా తారా సితారియా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ కరణ్ జోహార్ నిర్మాణంలో టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఇదే తారాకు తొలి సినిమా కావడం విశేషం. -
బాలీవుడ్ అర్జున్ రెడ్డికి జోడీగా..!
తెలుగు నాట సంచలన విజయం సాధించిన బోల్డ్ సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా హిందీలో షాహిదీ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ వర్షన్‌ను కూడా సందీపే డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమాకు హీరోయిన్గా బుల్లితెర నటి తారా సుతారియాను ఫైనల్ చేశారట. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్న తారా, అర్జున్ రెడ్డి రీమేక్‌లో షాహిద్ సరసన నటించనుంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను మురద్ ఖేతాని, అశ్విన్ వర్దేలు నిర్మిస్తున్నారు. -
నేను మే 18న రావట్లే : విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల మహానటి సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యువ కథానాయకుడు టాక్సీవాలా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స 2 బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ సినిమాను మే 18న రిలీజ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోటంతో టాక్సీవాలా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘మై రౌడీస్.. నేను మే 18న రావట్లే. భయపడటానికి, అరవటానికి, గట్టిగా నవ్వడానికి కాస్త వెయిట చేయండి. కొత్త రిలీజ్ డేట్‌ను మరో వారం రోజుల్లో వెల్లడిస్తాం’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. My rowdies, Nenu May 18th ki ravatle - sit tight for slightly longer to Scream! Shout! LaughOutLoud! coz we are giving this madcool film some final touches. Will announce the June Release date in a week. For now enjoy this pic of me sitting on my taxi and smiling 😜 #Taxiwaala pic.twitter.com/LQ8bMaEfJW — Vijay Deverakonda (@TheDeverakonda) May 14, 2018 -
హిందీ ‘అర్జున్ రెడ్డి’కి సిద్ధం
గత ఏడాది సంచలన విజయం సాధించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఎన్నో వివాదాల మధ్య వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. తమిళ్లో ఈ సినిమాతో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాల దర్శకత్వంలో తమిళ రీమేక్ రూపొందుతోంది. తాజాగా హిందీ రీమేక్ పనులు కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి బాలీవుడ్ అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించనున్నాడు. యంగ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మురద్ ఖేతాని, అశ్విన్ వర్దేలు నిర్మిస్తున్నారు. Team ARJUN REDDY is READY !!😎 Here we go. Wish us luck guys. 🤙🙏👏. @imvangasandeep @MuradKhetani @ashwinvarde pic.twitter.com/y9ndwvUg75 — Shahid Kapoor (@shahidkapoor) 11 May 2018 -
విజయ్ బర్త్‌డే స్పెషల్: ‘టాక్సీవాలా’ టీజర్
‘పెళ్లి చూపులు’తో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిలో తన నటనకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో వచ్చిన స్టార్డమ్... విజయ్‌కు ఆఫర్స్‌ను తెచ్చిపెట్టాయి. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, నోటా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే టాక్సీవాలా సినిమా కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ‘ద డ్రీమ్బిహెండ్ ద టాక్సీవాలా’ అంటూ ఓ వీడియోను రిలీజ్చేశారు. జనాలు కూడా ఈ వీడియోను బాగానే రిసీవ్ చేసుకున్నారు. నేడు విజయ్పుట్టిన రోజు సందర్భంగా టాక్సీవాలా టీం ప్రత్యేకంగా టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా2 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
దుల్కర్ వల్ల తప్పించుకున్నా: విజయ్ దేవరకొండ
‘‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నపుడు స్వప్న ఫోన్ చేసి ‘మహానటి’ చిత్రం గురించి చెప్పింది. వివరాలు అడక్కుండా ఒప్పేసుకున్నా. ఎందుకంటే.. స్వప్న, నాగీ (నాగ్ అశ్విన్) ఇద్దరూ నాకు ఫ్రెండ్స్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్ర కోసం మొదట దుల్కర్‌ని అడిగితే డేట్స్ కుదరలేదు. అందుకే నాగీ నన్ను చేయమన్నాడు. నాకేమో ఆ పాత్ర చేయగలనా? అనే భయం ఉండేది. ఎలాగైనా చేసేయాలి అనుకున్నా. మళ్లీ దుల్కర్ ఒప్పుకోవడంతో నేను తప్పించుకున్నా. ఫైనల్లీ విజయ్ ఆంటోనీ పాత్రకు ఫిక్సయ్యాను. ఈ చిత్రంలో సమంతలాంటి స్టార్‌తో నటించడం సరదాగా అనిపించింది. ఆమె చాలా హుషారుగా, ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ సినిమాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి తమిళంలో నటించినా వర్కవుట్ అవుతుంది. కానీ, హిందీ అలా కాదు. పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే హిందీవైపు దృష్టి పెట్టడంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత కథలు ఎంచుకోవడంలో యాటిట్యూడ్ కొంత మార్చాను. ఒక టాక్సీ డ్రైవర్‌ను తీసుకెళ్లి రకరకాల పరిస్థితుల్లో పడేస్తే అతని కథ ఎలా ఉంటుందన్నదే ‘టాక్సీవాలా’ కథ. ‘నోటా’ సినిమాలో కొంచెం యాంగ్రీగా కనిపిస్తాను. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు. -
‘డియర్ కామ్రేడ్’ అంటున్న అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేపు (మే 9న) రిలీజ్ అవుతున్న మహానటిలో కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ, మరో సినిమా టాక్సీవాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నోటా’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ మధ్యే ప్రారంభించాడు. నోటా చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్. పెళ్లిచూపులు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన యాష్ రంగినేని నిర్మాణంలో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ లీడ్ రోల్లో నటించనున్నాడు. ఈ సినిమాకు డియర్ కామ్రేడ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేసిట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
టాక్సీవాలాను ఫ్యామిలీ అంతా చూడొచ్చు
-
‘అర్జున్ రెడ్డి’ని మార్చేసిన పిల్లలు!
అర్జున్‌రెడ్డితో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. పెద్ద హీరోల నుంచే కాకుండా సినీ విశ్లేషకుల నుంచి విజయ్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. అర్జున్ రెడ్డి పాత్రను విజయ్ తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా మెప్పించాడు. అయితే సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అంతే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అది పిల్లలు చూడలేని సినిమా అని, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని ఇలా పలురకాలుగా అర్జున్‌రెడ్డిని బంధించాయి. అయినా ఇవేవి కూడా సినిమాను ఆపలేకపోయాయి. ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అవుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? విజయ్ ప్రస్తుతం టాక్సీవాలా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా2 ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఓ షార్ట్‌ఫిల్మ్ ద్వారా స్పష్టంచేశారు. ఈ వీడియోలో విజయ్ ఇంట్లో ఓ సినిమా చూస్తుండగా...నలుగురు పిల్లలు వచ్చి విజయ్‌తో అర్జున్‌రెడ్డి సినిమాను చూడలేకపోయామంటూ...దానికి కొన్నికారణాలను కూడా కనుక్కున్నామంటూ... పిల్లలు వారికి తగ్గట్టుగా విజయ్ను మారుస్తుంటారు. అర్జున్ రెడ్డిలో వాడిన భాష, వేషం లాంటి వాటిని మార్చేసి...కొత్త స్క్రిప్టును ఓకే చేస్తారు ఆ నలుగురు పిల్లలు. అదే టాక్సీవాలా అని సింబాలిక్‌గా టాక్సీలో నలుగురు పిల్లలతో బయల్దేరుతారు. చివర్లో పిల్లలు దిగి వెళ్తుండగా... సీ యూ ఇన్ థియేటర్స్ అంటూ విజయ్ చెప్పడంతో వీడియో ముగుస్తుంది. సో... టాక్సీవాలా సినిమాను చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని విజయ్ హామి ఇచ్చినట్టే. డ్రీమ్ బిహెండ్ టాక్సీవాలా అంటూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
‘టాక్సీవాలా’ టీజర్ వచ్చేస్తోంది..!
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. అర్జున్ రెడ్డి తరువాత ఏ మంత్రం వేసావే సినిమాతో నిరాశపరిచిన ఆ ప్రభావం విజయ్ కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సీవాలా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఆకట్టుకుంటున్న టాక్సీవాలా టీం ఏప్రిల్ 17న టీజర్ ను రిలీజ్ చేస్తోంది. టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్చేస్తూ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కండలు తిరిగిన బాడీతో సూపర్బ్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ ప్రియాంక లుక్‌ను కూడా ఈ పోస్టర్లో రివీల్ చేశారు. గోపిసుందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మే మూడోవారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. Because I'll give you the unexpected. Presenting to you the Swaggest Stress Busting Thriller you have ever seen. #TaxiwaalaTeaser pic.twitter.com/yxDenv3UlJ — Vijay Deverakonda (@TheDeverakonda) 14 April 2018 -
బాలా కొత్త చిత్రానికి రంగం సిద్ధం
తమిళ సినిమా: దర్శకుడు బాలా శైలి భిన్నంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేతు, నందా, పితామగన్ లాంటి చిత్రాలే అందుకు నిదర్శనాలు. నాన్‌కడవుల్, పరదేశీ, తారైతప్పట్టై వంటి చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. బాలా స్వీయ దర్శకత్వంలో చిత్రాలు నిర్మించడంతో పాటు ఇతర దర్శకులకు తన బ్యానర్లో అవకాశాలు ఇస్తుంటారు. కొద్ది కాలంగా విజయాలకు దురంగా ఉన్న ఈ సంచలన దర్శకుడు ‘నాచియార్’చిత్రంతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చారు. ఈ చిత్ర సక్సెస్‌కు చిత్ర పరిశ్రమ తోడవడంతో అర్ధ శతోత్సం దాటి ప్రదర్శితమవుతూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం బాలా నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘వర్మ’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్. ఈ విషయాన్ని పక్కన పెడితే బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లెన్స్ చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్‌కు అవకాశం ఇస్తున్నారు. లెన్స్ చిత్రం ఆంగ్లం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైంది. తమిళంలో లెన్స్ చిత్రాన్ని దర్శకుడు వెట్ట్రిమారన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి గానూ జయప్రకాశ్ రాధాకృష్ణన్ గత ఏడాది గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన తాజాగా ఒక మంచి కథను రెడీ చేశారట. దీన్ని దర్శకుడు బాలాకు వినిపించగా ఆయనకు బాగా నచ్చడంతో తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని మాట కూడా ఇచ్చారట. బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. -
ఆవకాయ్... అందరికీ కావాలోయ్
కావాలోయ్.. కావాలోయ్... మాకూ ఆవకాయ్ కావాలోయ్... అంటున్నారు మన పక్క భాషలవాళ్లు... తెలుగోడి ఆవకాయ్కి అంత క్రేజ్ మరి. తెలుగు సినిమాలకూ అంతే క్రేజ్ ఉంది. అదిరేటి మన ఆవకాయ్లాంటి సినిమాలను రీమేక్ చేస్తున్నారు. రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సీన్ రివర్స్. మనం పక్క సినిమాలను ఎక్కువ రీమేక్ చేసేవాళ్లం. ఇప్పుడు మన సినిమాలు అక్కడికెళుతున్నాయి. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయ్. బాహుబలి.. వీర్ యోధ మహాబలి ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్తు భారతదేశాన్ని ఏడాదిన్నరకు పైగా వెంటాడింది. 2015 జూలై 15న ‘బాహుబలి’ విడుదలైన తొలి ఆట నుంచి సినిమా చూసిన అందరిలోనూ ఇదే ప్రశ్న. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అంటూ గూగుల్లోనూ రికార్డు స్థాయిలో వెతికారంటే ఎంత ఆసక్తి నెలకొందో తెలిసిందే. 2017 ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ తొలి షో పడగానే ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ‘తెలుగు సినిమా స్టామినా ఇది’ అని ప్రపంచానికి చాటి చెప్పింది ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్ తమ నటన విశ్వరూపాన్ని చూపారు. దర్శకుడిగా రాజమౌళి ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయారు. కావాలంటే ఈ సినిమాని డబ్, చేసి విడుదల చేసుకోవచ్చు కానీ రీమేక్ చేయడం సాహసమే అని మన దేశంలో ఇతర భాషలవాళ్లు అనుకున్నారు. అయితే భోజ్‌పురిలో ‘వీరయోధ మహాబలి’ పేరుతో తెరకెక్కుతోన్న ఓ సినిమా ‘బాహుబలి’కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. దినేష్‌లాల్ యాదవ్, ఆమ్రపాలి దుబే, అయాజ్ ఖాన్, సుశీల్ సింగ్, దీపక్ భాటియా ముఖ్య తారలుగా ఇక్భాల్ బి„Š దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పణలో ఎమ్. రమేష్ వ్యాస్ నిర్మిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ‘వీరయోధ మహాబలి’ ఫొటోలు, వీడియోలు ‘బాహుబలి’ని పోలి ఉండటం విశేషం. సో.. ఇది ‘ఫ్రీమేక్’ అనుకోవచ్చేమో. ఒకేసారి రెండు భాషల్లో టెంపర్ ‘నా పేరు దయ.. నాకు లేనిదే అది.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్’.. ‘చేతనైతే చెయ్యి.. లేకపోతే అన్నీ మూసుకుని కూర్చో. ఊరికే అరవకు’.. వంటి డైలాగ్స్‌తో ఆకట్టుకుంది పూరి జగన్నాథ్ ‘టెంపర్’. ఎన్టీఆర్లోని మరో కోణాన్ని చూపించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ‘సింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రణ్వీర్ సింగ్, కాజల్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ కనిపించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 28న విడుదల కానుంది. మరోవైపు తమిళంలోనూ ‘టెంపర్’ రీమేక్ అవుతోంది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. మన ‘టెంపర్’ ఒకేసారి రెండు భాషల్లో రీమేక్ అవ్వడం విశేషం. ఇక్కడ లవ్.. అక్కడ కాదల్ ‘చూశారా నా బ్యాడ్‌లక్ ఎలా ఉందో. నాకు నచ్చినంత అందంగా.. నీరసం వచ్చేంత ఉత్సాహంగా.. కోపం వచ్చేంత క్యూట్‌గా.. నా బ్యాడ్‌లక్‌ని రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా మా నాన్నే స్టేషన్‌కి వెళ్లారు’ అంటూ తన మరదలు మహా లక్ష్మిని (తమన్నా) పరిచయం చేస్తాడు బాలు (నాగచైతన్య). బావామరదళ్లుగా ౖచైతూ, తమన్నా అలక, ప్రేమ, కుటుంబ పెద్దల జోక్యంతో ‘100% లవ్’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందర్నీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘100% కాదల్’ పేరుతో చంద్రమౌళి దర్శకత్వంలో తమిళంలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ నిర్మిస్తుండటం విశేషం. ‘కుమారి 21ఎఫ్’, ‘దర్శకుడు’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు సుక్కు. నాగచైతన్య పాత్రలో జి.వి.ప్రకాష్, తమన్నా క్యారెక్టర్లో ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే నటిస్తున్నారు. ఈ వేసవిలో ఈ కాదల్ (ప్రేమ) తెరమీదకు రానుంది. అర్జున్ రెడ్డి.. వర్మ అయ్యాడు ‘మొదటి సంవత్సరంలో ఒకమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకిష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతావాళ్లంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి. తరగతులు పెరిగేకొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి. మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రానివాళ్లకి, మిగతా తరగతుల వాళ్లకు చెప్పండి. ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అంటూ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో జూనియర్స్‌కి వార్నింగ్ ఇస్తాడు అర్జున్‌రెడ్డి (విజయ్ దేవరకొండ). ‘పెళ్ళిచూపులు’ వంటి ఫ్యామిలీ మూవీలో నటించిన విజయ్ ‘అర్జున్‌రెడ్డి’ వంటి బోల్డ్ క్యారెక్టర్లో నటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా యూత్‌కి తెగ నచ్చేయడంతో సూపర్‌హిట్‌గా నిలిచింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో విజయ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. కథానాయిక షాలినీ పాండేకీ అదే స్థాయిలో పేరొచ్చింది. ఈ సినిమాని తమిళ్లో ‘వర్మ’ పేరుతో విలక్షణ దర్శకుడు బాలా రీమేక్ చేస్తున్నారు. నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమా రీమేక్ కానుంది. తొలుత రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వరుణ్ ధావన్ పేరు.. ఇప్పుడేమో అర్జున్ కపూర్ పేరు వినిపిస్తోంది. అర్జున్ కపూర్ హీరోగా మురద్ ఖేతానీ ఈ సినిమా తెరకెక్కించనున్నారని బాలీవుడ్ టాక్. క్షణం.. బాఘీ 2 రిషి (అడివి శేష్) ఎన్ఆర్ఐ. మెడిసిన్ చదివేందుకు ఇండియా వెళ్లినప్పుడు సహ విద్యార్థి శ్వేతతో (అదా శర్మ) ప్రేమలో పడతాడు. తండ్రి కోసం శ్వేత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. శ్వేత నుంచి ఫోన్ రావడంతో ఇండియాకి వచ్చిన రిషికి శ్వేత కుమార్తె రియా కిడ్నాప్ అయిన విషయం తెలుస్తుంది. కిడ్నాప్ చేసిందెవరు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనే అంశాలతో.. చక్కటి స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని ‘బాఘీ–2’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్, దిశాపాట్నీ జంటగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఈనెల 30న విడుదల చేస్తున్నారు. సీతారామ కల్యాణ చూద్దాం శివ (నాగచైతన్య), భ్రమరాంబ (రకుల్ ప్రీత్‌సింగ్) ఓ పెళ్లిలో కలుసుకుంటారు. వారిమధ్య పరిచయం ఏర్పడుతుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. ప్రేమ విషయం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందోనని భయపడుతుంటాడు శివ. తన కోసం రాజకుమారుడు వస్తాడనే భ్రమల్లో ఉన్న భ్రమరాంబ.. శివ ప్రేమను అర్థం చేసుకోదు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న శివ, భ్రమరాంబ తండ్రులు తర్వాత విడిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరి ప్రేమకథ ఏ మలుపు తీసుకుంది? వారి తండ్రులు కలిశారా? లేదా? అనే చక్కటి కుటుంబ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రారండోయ్ వేడుకచూద్దాం’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ హిట్ సినిమాని కన్నడంలో ‘సీతారామ కల్యాణ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘జాగ్వార్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నిఖిల్ హీరోగా, రచిత రామ్ హీరోయిన్గా నటిస్తున్నారు. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. భలే భలే గజినీకాంత్ లక్కీ (నాని)కి చిన్నప్పటి నుంచి మతిమరుపు వ్యాధి ఉంటుంది. కానీ, ఆ విషయం ఎదుటి వాళ్లకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇలాంటి టైమ్‌లో నందనతో (లావణ్య త్రిపాఠి) పరిచయం ఏర్పడుతుంది లక్కీకి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన మతిమరుపు గురించి నందనకు తెలియకుండా లక్కీ జాగ్రత్త పడుతుంటాడు. అయితే లక్కీకి మతిమరుపు ఉన్న విషయం నందన తండ్రి రంగారావుకు (మురళీ శర్మ) తెలుస్తుంది. రంగారావు పెట్టిన పరీక్షను లక్కీ ఎలా ఎదుర్కొన్నాడన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మనిషిలోని లోపాన్ని కూడా కథాంశంగా తీసుకుని సూపర్ హిట్ సాధించొచ్చని నిరూపించారు దర్శకుడు మారుతి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఆర్య హీరోగా తమిళంలో ‘గజినీకాంత్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అఖిల్’ బ్యూటీ సాయేషా ఇందులో కథానాయిక. ఇటు సూర్య హిట్ మూవీ ‘గజనీ’, అటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గుర్తొచ్చేలా ‘గజినీకాంత్’ టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమా ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. - డేరంగుల జగన్ -
‘వర్మ సినిమాలో నా కూతురు నటించట్లేదు’
సాక్షి, చెన్నై : సీనియర్ నటి గౌతమి తాజాగా ట్విటర్ లో స్పందించారు. తన కూతురు సుబ్బలక్ష్మి త్వరలో సినిమాల్లోకి రాబోతుందంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అది నిజం కాదంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘మీడియాలో నా కూతురి డెబ్యూ గురించి వస్తున్న వార్తలు చూశాను. సుబ్బలక్ష్మి తన చదువుల్లో బిజీగా ఉంది. ఇప్పట్లో నటన గురించి ఆలోచన చేయలేదు. తనకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని గౌతమి తెలిపారు. కాగా, విలక్షణ దర్శకుడు బాలా అర్జున్ రెడ్డి రీమేక్‌ను ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ‘చియాన్’ విక్రమ్ తనయుడు ధృవ్ ఈ చిత్రంతో అరంగ్రేటం చేయబోతున్నాడు. హీరోయిన్ కోసం వేట ఇంకా కొనసాగుతోంది. Taken aback to see news about my daughter's acting debut. Subhalaxmi is committed to her studies and has no plans for acting now. Thank you all for your blessings on her. — Gautami (@gautamitads) 13 March 2018 -
నేనే డబ్బింగ్ చెబుతా : విజయ్ దేవరకొండ
తమిళసినిమా: తమిళం నేర్చుకుని తన చిత్రానికి తానే డబ్బింగ్ చెబుతానని తెలుగు యువ నటుడు విజయ్ దేవరకొండ తమిళ ప్రేక్షకులకు మాట ఇచ్చారు. ఈయనిప్పుడు నోటా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తేనాంపేటలోని నక్షత్ర హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టైటిల్‌ను ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్తో ఒక చిత్రం చేయాలని భావించానని మంచి కథ లభించడంతో చిత్రాన్ని తెరకెక్కిస్తునట్టు చెప్పారు. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు బాలా పొందారని, ఆ చిత్రం తెలుగు వెర్షనే చెన్నై, చెంగల్పట్టు ఏరియాల్లో రూ.3కోట్లు వసూలు చేసిందని తెలిపారు. చిత్ర హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్ చెప్పిన కథ విని ఇలాంటి కథే తనకు సూట్ అవుతుందని భావించి చిత్రానికి అంగీకరించానని తెలిపారు. ఈ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానని తమిళ ప్రేక్షకులకు మాట ఇస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. -
‘అర్జున్ రెడ్డి’లా మారిపోయిన ధృవ్
గత ఏడాది సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కోలీవుడ్ ఈ సినిమాను విక్రమ్ తనయుడు ధృవ్ మీరోగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను విలక్షణ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ను చాలా కాలం క్రితమే రిలీజ్ చేశారు. అయితే కథలోని క్యారెక్టర్‌కు తగ్గ లుక్ కోసం ధృవ్ ఆరు నెలలుగా కష్టపడుతున్నాడు. తాజాగా సినిమాకు తగ్గ మేకోవర్‌తో రెడీ అయిన ధృవ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. బాగా పెరిగిన గెడ్డం, మీసంతో ధృవ్ రఫ్ లుక్‌లో అదరగొడుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Stargazing. #dhruvfinallyanatchathiram😋 A post shared by Vikram (@the_real_chiyaan) on Mar 3, 2018 at 11:55pm PST -
అవును.. నేను ప్రేమలో ఉన్నాను..
సాక్షి, సిటీబ్యూరో: ‘అవును.. నేను ప్రేమలో ఉన్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా అందరినీ ప్రేమిస్తాను. అలాగని మీరంటున్న ప్రేమలో పడనని కాదు. ఎప్పుడు ప్రేమలో పడతామో చెప్పలేం. అది తెలియకుండా జరిగిపోతుంది. ఇప్పుడు మాత్రం ప్రేమలో లేన’ని చెప్పింది షాలినీపాండే. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ.. కుటుంబంతో గడిపే సమయమే చిక్కడం లేదు. ఇక ప్రేమలో పడే సమయం ఎక్కడా? అని సెలవిచ్చింది. తొలి సినిమాతోనే ప్రశంసలందుకున్న షాలిని... ఇప్పుడు ‘నా ప్రాణమే’ పాటతో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో మెరిసింది. వాలెంటైన్స్ డేకి విడుదలైన ఈ ఆల్బమ్ మంచి హిట్స్ సాధించింది. సింగర్‌గానూ అలరించిన షాలిని ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... షాలినీపాండే నేను థియేటర్ (రంగస్థలం) బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. రంగస్థలం, సినిమా రెండు వేర్వేరు. నాటకంలో ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందన చూస్తూ పాత్రను పండించాల్సి ఉంటుంది. సినిమా పూర్తయి విడుదలైతే గానీ ప్రజల అభిప్రాయం తెలియదు. అయితే దేని గొప్పదనం దానిదే. నా మట్టుకు నాకు అభినయానికి అవకాశమున్న పాత్ర లభిస్తే ఏదైనా ఇష్టమే. ప్రస్తుతం తెలుగులో ‘సావిత్రి’ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నాను. ఇంకా కొన్ని చర్చల్లో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. ఒక భాషా పరిశ్రమలో సెటిలవ్వాలని అనుకోవడం లేదు. ఏ భాషలో అయినా సరే పాత్ర బాగుండాలి. అది నేను చేయాలి అనుకోవాలి. అభినయానికి అవకాశం ఉండాలి. అర్థరహిత పాత్రలు చేయాలనుకోవడం లేదు. నటించడం నాకు ఇష్టం. అలాగే డ్యాన్స్ కూడా పెర్ఫార్మెన్స్లో భాగమేనని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు టాప్‌లో ఉన్న వారిని చూసి, ఆ పొజిషన్లోకి వెళ్లాలనే లక్ష్యాలు పెట్టుకోను. నాకు రోల్ మోడల్స్ అంటూ లేరు. మాధురి దీక్షిత్, గురుదత్, కమల్‌హాసన్... ఇలా ఎందరినో అభిమానిస్తాను. వారి అభినయాన్ని ఇష్టపడతాను. అయితే ప్రేక్షకులకు నేను షాలినిగా మాత్రమే గుర్తుండాలి. నాకు సొంత ఐడెంటిటీ ఉండాలి. నటన అనేది నాకొక ప్రొఫెషన్ మాత్రమే కాదు... అదొక ఎమోషనల్ థింగ్ ఫర్ మి. నాకు పాటలంటే మహా ఇష్టం. సంగీతం మాత్రం నేర్చుకోలేదు. మా అమ్మగారు క్లాసికల్ సింగర్. ఓ రకంగా ఈ సింగింగ్ టాలెంట్ కొంతం దైవ ప్రసాదం, కొంత అమ్మ నుంచి వచ్చింది. బెంగళూర్‌కి చెందిన లగోరి బ్యాండ్‌ని ముంబైలో తొలిసారి కలిశాను. నాలుగేళ్లుగా వారితో ప్రయాణం సాగుతోంది. విభిన్న భాషల్లో పాటలు విడుదల చేసిన వీరు... వాలెంటైన్స్ డేకి తెలుగులో పాట రూపొందించాలని అనుకున్నారు. తెలుగులో పాడడం అనగానే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఈ ఆల్బమ్‌ను బెంగళూర్‌లో సినిమా షూటింగ్‌లు చేసే ప్లేస్‌లో కేవలం ఒక్క రోజులోనే షూటింగ్ చేశారు. ఇందులో నాతో పాటు బ్యాండ్‌కు చెందిన గాయకుడు తేజాస్ మేల్ వాయిస్ ఇచ్చారు. గీత్ బ్యాండ్ మేనేజర్, సినీ గీత రచయిత కృష్ణకాంత్ పాట రాశారు. కరణ్ చావ్లా డైరెక్టర్‌గా వ్యవహరించారు. వ్యక్తిగతంగా ఈ ఆల్బమ్ చాలా ఆనందాన్నిచ్చింది. ఇంకెవరైనా మంచి కాన్సెప్ట్‌తో వస్తే ఇలాంటి ఆల్బమ్స్ చేయడానికి నేను రెడీ. భవిష్యత్తులో సొంత సినిమాల్లో పాడే అవకాశం వస్తే ఫుల్ హ్యాపీ. ఐ లైక్ సిటీ... అర్జున్‌రెడ్డి సినిమా కోసం చాలా రోజులు హైదరాబాద్‌లో ఉన్నాను. ఈ సిటీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే నాకు చాలా ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఎన్నో ఉన్నాయి. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నా స్టైలిస్ట్ మేఘనతో చాలా టైమ్ స్పెండ్ చేస్తాను. ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్, చెన్నైకి రాకపోకలు సాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో సెటిలవుతానా? మరెక్కడైనానా? అనేమీ అనుకోలేదు. సరికొత్త షాలిని... ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కోసం బరువు పెరిగాను. నిజానికి నేను సన్నగా ఉంటాను. ఆ క్యారెక్టర్‌కి బొద్దుగా ముద్దుగా ఉండడం అవసరం కాబట్టి, దానికి అనుగుణంగా బరువు పెరిగాను. అయితే ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాను. సో... కొత్త పాత్రలో సరికొత్త షాలినీని చూస్తారు మీరు. -
మెకానిక్ మహేష్..?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో ఆసక్తికరమైన సినిమాకు ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. భరత్ అనే నేను సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు సూపర్ స్టార్ అంగీకరించారన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షించిన సందీప్ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన సమయంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సందీప్ రెడ్డిని అభినందించారు. మహేష్ కూడా ట్వీటర్ ద్వారా సందీప్ రెడ్డి టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను సందీప్ రెడ్డి రెడీ చేశాడట. ఇప్పటికే మహేష్ కు కథ వినిపంచాడన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాలో మహేష్ బాబు మెకానిక్ పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే వరకు సందీప్ రెడ్డి తో చేయబోయే సినిమాపై మహేష్ టీం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
ప్రేమలో అర్జున్‌రెడ్డి యాక్టర్..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల లేదా వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. ‘ఆమె గురించి నా భావాలు, భావోద్వేగాలు పదాల్లో రాయాలని ప్రయత్నించి.. విఫలమయ్యాను. ఆమె అందమైన మనస్సును వర్ణించాలంటే ఎన్నో లక్షల కవితలు రాయాల్సి ఉంటుంది.. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని.. నా జీవితంలో తను అడుగుపెట్టబోతుందంటూ’ ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలోనూ లాయర్‌గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. బాబు బాగా బిజీ, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగి, ఎంసీఏ తదితర సినిమాల్లో నటించాడు. -
మరో అవతారంలో షాలినీ...
అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలీనీ పాండే ‘నా ప్రాణమై...’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను ఇటీవల రికార్డ్ చేశారు. ‘లగోరీ’ అనే ఇండియన్ బ్యాండ్ కంపోజ్ చేసిన ఈ పాటకు షాలినీ తన వాయిస్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. షాలినీ మొదటి సినిమాలోనే తెలుగు డబ్బింగ్ చెప్పుకుని ‘బేబీ.. బేబీ... ’ అంటూ ఆడియన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఏకంగా తెలుగులో పాట పాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే షాలినీ ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతున్నారు. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో, జీ.వీ.ప్రకాశ్‌తో ‘100% లవ్’ తమిళ రీమేక్ ‘100% కాదల్ లో, జీవా సరసన ‘గొరిల్లా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
రూటు మార్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్
-
రూటు మార్చిన అర్జున్ రెడ్డి హీరోయిన్
సాక్షి, సినిమా : థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన షాలిని పాండే.. అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రీతి పాత్రలో ఆమె ఇచ్చిన ఫెర్ఫార్మెన్స్ దెబ్బకు మిగతా భాషల్లో కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే షాలిని ఇప్పుడు మరో రూట్లోకి వెళ్లి సింగర్ అవతారం ఎత్తింది. ప్రేమికుల రోజు ప్రత్యేకం ‘నా ప్రాణమే’ అంటూ ఓ స్పెషల్ వీడియో ఆల్బమ్‌లో కోసం తన గళం వినిపించింది. పాప్ రాక్ బ్యాండ్ ‘లగోరీ’ కంపోజ్ చేసిన ఈ పాటలో షాలిని గాత్రం ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన చిన్న టీజర్‌ను నెట్లో వదిలారు. చాలా కాన్ఫిడెంట్‌తో షాలిని పాటను పాడగా.. అద్భుతంగా ఉన్న ఆమె గాత్రం... అందుకు తగ్గట్లే మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నారు. చూస్తుంటే సింగర్‌గా కూడా ఆమె సక్సెస్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే సావిత్రి బయోపిక్ మహానటితోపాటు, కోలీవుడ్‌లో 100% లవ్ రీమేక్‌లో షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది. -
ఒక్క సినిమానే : విక్రమ్
దక్షిణాదిలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచతుడు, ఐ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ త్వరలో తన నటవారసుడిని తెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ధృవ్ ఎంట్రీపై మాట్లాడిన విక్రమ్, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధృవ్... అర్జున్ రెడ్డి రీమేక్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడట. ‘వర్మ’ సినిమా రిలీజ్ తరువాత ధృవ్ చదువు మీద దృష్టి పెట్టనున్నట్టుగా వెల్లడించాడు. తిరిగి ఉన్నత చదువులు పూర్తయిన తరువాతే ధృవ్ తదుపరి చిత్రం మొదలువుతుందని వెల్లడించాడు విక్రమ్. -
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’గా..!
గత ఏడాది టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి. ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి కాసుల పంట పండించటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ లో బాల దర్శకత్వంలో హీరో విక్రమ్ వారసుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ పై కూడా క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమాను తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు అర్జున్ కపూర్ సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. -
లాస్ట్ ఇయర్ సంక్రాంతి... ఈ ఇయర్ పొంగల్ – షాలినీ పాండే
సంక్రాంతి మెమరీస్ పెద్దగా లేవు. ఎందుకంటే మేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోం. ఇక్కడికొచ్చాకే (హైదరాబాద్) సంక్రాంతి గురించి తెలిసింది. ‘అర్జున్ రెడ్డి’ చేస్తున్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూశాను. చక్కెర పొంగలి చాలా టేస్టీగా అనిపించింది. ఫెస్టివల్ టైమ్‌లో ఎక్కడ చూసినా గాలిపటాలే. ఇంత బాగా ఎగరేస్తారని నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ తెలుగు సినిమా చేస్తే.. ఈ ఇయర్ తమిళ సినిమా ‘100% కాదల్’ (తెలుగు ‘100% లవ్) రీమేక్) షూటింగ్లో ఉన్నాను. ఈ సెట్స్‌లో పొంగల్ (సంక్రాంతి) సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ విధంగా తమిళనాడులో ఎలా పండగ చేస్తారో తెలిసింది. నేను ఆర్టిస్ట్ అవ్వడంవల్లనే అన్ని సంప్రదాయాలు తెలుసుకోగలుగుతున్నాను. ఇక్కడి అమ్మాయిని అనే ఫీల్ కలుగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నన్ను ఇక్కడివారు తమ అమ్మాయిలా ఆదరిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. -
మమ్మీ, డ్యాడీ మీరే నా బెస్ట్..: అర్జున్ రెడ్డి!
గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరినిచ్చింది. రియలిస్టిక్ కథను అంతే సహజంగా తెరపై ఆవిష్కరిస్తే.. అది తప్పకుండా ప్రేక్షకులకు చేరుతుందని, సినిమా సూపర్‌హిట్ అవుతుందని.. అర్జున్‌రెడ్డి చిత్రం నిరూపించింది. ఈ సినిమాతో సూపర్‌స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండకు ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఓ చానెల్ నిర్వహించిన అవార్డుల ఫంక్షన్లో అర్జున్‌రెడ్డి సినిమాకుగాను విజయ్ దేవరకొండను అవార్డు వరించింది. ఈ అవార్డును అందుకుంటున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్టుచేసిన విజయ్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ‘ఒకవైపు చిరునవ్వుతో నాన్న.. మరోవైపు నవ్వులు చిందిస్తూ మెగాస్టార్.. ఇంతకన్నా గొప్ప సంవత్సరం ఏముంటుంది’ అంటూ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న ఫొటోను విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అమ్మ, నాన్న.. మీ ఇద్దరు బెస్టెస్ట్.. మీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను’ అంటూ అమ్మనాన్నలతోపాటు కలిసి అవార్డు అందుకుంటున్న ఫొటోను పెట్టారు. A smiling father on one side. A smiling Megastar on another. What an year it has been. pic.twitter.com/48QkPzNwCh — Vijay Deverakonda (@TheDeverakonda) 31 December 2017 Mummy and daddy :) You two are the bestest!!! Anything to make you smile. Happy new year :) pic.twitter.com/pusWbILmhY — Vijay Deverakonda (@TheDeverakonda) 31 December 2017 -
జాతీయ అవార్డు విజేతతో రానా
బాహుబలి విజయం తరువాత భల్లాలదేవ రానా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో ఇతర భాషా దర్శకులు కూడా రానాతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సోలో హీరోగా ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాల విజయం కూడా రానాకు కలిసొచ్చింది. ప్రస్తుతం 1945 అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న రానా, త్వరలో తమిళ దర్శకుడు ప్రభు సాల్మోన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హతీ మేరీ సాథీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కనుంది. ఈ రెండు సినిమా ల తరువాత ఓ జాతీయ అవార్డ్ విజేత దర్శకత్వంలో నటించనున్నాడు రానా. దక్షిణాదిలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయబోతున్నాడట. తన ప్రతీ సినిమాను రియలిస్టిక్ గా రూపొందించే బాల ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత 2018 ద్వితీయార్థంలో రానా హీరోగా సినిమాను ప్రారంభించనున్నాడట. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. -
అర్జున్‌రెడ్డికి నో...
...అవును. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటించేందుకు రణ్వీర్ సింగ్ ‘నో’ చెప్పారట. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం టాలీవుడ్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో హీరో, హీరోయిన్, డైరెక్టర్, స్నేహితుడి పాత్రధారి రాహుల్ ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోయారనడం అతిశయోక్తి కాదేమో. తెలుగునాట ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీ, కన్నడ భాషల్లో ఇతర దర్శకులు రీమేక్ చేస్తున్నా హిందీకి మాత్రం సందీప్ రెడ్డే దర్శకత్వం వహిస్తారనీ, రణ్‌వీర్‌సింగ్ లీడ్ రోల్లో నటిస్తారని వార్తలు వినిపించాయి. రణ్‌వీర్‌కి కథ వినిపించడంతో నటించేందుకు తొలుత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారట. ‘అర్జున్‌రెడ్డి’ కంటెంట్ బోల్డ్‌గా ఉండడమే ఇందుకు కారణమట. ‘పద్మావతి’ సినిమాలో రణ్వీర్ చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రే ఇప్పటికే వివాదం కావడంతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి మరో వివాదాస్పద పాత్రలో నటించడం ఇష్టం లేక ‘నో’ చెప్పారట. రణ్వీర్ స్థానంలో ఇప్పుడు షాహిద్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు షాహిద్‌నే ఖరారు చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ టాక్. -
బాహుబలిని ఢీకొట్టిన విక్రంవేదా.. దుమ్మురేపిన అర్జున్‌రెడ్డి, ఘాజీ!
2017లో విడుదలైన టాప్ -10 భారతీయ సినిమాల జాబితాను ప్రముఖ సినిమా సమాచార వెబ్సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాహుబలి-2ను అధిగమించి తమిళ క్రైమ్ థిల్లర్ మూవీ 'విక్రమ్ వేదా' టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ జాబితాలో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. టాప్-10 ఇండియన్ సినిమాల్లో మొదటిస్థానంలో విక్రమ్ వేదా ఉండగా.. రెండో స్థానంలో రాజమౌళి వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి-2', కొత్త దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన ట్రెండ్ సెట్టర్ 'అర్జున్‌రెడ్డి' మూడోస్థానంలో ఉన్నాయి. రాణా దగ్గుబాటి హీరోగా కొత్త దర్శకుడు సంకల్ప్‌రెడ్డి రూపొందించిన 'ద ఘాజీ అటాక్' సినిమా ఆరోస్థానంలో నిలిచింది. ఐఎండీబీ యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూల ఆధారంగా ఈ టాప్-10 జాబితాను ప్రకటించింది. ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలే ఈ జాబితాలో ఉండటం విశేషం. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కి కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన 'విక్రమ్ వేదా' తొలిస్థానంలో నిలువగా, రాజమౌళి 'బాహుబలి-2' రెండోస్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాధించిన విజయం, కలెక్షన్ల ముందు 'విక్రమ్ వేదా' విజయం చిన్నదేనని చెప్పాలి. ఇక తెలుగు ట్రెండ్‌సెట్టర్, విజయ్ దేవరకొండను సూపర్‌స్టార్‌ను చేసిన 'అర్జున్‌రెడ్డి' ఈ జాబితాలో మూడోస్థానాన్ని దక్కించుకొంది. నాలుగోస్థానంలో ఆమిర్ఖార్ తెరకెక్కించి అతిథి పాత్ర పోషించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్' నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖామర్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్"హిందీ మీడియం' ఐదోస్థానాన్ని దక్కించుకుంది. రాణా హీరోగా మూడు (హిందీ, తమిళం, తెలుగు) భాషల్లో విడుదలైన ఘాజీ సినిమా ఈ జాబితాలో ఆరోస్థానంలో నిలువగా.. ఇక, ఈ ఏడాది అక్షయ్ కుమార్ నటించిన రెండు సినిమాలు 'జాలీ ఎల్ఎల్బీ- 2', టాయ్‌లెట్ ఏక్ ప్రేమకథ.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక అంశాలు నేపథ్యంగా తీసుకొని తెరకెక్కిన 'టాయ్‌లెట్' ఏడో స్థానంలో నిలువగా.. కోర్టుడ్రామాగా తెరకెక్కిన జాలీ ఎల్ఎల్బీ-2 సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ భారీ బడ్జెట్ చిత్రం 'మెర్సల్' ఎనిమిదో స్థానంలో నిలువగా.. మమ్మూటీ, స్నేహ జంటగా తెరకెక్కిన మలయాళ మూవీ ది గ్రేట్ ఫాదర్ ఈ జాబితాలో పదోస్థానంలో నిలిచింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది. -
కోలీవుడ్‌కు విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీ హైప్ తో పాటు ఇతర భాషల్లోనూ విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పరభాషా దర్శకులు కూడా విజయ్ దేవరకొండ హీరోగా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘గీతాగోవిందం’ సినిమాతో పాటు షికారు, మహానటి సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. ఇవేకాకుండా మరో మూడు నాలుగు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తాజాగా ఓ తమిళ దర్శకుడు విజయ్ హీరోగా సినిమా తెరకెక్కించేందుకు చర్చలు జరుపుతున్నాడట. విక్రమ్ హీరోగా ఇరుముగన్ (ఇంకొకడు) సినిమాను తెరకెక్కించిన ఆనంద్ శంకర్, విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ కు కథ కూడా వినిపించాడట. అయితే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయితే గాని విజయ్ తమిళ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు. -
శేఖర్ కథకు అర్జున్ రెడ్డి ఫిదా
‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఫిదా కానిది ఎవరు చెప్పండి. ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో కనిపించిన ‘విజయ్ దేవరకొండ’ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ‘అర్జున్ రెడ్డి’ సాధించిన సంచలన విజయం తన దిశనే మార్చేసింది. చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నారు విజయ్. ఆల్రెడీ పట్టాల మీద నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా చర్చల దశలో మరికొన్ని ఉన్నాయి. రీసెంట్గా విజయ్ దేవరకొండకు శేఖర్ కమ్ముల కథ వినిపించారట. అన్నీ కుదిరితే ఆ సినిమాను విజయ్ దేవరకొండ హోమ్ ప్రొడక్షన్స్‌లో స్వయంగా నిర్మించొచ్చని సమాచారం. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంలో హీరో గ్యాంగ్‌లో చిన్న పాత్రలో కనిపించారు విజయ్. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా నటించనుండటం విశేషం. -
'ప్రీతి'గా ముద్దు పెట్టా!
