
తెలుగులో సంచనల విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను వర్మ పేరుతో బాలా దర్శకత్వంలో రూపొందించారు. అయితే నిర్మాతలకు అవుట్‌పుట్ నచ్చకపోవటంతో గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు.
అయితే రెండో వర్షన్ విషయంలోనూ రకరకాల అనుమానలు వచ్చాయి. షూటింగ్ అనుకున్నట్టుగా సాగటం లేదని, ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. చివరి షాట్‌కు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేశారు.
హీరో హీరోయిన్లపై చివరి షాట్‌ను చిత్రీకరించారు. ఈ షూటింగ్ జరుగుతుండగా చియాన్ విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనిటా సంధు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment