Mari Selvaraj
-
హిట్ డైరెక్టర్‌తో రజనీకాంత్ కొత్త సినిమా
కోలివుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జైలర్ హిట్ తర్వాత ఆ రేంజ్లో తన తర్వాతి సినిమా ఉండాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ దసరా పండక్కి 'వేట్టైయాన్' సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై సుభాస్కరన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు కూలీ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు జైలర్ సీక్వెల్ కూడా ఉంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.కోలీవుడ్ టాప్, టాలెంట్ డైరెక్టర్స్‌తో సినిమాలు తీసేందుకు రజనీకాంత్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వేట్టైయాన్ సినిమాతో టీజే జ్ఞానవేల్, కూలీ ప్రాజెక్ట్‌తో లోకేశ్ కనగరాజ్ , జైలర్‌తో నెల్సన్ దిలీప్‌కుమార్ ఇలా వరుస బిగ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రజనీకాంత్.. తాజాగా డైరెక్టర్ మారి సెల్వరాజ్‌తో ఒక సినిమా చేయనున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. కర్ణన్, మామన్నన్ చిత్రాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన మారి సెల్వరాజ్‌కు రజనీ ఛాన్స్ ఇచ్చారని తెలిసిన అభిమానులు సంబరపడుతున్నారు.తాజాగా ఓ ఇంటర్వయూలో పాల్గొన్న మారి సెల్వరాజ్ ఈ విషయం గురించి ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రజనీకాంత్ గారికి నేను అంటే చాలా ఇష్టం. నేను డైరెక్ట్ చేసిన కర్ణన్, మామన్నన్ చిత్రాలను ఆయన చూసి అభినందించారు. ఆ సమయంలోనే ఒక సినిమా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పటికైతే కథ రెడీ అయింది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.' అని మారి సెల్వరాజ్ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్నాయి. -
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
'టిల్లు స్క్వేర్' సినిమాతో హిట్ కొట్టిన అనుపమ.. మళ్లీ బిజీ అయిపోతోంది. తెలుగులో 'పరదా' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా అలాంటిదే ఒకటి అనుపమ ఖాతాలో చేరింది. తమిళంలో డిఫరెంట్ చిత్రాలు తీస్తాడనే పేరున్న డైరెక్టర్.. తన కొత్త మూవీలో అనుపమకు ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా అతడి మూడో చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'ఆదిత్య వర్మ', 'మహాన్' సినిమాలతో ఆకట్టుకున్న ధ్రువ్.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకుని కొత్త మూవీకి రెడీ అయిపోయాడు. సక్సెస్‌పుల్ దర్శకుడు మారి సెల్వరాజ్ తీయబోయే మూవీలో మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.ఇదే సినిమాలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతమందిస్తున్నారు. ప్రశాంతమైన మార్గాన్ని అన్వేషించే ఒక వీరుడి ఇతివృత్తమే 'బైసన్' సినిమా అని దర్శకుడు మారి సెల్వరాజ్ చెప్పారు. 'మామన్నన్' లాంటి అద్భుతమైన హిట్ సినిమా తర్వాత తీస్తున్న మూవీ కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: విడాకులపై సలహా అడిగిన యువతి.. మెగా డాటర్ శ్రీజ పోస్ట్ వైరల్)As powerful and fierce as it could get! Unleashing #Bison 🦬#BisonKaalamaadan All the best @mari_selvaraj #DhruvVikram @anupamahere @nivaskprasanna and team 💥💥💥@Tisaditi @ApplauseSocial @NeelamStudios_ pic.twitter.com/0D9pLnw2AD— pa.ranjith (@beemji) May 6, 2024 -
ధ్రువ్‌కు జోడీగా..?
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారట. అనుపమాకి ఇటీవల మారి సెల్వరాజ్ ఈ కథను వినిపించగా, ఈ బ్యూటీ ఆల్మోస్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మరి.. ధ్రువ్ విక్రమ్‌కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 15న తమిళనాడులోని తూత్తుకూడిలో ప్రారంభం కానుందని సమాచారం. -
Vaazhai In OTT: ఆ హిట్ డైరెక్టర్ మూవీ.. నేరుగా ఓటీటీకేనా!
మామన్నన్ మూవీతో హిట్ అందుకు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వాజై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూడు సూపర్ హిట్ చిత్రాల తర్వాత మారి సెల్వరాజ్ తెరకెక్కించిన నాలుగో చిత్రం వాజై ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్‌కు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామన్నన్ కంటే ముందే వచ్చిన పెరియారుమ్ పెరుమాల్, కర్ణన్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకున్నారు మారి సెల్వరాజ్. దీంతో వాజై మూవీని కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని కోలీవుడ్ ఫ్యాన్స్ భావించారు. అదే తరహాలోనే వాజై చిత్రాన్ని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అసలు కారణమిదేనా? అయితే ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందువల్లే ఈ మూవీని థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. நீளும் நீச்சலில் என் நா கேட்கும் ஒரு சொட்டுத் தேன் . —வாழை 🌴 This year belongs to #Vaazhai Team Vaazhai welcomes 2024 with warm hands!! Hitting theatres soon!! 🌴@disneyplusHSTam @navvistudios @mari_selvaraj @Music_Santhosh @thenieswar @KalaiActor @Nikhilavimal1… pic.twitter.com/CKrQNimnt7 — Mari Selvaraj (@mari_selvaraj) January 1, 2024 -
అనుమానస్పదంగా 'మామన్నన్' అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువ డైరెక్టర్ మృతి చెందాడు. పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి తమిళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు మరి సెల్వరాజ్. ఈ సినిమాల అన్నింటికి ఆయన వద్ద మారిముత్తు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ సినిమాల విజయాల వెనుక మారిముత్తు పాత్ర చాలా ఎక్కువగానే ఉందని బహిరంగంగానే మరి సెల్వరాజ్ అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న మారిముత్తు కేవలం 30 ఏళ్ల వయసులోనే మరణించడం చాలా బాధాకరం. (ఇదీ చదవండి: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్..!) ఊపిరాడకనే మరిముత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. తూత్తుకుడి జిల్లా శ్రీవైకుండం సమీపంలోని తిరుపుళియంగుడి అనే మారు మూల గ్రామానికి చెందిన మారిముత్తుకు సినిమాల్లో దర్శకుడవ్వాలనే కోరికతో చెన్నైకి వచ్చాడు. మూడు హిట్ సినిమాలకు మరి సెల్వరాజ్ వద్ద ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో తనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించేందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మారిముత్తుకు శామ్యూల్ అనే 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మారిముత్తుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. భోజనం తర్వాత సిగరెట్ తాగుతుండగా ఒక్కసారిగా దగ్గు రావడం ఆపై ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మారిముత్తు అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మామన్నన్ విజయంతో స్టాలిన్ చేతుల మీదుగా మరిముత్తు అవార్డును ఉదయనిధి అందుకోవడం గమనార్హం. -
నా చివరి సినిమాని బలమైన కథతో చేయాలనుకున్నా!
‘‘నాయకుడు’ చాలా మంచి కథ, పొలిటికల్ డ్రామా, సామాజిక న్యాయం, ప్రజల మధ్య సమానత్వం గురించి ఈ మూవీలో చర్చించాం. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి, నిర్మించారు. కీర్తీ సురేష్ హీరోయిన్. జూన్ 29న ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో ‘నాయకుడు’ పేరుతో ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి. నేడు ఈ మూవీ రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ–‘‘తెలుగులో నా గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈ సినిమాను తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. అయితే తమిళంలో మంచి వసూళ్లను సాధించడంతో ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నేను సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక నా చివరి సినిమాని బలమైన కథతో మారి సెల్వరాజ్‌తో చేయాలనుకున్నాను’’ అన్నారు. -
చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన కోలీవుడ్ చిత్రం మామన్నన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని మరి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం థియేట్రికల్‌గా సక్సెస్ కావడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రమే ఉదయనిధి స్టాలిన్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడికి హీరో సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!) చివరి చిత్రం సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మరి సెల్వరాజ్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్‌ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈ కారు విలువు దాదాపు రూ.40 నుంచి 45 లక్షల ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ తన ట్వీట్లో రాస్తూ..'ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్‌కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు. అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువ తరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది. మరి సెల్వరాజ్ సార్‌కి మినీ కూపర్ కారును అందించడం ఆనందంగా ఉంది. మామన్నన్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు సెల్వరాజ్‌కి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! ) ஒவ்வொருவரும் ஒவ்வொரு விதமாக விவாதிக்கிறார்கள். தங்களுடைய எண்ணங்களை கதையுடனும் களத்துடனும் தொடர்புபடுத்தி கருத்துகளை பகிர்கிறார்கள். உலகத் தமிழர்களிடையே விவாதத்துக்குரிய கருப்பொருளாக மாறியிருக்கிறது. அம்பேத்கர், பெரியார், அண்ணா, கலைஞர் போன்ற நம் தலைவர்கள் ஊட்டிய சுயமரியாதை உணர்வை,… pic.twitter.com/ro4j7epjAI — Udhay (@Udhaystalin) July 2, 2023 -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్‌తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
పాట పాడటమే కాదు డ్యాన్స్ కూడా చేసిన ఏఆర్ రెహమాన్!
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతానికి సినీ ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. అలాంటిది ఆయన వెండితెరపై ఆడి పాడారంటే ఇంకెంతగా విస్మయంతో చూస్తారో ఆలోచించండి. ఏ ఆర్ రెహమాన్ ఏంటి? డాన్స్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆయన డాన్స్ చేశారన్నది మాత్రం కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఈ అరుదైన దృశ్యాన్ని మామన్నన్ చిత్రంలో చూడబోతున్నారు. ఉదయ నిధి స్టాలిన్, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మారిసెల్వరాజ్ దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 29న విడుదలైంది. వడివేలు ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాదు చాలా గ్యాప్ తరువాత ఆయన ఈ చిత్రంలో ఒక పాట పాడడం విశేషం. రెహమాన్ స్పందిస్తూ తాను చిన్నతనం నుంచి కీబోర్డుతో గడిపానని ఆ తరువాత ఎన్నో స్టేజీలపై పాటలు పాడానని, ఇక ఇలాగే తన జీవితం గడచిపోతుంది అనుకుంటున్న సమయంలో మారిసెల్వరాజ్ మామన్నన్ చిత్రంలో తనను ఒక పాటలో మెరిసేలా చేశారని పేర్కొన్నారు. అయితే తనతో డాన్స్ చేయించిన ఘనత డ్యాన్స్ మాస్టర్ శాండీకే దక్కుతుందని అన్నారు. ఈ పాటను ఉదయనిధి స్టాలిన్‌కు చూపించగా ఆయన ఆశ్చర్యపోయారని దర్శకుడు మారిసెల్వరాజ్ పేర్కొన్నారు. చదవండి: అతడిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? -
మరోసారి ఆ డైరెక్టర్‌తో జతకట్టనున్న ధనుష్
‘కర్ణన్’ మూవీతో తనకు సూపర్‌హిట్ అందించిన దర్శకుడు మారి సెల్వరాజ్‌తో హీరో ధనుష్ మరోసారి జతట్టనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధనుష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. శుక్రవారం ఆయన ట్వీట్ చేశాడు. ‘మారి సెల్వరాజ్‌తో మరో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం’ అంటు రాసుకొచ్చాడు. ‘కర్ణన్’ సినిమా కోలీవుడ్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. థియేటర్ సీటింగ్ సామర్థ్యం కేవలం యాభై శాతం అయినప్పటికీ ఈ చిత్రం మెరుగైన వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ నిమిత్తం ధనుష్ క్యాలిఫోర్నియాలో ఉన్న సంగతి తెలిసిందే. -
స్పీడ్ పెంచారు
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తొలి సినిమాకే నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే సినిమాలు అంగీకరించడంలో స్పీడ్ పెంచాడు ధ్రువ్. రెండో సినిమాను తండ్రి విక్రమ్‌తో కలసి చేస్తున్నట్టు ప్రకటించాడు. ధ్రువ్, విక్రమ్ ముఖ్య పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ధ్రువ్ విక్రమ్ సోలో హీరోగా ఓ సినిమా కమిటయ్యారు. ‘పరియేరు పెరుమాళ్, కర్ణన్’ చిత్రాలను తెరకెక్కించిన మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ ఓ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తండ్రితో చేస్తున్న సినిమా, తాజాగా ఒప్పుకున్న ఈ సినిమాను ఏకకాలంలో పూర్తి చేస్తాడట ధ్రువ్. -
చిత్ర నిర్మాణరంగంలోకి కబాలి దర్శకుడు
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది కొత్తేమీ కాదు. స్టార్ దర్శకుడు శంకర్ లాంటి వారు చిత్ర నిర్మాణం చేపట్టి విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో అట్టకత్తి అంటూ దర్శకుడిగా పరిచయం అయిన పా.రంజిత్ తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత మద్రాస్ అంటూ ఉత్తర చెన్నై యువత జీవన విధానాన్ని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మూడో చిత్రంతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించి కబాలి చిత్రంతో స్టార్ దర్శకుల పట్టికలో చేరారు. తాజాగా మళ్లీ రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయిన పా.రంజిత్ ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో పక్క నీలం ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నవ దర్శకుడు మారి సెల్వరాజ్‌ను పరిచయం చేస్తూ చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి పరియేరుం పెరిమాళ్ అనే పేరును నిర్ణయించారు. క్రిమి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కధీర్ హీరోగానూ, నటి ఆనంది హీరోయిన్ గా నటించనున్నారు. ఈ నెల చివర్లో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తిరునెల్వెలి పరిసర ప్రాంతానికి చెందిన ఒక యువకుడి ఇతివృత్తంగా ఉంటుందట. ప్రేమ, యాక్షన్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకంగా చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ గురించి చెప్పాలంటే ఈయన దర్శకుడు రామ్ వద్ద కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారు. పరియేరుం పెరుమాళ్ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రీధర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.