‘‘ముద్దు పెట్టుకోవడం కూడా ఒక ఎమోషన్. నటిస్తున్నప్పుడు ఏ ఎమోషన్ అయినా ప్యాషన్‌తో చేయాల్సిందే. ‘అర్జున్‌రెడ్డి’లో షాలినీ పాండే కనపడదు. ముద్దు పెట్టుకున్నది షాలినీ పాండే అనిపించదు. ‘ప్రీతి’గానే ముద్దు పెట్టుకున్నాను.. ‘ప్రీతి’గానే అనిపిస్తాను. నిజానికి షాలిని విజయ్ దేవరకొండను ముద్దుపెట్టుకోలేదు. ప్రీతి అర్జున్‌రెడ్డిని ముద్దు పెట్టుకుంది’’ అంటున్నారు ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన షాలినీ పాండే. ఏంటండీ... షాలినిగారూ.. హండ్రెడ్ పర్సంట్ లవ్‌లో ఉన్నట్లున్నారు? ఎగ్జాట్లీ. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. చిన్ని చిన్ని అలకలు, పెద్ద పెద్ద గొడవలు, తీపి కబుర్లు, కొంటె చూపులు.. సూపర్బ్. ఆన్‌స్క్రీన్ లవ్ (తెలుగు ‘100% లవ్ ’ తమిళ రీమేక్‌లో కథానాయికగా నటిస్తున్నారు షాలిని) గురించి భలే చెప్పారు.. ఆఫ్ స్క్రీన్ ప్రేమ గురించి? ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పటివరకూ ఒక్కరు కూడా ‘ఐ లవ్ యు’ చెప్పలేదు. అందుకే, ప్రేమంటే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ తెలుసుకుంటున్నా. ఇంత అందమైన అమ్మాయికి ఒక్కళ్లు కూడా ప్రపోజ్ చేయలేదా? ఫాల్ట్ మీదేనేమో? అవునండి. నేను కొంచెం తేడానే. ఏది చేసినా ఫుల్‌గా కాన్సన్ట్రేట్ చేస్తా. స్కూల్ డేస్‌లో పుస్తకాల్లో మునిగిపోయేదాన్ని. కాలేజ్ డేస్‌లోనూ అంతే. దాంతో నాకు ఎమోషన్స్ ఉండవని, మరబొమ్మ టైప్ అనీ అబ్బాయిలు అనుకునేవారు (నవ్వుతూ). అయినప్పటికీ నన్ను ఇష్టపడ్డవాళ్లు ఉన్నారు. అయితే, ఆ ఇష్టాన్ని నాతో డైరెక్ట్‌గా చెప్పకుండా నా ఫ్రెండ్స్‌తో చెప్పేవారు. ఏం లాభం చెప్పండి? మరి.. మీరు ఎవరి మీదైనా మనసు పారేసుకున్నారా? ప్చ్... ఇప్పటివరకూ లేదు. అప్పుడేమో చదువులు. ఇప్పుడేమో యాక్టింగ్. మైండ్ అంతా వర్క్ మీదే. ఓకే.. ఫ్రమ్ జబల్పూర్ టు హైదరాబాద్‌కి హీరోయిన్గా వచ్చారు. సినిమాల్లోకి రావాలని చిన్నప్పటినుంచే అనుకున్నారా? అవును. హీరోయిన్ అయ్యే తీరాలన్నది నా యాంబిషన్. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయి. నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. కానీ, నేను హీరోయిన్ అవుతానంటే కాదనలేదు. ఎందుకంటే, నేనేది చేసినా ఒక కమిట్మెంట్తో చేస్తానని ఆయన నమ్మకం. ముందు నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. అక్కణ్ణుంచి మోడల్‌గా ట్రై చేద్దామనుకున్నా. అట్నుంచి సినిమాల్లోకి రావాలనుకున్నా. తెలుగు సినిమాతో నా కల నెరవేరింది. ఫస్ట్ మూవీ (‘అర్జున్‌రెడ్డి’) హిట్టయింది కాబట్టి హ్యాపీగా ఉన్నారు. తేడా జరిగి ఉంటే? కొలాప్స్ అయ్యేదాన్ని కాదు. కొంచెం బాధ మాత్రం ఉండేది. అయినా ఫెయిల్యూర్స్ నాకు కొత్త కాదు. ముంబైలో చాలానే ఫేస్ చేశాను. ఎన్నో రిజెక్షన్స్. అన్నీ తట్టుకున్నాను. లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా. అందుకని అంత ఈజీగా హర్ట్ అవ్వను. అది సరే.. ఫస్ట్ సినిమాకే అన్నేసి ముద్దు సీన్స్ చేశారు... ఇబ్బందిగా అనిపించలేదా? మిమ్మల్ని తక్కువగా మాట్లాడతారని భయపడలేదా? నేను థియేటర్ నుంచి వచ్చానని చెప్పాను కదా. అక్కడ మాకు ఒకటే నేర్పించారు. ‘నువ్వు ఏ పాత్ర అయితే చేస్తున్నావో అక్కడ ఉన్నది నువ్వు కాదు. ఆ క్యారెక్టర్ మాత్రమే’ అని. నా మనసులో అది బలంగా నాటుకుపోయింది. నేను షాలినిగా ముద్దులు పెట్టలేదు. ప్రీతీ (‘అర్జున్‌రెడ్డి’లో షాలిని క్యారెక్టర్ పేరు)గా పెట్టా. నటిగా ఎంతో ప్యాషన్‌తో ఆ సీన్స్ చేశా. ఇంజినీర్‌గా చూడాలనుకున్న మీ నాన్నగారు మీరు హీరోయిన్ అవుతానన్నా ఒప్పుకున్నారు. మరి.. ముద్దు సీన్స్ చేసే ముందు ఆయనతో చెప్పారా? పర్మిషన్ తీసుకున్నారా? బేసిక్‌గా నేను ఎవరి అడ్వైస్ తీసుకునే టైప్ కాదు. నిర్ణయాలు నావే. దాని తాలూకు సక్సెస్, ఫెయిల్యూర్స్ నావే. జీవితంలో ఎవర్నీ బ్లేమ్ చేయాలనుకోను. అందుకే సలహాలు తీసుకోను. ఆ సినిమాకి అది కరెక్ట్ అనిపించింది. పైగా డైరెక్టర్ సందీప్‌గారు చాలా ఏస్థటిక్గా తీస్తారని నమ్మాను. అందుకే చేశాను. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేసి ఉండకపోతే మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. సినిమా చూశాక మీ అమ్మానాన్న ఏమన్నారు? నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ‘షాలిని ఏది చేసినా ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది’ అని నా చెల్లెలితో నాన్న అన్నారు. అది చాలు. రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చుట్టూ పది మంది ఉంటే ఇబ్బందిగా ఉంటుందేమో. పైగా మీలాంటి కొత్త హీరోయిన్‌కి అయితే కష్టమేమో? ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూలో నేను కొత్త అయ్యుండొచ్చు. కెమెరా ఫేస్ చేయడం నాకు కొత్త కాదు. కొన్ని నాటకాల్లో నటించాను. అప్పుడు కెమెరాలో షూట్ చేశారు. ఫొటోషూట్స్ చేశాను. సో.. నాకేం ఇబ్బంది అనిపించలేదు. ‘కిస్సింగ్’ అనేది ఒక ఎమోషన్ అని సందీప్‌గారు చెప్పారు. అవును కదా.. నవ్వు, ఏడుపులా అది కూడా ఒక ఎమోషనేగా. దానికి అంత ఇబ్బంది ఎందుకు? అనిపించింది. మరి.. రొమాంటిక్ సీన్స్ చేశాక... మీరు, విజయ్ దేవరకొండ మామూలుగానే మాట్లాడుకోగలిగారా? ఇబ్బందేమైనా? నెవర్ అండి. కెమెరా ముందు మేం అర్జున్ – ప్రీతి. ఆ తర్వాత విజయ్, షాలిని. అందుకని బాగానే మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్. ‘కిస్సింగ్’ అనేది ఎమోషన్ కాబట్టి చేశానన్నారు. మరి.. సీన్ డిమాండ్ చేస్తే బికినీ ధరిస్తారా? అది ఫిజిక్‌ని బయటపెట్టేస్తుంది కదా? స్టోరీ డిమాండ్ చేస్తే నేను ఏది చేయడానికైనా రెడీ. కానీ, డైరెక్టర్ ఎలా తీస్తారు? అనేది మాత్రం చూసుకుంటా. నన్ను చీప్‌గా చూపించే సీన్స్ చేయను. చీప్‌గా కనిపించే కాస్ట్యూమ్స్ వేసుకోను. కానీ, కొంచెం బొద్దుగా ఉన్నారు కాబట్టి మీ ఫిజిక్‌కి బికినీ సూట్ కాదేమో? ‘అర్జున్‌రెడ్డి’లో ప్రెగ్నెంట్ ఉమన్‌గా కనిపించాల్సి వచ్చింది కాబట్టి, బరువు పెరిగాను. ఇప్పుడు సన్నబడి పోయాను. తెలుగు ‘100% లవ్’ తమిళ రీమేక్‌లో యాక్ట్ చేస్తున్నాను కదా. ఆ సినిమాలో టీనేజ్ గాళ్‌గా కూడా కనిపించాలి కాబట్టి తగ్గాను. తమన్నా ఓ పది సినిమాలు చేశాక ‘100% లవ్’ ఒప్పుకున్నారు. ఫుల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. మీరేమో జస్ట్ వన్ మూవీ ఓల్డ్. మరి చేయగలుగుతారా? ఇది నాకు చాలెంజింగ్. ఆ సినిమా చూశాను. తమన్నా చాలా బాగా చేశారు. నేను ఆమెలా చేయను. నాలా చేస్తాను. క్యారెక్టర్‌కి న్యాయం చేయగలననే నమ్మకం ఉండబట్టే ఒప్పుకున్నా. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఏ సినిమా ఒప్పుకున్నా, నేను చేయగలననే నమ్మకం ఉంటేనే ‘యస్’ అంటా. సీనియర్ నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా తీస్తోన్న ‘మహానటి’లో చేస్తున్నారు కదా.. మీ క్యారెక్టర్ గురించి? డీటైల్స్ చెప్పలేను. ఇంకా టైమ్ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’లో కనిపించిన షాలిని వేరు.. ఈ సినిమాలో కనిపించబోతున్న షాలిని వేరు. ఫైనల్లీ డ్రీమ్ రోల్ ఏదైనా? నేను మంచి ఆకలి మీద ఉన్న హీరోయిన్ని. ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలనుకుంటున్నాను. అదే నా డ్రీమ్ రోల్ అనుకుని, చేస్తా. తమిళంలో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా కథలు వింటున్నాను. సో.. కెరీర్ గురించి ఫుల్ పాజిటివ్‌గా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ షాలిని.. థ్యాంక్యూ . – డి.జి. భవాని -
మెంటలెక్కిస్తున్నారు
పిచ్చెక్కిస్తున్నారు. హిట్ల మీద హిట్లు కొట్టి పిచ్చిపిచ్చిగా ఆడిస్తున్నారు. మైండ్ తన్నితే చాలు.. డబ్బులే డబ్బులు! చిన్న సైకో ప్రాబ్లమ్ చాలు.. పిక్చర్ పెద్ద హిట్ కొట్టడానికి! కనకవర్షానికి ఇప్పుడు... కొత్త ధ్వని.. లక లక లక! తిన్నగా ఉంటే ఎవరూ తల తిప్పి చూడరు. తేడాగా ఉండాలి. మనిషైనా, మూవీ అయినా. మనిషి తేడాగా ఉంటే ‘వీడెవడ్రా తేడా గాడు’ అని దూరంగా వెళ్లిపోతాం. సినిమా తేడాగా ఉంటే ‘డిఫరెంట్‌గా ఉందట గురూ’ అనుకుంటూ థియేటర్‌కి వెళ్లిపోతాం. మూవీ ఆడిందంటే తేడాగా ఉందనే. అలాగని, తేడా ఉన్న ప్రతిదీ ఆడేస్తుందని కాదు. కొన్ని ఆడేసుకునేవీ ఉంటాయ్. ఆటాడుకున్నవీ ఉంటాయి. ఆడేసుకోవడం చూసినవాళ్లనీ, ఆటాడేసుకోవడం తీసినవాళ్లనీ! ‘వీడు తేడా’ అని ఆరేళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. టైటిల్ వరకే అది తేడా. స్టోరీలో తేడా లేదు. రెగ్యులర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తింగరి టైటిల్ చూసి, టైటిల్ రైటింగ్‌లోని వంకర టింకర్లను చూసి రవితేజ మూవీ ఏమో అనుకుంటాం. కాదు. నిఖిల్ హీరో. జనరల్‌గా మన హీరో క్యారెక్టర్లలో రవితేజ బాగా తేడా. ఆ తేడా కొంచెం నిఖిల్లో కూడా ఉంది. అందుకే.. డైరెక్టర్ చిన్నికృష్ణ .. అఖిల్‌తో ‘వీడు తేడా’ అని తీశాడు. అఖిల్ నిజంగా తేడాగా కనిపించే మూవీ మాత్రం ‘సూర్య వర్సస్ సూర్య’. 2015లో వచ్చింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. అందులో నిఖిల్‌కి ‘పోర్ఫీరియా’. కోటి మందిలో ఒకరికి వచ్చే జెనిటిక్ డిజార్డర్! అతడి బాడీ హిమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చెయ్యదు. ఎండ తగిలితే పదిహేను నిమిషాల్లో చచ్చిపోతాడు! వేరే మార్గం లేక నైట్ కాలేజ్‌కి వెళ్తాడు. ఇంట్లో లేట్ నైట్ షోలు చూస్తూ టీవీ యాంకర్ త్రిదా చౌదరి ప్రేమలో పడతాడు. ప్రేమతో పోలిస్తే పోర్ఫీరియా ఏమంత పెద్ద డిజార్డర్?! నిఖిల్ ఎలా త్రిదా ప్రేమను గెలిచాడన్నది స్టోరీ. ఈమధ్య జనం చూసిన తేడా సినిమా ‘అర్జున్‌రెడ్డి’. అందులో విజయ్ దేవరకొండకు పనిగట్టుకుని డిజార్డర్ ఏమీ ఉండదు. లవ్‌లో పడి ఒక ఆర్డర్ లేకుండా పోతాడు. లవ్‌లో పడినవాళ్లంతా ఆర్డర్ లేకుండా పోతారా? పోరు. ఇందులో ఎమోషనల్లీ వాడు తేడా. యాంగర్ మేనేజ్మెంట్ చేతకాదు. ‘ఎవడ్రా వాడు.. ఓయ్’ అని పెద్దగా లేస్తాడు.. వాడి పిల్లను ఎవరైనా, ఏమైనా అంటే. ఆడింది. రైట్ నౌ.. జనం చూస్తున్న తేడా మూవీ ‘మెంటల్ మదిలో..’ వివేక్ ఆత్రేయ డైరెక్టర్. శ్రీవిష్ణు హీరో. ‘మనవి ఆలకించరాదటే’ అన్నది టైటిల్‌కి ట్యాగ్‌లైన్. పిల్లాడు శుభ్రంగా ఉంటాడు. కానీ గందరగోళం. రెండుంటే ఒకటి సెలక్ట్ చేసుకోలేడు. కళ్లముందు ఒకటే ఉండాలి. తల్లొచ్చి హెల్ప్ చేస్తుంది. మల్టిపుల్ ఛాయిసెస్ డిజార్డర్. బీరువా తెరుస్తాడు. ఆ రోజు ఏ షర్ట్ వేసుకోవాలో తేల్చుకోలేడు. ఇదా, అదా.. ఇది కాకపోతే అదా, అది కాకపోతే ఇదా.. కన్ఫ్యూజన్. అన్నీ ఇంతే. చాయిస్ అంటే వాయిస్ డౌన్ అయిపోతుంది. కాళ్లూ చేతులు ఆడవు. దేవుడు అన్నిచోట్లా ఉండలేక తల్లి లాంటి స్త్రీని సృష్టించాడని అంటారు. ఎంత తల్లయినా ఇలాంటి కన్ఫ్యూజన్ కొడుకు వెళ్లిన చోటుకల్లా వెళ్లి, సెలక్ట్ చేసి పెట్టగలదా?! చివరి వాడి దరిద్రం. లైఫ్‌లోకి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తారు. వాళ్లలో ఎవర్ని సెలక్ట్ చేసుకోవాలన్నది ప్రాబ్లమ్. దీనికి ముందొచ్చిన తేడా మూవీ ‘మహానుభావుడు’. హీరో శర్వానంద్. డైరెక్టర్ మారుతి. క్లీన్ అండ్ టైడీ అని మూవీకి రివ్యూలు వచ్చాయి. ఇందులో హీరోకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. బ్రీఫ్‌గా ఓసీడీ. శుభ్రత అతడి వీక్నెస్. చేతుల శుభ్రం, కాళ్ల శుభ్రం, నోటి శుభ్రం, ఒంటి శుభ్రం. టోటల్‌గా మనిషి అతి శుభ్రం. కుర్రాడు అందంగా ఉంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్. అయితే అపరిచితుడిలా అతడిలోని ‘అతిశుభ్రుడు’ సమయం, సందర్భం లేకుండా పైకి వచ్చేస్తుంటాడు. అంత శుభ్రతలో కూడా.. తన టీమ్‌లోకి కొత్తగా వచ్చి చేరిన మెహ్రీన్‌ని లవ్ చేసేస్తాడు! ఆ అమ్మాయి కూడా ఈ స్వచ్ఛ భారతీయుడిని లవ్ చేస్తుంది. కానీ అతడిది ‘మనసు లేని శుభ్రత’ అని బయటపడిన రోజు మెహ్రీన్ మనసు విరిగిపోతుంది. ఆమె తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తే తన ఓసీడీ కారణంగా ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లలేకపోతాడు శర్వానంద్! అది ఆమెను హర్ట్ చేస్తుంది. మళ్లీ ఎలా కలుసుకున్నారన్నది మిగతా స్టోరీ. ఈ సినిమా వచ్చినప్పుడు ‘మారుతి మరో జబ్బు సినిమా’ అని కూడా రివ్యూలు వచ్చాయి. మారుతి మళ్లీ ఇలాంటి సినిమానే ఇంకోటి తీస్తే.. నో డవుట్.. డిజార్డర్ల డైరెక్టర్ అయిపోతాడు ఆయన. మహానుభావుడికి ముందు మారుతి ‘భలే భలే మగాడివోయ్’ తీశాడు. అందులో హీరో నానీ. మతిమరుపు అతడి డిజార్డర్. అది అతడిని కష్టాల్లో పడేస్తుంటుంది. ఆ కష్టాల్లోంచి కామెడీని లాక్కున్నాడు మారుతి. ‘గజనీ’ మూవీలో హీరో సూర్యకి ‘యాంటెరోగ్రేడ్ ఆమ్నీసియా’. అతడి మెమరీ పావుగంట మాత్రమే ఉంటుంది! లవ్‌ని మిక్స్ చేసి రెండున్నర గంటల సేపు లాగాడు మురుగదాస్. హిట్టయింది. సూర్యతో అతడు తీసిందే ‘సెవన్త్ సెన్స్’. అందులో సూర్యకు డిజార్డర్ ఏమీ లేదు. ‘బియాండ్ ఆర్డర్’ పనిచేస్తుంటుంది అతడి మైండ్. అదీ హిట్. సుకుమార్ ‘1 నేనొక్కడినే’లో మహేశ్‌బాబుది ‘ఇంటెగ్రేషన్ డిజార్డర్’. అతడి బ్రెయిన్లోని ‘గ్రే ఏరియాలో’ 25 పర్సెంట్ మిస్ అవుతుంది. దాంతో ఏవో కలలు అతడిని వెంటాడుతుంటాయి. వాటిని నిజం అనుకుని, ఆ కలల్లో వ్యక్తుల్ని పోల్చుకుని ఒక్కొక్కర్నీ చంపేస్తుంటాడు. జనానికి పిచ్చెత్తిపోయింది. పిచ్చిని పిచ్చిగా చూపిస్తే ఇంతే. ఇంకేదైనా మిక్స్ చెయ్యాలి. ఆ మిక్సింగ్ మిస్సయింది ‘1 నేనొక్కడినే’లో. ‘అపరిచితుడు’లో విక్రమ్‌ది ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’. మనిషి ఒక్కడే. లోపల ముగ్గురు ఉంటారు. అవసరాన్ని బట్టి ఒకడు బయటికి వస్తుంటాడు. ‘చంద్రముఖి’లో జ్యోతిక ‘స్పి›్లట్ పర్సనాలిటీ డిజార్డర్ ఇంచుమించు ఇలాంటిదే. ఆమె దెబ్బకు ఇంట్లో ఒక్కొక్కరూ ఒణికి చస్తుంటారు. ఇవి కాకుండా ‘బై పోలార్ డిజార్డర్’ అని ధనుష్ ‘త్రీ’ సినిమాలో ఒక డిజార్డర్ ఉంది. మూడ్స్ ఎప్పుడు ఎలా ఎందుకు మారతాయో తెలీదు. ఈ పిక్చర్ ఎందుకు ఆడలేదనేది మాత్రం డైరెక్టర్‌కి («ధనుష్ భార్యే) ఆ తర్వాత తెలిసే ఉంటుంది. జనానికి ఎక్కలేదు! ‘ఇంద్రుడు’ మూవీలో విశాల్‌కు ‘నార్కోలెప్సీ’. కాస్త ఎమోషనల్‌గా ఫీల్ అయితే చాలు అక్కడి కక్కడే నిద్రలోకి జారుకుంటాడు. జనానికి నిద్ర రాకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి విశాల్ బతికిపోయాడు. అతడే నిర్మాత మరి. ‘నేను మీకు తెలుసా’లో మంచు మనోజ్‌కి షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ ఉంటుంది. ముందు రోజేం జరిగిందీ గుర్తుండదు. టేప్ రికార్డర్‌తో గెటాన్ అయిపోతుంటాడు. ఇదిగో.. ఈ ‘తేడా’ల లిస్టులో వెతుక్కుంటూ పోతే ఇంకా ఒకట్రెండు సినిమాలు దొరుకుతాయి. కాలొంకర, చెయ్యొంకర ఉంటే తేడా అనం. మైండ్ ఆర్డర్ తప్పితేనే అది తేడా. కళ్లు లేని సినిమాలు, కాళ్లు లేని సినిమాలు, మరుగుజ్జు సినిమాలు, లడ్డు బాబు సినిమాలు.. మహామహులు నటించినవి తెలుగులో చాలా ఉన్నాయి. ఉన్నవి బోర్ కొట్టినప్పుడే లేనిది డిఫరెంట్ అవుతుంది. అందుకే వసంత కోకిలలు, స్వాతిముత్యాలు మెల్లిగా స్క్రీన్ మీదికి వచ్చాయి. అవీ పాతబడ్డాక డిజార్డర్ స్థాయి పెరిగి కామెడీలోకి టర్న్ అయింది. చూపు లేకపోవడం లైఫ్ ఛాలెంజ్. అది ఇన్స్పిరేషన్. తేడాగా చూపించడం స్క్రీన్ ఛాలెంజ్. అది ఎంటర్టైన్మెంట్. దటీజ్ వై.. బాడీలోని తేడాల కన్నా, బ్రెయిన్లోని తేడాలు ఇప్పుడు మూవీ మార్కెట్లో సేల్ అవుతున్నాయి. లైఫ్‌లో కష్టం ఉంటుంది. సంతోషం ఉంటుంది. కష్టాల్లోని కామెడీని చూపిస్తే మనిషికి ధైర్యం వస్తుంది. మనదీ ఒక కష్టమేనా అనిపిస్తుంది. బతగ్గలను అన్న నమ్మకం వస్తుంది. సినిమా దర్శకులు ఈ సూత్రాన్ని పట్టుకుని ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారు. ‘తేడా’లోని ఎంటర్టైన్మెంట్ని చిలికి, పైకి తెచ్చి, తలా ఇంత ముద్ద చేతిలో పెడుతున్నారు. -
‘వర్మ’ హీరోయిన్ ఇలా ఉండాలట..!
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కోసం ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఓ అమ్మాయి ముఖం కనిపించకుండా షూట్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన హీరో విక్రమ్, ‘ఈమె కనబడటం లేదు. ఒకవేళ ఈమె మీరే అయినా..లేక మీరు ఈమెలాగే ఉన్నా.. మీ ఫొటోలను వీడియోలను మాకు పంపించండి. నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్న. సమయం తీసుకోండి. కానీ త్వరపడండి’అంటూ కామెంట్ చేశాడు. హీరోయిన్ ఎంపిక కోసం వర్మ టీం రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. And.. SHE IS MISSING. If you are her or anyone who looks like her, send your pics or videos to varmathemovie@gmail.com. Can't wait to meet you. Take your time, but hurry. #heroinesearch #castingcall #vermas❤️#whostheluckygirl #thesearchbegins # varmathemovie #dirbala #dhruvvikram #E4entertainment. Thank you Shruti for your enchanting voice. Thanks ms AB. 🎥 Sukumar ✂️ Pradeep Jenifer 🎨 Kiran 👗Sathyasuku @shrutzhaasan @dhruv.vikram @mukeshe4e @pradeepjenifer A post shared by Vikram (@the_real_chiyaan) on Nov 11, 2017 at 10:31pm PST -
ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందే..!
తమిళ సినిమా : అర్జున్‌రెడ్డి అనూహ్య విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇంతకు ముందు టాలీవుడ్లో మారుమోగింది. ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తెలుగులో యువ నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. ఇదేమంత విశేషం కాదు. అయితే, ఇందులో విజయ్ దేవరకొండ పాత్రను నటుడు విక్రమ్ వారసుడు ధృవ పోషించనుండటం కచ్చితంగా విశేషమే అవుతుంది. ఎందుకంటే ధృవ పరిచయ చిత్రం ఇదే అవుతుంది. ఇక అంతకంటే సంచలనం ఏమిటంటే వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు బాలా హ్యాండిల్ చేయనుండటం. విక్రమ్‌కు సేతు చిత్రంతో సినీ జీవితానిచ్చిన ఈయన తన కొడుకు నట జీవితానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అధర్వ, జ్యోతికలతో నాచ్చియార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలా ధృవ హీరోగా రూపొందించనున్న చిత్ర షూటింగ్‌ను డిసెంబర్లో ప్రారంభించనున్నారు. కాగా ఈ చిత్రానికి వర్మ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్ ఫస్ట్‌లుక్‌ను నటుడు విక్రమ్ శుక్రవారం విడుదల చేశారు. వర్మ చిత్ర ఫస్ట్‌లుక్‌కు సినీ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ టైటిల్‌పై దర్శకుడు వర్మ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చాలా విషయాలపై ట్విట్టర్ ద్వారా స్పందించే దర్శకుడు వర్మ ఈ ధృవ చిత్ర టైటిల్‌పై కూడా తనదైన బాణీలో పరిహాసం చేశారు. ఆయనేమన్నారంటే..వర్మ ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. వర్మ టైటిల్‌పై దర్శకుడు వర్మ చేసి వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది : వర్మ
ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పినా వర్మ మాటల దాడి మాత్రం ఆగటంలేదు. తాను వేదించాలనుకున్న వ్యక్తులు తనకు బోర్ కొట్టేశారంటూ ట్విట్టర్ ఎకౌంట్ క్లోజ్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్తగా ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా తన మాటల దాడి కొనసాగిస్తున్నాడు. ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాకు విపరీతమైన ప్రచారం చేసిన పెట్టిన వర్మ ఇప్పుడు ఆ సినిమా తమిళ రీమేక్ మీద పడ్డాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వర్మ అనే టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ టైటిల్‌పై స్పందించిన వర్మ సినిమా టైటిల్ లోగో పోస్టర్‌తో పాటు ‘అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ పేరు వర్మ అంట, ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వర్మ నాగార్జున హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు వివాదాస్పద లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. Arjun Reddy Tamil version peru VARMA anta..Aa peru yekkado vinnattu gurthunnattu anipisthunnattu vundhi🙄 A post shared by RGV (@rgvzoomin) on Nov 10, 2017 at 7:00am PST -
మంజుల మాట విని షూటింగ్ క్యాన్సిల్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల, ఇటీవల తన పుట్టిన రోజు సందర్బంగా ‘మనసు చెప్పింది’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీడియోకు సినీపప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెళ్లువెత్తాయి. తాజాగా యంగ్ హీరో విజయ్ ఆమె ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపించాడు. తన మనసు నిద్రపొమ్మని చెప్పిందని, అందుకే షూటింగ్ క్యాన్సిల్ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌తో పాటు ఓ ఫొటోనూ కూడా షేర్ చేశాడు విజయ్. ఈ పోస్ట్‌ను మంచులకు ట్యాగ్ చేసి తను తన హార్ట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలిపాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న విజయ్, ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. Shoot cancelled, Heart said go back to sleep 😊#FollowYourHeart @ManjulaOfficial pic.twitter.com/28uVzD6YTy — Vijay Deverakonda (@TheDeverakonda) 9 November 2017 -
కొత్త దర్శకుడితో విజయ్..!
అర్జున్ రెడ్డి సినిమక్తో ఒకసారిగా స్టార్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ, వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు. విజయ్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఇప్పటికే దర్శకులుగా సక్సెస్ సాధించిన వారితోనే సినిమాలు చేస్తున్నాడు. మరోసారి ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ.భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చటంతో అతనితో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాను విజయ్ హీరోగా పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌తో కలిసి బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకావం ఉంది. -
‘అర్జున్‌రెడ్డి’ సూపర్ ఫ్లాప్.. రీజన్ ఇదే!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదల సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి. ముఖ్యంగా వివాదాలతోనే కావాల్సినంత ప్రచారం దొరికిన ఈ మూవీని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఆమూవీ విడుదలైనప్పుడు అద్భుతమైన మూవీ అని, హీరో విజయ్ దేవరకొండ నటన సూపర్ అంటూ మెచ్చుకున్న ఆర్జీవీ.. తాజాగా అర్జున్‌రెడ్డి మూవీ సూపర్ ఫ్లాప్ అని కామెంట్ చేశారు. అదేంటి ఇంతలో వర్మ రూట్ మార్చాడా అనుకుంటున్నారా.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా ఇటీవల ఆర్జీవీని కలుసుకున్నాడు. మరో విభిన్న కథాంశంతో తాను తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ స్టోరీని సీనియర్ డైరెక్టర్ ఆర్జీవీకి వివరించాడు. దీనిపై స్పందించిన వర్మ.. ‘సందీప్ నాకు లేటెస్ట్ మూవీ స్టోరీ వినిపించాడు. నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఈ సినిమా కథతో పోలిస్తే గత చిత్ర అర్జున్‌రెడ్డి సూపర్ ఫ్లాప్. సందీప్ కొత్త సినిమా మెగా సక్సెస్ అవుతుంది. అందుకే అర్జున్‌రెడ్డి ఫ్లాప్ అనిపిస్తుందని’ సందీప్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ’లక్ష్మీస్ ఎన్టీఆర్’తో బిజీగా ఉన్న డైరెక్టర్ వర్మ.. టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.