క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ | Anupama Parameswaran In Dhruv Vikram Bison Movie | Sakshi
Sakshi News home page

Anupama: హిట్ డైరెక్టర్ కొత్త సినిమాలో అనుపమ.. పెద్ద అవకాశమే

Published Tue, May 7 2024 12:53 PM | Last Updated on Tue, May 7 2024 6:20 PM

Anupama Parameswaran In Dhruv Vikram Bison Movie

'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?

(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)

హీరో విక్రమ్‌ కొడుకు ధ్రువ్‌ విక్రమ్‌.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్‌పుల్‌ దర్శకుడు మారి సెల్వరాజ్‌ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు.  ఈ చిత్రానికి బైసన్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్.

ఇదే సినిమాలో లాల్‌, పశుపతి, కలైయ రసన్‌, రజిష విజయన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్‌ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్‌' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్‌ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్‌ వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement