ధ్రువ్‌కు జోడీగా..?  | Anupama Parameswaran to play the female lead in Mari Selvaraj and Dhruv Vikram sports drama | Sakshi
Sakshi News home page

ధ్రువ్‌కు జోడీగా..? 

Published Sat, Mar 2 2024 2:40 AM | Last Updated on Sat, Mar 2 2024 2:40 AM

Anupama Parameswaran to play the female lead in Mari Selvaraj and Dhruv Vikram sports drama - Sakshi

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ వ్రికమ్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ జోడీగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కనుంది. కబడ్డీ ప్లేయర్‌ మానతీ గణేశన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తోంది.

కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారట. అనుపమాకి ఇటీవల మారి సెల్వరాజ్‌ ఈ కథను వినిపించగా, ఈ బ్యూటీ ఆల్మోస్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ టాక్‌. మరి.. ధ్రువ్‌ విక్రమ్‌కు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ కనిపిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 15న తమిళనాడులోని తూత్తుకూడిలో ప్రారంభం కానుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement