లాక్‌ డౌన్‌లో ఏం జరిగింది? | Bison Kaalamaadan: Dhruv Vikram and Anupama Parameswaran sports film with Mari Selvaraj gets a title | Sakshi
Sakshi News home page

లాక్‌ డౌన్‌లో ఏం జరిగింది?

Published Tue, May 7 2024 4:11 AM | Last Updated on Tue, May 7 2024 11:40 AM

Bison Kaalamaadan: Dhruv Vikram and Anupama Parameswaran sports film with Mari Selvaraj gets a title

ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నాలుగైదు సినిమాలు అంగీకరించి, ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు అనుపమా పరమేశ్వరన్‌. తమిళంలో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి ‘బైసన్‌’ టైటిల్‌ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్‌ ప్రకటించింది. అనుపమ లీడ్‌ రోల్‌లో రూపొందనున్న మరో చిత్రం ‘లాక్‌ డౌన్‌’ ప్రకటన కూడా వచ్చింది.

ఈ చిత్రాన్ని ప్రకటించి, ‘‘భావోద్వేగాలతో కూడిన కథను చూడ్డానికి సిద్ధం అవ్వండి’’ అంటూ అనుపమా పరమేశ్వరన్‌ పస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ‘లాక్‌ డౌన్‌’లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఈ రేంజ్‌లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్‌ జీవా దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement