
టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తమిళ అర్జున్ ఆదిత్మ వర్మ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కించారు.
అయితే బాల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవుట్‌పుట్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment