dhruv
-
లాక్ డౌన్లో ఏం జరిగింది?
ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నాలుగైదు సినిమాలు అంగీకరించి, ఫుల్ ఫామ్‌లో ఉన్నారు అనుపమా పరమేశ్వరన్. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి ‘బైసన్’ టైటిల్ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది. అనుపమ లీడ్ రోల్లో రూపొందనున్న మరో చిత్రం ‘లాక్ డౌన్’ ప్రకటన కూడా వచ్చింది.ఈ చిత్రాన్ని ప్రకటించి, ‘‘భావోద్వేగాలతో కూడిన కథను చూడ్డానికి సిద్ధం అవ్వండి’’ అంటూ అనుపమా పరమేశ్వరన్ పస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ‘లాక్ డౌన్’లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఈ రేంజ్లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
బహుమతి లాంటి సినిమా: హీరోయిన్ అనుపమ
విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించనున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ధృవ్‌కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటించనున్నట్లు మంగళవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. రజనీకాంత్‌తో ‘కాలా’, ‘కబాలి’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు పా. రంజిత్ ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘నా కెరీర్‌కు ఓ మంచి బహుమతిలా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనుపమా పరమేశ్వరన్. ‘‘కబడ్డీ ఆట మూలాలను తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. మా టీమ్ సభ్యుల కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌లా ఈ చిత్రం ఉంటుంది’’ అని మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
ధ్రువ్‌కు జోడీగా..?
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారట. అనుపమాకి ఇటీవల మారి సెల్వరాజ్ ఈ కథను వినిపించగా, ఈ బ్యూటీ ఆల్మోస్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మరి.. ధ్రువ్ విక్రమ్‌కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 15న తమిళనాడులోని తూత్తుకూడిలో ప్రారంభం కానుందని సమాచారం. -
ధ్రువ్–తనీషా జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
కటక్: ఒడిశా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం విజేతగా నిలువగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ చాంపియన్ అయ్యాడు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ధ్రువ్–తనీషా జోడీ 74 నిమిషాల్లో17–21, 21–19, 23–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–తాన్ వె హాన్ జెస్సికా (సింగపూర్) జంటను ఓడించింది. ధ్రువ్–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సతీశ్ 21–18, 19–21, 21–14తో ఆయుశ్ శెట్టి (భారత్)పై గెలిచాడు. సతీశ్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 14–21, 17–21తో మెలీసా–రాచెల్ రోజ్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ (భారత్) జంట 20–22, 18–21, 17–21తో లిన్ బింగ్ వె–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
సరైన హిట్ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న విక్రమ్ కొడుకు
కొందరికి సక్సెస్ అనేది కాస్త ఆలస్యంగానే వస్తుంది. యువ నటుడు ధ్రువ్‌విక్రమ్ ఈ కోవలోకే వస్తారు. ప్రముఖ నటుడు విక్రమ్ వారసుడు ఈయన అన్నది తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని విక్రం తన వారసుని ఆదిత్యవర్మ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేశారు. ఇది తెలుగులో విజయాన్ని సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్. అయితే కారణాలు ఏమైనా ఈ చిత్రం ధ్రువ్‌విక్రమ్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈయన తన తండ్రితో కలిసి మహాన్ అనే చిత్రంలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వలనో, వేరే కారణాలు వలనో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే ధ్రువ్‌విక్రమ్ నటనకు మాత్రం విమర్శకల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే ఈసారి కాస్త ఆలస్యం అయినా గట్టిగా హిట్ కొట్టే తీరాలి అన్న దృఢ సంకల్పంతో ఈ యువనటుడు ఉన్నట్లు తెలుస్తోంది. అలా నాలుగేళ్లుగా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో పరియోరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ వైవిధ్యభరిత కథతో ధ్రువ్‌విక్రమ్ ను డైరెక్టర్ చేయడానికి ముందుకు వచ్చారు.అయితే ఆయన ఉదయనిధి స్టాలిన్, కీర్తీసురేష్ జంటగా నటించిన మామన్నన్ చిత్ర చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత ధ్రువ్ విక్రమ్‌తో చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నటుడు ధ్రువ్ విక్రమ్ దానికంటే ముందు మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. డాడా చిత్రం ఫేమ్ గణేష్ బాబు దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
నిధుల వేటలో ధృవ స్పేస్
హైదరాబాద్: స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ధృవ స్పేస్ ఒకట్రెండేళ్లలో రూ.204 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. 100 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అభయ్ ఏగూర్ వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నామని, ఔత్సాహికులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ధృవ స్పేస్ ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి నిధులు అవసరం లేదు. అయితే కంపెనీకి చెందిన ఇతర విభాగాలకు ఇది అవసరం కావచ్చు. పెద్ద శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి వైపునకు కంపెనీ వెళుతోంది. ఇప్పటికే ప్రయోగించిన వాటి కంటే కొంచెం పెద్ద ఉపగ్రహాలను వచ్చే ఏడాది మధ్యలో లే దా చివరిలో కక్ష్యలో ప్రవేశపెట్టగలమని ఆశాభావంతో ఉన్నాం. ఇందుకు తగ్గ అభివృద్ధి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ధృవ స్పేస్ రూపొందించిన నానో ఉపగ్రహాలు తైబోల్ట్–1, తైబోల్ట్–2 శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ54 ఉపగ్రహ ప్రయోగనౌక ద్వారా ఇస్రో నవంబర్ 26న విజయవంతంగా ప్రయోగించింది. వీటి విజయం తర్వాత సంస్థ ప్రస్తుతం పీ30 ప్లాట్ఫామ్లో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్స్‌ను విస్తృతంగా అందజేసే 30 కిలోల బరువున్న ఉపగ్రహంపై పని చేస్తోంది’ అని అభయ్ పేర్కొన్నారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడం మొదలైందని, ప్రస్తుతం కంపెనీ బృందం ఈ మిషన్‌ను కొనసాగించడంలో, ఉపగ్రహాలను నిర్వహించడంలో బిజీగా ఉందన్నారు. దశాబ్దకాలం పూర్తి చేసుకున్న ధృవ స్పేస్ ఇప్పటి వరకు రూ.65 కోట్ల నిధులను అందుకుంది. -
సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్
తమిళసినిమా: విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ఆదిత్య వర్మ. ఇది తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్‌రెడ్డికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో ఈ త్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే నటుడిగా ధృవ్ విక్రమ్‌కు మంచి వర్కులు పడ్డాయి. తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత ధృవ్ విక్రమ్ మంచి కథా చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. పరియేరుమ్ పెరుమాళ్, కర్నన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ కర్నన్ చిత్రం తరువాత ధృవ్ విక్రమ్ హీరోగా కబడ్డీ క్రీడ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. అలాంటిది సడన్‌గా ఉదయనిధి స్టాలిన్ హీరోగా వమన్నన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. దీంతో ధృవ్ విక్రమ్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
Chiyaan Vikram Health Bulletin Released: స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం (జులై 8) మధ్యాహ్నం విక్రమ్ అస్వస్థతకు గురికాడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి కారణంగానే విక్రమ్ ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిపుణలైన వైద్యులతో చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజామాన్యం పేర్కొంది. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, శనివారం ఉదయం డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే విక్రమ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విక్రమ్ తనయుడు ధృవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. ఈ పోస్ట్‌లో 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులరా, నాన్నకు ఛాతీలో కొద్దిపాటి నొప్పికారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఈ పుకార్లు విని మేము చాలా బాధపడ్డాం. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. మా చియాన్ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు' అని పేర్కొన్నాడు. మరోవైపు విక్రమ్ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా నేడు (జులై 8) సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన 'పొన్నియిన్ సెల్వన్' టీజర్ లాంచ్‌కి విక్రమ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు విక్రమ్ కోబ్రా సినిమాలో కూడా నటిస్తున్నాడు. -
అలరిస్తోన్న చియాన్ విక్రమ్ 'మహాన్' మేకింగ్ వీడియో..
Chiyan Vikram Mahaan Movie Making Video Released: విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. 'మహాన్' టీజర్లో విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటన అలరించింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో విక్రమ్, ధ్రువ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రన్ తదితరులు తమ పాత్రల కోసం ఏ విధంగా కష్టపడ్డారో చూపించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. -
న్యూ ఇయర్..న్యూ లవ్ స్టోరీస్.. వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా?
2022 స్టార్టింగ్ లోనే న్యూ లవ్ స్టోరీస్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. గతంలో రీల్ పై ప్రేమలో పడినట్లు నటించిన జోడీస్ రియల్ లైఫ్ లోనూ లవ్ లో పడ్డారని జోరుగా ప్రచారం సాగుతోంది.కొద్ది రోజులుగా అలాంటి లవ్ బర్డ్స్ గురించే ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ లో నటించి మెప్పించారు విజయ్ దేవరకొండ, రష్మిక. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ పై చాలా కాలంగా రూమర్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లే వీరిద్దురు చాలా సార్లు కలసి కనిపించారు. ఒకసారి రెస్టారెంట్ లో మరోసారి ఈవెంట్ లో ఈజోడి అందరికళ్లకు కనిపించారు. ఇప్పుడు లేటెస్ట్ గా గోవాలో వీరిద్దరు కలసి పార్టీ చేసుకున్న ఫోటోస్ బయటికి రావడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. లైగర్ లో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది అనన్యా పాండే. తనకు ఇది తొలి తెలుగు చిత్రం. బాలీవుడ్ లో మాత్రం డ్రీమ్ గర్ల్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీ కూడా డ్ హీరో షాహిద్ కపూర్ బ్రదర్ ఇషాన్ కట్టర్ లవ్ లో పడిందని బీటౌన్ చెబుతోంది. ఇషాన్ కట్టర్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కాలీపీలీ అనే సినిమాలో ఇషాన్, అనన్య కలసి నటించారు.ఈ సినిమా సెట్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిరుగించిందట.రీసెంట్ గా వీరిద్దరు రాజస్తాన్ లోని ఒక నేషనల్ పార్క్ లో న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతో వీరిద్దరు త్వరలోనే తమ రిలేషన్ ను అఫీసియల్ చేస్తారని ప్రచారం సాగుతోంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ప్రేమలో పడ్డాడు అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తమిళ అర్జున్ రెడ్డి రీమేక్ లో హీరోయిన్ గా నటించిన బనితా సంధుతో ధృవ్ లవ్ లో ఉన్నాడట. ఇటీవల దబాయ్ లో వీరిద్దరు న్యూ ఇయర్ వేడుకులను జరుపుకున్నారు. దాంతో ధృవ్, బనితా లవ్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. -
సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట సంచలనం
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 178వ ర్యాంక్‌లో ఉన్న సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 21–11, 22–20తో ప్రపంచ 5వ ర్యాంక్, రెండో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలాతి దెవా ఒక్తావియాంతి (ఇండోనేసియా) జంటను బోల్తా కొట్టించింది. కేవలం 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సిక్కి–ధ్రువ్ జోడీ 15–19తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన సిక్కి–ధ్రువ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయినా... వెంటనే రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సుమిత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 15–21, 16–21తో హఫీజ్ ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (భారత్) 15–21, 12–21తో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–18, 15–21, 21–16తో క్రిస్టోవ్ పొపోవ్ (ఫ్రాన్స్)పై... హెచ్ఎస్ ప్రణయ్ 22–20, 21–19తో డారెన్ లియు (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ 10–21, 19–21తో హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో... ప్రపంచ 16వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–16, 14–21, 20–22తో హిరెన్ రుస్తావితో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. -
గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన గూఢచారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్‌ను ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నట్లు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రకటించారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో ఈ నౌకని రూపొందించారు. 2015లో నౌక నిర్మాణం ప్రారంభించగా 2020 అక్టోబర్‌లో పూర్తయింది. మొత్తం రూ.1,500 కోట్లతో ధ్రువ్ నిర్మితమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజనీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రు క్షిపణుల్ని సమర్థవంతంగా గుర్తించగల సామర్థ్యంతోపాటు అనేక ప్రత్యేకతలు ఈ నౌకకు ఉన్నాయి. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పాటు ఇతర భూభాగాల నుంచి క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా మనకు నష్టం జరగకుండా శత్రు క్షిపణులను ఏ ప్రాంతంలో ధ్వంసం చేయాలన్న విస్తృత సమాచారాన్ని సైతం అందించగల సామర్థ్యం ధ్రువ్ సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది. ధ్రువ్ నౌక మరిన్ని ప్రత్యేకతలివే.. ►దేశాన్ని మొత్తం నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మానిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ►ఈ నౌక రాకతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ►ఇందులో సెన్సార్లతో కూడిన త్రీ డోమ్ షేప్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీని వాడారు. ►అందుకే భారత నౌకాదళం ఐఎన్ఎస్ ధ్రువ్‌ని ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తోంది. ►అంతేకాకుండా.. దీని ద్వారా 14 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాగరతీరంలో విజయ జ్వాల బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పాక్‌తో 1971లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వార్షికోత్సవం స్వర్ణిమ్ విజయ్ వర్ష్‌లో భాగంగా వెలిగించిన విక్టరీ ఫ్లేమ్ శుక్రవారం ఈఎన్సీకి చేరుకుంది. ఈ విక్టరీ ఫ్లేమ్‌ను అధికారికంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ తీసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్ రాక సందర్భంగా శుక్రవారం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద వేడుకలు జరిగాయి. నేవీ సిబ్బంది నిర్వహించిన కవాతు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 1971 యుద్ధంలో పాల్గొన్న వారి అనుభవాలను హోంమంత్రి తెలుసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్‌ను స్వీకరిస్తున్న హోంమంత్రి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1971లో విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద 2020 డిసెంబర్ 16న నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. దక్షిణ కార్డినల్ కోసం విక్టరీ ఫ్లేమ్ ఐఎన్ఎస్ సుమిత్రలో పోర్ట్ బ్లెయిర్ నుంచి విశాఖపట్నం చేరుకుంది. ఇది నగరంలోని వివిధ పాఠశాలలకు వెళ్తుంది. అనంతరం రాజమహేంద్రవరం, విజయవాడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ నాలుగు విజయ జ్వాలలు కలుస్తాయి. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
INS Dhruv: ఇండియన్ జేమ్స్‌బాండ్.. ‘ధ్రువ్’
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశం ఎక్కుపెట్టిన క్షిపణి ఏదైనా సరే.. అదెక్కడ ఉంది.. ఎంత దూరంలో ఉంది.. దాన్ని ఛేదించేందుకు ఏం చేయాలనే వివరాల్ని రక్షణ రంగానికి చేరవేయగల సత్తాతో భారత్ అమ్ముల పొదిలో ‘ధ్రువ్’తార త్వరలో చేరబోతోంది. విభిన్న సాంకేతికతతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ క్షిపణి (మిసైల్)గ్రాహక యుద్ధ నౌక త్వరలోనే భారత నౌకాదళంలో సేవలందించనుంది. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు (హెచ్ఎస్ఎల్)లో రూ.1,500 కోట్ల వ్యయంతో ‘ఐఎన్ఎస్ ధ్రువ్’ రూపుదిద్దుకుంది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ సముద్ర నిఘా గూఢచారి నౌక వీసీ–11184ను నిర్మించారు. అనేక ప్రత్యేకతలు, శత్రు క్షిపణుల్ని గుర్తించగల అరుదైన సామర్థ్యం గల ఈ నౌకను రక్షణ శాఖ త్వరలోనే జాతికి అంకితం చేయనుంది. అణు క్షిపణుల్ని సైతం.. ధ్రువ్.. అనేక మిషన్లను ఒంటిచేత్తో పూర్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజినీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌తో పాటు ఇతర భూభాగాల నుంచి మిసైల్స్ ప్రయోగిస్తే.. వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. వాటి లక్ష్యాన్ని అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఇది సులువుగా కనిపెట్టేస్తుంది. వీటిని ఏ ప్రాంతంలో ధ్వంసం చేస్తే.. దేశానికి మేలు జరుగుతుందన్న విస్తృత సమాచారాన్ని రక్షణ శాఖకు అందించగల సామర్థ్యం దీని సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా సులభంగా గుర్తించేలా ధ్రువ్‌లో సాంకేతికతను అమర్చారు. ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ దేశం మొత్తం ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మోనిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ నౌక నిర్మాణంతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకూ ఈ తరహా టెక్నాలజీ నౌకలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉన్నాయి. అందుకే భారత నౌకాదళం ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ యుద్ధనౌకను ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తున్నారు. దీని తయారీని 2015లో ప్రారంభించారు. 2020 అక్టోబర్‌లో నౌక నిర్మాణం పూర్తయింది. హిందుస్థాన్ షిప్‌యార్డులో నిర్మితమైన అతి భారీ నౌక ఇదే కావడం విశేషం. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో సెన్సార్లతో కూడిన ‘త్రీ డోమ్ షేప్డ్ సరై్వలెన్స్ సిస్టమ్’ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీ వినియోగించారు. దీని ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేయొచ్చు. నౌక నిర్మాణం పూర్తయిన తర్వాత 6 నెలల పాటు రహస్యంగా షిప్‌యార్డు డ్రై డాక్‌లోనే ఉంచారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా విధుల్లోకి తీసుకొచ్చారు. త్వరలోనే అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. -
మైదానంలోనే కుప్పకూలాడు.. 18 ఏళ్లకే
వాషింగ్టన్: కారు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్(45) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టైగర్ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో ఆయనను ఆస్పత్రికి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, కుడి కాలులో రాడ్డు వేసినట్లు తెలిపారు. కాగా లాస్ ఏంజెల్స్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్ తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టైగర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరికొంత మంది గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కోబీ బ్రియాంట్ సహా అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిన క్రీడాకారులను తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. పద్దెనిమిదేళ్లకే మృత్యువాత పడ్డాడు ధ్రువ్ మహేందర్ పండోవ్.. పంజాబ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. 1974 జనవరి 9న జన్మించిన అతడు పదమూడేళ్ల వయస్సులోనే దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. జమ్ము కశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులు చేసిన ధ్రువ్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 14 ఏళ్ల 294 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతేగాక రంజీ ట్రోఫీలో 1000 పరుగుల మార్కును చేరుకున్న పిన్న వయస్కుల్లో(17 ఏళ్ల 341 రోజులు) ఒకడిగా కూడా నిలిచాడు. మెరుగైన భవిష్యత్తు గల ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న ధ్రువ్ దురదృష్టవశాత్తూ అంబాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పద్దెమినిదేళ్ల వయసులో(1992, జనవరి 31)నే ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు. మైదానంలో కుప్పకూలాడు భారత్ తరఫున 4 టెస్టు మ్యాచ్‌లు, 32 వన్డేలు ఆడాడు క్రికెటర్ రమణ్ లంబా కుశాల్. 1960లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన అతడు, ఐర్లాండ్ తరఫున అనధికారంగా వన్డే మ్యాచుల్లో పాల్గొన్నాడు. అంతేగాకుండా బంగ్లాదేశ్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. ఈ క్రమంలో 1998 ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో భాగంగా క్రికెట్ బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగడంతో కోమాలోకి వెళ్లి మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. కూతురితో పాటు తాను కూడా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ గతేడాది తన అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని వీడాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. కూతురు జియానాను సైతం తనలాగే అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి తనతో పాటు హెలికాప్టర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారితో పాటు మరో ఏడుగురు కూడా మరణించారు. ఏడేళ్లపాటు జీవచ్చవంలా ఫార్ములా వన్ మాజీ ప్రపంచ చాంపియన్ మైకెల్ షుమాకర్ స్కై డైవింగ్ సరదాతో చావు అంచుల దాకా వెళ్లాడు. ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో షుమేకర్ స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన అతడు సుదీర్ఘకాలంపాటు కోమాలోనే ఉన్నాడు. 1946లో తొలిసారిగా ఆరంభమైన ఫార్ములా వన్ నాటి నుంచీ అంతకు ముందెన్నడు లేనివిధంగా, ఫార్ములా వన్ చాంపియన్ షిప్ లతో పాటు పందేలనూ గెలుచుకున్న షూమాకర్.. 2004లో చివరిసారిగా తన చివరి ఫార్ములా రేస్‌ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం అతడు కోమా నుంచి బయపడినప్పటికీ మునుపటిలా సాధారణ జీవితం గడిపే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. విషాదాంతంగా ముగిసిన హ్యూస్ జీవితం క్రికెట్‌ను ప్రాణంగా భావించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ జోయెల్ హ్యూస్ జీవితం ఆట కారణంగానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. 2014 నవంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ సంధించిన బౌన్సర్ హ్యూస్ తలకు బలంగా తాకింది. బాధతో విలవిల్లాడుతూ క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. పాతికేళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. వీరితో పాటు క్రీడా రంగానికి చెందిన మరెంతో మంది ఆటగాళ్లు హఠాన్మరణం చెంది అభిమానులకు దుఃఖాన్ని మిగిల్చారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు మొతేరా క్రికెట్ స్టేడియం : బిగ్ సర్ప్రైజ్ -
స్పీడ్ పెంచారు
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తొలి సినిమాకే నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే సినిమాలు అంగీకరించడంలో స్పీడ్ పెంచాడు ధ్రువ్. రెండో సినిమాను తండ్రి విక్రమ్‌తో కలసి చేస్తున్నట్టు ప్రకటించాడు. ధ్రువ్, విక్రమ్ ముఖ్య పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ధ్రువ్ విక్రమ్ సోలో హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘పరియేరు పెరుమాళ్, కర్ణన్’ చిత్రాలను తెరకెక్కించిన మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తండ్రితో చేస్తున్న సినిమా, తాజాగా ఒప్పుకున్న ఈ సినిమాను ఏకకాలంలో పూర్తి చేస్తాడట ధ్రువ్. -
జోడీ కుదిరిందా?
తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తమిళ రీమేక్‌తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు మురుగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధృవ్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా ఎంపికైందని టాక్. ‘ఒరు అడార్ లవ్’ చిత్రంలో కన్ను గీటి యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ మధ్య వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ కేరళ కుట్టి జోరుకి ఈ మధ్య కాస్త బ్రేకులు పడ్డాయని మాలీవుడ్ టాక్. దాంతో ధృవ్ సినిమాలో సోలో హీరోయిన్గా అవకాశం రావడంతో ఈ బ్యూటీ ఫుల్ ఖుషీ అవుతున్నారట. కాగా నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలోనూ ప్రియా ప్రకాష్ వారియర్‌కి రెండో హీరోయిన్గా అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ధృవ్‌కి కరోనా
ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు, హీరో ధృవ్ సర్జా తనకు, తన భార్య ప్రేరణకు కరోనా లక్షణాలు కనిపించాయని బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘త్వరలోనే మేమిద్దరం పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాం. అయితే ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసినవార ందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. నాతో తిరిగినవారందరూ ఆరోగ్యంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ధృవ్. ఇదిలా ఉంటే ఇటీవల హఠాన్మరణం పొందిన చిరంజీవి సర్జా సోదరుడే ధృవ్ సర్జా. ఇక కన్నడ పరిశ్రమలో కరోనా బారిన పడిన మరో సెలబ్రిటీ సుమలత. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆమె ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కి కూడా కరోనా లక్షణాలు కనిపించాయని వార్త వచ్చింది. -
కొడుకు కోసమేనా..
ప్రముఖులు తమ వారసులను పరిచయం చేయడం అనేది అన్ని రంగాల్లోనూ జరుగుతోంది. సినిమా రంగం ఇందుకు అతీతం కాదు. ఎందరో నటీనటులు తమ వారసులను పరిచయం చేశారు, చేస్తున్నారు కూడా. అలా ప్రముఖ నటుడు సియాన్ విక్రమ్ కూడా తన వారసుడు ధృవ్ విక్రమ్‌ను కథానాయకుడిగా పరిచయం చేశారు. సాధారణంగా తమ వారసులని పరిచయం చేసే ముందు ఆ చిత్రానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా కథ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారు. అదేవిధంగా నటుడు విక్రమ్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని తెలుగులో సంచల విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్ర తమిళ్ రీమేక్ ద్వారా తన కొడుకు ధృవ్‌విక్రమ్‌ను కథానాయకుడిగా పరిచయం చేశారు. అనుకున్నవన్నీ జరగవు కదా! అలా ధృవ్ విక్రమ్ తొలిసారిగా నటించిన ఆదిత్య వర్మ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. నటుడిగా ధృవ్ విక్రమ్ మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. చిత్రం విజయవంతమైతే నటికైనా నటుడి కైనా క్రేజ్ వస్తుంది. అలా తన కొడుకును హీరోగా నిలనెట్టడానికి మిత్రమా విక్రమ్ మలి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఈయన కూడా తన కొడుకుతో కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. దీన్ని సక్సెస్ ఫుల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాత లలిత్‌కుమార్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. (కల నిజమైంది) విశేషమేమిటంటే ఈ చిత్రంలో యువ నటుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో విక్రమ్ పాత్ర ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా నటించడం విక్రమ్‌కు కొత్తేమీ కాదు. ఇంతముందు కూడా ఇరుముగన్ చిత్రంలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా తన కొడుకును హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి మరోసారి విలన్‌గా మారడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
కల నిజమైంది
ఒకే తెరపై తండ్రీ కొడుకులు కనిపిస్తే చూడాలని అభిమానులు అనుకుంటారు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ కాంబినేషన్ కుదిరితే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు. తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. దీనికి కారణం తండ్రీ కొడుకులు విక్రమ్– ధ్రువ్ విక్రమ్ కలిసి తొలిసారి ఒకే సినిమాలో నటì ంచనుండటం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న సినిమాలో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోలుగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘కార్తీక్ సుబ్బరాజ్‌గారి సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. మా నాన్నగారికి నేను పెద్ద అభిమానిని. అనిరు«ద్ పాటలన్నీ అదే పనిగా వినేవాణ్ణి. ఈ ముగ్గురితో కలిసి పని చేయడం కల నిజమైనట్టు ఉంది’’ అన్నారు ధ్రువ్. ఇది విక్రమ్ కెరీర్లో 60వ సినిమా కావడం విశేషం. ధ్రువ్‌కి ఇది రెండో సినిమా. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు ధ్రువ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించగలిగారు. ఇక తండ్రితో కలసి ధ్రువ్ నటించనున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. పోస్టర్లో రెండు చేతులు కనిపిస్తున్నాయి. ఒకటి విక్రమ్, మరోటి ధ్రువ్‌ది అని ఊహించవచ్చు. లలిత్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీతం అందించనున్నారు. ∙కుమారుడు ధ్రువ్‌తో విక్రమ్ -
కన్నడంలో నిన్ను కోరి
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా 2017లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. అథర్వా మురళి, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘తలళ్లి పోగాదే’ టైటిల్‌తో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. తాజాగా కన్నడంలోనూ ‘నిన్ను కోరి’ రీమేక్ కాబోతోందని సమాచారం. కన్నడ పాపులర్ నటుడు ధృవ్ సార్జా ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. నంద కిశోర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. -
‘ఆదిత్య వర్మ’తో సినిమాపై విక్రమ్ ఆసక్తి!
తండ్రి విక్రమ్‌తో కలిసి నటించడానికి యువ నటుడు ధ్రువ్ విక్రమ్ రెడీ అవుతున్నాడా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు విక్రమ్ తన కొడుకు ధ్రువ్ విక్రమ్‌ను ఆదిత్యవర్మ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. కాగా తన కొడుకు తొలి చిత్రం విషయంలో విక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతగా అంటే ముందుగా బాలా దర్శకత్వంలో రూపొందించిన వర్మ చిత్రం సంతృప్తిగా రాలేదని ఆ చిత్రాన్ని పక్కన పెట్టించి మరోసారి అర్జున్‌రెడ్డి చిత్రానికి పనిచేసిన అసోసియేట్‌ను దర్శకుడిగా పరిచయం చేసి అదే చిత్రాన్ని ఆదిత్యవర్మ పేరుతో పూర్తిగా రీషూట్ చేయించుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో విక్రమ్ స్పాట్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని నటుడు ధ్రువ్‌విక్రమ్‌నే తెలిపారు. అంత శ్రద్ధ తీసుకుని చేసినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే నటుడిగా ధ్రువ్‌విక్రమ్‌కు మంచి మార్కులే పడ్డాయి. కాగా ధ్రువ్‌విక్రమ్ చిత్రం ఏమిటన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. అయితే విక్రమ్ తన కొడుకుతో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకోసం మంచి కథను తయారు చేయమని తన సన్నిహిత దర్శకులకు చెప్పారు. అలా దర్శకుడు వెట్రిమారన్ విక్రమ్, ధ్రువ్‌విక్రమ్‌లకు ఒక కథను సిద్ధం చేశారట. ఈ విషయాన్ని ధ్రువ్‌విక్రమ్‌నే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ కథను తాను ఇంకా వినలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తండ్రీకొడుకులు కలిసి నటించడానికి కథ రెడీ అయ్యిందని, దీన్ని ఒక ప్రముఖ దర్శకుడు సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా చిత్రంతో పాటు, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత తన కొడుకుతో కలిసి నటించే చిత్రం ఉంటే అవకాశం ఉంది. -
నా చిత్రం కంటే కూడా..
తమిళ సినిమా : నటుడు విక్రమ్ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అవును ఇది ఆయన సంతోషంలో మునిగిపోతున్నారు. ఇందుకు కారణం విక్రమ్ వారసుడు దృవ్‌విక్రమ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆదిత్యవర్మ’. గత 22వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అదిత్యవర్మ. దృవ్‌విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా బవిటసందు అనే బాలీవుడ్ నటి హీరోయిన్గా పరిచయమయ్యింది. అర్జున్‌రెడ్డికు కో–డైరెక్టర్‌గా పనిచేసిన గిరీసాయి ఆదిత్యవర్మ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ముఖేశ్‌మెహ్తా నిర్మించిన చిత్రం ఆదిత్యవర్మ. కాగా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ కృతజ్ఞతలు చెప్పడానికి ఆదివారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో మీడియాతో సమావేశమయ్యారు. చిత్ర దర్శకుడు గిరీసాయి మాట్లాడుతూ ఈ చిత్రానికి నటుడు విక్రమ్ సహకారం ఎంతో ఉందన్నారు. ఆయన లేకుంటే ఆదిత్యవర్య లేదన్నారు. దృవ్‌విక్రమ్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆదిత్య పాత్రకు దృవ్ ప్రాణం పోశారని అన్నారు. భవష్యత్‌లో ఆయన పెద్దస్టార్ హీరో అవుతారని అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశం కలి్పంచిన చిత్ర నిర్మాతలకు, నటుడు విక్రమ్‌కు దన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్రం కోసం తనకుంటే ఎక్కువగా తన తండ్రి విక్రమ్ శ్రమించారని చెప్పారు. ఆయన ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి సారించేవారని అన్నారు. తన తండ్రి ఈ చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమించినట్లు తెలిపారు. నాన్న లేకపోతే తాను లేనన్నారు. నాన్నకు తాను పెద్ద అబిమానిని చెప్పారు. ఆయన కోసం ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. ఆదిత్యవర్మ చిత్రం సమష్టి కృషి అని, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. సంగీత దర్శకుడు రతన్ తనతో ఈ చిత్రంలో ఒక పాటను కూడా పాడించారని తెలిపారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పేదేమీ లేదని, ఆదిత్యవర్మ చిత్రం గురించి ప్రేక్షకులే చెబుతున్నారని అన్నారు. తాను నటించిన చిత్రం విడుదల కంటే తన కొడుకు నటించిన చిత్రం విడుదలే పెద్ద విషయంగా ఉందన్నారు. చాలాసంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అదేవిధంగా తన కొడుకును కథానాయకుడిగా పరిచయం చేసిన నిర్మాత ముఖేశ్ మెహ్తా, చిత్ర దర్శకుడు గిరిసాయికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని విక్రమ్ పేర్కొన్నారు. -
‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ద్రువ్ విక్రమ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘అదిత్య వర్మ’తో వెండితెరకు పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ద్రువ్తో కలిసి సినిమాను ప్రమోట్ చేయడంలో విక్రమ్ కూడా బీజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అదిత్య వర్మ’ ద్రువ్కు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. ద్రువ్ సినిమా కెరీర్‌కు అదిత్య వర్మ సరైన చిత్రం అన్నారు. తెలుగు అర్జున్ రెడ్డి చుశానని అది నాకు బాగా నచ్చిందని, ఈ సినిమా పలు బాషాల్లో రీమేక్ అవ్వడం సవాలుతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే నిర్మాత ముఖేష్ మెహతా అర్జున్ రెడ్డి మిళ రీమేక్‌కు ద్రువ్‌ను ఎంచుకున్నారని విక్రమ్ అన్నారు. ఇక గిరిసయ్య దర్శకత్వం వహిస్తున్న అదిత్య వర్మ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు అర్జున్ రెడ్డి హీరోయిన్ ప్రీతి పాత్రలో బనితా సింధు అదిత్య వర్మతో తమిళ తెరంగేట్రం చేయగా, ప్రియానంద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా గత నెలలో జరిగిన అదిత్య వర్మ అడియో లాంచ్‌లో ద్రువ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తాను నటించడానికి మా నాన్న విక్రమ్ చాలా శ్రమించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే ‘నా తండ్రి అంకితాభావం ఉన్న నటుడని నాకు తెలుసు, మా నాన్న ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రోత్సహం, ప్రమేయం లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదని’ అన్నాడు. -
నాన్న పదేళ్ల స్ట్రగుల్ చూశా!
సినిమా: తన తండ్రి 10 ఏళ్ల స్ట్రగుల్స్‌ను అనుభవించినట్లు ఆయన వారసుడు ధ్రువ్ విక్రమ్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఇది తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధ్రువ్ విక్రమ్‌కు జంటగా భవితసంధు నటించిన ఇందులో నటి ప్రియాఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోహీరోయిన్లు ధ్రువ్‌విక్రమ్, భవితసంధు బుధవారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. నటుడు ధ్రువ్ ముచ్చట్లు చూద్దాం.. ప్ర: ఆదిత్యవర్య చిత్రం గురించి చెప్పండి? జ: ఆదిత్యవర్మ చిత్రం చాలా కేర్‌ఫుల్‌గా యూనిట్ అంతా కలిసి శ్రమించిన చిత్రం ఇది. ప్ర:అర్జున్‌రెడ్డి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం? జ: నాకు హీరో పాత్ర హ్యాబిట్. నాకు చాలెంజింగ్ అనిపించింది. ప్ర: చిత్రంలో హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశాలు గురించి? జ: అవన్నీ స్క్రిప్ట్‌లో భాగంగానే చేశాం. భవితసంధు చాలా బాగా నటించింది. ప్ర:చిత్రం చూశారా? జ:నేనింకా చూడలేదు. నాన్న అయితే ఇప్పటికి వంద సార్లు చూసి ఉంటారు. ఆయన హ్యాపీ. ప్ర: మీ నాన్నగారిలో మీకు నచ్చిన విషయం? జ: ఆయన డెడికేషన్, తపన. పాత్ర కోసం పడే శ్రమ అన్నీ నన్ను ఆశ్చర్యపరిచేవే. అలా భవిష్యత్‌లో నేను కూడా చేస్తానోలేదో చెప్ప లేను. ఆయన ప్రారంభంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి 10 ఏళ్లు స్ట్రగుల్స్ పడ్డారు. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్న నటించిన చిత్రాలన్నీ బాగున్నాయి.సేతు, పితామగన్, బీమ, దూళ్ అన్నీ నచ్చాయి. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల రీమేక్‌లో ఏ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు? జ: భీమ చిత్ర రీమేక్ చేస్తే అందులో నటించాలని ఆశగా ఉంది. ప్ర:నాన్నతో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరగడం గురించి? జ: దర్శకుడు వెట్రిమారన్ నాన్నను కలిసి మా ఇద్దరితో చిత్రం చేయాలని చెప్పారు. మాకోసం ఆయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లున్నారు. అది నాన్నకు వినిపించారు.అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్ర:మీకు నచ్చిన నటుడు? జ: నాకు అందరు నటులు ఇష్టమే.అయితే అందరికంటే నాన్న ఎక్కువ ఇష్టం. ప్ర: మీరు నటించే చిత్రాల కథలను మీరే ఎంపిక చేసుకుంటారా? మీ నాన్న సెలెక్ట్ చేస్తారా? జ: ప్రస్తుతానికి అలాంటి సందర్భం రాలేదు. అయితే కథ నాకు నచ్చితే ఆ తరువాత నాన్న దృష్టికి తీసుకెళ్లతాను. ప్ర:తదుపరి చిత్రం? జ: ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆదిత్యవర్య చిత్రంపైనే నా దృష్టి అంతా. ఈ చిత్రం విడుదలైన తరువాత కొత్త చిత్రంపై దృష్టిసారిస్తాను -
సీన్ టు సీన్ అర్జున్‌రెడ్డే..!!
తెలుగులో అర్జున్‌రెడ్డి.. హిందీలో కబీర్ ఖాన్.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ‘కబీర్ సింగ్’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్ టు సీన్ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్లో ధ్రువ్ తనదైన ఒరిజినల్, ఇంటెన్స్, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్, ఆల్కాహల్ ఆడిక్ట్గా ఎమోషనల్ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ తమిళ ట్రైలర్‌పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్లో మాత్రం పూర్తిగా ‘అర్జున్‌రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
నాన్న లేకుంటే నేను లేను
సినిమా: నాన్న లేకుంటే తాను లేను అని పేర్కొన్నారు నవ నటుడు ధ్రువ్ విక్రమ్. నటుడు విక్రమ్ వారసుడైన ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ధ్రువ్ విక్రమ్‌కు జంటగా బనిత, ప్రియా ఆనంద్, అన్భుదాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గిరిసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు. కాగా ఆదిత్యవర్మ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. చిత్ర నిర్మాత ముఖేశ్ మెహతా మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్ర షూటింగ్లో నటుడు విక్రమ్ ఎప్పుడు ఒక స్టార్ నటుడిగా నడుచుకోలేదన్నారు. 2021లో విక్రమ్, ధ్రువ్‌విక్రమ్ కలిసి నటించి మనల్ని ఆనందపరుస్తారని భావిస్తున్నానన్నారు. ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ తాను పలు పాఠాశాలల్లో, కళాశాల్లో ప్రసంగించానన్నారు. అయితే ఈ వేడుక కొంచెం ప్రత్యేకం అన్నారు. కారణం తన కుటుంబం ఇక్కడ ఉందన్నారు. చిత్ర దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడి గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ప్రతిభావంతులు ఉండడం చూసి ఘనతగా భావించానన్నారు. తన తండ్రి విక్రమ్ గురించి చెప్పడానికి మాటలు లేవన్నారు. ఈ చిత్రానికి అంకితభావం 100 శాతం అని చెప్పారు. తన తండ్రి మంచి నటుడన్నదానికంటే మంచి తండ్రి అన్నదే తనకు తెలుసన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ధ్రువ్ మాదిరి మాట్లాడడం తనకు రాదన్నారు. తనకు 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడో, తాను నటించిన సేతు చిత్రం విడుదల కోసం ఎదురు చూసినప్పుడో ఎలాంటి ఆందోళనకు గురి కాలేదన్నది ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా తాను చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ చిత్రంలో ధ్రువ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నందుకు, అతనిపై నమ్మకం పెట్టినందుకు నిర్మాత ముఖేష్ మెహతాకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడు షరియా లేకుంటే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని పేర్కొన్నారు. -
తమిళ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజాగా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాల దర్శకత్వం వహించారు. అయితే బాల రూపొందించిన సినిమాతో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ధృవ్ సరసన బనిటా సందు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతమందిస్తున్నాడు. -
నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!
‘‘ప్రతి నటుడు హిట్ సాధించాలనే సినిమా చేస్తాడు. నా కెరీర్‌నే ఓసారి పరిశీలించుకుంటే.. ‘సేతు’ విజయం అందుకోవడానికి ముందు దాదాపు పన్నెండేళ్లు ఫెయిల్యూర్స్ చూశాను. ఆ సమయంలో నేను చేసిన ప్రతి సినిమా బ్రేక్ సాధిస్తుందనే చేశాను. కానీ రాలేదు. అయితే నటుడిగా ప్రతిసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టే ఎంచుకున్నాను. అందుకే ఇండియన్ సినిమాలో నాకంటూ ఓ గుర్తుంపు ఉందని భావిస్తున్నాను’’ అన్నారు విక్రమ్. రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వంలో విక్రమ్, అక్షరా హాసన్, అభిహసన్ (నటుడు నాజర్ తనయుడు) ముఖ్య తారాగణంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కడరమ్ కొండాన్’. ఈ చిత్రానికి నటుడు కమల్‌హాసన్ ఒక నిర్మాత. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ ఈ సినిమాను ‘మిస్టర్ కేకే’ టైటిల్‌తో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమ్, అక్షరా హాసన్ చెప్పిన విశేషాలు. ♦ ఇంటర్నేషనల్ స్టైల్లో తెరకెక్కిన చిత్రం ‘కేకే’. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర నా సినిమా జీవితంలోనే వన్నాఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను. అయితే నా పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. సినిమాలో నా క్యారెక్టర్ పాజిటివ్‌నా? నెగటివా? అనే విషయం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ♦ కొన్ని సినిమాలకు క్యారెక్టర్ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే సినిమాలో ఆ పాత్ర ఎంత బలమైనదో ఊహించుకోవచ్చు. ఈ సినిమా అలాంటిదే. అందుకే అలా టైటిల్ పెట్టాం. ఒక రోజులో జరిగే కథ కాబట్టి స్క్రీన్‌పై కథ స్పీడ్‌గా నడుస్తుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ రియల్‌గా ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన గిల్ ఫైట్స్‌ను బాగా డిజైన్ చేశారు. దర్శకుడు రాజేష్‌కు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సెట్లో తనకు ఏం కావాలన్న విషయంపై ఫుల్ క్లారిటీతో ఉంటాడు. ♦ ఇది ఇంటర్నేషనల్ స్టైలిష్ మూవీ అయినప్పటికీ మన ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందనే అనుకుంటున్నాను. నేను చేసిన ‘శివపుత్రుడు’ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అయినా కేవలం నేటివిటి కారణంగానే మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్’ వంటి సినిమాలకు మన ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఆ సినిమాల్లోని ఎమోషనల్ కంటెంటే. అలాగే ‘బాహుబలి’ కూడా. మంచి కథ, సరైన ఎమోషన్స్ ఉంటే ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు. అలాగే ఒక నటుడిగా బాక్సాఫీస్ నంబర్స్ కూడా ముఖ్యంగా భావిస్తాను. ♦ ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అందుకే ఏ ఒక్క భాషకే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లో నాకు గుర్తింపు తెచ్చిన సినిమాలు ఉన్నాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. నంబర్ 1 యాక్టర్ కావాలనే ఆశ లేదు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. ♦ నిజానికి ఈ సినిమాలో కమల్‌హాసన్‌గారు నటించాల్సింది. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కమల్‌సార్ బ్యానర్లో నేను ఈ సినిమా చేశాను. వాస్తవానికి కమల్‌గారు ఎవరి గురించీ ఎక్కువగా మాట్లాడరు. కానీ ఈ సినిమా తమిళ ఆడియో వేడుకలో నా గురించి ఆయన చెప్పిన మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. ♦ నా కొడుకు ధృవ్ నటించిన ‘ఆదిత్యవర్మ’ (తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్) షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా చాన్స్ వచ్చినప్పుడు ధృవ్ అమెరికాలో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. చాలా నేచురల్‌గా నటించాడనిపించింది. కొన్ని సీన్స్‌లో అయితే నా కంటే బాగా చేశాడనిపించింది. రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో, డబ్బింగ్ చెప్పే సమయంలో ‘నాన్నా.. నువ్వు బయటికి వెళ్లు’ అన్నాడు. నేను ఇక్కడ లేను.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడనుకుని వర్క్ చేయమన్నాను. ♦మణిరత్నంగారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నాను. అలాగే అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించబోతున్నాను. గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న ‘ధృవనక్షత్రం’ ఫైనల్ షెడ్యూల్ జరగాల్సి ఉంది. ‘మహావీర్ కర్ణ’ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతుంది. -
హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!
తెలుగులో సంచనల విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను వర్మ పేరుతో బాలా దర్శకత్వంలో రూపొందించారు. అయితే నిర్మాతలకు అవుట్‌పుట్ నచ్చకపోవటంతో గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. అయితే రెండో వర్షన్ విషయంలోనూ రకరకాల అనుమానలు వచ్చాయి. షూటింగ్ అనుకున్నట్టుగా సాగటం లేదని, ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. చివరి షాట్‌కు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేశారు. హీరో హీరోయిన్లపై చివరి షాట్‌ను చిత్రీకరించారు. ఈ షూటింగ్ జరుగుతుండగా చియాన్ విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. View this post on Instagram Adithya Varma will always be the most beautiful thing that’s ever happened to me. He gave me a purpose, gave my life meaning, gave me clarity about myself and most importantly, taught me how to never give up. So much love for all the people in this video, especially the man in the last frame. Couldn’t have done it without you. #itsawrap 💫 A post shared by த்ருவ் (@dhruv.vikram) on Jul 15, 2019 at 4:54am PDT -
నాన్న ఎప్పుడూ నా వెనకుంటారు
నటుడికి తొలి సినిమా చాలా ముఖ్యం. ఏ అడ్డంకులు లేకుండా మంచి హిట్ సాధించాలనుకోవడం సహజం. అలాంటిది ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా రాలేదని మళ్లీ మొదటి నుంచి తీయాలని నిర్మాతలు అనుకుంటే? ఆ యాక్టర్ కాన్ఫిడెన్స్‌లో కచ్చితంగా డిస్ట్రబెన్స్ వస్తుంది. అయితే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌కి ఇలా జరిగినా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ధృవ్. మొదట బాలా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘వర్మ’ టైటిల్‌తో తీశారు. ఆ చిత్రాన్ని ఆపేసి, ‘ఆదిత్యవర్మ’ పేరుతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి, పూర్తి చేశారు. ‘ఆదిత్య వర్మ’ పూర్తి కావడం వెనక తన తండ్రి సహకారం ఉందని భావోద్వేగంతో ధృవ్ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘సెట్‌ను ప్రతిరోజూ సందర్శిస్తూ, మమ్మల్ని మా శక్తిమేరకు పని చేసేలా ప్రోత్సహిస్తూ,్త, మా అందరి విజన్‌ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ నన్ను ‘ఆదిత్య వర్మ’ను చేశారు మా నాన్న. నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా, నా వెనకే ఉంటూ, నాకన్నీ నేర్పిస్తూ ఉన్నావు, ఉంటావు కూడా నాన్నా! నువ్వు లేకుండా ఏదీ అంత సులువుగా జరిగేది కాదు. నన్నెవరో అడిగారు.. ‘సినిమాకు అంత కష్టపడ్డారు కదా, టీజర్లో మీ నాన్నగారి పేరెక్కడా? అని. ఆయన పేరు నా పేరు వెనక, ఆయనెప్పుడూ నా వెనక ఉంటారు’ అని బదులిచ్చాను. నువ్వు గర్వపడేలా చేస్తాను నాన్నా’’ అని పేర్కొన్నారు. ‘ఆదిత్య వర్మ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ మెప్పిస్తాడా!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఒరిజినల్‌ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే తెరకెక్కించాడు. కబీర్ సింగ్ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తమిళ రీమేక్ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాలా దర్శకత్వం వహించారు. అయితే అవుట్‌పుట్ విషయంలో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి రూపొందించారు. ఆదిత్య వర్మ పేరుతో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే ఈ సారి కూడా ఆదిత్య వర్మ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో పాత్రకు ధృవ్ వయసు సరిపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడిసిన్, పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా ధృవ్ కనిపించటంలేదంటున్నారు విశ్లేషకులు. నటన పరంగా మెప్పించినా లుక్ కన్విన్సింగ్‌గా లేకపోతే కష్టమే అంటున్నారు. మరి ఈ విమర్శల నేపథ్యంలో తమిళ అర్జున్ రెడ్డి ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ వచ్చేసింది!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. తమిళ్లో ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్ లాంటివి యాజిటీజ్‌గా దించేశారు. టీజర్లో లుక్స్, యాక్టింగ్ పరంగా ధృవ్ ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ సినిమాను సీనియర్ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్‌పుట్ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్ సరసన బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ రెడీ!
టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తమిళ అర్జున్ ఆదిత్మ వర్మ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే బాల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవుట్‌పుట్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
జెట్ స్పీడులో తమిళ ‘అర్జున్ రెడ్డి’
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా తమిళ అర్జున్ రెడ్డికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. ముందుగా బాల దర్శకత్వంలో ఈ రీమేక్ చిత్రీకరించారు. కానీ అవుట్ పుట్ నచ్చకపోవటంతో ఆ వర్షన్ పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా కొత్త దర్శకుడితో సినిమా మొత్తం రీషూట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఆదిత్య వర్మ పేరుతో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 65 శాతానికి పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనితా సందు హీరోయిన్ నటిస్తోంది. రథన్ సంగీతమందిస్తున్నాడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫారిన్లో పాట
తెలుగు సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’లో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతోంది. హిందీ చిత్రం ‘అక్టోబర్’ ఫేమ్ బన్నితా సాంధు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. నటి ప్రియా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ముకేశ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. ‘‘చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పోర్చుగల్‌లో సాంగ్ షూట్ చేస్తున్నాం. 65 శాతం సినిమా పూర్తయింది. ఈ మధ్యే సినిమా ప్రారంభించాం. అంతలోనే 65 శాతం పూర్తి చేశాం. రికార్డు టైమ్’’ అన్నారు సినిమాటోగ్రఫర్ రవి. కె. చంద్రన్. ఇది వరకు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ధ్రువ్ హీరోగా బాల దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో ప్రారంభమై, రిలీజ్‌కి రెడీ అయిన విషయం తెలిసిందే. కాకపోతే అవుట్‌పుట్ తాము ఆశించినట్లుగా రాలేదని భావించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఆదిత్య వర్మ’గా టైటిల్‌ని మార్చారు. పూర్తయిన సినిమాని మళ్లీ మొదలుపెట్టి, తీయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌లో స్టార్ డైరెక్టర్
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ధృవ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను గిరీశయ్య దర్శకత్వంలో మరోసారి తెరకెక్కిస్తున్నారు. కొత్త తెరకెక్కిస్తున్న రీమేక్‌లో నటీనటులను కూడా మార్చేశారు చిత్రయూనిట్. తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌లో హీరోగా తండ్రి పాత్రలో సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా తాను నిర్మించిన సినిమాలన్నీ ఆగిపోవటంతో గౌతమ్ మీనన్ పూర్తి నటన మీద దృష్టిపెట్టాడు. ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన గౌతమ్, అర్జున్ రెడ్డి రీమేక్‌లో మాత్రం ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవ్ సరసన బానిటా సంధు హీరోయిన్గా నటిస్తుండగా ప్రియా ఆనంద్, అన్బులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
వర్మ కాదు... ఆదిత్యవర్మ
తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. అవుట్‌పుట్ నచ్చక మళ్లీ ఈ సినిమా తీయాలని నిర్మాతలు అనుకున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ను ప్రారంభించారు. రీషూట్ చేయాలనుకున్న తర్వాత హీరోగా ధృవ్‌నే ఉంచారు కానీ దర్శకుడు బాలా స్థానంలో గిరీశాయ అనే దర్శకుడిని తీసుకున్నారు. హీరోయిన్గా బన్నితా సాదును తీసుకున్నారు. రవి. కె చంద్రన్‌ను కెమెరామెన్‌గా తీసుకున్నారు టీమ్. తాజాగా ఈ సినిమాకు ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు ధృవ్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక చిత్రదర్శకుడు గిరీశాయ గురించి చెప్పాలంటే... తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారట. అలాగే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధన్నే ‘ఆదిత్యవర్మ’కు మ్యూజిక్ అందించబోతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా కంప్లీట్ చేసి జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
అర్జున్ రెడ్డి రీమేక్‌కు హీరోయిన్ ఫిక్స్!
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్‌పుట్‌తో నిర్మాతలు సంతృప్తిగా లేకపోవటంతో సినిమాను మరోసారి కొత్త టీంతో తెరకెక్కించే పనిలో ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా దర్శకుడి పేరు ఫైనల్ చేయని ఈ సినిమాలో హీరోయిన్ను కూడా మార్చేస్తున్నారు. మేఘా చౌదరి స్థానంలో బాలీవుడ్ నటి అక్టోబర్ ఫేం బనితా సందు నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన గిరీషయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. CONFIRMED... #October leading lady Banita Sandhu to star in #Tamil remake of #ArjunReddy... Dhruv Vikram, son of Chiyaan Vikram, to essay the title role. pic.twitter.com/QPM4FYenuT — taran adarsh (@taran_adarsh) 16 February 2019 -
‘వర్మ’ వివాదంపై స్పందించిన బాలా
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నిర్మాతలు సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలా ఇచ్చిన ఫస్ట్ కాపీ సంతృప్తిగా లేకపోవటంతో మరో దర్శకుడితో సినిమాను రీ షూట్ చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్శకుడు బాలా స్పందించారు. ప్రాజెక్ట్ నుంచి తనను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన బాలా అందుకు సాక్ష్యాలుగా నిర్మాణ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
వివాదాస్పద చిత్రంలో జాన్వీ?
వివాదాస్పద చిత్రంలో నాయకిగా అతిలోకసుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీకపూర్ నటించనుందా? జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల చాలానే చర్చ జరుగుతోంది. ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ హిందీ చిత్రం పింకూను తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అజిత్ కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ద్వారా జాన్వీ కోలీవుడ్‌కు పరిచయం కానుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ గురించి మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది. వర్మ చిత్ర వ్యవహారం తెలిసిందే. తెలుగు సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డికి రీమేక్‌గా తమిళంలో బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, మళ్లీ పూర్తిగా రీషూట్ చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అతని తొలి చిత్రమే ఇలా అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్మ చిత్రాన్ని తెరకెక్కించింది సాధారణ దర్శకుడు కాదు. తమిళ సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలను అందించిన జాతీయ అవార్డులను తమిళ సినిమాకు అందించిన దర్శకుడు బాలా. అలాంటి దర్శకుడిని ఇది అవమానించే చర్చగా భావిస్తూ పలువురు దర్శకులు ఆయనకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియదు. వర్మ చిత్ర నిర్మాత మాత్రం ఆ చిత్రాన్ని రీషూట్ చేయడానికి ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్, 96 చిత్రం ఫేమ్ సీ ప్రేమ్‌కుమార్, మలయాళ సినీ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్, బిజాయ్ నంబియార్‌లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే వర్మ చిత్రంలో ధృవ్‌నే మళ్లీ నటిస్తాడని నిర్మాతలు పేర్కొన్నారు. అతనికి జంటగా నటించిన బెంగాలీ బ్యూటీ మేఘా చౌదరి పరిస్థితినే అర్థం కావడం లేదు. ఆమె పాత్రలో ఇప్పుడు శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాన్వీ వివాదాస్పదంగా మారిన అర్జున్‌రెడ్డి రీమేక్‌లో నటించడానికి అంగీకరిస్తుందా? అన్నది వేచి చూడాలి. -
‘వర్మ’కేమైంది!
తమిళసినిమా: వర్మకేమైంది? కోలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారిన షాకింగ్ న్యూస్. దర్శకుడు బాలా సృష్టి వర్మ. దీన్ని ఆయన సృష్టి అనవచ్చో కాదో. ఎందుకంటే వర్మ బాలా ముద్దుబిడ్డ కాదు. అద్దె బిడ్డ అనవచ్చు. ఆయన రాసుకున్న కథా చిత్రం కాదు. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ వర్మ. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఇది. ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థకు ఫస్ట్ కాపీ విధానంలో బాలా నిర్మాణ సంస్థ బీ స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రం వర్మ. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా ఈ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు వర్మ చిత్రాన్ని విడుదల చేయడం లేదని వెల్లడిస్తూ మీడియాకు ఇక ప్రకటనను విడుదల చేశారు. అర్జున్‌రెడ్డికి రీమేక్‌లా లేదు అందులో వారు పేర్కొంటూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రాన్ని వర్మ పేరుతో రీమేక్ చేసి ఫస్ట్‌కాపీ బేస్డ్లో బాలా బి.స్టూడియోస్ సంస్థ తమకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే బాలా తెరకెక్కించిన వర్మ చిత్రం ఫస్ట్‌కాపీ చూసిన తరువాత తమకు సంతృప్తి అనిపించలేదన్నారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒరిజినల్ చిత్రానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. దీంతో వర్మ చిత్రాన్ని విడుదల చేయరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని మళ్లీ వేరే దర్శకుడితో రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. హీరోగా ధృవే నటిస్తారని, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. జూన్ 29న విడుదల చేస్తామని ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా పూర్తిగా అదీ ఒక జాతీయ అవార్డు గ్రహీత, పలు వైవిధ్యభరిత చిత్రాల సృష్టికర్త తెరకెక్కించిన చిత్రాన్ని విడుదల సంతృప్తిగా లేదని పక్కన పడేయనున్నట్లు చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నా చిత్రం రిలీజ్ కావడం లేదా? వర్మ చిత్రంలో ధృవ్‌కు జంటగా నవ నటి మేఘాచౌదరి నటించింది. మోడలింగ్ రంగంలో పాపులర్ అయిన ఈ బెంగాలీ బ్యూటీ హీరోయిన్గా ఇదే తొలి చిత్రం. వర్మ చిత్రం విడుదల కావడం లేదు తెలుసా అన్న ప్రశ్నకు మేఘాచౌదరి షాక్ అయ్యింది. కొత్తగా రూపొందించనున్న చిత్రంలో ధృవ్ నటించనున్నాడు. మరి ఈ చిన్నది ఉంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. విక్రమ్ కూడానా? వర్మ చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించడంతో ఆ చిత్ర దర్శకుడు బాలా చాలా హర్ట్ అయ్యారు. ఈయనకు దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్ ఉంది. ఆయన చిత్రాలకు ఆయనే కథలను రాసుకుంటారు. అలాంటి దర్శకుడు అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు ముందు వ్యతిరేకించారట. అయితే సేతు చిత్రంతో తనకు సినీ జీవితాన్ని చ్చిన నటుడు విక్రమ్ తన కొడుకును హీరోగా పరిచయం చేయమని కోరడంతో ఆయన కోసమే అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు బాలా సమ్మతించినట్లు సమాచారం. అయినా రీమేక్‌ను అలానే కాపీ కొట్టి చేయనని బాలా ముందే చెప్పారట. తీరా వర్మ చిత్రం పూర్తయిన తరువాత నటుడు విక్రమ్ కూడా నిర్మాతల తరఫున మాట్లాడటం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
డైరెక్టర్ బాలాకు షాక్
తమిళనాట డైరెక్టర్ బాలాకు ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. భిన్నంగా సినిమాలు తీస్తూ.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించిన బాలాకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కుతున్న వర్మ సినిమాను బాలా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవుట్‌పుట్ చూసిన నిర్మాతలు దానితో సంతృప్తి చెందలేదని, పూర్తి సినిమాను మళ్లీ రీషూట్ చేస్తామని ప్రకటించారు. హీరో ధృవ్ తప్పా మిగిలిన క్యాస్టింగ్ మొత్తాన్ని మార్చనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ బాలాను కూడా తప్పించడం తమిళ నాట హాట్ టాపిక్ అయింది. విక్రమ్ సూచన మేరకే నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు సమాచారం. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. -
నిద్రపోతుండగా త్రిష బుగ్గ గిల్లింది..
సినిమా: నటి త్రిష నా బుగ్గ గిల్లింది అంటున్నాడు నవ కథానాయకుడు ధ్రువ్. సియాన్ విక్రమ్ వారసుడైన ఈయన వర్మ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయన బి.స్టూడియోస్ సమర్పణలో ఈ 4 ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మోడల్ మేఘ నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. దీని విడుదల హక్కులను శక్తివేలన్ పొందారు. ఈ సందర్భంగా ఒక భేటీలో నవ నటుడు ధ్రువ్‌ను మీకు ఏ నటితో నటించాలని కోరిక అన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు చిన్నతనం నుంచి నటి త్రిష అంటే చాలా ఇష్టమని, అయితే తానిప్పటి వరకూ ఆమెను కలిసింది లేదని చెప్పాడు. ఒకసారి ప్రివ్యూ థియేటర్లో తాను నిద్రపోతుండగా త్రిష తన బుగ్గ గిల్లి వెళ్లిపోయినట్లు ధ్రువ్ చెప్పారు. త్రిష ధ్రువ్ తండ్రి విక్రమ్ నటించిన స్వామి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందిపుచ్చుకుందన్నది గమనార్హం. -
విరాళంగా తొలి పారితోషికం
పెరంబూరు: నవ నటుడు ధృవ్ తన తొలి పారితోషికాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం అందించారు. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్ అమెరికాలో నటనలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ధృవ్ తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. తండ్రి విక్రమ్‌కు సేతు చిత్రం ద్వారా నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు బాలానే ధృవ్ తొలి చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇటీవల వరద బీభత్సంతో కేరళ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆర్థికంగా, ఇతరత్రా సాయం చేశారు. తాజాగా ధృవ్ వర్మ చిత్ర హీరోగా అందుకున్న పారితోషికాన్ని వరద బాధితుల సహాయార్థం అందజేసి దాతృత్వం చాటుకున్నాడు. ఆయన కేరళ సీఎం పినరాయి విజయన్ను సోమవారం కలిసి తన తొలి చిత్ర పారితోషికాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆయనతో పాటు వర్మ చిత్ర నిర్మాత ముఖేశ్ ఆర్.మెహతా, ఏవీ.అనూప్ ఉన్నారు. ఇప్పటికే ధృవ్ తండ్రి, నటుడు విక్రమ్ కేరళ వరద బాధితులకు సహాయంగా రూ.35లక్షలను అందించిన విషయం తెలిసిందే. -
వర్మ వచ్చేశాడు
తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ‘వర్మ’లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించారు. ఇందులో బెంగాలీ మోడల్ మేఘా చౌదరి కథానాయికగా నటించారు. ఈశ్వరీరావ్, రైజా విల్సన్, ఆకాశ్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి రధన్ స్వరకర్త. ఆదివారం ధృవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేశారు. అలాగే ‘వర్మ’ తెలుగు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టీమ్. సో... ‘వర్మ’ చిత్రం తెలుగులో కూడా ఏమైనా డబ్ అవుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే హిందీ ‘అర్జున్‌రెడ్డి’లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్‌ని తెరకెక్కించిన సందీప్‌రెడ్డి వంగానే హిందీ రీమేక్‌కి దర్శకుడు. ఈ చిత్రానికి ముందుగా తారా సుతారియాను హీరోయిన్గా అనుకున్నారు. కానీ డేట్స్ కుదరక వీలు పడలేదట. ఇప్పుడీ పాత్రను కియారా అద్వానీ చేయబోతున్నారని బాలీవుడ్ లేటెస్ట్ టాక్. -
‘అర్జున్ రెడ్డి’ తమిళ్ టీజర్ వచ్చేసింది!
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ పలు భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్‌లో అర్జున్ రెడ్డి రీమేక్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్లో సందీప్ వంగా డైరెక్షన్లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోంది. తమిళ్లో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా అర్జున్ రెడ్డిని ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ బాలా.. ఈ రీమేక్‌ను తమిళ నేటీవిటికి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. మరి ఈ రీమేక్ కోలీవుడ్‌లో సంచలనం సృష్టించి..ధృవ్‌ని కూడా ఓవర్‌నైట్ స్టార్ చేస్తుందో లేదో చూడాలి. Teaser of #Varma Introducing #DhruvVikram#Bala Film#E4Entertainment Mukesh R Mehta #VarmaTeaser #HBDDhruvVikram https://t.co/o2cAyAGWQS@e4echennai @filmmakerbala @iammegha_c @raizawilson@radhanmusic @onlynikil pic.twitter.com/MZrdJG6f7u — BARaju (@baraju_SuperHit) 23 September 2018 -
ఆటోను ఢీకొట్టిన హీరో విక్రమ్ కొడుకు
-
బ్రేకింగ్: కారుతో విక్రమ్ కొడుకు ధ్రువ్ బీభత్సం!
సాక్షి, చెన్నై: ప్రముఖ కోలీవుడ్ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో వేగంగా కారు నడుపుతూ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిపోయిన కారు సమీపంలో గుంటలోకి దూసుకుపోయి.. ఇరుక్కుంది. ఈ ఘటనలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతని కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియడంతో పాండిబజార్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. ధ్రువ్ నడిపిన కారును స్వాధీనం చేసుకున్నారు. రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆటో డ్రైవర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆటోడ్రైవర్.. (పక్కన) ధ్రువ్ కారు తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళ రీమేక్‌తో ధ్రువ్ కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘వర్మ’గా ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తూ ధ్రువ్ ఈ మేరకు బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. కారు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ధ్రువ్‌ను పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
టాలీవుడ్‌కి ధృవ్?
కోలీవుడ్, టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్. ఆయన తనయుడు ధృవ్ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘వర్మ’తో ధృవ్ కోలీవుడ్‌కి హీరోగా పరిచయమవుతున్నారు. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో ధృవ్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో అని సమాచారం. ‘ఫిదా’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా తర్వాతి చిత్రంపై శేఖర్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ‘ఫిదా’ తర్వాత ఓ స్టార్ హీరోతో పనిచేయనున్నట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’తో శేఖర్ కమ్ముల..!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో ధృవ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ధృవ్ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. విక్రమ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన వారసుడ్ని రెండు భాషల్లో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్లో బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ధృవ్, తెలుగులో అందుకు భిన్నంగా ఓ క్లాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధృవ్ టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వర్మకి లవర్ దొరికింది
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా! ఏది అనుకోనమ్మా నీ చిరునామా! ఇదిగో ఆల్మోస్ట్ ఇలాగే విక్రమ్ తనయుడు ధృవ్ సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రియురాలి కోసం ఇన్నాళ్లు పాడుకుని ఉంటారేమో. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే అతనికి ప్రేయసి దొరికేసింది. రీల్ లవర్ గురించి చెబుతున్నాం. బాల దర్శకత్వంలో ధృవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో షాలినీ పాండే కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తమిళ చిత్రానికి హీరోయిన్గా చాలా మంది పేర్లను పరిశీలించారు. రీసెంట్గా శ్రియా శర్మ పేరు వినిపించింది. ఫైనల్లీ బెంగాలీ మోడల్ మేఘా చౌదరిని కన్ఫార్మ్ చేశారు. సో.. వర్మకి లవర్ దొరికిందన్న మాట. ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. -
బాలా కొత్త చిత్రానికి రంగం సిద్ధం
తమిళ సినిమా: దర్శకుడు బాలా శైలి భిన్నంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేతు, నందా, పితామగన్ లాంటి చిత్రాలే అందుకు నిదర్శనాలు. నాన్‌కడవుల్, పరదేశీ, తారైతప్పట్టై వంటి చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. బాలా స్వీయ దర్శకత్వంలో చిత్రాలు నిర్మించడంతో పాటు ఇతర దర్శకులకు తన బ్యానర్లో అవకాశాలు ఇస్తుంటారు. కొద్ది కాలంగా విజయాలకు దురంగా ఉన్న ఈ సంచలన దర్శకుడు ‘నాచియార్’చిత్రంతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చారు. ఈ చిత్ర సక్సెస్‌కు చిత్ర పరిశ్రమ తోడవడంతో అర్ధ శతోత్సం దాటి ప్రదర్శితమవుతూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం బాలా నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘వర్మ’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్. ఈ విషయాన్ని పక్కన పెడితే బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లెన్స్ చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్‌కు అవకాశం ఇస్తున్నారు. లెన్స్ చిత్రం ఆంగ్లం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైంది. తమిళంలో లెన్స్ చిత్రాన్ని దర్శకుడు వెట్ట్రిమారన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి గానూ జయప్రకాశ్ రాధాకృష్ణన్ గత ఏడాది గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన తాజాగా ఒక మంచి కథను రెడీ చేశారట. దీన్ని దర్శకుడు బాలాకు వినిపించగా ఆయనకు బాగా నచ్చడంతో తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని మాట కూడా ఇచ్చారట. బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. -
‘వర్మ సినిమాలో నా కూతురు నటించట్లేదు’
సాక్షి, చెన్నై : సీనియర్ నటి గౌతమి తాజాగా ట్విటర్ లో స్పందించారు. తన కూతురు సుబ్బలక్ష్మి త్వరలో సినిమాల్లోకి రాబోతుందంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అది నిజం కాదంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘మీడియాలో నా కూతురి డెబ్యూ గురించి వస్తున్న వార్తలు చూశాను. సుబ్బలక్ష్మి తన చదువుల్లో బిజీగా ఉంది. ఇప్పట్లో నటన గురించి ఆలోచన చేయలేదు. తనకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని గౌతమి తెలిపారు. కాగా, విలక్షణ దర్శకుడు బాలా అర్జున్ రెడ్డి రీమేక్‌ను ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ‘చియాన్’ విక్రమ్ తనయుడు ధృవ్ ఈ చిత్రంతో అరంగ్రేటం చేయబోతున్నాడు. హీరోయిన్ కోసం వేట ఇంకా కొనసాగుతోంది. Taken aback to see news about my daughter's acting debut. Subhalaxmi is committed to her studies and has no plans for acting now. Thank you all for your blessings on her. — Gautami (@gautamitads) 13 March 2018 -
బాలా చేతిలో మరో వారసురాలు
దర్శకుడు బాలా మరో నట వారసురాలిని నటిగా మలచనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులు వస్తోంది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు బాలా. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్ ఇలా ఒకదానికొక్కటి సంబంధం లేని కథా చిత్రాల సృష్టి కర్త బాలా. ఇటీవల జ్యోతిక, జీవీ ప్రకాశ్కుమార్లు నటించిన నాచియార్ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు విక్రమ్ కొడుకు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది కూడా. అయితే ఇందులో నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో ఈ పాత్ర పోషించిన మరాఠీ భామ శాలినిపాండే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌కు బాలా వర్మ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో శాలినిపాండే పాత్రలో చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంలో బాల నటిగా నటించిన శ్రియశర్మను నటింపజేయడానికి చర్చలు జరిగాయి. ఆ తరువాత తెలుగులో నటించిన శాలినిపాండేనే తమిళంలోనూ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మీని బాలా కథానాయకిగా పరిచయం చేయనున్నారన్నదే ఆ న్యూస్. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వర్మ చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ధృవ్తోపాటు సుబ్బులక్ష్మీ పాల్గొనే అవకాశం ఉంది. -
‘అర్జున్ రెడ్డి’లా మారిపోయిన ధృవ్
గత ఏడాది సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కోలీవుడ్ ఈ సినిమాను విక్రమ్ తనయుడు ధృవ్ మీరోగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను విలక్షణ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ను చాలా కాలం క్రితమే రిలీజ్ చేశారు. అయితే కథలోని క్యారెక్టర్‌కు తగ్గ లుక్ కోసం ధృవ్ ఆరు నెలలుగా కష్టపడుతున్నాడు. తాజాగా సినిమాకు తగ్గ మేకోవర్‌తో రెడీ అయిన ధృవ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. బాగా పెరిగిన గెడ్డం, మీసంతో ధృవ్ రఫ్ లుక్‌లో అదరగొడుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Stargazing. #dhruvfinallyanatchathiram😋 A post shared by Vikram (@the_real_chiyaan) on Mar 3, 2018 at 11:55pm PST -
ఒక్క సినిమానే : విక్రమ్
దక్షిణాదిలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచతుడు, ఐ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ త్వరలో తన నటవారసుడిని తెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ధృవ్ ఎంట్రీపై మాట్లాడిన విక్రమ్, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధృవ్... అర్జున్ రెడ్డి రీమేక్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడట. ‘వర్మ’ సినిమా రిలీజ్ తరువాత ధృవ్ చదువు మీద దృష్టి పెట్టనున్నట్టుగా వెల్లడించాడు. తిరిగి ఉన్నత చదువులు పూర్తయిన తరువాతే ధృవ్ తదుపరి చిత్రం మొదలువుతుందని వెల్లడించాడు విక్రమ్. -
‘వర్మ’ హీరోయిన్ ఇలా ఉండాలట..!
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కోసం ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఓ అమ్మాయి ముఖం కనిపించకుండా షూట్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన హీరో విక్రమ్, ‘ఈమె కనబడటం లేదు. ఒకవేళ ఈమె మీరే అయినా..లేక మీరు ఈమెలాగే ఉన్నా.. మీ ఫొటోలను వీడియోలను మాకు పంపించండి. నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్న. సమయం తీసుకోండి. కానీ త్వరపడండి’అంటూ కామెంట్ చేశాడు. హీరోయిన్ ఎంపిక కోసం వర్మ టీం రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. And.. SHE IS MISSING. If you are her or anyone who looks like her, send your pics or videos to varmathemovie@gmail.com. Can't wait to meet you. Take your time, but hurry. #heroinesearch #castingcall #vermas❤️#whostheluckygirl #thesearchbegins # varmathemovie #dirbala #dhruvvikram #E4entertainment. Thank you Shruti for your enchanting voice. Thanks ms AB. 🎥 Sukumar ✂️ Pradeep Jenifer 🎨 Kiran 👗Sathyasuku @shrutzhaasan @dhruv.vikram @mukeshe4e @pradeepjenifer A post shared by Vikram (@the_real_chiyaan) on Nov 11, 2017 at 10:31pm PST -
మన అర్జున్రెడ్డియే... వర్మగా మారాడు!
అదెలా కుదురుంది? ఎక్కడైనా ఒక్కటే పేరు ఉంటుంది కదా! మరి, ‘అర్జున్‌రెడ్డి’ వర్మగా ఎలా మారాడు? అనుకోవద్దు! రీమేక్ సినిమాల్లో హీరోలు మారినప్పుడు, టైటిల్స్ కూడా మారతాయి కదా! విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ హిట్. ఆ టైటిలే ఓ ట్రేడ్ మార్క్ సింబల్‌గా మారింది. ఈ సినిమాను తమిళంలో ప్రముఖ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు బాల దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రీమేక్‌కి ‘వర్మ’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ధృవ్ క్యారెక్టర్‌కి తగ్గట్టు లుక్‌ని మార్చుకునే పనిలో ఉన్నారట! వన్స్... లుక్ ఫైనలైజ్ చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారట! విక్రమ్‌ని ‘సేతు’తో స్టార్ చేసిన దర్శకుడు బాలాయే. ఆయన ధృవ్‌కి ఎలాంటి హిట్ ఇస్తారోనని విక్రమ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది : వర్మ
ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పినా వర్మ మాటల దాడి మాత్రం ఆగటంలేదు. తాను వేదించాలనుకున్న వ్యక్తులు తనకు బోర్ కొట్టేశారంటూ ట్విట్టర్ ఎకౌంట్ క్లోజ్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్తగా ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా తన మాటల దాడి కొనసాగిస్తున్నాడు. ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాకు విపరీతమైన ప్రచారం చేసిన పెట్టిన వర్మ ఇప్పుడు ఆ సినిమా తమిళ రీమేక్ మీద పడ్డాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వర్మ అనే టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ టైటిల్‌పై స్పందించిన వర్మ సినిమా టైటిల్ లోగో పోస్టర్‌తో పాటు ‘అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ పేరు వర్మ అంట, ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వర్మ నాగార్జున హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు వివాదాస్పద లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. Arjun Reddy Tamil version peru VARMA anta..Aa peru yekkado vinnattu gurthunnattu anipisthunnattu vundhi🙄 A post shared by RGV (@rgvzoomin) on Nov 10, 2017 at 7:00am PST -
తమిళ 'అర్జున్ రెడ్డి'కి జోడి ఎవరు..!
తెలుగులో సంచలన విజయం సాదించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను బాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవలే విక్రమ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులు ఎంపిక జరుగుతోంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర్ హాసన్ తో పాటు బాలనటిగా సత్తా చాటి ఇటీవల నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రియ శర్మల్లో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం జ్యోతిక, జీవి ప్రకాష్ కాంబినేషన్ లో రూపొందుతున్న నాచియార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలా, ఆ సినిమా రిలీజ్ తరువాత డిసెంబర్ నుంచి అర్జున్ రెడ్డి రీమేక్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈ లోగా హీరోయిన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. -
కర్ణాటక పొగరులో...
కర్ణాటక సంగీతంలో... అని రాయబోయి పొరబాటున ‘పొగరు’ అని రాశారనుకుంటున్నారేమో! అక్కడ రాసింది... మీరు చదివింది... కరెక్టే. అది పొగరే! కర్ణాటక ప్రేక్షకులకు తన నటనలోని పొగరేంటో చూపించనున్నారు శ్రుతీహాసన్. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కనిపించిన శ్రుతి, త్వరలో కన్నడ సినిమాలోనూ కనిపించనున్నారు. ఆమె ఓ కన్నడ సినిమా అంగీకరించారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో ధ్రువ్ సరసన శ్రుతి నటించనున్నారు. ధ్రువ్ హీరోగా నటిస్తున్న ‘పొగరు’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్నట్లు చిత్రదర్శకుడు నందకిశోర్ తెలిపారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ నెల్లోనే శ్రుతి కూడా ఈ షూటింగులో పాల్గొంటారట!! -
భారత హాకీ అధ్యక్షుడికి పుత్రశోకం
న్యూఢిల్లీ: భారత హాకీ అధ్యక్షుడు నరేందర్ బాత్రాకు పుత్రశోకం కల్గింది. బత్రా తనయుడు ధృవ్(27) అనారోగ్యంతో మృతి చెందాడు. గత నాలుగు రోజుల క్రితం మొరాకో వెళ్లిన ధృవ్ ఉదర సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని శుక్రవారం భారత్ కు తరలించనున్నారు. ఈ సందర్భంగా నరేందర్ బాత్రాకు ఢిల్లీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. 'యుక్త వయసులోని ధృవ్ కుటుంబానికి దూరం కావడం నిజంగా బాధాకరం. ఆ కుటుంబానికి తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలి' అని భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్పీ బన్సాల్ సంతాపం తెలిపారు. కాగా శుక్రవారం ధృవ్ అంత్యక్రియల కార్యక్రమానికి ఢిల్లీ క్రికెట్ సభ్యులు హాజరవుతారని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రవి జైన్ తెలిపారు.